న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై (పీపీబీఎల్) ఆర్‌బీఐ చర్యలు తీసుకోవడమనేది నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకతవైపు ఫిన్‌టెక్ సంస్థల దృష్టిని మరల్చేలా చేసిందని కేంద్ర ఐటీ శాఖ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. నియంత్రణ సంస్థ నిర్దేశించే నిబంధనలను పాటించడమనేది కంపెనీలకు ‘ఐచి్ఛకం‘ కాదని, ప్రతి వ్యాపారవేత్త కచి్చతంగా దానిపై దృష్టి పెట్టి తీరాల్సిందేనని ఆయన చెప్పారు. సాధారణంగా వ్యాపారవేత్తలు తమ సంస్థలను నిరి్మంచడంలో నిమగ్నమై, కొన్ని సార్లు నిబంధనలపై దృష్టి పెట్టడంలో విఫలం అవుతుంటారని పేర్కొన్నారు.
ఎంతో కష్టపడే, దూకుడుగా ఉండే వ్యాపారవేత్త కూడా నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని గుర్తించడంలో విఫలం కావడం వల్లే పీపీబీఎల్ ఉదంతం చోటు చేసుకుందన్నారు. నిబంధనలను పాటించని ఏ కంపెనీ అయినా చట్టాల నుంచి తప్పించుకోజాలదని మంత్రి స్పష్టం చేశారు. పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ చర్యలు ఫిన్‌టెక్ రంగాన్ని కుదిపివేశాయని భావించరాదని, నిబంధనలను పాటించాల్సిన అవసరం వైపు దృష్టిని మరల్చాయనే భావించవచ్చని మంత్రి వివరించారు. నిబంధనల ఉల్లంఘనకు గాను పీపీబీఎల్ మార్చి 15 నుంచి దాదాపు కార్యకలాపాలన్నీ నిలిపివేసేలా ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
బిలియన్ డాలర్ల చిప్ ప్లాంట్లు..
త్వరలోనే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులతో రెండు పూర్తి స్థాయి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు రానున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. ఇజ్రాయెల్‌కి చెందిన టవర్ సెమీకండక్టర్స్ 8 బిలియన్ డాలర్ల ప్రతిపాదనను, టాటా గ్రూప్ మరో ప్రాజెక్టును ప్రతిపాదించాయన్న వార్తలను ఆయన ధృవీకరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి వీటికి క్లియరెన్స్ ఇవ్వలేకపోతే, ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ సారథ్యంలో మూడో సారి ఏర్పాటు కాబోయే ప్రభుత్వం సత్వర ఆమోదం తెలపగలదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిప్‌ల తయారీకి సంబంధించి నాలుగు, చిప్‌ల అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) యూనిట్ల ఏర్పాటుకు 13 ప్రతిపాదనలు వచ్చాయి. అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ మైక్రోన్ .. గుజరాత్‌లో తలపెట్టిన రూ. 22,516 కోట్ల చిప్ అసెంబ్లీ ప్లాంటుకు ఇవి అదనం.
Comments
Please login to add a commentAdd a comment