rajeev chandrashekar
-
హిండెన్‌బర్గ్‌కు కాంగ్రెస్ సహకరిస్తోంది: రాజీవ్ చంద్రశేఖర్
ఢిల్లీ: అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆదానీ గ్రూప్ సంస్థల పేర్ల విలువలు కృత్రిమంగా పెచేందుకు వినివియోగించిన మారిషస్ ఫండ్లలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధబీ పురీ బోచ్‌కు, ఆమె భర్త ధవళ్ బోచ్‌కు సంబంధముందని తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో అదానీ గ్రూప్‌పై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.తాజాగా కాంగ్రెస్ విమర్శలపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు హిండెన్‌బర్గ్‌కు కాంగ్రెస్ సహకరిస్తోందని ఆరోపించారు. ‘హిండెన్‌బర్గ్, కాంగ్రెస్ మధ్య ఉన్న భాగస్వామ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ భాగస్వామ్యంతోనే హిండెన్ బర్గ్ ఇటువంటి నివేదిక విడుదల చేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచటం, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో గందరగోళం సృష్టించడమే కాంగ్రెస్ లక్ష్యం. ఇది కాంగ్రెస్ అసత్య ఆరోపణలకు నిదర్శనం. ఈ నివేదిక అసత్యాలు, అబద్ధాలతోనింపబడింది’’ అని అన్నారు. -
అప్పుడు మోదీ చేసిందేంటీ? బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్
ఢిల్లీ: వయనాడ్ పార్లమెంట్ స్థానంలో ప్రియాంకా గాంధీ వాద్రా పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ వారసత్వ రాజకీయలకు తెరలేపిందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ద్రోహం చేస్తోందని మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ వయనాడ్ ప్రజల మీద ఒక నేత తర్వాత మరో నేతను రుద్దుతూ వారసత్వ రాజకీయాలు చేస్తోంది. రాహుల్ గాంధీ మరో స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయం దాచిపెట్టడం సిగ్గుచేటు. ఈ విధానాల వల్లే రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మూడు ప్రధాన ఎన్నికల్లో ఓడిపోయింది’’ అని ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. బీజేపీ నేత చేసిన విమర్శలకు కాంగ్రెస్ ధీటుగా కౌంటర్ ఇచ్చింది.There is shamelessness and there is Cong type of shamelessness - imposing one member after another of their dynasty on voters of Wayanad - after shamelessly hiding the fact that Rahul was contesting from another constituency.This pattern of betrayal is reason why Cong has seen… https://t.co/W6hKnhKMtA— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) June 17, 2024 ‘‘2014లో వారణాసి నుంచి కూడా పోటీ చేసిన నరేంద్ర మోదీ.. వడోదర ఓటర్ల వద్ద దాచిపెట్టటం సిగ్గుచేటు కాదా?’’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ‘ఎక్స్’లో కౌంటర్ వేశారు.Like @narendramodi ‘shamelessly’ concealed from the voters of Vadodara that he will be contesting from Varanasi too, in 2014? https://t.co/VJhntkmRPR— Pawan Khera 🇮🇳 (@Pawankhera) June 17, 20242014లో వడోదర, వారణాసి రెండు స్థానాల్లో మోదీ పోటీ చేసి గెలుపొందారు. ఆయన వడోదర స్థానాన్ని వదలుకున్నారు. తాజాగా రాహుల్ గాంధీ సైతం వయనాడ్, రాయ్‌బరేలీ రెండు స్థానాల్లో పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన వాయనాడ్ స్థానాన్ని వదులుకోవటంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా గాంధీని పోటీకి దింపింది. అయితే ఇదే మొదటి ప్రత్యక్ష ఎన్నికల పోటీ కావాటం గమనార్హం.వాయనాడ్ నుంచి ప్రియంకాను బరిలోకి దించిన కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. కాంగ్రెస్ వారస్వత రాజకీయాలకు ఇదే అసలైన నిదర్శనం అంటూ మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీ కాదు.. ఫ్యామిలీ కంపెని అని సెటైర్లు వేస్తోంది. -
వివాదంలో కేంద్ర మంత్రి అఫిడవిట్.. ఈసీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కేంద్ర ప్రత్యక పన్నుల మండలి (సీబీడీటీ)కి కీలక ఆదేశాలు జారీ చేసింది. కేరళ తిరునువంతపురం బీజేపీ లోక్‌సభ అభ్యర్ధి, మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు ఉన్న ఆస్తులు, ఆదాయానికి.. ఎన్నికల కోసం ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో పొందుపరిచిన వివరాలు సమానంగా ఉన్నాయా? వ్యత్యాసం ఎమైనా ఉందా? అనేది పరిశీలించాలని కోరింది. కాంగ్రెస్ ఫిర్యాదుతో రాజీవ్ చంద్రశేఖర్ ఉన్న అసలు ఆస్తులకు, అఫిడవిట్లో దాఖలు చేసిన ఆస్తుల వివరాలకు పొంతనలేదని, తప్పుడు సమాచారం ఇచ్చారంటూ విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్, కేరళలో అధికార పక్షమైన ఎల్డీఎఫ్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులతో ఈసీఐ..ప్రత్యక్ష పన్ను మండలికి ఆదేశాలు జారీ చేసింది. ఆదాయం రూ.680యే 2021-22 ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే తన ఆదాయం కేవలం రూ. 680 అని చూపడంతో రాజీవ్ చంద్రశేఖర్ అఫిడవిట్‌పై వివాదం చెలరేగింది. పొంతనలేని ఆస్తుల వివరాలు ఈ అఫిడవిట్‌పై కాంగ్రెస్, ఎల్డీఎఫ్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజీవ్ చంద్ర శేఖర్‌కు ఉన్న అసలైన ఆస్తులు, అఫిడవిట్‌లోని ఆస్తుల వివరాలకు పొంతలేదని ఆరోపిస్తున్నాయి. బెంగళూరులోని ఆస్తులతో సహా ఇతర ఆస్తులను కేంద్ర మంత్రి వెల్లడించలేదని చెప్పాయి. జూపిటర్ క్యాపిటల్ అనే హోల్డింగ్ కంపెనీకి తనకు ఉన్న సంబంధం గురించి అఫిడవిట్లో ఎందుకు తెలపలేదని ఎల్డీఎఫ్ ప్రశ్నిస్తోంది. ఆ కంపెనీ అధికారిక వెబ్సైట్లో రాజీవ్ చంద్రశేఖర్‌ను వ్యవస్థాపకుడిగా ఉన్నప్పటికీ తన నిజమైన ఆస్తులను దాచే ప్రయత్నం చేస్తున్నారంటూ భారత ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో హైలెట్ చేసింది. ఈ ఫిర్యాదులపై బీజేపీ లోక్‌సభ అభ్యర్ధి రాజీవ్ చంద్రశేఖర్ మాత్రం.. నా అఫిడవిట్ చట్టానికి లోబడి ఉందని అన్నారు. -
బస్తీ మే సవాల్.. శశి థరూర్ వర్సెస్ కేంద్ర మంత్రి
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేరళలోని తిరువనంతపురం పార్లమెంట్ స్థానంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ముందు డిబేట్ విషయంలో అక్కడ పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు బహిరంగ సవాల్‌ను విసురుకున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ తనతో చర్చకు రావాలని కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ శశి థరూర్‌కు ఛాలెంజ్ చేశారు. దీంతో ఆయన సవాల్‌ను స్వీకరించారు శశి థరూర్. ‘తిరువనంతపురం అభివృద్ధి, పలు ఆలోచనల గురించి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌తో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. ఆయనకు ఈ నియోజకవర్గంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇదే విషయాన్ని నేను మొదటి నుంచి చెబుతున్నా. రాజకీయాలపై చర్చిద్దాం’అని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ.. ‘ రాజీవ్ చంద్రశేఖర్ డిబేట్ సవాల్‌ను నేను స్వాగతిస్తున్నా. అయితే ఇప్పటివరకు చర్చకు రాకుండా ఎవరు తప్పించుకు తిరుగుతున్నారో తిరువనంతపురం సెగ్మెంట్ ప్రజలకు తెలుసు. తిరువనంతపురం రాజకీయాలు, అభివృద్ధిపై చర్చిద్దాం’అని తెలిపారు. ‘ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి, మతతత్వం,పదేళ్ల బీజేపీ పాలనలో రాజకీయాల్లో పెంచిన ద్వేషం. అదే విధంగా గత 15 ఏళ్లుగా కళ్లముందు కనిపిస్తున్న తిరువనంతపురం అభివృద్ధిపై చర్చిద్దాం’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. కేరళలో కీలకస్థానమైన తిరువనంతపురంలో యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా శశి థరూర్ పోటీ చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ఆయన ఓటర్లుకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. వాటిని శశి థరూర్ టీం తీవ్రంగా ఖండించింది. ఆయన అటువంటి పనులు ఎప్పుడు చేయలేదని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి అయిన రాజీవ్ చంద్రశేఖర్‌పై యూడీఎఫ్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయన తన నామినేషన్ పత్రాల్లో నకిలీ అఫిడవిడ్ దాఖల చేశారని ఆరోపణులు చేశారు. ఇక్కడ వీరితో పాటు సీపీఐ పార్టీ తరఫున దిగ్గజ నేత పన్నియం రవీంద్రన్ పోటీ చేస్తున్నారు. కేరళలో మొత్తం 20 స్థానాల్లో ఒకే దశలో ఏప్రిల్ 26 పోలింగ్ జరగ్గా.. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
తిరువనంతపురం ఫైట్.. కేంద్ర ఐటీ మంత్రిపై ‘ఈసీ’కి ఫిర్యాదు
తిరువనంతపురం: కేరళలోని కీలక సీటు తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆస్తులు దాచారని ఎన్నికల కమిషన్(ఈసీ)కి వామపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఫిర్యాదు చేసింది. నామినేషనన్ సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్లో గత ఏడాది ఆదాయాన్ని ఆయన చాలా తక్కువగా చూపించారని ఫిర్యాదులో ఎల్డీఎఫ్ నేతలు పేర్కొన్నారు. జూపిటర్ క్యాపిటల్ అనే కంపెనీలో ఆయనకు ఉన్న సింహభాగం వాటాల నుంచి వచ్చే ఆదాయాన్ని వెల్లడించలేదని ఆరోపించారు. ఇంతకముందు ఇదే విషయమై రాజీవ్ చంద్రశేఖర్‌పై కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజీవ్‌చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి ప్రధానంగా యూడీఎఫ్ అభ్యర్థి శశిథరూర్‌తో పోటీపడుతున్నారు. ఇదీ చదవండి.. ప్రచార హోరు..తృణమూల్‌పై ప్రధాని మోదీ ఫైర్ -
నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని తెలియజేసింది
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై (పీపీబీఎల్) ఆర్బీఐ చర్యలు తీసుకోవడమనేది నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకతవైపు ఫిన్‌టెక్ సంస్థల దృష్టిని మరల్చేలా చేసిందని కేంద్ర ఐటీ శాఖ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. నియంత్రణ సంస్థ నిర్దేశించే నిబంధనలను పాటించడమనేది కంపెనీలకు ‘ఐచి్ఛకం‘ కాదని, ప్రతి వ్యాపారవేత్త కచి్చతంగా దానిపై దృష్టి పెట్టి తీరాల్సిందేనని ఆయన చెప్పారు. సాధారణంగా వ్యాపారవేత్తలు తమ సంస్థలను నిరి్మంచడంలో నిమగ్నమై, కొన్ని సార్లు నిబంధనలపై దృష్టి పెట్టడంలో విఫలం అవుతుంటారని పేర్కొన్నారు. ఎంతో కష్టపడే, దూకుడుగా ఉండే వ్యాపారవేత్త కూడా నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని గుర్తించడంలో విఫలం కావడం వల్లే పీపీబీఎల్ ఉదంతం చోటు చేసుకుందన్నారు. నిబంధనలను పాటించని ఏ కంపెనీ అయినా చట్టాల నుంచి తప్పించుకోజాలదని మంత్రి స్పష్టం చేశారు. పీపీబీఎల్‌పై ఆర్బీఐ చర్యలు ఫిన్‌టెక్ రంగాన్ని కుదిపివేశాయని భావించరాదని, నిబంధనలను పాటించాల్సిన అవసరం వైపు దృష్టిని మరల్చాయనే భావించవచ్చని మంత్రి వివరించారు. నిబంధనల ఉల్లంఘనకు గాను పీపీబీఎల్ మార్చి 15 నుంచి దాదాపు కార్యకలాపాలన్నీ నిలిపివేసేలా ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. బిలియన్ డాలర్ల చిప్ ప్లాంట్లు.. త్వరలోనే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులతో రెండు పూర్తి స్థాయి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు రానున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. ఇజ్రాయెల్‌కి చెందిన టవర్ సెమీకండక్టర్స్ 8 బిలియన్ డాలర్ల ప్రతిపాదనను, టాటా గ్రూప్ మరో ప్రాజెక్టును ప్రతిపాదించాయన్న వార్తలను ఆయన ధృవీకరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి వీటికి క్లియరెన్స్ ఇవ్వలేకపోతే, ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ సారథ్యంలో మూడో సారి ఏర్పాటు కాబోయే ప్రభుత్వం సత్వర ఆమోదం తెలపగలదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిప్‌ల తయారీకి సంబంధించి నాలుగు, చిప్‌ల అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) యూనిట్ల ఏర్పాటుకు 13 ప్రతిపాదనలు వచ్చాయి. అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ మైక్రోన్ .. గుజరాత్లో తలపెట్టిన రూ. 22,516 కోట్ల చిప్ అసెంబ్లీ ప్లాంటుకు ఇవి అదనం. -
డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: డీప్ ఫేక్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమైన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. ఈ వివరాలను కేంద్ర సహయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. ‘డీఫ్ ఫేక్’ ఫొటోలు, వీడియోల సృష్టికర్తల ఆగడాలను ఊపేక్షించేదిలేదని, భారీ జరిమానాలను వి«ధిస్తామని ఇటీవల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ సంస్థల సమావేశంలో హెచ్చరించిన విషయం తెల్సిందే. సంబంధిత మార్గదర్శకాలను, త్వరలో తీసుకురాబోయే చట్టాలను, నిబంధనలను రాజ్యసభ దృష్టికి తీసికెళ్లినట్లు మంత్రి పేర్కొన్నారు. సెక్షన్ 66డీ కింద కంప్యూటర్ ఆధారిత సాంకేతికతతో ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, రూ.1 లక్ష జరిమానా విధిస్తామని మంత్రి చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. -
డీఫ్ ఫేక్‌పై పోరు.. నేడు, రేపు కీలక సమావేశం
సాక్షి, ఢిల్లీ: ఇంటర్నెట్లో డీప్ ఫేక్ వీడియోల వ్యాప్తి ఈమధ్య ఆందోళన కలిగిస్తోంది. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు, ఆకతాయిలు అశ్లీల, నకిలీ.. విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసి సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారు. సాధికారత, వృద్ధి, సృజనాత్మకతకు.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్ బలమైన సాధనమే అయినప్పటికీ.. కొంతమంది దాన్ని దుర్వినియోగం చేయడం గమనార్హం. ఈ తరుణంలో డీప్‌ఫేక్ తరహా వ్యవహారాల కట్టడికి కేంద్రం రంగంలోకి దిగింది. నేడు,రేపు(నవంబర్ 23,24వ తేదీల్లో) సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులతో కేంద్ర ఐటీ శాఖ సమావేశం కానుంది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం.. గురువారం జరిగే సమావేశంలో మార్ఫింగ్ కంటెంట్(ఫొటోలు, వీడియోలు) అంశాల కట్టడిపై, శుక్రవారం జరిగే భేటీలో ఐటీ నిబంధనలపై చర్చించనున్నారు. డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తి కట్టడికి అవసరమైతే కొత్త చట్టం తెస్తామని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. ఈ తరుణంలో.. చట్టం రూపకల్పన, ఇతరత్రా అంశాలపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ప్రతినిధులతో కేంద్రం సమాలోచనలు జరిపే అవకాశాలూ కనిపిస్తున్నాయి. వాస్తవానికి డీఫ్ ఫేక్ కంటెంట్ వ్యవహారం ఇంటర్నెట్లో చాలాకాలంగా కొనసాగుతున్నప్పటికీ.. నటి రష్మిక మందన్న వీడియో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వెంటనే పలువురు ప్రముఖుల విషయంలోనూ ఇలాంటి వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, డీప్ ఫేక్ వంటి సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. తాజాగా.. బుధవారం జరిగిన జీ20 వర్చువల్ సమ్మిట్ ముగింపు ప్రసంగంలోనూ ప్రధాని మోదీ డీప్‌ఫేక్ సమస్యను ప్రస్తావించడం గమనార్హం. ‘‘ఏఐ ప్రతికూల ప్రభావాల గురించి ప్రపంచం ఆందోళన చెందుతోంది. సమాజానికి డీప్‌ఫేక్ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవడంతో పాటు డీప్‌ఫేక్‌ల నుంచి సమాజాన్ని కాపాడేందుకు కృషి చేయాలి’’ అని ప్రధాని మోదీ జీ20 సభ్య దేశాలకు పిలుపు కూడా ఇచ్చారు. -
అలాంటి వీడియోలపై దృష్టి పెట్టాం: కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్: నటి రష్మిక మందన్న పేరిట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియోల ఉదంతంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చిన ఆయన.. ఈ అంశంపై మాట్లాడారు. డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం దృష్టిసారించిందని.. కారకులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారాయన. శుక్రవారం సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ‘‘డీప్ ఫేక్ వీడియోలపై దృష్టి పెట్టాం. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. చిన్న పిల్లలు, మహిళలపై ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. మార్ఫింగ్ లాంటివి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపెడుతాయి. ఈ పరిస్థితులు ప్రమాదకరం’’ అని అన్నారాయన. ఈ తరహా ఘటనలపై రెండేళ్లుగా కేంద్రం దృష్టిసారించిందని చెప్పిన మంత్రి రాజీవ్.. సోషల్ మీడియా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సోషల్ మీడియా నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని అన్నారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్కు తేడా లేదు పదేళ్లలో కేసీఆర్ తెలంగాణకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ , ఛత్తీస్‌గఢ్, కర్ణాటక లో మాదిరిగా గ్యారంటీల పేరుతో ఎన్నికలకు వస్తోంది. ప్రజలు కాంగ్రెస్ మేనిఫెస్టో ను నమ్మట్లేదు. అందుకే గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేస్తోంది. ఏ రాష్ట్రంలో కూడా తన గ్యారంటీలను కాంగ్రెస్ సరిగా అమలు చేయలేదు. కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచిన అనంతరం ఇచ్చిన గ్యారంటీ లో మెలిక పెట్టింది. కర్ణాటకలో 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ అన్నారు. కానీ అక్కడ కరెంట్ ఉండట్లేదు. తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటుంది. అధ్యధిక నిరుద్యోగ రెట్ కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్ , ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్కు తేడా లేదు. దొందూ దొందే. రాష్ట్రాన్ని కాంగ్రెస్ 65 ఏళ్ళు దోచుకుంటే.. బీఆర్ఎస్ పదేళ్లు దోచుకుంది. రెండూ కుటుంబ పార్టీలే. తెలంగాణలో బీజేపీ రావాల్సి అవసరం ఉంది. -
డిసెంబరులో ఇండియా ఏఐ సదస్సు
నోయిడా: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆన్లైన్ గేమింగ్ విభాగాలు 2026–27 నాటికి భారత స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) 300 బిలియన్ డాలర్ల వరకు సమకూరుస్తాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. 2026–27 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్లు ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇందులో ఏఐ చాలా ముఖ్యమైన భాగం అని భావిస్తున్నామని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ’ఇండియా ఏఐ’ కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. ఇండియా ఏఐ 2023 పేరుతో ఈ ఏడాది డిసెంబర్ 10న అంతర్జాతీయ సదస్సును ప్రభుత్వం నిర్వహించనుందని వెల్లడించారు. -
212 మంది భారతీయుల తరలింపు
న్యూఢిల్లీ: హమాస్ మిలిటెంట్ల దాడులతో రణరంగంగా మారిన ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. దాదాపు 212 మందితో టెల్ అవివ్ నుంచి బయలుదేరిన మొదటి విమానం శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది. వీరిలో చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. విమానంలో వచ్చిన భారతీయులకు ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వారికి స్వాగతం పలికారు. కరచాలనం చేశారు. ఇజ్రాయెల్‌లో తమకు ఎదురైన భయానక అనుభవాలను భారతీయులు పంచుకున్నారు. సైరన్ల మోతతో నిద్రలేచేవాళ్లమని, ఎప్పుడేం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపామని, షెల్టర్లలో తలదాచుకున్నామని శశ్వంత్ సింగ్ అనే వ్యక్తి చెప్పాడు. ఆయన తన భార్యతో కలిసి ఢిల్లీకి చేరుకున్నాడు. తమను క్షేమంగా స్వదేశానికి చేర్చిన భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వెస్ట్‌బ్యాంకు, గాజాలోనూ కొందరు భారతీయులు నివసిస్తున్నారు. ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా రెండో విమానం శుక్రవారం సాయంత్రం టెల్ అవివ్ నుంచి బయలుదేరింది. శనివారం భారత్‌కు చేరుకోనుంది. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న భారతీయులు -
అధునాతన సిస్టమ్స్తయారీకి కేంద్రం బాసట
చెన్నై: అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా అధునాతన సిస్టమ్స్‌ను తీర్చిదిద్దడంలో పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) సహా య మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. తన ముందున్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత్ ప్రధానంగా వాణిజ్యపరంగా, అంతర్జాతీయంగా పోటీపడగలిగే టెక్నాలజీని రూపొందించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశీ పరిజ్ఞానంతో డీఐఆర్–వి (డిజిటల్ ఇండియా ఆర్ఐఎస్సీ–వి) మైక్రోప్రాసెసర్ రూపకల్పనలో అవసరమైన తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. మెయిటీ, ఐఐటీ మద్రాస్ నిర్వహించిన సింపోజియంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఇందులో 700 మంది పైచిలుకు వి ద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు. -
రియల్మీ ఫోన్లలో వ్యక్తిగత డేటా సేకరణ? స్పందించిన కేంద్రమంత్రి
చైనాకు చెందిన మొబైల్ కంపెనీ రియల్మీ ఫోన్లలోని కాల్ లాగ్‌లు, లొకేషన్ సమాచారం, ఎస్సెమ్మెస్ వంటి వినియోగదారుల వ్యక్తిగత డేటాను సేకరిస్తోందని యూజర్లు ఆరోపిస్తున్నారు. రియల్మీ ఫోన్లలోని 'మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీసెస్' వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని క్యాప్చర్ చేస్తుందని, ఈ సర్వీస్ డిఫాల్ట్‌గా యాక్టివేట్ చేశారని పేర్కొంటూ ఓ యూజర్ చేసిన ట్వీట్‌కు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. దీనిని తనిఖీ చేస్తామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ను కూడా ఆయన ట్యాగ్ చేశారు. ‘రియల్మీ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్ డేటా (కాల్ లాగ్‌లు, ఎస్సెమ్మెస్, లొకేషన్ సమాచారం) క్యాప్చర్ చేసే ఫీచర్ (మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీసెస్) ఉంది. ఇది డిఫాల్ట్‌గా 'ఆన్'లో ఉంది. సెట్టింగ్‌లు -> అదనపు సెట్టింగ్‌లు -> సిస్టమ్ సేవలు -> మెరుగుపరచబడిన ఇంటెలిజెంట్ సర్వీసెస్‌కి వెళ్లినప్పుడు డిఫాల్ట్ ఫీచర్‌గా 'ఆన్' ఉండటం చూడవచ్చు. భారతీయ వినియోగదారుల అనుమతి లేకుండా వారి డేటాను సేకరిస్తున్నారు. ఇది డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉన్నందున ఇది బలవంతపు సమ్మతి. ఈ డేటా చైనాకు పంపుతున్నారా?’ అంటూ రిషి బాగ్రీ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ సర్వీస్ ఫీచర్ సెట్టింగ్‌ల కింద లోతుగా ఉండటంతో చాలా మంది వినియోగదారులకు దాని గురించి కూడా తెలియదు. కానీ ఈ ట్వీట్‌ను ఫాలో అయిన మరికొందరు యూజర్లు వన్‌ప్లస్ ఫోన్లలో కూడా ఇలాంటి ఫీచర్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఒప్పో, వివో, రియల్మీ కంపెనీలకు మాతృ సంస్థ బీబీకే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్. వన్‌ప్లస్ బ్రాండ్ కూడా ఒప్పో అనుబంధ సంస్థే. రియల్మీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 14.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. రియల్మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ ఇటీవలే తప్పుకున్నారు. ఉన్నట్టుండి తన పదవి రాజీనామా చేశారు. Will hv this tested and checked @rishibagree copy: @GoI_MeitY https://t.co/4hkA5YWsIg — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) June 16, 2023 -
నిబంధనల కోణంలోనే సోషల్ మీడియాను చూస్తాం..
న్యూఢిల్లీ: ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మీదైనా ప్రభుత్వానికి వ్యక్తిగతంగా వ్యతిరేకత ఏమీ ఉండదని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. చట్టాలు, నిబంధనల అమలు కోణంలో మాత్రమే ప్రభుత్వానికి, సోషల్ మీడియాలకు సంబంధం ఉంటుందని ఆయన తెలిపారు. ప్లాట్‌ఫామ్‌లు కచ్చితంగా భారతీయ చట్టాలను గౌరవించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. కోవిన్ ప్లాట్ఫామ్లో డేటా ఉల్లంఘన జరిగిదంటూ వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. టెలిగ్రాం బాట్ ద్వారా బైటికొచ్చిన వ్యక్తిగత సమాచారమేదీ కోవిన్ డేటాబేస్లోనిది కాదని తెలిపారు. ఒక వ్యక్తికి చెందిన డేటాబేస్ నుంచి సదరు సమాచారం లీక్ అయ్యిందని, అదంతా నకిలీదేనని ఆయన చెప్పారు. అయినప్పటికీ, ఆ సమాచారం ఎంత పాతది, ఎక్కడి నుంచి వచ్చింది మొదలైన అంశాలపై విచారణ జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. రైతుల ఆందోళన సమయంలో తాము చెప్పినట్లు చేయకపోతే ట్విటర్‌ను మూసివేస్తామని ప్రభుత్వం బెదిరించిందంటూ కంపెనీ మాజీ సీఈవో జాక్ డోర్సే చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. ఇది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. భారతీయ చట్టాలకు విరుద్ధంగా పని చేస్తున్నప్పటికీ ట్విటర్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని చెప్పారు. -
కోవిన్ పోర్టల్.. ఫుల్ సేఫ్
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం తీసుకొచ్చిన కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన టీకా లబ్ధిదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ వార్తలకు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. నోడల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తోందని వెల్లడించింది. పోర్టల్‌లోని డేటా భద్రంగా ఉందని, డేటా ప్రైవసీ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. డేటా లీక్ అంటూ జరుగుతున్న ప్రచారం ఆకతాయిల పనేనని పేర్కొంది. డేటా లీక్ వార్తలపై సెర్ట్–ఇన్ వెంటనే స్పందించిందని, కోవిన్ యాప్‌పై లేదా డేటాబేస్‌పై ప్రత్యక్షంగా దాడి జరిగినట్లు ఆధారాలు లభించలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలిగ్రామ్ యాప్‌లో ఫోన్ నెంబర్లు ఎంట్రీ చేస్తే కోవిన్ యాప్ వివరాలను చూపిస్తోందని చెప్పారు. అంతేతప్ప వ్యాక్సిన్ లబ్ధిదారుల వివరాలు లీక్ కాలేదని స్పష్టం చేశారు. కాగా, కోవిన్ పోర్టల్ నుంచి ముఖ్యమైన డేటా లీకైనట్లు తెలుస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మొత్తం డేటా మేనేజ్మెంట్ వ్యవస్థ గోప్యతపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సోమవారం డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? కరోనా టీకా తీసుకున్న వారి వ్యక్తిగత డేటా కోవిన్ పోర్టల్‌లో నిక్షిప్తమైన సంగతి తెలిసిందే. టీకా లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు ఆన్లైన్ మెసెంజర్ యాప్ ‘టెలిగ్రామ్’లో కనిపిస్తున్నట్లు కొందరు ట్విట్టర్ ఖాతాదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. ఈ వ్యవహారంపై కొన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత లేకపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశాయి. దాంతో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించి, వివరణ ఇచ్చింది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా మాత్రమే కోవిన్ పోర్టల్‌లోని తమ వివరాలను లబ్ధిదారులు తెలుసుకోవచ్చని పేర్కొంది. లబ్ధిదారులు మినహా ఇతరులు తెలుసుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారుల చిరునామాలు తెలుసుకొనే వెలుసుబాటు కూడా లేదని వెల్లడించింది. -
కొత్త డిజిటల్ ఇండియా చట్టంలో తగిన రక్షణలు
న్యూఢిల్లీ: కొత్తగా తీసుకురాబోయే డిజిటల్ ఇండియా చట్టంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తరహా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీల నుంచి తగిన రక్షణలతో ప్రత్యేక చాప్టర్ ఉంటుందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. భారత్ సరైన విధానాన్నే అనుసరిస్తుందంటూ.. ఇంటర్నెట్ను భద్రంగా, యూజర్లకు విశ్వసనీయమైనదిగా ఉండేలా చూస్తామన్నారు. డిజిటల్ ఇండియా చట్టం రూపకల్పన విషయంలో భాగస్వాములతో రాజీవ్ చంద్రశేఖర్ విస్తృతమైన సంప్రదింపులు నిర్వహించడం గమనార్హం. రెండు దశాబ్దాల క్రితం నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్తది తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత చాట్ జీపీటీ సంచలనాలు సృష్టిస్తున్న తరుణంతో తగిన రక్షణలు ఏర్పాటు చేస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు చాట్ జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ సైతం ఏఐ టెక్నాలజీ నియంత్రణకు అంతర్జాతీయంగా నియంత్రణ సంస్థ అవసరమని పేర్కొనడం గమనార్హం. శామ్ ఆల్ట్‌మన్ వ్యాఖ్యలను మంత్రి వద్ద ప్రస్తావించగా.. ఆయనో స్మార్ట్ మ్యాన్ అని పేర్కొన్నారు. ఏఐని ఎలా నియంత్రించాలో ఆయనకంటూ స్వీయ అభిప్రాయాలు ఉండొచ్చన్నారు. కానీ, భారత్‌లోనూ స్మార్ట్ బుర్రలకు కొదవ లేదంటూ, ఏఐ నుంచి ఎలా రక్షణలు ఏర్పాటు చేయాలనే విషయమై తమకు అభిప్రాయాలు ఉన్నట్టు చెప్పారు. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలైనట్టు తెలిపారు. డేటా బిల్లుతో దుర్వినియోగానికి అడ్డుకట్ట ప్రతిపాదిత డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుతో డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడగలదని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సుదీర్ఘకాలంగా దోపిడీ చేసిన ప్లాట్‌ఫాంల ధోరణుల్లో మార్పులు రాగలవని ఆయన చెప్పారు. ఫ్యాక్ట్–చెక్ విభాగం ఏర్పాటుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించారు. వాస్తవాలతో పోలిస్తే తప్పుడు సమాచారం 10–15 రెట్లు వేగంతో ప్రయాణిస్తుందని, 20–50 రెట్లు ఎక్కువ మందికి చేరే ప్రమాదముందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టడానికి ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. అది తప్పు అని స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఒక అవకాశం ఉండాలని మంత్రి చెప్పారు. అందుకోసమే ఫ్యాక్ట్ చెక్ విభాగం పని చేస్తుందే తప్ప దాని వెనుక సెన్సార్షిప్ ఉద్దేశమేమీ లేదని పేర్కొన్నారు. -
వాట్సాప్‌లో అసలేం జరుగుతోంది.. మండిపడ్డ యూజర్ - సంస్థ రిప్లై ఇలా!
సాక్షి, న్యూఢిల్లీ: వాట్సాప్ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతపై కొద్ది రోజులుగా సందేహాలు తలెత్తుతున్నాయి. వాట్సాప్ యాప్ వాడకంలో లేనప్పుడు కూడా వినియోగదారుల అనుమతి లేకుండా ఫోన్లో మైక్రోఫోన్‌ను సంస్థ యాక్సెస్ చేస్తోందన్న ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అసలేం జరిగింది? ‘నేను ఫోన్ వాడకున్నా సరే వాట్సాప్ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో నా మొబైల్ మైక్రోఫోన్‌ను వాడుతోంది. నిద్రపోయి ఉదయం ఆరింటికి లేచా. అప్పుడూ మైక్రోఫోన్ దుర్వినియోగం అవుతోంది. అసలేం జరుగుతోంది?’ అంటూ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఫోడ్ డబిరి శనివారం ట్వీట్‌చేశారు. దీనికి 6.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీనిపై ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. ‘నథింగ్ ట్రస్ట్.. నాట్ ఈవెన్ నథింగ్’ (దేన్నీ నమ్మొద్దని, ఏం కాదని) అంటూ ఆయన ట్విట్ చేశారు. మరోవైపు ఈ ట్వీట్‌పై.. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ‘‘ఇది గోప్యతపై దాడి. దీనిపై వెంటనే విచారణ జరిపిస్తాం. గోప్యతకు భంగం వాటిల్లినట్లు తేలితే చర్యలు తప్పవు’ అంటూ ట్వీట్ చేశారు. కొన్ని నివేదికల ప్రకారం వాట్సాప్ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేస్తోంది. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోఫోన్, కెమెరా వంటి ప్రైవసీ సూచికలను ఏదైనా యాప్ యాక్సెస్ చేసినప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో గ్రీన్ నోటిఫికేషన్ వినియోగదారుడికి హెచ్చరికగా పనిచేస్తుంది. ఖండించిన వాట్సాప్: ఈ ఆరోపణలను వాట్సాప్ ఖండించిది. డబిరి పిక్సల్ ఫోన్లోని బగ్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు చేసి పరిష్కరించాలని గూగుల్‌ను అభ్యర్థించినట్టు ట్వీట్లో చేసింది. -
పెట్టుబడులకు లాజిస్టిక్స్ అద్భుత అవకాశం
భువనేశ్వర్: పెట్టుబడులు, పరిశ్రమగా రూపుదిద్దుకోవడం, భారీ ఉపాధి అవకాశాలతో రాబోయే సంవత్సరాల్లో యువతకు లాజిస్టిక్స్ పూర్తి అవకాశాలను కల్పించనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 27 నుండి 29 వరకు ఇక్కడ జరగనున్న మూడవ జీ– 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ భేటీ నేపథ్యంలో ‘‘ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్ ఫర్ కోస్టల్ ఎకానమీస్‘ అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే సంవత్సరాల్లో లాజిస్టిక్స్ భారీగా పురోగమించే అవకాశం ఉందని అన్నారు. ఈ రంగానికి సంబంధించి సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో భారీ పెట్టుబడులకు, వ్యవస్థాపకతకు, ఉపాధి అవకాశాలకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయని అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఇది ప్రపంచానికి సవాళ్లతో కూడిన ఆసక్తికరమైన సమయం. అవకాశాలతో పాటు సవాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంలో, భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది. భారత్‌ను ప్రపంచం చాలా గౌరవ ప్రదమైన దేశంగా చూస్తోంది‘ అని చంద్రశేఖర్ అన్నారు. సవాళ్లను తట్టుకునే ఎకానమీల దిశగా ప్రపంచం సవాళ్లను తట్టుకుని పురోగమించే లాజిస్టిక్స్, విశ్వసనీయ సప్లైచైన్ వైపు ప్రపంచం చూస్తోందని, రిస్క్ నుండి దూరంగా ఉంటూ సవాళ్లను ఎదుర్కొనే ఆర్థిక వ్యవస్థల వైపు పెట్టుబడులకు మొగ్గుచూపుతోందని మంత్రి పేర్కొన్నారు. ఒడిశా వంటి తీరప్రాంత రాష్ట్రాలలో లాజిస్టిక్స్‌పై దృష్టి, దీనిపై తగిన విధానాలు కీలకమైనవని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఒక భాగం. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలు సరఫరాలు, నిల్వల నిర్వహణకు సంబంధించిన కీలక విభాగం. భారత్‌కు విషయంలో ప్రపంచ బ్యాంకు 2023 లాజిస్టిక్ ఇండెక్స్ (ఎల్పీఐ) ర్యాంక్ 2022కన్నా 2023లో ఆరు స్థానాలు మెరుగుపడింది. ప్రపంచంలోని 139 దేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీ– భారత్ ర్యాంక్ 38కి పెరిగింది. 2022లో ఈ సూచీ ర్యాంక్ 44. ఈ నేపథ్యంలో భారత్ పురోగతిపై ఇంకా కేంద్ర మంత్రి ఏమన్నారంటే.. మొబైల్ ఫోన్ల హబ్‌గా.. 2014లో భారతదేశంలో వినియోగించే మొబైల్ ఫోన్లలో 82 శాతం దిగుమతి అయ్యాయి. 2022లో భారతదేశంలో వినియోగించే దాదాపు 100 శాతం మొబైల్ ఫోన్లు భారతదేశంలోనే తయారయ్యాయి. 2014లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతి దాదాపు లేనేలేదు. అయితే ఒక్క ఈ ఏడాదే భారత్ దాదాపు 11 బిలియన్ డాలర్ల విలువ చేసే యాపిల్, సామ్సంగ్ ఫోన్లను ఎగుమతి చేసింది. మారిన పరిస్థితులు భారతదేశంలో వ్యాపారం చేయడానికి తగిన మార్కెట్ లేదని, ఇది ఆచరణీయ మార్కెట్ కాదని, లాజిస్టిక్స్ వ్యయాలు భారీగా ఉన్నందున భారత్‌కు ప్రపంచ తయారీ కేంద్రంగా మారగల సామర్థ్యం అసలు లేదని చాలా దశాబ్దాలుగా ఒక వాదన ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్‌లో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, మొబైల్‌లు తదితర అనేక ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఎ గుమతులు, దేశంలోనే విక్రయాలు, దేశీయంగా పటి ష్టమైన లాజిస్టిక్స్ వ్యవస్థ వంటి ఎన్నో అంశాల్లో భా రత్ ఇప్పుడు మరింత సమర్థవంతంగా మారింది. నైపుణ్యాలు కీలకం యువత తమ ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలి. అంటే డిగ్రీలు అందుకున్నంత మాత్రాన నైపుణ్యాలను పొందలేము. ప్రత్యేకించి నైపుణ్యాల మెరుగుదలపై దృష్టి పెట్టాలి. మూడవ జీ–20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అక్షరాస్యత, స్టాటిస్టిక్స్, టెక్–ఎనేబుల్డ్ లెర్నింగ్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్, పరిశోధన, సహకారం వంటి పలు అంశాలపై దృష్టి సారిస్తుంది. తీరప్రాంత ఆర్థిక వ్యవస్థల పురోగతికి టెక్నాలజీ, ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్, స్కిల్ ఆర్కిటెక్చర్, జీవితకాల అభ్యాసానికి సామర్థ్యాలను పెంపొందించడం వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చనీయాంశాలు కానున్నాయి. జీ20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో జరిగింది. ఆ తర్వాత గత నెలలో అమృత్‌సర్‌లో రెండవ సమావేశం జరిగింది. మూడవ సమావేశాలు ఈ నెల్లో భువనేశ్వర్‌లో జరుగుతున్నాయి. తదనంతరం ఆయా అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయ ప్రాతిపదికన విధాన నిర్ణయాలు రూపొందుతాయి. -
బెట్టింగ్ గేమ్‌లపై నిషేధం
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ రంగ నియంత్రణకు సంబంధించి కేంద్రం గురువారం నిబంధనలను ప్రకటించింది. సిసలైన డబ్బులు పెట్టి ఆడేవి, బెట్టింగ్ చేసే గేమ్‌లను నిషేధించింది. అలాగే, ఆన్లైన్ గేమింగ్ రంగం స్వీయ నియంత్రణ విధానాన్ని పాటించాలని సూచించింది. ఈ దిశగా దేశీయంగా ఉపయోగించే గేమ్‌లను ఆమోదించేందుకు తొలుత మూడు స్వీయ నియంత్రణ సంస్థలను (ఎస్ఆర్వో) నోటిఫై చేయనుంది. 2021 ఐటీ చట్టాలకు సవరణగా ఈ నిబంధనలను చేర్చారు. సిసలైన డబ్బుతో పందేలు కాయనివి, వినియోగదారులకు హాని కలిగించే కంటెంట్ ఏదీ ఉండనివి, పిల్లలకు వ్యసనంగా మారని గేమ్స్‌కు అనుమతి ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ‘ఆన్లైన్ గేమింగ్ వృద్ధికి భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయి. అది గణనీయంగా విస్తరించేందుకు ఈ నిబంధనలు తోడ్పడగలవు‘ అని మంత్రి చెప్పారు. కొత్త నిబంధనలు నవకల్పనలకు ఊతమివ్వగలవని, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించగలదని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫాంలను ఏరివేసి, అంతర్జాతీయంగా పరిశ్రమ పోటీపడేలా ప్రోత్సహించగలవని అభిప్రాయపడ్డాయి. నిబంధనల్లో మరిన్ని ముఖ్య అంశాలు.. ► ఆన్లైన్ గేమ్స్‌ను నియంత్రించే ఎస్ఆర్వోల్లో పరిశ్రమ ప్రతినిధులు, గేమర్లు, ఇతరత్రా సంబంధిత వర్గాలు ఉంటాయి. నిబంధనల ప్రకారం ఎస్ఆర్వోల్లో ఒక విద్యావేత్త, సైకాలజీ నిపుణులు, బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న వ్యక్తి లేదా అధికారి ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఎస్ఆర్వోలను డీనోటిఫై చేస్తారు. ► గేమింగ్ వ్యసనంగా మారకుండా, ఆర్థికంగా నష్టపోకుండా, మోసాల బారిన పడకుండా యూజర్లను కాపాడేందుకు తగు వ్యవస్థను ఎస్ఆర్వోలు రూపొందించాలి. ఒక గేమింగ్ సెషన్లో సముచిత సమయం దాటితే పదే పదే హెచ్చరిక మెసేజీలు కూడా పంపించే విధంగా అది ఉండాలి. -
భారత టెక్నాలజీతో కోట్ల కొద్దీ ఆదా
న్యూఢిల్లీ: ఇతర దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేసుకునేందుకు డిజిటల్ చెల్లింపులు, కో–విన్, విశిష్ట గుర్తింపు సాంకేతికత వంటి భారతీయ టెక్నాలజీలు సహాయపడగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే ఆయా దేశాలు డిజిటైజేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో భారత్ .. తన వంతు బాధ్యతగా పలు దేశాలకు మన టెక్నాలజీ స్టాక్‌ను (ఉత్పత్తులు, సాధనాలు మొదలైనవి) ఆఫర్ చేసే ప్రణాళికలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇండియా స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు వివరించారు. రూ. 1.28 లక్షల కోట్లకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 1.28 లక్షల కోట్ల స్థాయికి చేరగలవని అంచనా వేస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఐటీ హార్డ్‌వేర్, విడిభాగాల తయారీదార్లు, హియరబుల్–వేరబుల్స్ ఉత్పత్తులకు కూడా కొత్తగా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వర్తింపచేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొబైల్ ఫోన్ సెగ్మెంట్ అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగంగా ఉండటంతో దానిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. 2023–24లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి రూ. 1 లక్ష కోట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. -
సైబర్ నేరం జరిగితే వెల్లడించాల్సిందే
న్యూఢిల్లీ: కంపెనీలు ఏదైనా సైబర్ దాడికి గురైతే దాన్ని ప్రభుత్వానికి వెల్లడించాలన్న చట్టాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. బెంగళూరులో ఐబీఎం ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 10 కోట్ల సైబర్ దాడుల ఘటనలను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఇండియా సీఈఆర్టీ) గుర్తించినట్టు చెప్పారు. సైబర్ దాడుల పరంగా భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి సైబర్ దాడులు జరిగితే బయటకు వెల్లడించకుండా దాచడం కుదరదు. వీటిని వెల్లడించాల్సిన బాధ్యతను సంస్థలపై పెట్టనున్నాం. ఇందుకు సంబంధించి కొన్ని రోజుల్లో నూతన చట్టం గురించి ప్రకటన వింటారు’’అని మంత్రి ప్రకటించారు. ముప్పు విషయంలో ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తి స్పష్టత ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సైబర్ విభాగం సురక్షితంగా, విశ్వసనీయంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని గుర్తు చేశారు. ‘‘మనం పెద్ద ఎత్తున సామర్థ్యాల విస్తరణపై పెట్టుబడులు పెడుతున్నాం. ఇంటర్నెట్ అన్నది సురక్షితంగా ఉండాలి. స్వేచ్ఛాయుతంగా, విశ్వసనీయమైనదిగా ఉండాలి. ఇంటర్నెట్కు సంబంధించిన మధ్యవర్తులు వినియోగదారులకు జవాబుదారీగా వ్యవహరించాలి’’ అని మంత్రి చెప్పారు. ఆసియా పసిఫిక్‌లో మొదటిది బెంగళూరులో ఏర్పాటు చేసిన కేంద్రం ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే మొదటిదిగా ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ తెలిపారు. సైబర్ భద్రత విషయంలో టెక్నిక్‌లపై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కేంద్రంలోనే కొత్త సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్త క్లయింట్లకు సెక్యూరిటీ రెస్పాన్స్ సేవలను అందించనున్నట్టు తెలిపారు. -
వాట్సాప్ బదులుగా 'సందేశ్'.. లోక సభలో కేంద్రం కీలక ప్రకటన
వాట్సాప్ తరహాలో వన్ టూ వన్ మెజేసింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ తదితర ఫీచర్లతో కేంద్ర ప్రభుత్వం సందేశ్ పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తేనుంది. నేషనల్ ఇన్ఫోర్మేటిక్స్ సెంటర్ (NIC) తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి ఈ యాప్‌ను డిజైన్ చేస్తున్నాయి. పూర్తిగా స్వదేశీగా ఈ యాప్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయం తెచ్చే పనిలో కేంద్రం నిమగ్నమైంది. ఈ మేరకు కేంద్రం పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ నిబంధనల నేపథ్యంలో కేంద్రం స్వదేశీ వాట్సాప్‌ను లాంఛ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యాప్‌కు సంబంధించి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. నేషనల్ ఇన్ఫోర్మేటిక్స్ సెంటర్ (NIC) తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి డిజైన్ చేసిన స్వదేశీ వాట్సాప్ సందేశ్ అందరికి అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ నిర్వహణ బాధ్యతలన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందన్న ఆయన.. వాట్సాప్ తరహాలో వన్ టూ వన్ మెజేసింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ తో పాటు ప్రభుత్వ అప్లికేషన్ ఈ యాప్ లో ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు మాత్రమే వాడుతున్న ఈ యాప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఇక ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే వాట్సాప్ కేవలం ఫోన్ నెంబర్‌తో మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ సందేశ్ యాప్ మాత్రం ఈమెయిల్ తో ఓపెన్ చేసేలా రూపొందించారు. అయితే సందేశ్ యాప్ ఎంతమేరకు ఆకట్టుకుంటుంది.? సందేశ్ తో వాట్సాప్ వినియోగం ఆగిపోతుందా? లేదా కొనసాగుతుందా? అన్న అంశం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. -
రమ్య వర్సెస్ రాజీవ్
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ట్విట్టర్ బాట పట్టాయి. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ ట్వీట్లతో హోరెత్తించిన కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్యపై బీజేపీ అదేస్థాయిలో ట్వీటర్లో విమర్శనాస్త్రాలు గుప్పిస్తోంది. రమ్యతో పాటు సీఎం సిద్ధరామయ్యను కౌంటర్ చేస్తూ బీజేపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీని విమర్శిస్తూ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్లపై మంగళవారం రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు అన్ని విషయాలపై మాట్లాడుదాం అంటూ రాజీవ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు రమ్య స్పందించారు. రాజీవ్‌కు రీట్వీట్ చేస్తూ కోరమాంగళలోని స్థలాన్ని కేఎంఎఫ్‌కు, హసన్‌లోని స్థలాన్ని సెజ్‌కు, కేఐఏడీబీ కింద డబాస్పేటలో ప్లాంట్ ఏర్పాటుకు చేసిన భూసమీకరణ, బెంగళూరు విమానాశ్రయానికి 75 ఎకరాల భూమి మంజూరుపై చర్చకు సిద్ధమా అని ఆమె ట్వీట్ చేశారు. వీటితో పాటు లోక్‌పాల్ బిల్లు, న్యాయమూర్తి లోహియా మృతి, అమిత్ షా మాటలపై చర్చించేందుకు సిద్ధరామయ్య సిద్ధమా అని ట్వీట్ చేశారు. -
కేటీఆర్, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ హబ్ విధానాన్ని రాజ్యసభ ఎంపీ, టెక్రోక్రాట్ రాజీవ్ చంద్రశేఖర్ మెచ్చుకున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను ఆయన శనివారం కలుసుకుని టీ హబ్ చేపట్టినందుకు అభినందించారు. ప్రభుత్వ సేవలలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకోవాలని మంత్రిని కోరారు. తెలంగాణ ప్రభుత్వం సిటిజన్ సర్విసెస్ లో ప్రారంభించిన, ఈ-వాహన్ బీమా వంటి సేవలను మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడికి వివరించారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీకి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ను నియమించనున్నట్లు కూడా మంత్రి తెలిపారు. ఈ విధానం ద్వారా పౌర సేవలను ప్రభావవంతంగా అందించేందుకు అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.