ఢిల్లీ: అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆదానీ గ్రూప్ సంస్థల పేర్ల విలువలు కృత్రిమంగా పెచేందుకు వినివియోగించిన మారిషస్ ఫండ్‌లలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్సన్ మాధబీ పురీ బోచ్‌కు, ఆమె భర్త ధవళ్ బోచ్‌కు సంబంధముందని తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో అదానీ గ్రూప్‌పై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజాగా కాంగ్రెస్ విమర్శలపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు హిండెన్‌బర్గ్‌కు కాంగ్రెస్ సహకరిస్తోందని ఆరోపించారు. ‘హిండెన్‌బర్గ్, కాంగ్రెస్ మధ్య ఉన్న భాగస్వామ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ భాగస్వామ్యంతోనే హిండెన్ బర్గ్ ఇటువంటి నివేదిక విడుదల చేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచటం, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో గందరగోళం సృష్టించడమే కాంగ్రెస్ లక్ష్యం. ఇది కాంగ్రెస్ అసత్య ఆరోపణలకు నిదర్శనం. ఈ నివేదిక అసత్యాలు, అబద్ధాలతోనింపబడింది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment