వాట్సాప్‌లో అసలేం జరుగుతోంది.. మండిపడ్డ యూజర్ - సంస్థ రిప్లై ఇలా! | IT Ministry to examine claim of WhatsApp accessing mic in background | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో అసలేం జరుగుతోంది.. మండిపడ్డ యూజర్ - సంస్థ రిప్లై ఇలా!

Published Thu, May 11 2023 5:36 AM | Last Updated on Fri, May 12 2023 11:47 AM

IT Ministry to examine claim of WhatsApp accessing mic in background - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వాట్సాప్‌ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతపై కొద్ది రోజులుగా సందేహాలు తలెత్తుతున్నాయి. వాట్సాప్‌ యాప్‌ వాడకంలో లేనప్పుడు కూడా వినియోగదారుల అనుమతి లేకుండా ఫోన్‌లో మైక్రోఫోన్‌ను సంస్థ యాక్సెస్‌ చేస్తోందన్న ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది.

అసలేం జరిగింది?
‘నేను ఫోన్‌ వాడకున్నా సరే వాట్సాప్‌ యాప్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో నా మొబైల్‌ మైక్రోఫోన్‌ను వాడుతోంది. నిద్రపోయి ఉదయం ఆరింటికి లేచా. అప్పుడూ మైక్రోఫోన్‌ దుర్వినియోగం అవుతోంది. అసలేం జరుగుతోంది?’ అంటూ ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌ ఫోడ్‌ డబిరి శనివారం ట్వీట్‌చేశారు. దీనికి 6.5 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. దీనిపై ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ‘నథింగ్ ట్రస్ట్.. నాట్ ఈవెన్ నథింగ్’ (దేన్నీ నమ్మొద్దని, ఏం కాదని) అంటూ ఆయన ట్విట్ చేశారు. 

మరోవైపు ఈ ట్వీట్‌పై.. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. ‘‘ఇది గోప్యతపై దాడి. దీనిపై వెంటనే విచారణ జరిపిస్తాం. గోప్యతకు భంగం వాటిల్లినట్లు తేలితే చర్యలు తప్పవు’ అంటూ ట్వీట్‌ చేశారు.

కొన్ని నివేదికల ప్రకారం వాట్సాప్‌ యాప్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ను యాక్సెస్‌ చేస్తోంది. ట్విట్టర్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోఫోన్, కెమెరా వంటి ప్రైవసీ సూచికలను ఏదైనా యాప్‌ యాక్సెస్‌ చేసినప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో గ్రీన్‌ నోటిఫికేషన్‌ వినియోగదారుడికి హెచ్చరికగా పనిచేస్తుంది.

ఖండించిన వాట్సాప్‌: ఈ ఆరోపణలను వాట్సాప్‌ ఖండించిది. డబిరి పిక్సల్‌ ఫోన్‌లోని బగ్‌ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు చేసి పరిష్కరించాలని గూగుల్‌ను అభ్యర్థించినట్టు ట్వీట్‌లో చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement