Microphone
-
అభిమానిపై ప్రముఖ ర్యాపర్ ఫైర్.. మైక్ విసిరి.. బూతులు తిడుతూ..
ప్రముఖ ర్యాపర్ కార్జీ బీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ మ్యూజిక్ షోలో పాట పాడుతుండగా.. ఓ వ్యక్తి ఆమెపై డ్రింక్ బాటిల్‌ను విసిరాడు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై బూతులు తిడుతూ మైక్‌ను విసిరింది. 'ఐ లైక్ ఇట్' పాటకు మూమెంట్స్ ఇస్తూ వేదికపై కార్డీ బీ ఉత్సాహంగా పాట పాడుతున్నారు. ఈ క్రమంలో స్టేజ్ కింద నుంచి ఓ వ్యక్తి డ్రింక్ బాటిల్‌ను ఆమెపై విసిరాడు. కోపంతో ఊగిపోయిన కార్డీ బీ.. అతనిపై మైక్ విసిరింది. ఈ వీడియోను ర్యాపర్ సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. Jealous Ass Bitch! https://t.co/bPikhCYBYx pic.twitter.com/AUoG7pvtCv — Cardi B | Updates (@updatesofcardi) July 30, 2023 కార్జీ బీ చేసిన పనికి ఆమెను మెచ్చుకున్నారు కొంతమంది నెటిజన్లు. ఫ్యాన్సు అతి చేయకూడదని సూచనలు చేశారు. పర్ఫార్మర్లపై అలా చేస్తే ప్రోగ్రామ్ దెబ్బతింటుందని కామెంట్లు పెట్టారు. ఇందులో కార్జీ బీ చేసిన పనిని నిందించకూడదని అన్నారు. మ్యూజిక్ ప్రోగ్రామ్‌లలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. డ్రేక్, బెబే రెక్ష, కెల్సియా బాలేరిని, అవా మాక్స్‌లకు కూడా ఫ్యాన్స్ నుంచి ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి. ఇదీ చదవండి: కోతి పిల్లను అక్కున చేర్చుకున్న పిల్లి.. ఏదేమైనా మథర్ ఈజ్ గ్రేట్..! వీడియో వైరల్.. -
అలా జరిగేసరికి..ముఖ్యమంత్రి సంయమనం కోల్పోయి.. మైక్ విసిరి..
రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బార్మర్ జిల్లా పర్యటనలో విచిత్రమైన పరిణామం ఎదురైంది. దీంతో ఒక్కసారిగా అసహనం కోల్పోయి మైక్ విసిరేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. నిజానికి ఆశోక్ గెహ్లాట్ బార్మర్‌లో రెండు రోజులు పర్యటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పథకాల గురించి మహిళల నుంచి ఫీడ్ బ్యాక్ కోసం వారితో సంభాషిస్తుండగా ఈ విచిత్ర పరిణామం ఎదురైంది. ఆ కార్యక్రమంలో ఆ పథకాలన ప్రయోజనాల గురించి వారిని ఆరా తీస్తున్నారు గెహ్లాట్. సరిగ్గా ఆ టైంలో మైక్ సరిగా పనిచేయడం మానేసింది. దీంతో గెహ్లాట్ బార్మర్ జిల్లా కలెక్టర్ నిలబడి ఉన్న ఎడమవైపు మైకుని విసిరారు. పోలీస్ సూపరింటెండెంట్ ఎక్కడ ఉన్నారంటూ.. మండిపడ్డారు. ఎస్పీ, కలెక్టర్ ఒకేలా కనిపిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇంతలో ఓ మహిళ మైక్ ఇవ్వడంతో..శాంతించి కాస్త నిదానంగా దానితో మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట హల్చల్ చేయడమే గాక సీఎం కలెక్టర్‌పైకి మైక్ విసిరేశారని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే దీనిపై స్పందించింది. ఆయన జిల్లా కలెక్టర్లపై మైక్రోఫోన్ విసరలేదంటూ ఆ వ్యాఖ్యలను ఖండించింది. Ashok Gehlot gets angry and throws Mike(not working) at an official pic.twitter.com/fa3d5Ea4h1 — Hemir Desai (@hemirdesai) June 3, 2023 (చదవండి: ఒడిశా రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు) -
వాట్సాప్‌లో అసలేం జరుగుతోంది.. మండిపడ్డ యూజర్ - సంస్థ రిప్లై ఇలా!
సాక్షి, న్యూఢిల్లీ: వాట్సాప్ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతపై కొద్ది రోజులుగా సందేహాలు తలెత్తుతున్నాయి. వాట్సాప్ యాప్ వాడకంలో లేనప్పుడు కూడా వినియోగదారుల అనుమతి లేకుండా ఫోన్లో మైక్రోఫోన్‌ను సంస్థ యాక్సెస్ చేస్తోందన్న ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అసలేం జరిగింది? ‘నేను ఫోన్ వాడకున్నా సరే వాట్సాప్ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో నా మొబైల్ మైక్రోఫోన్‌ను వాడుతోంది. నిద్రపోయి ఉదయం ఆరింటికి లేచా. అప్పుడూ మైక్రోఫోన్ దుర్వినియోగం అవుతోంది. అసలేం జరుగుతోంది?’ అంటూ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఫోడ్ డబిరి శనివారం ట్వీట్‌చేశారు. దీనికి 6.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీనిపై ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. ‘నథింగ్ ట్రస్ట్.. నాట్ ఈవెన్ నథింగ్’ (దేన్నీ నమ్మొద్దని, ఏం కాదని) అంటూ ఆయన ట్విట్ చేశారు. మరోవైపు ఈ ట్వీట్‌పై.. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ‘‘ఇది గోప్యతపై దాడి. దీనిపై వెంటనే విచారణ జరిపిస్తాం. గోప్యతకు భంగం వాటిల్లినట్లు తేలితే చర్యలు తప్పవు’ అంటూ ట్వీట్ చేశారు. కొన్ని నివేదికల ప్రకారం వాట్సాప్ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేస్తోంది. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోఫోన్, కెమెరా వంటి ప్రైవసీ సూచికలను ఏదైనా యాప్ యాక్సెస్ చేసినప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో గ్రీన్ నోటిఫికేషన్ వినియోగదారుడికి హెచ్చరికగా పనిచేస్తుంది. ఖండించిన వాట్సాప్: ఈ ఆరోపణలను వాట్సాప్ ఖండించిది. డబిరి పిక్సల్ ఫోన్లోని బగ్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు చేసి పరిష్కరించాలని గూగుల్‌ను అభ్యర్థించినట్టు ట్వీట్లో చేసింది. -
చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన మోదీ
జైపూర్: రాజస్థాన్ సిరోహిలో శుక్రవారం పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే ఆయన అంతకుముందు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అబు రోడ్లో బీజేపీ నిర్వహించిన ర్యాలీకి ఆలస్యంగా వెళ్లారు. సమయం రాత్రి 10గంటలు దాటిపోయింది. రాజస్థాన్‌లో 10 దాటిన తర్వాత మైక్‌లు, లౌడ్ స్పీకర్లపై నిషేధం అమలులో ఉంది. దీంతో నిబంధనలకు లోబడి ఆయన మైక్‌లో మాట్లాడలేదు. నిబంధనలు అతిక్రమించి మైక్‌లో ప్రసంగించడానికి తన మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని మోదీ అన్నారు. దయచేసి తనను క్షమించాలని అక్కడికి భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యర్తలను, అభిమానులను కోరారు. తాను మరోసారి కచ్చితంగా ఈ ప్రాంతానికి తిరిగి వచ్చి ఇప్పుడు చూపించిన ప్రేమ, అభిమానానికి రుణం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. 'భారత్ మాతాకీ జై' అని ప్రసంగం ముగించారు. ఇదంతా స్టేజీపై మైక్ లేకుండా సాధారణంగా మాట్లాడారు మోదీ. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదే వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్, పార్టీ సీనియర్ నేత అమిత్ మాలవీయ. మోదీ అంతకుముందు ఏడు కార్యక్రమాల్లో పాల్గొన్నారని, అందుకే షెడ్యూల్ అలస్యమై సమయం 10 దాటిందని వెల్లడించారు. 72 ఏళ్ల వయసులోనూ ఆయన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం చేస్తున్నారని చెప్పారు. ఇతర బీజేపీ నేతలు కూడా మోదీ నిజాయితీని కొనియాడారు. ప్రధాని హోదాలో ఉండి కూడా ఆయన వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురిపించారు. PM Modi decided against addressing the public meeting at Abu Road because it was well past stipulated time. This was 7th program of the day. Earlier he flagged and took a ride on Vande Bharat and Ahemdabad Metro, prayed at Ambaji among others. He is 72 and fasting for Navratri! pic.twitter.com/UWiotbehQm — Amit Malviya (@amitmalviya) September 30, 2022 చదవండి: ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయాల్లోకి.. శశి థరూర్ ప్రస్థానమిదే.. -
మీరు కంటెంట్ క్రియేటర్లా..? ఐతే ఇది మీకోసమే..!
ప్రముఖ అకౌస్టిక్ కంపెనీ జేబీఎల్ నుంచి మరో ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చింది. నాణ్య తతో కూడిన రికార్డింగ్ చేసేలా ఇందులో టెక్నాలజీ మిక్స్ చేసింది. గతంలోనూ జేబీఎల్ నుంచి ఈ తరహా ఉత్పత్తులు వచ్చినా... ఈసారి బడ్జెట్లో ఈ మైక్రోఫోన్‌ని మార్కెట్లోకి తెచ్చింది. చేతిలో ఎక్కడికైనా పట్టుకుపోయేలా డిజైన్ చేసింది. సోషల్ మీడియా వేదికగా పని చేసే కంటెంట్ క్రియేటర్లకు అనువుగా రూపుదిద్దింది. ఆ గాడ్జెట్ విశేషాలేంటో ఓ సారి చూద్దాం. అద్భుతమైన ఫీచర్లు జేబీఎల్ CSUM10 మీ దగ్గరుంటే రికార్డింగ్ స్టూడియో ఉన్నట్టే. ప్లగ్ అండ్ ప్లేగా డిజైన్ చేయడంతో దీన్ని ఉపయోగించడం తేలిక. ఇక డిజైన్ కూడా చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు. ముఖ్యంగా అవుట్డోర్ రికార్డింగులు తేలిగ్గా చేయోచ్చు. మైక్రోఫోన్‌ను సులువుగా వాడుకోవడానికి వీలుగా రౌండ్ మెటల్ డెస్క్ టాప్ స్టాండ్‌తో వస్తోంది. బాడీ మొత్తం ఫుల్ మెటల్ ఫినీషింగ్‌తో వస్తోంది. కంట్రోల్స్ విషయానికొస్తే.. బిగినింగ్ స్టేజ్‌లో ఉన్న కంటెంట్ క్రియేటర్లకు సులువుగా దీన్ని వాడవచ్చు. మైక్రోఫోన్ ముందు భాగంలో రెండు బటన్స్‌ను ఉన్నాయి. వీటిలో ఒకటి వాల్యూమ్ కంట్రోల్ చేయోచ్చు. మరొకటి వాయిస్‌ను అడ్జస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. లైవ్ ప్రోగ్రామ్స్‌కి తగ్గట్టుగా మ్యూట్ బటన్ కూడా ఇందులో ఉంది. డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్‌లతో కనెక్ట్ చేయడానికి యుఎస్బి-సి పోర్ట్ సౌకర్యం ఉంది. టైప్ సీ ఇయర్ ఫోన్ కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా 3.5 ఎంఎం ఇయర్ ఫోన్ జాక్కే చోటు కల్పించారు. తిరుగులేని పర్ఫార్మెన్స్ ఈ మైక్రో ఫోన్లో రెండు రకాల మోడ్‌లను ఏర్పాటు చేసింది జేబీఎల్. 1. ఒమ్నీ డైరక్షనల్ మోడ్(అన్ని దిశల నుంచి సమానంగా సౌండ్ రికార్డు అవుతుంది. ) 2.కార్డియాడ్ మోడ్ (మీకు 180 డిగ్రీల సమాంతరంగా రికార్డింగ్ చేస్తోంది ) ధర JBL CSUM10 డ్యూయల్ క్యాప్సూల్ కండెన్సర్ యూఎస్బీ రకం మైక్రోఫోన్ ధర రూ 5,799 గా ఉంది. JBL CSUM 10 బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్రోఫోన్. అతి తక్కువ ధరలో మల్టీ రికార్డింగ్ మైక్రోఫోన్ రావడం చాలా అరుదు. ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ స్వరాన్ని రికార్డు చేయవచ్చును. మీకు ఈ మైక్రోఫోన్ ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి పొందవచ్చును. ఇంకేందుకు ఆలస్యం వెంటనే కొనేయ్యండి. చదవండి: అదిరిపోయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ మొబైల్ -
ఆన్లైన్ మోసం: ఫోన్‌కు బదులు నాపరాయి
-
బంగారు కలలు కందాం...
‘థీమ్ పార్టీ’ గురించి వినే ఉంటారు. ఇలాంటి పార్టీలకు ఓ డ్రెస్ కోడ్ నిర్ణయిస్తారు. ఎలాంటి వేషధారణలో రావాలో కూడా ముందే చెప్పేస్తారు. ఆదివారం సాయంత్రం (భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం) లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకను ‘వియ్ ఆల్ డ్రీమ్ ఇన్ గోల్డ్’ అనే థీమ్‌తో నిర్వహించారు. ‘బంగారు బొమ్మను సొంతం చేసుకోవడానికి బంగారు కలలు కందాం’ అంటూ నామినేషన్ దక్కించుకున్నవాళ్లు ఇన్నాళ్లూ కలలు కన్నారు. మరి.. ఎవరి కల నిజమయ్యిందనేది సోమవారం తెలిసిపోతుంది. ఈలోపు ఆస్కార్ అవార్డుల గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం... మెరుపు తీగలను దగ్గరగా చూడ్డానికి పోటీ! ఆస్కార్ అవార్డు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విషయాల్లో రెడ్ కార్పెట్ ఒకటి. ఎర్ర తివాచీ పై అందాల తారలు వయ్యారంగా నడుస్తుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఈ క్యాట్వాక్ని దగ్గరగా చూడ్డానికి చాలామంది పోటీలు పడుతుంటారు. అందుకే, రెడ్ కార్పెట్‌కి సమీపంగా ఉన్న పోడియమ్కి వెళ్లే చాన్స్ దక్కించుకోవడానికి ఉవ్విళ్లూరుతారు. అందులో 745 మంది ఆసీనులు కావచ్చు. దీనికోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్లకే ఈ అవకాశం దక్కుతుంది. వీరికి లోపల జరిగే అవార్డు కార్యక్రమాన్ని వీక్షించే అనుమతి మాత్రం ఉండదు. అయి నప్పటికీ పోడియమ్లో చోటు కోసం ఆన్లైన్లో వేల సంఖ్యలో అప్లికేషన్స్ వస్తాయట. ఎక్కువ మాట్లాడితే... మైక్ కట్! ... అండ్ ది విన్నర్ ఈజ్ అంటూ తమ పేరు వినగానే విజేతల గుండె లయ తప్పినట్లు అవుతుంది. ఒకింత ఉద్వే గంగా, కన్ఫ్యూజన్గా వేదిక మీదకు వస్తారు. ఆ కంగారులో ఎక్కువ మాట్లాడేయాలనుకుంటారు కొంతమంది. కానీ, కేవలం 45 సెకండ్లు మాత్రమే విజేతకు టైం ఇస్తారు. అందుకే నామినేషన్ దక్కించుకున్నవాళ్లు ముందుగానే రిహార్సల్ చేస్తారు. అయినప్పటికీ ఉద్వేగంలో 45 సెకండ్లు కన్నా ఎక్కువ మాట్లాడితే...? మైక్రో ఫోన్‌ను కట్ చేస్తారు. ఆనాటి ఆనవాళ్లు! ఆస్కార్ వేదిక అంటే అంగరంగ వైభవంగా ఉంటుంది. ఈసారి వేదిక విశేషం ఏంటంటే.. 1970ల నాటి హాలీవుడ్ చిత్రాలను తలపించేలా ఉంటుందట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కాబట్టి, వేదికను అలా డిజైన్ చేశారు. ఆ విషయాన్ని ఉద్దేశిస్తూ.. ‘వియ్ ఆల్ డ్రీమ్ ఇన్ గోల్డ్’ అనే థీమ్‌తో ఈ వేడుక జరపాలనుకున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఆస్కార్ వేదికను డి జైన్ చేస్తున్న డెరిక్ మెక్లెయిన్ ఈసారి కూడా వేదికను డిజైన్ చేశారు. ముస్తాబుకు అంత ఖరీదా! అందాల తారలు రెడ్ కార్పెట్‌పై రకరకాల డ్రెస్సుల్లో చూపరుల మతులు పోగొడతారు. వీళ్లు వేసుకునే దుస్తులు, ఆభరణాలు, కేశాలంకరణ, మేకప్.. అన్నింటికీ కలిపి ఒక్కో బ్యూటీకి అయ్యే ఖర్చు దాదాపు 50 లక్షల రూపాయలట. అంత ఖర్చుపెడతారు కాబట్టే, కనువిందు చేయగలుగుతున్నారు. ఆ చానల్‌కి కాసుల పంట! ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఏబీసీ చానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గత 50 ఏళ్లుగా ఇదే చానల్ ఆస్కార్ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ ప్రసార హక్కులు దక్కించుకోవడానికి దాదాపు 520 కోట్ల రూపాయలను సదరు చానల్‌వారు వేడుక నిర్వాహకులకు ఇస్తారట. ఆ డబ్బుని యాడ్స్ రూపంలో సునాయాసంగా వసూలు చేసేసుకుంటారు. ప్రత్యక్ష ప్రసారం మధ్య మధ్యలో వచ్చే యాడ్స్‌కి దాదాపు 12 నుంచి 13 కోట్ల రూపాయల వరకూ తీసుకుంటారని భోగట్టా. 2020 వరకూ ఈ కార్యక్రమాన్ని తమ చానల్ వారే ప్రసారం చేసేలా ఆస్కార్ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుంది ఏబీసీ. ఈ చానల్ ద్వారా 225 దేశాల్లో ఆస్కార్ అవార్డుల పండగ వీక్షకులను కనువిందు చేయనుంది. లంచ్ మీట్లో సందడి నామినేషన్స్‌ని ప్రకటించిన తర్వాత నామినీస్‌కి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ లంచ్‌లో పాల్గొనడానికి వచ్చే నామినీస్ అందంగా ముస్తాబై హాజరవుతారు. ఈ మధ్య జరిగిన లంచ్ మీట్లో లియొనార్డో డికాప్రియో, స్టీవెన్ స్పీల్బర్గ్, జెన్నిఫర్ లారెన్స్, సీర్షా రొనాన్, రేషెల్ మెక్ ఆడమ్స్, లేడీ గగా తదితరులు పాల్గొని, సందడి చేశారు. అమెరికానే నా దగ్గరకు వచ్చింది: ప్రియాంకా చోప్రా ఆస్కార్ వేడుకల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేసే అవకాశం మన భారతీయ నటి ప్రియాంకా చోప్రాకు దక్కిన విషయం తెలిసిందే. రిహార్సల్స్ చేయడం కోసం రెండు రోజుల క్రితమే ఆమె లాస్ ఏంజిల్స్ వెళ్లారు. ‘‘జుత్తుకు హెన్నా పెట్టుకోమని, నోస్ రింగ్ పెట్టుకోమని.. ఇలా చాలామంది ఏవేవో సలహాలు ఇచ్చారు. ఎలా మ్యానేజ్ చేస్తావో.. ఏంటో అని కంగారుపెట్టారు. నేను కూల్‌గానే ఉన్నా’’ అని ప్రియాంక అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’ ఒప్పుకున్నప్పుడు అమెరికాలో నేనేంటో నిరూపించుకోవాలనే ప్లాన్ నాకుందని చాలామంది అనుకున్నారు. నాకలాంటి ప్లాన్స్ ఏవీ లేవు. అమెరికానే ఓ అవకాశం తీసుకుని నా దగ్గరకు వస్తే, నేను ఒప్పుకున్నాను... అంతే. నేను అమెరికన్ ఇండియన్ని కాదు. ఎప్పటికీ ‘ఇండియన్ ఇండియన్’నే’’ అన్నారు. ఆస్కార్ వేడుకలో అందర్నీ ఆకట్టుకోగలననే ధీమా ఆమెలో కనిపించింది. -
యాపిల్ వాచ్.. వచ్చేసిందోచ్..
క్యుపర్టినో, కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా అత్యాధునిక ఫీచర్స్‌తో స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునేందుకు ఇందులోనే బిల్ట్ఇన్ స్పీకర్, మైక్రోఫోన్ ఉన్నాయి. అలాగే, ఫిట్నెస్ను ట్రాక్ చేసేందుకు, వ్యాయామాలను సూచించేందుకు వర్కవుట్ యాప్ కూడా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, 18 క్యారట్ గోల్డ్ కేస్‌లతో ఈ వాచీలు లభ్యమవుతాయి.గోల్డ్ వాచ్ ధర 10,000 డాలర్ల నుంచి మొదలవుతుంది. ఇక స్టెయిన్లెస్ స్టీల్ వాచ్ రేటు 549-1099 డాలర్ల వరకూ ఉంటుంది. వాచ్ ‘స్పోర్ట్’ ధర 349-399 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. వీటి విక్రయాలకు మొదట 9 తొమ్మిది దేశాల్లో ఏప్రిల్ 10 నుంచి ముందస్తు బుకింగ్స్ మొదలవుతాయి. -
మిడతలకు చెవులున్నాయా?
మిడుతలకు మనలాగ చెవులుండవు. కాని వాటి జీవితంలో శబ్దానికి చాల ప్రాముఖ్యముంది. అసలు చెప్పాలంటే వాటికి తోడు కావలసిన మిడతల్ని కనుక్కునేందుకు ఈ శబ్దమే ముఖ్యమైన సాధనం. మగ మిడతలను ఒక గాజు గిన్నెలో ఉంచినపుడు, వాటిని గురించి ఆడ మిడతలు అసలు పట్టించుకోవని శాస్త్రజ్ఞులు వారి పరిశోధనల్లో తెలుసుకున్నారు. ఆడమిడతలు గాజు గిన్నెలోని మగ మిడతల్ని చూడగలిగినప్పటికీ వాటిని వినలేకపోయినందువల్ల సరిగా గుర్తించలేకపోయాయి. కాని ఒక మైక్రోఫోను ఆ మగ మిడుత శబ్దాన్ని స్పీకరుకు అందించినపుడు ఆడ మిడతలు ఎంతో సంతోషంగా ఆ గాజుగిన్నె చుట్టూ చేరినట్లు పరిశోధనల్లో తేలింది. అసలు విషయం ఏమిటంటే...మిడుతలకు చెవులుండవు. వాటికి బదులు వాటి ముందు కాళ్ళలో శబ్ద గ్రాహకాలు ఉంటాయి. అవి మద్దెలలాగ ఉంటాయి. ప్రతి ‘మద్దెల’ మధ్యలో ఒక గుండ్రటి కొమ్ములాంటి అమరిక ఉంటుంది. ఈ ‘మద్దెల’ పల్చటి చర్మాలు చుట్టుపక్కల ఉన్న శబ్దతరంగాలను - మిగతా క్రిమికీటకాలు చేసే చప్పుళ్ళను గ్రహించి ఆ మిడుత నాడీవ్యవస్థకు పంపుతాయి. అక్కడ ఆ శబ్దాల్ని డీకోడ్ చేసుకుంటాయి. -
లూనా... ఓ చక్కని సేవకుడు!
శునకాన్ని వాకింగ్‌కు తీసుకెళ్లడమే కాదు.. లూనా అనే ఈ పర్సనల్ రోబో ఇంకా అనేక పనులూ చేయగలదు. కూల్డ్రింకులు అందించడంతో పాటు ఆస్పత్రిలో వైద్యులకు, నర్సులకు సహాయం కూడా చేస్తుంది. కాలిఫోర్నియాలోని రోబోడైనమిక్స్ కంపెనీ వారు దీనిని తయారు చేస్తున్నారు. మనిషిలా ఒకటిన్నర మీటర్ల ఎత్తుండే లూనా ముఖంపై టచ్‌స్క్రీన్ ఉంటుంది. మైక్రోఫోన్, వైర్లెస్, సెల్యులార్ కమ్యూనికేషన్ ద్వారా నియంత్రించొచ్చు. హెచ్డీ కెమెరాతో పరిసరాలను గమనిస్తూ చక్రాలతో చకచకా తిరుగుతుంది. దీనిని పెద్ద ఎత్తున ఉత్పత్తిచేసేందుకు కంపెనీవారు నిధుల వేట మొదలుపెట్టారు. డిసెంబర్‌లోగా మార్కెట్లోకి రానున్న లూనా ధర రూ. 93 వేలు. ముందుగా బుక్ చేసుకుంటే రూ. 63 వేలు. ఇప్పుడు పీసీలు, స్మార్ట్ఫోన్లు ఇంటింటా సందడి చేస్తున్నట్లే.. 2021 నాటికి పర్సనల్ రోబోలూ హల్చల్ చేస్తాయని, వాటిలో లూనా మొదటిస్థానంలో నిలుస్తుందని కంపెనీవారు చెబుతున్నారు.