లూనా... ఓ చక్కని సేవకుడు!
శునకాన్ని వాకింగ్‌కు తీసుకెళ్లడమే కాదు.. లూనా అనే ఈ పర్సనల్ రోబో ఇంకా అనేక పనులూ చేయగలదు. కూల్‌డ్రింకులు అందించడంతో పాటు ఆస్పత్రిలో వైద్యులకు, నర్సులకు సహాయం కూడా చేస్తుంది. కాలిఫోర్నియాలోని రోబోడైనమిక్స్ కంపెనీ వారు దీనిని తయారు చేస్తున్నారు. మనిషిలా ఒకటిన్నర మీటర్ల ఎత్తుండే లూనా ముఖంపై టచ్‌స్క్రీన్ ఉంటుంది. మైక్రోఫోన్, వైర్‌లెస్, సెల్యులార్ కమ్యూనికేషన్ ద్వారా నియంత్రించొచ్చు.
హెచ్‌డీ కెమెరాతో పరిసరాలను గమనిస్తూ చక్రాలతో చకచకా తిరుగుతుంది. దీనిని పెద్ద ఎత్తున ఉత్పత్తిచేసేందుకు కంపెనీవారు నిధుల వేట మొదలుపెట్టారు. డిసెంబర్‌లోగా మార్కెట్లోకి రానున్న లూనా ధర రూ. 93 వేలు. ముందుగా బుక్ చేసుకుంటే రూ. 63 వేలు. ఇప్పుడు పీసీలు, స్మార్ట్‌ఫోన్లు ఇంటింటా సందడి చేస్తున్నట్లే.. 2021 నాటికి పర్సనల్ రోబోలూ హల్‌చల్ చేస్తాయని, వాటిలో లూనా మొదటిస్థానంలో నిలుస్తుందని కంపెనీవారు చెబుతున్నారు.