రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బార్మర్ జిల్లా పర్యటనలో విచిత్రమైన పరిణామం ఎదురైంది. దీంతో ఒక్కసారిగా అసహనం కోల్పోయి మైక్ విసిరేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. నిజానికి ఆశోక్ గెహ్లాట్ బార్మర్‌లో రెండు రోజులు పర్యటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పథకాల గురించి మహిళల నుంచి ఫీడ్ బ్యాక్ కోసం వారితో సంభాషిస్తుండగా ఈ విచిత్ర పరిణామం ఎదురైంది. ఆ కార్యక్రమంలో ఆ పథకాలన ప్రయోజనాల గురించి వారిని ఆరా తీస్తున్నారు గెహ్లాట్. సరిగ్గా ఆ టైంలో మైక్ సరిగా పనిచేయడం మానేసింది.
దీంతో గెహ్లాట్ బార్మర్ జిల్లా కలెక్టర్ నిలబడి ఉన్న ఎడమవైపు మైకుని విసిరారు. పోలీస్ సూపరింటెండెంట్ ఎక్కడ ఉన్నారంటూ.. మండిపడ్డారు. ఎస్పీ, కలెక్టర్ ఒకేలా కనిపిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇంతలో ఓ మహిళ మైక్ ఇవ్వడంతో..శాంతించి కాస్త నిదానంగా దానితో మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట హల్‌చల్ చేయడమే గాక సీఎం కలెక్టర్‌పైకి మైక్ విసిరేశారని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే దీనిపై స్పందించింది. ఆయన జిల్లా కలెక్టర్లపై మైక్రోఫోన్ విసరలేదంటూ ఆ వ్యాఖ్యలను ఖండించింది.
Ashok Gehlot gets angry and throws Mike(not working) at an official pic.twitter.com/fa3d5Ea4h1
— Hemir Desai (@hemirdesai) June 3, 2023
(చదవండి: ఒడిశా రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment