ఓ సర్పంచ్ అనర్గళంగా ఆంగ్లంలో ప్రసంగించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఇంగ్లీష్ స్పీచ్‌కి అందరూ ఫిదా అయ్యిపోయారు. ఐఏఎస్ ఆఫీసర్ సైతం ఆమె ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఈ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకెళ్తే..రాజస్తాన్ బార్మర్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి గౌరవ అతిథిగా కలెక్టర్ టీనాదాబి విచ్చేశారు. ఆ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ సోను కన్వర్ రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి కలెక్టర్‌కి ఆంగ్లంలో స్వాగతం పలికింది. " ఈరోజులో తాను కూడా భాగమైనందుకు సంతోషిస్తున్నాను. ముందుగా మా కలెక్టర్ టీనా మేడమ్ స్వాగం పలుకుతారు. ఓ మహిళగా ఆమెను స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నా" అంటూ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడింది.
ఆ తర్వాత ఆమె నీటి సంరక్షణపై కూడా ప్రసంగించింది. ఆ వేదికపై మహిళా సర్పంచ్ అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడిన తీరు అందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది. అంతేగాదు ఒక్కసారిగా ఆ వేదిక మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఆ సర్పంచ్ ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి టీనా సైతం ఆశ్చర్యంగా అలా చూస్తుండిపోయారు.
కాగా, 2015లో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ (UPSC) పరీక్షలో తన మొదటి ప్రయత్నంలోనే అగ్రస్థానంలో నిలిచి కలెక్టర్‌గా అజ్మీర్ నుంచి కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం టీనా దాబీ జైపూర్‌లో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే బార్మర్ జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
बाड़मेर में IAS टीना डाबी @dabi_tina के सामने जब राजपूती पोशाक और घूँघट में जालीपा महिला सरपंच सोनू कँवर ने जब अपना उद्बोधन अंग्रेज़ी से शुरू किया तो उपस्थित सब लोग चौंक गए और टीना डाबी के चेहरे की मुस्कान बयां कर रही है l..
जिला कलेक्टर खुद को ताली बजाने से नही रोक पाए pic.twitter.com/fLYuo0gqJo— Kailash Singh Sodha (@KailashSodha_94) September 14, 2024
Comments
Please login to add a commentAdd a comment