
బ్రెజిల్‌లోని అనపోలిస్‌లోని ఒక సూపర్ మార్కెట్ లో ఒక మహిళ జేబులో ఉన్నట్టుండి సెల్‌ఫోన్ పేలిపోయింది. ఈ షాకింగ్ ఘటన సీసీటీవీలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెల్ ఫోన్లు అసలెందుకు పేలతాయి?
షాపింగ్ మాల్ భర్తతో కలిసి షాపింగ్‌లో సందడి ఉంది ఒక మహిళ. ఇంతలో ప్రమాద ఎలాంటి సంకేతాలు లేకుండానే ఒక్కసారిగా జేబులోని ఫోన్ ద్వారా మంటలంటుకున్నాయి. వెనుక జేబులో ఉన్న ఫోన్ పేలిపోవడంతో, పొగ, మంటలు వ్యాపించాయి. చుట్టు పక్కల వారు భయంతో పరుగులుతీశారు. దీంతో పక్కనే ఉన్న భర్త పోన్ తీసి బైట పడేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదంలో ఆమె వెనుక భాగం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు ఎవరు? అనే వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే పేలిన ఫోన్ మోటరాలా కంపెనీదని తేలింది.
పేలుడుకు కారణమేమిటి?
ఎలక్ట్రికల్ ఇంజనీర్ క్లెబర్ డా సిల్వీరా మోరీరా లిథియం-అయాన్ బ్యాటరీలు పెద్ద మొత్తంలో శక్తిని నిల్వ చేస్తాయని, కొన్ని పరిస్థితులలో అవి వేడెక్కడంపల్ల ఒక్కోసారి పేలతాయని నిపుణులు తెలిపారు.
ఫోన్ పేలుళ్లకు నిపుణులు చెబుతున్న అనేక సాధారణ కారణాలు
బ్యాటరీ పాడైపోవడం, ఒత్తిడి : ఫోన్ మీద కూర్చోవడం లేదా దానిపై ఒత్తిడి తీసుకు రావడం వల్ల, పేలవచ్చు. షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు.
డూప్లికేట్ ఛార్జర్‌లు: చౌకైన లేదా నకిలీ ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గులతో, బ్యాటరీ దెబ్బతింటుంది.
బాగా వేడెక్కడం: ఫోన్‌ను ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉంచడం లేదా వేడి వాతావరణంలో ఛార్జ్ చేయడం వల్ల పేలిపోవచ్చు.
ఛార్జింగ్‌లో ఉండగా వాడకం: గేమ్‌లు ఆడటం, వీడియోలు చూడటం లేదా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఉపయోగించడం వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. ఫలితంగా మంటలు వ్యాపించవచ్చు.

పేలుడుపై కంపెనీ స్పందన
పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు మోటరోలా రంగంలోకి దిగింది. బాధితురాలితో మాట్లాడినట్టు కంపెనీ ధృవీకరించింది. తమ ఉత్పత్తులన్నీ కఠినమైన పరీక్షల ద్వారా మార్కెట్‌కు వెడతాయని, భద్రత పట్ల నిబద్ధతగా వ్యవహరిస్తామంటూ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక విశ్లేషణ చేస్తున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment