burst
-
రష్యాలో విషాదం: వేడి నీటి పైపు పగిలి నలుగురు మృతి!
రష్యాలోని మాస్కోలో ఒక షాపింగ్ మాల్లో వేడి నీటి పైపు పగిలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 70 మంది గాయపడ్డారు. టాస్ అనే వార్తా సంస్థకు మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ ఈ విషయాన్ని తెలియజేశారు. షాపింగ్ మాల్లో జరిగిన ప్రమాదం నలుగురి ప్రాణాలను బలిగొందని మేయర్ టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా తెలిపారు. మృతుల కుటుంబాలకు, స్నేహితులకు సంతాపం తెలిపారు. తొమ్మిది మంది ఆసుపత్రిలో చేరిక.. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మాల్లోని పైపు పగిలిపోవడంతో మాల్లోని కొంత భాగంలోకి వేడినీరు ప్రవేశించింది. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. మరో 20 మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక వైద్య అధికారి.. టాస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ పైపు పగిలిపోవడంతో పది మంది వేడి నీళ్ల బారిన పడ్డారని, వారిలో తొమ్మిది మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. నలుగురిపై క్రిమినల్ కేసు నమోదు ఈ ఉదంతంపై రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. నలుగురు నిందితులపై గ్రూప్ క్రిమినల్ కేసు పెట్టామని ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రతినిధి యులియా ఇవనోవా మీడియాకు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్క్యూ టీమ్ నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించింది. ఇది కూడా చదవండి: బైడెన్‌పై అభిశంసనకు సిద్ధమైన రిపబ్లికన్లు -
నైట్ షోలో అగ్ని ప్రమాదం..ఎగిసిపడ్డ అగ్నికీలలు
యూఎస్‌లోని ఓ నైట్ షోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా షోని నిలపేసి ప్రేక్షకులకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలిపింది నిర్వాహణ సంస్థ. ఈ ఘటన కాలిపోర్నియాలోని చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని డిస్నీల్యాండ్‌లో జరిగిన నైట్ షోలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో టామ్ సాయర్ ద్వీపం సమీపంలోని థీమ్ పార్క్ వద్ద జరిగే ఫ్యాంటాస్మిక్ ప్రదర్శనను అకస్మాత్తుగా నిలిపేశారు. ఈ అసౌకర్యానికి క్షమాపణలు తెలుపుతూ ప్రేక్షకుల కోసం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది నిర్వాహక సంస్థ. శనివారం సాయంత్రం డిస్నీల్యాండ్ పార్క్‌లో ఫ్యాంటాస్మిక్ చివరి ప్రదర్శన సమయంలో ఈ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఆకర్షణగా ఉండే 24 అడుగుల జెయింట్ డ్రాగన్ మంటల్లో చిక్కుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ అనుహ్య ఘటనతో నిర్వాహకులు ప్రదర్శనను నిలిపేసి ప్రదర్శనలిచ్చే నటీనటులందర్నీ సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఆ ద్వీపం అంతా హుటాహుటినా ఖాళీ చేయించారు. ఐతే ఈ ఘటనలో ఎవరూ ఎలాంటి గాయాల బారిన పడలేదు కానీ ఎంతమేర అగ్నిప్రమాదం సంభవించింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా అక్కడ ప్రదేశం అంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఫ్యాంటాస్మిక్ అనేది 27 నిమిషాల ప్రత్యక్ష ప్రదర్శన. దీన్ని 1992 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాణసంచా, రంగురంగుల నీటి ప్రదర్శన తోపాటు లైవ్లోన నటులు పైరోటెక్నిక్‌లు, లేజర్లు, సంగీతం వంటి ప్రదర్శనలిస్తారు. Fantastic Fantasmic fail - wow! #fantasmic #disneyland pic.twitter.com/MZhNJhEXrB — JessicaT (@Ms_JessicaT) April 23, 2023 (చదవండి: సూడాన్‌లో చిక్కుకున్న వారిని ఆ మార్గంలో తరలించేందుకు సన్నాహాలు!) -
హఠాత్తుగా పెళపెళమంటూ రోడ్డు బద్ధలై ఒక్కసారిగా..
ఏమైందో ఏమో ఉన్నటుండి ఒక్కసారిగా రహదారి బద్ధలై నీళ్లు ఫౌంటైన్ మాదిరి వెదజిమ్ముతూ బయటకు వచ్చాయి. దీంతో అక్కడ ఉండే వారెవరికీ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఇదేమైన మరో ప్రకృతి విపత్తా? అన్నట్లుగా జరిగిందా ఆ ఘటన. సరిగ్గా అదే సమయంలో స్కూటీపై పింక్ కలర్ దుస్తులతో ఒక అమ్మాయి వెళ్తోంది. ఈ హఠాత్పరిణామనికి వెదజిమ్ముతున్న నీటి కారణంగా కిందపడిపోవడమే గాక ఆ నీటి ప్రవాహానికి ఆమె కొట్టుకుపోయింది. అంత ఘోరంగా నీళ్లు పైకి ఎగదన్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో శనివారం రోడ్డు మధ్యలో చోటు చేసుకుంది. ఐతే చుట్టుపక్కల స్థానికులు ఆమెను రక్షించినట్లు సమాచారం. భూగర్భ పైప్ లైన్ పగిలిపోవడంతో నీటి ప్రవాహానికి రోడ్డు పెళపెళమంటూ.. విరిగిపోతూ నీళ్లు బయటకు ఉబికివచ్చేశాయి. దీంతో రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి, ఆ రహదారి మొత్తం నీళ్లతో నిండిపోయి, కంకరాళ్లతో చెల్లచెదురుగా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. #WATCH | Road cracked open after an underground pipeline burst in Yavatmal, Maharashtra earlier today. The incident was captured on CCTV. A woman riding on scooty was injured. pic.twitter.com/8tl86xgFhc — ANI (@ANI) March 4, 2023 (చదవండి: తీవ్ర లక్షణాలా? కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడొద్దు!) -
నడుములు విరిగిపోతాయ్ జాగ్రత్త!.. మంత్రి వార్నింగ్
బోఫాల్: అధికార దర్పం ప్రదర్శించే నేతలను తరచూ చూస్తుంటాం. కానీ, ఆ మదంతో అడ్డగోలు వ్యాఖ్యలు, చర్యలు చేసేవాళ్లూ కూడా అక్కడక్కడ తారసపడుతుంటారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లో అటవీ శాఖ మంత్రి విజయ్ షా అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఆ సమావేశంలో ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మంత్రి విజయ్ సహనం కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీయే అతన్ని సమావేశానికి అంతరాయం కలిగించేలా.. మద్యం తాగించి పంపించిందంటూ ఆ వ్యక్తిపై చిందులు తొక్కారు. ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకుడిని ఉద్దేశించి.. మేము మధ్యప్రదేశ్‌లో అభివృద్ధి శకానికి నాంది పలుకుతున్నాం. ఇక్కడ ఎవరైనా సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తే వారిని అరెస్టు చేస్తాం. ఇది ప్రభుత్వ సమావేశం. దీనికి అంతరాయం కలిగించి వారి నడుములు పగిలిపోతాయ్! అంటూ గట్టిగా హెచ్చరించారు. వాస్తవానికి ఆ వ్యక్తి తన భార్య అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తోందని, ఆరు నెలలుగా జీతం రావడం లేదంటూ మంత్రి ముందు తన గోడును వెల్లబోసుకున్నాడు. ఈ విషయమై మంత్రిగారిని గట్టిగా ప్రశ్నించాడు. అంతే అటవీ శాఖ మంత్రి ఊగిపోతూ.. సదరు వ్యక్తిపై తిట్లదండకం అందుకున్నాడు. "We're ushering development, but will lock anyone trying to create scene here.This is a govt gathering, whoever disrupts it will get hips broken by cops,"MP forest minister Vijay Shah's ultimatum to a villager asking questions at Vikas Yatra. @NewIndianXpress@TheMornStandard pic.twitter.com/94SwsWRBwi — Anuraag Singh (@anuraag_niebpl) February 15, 2023 (చదవండి: ఆప్ మంత్రిని విచారించిన సీబీఐ) -
విషాదం.. యుద్ధ ట్యాంకర్ పేలి ఇద్దరు సైనికులు మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలో విషాదం జరిగింది. సైనికులు ఏటా నిర్వహించే ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీ సమీపంలోని బబినా కంటోన్మెంట్ ప్రాంతంలో విన్యాసాలు నిర్వహించే సమయంలో టీ-90 యుద్ధ ట్యాంకర్ బ్యారెల్ పేలింది. మూడో తరానికి చెందిన ఈ ట్యాంకర్‌ను రష్యా తయారు చేసింది ఈ దర్ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీవ్ర గాయాలైనప్పటికీ అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. . పేలుడు జరిగిన సమయంలో ట్యాంకర్లో ముగ్గురు సైనికులు ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. కమాండర్, గన్నర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడని పేర్కొన్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సైనికాధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో తవాంగ్‌లో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ మరునాడే ఝాన్సీలో మరో ప్రమాదం జరిగి ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. చదవండి: వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు -
వామ్మో.. లోదుస్తుల్లో బంగారం..
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): పాదరక్షల్లో బంగారం దాచి తీసుకొచ్చిన ఆరుగురిని మీనంబాక్కం విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అర్ధరాత్రి శ్రీలంక నుంచి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక విమానం వచ్చింది. చెన్నైకి చెందిన ఆరుగురు ప్రయాణికులు ఒక బృందంగా వచ్చారు. అధికారులకు వారిపై అనుమానం రావడంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇద్దరు ప్రయాణికుల పాదరక్షల్లో బంగారం, నలుగురి లోదుస్తుల్లో 928 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. చదవండి: Tamilnadu: తల్లి వద్దు.. ప్రియుడే కావాలి.. -
ఆ వార్తలు నమ్మకండి.. ఏవైనా ఉంటే నేనే చెప్తా: మెహ్రీన్
నానికి జోడీగా ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నటించి టాలీవుడ్లోకి అడుగుపెట్టింది పంజాబీ భామ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. మహానుభావుడు, ఎఫ్ 2 చిత్రాలతో ఈ ముద్దు గుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కాగా ఇటీవల దర్శకుడు గోపిచంద్ మలినేని తన సినిమాలో హీరోయిన్గా మెహ్రీన్‌తో సంప్రదింపులు జరిపినట్లు, ఆ ఆఫర్‌ను ఈ అమ్మడు రిజెక్ట్ చేసిందనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా దీనిపై మెహ్రీన్ స్పందించింది. ఆ వార్తలను నమ్మకండి.. ప్రస్తుతం ఈ భామ ‘ఎఫ్-3’తో పాటు మరో సినిమాలో నటిస్తోంది. నిశ్చితార్థం అనంతరం తన సినిమాల ఎంపికలో సెలక్టివ్‌గా ఉంటున్నట్లు తెలుస్తోంది మెహ్రీన్. తనపై వస్తున్న వార్తలకు స్పందిస్తూ.. తెలుగులో కొత్త సినిమాలకు ఇంకా సంతకం చేయలేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ అంగీకరిస్తే తానే స్వయంగా తెలియజేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన ట్విటర్లో.. ‘ ప్రస్తుతం నేను మారుతి దాసరి, సంతోష్ చిత్రంలో బిజీగా ఉన్నాను. నా తదుపరి సినిమాలకు సంబంధించి వస్తున్న వార్తలను నమ్మకండి. ఏవైనా ఉంటే నేనే స్వయంగా మీతో పంచుకుంటా.. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ✌️ pic.twitter.com/k2VenjIbnC — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) June 27, 2021 చదవండి: ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? -
విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
-
విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం
బీజింగ్: టేకాఫ్ కు సిద్దంగా ఉన్న ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సెల్‌ఫోన్ చార్జింగ్ కు వాడే పవర్ బ్యాంకు పేలడంతో చైనా సదరన్ ఎయిర్లైస్స్ కు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. సిబ్బంది, ప్రయాణికులు సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. చైనాలోని గాంగ్జూ విమానాశ్రయంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బోయింగ్ 777-300ఈఆర్ రకానికి చెందిన సీజెడ్3539 విమానం గాంగ్జూ నుంచి షాంఘై వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రయాణికులు విమానంలో ఎక్కుతుండగానే ఓవర్‌హెడ్ కంపార్ట్మెంటులో మంటలు గమనించారు. అందులోని ఓ బ్యాగులో నుంచి మంటలు చెలరేగాయి. సిబ్బంది హుటాహుటిన స్పందించి మంటలు ఆర్పివేశారు. ప్రమాదం జరిగినప్పుడు పవర్ బ్యాంకు వినియోగంలో లేకపోయినా ఎందుకు పేలిందనే దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఆ బ్యాగు తీసుకువచ్చిన వ్యక్తిని విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఆ విమానాన్ని నిలిపివేసి మరో విమానంలో ప్రయాణికులను పంపించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీకాలేదు. బోయింగ్ 777-300ఈఆర్ విమానంలో కొంత భాగం మాత్రం పాడైంది. మంటలు చెలరేగినప్పుడు ప్రయాణికుడు తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
గ్యాస్ లీకై పూరిల్లు దగ్ధం
అత్తిలి : ఓ చిన్నారి మొక్కజొన్నపొత్తును గ్యాస్‌స్టౌపై కాల్చుకుని గ్యాస్‌ను కట్టకుండా వదిలేయడంతో మంటలు వ్యాపించి పూరిల్లు దగ్ధమైంది. శుక్రవారం సాయంత్రం మండలంలోని ఆరవల్లిలో జరిగిన ఈ దుర్ఘటనలో మూడు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. గ్రామానికి చెందిన సంధి సత్యం అతని కుమారులు భీమన్న, ధర్మరాజు నివశిస్తున్న పూరింట్లో గ్యాస్‌స్టౌ కట్టకుండా వదిలేయడంతో మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. మంటల్లో ఇంట్లో ఉన్న మరో రెండు గ్యాస్ బండలు పేలాయి. ఫలితంగా పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ.లక్ష ఆస్తినష్టం వాటిల్లినట్లు ఇన్చార్జ్ అగ్నిమాపకాధికారి కౌరు సత్యానందం తెలిపారు. ఎంటీటీసీ సభ్యురాలు వెలగల వెంకటలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ వెలగల ప్రసాదరెడ్డి ,వెలగల సత్యనారాయణరెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
-
బాలీవుడ్ భామ భోరుమందట
ముంబై: మై నేమ్ ఈజ్ షీలా... అంటూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన కత్రినా కైఫ్ భోరున విలపించిందట. కత్తి లాంటి కత్రినా ఏడవడం ఏంటీ.. ఏదో సినిమా కోసం అయి ఉంటుంది అనుకుంటున్నారా? కాదు నిజంగానే పబ్లిగ్గా ఏడ్చేసిందట. పాపం ఈ అమ్మడికి ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ ముంబై బాద్రాలోని ఒక చర్చిలో కళ్లనీళ్లు పెట్టుకుందిట. అక్కడ మేరీమాత ముందు తనను తాను నియంత్రించుకోలేక విలపించిందట. వెంటనే ఓ మీడియాకు సంబంధించిన వ్యక్తి ఫోటోలు తీశాడు.. అయితే వెంటనే తేరుకున్న కత్రినా తన ఫొటోలు బయట పెట్టొద్దని ప్రాధేయడిందట. కానీ ఆ వార్త అంతటితో ఆగలేదు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కన్నీళ్లు పెట్టుకున్న విషయం అలా అలా చక్కర్లు కొట్టి ఇపుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ అయింది. అసలు కత్రినా ఎందుకు ఏడ్చింది.. ఏమైంది అనే చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయ. బాయ్ ఫ్రెండ్ రణబీర్ విషయంలో ఏమైనా తేడాలొచ్చాయా? అందుకే ఏడ్చిందా ఇలా రకరకాల ప్రశ్నలు మొదలయ్యాయి. ఎందుకంటే మొదట సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం సాగించిన కత్రినా ఆ తరువాత అతనితో విడిపోయి రణబీర్ కపూర్ తో ప్రేమలో పడింది. దాదాపు మూడేళ్లుగా డీప్ లవ్ లో మునిగి తేలిన కత్రినా, రణబీర్‌లు.. ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి అంటూ మురిపించారు. కానీ ఈ ముచ్చట తీరింది లేదు. అందుకే కత్రినా అప్ సెట్ అయ్యిందా.. ఆ ఒత్తిడిని భరించలేకే బహిరంగంగా భోరుమందా అనుకుంటున్నారు. అటు కత్రినా పెళ్లికి రెడీగా ఉన్నా.. రణబీర్ మాత్రం ఈ విషయాన్ని ఏటూ తేల్చడంలేదని కొంతమంది చెబుతున్నారు. దీంతో ఈ ఫ్రస్ట్రేషన్ లోనే కత్రినా ఏడ్చేసి ఉంటుందని బాలీవుడ్ జనాల అంచనా. కాగా కత్తి లాంటి కత్రినా కైఫ్ ఓపక్క హీరోయిన్గా చేస్తూనే, ప్రత్యేక గీతాల్లో తన ప్రత్యేకతను చాటుకుంది. మొదట్లో డ్యాన్స్ లు చేయడానికి తడబడినా తరువాత ఐటెం సాంగ్స్ లో ఇరగదీస్తూ దూసుకుపోతోంది. -
నల్ల బెలూన్ ఎలా పగిలిందబ్బా..?!
సౌరశక్తి, ఉష్ణ సంగ్రహణం వంటి విషయాల గురించి మనం ఎన్నో విన్నాం. సూర్యుడి కిరణాలు ఎంతటి శక్తిమంతమైనవో, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో తెలుసుకున్నాం. అలాగే ఉష్ణ గ్రాహకాలు, విసర్జకాలు.. వాటి రంగుల మతలబు వగైరా సంగతులూ చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నాం. ఈ రెండిటి కలయికలోని ఓ చిట్టి ప్రయోగం మాత్రం చాలామందికి తెలిసుండదు. అతి తక్కువ ఖర్చుతో అబ్బురపరిచే ఈ 'సైన్స్ వండర్' మీకోసం..! కావాల్సివవి: రంగు లేని బెలూన్ (క్లియర్), నల్ల రంగు బెలూన్, భూతద్దం, సూర్యకాంత, పెద్దల పర్యవేక్షణ ఎలా చేయాలి..? తొలుత రెండు బెలూన్లను దగ్గరకు తీసుకుని ఒకదానిలోకి మరొకటి ఉండేలా చేయండి. రంగు లేని బెలూన్ బయట ఉండేలా, దాని లోపలి భాగంలో నల్ల రంగు బెలూన్ ఉండేలా జాగ్రత్త పడండి. ఈ రెండు బెలూన్ల మూతి భాగాలు తెరచి ఉంచి, తొలుత నల్ల బెలూన్‌లోకి కొద్ది పరిమాణంలో గాలి నింపండి. అనంతరం గాలి బయటకు పోకుండా దాని మూతిని దారంతో కట్టేయండి. ఇప్పడు బయట ఉన్న రంగులేని బెలూన్‌లోకి తగినంత పరిమాణంలో గాలి ఊదండి. దీని మూతిని కూడా దారంతో కట్టేయండి. ఇప్పుడు మీకు ఒకదానిలో ఒకటి దాగున్న బెలూన్లు దర్శనమిస్తాయి. బాహ్యంగా రంగులేని బెలూన్.., దాని లోపలి భాగంలో చిన్న సైజులోని నల్ల రంగు బెలూన్ కనిపిస్తాయి. సూర్యకాంతి ఉండే ప్రదేశంలోకి ఈ బెలూన్లను తీసుకెళ్లి, భూతద్దం సాయంతో సన్నని సూర్యకిరణాలు వాటిపై పడేలా చేయండి. ఏం జరుగుతుంది..? సూటిగా బెలూన్లను తాకిన వెచ్చని సూర్య కిరణాలు బయట ఉన్న రంగులేని బెలూన్ని కాకుండా.. లోపలి నల్ల రంగు బెలూన్ని పగిలేలా చేస్తాయి. దీంతో టప్‌మనే శబ్దంతో పాటు ముక్కలైన నల్ల బెలూన్ మనకు కనిపిస్తుంది. రంగు లేని బెలూన్ మాత్రం మునుపటిలాగే ఉంటుంది. ఎందుకిలా..? అసాధారణ రీతిలో అమర్చిన ఈ బెలూన్లలో తొలుత సూర్య కిరణాల వేడికి పగలాల్సింది బయట ఉన్న తెల్ల బెలూన్. అయితే, ఆశ్చర్యకరంగా లోపలి నల్ల బెలూన్ పగిలింది. దీనికి శాస్త్రీయ వివరణ ఉంది. మనం ముందు చెప్పుకున్నట్టుగా ఉష్ణ గ్రాహకం ఇక్కడ పనిచేసింది. రంగులేని బెలూన్ పారదర్శకంగా ఉంటుంది. ఇది తనలోకి చొచ్చుకుపోయే సూర్య కిరణాలను, కాంతిని అడ్డుకోదు. దీంతో కాంతి నేరుగా లోపలికి వెళ్లిపోయింది. అయితే, లోపలి నల్ల రంగు బెలూన్ ఈ కాంతిని అడ్డుకుంది. అంతేగాక, దాని నల్లని రంగు కారణంగా సూర్య కాంతిని శోషించుకుంది. దీంతో అందులోని ఉష్ణాన్ని సైతం బెలూన్ గ్రహించినట్టయింది. ఉష్ణం పెరుగుతున్న కొద్దీ బెలూన్లోని అణువుల మధ్య దూరం పెరగసాగింది. అణువుల బంధ విచ్ఛిత్తి కారణంగా నల్ల బెలూన్‌లో బంధించి ఉన్న గాలి ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. అంతే.. టప్మని శబ్దం చేస్తూ బెలూన్ పేలిపోయింది. అయితే, ఉష్ణాన్ని గ్రహించని కారణంగా బయట ఉన్న రంగులేని బెలూన్‌కు మాత్రం ఎటువంటి నష్టమూ వాటిల్లలేదు. -
ఎయిర్ ఇండియాకు తప్పిన ముప్పు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. శ్రీనగర్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వే పై విమానం టైరు ఒక్కసారిగా పేలడంతో భయాందోళన నెలకొంది. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. రన్ వే ను క్లియర్ చేయడానికి కనీసం గంట సమయం పడుతుందని, దీని మూలంగా మిగిలిన విమానాలకు ఆలస్యమయ్యే అవకాశం వుందని పేర్కొన్నాయి. అందుకే కొన్ని విమానాలను చండీగడ్ విమానాశ్రాయానికి మళ్లిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో సిబ్బంది సరఫరా చేసిన ఫుడ్ ప్లేట్లో బల్లి దర్శనమివ్వడంతో కలకలం రేగింది. ఈ వివాదం సద్దుమణగకముందే ఈ సంఘటనతో ప్రయాణీకులు భయభ్రాంతులకు లోనయ్యారు.