గ్యాస్ లీకై పూరిల్లు దగ్ధం
Published Fri, Sep 16 2016 10:47 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
అత్తిలి : ఓ చిన్నారి మొక్కజొన్నపొత్తును గ్యాస్‌స్టౌపై కాల్చుకుని గ్యాస్‌ను కట్టకుండా వదిలేయడంతో మంటలు వ్యాపించి పూరిల్లు దగ్ధమైంది. శుక్రవారం సాయంత్రం మండలంలోని ఆరవల్లిలో జరిగిన ఈ దుర్ఘటనలో మూడు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. గ్రామానికి చెందిన సంధి సత్యం అతని కుమారులు భీమన్న, ధర్మరాజు నివశిస్తున్న పూరింట్లో గ్యాస్‌స్టౌ కట్టకుండా వదిలేయడంతో మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. మంటల్లో ఇంట్లో ఉన్న మరో రెండు గ్యాస్ బండలు పేలాయి. ఫలితంగా పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ.లక్ష ఆస్తినష్టం వాటిల్లినట్లు ఇన్‌చార్జ్ అగ్నిమాపకాధికారి కౌరు సత్యానందం తెలిపారు. ఎంటీటీసీ సభ్యురాలు వెలగల వెంకటలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ వెలగల ప్రసాదరెడ్డి ,వెలగల సత్యనారాయణరెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
Advertisement