gas leake
-
‘ఆర్ఎఫ్సీఎల్’లో లీకవుతున్న గ్యాస్
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో వారంరోజులుగా అమ్మోనియా, యూరియా ఉత్పత్తిపై ట్రయల్ ర న్ నిర్వహిస్తున్నారు. అమ్మోనియా ప్లాంట్‌లో పై ప్లైన్ నిర్మాణంలో ఏర్పడిన సమస్య కారణంగా క ర్మాగారం నుంచి గ్యాస్ లీకవుతోంది. వారం క్రితం నైట్రోజన్ పైప్ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మార్చి నెలాఖరులో యూరియా ప్లాంట్‌ను షట్‌డౌన్ చేశారు. 45 రోజుల మరమ్మతు అ నంతరం తిరిగి యూరియా ప్లాంట్‌లో ఉత్పత్తిపై అ ర్ధరాత్రి సమయంలో ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారు. భయం గుప్పిట్లో ప్రభావిత గ్రామాలు.. కర్మాగారానికి ఆనుకుని వీర్లపల్లి, లక్ష్మీపురం, ఎల్కలపల్లి గేట్, విఠల్‌నగర్, శాంతినగర్, తిలక్‌నగర్, గౌతమినగర్, చైతన్యపురికాలనీ, సంజయ్‌గాంధీనగర్ ఉంటాయి. ట్రయల్ రన్ సమయంలో లీకవుతున్న గ్యాస్ సమీప గ్రామాలను చుట్టేస్తోంది. దీంతో ఊపిరాడడం లేదని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. హై పవర్ టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలి రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో ట్రయల్ రన్ సమయంలో ప్లాంట్ నుంచి రెండు రోజులుగా బయటకు వస్తున్న గ్యాస్‌తో ప్రభావిత ప్రాంతాలలో శ్వాస ఆడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిర్మాణ క్రమంలో నాణ్యత పాటించకపోవడంతోనే నిత్యం ఇలాంటివి జరుగుతున్నాయని ఆర్ఎఫ్సీఎల్ వర్కింగ్ యూనియన్ ప్రెసిడెంట్ అంబటి నరేష్ అన్నారు. కేంద్ర ఎరువులు రసాయనాల శాఖామంత్రి స్పందించి కర్మాగా రంలో జరుగుతున్న ప్రమాదాలపై హై పవర్ టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు చేపట్టాలి రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో రెండురోజులుగా వెలువడుతున్న నైట్రోజన్ గ్యాస్‌తో ప్రభావిత గ్రామాలతోపాటు గోదావరిఖని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మంగళవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇంజినీర్ కె.రవిదాస్‌కు వినతిపత్రం అందించారు. ప్లాంట్ నుంచి వెలువడుతున్న గ్యాస్‌తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలుష్య నియంత్రణ అధికారికి వినతులు జ్యోతినగర్: ఆర్ఎఫ్సీఎల్లో అమ్మోనియా గ్యాస్ లీకేజీపై సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫైట్‌ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్, ఉపాధ్యక్షుడు కొమ్మ చందు యాదవ్ ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి రవిదాస్‌కు మంగళవారం వినతిపత్రం అందించారు. సోమవారం ఉదయం గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు గంటపాటు వాసనతో ఉలిక్కిపడ్డారని, పెంచికల్‌పేట, లక్ష్మీపురం, వీర్లపల్లిలో ప్రభావం అధికంగా ఉందని, గౌతమినగర్, ఇందిరానగర్, తిలక్‌నగర్, విఠల్‌నగర్, అడ్డగుంటపల్లి, ఐదో ఇంక్లైన్, గోదావరిఖని, లక్ష్మీనగర్, కళ్యాణ్‌నగర్ వరకూ గ్యాస్ వ్యాపించిందని పేర్కొన్నారు. అమ్మోనియం లీక్ అవుతున్నా యాజమాన్యం స్పందించడం లేదన్నారు. దీనికి కాలుష్య నియంత్రణ అధికారి రవిదాస్ విచారణ చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
విశాఖలో విషాదం.. మరో గ్యాస్ లీక్..
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే విశాఖపట్నంలో మరో విషాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ కెమికల్స్ లో రియాక్టర్ నుంచి విష వాయువు లీకవడంతో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతులను షిఫ్ట్ ఇంచార్జ్ నరేంద్ర, గౌరీశంకర్‌గా గుర్తించారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అస్వస్థతకు గురైన ఎల్వీ చంద్రశేఖర్, పి.ఆనంద్ బాబు, డి.జానకీ రామ్, ఎం.సూర్యనారాయణలను గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్ విననయ్‌చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తుస్తున్నారు. ప్రమాద ఘటనపై కమిటీ.. హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో రియాక్టర్ వద్ద రావడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్.. నలుగురు అధికారులతో కమిటీని నియమించారు. పరవాడ ఫార్మా సిటీ ప్రమాద ఘటనపై కలెక్టర్‌తో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. -
ఎల్జీ పాలిమర్స్ ఘటన.. త్వరలోనే తుది నివేదిక
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సేకరించిన సమాచారం ఆధారంగా తుది నివేదికను త్వరలో సిద్ధం చేయనున్నామని హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ కమిటీ ఇప్పటికే సంబంధం ఉన్న అందరి నుండి సలహాలు, సూచనలు ప్రశ్నలు సేకరించడం జరిగిందన్నారు. దానిలో భాగంగా 243 రిప్రజెంటేషన్ 175 టెలిఫోన్, పబ్లిక్, వాట్సాప్ ను రిసీవ్ చేసుకున్నామని పేర్కొన్నారు. దాని ఆధారంగా కమిటీ ఒక ప్రశ్నావళి రూపొందించి ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఇతర రెగ్యులేటరీ అథారిటీ ద్వారా అందించడం జరిగిందని, ఇంకా ఎల్జీ పాలిమర్స్ నుంచి జవాబు అందాల్సి ఉందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను హైపవర్ కమిటీ తుది జాబితాలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. మే నెలలో విశాఖపట్నం సందర్శించిన హైపవర్ కమిటీ స్టేక్ హోల్డర్స్ అందరితో సుదీర్ఘ చర్చలు నిర్వహించిందన్నారు. జూన్ 15న ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు, నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఘటనలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చే వారంలో హైపవర్ కమిటీ మరిన్ని సమావేశాలు రెగ్యులేటరీ ఆథారిటీతో కలిపి నిర్వహించనుందని ఆయన తెలియజేశారు. -
‘ఆయన రాజకీయం కోసమే పనిచేస్తారు’
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు విశాఖ రావాలనుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి మూడు వారాలు అవుతోందని, ఇప్పుడు వచ్చి బాధితులను చంద్రబాబు పరామర్శిస్తారా అంటూ దుయ్యబట్టారు. ‘‘రాజకీయం చేయడానికే చంద్రబాబు రావాలనుకుంటున్నారు. ఆయన వస్తోంది పరామర్శకు కాదు.. రాజకీయం కోసం.. 24 గంటలు ఆయన రాజకీయం కోసమే పనిచేస్తారని’’ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. గ్యాస్ బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చారని.. ఏ రాష్ట్రం కూడా ఇలాంటి ప్యాకేజీ ఇవ్వలేదని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. (‘ఆలయాలను కూల్చిన నీచుడు చంద్రబాబు’) -
టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు..
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజ్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని.. కానీ అసమర్థ టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న గ్యాస్ లీకేజ్ బాధితులను గురువారం ఆయన పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్, తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రూరల్ అధ్యక్షులు సరగడం చిన్నప్పల నాయుడు, వైఎస్సార్సీపీ నేతలు ఆదిరెడ్డి మురళీ ఉన్నారు. (‘భవిష్యత్తులో కూడా ఆదుకుంటాం’) టీడీపీ తప్పుడు ప్రచారం.. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఆయన కుమారుడు అప్పల నాయుడు చేస్తోన్న దుష్ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ హయాంలో తండ్రీకొడుకులు నియోజకవర్గాన్ని దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారం దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గ్యాస్ లీకేజ్ ఘటనపై ఆరుగురు సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వకుండానే కంపెనీ తెరుస్తున్నారంటూ టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. (వలస కూలీలపై సీఎం జగన్ ఆవేదన) రూ.10 వేలు పరిహారం.. విష వాయువు ప్రభావిత 5 గ్రామాలు మాత్రమే కాకుండా సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను కూడా ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆయన వివరించారు. గ్యాస్ లీక్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాధితులంతా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు కూడా డిశ్చార్జ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తామని.. ఒక పర్మినెంట్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూ.10వేల పరిహారాన్ని కూడా ప్రజలకు అందిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. -
‘టీడీపీ జూమ్ పార్టీలా మారింది’
సాక్షి, విశాఖపట్నం : గ్యాస్ లీక్ బాధిత గ్రామాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అన్ని శాఖలు సత్వరం స్పందించడంతో నష్టం తగ్గిందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాలతో బాధితులందరికి పరిహారం కూడా అందించామని చెప్పారు. ఆస్పత్రుల్లో బాధితులందరికీ వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రెండు రోజులుగా బాధిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి ఉందన్నారు. ఎరవరికీ సమస్యలు రాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. మరో రెండు రోజుల్లో మిగిలిన వారికి కూడా పరిహారం అందిస్తామన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతుంటే.. ఒక్క టీడీపీ నేత కూడా సహాయం చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. టీడీపీ ఇప్పుడు జూమ్ పార్టీలా మారిందన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో జూమ్ ద్వారా మెసేజ్‌లు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ నియమించామని, నివేదిక వచ్చిన తర్వాత తగిన నిర్ణయాలు తీసుకుంటామని బొత్స వ్యాఖ్యానించారు. -
స్టైరీన్‌ను వెనక్కి పంపిస్తున్నాం: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: బాధితులకు భరోసా ఇచ్చేందుకే విషవాయువు ప్రభావిత గ్రామాల్లో బస చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..స్టైరీన్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. తిరిగి జన జీవనం కొనసాగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అన్ని గ్రామాల్లో పూర్తిగా పారిశుధ్య పనులతో పాటు.. ఇళ్లను శుభ్రం చేయించామని తెలిపారు. ఇళ్ల ముందున్న చెట్లను తొలగించామని పేర్కొన్నారు. 10 మంది వైద్యులతో కమిటీ ఏర్పాటు చేశామని.. గ్రామాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు వైద్యుల కమిటీ పరిశీలన చేస్తోందని తెలిపారు. (‘అప్పుడు గుర్తుకు రాలేదా బాబూ..’) బాధితులకు హెల్త్‌కార్డులు.. ఇలాంటి ఘటన మొదటిసారి జరిగింది కాబట్టి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయిస్తున్నామని చెప్పారు. ప్రతి బాధిత గ్రామంలో 24 గంటలు పనిచేసేలా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. వెంకటాపురంలో ‘వైఎస్సార్ క్లినిక్’ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇన్ పేషంట్ ఉండేలా ఈ క్లినిక్ నిర్మాణం జరుగుతుందని వివరించారు. బాధిత గ్రామాల ప్రజలకు ఒక ఏడాదిపాటు వైద్య సేవలు అందే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. (మన నీళ్లను తీసుకుంటే తప్పేంటి?: సీఎం జగన్) స్టైరీన్‌ను వెనక్కి పంపిస్తున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా రసాయన పరిశ్రమలను తనిఖీ చేస్తామన్నారు. విశాఖలో 20 రసాయన పరిశ్రమలను గుర్తించామని.. వచ్చే 4 రోజుల్లో పరిశ్రమల్లోని భద్రతా ప్రమాణాలు తనిఖీ చేస్తామని కన్నబాబు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు స్టైరీన్‌ను దక్షిణ కొరియాకు వెనక్కి పంపిస్తున్నామని పేర్కొన్నారు. రేపు ఉదయానికి ఒక షిప్ వెనక్కి వెళ్లనుందని తెలిపారు. తప్పుడు ప్రచారాలు దుర్మార్గం.. గ్యాస్ ఘటన బాధితులు మంగళవారం కొంతమంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని..రేపు(బుధవారం) మరి కొంతమంది డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతి చెందిన చిన్నారి గ్రీష్మ తల్లిపై కేసులు నమోదు చేశామని తప్పుడు ప్రచారాలు చేయడం దుర్మార్గమని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేయొద్దని కన్నబాబు హితవు పలికారు. -
‘లాలూచీ పడాల్సిన అవసరం మాకు లేదు’
సాక్షి, తాడేపల్లి : ఎల్జీపాలిమర్స్‌తో లాలూచీ పడాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆ సంస్థతో లాలుచీ పడి సింహాచల ఆలయ భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ ప్రమాదంపై నిపుణుల కమిటీ విచారణ చేస్తోందని, నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విశాఖ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డ వేగంగా స్పందంచారని, ప్రమాదం జరిగిన రోజే బాధితులను పరామర్శించారని గుర్తు చేశారు. గ్యాస్ బాధితులకు కనివినీ రీతిలో సాయం చేశారన్నారు. ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి సీఎం జగన్ అయితే.. ఎన్ని ప్రాణాలు పోయినా కరగని గుండె చంద్రబాబుది అని విమర్శించారు.(చదవండి : అలాంటి వార్తలు రాయొద్దు: మంత్రి బొత్స) యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభిస్తే.. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల ప్రమాదానికి కారణమైనవారిలో ఎంతమంది అరెస్ట్ చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై బురదజల్లడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. విశాఖకు వచ్చేందుకు చంద్రబాబు కేంద్రం పర్మిషన్ ఇచ్చిందో లేదో తెలియదని, ఆ విషయాన్ని చద్రబాబు ఎందుకు బయటపట్టడం లేదని ప్రశ్నించారు. (చదవండి : గ్యాస్ లీక్ : సీఎం జగన్ సహాయం ఓ నిదర్శనం) బాధితులను పరామర్శించే మనసు ఉంటేకారులో కూడా విశాఖకు రావొచ్చని, కానీ చంద్రబాబుకు ఆ ఉద్దేశమే లేదన్నారు. సీబీఐని రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు జీవితమంతా రాజకీయ కుట్రలేనని అంబటి విమర్శించారు. -
అలాంటి వార్తలు రాయొద్దు: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా వార్తలు రాయొద్దని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. లోకో పైలట్లు విష వాయువు బారిన పడ్డారన్నది అవాస్తవం అని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసత్య కథనాలను ప్రచారం చేయడం మంచిది కాదని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. (స్టైరిన్ తరలింపు ప్రక్రియ ప్రారంభం) ఆహారం అందిస్తాం: అవంతి శ్రీనివాస్ ఉదయం నుంచి గ్రామాల్లో అంత క్లీనింగ్ చేయిస్తున్నామని.. జీవీఎంసీ అధికారులు ఇచ్చిన సూచనలు మేరకు ఇళ్లలోకి వెళ్లాలని ప్రజలకు మంత్రి అవంతి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఇళ్లలో ఏసీలు ఆన్ చేయొద్దన్నారు. గ్రామాల్లోకి వచ్చేవారికి ఆహారంతో పాటు వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇళ్లలో ఎవరూ ఆహారం వండుకోవద్దని తెలిపారు. వార్డు వలంటీర్లు, అధికారులు గ్రామాలను పర్యవేక్షణ చేసి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. (గ్యాస్ లీక్ : సీఎం జగన్ సహాయం ఓ నిదర్శనం) -
ప్లాంట్లను ప్రారంభించే ముందు జాగ్రత్త
న్యూఢిల్లీ: విశాఖపట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న విషవాయు లీకేజీ తరహా ప్రమాదాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ–ఎన్డీఎంఏ) పలు మార్గదర్శకాలను జారీ చేసింది. లాక్డౌన్ అనంతరం పరిశ్రమలను ప్రారంభించే సమయంలో ఉద్యోగులు, కార్మికుల రక్షణకు, ప్లాంట్ భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఈ మార్గదర్శకాలను రూపొందించింది. లాక్డౌన్ కారణంగా కొన్ని వారాలుగా పరిశ్రమలు మూతపడిన కారణంగా, వాల్వ్‌లు, పైప్‌ల్లో మిగిలిపోయి ఉన్న రసాయనాలతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముందని ఎన్డీఎంఏ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది. మూసివేత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కొన్ని ప్లాంట్లు తీసుకుని ఉండకపోవచ్చని పేర్కొంది. ప్రమాదకర రసాయనాలు, మండే స్వభావమున్న రసాయనాల స్టోరేజ్ ట్యాంక్‌ల నిర్వహణ విషయంలోనూ జాగ్రత్త అవసరమని సూచించింది. పైప్‌లు, వాల్వ్‌లు, వైర్లలో ఎలాంటి లీకేజీల్లేకుండా చూసుకోవాలంది. పరిశ్రమను ప్రారంభించిన తరువాత అన్ని జాగ్రత్తలు తీసుకుని తొలివారం ట్రయల్ రన్ మాత్రమే చేయాలని పేర్కొంది. ట్రయల్ రన్ సమయంలో అసాధారణ శబ్దాలు రావడం కానీ, పొగ వెలువడడం కానీ జరుగుతుందేమో పరిశీలించాలంది. వెంటనే ఉత్పత్తిని పెంచాలని ప్రయత్నించవద్దని, ప్లాంట్ అంతా శానిటైజ్ చేయాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉద్యోగులు, కార్మికుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలంది. అందరికీ శానిటైజర్లు, మాస్క్‌లు సరఫరా చేయాలంది. సమస్య తీవ్రంగా ఉంటే ప్లాంట్‌ను మూసివేసి, మెయింటెనెన్స్ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండే పరిశ్రమల్లో భద్రత చర్యలపై ఆయా రాష్ట్రాల్లోని విపత్తు నిర్వహణ సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. మేనేజీరియల్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది షిఫ్ట్‌కు 33% ఉండేలా చూసుకోవాలని, ఈ విషయంలో హోం శాఖ మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. -
ఇదేనా చంద్రబాబు చిత్తశుద్ధి: ఉమ్మారెడ్డి
సాక్షి, గుంటూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన బాధాకరమని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించని విధంగా వైఎస్ జగన్ కోటి రూపాయల పరిహారం ప్రకటించారని తెలిపారు. (‘అది టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ’) ప్రతిపక్షాలన్నీ సీఎం వైఎస్ జగన్‌ను అభినందించాయని.. కానీ చంద్రబాబు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. ప్రజలను వదిలేసి నేరుగా ఫ్యాక్టరీకే వెళ్తానన్నప్పుడే చంద్రబాబు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. విచారణ అనంతరం కంపెనీపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం కంపెనీకి అనుకూలంగా మాట్లాడాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తప్పుబట్టారు. (‘అవే ఆయనకు దినచర్యగా మారాయి’) -
‘అవే ఆయనకు దినచర్యగా మారాయి’
సాక్షి, తాడేపల్లిగూడెం: విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన బాధాకరమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై ఆయన మండిపడ్డారు. నీచ రాజకీయాలు, పిచ్చి మాటలు చంద్రబాబుకు దినచర్యగా మారాయని నిప్పులు చెరిగారు. విశాఖలో ఘటన జరిగిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి యుద్ధప్రాతిపదికన బాధితులను ఆసుపత్రికి తరలించి వైద్యసాయం అందజేశారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించి వారికి ఆత్మస్థైరాన్ని నింపారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించిన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్నవారికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి లక్ష, బాధిత గ్రామాల్లోని 15వేల మందికి ఒకొక్కరికి రూ.10వేలు చెల్లించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. (‘అది టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ’) దేశంలోనే కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని ఆయన తెలిపారు. కోటి రూపాయలు ఎలా సరిపోతాయని వ్యాఖ్యానించడం చంద్రబాబు మతిలేనితనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులతో ఎల్జీ పాలిమర్స్ ఉదంతం పై పూర్తి నివేదిక ఇవ్వాలని కమిటీ వేస్తే స్టైరీన్ గ్యాస్ గురించి తనకే తెలియదని ఐఏఎస్ అధికారులకు ఏం తెలుసునని చంద్రబాబు అనడం చాలా హాస్యాస్పదమన్నారు. ఇదే పాలిమర్ సంస్థ విస్తరణకు 2018లో అనుమతి ఇచ్చిన సంగతి మరచిపోయావా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. త్రిసభ్య కమిటీ అంటూ అచ్చెన్నాయుడు, చిన రాజప్ప, రామానాయుడులను నివేదిక ఇవ్వమనడం చంద్రబాబు అనుభవం ఏమిటో అర్థమవుతుందని కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. (‘ప్రచార్భాటంతో ఆయనలా చేసి ఉంటే..’) -
‘అది టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ’
సాక్షి, అమరావతి: విశాఖ గ్యాస్ లీక్ ఘటన దురదృష్టకరమని మంత్రి కొడాలి నాని అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. హెల్త్ కార్డులు జారీ చేసి వారికి వైద్యసేవలు అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మృతుల కుటుంబాలకు సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్నవారికి వైద్యసేవలు అందించడంతో పాటు 10 లక్షల ఆర్థికసాయం, చికిత్స పొందుతున్నవారికి రూ.లక్ష ప్రకటించారని వెల్లడించారు. (‘ప్రచార్భాటంతో ఆయనలా చేసి ఉంటే..’) ఆ కంపెనీని అప్పుడెందుకు మూయించలేదు.. గ్యాస్ లీక్ ఘటనను నిపుణుల కమిటీ పరిశీలిస్తోందన్నారు. ప్రజల భద్రతే మాకు ముఖ్యమని.. ఫ్యాక్టరీ వల్ల ప్రమాదముందని నివేదిక వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఐఏఎస్‌లతో వేసిన కమిటీని చంద్రబాబు తప్పుబడుతున్నారని.. టీడీపీకి చెందిన దద్దమ్మలతో డ్రామా కమిటీ వేశారని దుయ్యబట్టారు.1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అదే కంపెనీలో అగ్నిప్రమాదం జరిగిందని.. అప్పుడెందుకు కంపెనీని చంద్రబాబు మూయించలేదని ప్రశ్నించారు. హిందూస్థాన్ పాలిమర్‌ను.. ఎల్జీ పాలిమర్‌గా మార్చింది చంద్రబాబేనని పేర్కొన్నారు. 2017లో కూడా కంపెనీ విస్తరణకు చంద్రబాబు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు సినిమా షూటింగ్ వల్ల 30 మంది చనిపోయారని.. వాళ్లు బతికొస్తారనే చంద్రబాబు రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారా అని కొడాలి నాని ప్రశ్నించారు. (‘ప్రజల భద్రతే ముఖ్యం కంపెనీ కాదు’) అందితే జట్టు..అందకపోతే కాళ్లు.. కరోనాకు భయపడి అద్ధాల మేడలో ప్రతిపక్షనేత చంద్రబాబు అద్దాల మేడలో దాగున్నారని..ఆయన ఇంటి నుంచి బయటకు రావడంలేదని ఎద్దేవా చేశారు. ఎవరో రాసిన లేఖలపై చంద్రబాబు సంతకాలు పెడుతున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుందన్నారు. పరిహారంపై గతంలో ఒక విధంగా..నేడు మరొకలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ సంగతి తెలుస్తానని చంద్రబాబు గతంలో ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. చంద్రబాబు అందితే జట్టు..అందకపోతే కాళ్లు పట్టుకుంటారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని నక్కజిత్తులు వేషాలు వేసిన మోదీ నమ్మరన్నారు.ఎల్జీ కంపెనీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం తమకు లేదని కొడాలి నాని పేర్కొన్నారు. -
విషాదంలోనూ దిగజారుడు రాజకీయాలా..?
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజీపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇప్పటివరకు పరిస్థితి 75 శాతం అదుపులోకి వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే 48 గంటలలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఐదు గ్రామాల ప్రజలను ఇళ్లకు పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు తప్ప ప్రతిపక్షాలన్నీ సీఎం వైఎస్ జగన్ కోటి రూపాయలు నష్ట పరిహారం ప్రకటించడం పట్ల హర్షించారని పేర్కొన్నారు. (చంద్రబాబు బుర్ర పని చేస్తుందా?: బొత్స) ఇంత పెద్ద విషాద సంఘటనను కూడా చంద్రబాబు తన రాజకీయానికి వాడుకోవడం దిగజారుడు చర్య అని దుయ్యబట్టారు. ఇంత వరకు ఆంధ్రాకు ఎందుకు రాలేదని చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన ఆంధ్రాకు ప్రతిపక్ష నాయకుడా.. తెలంగాణాకా అంటూ అవంతి ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పూర్తి అండగా ఉంటామని.. ప్రజల బాధ్యత తమదేనని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు (48 గంటల వరకు గ్రామాలకు వెళ్లొద్దు: నీలం సాహ్ని) -
గ్యాస్ లీక్ ఘటన: ఎక్స్‌గ్రేషియా విడుదల
సాక్షి, అమరావతి: విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా విడుదల చేసింది. రూ.30 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.కోటి రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రథమచికిత్స చేసుకున్న వారికి రూ.25 వేలు. ఆస్పత్రిలో రెండు, మూడు రోజులు ఉన్నవారికి రూ.లక్ష. వెంటి లెటర్‌పై ఉన్నవారికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రూ.30 కోట్లు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం: సీఎం జగన్) గ్యాస్ లీక్ ఘటనలో మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది. అలాగే విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైనవారికి విశాఖలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు గ్యాస్ లీకేజి అరికట్టేందకు 9 మంది నిపుణుల బృందంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు నిపుణల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది -
‘మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్’
సాక్షి, చిత్తూరు: విశాఖ గ్యాస్ లీకేజ్ విషాదం అందరినీ కలచివేసిందని ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పరిహారాన్ని చూసి అన్ని పార్టీలు అభినందిస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం తక్షణమే విశాఖకు చేరుకుని బాధితులను పరామర్శించి ధైర్యం నింపారని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులున్నారని.. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం మనసున్న ముఖ్యమంత్రి ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ప్రజల కష్టాలను చూసి చలించిపోయారని.. ఎన్నడూలేని విధంగా రూ.కోటి నష్టపరిహారాన్ని ప్రకటించారని చెప్పారు. (‘ఆ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది’) వారు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.. టీడీపీ నేతలు దీనిపై కూడా చీప్‌గా మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు. సీఎం జగన్ ఈ ఘటనపై హైపవర్ కమిటీతో విచారణకు ఆదేశించారని తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. యాజమాన్యంపై కూడా పోలీసు కేసు నమోదయ్యిందన్నారు. టీడీపీ నేతలు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని ఆమె నిప్పులు చెరిగారు. (గ్యాస్ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) -
ఆకాశహర్మ్యంలో పేలుడు
మాస్కో: రష్యాలోని మాగ్నిటోగొరస్క్ నగరంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. పురాతన బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన పేలుడుతో నలుగురు చనిపోయారు. చాలామంది జాడ తెలీడంలేదు. పేలుడు ధాటికి భవనంలోని ఒక భాగం కుప్పకూలింది. దాదాపు 70 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 22 డిగ్రీలకు పడిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదం గ్యాస్ లీకేజీ కారణంగానే చోటుచేసుకుందని జాతీయ భద్రతా సంస్థ ఎఫ్ఎస్బీ నిర్ధారించింది. రష్యాలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. -
గ్యాస్ లీకై పూరిల్లు దగ్ధం
అత్తిలి : ఓ చిన్నారి మొక్కజొన్నపొత్తును గ్యాస్‌స్టౌపై కాల్చుకుని గ్యాస్‌ను కట్టకుండా వదిలేయడంతో మంటలు వ్యాపించి పూరిల్లు దగ్ధమైంది. శుక్రవారం సాయంత్రం మండలంలోని ఆరవల్లిలో జరిగిన ఈ దుర్ఘటనలో మూడు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. గ్రామానికి చెందిన సంధి సత్యం అతని కుమారులు భీమన్న, ధర్మరాజు నివశిస్తున్న పూరింట్లో గ్యాస్‌స్టౌ కట్టకుండా వదిలేయడంతో మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. మంటల్లో ఇంట్లో ఉన్న మరో రెండు గ్యాస్ బండలు పేలాయి. ఫలితంగా పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ.లక్ష ఆస్తినష్టం వాటిల్లినట్లు ఇన్చార్జ్ అగ్నిమాపకాధికారి కౌరు సత్యానందం తెలిపారు. ఎంటీటీసీ సభ్యురాలు వెలగల వెంకటలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ వెలగల ప్రసాదరెడ్డి ,వెలగల సత్యనారాయణరెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
గ్యాస్‌లీకై మంటలు.. నవవధువు సజీవ దహనం
క్రోసూరు: గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. క్రోసూరు మండల కేంద్రంలో గ్యాస్ లీకై చెలరేగిన మంటలకు ఓ నవ వధువు సజీవ దహనమైంది. స్థానిక ఎస్టీ కాలనీలో వనపర్తి లావణ్య (19) ఆదివారం ఉదయం పాలు తీసుకొచ్చి టీ పెట్టుకునేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించింది. గ్యాస్ లీకై మంటలు ప్రారంభం కాగా, ఆమె వెనక్కి పరుగు తీసింది. పూరి గుడిసె కావడంతో మంటలు మొత్తాన్ని చుట్టుముట్టాయి. బయటకు రాలేక లోపలే సజీవ దహనమైంది. ఆ సమయంలో ఆమె భర్త మస్తాన్ బయటకు వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనలో మొత్తం నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో గ్యాస్ లీక్, ఇద్దరు మృతి
విశాఖ : విశాఖ ఉక్కు కర్మాగారంలో మరోసారి ప్రమాదం జరిగింది. స్టీల్ఫ్లాంట్లోని ఎస్ఎంఎస్-2 విభాగంలో సోమవారం కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ అవటంతో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు. మృతులు సీమాడ్ కంపెనీకి చెందిన ఇంజినీర్లు అనీష్, రజనీష్‌గా గుర్తించారు. మృతుల్లో ఒకరు తమిళనాడుకు చెందినవారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. మరోవైపు స్టీల్‌ప్లాంట్ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు భద్రతా చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది.