పేలుడు ధాటికి పాక్షికంగా కూలిన భవనం
మాస్కో: రష్యాలోని మాగ్నిటోగొరస్క్ నగరంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. పురాతన బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన పేలుడుతో నలుగురు చనిపోయారు. చాలామంది జాడ తెలీడంలేదు. పేలుడు ధాటికి భవనంలోని ఒక భాగం కుప్పకూలింది. దాదాపు 70 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 22 డిగ్రీలకు పడిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదం గ్యాస్ లీకేజీ కారణంగానే చోటుచేసుకుందని జాతీయ భద్రతా సంస్థ ఎఫ్‌ఎస్‌బీ నిర్ధారించింది. రష్యాలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment