కీవ్: రష్యాకు చెందిన కీలక ఆయుధాగారాలపై ఉక్రెయిన్ డ్రోన్‌లతో విరుచుకుపడింది. మిసై్పళ్లు, ఇతర ఆయుధాలను ధ్వంసం చేసింది. సరిహద్దు నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని ఆయుధ గిడ్డంగులపై ఉక్రెయిన్ మంగళవారం రాత్రి వందకు పైగా డ్రోన్లను ప్రయోగించి వాటిని నేలమట్టం చేసింది. భారీ పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. టోరోపెట్స్‌లో ఉన్న రష్యా ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. మాస్కోకు 380 కిలోమీటర్ల దూరంలో టోరోపెట్స్ ఉంది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సరీ్వసెస్, ఉక్రెయిన్ ఇంటలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ కలిపి సంయుక్తంగా ఈ భీకర దాడిని చేపట్టాయి.
స్వదేశీ తయారీ కొమికేజ్ డ్రోన్లను ఉక్రెయిన్ ఈ దాడికి వాడింది. ఇస్కాండర్, టోచ్కా–యు మిసై్పళ్లు, గ్లైడ్ బాంబులు, ఇతర మందుగుండు సామాగ్రి ఈ గిడ్డంగుల్లో ఉందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉత్తరకొరియా సరఫరా చేసిన కేఎన్–23 స్వల్పశ్రేణి బాలిస్టిక్ మిసై్పళ్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. భూకంపం వచి్చనంతటి తీవ్రతతో పేలుళ్లు జరిగాయని, పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. టోరోపెట్స్‌లో 11 వేల జనాభా ఉంది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో మిసై్పళ్లు పేలిపోయి 6 కిలోమీటర్ల ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి.
Comments
Please login to add a commentAdd a comment