Explosions
-
ఇజ్రాయెల్‌లో వరుస పేలుళ్లు
టెల్అవీవ్:మధ్య ఇజ్రాయెల్‌లో వరుస భారీ పేలుళ్లు సంభవించాయి. బాట్‌యామ్ నగరంలోని ఓ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న మూడు బస్సుల్లో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లు ఉగ్రవాదుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. మరో రెండు బస్సుల్లో దొరికిన బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు.వరుస పేలుళ్లతో దేశవ్యాప్తంగా బస్సులు,రైళ్లలో తనిఖీలు చేపట్టారు. బాంబులు ఎవరు పెట్టారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌లో దొరికన పేలుడు పదార్థాలను పోలినట్లు తాజాగా దొరికన బాంబులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పేలుళ్లకు హమాస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఖస్సమ్ బ్రిగేడ్స్ కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లోని తమ భూభాగాన్ని ఆక్రమించుకున్నవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని బబ్రిగేడ్స్ తాజాగా సోషల్‌మీడియాలో ఒక పోస్టు పెట్టింది. గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ వెస్ట్‌బ్యాంక్‌పై దాడులు మొదలు పెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్న కారణంతో హమాస్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉంది. -
హెజ్బొల్లాకు రెస్ట్ తీసుకునే సమయం కూడా ఇవ్వం: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ వరుస వైమానిక,భూతల దాడులతో ప్రకృతి సోయగాలతో పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే లెబనాన్ దేశ రాజధాని బీరూట్ చిగురుటాకులా వణికిపోతుంది.తాజాగా ఇజ్రాయెల్ శనివారం సాయంత్రం నుంచి బీరూట్‌లోని హెబ్బొల్లా కమాండ్ సెంటర్లు, అణ్వాయుదాలు నిల్వ ఉంచే స్థావరాలు, టెన్నెల్స్,మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. పేలుళ్ల దాటికి దక్షిణ బీరుట్, దాని పరిసర ప్రాంతాలు రెండుగంటలకు పైగా బాంబుల మోతలతో దద్దరిల్లిపోయాయి. దీంతో బీరూట్‌లో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనలో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడి ఒకటిగా నిలిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వైమానిక దాడులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి మాట్లాడుతూ.. మేము హెజ్బొల్లాపై మరింత ఒత్తిడి తేవాలి. ఉపశమనం లేకుండా హెజ్బొల్లాకు కంటి మీద కునుకు లేకుండా చేయాలి. విశ్రాంతి ఇవ్వకుండా శాస్వత నష్టం కలిగించేలా చేయాలని అన్నారు. -
రష్యా ఆయుధాగారాలపై ఉక్రెయిన్ భీకర దాడి
కీవ్: రష్యాకు చెందిన కీలక ఆయుధాగారాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. మిసై్పళ్లు, ఇతర ఆయుధాలను ధ్వంసం చేసింది. సరిహద్దు నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని ఆయుధ గిడ్డంగులపై ఉక్రెయిన్ మంగళవారం రాత్రి వందకు పైగా డ్రోన్లను ప్రయోగించి వాటిని నేలమట్టం చేసింది. భారీ పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. టోరోపెట్స్‌లో ఉన్న రష్యా ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. మాస్కోకు 380 కిలోమీటర్ల దూరంలో టోరోపెట్స్ ఉంది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సరీ్వసెస్, ఉక్రెయిన్ ఇంటలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ కలిపి సంయుక్తంగా ఈ భీకర దాడిని చేపట్టాయి. స్వదేశీ తయారీ కొమికేజ్ డ్రోన్లను ఉక్రెయిన్ ఈ దాడికి వాడింది. ఇస్కాండర్, టోచ్కా–యు మిసై్పళ్లు, గ్లైడ్ బాంబులు, ఇతర మందుగుండు సామాగ్రి ఈ గిడ్డంగుల్లో ఉందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉత్తరకొరియా సరఫరా చేసిన కేఎన్–23 స్వల్పశ్రేణి బాలిస్టిక్ మిసై్పళ్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. భూకంపం వచి్చనంతటి తీవ్రతతో పేలుళ్లు జరిగాయని, పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. టోరోపెట్స్‌లో 11 వేల జనాభా ఉంది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో మిసై్పళ్లు పేలిపోయి 6 కిలోమీటర్ల ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. -
Israel Hezbollah War: పేజర్లో 3 గ్రాముల పేలుడు పదార్థం!
లెబనాన్, సిరియాల్లో పేజర్ల అనూహ్య పేలుళ్లతో గతంలో ఎన్నడూలేనంతగా తొలిసారిగా పేజర్లపై చర్చ మొదలైంది. మంగళవారం నాటి ఘటనలో లెబనాన్, సిరియాల్లో మరణించిన వారి సంఖ్య బుధవారానికి 12కు పెరిగింది. ఇందులో ఇద్దరు చిన్నారులుసైతం ఉన్నారు. దాదాపు 3,000 మంది గాయపడ్డారు. అసలు ఏమిటీ పేజర్లు? అవి ఎలా పనిచేస్తాయి? వాటిల్లోకి పేలుడు పదార్థం ఎలా వచ్చి చేరింది? తదతర అంశాలను ఓసారి చూద్దాం.ఫోన్లో నిఘా భయం.. అందుకే పేజర్గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు బాసటగా నిలుస్తూ లెబనాన్‌లోని హెజ్బొల్లా.. ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. తమ వ్యూహాలు ఇజ్రాయెల్‌కు చిక్కకుండా ఉండేందుకు హెజ్బొల్లా ఒక కొత్త ఎత్తుగడ వేసింది. ఫోన్ల ద్వారా సున్నిత, రహస్య సమాచార మార్పిడి జరిగితే ఇజ్రాయెల్ పసిగట్టే ప్రమాదం ఉందని గ్రహించి ఫోన్లకు స్వస్తి పలికింది. వెంటనే ఫోన్లను పగలగొట్టి పాతిపెట్టాలని హెజ్బొల్లా ప్రధాన కార్యదర్శి హసస్ నస్రల్లామ్ తమ సభ్యులకు ఫిబ్రవరి 13న పిలుపునిచ్చారు. ఫోన్లకు బదులు పేజర్ వాడాలని సూచించారు. పేజర్లో సమాచారం అత్యంత సురక్షితంగా, భద్రంగా ఉంటుందని వారి నమ్మకం. దీంతో యుద్ధక్షేత్రంలో ఉండే సైనికులు మొదలు సహాయక సేవల్లో ఉండే వైద్యుల వరకు వివిధ విభాగాల సభ్యులు పేజర్ వాడటం మొదలెట్టారు. వీరి కోసం ఈ ఏడాది ప్రారంభంలో కొత్త పేజర్లను విదేశాల నుంచి తెప్పించారు. పోలీసు, అగ్నిమాపక శాఖలు సహా పలు అత్యవసర సేవల్లో పనిచేసే సిబ్బంది తక్షణ హెచ్చరికల కోసం పేజర్లపై ఆధారపడుతున్నారు.బ్రాండ్ మాదే.. ఉత్పత్తి మాది కాదు లెబనాన్‌లో పేలుళ్లకు ఉపయోగించిన పేజర్ ఏఆర్–924 రకానికి చెందినది. ఈ ఏడాది ప్రారంభంలో 5,000 పేజర్లను హెజ్బొల్లా ఆర్డర్ చేసింది. తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో సంస్థ నుంచి ఏఆర్–924 పేజర్లను తెప్పించినట్లు లెబనాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఉత్పత్తి స్థాయిలోనే ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ రంగంలోకి దిగి ప్రతి పేజర్లో 3 గ్రాముల బరువైన పేలుడు పదార్థాన్ని మదర్‌బోర్డులో అమర్చిందని హెజ్బొల్లా, లెబనాన్ భద్రతా వర్గాలు ఆరోపిస్తున్నాయి. పేల్చేందుకు శత్రువు పంపిన కోడ్‌ను మదర్ బోర్డ్ అందుకున్నాక పేజర్లోని పేలుడు పదార్థం క్రియాశీలమై పేలిందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పేజర్లను నెలల తరబడి వాడుతున్నా వాటిలోని పేలుడు పదార్థాన్ని హెజ్బొల్లా వర్గాలు గుర్తించకపోవడం తీవ్ర భద్రతావైఫల్యంగా చెబుతున్నారు. ఆ పేజర్లను మొదట్లో స్కాన్ చేసినపుడు ఎలాంటి పేలుడు పదార్థం జాడ కనిపించలేదని వారు చెబుతున్నారు. అయితే ఈ పేజర్లను హంగేరీకి చెందిన ‘బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ’ అనే సంస్థ రూపొందించిందని ఆ బ్రాండ్ యజమాని గోల్డ్ అపోలో వ్యవస్థాపకుడు హుసు చింగ్–కువాంగ్ తెలిపారు. ‘ఏఆర్–924 అనే బ్రాండ్ మాత్రమే మాది. ఆ బ్రాండ్ పేరుతో ఉన్న ఉత్పత్తి మాది కాదు. ఆ బ్రాండ్ పేరును వాడుకునేందుకు బీఏసీకి అనుమతి ఇచ్చాం. ఈ మేరకు మూడేళ్లక్రితం ఒప్పందం కుదిరింది’’ అని చింగ్కువాంగ్ బుధవారం చెప్పారు. అయితే బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ అనేది ఒక డొల్లకంపెనీ అని వార్తలొచ్చాయి. హంగేరీలోని బుడాపెస్ట్ నగరంలో సంస్థ ప్రధాన కార్యాలయం ఒక జనావాస అపార్ట్మెంట్లో ఉంది. అక్కడ ఒక కిటికీకి బీఏసీ కన్సల్టింగ్ అనే స్టిక్కర్ తప్పితే అక్కడ ఏమీ లేదని అసోసియేటెడ్ ప్రెస్ పాత్రికేయులు తేల్చారు.గతంలోనూ సాంకేతికతను వాడిన ఇజ్రాయెల్పేజర్కాకుండా గతంలో ఇలాగే వస్తువుల్లో పేలుడు పదార్థాలను అమర్చి శత్రువులను అంతంచేసిన చరిత్ర మొస్సాద్‌కు ఉంది. టెక్నాలజీ సాయంతో పేలుళ్లు జరిపిన సుదీర్ఘ చరిత్ర ఇజ్రాయెల్‌కు ఉంది. 1996లో హమాస్ కీలక బాంబ్మేకర్ యాహ్యా అయాస్ను హతమార్చేందుకు ఇజ్రాయెల్ పేలుడు పదార్థాన్ని మొబైల్ ఫోన్లో అమర్చింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ షిన్‌బెట్ గతంలో యాహ్యా ఫోన్లో 15 గ్రాముల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాన్ని నింపింది. తండ్రికి అయాష్ ఫోన్ కాల్ చేసినప్పుడు ఫోన్ మాట్లాడేది అయాష్ అని నిర్ధారించుకున్నాక దానిని పేల్చి అయాస్ను అంతంచేశారు. రిమోట్ ద్వారా నియంత్రించే కృత్రిమమేధతో పనిచేసే మిషిన్గన్తో ఇరాన్ అణు శాస్త్రవేత్త, ఉప రక్షణ మంత్రి మోసెన్ ఫక్రిజాదేను 2020లో హతమార్చింది. ఇజ్రాయెల్ 2021లో ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖకు చెందిన సర్వర్లను హ్యాక్ చేసి దేశవ్యాప్తంగా చమురు సరఫరాను స్తంభింపజేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌లోని రెండు ప్రధాన గ్యాస్ పైప్లైన్లను పేల్చి పలు నగరాల సేవలకు అంతరాయం కలిగించింది. జూలైలో టెహ్రాన్‌లోని ఒక అతిథిగృహంలోని గదిలో నెలల క్రితమే శక్తివంతమైన బాంబును అమర్చి హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియాను హతమార్చింది.– నేషనల్ డెస్క్, సాక్షి -
Israel Hezbollah War: నిన్న పేజర్లు నేడు వాకీ టాకీలు
బీరుట్: వాకీటాకీలు, సౌర విద్యుత్ వ్యవస్థల పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లింది. గాజా స్ట్రిప్‌పై భీకర భూతల, గగనతల దాడులతో తెగబడిన ఇజ్రాయెల్ తాజా తన లక్ష్యాన్ని లెబనాన్ వైపు తిప్పిందని బుధవారం నాటి అనూహ్య పేలుళ్ల స్పష్టమైంది. హెజ్బొల్లా సాయుధులు విరివిగా వాడే పేజర్లు పేలి 24 గంటలు గడవకముందే లెబనాన్‌లో బుధవారం వాకీటాకీలు, సౌరవిద్యుత్ వ్యవస్థలు పేలిపోయాయి. ఈ అనూహ్య పేలుళ్ల ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 450 మంది గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పేజర్ల పేలుళ్లతో 13 మంది చనిపోయి 2,800 మంది రక్తమోడిన తరుణంలో మరో ‘సాంకేతిక’ పేలుళ్ల పర్వానికి దిగి ఇజ్రాయెల్ కొత్త యుద్ధతంత్రానికి తెరలేపిందని అంతర్జాతీయంగా విశ్లేషణలు వెల్లువెత్తాయి. గాజా స్ట్రిప్‌లో దాదాపు మొత్తం భూభాగాన్ని జల్లెడపట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు తన లక్ష్యాన్ని లెబనాన్‌కు మార్చుకుందని తాజా ఉదంతం చాటుతోంది. అంతిమయాత్ర వేళ పేలుళ్లు పేజర్ల పేలుళ్లలో మరణించిన ముగ్గురు హెజ్బొల్లా సభ్యులు, ఒక చిన్నారి అంతిమయాత్రలు బీరుట్ శివారులోని దహియేలో కొనసాగుతున్నపుడే వాకీటాకీలు పేలడం గమనార్హం. ‘‘బీరుట్లో చాలా చోట్ల వాకీటాకీలు పేలాయి. ఎల్రక్టానిక్ పరికరాలు పేలిన ఘటనల్లో 9 మంది చనిపోయారు’’ అని లెబనాన్ ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. బీరుట్ నగరంతోపాటు లెబనాన్‌లో చాలా చోట్ల పేలుళ్లు జరిగాయని హెచ్»ొల్లా ప్రతినిధులు చెప్పారు. వాయవ్య తీర పట్టణమైన సిడాన్లో ఒక కారు, ఒక మొబైల్ ఫోన్ దుకాణం వాకీటాకీల పేలుడుకు ధ్వంసమైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రక్తమోడుతూ వందలాది మంది ఆస్పత్రులకు పోటెత్తుతున్న దృశ్యాలు స్థానిక మీడియాలో కనిపించాయి. ‘‘ఇలాంటిది నేనెప్పడూ చూడలేదు. గాయపడిన వారిలో చాలా మందికి చేతివేళ్లు తెగిపోయాయి. కళ్లు దెబ్బతిన్నాయి’’ అని బీరుట్‌లోని దీయూ ఆస్పత్రిలో వైద్యురాలు నౌర్ ఎల్ ఓస్తా చెప్పారు. ‘‘ వరుస అనూహ్య పేలుళ్లతో ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు పూర్తిస్థాయి యుద్ధానికి ఆజ్యంపోస్తున్నాయి’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు.దాడికి ఇదే సరైన సమయమా? వేలాది మంది హెజ్బొల్లా సైనికులు గాయాలపాలై ఆస్పత్రులకు పరిమితమయ్యారు. పేజర్ల పేలుడుతో హెజ్బొల్లాలో కమ్యూనికేషన్ నెట్వర్క్ కోలుకోనంతగా దెబ్బతింది. వాకీటాకీలు, సోలార్ వ్యవస్థల పేలుళ్లతో పౌరుల్లో ఆందోళనల నడుమ దేశంలో శాంతిభద్రతలపై లెబనాన్ దృష్టిపెట్టాల్సిఉంది. ఈ తరుణంలో దాడి చేస్తే శత్రువును భారీగా దెబ్బ కొట్టవచ్చని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ గడ్డపై వరుస పేలుళ్లతో ఆగ్రహించిన లెబనాన్, హెజ్బొల్లా సాయుధాలు దాడులకు తెగబడొచ్చన్న ఇజ్రాయెల్ భావించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా లెబనాన్ సరిహద్దు ప్రాంతాలకు ఇజ్రాయెల్ అదనపు బలగాలను తరలించింది. అక్టోబర్ 8న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దమనకాండ మొదలైననాటి నుంచి ఇజ్రాయెల్‌పైకి హెజ్బొల్లా రాకెట్, డ్రోన్ దాడులు చేస్తోంది. ఉద్రిక్తతలను ఆపండి: ఐరాస లెబనాన్ వాకీటాకీల పేలుళ్ల ఘటనపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తచేసింది. ‘‘ పరిస్థితి చేయిదాట కుండా ఇరు పక్షాలు సంయమనం పాటించాలి’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ‘‘ బందీలను విడిచిపెట్టి శాంతి స్థాపనకు కట్టుబడాలి. ఎల్రక్టానిక్ పరికరాల పేలుళ్లకు పాల్పడటం చూస్తుంటే ఇది భారీ సైనిక చర్యకు కసరత్తులా తోస్తోంది’’ అని గుటెరస్ వ్యాఖ్యానించినట్లు ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డ్యుజారిక్ చెప్పారు. యుద్ధంలో కొత్త దశ మొదలైంది: ఇజ్రాయెల్వాకీటాకీల ఉదంతం తర్వాత రమాట్ డేవిడ్ వైమానిక స్థావరంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్ మాట్లాడారు. ‘‘ యుద్ధంలో కొత్త దశకు తెరలేపుతున్నాం. యుద్ధక్షేత్ర కేంద్ర స్థానం ఉత్తరం నుంచి దిశ మార్చుకుంటోంది. మాకు ఇప్పుడు స్థిరత్వం అవసరం. బలగాలు, వనరులను వేరే లక్ష్యం వైపు వినియోగించే అవకాశముంది. బుధవారం అద్భుత ఫలితాలు సాధించాం’’ అని సైనికులనుద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అత్యున్నత స్థాయి భద్రతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. హెజ్బొల్లాపై అదనపు దాడులకు సిద్ధమవుతున్నామని చెప్పారు. దీంతో లెబనాన్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతోందని అర్థమవుతోంది. కాగా, వరుస పేలుళ్లపై స్వతంత్య్ర దర్యాప్తు జరపాలని ఐరాస మానవహక్కుల సంస్థ చీఫ్ వోకర్ టర్క్ డిమాండ్‌చేశారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
పేజర్లే బాంబులై...
బీరూట్: ఇజ్రాయెల్‌కు తమ ఆనుపానులు చిక్కొద్దనే ఉద్దేశంతో వాడుతున్న పేజర్లు చివరికి హెజ్బొల్లా మిలిటెంట్ల ప్రాణాలకే ముప్పు తెచి్చపెట్టాయి. మంగళవారం దేశంలో పలు ప్రాంతాల్లో వేలాది పేజర్లు ఉన్నపళాన పేలిపోయాయి. ఈ వింత పేలుళ్లలో కనీసం 2,800 మందికి పైగా గాయపడ్డారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘కనీసం 200 మందికి పైగా ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటిదాకా 9 మంది మృత్యువాత పడ్డారు’’ అని ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియద్ తెలిపారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాలన్నీ హెజ్బొల్లా కంచుకోటలే. రాజధాని బీరూట్‌లో పలుచోట్ల జనం తమ చేతులు, ప్యాంటు జేబులు, బెల్టుల్లోని పేజర్లు పేలి గాయాలపాలవుతున్న వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆస్పత్రుల్లో ఎ మర్జెన్సీ వార్డులన్నీ క్షతగాత్రులతో నిండిపోతున్నట్టు స్థానిక ఏపీ ఫొటోగ్రాఫర్లు తెలిపారు. ప్రధానంగా నడుము, కాళ్లకు గాయాలైనట్టు చెప్పారు. లెబనాన్‌లోని తమ రాయబారి కూడా పేజర్ పేలి గాయపడ్డ ట్టు ఇరాన్ ధ్రువీకరించింది. సిరియాలోనూ పేజర్ పేలుళ్లు జరిగాయి. ప్రతీకారం తప్పదు: హెజ్బొల్లా ఇది కచి్చతంగా ఇజ్రాయెల్ పనేనని హెజ్బొల్లా మండిపడింది. ప్రతీ కారం తప్పదంటూ ప్రకటన విడుదల చేసింది. మిలిటెంట్లు వాడుతున్న పేజర్లనే ఇజ్రాయెల్ వారిపైకి ఆయుధాలుగా మార్చి ప్రయోగించిందని ఏపీ అభిప్రాయపడింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో అవి ఏకకాలంలో పేలేలా చేసిందని చెప్పుకొచి్చంది. దీనిపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. సెల్ ఫోన్లు వాడితే తమ కదలికలను ఇజ్రాయెల్ కనిపెడుతుందనే భయంతో వాటి వాడకాన్ని హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా గతంలోనే ఆదేశించారు. దాంతో కమ్యూనికేషన్ కోసం మిలిటెంట్లు పేజర్లు వాడుతున్నారు. ఆ క్రమంలో ఇటీవల కొనుగోలు చేసిన కొత్త బ్రాండ్ పేజర్లే పేలాయని హెజ్బొల్లా ప్రతినిధి చెప్పుకొచ్చారు. ‘‘అవి ముందుగా వేడెక్కాయి. కాసేపటికే పేలిపోయాయి. వాటిలోని లిథియం బ్యాటరీలే కొంపముంచినట్టున్నాయి’’ అంటూ వాపోయారు. శత్రువు పని పట్టడంలో ఆరితేరిన ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఇలా వినూత్నంగా ప్లాన్ చేసిందన్న వ్యాఖ్యలు విని్పస్తున్నాయి. -
Iran explosions: రక్తమోడిన ర్యాలీ
దుబాయ్: అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అత్యున్నత సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 188కి పైగా క్షతగాత్రులయ్యారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఇరాన్ ఖండిస్తున్న వేళ ఇరాన్‌పై దాడి ఖడ్గం ఝుళిపించింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. బుధవారం మధ్యాహ్నం మూడింటపుడు కెర్మాన్ నగరంలోని ఖాసిమ్ సులేమానీకి నివాళిగా ఆయన సమాధి దగ్గర నాలుగో సంస్మరణ ర్యాలీ జరుగుతుండగా సాహెబ్ అల్–జమాన్ మసీదు సమీపంలో రోడ్డుపై ఈ పేలుడు ఘటన జరిగింది. దారి పొడవునా వేలాది మంది సులేమానీ మద్దతుదారులతో ర్యాలీ కొనసాగుతుండగా సమాధికి 700 మీటర్లదూరంలో మొదటి పేలుడు సంభవించింది. గాయపడిన వారిని కాపాడేందుకు జనం, ఎమర్జెన్సీ విభాగ సభ్యులు భారీ సంఖ్యలో గుమికూడుతుండగా సమాధికి ఒక కిలోమీటర్ దూరంలో మరో భారీ పేలుడు సంభవించింది. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడి రక్తమోడుతున్న క్షతగాత్రులను వెంటనే హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారి ఆర్తనాదాలు, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో ఘటనాస్థలి భీతావహంగా తయారైంది. ఇది ఉగ్రదాడేనని కెర్మాన్ నగర డెప్యూటీ గవర్నర్ రహ్మాన్ చెప్పారు. అయితే దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఎవరీ సులేమానీ? ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌లోని కీలక ఖుర్డ్స్ ఫోర్స్‌కు మేజర్ జనరల్ సులేమానీ నేతృత్వం వహిస్తుండేవారు. ఖుర్డ్స్ఫోర్స్ అనేది విదేశీ సైనిక వ్యవహారాల విభాగం. సైన్యం కోసం ఆయుధాలు, నిధుల సేకరణ, నిఘా, సరకుల రవాణా బాధ్యతలను ఈ దళమే చూసుకుంటుంది. ఇరాన్‌కు మద్దతు పలికే గాజా స్ట్రిప్‌లోని హమాస్ మిలిటెంట్ గ్రూప్‌కు, లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌కు, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకూ సాయపడుతుంది. దీనిని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గతంలో ప్రకటించింది. ఎందుకు చంపారు? 2020 జనవరిలో ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంక్యూ9 రీపర్ డ్రోన్ సాయంతో అమెరికా సులేమానీని హతమార్చింది. ‘‘ 1998లో ఖుర్డ్స్ ఫోర్స్‌ను ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇరాక్, సిరియాలో లక్షలాది మంది అమాయకుల మరణాలకు సులేమానీ కారకుడు. ప్రపంచ నంబర్‌వన్ ఉగ్రవాది అయినందుకే అతడిని అంతమొందించాం’ అని నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి రోజున ప్రకటించారు. దీంతో ఆగ్రహంతో ఇరాన్ అప్పట్లో ప్రతీకార దాడులకు దిగడం తెల్సిందే. ఇరాన్ సైన్యాన్ని పటిష్టవంతం చేయడంలో సులేమానీది కీలక పాత్ర. అందుకే ఇరాన్ వ్యాప్తంగా సులేమానీకి అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. నేషనల్ ఐకాన్‌గా కీర్తింపబడ్డారు. 2011లో అరబ్ ఉద్యమం తర్వాత సిరియాలో బషర్ అస్సాద్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు. కానీ ఈ ఘటనలో సిరియాలో అంతర్యుద్ధం రాజుకుని అది ఇప్పటికీ రగులుతూనే ఉంది. 2018లో ప్రపంచ ఆర్థిక శక్తులు కీలక ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగాక ఇరాన్ సైనిక నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ట్రంప్ సర్కార్ ఇచి్చన ఆదేశాలతో సులేమానీపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో అప్పట్లో సంచలనమైంది. సులేమానీ హత్యేకాదు అంత్యక్రియల ఘటనా వార్తపత్రికల పతాకశీర్షికలకెక్కింది. 2020లో వేలాదిమంది పాల్గొన్న అంత్యక్రియల్లో తొక్కిసలాట జరిగి 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. -
ఇరాన్లో జంట పేలుళ్లు.. వందకుపైగా మృతులు!
టెహ్రాన్: ఇరాన్లో బుధవారం జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో వంద మందికిపైగా మృతి చెందగా.. 170 మంది తీవ్రంగా గాయడినట్లు ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది. దివంగత ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ సమాధి సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తివంతమైన ఖుద్స్ ఫోర్స్‌కు ఖాసీం సులేమానీ నేతృత్వం వహించేవాడు. 2020లో అమెరికా జరిపిన వైమానికి దాడిలో ఖాసీం సులేమానీ మరణించారు. బుధవారం ఖాసీం సులేమానీ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న సమయంలో నిమిషాల వ్యవధిలో వరసగా పేలుళ్లు జరిగాయి. ఖాసీం సులేమానీ జయంతి రోజే సమాధి వద్ద ఈ పేలుళ్లు జరగటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ పేలుళ్లకు ఉగ్రవాదులే కారణమని కెర్మాన్ ప్రావిన్స్ చెందిన అధికారులు తెలిపారు. మరోవైప మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. Pics | 73 Dead In Twin Blasts Near Grave Of Iran's Top General Qassem Soleimani https://t.co/EbzhuEE70t pic.twitter.com/x7lIs1vtjD — NDTV (@ndtv) January 3, 2024 చదవండి: అమెరికాపై ఇజ్రాయెల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు -
ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకపై దాడి
దుబాయ్: ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న తమ యుద్ధ నౌక యూఎస్ఎస్ కార్నీ సహా పలు వాణిజ్య నౌకలపై ఆదివారం దాడులు జరిగినట్లు అమెరికా పేర్కొంది. దాడికి కారణమెవరనే విషయం పెంటగాన్ తెలపలేదు. ఉదయం 10 గంటల సమయంలో యెమెన్ రాజధాని సనాలో మొదలైన ఈ దాడులు సుమారు 5 గంటలపాటు కొనసాగినట్లు ఓ అధికారి చెప్పారు. ఎర్ర సముద్రంలో అనుమానాస్పద డ్రోన్ దాడి, పేలుళ్లు సంభవించినట్లు అంతకుముందు బ్రిటిష్ మిలటరీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే ఓడలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతున్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవలి కాలంలో దాడులకు తెగబడుతున్నారు. తాజా ఘటనలపై హౌతీలు స్పందించలేదు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం వేళ మధ్యప్రాచ్యంలో ఈ దాడులు ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. -
Israel-Hamas War: ఆ కిరాతకం మీదే..
గాజా స్ట్రిప్/టెల్ అవీవ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: గాజా సిటీలోని అల్–అహ్లీ ఆసుపత్రిలో పేలుడు ఘటనపై ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం నిందలు మోపుకుంటున్నాయి. దాదాపు 500 మందిని బలిగొన్న కిరాతకులు మీరంటే మీరేనని వాదులాటకు దిగాయి. ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్ గురితప్పడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ, ముమ్మాటికీ ఇజ్రాయెల్ సైన్యమే ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని హమాస్ ఆరోపించింది. అల్–అహ్లీ ఆసుపత్రి ప్రాంగణంలో హృదయవిదారక వాతావరణం నెలకొంది. క్షతగాత్రులను ఎక్కడికి తరలించాలో తెలియడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే గాజాలో ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయానని గుర్తుచేస్తున్నారు. ఇక్కడ వైద్య సదుపాయాలు లేకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం బుధవారం 12వ రోజుకు చేరింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 3,478 మంది మరణించారని, 12,000 మందికిపైగా క్షతగాత్రులుగా మారారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 1,300 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్నామని, వారు ప్రాణాలతో బయటపడతారన్న నమ్మకం లేదని వెల్లడించింది. హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. దాదాపు 200 మంది బందీలు ఇప్పటికీ హమాస్ అ«దీనంలోనే ఉన్నారు. వారిని విడిపించేందుకు ఇజ్రాయెల్ సాగిస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇరుపక్షాలు మెట్టు దిగిరావడం లేదు. దాంతో బందీల పరిస్థితి ఏమిటన్నది ఆందోళనకరంగా మారింది. గత 12 రోజుల్లో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై 450 రాకెట్లు ప్రయోగించారని అంచనా. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వైమానిక దాడులు కొనసాగించింది. భయంకరమైన ఊచకోత: హమాస్ అల్–అహ్లీ హాస్పిటల్లో పేలుడుకు తాము కారణం కాదని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారీ చెప్పారు. ఆ పేలుడుతో తమకు సంబంధం లేదన్నారు. పేలుడు జరిగిన సమయంలో తాము ఆ ప్రాంతంపై అసలు ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం 6.59 గంటల సమయంలో సమీపంలోని ఓ శ్మశాన వాటిక నుంచి పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ అయిన ఇస్లామిక్ జిహాద్ సభ్యులు రాకెట్‌ను ప్రయోగించినట్లు తమ రాడార్ గుర్తించిందని తెలిపారు. ఈ రాకెట్ గురితప్పి, ఆసుపత్రి బయట పార్కింగ్ ప్రాంతంలో పేలిందని వెల్లడించారు. ఆసుపత్రిలో పేలుడు ఘటనను ‘భయంకరమైన ఊచకోత’గా హమాస్ అభివర్ణించింది. ఈ దురాగతానికి ఇజ్రాయెల్ సైన్యమే కారణమని పే ర్కొంది. ఈ మారణకాండకు బాధ్యత వహించకుండా ఇజ్రాయెల్ తప్పించుకోవాలని కుట్ర పన్నుతోందని ఆరోపించింది. అల్– అహ్లీ ఆసుపత్రిని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ కొన్ని రోజుల క్రితమే ఆదేశించిందని గుర్తుచేసింది. ఆసుపత్రిలో పేలుడులో 500 మంది చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆ సంఖ్యను 471గా సవరించింది. బైడెన్‌తో సమావేశాలు రద్దు గాజా ఆసుపత్రిలో పేలుడు ఘటనకు నిరసనగా జోర్డాన్ కఠిన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జరగాల్సిన సమవేశాన్ని జోర్డాన్ రాజు అబ్దుల్లా–2 రద్దు చేసుకున్నారు. పాలస్తీనా నేత మొహమ్మద్ అబ్బాస్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ కూడా ఇదే బాటలో నడిచారు. బైడెన్‌తో తాము భేటీ కావడం లేదని తేలి్చచెప్పారు. దాంతో బైడెన్ తన పర్యటనను కేవలం ఇజ్రాయెల్‌కే పరిమితం చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోందని జోర్డాన్ విదేశాంగ మంత్రి సపాధీ చెప్పారు. హమాస్ లావాదేవీలపై ఆంక్షలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగి, వెయ్యి మందికిపైగా జనాన్ని బలి తీసుకున్న మిలిటెంట్ సంస్థ హమాస్‌పై అగ్రరాజ్యం అమెరికా కఠిన చర్యలు ప్రారంభించింది. 10 మంది హమాస్ మిలిటెంట్ల బృందం ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం అమెరికా ప్రకటించింది. అలాగే హమాస్ ఆర్థిక నెట్‌వర్క్‌పైనా ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. గాజా, సూడాన్, తుర్కియే, అల్జీరియా, ఖతార్‌లో ఈ ఆంక్షలు అమలవుతాయని వెల్లడించింది. ఈ ఆంక్షల వల్ల విదేశాల నుంచి హమాస్‌కు నిధులు అందకుండా కట్టడి చేసినట్లు అవుతుందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ జానెట్ చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం హమాస్ మిలిటెంట్లకు అండగా నిలుస్తూ, భారీ ఎత్తున ఆర్థిక సాయం అందిస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా ఇకపై నిధులు ఇవ్వడం సులభం కాదు. వివిధ దేశాల్లో హమాస్ సభ్యుల బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆయా ఖాతాల్లోకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆ పేలుడుకు కారణం ఇజ్రాయెల్ కాదు: బైడెన్ గాజా హాస్పిటల్లో భీకర పేలుడుకు ఇజ్రాయెల్ ఎంతమాత్రం కారణం కాదని, ‘మరో బృందం’ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఆయన బుధవారం ఇజ్రాయెల్‌లో టెల్ అవీవ్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, తాజా పరిణామాలు, గాజా ప్రజలకు అందించాల్సిన మానవతా సాయంపై చర్చించుకున్నారు. అల్–అహ్లీ ఆసుపత్రిలో పేలుడు ఉదంతం ప్రస్తావనకు వచి్చంది. ఇస్లామిక్ జిహాద్ సభ్యులు ప్రయోగించిన రాకెట్ మిస్‌ఫైర్ కావడం వల్లే ఈ పేలుడు జరిగిందన్న ఇజ్రాయెల్ వాదనతో బైడెన్ ఏకీభవించారు. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజల ధైర్యసాహసా లు, అంకితభావం, శౌర్యాన్ని గౌరవిస్తూ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తుండడాన్ని గర్వకారణంగా భావిస్తున్నానంటూ బైడెన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇజ్రాయెల్ ప్రజల దుఃఖాన్ని అమెరికన్లు సైతం పంచుకున్నారని చెప్పారు. ఇజ్రాయెల్–హమస్ ఘర్షణ మరింత విస్తరించకూడదన్నదే తన ఉద్దేశమని తెలిపారు. ఈజిప్టు నుంచి మానవతా సాయాన్ని గాజాలోకి అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని వివరించారు. గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు 100 మిలియన్ డాలర్ల సాయం: బైడెన్ టెల్ అవీవ్: గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు 100 మిలియన్ డాలర్ల (రూ.832.87 కోట్లు) మానవతా సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ప్రకటన బుధవారం ప్రకటించారు. గాజా ప్రజలకు ఇప్పుడు ఆహారం, నీరు, ఔషధాలు, వసతి చాలా అవసరమని అన్నారు. గాజాకు ఇతర దేశాల నుంచి మానవతా సాయం చేరడానికి అంగీకరించాలని ఇజ్రాయెల్ కేబినెట్‌ను కోరానని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తాము అందించే 100 మిలియన్ డాలర్ల సాయం హమాస్‌కు, ఉగ్రవాద సంస్థలకు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, బాధిత పాలస్తీనియన్లకు మాత్రమే అందేలా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ఉంటుందని బైడెన్ పునరుద్ఘాటించారు. -
ఈ బాంబు ఒక్కటి వేస్తే.. 100 బాంబులు వేసినట్టే..
ఏదైనా బాంబును ప్రయోగిస్తే.. అది పడిన ప్రదేశంతోపాటు కొంతదూరం వరకు విధ్వంసం సృష్టిస్తుంది. అక్కడితో దాని పని అయిపోతుంది. అదే క్లస్టర్ బాంబును ప్రయోగిస్తే.. టార్గెట్ చేసిన ప్రదేశంతోపాటు చుట్టుపక్కల కొంత దూరం దాకా విధ్వంసం సృష్టిస్తుంది. అందులోని భాగాలు ఆ తర్వాత కూడా పేలుతూనే.. అక్కడికి వచ్చినవారి ప్రాణాలు తీస్తూనే ఉంటాయి. తాజాగా ఉక్రెయిన్‌కు అమెరికా క్లస్టర్ బాంబులను ఇవ్వడం, ప్రతిగా తమ వద్ద కూడా క్లస్టర్ బాంబులు ఉన్నాయని రష్యా హెచ్చరించడం నేపథ్యంలో.. క్లస్టర్ బాంబులు ఏమిటి? వాటితో ప్రమాదమేంటి? ఇప్పటివరకు ఎక్కడైనా ప్రయోగించారా? అన్న వివరాలు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఒకటి కాదు వందల బాంబులు కలిపి.. సాధారణంగా క్షిపణులు అయినా, ఇతర బాంబులు అయినా వాటిలో పేలిపోయే భాగం (వార్ హెడ్) ఒకటే ఉంటుంది. ఒకే ప్రదేశంలో పెద్ద పేలుడు సంభవిస్తుంది. అదే క్లస్టర్ బాంబులో వందలకొద్దీ చిన్న బాంబులు (బాంబ్లెట్లు) ఉంటాయి. దీనిని ప్రయోగించాక నిర్దేశించిన ప్రాంతానికి చేరుకోగానే విచ్చుకుని.. అందులోని చిన్న బాంబులన్నింటినీ కొంతదూరం వరకు వెదజల్లుతుంది. ఇలా ఎక్కువ విస్తీర్ణంలో పేలుళ్లు జరుగుతాయి. అంత విస్తీర్ణంలో విధ్వంసం జరుగుతుంది. మిలటరీ స్థావరాలు, వాహనాలు, ఆయుధాలు నాశనమవుతాయి. ఆ ప్రాంతంలో ఉండే సైన్యం, సాధారణ ప్రజలకూ ప్రమాదం కలుగుతుంది. అప్పుడే పేలక.. తర్వాత ప్రాణాలు తీస్తూ.. క్లస్టర్ బాంబులు వెదజల్లే బాంబ్లెట్లలో అన్నీ అప్పటికప్పుడే పేలిపోవు. వాటిలో కొన్ని నేలపై చెల్లాచెదురుగా పడిపోతాయి. కొన్నిసార్లు ఏళ్లకేళ్లు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైనా సైనికులుగానీ, సాధారణ పౌరులుగానీ వాటిని తాకితే పేలిపోయి ప్రాణాలు తీస్తాయి. అంటే యుద్ధం ముగిసిపోయినా బాంబుల బాధ తప్పని పరిస్థితి. ♦ గతంలో వియత్నాం, లావోస్, ఇరాక్, అష్గానిస్తాన్ తదితర యుద్ధాల్లో అమెరికా ఈ కస్టర్ బాంబులను వినియోగించింది కూడా. వాటిలో పేలిపోకుండా ఉన్న బాంబులు ఇప్పటికీ తరచూ విస్ఫోటం చెందుతూ ప్రజలు ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. ♦ క్లస్టర్ బాంబులు భారీగా జన హననానికి దారి తీస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వీటి వాడకాన్ని నిషేధిస్తూ ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఆ ఒప్పందంపై అమెరికా, ఉక్రెయిన్, రష్యా సంతకం చేయకపోవడం గమనార్హం. ‘డడ్ రేటు’తో ఎఫెక్ట్ క్లస్టర్ బాంబు ప్రయోగించినప్పుడు పేలకుండా ఉండిపోయే బాంబ్లెట్ల శాతాన్ని ‘డడ్ రేటు’గా పిలుస్తారు. ఈ డడ్ రేటు ఎంత ఎక్కువగా ఉంటే.. భవిష్యత్తులో ప్రజలు వాటి బారినపడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. రష్యాకు చెందిన క్లస్టర్ బాంబుల డడ్ రేటు 4శాతం నుంచి 40 శాతం వరకు ఉంటుందని అంచనా. తాజాగా ఉక్రెయిన్‌కు ఇచ్చిన క్లస్టర్ బాంబుల డడ్ రేటు చాలా తక్కువగా 2.35 శాతమేనని అమెరికా అధికారులు ప్రకటించడం గమనార్హం. క్లస్టర్ బాంబుల ప్రత్యేకతలివీ.. ♦ క్లస్టర్ బాంబు బరువు సాధారణంగా 450 కిలోల నుంచి 500 కిలోల వరకు ఉంటుంది. అందులో ఒక్కోటీ ఏడెనిమిది అంగుళాల పొడవున్న 200 వరకు బాంబ్లెట్లు ఉంటాయి. ♦ క్లస్టర్ బాంబు నిర్దేశిత లక్ష్యానికి చేరువకాగానే.. అతి వేగంగా తిరగడం మొదలవుతుంది. తర్వాత దశలవారీగా బాంబ్లెట్లను విడుదల చేస్తుంది. దీనివల్ల బాంబ్లెట్లు దూరదూరంగా, వేగంగా పడిపోతాయి. ♦ క్లస్టర్ బాంబుల్లోని బాంబ్లెట్లకు కిందివైపు ఫ్యాన్ తరహా ప్రత్యేకమైన రెక్కలు, లేకుంటే చిన్నపాటి ప్యారాచూట్లను అమర్చుతారు. దీనితో అవి ఓ క్రమంలో నేలను తాకి పేలిపోతాయి. ♦ పేలిపోకుండా ఉండిపోయిన బాంబ్లెట్లను గుర్తించి నిర్విర్యం చేయడం కూడా ప్రమాదకరమైన పనే. ఎవరైనా తాకగానే పేలిపోయే అవకాశాలు ఎక్కువ. అందువల్ల బాంబ్ డిస్పోజల్ యూనిట్లు, రోబోలతో వాటిని గుర్తించి, నిర్విర్యం చేయాల్సి ఉంటుంది. 1 మిలటరీ వాహనం నుంచి క్లస్టర్ బాంబు ప్రయోగం 2 నిర్దేశిత లక్ష్యానికి సమీపంలో ఉండగా క్లస్టర్ బాంబు నుంచి బాంబ్లెట్లు విడుదల అవుతాయి. 3 చాలా వరకు బాంబ్లెట్లు నేలను తాకగానే పేలిపోతాయి. 4 కొంత మేర బాంబ్లెట్లు పేలిపోకుండా నేలపై పడి ఉంటాయి. వాటిని ఎవరైనా తాకితే వెంటనే పేలిపోయి విధ్వంసం సృష్టిస్తాయి. -
జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు.. ఆరుగురు పౌరులకు గాయాలు..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నర్వాల్‌లో శనివారం ఉదయం జంట పేలుళ్లు జరిగాయి. ట్రాన్స్పోర్ట్ నగర్ యార్డ్ నంబర్ 7లో ఈ ఘటన జరిగింది. వరుస పేలుళ్లలో ఆరుగుగు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పేలుళ్లు బాంబుల వల్ల జరిగాయా? లేక ఇతర కారణాలున్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు దీన్ని ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. నర్వాల్ ప్రాంతాన్ని దిగ్భంధించి తనిఖీలు చేపట్టారు. నర్వాల్ ఏరియా రోజంతా రద్దీగా ఉంటుంది. ఇక్కడ వాహనాల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. కార్ల విడి భాగాలు, రిపేర్లు, మెయింటెనెన్స్ కోసం వాహనదారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఓ వైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కశ్మీర్‌లోనే కొనసాగుతున్న తరుణంలో ఈ పేలుడు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతంలో నిఘా పెంచారు. చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై బీర్ తాగుతూ బిల్డప్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు.. -
Targeted Attacks: నిన్న ఇంట్లోకి చొరబడి కాల్పులు.. నేడు బాంబు దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో మైనారిటీ వర్గం లక్ష్యంగా ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. రాజౌరికి 8 కిలోమీటర్ల దూరంలోని అప్పర్ డాంగ్రి గ్రామంలో ఆదివారం ఇళ్లల్లోకి చొరబడి కాల్పులు జరిపిన సంఘటన నుంచి తేరుకోకముందే మరోమారు దాడి చేశారు. బాధితుల ఇంటి సమీపంలోనే సోమవారం భారీ పేలుడు జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం నాటి కాల్పుల్లో మొత్తం నలుగురు మృతి చెందగా.. సోమవారం నాటి బాంబు దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ‘మొదటి కాల్పుల ఘటన జరిగిన ప్రాంతంలోనే పేలుడు జరిగింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాత్రికేయులు అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రాంతంలోనే మరో ఐఈడీని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాం.’అని స్థానిక పోలీసులు తెలిపారు. ఆదివారం నాటి ఘటన బాధ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలోనే ఈ భారీ పేలుడు జరగటం తీవ్ర కలకలం రేపింది. రూ.10లక్ష పరిహారం, ప్రభుత్వం ఉద్యోగం.. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం, ఇంట్లో అర్హులైన వారికి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. గాయపడిన వారికి రూ.1 లక్ష సాయం అందిస్తామని తెలిపారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, కారకులను చట్టంముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఆందోళనలు.. మైనారిటీలే లక్ష్యంగా ఉగ్రదాడులు జరగటంపై రాజౌరీలో ఆదివారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు స్థానికులు. తమ ప్రాణాలు రక్షించటంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. నిరసనకారులను కలిసేందుకు వెళ్లిన క్రమంలో జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవిందర్ రైనాను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, లెఫ్టినెంట్ గవర్నర్ తమ వద్దకు వచ్చి డిమాండ్లు వినాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు పౌరులు మృతి -
రష్యా ప్రతీకార చర్య.. ఉక్రెయిన్‌పై మిసైల్స్‌తో భీకర దాడులు
కీవ్: కెర్చ్ వంతెన పేల్చివేతతో ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో రష్యాకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కీలకమైన క్రిమియా-రష్యా వంతెనపై పేలుడుకు ఉక్రెయిన్ కారణమని ఆరోపించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇది ముమ్మాటికి ఉగ్రవాద చర్యతో సమానమని విమర్శించారు. ఆ మరుసటి రోజే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో వరుస పేలుళ్లు భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఉదయం 8.15 గంటలకు తొలిసారి పేలుడు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. బ్లాస్ట్ జరిగిన ప్రాంతానికి భారీగా అంబులెన్స్‌లు తరలివెళ్లాయని పేర్కొంది. ఉక్రెయిన్‌లో చాలా నగరాల్లో సోమవారం మిసైల్ దాడులు జరిగినట్లు ఆరోపించారు అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ‘మిసైల్స్ దాడిలో ఉక్రెయిన్ చిక్కుకుంది. దేశంలోని చాలా నగరాల్లో దాడులు జరిగినట్లు తెలుస్తోంది.’ అని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ‘రాజధాని కీవ్‌లోని షెవ్చెన్కివిస్కీ జిల్లాలో పలు భారీ స్థాయి పేలుళ్లు సంభవించాయి.’ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కీవ్ మేయర్ విటాలి క్లిట్స్చ్కో. మరోవైపు.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోల్లో పలు ప్రాంతాల్లో నల్లటి పొగ అలుముకున్నట్లు కనిపిస్తోంది. రాజధాని కీవ్‌పై చివరిసారిగా జూన్ 26న దాడి చేశాయి రష్యా సేనలు. తాజాగా కెర్చ్ వంతెన కూల్చివేతకు ప్రతీకార దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లోని జపోరిజియా ప్రాంతంలో రష్యా ఆదివారం జరిపిన మిసైల్స్ దాడుల్లో 13 మంది మరణించారు. ఈ దాడిని అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ఈ దాడిలో 11 మంది చిన్నారుల సహా మొత్తం 89 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యాలోని కీలక వంతెన పేలుడు తర్వాత ఉక్రెయిన్ పేలుళ్ల ఘటనలు పెరిగాయి. దీంతో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: క్రిమియా వంతెన బాంబు దాడి: ఉగ్రవాదమన్న పుతిన్.. ఉక్రెయిన్ ఘాటు కౌంటర్ -
విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు
మాస్కో: క్రిమియాను రష్యాను కలిపే వంతెనపై భారీ విధ్వంసం జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం 6 గం.లకు ఓ ట్రక్కు పేలడం కారణంగా ఈ భారీ ప్రమాదం సంభవించింది. దీంతో క్రిమియా వైపుగా వెళ్తున్న రైలులోని ఏడు ఇంధన ట్యాంకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విధ్యంసం కారణంగా వంతెన రెండు లైన్లు పాక్షికంగా కూలిపోయాయి. ఈ మేరకు ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న క్రిమియాను రష్యాను కలిపే కీలక వంతెన భారీ కారు బాంబు పేలుడుతో ధ్వంసమైంది. ఈ ఘటనపై రష్యా దర్యాప్తు చేపట్టింది. ఒక ట్రక్కును పేల్చివేయడంతోనే అగ్నికీలలు వ్యాపించినట్లు రష్యా పరిశోధన కమిటి పేర్కొంది. ఈ వంతెనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2018లో ప్రారంభించారు. ఘటనా స్థలానికి డిటెక్టివ్‌లను పంపినట్లు దర్యాప్తు కమిటీ పేర్కొంది. పరిశోధన కమిటీ ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటనకు కారకులెవరు వంటి వాటిపై ముమ్మరంగా విచారణ సాగిస్తున్నట్లు వెల్లడించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Crimean bridge this morning. pic.twitter.com/chmoUEIxt7 — Anton Gerashchenko (@Gerashchenko_en) October 8, 2022 (చదవండి: షాకింగ్ వీడియో.. కారులో బర్గర్ తింటున్న యువకుడిపై పోలీసు కాల్పులు) -
బెలూన్‌లో గాలి నింపే హీలియం ట్యాంక్ పేలి... ఒకరు మృతి
బెలూన్‌లో గాలి నింపే హీలియం ట్యాంక్ పేలడంతో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు తిరుచ్చిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం..బెలూన్లు అమ్మే వ్యక్తి నార్సింగ్ నిర్లక్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుడు 35 ఏళ్ల రవిగా గుర్తించారు. అతను బెలూన్లు కొనడానికి వచ్చి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనలో నలుగురైదుగురు వ్యక్తుల స్వల్ప గాయాలతో బయటపడ్డారని అన్నారు. ఈ పేలుడులో ద్విచక్రవాహనాలు, ఒక ఆటోరిక్షా దారుణంగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. ఈ ఘటన మొత్తం టెక్స్టైల్ ఫోరూం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఆ వీడియోలో షాపు బయట ఒక వ్యక్తి బెలూన్లు అమ్ముతున్నాడు. కాసేపటికి హఠాత్తుగా పేలుడు సంభవించింది తదనంతరం సమీపంలోని జనాలంతా భయంతో పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తోంది. #WATCH | Tamil Nadu: A helium tank exploded in a market in Trichy's Kotai Vasal area yesterday; One dead & several injured. Case registered. pic.twitter.com/wUHvlaM5GQ — ANI (@ANI) October 3, 2022 (చదవండి: పండగ వేళ విషాదం..కొడుకు మృతిని జీర్ణించుకోలేక ఆగిన తండ్రి గుండె) -
ఘనాలో భారీ పేలుడు.. 17 మంది మృతి
అక్రా: పశ్చిమ ఘనాలో భారీ పేలుడు సంభవించింది. బోగోసో ప్రాంతం సమీపంలో ట్రక్, మోటర్ బైక్‌ను ఢీకొని పేలుడు చోటుచేసుకుంది. అధికారుల ప్రకారం.. మైనింగ్ కంపెనీకి పేలుడు పదార్థాలు తరలిస్తున్న ట్రక్ ప్రమాదానికి గురైంది. పేలుడు సంభవించిన ప్రదేశంలో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ ఉండటం వలన ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో దట్టమైన నల్లని మేఘాలు అలుముకున్నాయి. పేలుడు బీభత్సానికి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. ఆ ప్రదేశంలో ఇప్పటి వరకు.. 17 మంది మృతి చెందగా, మరో 59 మంది తీవ్రగాయాలపాలయ్యారు. క్షత గాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అధికారులు సంఘటన స్థలానికి సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంపై ఘనా అధ్యక్షుడు నానా అక్రూఫో అడ్డో స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డ 59 మందిలో.. 42 మందిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చదవండి: ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే -
అఫ్ఘనిస్తాన్‌లో పేలుడు... తొమ్మిది మంది మృతి
తూర్పు అఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు తాలిబన్లు తెలిపారు. అయితే ఈ తూర్పు నాగర్‌హర్ ప్రావిన్స్‌లోని లాలోపర్ జిల్లాలో ఆహార పదార్థాలను విక్రయిస్తున్న బండి పాత పేలని మోర్టార్ షెల్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని తాలిబన్ల గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. (చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!) తాలిబాన్ ప్రత్యర్థుల అయిన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అఫ్గనిస్తాన్‌ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ కొత్త పాలకులను లక్ష్యంగా చేసుకుని పలు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేగాక దశాబ్దాల కాలంగా యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొన్న అఫ్గనిస్తాన్‌లో పేలని ల్యాండ్ మైన్స్, ఇతర ఆయుధాలు కోకొల్లలు. అయితే అవి ఎప్పుడైన పేలితే మాత్రం పిల్లలే ఆ ప్రమాదానికి బాధితులవడం బాధాకరం. (చదవండి: వరల్డ్ స్ట్రాంగెస్ట్ గర్ల్: దెబ్బ పడితే ఖతమే!) -
ఘోరం ప్రమాదం: చూస్తుండగానే 50 మంది సజీవ దహనం
పోర్ట్–ఔ–ప్రిన్స్: తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న హైతీలో పెను విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 53 మంది సజీవ దహనమయ్యారు. 100 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాప్–హైతియన్ నగరంలో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగిందని నగర డిప్యూటీ మేయర్ పాట్రిక్ అల్మోనార్ చెప్పారని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. సంఘటనస్థలం నుంచి మంటలు చుట్టుపక్కలున్న మరో 20 గృహాలకు వ్యాపించడంతో అందులోని వారూ సజీవ దహనమయ్యారు. ట్యాంకర్ నుంచి లీకవుతున్న పెట్రోల్‌ను పట్టుకునేందుకు జనం బకెట్లతో ఎగబడినపుడు మంటలు అంటుకుని ట్యాంకర్ పేలిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!! -
జలాలాబాద్‌లో పేలుళ్లు.. ఇద్దరు మృతి: తాలిబన్ అధికారులు
జలాలాబాద్: ఆప్గనిస్తాన్‌లోని జలాలాబాద్‌లో శనివారం మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, మరో 18 నుంచి 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం. అంతేగాక మరణించిన వారిలో తాలిబన్ అధికారులూ ఉన్నట్లు తెలుస్తోంది. జలాలాబాద్‌లో జరిగిన వేరువేరు బాంబు పేలుళ్లో ఇద్దరు మృతి చెందినట్లు, 20 మంది వరకు గాయపడినట్లు తమకు సమాచారం అందిందని తాలిబన్ అధికారులు పేర్కొన్నారు. అయితే మృతుల పేర్లు మాత్రం వెల్లడించలేదు. గాయపడిన వారిలో మహిళలు, చిన్న పిల్లలున్నట్లు తెలిపారు. కాగా బాంబు దాడి ఘటనపై విచారణ జరగుతున్నట్లు వెల్లడించారు. నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌లోని తాలిబాన్ వాహనాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. తాలిబన్ దళాల వాహనాలు వెళ్తుండగా రోడ్డు పక్కన అమర్చిన మందుపాతరను పేల్చారని చెప్పారు. ఇదిలా ఉండగా ఆగస్ట్ 15న ఆప్గనిస్తాన్‌ను తాలిబన్లు మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నప్పటి నుంచి ఆ దేశంలో వివిధ ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు జరుతూనే ఉన్నాయి. చదవండి: అఫ్గనిస్తాన్‌కి తక్షణ సాయం కావాలి: యూఎన్ మూగజీవాల రక్షకుడు.. 8వేల కుక్కలను కాపాడిన భిక్షువు.. -
కాబూల్ పేలుళ్లు: ‘అసలు ఇండియాలో అడుగు పెడతామనుకోలేదు’
సాక్షి, వెబ్‌డెస్క్: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన నాటి నుంచి ఆ దేశంలో పరిస్థితులు దిగజారిపోయాయి. ఈ క్రమంలో పలు దేశాలు అఫ్గన్‌లో ఉన్న తమ దేశీయుల తరలింపుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే గురువారం దేశాన్ని వదిలి వెళుతున్న పాశ్చాత్యులు, అఫ్గన్లు లక్ష్యంగా కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం ఆత్మాహుతి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి భయంకర పరిస్థితుల నుంచి క్షేమంగా స్వదేశం చేరుకున్న ఓ భారతీయ జంట తాము ఎదర్కొన్న భయానక అనుభవాల గురించి వివవరించింది. ఇప్పటికే భారత ప్రభుత్వం అఫ్గన్ నుంచి 800 మంది భారతీయులను క్షేమంగా దేశానికి చేర్చింది. ఇలా చేరుకున్న వారిలో గుజరాత్‌కు చెందిన షివాంగ్ దవే, అతడి భార్య కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారు తాము ఎదొర్కన్న భయానక అనుభవాలు, ఉద్రిక్త పరిస్థితుల గురించి వెల్లడించారు దవే దంపతులు. షివాంగ్ దవే మాట్లాడుతూ.. ‘‘నేను గత 15 ఏళ్లుగా అఫ్గన్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాను. నాకు ఇద్దరు కుమారులు రోహిత్భయ్ దవే, మరొకరు ప్రముఖ గుజరాత్ కవి హరింద్ర దవే. తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన తర్వాత మేం అక్కడ బతకడం అసాధ్యం అని మాకు అర్థం అయ్యింది. భారత ప్రభుత్వం మమ్మల్ని తరలించేందుకు ముందుకు వచ్చింది’’ అని తెలిపాడు. (చదవండి: పాకిస్తాన్ మా రెండో ఇల్లు : తాలిబన్లు) ‘‘కాబూల్ విమానాశ్రయం చేరుకుంటే తప్ప మా భవిష్యత్ ఏంటో అర్థం కాదు. ఇక మా ఇంటి దగ్గర నుంచి కాబూల్ విమానాశ్రయం చేరుకునే దారి వెంబడి మాకు ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత కాబూల్ విమానాశ్రయం వెళ్లే దారులన్నింటిని మూసేశారు. రోడ్ల మీద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. వీటన్నింటిని దాటుకుని విమానాశ్రయం చేరుకున్నాము’’ అని తెలిపాడు దవే. (చదవండి: కాబూల్ రక్తసిక్తం:100 మందికి పైగా మృతి! ) దవే భార్య మాట్లాడుతూ.. ‘‘అసలు మేం కాబూల్ విమానాశ్రయం చేరుకుంటామా.. లేదా అనే భయం వెంటాడసాగింది. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి విమానాశ్రయం చేరుకున్నాము. కానీ అక్కడ అనుకోని ఉపద్రవం ఏర్పడింది. తాలిబన్లు నా భర్తను బంధించారు. నాకు అర్థం అయ్యింది.. మా జీవితాలు ఇక్కడే ముగిసిపోతాయి.. మేం మా స్వదేశం వెళ్లమని తెలిసింది. కాకపోతే అదృష్టం కొద్ది మే తాలిబన్ల చేతుల నుంచి బయటపడి.. ఇండియా వెళ్లే విమానం ఎక్కగలిగాము’’ అని గుర్తు చేసుకున్నారు.(చదవండి: ఇక అంతా తాలిబన్ల సహకారంతోనే..) ‘‘ఆ తర్వాత అనేక చోట్ల ఆగుతూ మా ప్రయాణం కొనసాగింది. విమానం గాల్లోకి లేచి.. భారత్‌లో ల్యాండ్ అయ్యే వరకు ఊపిరి బిగపట్టుకుని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాము. గాల్లో ఉండగా కిందకు చూస్తే.. ప్రతి 40-50 మీటర్లకు ఓ చోట పేలుళ్లు చోటు చేసుకునే ఘటనలు దర్శనమిచ్చాయి. మా జీవితంలో అంతలా భయపడిన దాఖలాలు లేవు. ఆదివారం భారత్‌లో ల్యాండ్ అయ్యాము. ఆ తర్వాత గుజరాత్‌లోని మా ఇంటికి చేరుకున్నాం. ప్రస్తుతం మా బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేవు.. మాకు ఉద్యోగం లేదు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అర్థం కావడం లేదు’’ అని దవే దంపతులు వాపోయారు. -
కాబుల్ ఎయిర్ పోర్టులో బాంబుల మోత
-
వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్, 13 మంది మృతి
కాబూల్: తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్నప్పటినుంచీ హింస మరింత రగులుతోంది. తాజాగా కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద జంట పేలుళ్ల ఘటనలు బీభత్సం సృష్టించాయి. హమీద్ కర్జాయ్ విమానాశ్రయం అబేగేట్, ఒక హోటల్‌వద్ద వరుసగా భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరణించిన వారిలో పిల్లలు కూడా ఉన్నారని, తాలిబన్ ప్రతినిధి రాయటర్స్‌తో తెలిపారు. అటు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు దీన్ని ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. కాగా పేలుళ్లు జరిగే అవకాశ ఉందని ముందే హెచ్చరించిన అమెరికా తాజాగా మరింత అప్రమత్తమైంది. మరో పేలుడు కూడా జరిగే అవకాశం ఉందని అమెరికా ఆర్మీ హెచ్చరించింది. కాబుల్ ఎయిర్‌పోర్టుపై ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని అమెరికా సహా నాటో దేశాలు హెచ్చరించిన గంటల వ్యవధిలోనే పేలుళ్ళు ఘటనలు మరింత ఆందోళన రేపాయి. VIDEO: People being rushed to the hospital following reported suicide bomber attack at Kabul airport. pic.twitter.com/ex74FpusGs — Election Wizard (@ElectionWiz) August 26, 2021 -
గ్యాస్ సిలిండర్ పేలుళ్లు : జాగ్రత్తలు తీసుకోండిలా..
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ వినియోగించడంలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలపై అవగాహన లోపం, గ్యాస్ లీకేజీలపై ఏమరుపాటు కారణంగా భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రధాన ఆయిల్ కంపెనీలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేయడం, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు అత్యవసర సేవల నిమిత్తం టెక్నికల్ సిబ్బందిని నియమించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఎజెన్సీల వద్ద గ్యాస్ లీకేజీ, ఇతరత్రా వినియోగదారుల కాల్స్ కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో పడిపోతున్నాయి. డెలివరీ బాయ్స్ రిపేరు సిబ్బందిగా అవతారమెత్తి ప్రైవేటు టెక్నీషియన్స్ కంటే అదనంగా సర్వీస్ చార్జీలు వసూలు చేయడం పరిపాటిగా తయారైంది. ఒకవైపు ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యం, మరోవైపు వినియోగదారుల తప్పిదాలు వంటింట్లో విస్ఫోటనాలకు దారి తీస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని ఒక గుడిసెలో గురువారం గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి గుడిసె దగ్ధమైంది. ఇంట్లో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓల్డ్‌బోయిన్‌పల్లి ఈద్గా సమీపంలోని రామకష్ణ పాఠశాల వద్ద ఒక ఇంట్లో రెండు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. మంటల ధాటికి ఇళ్లల్లోని ఫర్నిచర్సహా ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఈ రెండు సంఘటనలను బట్టిచూస్తే వంటింట్లో వంట గ్యాస్ విస్ఫోటంగా తయారైంది. పరీక్షలో నిర్లక్ష్యం... ► వంట గ్యాస్ సిలిండర్ పరీక్షల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. సిలిండర్ జీవిత కాలపరిమితి పదేళ్లు. ఆ తర్వాత తిరిగి పరిశీలించి సిలిండర్ ప్రమాణాల ను బట్టి మరో ఐదేళ్లు రీఫిల్లింగ్ చేయడమా? లేదా తుప్పు కింద పడేయడం చేయాల్సి ఉంటుంది. ► రీఫిల్లింగ్ జరిగే ప్రతిసారి సిలిండర్ రీఫిల్ బాడీ ఇతరత్రా వాటిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఆయిల్ కంపెనీలు టెర్మినల్‌కు వచ్చిన సిలిండర్‌ను మొక్కుబడి పరిశీలనతో రీఫిల్లింగ్ చేసి సరఫరా చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిలిండర్ పై డ్యూడేట్... ► వంట గ్యాస్ సిలిండర్ భద్రత ప్రమాణాలను కాలపరిమితి (డ్యూ డేట్) బట్టి గుర్తించవచ్చు. ► సిలిండర్‌పై త్రైమాసాకానికి ఒక కేటగిరిగా అక్షరాలు డ్యూ డేట్‌గా ఉంటాయి. అక్షరంతో పాటు అంకె అంటే కాలపరిమితి గడువు సంవత్సరం కూడా ఉంటుంది. ► ఉదాహరణకు సిలిండర్ పై ఏ-21 బీ-21, సీ-21, డీ-21 అనే అక్షరాలు ఉంటాయి. ఏ-అంటే జనవరి నుంచి మార్చి వరకు, బీ అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సీ అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, డీ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పరిగణించాలి. పక్కన ఉన్న అంకెను సంవత్సరంగా గుర్తించాలి. ఇవీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦సిలిండర్ డోర్ డెలివరీ కాగానే సీల్ కరెక్టుగా ఉందా, లేదా చూసుకోవాలి. సిలిండర్ కాలపరిమితి పరిశీలించాలి. ♦సీల్ తీయగానే ఓపెన్ రింగ్ కట్ అయినా...గ్యాస్ వాసన వచ్చినా తిరిగి సిలిండర్ వెనక్కి పంపాలి. రెగ్యులేటర్, బర్నర్‌ను ఎప్పటి కప్పుడు తనిఖీ చేసుకోవాలి. రెండేళ్లకు ఒకసారి స్టవ్‌ను మార్చు కోవాలి. ♦ వంట గ్యాస్ స్టౌ వినియోగించని సమయంలో రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి. రాత్రి పూట తప్పనిసరిగా రెగ్యులేటర్ ఆఫ్‌లో ఉంచాలి. ♦వంట గది తలుపుల కింద కనీసం ఒక అంగుళం ఖాళీగా ఉండే విధంగా చూడాలి. ♦ గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు తప్పనిసరిగా వాసన వస్తుంది. అలాంటి సమయంలో ఎలాంటి ఏమరుపాటు పనికి రాదు. ♦ విద్యుత్ స్విచ్‌లు ముట్టుకోవడం, అగ్గిపుల్ల వెలిగించడం చేయకూడదు. విద్యుత్ స్విచ్‌లు ఆన్ చేయడం, ఆఫ్ చేయడం చేయవద్దు. స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే వచ్చే చిన్నపాటి స్పార్క్(మెరుపు) ప్రమాదానికి దారితీస్తోంది. ♦ గ్యాస్ వాసన పసిగట్టగానే తక్షణం వంటింటి తలుపులు, కిటికీలు బార్లా తెరిచి గ్యాస్‌ను బయటకు పంపే ప్రయత్నం చేయాలి. ♦ ఆ తర్వాత గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తిస్తే సిలిండర్‌ను బయటికి తీసుకెళ్లి బహిరంగ ప్రదేశంలో సేఫ్టీ పిన్ బిగించి ఉంచాలి. ♦ సిలిండర్ కంటే ఎత్తులో స్టవ్ ఉండాలి. సిలిండర్‌ను నిలువుగానే పెట్టాలి. ♦ వంట గదిలో ఫ్రిజ్ పెట్టవద్దు. అందులో ఉండే థర్మోస్టాట్ వల్ల ఆటో కటాఫ్ అవుతోంది. గ్యాస్ లీకైన సమయంలో ఇటువంటి ప్రమాదానికి దారితీస్తోంది. గుడిసెలో పేలిన సిలిండర్లు బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 11లోని ఉదయ్‌నగర్ బస్తీలో గురువారం ఉదయం తాళం వేసిన గుడిసెలో ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.... ఉదయ్‌నగర్ బస్తీలో సావిత్రి అనే మహిళ తన ఇంటిపై గుడిసెలు వేసి అద్దెకిచ్చింది. గోపాల్–మంగమ్మ దంపతులు ఓ గుడిసెలో, నర్సింహ అనే వ్యక్తి మరో గుడిసెలో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం వారు గుడిసెకు తాళం వేసి పనికి వెళ్లిపోయారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఓ గుడిసెలో ప్రమాదవశాత్తు రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో ఇంటి యజమాని సావిత్రికి స్వల్ప గాయాలయ్యాయి. మరో గుడిసెలో ఉన్న సిలిండర్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా అప్పటికే గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో రూ. లక్ష నగదు కాలిపోయినట్లు మంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. కళ్లముందే డబ్బు, సామగ్రి, నిత్యావసర సరుకులు అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు బోరున విలపించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గుజరాత్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
అహ్మదాబాద్: కెమికల్ గోడౌన్లో పేలుడు సంభవించి భవనం కుప్పకూలిన ఘటనలో 12 మంది మరణించారు. ఈ దుర్ఘటన అహ్మదాబాద్ నగర శివారులో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. మరణించిన 9 మంది కూలీల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు చెప్పారు. గాయపడిన మరో 9 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కెమికల్స్ కారణంగా భారీ పేలుడు సంభవించడంతో భవనం కుప్పకూలి ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బలగాలు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 18 మందిని వెలికితీసి అంబులెన్సుల ద్వారా హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. అయితే అందులో 12 మంది మరణించారని వైద్యులు తెలిపారు. శిథిలాల కింద అణువణువూ గాలిస్తున్నామని, ప్రమాదంపై విచారణ సాగిస్తున్నామని డీసీపీ అశోక్ మునియా చెప్పారు. కెమికల్ గోడౌన్‌లోని బాయిలర్ వల్ల పేలుడు జరిగి ఉండవచ్చని స్థానిక ఫ్యాక్టరీల యజమానులు అభిప్రాయపడుతున్నారు. పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో గోడలు పగిలి స్లాబ్ కూలిందని గోడౌన్ పక్కన భవనాల్లో పనిచేస్తున్న కూలీలు చెప్పారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. బాధితులను ఆదుకోవడానికి అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని ట్వీట్ చేశారు. -
భారీ పేలుడు ఐదుగురు సజీవ దహనం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించడంతో.. అందులో పనిచేస్తున్న కార్మికుల్లో ఐదురుగు సజీవ దహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విరుదునగర్ జిల్లా సరిహద్దుల్లోని మురుగనేరి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ బాణసంచా కర్మాగారంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. డి.కల్లూపట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని తమ కుటుంబాలపై దేవుడు పగబట్టాడని మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
వెంటాడుతున్న విషాదం: ‘ఒక్కరూ ప్రాణాలతో లేరు’
బీరూట్: లెబనాన్ రాజధాని బీరుట్లో పేలుళ్లు సంభవించి నెల రోజులు దాటిపోయింది. ప్రమాదం జరిగిన చోటు నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేర భవనాలన్నీ ధ్వంసమైన ఆ భీతావహ ఘటన ప్రజలను ఇంకా వెంటాడుతోంది. సుమారుగా 191 మంది ప్రాణాలను బలి తీసుకున్న తీవ్ర విషాదం నుంచి వారు నేటికీ కోలుకోలేపోతున్నారు. ప్రమాదం సమయంలో మిస్సయిన ఏడుగురి జాడ ఇంతవరకు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ‘లెబనాన్’గుండెను నిలువునా చీల్చిన ఆ చేదు ఘటన నిజం కాకపోయి ఉంటే బాగుండునని, శిథిలాల కింద పడి ఉన్న వాళ్లు కొన ఊపిరితోనైనా బతికి ఉంటారనే ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. అయితే చిలీ రక్షణ బృందాలు చెప్పిన విషయాలు వారి ఆశలను అడియాసలు చేశాయి. సెన్సార్ రీడింగ్‌లో వెల్లడైనట్లుగా.. పేలుళ్లలో ధ్వంసమైన భవన శిథిలాల కింద ఓ ఒక్కరు ప్రాణాలతో మిగిలిలేరనే చేదు నిజాన్ని చెప్పాయి. (చదవండి: ‘అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది’) కాగా గత నెల 4న బీరూట్ పోర్టులో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్ వలన భారీ స్థాయిలో పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సుమారు 6 వేల భవనాలు నేలమట్టమయ్యాయి. గత ఏడాది కాలంగా లెబనాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి కారణంగా... పేదరికం తారస్థాయికి చేరింది. నిత్యావసరాల కోసం ప్రజలు చెత్తకుప్పలను ఆశ్రయించే దుస్థితి వచ్చింది. అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయి. ఇలాంటి తరుణంలో రాజధానిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం లెబనియన్ల జీవితాలను మరింత గందరగోళంలోకి నెట్టాయి. కనీసం శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసే టెక్నాలజీ కూడా అందుబాటులో లేకపోవడంతో.. స్థానిక ప్రభుత్వం చిలీ, అమెరికా, ఫ్రాన్స్ నుంచి రక్షణ బృందాలను రప్పించగా నేటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హార్ట్‌బీట్ వినిపించింది.. ఈ క్రమంలో శిథిలమైన ఓ భవనం వద్ద మానవ హృదయ స్పందనను(హార్ట్‌బీట్) పోలిన శబ్దాలను హైటెక్ సెన్సార్లు గుర్తించడంతో రక్షణ బృందాలు అక్కడ గాలింపు ముమ్మరం చేయగా వారికి నిరాశే మిగిలింది. అక్కడ మనిషి ఆనవాలు కనిపించలేదని చిలీ రెస్క్యూ స్పెషలిస్టు ఫ్రాన్సిస్కో లెర్మాండా శనివారం మీడియాకు వెల్లడించారు. ‘‘ఆ భవనం కింద మనిషి బతికి ఉన్నాడనడానికి ఎలాంటి ఆనవాలు లభించలేదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. అక్కడ ఎవరూ సజీవంగా లేరు’’అని విచారం వ్యక్తం చేశారు. ఇక పోర్టు సమీపంలో ఓ జాగిలం సెంట్ వాసన పసిగట్టి పరుగులు తీయడంతో.. ఇద్దరు మహిళా వర్కర్లు అక్కడ గల టన్నెల్ చివరి వరకు వెళ్లి మృతుల జాడ కోసం వెదకగా.. ఎవరూ కనిపించలేదు. అయినప్పటికీ.. ‘‘పాక్షికంగా ధ్వంసమైన భవనాలు కూలిపోతాయనే భయం వెంటాడినా సరే అణువణువూ గాలిస్తాం. బాధితులను వెలికితీసేందుకు మా వంతు ప్రయత్నం కొనసాగిస్తాం’’అని సివిల్ డిఫెన్స్ అధికారి ఖాసీం ఖటార్ వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు అన్నిచోట్లా శిథిలాలను తొలగించే ప్రక్రియ పూర్తై పోవచ్చిందని తెలిపారు. అద్భుతం జరిగితే తప్ప.. అయితే లెబనీస్ అధికారులు మాత్రం.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ ఘోర ప్రమాదం నుంచి తేరుకుని బతికే ఛాన్స్ ఉండదని అభిప్రాయపడ్డారు. తాజా పరిణామాల నేపథ్యంలో స్థానిక ఫిల్మ్ మేకర్ సలీం మురాద్ మాట్లాడుతూ.. ‘‘అద్భుతం జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ ప్లీజ్ దేవుడా.. బీరూట్ మిరాకిల్‌కు వేదిక కాగల ఆశీర్వాదాలు అందించూ’’అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక మృతులను వెలికితీసేందుకు ప్రాణాలు పణంగా పెట్టి శ్రమిస్తున్న చిలీ రక్షణ బృందాలపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిని నిజమైన హీరోలుగా వర్ణిస్తూ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు చెబుతున్నారు. బీరూట్ పేలుళ్ల ఘటనకు నెల రోజులు పూర్తైన సందర్భంగా మృతులకు నివాళిగా శుక్రవారం దేశ ప్రజలంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. కాగా ఈ ఘోర విషాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని హసన్ దియాబ్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
బీరుట్ ప్రమాదం: విస్మయకర విషయాలు వెల్లడి
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్లో పేలుడు ఘటనకు సంబంధించి విస్మయకర విషయాలు బయటికొస్తున్నాయి. ప్రభుత్వాన్ని నెల క్రితమే హెచ్చరించినా చర్యలు చేపట్టకపోవడంతోనే ఇంతటి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పోర్టులో ఉన్న 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వల వల్ల రాజధాని బీరుట్కు ప్రమాదం పొంచి ఉందని సెక్యురిటీ వర్గాలు నెల క్రితమే హెచ్చరించినట్టు ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. సెక్యురిటీ వర్గాల హెచ్చరికలకు సంబంధించిన పత్రాలను సదరు వార్తా సంస్థ, కొందరు సీనియర్ భద్రతా అధికారులు పరిశీలించారని పేర్కొంది. బీరుట్ పేలుడు ఘటన అనంతరం నేషనల్ సెక్యురిటీ జనరల్ ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2013 నుంచి గోడౌన్లలో ఉన్న అమ్మోనియం నైట్రేట్‌తో బీరుట్కు పెను ప్రమాదం పొంచి ఉందని అధ్యక్షుడు మిచల్ అవున్, ప్రధాని హసన్ డియాబ్‌కు జులై 20న లేఖ రాసిన విషయాన్ని నేషనల్ సెక్యురిటీ జనరల్ తాజా రిపోర్టులో ప్రస్తావించారు. (చదవండి: ‘హైదరాబాద్ చేరుకున్న అమ్మోనియం నైట్రేట్’) భారీ స్థాయిలో ఉన్న అమ్మోనియం నిల్వలను సంరక్షించాలని జనవరిలో జ్యుడియల్ కమిటీ కూడా చెప్పిందని ఆయన రిపోర్టులో గుర్తు చేశారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వలు తీవ్రవాదులు దొంగిలించి మారణహోమం సృష్టించే అవకాశం ఉందని, లేదంటే పేలుడు గనుక జరిగితే బీరుట్ సర్వనాశనం అవుతుందని ఆ లేఖలో నేషనల్ సెక్యురిటీ జనరల్ హెచ్చరించారు. దురదృష్టవశాత్తూ ఆయన హెచ్చరించిన రెండు వారాల అనంతరం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 163 మంది ప్రాణాలు కోల్పోగా 6 వేల మందికి పైగా గాయపడ్డారు. సుమారు 6 వేల భవనాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇదిలాఉండగా.. పేలుడు ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని హసన్ దియాబ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. (చదవండి: నిరసనలు: లెబనాన్ ప్రధాని రాజీనామా) -
చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్ బంక్
మాస్కో: కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఆగస్టు నెలలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా రష్యాలోని ఓ పెట్రోల్ బంక్‌లో భారీ పేలుడు సంభవించింది.. సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వోల్గోగ్రాడ్ పెట్రోల్ స్టేషన్లో మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళం అక్కడకు చేరుకుంది. మంటల ధాటికి అంతలోనే భారీ పేలుడు చోటుచేసుకోవడంతో పెట్రోల్ బంక్ నామరూపాల్లేకుండా పోయింది. పెట్రోల్ స్టేషన్‌కు సంబంధించిన పైప్లైన్లు కూడా పేలి పోవడంతో సుమారు 200 మీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక లెబనాన్ రాజధాని బీరుట్లో జరిగిన భారీ పేలుడు ఘటనతో 160 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. (నిరసనలు: లెబనాన్ ప్రధాని రాజీనామా) -
నిరసనలు: లెబనాన్ ప్రధాని రాజీనామా
బీరుట్: లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు వారం క్రితం బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. దాంతో రాజీనామా చేయాలని ప్రధాని హసన్ నిర్ణయించుకున్నారు. ‘ఇక్కడ ప్రభుత్వం కన్నా అవినీతి శక్తిమంతమైందని తేలింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై ప్రజలతో కలిసి మార్పుకోసం పోరాడుతానన్నారు. ఈ రోజు నా ప్రభుత్వం రాజీనామా చేస్తోంది. లెబనాన్‌ను దేవుడే రక్షించు గాక’ అని టీవీలో తన సంక్షిప్త ప్రసంగాన్ని ముగించారు. (చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్ బంక్) -
మానవ తప్పిదమే; బీరూట్ పోర్టు డైరెక్టర్ అరెస్ట్
బీరూట్: లబనాన్ రాజధాని బీరూట్‌లో పేలుడు ఘటనకు బాధ్యుడిగా బీరూట్ పోర్టు డైరెక్టర్‌ను లెబనాన్ మిలటరీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జరిగిన పేలుడు ఘటనలో 135 మంది ప్రాణాలు విడువగా దాదాపు 5 వేల మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. అటార్నీ జనరల్ ఫాదీ అకీకీ నేతృత్వంలో పోలీసులు పోర్టు డైరెక్టర్ హస్సాన్ కోరేటమ్‌ని అదుపులోకి తీసుకున్నారని ఆ దేశ మీడియా ఎన్ఎన్ఏ తెలిపింది. హస్సాన్ కోరేటమ్‌తో పాటు మరో 16 మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టు వెల్లడించింది. వీరంతా పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచిన గోడౌన్ 12 వద్ద విధుల్లో ఉన్నారని పేర్కొంది. పేలుడుకు కారణమైన అమ్మోనియం నైట్రేట్ నిల్వల్లో గోడౌన్ 12 సిబ్బంది నిర్లక్షాన్యికి సంబంధించిన ఫొటోలు బయటికొచ్చాయని ఎన్ఎన్ఏ మీడియా తెలిపింది. పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పింది. (చదవండి: చెన్నైలో 700 టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలు) కాగా, మానవ తప్పిదం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు లెబనాన్ దేశాధ్యక్షుడు మిచెల్ అవున్ స్పష్టం చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు వెల్లడించారు. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వలు రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఇగోర్ గ్రెచుష్కిన్‌విగా తేలిందని, దర్యాప్తు బృందం అతన్ని ప్రశ్నించే అవకాశం ఎన్ఎన్ఏ మీడియా సంస్థ వెల్లడించింది. 1975 నుంచి 1990ల మధ్య జరిగిన సివిల్ వార్‌ను సైతం తట్టుకున్న భవనాలు, తాజా పేలుడు ధాటిని మాత్రం తట్టుకోలేక చరిత్రలో కనుమరుగయ్యేలా నేలకూలాయని లెబనాన్ వాసులు వాపోతున్నారు. దర్యాప్తులతో ఒరిగేదేమీ ఉండదని, పేలుడు పదార్థాలు పోర్టులోకి రాకుండే అడ్డుకుంటే చాలని అంటున్నారు. (కొడుకును రక్షించుకునేందుకు తండ్రి ఆరాటం) -
బీరూట్ పేలుళ్లు : 30 గంటలు సముద్రంలోనే..
బీరూట్ : లెబనాన్ రాజధాని బీరూట్ నగరంలో మంగళవారం సంభవించిన శక్తివంతమైన పేలుడు జరిగిన 30 గంటల తర్వాత సముద్రంలో ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడు అయ్యాడు పోర్టులో పని చేసే కార్మికుడు. భారీ పేలుళ్ల అనంతరం మిస్సయిన వారి జాడ తెలుసుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో క్రియేట్ చేసిన అకౌంట్లో రక్తపు మడుగులో ఉన్న అమిన్ అల్ జహెద్ ఫోటో కనిపించింది. భారీ పేలుళ్ల అనంతరం తీవ్రగాయాలైన అమిన్ అల్ జహెద్ మధ్యధరా సముద్రంలో పడిపోయినట్టు తెలుస్తోంది. రెస్క్యూ సిబ్బంది అమిన్ని కాపాడిన అనంతరం పడవపై పడుకోబెట్టిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తీవ్రగాయాలతో ఉన్న అతన్ని రఫిక్ హరీరీ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, సముద్రంలో 30 గంటలపాటూ ఎలా బతుకుపోరాటం చేశాడనే సమాచారం తెలియాల్సి ఉంది. బీరూట్‌లో సంభవించిన భారీ పేలుళ్లలో 137 మంది మృతిచెందగా, 5,000 మందికి పైగా గాయపడ్డారు. (2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ వల్లే..) 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్ మంత్రి మొహమ్మద్ ఫహ్మీ చెప్పారు. బీరూట్ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేసినట్లు తెలిసింది. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ముదురు నారింజ రంగు మేఘం పుట్టుగొడుగు ఆకారంలో ఆకాశంలోకి ఎగిరిపోతున్న దృశ్యం కనిపించింది. విషపూరితమైన నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. -
2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ వల్లే..
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో మంగళవారం సంభవించిన శక్తివంతమైన పేలుడులో మృతుల సంఖ్య 135కు చేరిందని, 5,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని లెబనీస్ రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి జార్జి కెటానెహ్ చెప్పారు. నగరంలో ఇటీవలి కాలంలో ఇదే అతి పెద్ద పేలుడని భావిస్తున్నారు. బుధవారం నగరంలో బీతావహ దృశ్యాలు కనిపించాయి. పోర్ట్ నుంచి ఇప్పటికీ పొగ వెలువడుతోంది. పరిసర ప్రాంతాలు బూడిద, వ్యర్థాలతో నిండిపోయాయి. పెద్దసంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాలు నేలమట్టమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. చిన్న మంటగా మొదలైన ఈ విస్ఫోటనం క్షణాల్లోనే భీకర రూపం దాల్చింది. ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. 1975–1990 మధ్య జరిగిన సివిల్ వార్‌లో, పొరుగు దేశం ఇజ్రాయెల్‌తో జరిగిన ఘర్షణల్లో, ఉగ్రవాద దాడుల్లో ఇలాంటి పేలుళ్లు కనిపించాయని స్థానికులు అంటున్నారు. ప్రాణాలు తీసిన అమ్మోనియం నైట్రేట్ 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్ మంత్రి మొహమ్మద్ ఫహ్మీ చెప్పారు. బీరుట్ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేసినట్లు తెలిసింది. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ముదురు నారింజ రంగు మేఘం పుట్టుగొడుగు ఆకారంలో ఆకాశంలోకి ఎగిరిపోతున్న దృశ్యం కనిపించింది. విషపూరితమైన నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. ఆహార సంక్షోభం తప్పదా? చాలా చిన్న దేశమైన లెబనాన్‌లో ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలింది. సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ప్రజల్లో అసంతృప్తిజ్వాలలు రగులుతున్నాయి. వారు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి లెబనాన్‌పై పంజా విసురుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేలుడు సంభవించి, 135 మంది అమాయక జనం చనిపోవడం పాలకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లెబనాన్ 10 లక్షల మందికి పైగా సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. విదేశాల నుంచి నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల దిగుమతికి బీరూట్ పోర్ట్ అత్యంత కీలకం. తాజా పేలుడు వల్ల ఈ ఓడరేవు చాలావరకు నామరూపాల్లేకుండా పోయింది. దిగుమతులన్నీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఇకపై ఆహార సంక్షోభం తప్పదని వాదన వినిపిస్తోంది. భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి లెబనాన్‌లో పేలుడు సంభవించి, 135 మంది మరణించడం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మిన్నంటిన ఆక్రందనలు కూలిన భవనాలు, రేగుతున్న పొగలు, గల్లంతైన కుటుంబ సభ్యులు.. ఇదీ ప్రస్తుతం బీరుట్ లో పరిస్థితి. ఓ వైపు అంబులెన్స్ సైరన్లు మోగుతుంటే మరోవైపు బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. దారుణమైన ఈ పేలుడు నగరాన్ని ఛిద్రం చేసేసింది. రంగు రంగుల అద్దాలతో, అందమైన రాళ్ల నిర్మాణాలతో ఉన్న ప్రాంతమంతా మరుభూమిగా మారింది. తరాల పాటు నిర్మించిన భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. 1975 నుంచి 1990ల మధ్య జరిగిన సివిల్ వార్‌ను సైతం తట్టుకున్న భవనాలు, పేలుడు ధాటిని మాత్రం తట్టుకోలేక చరిత్రలో కనుమరుగయ్యేలా నేలకూలాయి. ఇంటి బాల్కనీలు రోడ్డు నడిమధ్యకు వచ్చి పడ్డాయి. రెస్టారెంట్లు, షాపుల్లోని కుర్చీలు ఎవరినీ రానివ్వద్దన్నట్టు తలకిందులుగా పడిపోయాయి. నేనెక్కడికెళ్లాలి ? నేనేం చేయాలి అంటూ కుప్పకూలిన ఓ ఇంటి ఎదుట యజమానురాలు బాధను వ్యక్తం చేస్తూ కనిపించింది. పసి పిల్లలు పేలుడు ధాటికి ఆస్పత్రుల పాలయ్యారు. ఇంతకు మించి వినాశనమంటూ ఉంటుందా అనే స్థాయిలో నగరం దిబ్బగా మారింది. ప్రస్తుతానికైతే కుయ్ మంటూ తిరిగే అంబులెన్సులు, రాళ్లెత్తి మరీ మనుషుల కోసం వెతుకుతున్న వాలంటీర్ల శ్రమ, అయినవారిని కోల్పోయి రోదిస్తున్న బాధితుల ఆక్రందనలు మాత్రమే కనిపిస్తున్నాయి. లెబనాన్‌కు వెల్లువెత్తుతున్న సాయం లెబనాన్‌కి అంతర్జాతీయ సమాజం నుంచి సహాయం వెల్లువెత్తుతోంది. లెబనాన్‌లో సంభవించిన పేలుడు అనంతరం క్షతగాత్రులను ఆదుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ విమానాల ద్వారా అవసరమైన మందులను పరికరాలను పంపిస్తున్నట్లు వెల్లడించింది. మందులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్‌లోని మానవతా సహాయ కేంద్రం నుంచి క్షతగాత్రులకు చేరవేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి తారిక్ జెసా రెవిక్ చెప్పారు. ఓడరేవు కేంద్రంగా జరిగిన భారీ పేలుడు ప్రభావంతో అనేక భవనాలు శిథిలమయ్యాయి. బీరుట్లో బీభత్సం సృష్టించిన ఈ పేలుడు ప్రభావంతో ప్రజా జీవనం ఛిన్నాభిన్నమైంది. యూరోపియన్ సమాజం, రష్యా, నార్వే, టర్కీ, నెదర్లాండ్స్, సైప్రస్, గ్రీక్, ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు ఇప్పటికే మందులు, వాహనాలు, హెలికాప్టర్లు, అంబులెన్సులు, వైద్య బృందాలు, రెస్క్యూ టీమ్‌లను తరలించడం ప్రారంభించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ లెబనాన్‌ను సందర్శించారు. దేశాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో అనేక విదేశీ రాయబార కార్యాలయాలు సైతం దెబ్బతిన్నాయి. కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి ప్రపంచ దేశాలకు లెబనాన్ ప్రధాని వేడుకోలు ఆర్థిక సంక్షోభంతోపాటు బీరుట్లో పేలుడు వల్ల తాము కష్టాల్లో కూరుకుపోయామని, ప్రపంచ దేశాలు, మిత్ర దేశాలు వెంటనే స్పందించి, ఆదుకోవాలని లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దియాబ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రసంగం విడుదల చేశారు. పేలుడుకు పాల్పడి, అమాయకుల ప్రాణాలను బలిగొన్న వారు ఎప్పటికైనా మూల్యం చెల్లించకోక తప్పదని పేర్కొన్నారు. పేలుడులో గాయపడిన మహిళకు చికిత్స అందిస్తున్న ఆరోగ్య కార్యకర్త పేలుడులో గాయపడిన చిన్నారి పేలుడు వల్ల ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది -
బీరూట్ పేలుళ్లు : 100కు పెరిగిన మృతుల సంఖ్య
బీరూట్ : లెబనాన్ రాజధాని బీరూట్‌ను వణికించిన భారీ పేలుళ్లలో మృతుల సంఖ్య 100కు చేరింది. ఈ ఘటనలో నాలుగువేల మందికి పైగా గాయపడ్డారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో జనం వణికిపోయారు. భయంతో ప్రజలు వీధుల వెంట పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఎరువులు, బాంబుల తయారీలో ఉపయోగించే 2750 టన్నుల అల్యూమినియం నైట్రేట్‌ను ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా ఆరేళ్లుగా పోర్టు ప్రాంతంలో నిల్వచేశారని అధ్యక్షుడు మేఖేల్ ఔన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్ర నిర్లక్ష్యమని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. బాధ్యులపై చర్యలు పేలుళ్లకు బాధ్యులను విడిచిపెట్టబోమని, వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని ప్రధానమంత్రి హసన్ దియాబ్ హెచ్చరించారు. కాగా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తుల్లో వెల్లడైందని అధికార వర్గాలు తెలిపాయి. పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచిన వేర్‌హస్‌లో వెల్డింగ్ పనులు చేపట్టడంతోనే పేలుళ్లు ప్రారంభమయ్యాయని భద్రతాధికారులతో పాటు మీడియా పేర్కొంది. మరోవైపు దశాబ్ధాల తరబడి సాగిన అవినీతి, పాలనా వైఫల్యాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని లెబనాన్ ప్రజలు రాజకీయపార్టీలపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీరూట్ పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించిన మేయర్ జమాల్ ఇతాని ఈ ప్రాంతం వార్ జోన్‌ను తలపిస్తోందని..తనకు మాటలు రావడం లేదని అన్నారు.పేలుళ్ల బీభత్సంతో కోట్లాది డాలర్ల నష్టం వాటిల్లిందని బీరూట్, లెబనాన్‌లకు ఇది కోలుకోలేని దెబ్బని వ్యాఖ్యానించారు. ఇక ఈ ఘటనలో వంద మంది మరణించారని, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లెబనాన్ రెడ్‌క్రాస్ హెడ్ జార్జ్ కెట్టాని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ పేలుళ్లలో మృతుల్లో అత్యధికులు పోర్ట్, కస్టమ్స్ ఉద్యోగులే ఉన్నారు.సెంట్రల్ బీరూట్‌లో భవనాలు దెబ్బతినగా, ఫర్నీచర్ వీధుల్లో పడిపోయింది. వీధులన్నీ గ్లాసు ముక్కలు శిధిలాలతో నిండాయి. పోర్టుకు సమీపంలోని కార్లు పల్టీలు కొట్టాయని స్ధానికులు పేలుళ్ల బీభత్సాన్ని గుర్తుచేసుకున్నారు. తాము ఇప్పుడు విపత్తు ప్రాంతంలో ఉన్నామని, పేలుళ్ల ధాటికి తన భవనం కదిలిందని డౌన్‌టౌన్ ప్రాంతానికి చెందిన బిలాల్ (60) చెప్పుకొచ్చారు. పేలుళ్ల ప్రభావం చూసి తాను భూకంపం అనుకున్నానని ఆయన పేర్కొన్నారు. చదవండి : బీరూట్ పేలుళ్లు: వైరల్ వీడియోలు -
ఇంతటి విధ్వంసం ఎన్నడూ చూడలేదు: గవర్నర్
బీరూట్: తన జీవితకాలంలో ఇంతటి విధ్వంసాన్ని ముందెన్నడూ చూడలేదని బీరూట్ గవర్నర్ మార్వాన్ అబౌడ్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. పోర్టు ఏరియాలో పేలుళ్ల ఘటన తనకు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి ఉదంతాలను గుర్తు చేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఇదొక జాతీయ విపత్తు అని ఆవేదన చెందారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలేమిటో ఇంకా తెలియరాలేదన్నారు. ఘటనాస్థలిలో తొలుత మంటలు చెలరేగాయని, ఆ తర్వాత పేలుడు సంభవించినట్లు తెలిపారు. మంటలు ఆర్పేందుకు వెళ్లిన దాదాపు 10 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా కనబడకుండా పోయారని, వారి కోసం రక్షణ బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు.(‘సర్వనాశనం.. ఇంకేమీ మిగల్లేదు’) కాగా లెబనాన్ రాజధాని బీరూట్‌లో మంగళవారం భారీ పేలుళ్లు సంభవించిన విషయం విదితమే. పేలుడు పదార్థాలు నిల్వ చేసిన గోదాంలో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. పేలుళ్ల ధాటికి 70 మందికి పైగా మృత్యువాత పడగా.. సుమారు 4 వేల మంది గాయపడ్డారు. ఈ క్రమంలో లెబనీస్ ప్రధాని హసన్ డియాబ్ బుధవారాన్ని జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. ఇక పేలుళ్లు సంభవించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీరూట్‌లో సాయుధ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేయాలని అధ్యక్షుడు మైఖేల్ ఔన్ ఆదేశించారు. ఇక ఈ బీరూట్ ఉదంతంపై విచారం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పేలుళ్ల ఘటన భయంకరమైన దాడిలా కనిపిస్తోందంటూ సందేహం వ్యక్తం చేశారు.(బీరూట్ బీభత్సం : మహిళ సాహసం) Beirut governor is literally crying while talking about the explosions, who likens them to Nagasaki and Hiroshima attacks pic.twitter.com/YPHqd1Sq2d — Ragıp Soylu (@ragipsoylu) August 4, 2020 -
బీరూట్ విధ్వంసానికి అసలు కారణం ఇదేనా?
బీరూట్: లెబనాన్ రాజధాని బీరూట్‌లో మంగళవారం రాత్రి భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 70 మందికి పైగా చనిపోగా, నాలుగు వేలమందికి పైగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుళ్లకు ప్రధాన కారణం అమ్మోనియం నైట్రేట్ అని అధికారులు చెబుతున్నారు. అమ్మోనియం నైట్రేట్, వాసన లేని స్ఫటికాకార పదార్ధం. ఇది సాధారణంగా ఎరువుగా ఉపయోగిస్తారు. ఇప్పుడే కాకుండా పలు దశాబ్దాలుగా అనేక పారిశ్రామిక పేలుళ్లకు కారణమయింది. అమ్మోనియం నైట్రేట్ కారణంగా 2013లో టెక్సాస్ ఎరువుల కర్మాగారంలో 15 మంది మృతి చెందారు. 2001లో ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌లోని ఒక రసాయన కర్మాగారంలో 31 మంది మృతి చెందారు. అమ్మోనియం నైట్రేట్ అంత ప్రమాదకారి ఎందుకు? ఇంధన నూనెలతో కలిపినప్పుడు, అమ్మోనియం నైట్రేట్ శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని సృష్టిస్తుంది. అందుకే పేలుడు పదార్థాల కోసం తాలిబాన్ వంటి గ్రూపులు కూడా అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగిస్తాయి. వ్యవసాయంలో, అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించినప్పుడు తేమ కారణంగా త్వరగా కరిగిపోతుంది. అదేవిధంగా మొక్కల పెరుగుదలకు కీలకమైన నత్రజని మట్టిలో కలవడానికి ఉపయోగపడుతుంది. అమ్మోనియం నైట్రేట్ కారణంగానే పేలుడు సంభవించిందని లెబనాన్ ప్రధాని తెలిపారు. సాధారణ నిల్వ పరిస్థితులలో అధిక వేడి లేకుండా, అమ్మోనియం నైట్రేట్ మండటం కష్టమని ఐలాండ్ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జిమ్మీ ఆక్స్లీ తెలిపారు. జిమ్మీ ఆక్స్లీ మాట్లాడుతూ.. ‘మీరు బీరూట్ పేలుడు వీడియోను చూస్తే దాంట్లో నల్లటి, ఎర్రటి పొగను చూడవచ్చు. అది ఒక అసంపూర్ణ ప్రతిచర్య. అక్కడ అమ్మోనియం నైట్రేట్ ప్రతిచర్యను ప్రేరేపించే ఒక చిన్న పేలుడు జరిగిందని నేను అనుకుంటున్నాను. ఆ చిన్న పేలుడు ప్రమాదమా లేదా కావాలనే చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఎందుకంటే అమ్మోనియం నైట్రేట్ ఒక ఆక్సిడైజర్ ఇది దహన చర్యను వేగవంతం చేస్తోంది. అదేవిధంగా ఇతర పదార్థాలను మరింత సులభంగా మండించటానికి అనుమతిస్తుంది. అంతేకానీ దాని అంతట అది ఎక్కువగా మండదు. ఈ కారణాల వల్ల, సాధారణంగా దీనిని ఎక్కడ నిల్వ చేయవచ్చనే దానిపై చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి. దీనిని ఇంధనాలు, వేడి వనరులు ఉన్న చోటుకు దూరంగా ఉంచాలి. చాలా యూరోపియన్ యూనియన్ దేశాలు అమ్మోనియం నైట్రేట్‌లో కాల్షియం కార్బోనేట్ కలిపి కాల్షియం అమ్మోనియం నైట్రేట్‌గా మార్చాలి అని నిబంధనలు విధిస్తున్నాయి. ఎందుకంటే అమ్మోనియం నైట్రేట్‌తో పోలిస్తే కాల్షియం అమ్మోనియం నైట్రేట్ చాలా సురక్షితం. యునైటెడ్ స్టేట్స్లో కూడా ఓక్లహోమా సిటీ దాడి తరువాత నిబంధనలు కఠినతరం చేయబడ్డాయి. కెమికల్ ఫెసిలిటీ యాంటీ టెర్రరిజం స్టాండర్డ్స్ కింద 900 కిలోగ్రాముల అమ్మోనియం నైట్రేట్ కంటే ఎక్కువ నిల్వ చేయాలంటే వాటి కోసం ప్రత్యేకమైన అనుమతులు అవసరం. దీని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ వ్యవసాయం, నిర్మాణ రంగంలో అమ్మోనియం నైట్రేట్ ఎంతో అవసరమ’ని ఆక్స్లీ చెప్పారు. ‘పేలుడు పదార్థాలు లేని ఈ ఆధునిక ప్రపంచం మనకు ఉండదు, అమ్మోనియం నైట్రేట్ ఎరువులు లేకుండా ఈ రోజు మన జనాభాకు ఆహారం ఇవ్వలేం. అందుకే దానిని ఉపయోగించేటప్పుడు ఎక్కువ శ్రద్ధ వహించాలి’ అని ఆయన వివరించారు. చదవండి: బీరూట్ భారీ పేలుళ్లు, 70మంది మృతి -
మహిళ సాహసం
-
బీరూట్ : పోర్టు ఏరియాలో భారీ పేలుళ్లు
-
బీరూట్ బీభత్సం : మహిళ సాహసం
బీరూట్ : లెబనాన్ రాజధాని బీరూట్ నెత్తురోడింది. మంగళవారం సంభవించిన భారీ పేలుళ్లు బీభత్సం సృష్టించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 78 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు నాలుగు వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. దీంతో బీరూట్ నగరమంతా ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శన మిస్తున్నాయి. ఈ పేలుడు ధాటికి సంబంధించిన శబ్దాలు 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ ద్వీపం వరకూ వివినిపించినట్టు తెలుస్తోంది. బీరూట్ నగరంలో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. పరిసరాల ప్రాంతాల భవనాల కిటికీల అద్దాలు పగిలి పోవడంతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక మహిళ తన యజమాని బిడ్డను కాపాడేందుకు చేసిన సాహసం విశేషంగా నిలిచింది. పేలుడు సమయంలో ఆ ఇంటి పనిమనిషి తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను కాపాడిన వీడియో చూస్తే.. ఒక్క క్షణం నిశ్చేష్టులవడం ఖాయం. [ చదవండి: బీరట్ విధ్వంసానికి అసలు కారణం ఇదేనా? ] ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది బాంబు దాడి కావచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఇది భయంకరమైన దాడిలా ఉందని ట్రంప్ వైట్ హౌస్ వద్ద విలేకరులతో అన్నారు. అయితే పోర్ట్‌సైడ్ గిడ్డంగిలో కొన్నేళ్లుగా నిల్వ ఉంచిన 2,750 టన్నుల వ్యవసాయ ఎరువు అమ్మోనియం నైట్రేట్ కారణంగా పేలుడు సంభవంచి ఉంటుందని ప్రధాని హసన్ డియాబ్ అన్నారు. ఇలా నిల్వ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదంటూ లెబనాన్ అధ్యక్షుడు మికెల్ ఒవాన్ ట్వీట్ చేశారు. అయితే పేలుడు ఎలా జరిగిందన్న విషయంపై విచారణ సాగుతోందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని లెబనాన్ సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇది భయంకరమైన దాడిలా ఉంది: ట్రంప్
వాషింగ్టన్: లెబనాన్ బీరూట్ పేలుళ్ల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో లెబనాన్‌కు అమెరికా తోడుగా ఉంటుందని, ఎలాంటి సాయం చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాగా బీరూట్‌లో మంగళవారం సంభవించిన భారీ పేలుళ్ల కారణంగా 70 మందికి పైగా మృతిచెందగా.. 4 వేల మందికి గాయపడినట్లు లెబనాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.(బీరూట్ భారీ పేలుళ్లు, 70మంది మృతి) ఈ విషయంపై స్పందించిన ట్రంప్.. డెబ్బై మందికి పైగా ప్రాణాలు బలిగొన్న ఈ ప్రమాదాన్ని‘భయంకరమైన దాడి’లా కనిపిస్తోందన్నారు ఇది పేలుడు పదార్థాల తయారీ వల్ల సంభవించలేదని, బాంబు దాడి అని భావిస్తున్నట్లు తెలిపారు. తన యంత్రాంగంలోని కొంతమంది అత్యుత్తమ జనరల్స్‌తో మాట్లాడానని, వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని విలేకరులతో పేర్కొన్నారు. కాగా గతంలో సీజ్ చేసిన ఓ పడవలోని పేలుడు పదార్థాలను పోర్టు ఏరియాలో నిల్వ చేయగా ప్రమాదం సంభవించినట్లు లెబనీస్ జనరల్ సెక్యూరిటీ చీఫ్ అబ్బాస్ ఇబ్రహీం స్వయంగా వెల్లడించిన తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇక ఈ విచారకర ఘటనపై అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ స్పందించారు. లెబనాన్ ప్రజల కోసం తాము ప్రార్థిస్తున్నామంటూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (బీరూట్ బీభత్సం : మహిళ సాహసం) ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బీరూట్ భారీ పేలుళ్లు
-
బీరూట్ భారీ పేలుళ్లు, 70మంది మృతి
బీరూట్: లెబనాన్ రాజధాని బీరూట్‌లో భారీ పేలుడు సంభవించింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ పేలుళ్లలో 70 మందికి పైగా చనిపోగా.. నాలుగు వేలమందికి పైగా గాయపడినట్లు ఆదేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో జనం వణికిపోయారు. వీధుల వెంట పరుగులు తీశారు. [ చదవండి: బీరట్ విధ్వంసానికి అసలు కారణం ఇదేనా? ] మొదటి పేలుడు సంభవించిన కాసేపటికే రెండో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా భూమి కంపించినంతగా ప్రమాద తీవ్రత ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ నేతల మృతి
కొలంబో : శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటన తర్వాత కర్ణాటకలోని జేడీఎస్ పార్టీకి చెందిన ఏడుగురు నేతలు అదృశ్యమయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందినట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. వారిని కేజీ హనుమంతరాయప్ప, ఎం. రంగప్పగా గుర్తించారు. వీరంతా ఎన్నికల ప్రచారం అనంతరం ఈ నెల 20న శ్రీలంకకు వెళ్లారు. కొలొంబోలోని ‘ద షాంగ్రిలా హోటల్’లో రెండు గదుల్లో బస చేసినట్లు సమాచారం. అదే చోట బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. అదృశ్యమైన వారిలో శివన్న, పుట్టరాజు, మునియప్ప, లక్ష్మీనారాయణ, మారేగౌడ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చదవండి : దివ్య సందేశంపై రాక్షస కృత్యం! కాగా జేడీఎస్ నేతల మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ నేతల గల్లంతు తనను షాక్ గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. గల్లంతైన నేతల ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతిచెందిన సంఖ్య 290కి చేరింది. 500మందికి పైగా గాయపడ్డారు. External affairs Min. @SushmaSwaraj has confirmed the death of two Kannadigas,KG Hanumantharayappa and M Rangappa, in the bomb blasts in #Colombo. I am deeply shocked at the loss of our JDS party workers, whom I know personally. We stand with their families in this hour of grief — H D Kumaraswamy (@hd_kumaraswamy) 22 April 2019 -
శ్రీలంకలో 13.8 కోట్ల మంది చనిపోయారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పులో కాలేశారు. ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం శ్రీలంకలో చోటుచేసుకున్న మారణకాండలో ఏకంగా 138 మిలియన్ల మంది(13.80 కోట్లు) చనిపోయారని, 600కుపైగా జనం గాయపడ్డారని ట్వీట్ చేశారు. అమెరికా ప్రజల తరపున శ్రీలంక ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తున్నానన్నారు. మృతులకు సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో లంక పౌరులకు అండగా నిలిచేందుకు, ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీలంకలో 13.80 కోట్ల మంది మృతి చెందారంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ను సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తీవ్రంగా తప్పుపట్టారు. అన్నింటినీ మిలియన్లలో లెక్కించలేమని, సానుభూతి సందేశంపై కూడా శ్రద్ధ చూపకపోతే అది నిజమైన సానుభూతి ఎలా అవుతుందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘‘మా దేశ జనాభా 2.17 కోట్లే, అలాంటప్పుడు 13.80 కోట్ల మంది మరణించడం అసాధ్యం, మీ సానుభూతి మాకేం అక్కర్లేదు’’అని శ్రీలంకకు చెందిన ఓ నెటిజన్ సోషల్ మీడియాలో తిప్పికొట్టారు. ట్రంప్ లెక్క ప్రకారం ఇప్పుడు మా దేశం ప్రజలెవరూ లేకుండా ఖాళీగా మారింది అని మరో నెటిజన్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ గతంలోనూ పలుమార్లు తప్పుడు ట్వీట్లు చేసి నవ్వుల పాలయ్యారు. -
లంక పర్యాటకంపై పెద్ద దెబ్బే
కొలంబో: పర్యాటకానికి మారుపేరు శ్రీలంక. ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన శ్రీలంకను ప్రతిఏటా లక్షలాది మంది విదేశీయులు సందర్శిస్తుంటారు. వీరిలో భారతీయులే అధికంగా ఉంటారు. తాజాగా జరిగిన ఉగ్రవాద దాడులు పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉందని ఇక్కడి టూర్లు ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంకలో త్వరలో వేసవి సెలవులు ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో విదేశీయులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని శ్రీలంక అధికారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే ఈ దాడులు జరగడం దురదృష్టకరమని అంటున్నారు. ఉగ్రవాద దాడులు తమ దేశంలో పర్యాటక రంగంపై పెద్ద దెబ్బేనని, పర్యాటక ఆదాయం తగ్గుముఖం పట్టవచ్చని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. నేరుగా హోటళ్లపైనే దాడులు జరగడం దేశంలో ఇదే తొలిసారి అని లంక టూర్ ఆపరేటర్ల సంఘం హరిత్ పెరేరా చెప్పారు. 30 ఏళ్ల ఎల్టీటీఈ యుద్ధంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. తాజాగా జరిగిన దాడులతో విదేశీ యాత్రికులకు తప్పుడు సందేశం పంపినట్లయిందని అభిప్రాయపడ్డారు. పదేళ్ల కిందటి దాకా శ్రీలంక పర్యాటక రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఎల్టీటీఈ ఉద్యమంలో లక్ష మంది చనిపోయారు. ఎల్టీటీఈ పతనం అనంతరం లంకలో పర్యాటక రంగం అనూహ్యంగా పుంజుకుంది. ఆసియాలోనే అగ్రశ్రేణని పర్యాటక దేశంగా అవతరించింది. భారతీయులను ఆకర్షించడానికి లంక ప్రభుత్వం రామాయణ సర్క్యూట్‌ను అభివృద్ధి చేసింది. -
మేమున్నాం.. ఆందోళన వద్దు
న్యూఢిల్లీ: శ్రీలంకలో జరిగిన వరుస బాంబుపేలుళ్లపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. శ్రీలంక రాష్ట్రపతి మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘేలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ‘అత్యంత క్రూరమైన, అనాగరిక చర్య’గా అభివర్ణించారు. ఈ షాక్‌నుంచి కోలుకోవడంతోపాటు, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు శ్రీలంకకు అవసరమైన సాయం అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు. విశ్వ మానవాళికి ఉగ్రవాదం పెనుసవాలుగా మారిందనడానికి శ్రీలంకలో వరుసపేలుళ్లు మరో ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ‘సీమాంతర ఉగ్రవాదంతోపాటు, ఇలాంటి ఉన్మాదపు దాడులకు పాల్పడుతున్న వారిని అణచివేసేందుకు అంతర్జాతీయ సమాజమంతా ఏకమవ్వాలి. దీన్ని సమర్థించుకునే ఏ చర్యనూ సహించకూడదు’అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆదివారం శ్రీలంకలో జరిగిన ఎనిమిది వరుస ఆత్మాహుతిదాడుల్లో 200 మందికి పైగా చనిపోగా.. 500 మందికి పైగా గాయలయ్యాయి. ‘మృతుల కుటుంబాలకు, శ్రీలంక ప్రభుత్వానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇలాంటి దారుణమైన దాడులకు పాల్పడిన వారెంతవారైనా కఠినంగా శిక్షించాల్సిందే’అని విదేశాంగశాఖ ప్రకటన పేర్కొంది. ‘కొలంబోలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉన్నాను. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం’అని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీటర్లో పేర్కొన్నారు. ఖండించిన దేశాధినేతలు లండన్/కొలంబో/ముంబై: శ్రీలంకలో ఉగ్రదాడులను ప్రపంచ వ్యాప్తంగా నేతలు ఖండించారు. అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ తదితర దేశాధినేతలతోపాటు పలువురు హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. శ్రీలంక ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి సాక్షి, హైదరాబాద్: శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చర్యను అత్యంత హేయమైందిగా వర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేటీఆర్ దిగ్భ్రాంతి శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లలో జరిగిన వరుస బాంబు పేలుళ్లపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్రదినం రోజున అనాగరిక, క్రూరచర్యతో విలువైన ప్రాణాలను తీశారని అన్నారు. బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదివారం ట్విటర్లో ప్రగాఢ సానుభూతి తెలిపారు. మానవత్వానికే మచ్చ సాక్షి, అమరావతి: శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీలంక మారణ హోమం మానవత్వానికే మాయనిమచ్చని, ప్రాణం పోసే శక్తి లేనివారికి ప్రాణం తీసే హక్కులేదని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కిరాతక చర్య: జగన్ సాక్షి, అమరావతి: శ్రీలంకలోని కొలంబోలో జరిగిన మారణహోమాన్ని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ కిరాతక చర్యలకు బలైన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. నాగరిక సమాజంలో ఇలాంటి విచక్షణారహితమైన హింసకు తావే లేదని జగన్ అభిప్రాయపడ్డారు. అమాయకులను బలిగొన్న ఈ దుశ్చర్యను ఆయన తీవ్రంగా ఖండింస్తూ ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. -
లంకలో వెల్లువెత్తిన రక్తదాతలు
కొలంబో: శ్రీలంకలో ఉగ్రవాదుల దుశ్చర్య వల్ల వందలాది మంది క్షతగాత్రులుగా మారారు. బాంబు దాడుల్లో గాయపడిన వారిలో చాలామందిని కొలంబో నేషనల్ హాస్పిటల్, బట్టికలోవా ఆసుపత్రులకు తరలించారు. ఆయా ఆసుపత్రుల్లో రక్తం నిల్వలు సరిపడా లేకపోవడంతో, బాధితులను రక్షించేందుకు వెంటనే రక్తదానం చేయాలంటూ శ్రీలంక నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సర్వీస్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. దీనికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. రక్తదాన కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. తమ రక్తం ఇచ్చేందుకు పోటీ పడ్డారు. అంతేకాకుండా బాధితులకు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావాలంటూ తమ మిత్రులకు కూడా సమాచారం చేరవేశారు. ఫలానా గ్రూప్ రక్తం అత్యవసరంగా కావాలని పేర్కొంటూ చాలామంది ట్విట్టర్లో ట్వీట్లు చేశారు. రక్తంఇచ్చేందుకు వచ్చిన వారి ఫొటోలను షేర్ చేశారు. రాజధాని కొలంబోలోని నేషనల్ బ్లడ్ బ్యాంకు రక్తదాతలతో కిక్కిరిసిపోయింది. సమీపంలోని ఆసుపత్రులు, రక్తదాన కేంద్రాల్లో రక్తదానం చేయాలంటూ ముస్లింలకు ముస్లిం కౌన్సిల్ ఆఫ్ శ్రీలంక పిలుపునిచ్చింది. ఉగ్రదాడులను కొలంబో ఆర్చిబిషప్ మాల్కోమ్ కార్డినల్ రంజిత్ తీవ్రంగా ఖండించారు. రక్తదానం చేసి, క్షతగాత్రులకు అండగా నిలవాలని ప్రజలకు సూచించారు. క్యాన్సిలేషన్ చార్జీలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా న్యూఢిల్లీ: ఉగ్రవాద దాడుల నేపథ్యంలో శ్రీలంక రాజధాని కొలంబో నుంచి భారత్‌కు ఈ నెల 24వ తేదీ వరకూ రాకపోకలు సాగించే తమ విమానాల్లో టికెట్ల క్యాన్సిలేషన్ చార్జీలను ఎయిర్ ఇండియా యాజమాన్యం రద్దు చేసింది. అలాగే రీషెడ్యూలింగ్ చార్జీలను సైతం వసూలు చేయబోమని ట్విట్టర్లో ప్రకటించింది. ఎయిర్ ఇండియా నిత్యం ఢిల్లీ నుంచి రెండు, చెన్నై నుంచి ఒక విమానాన్ని కొలంబోకు నడుపుతోంది. -
క్షేమంగా తిరిగి వచ్చిన జగిత్యాలవాసులు
కోరుట్ల/మెట్పల్లి: శ్రీలంకలోని కొలంబోలో ఆదివారం జరిగిన ఉగ్రదాడి నుంచి జగిత్యాల జిల్లాకు చెందిన మెట్పల్లి, కోరుట్ల పట్టణాలకు చెందిన పలువురు త్రుటిలో తప్పించుకుని క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. మెట్‌పల్లికి చెందిన ఏలేటి నరేందర్‌రెడ్డి, అల్లాడి శ్రీనివాస్, కోరుట్లకు చెందిన బాశెట్టి కిషన్ దంపతులు సహా మొత్తం 14 మంది వారం క్రితం శ్రీలంక పర్యటనకు వెళ్లారు. అక్కడ వివిధ ప్రాంతాలను సందర్శించిన అనంతరం వారు ఈనెల 19న కొలంబో నగరానికి చేరుకుని నార్లేమెరీన్ అనే హోటల్లో బసచేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకు వీరంతా స్వదేశానికి బయలుదేరగా, 8 గంటల ప్రాంతంలో వారు బస చేసిన హోటల్ పక్కన ఉన్న మరో హోటల్లో ఉగ్రదాడి జరిగింది. దాడి జరగడానికి గంట ముందు అక్కడి నుంచి బయలుదేరి క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. సాయంత్రం ఇక్కడికి చేరుకున్న తర్వాత దాడి విషయం తెలుసుకున్న వారు ఉద్వేగానికి లోనయ్యారు. పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్న శ్రీలంకలో ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలను బలి తీసుతీకోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అనంత’వాసులకు గాయాలు సాక్షి ప్రతినిధి, అనంతపురం: శ్రీలంకలో బాంబుపేలుళ్ల ఘటనలో అనంతపురం వాసులు ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టీడీపీ నేత, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ యజమాని అమిలినేని సురేంద్రబాబు, ఆయన స్నేహితుడు భక్తవత్సలం గాయపడగా, సురేంద్ర మరో స్నేహితుడు రాజగోపాల్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వీరు ముగ్గురూ వ్యక్తిగత పనిమీద కొలంబో వెళ్లి షాంగ్రీ లా హోట్‌లో బసచేశారు. హోటల్లోని రెస్టారెంట్లో అల్పాహారం తింటుండగా ఒక్కసారిగా పెద్దపేలుడుతో రెస్టారెంట్ అద్దాలు ధ్వంసమై సురేంద్ర ముఖంపై పడడంతో స్వల్పగాయాలయ్యాయి. అలాగే భక్తవత్సలం కాలికి గాయాలయ్యాయి. వీరిని హోటల్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం వీరు ముగ్గురూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందించారు. -
అల్పాహారం క్యూలో నిలుచునే!
కొలంబో: శ్రీలంకలో భారీ పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో కొలంబోలోని లగ్జరీ హోటల్ ‘సినమన్ గ్రాండ్ హోటల్’ఒకటి. ఈస్టర్ సండే అల్పాహారం కోసం అందరూ క్యూలో నిలబడ్డారు. వీరితోపాటే ఈ ఉన్మాద ఘటనకు కారణమైన ఉగ్రవాది కూడా మానవబాంబు రూపంలో అదే క్యూలో నిలుచున్నాడు. క్యూలో వచ్చిన ఆజం ప్లేట్లో అల్పాహారం వడ్డిస్తుండగానే.. ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో క్షణాల్లోనే.. ఆ లాంజ్ అంతా రక్తపుమరకలు.. ‘ప్లీజ్ కాపాడండం’టూ ఆర్తనాదాలతో నిండిపోయింది. ‘ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈస్టర్ బ్రేక్‌ఫాస్ట్ కోసం లాంజ్ బిజీగా ఉంది. ఇందులో కుటుంబాలతో వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. అందరూ క్యూలో వస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే కళ్లముందు శవాలు పడి ఉన్నాయి. మిగిలినవారు ఓవైపు గాయాలై రక్తం కారుతుండగానే ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కు పారిపోతున్నారు. క్షణాల్లోనే మనుషులంతా రక్తపు ముద్దలుగా మారిపోయిన భయానక వాతావరణంలోనూ.. మా సిబ్బంది తక్షణమే స్పందించి గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించాం. దాదాపు 20 మంది పరిస్థితి చాలా విషమంగా అనిపించింది. వీరిని నేషనల్ హాస్పిటల్ పంపించాం’అని ఆ హోటల్ మేనేజర్ ఒకరు పేర్కొన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌కు అతిథులను ఆహ్వానిస్తున్న తమతోటి మేనేజర్ ఒకరు కూడా ఈ దుర్ఘటనలో మృతుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ కుదరకపోవడంతోనే! ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉన్మాది శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వీటిని పోలీసులు సేకరించారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం శ్రీలంక జాతీయుడే అయిన ఉన్మాది ఆజం.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపించి బిజినెస్ పనిమీద వచ్చానంటూ మరో రెండు హోటల్స్‌లో గదులకోసం ప్రయత్నించాడు. ఆయా హోటళ్ల మేనేజర్లు తిరస్కరించడంతో చివరకు శనివారం రాత్రి సినమన్ గ్రాండ్ హోటల్లో చేరి ఇంతమంది ప్రాణాలు తీశాడని వెల్లడైంది. సినమన్ గ్రాండ్తోపాటు షాంగ్రి–లా, కింగ్స్బరీ హోటళ్లతోపాటు ఈస్టర్ ప్రార్థనలకోసం వచ్చిన మరో మూడు చర్చిల్లోనూ ఉన్మాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. చారిత్రక సెయింట్ ఆంథోనీస్ కేథలిక్ చర్చ్‌లో అత్యంత తీవ్రతరమైన పేలుడు జరిగింది. చర్చ్ పైకప్పు ఊడి కిందపడడంతోపాటు.. అలంకరించిన లైట్లు, అద్దాలు విరిగిపోయాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ దాడులకు కారణం ఎవరనేదానిపై ఇంతవరకు అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ దుర్ఘటనలో 35 మంది విదేశీయులు మృతిచెందారు. వీరంతా ఆయా హోటళ్లలో జరిగిన పేలుళ్లలోనే చనిపోయారు. ప్రధాని నివాసానికి సమీపంలోనే.. హోటల్ సినమోన్ గ్రాండ్‌కు సమీపంలోనే శ్రీలంక ప్రధాని అధికారిక నివాసం ఉండడంతో.. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమాండోలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీంతో సహాయక కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. షాంగ్రి–లా హోటల్లోని టేబుల్ వన్ రెస్టారెంట్లో ఉదయం 9 గంటల ప్రాంతంలో రెండు బాంబు పేలుళ్లు వినిపించాయి. అయితే.. ఈ ఘటనలో ఎందరు మరణించారో ఇంకా స్పష్టత రావడం లేదు. ఆ హోటల్ రెండో అంతస్తులోని రెస్టారెంట్లో పేలుడు ధాటికి కిటికీలు ఎగిరిపోయాయి. పైకప్పులో ఉన్న విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ కనిపించాయని ఏఎఫ్‌పీ ఫొటోగ్రాఫర్ ఒకరు తెలిపారు. ‘హోటల్లో ఉన్న మిగిలిన వారి భద్రతే మా ప్రాధాన్యత. వారిని కాపాడేందుకు మా విపత్తు నిర్వహణ బృందం పనిచేస్తోంది’అని షాంగ్రి–లా హోటల్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. మృతుల దిబ్బగా కింగ్స్బరీ కొలంబో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు సమీపంలోని కింగ్స్బరీ హోటల్.. నగరంలోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటి. ఇక్కడ జరిగిన పేలుడులోనూ మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎందరు చనిపోయారు.. వారి వివరాలేంటనేది మాత్రం తెలియరాలేదు. ‘ఈ ఘటన మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. ఈ వరుస బాంబుపేలుళ్లపై యావత్ శ్రీలంక మౌనంగా రోదిస్తోంది. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాం. వారికి అవసరమైన వైద్యసేవలను అందించడంలో మా వంతు సాయంచేస్తున్నాం. హోటల్ మొత్తాన్ని వెంటనే ఖాళీ చేయించాం’అని కింగ్స్బరీ హోటల్ యాజమాన్యం ఫేస్బుక్ పోస్టులో పేర్కొంది. చర్చిలో మాంసం ముద్దలు కొలంబో: ముష్కర మూకల రక్తదాహానికి అమాయక భక్తులు బలయ్యారు. ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చి, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకలో ఆదివారం బాంబు దాడులు జరిగిన సెయింట్ సెబాస్టియన్ చర్చి, సెయింట్ ఆంథోనీస్ చర్చిలో భీతావహ దృశ్యాలు కనిపించాయి. చర్చిల గోడలకు మనుషుల మాంసపు ముద్దలు అతుక్కుపోయాయంటే పేలుళ్ల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎటు చూసినా రక్తపు మడుగులే దర్శనమిచ్చాయి. పేలుళ్ల తీవ్రతకు అద్దాలు పగిలి చెల్లాచెదురుగా పడిపోయాయి. కుర్చీలు సైతం విరిగిపోయాయి. పైకప్పులు ధ్వంసమయ్యాయి. సెబాస్టియన్ చర్చి బయట కూడా మాంసపు ముద్దలు ఎగిరిపడ్డాయి. చర్చిల్లో ఈ దారుణ దృశ్యాలను చూసి పోలీసులు, సహాయక సిబ్బంది చలించిపోయారు. సెబాస్టియన్ చర్చి ప్రాంగణంలో 30 మృతదేహాలు లభించాయని ఆర్చిడయాసిస్ ఆఫ్ కొలంబో ప్రతినిధి ఫాదర్ ఎడ్మండ్ తిలకరత్నే చెప్పారు. ఈ చర్చిలో జరిగిన పేలుళ్లలో ముగ్గురు మతబోధకులు గాయపడ్డారని తెలిపారు. ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం ఈ చర్చికి సమీప గ్రామాల నుంచి 1,000 మందికిపైగా భక్తులు వచ్చారని వెల్లడించారు. శ్రీలంకలో ప్రసిద్ధి చెందిన సెబాస్టియన్ చర్చిని నెగొంబో పట్టణంలో 1946లో నిర్మించారు. క్యాథలిక్ చర్చి చరిత్రలో అమరవీరుడిగా పేరుగాంచిన సెయింట్ సెబాస్టియన్‌కు దీన్ని అంకితం చేశారు. కొలంబోలోని సెయింట్ ఆంథోనీస్ చర్చికి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ పేలుళ్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కొలంబో ఆర్చిబిషప్ కార్డినల్ మాల్కోమ్ రంజిత్ డిమాండ్ చేశారు. ద్వీప దేశానికి నెత్తుటి గాయాలు శ్రీమహాబోధి దాడి (1985): అనురాధాపురాలో ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో క్రైస్తవ సన్యాసులు (నన్స్), బౌద్ధ భిక్షవులతో సహా 146 మంది పౌరులు మరణించారు. ► అలూత్ ఒయా నరమేధం (1987): సింహళీ జాతీయులపై ఎల్టీటీఈ చేసిన దాడిలో 127 మంది మరణించారు. ► శ్రీలంక పార్లమెంట్‌పై గ్రెనేడ్ దాడి (1987): శ్రీలంక పార్లమెంట్‌పై ఎల్టీటీఈ తీవ్ర వాద సంస్థ జరిపిన గ్రెనేడ్ బాంబు దాడిలో ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. ► కొలంబో బస్‌స్టేషన్‌లో బాంబుదాడి (1987): కొలంబో బస్‌స్టేషన్‌లో జరిగిన కారు బాంబు దాడిలో 113 మంది పౌరులు మరణించారు. ► కట్టంకూడి మసీదులో నరమేధం (1990): కట్టంకూడి మసీదులో ఎల్టీటీఈ చేసిన దాడిలో 147 మంది ముస్లింలు చనిపోయారు. ► పల్లుయగొదెల్లా నరమేధం (1992): సింహళ జాతీయులే లక్ష్యంగా పల్లుయగొదెల్లాలో ఎల్టీటీఈ తీవ్రవాదులు చేసిన దాడిలో 285 మంది దుర్మరణం పాలయ్యారు. ► కొలంబో సెంట్రల్ బ్యాంకుపై బాంబుదాడి (1996): కొలంబో సెంట్రల్ బ్యాంకు మెయిన్ గేటువద్ద ఎల్టీటీఈ అమర్చిన ట్రక్కు బాంబు దాడిలో 91 మంది మరణించారు. ► దిగంపతన బాంబుదాడి (2006): దిగంపతనలో 15 మిలిటరీ కాన్వాయ్ బస్సులపై ఎల్టీటీఈ ట్రక్కు బాంబు దాడిలో 120 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం కొలంబోలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ధ్వంసమైన సినమన్ హోటల్ సెబాస్టియన్స్ చర్చిలో చెల్లాచెదురుగా మృతదేహాలు ఆదివారం కొలంబోలోని సెయింట్ సెబాస్టియన్స్ చర్చి వద్ద రోదిస్తున్న బాధితులు సెబాస్టియన్స్ చర్చి వద్ద గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం ఉగ్రవాదుల కోసం ఓ హోటల్ వద్ద హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు -
బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో
-
తృటిలో బయటపడ్డ సినీ నటి రాధిక
సాక్షి, చెన్నై : శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేసింది. సిన్నామన్ గ్రాండ్ హోటల్లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను ఖాళీ చేశారు. ఈ ఘటనపై రాధిక ట్వీటర్లో స్పందిస్తూ... ‘ పేలుళ్ల గురించి విని షాకయ్యాను. పెలుళ్లకు కొద్ది నిమిషాల ముందు నేను అక్కడే బస చేశా. అక్కడ బాంబు పేలుళ్లు జరిగియాంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. దేవుడు అందరితో ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్విట్ చేశారు. OMG bomb blasts in Sri Lanka, god be with all. I just left Colombo Cinnamongrand hotel and it has been bombed, can’t believe this shocking. — Radikaa Sarathkumar (@realradikaa) 21 April 2019 శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు ఉదయం వరుస బాంబ్ పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 165 మంది మృతి చెందగా, 280మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్న భక్తులను లక్ష్యంగా పెట్టుకొని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా చర్చిలో ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. షాంగ్రి లా హోటల్, కింగ్స్ బరీ హోటల్లో కూడా బాంబుపేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. చదవండి : బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో -
కొలంబో పేలుళ్లు.. స్పందించిన సినీతారలు
శ్రీలంకలోని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఇప్పటికీ వరకు అందించిన సమాచారం మేరకు ఈ దాడిలో 165 మంది మృతిచెందగా, 280మందికి పైగా గాయాలయ్యాయి. అయితే తమిళ, తెలుగు తారలు సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనను ఖండించారు. తమిళ హీరో శరత్ కుమార్ ట్వీట్ చేస్తూ.. ‘కొలంబోలో జరిగిన ఉగ్రదాడి ఖండించదగినది. ఆ దాడిలో చనిపోయిన అమాయకులను చూస్తే.. హృదయం చలించిపోతోంది’ అని పేర్కొన్నారు. విశాల్ కూడా ఈ ఘటనను ఖండించారు. సాయి ధరమ్ తేజ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. శ్రీలంక బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాధికా శరత్‌కుమార్ తృటిలో ప్రమాదం తప్పించుకున్నానని తెలిపారు. ప్రధాని మోదీ సహా ప్రముఖ రాజకీయ నాయకులు ఈ ఘటనను ఖండించారు. A dastardly act of terror unleashed in Colombo is condemnable, our heart goes out to innocent lives lost in the attack @TamilTheHindu @ThanthiTV @bbctamil — R Sarath Kumar (@realsarathkumar) April 21, 2019 My prayers,strength and deepest condolences to the people of #Srilanka #PrayforSriLanka 🙏🏼 pic.twitter.com/E3WBbuLTTy — Sai Dharam Tej (@IamSaiDharamTej) April 21, 2019 Devastated to hear about the Bomb blasts in Sri Lanka.... My Thoughts & Prayers are with the People of Sri Lanka....#SriLanka #SriLankaBlasts — Vishal (@VishalKOfficial) April 21, 2019 -
బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో
కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చ్‌లకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 207 మంది మృతి చెందగా, 500మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాడిలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఉగ్రదాడితో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. ఈ రోజు ఉదయం నుంచి మూడు చర్చిలతో పాటు, మూడు హోటళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా చర్చిలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. షాంగ్రి లా హోటల్, కింగ్స్ బరీ హోటల్లో కూడా బాంబుపేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. ఉగ్రదాడిపై భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. కొలంబోలోని భారత హైకమిషనర్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. బాంబు పేలుళ్లపై అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. -
మారేడ్‌పల్లి రిలయన్స్ ఫైర్‌సేఫ్టీలో పేలుడు..
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఓ కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడుతో పాటు మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మరికొందరికి గాయాలయ్యాయి. వెస్ట్‌మారేడ్‌పల్లిలోని సయ్యద్ జలాల్ గార్డెన్ వద్ద ప్లాట్ నంబర్–5లో రిలయన్స్ ఫైర్‌సేఫ్టీ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ నడుస్తోంది. కంపెనీ ఎండీగా అరుణ్ ఆంథోనీరాజ్ వ్యవహరిస్తున్నారు. చర్లపల్లిలో ఫ్యాక్టరీ ఉండగా మారేడుపల్లిలో రెండతస్తుల భవనంపై రేకుల షెడ్డును గోదాంగా వాడుతున్నారు. ఫైర్ సేఫ్టీ పరికరాలను ఇందులో నిల్వ ఉంచారు. బుధవారం ఉదయం 11.45 నిమిషాల ప్రాంతంలో పైఅంతస్తులో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం ధ్వంసం కావడంతో పాటు స్థానికంగా ఉన్న పలువురి ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. రెండు బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత భవనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంస్థలో స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్న జంగా రాజు సజీవ దహనమయ్యాడు. రాజు పశ్చిమ గోదావరి జిల్లా దద్దులూరు గ్రామానికి చెందిన వాడు. పలువురికి గాయాలు.. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో జంగా రాజుతో పాటు అక్కడే పనిచేస్తున్న అతడి బావమరిది ఇస్మాయిల్ ఉన్నాడు. ఇస్మాయిల్ కింది అంతస్తులో ఉండగా, రాజు పైఅంతస్తులో ఉన్నాడు. పేలుడు జరిగిన వెంటనే మంటలు వచ్చాయని, మంటల్లో రాజు సజీవ దహనమయ్యాడని ఇస్మాయిల్ కన్నీరుమున్నీరయ్యాడు. రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు. ప్రమాదం జరిగిన సమయంలో మరో వ్యక్తి పైఅంతస్తుకు వెళ్లేందుకు ప్రయత్నించగా శిథిలాలు మీద పడటంతో గాయాల పాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక బృందం వెంటనే ఘటనాస్థలానికి చేరుకుంది. మంటలు ఆర్పుతున్న సమయంలో మరోసారి పేలుడు సంభవించడంతో అగ్నిమాపక బృందం వెంకటేశ్ కొద్దిదూరం ఎగిరిపడ్డాడు. వెంకటేశ్ తలకు హెల్మెట్ ఉండటంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కాగా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు రంగలోకి దిగింది. జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని మారేడ్‌పల్లి సీఐ శ్రీనివాసులు తెలిపారు. ప్రమాదం గ్యాస్ సిలిండర్ కారణంగా జరిగిందా.. లేదా ఫైర్‌సేఫ్టీ పరికరాల వల్ల జరిగిందా అనే విషయాలు దర్యాప్తులో తెలుస్తాయని చెప్పారు. -
ఆకాశహర్మ్యంలో పేలుడు
మాస్కో: రష్యాలోని మాగ్నిటోగొరస్క్ నగరంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. పురాతన బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన పేలుడుతో నలుగురు చనిపోయారు. చాలామంది జాడ తెలీడంలేదు. పేలుడు ధాటికి భవనంలోని ఒక భాగం కుప్పకూలింది. దాదాపు 70 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 22 డిగ్రీలకు పడిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదం గ్యాస్ లీకేజీ కారణంగానే చోటుచేసుకుందని జాతీయ భద్రతా సంస్థ ఎఫ్ఎస్బీ నిర్ధారించింది. రష్యాలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. -
బీపీసీఎల్ రిఫైనరీలో భారీ పేలుడు, మంటలు
సాక్షి,ముంబై: ముంబైలోని భారత పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. పలుమార్లు ఈ పేలుళ్లు జరగడంతో మంటలు ఎగిసి పడ్డాయి. ముంబై మహల్ రోడ్ చెంబూర్ ప్రాంతంలోని రిఫైనరీలో ఈ విస్ఫోటనం సంభవించింది. పేలుళ్ల తరువాత భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయని అగ్నిమాపక అధికారులు వెలడించారు. 7అగ్నిమాపక శకటాలు, 2 ఫోం టెండర్లు, జంబో ట్యాంకర్లతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 21 మంది తీవ్రంగా గాయపడినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
వెనిజువెలా అధ్యక్షుడిపై హత్యాయత్నం!
కరాకస్: వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మడురోపై ఆదివారం ఉదయం (భారతకాలమానం ప్రకారం) హత్యాయత్నం జరిగింది. భారీ పేలుడు పదార్థాలున్న డ్రోన్ ఆయన ప్రసంగిస్తున్న వేదికకు సమీపంలో పేలింది. ఈ ప్రమాదంలో ఆయన క్షేమంగానే బయటబడినా.. ఏడుగురు సైనికులకు గాయాలయ్యాయి. నేషనల్ గార్డ్స్ 81వ వార్షికోత్సవం సందర్భంగా కరాకస్‌లో మిలటరీ పరేడ్‌నుద్దేశించి మడురో ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడికి కొలంబియానే కారణమని మొదట పేర్కొన్న మడురో అనంతరం.. అనుమానాస్పద రెబల్ గ్రూప్ హత్యాయత్నం చేసి ఉండొచ్చన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మిలటరీ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ‘నేను బాగున్నాను. బతికే ఉన్నాను. ఈ దాడి తర్వాత మరింత విప్లవాత్మకంగా పనిచేయాలని నిశ్చయించుకున్నాను. ఈ ఘటనకు బాధ్యులకు తీవ్రమైన శిక్షలు తప్పవు. ఎవరినీ క్షమించబోం’ అని దాడి అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ మడురో హెచ్చరించారు. ‘నన్ను చంపేందుకు పన్నిన కుట్ర ఇది. నేడు నన్ను అంతమొందించేందుకు ప్రయత్నించారు. ఓ ఎగురుతున్న వస్తువు హఠాత్తుగా నా ముందు పేలింది’ అని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ఆందోళనలను అణచివేస్తున్న మడురో.. 248 మందిని రాజకీయ ఖైదీలుగా జైల్లో పెట్టారు. ఈ ఘటనకు బాధ్యులపై కనికరం చూపించబోమని అటార్నీ జనరల్ తారెక్ విలియమ్ సాబ్ హెచ్చరించారు. కాగా, ఈ దాడికి తమదే బాధ్యతని వెనిజువెలా మిలటరీ రెబల్ గ్రూప్ ‘నేషనల్ మూమెంట్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ టీషర్ట్స్’ (ఎన్‌ఎంఎస్‌టీ) ప్రకటించుకుంది. పేలింది డ్రోనా? సిలిండరా? వెనిజువెలా అధికార చానెల్లో చూపించిన దృశ్యాల్లో.. సైనికుల మధ్యలో మడురో నిలబడి ప్రసంగిస్తుండగా ఓ భారీ శబ్దం వినిపించింది. దీంతో పరేడ్‌లో ఉన్న జాతీయ గార్డులు దూరంగా జరిగిపోయారు. పేలుడు జరగగానే గార్డులు అధ్యక్షుడికి రక్షణ కల్పిస్తూ ఆయన చుట్టూ వలయంలా మారిన దృశ్యాలు కూడా కనిపించాయి. ఆ వెంటనే లైవ్ కట్ అయింది. అధ్యక్షుడు ప్రసంగిస్తున్న వేదికకు సమీపంలో ఈ డ్రోన్ పేలిందని వెనిజువెలా సమాచార మంత్రి జార్జ్ రోడ్రిగ్జ్ తెలిపారు. సంప్రదాయవాదులే (విపక్షం) ఈ పనిచేసి ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కరాకస్ మిలటరీ క్షేత్రానికి సమీపంలోని భవనం వద్దనుంచే ఈ డ్రోన్‌ను ఆపరేట్ చేసినట్లు స్థానిక పోలీసులు భావిస్తున్నారు. అయితే.. సమీపంలోని భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే భారీగా శబ్దం వచ్చిందని, హత్యాయత్నం జరగలేదని పలు అంతర్జాతీయ వార్తాసంస్థలు పేర్కొన్నా యి. మడురో మిత్రులైన క్యూబా, బొలీవియా దేశాలు ఈ హత్యాయత్నాన్ని ఖండించాయి. మాకేం సంబంధం లేదు: అమెరికా వెనిజువెలా ఘటనను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దాడి వెనక తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ‘అమెరికా ప్రమేయం లేదు. ఆ దేశంలో జరిగే మార్పులతో మాకు సంబంధం లేదు’ అని అమెరికా భద్రతా సలహాదారు. జాన్ బోల్టన్ తెలిపారు. కొలంబియా ప్రభుత్వం కూడా మడురో ఆరోపణలను ఖండించింది. ‘మడురో ఆరోపణలు అర్థరహితం. ఎలాంటి ఆధారాల్లేకుండా మాట్లాడొద్దు’ అని హెచ్చరించింది. బాధ్యత మాదే! ఈ దాడికి తామే బాధ్యులమని మిలటరీ రెబల్ గ్రూప్ ‘నేషనల్ మూమెంట్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ టీషర్ట్స్’ (ఎన్‌ఎంఎస్‌టీ) ప్రకటించుకుంది. ‘రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన వారు, అధికారాన్ని స్వార్థప్రయోజనాలకు వాడుకునే వారికి మిలటరీ ఇస్తున్న అసలు సిసలు గౌరవం’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ‘దేశ ప్రజలు సంతోషంగా ఉండేలా చూడటం ప్రభుత్వం బాధ్యత. కానీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోలేని ప్రభుత్వాన్ని మేం సహించబోం. కరెన్సీకి విలువ లేదు. వ్యాధులకు మందుల్లేవు. విద్యావ్యవస్థ దారుణంగా ఉంది. కమ్యూనిజాన్ని మాత్రమే ప్రభుత్వం బోధిస్తోంది’ అని ఎన్‌ఎంఎస్‌టీ పేర్కొంది. దేశంలో రాజ్యాంగ సంక్షోభం భారీ చమురు నిక్షేపాలున్నప్పటికీ.. వెనిజువెలా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దేశంలో కొంతకాలంగా రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. మడురో సన్నిహితులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అంతర్జాతీయంగా ఏకాకి అయింది. ద్రవ్యోల్బణం తీవ్ర స్థితికి చేరుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సంప్రదాయవాదులను (విపక్షాలు) మడురో జైల్లో పెట్టిస్తున్నారు. వీరికి అమెరికా సాయం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగగా.. మడురో ఏకపక్ష నిర్ణయాలతో విపక్షం ఎన్నికలను బహిష్కరించింది. దీంతో మరో ఆరేళ్లపాటు ఈయనే అధికారంలో ఉండనున్నారు. డ్రైవర్ నుంచి అధ్యక్షుడి దాకా.. 1962లో పుట్టిన నికోలస్ మడురో తండ్రి వెనిజువెలాలో ప్రముఖ కార్మిక నేత. చిన్నప్పటినుంచే కమ్యూనిజం, కార్మిక చట్టాలను మడురో ఒంటబట్టించుకున్నారు. విద్యార్థి సంఘం నేతగా ఎదిగిన మడురో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిచేయలేదు. అనంతరం కరాకస్ మెట్రో కంపెనీలో బస్ డ్రైవర్‌గా కూడా పనిచేశారు. 1993లో అప్పటి వెనిజువెలా అధ్యక్షుడు హ్యుగో చావెజ్‌ను కలుసుకున్న మడురో.. ఆ తర్వాత బొలివియన్ ఉద్యమంతో కీలకనేతగా ఎదిగారు. ఈ ఉద్యమం ద్వారానే 1998లో చావెజ్ అధ్యక్ష పీఠాన్ని మళ్లీ అధిరోహించారు. అప్పుడే మడురో ఎంపీగా గెలిచారు. 1999లో నేషనల్ అసెంబ్లీలో డిప్యూటీ నేతగా ఎంపికయ్యారు. చావెజ్ 2006లో మడురోను విదేశాంగ మంత్రిగా నియమించారు. 2013లో చావెజ్ మరణంతో ఆపద్ధర్మ నేతగా, ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో నెగ్గి అధ్యక్షుడయ్యారు. -
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం..
-
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
సాక్షి, కర్నూలు: ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి పైగా మృత్యువాత పడగా, మరికొంతమంది తీవ్రగాయాలపాలయ్యారు. పేలుళ్ల కారణంగా బండరాళ్లు మీద పడటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బండరాళ్ల కింద మరికొంత మంది చిక్కుకున్నట్టు తెలుస్తుంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పేలుళ్లతో క్వారీలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి మూడు ట్రాక్టర్లు, లారీ, రెండు షెడ్లు పూర్తిగా దగ్థమయ్యాయి. షెడ్లలో మరికొంత మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మృతులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ కార్మికులుగా అధికారులు గుర్తించారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రజలు భయంతో వణికిపోయారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. -
పేలుళ్ల మోతతో దద్దరిల్లిన వరంగల్
-
బతుకులు బుగ్గి
సాక్షి ప్రతినిధి, వరంగల్: చెవులు చిల్లులు పడేలా శబ్దం.. ఆకాశం నిండా కమ్ముకున్న పొగలు.. మూడు కిలోమీటర్ల మేర కంపించిన ఇళ్లు.. వంగిపోయిన స్టీలు కడ్డీలు.. తునాతునకలైన షాబాదు రాళ్లు.. ఛిద్రమై వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ కార్మికుల శరీర భాగాలు.. వరంగల్‌లో జరిగిన ప్రమాద తీవ్రతకు అద్దం పట్టే దృశ్యాలివీ! నిబంధనలు తుం గలోకి తొక్కి, అధికారుల కళ్లు గప్పి నడుస్తున్న ఫైర్వర్క్స్లో జరిగిన అగ్నిప్రమాదం 8 మంది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదు. ఐదుగురు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వరంగల్ లోని భద్రకాళి ఫైర్వర్క్స్లో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ విస్ఫోటానికి కారణం ధూమపానమా లేదా కరెంట్ షార్ట్ సర్క్యూటా అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసలేం జరిగింది? వరంగల్‌కు చెందిన గుళ్లపెల్లి రాజ్‌కుమార్ అలియాస్ బాంబుల కుమార్ కాశి బుగ్గ సమీపంలో కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్వర్క్స్ పేరుతో టపాసుల విక్రయాలు చేస్తున్నాడు. ఈ గోదాములో సుమారు 60 మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 20 మంది గోదాములో ఉన్నట్లు సమాచారం. కాజీపేటకు చెందిన ఓ మహిళ మరణించడంతో ఆమె శవయాత్రలో బాణసంచా కాల్చేందుకు బందెల సారంగపాణి, బండారి సమ్మయ్య, రాజు, మహేశ్ ఉదయం 11 గంటల సమయంలో ఈ గోడౌన్ వద్దకు వచ్చారు. కంపెనీ ఔట్లెట్లో టపాసులు బేరం చేస్తున్నారు. ఇంతలో శక్తివంతమైన టపాసులు లోపలి నుంచి తెస్తానంటూ ఓ వర్కర్ తయారీ విభాగంలోకి వెళ్లాడు. ఇంతలో లోపలి నుంచి పేలుళ్ల శబ్దాలు వచ్చాయి. చూస్తుండగానే ఒకదాని వెంట మరొకటిగా టపాసులు పేలిపోయాయి. దీంతో టపాసులు కొనేందుకు వచ్చినవారు ప్రాణభయంతో బయటకు పరుగెడుతూ విస్ఫోటం ధాటికి మెయిన్ గేటు వద్ద పడిపోయారు. కాసేపటికి తేరుకుని దూరంగా పరుగు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ గోదాములో పనిచేస్తున్న కార్మికులు ఎక్కడి వారక్కడే మంటల్లో సజీవ దహనమయ్యారు. పేలుళ్ల తీవ్రతకు కొందరి శరీరభాగాలు ఛిద్రమై వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. పక్కనున్న కరెంటు తీగలు తెగిపడ్డాయి. కరెంటు పోల్‌పై ఉన్న ఇన్సులేటర్లు కూడా విరిగి ముక్కలయ్యాయి. గోదాము స్థలం నేలమట్టమైంది. చుట్టూ ఉన్న ప్రహరీ కూలిపోయింది. కింద పరిచిన షాబాదు రాళ్లు తుక్కుతుక్కు అయ్యాయి. సుమారు గంట పాటు ఏకధాటిగా పేలుళ్లు, మంటలు కొనసాగాయి. పేలుడు తీవ్రతకు వరంగల్ తూర్పు ప్రాంతం దద్దరిల్లింది. ప్రమాదస్థలికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఇళ్లు ఒక్కసారిగా కంపించాయి. భారీ శబ్దం, ఇళ్లు కంపించడంతో పిడుగు పడిందేమో, భూకంపం వచ్చిందేమో అని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలియగానే ఫైర్ సిబ్బంది, స్థానికులు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. శిథిలాల్లో ఎనిమిది మృతదేహాలు లభించాయి. మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదు. మృతులందరూ గోదాములో పని చేసే కార్మికులే. ఇందులో పనిచేసే మహిళలు బాణసంచాలో గన్‌పౌడర్ కూర్చి చుట్టలుగా చుట్టడం, క్రమంలో పేర్చడం, రంగులు అద్దడం వంటి పనులు చేస్తుంటారు. ప్రమాదంలో వీరు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతదేహాలను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ సిగరెట్టే ముంచిందా? గోదాములో విస్ఫోటం ఎలా జరిగిందన్న అంశంపై స్పష్టత లేదు. అయితే టపాసులు కొనేందుకు వచ్చిన నలుగురిలో ఓ వ్యక్తి సిగరెట్ ముట్టించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. మిగిలిన ముగ్గురు బాణసంచా కొనుగోలు చేస్తుండగా మరో వ్యక్తి మూత్రం కోసం కాస్త దూరం వెళ్లాడు. ఈ సమయంలో అతడు సిగరెటు ముట్టించినట్లు తెలిసింది. ఇది గమనించిన ఓ కార్మికుడు సారూ.. సిగరెట్ ముట్టించవద్దు అని అరిచాడు. దీంతో ఆ వ్యక్తి సిగరెట్‌ను కింద పడేయడం, అక్కడే బాణసంచా తయారీ పదార్థాలపై అది పడడంతో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ నిప్పే క్రమంగా విస్తరించి పెద్ద ఎత్తున్న నిల్వ ఉన్న బాణసంచా మొత్తం అంటుకోవడంతో కారణమైందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన మానవ తప్పిదం వల్ల జరిగిందేనని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గోడౌన్ ప్రాంతమంతా సీసీ కెమెరా నిఘాలో ఉంది. కెమెరా మెమెరీ ఉండే హార్డ్‌డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫుటేజీని పరిశీలిస్తే ప్రమాదానికి అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది. అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. అమ్మకాల పేరుతో తయారీ.. భద్రకాళి ఫైర్వర్క్స్లో అడుగడునా నిబంధనలు తుంగలో తొక్కారు. ఈ సంస్థను 2009లో రిజిస్టర్ చేయించారు. ఏడాది పొడవునా బాణసంచా అమ్మకాలపై వరుసగా అనుమతులు తీసుకుంటున్నారు. 2016లో మూడేళ్ల కాలపరిమితికి జిల్లా యంత్రాంగం నుంచి అనుమతులు పొందారు. ఇక్కడ కేవలం ఇతర ప్రాంతాల నుంచి తెప్పించిన టపాసులను నిల్వ ఉంచి అమ్మకాలు చేయాలి. కానీ ఇందుకు విరుద్ధంగా తయారీ చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు, రక్షణ చర్యలు తీసుకోకుండా కుటీర పరిశ్రమ స్థాయిలో నిత్యం మూడు షిఫ్టుల్లో టపాసుల తయారీ కొనసాగిస్తున్నారు. ప్రమాదంపై డివిజినల్ ఫైర్ ఆఫీసర్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ.. భద్రకాళి ఫైర్ వర్క్స్‌కు తయారైన బాణసంచా అమ్ముకునేందుకు మాత్రమే అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు ఉన్నాయన్నారు. ప్రమాదం తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి ఫైర్వర్క్స్ నిర్వాహకుడు బాంబుల కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. జాడ లేని ఫైర్‌సేఫ్టీ.. ఫైర్‌సేఫ్టీ నిర్వహణలో భాగంగా రిటైర్డ్ ఫైర్ అధికారిని ఫైర్ సెఫ్టీ ఉద్యోగిగా నియమించాల్సి ఉంది. దీంతోపాటు ప్రతి ఏడాదికి ఓ సారి మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఈ రెండు నిబంధనలు గోదాములో అమలుకు నోచుకోలేదు. ఫైర్ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ ప్రమాద సమయంలో పని చేయలేదు. మంటలను ఆర్పే సిలిండర్లు సంఘటన స్థలంలోనే పడి ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ పైపులు పగిలిపోయినా. వాటి నుంచి మంటలను ఆర్పే రసాయనాలు, నీరు విడుదల కాలేదు. మధ్యాహ్నం మళ్లీ పేలుళ్లు ఉదయం 11 గంటలకు ప్రమాదం సంభవించగానే అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఓ వైపు ఫైర్ సిబ్బంది శిథిలాల తొలగింపు చేస్తుండగా మధ్యాహ్నం 1:17 గంటల సమయంలో బాంబులు నిల్వ చేసే స్థలంలో మరోసారి మంటలు ఎగిశాయి. టపాసుల మోత మొదలైంది. దీంతో అక్కడికి వచ్చిన ప్రజలు పరుగులు తీశారు. ఓవైపు పేలుళ్ల మోత కొనసాగుతుండగానే శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికి తీశారు. జనావాసాల మధ్య అనుమతి ఎలా ఇచ్చారు? ప్రమాదం జరిగే అస్కారం ఉండటం వల్ల బాణసంచా నిల్వలు, అమ్మకాలపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. సాధారణంగా జనావాసాల మధ్య వీటికి అనుమతి ఇవ్వరు. కానీ అగ్నిమాపక శాఖ, గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ అధికారులు జనావాసాల మధ్య అనుమతి ఇవ్వడం గమనార్హం. భద్రకాళి ఫైర్‌వర్క్స్‌కు పక్కన ఉన్న మణికంఠ కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. పద్ధతి లేకుండా ఇష్టారీతిగా అనుమతులు ఇవ్వడం, ఆపై పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంది. ప్రాణాలు పోయాయనుకున్నా: సారంగపాణి, ప్రత్యక్ష సాక్షి మా బంధువొకరు చనిపోవడంతో బాణసంచా కొనేందుకు మేం నలుగురం భద్రకాళి ఫైర్‌వర్క్స్‌కు వెళ్లాం. ఔట్లెట్లో టపాసులు చూసి మరింత శక్తివంతమైనవి కావాలని అడిగాం. అక్కడున్న వ్యక్తి తెచ్చి ఇస్తానంటూ లోపలికి వెళ్లాడు. ఇంతలో మాలో ఇద్దరు కొంచెం బయటకు వెళ్లగా నేను అక్కడే ఉన్నా. ఇంతలో శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూస్తే టపాసులు పేలుతున్నాయి. టెస్టింగ్ అనుకున్నా.. : శివకుమార్ భద్రకాళి ఫైర్వర్క్స్ సమీపంలోనే మా ఇళ్లు ఉంది. ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఇంటి పైకప్పుగా ఉన్న రేకులు విరిగిపోయి కింద పడుతున్నాయి. పదిహేను నిమిషాల పాటు శబ్దాలు తప్ప మరేమీ వినిపించలేదు. బాంబులు టెస్టు చేస్తున్నారేమో అనుకున్నా. బయటకొచ్చాక ప్రమాదం సంగతి తెలిసిందే. ఇది నాలుగోసారి.. నాలుగేళ్లలో ఇక్కడ మూడుసార్లు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అందులో ఏడేళ్లుగా పనిచేసిన ఓ కార్మికుడు తెలిపాడు. అయితే కార్మికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదాలు తప్పాయని పేర్కొన్నాడు. వరుసగా ఈ తరహా ఘటనలు జరుగుతుండడంతో పని మానేసినట్టు వివరించాడు. మృతుల వివరాలు.. గాజుల హరిక్రిష్ణ (38), తిలక్‌రోడ్, కాశిబుగ్గ, వరంగల్ కోమటి శ్రావణి (33), ఓంసాయి కాలనీ , సుందరయ్య నగర్, వరంగల్ బేతి శ్రీవాణి (25) ఓంసాయి కాలనీ, సుందరయ్య నగర్, వరంగల్ రంగు వినోద్ (24) బాలాజీ నగర్, ఏనూమాముల మార్కెట్ రోడ్, వరంగల్ వల్దాసు అశోక్‌కుమార్ (30) కాశిబుగ్గ, వరంగల్ బాలిని రఘుపతి (40), సాయిబాబా గుడి దగ్గర, కాశిబుగ్గ, వరంగల్ కందకట్ల శ్రీదేవి (34), కీర్తినగర్ కాలనీ, గొర్రెకుంట, వరంగల్ బాస్కుల రేణుక (39) సుందరయ్య నగర్, వరంగల్ ఈ ఇద్దరి ఆచూకీ లేదు వడ్నాల మల్లికార్జున్ (35), కొత్తవాడ, వరంగల్ వంగరి రాకేష్ (22), కరీమాబాద్ ,వరంగల్ క్షతగాత్రులు కొండపల్లి సురేష్, బాలాజీనగర్, ఏనుమాముల, వరంగల్ బందెల సారంగపాణి, గొర్రెకుంట, వరంగల్ పరికెల మోహన్, కాశిబుగ్గ, వరంగల్ బి.రవి, హన్మకొండ సలేంద్ర శివ, కోటిలింగాల, వరంగల్ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వరంగల్‌లో ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని, వారి కుటుంబాలను అన్ని విధాలుగా అదుకుంటామన్నారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. స్పీకర్ మధుసూధనాచారి, మంత్రి ఆజ్మీరా చందూలాల్, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, వినయ్‌భాస్కర్, కొండా సురేఖ తదితరులు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సమగ్ర విచారణ జరపాలి ప్రమాదంపై విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షలు, క్షతగాత్రులకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఫైర్వర్క్స్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అ««ధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఈ ఘటన తనకు బాధ కలిగించిందని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. -
నిర్లక్ష్యానికి మూల్యం
నిత్యం నిప్పుతో చెలగాటం అనదగ్గ బాణసంచా తయారు చేసేచోట, వాటిని నిల్వ చేసే ప్రదేశంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఏమాత్రం ఏమరు పాటుతో ఉన్నా పెను నష్టం సంభవిస్తుంది. వరంగల్ నగరంలోని కోటిలింగాలలో ఉన్న గోదాంలో బుధవారం హఠాత్తుగా పేలుళ్లు సంభవించి, క్షణాల్లో మంటలు వ్యాపించి 11 మంది సజీవదహనమైన ఉదంతం ఎంతో విషాదకరమైనది. ఈ దుర్ఘటనలో మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దాలు దాదాపు నగరమంతా వినిపించాయంటే... వాటి ధాటికి మూడు కిలోమీటర్ల నిడివి లోని ఇళ్లు కంపించాయంటే ఈ ప్రమాదం తీవ్రత అర్ధమవుతుంది. ప్రమాదం జరిగాక 15 నిమిషాల పాటు పేలుళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. మంటలు అదుపులోకి రావడానికి రెండు గంటలు పట్టింది. ముప్పు ముంచుకొచ్చాక కదలటం మినహా ముందు జాగ్రత్త చర్యల్లో అధికార యంత్రాంగం ఎప్పుడూ విఫలమవుతున్నదని వరంగల్ ఉదంతం రుజువు చేసింది. బాణసంచా, టపాసుల తయారీ మాత్రమే కాదు... వాటిని నిల్వ చేసే గోదాంలు కూడా జనావాసాల మధ్య ఉండకూడదు. అలాగే వాటిని తెచ్చి నిల్వ చేసి, విక్రయించడానికి మాత్రమే అనుమతి ఉన్న సంస్థ తయారీ పనులకు దిగ కూడదు. కానీ వరంగల్ నగరంలో ఈ రెండింటినీ ఉల్లంఘించారు. ఎక్కడినుంచో పేలుడు పదా ర్థాలను తెప్పించుకుని 60మంది కార్మికులతో బాణసంచా, టపాసులు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు మూడు నాలుగేళ్లనుంచి ఇదంతా కళ్లముందే సాగుతున్నా అధికార యంత్రాంగం, ప్రత్యేకించి అగ్ని మాపక శాఖ పట్టించుకోలేదు. ప్రజల భద్రతతో ముడిపడి ఉన్న విషయాల్లో కూడా పర్యవేక్షణ ఇంత నాసిరకంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ నిబంధనలైనా, ప్రమాణాలైనా ఏళ్ల తరబడి ఎదురైన సమస్యలనుంచి గుణపాఠాలు నేర్చుకుని రూపొందించుకున్నవే. కానీ అవి పుస్తకాల్లో మిగిలిపోతు న్నాయి. ఎవరికి వారు ఇష్టానుసారం వ్యవ హరిస్తున్నారు. ఆ నిబంధనలు, ప్రమాణాలు అధికారులకు ఆదాయ మార్గంగా మారుతున్నాయి తప్ప జనం భద్రతకు, శ్రేయస్సుకు తోడ్పడటం లేదు. పండగలు, శుభకార్యాలు, విజయోత్సవాలు జరిగే సందర్భాల్లో ఏ మతస్తులైనా బాణసంచా, టపాసులు కాల్చడం రివాజు. వీటిని ఎప్పటికప్పుడు అభివృద్ధిపరుస్తూ కొత్త కొత్త హంగులతో, ఆకర్షణీయంగా కనబడేలా చేయడం కోసం బాణసంచా ఉత్పత్తిదార్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రంగురంగుల కాంతులు వెదజల్లేలా, మిరుమిట్లు గొలిపేలా, భారీగా చప్పుళ్లు చేసేలా వీటిని రూపొందించడం కోసం ఎన్నో రకాల రసాయన పదార్ధాలు వినియోగిస్తారు. ఈ ప్రక్రియలో నిర్దేశిత ప్రమాణాలను, అనుమతించిన రసాయనాలను మాత్రమే వినియోగిస్తున్నారా లేక నిషిద్ధ పదార్థాలేమైనా ఉపయోగిస్తున్నారా అన్న పర్యవేక్షణ ఉండాలి. అలాగే తయారైన బాణసంచాను, టపాసులను తీసుకెళ్లడంలో, నిల్వ చేయడంలో భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించాలి. ఈ పనుల్లో ఎందరో నిమగ్నమై ఉంటారు గనుక వీటన్నిటినీ అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించాలి. వరంగల్ ఉదంతంలో చట్టవిరుద్ధంగా టపాసులు, బాణసంచా తయారీ పనులు చేయిస్తున్నట్టు తమ దృష్టికి రాలేదని అధికారులు అమాయకత్వం నటిస్తే చెల్లదు. నిర్ణీత కాలవ్యవధిలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం, ఏం జరుగుతున్నదో తెలుసుకోవటం వారి బాధ్యత. వరంగల్ నగరంలో ఒకప్పుడు విప్లవ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆ కారణం వల్ల ఇప్పటికీ అక్కడ ప్రజా సంఘాలు సభలు, సమావేశాలు జరుపుకోవటంపై అప్రకటిత నిషేధం, వాటి కార్యకలాపాలపై నిఘా ఉన్నాయి. అటువంటిచోట అత్యంత ప్రమాదకర స్థాయిలో జనావాసాల్లో బాణసంచా, టపా సుల తయారీ, నిల్వ, అమ్మకాలు యధేచ్ఛగా సాగిపోవటం వింత కాదా? గత నాలుగేళ్లలో మూడు సార్లు ప్రమాదాలు జరిగాయని అక్కడ లోగడ పనిచేసిన కార్మికుడు ‘సాక్షి’తో చెప్పాడు. పర్యవేక్షించా ల్సిన అధికారులకు మాత్రం ఈ సంగతి తెలిసినట్టు లేదు. బాణసంచా, టపాసుల తయారీ ప్రదేశంలో నిర్దిష్టమైన ఉష్ణోగ్రత, తేమ ఉండాలి. వీటి ఉత్ప త్తికి వాడే రసాయన పదార్థాలు ఎంతో ప్రమాదకరమైనవి. అందుకే తగిన శిక్షణ పొందిన సిబ్బంది మాత్రమే ఆ పనుల్లో ఉండాలి. అలాగే వారికి వివిధ రసాయనాలపై తగిన అవగాహన అవసరం. తాము ఎలాంటి ప్రమాదకర పదార్థాలతో పని చేస్తున్నామో వారికి అర్ధం చేయించడం, తీసుకోవా ల్సిన జాగ్రత్తలు చెప్పటం యాజమాన్యం బాధ్యత. అగ్ని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్నదని తెలిసినా కార్మికులు కేవలం పొట్ట నిండటానికి వేరే మార్గం లేక ఇటువైపు వస్తారు. సాధారణంగా కాంట్రాక్టు కార్మికుల్నే ఈ పనుల కోసం నియమించుకుంటారు. కనుక వారికి వివిధ ప్రయోజనాలు గానీ, రక్షణలుగానీ ఉండవు. కనీసం రికార్డుల్లో వారి పేర్లుంటాయో లేదో కూడా అనుమానమే. ఇక ప్రమాదాల్లో ప్రాణాలుపోతే, తీవ్రంగా గాయపడితే వారిపై ఆధారపడి బతికే కుటుంబాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవాల్సిందే. మనకు 1884నాటి పేలుడు పదార్థాల చట్టం ఉంది. అలాగే పేలుడు పదార్థాలకు సంబంధించి 2008లో రూపొందిన నిబంధనలున్నాయి. బాణ సంచా, టపాసుల పరిశ్రమలు అధికంగా ఉన్న శివకాశిలో పెను ప్రమాదాలు సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలు వీటికి అదనం. ఇవన్నీ బాణసంచా, టపాసుల తయారీ లేదా అమ్మకాలకు సంబంధించి లైసెన్స్‌లు జారీ చేయడానికి ముందు చూడాల్సిన అంశాలు, అనం తరకాలంలో ఎప్పటికప్పుడు తనిఖీలు సాగాలి. ఇలా ఎన్ని ఉన్నా వరంగల్ ఉదంతంలో 11 నిండు ప్రాణాలు బలైపోయాయి. కనీసం ఈ ఉదంతమైనా దేశంలో అందరి కళ్లూ తెరిపించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై... నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై, విక్రేతలపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడకూడదు. అప్పుడు మాత్రమే ఇటువంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. -
మహారాష్ట్రలో భారీ పేలుడు: ముగ్గురి మృతి
-
మహారాష్ట్రలో భారీ పేలుడు: ముగ్గురి మృతి
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని పాల్గర్లో గురువారం అర్ధరాత్రి భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. బోయిసార్ - తారాపూర్ ఇండస్ట్రీయల్ కారిడార్‌లోని నోవాపెనే స్ఫెషాలిటీస్ లిమిటెడ్‌లో పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగిసిపడి ఇతర యూనిట్లకి మంటలు వ్యాపించాయి. పేలుడు ప్రభావంతో 12 కిలోమీటర్ల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మండే స్వభావం ఉన్న ఎల్ఈడీని ఎక్కువ మోతాదులో నిల్వ ఉంచడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. భారీ ఎత్తున ప్రమాదం సంభవించటంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం హై అలర్ట్ ప్రకటించామని తెలిపారు. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, భవనాలు కంపించడంతో ఏం జరిగిందో తెలియక తీవ్ర గందరగోళానికి గురైనట్టు స్థానికులు తెలిపారు. -
పేలిన రెడ్మీ సెల్‌ఫోన్
హిందూపురం అర్బన్: పట్టణంలోని బాలాజీసర్కిల్లో నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణ ఇంట్లో రెడ్మీ నోట్–4 సెల్‌ఫోన్ పేలింది. మధ్యాహ్నం చార్జింగ్ పెట్టి ఉంచడంతో కొంత సేపటికి పెద్ద శబ్ధంతో సెల్‌ఫోన్ పేలడంతో ఇంట్లో కలకలం రేగింది. కొద్దిసేపటి ముందు షర్టు ప్యాకెట్లో ఫోన్ ఉంచుకున్నానని.. అప్పుడు పేలి ఉంటే పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే గుండె జలదరిస్తోందని లక్ష్మీనారాయణ తెలిపారు. వెంటనే షోరూమ్‌కు వెళ్లి సెల్‌ఫోన్ చూపించగా.. ఏజెన్సీతో మాట్లాడి మరొకటి ఇప్పించేందుకు ఒప్పించారు. ఒకే కంపెనీకి చెందిన ఫోన్లు అధిక శాతం పేలుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. -
ముంబైలో పేలుడు పదార్థాలు స్వాధీనం
ముంబై: ముంబై పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో కలకలం రేగింది. ముంబైలో థానే సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. తొమ్మిది డిటోనేటర్లు, 15కేజీల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సం దగ్గరపడుతున్న నేపథ్యంలో పేలుడు పదార్థాలను లభ్యమవడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. -
ఆగ్రా రైల్వే స్టేషన్ వద్ద జంట పేలుళ్లు
-
ఆగ్రా రైల్వే స్టేషన్ వద్ద జంట పేలుళ్లు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం జంట పేలుళ్లు చోటుచేసుకోవడం కలకలం రేపింది. మొదట ఓ రైల్వే ట్రాక్ సమీపంలోని చెత్తకుండీ వద్ద పేలుడు చోటుచేసుకోగా.. ఆ తర్వాత సమీపంలోని ఓ నివాసగృహం వద్ద మరో పేలుడు చోటుచేసుకుంది. అంతేకాకుండా రైల్వేట్రాక్ వద్ద ఓ బెదిరింపు లేఖ కూడా లభ్యం అయింది. అయితే, ఇవి తక్కువ తీవ్రత కలిగిన బాంబులు కావడంతో పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుపు, ఇటీవల లక్నోలో ఐఎస్ ఉగ్రవాది కాల్చివేత తదితర ఘటనల నేపథ్యంలో ఈ జంట పేలుళ్లు పోలీసుల్లో కలవరం రేపాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన వెనుక ఉగ్రవాద చర్య ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. -
పేలుళ్ల విస్ఫోటం
అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన గ్యాస్ లారీ చెట్టి విరిగి విద్యుత్‌లైన్‌పై పడటంతో రేగిన మంటలు విశాఖపట్టణం (భీమిలి): నగర శివారులో ఆనందపురం మండలం గుడిలోవ వద్ద మంగళవారం అర్థరాత్రి ఒక లారీ మంటలకు ఆహుతి కావడం.. అందులో ఉన్న సిలిండర్లు పేలిపోయిన ఘటన బీభత్సం సృష్టించింది. పరవాడ వద్ద ఉన్న భారత్ గ్యాస్ గొడౌన్ నుంచి 306 గ్యాస్ సిలిండర్లను లారీలో లోడ్ చేసుకొని డ్రైవర్ నాగేశ్వరరావు పెందుర్తి మీదుగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి తీసుకెళ్తున్నాడు. గుడిలోవ వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి అడ్డంగా రావడంతో.. అతన్ని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించే క్రమంలో లారీ రోడ్డు పక్కనున్న తాటిచెట్టును ఢీకొట్టింది. దాంతో తాటిచెట్టు విరిగిపోయి పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్ లైనుపై పడటంతో మంటలు రేగాయి. అదే సమయంలో లారీ నుంచి లీకైన డీజిల్ అంటుకొని మంటలు లారీని కమ్మేశాయి. మంటల వేడికి లారీలో ఉన్న సిలిండర్లలో గ్యాస్ ఒత్తిడి పెరిగి ఒక్కొక్కటిగా పేలడం ప్రారంభించాయి. మూడు గంటలపాటు పేలుళ్లు ఏకధాటిగా మూడు గంటలపాటు కొనసాగిన ఈ పేలుళ్ల ధాటికి చుట్టుపక్కల కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాంతాలన్నీ అదిరిపోయాయి. నిద్రపోతున్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈలోగా లారీకి మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి దూకేసి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. అయితే మంటల తీవ్రత కారణంగా లారీ సమీపంలోకి వెళ్లలేక దూరం నుంచే మర్రిపాలెం, తాళ్లవలస నుంచి వచ్చిన నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. తెల్లవారుజాముకు గానీ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో లార్తీ పూర్తిగా కాలిపోయి ఆనవాలు లేకుండాపోయింది. 4 గంటలపాటు ట్రాఫిక్ నిలిపివేత ప్రమాద తీవ్రతను గమనించిన పోలీసులు ఈ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. వాహనాలను ఇతర మార్టాల్లోకి మళ్లించారు. సుమారు 4 గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాద విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ యోగానంద్, ఏసీపీ బి.వి.ఎస్.నాగేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి మోహనరావు, స్థానిక సీఐ ఆర్.గోవిందరావు, తహసీల్దారు ఎస్.వి.అంబేద్కర్లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. లారీ పూర్తిగా దగ్ధం కావడంతోపాటు సిలిండర్లు పేలిపోవడంతో సుమారు రూ. 20 లక్షల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. నిషేధ సమయంలో సిలిండర్ల తరలింపు పేలుడు స్వభావం గల వస్తువులు, పదార్థాలను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు మాత్రమే రవాణా చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ప్రమాదానికి గురైన లారీ అర్ధరాత్రి వేళ నిబంధనలను అతిక్రమించి సిలిండర్లను నగరం మీదుగా శివారు ప్రాంతానికి ఎలా చేరుకుందన్న విషయం చర్చనీయాంశమైంది. అలాగే సిలిండర్లను చట్టబద్దంగానే తరలిస్తున్నారా లేదా బ్లాక్‌లో తరలిస్తున్నారా అన్న అనుమానాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాహనాల ద్వారా భారీగా సరుకులు రవాణా చేసేటప్పుడు తప్పకుండా సహాయకులను పంపిస్తారు. కానీ ఈ లారీతో ఒక్క డ్రైవరే ఉన్నాడు. మతిస్థిమితం లేని వ్యక్తిని తప్పించబోయి చెట్టును ఢీకొట్టానని డ్రైవర్ చెబుతున్నాడు. కానీ నిర్ణీత వేగంతో వస్తే లారీని అదుపు చేసే అవకాశం ఉంది. అందువల్ల మితి మీరిన వేగం కానీ.. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం కానీ జరిగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు బంక్.. ఇటు గ్రామం ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో ఒకపక్క తర్లువాడ గ్రామం.. మరోపక్క పెట్రోల్ బంక్ ఉన్నాయి. ఈ రెండింటిలో ఏ ఒక్కదానికి చేరువలో ఈ ప్రమాదం జరిగినా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లేది. పెట్రోలు బంక్‌కు ఆనుకొని చాలా తోటలు ఉన్నాయి. మంటలు చెలరేగి ఉంటే అపార నష్టం జరిగి ఉండేదని సంఘట స్థలాన్ని చూసిన స్థానికులు ఆందోళనతో చెప్పారు. -
కాబుల్‌పై ఐసిస్ పంజా
ఆర్మీ ఆసుపత్రిపై దాడిలో 30 మంది దుర్మరణం ఆరుగంటల ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రమూకల ఏరివేత కాబుల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ బుధవారం మరోసారి బాంబు పేలుళ్లు, తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఇక్కడి అతిపెద్ద మిలిటరీ ఆసుపత్రి సర్దార్ దౌడ్ ఖాన్ హాస్పిటల్లోకి వైద్యుల దుస్తుల్లో చొరబడిన ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 30 మందికి పైగా మరణించగా, సుమారు 50 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది రోగులు, వైద్య సిబ్బంది ఉన్నారు. ఆసుపత్రి వెనక ద్వారం వద్ద ఓ బాంబర్ తనను తాను పేల్చేసుకున్న తరువాత ముగ్గురు సాయుధులు రోగులు, వైద్య సిబ్బందిపై బుల్లెట్ల వర్షం కురిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో కారులో బాంబు పేలుడుతో పాటు మరో భారీ పేలుడు జరిగినట్లు తెలిసింది. ఆ తరువాత అఫ్గాన్ ప్రత్యేక భద్రతా దళాలు చేపట్టిన ఆరుగంటల ఆపరేషన్‌లో ముష్కరులు హతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భద్రాతా దళాలు ఆసుపత్రి పైకప్పుపై దిగి దుండగుల పనిపట్టాయని వెల్లడించారు. ఈ దాడికి బాధ్యత తమదే అని ఇస్లామిక్ స్టేట్ జిహాదిస్టులు టెలిగ్రాం అకౌంట్ ద్వారా ప్రకటించారు. ఇందులో తమ పాత్ర లేదని తాలిబన్ స్పష్టం చేసింది. అంతకుముందు..ఆసుపత్రి వార్డుల్లో చిక్కుకున్న వైద్య సిబ్బంది సాయం కోరుతూ ఫేస్బుక్లో పోస్టులు చేశారు. భయంతో కొంతమంది పై అంతస్తులోని కిటికీ చూరుపై దాక్కున్నట్లు టీవీ ఫుటేజీల్లో కనిపించింది. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు
హైదరాబాద్ సిటీ: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. ఈ కేసులోని ఆరుగురు నిందితులలో ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసీన్ భత్కల్ తో పాటు అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్‌లను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీరంతా చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. నిందితులపై దేశద్రోహం, హత్యానేరంతో పాటు పేలుడు పదార్థాల యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా పేలుళ్ల సూత్రధారి రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభియోగపత్రంలో 524 మందిని సాక్షులుగా చూపింది. ప్రాసిక్యూషన్ హాజరుపర్చిన 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు వారు నమోదుచేశారు. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 22 మంది మృతి చెందగా.. 140 మంది గాయపడ్డారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు
-
శాంసంగ్ నెత్తిన మరో బాంబు
-
శాంసంగ్ నెత్తిన మరో బాంబు
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కు కష్టాలు వీడడంలేదు శాంసంగ్ గెలాక్సీ నోట్7 పేలుళ్ల బాధలనుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల సంస్థను తాజాగా మరో వివాదం చుట్టుకుంది. శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు కూడా పేలుతున్న సంఘటనలు ఆందోళన రేపుతుండడంతో అమెరికాలో దాదాపు 30 లక్షల మెషీన్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. శాంసంగ్ వాషింగ్ మెషీన్లు పేలినపుడు బాంబు పేలినంత పెద్ద శబ్దం వచ్చిందని బాధిత వినియోగదారులు ఒకరు వివరించారు. తీవ్రమైన వైబ్రేషన్ రావడం లేదా వాషింగ్ మెషిన్ పైన వుండే టాప్ భయంకరమైన శబ్దంతో పేలిపోవడమోజరుగుతోందంటూ వినియోగదారులు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ పేలుళ్ల సందర్భంగా దవడ, భుజాలు విరిగిపోవడం లాంటి తీవ్ర గాయాలైన దాదాపు 733 కేసులు నమోదు కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. 2011లో విక్రయించిన 34 మోడళ్ల మొత్తం 2.8 మిలియన్ల వాషింగ్ మెషీన్లను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ మెషీన్లను కొనుగోలు చేసిన వారు ఫ్రీగా రిపేరు చేయించుకోవచ్చని, లేదా నగుదును మొత్తం తిరిగి తీసుకోవచ్చని తెలిపింది. లేదంటే మరో శాంసంగ్ మెషీనతో ఎక్సేంజ్ చేసుకుంటే స్పెషల్ రాయితీ అందిస్తున్నట్టు ప్రకటించింది. తమ విశ్వసనీయ వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ క్షమాపణలు తెలిపింది. అయితే నార్త్ అమెరికా వెలుపల అమ్మిన మోడల్స్ లో ఈ ప్రభావం లేదని చెప్పింది. మరోవైపు అమెరికాకు చెందిన కన్జ్యూమర్ సేఫ్టీ ప్రొడక్షన్ అధికారులు (సీపీఎస్సీ) కూడా ఈ విషయంలో వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే రిపేర్ చేయించుకోవాలని లేదా సేఫ్టీ కిట్ వాడాలని సూచించింది. కాగా శాంసంగ్ 2013లో ఆస్ట్రేలియాలో లక్షా యాభైవేల వాషింగ్ మెషిన్లను రీకాల్ చేసింది. అలాగే కొరియాకు చెందిన ఈ మొబైల్ మేకర్ తన తాజా స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లు సృష్టించిన వివాదంతో భారీ ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. -
జపాన్ టు శ్రీకాకుళం
కవర్ స్టోరీ: ఆగస్టు 6 హిరోషిమా డే సందర్భంగా... సునామీ తాకిడి తర్వాత 2011 మార్చి 11న జపాన్‌లోని ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో సంభవించిన పేలుళ్లు మొన్నటికి మొన్న నాగసాకి, హిరోషిమా...నిన్నటికి నిన్న ఫుకుషిమా. ఒకటి ఉద్దేశపూర్వకమైన దాడి. మరొకటి ‘అనుకోని’ దుర్ఘటన. రెండూ ‘అణు’దారుణాలే. రెండింటి పర్యవసానాలూ దాదాపు ఒకటే... భారీ ప్రాణనష్టం... ప్రాణాలు మిగిలిన జనాలకు నయంకాని వ్యాధులు. ఆ వ్యాధులు సోకిన వారికే పరిమితం కాలేదు, తరతరాలనూ వెన్నాడుతూనే ఉన్నాయి. ఇక ప్రకృతికి వాటిల్లిన నష్టం చెప్పనలవి కాదు. ఇవన్నీ అల్లక్కడెక్కడో జపాన్‌లో జరిగిన సంఘటనలు కదా అని వదిలేయగలమా? సాటి మానవుల ప్రాణాలకు ఎక్కడ కష్టం వాటిల్లినా అది కష్టమే కదా! సాటి మానవుల ప్రాణాలకు ఎక్కడ నష్టం వాటిల్లినా అది నష్టమే కదా! ఎక్కడో జరిగిందిలే మనకెందుకని వదిలేస్తే రేపు అలాంటి ముప్పు మనకూ రావచ్చు. నాగసాకి, హిరోషిమాల మాదిరి ఉద్దేశపూర్వక దాడుల వల్ల కాకపోవచ్చు గాని, ఫుకుషిమా మాదిరి మరో‘షిమా’ మన శ్రీకాకుళం జిల్లాలోనే పునరావృతం కావచ్చు. ప్రజల ప్రాణాలను చెల్లని చిల్లరనాణేలుగా పరిగణించే పాలకశ్రేణులకు ఇవేవీ పట్టవు. అందుకే ఎంతమంది శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నా, జనాలు ఎంతగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నా మొండిగా అంతులేని ‘అణు’వ్యామోహాన్ని ప్రదర్శిస్తూ ఆ విధంగా ముందుకు పోవడానికే సిద్ధపడుతున్నాయి. విల్లంబులు ఇంకా అంతరించని కాలం అది. అక్కడక్కడా వినిపించే తుప్పు తుప్పు తుపాకుల చప్పుళ్లకే జనాలు భయపడే కాలం అది. ప్రకృతిలోని పచ్చదనం ఇంకా వన్నెతగ్గని కాలం అది. అలాంటి కాలంలో జర్మన్ రసాయన శాస్త్రవేత్త మార్టిన్ క్లాప్రోత్ 1789లో యురేనియం కనుగొన్నాడు. అప్పట్లో అది ఇనుము వంటి ఇతర మూలకాల్లాంటిదేనని అనుకున్నారే తప్ప వినాశనాలకు మూలం కాగలదనుకోలేదు. యురేనియం కనుగొన్న దాదాపు వందేళ్ల తర్వాత గాని రేడియం, యురేనియం వంటి మూలకాలకు గల అణుధార్మికతను శాస్త్రవేత్తలెవరూ గుర్తించలేదు.వీటి కేంద్రకాలు విచ్ఛిత్తికి గురైనప్పుడు ఉష్ణోగ్రత, శక్తితో పాటు వీటికి చెందిన ప్రమాదకరమైన పార్టికల్స్ ప్రకృతిలోకి విడుదలవుతాయి. ఇలాంటి మూలకాలకు గల ఈ ప్రత్యేక లక్షణానికి పీర్ క్యూరీ, మేరీ క్యూరీ దంపతులు 1896లో తొలిసారిగా ‘రేడియో ఆక్టివిటీ’ (అణుధార్మికత) అనే పేరుపెట్టారు. ఆ తర్వాత రేడియో ధార్మికత గల అణువులను శరవేగంగా ప్రోటాన్లతో ఢీకొట్టించడం వల్ల విస్ఫోటాన్ని సృష్టించే ప్రక్రియను, అపరిమితంగా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చనే విషయాన్ని 1930వ దశకంలోనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు.‘అణు’దుర్ఘటన ఐదేళ్ల కిందట జపాన్‌లోని తొహుకు ప్రాంతంలో భూకంపం వచ్చింది. భూకంపం ధాటికి సునామీ చుట్టుముట్టింది. సునామీ తాకిడికి 2011 మార్చి 11న ఫుకుషిమాలోని అణు విద్యుత్ కేంద్రం విధ్వంసానికి గురైంది. సునామీ చెలరేగిన వెంటనే ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలోని నాలుగో రియాక్టర్ దెబ్బతిని, అందులోని ఇంధన కడ్డీల నుంచి విపరీతమైన వేడి విడుదలైంది. ఫలితంగా వాతావరణంలోకి రేడియో ధార్మిక పదార్థాల విడుదలతో పాటు నాలుగు రోజుల పాటు ఆ రియాక్టర్లో పేలుళ్లు కూడా సంభవించాయి. ఫుకుషిమా దుర్ఘటనలో రేడియేషన్ వల్ల ఎవరూ మరణించలేదు గాని, ప్రమాదస్థలికి పరిసరాల్లోని ప్రజలను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో దాదాపు 1600 మంది మరణించారు. అయితే, ఫుకుషిమా దుర్ఘటన పర్యవసానాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రేడియేషన్ వల్ల వెంటనే ఎవరూ మరణించకపోయినా, దాని ప్రభావం వల్ల కొందరు చిన్నారులు థైరాయిడ్ కేన్సర్‌కు, థైరాయిడ్‌కు సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యారు. ఫుకుషిమాలో జరిగినది చాలా చిన్న ‘అణు’ప్రమాదమని వారు అంటున్నారు. దీని తీవ్రత 1.5 ఎస్వీగా నమోదైంది. ఈ చిన్న ‘అణు’ ప్రమాదానికే పరిస్థితి ఇలా ఉంటే, ఇక పెద్ద ప్రమాదం జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే. ‘అణు’దుర్వినియోగం రేడియో ధార్మికత గల అణువులతో విద్యుత్తునే కాదు, విధ్వంసాలనూ సృష్టించవచ్చు అని తెలిశాక అగ్రరాజ్యమైన అమెరికా ధ్వంసరచనకు ఒడిగట్టింది. బ్రిటన్ సమ్మతితో 1945లో జపాన్‌లోని నాగసాకి, హిరోషిమా నగరాలపై అణుబాంబులను ప్రయోగించింది. ఆ విధ్వంసంలో తక్షణమే 1.29 లక్షల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అణుబాంబుల రేడియో ధార్మికత ప్రభావం నాగసాకి, హిరోషిమాలపై దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంది. ఆ రెండు నగరాల పరిసరాల్లో ఉంటున్న చాలామంది రకరకాల కేన్సర్ల బారిన పడ్డారు. ‘అణు’ విధ్వంసం తర్వాత ఆ ప్రాంతంలో చాలామంది పిల్లలు జన్యులోపాలతో పుట్టారు. నాగసాకి, హిరోషిమా పరిసరాల్లో 1945-2000 మధ్య కాలంలో ల్యూకీమియా సోకి 46 శాతం మంది, ఇతర కేన్సర్ల వల్ల మరో 11 శాతం మంది మరణించారు. తాజా లెక్కల ప్రకారం నాగసాకి, హిరోషిమా పరిసరాల్లో దాదాపు 1.83 లక్షల మంది రేడియో ధార్మికత వల్ల తలెత్తిన రకరకాల వ్యాధులతో ఇంకా బాధపడుతూనే ఉన్నారు. శ్రీకాకుళంలో ‘అణు’గొణలు భారత్‌లోని ప్రతిపాదిత అణు విద్యుత్ కేంద్రాలలో ఒకటి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న కొవ్వాడ వద్ద ఏర్పాటు కానుంది. నిజానికి ఇది గుజరాత్‌లోని మితివర్ధిలో ఏర్పాటు కావాల్సి ఉంది. మితివర్ధిలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని 2007లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 2013 నాటికి అటవీ, పర్యావరణ అనుమతులు కూడా పొందింది. అయితే, దీనిని కొవ్వాడకు తరలిస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది. గుజరాత్ ప్రజలు వ్యతిరేకించడం వల్లనే అక్కడ తలపెట్టిన అణు విద్యుత్ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడకు తరలిస్తోందనే ఆరోపణలున్నాయి. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం కొవ్వాడ, అల్లివలస పంచాయతీల పరిధిలో కొవ్వాడ, చిన్నకొవ్వాడ, రామచంద్రాపురం, గూడాం టెక్కలి గ్రామాలను ఖాళీ చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ గ్రామాల్లో 3500 ఇళ్లు ఖాళీ చేయించనుండగా, సుమారు ఆరువేల మంది ప్రజలు నిర్వాసితులు కానున్నారు. నిజానికి శ్రీకాకుళంలో ‘అణు’గొణలు ఇప్పటివి కావు. మొదట 1992లోనే కొవ్వాడలో న్యూక్లియర్ పార్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. హడావుడిగా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ప్రాజెక్టు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. కొవ్వాడ న్యూక్లియర్ పార్కుకు 2080 ఎకరాలు కావాల్సి ఉండగా, దాని కోసం 1480 ఎకరాల ప్రభుత్వ భూమిని, మిగిలిన 600 ఎకరాలు రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా... కొవ్వాడ, చిన్నకొవ్వాడ, రామచంద్రాపురం, గూడాంటెక్కలి, కోటపాలెం, పాతర్లపల్లి, మరువాడ గ్రామాల రైతుల నుంచి భూసేకరణకు సన్నాహాలు సాగిస్తోంది. అణు హబ్బా... చావుదెబ్బా? ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రధాన ‘అణు’స్థావరంగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలిలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే స్థలాన్ని గుర్తించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌కు రానున్న సందర్భంగా కావలి ‘అణు’ ప్రాజెక్టుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది.వీటితో కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఆరు అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రాన్ని న్యూక్లియర్ హబ్‌గా మారుస్తామని ప్రభుత్వం చెప్పుకొంటోంది. అయితే, అది అణు హబ్బా... ప్రజల బతుకులపై చావుదెబ్బా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు నిరసనలు ఎదురవుతూ ఉండటంతో వీటి ఏర్పాటు కోసం కేంద్రం తాజాగా ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారిస్తోంది. మన కొవ్వాడ మరో ఫుకుషిమా? జపాన్‌లోని ఫుకుషిమాకు, మన ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడకు చాలా సారూప్యతలు ఉన్నాయి. రెండు ప్రాంతాలూ సముద్రతీరంలోనే ఉన్నాయి. జపాన్‌కు భూకంపాలు కొత్త కాదు. దాదాపు దేశమంతా తరచూ భూకంపాలకు గురయ్యే ప్రాంతంలోనే ఉంది. మన దేశంలో భూకంపాలకు గురయ్యే అవకాశాలు గల ప్రాంతాల్లో కొవ్వాడ కూడా ఉంది. భవిష్యత్తులో ఇక్కడ భూకంపాలు సంభవించే ముప్పు కచ్చితంగా ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. అలాంటప్పుడు ఇక్కడ నిర్మించబోయే అణు విద్యుత్ కేంద్రం ఎంతవరకు సురక్షితంగా ఉంటుందనే దానికి ఏమాత్రం భరోసా లేదు. ఒకవైపు గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో అణు విద్యుత్ కేంద్రాలు వద్దంటే వద్దని తిరస్కరిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అణువంతైనా ఆలోచన లేకుండా వాటన్నింటినీ అక్కున చేర్చుకుంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలను తుంగలోకి తొక్కి మరీ అణు విద్యుత్ కేంద్రాలకు చాలా చేరువలోనే జనావాసాల ఏర్పాటుకు అడ్డగోలుగా తెగబడుతోంది. ‘అణు’ వినియోగం నుంచి చాలా అభివృద్ధి చెందిన దేశాలే వెనక్కు తగ్గుతుంటే, మన పాలకులు మాత్రం ఎలాంటి ఆలోచనా లేకుండా దేశవ్యాప్తంగా ఎడాపెడా అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు తెగబడుతుండటం శోచనీయం. అణు విద్యుత్ కేంద్రాల వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడటమే కాదు, వీటిని లక్ష్యంగా చేసుకుని ఏ ఉగ్రవాదులైనా దాడులకు తెగబడితే అప్పుడు జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించనైనా ఊహించలేరు. ప్యాకేజీల ఎర అణు విద్యుత్ కేంద్రంపై వ్యతిరేకతను నీరుగార్చేందుకు ప్రభుత్వం కొవ్వాడ పరిసరాల రైతులకు ప్యాకేజీల ఎర వేస్తోంది. ఈ ప్రాంతంలో భూముల మార్కెట్ ధర ఎకరానికి రూ.3 లక్షల వరకు ఉంది. దీనికి మూడు నాలుగు రెట్లు ప్యాకేజీగా ఇస్తామని ప్రభుత్వం ఆశ చూపుతోంది. నిర్వాసితులకు నారువా గ్రామంలో 350 ఎకరాల్లో పునరావాసం కల్పించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక అణు విద్యుత్ కేంద్రం సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణం కోసం కొత్త సుందరపాలెంలో 350 ఎకరాల స్థలాన్ని గుర్తించింది. స్థల సేకరణ వ్యవహారమై ఇదివరకు ఆర్డీవో ఇక్కడకు వస్తే స్థానికులు అడ్డగించారు. తర్వాత గత ఏడాది శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఇక్కడ నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత ఖాళీ చేసిన ఇళ్ల లబ్ధిదారులకు ఇల్లుతో పాటు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని, మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పరిహారంగా రూ.5 లక్షలు వద్దనుకుంటే, నెలకు రూ.2 వేల చొప్పున ఇరవయ్యేళ్ల పాటు పింఛను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కొవ్వాడ న్యూక్లియర్ పార్కును తొలుత స్థానికులు వ్యతిరేకించినా, ప్రభుత్వం ఇక గత్యంతరం లేని పరిస్థితులు కల్పించడంతో చివరకు దీనికి అంగీకరించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇన్పుట్స్: అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం వ్యతిరేకత ఎందుకంటే..? ⇒ పలు పర్యావరణ సంఘాలు, ప్రజా సంఘాలు కొవ్వాడ వద్ద న్యూక్లియర్ పార్కు ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం న్యూక్లియర్ పార్కుకు కనీసం 38 కిలోమీటర్ల వరకు ఎలాంటి జనావాసాలు ఉండకూడదు. అయితే, కొవ్వాడ వద్ద ఈ పరిమితిని 16 కిలోమీటర్లకు తగ్గించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ⇒ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న కొవ్వాడ భూకంపాలకు అవకాశం గల ప్రాంతంలో ఉంది. భూకంపం, సునామీ వంటి ప్రకృతి విపత్తులు తలెత్తితే ఇక్కడ ఏర్పాటు చేయబోయే అణు రియాక్టర్లు విధ్వంసానికి గురికాకుండా ఉండవు. అలాంటిదేదైనా జరిగితే, దానికి ఎవరు జవాబుదారీ అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ⇒ నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తొలుత కొవ్వాడ ప్రాజెక్టును వ్యతిరేకించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన 2010లో ఇక్కడ పర్యటించినప్పుడు కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామని, తాము అధికారంలోకి వస్తే, ఈ ప్రతిపాదనను రద్దు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను గాలికొదిలేసి, సర్వే పనులను వేగవంతం చేశారు. కవర్‌స్టోరీ: పన్యాల జగన్నాథదాసు -
సిటీపై కమాండ్.. కంట్రోల్
రోల్ మోడల్‌గా సూరత్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ దేశంలో తొలి సేఫ్‌సిటీ ప్రాజెక్టు ఇదే.. ఖజానాపై భారం లేకుండా ఏర్పాటు ‘పీపుల్స్-పబ్లిక్-ప్రైవేట్’ భాగస్వామ్యంలో నిర్మాణం సిటీబ్యూరో: సిటీలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా.. దాంతోపాటే రెచ్చిపోతున్న నేరగాళ్లు.. వీరిని కట్టడి చేసేందుకు, హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు దేశంలోని మెట్రో సిటీస్ కంటే ముందుగా నాలుగేళ్ల క్రితం సూరత్‌లో ఈ విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి ఆ సిటీ పోలీసు కమిషనర్ రాకేష్ ఆస్తానా చొరవతో ప్రభుత్వ ఖజానాపై భారం లేకుండా అత్యాధునికమైన సాంకేతిక పరి జ్ఞానంతో ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.దీనిద్వారా ఇటు నేరగాళ్ల, అటు ట్రాఫిక్ ఉల్లంఘనులకు చెక్ పెట్టారు. ‘సురక్షా సేతు’గా పిలిచే ‘సూరత్ సేఫ్ సిటీ ప్రాజెక్టు’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఆ ఆలోచన ఇలా వచ్చింది.. ముంబైలో 2011 జూలై 13న మూడు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. వీటిలో ఒక పేలుడు అక్కడి వజ్రాల వ్యాపార కేంద్రమైన జువేరీ బజార్‌ను టార్గెట్ చేసిందే. దీనికి నాలుగేళ్ల ముందు 2008 జూలైలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు అహ్మదాబాద్‌లో వరుస బాంబులు పేల్చారు. ఆ మరుసటి రోజు సూరత్‌లోని 15 ప్రాంతాల్లో 29 బాంబుల్ని అమర్చారు. ముంబై పేలుళ్లు జరిగిన కొన్ని నెలలకే గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్తానా సూరత్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. జువేరీ బజార్ మాదిరిగా వజ్రాల వ్యాపార కేంద్రమైన సూరత్ సైతం మరోసారి ఉగ్రవాదుల టార్గెట్‌గా మారే ప్రమాదం ఉందని ఆయన భావించారు. దీంతో పాటు అవసరానికంటే తక్కువగా ఉన్న ట్రాఫిక్ సిబ్బందితో ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని నిర్ణయించి ‘సూరత్ సేఫ్ సిటీ ప్రాజెక్టు’కు శ్రీకారం చుట్టారు. ట్రస్ట్ ఏర్పాటు చేసి ముందుకు.. ప్రాజెక్టులో భాగంగా సూరత్ నగర వ్యాప్తంగా నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ (సీసీసీ) రూపకల్పనకు నిర్ణయించారు. దీన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు నిధుల సమస్య ఎదురైంది. 2012 సెప్టెంబర్‌లో సూరత్‌లో ఉన్న వజ్రాలు, వస్త్ర వ్యాపారులతో పాటు ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు తమ ఆలోచనను వివరించారు. దీనికి అంతా ఆకర్షితులై అక్కడిక్కడే రూ.ఐదు కోట్ల విరాళాలు ఇచ్చారు. ‘సూరత్ సేఫ్ సిటీ ప్రాజెక్టు’లో భాగంగా మొదటి దశలో సీసీసీతో పాటు 23 ప్రాంతాల్లో 104 అత్యాధునిక కెమెరాలు ఏర్పాటుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించారు. అయితే వాటి నిర్మాణానికే కనిష్టంగా వచ్చిన టెండర్ రూ.60 కోట్లకు ఉంది. దీంతో ప్రాజెక్టు బాధ్యతల్ని తామే చేపట్టాలని నిర్ణయించి, రాకేష్ ఆస్తానా దాని కోసం సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులతో ‘ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ ఏర్పాటు చేశారు. మూడు నెలల్లో మొదటి దశ పూర్తి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ ప్రాజెక్టులు ఉండాల్సిన సాంకేతిక అంశాలను ఖరారు చేసింది. సూరత్‌కు చెందిన ‘ఇన్నోవేటివ్ టెలికం అండ్ సాఫ్ట్వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ వాస్తవ ధరలకే ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ఫలితంగా కేవలం రూ.16.5 కోట్లతో తొలిదశ ప్రాజెక్టు మూడు నెలల్లోనే అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ 2013 జనవరి 18న దీన్ని ఆవిష్కరించారు. ట్రస్ట్‌కు విరాళాల వెల్లవ వస్తుండటం, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ సైతం ముందుకు రావడంతో ఇప్పటికి పూర్తయిన రెండు దశల్లో సూరత్‌లోని 97 ప్రాంతాల్లో 614 కెమెరాలు ఏర్పాటయ్యాయి. వీటిలో 24 పీటీజెడ్ పరిజ్ఞానంతో కూడినవి. పూర్తిస్థాయిలో ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ కెమెరాల ద్వారా కనిపించే దృశ్యాలను ఎప్పటికప్పుడు చూసేందుకు సీసీసీలో 280 చదరపు అడుగుల డిజిటల్ వీడియో వాల్ ఏర్పాటు చేశారు. ఇప్పటికి ఈ ప్రాజెక్టుకు రూ.46 కోట్లు ఖర్చయింది. ఐదేళ్ల పాటు ఈ కెమెరాల నిర్వహణ బాధ్యతలు సైతం ‘ఇన్నోవేషన్స్’ సంస్థే చేపట్టింది. మరో మూడేళ్లలో సూరత్ వ్యాప్తంగా 5 వేల కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా ‘సూరత్ సేఫ్ సిటీ ప్రాజెక్టు’ ముందుకు సాగుతోంది. ఇందులో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యమే కాకుండా (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్గా పిలిచే పీపీపీ) ప్రజలదీ ఉడడంతో దీన్ని పీపుల్స్-పబ్లిక్-ప్రైవేట్ పార్టిసిపేషన్ (పీపీపీపీ) మోడల్‌గా అక్కడి అధికారులు చెబుతున్నారు. సిట్యువేషన్ మేనేజ్మెంట్ సిస్టం సూరత్ నగర వ్యాప్తంగా ఎక్కడైనా బాంబు పేలినా, తుపాకీ కాల్పులు జరిగినా, అగ్నిప్రమాదం సంభవించినా ఈ సిస్టంతో అనుసంధానించి ఉన్న కెమెరాలు తక్షణం గుర్తించి సీసీసీలో ఉన్న కంప్యూటర్లో ప్రత్యేక పాప్అప్ ద్వారా సిబ్బందికి సమాచారం ఇస్తాయి. ఘటన జరిగిన ప్రదేశంతో పాటు దానికి సమీపంలో ఉన్న పోలీసు గస్తీ వాహనాల వివరాలనూ చూపిస్తాయి. సీసీసీలోని సిబ్బంది ఆ ప్రాంతంలో ఉన్న కెమెరాను యాక్టివేట్ చేయడం ద్వారా ఏం జరిగిందో నేరుగా చూసే అవకాశం ఉంది. సస్పీషియస్ అలార్మింగ్ సిస్టమ్ సీసీసీలో ఉన్న కంప్యూటర్లో ఈ ప్రత్యేక ప్రోగ్రామింగ్‌తో ఎవరైనా అనుమానిత వ్యక్తి, వస్తువు, వాహనం ఓ ప్రదేశంలో నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు కదలకుండా ఉంటే దాన్ని కెమెరా ద్వారా కంప్యూటర్ గుర్తిస్తుంది. ఆ వస్తువు/వ్యక్తి ఎక్కడుందనే సమాచారాన్ని ప్రత్యేక అలారమ్ ద్వారా సీసీసీలోని సిబ్బందికి సమాచారం ఇస్తుంది. నైట్ విజన్, జూమ్ కెమెరాలు సూరత్‌లో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన కెమెరాలన్నీ అత్యాధునికమైనవే. రహదారులపై ప్రతి కిలోమీటరు దూరానికి ఓ కెమెరా నిఘా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కెమెరా గరిష్టంగా 760 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి ముఖాన్ని పగలు, రాత్రి సైతం స్పష్టంగా చూపిస్తుంది. 500 మీటర్ల దూరంలో ఉన్న వాహనం నెంబర్ ప్లేట్‌ను జూమ్ చేసి చూపిస్తుంది. వీటి ద్వారా సూరత్ పోలీసులు గత ఏడాది నేరాలను 23 శాతం తగ్గించగలిగారు. స్నాచింగ్ నుంచి కిడ్నాప్-మర్డర్ వరకు 84 కేసుల్ని ఈ కెమెరాల ఫీడ్ ద్వారా ఛేదించారు. దీనికి అనుసంధానంగా ‘డయల్-100’, మహిళా హెల్ప్‌లైన్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ తదితరాలను సీసీసీలో ఏర్పాటు చేశారు. మరికొన్ని అత్యాధునిక వ్యవస్థలు సైతం అందుబాటులో ఉంచారు. ఏఎన్పీఆర్ వ్యవస్థ వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించేందుకు ఉపకరించే ‘ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ సిస్టం’ (ఏఎన్పీఆర్) ఇది. చోరీ వాహనాలు, హిట్ అండ్ రన్/ఇతర కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న వాటితో పాటు భారీగా ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాల వివరాలను సర్వర్‌లో నిక్షిప్తం చేసి కంప్యూటర్ ద్వారా కెమెరాలను అనుసంధానించారు. దీంతో ఆయా వాహనాలు నగరంలో ఎక్కడ తిరిగినా వెంటనే గుర్తించే కెమెరాలు సీసీసీలో ఉన్న వారిని అప్రమత్తం చేస్తాయి. -
యూరప్‌లో టెర్రరిస్టుల అరెస్టు పర్వం
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో బాంబు పేలుళ్ల అనంతరం యూరప్ అంతటా అరెస్టుల పర్వం మొదలైంది. ఇప్పటికే ఉగ్రవాదులతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న అనుమానితులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో ఇసుమంత సంబంధమున్నా వారిని నిర్భందిస్తున్నారు. ఈ మంగళవారం బ్రస్సెల్స్‌లోని ఎయిర్ పోర్ట్ పై బాంబు దాడులకు పాల్పడి ఇద్దరు అమెరికన్లతో సహా 31మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించే ఇప్పటికే బ్రస్సెల్స్ లో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు ఆత్మహుతి దళ సభ్యుల వెనుక లగేజ్ నెట్టుకుంటూ వచ్చిన వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు నెయిబ్ అల్ హమీద్ అనే మరో వ్యక్తికి, రీదీ క్రికెట్ అనే వ్యక్తి కోసం వాంటెడ్ నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే, ఫ్రాన్స్, బ్రిటన్, బెల్జియం అంతటా అనుమానిత ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. -
బ్రస్సెల్స్‌లో మరోసారి పేలుడు శబ్దాలు
బ్రస్సెల్స్: బ్రస్సెల్స్‌లో మరోసారి భారీ బాంబు పేలుడు శబ్దం వినిపించింది. స్కార్ బీక్ జిల్లాలో పోలీసులు ఉగ్రవాదుల కోసం వేటాడుతుండగా తాజాగా బాంబు పేలుడు సంభవించిందని రాయిటర్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని కూడా పోలీసులు నిర్భంధించినట్లు సమాచారం. పోలీసుల తనిఖీల వల్ల గంభీరంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్రస్సెల్స్ లోని జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు బాంబు పేలుళ్లు చోటుచేసుకొని దాదాపు 30మందికి పైగా చనిపోగా మరో 40మందికి పైగా గాయాలపాలయిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వారికోసం ప్రస్తుతం బ్రస్సెల్స్‌లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు జరుపుతున్న దాడుల్లో ఒకరు మృతిచెందినట్లు కూడా తెలుస్తోంది. -
బెల్జియం పోలీసుల వేట
బ్రసెల్స్ నిందితుల కోసం విస్తృత గాలింపు ఇద్దరు మంత్రుల రాజీనామా! దాడులపై త్వరలోనే స్పష్టత ఇస్తానన్న ప్రధాని బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో వరు స పేలుళ్లకు పాల్పడిన వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా భావిస్తున్న ఇద్దరి కోసం వేటాడుతున్నారు. మెట్రో రైల్వే స్టేషన్లో ఘటనాస్థలంలో ఒకరిని అనుమానాస్పదంగా గుర్తించగా, మరొకరిని అనుమానాస్పద బాంబర్ (నజిమ్ లాచ్రోయి)గా విమానాశ్రయం సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. తమను పేల్చేసుకున్న బక్రోయి సోదరుల గురించి పోలీసులకు తెలుసని, వారిలో ఒకడైన ఇబ్రహీం బక్రోయి టర్కీ నుంచి వచ్చినట్లు భద్రతా అధికారులు కనుగొన్నారు. అతడి గురించి తాము ముందుగానే హెచ్చరించినప్పటికీ అతడికున్న ఉగ్రవాద సంబంధాలను కనుగొనడంలో బెల్జియం పోలీసులు విఫలమయ్యారని టర్కీ అధ్యక్షుడు రికెప్ టయీప్ ఎర్డోగన్ చెప్పారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే దాడులు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు బెల్జియం మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అంతర్గత భద్రత మంత్రి జాన్ జంబోన్, న్యాయ శాఖ మంత్రి కోయెన్ రాజీనామా చేసినట్లు మీడియా తెలిపింది. దాడుల గురించి త్వరలోనే స్పష్టత ఇస్తామని బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్ చెప్పారు. బ్రసెల్స్ దాడులతో యూరోపియన్ యూనియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆయా దేశాల న్యాయ, హోం శాఖ మంత్రులు త్వరలోనే బ్రసెల్స్‌లో భేటీ అయి ఉగ్రవాద పోరుకు కార్యాచరణ రూపొందించనున్నారు. పెద్ద ఎత్తున నివాళి వరుస పేలుళ్లతో 31 మంది మరణించిన ఘటన షాక్ నుంచి బెల్జియం ఇంకా తేరుకోలేదు. బ్రసెల్స్‌లోని ‘ప్లేస్ డి లా బౌర్స్’ అనే సెంటర్ వద్దకు ప్రజలు పెద్దఎత్తున వచ్చి నివాళులర్పించారు. తామంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని, ప్రపంచమంతా తమతో ఉందంటూ సందేశమిస్తున్నారు. ఇస్లామిక్ స్టే ట్ జిహాదీలు యూరప్‌లో మరిన్ని దాడులకు పాల్పడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఐసిస్‌తో సంబంధాలున్నాయన్న అనుమానంతో 162 మందిని మలేసియాలోని కౌలాలంపూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దెస్లామ్‌కు తెలియదు పారిస్ దాడుల నిందితుడైన సలాహ్ అబ్దెస్లామ్‌కు బ్రసెల్స్ పేలుళ్ల గురించి తెలియదని అతడి న్యాయవాది స్వెన్ మేరీ చెప్పారు. అబ్దెస్లామ్ను జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారన్నారు. బెల్జియంలో దాడులకు ముందు అబ్దెస్లామ్ బ్రసెల్స్‌లో పట్టుబడిన సంగతి తెలిసిందే. అబ్దెస్లామ్పై బెల్జియం పోలీసులు అభియోగాలు నమోదుచేయగా, విచారణ నిమిత్తం అతడిని అప్పగించాలని ఫ్రాన్స్ అధికారులు కోరారు. వెంటనే తనను ఫ్రాన్స్‌కు అప్పగించాలని అబ్దెస్లామ్ చెప్పాడని, దీనిని వ్యతిరేకించవద్దని మేజిస్ట్రేట్‌ను కోరతానని మేరీ పేర్కొన్నారు. భారతీయుడి చివరి ఫోన్ కాల్ గుర్తింపు పేలుళ్ల అనంతరం గల్లంతైన భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవేంద్రన్ గణేశ్ చివరి ఫోన్‌కాల్‌ను అధికారులు గుర్తించారు. బెంగళూరు ఇన్ఫోసిస్‌కు చెందిన గణేశ్ చివరి కాల్‌ను బ్రసెల్స్‌లో మెట్రో రైల్లో మాట్లాడినట్లు కనుగొన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విటర్లో తెలిపారు. ఆయన ఆచూకీ కోసం ఎంబసీ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. -
'బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లకు మాదే బాధ్యత'
బ్రెస్సెల్స్: బెల్జియం రాజధానిలో బ్రస్సెల్స్‌లో బాంబు పేలుళ్ల ఘటనకు తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మంగళవారం బ్రస్సెల్స్‌లోని జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు చోట్ల, పక్కనే రైల్వే స్టేషన్ సమీపంలో మరో పేలుడు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 30 మంది మరణించగా, మరో 35 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. బాంబు పేలుళ్ల ఘటన అనంతరం తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేశారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. పోలీసులు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను అరెస్ట్ చేశారు. బెల్జియం, ఫ్రాన్స్ సరిహద్దును మూసివేసి ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు వేటాడుతున్నాయి.