సాక్షి,ముంబై: ముంబైలోని భారత పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. పలుమార్లు ఈ పేలుళ్లు జరగడంతో మంటలు ఎగిసి పడ్డాయి. ముంబై మహల్ రోడ్ చెంబూర్ ప్రాంతంలోని రిఫైనరీలో ఈ విస్ఫోటనం సంభవించింది. పేలుళ్ల తరువాత భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయని అగ్నిమాపక అధికారులు వెలడించారు. 7అగ్నిమాపక శకటాలు, 2 ఫోం టెండర్లు, జంబో ట్యాంకర్లతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 21 మంది తీవ్రంగా గాయపడినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment