ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 15 ఇళ్లు దగ్ధం? | Mumbai a Massive Fire Broke out 15 Houses were Damaged | Sakshi
Sakshi News home page

Mumbai: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 15 ఇళ్లు దగ్ధం?

Published Sat, Feb 17 2024 9:05 AM | Last Updated on Sat, Feb 17 2024 1:48 PM

Mumbai a Massive Fire Broke out 15 Houses were Damaged - Sakshi

ముంబైలోని గోవండిలోని బైగన్‌వాడి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 15 ఇళ్లకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఆ ఇళ్లు భారీగా  దెబ్బతిన్నాయి. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. 

అగ్నిమాపక దళం రాకముందే స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనలో కనీసం పది నుండి పదిహేను ఇళ్లు దెబ్బతిన్నాయని ఒక అధికారి తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరకీ ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వాహనాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేశారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement