ముంబై: ఒక్కొసారి కొన్ని విన్యాసాలు పేరును తెచ్చిపెడితే.. అవే విన్యాసాలు వివాదంలోకి నెట్టుతాయి. ఎత్తైన భవనంపై ప్రమాదకరమైన విన్యాసం వేసి ఓ యువకుడు అరెస్టైన సంఘటన శుక్రవారం ముంబైలో చోటుచేసుకుంది. సదరు యువకుడిని నోమన్ డిసౌజాగా ముంబై పోలీసులు గుర్తించారు. వివరాలు.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో నోమన్ డిసౌజ్ ఎత్తైన భవనం అంచున హ్యాండ్‌స్టాండ్ వేశాడు. ఈ వీడియో ముంబై పోలీసుల దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టారు. పశ్చిమ ముంబైలో కండివాలిలోని భారత్ ఎస్‌ఆర్‌ఏ భవనంలోని 22వ అంతస్తుపై ఈ ప్రమాదకర విన్యాసం వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. (చదవండి: కలిసికట్టుగా ఊడ్చేశారు..టీంవర్క్ అంటే ఇది)
అంత్యంత ఎత్తైన ఈ భవనం అంచున విన్యాసం వేసి వైరల్ అవుదాం అనుకున్నాడు డిసౌజా. ఇందుకోసం 22వ అంతస్తు అంచున హ్యాండ్‌స్టాండ్ వేసి ఎనర్జీ డ్రింగ్ తాగుతూ విన్యాసం వేశాడు. ఈ వీడియోను అతడి ఇద్దరూ స్నేహితులు మొబైల్‌లో చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియోను వైరల్ అయ్యింది. అది చూసిన నెటిజన్‌లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాస్పదంగా ఉన్న ఈ వీడియో చూసిన పోలీసులు డిసౌజాతో పాటు అతడి ఇద్దరూ స్నేహితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.(చదవండి: హెడ్ ఫోన్లు వాడుతున్నారా? బీ కేర్‌ఫుల్)
Comments
Please login to add a commentAdd a comment