Mumbai Man Performs Dangerous Stunt With Bike Video Viral - Sakshi
Sakshi News home page

ఓరి నీ వేషాలో.. హీరోలా ఫీలై ఇద్దరమ్మాయిలతో బైక్‌ స్టంట్‌.. తర్వాత ఏమైందంటే..

Published Sat, Apr 1 2023 1:43 PM | Last Updated on Sat, Apr 1 2023 2:48 PM

Mumbai Man Performs Dangerous Stunt With Bike Video Viral - Sakshi

ముంబై: ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని పోలీసులు ఎన్నిసార్లు చెబుతున్నా కొందరు మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. రూల్స్‌ పాటించనందుకు జరిమానాలు విధిస్తున్నా డోంట్‌ కేర్‌ అంటూ బైక్‌లతో స్టంట్స్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాల బారినపడుతూ, ప్రమాదాలకు గురవతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ బైకర్‌ చేసిన స్టంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

వివరాల ప్రకారం.. ముంబైలో ఓ వ్యక్తి ప్రమాదకర స్టంట్‌ చేశాడు. ఓ యువకుడు తన బైక్‌పై ముందు భాగంలో ఒక యువతిని, వెనుక మరో యువతిని కూర్చోబెట్టుకుని స్టంట్స్‌ చేశాడు. బైక్‌ ముందు భాగాన్ని అమాంతం పైకిలేపి అలానే కొద్ది దూరంపాటు తీసుకెళ్లాడు. ఇలా కొద్ద దూరంగా ముందు టైర్‌ గాల్లోనే ఉండి.. బైకర్‌ స్టంట్‌ను పూర్తి చేశాడు. ఇక, దీన్ని మరో బైక్‌ మీద వస్తున్న వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోను పాట్‌హోల్‌ వారియర్స్‌ ఫౌండేషన్‌  అనే సంస్థ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టుచేసింది. 

ఇక, ఈ వీడియో మహారాష్ట్ర పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది సదరు సంస్థ. వీడియోతో పాటు బైక్‌ నంబర్‌ను కూడా జోడించి ట్విట్టర్‌ వేదికగా ముంబై ట్రాఫిక్‌ పోలీసులకు ట్యాగ్‌ చేసింది. కాగా, వీడియోపై స్పందించిన పోలీసులు.. బైకర్‌తోపాటు ఆ ఇద్దరు అమ్మాయిలపై కేసు నమోదుచేసినట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. వీరి గురించి వివరాలు తెలిస్తే.. పోలీసులకు సమాచారం అందించాలని ట్రాఫిక్‌ విభాగం కోరింది. ముగ్గురిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement