
ఇది సోషల్ మీడియా కాలం.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ 24 గంటలు ఆన్‌లైన్‌లోనే గడుపుతున్నారు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో పాపులర్ అయ్యేందుకు తహతహలాడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ లైకులు, వ్యూవర్‌షిప్ కోసం అట్రాక్ట్ చేస్తున్నారు. రోజురోజుకీ ఈ పిచ్చి పీక్స్‌కు వెళుతోంది. వాటి కోసం ఒక్కోసారి ప్రమాదాలను కోరి తెచ్చుకుంటున్నారు.. తాజాగా ఓ యువతి వైరల్ అవ్వడం కోసం తుపాకీతో నడిరోడ్డుపై రీల్స్ చేయడంతో ఇరకాటంలో పడింది.
ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో హైవేపై ఓ అమ్మాయి తన చేతిలో పిస్తోల్‌తో ఆ రీల్స్ కోసం డ్యాన్స్ చేసింది. పాపులర్ యూట్యూబర్ సిమ్రన్ యాదవ్ .. లక్నో హైవేపై ఓ భోజ్‌పురి పాటైకు స్టెప్పులేసింది. యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఓ అడ్వకేట్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశాడు.
వీడియో వైరల్‌కావడంతో లక్నో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ అమ్మాయిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటన పట్ల విచారణకు ఆదేశించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక యువతి డ్యాన్స్ వీడియోపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆమెను మెచ్చుకుంటుంటే.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
instagram star सिमरन यादव लखनऊ सरेआम नियम कानून व आचार संहिता की धज्जियाँ उड़ाते हुए highway पर पिस्टल को लहराकर video वायरल करके समाज में अपनी बिरादरी का रौब जमा रहीं हैं परंतु अधिकारी चुप्पी साधे हुए है l @dgpup @ECISVEEP @Splucknow_rural @Igrangelucknow @adgzonelucknow @myogi pic.twitter.com/GN4zWsc1P9
— Advocate kalyanji Chaudhary (@DeewaneHindust1) May 9, 2024
Comments
Please login to add a commentAdd a comment