ఈ వీడియోలు యమా టేస్టీ.. | India Food Service Report 2024 Revealed | Sakshi
Sakshi News home page

ఈ వీడియోలు యమా టేస్టీ..

Published Tue, Jul 23 2024 5:56 AM | Last Updated on Tue, Jul 23 2024 5:56 AM

India Food Service Report 2024 Revealed

విభిన్న దేశీయ రుచులపై ఇన్‌స్టా, యూట్యూబ్‌లో విదేశీయుల వంటకాలు 

నెట్టింట ఘుమఘుమలకు లక్షలాది మంది వీక్షకులు 

మరోవైపు.. దేశంలో తినుబండారాల ఆహార రంగం వ్యాపారానికి భలే గిరాకీ 

ప్రస్తుతం దేశంలో ఏటా రూ.5.69 లక్షల కోట్ల వ్యాపారం 

2028 నాటికి ఇది రూ.7.76 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా 

ఇండియా ఫుడ్‌ సర్వీస్‌ రిపోర్టు–2024 వెల్లడి 

సాక్షి, అమరావతి : జేక్‌ డ్రయాన్, ఆండ్రియా, చెయ్‌సింగ్, సారా టాడ్, బెరిల్‌ షెరెషెవ్‌స్కీ.. వీరంతా ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. జేక్‌ డ్రయాన్‌ది ఇంగ్లండ్‌ అయితే.. ఆండ్రియా ఒక జర్మన్‌.. సారా టాడ్‌ ఒక ఆస్ట్రేలియన్‌.. బెరిల్‌ షెరెòÙవ్‌స్కీది న్యూయార్క్‌. వీరందరిలో ఒక సారూప్యత ఉంది. రకరకాల భారతీయ వంటకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ఈ ఫుడ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు. ఇలా వారు ఇన్‌స్ట్రాగాం రీల్స్, యూట్యూబ్‌ షాట్స్‌ ద్వారా సోషల్‌ మీడియా వేదికపై లక్షలకొద్దీ ఫాలొవర్లను సంపాదించుకుని ఘుమఘుమలాడే మన దేశీయ రుచులకు ఎక్కడలేని ప్రాచుర్యం కల్పిపస్తున్నారు.   

యూట్యూబ్‌ వంటల వీడియోల్లో ఇటీవల కాలంలో కొత్త ఒరవడి మొదలైంది. కేవలం మన దేశానికి పరిమితమై ఉండే, లేదంటే ఇక్కడే కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండే చాలారకాల వంటలపై మన దేశంతో ఏ సంబంధంలేని విదేశీయులు కొందరు రూపొందిస్తున్న వీడియోలు లక్షల మంది భారతీయులు మెచ్చుకునేలా ఉంటున్నాయి. ఫుడ్‌ బ్లాగర్‌ అయిన జేక్‌ డ్రయాన్‌ తనకు తానుగా దక్షిణాది భారతీయులకు అత్యంత ప్రియమైన సాంబారు–ఇడ్లీ వండుతూ చేసిన వీడియోను 25 లక్షల మంది వీక్షించారు. 

కేవలం ఇన్‌స్టాలోనే దాదాపు 18 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న డ్రయాన్‌ మన దేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన 17 రాష్ట్రాలకు చెందిన వంటకాలపై వీడియోలు చేశారు. ఇతను మన దేశాన్ని ఎప్పుడూ సందర్శించనప్పటికీ మనవాళ్ల ఆసక్తి, అభిరుచుల నాడి పట్టుకుని పసందైన వీడియోలు చేస్తున్నారు. బిహార్‌లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన ‘సత్తు కా పరంత’.. రాజస్థాన్‌ ‘దాల్‌ బాటి చుర్మా’ వీడియోలకు నెట్టింట అత్యంత ఆదరణ దక్కింది.

 అలాగే, జర్మనీకి చెందిన అండ్రియా మన దేశంలోని పంజాబ్‌ యువకుడిని పెళ్లి చేసుకుంది. దాంతో భారతీయ వంటకాలపై ఆమెకు ఆసక్తి పెరిగింది. అలా ఆండ్రియా రూపొందించిన భారతీయ వంటల వీడియోలకు సోషల్‌ మీడియా ఇన్‌స్ట్రాగాంలో ఆమెకు 1.69 లక్షల మంది ఫాలోవర్లును తెచి్చపెట్టింది. అంతేకాదు.. ఆ్రస్టేలియాకు చెందిన సారా టాడ్, న్యూయార్క్‌లో నివాసం ఉండే బెరిల్‌ షెరెషెవ్‌స్కీ లాంటి విదేశీయుల భారతీయ వంటల వీడియోలు మన దేశంలో యమా క్రేజ్‌ పొందాయి. 

ఉపాధి అవకాశాల్లోనూ అదరహో.. 
ఇక మన దేశంలో అత్యధిక మంది ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిపస్తున్న రెండో అతిపెద్ద రంగంగా కూడా ఆహార రంగం ప్రగతి సాధించిందని ఆరి్థక నిఫుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రంగంలో ఏటా 85 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు తెచ్చి పెడుతుండగా, 2028 నాటికి  ఏటా కోటికి మందికి దక్కే అవకాశం ఉందని అంచనా.  

ది ఇండియా ఫుడ్‌ సర్వీవస్‌ రిపోర్టు–2024 ప్రకారం..
ప్రస్తుతం దేశంలో ఏటా ఆహార రంగ వ్యాపారం రూ.5.69  లక్షల కోట్లు 
2028 నాటికి చేరుకునే మొత్తంరూ.7.76 లక్షల కోట్లు 
ప్రస్తుతం ఈ రంగంలో ఏటా ఉపాధి అవకాశాలు 85 లక్షలమందికి 
2028 నాటికి ఉపాధికోటి మందికి 
2028 నాటికి ఈ రంగం వ్యాపార లావాదేవీల్లో సంఘటిత రంగంవాటా 53 %
ఆహార రంగం వ్యాపార లావాదేవీల్లో అసంఘటిత రంగం వాటా56.7 %

వంటలపైనే ఏటా రూ.5.69 లక్షల కోట్ల వ్యాపారం.. 
ఇలా యూట్యూబ్‌లో వంటల వీడియోలు చూస్తూ నచి్చన వంటలను చేసుకుని తినడమే కాదు.. అప్పుడప్పుడూ ఇంటిల్లిపాదీ రెస్టారెంట్లకు వెళ్లి అక్కడి రుచులను ఆస్వాదించే సంస్కృతి కూడా బాగా పెరిగిపోయింది. పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు, విజయవాడ, విశాఖపట్నంతోపాటు ఓ మోస్తరు పట్టణాల్లో సైతం పుట్టగొడుగుల్లా వెలు­స్తున్న రెస్టారెంట్లు వీకెండ్స్, సెలవు రోజుల్లో కిక్కిరిసిపోయి ఉంటున్నాయంటే ఫుడ్‌ బిజినెస్‌కు ఏ స్థాయిలో ఆదరణలో ఉందో తెలుస్తుంది. నిజానికి.. ఆరి్థకవేత్తలు చెబుతున్న గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం మన దేశంలో ఏటా రూ.5.69 లక్షల కోట్ల మేర వ్యాపారం ఈ ఆహార రంగంలో జరుగుతోంది. 

ఇంకోవైపు.. దేశంలో అన్ని వ్యాపార రంగాల్లో కొనసాగుతున్న వృద్ధి కంటే ఒక్క ఆహార రంగంలోని వ్యాపార వృద్ధే అధికంగా ఉన్నట్లు వారంటున్నారు.  ది ఇండియా ఫుడ్‌ సర్వీస్‌ రిపోర్టు–­2024 ప్రకారం.. దేశ ఆహార రంగంలో ఏటా రూ.5.69 లక్షల కోట్ల మేర వ్యాపారం కొనసాగుతుండగా, 2028 నాటికి అది ఏకంగా రూ.7.76 లక్షల కోట్లకు చేరుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు. 

బడా పారిశ్రామికవేత్తల పెట్టుబడులు.. 
ఇలా.. ఈ రంగంపై భారీ వృద్ధి అంచనాలు ఉండడంతో బడా పారిశ్రామిక వ్యాపారవేత్తలు సైతం ఈ రంగంపై కన్నేసి కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని ఆహార రంగం వ్యాపార లావాదేవీల్లో 56.7 శాతం మేర అసంఘటిత రంగంలోని చిన్న హోటళ్ల ద్వారా సాగుతుండగా, 2028 నాటికి ఈ లావాదేవీలు 47 శాతానికి పరిమితమై ప్రభుత్వం వద్ద గుర్తింపు పొందిన సంఘటిత రంగం ద్వారా 53 శాతం లావాదేవీలు కొనసాగుతాయని నిపుణులు 
చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement