
యువత అభిరుచులను ప్రభావితం చేయడంలో సోషల్ మీడియా ఫస్ట్
రెండో స్థానంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు
మూడు, నాలుగు స్థానాల్లో టీవీలు, డిజిటల్ మీడియా
స్ప్రౌట్స్ సోషల్ ఇండెక్స్ నివేదికలో వెల్లడి
కొత్త బట్టలు కొనాలన్నా... లేటెస్ట్ గాడ్జెట్ కావాలన్నా... టీవీలు, ఫ్రిడ్జ్‌లు వంటి గృహోపకరణాలు తీసుకోవాలనుకున్నా.. ఇంటీరియర్ డిజైనింగ్.. ఆటోమొబైల్స్.. ఆభరణాలు.. ఇలా మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ట్రెండ్స్ తెలుసుకునేందుకు సోషల్ మీడియా వేదికలను ఆశ్రయిస్తున్నామని యువత ముక్తకంఠంతో చెబుతోంది.
హాలిడే ట్రిప్స్‌ను ప్లాన్ చేసేందుకు సైతం సోషల్ మీడియాలోనే అన్వేషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వస్తు వినియోగ మార్కెట్‌ను సోషల్ మీడియా శాసిస్తోంది. అంతర్జాతీయ మార్కెటింగ్ కన్సల్టెన్సీ స్ప్రౌట్ సోషల్ ఇండెక్స్ తాజా నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. – సాక్షి, అమరావతి
1 కొత్త ఫ్యాషన్లు, మార్కెట్ ఆవిష్కరణల గురించి తెలుసుకునేందుకు యువత ఆధారపడే వాటిలో సోషల్ మీడియా స్థానం
90 శాతం కొత్త ఫ్యాషన్లు, మార్కెట్ ఆవిష్కరణల గురించి తెలుసుకునే విషయంలో సోషల్ మీడియానునమ్మేవారు
81 శాతం సోషల్ మీడియా ప్రభావంతో తక్షణం స్పందించి వస్తువులు కొనుగోలు చేస్తున్నవారు
» కొత్త ఫ్యాషన్లు, మార్కెట్ ఆవిష్కరణలను గురించి తెలుసుకునేందుకు యువత ఆధారపడేవాటిలో సోషల్ మీడియా మొదటి స్థానంలో ఉంది. ఏకంగా 90శాతం మంది యువత సోషల్ మీడియాను విశ్వసిస్తున్నారు.
» స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదించడం అనేది రెండో స్థానంలో ఉంది. 68శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు.
» టీవీ చానళ్లు మూడో స్థానంలో ఉన్నాయి. 60శాతం మంది యువత టీవీ చానళ్లలో ప్రకటనలను పరిశీలిస్తున్నారు.
» నాలుగో స్థానంలో డిజిటల్ మీడియా ఉంది. 54శాతం మంది డిజిటల్ మీడియా ద్వారా మార్కెటింగ్ ట్రెండ్స్ తెలుసుకుంటున్నారు.
» పాడ్ కాస్ట్ ప్రసారాలను 35శాతం మంది విశ్వసిస్తున్నారు.
» 23శాతం మంది పత్రికలను ఆశ్రయిస్తున్నారు.
» సోషల్ మీడియా ప్రభావంతో తక్షణం స్పందించి నచ్చినవి కొనుగోలు చేస్తున్నామని ఏకంగా 81శాతం మంది చెప్పారు.
» కనీసం నెలకు ఒకసారి అయినా సోషల్ మీడి యా తమ కొనుగోలు అభిరుచులను నిర్దేశిస్తోందని 28శాతం మంది తెలిపారు.
» ఇక ఏదైనా బ్రాండ్ గురించి సోషల్ మీడియాలో లేకపోతే తాము ప్రత్యామ్నాయ బ్రాండ్ల పట్ల మొగ్గుచూపుతున్నట్లు 78శాతంమంది వెల్లడించారు.
» సోషల్ మీడియా ద్వారా వస్తువుల కొనుగోలుకు పలు కారణాలను కూడా యూజర్లు వెల్లడించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రదర్శించే వివిధ కంపెనీల ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారులకు అందించే సేవల పట్ల సంతృప్తి కారణంగా వస్తువులు కొనుగోలు చేస్తున్నామని 63శాతం మంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment