digital media
-
డిజిటల్ మీడియాకూ ప్రభుత్వ ప్రకటనలు
హైదరాబాద్: ప్రతిక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆన్లైన్ న్యూస్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలంటూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) ప్రత్యేక కమిషనర్ ఎస్ హరీష్‌కు విజ్ఞప్తి చేశారు తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (TDMJA) నాయకులు స్వామి ముద్దం, పోతు అశోక్. ఈ మేరకు ఆన్లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుపుతూ లేఖ అందించారు.దీనిపై సానుకూలంగా స్పందించిన ఐ అండ్ పీఆర్ కమిషనర్.. త్వరలోనే ఆన్లైన్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే ప్రక్రియ షురూ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు స్వామి ముద్దం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా డిజిటల్ మీడియా రంగం కీలక పాత్ర వహిస్తుందన్నారు.ఈ కొత్త మాధ్యమంలో అనేక మంది జర్నలిస్టులు పని చేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ న్యూస్ మీడియాకు గుర్తింపును ఇస్తూ ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి సహకరించాలని ఐ అండ్ పీ ఆర్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించి, ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడం సంతోషకరమని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆన్లైన్ న్యూస్ మీడియాకు తెలంగాణ మీడియా అకాడమీ ఆక్రిడిటేషన్లు ఇచ్చేందుకు గైడ్‌లైన్స్ రూపొందించడం కొత్త మీడియా జర్నలిస్టులకు శుభపరిణామమని చెప్పారు. -
మీడియాకు క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్!
టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్.. మీడియాకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల క్రితం 'పొట్టేల్' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా రివ్యూ రైటర్లపై దారుణమైన కామెంట్స్ చేశాడు. ఇక్కడ రాయలేని బాషలో మాట్లాడాడు. దీంతో నోటికొచ్చినట్లు వాగిన శ్రీకాంత్‌పై డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: శ్రీకాంత్ అయ్యంగర్.. ఏంటీ నోటి దురుసు?)తన వ్యాఖ్యలపై శ్రీకాంత్ అయ్యంగర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అప్పటివరకు ఇతడు నటించిన సినిమాల ప్రెస్ మీట్స్‌కి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రీకాంత్.. రివ్యూ రైటర్లకు సారీ చెప్పేందుకు ముందుకు వచ్చాడు. నా మాటలతో మీకు బాధ కలిగించాను. త్వరలోనే క్షమాపణ చెబుతా అని వీడియో రిలీజ్ చేశాడు.నోటికొచ్చిందల్లా వాగే శ్రీకాంత్.. సారీ చెబితే అయిపోయేదానికి త్వరలో చెబుతా అని అనడం చూస్తుంటే వైరల్ కావాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడా అనిపిస్తుంది. మరి త్వరలో సారీతో పాటు ఏం చెబుతాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)త్వరలోనే మీ అందరికీ క్షమాపణలు చెప్తాను - శ్రీకాంత్ అయ్యంగార్ pic.twitter.com/V4Y5NqsoMV— Rajesh Manne (@rajeshmanne1) October 27, 2024 -
మీడియా స్వేచ్ఛకు కళ్లెమా!
వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయకతప్పని పక్షం రోజుల్లోనే ప్రస్తుతం భిన్నవర్గాల పరిశీలనలో ఉన్నదని చెబుతున్న బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు ముసాయిదాను కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వెనక్కి తీసుకుంది. కారణమేదైనా ఇది ఆహ్వానించ దగ్గ పరిణామం. ఈ బిల్లు తొలి ముసాయిదా నిరుడు నవంబర్‌లో విడుదల చేయగా దానిపై వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని చెబుతూ గత నెల రెండో ముసాయిదా తీసుకొచ్చారు. తాజాగా దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. వచ్చే అక్టోబర్ 15 వరకూ ముసా యిదా బిల్లుపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. బహుశా శీతా కాల సమావేశాలనాటికి దీనికి తుదిరూపం ఇవ్వాలన్నది పాలకుల ఉద్దేశం కావొచ్చు. డిజిటల్ మీడియా ప్రస్తుతం ఊహకందని రీతిలో విస్తరించింది. 1959లో ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ప్రారంభించిన టెలివిజన్ ప్రసారసేవలు 80వ దశకం చివరినాటికి కొత్త పుంతలు తొక్కాయి. స్టార్ టీవీ, ఎంటీవీ, బీబీసీ, సీఎన్ఎన్ వగైరాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రస్తుతం యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్వంటి సామాజిక మాధ్యమాలతోపాటు ఓటీటీలు వచ్చాయి. వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి సరేసరి. అన్నింటా మంచీ చెడూ ఉన్నట్టే వీటివల్ల కూడా సమస్యలు ఎదురువుతూ ఉండొచ్చు. అవి దుష్పరిణామాలకు దారితీయటం నిజమే కావొచ్చు. అందుకు తగిన చట్టాలు తీసుకు రావటం కూడా తప్పేమీ కాదు. కానీ ఈ మాధ్యమాలను నియంత్రించే పేరిట భావప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం వేయాలనుకోవటం, అసమ్మతిని అణిచేయాలనుకోవటం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ ముసాయిదా బిల్లు చేస్తున్నది అదే. గతంలో కేబుల్ రంగం హవా నడిచినప్పుడు వీక్షకులకు ఇష్టం ఉన్నా లేకున్నా అనేక చానెళ్లు వచ్చిపడేవి. వర్తమానంలో అలా కాదు. ఏం చూడాలో, వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ వీక్షకులకు ఉంటుంది. పార్టీలకు అమ్ముడుపోయిన చానెళ్లు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అర్థమయ్యాక జనం వాటిని చూడటం మానుకుంటున్నారు. ఆన్లైన్లో ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటున్నారు. తమకు నచ్చిన, తాము తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఉన్నదనుకుంటేనే ఆన్లైన్లో లభ్య మయ్యే వీడియోలను వీక్షిస్తారు. వార్తా విశ్లేషణలను చదువుతారు. ఒక అంశంపై ఎవరెవరి అభిప్రా యాలు ఎలావున్నాయో తెలుసుకుంటారు. ఈ క్రమంలో సహజంగానే ప్రజలను పక్కదోవపట్టించేవాళ్లు ఉంటారు. అశ్లీలతనూ, దుర్భాషలనూ గుప్పించేవారుంటారు. తప్పుడు కథనాలను ప్రసారం చేసేవారూ ఉంటారు. అలాంటివారిపై తగిన చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ కాదనరు. కానీ నిజాయితీగా అభిప్రాయాలు వ్యక్తీకరించేవారిని కూడా వారితో సమంచేసి శిక్షించే ధోరణి ఎంతవరకూ సబబు? అత్యధిక వీక్షకుల్ని రాబట్టుకుంటున్న ఆన్లైన్ మాధ్యమాలకు సైతం ముసా యిదాలో ఏముందో అధికారికంగా తెలియదు. అనేకానేక ఆన్లైన్ చానెళ్లు, ఇతర ప్రచురణ మాధ్య మాలూ సభ్యులుగా ఉన్న డిజిపబ్ వంటి స్వయంనియంత్రణ సంస్థలకే ఈ ముసాయిదాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి వర్తమానమూ లేదు. మరి కేంద్రం ఇంతవరకూ సాగించామంటున్న సంప్రదింపులు ఎవరితో జరిగినట్టు? రెండు మూడు ఓటీటీ యాజమాన్యాలనో, కార్పొరేట్ రంగ ఆధిపత్యంలో సాగుతున్న ఇతర మాధ్యమాలనో, తాము నిపుణులుగా భావించేవారినో సంప్రదిస్తే సరిపోతుందా? సాగు చట్టాల విషయంలోనూ లక్షలాదిమంది రైతులతో, వేలాది సంఘాలతో చర్చించామని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. చివరకు ఏమైంది? రైతులు పట్టుదలగా పోరాడాక వెనక్కు తీసుకోకతప్పలేదు. సమస్యేమంటే...ట్విటర్లో లక్షల్లో అనుయాయులున్న రాజకీయ నాయకులు మొదలుకొని ధ్రువ్రాఠివంటి పాపులర్ యూట్యూబర్ల వరకూ... ఎంతో నిబద్ధతతో సీనియర్ జర్నలిస్టులు నడిపే మాధ్యమాలవరకూ అందరినీ ముసాయిదా బిల్లు ఒకే గాటన కడు తోంది. ఆఖరికి పత్రికలూ, చానెళ్లూ అనుబంధంగా నడుపుతున్న డిజిటల్ మాధ్యమాలు సైతం ఈ పరిధిలోకొస్తాయి. పైగా ఈ కార్యకలాపాలు క్రిమినల్ చట్టాల పరిధిలోకి కూడా వెళ్లి అనేక కేసులు దాఖలవుతాయి. అరెస్టయితే బెయిల్ దుర్లభమవుతుంది. తటస్థంగా విశ్లేషణలందిస్తూ వేలల్లోనో, లక్షల్లోనో వీక్షకుల్ని సంపాదించుకుంటున్న వ్యక్తులు కూడా ఈ బిల్లు చట్టమైతే అనేకానేక పత్రాలు దాఖలుచేయాల్సివస్తుంది. అంతేకాదు...ఒక గ్రీవెన్స్ అధికారిని నియమించుకోవటం, స్వీయ మదింపు కమిటీని ఏర్పాటుచేసుకోవటం తప్పనిసరవుతుంది. ఈ వ్యయాన్నంతా వీక్షకులనుంచి వసూలు చేయటం సాధ్యమేనా? అసలు వచ్చే ఆదాయం ఎంత? పైగా తప్పుడు కథనాలు ప్రసారం చేశారనుకుంటే వారెంట్ లేకుండా దాడులు చేసి పరికరాలను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభు త్వాలకు వస్తుందంటున్నారు.ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి విపక్షాలను జైళ్లలో కుక్కి అసమ్మతిని అణి చేశారని బీజేపీ తరచు చెబుతుంటుంది. రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా ప్రతియేటా జూన్ 25ను పాటించాలని కూడా పిలుపునిచ్చింది. అలాంటి పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ముసాయిదాను తీసుకురావటం, దాన్ని బహిరంగపరచకపోవటం వింత కాదా? మన పొరుగు నున్న బంగ్లాదేశ్‌లో హసీనా హయాంలో ఇలాంటి చట్టాన్నే తీసుకొచ్చారు. కానీ అక్కడ నిరసన వెల్లువ ఆగిందా? తమ నిర్ణయాలపై సామాన్యులు ఏమనుకుంటున్నారో, వారిలోవున్న అసంతృప్తి ఏమిటో తెలుసుకోవటానికి డిజిటల్ మీడియా తోడ్పడుతుంది. అది పాలకులకే మంచిది. మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టయిన ఇలాంటి ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవటం ఉత్తమం. -
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
‘గుడ్ మార్నింగ్.... ఇదొక అంద మైన మార్నింగ్’ అంటూ 16 ఏళ్ల క్రితం తెలుగు లోగిళ్లను.. తాకిన ‘సాక్షి’ని తెలు గు ప్రజలందరూ అభిమానపూర్వకంగా మీ మనసుల్లో నిలుపుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ వార్తా ప్రపంచంలో ఒంటెత్తు పోకడకు ఫుల్స్టాప్ పెడుతూ నాణేనికి మరోవైపును చూపుతూనే ఉంది ‘సాక్షి’. ఆల్కలర్ పేజీలు, ఏకకాలంలో 23 ఎడిషన్లతో మొదలైన సాక్షి తరువాతి కాలంలో దినదిన ప్రవర్ధమానమై శాటి లైట్ చానల్, డిజిటల్ మీడియాకూ విస్తరించింది. పాఠకుల అవసరాలు.. మనోభావాలకు తగ్గట్టుగా తనను తాను మలచుకోవడంలో సాక్షి ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంది. అంత ర్జాతీయ ప్రమాణాలు, డిజైన్లతో ‘సాక్షి’ చానల్ ఇటీవలే సరికొత్త రూపు సంతరించుకున్న విషయం మీకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు... "Sakshi.com''కు కూడా కొత్త సొబగులు అద్దుతున్నాం.జర్నలిజం విలువలలో ఏమాత్రం రాజీ పడకుండా... డిజైనింగ్, నావి గేషన్ విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ మీకోసం మరింత అందంగా తయారైంది మీ వెబ్సైట్! కంటికి ఇంపుగా... వార్తలు చదివేందుకు మరింత సులభతరంగా ఉంటుంది ఇది. ఇంటర్నెట్ తాజా పోకడలను ప్రతిబింబించే లుక్ అండ్ ఫీల్, సులభంగా నావిగేట్ చేసుకునే యూజర్ ఇంటర్ఫేస్, ఏ డివైజ్‌కైనా అనుకూలంగా మారే రెస్పాన్సివ్ వెబ్సైట్, నచ్చిన కంటెంట్‌ను సిఫార్సు చేసే టూల్స్, అంతే కాదు.. వార్తలు చదువుకోవడంతోపాటు హాయిగా మల్టీ మీడియాలో ఫొటోలు, వీడియో లు చూడవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. వీటితోపాటే సాక్షి మొబైల్ అప్లికేషన్ ను కూడా ఆధునికీకరించాం. మీరు మొబైల్ యాప్‌లో సాక్షిని ఫాలో అవుతుంటే (ఆండ్రాయిడ్ లేదా iOS ) యాప్‌ను ఒక్కసారి అప్డేట్ లేదా రీఇన్ స్టాల్ చేసుకోవడమే తరువాయి. సరికొత్త డిజైన్, లుక్స్‌తో సాక్షి.కామ్ మీ ముందు ప్రత్యక్షమవుతుంది.దశాబ్ద కాలంగా sakshi.comని ఆదరిస్తున్న పాఠకదేవుళ్లు మాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. డిజిటల్ ప్లాట్‌ఫాంల రీడర్‌షిప్‌ను లెక్కించే ఆధీకృత వ్యవస్థ comscore ప్రకారం.. తెలుగు న్యూస్ వెబ్సైట్లలో www.sakshi.com అత్యధిక యూనిక్ విజిటర్స్‌తో చాలాకాలంగా మొదటి స్థానంలో ఉంది. (··Source: comscore).సాక్షి కుటుంబంలో మీరంతా సభ్యులైనందుకు గర్విస్తున్నాం. కొత్త రూపంలో మీ ముందుకొచ్చిన www.sakshi.com ను ఆశీర్వదించండి. – ఎడిటర్, సాక్షి మీడియా గ్రూప్ -
ఏఎస్సీఐ సంచలన రిపోర్ట్ - డిజిటల్ మీడియాలోనే ఎక్కువగా అవే!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్) అభ్యంతరకర ప్రకటనలు అత్యధికంగా డిజిటల్ మీడియాలోనే దర్శనమిచ్చాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ (ఏఎస్సీఐ) ఒక నివేదికలో తెలిపింది. అయిదింట నాలుగొంతుల అభ్యంతర యాడ్లు డిజిటల్ మీడియా నుంచే ఉన్నట్లు వివరించింది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే 2023–24 ప్రథమార్ధంలో ఏఎస్సీఐ 27 శాతం అధికంగా 3,501 ప్రకటనలను సమీక్షించింది. సమీక్షాకాలంలో ఫిర్యాదుల సంఖ్య 34 శాతం పెరిగి 4,491కి చేరింది. ఏఎస్సీఐ ప్రాసెస్ చేసిన ప్రకటనల్లో ఇన్ఫ్లుయెన్సర్ల కేసులు 22 శాతం ఉన్నాయి. ఎనిమిది ఉల్లంఘనలతో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. రంగాల వారీగా చూస్తే .. అత్యధికంగా హెల్త్‌కేర్‌లో, ఆ తర్వాత సంప్రదాయ విద్య, వ్యక్తిగత సంరక్షణ, గేమింగ్ విభాగాల్లో ఉల్లంఘనలు జరిగాయి. నాలుగింట మూడొంతుల ఫిర్యాదులను ఏఎస్సీఐ సుమోటోగా చేపట్టగా, వినియోగదారుల నుంచి వచ్చినవి 21 శాతం ఉన్నాయి. ఉల్లంఘనల్లో వాటాలు చూస్తే డిజిటల్ మీడియా 79 శాతం, ప్రింట్ మాధ్యమం 17 శాతం, టీవీ మాధ్యమం 3 శాతంగా ఉన్నాయి. -
అర్థవంతమైన జీవితం
‘ఆసక్తి ఉంటే అనంత విశ్వాన్ని మధించవచ్చు’ అనడానికి ప్రతీక శకుంతలాదేవి. అరవై దాటిన తర్వాత యూ ట్యూబర్‌గా ప్రపంచానికి పరిచయమయ్యారు. అంతకంటే ముందు ఆమె తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఆ ప్రపంచంలో సంగీతం, సాహిత్యం, మొక్కల పెంపకం ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మీడియా వేదికగా సృజనాత్మకతను పంచుతున్నారు.భర్త బాటలో తాను కూడా మరణానంతరం దేహాన్ని డొనేట్ చేశారు. శకుంతలాదేవి అత్యంత సాధారణ గృహిణి. నలుగురు పిల్లల్ని పెంచుతూ ఆమె తన అభిరుచులను కొనసాగించారు. సాహిత్యాన్ని ఆస్వాదించకుండా ఉట్టిగా పాటలు వినడంలో ఏదో అసంతృప్తి. అందుకే హిందీ పాటల సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి హిందీ– తెలుగు డిక్షనరీలో అర్థాలు వెతుక్కున్నారు. స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియాలను ఉబుసుపోని పోస్టులకు పరిమితం చేయలేదామె. సాంకేతిక పాఠాలను స్మార్ట్‌ఫోన్ తోనే నేర్చుకున్నారు. వీడియో రికార్డ్ చేయడం, ఎడిటింగ్, థంబ్‌నెయిల్ పెట్టడం, యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేయడం వరకు అవసరమైనవి అన్నీ సొంతంగా నేర్చుకున్నారు. తనకు తెలిసిన మంచి విషయాలను డిజిటల్ మీడియా వేదికగా ప్రపంచంతో పంచుకుంటున్నారు. ‘నన్ను ప్రపంచానికి తెలియచేసిన యూట్యూబ్‌కి తొలుత కృతజ్ఞతలు’ అంటూ తన వివరాలను ‘సాక్షి’తో పంచుకున్నారు స్వర్ణ శకుంతలాదేవి. ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయం వరకు ... ‘‘మాది తెనాలి దగ్గర మూల్పూరు గ్రామం. నాన్న వ్యవసాయంతోపాటు గుడిలో పూజలు చేసేవారు. ఏడుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివింది నేనే. మా వారు బీఏఎమ్ఎస్ చదువుతూ ఉండడంతో ఆయన చదువు పూర్తయ్యే వరకు, నాకూ చదువుకునే అవకాశం వచ్చింది. ఫిఫ్త్‌ఫారమ్‌లో ఉండగా పెళ్లయింది. తర్వాత పుట్టింట్లోనే ఉండి ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసి రిజల్ట్స్ వచ్చే నాటికి చీరాలలో అత్తగారింటిలో ఉన్నాను. అప్పట్లో ఆ చదువుకే సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగం ఇచ్చేవారు. మా అత్తగారు ‘ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందిప్పుడు’ అనడంతో ఇంటికే పరిమితమయ్యాను. టీచర్ అయ్యే అవకాశం అలా చేజారింది. కానీ మా వారి నుంచి ప్రోత్సాహం మాత్రం ఎప్పుడూ ఉండేది. ఆయన ఆయుర్వేద వైద్యులుగా ఒంగోలు దగ్గర అమ్మనబ్రోలులో ప్రాక్టీస్ చేసేవారు. అక్కడే 35 ఏళ్ల పాటు ఉన్నాం. ఇద్దరు పిల్లలు పుట్టిన తరవాత వీణ నేర్చుకున్నాను. ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలు. వాళ్లందరి ఆలనపాలన చూస్తూ నా అభిరుచులను కొనసాగించగలిగాను. ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి రంగనాయకమ్మ రాసిన బలిపీఠం, కౌసల్యాదేవి– చక్రవాకం, రవీంద్రనాథుని గీతాంజలి, బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి.. ఇలా అదీ ఇదీ అనే వర్గీకరణ లేకుండా చదివేదాన్ని. యద్దనపూడి, మాదిరెడ్డి, యండమూరి, శ్రీశ్రీ రచనలను, అబ్దుల్‌కలామ్ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను ఇష్టంగా చదివాను. కొన్ని రచనలు రేడియోలో నాటికలుగా వచ్చేవి. వాటి కోసం రేడియోకి అంకితమయ్యేదాన్ని. ఇలా సాగుతున్న జీవితంలో పిల్లలు నలుగురూ సెటిల్ అయిన తర్వాత మా వారుప్రాక్టీస్ చాలించారు. 2005లో చీరాలకు వచ్చాం. పెద్దబ్బాయి కొత్తదారిలో నడిపించాడు మా పెద్దబ్బాయి నన్ను కొత్తగా ఆవిష్కరించాడు. తను మెకానికల్ ఇంజనీర్. తాను ఆసక్తి కొద్దీ జెమాలజీ కోర్సు చేశాడు. రత్నాల గురించిన కబుర్లు నాకు ఎక్కువ ఆసక్తినివ్వడంతో రత్నాలకు – రాళ్లకు మధ్య తేడాను గుర్తించడం నేర్పించాడు. ముత్యాలు, పగడాలతోపాటు రకరకాల బీడ్స్, జెమ్స్, సెమీ ప్రెషియస్ స్టోన్ ్సతో ఆర్నమెంట్ మేకింగ్ నేర్పించాడు. జీవితాన్ని మనం ఎంత ఉత్సాహవంతంగా, రాగరంజితంగా మార్చుకున్నప్పటికీ ఏదో ఒక వెలితిని సృష్టించి ప్రశ్నార్థకంగా మన ముందు పెడుతుంది. నా అభిరుచులు మాత్రమే నాతో మిగిలాయి, వాటినిప్రోత్సహించిన మావారు మాకు దూరమయ్యారు. ఆయన కోరిక మేరకు దేహాన్ని వైద్యవిద్యార్థుల అధ్యయనం కోసం ఒంగోలులో మెడికల్ కాలేజ్‌కి ప్రదానం చేశాం. ఆయన బాటలో నేను కూడా మరణానంతరం నా దేహాన్ని డొనేట్ చేస్తూ సంతకం చేశాను. మనం జీవిస్తూ మరొకరికి ఉపయోగం కలిగించడమే జీవితానికి అసలైన అర్థం అని నమ్ముతాను. ఆయన జ్ఞాపకాలతో రోజులు సాగుతున్న సమయంలో కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. యూ ట్యూబ్ ఆత్మీయులనిచ్చింది కోవిడ్ సమయంలో అగాధంలాంటి విరామం. ఆ విరామం ఎంత కాలమో కూడా తెలియదు. యూ ట్యూబ్ చానెల్స్ చూస్తూ, మా వారు సుబ్రహ్యణ్య కుమార్ రాసిన వైద్య గ్రంథాన్ని చదువుతూ గడిపాను. అప్పుడు నాక్కూడా నాకు తెలిసిన సంగతులు చెప్పాలనిపించింది. గూగుల్ లేని రోజుల్లోనే నిత్యాన్వేషిగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. చేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చిన తర్వాత ఇక కష్టమేముంది? యూ ట్యూబ్‌కి సంబంధించిన పరిజ్ఞానమంతా ‘హౌ టూ అప్లోడ్, హౌ టూ డూ ఎడిటింగ్, హౌ టూ డూ థంబ్‌నెయిల్’ అంటూ ‘హౌ టూ’ అని అడుగుతూ నేర్చుకున్నాను. మొదట వంటలు, ఇంటి అలంకరణ, మా వారు రాసిన వైద్యగ్రంథంలోని విషయాలను చెప్పాలనుకుని 2021లో యూ ట్యూబ్ చానెల్ మొదలుపెట్టాను. కొంతకాలం తర్వాత యూ ట్యూబ్ గుర్తించాలంటే ఏదో ఒక టాపిక్ మీదనే దృష్టి పెట్టమని సూచించారు పిల్లలు. వంటలు చాలామంది చేస్తున్నారు. ముత్యాలు, పగడాల గురించి చాలామందికి తెలియని సంగతులు చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పమన్నారు మా పిల్లలు. ఆ తర్వాత నాకు సబ్‌స్రైబర్స్ రెండున్నర లక్షలకు పెరగడంతోపాటు ఫాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. డాక్టర్లు, సైంటిస్ట్‌లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు... సందేహాలడుగుతుంటే నాకు తెలిసినదెంత? ఇంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ల సందేహాలు నేను తీర్చడమేమిటని ఆశ్చర్యంగా ఉంటుంది కూడా. అసలు ముత్యాన్ని, నకిలీ ముత్యాన్ని ఎలా గుర్తించాలి, తైవాన్ పగడం ఎలా ఉంటుంది, ఇటాలియన్ పగడాలెలా ఉంటాయి, వేటిని క్యారట్లలో తూస్తారు, వేటిని గ్రాముల్లో తూస్తారు... వంటి విషయాలనెన్నో చెప్పాను. యూ ట్యూబర్‌గా నేను డబ్బుకంటే వెలకట్టలేని ఆత్మీయతను, అభిమానాన్ని సంపాదించుకున్నాను. ఆంటీ, అమ్మా అనే పిలుపులతోపాటు ఈ తరం యువతులు వాళ్ల సందేహాల కోసం ఫోన్ చేసి ‘అమ్మమ్మా’ అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంటోంది. మనిషి, మెదడు పని లేకుండా ఖాళీగా ఉండకూడదు. అలాగే ఎంటర్టైన్ మెంట్ మన మైండ్‌ని చెడగొట్టకూడదని నమ్ముతాను. అందుకే టీవీ సీరియల్స్ నన్ను ఆకర్షించలేదు. నాకు నేనుగా సమయాన్ని ఇలా ఆనందంగా, ఉపయుక్తంగా మలుచుకున్నాను’’ అన్నారు శకుంతలాదేవి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
బీజేపీకి గౌతమి గుడ్‌బై
సాక్షి, చైన్నె : సినీ నటి గౌతమి బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీలోని నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనను మోసం చేసిన మోసగాడికి అండగా బీజేపీ నాయకులు ఉన్నారని తెలిసి తీవ్ర మనో వేదనకు గురైనట్టు పేర్కొన్నారు. గౌతమి విడుదల చేసిన ప్రకటనలోని వివరాలు.. ‘బరువెక్కిన హృదయంతో , తీవ్ర అసంతృప్తితో బీజేపీ నుంచి వైదొలగేందుకు నిర్ణయించాను. గత 25 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నాను , ఈ పయనంలో ఎన్నో సవాళ్లు, ఒడి దొడుగులు ఎదుర్కొన్నాను. అయినా, తన పని తాను సక్రమంగా చేస్తూ ముందుకు సాగినట్టు పేర్కొన్నారు. పార్టీ నుంచి, నాయకుల నుంచి తనకు ఎలాంటి మద్దతు, సహకారం లేక పోవడమే కాకుండా నన్ను మోసం చేసిన అలగప్పన్‌కు అండగా తమ పార్టీ వాళ్లే ఉన్నట్టుగా వచ్చిన సమాచారం తీవ్రంగా కలచి వేసింది. 37 సంవత్సరాలు సినిమా, టీవీ, రేడియో, డిజిటల్ మీడియాలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కుమార్తెతో తన జీవితం ఉజ్వలమయంగా ఉండాల్సిందన్నారు. అయితే అలగప్పన్ తనను ఆర్థికంగా మోసం చేశాడని, నగదు, ఆస్తులను అపహరించాడని ఇటీవలే తన దృష్టి వచ్చిందన్నారు. ఈ విషయంగా పోలీసులను ఆశ్రయించానని గుర్తుచేశారు. అయితే ఆ మోసగాడికి బీజేపీలోని కొందరు నేతలు అండగా ఉండడం తనను కలిచి వేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసులు, న్యాయం వ్యవస్థ మీద నమ్మకంతో తాను చేసిన ఫిర్యాదుపై న్యాయం దక్కుతుందనే ఎదురు చూపులో ఉన్నాను. 2021 ఎన్నికల్లో రాజపాళయం సీటు తనకే అని చెప్పడంతో పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేశానని, చివరి క్షణంలో సీటు దక్కకుండా చేశారని గుర్తుచేస్తూ, ఎలాంటి మద్దతు , సహకారం, ఆదరణ లేని పార్టీలో కొనసాగలేను. నన్ను మోసం చేసిన వ్యక్తి 40 రోజులుగా బీజేపీ సీనియర్ల సహకారంతో అజ్ఞాతంలో ఉన్నట్టు వచ్చిన సమాచారం తనను మరింతగా కుంగదీసింది. అందుకే పార్టీ నుంచి బయటకు వెళ్తున్నాను’ అని ప్రకటించారు. ఇదిలా ఉండగా, గౌతమి నిర్ణయంపై బీజేపీ మహిళానేత,నటి కుష్భు విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చిన నటి గాయత్రి రఘురాం మరో మారు తెర మీదకు వచ్చి, బీజేపీలో మహిళలకు గుర్తింపు లేదని, న్యాయం దక్కదని ఆవేదన వ్యక్తం చేశారు. -
డిజిటల్ కార్పొరేషన్‌పై పదేపదే అబద్ధాలా?
సాక్షి, అమరావతి : ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌పై బురద జల్లడమే లక్ష్యంగా కొన్ని ఎల్లో మీడియా పూర్తి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ఆ సంస్థ మండిపడింది. సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఖర్చుచేసింది రూ.88.56 కోట్లు అయితే.. రూ.500 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పడం దారుణమని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. స్వార్థ ప్రయోజనాల కోసం ఇష్టానుసారం అబద్ధాలు చెబుతున్నారని.. కానీ, అంకెలు వాస్తవాలను ప్రతిబింబిస్తాయని తెలిపింది. 2020–21, 2021–22 సంవత్సరాలకు సంబంధించి సంస్థ వివరాలను కాగ్‌కు సమర్పించామని, 2022–23 సంవత్సరం నివేదికలు త్వరలో సమర్పిస్తామని పేర్కొంది. సిబ్బంది నియామకంలో ఎలాంటి రాజకీయ జోక్యంలేదని, కేవలం చేయాల్సిన పనికోసం అవసరమైన వ్యక్తులను వారి అర్హతలను బట్టి వివిధ మీడియా సంస్థలకు చెందిన వారిని నియమించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుత డిజిటల్ మీడియా అవసరాలకు అనుగుణంగా అందులో నైపుణ్యం, సాంకేతిక అనుభవం ఉన్న వ్యక్తిని వీసీ అండ్ ఎండీగా ప్రభుత్వం నియమించిందని పేర్కొంది. సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు వీసీ అండ్ ఎండీ జీతం తీసుకోలేదని, కేవలం రాష్ట్రం కోసం పనిచేయాలనే తపనతో పనిచేశారని తెలిపింది. డిజిటల్ కార్పొరేషన్‌కు ఐ–డ్రీమ్ మీడియాతో సంబంధంలేదని, కార్పొరేషన్ ఆ సంస్థకు ఎటువంటి ప్రకటనలు ఇవ్వలేదని సంస్థ స్పష్టంచేసింది. మీడియా సంస్థలు, వెబ్సైట్లకు ప్రకటనలను వాటి కార్యక్రమాలు, వాటికి ప్రజల్లో ఉన్న ఆదరణ, వాటి రీచ్‌ను బట్టి విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని పాటిస్తోందని తెలిపింది. పదేపదే అబద్ధాలు రాయడం ద్వారా ప్రజలు వాటిని నిజం అనుకునేలా నమ్మించడానికి ప్రయత్నించడం సరికాదని పేర్కొంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా చేయడం కోసమే తమ సంస్థ పనిచేస్తోందని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ స్పష్టంచేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే సంస్థ లక్ష్యమని పేర్కొంది. -
టీ–శాట్ సేవలు 90 లక్షల మందికి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణకు ముందు ‘మన టీవీ’ పేరిట కొన్ని ఇళ్లు, సంస్థలకే పరిమితమైన టీ–శాట్ సేవలు.. ప్రస్తుతం 90 లక్షల మందికి అందుతున్నాయనిఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యార్థులు, యువతకు అవసరమైన సేవలకోసం ప్రణాళికాబద్ధంగా, ఆచరణాత్మక విధానాలతో టీ–శాట్ కార్యక్రమాలు రూపొందుతున్నట్టు వెల్లడించారు. అంబేడ్కర్ యూనివర్సిటీ ఆవరణలో గురువారం జరిగిన టీ–శాట్ ఆరో వార్షికోత్సవంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా కూడా సేవలు అందించేందుకు పదివేల గంటలకు పైగా కూడిన కంటెంట్‌తో ప్రత్యేక యాప్ తయారు చేసినట్టు వెల్లడించారు. దీంతో లక్షలాది డౌన్లోడ్ల ద్వారా విద్యార్థులు పాఠాలు నేర్చుకునే పద్ధతులు వేగంగా మారుతున్నాయన్నారు. మారుతున్న బోధన, అభ్యసన ధోరణులకు అనుగుణంగా కంటెంట్ రూపకల్పనలో టీ–శాట్ మార్పులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీశాట్ సీఈఓ శైలేష్‌రెడ్డి, ఉస్మానియా, అంబేడ్కర్ వర్సిటీల వీసీలు రవిందర్‌యాదవ్, సీతారామారావు పాల్గొన్నారు. కంటెంట్ రూపకల్పన కోసం ఉస్మానియావర్సిటీతో టీ–శాట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకు న్నట్టు కేటీఆర్ వెల్లడించారు. ఓయూ ఆవిష్కరణల వాతావరణాన్ని ప్రోత్స హించాలని సూచించారు. ఈ ఒప్పందం ద్వారా వర్సిటీ పరిధిలోని 720 అనుబంధ కాలేజీలకు చెందిన సుమారు మూడు లక్షల మంది విద్యార్థులకు టీ–శాట్ నెట్వర్క్ ద్వారా పాఠాలు అందుతాయి ఆహాలోనూ టీ–శాట్: ఆహా ఓటీటీ వేదిక ద్వారా టీ–శాట్ ప్రసారానికి కూడా ఒప్పందం కుదిరింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా టీ–శాట్ ప్రసారాలు వీక్షకులకు అందుతాయని ఆహా టీవీ సీఈఓ రవికాంత్ సబ్నవీస్ ప్రకటించారు. -
ఆలోచన రేపుతున్న ఆరోపణలు
నూరుపూలు వికసించనీ... వేయి భావాలు సంఘర్షించనీ అంటారు. కానీ, మనమిప్పుడు ఏ చిన్న వ్యతిరేక వ్యాఖ్యనైనా సహించలేని స్థితికి వచ్చేశామా? డిజిటల్, సోషల్ మీడియా విప్లవంతో జనం సమాచారం పంచుకోవడం నుంచి స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తీకరణ దాకా – సమస్తం మారిపోయిన వేళ ప్రభుత్వాల నియంత్రణ ఎంత? ప్రతి ఒక్కరికీ అందుబాటుతో మీడియా ప్రజాస్వామికీకరణతో పాటు విచ్చలవిడితనమూ పెరిగే ప్రమాదం ఉన్నందున ఈ భారీ టెక్ సంస్థల బాధ్యత ఎంత? కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ట్విట్టర్ మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సీ సోమవారం చేసిన సంచలన ఆరోపణలు ఇలాంటి ఎన్నో ప్రశ్నల్ని మరోసారి లేవనెత్తాయి. అమెరికన్ యూట్యూబ్ షో ‘బ్రేకింగ్ పాయింట్స్’కు డోర్సీ ఇచ్చిన ఇంటర్వ్యూ భారత ప్రభుత్వానికీ, పాపులర్ సోషల్ మెసేజింగ్ వేదికకూ మధ్య కొనసాగుతున్న పోరులో కొత్త సంగతులను సోమవారం రాత్రి బయటపెట్టింది. రైతుల ఉద్యమ సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పలు ట్విట్టర్ ఖాతాలను స్తంభింపజేయాల్సిందిగా భారత ప్రభుత్వం నుంచి పలు అభ్యర్థనలు వచ్చాయనేది ఆయన కథనం. అంతకన్నా ఆందోళనకరమైనవి ఏమిటంటే – ప్రభుత్వ డిమాండ్లకు తలొగ్గకపోతే, భారత్‌లో ట్విట్టర్‌ను మూసివేయిస్తామనీ, దేశంలోని సంస్థ ఆఫీసులపైన, ఉద్యోగుల ఇళ్ళపైన దాడులు చేయిస్తామనీ గద్దె మీది పెద్దలు బెదిరించారట. డోర్సీ చేసిన ఈ ఆరోప ణలు తీవ్రమైనవి. సహజంగానే ప్రభుత్వం ఆ ఆరోపణల్ని పూర్తిగా తోసిపుచ్చింది. అంతమాత్రాన కేంద్రంలో గడచిన తొమ్మిదేళ్ళ పైచిలుకు బీజేపీ హయాం సంప్రదాయ మీడి యాకైనా, సోషల్ మీడియాకైనా సవ్యంగా ఉందనుకోలేం. పత్రికలు, టీవీ ఛానళ్ళ నుంచి వెబ్సైట్లు, సోషల్ మీడియా దాకా అన్నిటినీ నయానో, భయానో తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి పాలకులు ప్రయత్నిస్తున్న తీరు కొత్తేమీ కాదు. కొన్ని జాతీయ టీవీ ఛానళ్ళను బీజేపీ పెద్దలు, వారి మిత్రులు, ఆశ్రితులు హస్తగతం చేసుకోవడమూ బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ మాజీ పెద్ద చేసిన ఆరోపణలు అసత్యమో, సత్యమో కానీ... అసహజమని మాత్రం అనిపించట్లేదు. తొమ్మిదేళ్ళ చరిత్ర చూస్తే నమ్మశక్యంగానే ఉన్నాయి. అదే సమయంలో ట్విట్టర్ సారథ్యం వదిలేసిన ఇంతకాలానికి డోర్సీ ఇప్పుడు ఈ అంశాలను ఎందుకు లేవనెత్తుతున్నారన్నదీ ఆలోచించాల్సినదే! ట్విట్టర్ పులు కడిగిన ముత్యం అనుకోలేం. పలు సందర్భాల్లో ఏకపక్షంగా వ్యవహరించిన చరిత్ర దానిది. పారదర్శకత లేకుండా ఈ తోక లేని పిట్ట తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు కూడా సవాలక్ష. స్వయంగా డోర్సీ సైతం వివాదాలకు అతీతులేమీ కాదు. 2018లో భారత్‌లో పర్యటించినప్పుడు ఆయన వివాదాస్పద పోస్టర్‌ను చేత ధరించిన ఘటన ఇప్పటికీ విశ్లేషకులకు గుర్తే. అలాగే, ఆయన హయాంలో ట్విట్టర్ తన అల్గారిథమ్ ద్వారా నచ్చినవారిని పెంచుతూ, నచ్చనివారిని తుంచుతూ నడిచిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ సైతం అలాంటి కొన్ని అంతర్గత పత్రాలను బయటపెట్టారు. కొన్ని వార్తా కథనాలను నిరో ధిస్తూ, కొన్ని ఖాతాలను స్తంభింపజేశాక ఇలాంటి వేదికలకు ఇక తటస్థత ఎక్కడున్నట్టు? పారదర్శ కత, జవాబుదారీతనం లేనప్పుడు ట్విట్టరే కాదు... ఏ సోషల్ మీడియా వేదికకైనా పవిత్రత, గౌరవం ఏం ఉంటాయి? పాలకులను అవి వేలెత్తి చూపితే, మూడు వేళ్ళు వాటినే వెక్కిరిస్తాయి. అలాగని ఆ లోపాలే సందుగా... పాలక పక్షాలు, ప్రభుత్వాలు సోషల్ మీడియా సహా సమస్త భావప్రసార వేదికల పైనా స్వారీ చేస్తుంటే సమర్థించలేం. సోమవారం ఒకపక్కన ‘కోవిన్’ పోర్టల్ లోని పౌరుల సమాచారం అంగట్లో లభిస్తున్నట్టు బయటపడ్డ కొద్ది గంటల్లోనే, డోర్సీ సంచలన ఆరోపణలూ రావడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ, వార్తలనైనా, వ్యాఖ్యలనైనా... నోటితో ఖండించడమే తప్ప సర్కార్ తన సమర్థత, నిర్దోషిత్వాలను నిరూపించుకొనేందుకు ప్రయత్నించడం లేదు. నిజానికి, 2021 ఫిబ్రవరిలో సైతం దాదాపు 250 ఖాతాలనూ, ట్వీట్లనూ తొలగించమంటూ పాలకుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు ట్విట్టర్ ప్రతిఘటించింది. బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు చేసిన వివాదాస్పద ట్వీట్‌కు ‘మ్యానిప్యులేటెడ్ మీడియా’ అని ట్యాగ్ తగిలించేసరికి, 2021 మే నెలలో తన కార్యాలయాలపై ఢిల్లీ పోలీసు దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు ఇలా రహస్యంగా, అడ్డగోలుగా సాగుతున్న ఈ సెన్సార్షిప్ డిమాండ్లపై కర్ణాటక హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ వేసింది. అప్పుడైనా, ఇప్పుడైనా ప్రభుత్వం ఆరోపణల్ని తోసిపుచ్చడానికే పరిమితమైంది. ధ్రువీకృత జర్నలిస్టులు, వార్తా సంస్థల ఖాతాలు పోస్ట్‌లను సైతం స్తంభింపజేయమంటూ మన దేశం నుంచి ట్విట్టర్‌కు వస్తున్న డిమాండ్లే ఎక్కువట. 2021 ద్వితీయార్ధంలో మొత్తం 326 లీగల్ డిమాండ్లొస్తే, అందులో 114 మన దేశానివే. మొత్తం మీద పాలకులకు ప్రజా ఉద్యమాలు, ప్రతికూల వ్యాఖ్యలంటే దడ పుడుతున్నట్టుంది. రైతు ఉద్యమమైనా, రెజ్లర్ల నిరసనైనా సర్కార్ శైలి ఒకటే– ముందు ఉదాసీనత, తర్వాత అణచివేత. ప్రజాక్షేత్రంలో వ్యవహారం బెడిసి కొడుతోందనిపిస్తే – ఆఖరికి అత్యవసర కంటి తుడుపు కార్యాచరణ. ఏ రకంగా చూసినా ఇది సరి కాదు. ట్విట్టర్ సహా అన్నీ జవాబుదారీతనంతో, స్థానిక చట్టాలకు కట్టుబడాలి. అదెంత ముఖ్యమో, బెదిరింపు ధోరణులు ప్రజాస్వామ్య విలువలకే మచ్చ అని పాలకులు గ్రహించడం అంత కీలకం. ఆ రెండూ జరగనంత కాలం ఇవాళ డోర్సీ... రేపు మరొకరు... పేరు మారవచ్చేమో కానీ, ఆరోపణల తీరు, సారం మారవు. -
ఫాలోయింగ్‌లో కింగ్
వివిధ డిజిటల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ ఖాతాల నిర్వహణలో ముందుకు దూసుకుపోతోంది. తెలంగాణ సీఎంఓ, మంత్రి కేటీఆర్ డిజిటల్ మీడియా వింగ్.. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ చానల్ ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం, తప్పుడు సమాచారంపై అప్రమత్తం చేయడం వంటి కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సీఎం కార్యాలయం, మంత్రి కేటీఆర్‌ను ఎంత మంది అనుసరిస్తున్నారు, ఎంత మందికి చేరువవుతున్నారనే గణాంకాలను ఇటీవల తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ విడుదల చేసింది. మరోవైపు ఈ ఏడాది మే 20వ తేదీ నాటికి ట్విట్టర్లో హరియాణా తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతీ వెయ్యి మందిలో 44 మంది సీఎం కార్యాలయ ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
నకిలీల తనిఖీ పేరుతో పెత్తనం?
డిజిటల్ మీడియాలో వచ్చే ప్రభుత్వ వార్తల్లోని సత్యాసత్యాలను ఒక ప్రత్యేక ‘ఫ్యాక్ట్ చెక్’ విభాగం ద్వారా తనిఖీ చేయించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ... ఐటీ ‘నియమావళి – 2023’ని సవరించడంపై పలు అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన విస్తృత సంప్రదింపులు లేకుండానే నిబంధనలు రూపొందించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(ఎ) పౌరులకు ప్రసాదిస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని సోషల్ మీడియా వెబ్సైట్లు, డిజిటల్ మాధ్యమాలు కలవరం చెందుతున్నాయి. సమాచారాన్ని తొలగించమని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దఖలు పడుతున్నందునే తాజా ‘ఐటీ నియమావళి, 2023’ వివాదాస్పదం అయింది. ఏప్రిల్ 6న కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫి కేషన్తో ఒక కొత్త సమాచార నియంత్రణ శక్తి ఊపిరి పోసుకుంది! ప్రాథమిక ‘ఐటీ నియమావళి, 2023’కి జోడింపుగా ‘మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నీతి నియమాలు’ (ఇంటర్మీడియేటరీ గైడ్‌లైన్స్ అండ్ మీడియా ఎథిక్స్ కోడ్)ని చేర్చడం ద్వారా ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ’ అలాంటి నియంత్రణ శక్తి ఆవిర్భావానికి తావు కల్పించింది.ఈ కొత్త నియమావళి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డిజిటల్ మీడియాలో వచ్చే నకిలీ, తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని గుర్తించి, వాటిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక ‘వాస్తవాల తనిఖీ’ (ఫ్యాక్ట్ చెక్) విభాగం ఏర్పాటుకు అధికారాన్ని ఇస్తోంది! సమాజ సంక్షేమాన్ని విస్మరించి, స్వేచ్ఛను హరించేందుకు (ఆర్వేలియన్) అవకాశం ఉన్న ఆ ఫ్యాక్ట్ చెక్ విభాగం... ప్రభుత్వ శాఖలు, మంత్రుల గురించి డిజిటల్ మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు, నివేదికలు, అభిప్రాయాలను వాస్తవాల తనిఖీ పేరిట పరి శీలించి వాటిని తొలగించడం కోసం ఆన్లైన్ మధ్యవర్తులకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ మధ్యవర్తులు ఆన్లైన్ సోషల్ మీడియా కంపెనీలు కావచ్చు. ఐ.ఎస్.పి. (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్)లు, యాప్‌ల రూప కల్పనకు అవసరమై సాంకేతికతల్ని హోస్ట్ చేసే సంస్థలూ కావచ్చు. వాస్తవాల తనిఖీ వల్ల కచ్చితత్వ నిర్ధారణ జరుగుతుందనీ, వాస్తవా లకు మాత్రమే విస్తృతి లభించి, పాఠక పౌరులకు ఏది చేరాలో అదే చేరుతుందనీ ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ’ ఉద్దేశం. ఐటీ యాక్ట్, 2000లోని సెక్షన్ 79 కల్పిస్తున్న ‘నియమాల రూప కల్పన అధికారాన్ని’ ఉపయోగించుకుని ఈ తాజా ఐటీ నియమావళి, 2023 ఏర్పడింది. శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం... సెక్షన్ 79, ఐ.టి. నియమావళిని అనుసరించి చట్ట విరుద్ధ చర్యలకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని కోర్టు ఉత్తర్వు ద్వారా లేదా ప్రభుత్వ విభాగం ఆదేశాల మేరకు ప్రభుత్వం పొందడానికి మధ్యవర్తులను ఏర్పరచుకోవచ్చు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)లో ‘నకిలీ’, ‘తప్పుడు’, ‘తప్పుదారి పట్టించే’ అనే పదాలు ప్రత్యేకించి లేవు. శాంతి భద్రతలు, దేశ సమగ్రత, నైతికత వంటి విస్తృత వర్గీకరణల కింద మాత్రమే ఐటీ నియమావళి అన్వయం అవుతుంది. అంతమాత్రాన, సరిగా లేని ఏదైనా సమాచారం లేదా ప్రకటన... నకిలీ, తప్పుడు, లేదా తప్పుదారి పట్టించేది అయిపోదు. అయితే నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే వర్గీకరణల కిందికి వచ్చే ప్రతి సమాచారం కూడా ఈ ‘వాస్తవాల తనిఖీ’ పరిధిలోకి రాకపోయి నప్పటికీ రాజ్యాంగ విరుద్ధమైన నిషేధ అధికారంతో ప్రభుత్వం చర్య తీసుకునే ప్రమాదం ఉంది. ఇక ఐటీ నియమావళి, 2023 ‘నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే’ సమాచారం ఎలాంటిదన్నది నిర్వచించలేదు. ‘వాస్తవాల తనిఖీ విభాగం’ అర్హతల్ని, విచారణ పరిధుల్ని, విధానాలను పేర్కొన లేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి.ఐ.బి.) లో ఇప్పటికే ఉన్న తనిఖీ విభాగం గతంలో పొరబడిన సందర్భాలు కూడా ఉన్నాయి! 2020 డిసెంబర్ 16 పీఐబీ ఒక ఇంటెలిజెంట్ బ్యూరో నియామక సమా చారానికి బూటకంగా ముద్రవేసింది. అయితే ఆ మర్నాడే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... పీఐబీ బూటకం అని భావించిన ఆ నియామక ప్రకటన నిజమైనదేనని ప్రకటించింది. ఇదొక్కటే ఇలాంటి సంఘటన కాదు. పలు పత్రికా ప్రచురణకర్తలు ఇటువంటి వాస్తవాల తనిఖీ తొందరపాట్లపై ఫిర్యాదు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ‘ఐటీ నియమావళి, 2023’ మొదట 2023 జనవరి 2న ఒక ముసాయిదా రూపంలో వెలువడింది. ఆ నియమావళిపై 2023 జనవరి 17 లోపు తమ అభిప్రాయాలను వెల్లడించాలని ప్రభుత్వం డిజిటల్ సంస్థలను, డిజిటల్ వినియోగదారులను కోరింది. అయితే ఆ ముసాయిదా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను నియంత్రించడానికి అవసరమైన నిబంధనలను మాత్రమే కలిగి ఉంది. అభిప్రాయాల వెల్లడికి గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆ ముసాయిదాలో ‘వాస్తవాల తనిఖీ’ అధికా రాలను చేరుస్తూ దానిపై సంప్రదింపుల వ్యవధిని పొడిగించింది. ఈ చర్యే ఆందోళనకు దారి తీసింది. ఎడిటర్స్ గిల్డ్ జనవరి 18న ఒక ప్రకటన విడుదల చేస్తూ, తనిఖీ అధికారాల నిబంధనను వెనక్కు తీసుకోవాలని కోరింది. ఏది నకిలీ సమాచారమో తేల్చే పూర్తి నిర్ణయాధికారం ప్రభుత్వం చేతిలో ఉండకూడదని అభిప్రాయపడింది. జనవరి 19న ‘డిజిపబ్’... ప్రతిపాదిత సవరణల్ని విమర్శించింది. ఆ సవరణలు భారత ప్రభుత్వానికి ఏకపక్షంగా విచక్షణాధికారాలను కట్ట బెడుతున్నాయని ఆరోపించింది. జనవరి 23న ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ... ఈ సవరణలు ప్రభుత్వ చర్యల్ని విమర్శించడాన్ని నిషేధించేందుకు అనుమతిస్తున్నాయని వాదించింది. ఈ అభ్యంతరాలన్నిటికీ జనవరి 25న ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు. ఈ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఏర్పాటు ప్రతిపాదనపై ఫిబ్రవరి ఆరంభంలో పీఐబీతో ప్రత్యేక సంప్రదింపులు జరుపుతామని ప్రకటించారు. అయితే ముఖాముఖీలు గానీ, ఆన్లైన్ ప్రజా సంప్రదింపులు గానీ లేవు. డిజిటల్ సమాచార సంస్థలతో ప్రభుత్వం అసలు సమావేశమే అవలేదు. ‘‘అన్నిటికన్నా ఆశ్చర్య పరుస్తున్నదేమంటే ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అర్థవంతమైన సంప్రదింపులేవీ జరప కుండానే ముసాయిదాలో సవరణల్ని ప్రకటించడం’’ అని ఎడిటర్స్ గిల్డ్ ఏప్రిల్ 7న పేర్కొంది. వాస్తవానికి ‘ఐటీ నియమావళి, 2021’లో ప్రతి సంవత్సరం సవ రణలు జరుగుతూనే ఉన్నాయి. మొదట 2021 ఫిబ్రవరి 25న ప్రభుత్వం ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు, డిజిటల్ న్యూస్ పోర్టల్స్‌కు ఉన్న అధికారాలను విస్తరిస్తూ నియమాల్లో మార్పులు చేసింది. ఆ మార్పులపై వ్యతిరేకత వ్యక్తం అయింది. 30 రిట్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిపై మూడు హైకోర్టులు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చాయి. 2021 ఆగస్టు 5న బాంబే హైకోర్టు ‘‘ఈ మార్పులు ఆలోచనా స్వేచ్ఛ కోసం ప్రజలు అలమటించేలా చేస్తాయి’’ అని పేర్కొంటే, 2021 సెప్టెంబరు 17న మద్రాసు హైకోర్టు, ‘‘ప్రభుత్వపు ఒక్క కనుసైగతో పౌరులకు సమాచారం అందుబాటులో లేకుండా పోతుంది’’ అని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులను సవాలు చేసి వాటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఆ తర్వాత, 2022 అక్టోబర్ 28న ప్రభుత్వం మరికొన్ని సవ రణల్ని ప్రవేశపెట్టింది. సోషల్ మీడియా వినియోగదారులు సమాచార నియంత్రణ నియమాలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి వీలుకల్పించే ఫిర్యాదుల అప్పిలేట్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు 37 విజ్ఞప్తులు రాగా, వాటిల్లో 19 విజ్ఞప్తులను నిర్ణయ మేమిటో వెల్లడించకుండా, ప్రజలకు వాటి యు.ఆర్.ఎల్.లను బహి ర్గతం చేయకుండా అవి పరిష్కరించేశాయి! ఇదంతా ‘రేస్ ఇస్పా లోక్వి టూర్’ (వాస్తవాలు వాటికవే మాట్లాడతాయి) అనే లాటిన్ సామెతను గుర్తు చేస్తోంది. నిజం ఏమిటో నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వ శాఖకు దఖలు పరుస్తున్న ఐటీ నియమావళి, 2023తో వాస్తవాలే మాట్లాడతాయన్న సంగతి కూడా నిర్ధారణలోకి రావచ్చు. అపర్ గుప్తా వ్యాసకర్త న్యాయవాది,ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
డిజిటల్ మీడియాతో ఉన్నత విద్య పటిష్టం
బంజారాహిల్స్: ముఖ్యమంత్రి కేసీఆర్ డిజిటల్ మీడియా ద్వారా తెలంగాణలో ఉన్నత విద్యను పటిష్ట పరుస్తున్నారని తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్(సికా), ఎక్సెల్ ఇండియా మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో బ్రిడ్జింగ్ ఎడ్యుకేషనల్ డివైడ్(ఒడీఎఫ్‌ఎల్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్)్ఙ అనే అంశంపై ఒక రోజు సింపోసియం నిర్వహించారు. పలువురు విద్యారంగ నిపుణులు, నాయకులు పాల్గొని ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ, రానున్న రోజుల్లో విద్యా రంగంలో మార్పులు, అటు ప్రభుత్వాలు ఇటు విద్యా సంస్థలు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను విస్తృతంగా చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగానికి విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతానికి బ్రాడ్ బ్యాండ్ సేవలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. గ్రామీణ పాఠశాలలను కూడా ఆన్లైన్ విద్యా విధానానికి అనుసంధానం చేయనున్నట్లు వివరించారు. సాంకేతిక కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. సాంకేతిక విప్లవం నేపథ్యంలో తరగతి గది వాతావరణం పూర్తిగా మారిపోయిందన్నారు. ఆన్లైన్ విద్యా బోధనలో వినూత్న మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ప్రొ.ఆర్.లింబాద్రి, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య.కె.సీతారామారావు, టి–శాట్ సీఈవో శైలేష్‌రెడ్డి, ‘సికా’ డైరెక్టర్ ప్రొ. ప్రొ.పి.మధుసూదన్‌రెడ్డి, ఎక్సెల్ ఇండియా చీఫ్ ఎడిటర్ సంగెం రామకృష్ణ, విశ్వవిద్యాలయ, రిజిస్ట్రార్ డా ఏవీఎన్ రెడ్డి, డీన్ సోషల్ సైన్సెస్ ప్రొ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ మీడియా నియంత్రణకు చట్టం!
న్యూఢిల్లీ: డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు కేంద్ర సర్కారు సన్నద్దమవుతోంది. దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లును వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ బిల్లును ప్రభుత్వం ఆమోదిస్తే డిజిటల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. తప్పుడు సమాచారం ఇచ్చినట్టు రుజువైతే వెబ్సైట్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం, జరిమానా విధించేందుకు అవకాశం కలుగుతుంది. న్యూస్ ప్రొవైడర్లపై ఆంక్షలు.. ఇప్పటివరకు ఏ ప్రభుత్వ శాఖ నియంత్రణ పరిధిలోని డిజిటల్ న్యూస్‌ను తొలిసారిగా మీడియా నమోదు చట్టంలోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లులో కొత్తగా ‘ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా డిజిటల్ మీడియాలో వార్తలు’ అనే అంశాన్ని చేర్చింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే డిజిటల్ న్యూస్ ప్రొవైడర్లకు ఆంక్షలు తప్పవు. చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజుల్లోపు.. డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు తమ వెబ్సైట్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అప్పీలేట్ బోర్డు కూడా.. నిబంధనలు అతిక్రమించిన డిజిటల్ న్యూస్ పబ్లిషర్లపై చర్యలు తీసుకునే అధికారం ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌కు ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించిన వెబ్సైట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం లేదా రద్దు చేయడంతో పాటు జరిమానాలు విధించే చర్యలు ఉంటాయి. ఈ బిల్లును ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదించాల్సి ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ నేతృత్వంలో అప్పీలేట్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు అధికారిక వర్గాల సమాచారం. సమాచార శాఖ పరిధిలోకి డిజిటల్ న్యూస్ మీడియా నమోదు చట్టంలో కేంద్రం ప్రతిపాదిత తాజా సవరణలు అమల్లోకి వస్తే... డిజిటల్ న్యూస్ మీడియా పూర్తిగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నియంత్రణలోకి వస్తుంది. కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు 2019లో చేసిన ప్రయత్నం పెద్ద వివాదానికి దారితీసింది. డిజిటల్ మీడియా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో అప్పట్లో ప్రభుత్వం వెనకడుగు వేసింది. ‘ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం నుంచి ఇంటర్నెట్ ద్వారా టెక్ట్స్, వీడియో, ఆడియో, గ్రాఫిక్స్ రూపంలో, డిజిటల్ ఫార్మాట్లో వార్తలను ప్రసారం చేయడాన్ని డిజిటల్ మీడియా న్యూస్’గా అప్పట్లో నిర్వచించారు. (క్లిక్: సహజీవనం చేసి.. రేప్ కేసులు పెడితే ఎలా?) -
రూ. 4.30 లక్షల కోట్లకు దేశీ మీడియా
న్యూఢిల్లీ: దేశీ మీడియా, వినోద పరిశ్రమ 2026 నాటికి 8.8 శాతం మేర వార్షికంగా వృద్ధి చెందనుంది. రూ. 4.30 లక్షల కోట్లకు చేరనుంది. దేశీ మార్కెట్లో ఇంటర్నెట్, మొబైల్స్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మీడియా, ప్రకటనలు ఇందుకు ఊతమివ్వనున్నాయి. సంప్రదాయ మీడియా నిలకడగా వృద్ధి చెందనుంది. అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం 2026 నాటికి టీవీ అడ్వర్టైజింగ్ రూ.43,000 కోట్లకు చేరనుంది. తద్వారా అంతర్జాతీయంగా ఈ విషయంలో అమెరికా, జపాన్, చైనా, బ్రిటన్ తర్వాత అతి పెద్ద టీవీ అడ్వర్టైజింగ్ మార్కెట్‌గా భారత్ అయిదో స్థానం దక్కించుకోనుంది. 2022లో భారతీయ మీడియా, వినోద పరిశ్రమ 11.4 శాతం వృద్ధితో రూ. 3.14 లక్షల కోట్లకు చేరనుంది. ఓటీటీలకు సబ్స్క్రిప్షన్ ఊతం .. దేశీయంగా ఓటీటీ వీడియో సర్వీసులు వచ్చే నాలుగేళ్లలో రూ. 21,031 కోట్లకు చేరవచ్చని అంచనా. ఇందులో రూ. 19,973 కోట్లు సబ్స్క్రిప్షన్ ఆధారిత సర్వీసుల నుండి, రూ. 1,058 కోట్లు వీడియో ఆన్ డిమాండ్ (వీవోడీ) విభాగం నుండి రానున్నాయి. ఓటీటీల వృద్ధికి సబ్స్క్రిప్షన్ సర్వీసులు ఊతమిస్తున్నాయని, 2021లో ఓటీటీల మొత్తం ఆదాయంలో వీటి వాటా 90.5 శాతంగా ఉండగా .. 2026 నాటికి 95 శాతానికి చేరుతుందని నివేదిక తెలిపింది. జనాభా పరిమాణం, మొబైల్ ఆధారిత ఇంటర్నెట్ వీడియోల వినియోగం.. ఓటీటీ మార్కెట్ వేగవంతంగా వృద్ధి చెందడానికి దోహదపడనున్నాయి. వార్తాపత్రికలు అప్..: 2021లో మొత్తం వార్తాపత్రికల ఆదాయం రూ. 26,378 కోట్లుగా ఉండగా, 2026 నాటికి 2.7 శాతం వార్షిక వృద్ధి రేటుతో (సీఏజీఆర్) రూ. 29,945 కోట్లకు చేరనుంది. అప్పటికల్లా భారత న్యూస్‌పేపర్ మార్కెట్ .. ఫ్రాన్స్, బ్రిటన్ను కూడా దాటేసి అయిదో స్థానానికి ఎదుగుతుంది. ఈ వ్యవధిలో దినపత్రికల కాపీల విక్రయాల్లో (పరిమాణంపరంగా) వృద్ధి నమోదు చేసే ఏకైక దేశంగా భారత్ నిలవనుంది. ప్రింట్ ఎడిషన్ రీడర్‌షిప్‌లో 2025 నాటికి చైనాను దాటేసి అతి పెద్ద మార్కెట్‌గా నిలవనుంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► 2022లో రూ.35,270 కోట్లుగా ఉండనున్న టీవీ ప్రకటనల విభాగం 2026 నాటికి 23.52% వృద్ధితో రూ. 43,568 కోట్లకు చేరనుంది. ► అనేక సంవత్సరాల పాటు వేగంగా వృద్ధి చెందిన భారతీయ టీవీ అడ్వర్టైజింగ్ మార్కెట్.. 2020లో కోవిడ్–19 కారణంగా మందగమనం బారిన పడింది. దీంతో 2019తో పోలిస్తే 2020లో 10.8% క్షీణించింది. ఇది తాత్కాలిక అవరోధమే. 2021లో ఈ విభాగం 16.9% వృద్ధి చెంది రూ. 32,374 కోట్లకు చేరింది. ► దేశీ ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ మార్కెట్ 2026 నాటికి 12.1% వార్షిక వృద్ధితో రూ. 28,234 కోట్లకు చేరనుంది. మొబైల్స్ ద్వారా ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఇంటర్నెట్ ప్రకటనల మార్కెట్ ఆదాయంలో గతేడాది ఈ విభాగం వాటా 60.1%గా ఉండగా.. 2026 నాటికి 69.3 శాతానికి చేరనుంది. ► వచ్చే నాలుగేళ్లలో వీడియో గేమ్స్, ఈ–స్పోర్ట్స్ విభాగం ఆదాయం 18.3 శాతం సీఏజీఆర్‌తో రూ. 37,535 కోట్లకు చేరవచ్చని అంచనా. ► దేశీ సినిమా పరిశ్రమ 2026 నాటికి రూ. 16,198 కోట్లకు చేరనుంది. -
ఇష్టానుసారంగా ఆన్లైన్ సేవలు.. మీ పాస్వర్డ్ ఎంత సేఫ్.. ఇలా చేశారంటే!
Cyber Crime Prevention Tips: ఇ–మెయిల్, సోషల్‌మీడియా, బ్యాంకింగ్, ఫైల్ షేరింగ్, ఇ–కామర్స్.. ఇలా ప్రతిదానికి రకరకాల పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకుంటాం. వాటిలో సురక్షితమైన పాస్‌వర్డ్‌లను ఎంచుకోవడం, నిర్వహించడం కష్టంగా అనిపిస్తుంటుంది. కానీ, ఈ రోజుల్లో సేఫ్టీ పాస్వర్డ్ మేనేజ్మెంట్ను సరిగ్గా నిర్వహించకపోతే చిక్కులు తప్పవు. డిజిటల్ చెల్లింపులు పెరిగిన ఈ రోజుల్లో పాస్వర్డ్ నిర్వహణ లోపిస్తే అధికమొత్తంలో నగదును నష్టపోవాల్సి రావచ్చు. వీరిలో గృహిణులు, వయోజనుల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు నివేదికలు కూడా ఉన్నాయి. తమ పాస్‌వర్డ్‌ను ఇతరులకు చెప్పడం ఎంత నష్టమో, సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా అకౌంట్స్‌ను నిర్వహించడం కూడా అంతే నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి, ఆన్లైన్ సేవలు పొందేవారు ఇష్టానుసారంగా కాకుండా తప్పనిసరి భద్రతా చర్యలు కూడా తీసుకోవాలి. పటిష్టం చేసే విధానం... పాస్‌వర్డ్‌లో కనీసం 8 అక్షరాలు ఉండాలి. లాగిన్ చేసిన ప్రతి సైట్‌కి ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను రూపొందించడానికి బేస్, పిన్ విధానాన్ని ఉపయోగించడం శ్రేయస్కరం. ఉదాహరణకి.. primevideo.com ని లాగిన్ చేస్తున్నారనుకుంటే దానికి బేస్ 'rime@', పిన్ ’'home@321' సెట్ చేసుకోవచ్చు. కొత్త పాస్‌వర్డ్‌ను రూపొందించడానికి పాస్వర్డ్ జనరేటర్ సాధనాన్ని ఉపయోగించవచ్చు. వీటిలో చాలా వరకు సర్వీస్ ప్రొవైడర్లు డిఫాల్ట్‌గా అందిస్తాయి. పాస్వర్డ్ మేనేజర్ అప్లికేషన్లు, ఆన్లైన్ సేవల కోసం, పాస్‌వర్డ్‌లను నిల్వ చేయడానికి, రూపొందించడానికి, నిర్వహించడానికి వినియోగదారులను అనుమతించే ప్రోగ్రామ్ పాస్వర్డ్ మేనేజర్. పాస్‌వర్డ్‌లను రూపొందించడంలో, తిరిగి పొందడంలో, వాటిని ఎన్క్రిప్టెడ్ డేటాబేస్‌లో నిల్వ చేయడం, డిమాండ్‌పై ఉపయోగించడంలో ఇది సహాయం చేస్తుంది. అత్యున్నత స్థాయి భద్రతను అందించే చాలా సేవలు ఆర్మీ గ్రేడ్ ఎఇఎస్256–ఎన్క్రిప్షన్ని కలిగి ఉంటాయి. మూడు రకాల పాస్వర్డ్ మేనేజర్లు... 1. ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్. 2. ఇంటర్నెట్ కనెక్షన్‌తో ఏదైనా కంప్యూటర్ లేదా పరికరం నుండి యాక్సెస్ చేయవచ్చు. మీ ఆధారాలను నిల్వ చేయడానికి అనుమతిస్తుంది. 3. మీ ఆధారాలను నిల్వచేయడానికి హార్డ్‌వేర్ పరికరంలో ఇన్స్టాల్ అయి ఉంటుంది. పాస్వర్డ్ మేనేజర్ని ఉపయోగించడం వల్ల... 👉🏾మీ అన్ని ఆధారాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. 👉🏾నకిలీ లాగిన్ సందర్భంలో మీకు సమాచారం తెలియజేస్తుంది. 👉🏾మీ ఆధారాలను సులభంగా మార్చుకోవచ్చు. 👉🏾ఇతర గ్యాడ్జెట్స్లోనూ ఒకే పాస్‌వర్డ్‌ను నిర్వహించవచ్చు. కొన్ని ప్రముఖ పాస్వర్డ్ మేనేజర్లు (a)lastpass.com (b) keepass.info (c) keepersecurity.com (d) pwsafe.org (e) dashlane.com రెండు కారకాల ప్రమాణీకరణ 👉🏾రెండు దశలు లేదా ద్వంద్వ కారకాల ప్రమాణీకరణగా కూడా సూచిస్తుంది. ఇది భద్రతా ప్రక్రియ. దీనిలో వినియోగదారులు యాక్సెస్‌ని «ధ్రువీకరించడానికి రెండు వేర్వేరు ప్రమాణీకరణ కారకాలను అందిస్తారు. 👉🏾2ఎఫ్ఎ ఫిషింగ్ వ్యూహాలను ఉపయోగించి పరికరాలు లేదా ఆన్లైన్ ఖాతాల వివరాలను సేకరించి, దాడి చేసేవారికి కష్టంగా ఉండేలా ప్రామాణీకరణ ప్రక్రియకు అదనపు భద్రతను జోడిస్తుంది. 👉🏾ప్రతి 30 సెకన్లకు కొత్త సంఖ్యా కోడ్‌ను అందించే హార్ద్‌వేర్ సాధనాలను హార్డ్‌వేర్ టోకెన్ అంటారు. 👉🏾ఎసెమ్మెస్ టెక్ట్స్ మెసేజ్, వాయిస్ ఆధారిత సందేశం ద్వారా వినియోగదారునకు ఓటీపీ పంపుతుంది. 👉🏾సాఫ్ట్వేర్ టైమ్ ఆధారంగా జనరేట్ అయ్యే టివోటీపి పాస్‌కోడ్ కూడా పంపుతుంది. ∙పోర్టల్స్, అప్లికేషన్లు వినియోగదారునకు ఒక ఫుష్ నోటిఫికేషన్‌ను ప్రామాణీకరణగా పంపుతాయి. ఇక్కడ వినియోగదారుడు ఒకే టచ్‌తో యాక్సెస్‌ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. రెండు దశల ధ్రువీకరణ 👉🏾వినియోగదారుడి గ్యాడ్జెట్‌కు పంపిన పాస్వర్డ్, ఓటీపీ రెండింటినీ నమోదు చేయాలి. రెండు కారకాల ప్రామాణీకరణలో ఉపయోగించిన పద్ధతులలో ఫేసియల్ స్కాన్ టెక్నాలజీతో ఉంటాయి. అలాగే, వీటిని వేలిముద్ర స్కాన్‌తో యాక్సెస్ చేయవచ్చు. పాస్‌వర్డ్‌లను సురక్షితంగా ఉంచుకోవడానికి... మీ లాగిన్ ఆధారాలను నోట్‌బుక్‌లో రాసుకొని, ట్రాక్ చేసుకోవచ్చు. ∙మీ పాస్వర్డ్లు దొంగిలించబడ్డాయో లేదో ఈ కింది వెబ్సైట్లలో తనిఖీ చేసుకోవచ్చు. (a) passwords.google.com (b) haveibeenpwned.com (c) snusbase.com (d) avast.com/hackcheck 👉🏾మీ పాస్‌వర్డ్‌లో సాధారణ పదాలు, అక్షరాల కలయికలు లేకుండా చూడాలి. అంటే– పాస్వర్డ్, వెల్కమ్, సిటీ నేమ్, పెట్ నేమ్, ఇంటిపేరు... మొదలైనవి. 👉🏾పాస్వర్డ్ పొడవు 8 అక్షరాల్లో ఉండాలి. 👉🏾ప్రత్యేక అక్షరాలు, సంఖ్యలు, పెద్ద అక్షరాలను ఉపయోగించాలి. 👉🏾ప్రతి మూడు నెలలకోసారి మీ పాస్‌వర్డ్‌ని మార్చుకుని, రీ సెట్ చేసే అలవాటును పెంచుకోవాలి. 👉🏾మీ పాస్‌వర్డ్‌లను రీ సైకిల్ చేయవద్దు. కొత్త పాస్‌వర్డ్‌ను రూపొందించమని అడిగిన ప్రతిసారి కొత్త సిరీస్‌ను ఎంచుకోవాలని నిర్ధారించుకోండి. 👉🏾ఎసెమ్మెస్ ధృవీకరణతో రెండు కారకాల ప్రమాణీకరణ (2ఎఫ్ఎ) ఉపయోగించాలి. 👉🏾పెయిడ్ పాస్వర్డ్ మేనేజర్‌ను ఉపయోగించడం మేలు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
క్లీన్ టెక్నాలజీ కేరాఫ్ టీహబ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌కు మణిహారం టీహబ్ ఇప్పుడు క్లీన్ టెక్నాలజీ రంగంలోని స్టార్టప్ కంపెనీలను ఆకర్షిస్తోంది. కెనడాకు చెందిన ప్రతిష్టాత్మక కెనడా డిజిటల్ మీడియా నెట్‌వర్క్‌తో(పబ్లిక్ప్రైవేట్ ఇన్నోవేషన్ హబ్)తో టీహబ్ గతంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఇప్పుడు సత్ఫలితాన్నిస్తోంది. కెనడాలో బయో టెక్నాలజీ, క్లీన్ టెక్నాలజీ, బిజినెస్టు బిజినెస్ తదితర రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న అంకుర పరిశ్రమలను నగరానికి ఆహ్వానించేందుకు కెనడియన్ డిజిటల్ మీడియా నెట్వర్క్ (సీడీఎంఎన్)కు అనుబంధంగా పనిచేస్తున్న 26 సంస్థలను టీహబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రిడ్జి ప్రోగ్రాంకు ఎంపిక చేసినట్లు టీహబ్ ప్రతినిధులు తెలిపారు. ఆయా రంగాల్లో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, ఉత్పత్తుల సాధనే లక్ష్యంగా పనిచేసే సంస్థలకు భారత్‌లో మార్కెట్ అవకాశాలను చూపడంతోపాటు పలు పరిశ్రమలకు చేయూతనందించేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని టీహబ్ వర్గాలు పేర్కొన్నాయి. కెనడా నుంచి మెరుగైన సాంకేతికతను పొందడంతోపాటు ఇక్కడి చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం, నూతన అంకుర పరిశ్రమలకు జీవం పోయడమే ధ్యేయమన్నారు. ప్రధానంగా నిలకడగల అభివృద్ధి సాధన,హెల్త్‌కేర్ రంగంలో మరింత పురోగతి సాధించేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. నూతన అంకుర పరిశ్రమల రాకతో ఉద్యోగవకాశాలు పెరగడంతోపాటు.. కెనడా, భారత దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. కెనడాకు చెందిన కంపెనీలు టీహబ్ నుంచి కార్యకలాపాలు సాగించేందుకు కూడా అనువైన వాతావరణం ఏర్పాటు చేశామన్నారు. (చదవండి: ఫార్మా మహిళల భద్రతకు ‘షీ షటిల్స్’) -
ట్రెండ్ సెట్టర్
డిజిటల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మరుగున పడిన, మారుమూల ప్రాంతాల్లోని ఎంతోమంది ప్రతిభ వెలుగులోకి వస్తోంది. వినూత్న నైపుణ్యాలతో తామేంటో నిరూపించుకుంటూ ట్రెండ్సెట్టర్లుగా నిలుస్తున్నవారు ఎందరో. ఈ కోవకు చెందిన వారే జ్యోతి అధవ్. కార్పొరేట్ రంగంలోనేగాక, సామాజిక సేవారంగంలోనూ విశేషమైన సేవలందించి 2022 సంవత్సరానికి గానూ టైమ్స్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మహిళలు బలహీనులు కాదు, మనసుపెట్టి పనిచేస్తే ఒకచేత్తో ఎన్నో పనులు చక్కదిద్దగలుగుతారు అని నిరూపిస్తోంది జ్యోతి అధవ్. పూనేకు చెందిన జ్యోతి క్రియేటివ్ ఆర్టిస్టేగాక, విజయవంతంగా రాణిస్తోన్న వ్యాపారవేత్త. ఒక పక్క నైరూప్య చిత్రకారిణిగా రాణిస్తూనే, బిజినెస్ ఉమెన్‌గా దూసుకుపోతూ, ఎన్జీవోని నడుపుతున్నారు. జ్యోఆర్ట్స్ అండ్ డెకార్స్‌కు వ్యవస్థాపక డైరెక్టర్‌గానూ పనిచేస్తోంది. తన చిత్రకళా నైపుణ్యంతో అల్ట్రా మోడ్రన్ ఆర్ట్ స్టూడియోను నిర్వహిస్తూ...చిత్రకళానైపుణ్యంతో స్పష్టమైన, ప్రత్యేకమైన డెకరేటింగ్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. పూనే కేంద్రంగా నడుస్తోన్న మసాలా కంపెనీ ‘సాఫ్రో’కు ఒక డైరెక్టర్‌గా పనిచేస్తోంది. గత కొన్నేళ్లుగా తన ఉత్పత్తులను దేశ, విదేశాల్లో విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తోంది. ఇలా అనేక వ్యాపారాలను ఎంతో నైపుణ్యంతో చూసుకుంటూ అభివృద్ధి పథంలో నడిపించడం విశేషం. వసుమతి వెల్ఫేర్ మంచి కళాకారిణిగానేగాక విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తోన్న జ్యోతికి మానవత్వ గుణాలు కాస్త ఎక్కువే. సమాజానికి తిరిగిచ్చేయాలన్న ఉద్దేశ్యంతో భర్త విజయ్ అధవ్ సహకారంతో వసుమతి వెల్ఫేర్ ఫౌండేషన్‌ను స్థాపించింది. ఈ ఫౌండేషన్ ద్వారా ఆసరా కోల్పోయిన వారు, నిరుపేదలకు సాయం చేస్తోంది. పేదల ఆకలి తీర్చడం, అనారోగ్యంగా ఉన్నవారికి వైద్యసదుపాయాలను అందిస్తోంది. అంతేగాక మహిళ అభ్యున్నతికి కృషిచేస్తోంది. ఆడపిల్లల విద్యను ప్రోత్సహిస్తూ వారి విద్యకయ్యే ఖర్చునూ భరిస్తోంది. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు అయ్యే ఖర్చును ఈ ఫౌండేషన్ అందిస్తోంది. కరోనా సమయంలోనూ రోగులకు వైద్య సదుపాయం, ఆహారం, నీటిప్యాకెట్లు, వంట సరుకులను ఉచితంగా పంపిణీ చేసింది. చిత్రకళాకారిణిగా, వ్యాపార వేత్తగా, మానవతా వాదిగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న జ్యోతి అధవ్ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుండడం వల్లే ఆమె 2022 సంవత్సరానికి గాను ‘టైమ్స్ అప్లోడ్స్ ట్రెండ్ సెట్టర్’గా నిలిచింది. కష్టపడేతత్వం, ఓర్పు సహనం ఉండాలేగానీ నాలుగైదు పనులు ఒక్కసారే చేయవచ్చు అని నిరూపిస్తోంది జ్యోతి. ప్రతి మనిషికీ ఉండేది 24 గంటల సమయమే. కానీ జ్యోతి అధవ్ లాంటి వాళ్లు ఆ ఇరవై నాలుగు గంటల్లోనే ఎన్నో పనులు చేసి ట్రెండ్ సెట్ చేస్తున్నారు. చిత్రకళాకారిణిగా, వ్యాపార వేత్తగా, మానవతా వాదిగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న జ్యోతి అధవ్ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుండడం వల్లే ఆమె 2022 సంవత్సరానికి గాను ‘టైమ్స్ అప్లోడ్స్ ట్రెండ్ సెట్టర్’గా నిలిచింది. -
టీవీని అధిగమించనున్న డిజిటల్
ముంబై: టెలివిజన్‌ను అధిగమించి డిజిటల్ విభాగం 2022లో అతిపెద్ద మాధ్యమంగా అవతరించనుందని అంతర్జాతీయ ప్రముఖ మీడియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గ్రూప్ఎమ్ అంచనా వేసింది. 2022లో మొత్తం ప్రకటనల వ్యయం 22 శాతం వృద్ధితో రూ.1,07,987 కోట్లని లెక్కగట్టింది. ఈ మేరకు తన ‘ దిస్ ఇయర్, నెక్ట్స్ ఇయర్’ 2022 (టీవైఎన్‌వై) ప్రకటనల వ్యయ (యాడెక్స్) అంచనాల నివేదికను ఆవిష్కరించింది. నివేదిక ప్రకారం యాడ్ వ్యయాల్లో వేగంగా పురోగమిస్తున్న 10 దేశాల్లో భారత్ ఒకటి. ఈ విషయంలో దేశం తొమ్మిదవ అతిపెద్ద మార్కెట్‌గా ఉంటుంది. ప్రకటనల వ్యయ పరిమాణాల పెరుగుదలకు సంబంధించి ఐదవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మొత్తం మాధ్యమంలో డిజిటల్ షేర్ 2022లో 45 శాతానికి చేరుతుంది. ఈ విభాగంలో 33 శాతం పురోగతి ఉంటుంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే ప్రకటన ల వ్యయం 11% పెరిగి 850 బిలియన్ డాలర్లకు చేరుతుంది. డిజిటల్ వాటా ఇందులో 66%. భారత వినియోగదారు, పరిశ్రమ అభిరుచులను రూపుదిద్దే కొన్ని కీలక ధోరణులను కూడా గ్రూప్ఎమ్ తన నివేదికలో ప్రస్తావించింది. సంస్థాగత పరిస్థితులు, వినియోగదారు అభిరుచులు–స్థిరత్వం, డిజిటల్ అనుభవం, డేటా, వాణిజ్యం, పర్యావరణ వ్యవస్థ, క్రీడా వ్యాపార వృద్ధి, సాంకేతికత వినియోగం, మార్కెటింగ్ పనితీరు, టీవీ ప్రకటనల సాంకేతికత, ఆఫ్‌లైన్ మీడియా పరిణామం వంటి అంశాల్లో మార్పులు వినియోగదారు, పరిశ్రమలో కొత్త ట్రెండ్స్‌ను సెట్ చేస్తాయని నివేదిక విశ్లేషించింది. -
ఆ ఫొటోలు తీసినందుకు దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు..
రవి చూడని బ్రిటీష్ పాలన గురించి విని ఉంటారు.. కానీ నేటికీ అక్కడి నిరంకుశ పాలనలో అభివృద్ధికి, టెక్నాలజీకి ఆమడ దూరంలో ఉన్నారీ దేశ ప్రజలు. అక్కడ పర్యటించాలన్నా, కనీసం మనసును కదిలించిన ఫొటోలు తీసుకోవలన్నా అడుగడుగునా ఆంక్షలే. ఇలాంటి వాటిని కూడా నిషేధిస్తారా అనే అనుమానం కలుగుతుంది ఇది చదివితే. ఎరిక్ లాఫోర్గ్ ఈ ఫొటోలు తీసినప్పుడు అసలూహించి ఉండడు. కేవలం ఆ ఫొటోలు మూలంగా ఆ దేశం నుంచి శాశ్వతంగా భహిష్కరించబడతాడని. మర్మదేశంగా పేర్కొనే నార్త్ కొరియాకు సంబంధించిన ఫొటోలే అవి. అక్కడి అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ వీటిని తీవ్రంగా వ్యతిరేకించాడట. కిమ్ అనుమతి లేకుండా ఆ దేశానికి సంబంధించి చిన్న చీపురుపుల్ల కూడా ప్రపంచాన్ని చూడదు. అటువంటి అక్కడి పేదరికాన్ని, ప్రజల దుర్భర జీవనాన్ని గురించి ఫొటోలు తీస్తే ఊరుకుంటాడా! అయినప్పటికీ ఆ ఫొటోలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఫొటోగ్రాఫర్ ఎరిక్ లాఫోర్గ్ మాటల్లోనే.. 2008 నుంచి ఆరు సార్లు ఉత్తర కొరియాను సందర్శించాను. వాళ్లు నా దగ్గరి ఫొటోలు డిలీట్ చేయమన్నప్పుడు, వాటిని సేవ్ చేసి, డిలీట్ చేశాను. థ్యాంక్స్ టు డిజిటల్ మీడియా!! పోషకాహారలోపంతో బాధపడే ఈ విధమైప పిల్లల ఫొటోలు తీయడం ఉత్తర కొరియాలో నిషేధం. అంతేకాదు పేదరికాన్ని తెలియజేసే ఏ విధమైన ఫొటోలు తీయకూడదు. రాళ్లపై నిద్రపోతున్న ఇతని ఫొటోను కూడా డిలీట్ చేయమన్నారు. ఎందుకంటే ఈ ఫొటోలో అతను మృతి చెందినట్టు కనిపిస్తున్నాడు. ఈ ఫొటో తీస్తున్నప్పుడు కరెంట్ పోయింది. దీన్ని కూడా డిలీట్ చేయమన్నారు. పైగా అమెరికా ఆంక్షల వల్లనే కరెంట్ కోతలని చెప్పారు. పనులకు వెళ్లడానికి గంటల తరబడి సైకిళ్లను తొక్కేవారి ఫొటోలు తీయడం కూడా నిషేధమే. చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. నార్త్ కొరియాలో ప్రతీచోట కనిపించే సైనికులకు సంబంధించిన ఫొటోలు అస్సలు తీయకూడదు. మరీ ముఖ్యంగా ఆగిపోయిన బస్సులను తోసే సమయంలో అస్సలు తీయకూడదు. క్రమశిక్షణలేని పిల్లల ఫొటోలు కూడా తీయకూడదు. పేదరికంలో మగ్గుతున్నవారి జీవనవిధానాన్ని ఫొటోల్లో బంధించడం అక్కడి చట్టం ప్రకారం నేరం. వాక్ వే సరిహద్దులను రిపేర్ చేస్తున్న మహిళలు, పిల్లలకు సంబంధించిన ఇలాంటి ఫొటోలు తీయడం కూడా చట్టవిరుద్ధమే. నాయకుల చిత్రాల ముందు నవ్వుతున్నవారి ఫొటోలు తీయడం అగౌరవంగా భావిస్తారు. చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! సైనికులు కనిపించకుండా జంతువుల ఫొటోలు తీసుకోవచ్చు. కానీ అక్కడ ఇది పూర్తిగా అసాధ్యం. ఎందుకంటే ప్రతీచోట పోగయ్యే ప్రజలకన్నా సైనికులే 99 శాతం ఉంటారు. తినటానికి గడ్డిని సమకూర్చుకునే నార్త్ కొరియన్ ఫొటోలు తీయకూడదు. ఇది కూడా చట్ట విరుద్ధమే. ప్యోంగ్యాంగ్ రోడ్లపై అరుదుగా కార్లు కనిపిస్తాయి. కార్లు ఓ వైపు వెళ్తున్నారోడ్డు మధ్యలో పిల్లలు ఆడుకుంటారు. ఈ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు కూడా తీయకూడదు. సాంగ్డౌన్లో ఎస్కలేటర్‌ను చూసి భయపడుతున్న పిల్లలు వీళ్లు. ఈ దేశ ప్రజల్లో చాలా మందికి అది ఏమిటో కూడా తెలియదు. మరమ్మత్తులు అవసరమైన ఈ పాత బిల్డింగ్, ఆహారం కోసం చేపలు పట్టే వ్యక్తి, కాలుష్యంతో నిండిన నదిలో స్నానం చేసే వ్యక్తి, గుండీలు ఊడిన వ్యక్తి ఫొటోలు, విశ్రాంతి తీసుకునే సైనికులు, నిరాశ్రయులైన వ్యక్తులకు సంబంధించిన ఫొటోలు, మురికి దుస్తులతో ఉన్న వ్యక్తుల ఫొటోలు తీయడం అక్కడి చట్టం ప్రకారం నేరం. చాలా మటుకు నార్త్ కొరియా దేశంలో పేరదికమే కనిపిస్తుంది. ఇతర ప్రపంచదేశాలు తమను తక్కువచేసి చూస్తారనే భయం, ఆంధోళన అక్కడి నాయకుడిలో స్పష్టంగా కనిపిస్తోంది. నిరంకుశ పాలన పరాకాష్టకు చేరితే ఉత్తర కొరియాలా ఉంటుందనడానికి ఈ ఫొటోలపై ఉన్న నిషేధమే నిదర్శనం. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. -
డిజిటల్ తెరపై తెలుగు వెలుగులు
‘డిజిటల్ హ్యుమానిటీస్’ రంగానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం పెరిగింది. ఆ దిశగా చాలా పరిశోధనలూ ఫలితాలూ అందుబాటులోకి వచ్చాయి. భారతీయ భాషలు వీటిని అందుకోవడంలో కాస్త వెనుకబడే ఉన్నాయి. డిజిటల్ రంగంపై కరోనా విశేష ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో తెలుగు భాగస్వామ్యాన్ని అంతర్జాలంలో మరింత పెంచాల్సివుంది. కరోనా కల్పించిన అనివార్యత వల్ల సమాచారం కోసం, మొదట్లో మృదు ప్రతుల్ని కంప్యూ టర్, ఫోన్ స్క్రీన్ల మీద చదవడం కొంత ఇబ్బంది కలిగిం చినా, తర్వాత అలవాటైపోయింది. ఇప్పుడు ‘ఫలానా బుక్ సాఫ్ట్ కాపీ ఏ వెబ్సైట్లో దొరుకుతుంది’ అనే అలవాటు లోకి వచ్చేశాం. అందుకే డిజిటల్ వేదికపై సాహిత్యం, కళలువంటి మానవీయశాస్త్రాలతోపాటు వాణిజ్య, వైద్య, సైన్స్, రాజకీయ మొదలైన సకల శాస్త్రాల సమాచారాన్ని పరిశోధకుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరికీ అందుబాటులో ఉంచాలి. భారతదేశంలాంటి అభివృద్ధి చెందుతోన్న సమాజాల్లో సమాచార లభ్యత ప్రధాన సమస్య. దీన్ని అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల తక్షణావసరం. సమాచారంపై కొందరి గుత్తాధిపత్యాన్ని తొలగించేలా రచయితలు, ప్రభుత్వాలు, ముద్రణాసంస్థలు పరస్పరావగాహనతో ముందు కెళ్ళాలి. తెలుగు ప్రభుత్వాలు దీన్ని లాభసాటి కార్యక్రమంగానో, సమాజోద్ధరణగానో చూడకుండా ఇవాళ్టి పోటీ ప్రపంచంలో అనివార్యంగా దాటవలసిన మైలురాయిగా పరిగణించాలి. ప్రభుత్వరంగ సంస్థలే పూనుకొని ఆయా రచయితలతో, ముద్రణాసంస్థలతో చర్చలు జరిపి, వారికి కావలసిన గుర్తింపు, గౌరవం, ఆర్థిక వెసులుబాట్లకు సంబంధించిన ‘ఒప్పందాన్ని’ కుదుర్చుకోవాలి. దీనికోసం అవసరమయ్యే కొత్త చట్టాలను తేవాల్సిన, సర్దుబాటు చర్యలను చేపట్టాల్సిన పెద్దన్న పాత్రను ప్రభుత్వాలు పోషించక తప్పదు. (చదవండి: బడా వ్యాపారులకే ‘బ్యాడ్ బ్యాంక్’) ప్రజలకు తక్షణం వినియోగపడటానికి కావలసిన సమాచారం మొదట కనీసం పీడీఎఫ్ రూపంలోనైనా ఉంచాలి. యూనికోడ్లో ఉంచగలిగితే మరింత ప్రయోజనకరం. ఈ రూపంలో ఉంచడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రాజ్యమేలుతున్న పేజ్మేకర్ సాఫ్ట్వేర్ స్థానంలో యునికోడ్ ఫాంట్స్ వాడేలా రచయితలను, ముద్రణారంగాన్ని ప్రోత్సహించాలి. పేజ్మేకర్లో ఉండే అనేకరకాల వెసులుబాట్లను యునికోడ్‌లో కూడా జోడించడానికి ఐఐటీ, ఐఐఐటీ, వికీపీడియా, తెలుగు ఫాంట్స్ లాంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో పని చేయాల్సి ఉంటుంది. దాంతోబాటు ఇంగ్లిష్‌కు ఉన్నట్టు తెలుగుకు కూడా ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్)ను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తెస్తే మరో అద్భుతం చేసినవాళ్ళవు తారు. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు పీడీఎఫ్ రూపంలో కోట్లాది పుటల్లో ఉన్న సమాచారాన్ని ఒక్క మీట నొక్కుతో ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి మార్చుకునే వెసులు బాటు ఉంటుంది. తమ సంస్థల్లో ముద్రితమవుతోన్న ప్రతి పుస్తకానికి సంబంధించిన వివరాల్ని విధిగా ఆ సంస్థలచేత ఆధునిక పద్ధతుల్లో ‘సమాచార నిధి’(డేటా బేస్) తయారు చేయించాలి. తెలుగు పుస్తకాల సమాచారం ఒక దగ్గరకు తీసుకురావాలి. ఆ పుస్తక సంబంధిత పీడీఎఫ్, ఎలక్ట్రానిక్ ఫార్మాట్ కాపీని అంతర్జాలంలో పెట్టడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటుచేయాలి. అంతర్జాలంలో పుస్తకాల్ని చదవడం ద్వారా వచ్చే ఆదాయం రచయితకు అందేలా చూడాలి. ప్రతి ముద్రిత ప్రతికి సంబంధించిన కొన్ని పుస్తకాల్ని ప్రభుత్వ ప్రాతినిధ్య సంస్థలకు పంపేలా చూడాలి. (చదవండి: రైతు ఆదాయంపై అర్ధసత్యాలు) ఇప్పటికే యంత్రానువాదం (మిషన్ ట్రాన్స్లేషన్) అందుబాటులోకి వచ్చింది. దీన్ని మరింత అభివృద్ధి చేసి మెరుగ్గా అందించాలి. ముఖ్యంగా యూజర్ ఫ్రీ అప్లికేషన్స్ రావడం ఈనాటి సాంకేతిక రంగంలో పెనువిప్లవం. జ్ఞానాన్ని డిజిటల్ మాధ్యమంలో ఉంచే ప్రక్రియ నిరంతరం చేయగలిగితే ప్రజల్లో విషయ సంబంధిత అవగాహన పెరుగుతుంది. తెలుగులో రాస్తోన్న సకల శాస్త్రాల సమా చారం అందుబాటులో ఉండటం వల్ల పరిశోధనలు వేగ వంతమవుతాయి. తెలుగు పరిశోధనల్లో ముఖ్యంగా భాషా పరిశోధనల్లో కొత్తశకం ప్రారంభమౌతుంది. తెలుగు భాషలో ఏ అక్షరం ఎవరు రాశారు? ఏ అక్షరాలను ఎవరు, ఎక్కడి నుంచి, ఎంతశాతంలో వాడుకొన్నారు మొదలైన విషయాలు ఇట్టే తెలిసిపోతాయి. తద్వారా పరిశోధనల్లో కచ్చితత్వం, నిర్దిష్టత, నిర్దుష్టత సాధ్యమై సారవంతమైన ఫలితాలు వస్తాయి. – డా. ఎస్. చంద్రయ్య, టి. సతీశ్ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం -
భారత్‌లో యాహూ న్యూస్ బంద్
Yahoo News India: వెబ్ సర్వీసుల ప్రొవైడర్ యాహూ.. భారత్‌లో న్యూస్ ఆపరేషన్స్‌ను నిలిపివేసింది. 20 ఏళ్ల సేవలకు నేటితో(ఆగష్టు 26) పుల్‌స్టాప్ పెట్టింది. ఈ మేరకు న్యూస్ ఆధారిత వెబ్సైట్ల కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించిన యాహూ.. మెయిల్ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. అమెరికాకు చెందిన వెబ్ సేవల కంపెనీ యాహూ.. ఇవాళ్టి నుంచి వార్తా సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. గురువారం నుంచి ఎలాంటి కొత్త కంటెంట్‌ను పబ్లిష్ చేయకపోవడం విశేషం. అయితే ఈ షట్‌డౌన్‌తో మిగతా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఆగష్టు 26 నుంచి యాహూ ఇండియా.. ఎలాంటి కంటెంట్‌ను పబ్లిష్ చేయబోదు. యాహూ అకౌంట్‌తో పాటు మెయిల్, సెర్చ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదు. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేద’’ని యాహూ ఇండియా హోం పేజీలో ప్రకటించింది. క్లిక్ చేయండి: వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డు.. ఇలా చేయొచ్చు ఇక ఈ ప్రకటనతో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్‌కు సంబంధించిన కంటెంట్ నిలిచిపోనుంది. ఎఫ్‌డీఐ కొత్త రూల్స్.. విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను.. అదీ కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే కొత్త చట్టాలు అనుమతించనున్నాయి. అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానుంది. డిజిటల్ కంటెంట్.. ముఖ్యంగా యాహూ క్రికెట్‌పై ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. గత 20 ఏళ్లుగా యాహూ సేవలు ప్రీమియం, లోకల్ కంటెంట్ అందిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్కి పర్యాయపదంగా యాహూను.. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్ 2017లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ముట్టుకోకుండానే ఫోన్ పని చేస్తుందిక -
డిజిటల్ మీడియాకు భారీ ఊరట
ముంబై: కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021లో కొన్ని అంశాలపై బాంబే హైకోర్టు శనివారం మధ్యంతర స్టే విధించింది. ఆన్లైన్ ప్రచురణకర్తలంతా నైతిక నియమావళి, ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించాలని ఐటీ రూల్స్‌లో పొందుపర్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలపై న్యాయస్థానం మధ్యంతర స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఐటీ చట్టంలోని క్లాజ్ 9 కింద పేర్కొన్న సబ్ క్లాజెస్ 1 అండ్ 3లపై స్టే విధిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ సబ్‌క్లాజ్‌లు పిటిషనర్ వాక్ స్వాతంత్రపు హక్కును హరిస్తున్నట్లుగా తాము ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్లు తెలిపింది. కొత్త ఐటీ రూల్స్‌లోని నిబంధనలను సవాలు చేస్తూ లీగల్ న్యూస్ పోర్టల్ ‘ద లీఫ్లెట్’, జర్నలిస్టు నిఖిల్ వాగ్లే బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. పిటిషనర్ల వాదనలో ఏకీభవించింది. వివాదాస్పద కొత్త ఐటీ నిబంధనల్లోని సబ్ క్లాజ్‌లపై మధ్యంతర స్టే విధించింది. చదవండి : 53 కోట్లు దాటిన వ్యాక్సినేషన్ -
ఫేస్బుక్, గూగుల్‌కు సమన్లు
సాక్షి,న్యూఢిల్లీ: పౌరుల హక్కుల పరిరక్షణ,ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల దుర్వినియోగం నివారణపై దృష్టి పెట్టిన కేంద్రం సోషల్‌మీడియా సంస్థలకు మరోసారి సమన్లు ఇచ్చింది. ఈ అంశాలపై చర్చించేందుకు ఫేస్బుక్ ఇండియా, గూగుల్ ఇండియాకు ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ప్యానెల్ రేపు(జూన్ 29వ తేదీ) కమిటీ ముందు హాజరుకావాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. ఆన్లైన్లో మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో సహా, పౌరుల హక్కులను రక్షించడం, ఆన్లైన్ న్యూస్ మీడియా దుర్వినియోగం అంశంపై ఫేస్బుక్, గూగుల్ సంస్థల అభిప్రాయాలను కమిటీ సేకరించనుంది. రెండు సంస్థలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కమిటీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఇదే సమస్యలపై చర్చించేందుకు రానున్న రోజుల్లో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ప్రతినిధులకు కూడా నోటీసులివ్వనుంది. ఇప్పటికే ఇదే అంశంపై జూన్ 18వ తేదీన ట్విటర్‌ను స్టాయీ సంఘం ప్రశ్నించిన విషయం తెలిసిందే. చదవండి : కోవిషీల్డ్‌కు గ్రీన్ పాస్ షాక్! సీరం సీఈవో భరోసా DRDO: 2-డీజీ డ్రగ్, కమర్షియల్ లాంచ్ -
గోవా బ్యూటీ డిజిటల్ ఎంట్రీ.. త్వరలోనే ‘ఇలియానా టాక్ షో’
కరోనా పుణ్యమా అని డిజిటల్ మీడియాకి డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. డిజిటల్లో వెబ్ సీరీస్‌లతో పాటు టాక్ షోలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. వాటిలో ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు చేసే టాక్ షోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో టీవీ చానళ్లతో పాటు ఓటీటీ సంస్థలు కూడా పేరున్న హీరోయిన్లను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం సమంత ఓ టాక్ షోని చేసింది.ఆ షోకి మంచి స్పందనే వచ్చింది. ఇక తమన్నాతో సైతం ఓ టాక్ షోకి ప్లాన్ చేస్తుంది ‘ఆహా’. ఇదిలా ఉంటే ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైందని సీనీ వర్గాల సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఇలియానా ఓ టాక్ షో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగిపోయాయట. తొలుత ఓ సీజన్‌ని షూట్ చేసి విడుదల చేస్తారట. దానికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి మరో సీజన్‌ని ప్లాన్ చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ టాక్ షో కోసం ఇలియానా భారీగానే పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదికి చెందిన ఓ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ టాక్‌షోని రూపొందించబోతున్నట్లు సమాచారం. -
కేంద్ర నిర్ణయంపై రాధికా ఆప్టే ఫైర్
ఈ మధ్యకాలంలో ఓటీటీ వినియోగం బాగా పెరిగింది. చిన్న సినిమాలు మొదలుకొని స్టార్ నటీనటులు కూడా ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నారు. అయితే సినిమాల్లో ఉన్నట్లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై నియంత్రణ లేదు. దీంతో ఓటీటీ(ఓవర్ ద టాప్) పేరిట అశ్లీలం నేరుగా ప్రజల నట్టింట్లోకి చేరుతోందన్న ఆందోళనలు పెరిగిపోతుండడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన నిబంధనావళిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ కంటెంట్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గైడ్‌లైన్స్‌పై నటి రాధికా ఆప్టే అభ్యంతరం వ్యక్తం చేసింది. 'ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ట్రెండ్ నడుస్తుంది. దీన్ని వల్ల ఎన్నో కొత్త ఆలోచనలు ప్రేక్షకులకు చేరుతున్నాయి. అంతేకాకుండా ఓటీటీ వల్ల చాలా మంది ఉపాధి అవకాశాలు లభించాయి. గత కొన్నాళ్లుగా ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. ఇదా చాలా అద్భుతమైన ప్లాట్పామ్. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలు భయానకంగా ఉన్నాయి. మున్ముందు ఇంకెన్ని మార్పులు వస్తాయో చూడాలి' అని అసహనం వ్యక్తం చేసింది. కాగా అందాల ఆరబోతకు వెనకాడని రాధికా ఆప్టే ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య రాధికా ఆప్టే బాత్రూం సీన్లలో కనిపించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. చదవండి : ఓటీటీలపై నిఘా పెళ్లి ఇష్టం లేదు, కానీ దానికోసమే చేసుకున్నా -
డిజిటల్ మీడియాకు వాక్ స్వేచ్ఛ వద్దా?
నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటర్మీడియరీ లయబిలిటీ మార్గదర్శకాలు యూజర్ల గోప్యతపై నిషేధం విధించి, వారి సంభాషణలను శాశ్వతంగా భద్రపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఇది మీడియా వాక్ స్వేచ్ఛకు మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో వాక్ స్వేచ్ఛకు కూడా సంబంధించిన సమస్య. ప్రతి యూజర్ సందేశాన్ని ఇలా నిలవ చేయటం ద్వారా నిఘా సంస్థలు కోరుకున్న ప్రతిసారీ వాటిలోని విషయాన్ని సమర్థంగా పరిశీలించవచ్చు. కానీ, రహస్యంగా సాగించే సంభాషణలను, లేదా పంపే సందేశాలను నిషేధించే తరహా నిబంధనలు విఫలమవుతాయన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మధ్యస్థపు మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ నిబంధనలు వాక్ స్వేచ్ఛ అనే భావనకే వ్యతిరేకంగా ఉన్నాయనే అంశంపై ఏకాభిప్రాయం కలుగుతోంది. సాధారణంగా మితభాషిగా ఉండే ఎడిటర్స్ గిల్డ్ సైతం ఈ విషయమై ఒక ప్రకటన చేస్తూ ఈ కొత్త నియమాలు దేశంలో మీడియా స్వతంత్రతకు వ్యతిరేకమని పేర్కొనడం గమనార్హం. సాధారణ ప్రజానీకం కోసం కోడ్ రచన, సంకేత నిక్షిప్త సందేశాల టెక్నాలజీ ప్రాప్యతను పరిమితం చేయడానికి 50 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న జాతీయ ప్రభుత్వాల ట్రెండ్కీ కేంద్రప్రభుత్వ మధ్యస్థపు మార్గదర్శకాలకు సమాన ప్రాధాన్యత ఉంది. అమెరికా 1990ల చివరలో క్రిప్టోగ్రఫీని సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉంచడంపై పరిమితి విధించడానికి ప్రయత్నించినప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో వాక్ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న సైఫర్‌పంక్స్ (సామాజిక, రాజకీయ మార్పుకోసం ప్రైవసీ పొడిగింపు టెక్నాలజీలను, క్రిప్టోగ్రఫీని విస్తృతంగా ఉపయోగించాలని ప్రబోధించే వారు) ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా అడ్డుకున్నారు. క్రిప్టోగ్రఫిక్ కోడ్ రచనను విదేశాలకు ఎగుమతి చేయడాన్ని అనుమతించకుండా ఆంక్షలు విధించినప్పుడు, టీ షర్ట్‌లపై ఈ కోడ్‌ను సైఫర్పంక్లు ముద్రించి సంచలనం రేకెత్తించారు.ఈరోజు మనందరం ఆధారపడిన ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటోకాల్ (పంపిన సందేశాలను సంబంధిత యూజర్లు మాత్రమే చదవగలిగేలా చేసే కమ్యూనికేషన్ సిస్టమ్) సైఫర్పంక్లు ప్రారంభించిన 50 ఏళ్ల ప్రతిఘటనా ఉద్యమ ఫలితం మాత్రమే. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటర్మీడియరీ లయబిలిటీ మార్గదర్శకాలను కూడా ఈ కోణంలోనే చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ మార్గదర్శకాలు యూజర్ల గోప్యతపై నిషేధం విధించి, ప్రతి యూజర్ గోప్యతా సంభాషణను శాశ్వత రికార్డు రూపంలో భద్రపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత సమస్య మీడియా వాక్ స్వేచ్ఛకు సంబంధించింది మాత్రమే కాదు. అంతకు మించి ఇది సాఫ్ట్వేర్ రంగంలో వాక్ స్వేచ్ఛకు సంబంధించిన సమస్య. ప్రాథమిక స్థాయిలో చూస్తే కోడ్‌ను రాసి దాన్ని ప్రచురించడానికి, అభిప్రాయాలను రాసి వాటిని పుస్తకాలుగా ప్రచురించడానికి మధ్య ఎలాంటి వ్యత్యాసమూ లేదు. కానీ మెసేజింగ్ యాప్‌లు కోడ్ రచనను ఎలా చేయాలనే విషయమై, కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మధ్యస్థపు మార్గదర్శకాలు ఆదేశిస్తున్నట్లుగా కనబడుతున్నాయి. ఇది సాంకేతిక రంగానికి వర్తించే వాక్ స్వేచ్ఛపై ఆంక్షలు విధించే రూపమే తప్ప మరేమీ కాదు.ఈ ప్రత్యేక సమస్య కేంద్ర బిందువు ఏదంటే సిగ్నల్ ప్రొటోకాల్. ఇది సైబర్ రంగంలో అభిప్రాయాలను వెలువరించే కోడ్ వ్యక్తీకరణ. ఇది భౌతిక రంగంలో వాక్ స్వేచ్ఛ పరవళ్లు తొక్కడాన్ని అనుమతిస్తుంది. దీన్ని ‘ఓపెన్ విస్పర్ సిస్టమ్స్’ అనే పేరు కలిగిన లాభేతర కంపెనీ వృద్ధి చేసింది. ఇతరుల కంటబడకుండా, వినకుండా యూజర్లు చేసే గోప్య సంభాషణలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టరాదనే ప్రగాఢ విశ్వాసం ఈ కంపెనీకి ఊపిరిగా ఉంటోంది. మద్రాస్ హైకోర్టులో ఫింగర్‌ప్రింటింగ్ టెక్నిక్‌పై చర్చ జంతు పరిరక్షణా కార్యకర్త ఆంథోనీ క్లెమెంట్ రూబిన్ మద్రాస్ హైకోర్టు ముందు దాఖలు చేసిన ప్రజావ్యాజ్య ప్రయోజన దావాతో యూజర్ల గోప్యతపై చర్చ భారత్‌లో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. న్యాయస్థానంలో ఈ అంశంపై జరిగిన చర్చ.. నిక్షిప్త సందేశాలను విచ్ఛిన్నపర్చకుండానే యూజర్ల మాటల సందేశాన్ని వాట్సాప్ ట్రాక్ చేయవచ్చా అనే అంశంపైకి మళ్లింది. అప్పుడు సైతం పేరుచెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ అధికారులు కొందరు ప్రతి సందేశంపై ఫింగర్ ప్రింటింగ్ (డేటాను గుర్తించి, ట్రాక్ చేసేందుకు నెట్వర్క్ డేటా నష్ట నివారణ సంస్థలు చేపట్టే డేటా లేదా డాక్యుమెంట్ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్) వేయడాన్ని ఒక పరిష్కార మార్గంగా ప్రతిపాదించారు. ప్రతి సందేశంపై ఫింగర్ ప్రింటింగ్ అమలు అసాధ్యమని వాట్సాప్ తోసిపుచ్చినందున ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటోకాల్ అవసరమే లేదని తమిళనాడు అడ్వొకేట్ జనరల్ వాదించారు కూడా.అయితే ఇప్పుడు కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలను ప్రకటించి ఉన్నందున ఫింగర్‌ప్రింటింగ్ సొల్యూషన్ని అమలుపర్చేందుకు అధి కార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. అయితే యూజర్ల గోప్యత సందేశాలను తాను వెల్లడి చేయబోననే తప్పుడు ప్రకటనతో ప్రభుత్వ యంత్రాంగం ముందుకొస్తోంది. ఫింగర్ ప్రింటింగ్ సొల్యూషన్ యూజర్ల గోప్యత సందేశాలను ఎలా బహిర్గతం చేస్తుందో అర్థం కావాలంటే ఫార్వార్డ్ సీక్రెసీ భావనను ముందుగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఫార్వార్డ్ సీక్రెసీ అంటే మీ ప్రస్తుత ఎన్క్రిప్షన్ కీని ఎవరైనా సైబర్ అటాకర్ దొంగిలించినా, మీ మునుపటి సందేశాలను ఇప్పటికీ సురక్షితంగానే ఉంచే సిగ్నల్ ప్రొటోకాల్. ఈ ఫార్వర్డ్ సీక్రెసీ అనేది చైనా వంటి ప్రత్యర్థి దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విచ్ఛిన్నపర్చడం ద్వారా మీ సందేశాలన్నింటిని అడ్డుకోవడమే కాకుండా, మీ ఫోన్ నుండి మీ ప్రమేయం లేకుండా బలవంతంగా సందేశాలను గుంజుకోవడానికి ఇలాంటి దేశాలు ప్రయత్నించే అవకాశం ఉంది. మన ప్రత్యర్థి దేశాలు ఆత్యాధునిక సైబర్ ఆపరేషన్లను కలిగి ఉంటున్నప్పుడు బలహీనమైన ఎన్క్రిప్షన్ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. మునుపటి సందేశాలు కొంత కాలం తర్వాత ఆటోమేటిక్‌గా తొలిగిపోతున్నప్పుడు ఫార్వర్ట్ సీక్రెసీ అనేది మరింతగా ఆచరణ సాధ్యంగా మారుతుంది. కాబట్టి మీ ఫోన్‌ని మీరు కోల్పోయినా లేక ఎవరైనా తీసుకుపోయినా సరే వాటిలోని పాత సందేశాలని ఎవరూ ఇకపై చూడలేరు. సంగ్రహించలేరు. కాబట్టి, సిగ్నల్ మెసెంజర్, వాట్సాప్ రెండింటిలో సందేశాలు మాయమవడం అనేది ఒక ప్రామాణిక ఫీచర్‌గా ఉంటుంది. అంటే ఇతరుల చెవిలో మాత్రమే మనం వినిపించే గుసగుసలు ఎలా రహస్యంగా ఉంటాయో, అవి గాల్లో ఎలా కలిసిపోతాయో ఆ రకంగా ఇకపై మొబైల్ సందేశాలు కనిపించకుండా పోతాయి. మీరు ఒక గ్రూప్‌లో సందేశాలను పంపించినప్పుడు, ఇతర డివైస్ల నుంచి సందేశాలను తొలగించే సందర్భంలో కూడా ఇది వర్తిస్తుంది. దీనివల్ల మీ గోప్యత మరింత విస్తృతమవడమే కాకుండా స్వేచ్ఛగా మీకు మీరుగా గానీ, లేక గ్రూప్‌లో కానీ మాట్లాడవచ్చు.అభిప్రాయాలను పంచిపెడుతూ, ప్రజలను ప్రభావితం చేసేం దుకు ఒక పబ్లిక్ రంగాన్ని రూపొందించి ఉంచే ట్విట్టర్, ఫేస్బుక్ మాదిరి కాకుండా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు అనేవి వ్యక్తులు లేదా గ్రూపుల వ్యక్తిగత కమ్యూనికేషన్ కోసమే ప్రాథమికంగా ఉపయోగపడతాయి. అయితే ఈ గ్రూపులు లేదా సంభాషణ కర్తలు నేరస్వభావంతో ఉండవచ్చు. ఒక మూసివుంచిన గదిలో నేరాలు ఎలా చేయాలో మాట్లాడుకునే భావసారూప్యత కలిగిన వ్యక్తులకు, ఇలాంటి యూజర్ల గ్రూపుకు పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ఇలాంటి గ్రూప్లలోకి చొరబడటం ద్వారా లేక ఇలాంటి గ్రూప్‌ల ఆధారాన్ని సేకరించి వారు చేస్తున్న నేరాలను పసిగట్టి దర్యాప్తు చేయడం నిఘా సంస్థల పని. ఒక సందేశాన్ని మొట్టమొదటగా ఎవరు పంపించారో కనుగొనడానికి మెసేజింగ్ అప్లికేషన్లు తమ నిక్షిప్త సందేశాల టెక్నాలజీని మార్చుకోవాలని ఆదేశించడం ద్వారా, ప్రభుత్వం ప్రతి సందేశాన్ని, ప్రతి యూజర్ వివరాలకు సంబంధించిన హ్యాష్ విలువలను తప్పకుండా నిల్వ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ప్రతి సందేశాన్ని ఇలా నిలవ చేయటం అంటే నిఘా సంస్థలు కోరుకున్న ప్రతిసారీ ఈ సందేశాలలోని విషయాన్ని సమర్థంగా పరిశీలించవచ్చు. ఇటీవలే దిశారవి అరెస్టు సందర్భంగా ఢిల్లీ కోర్టు వాక్ స్వేచ్ఛ, స్వేచ్ఛాయుత వ్యక్తీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను కోరుకునే హక్కును కలిగి ఉంటుందని, కమ్యూనికేషన్లో అలాంటి భౌగోళిక అడ్డుగోడలు ఉండవని వ్యాఖ్యానించడాన్ని గుర్తుంచుకోవాలి. రహస్యంగా సాగించే సంభాషణలను, లేదా పంపే సందేశాలను నిషేధించడానికి తీసుకొచ్చే నిబంధనలు తప్పక విఫలమవుతాయి. ఈ సందర్భంగా ఒక మెసేజ్‌ని ఫార్వర్డ్ చేయడాన్ని నియంత్రించడం ఎలా అనే అంశంపై మరింత చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీనివాస్ కొడాలి వ్యాసకర్త స్వతంత్ర పరిశోధకుడు డేటా, ఇంటర్నెట్ గవర్నెన్స్ (ది వైర్ సౌజన్యంతో) -
కట్టడి సరే! కర్ర పెత్తనమొద్దు
ఆన్లైన్ కంటెంట్ విచ్ఛలవిడితనాన్ని నియంత్రించే క్రమంలో పౌరుల హక్కుల్ని భంగపరిచే ప్రమాద సూచికలున్నాయి. అభ్యంతరకర కంటెంట్ డిజిటల్ వేదికల్లో వ్యాప్తి చెందుతున్నపుడు, దాన్ని సృష్టించిన వ్యక్తిని 72 గంటల్లో గుర్తించాలన్నది తాజా నిబంధన. అందుకు వీలు కల్పించే నిర్వహణ సదరు సంస్థలే ఏర్పాటు చేసుకోవాలి. అంటే, మాధ్యమిక వేదికగా, వినియోగదారులిద్దరి మధ్య పరస్పరం మార్పిడి జరిగే సమాచారానికి ఇక గోప్యత ఉండదు. ఇది గోప్యతా నిబంధనకు పూర్తి విరుద్ధం. ఇంకా సమగ్రంగా డాటా పరిరక్షణ చట్టం, గోప్యతా చట్టం రూపుదిద్దుకోని దేశంలో ఇది ప్రమాద సంకేతం. భరోసా ఇవ్వాల్సిన నిబంధనలు భయాలు రేపితే? పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టే! ‘డిజిటల్ మీడియా’లో వచ్చే కంటెంట్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలు చర్చ రేపుతున్నాయి. ఇదొక ‘మృదు స్పర్శ’ అని సర్కారు ముచ్చటగా పేర్కొన్నా, చివరకు కఠువైన కర్రపెత్తనానికి దారితీసే జాడే కనిపిస్తోంది. అదే జరిగితే, ఇంతటి కసరత్తు తుదిస్వరూపం... భావ వ్యక్తీకరణ హక్కుకు ఒకడుగు దూరం, సెన్సార్‌షిప్‌కు మరొకడుగు దగ్గరైనట్టే లెక్క. ఇన్నాళ్లూ వాటిపై చట్ట నియంత్రణ లేకపోవడం ఓ లోపమైనా, ఎంతో ఆసక్తితో నిరీక్షించింది ఇందుకా? అన్న పెదవి విరుపు మీడియా వర్గాల్లో వస్తోంది. పౌరులు కూడా ఏం బావుకుంటారనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. నిబంధనల వెనుక పేర్కొన్న లక్ష్యాలు ఆదర్శవం తంగా అమలయితే, హానికి బదులు సమాజానికి మంచి జరగొచ్చు! కానీ, నిబంధనల నీడలో కేంద్ర సర్కారు పెద్దలకు లభించే నిర్హేతుక విచక్షణాధికారాల వల్ల దురుపయోగానికి ఆస్కారం పెరుగుతుంది. నిబంధనావళి రూపొందించిన తీరే అందుకు కారణం. ఆన్లైనే వేదికగా... ఏలిన వారి సానుకూల ప్రచార ద్వారాలు తెరచుకునేందుకు, గిట్టని ప్యత్యర్థి పక్షాల వారి భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు బంధాలు వేసేందుకూ ఇది ఊతమిస్తుంది. ఆన్లైన్ కంటెంట్ విచ్చలవిడితనాన్ని నియంత్రించే క్రమంలో పౌరుల హక్కుల్ని భంగపరిచే ప్రమాద సూచికలున్నాయి. ఆన్లైన్ సమాచార వ్యవస్థల ఊపిరైన భావవ్యక్తీకరణ హక్కుకు గండి పడొచ్చు. డిజిటల్ మాధ్యమాలే వేదికగా పరస్పర సమాచార మార్పిడి చేసుకునే వినియోగదారుల గోప్యత గోడలె క్కొచ్చు! ఓటీటీ వేదికల్లో పుట్టే కంటెంట్ సృజన భంగపడచ్చు! నచ్చని సర్కారు విధానాలని ఎండగడుతూ వేర్వేరు సామాజిక వేది కల నుంచి నిరసనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసే ప్రజాస్వామ్యవాదుల గొంతును నొక్కే ఆయుధంగా మారే ప్రమాదముంది. ఇప్పుడెందుకీ నిబంధనలు? సామాజిక మాధ్యమాలతో సహా ఇతర ఆన్లైన్ డిజిటల్ వేదికల నుంచి వస్తున్న కంటెంట్ తరచూ వివాదాస్పదమౌతోంది. రాజకీయ అనుకూల, ప్రతికూల వాదనల నడుమ ట్విటర్, ఫేస్బుక్ వంటి మాధ్యమిక డిజిటల్ వేదికలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలనెదు ర్కొంటున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత గోప్యత, దానికి భంగం కలిగేలా ‘వాట్సాప్’ ఇటీవల తాజా నిబంధనావళిని తెచ్చే యత్నం, వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం తెలిసిందే! ఇక్కడొక పద్ధతి, పకడ్బందీ చట్టాలున్న ఇంగ్లండ్ వంటి ఐరోపా దేశాల్లో మరో పద్ధతి ఎలా పాటిస్తారంటూ కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు సదరు మాధ్యమిక డిజిటల్ వేదికను ప్రశ్నించాయి. ఆ పరిస్థితి కూడా, దేశంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక చట్టం, ఒక నియం త్రణ వ్యవస్థ అవసరాన్ని నొక్కి చెప్పింది. డిజిటల్ మీడియా వేదికల నుంచి పిల్లలను పెడదారి పట్టిస్తున్న శృంగార వీడియోలు (పోర్నో), మహిళల్ని అసభ్యంగా, అభ్యంతరకరంగా చూపించే వీడియోలు, చిత్రాలు ప్రసారమౌతున్న తీరుపట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 ప్రజ్వల కేసులో కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైన ఆదేశాలిచ్చింది. వినియోగదారుల సమాచారం పంచుకునే మాధ్యమిక వేదికలతో సహా వివిధ డిజిటల్ మీడియాలో వస్తున్న కంటెంట్‌ను కట్టడి చేయాలని, అవసరమైతే మార్గదర్శకాల్ని జారీ చేయాలని, నియంత్రణ వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది. ప్రస్తుత మార్గదర్శకాలు ఆ క్రమంలో వచ్చినవే! అయితే వీటిని పార్లమెంటు లోగానీ, మరే ఇతర శాసన వేదికల్లోగానీ చర్చించ లేదు. డిజిటల్ మీడియాపై అధికారిక నియంత్రణ, వారి పనితీరును నిర్దేశించే చట్ట మేదీ లేకపోవడం లోపంగానే ఉంది. కొత్తగా చట్టం తీసుకురాకుండా కేంద్రం తాజా నిబంధనలతో ఆ లోటును పూడ్చే ప్రయత్నం చేసింది. ఎటు దారి తీసేనో...! డిజిటల్ వేదికల్లో కంటెంట్ ఏ అదుపూ లేకుండా, విచ్చలవిడిగా ఉండా లని ఎవరూ కోరుకోరు. నియంత్రణ, అందుకు తగిన మార్గదర్శకాలు, అమలుపై నిఘా ఉండాల్సిందే! అవి ఏ మేర సముచితమన్నది ప్రజా స్వామ్య వ్యవస్థలో చర్చ పుట్టిస్తుంది. ఫిర్యాదుల్ని పరిష్కరించడం, డిజిటల్ వేదికలని నియంత్రించడం, వారి ప్రక్రియల్ని చట్టబద్ధం చేయడం కోసమే ప్రస్తుత నియమావళి. డిజిటల్ అన్న మౌలిక పదం కింద... అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికల్ని, ఫేస్బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్ని, వాట్సాప్, సిగ్నల్ వంటి సమాచార మార్పిడి–మాధ్యమిక వేదికల్ని, వివిధ న్యూస్ వెబ్సైట్ల వంటి సమా చార మాధ్యమాల్ని... అన్నింటినీ ఒక గాటన కట్టడం ఆశ్చర్యం కలిగి స్తోంది. వాటి స్వరూప స్వభావాలు, పనితీరు, కంటెంట్ నిర్మాణం, పంపిణీ, లక్ష్యిత వినియోగదారులు... భిన్నం. కంటెంట్ పట్ల అభ్యంత రాలతో ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని పరిష్కరించేందుకు ఆయా సంస్థల్లో నిర్దిష్ట మూడంచెల వ్యవస్థ ఉండాలని నిర్దేశించారు. అంతర్గ తంగా మొదట గ్రీవెన్స్ ఆఫీసర్, తర్వాత ఫిర్యాదుల్ని పరిష్కరించే ‘గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ’ ఉండాలి. అప్పటికీ పరిష్కారం లభించ కుంటే, సదరు అంశం మూడో స్థాయిలో, ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులతో ఏర్పడే ‘తుది అంచె కమిటీ’కి వెళ్తుంది. వారిచ్చే తీర్పుకు లోబడి ఉండాలి. అంటే, పాలకపక్షాల కనుసన్నల్లోని వీర విధేయ అధికారులు ఆయా స్థానాల్లో ఉంటే, ఇది ’సూపర్ సెన్సా రింగ్’ కాక మరేమవుతుందన్నది ప్రశ్న! ఆన్లైన్ మీడియాలో ఏం రావాలి? ఏం రావొద్దు? అన్నది ప్రభుత్వాధికారుల నిర్ణయాల ప్రకారం జరిగితే, మీడియా స్వేచ్ఛ– వాక్స్వాతంత్య్రానికి అర్థం చిన్న బోతుంది. చిన్న సంస్థలు ఇంతటి ఫిర్యాదు–పరిష్కార వ్యవస్థల్ని ఏర్పరచుకోలేవు. పెద్ద సంస్థలు సర్కారు పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడ సాహసించలేవు. చివరకిది, ఫక్తు ప్రచారానికి–సమాచార వ్యవస్థకి మధ్య విభజన రేఖను చెరిపేస్తుంది. మీడియా విశ్వసనీయ తను తగ్గిస్తుంది. కడకు ఆర్థికంగా మనలేని స్థితికి మీడియా దిగజారు తుందన్నది ఆందోళన. ఓటీటీలో వచ్చే కంటెంట్ వీక్షకులను వేర్వేరు వయసుల వారిగా వర్గీకరించాలన్న నిబంధన స్వాగతించదగ్గదే. న్యాయస్థానంలో నిలిచేనా...? పరస్పర విరుద్ధాంశాలు సందేహాల్ని రేకెత్తిస్తున్నాయి. అభ్యంతరకర కంటెంట్ డిజిటల్ వేదికల్లో వ్యాప్తి చెందుతున్నపుడు, దాన్ని సృష్టించిన వ్యక్తిని 72 గంటల్లో గుర్తించాలన్నది తాజా నిబంధన. అందుకు వీలు కల్పించే నిర్వహణ సదరు సంస్థలే ఏర్పాటు చేసుకోవాలి. అంటే, మాధ్యమిక వేదికగా, వినియోగదారులిద్దరి మధ్య పరస్పరం మార్పిడి జరిగే సమాచారానికి ఇక గోప్యత (ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టింగ్) ఉండదు. ఇది గోప్యతా నిబంధనకు పూర్తి విరుద్ధం. ఇంకా సమగ్రంగా డాటా పరిరక్షణ చట్టం, గోప్యతా చట్టం రూపుదిద్దుకోని దేశంలో ఇది ప్రమాద సంకేతం. ఇదే సమయంలో ఆ రెండు చట్టాలు తీసుకువచ్చే యత్నాలు మరోవైపు జరుగుతున్నాయి. గోప్యత ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు 2017 ఆగస్టులో విస్పష్టమైన తీర్పునిచ్చింది. పైగా, నిబం ధనల్లో పేర్కొన్న పలు అంశాలు నిర్ణయించే అధికారం సర్కారుకు/ అధికారులకు దఖలుపరిచే మూల స్వరూపమేదీ సదరు ‘ఐటి చట్టం– 2000’లో లేదు. చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉన్నట్టే, ఒక చట్టం కింద రూపొందే నిబంధనలు సదరు చట్టానికి లోబడే ఉండాలి. భిన్నంగా ఉంటే, సవాల్ చేసినపుడు న్యాయస్థానంలో నిలువ జాలవు. తగురీతిన పార్లమెంటులో చర్చించకుండా, చట్ట సవరణకూ సిద్దపడ కుండా, తనకు లేని అధికారాల్ని ప్రభుత్వం నిబంధనల రూపంలో తీసుకురావడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగ బద్ధత అటుంచి, ముందు చట్టబద్ధతైనా ఉండాలిగా? అనే ప్రశ్న తలె త్తుతోంది. తప్పిదాల్ని సరిదిద్దుకోకుంటే... భారత రాజ్యాంగం అధిక రణం 19(1)(ఎ)లో, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటన అధి కరణం 19లో నొక్కిచెబుతున్న భావ ప్రకటన స్వేచ్చ గాలికి ఎగిరిపోయి ప్రజాస్వామ్యం పరిహాసమవుతుంది. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
సోషల్ మీడియాకు కళ్లెం
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దుర్విని యోగంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను, నేరపూరిత సమాచారాన్ని కట్టడి చేసేందుకు సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు చేపట్టాల్సిన చర్యలను నిర్ధారిస్తూ కఠిన నిబంధనావళిని విడుదల చేసింది. అలాగే, తమ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రసారమయ్యే కంటెంట్‌కు సంబంధించి యూట్యూబ్, ఆమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సంస్థలు అనుసరించాల్సిన నియమాలను నిర్ధారించింది. వివాదాస్పద సమాచారంపై సత్వరమే స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారం కోసం అధికారులను నియమించి, వారు భారత్‌లోనే నివసించేలా చూడాలని ఆదేశించింది. భారత్‌లోని చిరునామాతో కార్యాలయం ఉండాలని పేర్కొంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా షేర్ అవుతున్న పోస్ట్‌లను, సంబంధిత ఖాతాలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాల విషయంలో కేంద్రానికి, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు మధ్య ఇటీవల వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా, ఓటీటీ, డిజిటల్ మీడియాల నియంత్రణకు ఉద్దేశించిన తాజా నియమ, నిబంధనలను ‘ద ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్’ పేరుతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం వెల్లడించారు. దర్యాప్తు సంస్థలతో సమన్వయం కోసం వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్ తదితర సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ఆమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యాజమాన్యాలు భారత్‌లో ప్రత్యేకంగా ప్రతినిధులను నియమించుకోవాలని ఆ నిబంధనల్లో స్పష్టం చేశారు. అలాగే, వివాదాస్పద సమాచారాన్ని మొదట రూపొందించిన వ్యక్తిని 24 గంటల్లోపు గుర్తించి, ఆ సమాచారాన్ని, ఆ ఖాతాను తొలగించాలని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే సమాచారం, లైంగిక దృశ్యాలు, మార్ఫ్డ్ ఫొటోలు, నగ్నచిత్రాల విషయంలోనూ ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు స్పందించాలని ఆదేశించారు. వివాదాస్పద సమాచారంపై ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే.. తక్షణమే స్పందించాలని స్పష్టం చేశారు. వినియోగదారులు, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం భారత్‌లోనే ఉండేలా ఒక అధికారిని నియమించాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలతో నెలవారీ నివేదికను రూపొందించాలని, వినియోగదారుల ఫిర్యాదులపై 15 రోజుల్లోగా స్పందించాలని ఆదేశించారు. దేశ సార్వభౌమత్వాన్ని, దేశ రక్షణను, సమాజంలో శాంతి భద్రతలను దెబ్బతీసే సమాచారంపై.. ఆ సమాచారాన్ని తొలుత రూపొందించిన వ్యక్తి వివరాలను ప్రభుత్వం కానీ, కోర్టులు కానీ కోరితే వెంటనే అందించాలని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏదైనా సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు. వినియోగదారుల సంఖ్య ఆధారంగా సోషల్ మీడియా సంస్థలను రెండు విభాగాలుగా విభజిస్తూ నిబంధనలను రూపొందించారు. ప్రభావశీల సామాజిక మాధ్యమాలు మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. వార్తలు, వార్తాకథనాలను అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కూడా వాటి యాజమాన్య వివరాలను స్పష్టంగా పేర్కొనాలని నిబంధనల్లో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలు, ఓటీటీ సంస్థలు, డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్స్ దుర్వినియోగం కాకుండా చూసేందుకే ఈ నిబంధనలను రూపొందించామని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆయా సంస్థలు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 2011 నాటి నిబంధనల స్థానంలో తాజా నిబంధనలను తీసుకువచ్చామన్నారు. ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థలు తాజా నిబంధనలను అమలు చేసేందుకు మూడు నెలల గడవును ఇచ్చామన్నారు. ‘భారత్‌లో అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థల వ్యాపార విస్తరణను స్వాగతిస్తాం. విమర్శను, భిన్నాభిప్రాయాన్ని కూడా గౌరవిస్తాం. అలాగే, సోషల్ మీడియా వినియోగదారులకు తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక సరైన వేదిక కూడా ఉండాలి’ అని ఆయన వివరించారు. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ డేటా చవకగా లభిస్తున్న భారత్.. సోషల్ మీడియా సంస్థలకు అతిపెద్ద లాభదాయక మార్కెట్‌గా మారిన విషయం తెలిసిందే. భారత్‌లో వాట్సాప్‌కు 53 కోట్ల మంది, ఫేస్‌బుక్‌కు 41 కోట్లమంది, యూట్యూబ్‌కు 44.8 కోట్ల మంది, ట్విటర్‌కు 1.75 కోట్లమంది, ఇన్‌స్ట్రాగామ్‌కు 21 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు. సోషల్ మీడియా నిబంధనలను ఐటీ శాఖ పర్యవేక్షిస్తుంది. ఓటీటీ, డిజిటల్ మీడియా నిబంధనలను సమాచార ప్రసార శాఖ పర్యవేక్షిస్తుంది. అన్ని సోషల్ మీడియా సంస్థలు భారతీయ చట్టాలను గౌరవించాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల వినియోగదారుల సాధికారత లక్ష్యంగా కొత్త నిబంధనలు రూపొందాయని ట్వీట్ చేశారు. తాజా నిబంధనల ప్రకారం.. అన్ని సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు ఒక చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, ఒక నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్, ఒక రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించుకోవాలి. వారు భారత్‌లోనే నివాసం ఉండాలి. ఫిర్యాదులకు సంబంధించిన నివేదికను నెలవారీగా వారు రూపొందించాలి. తమ అకౌంట్లను స్వచ్చందంగా వెరిఫై చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించాలి. కంటెంట్‌ను తొలగించడానికి సంబంధించి వినియోగదారుడికి ముందుగా సమాచారం, వివరణ ఇవ్వాలి. ఈ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం వినియోగదారులకు ఉండాలి. వినియోగదారుల వయస్సు ఆధారంగా తాము ప్రసారం చేసే కంటెంట్‌ను యూనివర్సల్, యూ/ఏ 7+ సంవత్సరాలు, యూ/ఏ 13+ సంవత్సరాలు, యూ/ఏ 16+ సంవత్సరాలు, ఏ(పెద్దలకు మాత్రమే) అనే ఐదు విభాగాలుగా ఓటీటీ సంస్థలు విభజించాలి. ఆయా విభాగాలను స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. దాంతో, వినియోగదారులు తాము వీక్షించనున్న వీడియోపై ముందే ఒక అవగాహనకు వస్తారు. యూ/ఏ 13+ సంవత్సరాలు.. ఆ పై విభాగాలకు సంబంధించి పిల్లలకు అందుబాటులో లేకుండా పేరెంటల్ లాక్ సదుపాయాన్ని కల్పించాలి. అడల్ట్ కంటెంట్‌ను వీక్షించేందుకు వయస్సును నిర్ధారించే విశ్వసనీయమైన ప్రక్రియ ఉండాలి. వార్తలను, వార్తాకథనాలను ప్రసారం చేసే డిజిటల్ మీడియా సంస్థలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను, కేబుల్ టెలీవిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ చట్టంలోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అపోహలను, అసత్యాలను ప్రచారం చేయకూడదు. స్వీయ నియంత్రణతో కూడిన మూడంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తొలి స్థాయిలో పబ్లిషర్ల స్వీయ నియంత్రణ, రెండో స్థాయిలో పబ్లిషింగ్ సంస్థలకు సంబంధించిన ఉమ్మడి స్వీయ నియంత్రణ విభాగం, మూడో స్థాయిలో పర్యవేక్షక నియంత్రణ ఉండాలి. రెండో స్థాయిలోని స్వీయ నియంత్రణ విభాగం కోసం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, లేదా సంబంధిత వ్యవహారాల్లో నిపుణుడైన వ్యక్తిని నియమించుకోవచ్చు. ఆ కమిటీలో గరిష్టంగా ఆరుగురు సభ్యులుండాలి. సమాచార ప్రసార శాఖ వద్ద ఆ కమిటీని రిజిస్టర్ చెయ్యాలి. తమ అకౌంట్లను స్వచ్చందంగా వెరిఫై చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించాలి. కంటెంట్‌ను తొలగించడానికి సంబంధించి వినియోగదారుడికి ముందుగా సమాచారం, వివరణ ఇవ్వాలి. ఈ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం వినియోగదారులకు ఉండాలి. వినియోగదారుల వయస్సు ఆధారంగా తాము ప్రసారం చేసే కంటెంట్‌ను యూని వర్సల్, యూ/ఏ 7+ సంవత్సరాలు, యూ/ఏ 13+ సంవత్సరాలు, యూ/ఏ 16+ సంవత్సరాలు, ఏ(పెద్దలకు మాత్రమే) అనే 5 విభాగాలుగా ఓటీటీ సంస్థలు విభజించాలి. అవి స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. యూ/ఏ 13+ సంవత్సరాలు.. ఆ పై విభాగాలకు సంబంధించి పిల్లలకు అందుబాటులో లేకుండా పేరెంటల్ లాక్ సదుపాయాన్ని కల్పించాలి. అడల్ట్ కంటెంట్‌ను వీక్షించేందుకు వయస్సును నిర్ధారించే విశ్వసనీయమైన ప్రక్రియ ఉండాలి. వార్తలను, వార్తాకథనాలను ప్రసారం చేసే డిజిటల్ మీడియా సంస్థలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ చట్టంలోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అపోహలను, అసత్యాలను ప్రచారం చేయకూడదు. స్వీయ నియంత్రణతో కూడిన మూడంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తొలి స్థాయిలో పబ్లిషర్ల స్వీయ నియంత్రణ, రెండో స్థాయిలో పబ్లిషింగ్ సంస్థలకు సంబంధించిన ఉమ్మడి స్వీయ నియంత్రణ విభాగం, మూడో స్థాయిలో పర్యవేక్షక నియంత్రణ ఉండాలి. రెండో స్థాయిలోని స్వీయ నియంత్రణ విభాగం కోసం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, లేదా రిటైర్డ్ హైకోర్టు దాన్యాయమూర్తి, లేదా సంబంధిత వ్యవహారాల్లో నిపుణుడైన వ్యక్తిని నియమించుకోవచ్చు. -
ఓటీటీలపై నిఘా
సాక్షి, న్యూఢిల్లీ: ఓటీటీ(ఓవర్ ద టాప్) పేరిట అశ్లీలం నేరుగా ప్రజల నట్టింట్లోకి చేరుతోందన్న ఆందోళనలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తదితర ఓటీటీ వేదికలను, ఇతర డిజిటల్ న్యూస్ వెబ్సైట్లు, కరెంట్ అఫైర్స్ కంటెంట్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ ద్వారా ప్రసారమయ్యే డిజిటల్ కంటెంట్‌పై ప్రస్తుతం దేశంలో ఎలాంటి నిఘా లేదు. నియంత్రణకు విధానాలు, నిబంధనలు లేవు. నెట్లో ప్రసారమయ్యే అశ్లీల, అనుచిత అంశాలపై కన్నేసి ఉంచేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చట్టం గానీ, స్వతంత్ర సంస్థ గానీ లేవు. అందుకే కేంద్ర సర్కారు ఇలాంటి వ్యవహారాలపై నిఘా పెట్టే అధికారాన్ని సమాచార, ప్రసార శాఖకు కట్టబెట్టింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి కోవింద్ సంతకం చేశారు. కోర్టు వివరణ కోరిన నెల రోజుల్లోపే... ఓటీటీలపై నిఘా కోసం కేంద్ర ప్రభుత్వం ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) రూల్స్–1961’లో సవరణలు చేసింది. దీన్ని ఇకపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) 357వ అమెండ్మెంట్ రూల్స్–2020గా వ్యవహరిస్తారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. అశ్లీలంపై చర్యలు తీసుకొనే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 క్లాజ్(3) ప్రకారం కేంద్రానికి సంక్రమించింది. ఆన్లైన్ వేదికలపై లభ్యమయ్యే న్యూస్, ఆడియో, విజువల్ కంటెంట్, సినిమాలకు సంబంధించిన నియంత్రణ విధానాలను రూపొందించే అధికారం సమాచార, ప్రసార శాఖకు దక్కింది. ఓటీటీలు, డిజిటల్ మీడియా వేదికలపై నియంత్రణ కోసం ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు శశాంక్ శంకర్ జా, అపూర్వ అర్హతియా ఇటీవలే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం వివరణ కోరిన నెల రోజుల్లోనే కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. -
ఓటీటీకి కూడా సెన్సార్
సాధారణంగా సినిమాలైతే సెన్సార్ అవ్వకపోతే విడుదల చేయలేరు. సినిమా తయారైన తర్వాత ఎవరెవరు ఆ సినిమా వీక్షించవచ్చో సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇస్తుంది. అయితే ఓటీటీ (నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, జీ5 మొదలైనవి) ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలయ్యే కంటెంట్‌కు సెన్సార్ లేదు. కానీ ఇకనుంచి ఓటీటీ కంటెంట్‌కి కూడా కత్తెర తప్పదని సమాచార మరియు ప్రసారశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక పై ఆన్లైన్లో ప్రసారమయ్యే కంటెంట్ కూడా ప్రభుత్వం గమనిస్తుంటుందని పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని డిజిటల్ మాధ్యమాల్లో సినిమా, సిరీస్‌లు, వెబ్‌సిరీస్‌లు చేస్తున్న పలువురు దర్శక–నిర్మాతలు వ్యతిరేకించారు. -
చైనాకు చెక్ పెట్టెందుకు మరో నిర్ణయం
న్యూఢిల్లీ: సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు చైనీస్ యాప్‌లను నిషేధించిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. న్యూస్ అగ్రిగేటర్లు, న్యూస్ ఏజెన్సీలు 26 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి(ఎఫ్‌డీఐ)ని పాటించాల్సి ఉంటుందని కేంద్రం శుక్రవారం ప్రకటించింది. సదరు సంస్థ సీఈఓ ఒక భారతీయ పౌరుడై ఉండాలి. 60 రోజులకు పైగా పనిచేసే విదేశీ ఉద్యోగులందరికీ సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం ఉంటుందంటూ ప్రభుత్వం కొన్ని నియమాలను సూచించింది. 26 శాతం ఎఫ్‌డీఐ నియమాన్ని కఠినతరం చేయడం ద్వారా దేశంలోని డిజిటల్ మీడియాలో పెట్టుబడులు పెడుతున్న చైనా, ఇతర విదేశీ కంపెనీలపై పట్టు సాధించడానికి ప్రభుత్వానికి వీలవుతుంది. డైలీ హంట్, హలో, యుఎస్ న్యూస్, ఒపెరా న్యూస్, న్యూస్‌డాగ్ వంటివి ప్రస్తుతం దేశంలో ఉన్న కొన్ని చైనీస్, విదేశీ నియంత్రిత-డిజిటల్ మీడియా సంస్థలు. ఇవి 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేశాయి. ఈ క్రమంలో భారతదేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నియమాలను అమలు చేయాలని భావిస్తోంది. ప్రింట్ మీడియా తరహాలో, డిజిటల్ మీడియా ద్వారా వార్తలు ప్రస్తుత వ్యవహారాలను అప్లోడ్ చేయడానికి / ప్రసారం చేయడానికి ప్రభుత్వ మార్గంలో 26 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) కేంద్ర క్యాబినెట్ 2019 ఆగస్టులో ఆమోదించింది. ఇప్పుడు, అలాంటి కంపెనీలు అన్ని "ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరంలోపు, కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో వారి ఎఫ్‌డీఐని 26 శాతం స్థాయికి సమలేఖనం చేయవలసి ఉంటుంది" అని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) తెలిపింది. ఇందుకు గాను ఒక సంవత్సరం సమయం ఇవ్వబడింది. ఈ నిర్ణయం యొక్క కొన్ని అంశాలపై వివరణ కోరుతూ వాటాదారుల నుంచి పలు విన్నపాలు వచ్చాయని డీపీఐఐటీ తెలిపింది. కొంతమంది నిపుణులు, పరిశ్రమకు చెందిన వ్యక్తులు తమ రిజర్వేషన్ల స్పష్టతకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారని తెలిపింది. (చదవండి: భారత్ కొత్త నిబంధనలపై చైనా అసంతృప్తి) ఈ క్రమంలో డీపీఐఐటీ "తగిన సంప్రదింపుల తరువాత, ప్రభుత్వ మార్గం ద్వారా 26 శాతం ఎఫ్‌డీఐని అనుమతించే నిర్ణయం" రిజిస్టర్ చేయబడిన, భారతదేశంలో ఉన్న లేదా భారతీయ సంస్థలకు చెందిన కొన్ని "వర్గాలకు వర్తిస్తుందని" స్పష్టం చేసింది. అవి ఏవి అనగా - ప్రస్తుత వ్యవహారాలను అప్లోడ్ / స్ట్రీమింగ్ చేసే వెబ్సైట్లు, యాప్ప్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో వార్తలు, వార్తలను నేరుగా లేదా పరోక్షంగా డిజిటల్ మీడియా సంస్థలకు లేదా న్యూస్ అగ్రిగేటర్లకు వార్తలను సేకరించడం, రాయడం, పంపిణీ చేయడం చేసేవి; సాఫ్ట్వేర్ / వెబ్ యాప్స్, వార్తా వెబ్సైట్లు, బ్లాగులు, పాడ్‌కాస్ట్‌లు, వీడియో బ్లాగులు వంటి వివిధ వనరులను ఉపయోగించి వార్తలను సేకరించి వార్తా విషయాలను ఒకే చోట కలిపే వాటికి ఇవి వర్తిస్తాయి అని తెలిపింది.(చదవండి: ఆర్థిక రికవరీకి విదేశీ పెట్టుబడులు అవసరం) స్వావలంబన,బాధ్యతాయుతమైన డిజిటల్ న్యూస్ మీడియా పర్యావరణ వ్యవస్థను స్థాపించే లక్ష్యంతో ఈ నియమాలు తీసుకువచ్చారు. సంస్థ బోర్డులో మెజారిటీ డైరెక్టర్లు భారత పౌరులుగా ఉండటం వంటి కొన్ని షరతులకు కంపెనీ కట్టుబడి ఉండాలి; చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక భారతీయుడే ఉండాలి. ఈ నిర్ణయం భారతీయ ప్రయోజనాలకు పక్షపాతం లేని నిజమైన ఎఫ్‌డీఐ పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది. ముఖ్యంగా పొరుగు దేశాల నుంచి వచ్చే నకిలీ వార్తలు సమాచార ముప్పు ఉన్నందున ఈ నియమాల ద్వారా భారతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత లభిస్తుంది. -
కోటి మంది యోగా చేస్తారు
న్యూఢిల్లీ: ఆదివారం జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు దాదాపు కోటి మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్ చెప్పారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తాను సూర్య నమస్కారం, పురాణఖిల ఆసనాలు వేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ‘ఇంటి వద్ద యోగా.. కుటుంబంతో కలసి యోగా’ అనే ఇతివృత్తంపై యోగా కార్యక్రమలు చేపట్టనున్నట్లు చెప్పారు. డిజిటల్ రూపంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం భారీస్థాయిలో జనంతో యోగాసనాలతో జరిగే యోగా దినోత్సవం ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా డిజిటల్ రూపంలో జరగనుంది. -
‘డిజిటల్’ ప్రయోగాలే శరణ్యం
సాక్షి, హైదరాబాద్ :కోవిడ్-19 ప్రపంచ దేశాలకు అనేక కొత్త సవాళ్లను తెరమీదకు తెచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఆయా దేశాలు విధించిన లాక్డౌన్ లేదా షట్‌డౌన్ వంటి ప్రయోగాలు అనేక రంగాలను చిన్నాభిన్నం చేశాయి. కొన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అందులో మీడియా రంగం కూడా ఒకటి. లాక్‌డౌన్‌తో ఎదురైన అనుభవాలు మీడియా రంగంలో సమూల మార్పులను సూచిస్తుండగా, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించాల్సిన అనివార్య పరిస్థితులను కల్పించింది కూడా. ప్రత్యేకించి మీడియాలో డిజిటల్ రంగం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరూ డిజిటల్ మీడియాపై దృష్టి సారించడమే కాకుండా తగిన వ్యూహాలను రచిస్తున్నాయి. (ప్రింట్‌ను దాటనున్న ‘డిజిటల్’) ఈ తాజా పరిస్థితులు శరవేగంగా మారుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకుని ‘ఎక్చేంజ్ ఫర్ మీడియా’ సంస్థ ‘ఈ ఫర్ యమ్ ఇండియా బ్రాండ్ కాన్క్లేవ్ - సౌత్ వర్చువల్ సిరీస్’ పేరుతో మీడియా రంగంలో నిష్ణాతులైన వారితో ఒక చర్చా గోష్ఠిని నిర్వహించింది. ‘డిజిటల్ న్యూస్ : కంజ్యూమర్ ఎంగేజ్మెంట్ అండ్ మోనిటైజేషన్ పోస్ట్ కోవిడ్ -19’ అన్న అంశం ఇతివృత్తంగా గోష్టి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ది గ్లిట్చ్ కో- ఫౌండర్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ రోహిత్ రాజ్ అధ్యక్షత వహించారు. వికటన్ గ్రూప్ ఎమ్. డి బి. శ్రీనివాసన్, నెట్వర్క్ 18 డిజిటల్ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ పునీత్ సింగ్వీ, సాక్షి, ఐటి అండ్ డిజిటల్ ప్రెసిడెంట్ బొల్లారెడ్డి దివ్య, మనోరమ ఆన్లైన్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ బాబి పౌల్ పాల్గొన్నారు. చర్చల్లో పాఠకులు, నిపుణుల నుంచి వచ్చిన అనేక సందేహాలకు వారు సమాధానాలిచ్చారు. (ఇక పాఠకుల వ్యాఖ్యలకు ప్రాధాన్యత) కోవిడ్-19 నేపథ్యంలో డిజిటల్ మీడియా ప్రాధాన్యత పెరిగింది. కోవిడ్ -19 తర్వాత దీనిని ఇలాగే ఎలా కొనసాగిస్తారు? ఫేక్ న్యూస్ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంస్థ ఆదాయ మార్గాలు పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడున్న క్లయింట్స్‌తో పాటు అదనంగా కొత్త వారిని ఎలా ఆకర్షిస్తారు? భవిష్యత్‌లో మీడియాలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాత్ర లాంటి అనేక ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. అదే విధంగా ఈ-పేపర్ సబ్‌స్కిప్షన్ ధరల నిర్ణయం లాంటి అనేక కీలక అంశాలపై చర్చ సాగింది. కీలకమైన అలాంటి అనేక సందేహాలపై నిపుణులు ఏమన్నారో ఈ వీడియో చూడండి. -
ఆ పోస్టులన్నీ నిజాలు కావు
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో వస్తున్న ప్రతీ వార్త, సమాచారం నిజం కాదని, ఇతరులతో పంచుకునే ముందు తప్పనిసరిగా రూఢీ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా విభాగం స్పష్టం చేసింది. అసత్య ప్రచారాలు చేసే వారిపై సంబంధిత చట్టాల కింద శిక్ష పడుతుందని హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల్లో ఇటీవలి కాలంలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టుల్లోని వాస్తవాలను ‘ఫ్యాక్ట్‌చెక్’వెబ్సైట్లో వెల్లడించింది. ► కరోనాతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న కొంతమంది విశ్లేషకుల అంచనాలు తప్పవుతాయని, మానవ స్ఫూర్తి, అంకితభావం ముందు అసాధ్యమనుకున్నవి ఎన్నో గతంలో సుసాధ్యమైనట్టు రతన్ టాటా పేరిట సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు చక్కర్లు కొడుతోంది. ఈ మాటలను తాను అనలేదని తన అధికారిక ట్విట్టర్ ఖాతాల్లో రతన్ టాటా స్వయంగా వెల్లడించారు. ► ఇటలీలో క్రేన్ల సాయంతో శవాలను ఎత్తి ఓ శ్మశానంలో గుట్టలుగా పోస్తున్నట్లు ఫేస్బుక్లో ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఇది 2013లో విడుదలైన ‘ది ఫ్లూ’అనే సినిమాలోనిది. ► కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని కరోనా ఐసోలేషన్ వార్డుగా మార్చారని, కొంత మంది ముస్లింలు ఆ గుడిలో చెప్పులేసుకుని తిరుగుతున్నారని చెబుతూ పెట్టిన ఒక పోస్టు ఫేస్బుక్లో తిరుగుతోంది. అది కాణిపాకం దేవాలయం కాదు. ‘శ్రీ గణేష్ సదన్’పేరుతో ఉన్న ఒక వసతి గృహాన్ని ఏపీ ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రంగా మార్చింది. ► వందనా తివారీ అనే డాక్టర్ కరోనా పరీక్షలు చేస్తుండగా ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని చెబుతూ ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఆమె మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఫార్మసిస్ట్ అని, కరోనా ప్రబలకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నట్టు నిజ నిర్ధారణలో తేలింది. అయితే వందన మెదడులో రక్తస్రావంతో చనిపోయిందని తెలిసింది. ► కరోనా కారణంగా హోటల్స్, రెస్టారెంట్లు, రిసార్ట్స్ 2020 అక్టోబర్ 15 వరకు మూసివేయాలని కేంద్ర పర్యాటక శాఖ ఆదేశించినట్లుగా చెబుతున్న ఒక సర్క్యులర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కేంద్ర పర్యాటక శాఖ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీనిని వదంతిగా పేర్కొన్నాయి. -
సింగిల్ ‘బ్రాండ్’ బాజా..!
సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఇప్పటిదాకా ప్రతిబంధకంగా ఉన్న పలు నిబంధనలను కేంద్రం సడలించడంతో భారత్‌లో సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్న విదేశీ దిగ్గజ సంస్థల ప్రణాళికలకు ఊతం లభించినట్లయింది. దీంతో టెక్ దిగ్గజం యాపిల్ సహా పలు సంస్థలు భారత్‌లో సింగిల్ బ్రాండ్ విక్రయాలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం దేశీ సంస్థల భాగస్వామ్యంతో భారత మార్కెట్లోకి ప్రవేశించిన జారా, హెచ్అండ్ఎం, గ్యాప్ వంటి సంస్థలు కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు కూడా నిబంధనల సడలింపుతో మార్గం సుగమమైంది. ఒకే బ్రాండ్ ఉత్పత్తులను విక్రయించే పలు సింగిల్ బ్రాండ్ విదేశీ సంస్థలు.. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత మార్కెట్లో ప్రవేశించేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇక్కడ సొంతంగా కార్యకలాపాలు సాగించాలంటే కచ్చితంగా ముందు ఆఫ్‌లైన్ స్టోర్ ఏర్పాటు చేయాలన్న నిబంధన వాటికి అడ్డంకిగా ఉంటోంది. స్టోర్ ఏర్పాటు వ్యయాలు భారీగా ఉంటున్న నేపథ్యంలో అసలు తమ ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉంటుందో తెలియకుండా ఆఫ్‌లైన్ స్టోర్ ఏర్పాటు చేయడం సరికాదనే ఉద్దేశంతో అవి వెనుకడుగు వేస్తూ వస్తున్నాయి. ఒకవేళ ముందుకొచ్చినా.. స్థానికంగా ఏదో ఒక సంస్థతో టైఅప్ పెట్టుకోవడం తప్పనిసరవుతోంది. దీంతో పాటు 30 శాతం కొనుగోళ్లు స్థానికంగా జరపాలన్న మరో నిబంధన కూడా విదేశీ సంస్థలకు అడ్డంకిగా ఉంటోంది. ఫలితంగా.. అవి స్థానికంగా ఇతర సంస్థలతో జట్టు కట్టి కార్యకలాపాలు సాగించాల్సి వస్తోంది. తాజాగా తప్పనిసరి ఆఫ్‌లైన్ స్టోర్ ఏర్పాటు, సోర్సింగ్ నిబంధనలను సడలించాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. పలు ప్రయోజనాలు.. నిబంధనల సడలింపుతో సింగిల్ బ్రాండ్ రిటైల్ సంస్థలు ముందుగా ఆన్లైన్లో విక్రయాలు జరపవచ్చు. అయితే, రెండేళ్ల వ్యవధిలో ఆఫ్‌లైన్ స్టోర్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక సోర్సింగ్ విషయానికొస్తే సింగిల్ బ్రాండ్ రిటైలర్లు తొలి అయిదేళ్లలో సగటున 30% స్థానికంగా కొనుగోళ్లు చేస్తే చాలు. ఆ తర్వాత నుంచి ఏటా ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. అయితే, ఇందులోనూ రిటైలర్లకు ఇంకొంత వెసులుబాటు లభించనుంది. సదరు బ్రాండ్‌ను విక్రయించే కంపెనీ లేదా ఆ గ్రూప్ కంపెనీలు లేదా థర్డ్ పార్టీ వెండార్లయినా సరే స్థానికంగా జరిపే కొనుగోళ్లు సోర్సింగ్ నిబంధన పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు యాపిల్‌కు వెండార్.. ఫాక్స్‌కాన్ గానీ స్థానికంగా ఉత్పత్తులను కొనుగోలు చేస్తే.. అది సోర్సిం గ్పరంగా యాపిల్‌కు కూడా దఖలుపడుతుంది. వాస్తవానికి చిన్న, మధ్య తరహా దేశీ సంస్థలు, కుటీర పరిశ్రమలు, చేతి వృత్తుల వారి ప్రయోజనాలు కాపాడేందుకు ఈ 30 శాతం నిబంధన పెట్టారు. విదేశీ సింగిల్ బ్రాండ్ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలకు దూరంగా ఉండటానికి ఈ సోర్సింగ్ నిబంధన కూడా ఒక కారణమే. స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్ దిగ్గజం ఐకియా వంటి సంస్థలు భారత్‌లో చాన్నాళ్లుగా వివిధ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. ఇక్కడ స్టోర్ పెట్టాలంటే కచ్చితంగా 30 శాతం ఇక్కడివే కొనాలన్న నిబంధన కారణంగా చాలా కాలం ముందుకు రాలేదు. తాజాగా నిబంధనల మార్పుతో విదేశీ రిటైలర్లకు మరింత వెసులుబాటు లభించనుంది. ఉపాధికి ఊతం.. నిబంధనలను సడలించడం ఉభయతారకంగా ఉంటుందన్నది ప్రభుత్వ అభిప్రాయం. ఆయా సంస్థలు స్వయంగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఊతం లభిస్తుందని, ఆన్లైన్లో విక్రయాలు జరిపినా ఉపాధి కల్పనకు తోడ్పాటు లభించగలదని భావిస్తోంది. లాజిస్టిక్స్, డిజిటల్ చెల్లింపులు, కస్టమర్ కేర్, శిక్షణ తదితర విభాగాల్లో ఉద్యోగాల కల్పన జరగగలదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఉదాహరణకు.. 2013లో అమెజాన్ భారత మార్కెట్లోకి వచ్చినప్పట్నుంచి 2,00,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరిగిందని అంచనా. అమెజాన్ సుమారు 5,00,000 మంది విక్రేతలతో కలిసి పనిచేస్తోంది. అమ్మకాలు పెరిగే కొద్దీ ఆయా విక్రేతలు మరింత మంది సిబ్బందిని తీసుకుంటూ ఉండటం వల్ల ఆ రకంగా కూడా ఉపాధికి ఊతం లభిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ‘స్మార్ట్‌ఫోన్స్’ విస్తరణ.. నిబంధనల సడలింపుతో ఎగుమతులకు కూడా ఉపయోగపడేలా భారత్‌లో తయారీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని చైనా స్మార్ట్‌ఫోన్స్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ చెప్పారు. ‘ఆఫ్‌లైన్ స్టోర్స్ విస్తరణకు కూడా దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. ఇప్పటికే మా స్థానిక భాగస్వాములతో అన్ని ప్రధాన నగరాల్లో స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, తాజా పరిణామంతో భారత తయారీ రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులు రాగలవని మరో స్మార్ట్‌ఫోన్ సంస్థ వివో ఇండియా డైరెక్టర్ (బ్రాండ్ స్ట్రాటెజీ విభాగం) నిపుణ్ మార్యా చెప్పారు. యాపిల్, వన్‌ప్లస్, ఒప్పో వంటి దిగ్గజ బ్రాండ్ల సొంత స్టోర్స్ ఏర్పాటుతో దేశీ మొబైల్ హ్యాండ్సెట్ రిటైలింగ్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి ఎదగగలదని పరిశ్రమ సమాఖ్య ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అభిప్రాయపడింది. సన్నాహాల్లో యాపిల్.. 3 నెలల్లో ఆన్లైన్ విక్రయాలు ఏడాదిన్నరలో తొలి ఆఫ్‌లైన్ స్టోర్ సింగిల్ బ్రాండ్ రిటైల్ నిబంధనల సడలింపుతో టెక్ దిగ్గజం యాపిల్ తమ తొలి ఆన్లైన్ స్టోర్ ప్రారంభించే సన్నాహాల్లో పడింది. వచ్చే 3–5 నెలల్లో ఇది సిద్ధం కావొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ఆన్లైన్ స్టోర్స్ తరహాలోనే ఇది కూడా ఉండనుందని పేర్కొన్నాయి. ఇక వచ్చే 12–18 నెలల్లో ఆఫ్‌లైన్ స్టోర్ సైతం ప్రారంభించాలని యాపిల్ నిర్ణయించుకున్నట్లు వివరించాయి. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్ భాగస్వామ్యంతో యాపిల్ ఆన్లైన్లో భారత్‌లో విక్రయాలు జరుపుతోంది. భారత్‌లో ఐఫోన్ అమ్మకాల్లో 35–40 శాతం వాటా ఈ–కామర్స్‌దే ఉంటోంది. ఐప్యాడ్ ట్యాబ్లెట్స్, మాక్‌బుక్ ల్యాప్టాప్స్ అమ్మకాలు కూడా ఆన్లైన్లో భారీగానే ఉంటున్నాయి. దేశీయంగా మొత్తం ఉత్పత్తుల విక్రయాల్లో ఆన్లైన్ అమ్మకాల వాటా 25 శాతం పైగా ఉంటోంది. అందుకే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని యాపిల్ భావిస్తోంది. ‘భారత్‌లో తొలి యాపిల్ రిటైల్ స్టోర్ ఏర్పాటు చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు అందిస్తున్న సేవలను భారతీయ కస్టమర్లకు కూడా అందిస్తాం. త్వరలోనే మిగతా ప్రణాళికలను వెల్లడిస్తాం‘ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం యాపిల్‌కు 25 దేశాల్లో స్టోర్స్ ఉన్నాయి. -
ఎఫ్‌డీఐ 2.0
న్యూఢిల్లీ: నీరసించిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్నిచ్చేందుకు ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మరోసారి ద్వారాలు తెరిచింది. బొగ్గు మైనింగ్, కాంట్రాక్టు తయారీ రంగాల్లోకి నూరు శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతి అవసరం లేని ఆటోమేటిక్ మార్గంలో ఆహ్వానించింది. అలాగే, డిజిటల్ మీడియాలో ఇప్పటి వరకు ఎఫ్‌డీఐలకు అవకాశం లేకపోగా, ఇకపై 26 శాతం వరకు ఎఫ్‌డీఐలను స్వీకరించొచ్చు. బుధవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకుంది. అలాగే, సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు స్థానిక ఉత్పత్తులను సమీకరించుకునే విషయంలో మరింత వెసులుబాటు కల్పించింది. ఐదేళ్ల కనిష్ట స్థాయికి (5.8 శాతం) జీడీపీ వృద్ధి రేటు పడిపోవడంతో గత వారం పలు వర్గాలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించగా.. వారం తిరగకముందే ఎఫ్‌డీఐలపై నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధి విషయంలో మరిన్ని చర్యలకూ అవకాశం ఉందని ప్రభుత్వం సంకేతాలు పంపినట్టయింది. గత 3–4 త్రైమాసికాలుగా దేశ వృద్ధి కుంటుపడిన విషయం గమనార్హం. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో నమోదైన జీడీపీ వృద్ధి 5.8 శాతం అన్నది ఐదేళ్ల కనిష్ట స్థాయి. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల తక్షణ నిధుల సాయం సహా పలు చర్యలను ప్రభుత్వం గతవారం ప్రకటించింది. మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు.. ‘‘ఎఫ్‌డీఐ విధానంలో మార్పులు చేయడం వల్ల భారత్ ఎఫ్‌డీఐలకు గమ్యస్థానంగా మరింత ఆకర్షణీయంగా మారుతుంది. తద్వారా పెట్టుబడుల రాక పెరిగి, ఉపాధి, వృద్ధికి తోడ్పడుతుంది’’ అని కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో అన్నారు. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు గాను ఎఫ్‌డీఐ పాలసీని మరింత సరళీకరించడమే కేబినెట్ నిర్ణయాల ఉద్దేశంగా పేర్కొన్నారు. కాంట్రాక్టు తయారీలో నూరు శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతించడం వల్ల దేశీ తయారీ వృద్ధి చెందుతుందన్నారు. సింగిల్ బ్రాండ్ రిటైల్ సింగిల్ బ్రాండ్ రిటైల్ విభాగంలో 51 శాతానికి మించి ఎఫ్‌డీఐలను కలిగిన సంస్థ... 30 శాతం ఉత్పత్తులను స్థానిక మార్కెట్ నుంచే సమీకరించుకోవాలన్నది ప్రస్తుతమున్న నిబంధన. ఇటువంటి సంస్థలకు కార్యకలాపాల నిర్వహణలో గొప్ప వెసులుబాటు కల్పించేందుకు గాను, భారత్ నుంచి సేకరించే అన్ని రకాల ఉత్పత్తులను స్థానిక సమీకరణగానే గుర్తిస్తారు. అంటే భారత్‌లో విక్రయించేందుకు అయినా, విదేశాలకు ఎగుమతి చేసేందుకు సమీకరించినా ఈ వెసులుబాటు లభిస్తుంది. అలాగే, భౌతికంగా సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాలు ప్రారంభించడానికి ముందే ఆన్లైన్లో అమ్మకాలు మొదలు పెట్టుకునేందుకు కూడా అనుమతించింది. ‘‘ఆన్లైన్ విక్రయాలతో లాజిస్టిక్స్, డిజిటల్ చెల్లింపులు, కస్టమర్ కేర్, శిక్షణ, ఉత్పత్తులపై నైపుణ్యం విభాగాల్లో ఉద్యోగాలు వస్తాయి’’ అని మంత్రి గోయల్ తెలిపారు. డిజిటల్ న్యూస్ మీడియా డిజిటల్ మీడియాకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం మంచి ముందడుగు వేసిందనే చెప్పాలి. ప్రింట్ మీడియా తరహాలోనే... ఇకపై డిజిటల్ మీడియాలో వార్తలు, కరెంట్ అఫైర్స్ అప్లోడింగ్, స్ట్రీమింగ్ విభాగంలోకి ప్రభుత్వ అనుమతితో 26 శాతం వరకు ఎఫ్‌డీఐలు ప్రవేశించొచ్చు. ప్రింట్ మీడియాలో ఇప్పటికే ప్రభుత్వ అనుమతితో 26 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. అలాగే, బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ సేవల్లోనూ ప్రభుత్వ అనుమతితో 49 శాతం ఎఫ్‌డీఐలకు ప్రవేశం ఉంది. బొగ్గు రంగంలోకి ఇలా... ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులు, ఐరన్, స్టీల్, సిమెంట్ ప్లాంట్ల సొంత వినియోగానికి ఉద్దేశించిన బొగ్గు, లిగ్నైట్ మైనింగ్‌లోకి ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఇకపై బొగ్గు విక్రయాలు, మైనింగ్, కోల్ వాషరీ, క్రషింగ్, కోల్ హ్యాండ్లింగ్ తదితర బొగ్గు అనుబంధ విభాగాల్లోకీ వంద శాతం ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్‌డీఐలను తెచ్చుకోవచ్చు. ఐదేళ్లలో 286 బిలియన్ డాలర్లు ఎఫ్‌డీఐ అన్నది ఆర్థిక వృద్ధికి కీలకమైన ఇంధనం వంటిది. రుణాల రూపంలో కాకుండా పెట్టుబడులుగా దేశాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తోడ్పడతాయి. ఇప్పటికే చాలా రంగాల్లోకి ప్రభుత్వం నూరు శాతం ఎఫ్‌డీఐలను ఆహ్వానించడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా 2014–15 నుంచి 2018–19 వరకు దేశంలోకి 286 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. అంతకుముందు 5 ఏళ్లలో వచ్చిన 189 బిలియన్ డాలర్లతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. 2018–19లో వచ్చిన 64.37 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు ఇప్పటి వరకు ఓ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన గరిష్ట ఎఫ్‌డీఐలు కావడం గమనార్హం. యాపిల్, వన్‌ప్లస్‌లకు ప్రయోజనం దేశంలో సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాలకు సంబంధించి నిబంధనలను సరళీకరించడం వల్ల మొబైల్ హ్యాండ్సెట్ రిటైల్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని, యాపిల్, వన్‌ప్లస్, ఒప్పో వంటి సంస్థలు సొంత దుకాణాలు తెరిచేందుకు మార్గం సుగమం అవుతుందని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) పేర్కొంది. పెట్టుబడులు పెరుగుతాయ్: హెచ్అండ్ఎం ‘‘ హెచ్అండ్ఎం గత 30 సంవత్సరాలుగా అంతర్జాతీయ మార్కెట్ కోసం భారత్ నుంచి సమీకరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ కోసం సమీకరించేవి కూడా ఇకపై 30 శాతం స్థానిక సమీకరణ కింద పరిగణించడం ఆహ్వానించతగినది. ఇది భారత్‌లో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుంది. విదేశీ కంపెనీల నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుంది’’ అని హెచ్అండ్ఎం భారత మేనేజర్ జానే ఎనోలా పేర్కొన్నారు. ప్రోత్సాహకరం: ఐకియా ‘‘సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు సంబంధించి స్థానిక ఉత్పత్తుల సమీకరణ నిబంధనను ప్రభుత్వం సులభతరం చేయడాన్ని ఐకియా ఇండియా ఆహ్వానిస్తోంది. సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు సంబంధించి వ్యాపార నిర్వహణను సులభంగా మార్చే ప్రభుత్వ చర్యలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి’’ అని ఐకియా ఇండియా పేర్కొంది. -
డిజిటల్ మీడియాలో విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డిజిటల్ మీడియాతో పాటు పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పూర్తి స్థాయిలో అనుమతించే దిశగా మరో విడత సంస్కరణలపై కసరత్తు చేస్తోంది. వీటిలో భాగంగా బొగ్గు, కాంట్రాక్ట్ తయారీ రంగానికి సంబంధించి కూడా ఎఫ్‌డీఐ నిబంధనలను సరళతరం చేయనుంది. కేంద్ర క్యాబినెట్ త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంట్రాక్ట్ తయారీ రంగంలో కూడా 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించే ప్రతిపాదన కేంద్రం పరిశీలిస్తున్నట్లు వివరించాయి. ప్రస్తుతం తయారీ రంగంలోకి ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. వీటి ప్రకారం తయారీదారు భారత్‌లో తయారు చేసిన ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోనక్కర్లేకుండా హోల్‌సేల్, రిటైల్ (ఈ–కామర్స్ సహా) మార్గాల్లో విక్రయించుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించి కాంట్రాక్ట్ తయారీ విభాగం ప్రస్తావన లేకపోవడంతో అస్పష్టత ఉంది. ఏవియేషన్, మీడియా (యానిమేషన్ మొదలైన విభాగాలు)బీమాసహా ప్రస్తుతం నిబంధనలను మరింత సరళతరం చేయడంపై దృష్టి సారిస్తోందని సమాచారం. -
ప్రింట్‌ను దాటనున్న ‘డిజిటల్’
ముంబై: ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా డిజిటల్ మీడియా ఇతరత్రా ప్రింట్, సినిమా మాధ్యమాలను అధిగమించనుంది. 2019లో సినిమా పరిశ్రమను, 2021 నాటికి ప్రింట్ మీడియాను దాటేయనుంది. 2021 నాటికి 5.1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019లో డిజిటల్ మీడియా 3.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని ఇందులో అంచనా వేశారు. ఇక 2018లో 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్న సినిమా సెగ్మెట్ ఈ ఏడాది 2.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని, గతేడాది 4.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ప్రింట్ మీడియా 2021 నాటికి 4.8 బిలియన్ డాలర్లకు చేరగలదని ఫీక్కీ–ఈవై నివేదిక అంచనా వేసింది. డిజిటల్ మీడియా గతేడాది 42 శాతం వృద్ధి చెంది 2.4 బిలియన్ డాలర్లకు చేరింది. భారతీయులు ఫోన్‌పై సగటున 30 శాతం సమయాన్ని వినోదానికి వెచ్చిస్తున్నారని నివేదికలో వెల్లడైంది. 57 కోట్ల మంది నెట్ వినియోగదారులు.. చైనా తర్వాత ప్రస్తుతం భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్ యూజర్లు దాదాపు 57 కోట్ల మంది ఉన్నారు. ఏటా ఈ సంఖ్య 13 శాతం పెరుగుతోంది. ఆన్లైన్ వీడియోలు వీక్షించే వారి సంఖ్య 32.5 కోట్లు, ఆడియో స్ట్రీమింగ్ యూజర్స్ సంఖ్య 15 కోట్ల స్థాయిలో ఉంది. 2021 నాటికి ఓవర్ ది టాప్ వీడియో సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 3–3.5 కోట్ల దాకా, ఆడియో సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 60–70 లక్షల దాకా పెరుగుతుందని ఫిక్కీ–ఈవై అంచనా వేసింది. టెలికం ఆపరేటర్లు కొత్తగా మల్టీ–సిస్టమ్ ఆపరేటర్ల అవతారమెత్తుతారని పేర్కొంది. ‘ప్రస్తుతం మొత్తం వినియోగంలో 60 శాతం వాటా టెలికం సంస్థల ద్వారా ఉంటోంది. ఇది 2021 నాటికి 75 శాతానికి .. 37.5 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్ స్థాయికి చేరుతుంది‘ అని ఫిక్కీ–ఈవై తెలిపింది. మరోవైపు, టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ టారిఫ్ ఆర్డరుతో ఓటీటీ, టీవీ ప్రసారాల సంస్థల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గి.. ఓటీటీ సంస్థలకు లబ్ధి చేకూరవచ్చని వివరించింది. నివేదికలో మరిన్ని వివరాలు ♦ గతేడాది దేశీయంగా మొత్తం మీడియా, వినోద రంగం పరిమాణం 23.9 బిలియన్ డాలర్లకు చేరింది. 2017తో పోలిస్తే 13.4% వృద్ధి. 2021 నాటికి 33.6 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. ♦ 2018–21 మధ్య కాలంలో ఈ వృద్ధికి ఆన్లైన్ గేమింగ్, డిజిటల్ మీడియా ఊతంగా ఉండనున్నాయి. విభాగాలవారీ ఆదాయాలపరంగా టీవీ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ♦ 2017లో 18.3 కోట్లుగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 2018లో 27.8 కోట్లకు ఎగబాకింది. ♦ టీవీ రంగం 2018లో 12 శాతం వృద్ధితో 10.6 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. 2021 నాటికి ఇది 13.7 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
టీవీలు, ఏసీలు ఆన్‘లైనే’...
న్యూఢిల్లీ: టీవీలు, ఏసీలు వంటి వినియోగ ఉత్పత్తుల గురించి ఆన్లైన్లో అధ్యయనం చేసి, వీడియోలు చూసిన తర్వాతే కొనుక్కునే ధోరణి పెరుగుతోంది. ఇలా డిజిటల్ మాధ్యమం ప్రభావంతో జరిగే కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల పరిమాణం 2023 నాటికి 23 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కొనుగోలు ప్రక్రియలో ఏ దశలోనైనా కొనుగోలుదారు ఇంటర్నెట్‌ని వినియోగించిన పక్షంలో సదరు లావాదేవీని డిజిటల్ మాధ్యమం ప్రభావిత లావాదేవీగా పరిగణించి ఈ నివేదికను రూపొందించారు. ‘ప్రస్తుతం కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల్లో దాదాపు 28% విక్రయాలు డిజిటల్ మాధ్యమంతో ప్రభావితమైనవే ఉంటున్నాయి. 2023 నాటికి ఇది 63%కి పెరగవచ్చు. విలువపరంగా చూస్తే 23 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చు. ఇందులో సుమారు 10 బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు ఆన్లైన్ విక్రయాలే ఉంటాయని అంచనా‘ అని నివేదిక వివరించింది. టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, చిన్న గృహోపకరణాలు, వాటర్ ప్యూరిఫయర్లు, మైక్రోవేవ్ ఒవెన్లు మొదలైన ఉత్పత్తుల ధరలపై 33% డిజిటల్ ప్రభావం ఉంటోంది. కొనుగోలు నిర్ణయాలపై డిజిటల్ ప్రభావం.. నివేదిక ప్రకారం.. కొనుగోలు నిర్ణయాలపై డిజిటల్ మాధ్యమం ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. ఇలా ప్రభావితమైన వారి సంఖ్య గడిచిన నాలుగేళ్లలో రెట్టింపయ్యింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వీరి సంఖ్య 5 రెట్లు పెరగ్గా, మహిళా కొనుగోలుదారుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. కొనుగోలుకు ముందు దాదాపు 80% మంది డిజిటల్ ప్రభావిత కొనుగోలుదారుల్లో ఏ బ్రాండు కొనాలి వంటి అంశాలపై సందిగ్ధత ఉంటోంది. దీంతో వారు సగటున దాదాపు 2–3 వారాలు ఆన్లైన్లో అధ్యయనం చేశాకే కొంటున్నారు. సెర్చి, సోషల్ మీడియా, బ్లాగ్లు, ఆన్లైన్ వీడియోలు మొదలైనవి ఆన్లైన్ రీసెర్చ్‌లో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు కూడా కొనుగోలుదారులకు చేరువయ్యేలా డిజిటల్ వ్యూహాలు అమలు చేస్తున్నాయని గూగుల్ ఇండియా కంట్రీ డైరెక్టర్ (సేల్స్) వికాస్ అగ్నిహోత్రి చెప్పారు. -
ఇక పాఠకుల వ్యాఖ్యలకు ప్రాధాన్యత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న పత్రికలు ఓపక్క న్యూప్రింట్ ధరలు పెరిగిపోతుండడం, మరో పక్క రెవెన్యూ తగ్గిపోతుండడం వల్ల మనుగడ సాగించేందుకు కొత్త దారులు వెతుకుతున్నాయి. ఇప్పటికే డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టిన ఈ పత్రికలు డిజిటల్ మీడియా ద్వారా రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ‘హెరాల్డ్ సన్’ ట్యాబ్‌లైడ్‌ను ప్రచురిస్తున్న మెల్బోర్న్లోని ‘న్యూస్ కార్పోరేషన్ ఆస్ట్రేలియా’ తమ రిపోర్టర్లను ప్రోత్సహించడం ద్వారా ‘పేజ్ వ్యూస్’ను పెంచుకునే పథకానికి ఈ వారం శ్రీకారం చుట్టింది. పేజ్‌వ్యూస్‌ను బట్టి రిపోర్టర్ల కథనాలకు ఒక్కో కథనానికి పది డాలర్ల నుంచి 50 డాలర్ల వరకు రోజువారి బోనస్‌ను ప్రకటించింది. వారానికి కొన్ని వందల డాలర్లను సంపాదించుకునే అవకాశం దొరికిందని ‘హెరాల్డ్ సన్’ రిపోర్టర్లు మురిసి పోతున్నారు. క్రైమ్, సెక్స్, ఎంటర్టైన్మెంట్ వార్తలకే ‘పేజ్ వ్యూస్’ ఎక్కువ వస్తాయికనుక, అలాంటి వార్తల కోసమే రిపోర్టర్లు పోటీ పడాల్సి వస్తుందని, పర్యవసనంగా రాజకీయ వార్తలకు ఆదరణ తగ్గిపోతుందని సీనియర్ రిపోర్టర్లు వాపోతున్నారు. ఆస్ట్రేలియా మొత్తంలో 150 వేర్వేరు పత్రికలు కలిగిన ఈ సంస్థకు ఈ ఏడాది ఏడు శాతం రెవెన్యూ తగ్గింది. అదే సమయంలో డిజిటల్ సబ్క్రైబర్స్ 20.5 శాతం పెరిగారు. అంటే వారు 4,09,000 నుంచి 4,93,200లకు పెరిగారు. అయినప్పటికీ ముద్రణా మీడియాలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోలేకపోతోంది. అందుకని జర్నలిస్టులకు ఉద్వాసన పలుకుతోంది. ఈసారి మరో యాభై మంది జర్నలిస్టులకు ఉద్వాసన చెబుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. డిజిటల్ నైపుణ్యం లేనివారినే పంపిస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మైఖేల్ మిల్లర్ ప్రకటించారు. ‘పేజ్ వ్యూస్’ పెరిగినంత మాత్రాన డిజిటల్ మీడియాకు యాడ్ రెవెన్యూ పెరగదని, డిజిటల్‌కు సంబంధించి యాడ్ వ్యవస్థ సంక్లిష్టమైనదని, నెంబర్లకన్నా ఉన్నత ప్రమాణాలుగల వార్తలు, ఉన్నత విలువలు కలిగిన రీడర్ల రద్దీ అవసరమని సర్చ్ ఇంజన్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ పాఠకులు తమ అభిప్రాయాలను వార్తా కథనం రాసిన రిపోర్టర్‌తో పంచుకునే అవకాశం ఉండాలని వారు అభిప్రాయ పడ్డారు. అన్నింటికన్నా ముఖ్యం స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం. ఇలాంటి అభిప్రాయాల నేపథ్యంలో పాఠకులు, వార్తా సంస్థలకు మధ్య మరింత అనుబంధాన్ని పెంచేందుకు అవసరమైన టూల్స్‌ను తయారు చేయాల్సిందిగా ‘ఫైర్ఫాక్స్ బ్రౌజర్’ను అభివృద్ధి చేసిన ‘మొజిల్లా’ డెవలపర్‌ను అమెరికాలోని ‘ది న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్’ పత్రికల యాజమాన్యాలు ఆశ్రయించాయి. దీన్ని ‘కోరల్ ప్రాజెక్ట్’గా అవి వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ దాత ‘నైట్ ఫౌండేషన్’ 40 లక్షల డాలర్లు చెల్లించారు. పాఠకులు వార్తలపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్ కింద ‘టాక్’ అనే ఫ్లాట్ఫారమ్ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి లోకల్ జర్నలిజం (స్థానిక ప్రజలకు సంబంధించిన వార్తా కథనాలు) అంతంత మాత్రంగానే ఉందని, దాన్ని విస్తరించడం ద్వారా స్థానికంగా యాడ్స్‌ను ఆకర్షించవచ్చని, తద్వారా రెవెన్యూను పెంచుకునే అవకాశం ఉందని కూడా సర్చ్ ఇంజన్ విశ్లేషకులు సూచిస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పాఠకులకు దగ్గరవడమే కాకుండా, స్థానిక వార్తా కథనాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. -
బ్యాంకుల ‘ఫిజిటల్’ మంత్రం!
సాక్షి, బిజినెస్ విభాగం: డిజిటల్ మాధ్యమంలో ఆర్థిక లావాదేవీలు క్రమంగా ఊపందుకుంటున్నప్పటికీ.. బ్యాంకులు సంప్రదాయ బ్రాంచి బ్యాంకింగ్‌ను కూడా మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఇటు మొబైల్, డిజిటల్ అటు బ్రాంచీల సాయంతో మరింత మందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విధానాన్నే ముద్దుగా ఫిజిటల్గా (ఫిజికల్+డిజిటల్) వ్యవహరిస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకు చీఫ్ ఉదయ్ కోటక్ తొలుత చేసిన ఈ పదప్రయోగం.. నెమ్మదిగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుపడటం, నెట్ అందుబాటులోకి రావడం వల్ల 2011 నుంచి మొబైల్, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. అయితే, వీటితో పాటు శాఖలు కూడా కంటి ముందు కనిపిస్తుంటే ఖాతాదారులకు బ్యాంకుపై భరోసా ఉంటోందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు అటు ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా పోటాపోటీగా శాఖలు ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నాయి. సాధారణంగా అన్ని వర్గాలకూ ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యతతో ప్రభుత్వ రంగ బ్యాంకులు విస్తృతంగా శాఖలు నిర్వహిస్తున్నాయి. ఇపుడు ప్రైవేట్ బ్యాంకులు కూడా కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు, డిపాజిట్లను పెంచుకునేందుకు శాఖలను పెంచుకుంటున్నాయి. డిజిటల్‌తో వినూత్న ప్రయోగాలు.. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంల ద్వారా మరింత వినూత్నమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. వీటికి ఖాతాదారుల నుంచి సానుకూల స్పందన కూడా వస్తోంది. అదే సమయంలో డిజిటల్‌కు సమానంగా ఫిజికల్ (భౌతికంగా) శాఖలూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయం బ్యాంకింగ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘బ్రాంచీలు ప్రధానంగా కస్టమర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడతాయి. శాఖలపరంగా భారీ నెట్వర్క్ ఉంటే కస్టమర్లకు భరోసా ఉంటుంది. ఇక శాఖల నెట్‌వర్క్‌కు డిజిటల్ చానల్స్ అనుబంధంగా పనిచేస్తాయి. మరింత మెరుగైన సర్వీసు అందించేందుకు, ఇంకొంత మంది కొత్త కస్టమర్స్‌కు చేరువయ్యేందుకు ఉపయోగపడతాయి. ఫెడరల్ బ్యాంక్ విషయం తీసుకుంటే శాఖల్లో జరిగే 75 శాతం పైగా లావాదేవీలు ప్రస్తుతం డిజిటల్ చానల్స్ ద్వారా జరుగుతున్నాయి. మాకు దేశవ్యాప్తంగా పటిష్టమైన శాఖల నెట్వర్క్ ఉంది. గడిచిన మూడేళ్లలో కొత్త శాఖలేమీ ప్రారంభించలేదు కానీ.. ఈ ఏడాదిలో దీనిపై మళ్లీ కసరత్తు చేసే అవకాశం ఉంది. ఇటు డిజిటల్‌తో పాటు అటు బ్రాంచీల తోడ్పాటుతో ఫిజిటల్ సేవలు కొనసాగిస్తాం‘ అని ఫెడరల్ బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (డిజిటల్ హెడ్) జితేష్ పీవీ తెలిపారు. శాఖల్లో ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యం.. డిజిటల్, మొబైల్ మాధ్యమాలు ఉన్నప్పటికీ.. ఖాతాదారులకు ప్రత్యేక ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వటంలో బ్యాంకుల శాఖలు ముందుంటాయని ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ ప్రకాష్ సుందరం చెప్పారు. ‘‘సెల్ఫ్ సర్వీస్ డిజిటల్ కావొచ్చు.. అసిస్టెడ్ డిజిటల్ విధానం (బ్యాంకింగ్ సిబ్బంది సహాయంతో డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవడం) కావొచ్చు.. శాఖ తీరు బాగుంటేనే ఆ బ్యాంకుతో లావాదేవీలు నిర్వహించేందుకు కస్టమరు ఇష్టపడతారు. కాబట్టి పరిమాణంలో చిన్నవైనా సరే శాఖల ప్రాధాన్యం తగ్గదు’’ అని ప్రకాష్ సుందరం చెప్పారు. యువతరం ఎక్కువగా మొబైల్, ఆన్లైన్ బ్యాంకింగ్ వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ.. కొంత పాత తరం 45–50 ఏళ్ల వాళ్లు ఇప్పటికీ బ్యాంకు శాఖల ద్వారా లావాదేవీలు జరిపేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రత్యేకంగా లాకరు సదుపాయం, వ్యక్తిగత ఆర్థిక సేవలు కోరుకునే సంపన్న వర్గాలకు కూడా బ్యాంకు శాఖలు అవసరమని ప్రకాష్ చెప్పారు. యాక్సిస్ ఏటా 400 శాఖలు.. వినూత్న డిజిటల్ సేవలు ఆవిష్కరించడంతో పాటు మరిన్ని శాఖల ఏర్పాటుపై దృష్టి పెడుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి చెప్పారు. ఏటా 400 శాఖలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం శాఖల సంఖ్య 5,500కు చేరే దాకా ఇదే విధానం కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. యాక్సిస్ ఈ ఏడాది మార్చిలో తమ 4,000వ శాఖను ఏర్పాటు చేసింది. ఆర్బీఎల్ వంటి చిన్న బ్యాంకులు కూడా శాఖలను పెంచుకుంటున్నాయి. 2018 మార్చి ఆఖరు నాటికి 265గా ఉన్న ఆర్బీఎల్ బ్రాంచీల సంఖ్య 2019 మార్చి 31 నాటికి 324కి పెరిగింది. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల ఫిబ్రవరిలోనే తమ 5,000వ బ్రాంచీని ప్రారంభించింది. అయితే, బ్రాంచీల నెట్‌వర్క్‌పరంగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులదే (పీఎస్బీ) ఆధిపత్యం ఉంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం గతేడాది జూన్ ఆఖరు నాటికి పీఎస్బీ శాఖల సంఖ్య 90,821గా ఉంది. అదే ప్రైవేట్ బ్యాంకుల శాఖల సంఖ్య 28,805కి పరిమితమైంది. -
ఈ ప్రశ్నకు బదులేది?
బ్రిటన్‌లో ఒక అమ్మాయి రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటం తల్లిదండ్రుల్ని కలిచివేసింది. అమ్మాయి సెల్‌ఫోన్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పరిశీలిస్తే ఆత్మహత్యకు కారణాలేమైనా తెలుస్తాయేమోనని వారు ప్రయత్నించారు. అయితే, పాస్వర్డ్ తెలియకపోవడంతో అవేవీ ఓపెన్ కాలేదు. కంపెనీ వాళ్లని సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. అమ్మాయి చనిపోవడంతో సామాజిక మాధ్యమాల్లో ఆమెకు సంబంధించిన అకౌంట్లు, వాటిలోని సమాచారం ఎవరికీ తెలియకుండా నిక్షిప్తమైపోయిం ది. దాంతో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించేవారెవరైనా చనిపోతే ఆ ఖాతాలన్నీ ఏమైపోవాలి. ఆ సమాచారం ఎవరికి చెందాలి. డిజిటల్ వారసులెవరు.. అన్న ప్రశ్నలు ఉదయించాయి. అయితే దీనికి ఇంత వరకు సరైన సమాధానం లభించలేదు. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు సామాజిక మాధ్యమ ఖాతా కలిగి ఉన్నారని ఒక అంచనా. ఆయా ఖాతాల్లో ఎన్నో ఫొటోలు, వ్యక్తిగత విషయాలు, సందేశాలు పోస్టు చేస్తుం టారు. ఒక రకంగా అది వారి వ్యక్తిగత సమాచార నిధిలా తయారవుతుంది. ఒకవేళ ఆ ఖాతాదారు మరణిస్తే ఆ నిధి ఎవరికి చెందు తుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. చనిపోయిన వారి ఫోన్ డేటా అంతా వారి తల్లిదండ్రుల ఆస్తి కావాలని, ఆ సమాచారం అంతా వారికి చెందాలని కొందరు వాదిస్తున్నారు. సరైన చట్టాలు లేవు ఒకరి ఖాతాను (చనిపోయినవారి) మరొకరు ఓపెన్ చేయడం తమ విధానాలకు విరుద్ధమని ఇన్స్టాగ్రామ్ అంటోంది. అయితే, కోర్టు ఆదేశాలున్న పక్షంలో తల్లిదండ్రులకు ఆ సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చే విషయం పరిశీలిస్తామంటోంది. సామాజిక మాధ్యమాల ఖాతాల వారసత్వంపై చాలా దేశాల్లో ఎలాంటి చట్టాలు, నిబంధనల్లేవు. దాంతో ఏ ఖాతాదారుడైనా చనిపోతే అతని అకౌంట్లోని సమాచారం ఎవరికి చెందాలన్నది సమస్యగా మారుతోంది. ‘సామాజిక మాధ్యమాల్ని వాడే వారిలో చాలా మంది వ్యక్తిగత రహస్యాలను, సమాచారాన్ని ఇతరులకు పంపుతుంటారు. వ్యక్తిగత గోప్యత అన్నది చాలా కీలకం. ప్రస్తుతం ఉన్న చట్టాలేవీ దీనిని అతిక్రమించలేవు’అంటున్నారు బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎడినా హర్బింజా. ఏ దేశంలో ఎలా... డిజిటల్ వారసత్వానికి సంబంధించి ఐరోపా యూనియన్ గత ఏడాది ‘జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) పేరుతో ఒక చట్టాన్ని తెచ్చింది. తమకు సంబంధించిన డేటా కాపీని ఇవ్వాల్సిందిగా లేదా తమ డేటాను తొలగించాల్సిందిగా ఇంటర్నెట్ కంపెనీలను కోరే హక్కు ఖాతాదారులకు ఉంటుందని ఈ చట్టం చెబుతోంది. అయితే బతికున్న వారికే ఇది వర్తిస్తుంది. వ్యక్తిగత సమాచారం ఆస్తి కాదని, దానిని అమ్మడమో, ఇతరులకు బదలాయించడమో సాధ్యం కాదని ఐరోపా న్యాయ నిపుణులు అంటున్నారు. ఫ్రాన్స్‌లో తమ తదనంతరం తమ సోషల్ మీడియా డేటాను ఏం చెయ్యాలన్నది కంపెనీలకు చెప్పే హక్కు ప్రజలకు ఉంది. కెనడాలో అయితే, మృతుల ఖాతాను వారి వారసులు తెరవచ్చు. సామాజిక ఖాతాల సమాచారాన్ని కూడా ఉత్తరాల్లాగే పరిగణించి వాటిపై వారసులకు హక్కు కల్పించాలని జర్మనీ కోర్టు గత ఏడాది çస్పష్టం చేసింది. దాంతో అక్కడ మృతుల కుటుంబీకులు ఆ సమాచారాన్ని పొందే అవకాశం ఉంది. ఇక అమెరికా విషయానికి వస్తే.. మృతులు సామాజిక మాధ్యమాల్లో ఎవరితో, ఎప్పుడు మాట్లాడారన్నది ‘చూడవచ్చు’. దాన్ని చదవాలంటే మాత్రం కోర్టు లేదా ఖాతాదారుడి అనుమతి కావాలి. మాధ్యమాలేమంటున్నాయి.. మరణానంతరం తమ డిజిటల్ డేటాను ఎవరికి, ఎంత మేరకు ఇవ్వవచ్చన్నది నిర్ణయించుకునే అవకాశాన్ని గూగుల్ తమ ఖాతా దారులకు కల్పిస్తోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హోల్డర్ల విషయంలో మృతుల ఖాతాలను రద్దు చేయడం లేదా దాన్ని స్మారక పుట(మెమోరియల్ పేజ్)గా మార్చడానికి కుటుంబీకులకు అవకాశం కల్పిస్తోంది. స్మారక పుటల్లో సమాచారం కనిపిస్తుంది కాని దాన్ని మార్చడానికి వీలు కాదు. ఫేస్బుక్ ఖాతాదారులు తమ ఖాతాలకు వారసులను కూడా నామినేట్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ డిలీట్ చేసినా దాంట్లోని సమాచారాన్ని కొంతకాలంపాటు పదిలంగా ఉంచుతామని ఈ మాధ్యమాలు చెబుతున్నాయి. నిపుణుల సూచనలు మృతుని డేటాను ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, ఖాతాదారుడు చనిపోగానే అతని డేటా అంతా దానికదే తుడిచిపెట్టుకుపోయేలా చూడాలని న్యాయ నిపుణులు అంటున్నారు. మృతుని అకౌంట్లో వ్యక్తిగత సమా చారాన్ని డిలీట్ చేయాలని, ఫొటోలు, ఇతర సమాచారంపై వారసులకు హక్కు కల్పించాలని మరికొందరంటున్నారు. -
2020కి భారత్ ఆన్లైన్ కొనుగోళ్లు @ 10,000 కోట్ల డాలర్లు
వినియోగదారులు ఆన్లైన్లో జరిపే కొనుగోళ్ల విలువ 2020 నాటికి 2.5 రెట్లు పెరిగి దాదాపు 10,000 కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా. ఈ–కామర్స్, ట్రావెల్ అండ్ హోటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ మీడియా రంగాల్లోని వృద్ధి దీనికి దోహదపడుతుంది. ఈ విషయాలు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, గూగుల్ సంయుక్త నివేదికలో వెల్లడయ్యాయి. నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ♦ భారతీయులు ప్రస్తుతం ఆన్లైన్లో జరిపే కొనుగోళ్ల విలువ దాదాపు 4,000 కోట్ల డాలర్లుగా ఉంది. ♦ ఈ–కామర్స్ విభాగంలో అప్పరెల్ అండ్ యాక్ససిరీస్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, డ్యూరబుల్స్, ఫుడ్ అండ్ గ్రాసరీ వంటి ఉత్పత్తులపై కస్టమర్ల వ్యయాలు 2020 నాటికి ప్రస్తుతమున్న 18 బిలియన్ డాలర్ల నుంచి 40–45 బిలియన్ డాలర్లకు చేరొచ్చు. అలాగే ట్రావెల్ అండ్ హోటల్ వ్యయాలు 11 బిలియన్ డాలర్ల నుంచి 20 బిలియన్ డాలర్లకు, ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యయాలు 12 బిలియన్ డాలర్ల నుంచి 30 బిలియన్ డాలర్లకు, డిజిటల్ మీడియా వ్యయాలు 200 మిలియన్ డాలర్ల నుంచి 570 మిలియన్ డాలర్లకు పెరగొచ్చు. ♦ అందుబాటు ధరల్లోని స్మార్ట్‌ఫోన్స్, చౌక డేటా ప్లాన్స్, స్థానిక భాషలో ఎక్కువ కంటెంట్ అందుబాటులోకి రావడం వంటి పలు అంశాల కారణంగా ఆన్లైన్ యూజర్ల సంఖ్య గత నాలుగేళ్లలో దాదాపు 2 రెట్లు పెరిగి ప్రస్తుతం 43 కోట్లకు చేరింది. ♦ నాన్–టైర్ 1 పట్టణాల్లోని కొత్త యూజర్లు, మహిళలు సహా 35 ఏళ్లకుపైన వయసున్న షాపర్లు ఆన్లైన్ కొనుగోళ్ల వృద్ధికి బాగా దోహదపడనున్నారు. ♦ 2020 నాటికి మహిళా షాపర్ల సంఖ్య 2.5 రెట్లు పెరగనుంది. ♦ మౌలిక సదుపాయాల మెరుగుదల వల్ల మెట్రో నగరాలే కాకుండా పట్టణాల నుంచి కూడా ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరగనుంది. ♦ ఏదేమైనప్పటికీ అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్‌లో డిజిటల్ లావాదేవీల సంఖ్య తక్కువగానే ఉంది. ♦ భారత్‌లో ఐదుగురు ఇంటర్నెట్ యూజర్లలో ఒకరు ఆన్లైన్లో షాపింగ్ చేసి ప్రొడక్టులను కొనుగోలు చేస్తున్నారు. ఆరుగురిలో ఒకరు ఆన్లైన్లో ట్రావెల్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. దాదాపు 75–80 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇప్పటికీ ఆన్లైన్లో కొనుగోళ్లు చేయడం లేదు. ఆఫర్లు, డిస్కౌంట్లు వంటి వాటితో యూజర్లను కొనుగోలు మార్గంలోకి ఆకర్షించొచ్చు. -
ఫేస్బుక్, గూగుల్‌పై నిఘా
సిడ్నీ: ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలపై అమెరికా, బ్రిటన్ల తర్వాత ప్రస్తుతం ఆస్ర్టేలియా నిఘా పెట్టింది. వార్తా ప్రకటనలు, అసత్య కథనాలపైనా కన్నేసి ఉంచాలని నిర్ణయించింది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్‌ఫాం కార్యకలాపాలను పరిశీలించానలి ఆస్ర్టేలియన్ కాంపింటీషన్ కన్సూమర్ కమిషన్‌ను(ఏసీసీసీ) ప్రభుత్వం కోరినట్టు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక పేర్కొంది. ఆస్ర్టేలియాలో ఫేస్బుక్,గూగుల్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫాంల ప్రభావంపై తాము పూర్తిస్ధాయిలో అథ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని ఏసీసీసీ ఛైర్మన్ రాడ్ సిమ్స్ చెప్పారు. విచారణలో భాగంగా డిజిటల్ కంటెంట్, సోషల్ మీడియా వేదికలనూ జల్లెడపట్టనున్నారు.ఆయా సంస్థలు విదేశాల నుంచి పనిచేస్తున్నా తమ సమాచార వ్యవస్థలు వాటిని లొకేట్ చేస్తాయని సిమ్స్ తెలిపారు. అసత్య వార్తలు వైరల్ అవుతున్న అంశాన్నీ తమ విచారణ పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. -
డిజిటల్ బామ్మ
ఒకప్పుడు అక్షరం ముక్క రాని ఈ బామ్మ ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్పర్ట్. సామాజిక అభివృద్ధి కోణంలో డిజిటల్ మీడియా పాత్రను అవగాహన చేసుకొని కొత్త అడుగులు వేస్తుంది. రాజస్థాన్‌లోని ఆజ్మీర్ జిల్లాలోని హర్మద అనే గ్రామంలో జన్మించిన నౌరోతి ఎన్నడూ స్కూలు ముఖం చూడలేదు. కుటుంబానికి ఆసరాగా నిలవడం కోసం రాళ్లు కొట్టే పని నుంచి రోడ్డు నిర్మాణ పనులలో కూలీ పనుల వరకు రకరకాల పనులు చేసేది. అయితే పురుషులతో పోల్చితే స్త్రీలకు కూలీ డబ్బులు తక్కువ ఇచ్చేవాళ్లు. ‘మగవాళ్లతో సమానంగా కష్టపడుతున్నప్పుడు...వారితో సమానంగా కూలీ ఎందుకు ఇవ్వరు?’ అని ప్రశ్నించేది నౌరోతి.కేవలం ప్రశ్నించడంతో మాత్రమే ఊరుకోలేదు. ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి న్యాయపోరాటం చేసింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లి గెలిచింది. ఈ విజయం...నౌరోతిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆత్మవిశ్వాసాన్ని నింపింది.న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో చదువు ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుంది నౌరోతి. ‘‘చదువుకోకుండా ఇన్ని సంవత్సరాలు వృథా చేశాను’’ అని అనుకున్నదే ఆలస్యం తనలోని నిరక్షరాస్యతపై పోరాటం మొదలుపెట్టింది. తన గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిలోనియాలోని బేర్‌ఫుట్ కాలేజీలో అక్షరాభ్యాసం మొదలు పెట్టింది. త్వరగా నేర్చుకునే నైపుణ్యం, చురుకుదనంతో ఆరు నెలల్లోనే చదవడం, రాయడం నేర్చుకుంది. చదువుకు దూరమైన ఎంతోమంది మహిళలను తనతో పాటు బడికి తీసుకువచ్చేది. తన నాయకత్వ లక్షణాలతో గ్రామ ప్రజల మనసులు చూరగొన్న నౌరోతి పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్‌గా గెలిచింది.సర్పంచ్‌గా ఉన్న అయిదు సంవత్సరాల కాలంలో గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ఆల్కహాల్ మాఫియాపై పోరాటం చేసింది. ఇదంతా ఒక్క ఎత్తయితే... కంప్యూటర్‌పై అవగాహన పెంచుకోవడం మరో ఎత్తు. కంప్యూటర్ నాలెడ్జ్ వల్ల సమయం ఆదా కావడం మాత్రమే కాకుండా... ఎన్నో విధాలుగా ఉపయోగం ఉంటుందని స్వయంగా తెలుసుకొని రంగంలోకి దిగింది. కంప్యూటర్‌పై పట్టు సాధించింది.మహిళాసాధికారతకు సంబంధించిన వార్తలు, ఆరోగ్యసమస్యలు, వ్యవసాయంలో వస్తున్న సరికొత్త మార్పులు...ఇలా ఎన్నో విషయాలు ఇంటర్నెట్లో చదివి పదిమందికి చెబుతుంటుంది నౌరోతి. కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో గ్రామస్తులకు చెబుతుంటుంది. నౌరోతి దగ్గర కంప్యూటర్ పాఠాలు నేర్చుకున్న ఎంతో మంది శిష్యులు రకరకాల ఉద్యోగాల్లో స్థిరపడడం మరో విశేషం! -
ఐదేళ్లలో డిజిటల్ మీడియాదే ఆధిపత్యం!
మూడేళ్లలో రూ.20,000 కోట్లకు డిజిటల్ మార్కెట్: ఈవై ఇండియా ముంబై: స్మార్ట్ఫోన్లు, బ్రాడ్‌బ్యాండ్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో 2021–22 నాటికి డిజిటల్ మీడియా.. ఇతర సంప్రదాయ మాధ్యమాలను అధిగమిస్తుందని కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) ఇండియా అంచనా వేసింది. 2019–20 నాటికి జనాభాలో 50 శాతం మంది స్మార్ట్ఫోన్లను వినియోగించనుండటం ఇందుకు తోడ్పడగలదని వివరించింది. అలాగే, 2021–22 నాటికి స్మార్ట్ఫోన్ల వాడకంలో మూడో వంతుకి బ్రాడ్‌బ్యాండ్ వినియోగం చేరుతుందని, ఈ రెండు సర్వీసుల వ్యయాల మధ్య వ్యత్యాసం ఒక మోస్తరు స్థాయికి రాగలదని తెలిపింది. వీటన్నిటి ఊతంతో డిజిటల్ మీడియా వినియోగం గణనీయంగా పెరుగుతుందని ఈవై ఇండియా అడ్వైజరీ లీడర్ (మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగం) ఆశీష్ ఫేర్వానీ తెలిపారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఈ–మార్కెటర్ అంచనా ప్రకారం భారతీయులు ప్రతి రోజు సంప్రదాయ మీడియా (టీవీ, రేడియో, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు)పై సగటున రెండున్నర గంటలు, డిజిటల్ మీడియాపై ఒక గంట మేర సమయం వెచ్చిస్తున్నారు. ‘2020–21 నాటికి ఈ ధోరణి మారుతుంది. 2021–22 కల్లా డిజిటల్ వినియోగం భారీగా పెరిగి, సంప్రదాయ మీడియా వాడకం గణనీయంగా తగ్గిపోతుంది‘ అని పేర్కొన్నారు. ముందుగా ముప్పు ఇంగ్లిష్ మీడియాకే.. పై స్థాయి వర్గాలు వేగంగా డిజిటల్ వైపు మళ్లుతుండటంతో సంప్రదాయ మాధ్యమంలో ముందుగా ఇంగ్లీష్ ప్రింట్ మీడియాకే ముప్పు పొంచి ఉందని ఆశీష్ చెప్పారు. ప్రాంతీయ భాషల్లో ప్రింట్ సర్క్యులేషన్ పెరుగుతోందని, ఇది మరింత వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం రూ. 8,490 కోట్లుగా ఉన్న దేశీ డిజిటల్ మార్కెట్ (డిజిటల్ అడ్వర్టైజింగ్, మ్యూజిక్, వీడియోలు, గేమింగ్ మొదలైనవి) వచ్చే మూడేళ్లలో రూ. 20,000 కోట్లకు చేరనుందని పరిశ్రమవర్గాల అంచనా. -
ఎంటర్టైన్మెంట్లో ‘హంగామా’
♦ కంటెంట్‌ను విస్తృతం చేస్తున్న కంపెనీ ♦ పిల్లల కోసం త్వరలో యానిమేషన్ వీడియోలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న హంగామా.కామ్ మరింత వినోదాన్ని పంచేందుకు రెడీ అయింది. వేలాది సినిమాలు, పాటలను నిక్షిప్తం చేసిన ఈ సంస్థ కొద్ది రోజుల్లో పిల్లల కోసం యానిమేషన్ వీడియోలను పరిచయం చేయనుంది. అలాగే టీవీ సీరియళ్లను సైతం పొందుపరుస్తామని హంగామా.కామ్ సీఈవో సిద్ధార్థ రాయ్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. రానున్న రోజుల్లో సొంతంగా టీవీ సీరియళ్లు, యానిమేషన్ కంటెంట్‌ను రూపొందిస్తామని చెప్పారు. తెలుగు కంటెంట్ కోసం ఇటీవలే మా టీవీతోపాటు సన్ టీవీ నెట్వర్క్తోనూ ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. తమ నెట్‌వర్క్‌లోకి లాగిన్ అయిన కస్టమర్ సగటున 47 నిముషాలు వీడియోలను చూస్తున్నట్టు చెప్పారు. 4జీ నెట్వర్క్ విస్తృతమైతే పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. డేటా చార్జీలు త గ్గడం, నాణ్యమైన సేవలు అందుతాయి కాబట్టి కస్టమర్ల సంఖ్య అధికమవుతుందని పేర్కొన్నారు. మార్చికల్లా 2.5 కోట్లమంది.. వీడియో ఆన్ డిమాండ్ సేవలందిస్తున్న హంగామా ప్లే కస్టమర్లు నెలవారీ చందా రూ.199 చెల్లించాలి. ఎన్ని సినిమాలనైనా అపరిమితంగా చూడొచ్చు. చందాదారుగా కొనసాగినంత కాలం సినిమాలను డౌన్లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో వీక్షించే వీలుంది. ఒక కస్టమర్ తన ఖాతా కింద అయిదు ఉపకరణాల్లో ఈ యాప్‌ను వాడొచ్చు. హంగామా, హంగామా ప్లే వినియోగదార్లు 6.7 కోట్ల మందికిపైగా ఉన్నారు. వీరిలో 1.75 కోట్లకుపైగా ప్రీమియం చందాదారులున్నారు. చిన్న వీడియోలను చూసే వారి సంఖ్య ఏడాదిలో 16 నుంచి 34%కి ఎగసింది. డిసెంబరుకల్లా ఇది 55 శాతానికి చేరడం ఖాయమని సిద్ధార్థ రాయ్ వెల్లడించారు. 2017 మార్చికల్లా మొత్తం చందాదారుల సంఖ్య 20 కోట్లకు, ప్రీమియం చందాదారులు 2.5 కోట్లకు చేరొచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంత కస్టమర్ల వాటా 30% ఉంటుందని వివరించారు. -
మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో నియామకాల జోరు
న్యూఢిల్లీ: మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో నియామకాలు పెరిగాయి. ఈ రంగంలో నియామకాల వృద్ధి గతేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో 9 శాతం పెరిగింది. నియామకాల పెరుగుదలకు డిజిటల్ మీడియా, శాటిలైట్ టీవీ వంటి తదితర విభాగాల విస్తరణే కారణం. ఈ విషయం టైమ్స్జాబ్స్డాట్కామ్ సర్వేలో వెల్లడైంది. గత ఏడాది కాలంలో ఎంటర్టైన్మెంట్, మీడియా, జర్నలిజం నిపుణుల డిమాండ్ బాగా పెరిగింది. వీరిలో ముఖ్యంగా ప్రారంభ స్థాయి, ఐదేళ్లలోపు అనుభవం ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా (60 శాతంగా) ఉంది. ఈ డిమాండ్‌లో 50 శాతం ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల నుంచే ఉంది. తర్వాతి స్థానాల్లో హైద రాబాద్, పుణే, అహ్మదాబాద్‌లు ఉన్నాయి. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో మీడియా సంబంధిత యాప్‌ల వినియోగం పెరిగిందని తద్వారా సోషల్ మీడియా నిపుణులకు మంచి డిమాండ్ ఏర్పడింఈని టైమ్స్జాబ్స్డాట్కామ్ వెల్లడించింది. -
‘సాక్షి’ మొబైల్ యాప్‌కి విశేష స్పందన
⇒ డిజిటల్ టెక్నాలజీతోనే పాఠకులకు మరింత చేరువ ⇒ డిజిటల్ మీడియా సదస్సులో ‘సాక్షి’ డిజిటల్ మీడియా, ఐటీ ప్రెసిడెంట్ దివ్యారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ : అన్ని వర్గాల పాఠకులకు వార్తలను తక్కువ సమయంలో చేరవేసేందుకు డిజిటిల్ మీడియా ఎంతో ఉపకరిస్తుందని ‘సాక్షి’ డిజిటల్ మీడియా, ఐటీ ప్రెసిడెంట్ దివ్యా బొల్లారెడ్డి అన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం విరివిగా పెరిగిపోతున్న ఈ సమయంలో అన్ని వర్గాల పాఠకులను, ముఖ్యంగా యువతను మరింతగా ఆకర్షించేందుకు సోషల్ మీడియాతోపాటు సరికొత్త యాప్స్ వాడాల్సిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. ఢిల్లీలో మంగళవారం డిజిటల్ మీడియా ఇండియా-2015 సదస్సుకు దివ్యారెడ్డి హాజరయ్యారు. బీబీసీ సహా ప్రపంచస్థాయి మీడియా సంస్థలకు చెందిన పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ మీడియాలో వస్తున్న మార్పులు, పాఠకుల అవసరాలకు తగ్గట్టుగా చేసుకోవాల్సిన మార్పులు సహా పలు అంశాలపై చర్చించారు. సదస్సులో భాగంగా ‘ఏ కేస్ స్టడీ ఆన్ ది డిజిటల్ కంటెంట్ స్ట్రాటజీ ఆఫ్ సాక్షి డెయిలీ’ అన్న అంశంపై దివ్యారెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలుగు భాషలో సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ, సాక్షి డాట్‌కామ్ ద్వారా వార్తలను, వార్తా కథనాలను మరింత వేగవంతంగా చేరువచేసేందుకు తీసుకుంటున్న చర్యలు, టెక్నాలజీలో తీసుకువచ్చిన మార్పులను వివరించారు. సాక్షి వెబ్ మీడియాలో తాజా వార్తలను అందించడంతోపాటు రోజువారీ పత్రికలో, టీవీలో వచ్చే వార్తలతోపాటు ఆ వార్తకు సంబంధించిన అదనపు సమాచారాన్ని, ఒక సంఘటనకు సంబంధించిన అదనపు ఫొటోలను, వీడియోలను వీలైనన్ని ఎక్కువ పాఠకులకు చేరువ చేసేలా తీర్చిదిద్దినట్టు చెప్పారు. వార్తల్లో నాణ్యత లోపించకుండా అంతర్గతంగా ఎలాంటి వ్యవస్థను రూపొందించుకోవాలనే అంశాలను వివరించారు. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలోనూ పాఠకుడితో అనుబంధాన్ని కొనసాగించేందుకు తీసుకుంటున్న చర్యలను తెలిపారు. కొత్తగా ప్రారంభించిన సాక్షి మొబైల్ యాప్‌కి సైతం విశేష స్పందన లభిస్తోందన్నారు. దీనిలో యూజర్ జనరేటెడ్ కంటెంట్(యూజీసీ)వినియోగంతో వీక్షకుడితో అనుబంధాన్ని కొనసాగించే అవకాశం ఉందన్నారు. దీనిలో వీక్షకులను సహ భాగస్వామ్యులను చేస్తూ వారు పంపే ఫొటోలను వెబ్‌లో పెడుతున్నామని తెలిపారు. డిజిటల్ మీడియాని వినియోగించే వారిలో యువత శాతం ఎక్కువగా ఉంటున్నందున వారిని ఆకట్టుకునేలా వార్తాంశాలను ఎంపిక చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. టీవీలో వచ్చే వార్తను మరెప్పుడైనా నచ్చిన సమయంలో చూసేలా తక్కువ నిడి వి ఉన్న వీడియోలను మొబైల్ యాప్‌లో పెట్టడం, అందుకు సబంధించిన సమాచారాన్ని టెక్ట్స్ రూపంలో ఇవ్వడంతో వీక్షకుడికి మరింత వెసులుబాటుగా ఉంటోందన్నారు. డిజిటల్ మీడియాలో వస్తున్న మార్పులతో ఎప్పటికప్పుడు నవీనీకరించుకుంటే మరింతగా పాఠకులకు, వీక్షకులకు చేరువకావొచ్చని అన్నారు.