వివిధ డిజిటల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ ఖాతాల నిర్వహణలో ముందుకు దూసుకుపోతోంది.
తెలంగాణ సీఎంఓ, మంత్రి కేటీఆర్ డిజిటల్ మీడియా వింగ్.. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ చానల్ ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం, తప్పుడు సమాచారంపై అప్రమత్తం చేయడం వంటి కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది.
గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సీఎం కార్యాలయం, మంత్రి కేటీఆర్‌ను ఎంత మంది అనుసరిస్తున్నారు, ఎంత మందికి చేరువవుతున్నారనే గణాంకాలను ఇటీవల తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ విడుదల చేసింది.
మరోవైపు ఈ ఏడాది మే 20వ తేదీ నాటికి ట్విట్టర్‌లో హరియాణా తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతీ వెయ్యి మందిలో 44 మంది సీఎం కార్యాలయ ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment