YouTube
-
యూట్యూబ్ సాయంతో సెల్ఫ్ సర్జరీ..! ఐతే అతడు..
ఏదైన తెలియని విషయం నేర్చుకోవాలంటే ఠక్కున గుర్తొచ్చేది యూట్యూబ్ మాయజాలమే. అందులో ఏ వంటకమైన, తెలియని పనైనా సులభంగా నేర్చుకోవచ్చు..నిమిషాల్లో చేసేయొచ్చు. అయితే అది కొన్నింటికే పరిమితం. ఆరోగ్యానికి సంబంధించినవి చాలామటుకు వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకునే చేయాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు. అయితే ఈ వ్యక్తి ఏకంగా యూట్యూబ్ చూసి తనకు తాను సర్జరీ చేసుకున్నాడు. చివరికి అది కాస్త సివియర్ అయ్యి ఆస్పత్రి మెట్లు ఎక్కక తప్పలేదు. అయితే వైద్య నిపుణులు ఇదెంత వరకు సబబు అని మండిపడుతున్నారు. మరీ ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే..ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి యూట్యూబ్ వీడియోల సాయంతో నేర్చుకున్న పరిజ్ఞానంతో తనకు తానుగా సర్జీర చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. అందుకోసం మార్కెట్ నుంచి సర్జికల్ బ్లేడ్లు, కుట్లు వేసే తీగలు, సూదులు వంటివి అన్ని కొనుగోలు చేశాడు. అనుకున్నట్లుగానే అన్నంత పని చేసేశాడు. తనకు తానుగా పొత్తికడుపు కోసుకుని మరీ ఆపరేషన్ చేసుకున్నాడు. అంత వరకు బాగానే ఉంది. ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా దిగజారడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలింరు అతడి బంధువులు. ఆస్పత్రి వైద్యులు అతడి చేసిన ఘనకార్యం విని కంగుతిన్నారు. వెంటనే పరీక్షించగా..అదృష్టవశాత్తు సదరు వ్యక్తి పొత్తి కడుపు పైపొర మాతమే కోయడంతో త్రటిలో ప్రాణాపయం తప్పిందన్నారు. ఎందుకంటే కాస్త లోతుగా కోసుంటే ఇతర అంతర్గ అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యేవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.ఘటనపై సీరియస్ అవుతున్న వైద్యులు..ఆన్లైన్లో చూసిన ప్రతిదాన్ని చేసేయాలని చూడొద్దు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో పరాచకాలు వద్దు. నిపుణుల సాయం లేకుండా సర్జరీ లాంటివి అత్యంత ప్రమాదకరమని అన్నారు. వైద్యుడిని సంప్రదించకుండా ఇలాంటి సర్జరీలు చేసేటప్పుడూ ఒకవేళ అధిక రక్తస్రావం అయితే పరిస్థితి చేజారిపోతుంది. పైగా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. డబ్బు ఆదా చేయాలనో లేదా మాకు చాలా పరిజ్ఞానం వచ్చేసిందన్న అత్యుత్సాహంతోనే ఇలాంటిపనులకు అస్సలు ఒడిగట్టద్దు. ఈ మిడిమిడి జ్ఞానంతో స్వీయంగా లేదా వేరేవాళ్లకి సర్జరీలు చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆన్లైన్ హెల్త్ ట్యూటోరియల్స్ లేదా హెల్త్ ట్రెండ్లు వంటి వాటిని చాలావరకు వైద్యులు ఆమోదించరిన అన్నారు. నిపుణుల మార్గదర్శకత్వంలోనే ఇలాంటివి చేయాలి. ఎంబీబిఎస్ చదివి ఎన్నేళ్లో ప్రాక్టీస్ చేసినా వైద్యులే ఒక్కోసారి పొరపాట్లు దొర్లుతుంటాయి. అలాంటిది ఏ మాత్రం అనుభవం లేకుండా .. జస్ట్ చూసి ఎలా చేసేస్తారంటూ మండిపడుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: 'విద్యార్థి భవన్ బెన్నే దోసె'..యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా..) -
బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?
బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్‌లను ప్రమోట్ చేసిన వారు భారీగా సంపాధించారని పోలీసుల విచారణలో తెలుస్తోంది. ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం వల్ల సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్ యాప్స్ ఉచ్చు బిగుస్తుంది. బెట్టింగ్ యాప్ప్ ప్రమోట్ చేసి డబ్బలు దండుకున్న వారిలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అయితే, వారు ఒక్కో యాప్‌ను ప్రమోట్ చేసినందుకు గాను ఎంతమొత్తంలో డబ్బు తీసుకుంటారో అధారాలతో సహా బయటకొస్తున్నాయి.బెట్టింగ్ యాప్స్ గురించి ఒక నిమిషం వీడియోకు రూ.90వేలకు పైగానే చార్జ్ చేసినట్లు సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో 1 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉంటే నెలకు రూ. 30 లక్షలు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఎక్కువ మంది సుమారు15 వీడియోలకు పైగానే ప్రమోట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో తేలింది. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ.. అన్వేష్‌కు ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహుకులు ఏకంగా కోటి రూపాయలు ఆఫర్ చేసినట్లు ఆయన చెప్పాడు. అదే సమయంలో బ్యాంకాక్ పిల్ల యూట్యూబర్‌ను(శ్రావణి ) కూడా వారు సంప్రదించారట. ఆమెకు రూ. 70 లక్షలు ఇస్తామని బెట్టింగ్ యాప్స్ వాళ్లు ఆఫర్ చేసినట్లు తన యూట్యూబ్ ఛానల్లో పంచుకుంది. ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటే అధికమొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు ఈ గేమింగ్ యాప్స్ నిర్వాహుకులు ఏమాత్రం వెనకడుగు వేయడంలేదని చెప్పవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో 5వేల మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా నెలకు 20వేల వరకు ఇచ్చారని చెబుతున్నారు. ఇలా వారికి ఉన్న గుర్తింపును బట్టి డబ్బులు ఇచ్చేవారని తెలుస్తోంది. ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారు కనీసం రూ. 50 లక్షలకు పైగానే సంపాధించారని సమాచారం. వారి బ్యాంకు లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరెన్ని వీడియోలు చేశారు.. ఎంత డబ్బు సంపాధించారు అనే కోణంలో విచారిస్తున్నారు.ఎవరెవరు ఏ యాప్స్‌లో.. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్‌మీడియాలో పాప్అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్‌విన్ సైట్లు, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు.సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. -
వయసు 60..టైలరింగ్‌తో పొట్టపోసుకునే మహిళ ఏకంగా ఎవరెస్టునే..!
ఆమె వయసు 60... ఊరు కేరళ. టైలరింగ్‌తో పొట్ట పోసుకునే సగటు స్త్రీ. కాని ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు ఎలాగైనా చేరాలని పట్టుదల. ట్రైనింగ్ లేదు... బృందాలతో కలవడం లేదు. కేవలం యూట్యూబ్‌ను గురువుగా పెట్టుకుంది. అడుగులో అడుగు వేస్తూ వయసును లెక్కచేయక గమ్యం చేరుకుంది.చిన్న మనుషులూ పెద్ద కలలు కనొచ్చు. వసంతి చెరువీట్టిల్ స్ఫూర్తి గాథ.‘అది ఆనందమో దుఃఖమో తెలియదు. త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి, కేరళ సంప్రదాయ చీరలో నేను నిలుచుంటే రివ్వుమనే చల్లగాలిలో అందరూ చప్పట్లు కొడుతుంటే కళ్లలో నీళ్లు ఉబికి వచ్చాయి‘ అంటుంది వసంతి చెరువీట్టిల్.సమున్నతంగా శ్వేత కిరీటాలతో నిలుచుని ఉండే హిమాలయాలను పలకరించడానికి కేరళలోని కన్నూరు నుంచి ఈమె బయలుదేరినప్పుడు తోడు ఎవరూ లేరు తనకు తాను తప్ప. భర్త చనిపోయాక ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసి వారి జీవితానికి దారి చూపించాక ఈ ప్రపంచాన్ని చూడాలని చిన్న ఆశ కలిగింది వసంతికి. చేసే పని టైలరింగ్. ఆదాయం కొద్దిగా. కాని అందులోనే దాచి ఎంత వీలైతే అంత తిరిగి చూడాలనుకుంది. తన చుట్టూ ఉన్నది తనలాంటి వారే కాబట్టి ‘అమ్మో అంత ఖర్చా? మేము నీతో రాము’ అన్నారు. ‘వెళితే నువ్వొక్కదానివే వెళ్లు’ అన్నారు. ‘వెళ్లలేనా?’ అనుకుంది వసంతి. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు బ్రేక్ వేస్తారు. కాని వసంతి ఇద్దరు కొడుకులూ వెళ్లిరామ్మా అన్నారు. అలా ఆమె మొదట థాయ్‌ల్యాండ్ తిరిగి వచ్చింది ఒక్కత్తే. ఆ తర్వాత హిమాలయాలు కనీసం బేస్ క్యాంప్ అయినా చూడాలనుకుంది.యూట్యూబే ట్రెయినర్‌గా...ఎవరెస్ట్ అధిరోహించడంలో రెండు దశలు. ఒకటి బేస్ క్యాంప్‌కు చేరుకోవడం. రెండు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం. ఎవరెస్ట్ శిఖరం పై చేరడం చాలా కష్టం కాబట్టి కనీసం బేస్ క్యాంప్ అయినా చేరాలనుకుంటారు. అయితే సముద్ర మట్టానికి 5364 మీటర్ల ఎత్తున ఉన్న బేస్‌క్యాంప్ వరకూ వెళ్లడం కూడా సామాన్యమైన విషయం కాదు. 7 నుంచి 9 రోజులు పడుతుంది. ఇందుకు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజులు ట్రెకింగ్ బూట్లతో నడవగలగడం ఇవన్నీ సాధన చేయాలి. ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న వసంతి కేవలం యూట్యూబ్‌లో చూసి ఇవన్నీ నేర్చుకుంది. రోజూ వ్యాయామం చేసింది. నాలుగు గంటల పాటు వాకింగ్ చేసింది. ట్రెకింగ్ షూస్ వేసుకుని నడిచింది. హిమాలయాల్లో కమ్యూనికేషన్ ఇబ్బంది రాకుండా కాస్తో కూస్తో హిందీ కూడా నేర్చుకుంది. ఆ తర్వాత అందరికీ చెప్తే విస్తుపోయారు. చివరకు అభినందనలు తెలిపి సాగనంపారు.ప్రతికూలతలునేపాల్లోని లుల్కా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి దశల వారీగా బేస్‌క్యాంప్ వెళ్లాలనుకుంది వసంతి. అయితే వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఆమె ఎక్కాల్సిన లుల్కా విమానం ఎగరలేదు. దాంతో చిక్కుబడిపోయింది. అప్పుడు ఒక జర్మన్ జంట లుల్కా నుంచి కాకుండా సుర్కె నుంచి వెళదామని సాయం చేశారు. ఫిబ్రవరి 15న సుర్కె నుంచి ఆమె ట్రెకింగ్ మొదలైంది. ఏమాత్రం అనువుగా లేని కాలిబాట దారుల్లో ఆమె ప్రతి ఐదు నిమిషాలకు దీర్ఘశ్వాస తీసుకుంటూ రోజుకు 7 గంటలు నడిచి విశ్రాంతి తీసుకుంటూ మొత్తం 9 రోజులు నడిచి చివరకు బేస్ క్యాంప్‌కు చేరుకోగలిగింది.నా సంప్రదాయం నా గౌరవంవసంతి తనతో పాటు కేరళ సంప్రదాయ చీర తెచ్చుకుంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర చేరాక దానిని కట్టుకుని ఫొటో దిగింది. తన సంప్రదాయ ఘనత చాటింది. వసంతిని ఇప్పుడు కేరళ మాత్రమే కాదు నెరవేరని ఆకాంక్షలు గల స్త్రీలందరూ అబ్బురంగా చూస్తున్నారు. (చదవండి: ఏడు పదుల వయసులో ఫిట్‌గా మోదీ..! ఆరోగ్య రహస్యం ఇదే..) -
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న యూట్యూబర్లపై కేసులు.. త్వరలోనే అరెస్ట్?
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కంటెంట్ క్రియేటర్లపై కేసులు నమోదు చేశారు. వారిలో హర్షసాయి, సన్నీ యాదవ్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బండారు పేషయాని సుప్రిత తదితరులపై వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల చేయగా.. త్వరలోనే వీరిని అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. -
Vinisha Reddy: వైద్య వృత్తిని వదిలి ఐఏఎస్ వైపు
ప్రస్తుతం యువతను సోషల్ మీడియా గురించి అడిగితే.. రీల్స్ గురించి, షార్ట్స్ గురించి చెబుతారు.. కానీ అదే సామాజిక మాధ్యమాల్లో ఒకటైన యూట్యూబ్‌ను వినియోగించుకుని గ్రూప్స్‌లో టాపర్‌గా నిలిచింది ఆ యువతి. ప్రతి నిమిషం అదే లక్ష్యంతో ఏకాగ్రతగా నిర్ధేశిత ప్రణాళికతో ముందుకు కదిలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ పోటీ పరీక్షల్లో విజయం సాధించింది. ఆమె నగరానికి చెందిన డాక్టర్ వినీషా రెడ్డి.. యూట్యూబ్‌లో పోటీ పరీక్షల క్లాసులు వీక్షిస్తూ రికార్డును సృష్టించింది.. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్స్ పరీక్షలో మహిళా విభాగంలో అత్యధిక మార్కులు సాధించి వరుసగా టాపర్‌గా నిలిచారు వినీషా రెడ్డి. చదివింది వైద్య వృత్తి అయినప్పటికీ తల్లిదండ్రుల మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. బీహెచ్ఎంఎస్ పూర్తి కాగానే డాక్టర్ ప్రాక్టీస్ వైపు మొగ్గు చూపకుండా 2022 నుంచి పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. కోచింగ్ సెంటర్‌కు వెళ్లడం కంటే ఇంట్లోనే కూర్చోని ఆన్లైన్ క్లాసుల ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధం అయితే సమయం వృథా కాదని తల్లిదండ్రులు సలహా ఇచ్చారు. చదివిన వైద్య వృత్తితో సంబంధం లేకుండా యూట్యూబ్‌లో సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల టాపర్స్ ఇంటర్వ్యూలను వీక్షించారు. తద్వారా ఓ అంచనాకు వచ్చారు. గ్రూప్స్ నోటిఫికేషన్ వెలువడగానే దరఖాస్తు చేసుకుని యూ ట్యూబ్‌లో క్లాసులను వీక్షించారు. చక్కని ప్రణాళికతో రోజుకు ఎనిమిది గంటలు సమయం కేటాయించి సబ్జెక్టుల వారీగా క్లాసులు వింటూ తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. మొదటి అటెంప్ట్ లోనే.. అనుకున్న లక్ష్యాన్ని చేరేలా చక్కని ప్రణాళికతో ప్రాక్టీస్ చేసినట్లు డాక్టర్ వినీషా రెడ్డి చెబుతున్నారు. టీజీపీఎస్సీ నిర్వహించిన సీడీపీవో పరీక్షలకు హాజరై స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. గ్రూప్–1లో సైతం అత్యధిక మార్కులు సాధించారు. గ్రూప్–2 మహిళా విభాగంలో టాపర్‌గా నిలిచారు. తాజాగా టీజీపీఎస్సీ గ్రూప్–3 మహిళా విభాగంలోనూ మొత్తం 450 మార్కులకు గానూ 325.157 మార్కులు సాధించారు. 8వ జనరల్ ర్యాంకింగ్‌లో నిలిచారు. సివిల్స్ పరీక్షలతో ఐఏఎస్ కావాలన్నదే తన ముందున్న ఏకైక లక్ష్యమని వినీషారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
జియోస్టార్ యూట్యూబ్ కంటెంట్ తొలగింపు
భారత బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ స్ట్రీమింగ్ పరిశ్రమలో ప్రముఖ సంస్థగా ఉన్న జియోస్టార్(Jiostar) మే 1, 2025 నాటికి యూట్యూబ్ నుంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునేందుకు సంస్థ ఈమేరకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. పే-టీవీ(డబ్బు చెల్లిస్తే టీవీ సర్వీసులు అందించడం) డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ నుంచి ఉచిత డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కు చందాదారుల వలసలను అరికట్టడానికి ఈ వ్యూహాత్మక నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.జియోస్టార్ ఇకపై ప్రీమియం కంటెంట్‌ను సబ్స్రిప్షన్ పరిధిలోకి తీసుకురావాలనే వ్యూహానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం ద్వారా పెయిడ్ సర్వీసులను పెంచుతూ సబ్‌స్రైబ్‌లను ప్రోత్సహించేందుకు వీలు అవుతుందని కంపెనీ నమ్ముతుంది. జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనంతో ఓటీటీ విభాగంలో జియోస్టార్ కీలకంగా మారింది. ఇది బాలీవుడ్, అంతర్జాతీయ సినిమాలు, ప్రాంతీయ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్‌తో సహా విభిన్న కంటెంట్‌ను అందిస్తోంది.బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమపై ప్రభావంయూట్యూబ్ నుంచి కంటెంట్‌ను తొలగించాలన్న నిర్ణయం బ్రాడ్‌కాస్టింగ్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టాటా ప్లే, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ వంటి పే-టీవీ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్‌లు ఉచితంగా ప్రీమియం కంటెంట్ అందిస్తున్నాయి. క్రమంగా ఈ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఇదే పంథాను ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో తమ సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పే-టీవీ సబ్ స్క్రిప్షన్ల సంఖ్య 8.4 కోట్లుగా ఉంది. ఇది గతంలో ఎక్కువగానే ఉండేది. చందాదారులను నిలుపుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి కంపెనీలు విభిన్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. భారతదేశంలో టీవీ సబ్ స్క్రిప్షన్ మార్కెట్ విలువ రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: పండుగ వేళ పసిడి పరుగు.. తులం ఎంతంటే..సవాళ్లు ఇవే..సబ్స్క్రిప్షన్ ఆధారిత మోడల్‌పై కంపెనీలు దృష్టి పెట్టడం ఆదాయ వృద్ధికి అవకాశాలను పెంచేవైనప్పటికీ.. ఉచిత కంటెంట్‌కు అలవాటు పడిన భారతీయ వినియోగదారులు ఎంత మేరకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్లకు మారుతారో గమనించాల్సి ఉంటుంది. ఏదేమైనా జియోస్టార్ కంటెంట్ లైబ్రరీ, లైవ్ స్పోర్ట్స్, ప్రాంతీయ కంటెంట్ వంటి ప్రత్యేక సదుపాయాలు వీక్షకులను సబ్‌స్క్రైబ్ చేసుకునే దిశగా ఆకర్షిస్తుందని కంపెనీ విశ్వసిస్తుంది. -
యూట్యూబ్ సలహా ప్రమాదం కావచ్చు...
ఉదయాన్నే రాగి సంగటి తినమంటారొకరు. తింటే డేంజరంటారొకరు. వేపాకులను తినేయండి అని ఒకరు. రావి ఆకుల జ్యూస్ అని ఒకరు. ఇటీవల ఆరోగ్యం మీద అందరికీ ఆసక్తి పెరిగింది. దానికి తగ్గట్టు యూట్యూబ్‌లో చిట్కాల వీడియోలు పెరిగాయి. అర్హతలు ఉన్నవారూ లేనివారూ చెప్పేది వింటే ప్రొణం మీదకు రావచ్చు.కేరళలోని కన్నూరులో ఓ 18 ఏళ్ల యువతి బరువు తగ్గడానికి కేవలం వేడినీళ్లు తాగుతూ అవయవాలు దెబ్బ తిని మరణించింది. పిల్లలను హెచ్చరించే మనం జాగ్రత్త పడాల్సిన సమయం ఇది.ఆరోగ్య ప్రచారం మంచికోసం కాకుండా సబ్స్ట్రయిబర్ల కోసం, వ్యూస్ కోసం సాగడం నేటి విషాదం. ఎలాంటి టిప్స్ చెప్పిస్తే వీడియోలు వైరల్ అవుతాయో చూస్తున్నారో తప్పితే చెబుతున్న విషయాలు ఎవరికి, ఎంతవరకు అవసరమో ఎవరికి కీడు చేస్తాయో చెప్పడం లేదు. ఆహార విధానాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త సిద్ధాంతాలు లేవనెత్తుతూ అయోమయానికి గురి చేయడం నేడు చూస్తున్నాం. కోడిగుడ్డు పచ్చసొన కొందరు వద్దు అంటే కొందరు అదే మంచిది అంటారు. ఇలాంటి అయోమయం మధ్యలో ప్రత్యామ్నాయ ఆహార ప్రచారకర్తలు ముందుకు వచ్చి తాము నమ్మిన విధానాలను ప్రచారం చేస్తున్నారు. వీరు చేస్తున్న వీడియోలకు శాస్త్రీయ నిర్థారణ ఏమిటి అన్నది ఎవరూ చూడటం లేదు. అలాగే చురుగ్గా, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ‘సన్నగా’ కనిపించడం అవసరం అనుకుంటున్నారు చాలామంది. సన్నగా అవడం అందరి శరీరతత్వాలకు సరిపడుతుందో లేదో వైద్య సలహా తీసుకోవడం లేదు. వీడియోలు చూసి బరువు తగ్గేందుకు ప్రయత్నించిప్రొణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కేరళలో జరిగిన ఉదంతం ఈ విషయంలో హెచ్చరిక చేస్తోంది.50 కిలోల నుంచి 24 కిలోలకుకన్నూరు జిల్లా కలూరుపరయకు చెందిన 18 ఏళ్ల ఫస్ట్ ఇయర్ డిగ్రీ అమ్మాయి శ్రీనంద బరువు తగ్గిపోయి మాట్లాడలేని స్థితికి చేరుకోగా తల్లిదండ్రులు ఆమెను తలస్సెరి కోఆపరేటివ్ హాస్పిటల్‌కు తీసుకు వచ్చారు. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ ప్రభు మాట్లాడుతూ ‘ఆమె బరువు 24 కేజీలు ఉంది. బి.పి. 70, ఆక్సిజన్ లెవల్ 70, బ్లడ్‌షుగర్ 45.. సోడియం, పొటాషియం లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. ఆమె ఆరు నెలలుగా ఆహారం తినకుండా దాచేస్తోంది. మూడునెలలుగా యూట్యూబర్‌ను నమ్మి హాట్ వాటర్ మాత్రమే తీసుకుంటోంది. 50 కిలోల నుంచి మూడునెలల్లో 24 కిలోలకు వచ్చేసింది. ఇది ఆహారాన్ని నిరాకరించే ‘అనొరెక్సియా’ అనే మానసిక స్థితి. తల్లిదండ్రులు ఆ విషయాన్ని కనిపెట్టలేకపోయారు. ఇలాంటి వారిని ముందే గుర్తించి మానసిక వైద్యం చేయించాలి’ అన్నారు. ‘రోజుల తరబడి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు’ అని ఆయన తెలిపారు.బాడీ షేమింగ్, వీడియోలుఇటీవల కాలంలో బాడీ షేమింగ్ వల్ల టీనేజర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు దేశప్రధాని మన దేశంలో ఊబకాయం పెరిగిపోతోందని ఆందోళన చెందుతోంటే, అందుకు కారణాలను అర్థం చేసుకోకుండా ఊబకాయులను బాడీ షేమింగ్ చేస్తున్నారు కొందరు. టీనేజ్‌లో ఉన్న పిల్లలు సన్నబడాలని హటాత్తుగా బరువు తగ్గితే అది అవయవాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి వారిని ఆకర్షించేలా యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు ఉంటున్నాయి. ‘ఇలా చేస్తే వెంటనే బరువు తగ్గుతారు’ అనే వీడియోలు నమ్మవద్దని పిల్లలకు చె΄్పాల్సిన అవసరం ఉంది.గుడ్డిగా నమ్మవద్దుఅలోపతిలోగాని ఆయుర్వేదంలోగాని లేదా ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లోగాని కచ్చితమైన నిపుణులను కలిసి పూర్తిగా కేస్ హిస్టరీ చెప్పి సన్నబడటానికి లేదా బరువు తగ్గడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చి ఆకుకూరల, కాయగూరల జ్యూసులు తాగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. నిపుణుల సలహా తప్పనిసరిబరువు తగ్గడం అనేది మానసిక వైకల్యంగా మారే స్థితికి కొంతమంది చేరుకోవడం బాధాకరం. ఇలాంటి వారు యూట్యూబ్, ఇన్‌స్టా తదితర ప్లాట్‌ఫామ్స్‌లో తెలిసీ తెలియక చెప్పే సలహాలు నమ్మి నష్టపోతున్నారు. కేరళలో చనిపోయిన అమ్మాయి ఆరు నెలలు ‘హాట్‌వాటర్’ థెరపీ చేసింది. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ ఇద్దరూ ఒకే విధంగా బరువు తగ్గరు. అందుకు వయసు, శరీరతత్త్వం, జన్యుపద్ధతి, జీవన విధానం... ప్రభావం చూపుతాయి. బరువు తగ్గించాలంటే ఎక్స్‌పర్ట్‌లు వ్యక్తిగతంగా వివరాలు తీసుకుని, మెడికల్ హిస్టరీ తెలుసుకొని, ఎటువంటి ఆహారం తీసుకోవాలో, వద్దో సూచిస్తారు. క్వాలిఫైడ్ డైటిషియన్స్ను వ్యక్తిగతంగా కలిసి డైట్ పాటించాలి తప్ప ఎవరూ ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పే విధానాలకు దిగవద్దు.– డా.వాణి కత్తి, ఫుడ్‌సైన్స్ ఎక్స్పర్ట్ -
బరువు తగ్గాలని ఆ డైటింగ్ : చివరికి ప్రాణమే పోయింది!
బరువు తగ్గాలనే ఆరాటంలో చాలా పొరబాట్లు చేస్తూ ఉంటారు కొంతమంది. శరీర తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అసలు బరువు తగ్గడం అవసరమా? తగ్గితే ఎన్ని కిలోలు తగ్గాలి? ఎలాంటి డైట్ పాటించాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? అనేది నిర్ణయించుకోవడం అవసరం. ఇందుకు వైద్యుల సలహాలు, నిపుణుల సూచనలు చాలా ముఖ్యం. అలాకాకుండా బరువు పెరుగుతామనే భయంతో ఆన్లైన్లో చూసో, లేదా మరెవరో చెప్పారనో ఏ డైట్ బడితే అది ఫాలో కావడం అనర్థం. ఒక్కోసారి ఇది ప్రాణాలు కూడా పోవచ్చు. కేరళలో కన్నూరులో చోటు చేసుకున్న ఘటన ఇలాంటి ఆందోళనలనే రేకెత్తిస్తోంది. కొన్ని రకాల రుగ్మతల వల్ల కూడా భయం పెరిగిపోతామనే భయం పట్టుకుంటుందని మీకు తెలుసా? రండి తెలుసుకుందాం! కేరళలోని కన్నూర్‌కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి తీవ్రమైన ఆహార నియంత్రణలు పాటించేది. యూట్యూబ్‌లో చూసి దాదాపు పూర్తిగా ఆహారాన్ని తీసుకోవడం మానేసింది. కేవలం నీటినే తీసుకునేది. చివరికి తీవ్రమైన దీర్ఘకాలిక ఆకలి కారణంగా ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయింది. మృతురాల్ని కూతుపరంబ నివాసి శ్రీనందగా గుర్తించారు. తీవ్రమైన సమస్యలతో తలస్సేరిలోని ఒక ఆసుపత్రిలో చేరింది. వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండి ప్రాణాలు కోల్పోయింది. ఆమె గతంలో కూడి ఇలాంటి సమస్యలతో కోజికోడ్ మెడికల్ కాలేజీలో చేరిందట. వైద్యుడు డాక్టర్ నాగేష్ ప్రభు ప్రకారం, శ్రీనంద అనోరెక్సియా నెర్వోసా అనే తినే రుగ్మతతో బాధపడుతోంది. దీని వలన రోగి బరువు పెరుగుతారనే భయం ఉంటుంది. ఆరు నెలల కింత నుంచి ఆకలితోనే ఉంటోందని ఆయన తెలిపారు. సోడియం , చక్కెర స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఇలాంటి సమస్యలకు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాధి తీవ్రత గురించి తెలుసు కోవాలన్నారు. పశ్చిమ దేశాల్లో ఎక్కువగా కనిపించే అనోరెక్సియా నెర్వోసా కేరళలో కనిపించడం ఇది చాలా అరుదు అని కూడా ఆయన చెప్పారు. అనోరెక్సియా నెర్వోసా అంటే..?డా. నగేష్ అందించిన వివరాల ప్రకారం అనోరెక్సియానెర్వోసాతో బాధపడేవారిలో కాలక్రమేణా ఆకలి అనే అనుభూతిని కోల్పోతారు. దీనికి కారణాలపై స్పష్టత లేదు. అయితే మానసిక ఆరోగ్యం, జన్యు మార్పులు, పర్యావరణం వంటివి ఈ పరిస్థితికి కారణమవుతుంది. అన్ని వయసులు, జాతులు, శరీర రకాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.మానసిక చికిత్సఅనోరెక్సియా నెర్వోసా ఒక మానసిక పరిస్థితి. దీని లక్షణాలను బట్టి మానసిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మందులు, పోషకాహార కౌన్సెలింగ్, వారానికి ఒకసారి మానసిక కౌన్సెలింగ్ తీసుకోవాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి. సకాలంలో చికిత్స చేస్తే నయమవుతుంది. అయితే, ఇలాంటివి రుగ్మతలు రాత్రికి రాత్రే నయం కావు. కోలుకోవడానికి సమయం చాలా పట్టవచ్చు. వైద్యులను సలహాలను తప్పక పాటిస్తూ, క్రమం తప్పకుండా మందులు వాల్సి ఉంటుంది. -
న్యాయ వ్యవస్థకు తాడు మీద నడక
రణవీర్ అలహాబాదియా కేసు ఎంత సంక్లిష్టమో సుప్రీంకోర్టు దాన్ని డీల్ చేసిన తీరు తేటతెల్లం చేస్తోంది. ఈ విచారణ... నైతిక ఆగ్రహానికీ, రాజ్యాంగ ఔచిత్యానికీ నడుమ తాడు మీద చేసిన నడకను తలపిస్తోంది. వాదప్రతివాదాలు విన్న తర్వాత యూ ట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రణవీర్‌కు ఊరట కల్పిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. రణవీర్ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ వ్యక్తి. ‘ఇండియా గాట్ లేటెంట్’ అనే వెబ్ టాలెంట్ షోలో అతను చేసిన వ్యాఖ్యలపై అనేక ఎఫ్ఐఆర్లు దాఖలు అయ్యాయి. ఆ వ్యాఖ్యలు సరదా కోసమే చేసినప్పటికీ వాటిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. మీడియా సంస్థలు, రాజకీయ నేతలు గగ్గోలు పెట్టడం అగ్నికి ఆజ్యం పోసి నట్లయింది. రణవీర్ భాష ఎంత అసహ్యకరంగా ఉంది అన్నది న్యాయపరంగా ప్రధాన ప్రశ్న కాదు, అది భారతీయ చట్టాల ప్రకారం నేరపూరిత అపరాధం అవుతుందా అవ్వదా అన్నదే ముఖ్యం. ఆయన న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ న్యాయస్థానంలో చేసిన ఈ వాదన ఎంతైనా సమంజసం. వారికీ రాజ్యాంగ రక్షణ అవసరంకానీ కోర్టు ఇలాంటి సూక్ష్మ అంశాలను పట్టించుకునే మూడ్‌లో లేదు. భాష ‘డర్టీ’గా, ‘పర్వర్టెడ్’గా ఉందంటూ విచారణ ఆసాంతం ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తన ఏహ్యభావం వ్యక్తం చేసింది. ఒక దశలో న్యాయమూర్తి కల్పించుకుని, ‘‘ఇలాంటి భాషను మీరు సమర్థిస్తున్నారా?’’ అని చంద్రచూడ్‌ను ప్రశ్నించారు. నిజానికి డిఫెన్స్ లాయర్ పాత్ర... అత్యంత తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్ననిందితుడికి సైతం న్యాయవ్యవస్థ ద్వారా చట్టపరమైన రక్షణ లభించేట్లు చూడటమే!సుప్రీంకోర్టు సమాజ నైతికతకు సంరక్షకురాలు కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి రాజ్యాంగ హక్కులను కాపాడటమే దాని ప్రాథమిక విధి. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం అంటే జనామోదం పొందిన భావప్రకటనను పరిరక్షించడం అనుకోకూడదు. అప్రియమైన, జనాదరణ లేని భావప్రకటన చేసి నప్పుడు అలాంటి వారికి రాజ్యాంగపరమైన రక్షణ అవసరం అవుతుంది.అభినవ్ చంద్రచూడ్ ఈ విచారణ సందర్భంగా న్యాయ సూత్రాల మీదకు కోర్టు దృష్టిని మరల్చారు. అపూర్వ అరోరా వెబ్ సిరీస్ (కాలేజ్ రొమాన్స్) కేసును ఉదహరిస్తూ, అసభ్యత మాత్రమే అశ్లీలత అవ్వదన్న సుప్రీం తీర్పును ఆయన ప్రస్తావించారు. ఒకరి భావప్రకటన ఇతరుల లైంగిక వాంఛలను ప్రేరేపించడానికి ఉద్దేశించి నదా, హద్దులు దాటి నేరపూరితమైన అశ్లీలతకు అది కారణమైందా అనే అంశాల ప్రాతిపదికగా దాన్ని పరీక్షకు పెట్టాలని ఈ తీర్పు చెబుతోంది. న్యాయస్థానం దీన్ని పట్టించుకున్నట్లు లేదు. ‘‘ఇది అశ్లీలత కాకుంటే, మరేది అశ్లీలత అవుతుంది?’’ అని ప్రశ్నించింది. కోర్టులు నైతిక శూన్యంలో పని చేయాలని అనడం లేదు. అలా అని వాటి నైతిక పరమైన ఏహ్యత... న్యాయ తర్కాన్ని కప్పివేయకూడదు. అరోరా కేసు ‘‘మీరు ఏదనుకుంటే అది మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా?’’ అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. తన వ్యక్తిగత మర్యాద భావన నుంచి వాక్ స్వాతంత్య్ర సంరక్షణను వేరు చేయడానికి కోర్టు విముఖంగా ఉన్నట్లు ఈ ప్రశ్న సంకేతాలు ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో కేసు ఎదుర్కొంటున్న ‘యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్’ రణవీర్ అలహాబాదియా పితృస్వామ్య కథనంరణవీర్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు ఆయన న్యాయవాది చంద్రచూడ్ కోర్టు దృష్టికి తీసుకురాగా, జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్య ప్రస్తుత హియరింగ్‌లో అత్యంత కలవరం కలిగించిన అంశం! ఈ తరహాలో చౌకబారు ప్రచారం పొందాలని మీరు ప్రయత్నించినట్లే, బెదిరింపుల ద్వరా చౌకబారు ప్రచారం సంపాదించాలని ప్రయత్నించే వారు కూడా ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. రణవీర్ మాటలు ఎంత అభ్యంతర కరమైనవి అన్నది పక్కనపెడితే, చంపేస్తామనే బెదిరింపులు వాటికి పర్యవ సానం కారాదు. రణవీర్ వ్యాఖ్యలు తన తల్లిదండ్రులకు అవమానం కలిగించా యని విచారణలో కోర్టు పదేపదే ప్రస్తావించింది. భారతీయ సాంస్కృతిక నియమాలను ఈ పితృస్వామ్య నెరేటివ్ ప్రతిఫలిస్తుంది. రాజ్యాంగంలో దీనికి చోటు లేదు. న్యాయస్థానాలు నైతికతకు పున రావాస కేంద్రాలు కావు. రణవీర్ నేరం చేశాడా లేదా అన్నదానికి... అతడు తన కుటుంబాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాడన్నది సంబంధం లేని విషయం. సామాజిక తిరస్కారాన్ని చట్టపరమైన నేరారోపణతో ముడిపెట్టడం అనేది కోర్టులు దాటకూడని ప్రమాదకమైన రేఖ. కోర్టు చిట్టచివరకు రణవీర్‌కు మధ్యంతర ఉపశమనం మంజూరు చేసింది. ప్రతివాదులకు నోటీసు జారీచేసి వారి సమాధానం కోరింది. ఇది సరైన నిర్ణయం. రణవీర్ వ్యాఖ్యలకు అభ్యంతరకర స్వభావం ఉన్నప్పటికీ, వాటిని నేరంగా గుర్తించడానికి అది చాలదు.‘ఇండియా గాట్ లేటెంట్’ వెబ్ షో వివాదం, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఈ కార్యక్రమ స్వభావం సందర్భపరమైన ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తింది. రణవీర్ వ్యాఖ్యల క్లిప్ అసందర్భంగా లీక్ అయ్యింది. ఆ విషయం కోర్టుకూ తెలిసినట్లే ఉంది. అయినా విచారణలో ఈ ఎరుక ప్రభావం కనిపించలేదు. భావప్రకటన స్వేచ్ఛ కేసుల్లో సంద ర్భానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మూక ప్రేరేపిత నైతిక భయాందోళనల నుంచి కోర్టులు వాక్ స్వేచ్ఛను పరిరక్షించాలి. న్యాయస్థానాలు తమ విచారణలో ఎంత సంయమనం పాటించాల్సి ఉంటుందో గుర్తు చేసేందుకు రణవీర్ కేసు చక్కటి ఉదా హరణగా నిలుస్తుంది. న్యాయమూర్తులు కూడా మనుషులే. అందరి లానే వారికీ అసహ్యం, కోపం, అనైతికత పట్ల ఏహ్యభావం ఉంటాయి. కాని వారి వృత్తి... భావోద్వేగాలకు లోనై తీర్పులు చెప్పేది కాదు. రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా న్యాయాన్ని పరిరక్షించాలి. జనాభిప్రాయం వేరేలా ఉన్నప్పుడు ఈ విధి కష్టతరంగానే ఉంటుంది. కత్తి మీద సాములా వారు తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించాల్సి వస్తుంది. విచారణ జరగాల్సిన తీరువ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడానికి రాజ్యాంగానికి లోబడి అంతిమంగా తాను ఏం చేయాలో అదే మన సర్వోన్నత న్యాయ స్థానం చేసింది. మధ్యంతర ఉపశమనం మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ క్రమంలో అది వ్యవహరించిన తీరు ప్రజలకు అస్పష్ట సంకేతాలు పంపింది. న్యాయవ్యవస్థ నిన్ను కాపాడు తుంది... కానీ ఆ పని నిన్ను అవమానానికి గురి చేసిన తర్వాతే,అసంతృప్తితోనే నీ హక్కులను గౌరవిస్తున్నట్లు నీకు స్పష్టం చేసిన తర్వాతే, నీ మీద తన నైతిక ఆధిక్యతను రుజువు చేసుకున్న తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పకనే చెప్పింది. రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలు పని చేయాల్సిన తీరు ఇది కాదు. జనామోదం కొరవడిన వారికీ, అభ్యంతకరమైన వారికీ, ఆఖరుకు పెర్వర్ట్ అయిన వారికీ ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాపాడేందుకే సుప్రీం కోర్టు ఉన్నది. అసభ్యత నుంచి సమాజాన్ని శుద్ధి చేయడం తన బాధ్యత కాదనీ, తనకు దీపస్తంభంలా నిలవాల్సింది చట్టమే కాని నైతికత కానేకాదనీ న్యాయ స్థానం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకుంటూ ఈ కేసు విచా రణ కొనసాగిస్తుందని ఆశిద్దాం.సంజయ్ హెగ్డే వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఒకే దెబ్బతో చంపడం ఎలా?.. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. వ్యసనాలకు బానిసైన కొడుకు.. యూట్యూబ్‌లో వీడియో చూసి తండ్రి హత్యకు స్కెచ్ వేశాడు. అనుమానం రాకుండా భూ తగాదాలో ప్రత్యర్థులు హతమార్చినట్లు డ్రామాలాడాడు. పోలీసుల విచారణతో మర్డర్ మిస్టరీ వీడింది. ఈ నెల 8వ తేదీన మైలవరం మండలం మెర్సుపల్లి వద్ద వక్తి మృతదేహం లభ్యం కాగా, మృతుడు ములకలపెం గ్రామానికి చెందిన కడియం శ్రీనివాసరావుగా పోలీసులు గుర్తించారు.వ్యవసనాలకు బానిసై తండ్రి శ్రీనివాసరావును హతమార్చిన కొడుకు పుల్లారావు.. పేకాట, ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లలో డబ్బు పోగొట్టుకున్నాడు. గతంలో పుల్లారావు చేసిన నాలుగు లక్షల అప్పును తండ్రి శ్రీనివాసరావు తీర్చాడు. వ్యసనాలకు బానిసై అప్పుల పాలైన కొడుకు పుల్లారావును పలుమార్లు తండ్రి మందలించాడు. దీంతో తండ్రిని చంపేందుకు పుల్లారావు స్కెచ్ వేశాడు.యూట్యూబ్‌లో సీరియల్ కిల్లర్ మర్డర్ వీడియోలు చూసిన పుల్లారావు.. ఒకే దెబ్బతో ఎలా మనిషి ప్రాణం తీయొచ్చు అని యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. పథకం ప్రకారం ఈనెల 8వ తేదీన పొలంలో ఉన్న తండ్రిని కర్రతో కొట్టి చంపేశాడు. తన తండ్రి మృతిపై అనుమానాలున్నాయంటూ డ్రామాకు తెరతీసిన మృతుడి కుమారుడు పుల్లారావు.. కేసు తనపైకి రాకుండా ఉండేందుకు గ్రామస్తులతో కలిపి నిరసనలు చేపట్టాడు. పోలీసుల విచారణలో పుల్లారావే హంతకుడని నిర్థారణ కావడంతో నిందితుడిని మైలవరం పోలీసులు అరెస్ట్ చేశారు. -
వివాదాస్పద ఎపిసోడ్‌ను తొలగించిన యూట్యూబ్
-
హాస్యం పేరిట నీచపు వ్యాఖ్యలు.. కేంద్రం నోటీసులతో స్పందించిన యూట్యూబ్
న్యూఢిల్లీ: ఓ కామెడీ షోలో ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటికే అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని శివసేన ఉద్దవ్ వర్గం భావిస్తోంది. అయితే ఈలోపు.. కేంద్ర నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ అతని అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోను తొలగించేసింది.ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా(Ranveer Allahbadia) ఓ పాపులర్ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగ పరచారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో మరికొందరు రాజకీయ నేతలు కూడా నీచపు వ్యాఖ్యలు చేశాడంటూ అల్హాబాదియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు.. పాడ్‌కాస్ట్‌లపై నిషేధం విధించాలంటూ పలువురు డిమాండ్ చేశారు. మరోవైపు.. అతనిపై పలుచోట్ల ఫిర్యాదులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ వీడియోను తొలగించాలని యూట్యూబ్‌కు కేంద్రం నోటీసులు పంపింది.కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా(Kanchan Gupta) యూట్యూబ్ ఆ వీడియోను డిలీట్ చేసిన విషయాన్ని ఎక్స్ ద్వారా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే యూట్యూబ్ ఈ చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు. ప్రధాని అతనికి అవార్డు ఇచ్చారుమరోవైపు.. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని యూబీటీ శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది చెబుతున్నారు. హాస్యం పేరిట అనుచిత వ్యాఖ్యలతో హద్దులు దాటడం.. ఏ భాషలోనైనా సహించేది లేదు. ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ పానెల్ వద్ద చర్చిస్తాం. ప్రధాని మోదీ అతనికి(రణవీర్ అల్హాబాదియా) అవార్డుఇచ్చారు. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కమిటీలో సభ్యుడిగా కూడా అవకాశం ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు అని ఎక్స్‌లో పోస్ట్ చేశారామె.సమయ్ రైనా నిర్వహించే ‘ఇండియా గాట్ లాటెంట్’ అనే షోలో రణవీర్ అల్హాబాదియా పాల్గొన్నారు. ఓ కటెంటెస్ట్ను ఉద్దేశించి.. ‘‘నీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొంటే జీవితాంతం చూస్తూ ఉండిపోతావా?. లేకుంటే.. ’’ అంటూ అతి జుగుప్సాకరమైన ప్రశ్నను సంధించాడు. ఆ వీడియో నెట్టింటకు చేరడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం అతని తీరును తీవ్రంగా ఖండించారు.సారీ చెప్పినా.. ‘‘నా వ్యాఖ్యలు అనుచితమైనవే కాదు.. హాస్యమైనవీ కాదు.. హాస్యం నా బలం కాదు.. నేనిక్కడ ఉన్నది క్షమాపణలు చెప్పేందుకే’’ అని ఎక్స్‌లో రణవీర్ క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ.. అతనిపై విమర్శలు మాత్రం చల్లారడం లేదు. రణవీర్‌తో పాటు ఇండియాస్ గాట్ లాటెంట్ షో నిర్వాహకులు, న్యాయనిర్ణేతలపైనా కేసులు నమోదు అయ్యాయి. రణవీర్ అల్హాబాదియా ఎవరంటే.. 31 ఏళ్ల వయసున్న రణవీర్ అల్హాబాదియాకు వివాదాలు కొత్తేఆం కాదు. ఇతనొక ప్రముఖ యూట్యూబర్. బీర్‌బైసెప్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. దానికి ఒక కోటి ఐదు లక్షల మంది దాకా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇక.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 4.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్నో పాపులర్ యూట్యూబ్ ఛానెల్స్‌ను అతను సహ వ్యవస్థాపకుడిగా నడిపిస్తున్నాడు. అంతేకాలు.. పలువురు పొలిటికల్ లీడర్ల మీద అతను పేల్చిన జోకులు విమర్శలు సైతం దారి తీశాయి.ఏమిటీ షో ఉద్దేశం ఇండియాస్ గాట్ లాటెంట్ అనేది ఒక కామెడీ షో. తమలోని హాస్యకోణాన్ని కొత్తగా ప్రదర్శించుకోవాలనుకునేవాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ప్రముఖ హాస్యనటుడు సమయ్ రైనా ఏర్పాటు చేసిన వేదిక ఇది. కేవలం హాస్యం మాత్రమే కాదు.. పాటలు పాడడం, డ్యాన్సులు.. ఇలా ఎన్నో టాలెంట్లను ఇక్కడ ప్రదర్శించొచ్చు. అయితే ఇది రెగ్యులర్ తరహాలో ఉండదు. అందుకే అంతటి ఆదరణను చురగొంది. అదే సమయంలో అక్కడి కంటెస్టెంట్లు చేసే వ్యాఖ్యలు, జడ్జిల కామెంట్లు అభ్యంతరకంగా ఉండడంతో పలు వివాదాల్లోనూ ఈ షో చిచ్కుకుంది. -
పల్లవించిన ప్రజ్ఞ! తమిళులైనా.. తెలుగులో..
యథా రాజా.. తథా ప్రజా.. అన్నట్లు.. ఇంటి వాతావరణం ఆధ్యాత్మిక భావాలతో నిండి ఉంటే, ఆ ఇంట పుట్టిన యువతరం కూడా ఆ దారినే అనుసరిస్తారు. అందుకు చక్కటి ఉదాహరణే కొమాండూరు ప్రజ్ఞ రాఘవన్. తమిళ వైష్ణవులైన ఐటీ ఉద్యోగి కోమాండూరు రాఘవన్, భార్గవి దంపతుల మొదటి సంతానం ప్రజ్ఞ రాఘవన్. ఈమె పల్లవి మోడల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. 13 ఏళ్ల చిన్నారి మూడేళ్ల ప్రాయం నుంచే నాయనమ్మ కొమాండూరు నళిని శ్రీనివాసన్ ప్రోత్సాహంతో భక్తి శ్లోకాలను చక్కటి ఉచ్ఛరణతో అలవోకగా పాడడం నేర్చుకుంది. తమిళులకు అతి పవిత్రమైన ధనుర్మాసంలో ప్రతిరోజూ తిరుప్పావై పాశురాలు పాడడం ఆనవాయితీ. నాయనమ్మ, తల్లిదండ్రులు క్రమం తప్పకుండా పాటించే ఈ తిరుప్పావై పారాయణం..ఆ అండాళ్ తల్లి అనుగ్రహంతో పుట్టిందని భావించే ప్రజ్ఞకు సహజంగానే అలవడింది. జన్మతః తమిళులైనా, ప్రాంతీయ భాష అయిన తెలుగుపై ఉన్న గౌరవంతో, నాయనమ్మ నేర్పిన తెలుగు పాఠాలు, ప్రజ్ఞ తెలుగు ఉచ్ఛరణకు మరింత మెరుగులు దిద్దేలా చేశాయి. ఇది గమనించిన తండ్రి రాఘవన్ ప్రజ్ఞ చేత తిరుప్పావై పాశురాలను పాడించి, తన పేరుతో ప్రారంభించిన ‘యువర్స్ ప్రజ్ఞ’ అనే యూట్యూబ్ ఛానల్లో మూడు సంవత్సరాలుగా ధనుర్మాసం 30 రోజులు ప్రసారం చేస్తూ వస్తున్నారు. తిరుప్పావైకి సంబంధించి తండ్రి సేకరించి పొందుపరిచిన వ్యాఖ్యానాన్ని భావయుక్తంగా, స్వచ్ఛమైన పదోచ్ఛారణతో ప్రవచన శైలిలో అందిస్తోంది. పేరుకు తగ్గ ‘ప్రజ్ఞ’.. ప్రజ్ఞ ప్రవచన తీరు చూస్తే పేరుకు తగ్గ ప్రజ్ఞా పాటవాలు చూపుతోంది అని ఎందరో పెద్దల కొనియాడారు. ఈ ఏడాది రాఘవన్ తమిళ పాశురాలను తెలుగులో పాట శైలిలో చేసిన అనువాదాన్ని తన వాక్పటిమతో, పాశుర భావానికి తగినట్లు అందరికీ అర్థమయ్యేలా వ్యాఖ్యానించి తెలుగు భాషాభిమానులు, ఆధ్యాత్మికవేత్తల నుంచి రెట్టింపు ప్రశంసలు పొంది శభాష్ అనిపించుకుంది. ప్రతిభను గుర్తించిన సుబ్బు మ్యూజికల్ అకాడమీ అధ్యక్షులు శ్రీధరం రామ సుబ్రహ్మణ్యం ఈ నెల 12న నిర్వహించిన సంగీత విభావరిలో గౌరవ అతిథి కొమరవోలు శ్రీనివాసరావు, నరేష్కుమార్ ప్రజ్ఞను జ్ఞాపికతో సత్కరించారు. ప్రజ్ఞ సంగీత విభావరులలో గాయకుడైన తండ్రి రాఘవన్‌తో పలు కార్యక్రమాల్లో, సినీ సంగీతంలోనూ శ్రోతలను ఆకట్టుకోవడం కొసమెరుపు. (చదవండి: సాత్విక ఆహారంతో బరువుకి చెక్‌పెట్టండిలా..!) -
జియో కొత్త ప్లాన్.. రెండేళ్లు యూట్యూబ్ ఫ్రీ
2025 జనవరి 11 నుంచి రిలయన్స్ జియో తన ఎయిర్ ఫైబర్ & ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ప్రయోజనాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన వినియోగదారులు 24 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియమ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రయోజనాలను పొందుతారు. జియో.. యూట్యూబ్ మధ్య ఈ ముఖ్యమైన భాగస్వామ్యం, దేశవ్యాప్తంగా ఉన్న సబ్స్క్రైబర్ల కోసం డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించింది.యూట్యూబ్ ప్రీమియమ్ ప్రత్యేకతలు➤అడ్వర్టైజెంట్ బ్రేక్ లేకుండా.. ఇష్టమైన వీడియోలను ఎలాంటి అడ్డంకులు చూడవచ్చు.➤ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా (ఆఫ్‌లైన్) ఎప్పుడైనా కంటెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.➤ఇతర యాప్స్ ఉపయోగిస్తూనే లేదా స్క్రీన్ ఆఫ్ అయినప్పటికీ వీడియోలు చూడవచ్చు.. మ్యూజిక్ కూడా వినవచ్చు.➤యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియమ్ కింద 100 మిలియన్ల కంటే ఎక్కువ పాటల ఫ్రీ లైబ్రరీ వంటి వాటిని పొందవచ్చు.ప్లాన్ వివరాలురూ. 888, రూ. 1199, రూ. 1499, రూ. 2499, రూ. 3499 ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంది సంస్థ అందించే ప్రయోజనాలను పొందవచ్చు. ఈ అవకాశం జియో ఎయిర్ ఫైబర్ & జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: భారీగా పెరిగిన టిమ్ కుక్ జీతం: ఇప్పుడు వార్షిక వేతనం ఎంతంటే..యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్‌ని యాక్టివేట్ చేయడం ఎలా➤ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న తరువాత, మై జియో యాప్‌లో మీ అకౌంట్లో లాగిన్ అవ్వండి.➤ఆ పేజీలో కనిపించే యూట్యూబ్ ప్రీమియమ్ బ్యానర్‌పై క్లిక్ చేయండి.➤మీ యూట్యూబ్ ఖాతాతో లాగిన్ అవ్వండి లేదా కొత్త ఖాతాను క్రియేట్ చేయండి.➤అదే వివరాలతో జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ సెటప్ టాప్ బాక్స్‌లో లాగిన్ అవ్వండి, యాడ్-ఫ్రీ కంటెంట్‌ను ఆస్వాదించండి.Enjoy ad-free YouTube on your big screen with JioAirFiber & JioFiber.Get 24 months of YouTube Premium today.#JioAirFiber #JioFiber #YouTubePremium #WithLoveFromJio pic.twitter.com/JN864Ki7UP— Reliance Jio (@reliancejio) January 11, 2025 -
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మీకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే అంచే ఇష్టమా..? అయితే, మలయాళ ( Malayalam) ఇండస్ట్రీలో గదేడాదిలో వచ్చిన ఈ చిత్రాన్ని వదులుకోకండి. కేవలం 1:40 గంటల పాటు ఉండే ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం మలయాళ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్‌ను ఉచితంగా చూసే అవకాశం వచ్చింది. అది కూడా యూట్యూబ్‌లో కావడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.మలయాళంతో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'కురుక్కు' (Kurukku) తెలుగులో 'V2 డబుల్ మర్డర్' ( V2 Double Murder) అనే టైటిల్‌తో డబ్ అయ్యింది. తాజాగా ఈ హిట్ మూవీ తెలుగు వెర్షన్‌ను ఉచితంగా యూట్యూబ్‌లో (YouTube) చూడొచ్చు. ఈ మూవీలో పెద్ద స్టార్స్ లేరు. అనిల్ ఆంటో, బాలాజీ శర్మ, మీరా నాయర్, శ్రీజీత్ కీలక పాత్రలు పోషించారు. అభిజీత్ నూరానీ దర్శకత్వం వహించాడు. గతేడాది జూన్‌లో చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజైన కురుక్కు బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది.కురుక్కు ప్రేక్షకులను మెప్పింస్తుంది. ఇందులో ఎలాంటి కామెడీ, సాంగ్స్ అనేవి ఉండవు.. కేవలం యాక్షన్ సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేకాకుండా సినిమా నిడివి తక్కువ. దీంతో ప్రేక్షకులలో ఎక్కడా కూడా బోర్ ఫీల్ కలగకుండా సినిమా సాగుతుంది. ఒక డబుల్ మర్డర్ కేసును పోలీస్ టీమ్ ఎలా ఛేదించింది అన్నదే 'వీ2 డబుల్ మర్డర్' కథ. పోలీసుల ఇన్విస్టిగేషన్లో కిల్లర్ ఎవరన్నది చివరి వరకు రివీల్ కాదు. వరుస ట్విస్ట్‌లతో దర్శకుడు ఈ మూవీని నడిపించిన తీరును ఎవరైనా ప్రశంసించాల్సిందే.(ఇదీ చదవండి: గేమ్ ఛేంజర్ తర్వాత స్టార్ హీరో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్)ఈ సినిమా కథలో రూబిన్, అతడి వైఫ్ స్నేహ ఇద్దరు అతి దారుణంగా హత్యకు గురువుతారు. ఇద్దరి మృతదేహాలు వేరువేరు చోట్ల ఉంటాయి. అయితే, వారి హత్యను జార్జ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రత్యక్షంగా చూస్తాడు. కానీ, అతను మద్యం మత్తులో ఉండటంతో హంతకుడిని సరిగ్గా గుర్తు పట్టకలేక పోతాడు. సంచలనంగా మారిని ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మారుతాడు. ఈ కేసు ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను సజన్ అనే పోలీస్ ఆఫీసర్ చేస్తుంటాడు. ఈ హత్యలో జార్జ్ నిరపరాధి అని సజన్ నమ్ముతాడు. కానీ, సాక్ష్యాలు మాత్రం అతడే హత్య చేసినట్లుగా కనిపిస్తాయి. చివరికి ఈ హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారు అనేది స్టోరీ. మర్డర్ మిస్టరీగా మారిన కురుక్కు తెలుగులో 'V2 డబుల్ మర్డర్' చిత్రాన్ని యూట్యూబ్‌లో ఉచితంగా చూసేయండి. -
సోషల్ మీడియా స్టార్ ‘రాణి కోతి’: యూట్యూబ్ ద్వారా లక్షలు : వైరల్ వీడియో
కుంచం అంత కూతురుంటే మంచం మీదే కూడు అనేది సామెత. అంటే ఇంట్లో చిన్న ఆడకూతురుంటే చాలు..ఆ ఇంట్లోని అన్ని పనుల్లో ఎంతో చేయూత అని. ఈ విషయంలో నేనేం తక్కువ అంటోంది ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలోని ఖాగీపూర్ సద్వా గ్రామానికి చెందిన కోతి. అవును మీరు చదివింది నిజమే. కోతి ఇంట్లో అన్ని పనులు చకా చకా పెట్టేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ సంచలనంగా మారిన కోతి కథేంటో తెలుసుకోవాలని ఉంది కదా.. పదండి మరి!యూపీలోని రాయ్‌బరేలీ జిల్లాలోని సాద్వా గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు ఇంట్లోని కోతిని చూస్తే ఔరా అనాల్సిందే. అందుకే దీనికి ముద్దుగా రాణి అని పిలుచుకుంటారు.ఇల్లంతా చలాకీగా తిరుగుతూ అన్ని పనులు చేసేస్తుంది. గిన్నెలు తోముతుంది. బట్టలు ఉతకడం, మాప్ పెట్టడం, మసాలాలు రుబ్బడం, పొలంలో సహాయం చేయడం ఇలా అన్ని పనులు చక్కబెట్టేస్తుంది. అంతేనా రాణి గారు శ్రద్ధగా గుండ్రంగా చపాతీలు చేసి ఇస్తుంది. ఇది చాలదన్నట్టు గ్రామంలోని ఇతర ఇళ్లల్లో ఆడవానికి కూడా పనిలో సహాయం చేస్తుంది. అందుకే దాదాపు ఎనిమిదేళ్ల నుంచి విలేజ్ డార్లింగ్‌లా మారిపోయింది. పుట్టింది కోతిగా అయినా.. మనిషిలానే చేస్తున్న పనులు, అందరికీ సాయం చేసే స్వభావం వల్ల ఊరందరికీ అభిమానంగా మారింది.యూట్యూబ్ ద్వారా లక్షల ఆదాయం రాణి వంటలు చేస్తున్న వీడియోను యజమాని ఆకాష్ పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. రాణి పనులను, చేష్టలను డాక్యుమెంట్ చేయాలని నిర్ణయించుకోవడంతో అశోక్ అదృష్టం మారిపోయింది. యూట్యూబ్‌లో రాణి వీడియోల ద్వారా 5 లక్షల రూపాయలకు పైగా ఆర్జించామని అశోక్ పేర్కొన్నాడు. కోట్లాదిమంది తమ వీడియోను వీక్షించారని తెలిపాడు. ముంబై, కోల్‌కతా, వారణాసి ఇలా అనేక ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఆమెను చూడటానికి వస్తారట. అమెరికా, యూకే సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, ఇరాన్, రష్యా, చైనా , అనేక ఇతర దేశాల వాళ్లు ఫోన్లు చేస్తారన్నాడు. ఎంత స్నేహశీలి అయినా, రాణిగారికి సొంత నిబంధనలు కూడా ఉన్నాయి. ఆమెకు నచ్చితేనే మనుషుల్ని దగ్గరకు రానిస్తుంది. తనకు నచ్చితే వారి ఒడిలో నిద్రపోతుంది కోపం వస్తే మాత్రం చిన్నగా మణికట్టును కొరుకుతుంది. రాణికి ఇష్టమైన ఆహారం, అరటిపండ్లు. వీటితోపాటు బఠానీలు, రొట్టెలు తినడం కూడా ఆమెకు చాలా ఇష్టం. #WATCH | यूपी के रायबरेली जिले में रानी नाम की बंदरिया का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। वीडियो में बंदरिया रोटी बनाने से लेकर बर्तन धोने समेत घर के काम करते दिख रही है। वीडियो देख हर कोई हैरान है।#Raibareli pic.twitter.com/3UWY4izZ6N— Hindustan (@Live_Hindustan) December 30, 2024 -
ఈ ఏడాది టాప్ సాంగ్స్ లిస్ట్ ప్రకటించిన యూట్యూబ్.. తెలుగు పాటకు చోటు
తెలుగు సాంగ్ గ్లోబల్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. 2024లో విడుదలైన సాంగ్స్‌లలో టాప్-10 లిస్ట్‌ను యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది. అందులో ఇండియా నుంచి ఒక సాంగ్ మాత్రమే ఉంది. అయితే, అది తెలుగు సినిమాకు సంబంధించిన పాట కావడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో 'గుంటూరు కారం'తో సందడి చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సాంగ్‌తో లెక్కలేనన్నీ రీల్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది.'కుర్చీ మడతపెట్టి' సాంగ్ విడుదలైనప్పటి నుంచే యూట్యూబ్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది. 527+ మిలియన్ వ్యూస్‌తో ఇప్పటికి కూడా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. దీంతో 2024 యూట్యూబ్ టాప్ సాంగ్స్‌లో స్థానం దక్కించుకున్న ఏకైక ఇండియన్ పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 7 టాప్ హిట్ సాంగ్స్‌ను యూట్యూబ్ ప్రకటించింది. అందులో భారత్ నుంచి ఎంపికైన ఏకైక పాట 'కుర్చీ మడతపెట్టి' అనే సాంగ్ ఉండటం విశేషం. కేవలం తెలుగులోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తెలుగు పాట సత్తా చాటడంతో మహేష్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12న విడుదలైంది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హారికా అండ్ హసిని బ్యానర్స్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, మహేష్ వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లాయి. -
యూట్యూబ్‌లో థంబ్‌నేల్స్ చేస్తున్నారా..? ఇకపై అది కుదరదు!
వ్యూస్ పెంచుకునేందుకు వీడియో అప్లోడర్లు చేస్తున్న అనైతిక ప్రయత్నాలకు చెక్ పెట్టేలా యూట్యూబ్ చర్యలకు సిద్ధమైంది. వీడియోను ఎక్కువ మంది వీక్షించాలనే ఉద్దేశంతో చాలామంది యూట్యూబర్లు ఆకర్షణీయ థంబ్‌నేల్స్ పెడుతుంటారు. అలా పెట్టడం తప్పుకాదు.. కానీ, అసలు వీడియోలో ఉన్న కంటెంట్‌తో సంబంధం లేకుండా కొందరు థంబ్‌నేల్స్ పెట్టి వీక్షకులను మభ్యపెడుతుంటారు. అలాంటి వారిపై యూట్యూబ్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, గతంలో జరిగిన అంశాలు, ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న సమాచారం.. వంటి ఎన్నో అంశాలను వక్రీకరించి యూట్యూబ్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాపింప జేస్తున్నారు. దాన్ని కట్టడి చేసేందుకు యూట్యూబ్ త్వరలో కొత్తగా నిబంధనలు ప్రకటించబోతున్నట్లు స్పష్టం చేసింది. వీక్షకులను తప్పుదోవ పట్టించేలా వీడియోలు అప్లోడ్ చేయడం, తప్పుడు సమాచారం ఉన్న థంబ్‌నేల్స్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే రానున్న రోజుల్లో కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.ఇదీ చదవండి: సైబర్ నేరాలపై వినూత్నంగా అవగాహనకొత్తగా తీసుకురాబోయే నిబంధనలు పాటించని వారి వీడియోలను ప్రైమరీగా డిలీట్ చేస్తామని పేర్కొంది. రెండోసారి తిరిగి అలాగే నిబంధనలను విస్మరిస్తే ఛానల్‌ను తాత్కాలికంగా నిలిపేయబోతున్నట్లు(ఛానల్ స్ట్రైక్) హెచ్చరించింది. తప్పుదోవ పట్టించే కంటెంట్ ద్వారా యూట్యూబ్‌పై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉన్నట్లు కంపెనీ వివరించింది. వీక్షకుల్లో విశ్వాసం నింపాలంటే స్పష్టమైన, వాస్తవమైన, ఉల్లంఘనలు అతిక్రమించని, తప్పుదోవ పట్టించని కంటెంట్‌ను అప్లోడ్ చేయాలని యూట్యూబర్లకు సూచించింది. -
యూట్యూబ్‌లో తప్పుడు థంబ్‌నెయిల్స్ ఇచ్చే వారికి హెచ్చరిక
యూట్యూబ్.. ప్రపంచంలో ఎక్కువమంది ఇందులో సమయం గడుపుతుంటారు. వారికి నచ్చిన కంటెంట్ కోసం వెతుకుతుంటారు కూడా. అయితే, ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకోవాలని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ యూజర్లను తప్పుదారి పట్టిస్తుంటాయి. వీడియోలో ఉన్న కంటెంట్‌తో యూట్యూబర్స్ పెట్టే థంబ్‌నైల్స్, టైటిల్స్ ఎలాంటి సంబంధం ఉండదు. ఇలా వ్యూస్ కోసం వారిని తప్పుదోవ పట్టించడం వంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపై కంటెంట్‌కి వ్యతిరేకంగా తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్స్ పెడితే ఖాతాలను తొలగించనున్నట్లు ప్రకటించింది.థంబ్‌నైల్‌లో ఒక సినిమా పేరు ఉంచి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తారు. దానిని క్లిక్ చేస్తే మరో సినిమా ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫోటోలు ఉంచి ఎలాంటి సంబంధంలేని అడ్డమైన థంబ్‌నైల్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి చర్యల వల్ల యూజర్లు బాగా విసిగెత్తిపోతున్నారని యూట్యూబ్ గుర్తించింది. ఇలాంటి సందర్భాలలో యూజర్ల సమయం వృథా అవుతుంది. ఆపై ఆ ఫ్లాట్‌ఫామ్‌పై విశ్వాసం తగ్గిపోతుంది. దీంతో యూట్యూబ్ పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.యూజర్లను తప్పుదోవ పట్టించేలా క్లిక్‌బైట్ థంబ్‌నెయిల్స్‌ను ఎవరైనా ఉపయోగిస్తే.. ఆ యూట్యూబ్ అకౌంట్లపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ హెచ్చరిక తర్వాత కూడా వారిలో మార్పులు రాకుంటే రానున్న రోజుల్లో ఇలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతల గురించి వీడియోలు పోస్ట్ చేస్తున్న క్రమంలో వారికి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్ క్రియేట్ చేస్తుంటారు. కంటెంట్ నిజమే అనుకొని యూజర్లు లోపలికి వెళ్తే.. అక్కడ ఏమీ ఉండదు. ఇలా లెక్కలేనన్ని వీడియోలు యూజర్లను తప్పుదోవ పట్టించడంతో వారిని విసిగిస్తున్నారు. దీంతో అలాంటి యూట్యూబ్ ఛానళ్లపై చర్యలకు సిద్ధమైంది. -
యూట్యూబ్ కోసం రూ.8 లక్షల ఖర్చు.. ఎంత వచ్చిందంటే?
టెక్నాలజీ బాగా పెరిగిపోతోంది. ప్రజలు డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలను అన్వేషిస్తూ.. యూట్యూబ్ మీద పడుతున్నారు. నేడు చాలామందికి యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయి. దీని ద్వారా కొందరు లెక్కకు మించిన డబ్బు సంపాదిస్తుంటే.. మరికొందరు ఫెయిల్ అవుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'నళిని ఉనగర్'. ఇంతకీ ఈమె ఎవరు? యూట్యూబ్ కోసం ఎంత వెచ్చించింది? ఎందుకు ఫెయిల్ అయిందనే.. వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.నళిని ఉనగర్.. 'నలినీస్ కిచెన్ రెసిపీ' పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి మూడు సంవత్సరాలు నడిపింది. అయితే ఈమెకు యూట్యూబ్ ద్వారా ఏ మాత్రం ఆదాయం రాలేదు. కానీ నళిని.. స్టూడియో, కిచెన్ సెటప్ చేసుకోవడానికి, ప్రమోషన్స్ కోసం దాదాపు రూ.8 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.మూడేళ్ల పాటు సుమారు 250 వీడియోలు చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. కానీ యూట్యూబ్ నుంచి ఆమెకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. దీంతో విసుగెత్తి.. యూట్యూబ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా కిచెన్ వస్తువులను, స్టూడియో ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా విక్రయించనున్నట్లు పేర్కొంది. నేను నా యూట్యూబ్ కెరీర్లో ఫెయిల్ అయ్యాను. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని సోషల్ మీడియా ద్వారా చెప్పింది.I failed in my YouTube career, so I’m selling all my kitchen accessories and studio equipment. If anyone is interested in buying, please let me know. 😭 pic.twitter.com/3ew6opJjpL— Nalini Unagar (@NalinisKitchen) December 18, 2024మూడు సంవత్సరాల్లో 250 వీడియోలు చేసాను, 2450 సబ్‌స్కైబర్లు మాత్రమే వచ్చారు. ఎంత కష్టపడినా.. యూట్యూబ్ కొన్ని రకాల కంటెంట్లకు మాత్రమే ఫేవర్ చేస్తుందని నళిని ఆరోపించింది. నేను మూడేళ్ళలో సంపాదించిన మొత్తం 'సున్నా' అని ఆవేదన వ్యక్తం చేసింది.నేను యూట్యూబ్ మీద చాలా కోపంగా ఉన్నాను. నేను ఈ ఛానల్ ప్రారంభించాడని డబ్బు, సమయాన్ని మాత్రమే కాకుండా నా వృత్తిని కూడా వదులుకున్నాను.. అని ఒక ట్వీట్లో వెల్లడించింది. కానీ నాకు యూట్యూబ్ ఎలాంటి ప్రతిఫలాన్ని అందించలేదని వాపోయింది.I’m honestly angry with YouTube. I spent my money, time, and even risked my career to build my channel, but in return, YouTube gave me nothing. It feels like the platform favors certain channels and specific types of videos, leaving others with no recognition despite the hard…— Nalini Unagar (@NalinisKitchen) December 18, 2024యూట్యూబర్స్ ఎదుర్కోవాల్సిన సవాళ్లుయూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనే మాట నిజమే. కానీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన అందరూ డబ్బు సంపాదిస్తారు అని అనుకోవడం మూర్కత్వమే. ఎందుకంటే యూట్యూబ్‌లో అందరికీ డబ్బులు వస్తాయనే గ్యారంటీ లేదు. డబ్బు రావడం అనేది సబ్‌స్కైబర్లు, వాచ్ అవర్స్, వ్యూవ్స్ వంటి వాటిపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి యూట్యూబర్స్ వీటన్నింటినీ విజయవంతంగా ఎదుర్కోగలిగి.. ఓపిగ్గా నిలబడితే డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. -
యూట్యూబ్‌లో టెన్త్ ప్రశ్నాపత్రాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి అర్ధ సంవత్సర పరీక్ష పేపర్లు ఆన్లైన్లో ప్రత్యక్షమైన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. సోమవారం ఉదయం పరీక్ష ప్రారంభమైన గంటలోపే పాఠశాల విద్యాశాఖ తేరుకుని అన్ని తరగతుల పరీక్షలను రద్దు చేసింది. సీల్డ్ కవర్లో ఎంతో పకడ్బందీ రక్షణలో ఉంచాలి్సన పరీక్ష పత్రాలు రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లో అప్లోడ్ కావడం.. ఎక్కడ లీకైందో ఇప్పటివరకు తెలుసుకోలేకపోవడం చూస్తుంటే ప్రభుత్వ విద్యపై కూటమి సర్కారు తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మార్చి–2025లో జరిగే ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఇదే తీరున ఉంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.అర్ధ వార్షిక పరీక్షల్ని సక్రమంగా నిర్వహించేలేని వారు పబ్లిక్ పరీక్షలు ఇంకెలా నిర్వహస్తారోనని విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం లెక్కల పరీక్ష ప్రారంభమైన గంటలోనే మేథ్స్ పేపర్ యూట్యూబ్‌లో ప్రత్యక్షమైందన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. విషయం తెలియగానే పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రారంభమైన అన్ని పరీక్షలను నిలిపివేయాలని ఆర్జేడీలు, డీఈవోలకు వాట్సాప్ సందేశాలు పంపించి పరీక్షను నిలిపివేశారు. మేథ్స్ పరీక్షను ఈ నెల 20న నిర్వహించాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారుల రక్షణలో ఉండే ప్రశ్నాపత్రాలు ఎలా బయటకు వచ్చాయన్న దానిపై ఆ శాఖ అధికారులు నోరుమెదపడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం తేటతెల్లంఈ విద్యా సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సీల్డు కవర్లో ఉంచాలి్సన పేపర్లను ఓపెన్‌గానే అందించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఫార్మెటివ్, సమ్మెటివ్–1 అసెస్మెంట్ల పరీక్ష పేపర్లు మండల రిసోర్సు సెంటర్ల (ఎంఈవో కార్యాలయం)లో సీల్డు కవర్లో ఉంచి భద్రపరుస్తారు. పరీక్ష జరిగే రోజు ఉదయం సంబంధిత పాఠశాల పరీక్ష ఇన్చార్జి టీచర్ వెళ్లి ఉదయం మధ్యాహ్నంజరిగే పేపర్లను ఎంఈవో నుంచి తీసుకుని తమతమ పాఠశాలకు తెచ్చి మిగతా ఉపాధ్యాయుల సమక్షంలో సీలు తెరవాల్సి ఉంటుంది. ఇంత పక్కాగా ఉండే భద్రతను చేధించి యూట్యూబ్‌లో పేపర్లు ప్రత్యక్షం కావడం గమనార్హం.వాస్తవానికి ఈ నెల 9వ తేదీ నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు ఎస్ఏ–1 పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 7న మెగా పేరెంట్స్ డే నిర్వహించడం, 14న రెండో శనివారం కావడంతో ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పరీక్షలను ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఉండడంతో అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు తదితర జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో పరీక్షలు నిలిపివేసి, మిగిలిన చోట పూర్తి చేశారు. ఇప్పటివరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పేపర్లు పూర్తయ్యాయి.మార్చి–2025 పబ్లిక్ పరీక్షలపై అనుమానాలు?ఎస్ఏ–1 ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత కొన్ని జిల్లాల్లో ప్రశ్నాపత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇకపై జరిగే పరీక్షలకు అక్కడి నుంచే నేరుగా తీసుకునే ఏర్పాట్లు చేశారు. కాగా, అర్ధ వార్షిక పరీక్ష పేపర్ల లీకేజీతో మార్చి–2025లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు నిర్లక్ష్యానికి విద్యార్థుల భవిష్యత్ పణంగా పెట్టాలి్సన పరిస్థితి తీసుకొచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో బడులను రాజకీయ ప్రచారాలు, ప్రయోగాలకు కేంద్రాలు మార్చేశారని.. పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టలేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. -
కంటెంట్ ఖండాలు దాటేలా యూట్యూబ్ కొత్త ఫీచర్
మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? మీ కంటెంట్‌ను వీరే భాషల్లో వినిపించాలనుకుంటున్నారా? ‘అవును.. కానీ, ఆ భాషలో అంతగా ప్రావీణ్యం లేదు’ అని అధైర్య పడకండి. యూట్యూబ్ మీలాంటి వారికోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమేరకు తన బ్లాగ్‌పోస్ట్‌లో వివరాలు వెల్లడించింది.సినిమాలే కాదు, భాష రాకపోయినా ఇకపై యూట్యూబ్ వీడియోలను ఖండాంతరాలను దాటించి ఏంచక్కా మీ కంటెంట్‌ను విదేశాల్లోని వారికి వినిపించవచ్చు. ఇందుకోసం యూట్యూట్ ‘ఆటో డబ్బింగ్’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చించి. ఈ ఫీచర్ వీడియోల్లోని వాయిస్‌ను ఆటోమేటిక్‌గా డబ్ చేసి వేరే భాషల్లోకి తర్జుమా చేసి వినిపిస్తుంది. దాంతో కంటెంట్ క్రియేటర్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తమ వీడియోను ఇతర భాషల్లో పోస్ట్ చేసే వీలుంటుంది. స్లైడ్స్, వీడియో బిట్స్‌తో కంటెంట్ ఇచ్చేవారికి ఈ ఫీచర్ మరింత ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.అన్ని భాషల్లోకి మారుతుందా..?ప్రాథమికంగా ఇంగ్లిష్‌లోని వీడియో కంటెంట్‌ను ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లోకి ఆటోమేటిక్‌గా డబ్ చేసేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీడియోలోని వాయిస్ పైన తెలిపిన ఏ భాషల్లో ఉన్నా ముందుగా ఇంగ్లిష్‌లోకి మారిపోతుంది. ఈ వీడియోపై ఆటో డబ్బ్‌డ్ అనే మార్కు ఉంటుంది. ఒకవేళ యూట్యూబ్ ఏఐ డబ్ చేసిన వాయిస్ వద్దనుకుంటే, ఒరిజినల్ వాయిస్ వినాలనిపిస్తే వీడియోపై ట్రాక్ సెలెక్టర్ ఆప్షన్ ఉపయోగించి అసలు వాయిస్‌ను వినొచ్చు. ప్రాథమికంగా ప్రస్తుతానికి పైన తెలిపిన భాషల్లోనే వాయిస్ డబ్ అవుతుంది. యూజర్ ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి ఇందులో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు యూట్యూబ్ తెలిపింది.ఎలా వినియోగించాలంటే..కంటెంట్ క్రియేటర్లు వీడియో అప్లోడ్ చేయగానే యూట్యూబ్ ఆటోమెటిక్‌గా వాయిస్‌ని గుర్తించి అది సపోర్ట్ చేసే భాషల్లోకి కంటెంట్‌ను డబ్ చేస్తుంది. ఫైనల్‌గా అప్లోడ్ చేయడానికి ముందు రివ్యూ చేసుకోవచ్చు. యూట్యూబ్ స్టూడియోలోని లాంగ్వేజ్ సెక్షన్లో డబ్బ్‌డ్ వీడియోలు కనిపిస్తాయి. వైటీ స్టూడియోలోని ప్రతి వీడియోను నియంత్రించే అధికారం మాత్రం కంటెంట్ క్రియేటర్లకే ఉంటుంది.ఇదీ చదవండి: 3.1 కోట్ల కస్టమర్ల డేటా లీక్‌పై క్లారిటీఈ ఫీచర్ ఎప్పుడు పని చేయదంటే..కొన్ని సందర్భాల్లో వాయిస్ క్లారిటీ లేకపోయినా, లేదంటే ఏదైనా కారణాలతో వాయిస్ గుర్తించలేకపోయినా డబ్బింగ్ పని చేయదని యూట్యూబ్ క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ డబ్బింగ్ ఆప్షన్ వినియోగించుకోవాలంటే మాత్రం ఇంగ్లీష్ వాయిస్ క్లారిటీగా ఉండడంతోపాటు రికార్డింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్తపడడం ముఖ్యం. ఇప్పటివరకు ఇంగ్లీష్ కంటెంట్‌ను అప్లోడ్ చేసే రిజినల్ కంటెంట్ క్రియేటర్ల సంపాదన ఈ ఫీచర్‌తో పెరగబోతుందని నిపుణులు చెబుతున్నారు. -
ఆరేళ్లకే యూట్యూబ్ సంచలనం.. 16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద.. ప్రపంచంలోనే సంపన్నుడిగా!
ఈ రోజుల్లో మిలియనీర్ కావాలంటే మాటలు కాదు. బిజినెస్‌లో రాణించేవారికే ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కోట్ల సంపాదన కూడబెట్టాలన్న వ్యాపారంలో రాణిస్తేనే సాధ్యమవుతుంది. కానీ 16 కోటీశ్వరుడైతే ఎలా ఉంటుంది. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అలా చిన్న వయసులోనే కోట్లు సంపాదించిన బాలనటుడు ఒకరు ఉన్నారు. అతని పేరే ఇయాన్ ఆర్మిటేజ్. ఇంతకీ అతను ఎలా సంపాదించాడో తెలుసుకుందాం.ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాలనటుడిగా ఇయాన్ ఆర్మిటేజ్ నిలిచారు. ఆరేళ్లకే తన యూట్యూబ్ వీడియో సిరీస్ ఇయాన్ లవ్స్ థియేటర్ ద్వారా యూట్యూబ్ స్టార్‌గా సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత తొమ్మిదేళ్లకే ప్రైమ్‌టైమ్ టీవీ షోలో లీడ్ రోల్లో కనిపించాడు. 2008లో జార్జియాలో జన్మించిన ఇయాన్ ఆర్మిటేజ్ 2017లో నటనలో ఎంట్రీ ఇచ్చాడు. ది గ్లాస్ కాజిల్, అవర్ సోల్స్ ఎట్ నైట్, ఐయామ్ నాట్ హియర్ లాంటి చిత్రాలతో పాటు లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్, బిగ్ లిటిల్ లైస్ లాంటి టీవీ షోల్లో మెరిశాడు.అయితే యంగ్ షెల్డన్ అనే సిట్కామ్తోనే ఇయాన్ ఆర్మిటేజ్ మరింత ఫేమస్ అయ్యాడు. తొమ్మిదేళ్లకే లీడ్ రోల్ పోషించిన బాలనటుడిగా నిలిచాడు. దాదాపు ఏడేళ్ల పాటు ఈ సిట్‌కామ్‌లో కనిపించాడు. ఈ సిరీస్ ఏడు సీజన్ల తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో ముగిసింది.16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద..యంగ్ షెల్డన్లో పాత్రకు గానూ ఇయాన్ ఒక ఎపిసోడ్‌కు 30 వేల డాలర్లు పారితోషికం అందుకున్నాడు. సీజన్ -1 కోసం ఏకంగా రూ.4.6 కోట్లు సంపాదించాడు. ఈ సిట్కామ్ సీజన్ -5 నాటికి ఒక్కో సీజన్‌కు దాదాపు రూ.8 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. దీంతో 13 ఏళ్లకే ప్రపంచంలో మిలినీయర్లలో ఒకరుగా నిలిచాడు. అతని నికర ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి ప్రపంచంలోనే అత్యంత సంపన్న బాల నటుడి రికార్డ్ సృష్టించాడు.యూట్యూబ్ నుంచి మొదలైన ఇయాన్ ఆర్మిటేజ్ ఏకంగా టీవీ స్టార్‌గా ఎదిగారు. యంగ్ షెల్డన్ సిరీస్‌తో స్టార్డమ్ తెచ్చుకున్న ఇయాన్ మరో రెండు చిత్రాలలో నటించాడు. స్కూబ్, పా పెట్రోల్: ది మూవీస్‌లో కనిపించాడు. -
లెక్చరర్ కుర్చీ కింద బాంబు.. విద్యార్థుల ప్రతీకారం..
విద్యా బుద్ధులు నేర్పించే గురువు పట్ల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. మహిళా లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబును అమర్చారు. ఆ తర్వాత ఏమైందంటే?పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాకు చెందిన కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 13 నుంచి 15 విద్యార్థుల్ని మహిళా సైన్స్ లెక్చరర్ మందలించారు. దీంతో కోపోద్రికులైన విద్యార్థులు లెక్చరర్‌పై ప్రాంక్ పేరుతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు.ఫైర్ క్రాకర్స్ తరహాలో పేలే రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేసిన లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చాలని అనుకున్నారు. బాంబు తయారు చేసేందుకు యూట్యూబ్ వీడియోల్ని చూశారు. అనంతరం వీడియోల్లో చూపించినట్లుగా రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారం.. పాఠాలు చెప్పేందుకు క్లాస్ రూమ్‌కి వచ్చే లెక్చరర్ చైర్లో కూర్చున్నప్పుడు బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. రిమోట్ కంట్రోల్‌తో బాంబు పేల్చే పనిని క్లాస్ రూమ్‌లో ఉన్న విద్యార్థికి అప్పగించారు. చైర్ కింద బాంబును అమర్చి సైలెంట్‌గా క్లాస్ రూమ్‌లో కూర్చున్నారు. లెక్చరర్ గదిలోకి రావడం.. అటెండెన్స్ తీసుకుని పాఠాలు చెప్పేందుకు చైర్లో కూర్చున్నారు. వెంటనే క్లాస్ రూమ్‌లో ఉన్న విద్యార్థి తన చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్‌తో బాంబును పేల్చాడు. అదృష్టవశాత్తూ.. పేలుడు ఘటనలో మహిళా లెక్చరర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.ఈ ఘటనపై బాధిత మహిళా లెక్చరర్‌కు తోటి లెక్చరర్లు మద్దతుగా నిలిచారు. ఇలాంటి ఆకతాయి పనులు పునరావృతం కాకుండా ఉండేలా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు తయారీ, ఎంతమంది విద్యార్థులు ఈ ఆకతాయి పనులు చేశారు వంటి వివరాల్ని సేకరించారు. అనంతరం మహిళా లెక్చరర్ తిట్టడం వల్లే విద్యార్థులు యూట్యూబ్ వీడియోలు చూసి బాంబును తయారు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.దీంతో విద్యార్థలుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బాంబు ఘటనలో ప్రమేయం ఉన్న 13 నుంచి 15 మంది విద్యార్థుల తల్లిదండ్రలుకు సమాచారం అందించారు. అయితే పిల్లలు చేసిన ఆకతాయి పనికి వారి తల్లిదండ్రులు సదరు మహిళా లెక్చరర్‌కు క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటి ఆకతాయి పనులు చేయకుండా చూసుకుంటామని కోరారు. పిల్లల్ని హెచ్చరించారు.తల్లిదండ్రుల విజ్ఞప్తితో విద్యార్థులపై కేసులు, విచారణతో పేరుతో ఇబ్బంది పెట్టొద్దని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆకతాయి విద్యార్థుల్ని వారం రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నరేష్ మెహతా తెలిపారు. -
పరువు నష్టం కలిగించే పోస్టులు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లే వీడియోలను అప్లోడ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని యూట్యూబ్‌ను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించే పోస్టులు తొలగించాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత వేధింపులకు పాల్పడే వీడియోలు పెట్టడం తగదని మందలించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇచ్చిన విధంగా ఏ పౌరుడినీ వేధించే కంటెంట్ ఉండకూడదని తేల్చిచెప్పింది. ‘మీమాంస విక్టిమ్స్’పేరుతో అనధికారిక ప్రతివాదులు పిటిషనర్లపై పెట్టిన వీడియోలు, ఫొటోలు, ఆడియో సందేశాలను వెంటనే బ్లాక్ చేయాలని యూట్యూబ్‌కు చెప్పింది. అలాగే పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించే పోస్టు యూట్యూబ్‌లో పెట్టవద్దని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. తమ పరువుకు నష్టం కలిగించేలా ఉన్న వీడియోలు, ఫొటోలు, ఆడియో సందేశాలు యూట్యూబ్ నుంచి తొలగించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌కు చెందిన ఎం.శివకుమార్, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ విచారణ చేపట్టారు. కావాలనే పోస్టులు పెట్టారు.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న శివకుమార్ సూచన మేరకు మురళీకృష్ణ, సమత రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి లాభం పొందారు. ఈ క్రమంలోనే శివకుమార్ తమ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారంటూ మురళి, సమతతోపాటు మరికొందరు క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసు ట్రయల్ కోర్టు వద్ద పెండింగ్‌లో ఉంది. ‘మీమాంస విక్టిమ్స్’పేరుతో యూట్యూబ్ చానల్ సృష్టించిన మురళి, సమత.. శివ, అతని కుటుంబసభ్యుల ఫొటోలతో పరువు నష్టం కలిగించేలా నిరాధార ఆరోపణలతో 51 వీడియోలు, ఆడియోలు పోస్టు చేశారు. ఈ వేధింపులు భరించలేక శివ భార్య ఆత్మహత్యకు యత్నించింది. ఈ పోస్టులను తొలగించాలని యూట్యూబ్‌కు మెయిల్ పంపినా స్పందన లేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆ వివాదంపై వీడియోలు పెట్టడాన్ని తప్పుబట్టారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ముఖ్య కార్యదర్శి, యూట్యూబ్, ఎ.మురళీకృష్ణ, సమతా శ్యామలకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ డిసెంబర్ 4లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. -
మోడలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో..డిజిటల్ స్టార్‌గా ఫోర్బ్స్‌లో చోటు!
స్టార్ యూట్యూబర్ కావాలంటే చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండగానే సరిపోదు. స్మార్ట్‌గా ఆలోచించాలి. మహేష్ కేశ్వాలా ‘డిజిటల్ స్టార్’ స్టేటస్ రాత్రికి రాత్రి రాలేదు. మోడలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన మహేష్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘డిజిటల్ స్టార్’ అయ్యాడు. ‘ఫోర్బ్స్’ జాబితాలో చోటు సంపాదించాడు...గేష్గా ప్రసిద్ధుడైన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్ మహేష్ కేశ్వాలాకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో ఏడు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే తన బలం. ‘దైనందిన జీవితంలోని సంఘటనల నుంచి కంటెంట్ క్రియేట్ చేస్తాను. అలా అని తొందరపడకుండా ఏది ట్రెండింగ్‌లో ఉందో, ఏది ప్రేక్షకులకు నచ్చుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను. ఎంతో పరిశోధించాకగానీ ఒక వీడియో చేయడం జరగదు’ అంటున్నాడు ముంబైకి చెందిన తుగేష్.‘ది తుగేష్ షో’ బాగా పాపులర్ అయింది. ఈ షో కోసం తాను సాధారణంగా క్రియేట్ చేసే రీల్స్, కామెంటరీ వీడియోలతో పోలిస్తే పదిరెట్లు ఎక్కువగా కష్టపడ్డాడు. ‘మందులకే కాదు కంటెంట్‌కు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అయిదు సంవత్సరాల క్రితం సూపర్ హిట్ అయిన కంటెంట్‌ను ఇప్పుడు ఎవరూ పట్టించుకోక΄ోవచ్చు. అందుకే కంటెంట్ క్రియేటర్లు కాలంతోపాటు ప్రయాణించాలి’ అంటాడు తుగేష్.‘సక్సెస్ మంత్రా ఏమిటి?’ అనే ప్రశ్నకు మహేష్ చెప్పిన జవాబు...‘సక్సెస్‌కు షార్ట్ కట్లు ఉండవు. కఠోర శ్రమ, అంకితభావం ఉంటే ఎవరికైనా విజయం సాధ్యమే. నా ప్రపంచంలో క్రియేటివ్ బ్లాక్స్‌కు తావు లేదు’ హాస్యమే కాకుండా ఇండియన్ మీడియా, సోషల్ మీడియా ప్రముఖులపై తుగేష్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. ‘తుగేష్ లైవ్’ అనే వ్లాగింగ్ చానల్ ద్వారా తన ట్రావెల్ వ్లాగ్‌లు, వ్యక్తిగత అనుభవాలను షేర్ చేస్తుంటాడు. ‘ఒక ప్రాజెక్ట్‌కు మంచి పేరు వచ్చిన తరువాత ‘నెక్ట్స్ ప్రాజెక్ట్ దీనికంటే భిన్నంగా ఉండాలి అని ఆలోచిస్తాను’ అంటున్న మహేష్ ఇటీవల ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటు సంపాదించాడు.ఏ పని చేసినా యాంత్రి కంగా కాకుండా శ్రద్ధగా చేయాలి. కంటెంట్ విషయంలో ‘నాకు నచ్చితే చాలు’ అనుకోకుండా 360 డిగ్రీ కోణంలో విశ్లేషించాలి. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. అని చెబుతున్నాడు తగేష్. (చదవండి: సింపుల్ అండ్ గ్రేస్‌ఫుల్..!) -
ఇక యూట్యూబ్‌లో షాపింగ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ భారత్‌లో షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అర్హత కలిగిన క్రియేటర్లు తమ వీడియోలకు ఉత్పత్తులను జోడించడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించేందుకు ఈ కార్యక్రమం వీలు కలి్పస్తుంది. వీడియోలు, షార్ట్స్, లైవ్స్ట్రీమ్స్కు కంటెంట్ క్రియేటర్లు ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేస్తే.. వీడియో డి్రస్కిప్షన్లో, అలాగే ప్రొడక్ట్ సెక్షన్లో అవి ప్రత్యక్షం అవుతాయి. వ్యూయర్స్ వాటిని క్లిక్ చేయడం ద్వారా రిటైలర్స్ సైట్‌కు చేరుకుని షాపింగ్ చేయవచ్చు. వీక్షకులు చేసే కొనుగోళ్ల ఆధారంగా కంటెంట్ క్రియేటర్లకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతానికి ఈ–కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, మింత్రా పోర్టల్‌లో లిస్ట్ అయిన ఉత్పత్తులను క్రియేటర్లు తమ వీడియోలకు ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా సక్సెస్..: యూట్యూబ్ షాపింగ్ అంతర్జాతీయంగా విజయవంతం అయిందని యూట్యూబ్ తెలిపింది. అంతర్జాతీయంగా 2023లో వ్యూయర్స్ ఏకంగా 3,000 కోట్లకుపైగా గంటల షాపింగ్ సంబంధ కంటెంట్‌ను యూట్యూబ్‌లో వీక్షించారు. ఈ నేపథ్యంలో షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను భారత్‌లో పరిచయం చేసినట్టు యూట్యూబ్ షాపింగ్ జీఎం, వైస్ ప్రెసిడెంట్ ట్రావిస్ కజ్ తెలిపారు. -
యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గం
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'యూట్యూబ్' భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్లు మరింత ఆదాయాన్ని పొందడానికి సరికొత్త మార్గాన్ని పరిచయం చేసింది. 'షాపింగ్ ప్రోగ్రామ్' పేరుతో పరిచయం చేసిన ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ వీడియోలలో ఉత్పత్తులను ట్యాగ్ చేయడం ద్వారా ఎక్కువ డబ్బు ఆర్జించవచ్చు.ఇప్పటికే ఈ షాపింగ్ ప్రోగ్రామ్ అమెరికా, సౌత్ కొరియా దేశాల్లో అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు దీనిని భారతీయ కంటెంట్ క్రియేటర్ల కోసం పరిచయం చేసింది. దీనికోసం యూట్యూబ్ ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అర్హులైన వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.షాపింగ్ ప్రోగ్రామ్ ఫీచర్ కోసం కంటెంట్ క్రియేటర్లు.. యూట్యూబ్ షాపింగ్‌లో సైనప్ అవ్వాలి. మీ అప్లికేషన్‌ను ప్లాట్‌ఫామ్ ఆమోదించిన తరువాత షాపింగ్ ప్రోగ్రామ్‌ను యాక్సెస్ చేయవచ్చు. మీరు క్రియేట్ చేసే వీడియోలలో, షార్ట్స్, లైవ్ స్టీమ్ వంటి వాటిలో ఉత్పత్తులను ట్యాగ్ చేయవచ్చు, ఒక వీడియోకు సుమారు 30 ఉత్పత్తులను ట్యాగ్ చేసుకోవచ్చు. ఈ ఉత్పత్తులు యూజర్లకు కనిపిస్తాయి.యూజర్లు ఈ ఉత్పత్తులను చూసి, వారికి నచినట్లయితే దానిపైన క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు, అక్కడే కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేయడంతో యూట్యూబర్లకు కమీషన్ వస్తుంది. యూజర్ ఒక ప్రొడక్ట్ కొనుగోలు చేస్తే.. ఎంత కమీషన్ వస్తుందనే వివరాలను కూడా క్రియేటర్ అక్కడే చూడవచ్చు.ఇదీ చదవండి: ముద్ర లోన్ లిమిట్ పెంపు: రూ.10 లక్షల నుంచి..షాపింగ్ ప్రోగ్రామ్ ఫీచర్ యాక్సెస్ పొందాలంటే.. కంటెంట్ క్రియేటర్లు తప్పనిసరిగా కనీసం 10,000 సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. అన్ని అర్హతలు ఉన్న క్రియేటర్లు సేల్స్ కమీషన్ పొందవచ్చు. అయితే భవిష్యత్తులో ఈ ఆదాయంలో వాటా తీసుకోవాలని యూట్యూబ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ గుర్తుంచుకోవలసిన మరో అంశం ఏమిటంటే.. పిల్లల కోసం రూపోందించిన యూట్యూబ్ చానళ్లకు, మ్యూజిక్ చానళ్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. -
యూట్యూబ్ సాయంతో గవర్నమెంట్ జాబ్..
ఒరిస్సాలోని గిరిజన తెగ. కోచింగ్‌కు డబ్బులు లేవు. ఇంట్లో ఇంటర్నెట్ రాదు.కాని జీవితంలో ఏదైనా సాధించాలి. ఇంటికి, ఊరికి దూరంగా వెళ్లి మరీ సిగ్నల్ ఉన్న చోట కూచుని యూట్యూబ్ వీడియోల సాయంతో ‘ఒరిస్సా సివిల్ సర్వీసెస్’లో ఉద్యోగం సాధించింది బిని ముడులి. సోషల్ మీడియా వల్ల కలిగిన మేలు ఇది. ఒరిస్సాలో బోండా తెగ నుంచి స్టేట్ సివిల్స్‌లో ఉద్యోగం సాధించిన మొదటి మహిళ బిని పరిచయం...ఒక్కొక్కరూ ఒక్కొక్కరూ వస్తూ ఉంటే కాసేపటికి ఆ బోండా ఘాట్ జనాలతో నిండిపోయింది. అందరూ బిని ముడులిని చూసి అభినందించేవారే. దిష్టి తీసేవారే. కారణం ఆ అమ్మాయి తమ బోండా తెగ గౌరవాన్ని పెంచింది. తమ తెగ నుంచి ‘ఒరిస్సా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్’ (ఓపిఎస్‌సి)లో ర్యాంక్ సాధించి గవర్నమెంట్ అధికారి అవుతున్న మొదటి అమ్మాయి బిని ముడులి. ‘నాకు ఉద్యోగం వస్తే నా కంటే మావాళ్లే ఎక్కువ ఆనందిస్తున్నారు’ అంటుంది 24 ఏళ్ల బిని ముడులి. మొన్నటి శనివారం విడుదలైన ఓపిఎస్‌సి ఫలితాల్లో ఎస్.టి. కోటాలో 596వ ర్యాంకు పొంది ఉద్యోగానికి అర్హత సాధించింది బిని. ఓపిఎస్‌సి 2022–23 పరీక్షకు మొత్తం 92,194 మంది అభ్యర్థులు ΄ోటీ పడితే వారిలో 683 మంది అర్హత సాధించారు. విశేషం ఏమిటంటే టాప్ టెన్ ర్యాంకుల్లో ఐదు మంది అమ్మాయిలున్నారు. అర్హత సాధించిన వారిలో 258 మంది అమ్మాయిలే.యూట్యూబ్ పాఠాలతో2020లో ఓపిఎస్‌సి పరీక్ష రాసి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యింది బిని. ‘నా ప్రిపరేషన్ సరి΄ోదని నాకు అర్థమైంది. కాని కోచింగ్‌కు వెళ్లేందుకు డబ్బు లేదు. అదీగాక నేను సంపాదించి ఇంటికి సాయపడాల్సిన సమయం. అందుకే ఆయుర్వేదిక్ అసిస్టెంట్‌గా పని చేయడం మొదలెట్టాను. మా ఊరిలో ఇంటర్నెట్ ఉండదు. అందుకే దగ్గరిలోని గోవిందపల్లి టౌన్‌కు వచ్చి అక్కడ యూట్యూబ్‌లో దొరికే పాఠాలతో ప్రిపేర్ అయ్యాను. ఆన్లైన్లో దొరికే మెటీరియల్‌ను చదువుకున్నాను. అనుకున్నది సాధించాను’ అంది బిని.అమ్మాయిలను స్కూళ్లకు పంపండి‘ఆడపిల్లలను బాగా చదివించండి అనేదే నా పిలుపు. చదువులోనే వారి అభివృద్ధి ఉంది. డబ్బు లేక΄ోయినా ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఉచితంగా అనేక కోర్సులు, కోచింగ్‌లు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. నేను అధికారి అయ్యాక స్త్రీల స్వయంసమృద్ధి కోసం పని చేస్తాను. అంతేకాదు మా బోండా తెగ కోసం వారికి అందాల్సిన సంక్షేమ ఫలాల కోసం పని చేస్తాను’ అంది బిని.వంటలు చేస్తూ పెంచాడుఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లాలో ముదులిపడ అనే చిన్న బోండాల ఊరు బిని ముడులిది. తండ్రి మధుముడిలి అక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వంటచేస్తాడు. తల్లి సునమణి ఊళ్లో అంగన్వాడి కార్యకర్తగా పని చేస్తోంది. ఒరిస్సాలో మొత్తం 13 గిరిజన తెగలు అంతరించిపోయే ప్రమాదంలో ఉంటే వాటిలో ఒకటి బోండా తెగ. ఆ తెగ నుంచి తాను బాగా చదువుకుని పైకిరావాలనుకుంది బిని ముడులి. జేపోర్లోని బిక్రమ్దేబ్ యూనివర్సిటీలో జువాలజీలో ఎంఎస్సీ చేసింది. ప్రభుత్వ అధికారి అయి ప్రజలకు సేవ చేయాలనేది బిని కల. (చదవండి: వీధుల్లో బిక్షాటన చేసే అమ్మాయి నేడు డాక్టర్‌గా..!) -
సిద్ధిఖీ కేసు: ‘యూట్యూబ్ చూసి నిందితుల గన్ షూటింగ్ ప్రాక్టిస్’
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీను హత్యకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సిద్ధిఖీని హత్య చేయడానికి నిందితులు గుర్మైల్ సింగ్, ధరమ్‌రాజ్ కశ్యప్‌లు యూట్యూబ్ వీడియోలు చూసి షూట్ చేయడం నేర్చుకున్నారని ముంబై పోలీసుల వర్గాలు వెల్లడించాయి. ఈ హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పరీరాలో ఉన్న వారిని వెతకడానికి పోలీసులు బృందాలను గాలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ హత్య కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నారు. 7.62 ఎంఎం తుపాకీతో కూడిన ఓ నల్ల బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.‘‘సిద్ధిఖీని గుర్తించడానికి నిందితులకు ఆయన ఫోటోను ఇచ్చారు. ఘటనకు 25 రోజుల ముందు నిందితులు ఆయన నివాసం, కార్యాలయాన్ని పరిశీలించారు. గుర్మైల్ సింగ్ , ధరమ్‌రాజ్ కశ్యప్ యూట్యూబ్ నుంచి షూటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. ముంబైలో బుల్లెట్ మ్యాగజైన్ లేకుండా గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేశారు’’ అని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి.ఇక.. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్కు చెందిన 23 ఏళ్ల హరీష్‌కుమార్ బాలక్రామ్గా ఈ హత్యకేసులో నాలుగో నిందితుడిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు ఆర్థిక సహాయం అందించడం, లాజిస్టిక్స్‌ను సమన్వయం చేశాడని పోలీసులు తెలిపారు. బాలక్‌రామ్ పూణెలో స్క్రాప్ షాప్ డీలర్‌గా పనిచేస్తున్నాడని పేర్కొన్నారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు బాలక్రామ్గా స్క్రాప్ షాపులో పనిచేసేవారని పోలీసులు వెల్లడించారు.చదవండి: సిద్దిఖీ హత్యకు పుణెలో కుట్ర -
Tech Talk: యూట్యూబ్‌లో.. ఈ ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఉన్నాయని మీకు తెలుసా!
క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ ఇన్నోవేటివ్ ఫీచర్లను ప్రకటించింది. కంటెంట్ క్రియేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ అధునాతన వీడియో జనరేషన్ టెక్నాలజీ, కమ్యూనిటీ ఫీచర్లు ఉపయోగపడతాయి.వీయో ఇన్ డ్రీమ్ స్క్రీన్: షార్ట్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ జనరేట్ చేయడం కోసం రూపొందించిన యూట్యూబ్ డ్రీమ్స్క్రీన్ ఫీచర్ ఇప్పుడు గూగుల్ డీప్‌మైండ్ వీయోను ఇంటిగ్రేట్ చేస్తుంది. ఈ అప్‌గ్రేడ్ క్రియేటర్లకు సహజత్వంతో కూడిన బ్యాక్‌గ్రౌండ్, స్టాండ్‌లోన్ వీడియో క్లిప్‌లను క్రియేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. షార్ట్–ఫామ్ కంటెంట్ నాణ్యతను పెంచుతుంది.ఇన్స్పిరేషన్ ట్యాబ్ అప్‌గ్రేడ్: ఐడియాలు, టైటిల్స్, థంబ్ నెయిల్స్, ఔట్లైన్స్ను మెరుగుపరచడానికి ఉపకరిస్తుంది.కమ్యూనిటీస్: ఈ సరికొత్త కమ్యూనిటీస్ ఫీచర్ ద్వారా క్రియేటర్లు, సబ్స్క్రైబర్లు వీడియోలు, టాపిక్స్ గురించి చర్చించుకోవచ్చు.ఆటో డబ్బింగ్: యూట్యూబ్ ‘ఆటో డబ్బింగ్’ ఫీచర్‌ని విస్తరించనుంది. డబ్బింగ్ ఆడియో ట్రాక్‌లను ఆటోమేటిక్‌గా యాడ్ చేయడానికి క్రియేటర్లకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది వీడియోలను ప్రపంచ ప్రేక్షలకు చేరువ చేస్తుంది. భాష అడ్డంకులు లేకుండా చేస్తుంది.హైప్ ఫీచర్: ‘హైప్’ ఫీచర్ ద్వారా ఔత్సాహిక క్రియేటర్లు కొత్త ఆడియెన్స్‌తో కనెక్ట్ కావచ్చు. అయిదు లక్షల కంటే తక్కువ చందాదారులు ఉన్న క్రియేటర్ల నుంచి వీడియోలను హైప్ చేయడానికి ఈ ఫీచర్ వినియోగదారులకు ఉపయోగపడుతుంది. చిన్న, మధ్యతరహా క్రియేయేటర్ల అభివృద్ధికి ఉపయోగపడే ఫీచర్‌ను తీసుకురావాలనే జెన్ జెడ్‌లోని అత్యధికుల విన్నపం మేరకు ‘హైప్’ ఫీచర్‌ని తీసుకువచ్చారు. గూగుల్ పిక్సెల్ 9ప్రో..డిస్ప్లే: 6.30 అంగుళాలు ; బరువు: 199 గ్రా.మెమోరీ: 128జీబి 16జీబి ర్యామ్/256జీబి 16జీబి ర్యామ్/ 512 జీబి 16జీబి ర్యామ్బ్యాటరీ: 4700 ఎంఏహెచ్ఫ్రంట్ కెమెరా: 42 ఎంపీడిజిటెక్ స్మార్ట్‌ఫోన్ జింబల్..బ్రాండ్: డిజిటెక్ బరువు: 400 గ్రా. కలర్: లైట్ గ్రే 3 క్రియేటివ్ ఆపరేషన్ మోడ్స్:ఆల్ ఫాలో మోడ్హాఫ్ ఫాలో మోడ్ ఆల్ లాక్ మోడ్పోర్టబుల్ అండ్ ఫోల్డబుల్ఇన్స్టా ‘రీల్స్’ (ఆండ్రాయిడ్) డౌన్లోడ్ చేయడానికి...‘వీడియో డౌన్లోడర్ ఫర్ ఇన్స్టాగ్రామ్’లాంటి యాప్‌లను ఉపయోగించి ‘రీల్స్’ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ‘రీల్స్’ లింక్‌ను కాపీ చేసి యాప్‌లో పేస్ట్ చేయడం ద్వారా ఫోన్ గ్యాలరీలో డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఐఫోన్ యూజర్లు ‘రీల్స్’ను డౌన్లోడ్ చేసుకోవడానికి ‘ఇన్సేవర్:రీపోస్ట్ ఫర్ ఇన్స్టాగ్రామ్’లాంటి యాప్‌లను ఉపయోగించవచ్చు. థర్డ్–పార్టీ యాప్‌లపై మీకు ఆసక్తి లేకపోతే ‘స్క్రీన్ రికార్డింగ్’ అనేది ఒక ఆప్షన్.కొత్త ఇమోజీలు..మన భావోద్వేగాలను వేగంగా వ్యక్తీకరించడానికి ఇమోజీ అనేది చక్కటి మార్గం. కోపం, నిరాశ, నిరుత్సాహం, ఉత్సాహం... ఇలా ప్రతి భావోద్వేగానికి ఒక ఇమోజీ ఉంది. ఇప్పుడు ఉన్న ఎన్నో ఇమోజీలకు కొత్తగా మరో 8 యాడ్ కానున్నాయి. దీంతో ఇమోజీల ప్రపంచం మరింతగా విస్తరించనుంది.కొత్త ఇమోజీలను సృష్టించే బాధ్యత యూనికోడ్ స్టాండర్డ్ తీసుకుంటుంది. సార్క్ అధికారిక జెండా, పార, రూట్ వెజిటేబుల్, కంటికింద సంచులతో అలిసిపోయిన ముఖం, పెయింట్ స్పా›్లట్, చెట్టు కొమ్మ, వేలిముద్ర, హర్ప్(మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్)... ఇలాంటి కొత్త ఐకాన్లను యూనికోడ్ ఎనౌన్స్ చేసింది.ఇవి చదవండి: హెల్దీ డైట్.. క్యారమెల్ బార్స్! -
బ్లాకర్లు వాడుతున్నా యాడ్! ఇప్పుడేం చేయాలి..?
ఎంతో ఆసక్తిగా యూట్యూబ్‌లో వీడియా చూస్తూంటే యాడ్ వచ్చిందనుకోండి చిరాకేస్తుంది కదా. అందుకోసం మార్కెట్లో ఉన్న యాడ్బ్లాకర్లను వాడుతుంటారు. దాంతో ఎలాంటి యాడ్లు రాకుండా ఏంచక్కా వీడియో చూస్తుంటారు. కానీ ఇకపై ఇలాంటివి కుదరకుండా యూట్యూబ్ పక్కా చర్యలు చేపట్టింది. ఇప్పటికే స్కిప్ చేయలేని యాడ్లను డిస్ప్లే చేస్తున్న యూట్యూబ్.. యాడ్బ్లాకర్లు వాడుతున్నా వీడియో పాజ్ చేసినప్పుడు యాడ్ వచ్చేలా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.యూట్యూబ్ ‘యాడ్ బ్లాకర్ డిటెక్షన్ టెక్నాలజీ’ను వినియోగిస్తుంది. దీనివల్ల యాడ్ బ్లాక్ యాప్‌లు వాడుతున్న ఫోన్లు, డెస్క్టాప్ల్లో వీడియో చూస్తున్నప్పుడు పాజ్ చేస్తే యాడ్ డిస్ప్లే అయ్యేలా ఏర్పాటు చేశారు. ‘యూట్యూబ్‌లో వీడియో పాజ్ చేయబడినప్పుడు కూడా స్క్రీన్‌పై పాప్ అప్ ప్రకటన డిస్ప్లే అవుతుంది. పాజ్ చేసిన స్క్రీన్ సమయాన్ని లక్ష్యంగా చేసుకుని యాడ్ వచ్చేలా ప్రకటనదారులకు కంపెనీ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. త్వరలో ఇది అందరి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది’ అని యూట్యూబ్ కమ్యూనికేషన్ మేనేజర్ ఒలువా ఫలోడున్ తెలిపారు.ఇదీ చదవండి: ఐదు నెలల్లో యూపీఐ లావాదేవీలు ఎంతంటే..ఈ నేపథ్యంలో యూట్యూబ్‌లో ఎలాంటి యాడ్లు రాకూడదని భావించేవారు ‘యూట్యూబ్ ప్రీమియం’ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నెలకు సుమారు రూ.1,100 ప్రీమియం చెల్లిస్తే ఎలాంటి యాడ్స్ రాకుండా వీడియోను వీక్షించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రకటనదారులు చెల్లించే మొత్తంలో కంటెట్ క్రియేటర్లకు 55 శాతం, యూట్యూబ్‌కు 45 శాతం ఆదాయం అందేలా ప్రస్తుత యాడ్ రెవెన్యూ పాలసీ ఉంది. -
Fake Doctor: యూట్యూబ్ చూస్తూ ఆపరేషన్
పట్నా: నకిలీ వైద్యుల చేతుల్లో అమాయక రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆగట్లేవు. నకిలీడాక్టర్ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ 15 ఏళ్ల బాలుడికి శస్త్రచికిత్స చేయబోయి అతని ప్రాణాలు తీసిన ఘటన తాజాగా బిహార్‌లో వెలుగుచూసింది. పరారైన నకిలీ వైద్యుడు, ఆస్పత్రి సిబ్బందిని పట్టుకునేందుకు పోలీసులు వేట మొదలుపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరణ్ జిల్లాలోని మదౌరా పట్టణంలో నకిలీ డాక్టర్ అజిత్ కుమార్ పురి ‘శ్రీ గణపతి హాస్పిటల్’ పేరిట ఒక వైద్యశాల నిర్వహిస్తున్నాడు. 15 ఏళ్ల కృష్ణకుమార్ వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతుండటంతో శుక్రవారం రాత్రి అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కాసేపటికి వాంతులు తగినా పిత్తాశయంలో రాళ్లున్నాయని, ఆపరేషన్ తప్పదని వైద్యుడు చెప్పాడు. తండ్రి వారించినా బలవంతంగా ఆపరేషన్ చేశాడు. బాలుడు విపరీతమైన నొప్పితో బాధపడుతుండటంతో నిలదీయగా గద్దించి పంపించేశాడు. ఇంటికెళ్లాక బాలుడు స్పృహ కోల్పోవడంతో మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడం ముందే పసిగట్టిన వైద్యుడు వెంటనే పటా్న తీసుకెళ్లాలని సూచించాడు. మార్గమధ్యంలోనే బాలుడు కన్నుమూశాడు. ‘‘వైద్యునికి ఎలాంటి అర్హత లేదని మాకు తెలీదు. యూట్యూబ్ చేస్తూ ఆపరేషన్ చేశాడు. తర్వాతే విషయం మాకు అర్థమైంది’’ అని బాలుడి తాత ప్రహ్లాద్ ప్రసాద్ షా ఆరోపించారు. -
యూట్యూబ్‌లో చూస్తూ సర్జరీ.. అంతా బాగుంది అని అనుకునే లోపే
దేశంలో నకిలీ డాక్టర్ల రోజురోజుకి పెరిగిపోతున్నారు. వీరి కారణంగా అమాయకులు ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. తాజాగా వాంతులు అవుతున్నాయని 15ఏళ్ల బాలుడిని ఓ ఆస్పత్రికి తరలించారు అతని తల్లిదండ్రులు. ఫేక్ డాక్టర్ చికిత్స చేయడంతో వాంతులు తగ్గాయి. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బాలుడికి యూట్యూబ్ చూస్తూ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాడు. పరిస్థితి విషమించడంతో అత్యసర చికిత్స కోసం సదరు డాక్టర్.. మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే మార్గం మధ్యలో బాలుడు చనిపోవడంతో డెడ్ బాడీని ఆస్పత్రి ఆవరణలో వదిలేసి పారిపోయాడు నకిలీ డాక్టర్. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రం సరణ్ ప్రాంతానికి చెందిన 15ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. వాంతులు చేసుకున్నాడు. మా అబ్బాయికి పలు మార్లు వాంతులయ్యాయి. చికిత్స కోసం గణపతి ఆస్పత్రికి తీసుకొచ్చాం.ఆస్పత్రిలో జాయిన్ చేయించిన కొద్ది సేపటికి వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ అజిత్ కుమార్ పూరి మాత్రం బాలుడికి ఆపరేషన్ చేశారు. యూట్యూబ్ వీడియోస్ చూసి ఆ ఆపరేషన్ చేయడంతో నా కుమారుడు మరణించాడు అని బాలుడి తండ్రి చందన్ షా గుండెలవిసేలా రోదిస్తున్నారు.మేం డాక్టర్లమా.. లేదంటే మీరు డాక్టర్లా.. గణపతి ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ ఓ పని మీద తండ్రిని పంపించి, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా నా మనువడికి ఆపరేషన్ చేయడం ప్రారంభించారు. అనుమతి లేకుండా ఆపరేషన్ ఎందుకు చేస్తున్నారు? అని అడిగితే. పేషెంట్ నొప్పితో బాధపడుతున్నాడు. మేం డాక్టర్లమా? మీరు డాక్టర్లా? అంటూ మండిపడ్డారు. నా మనవడి జీవితం ఇలా ముగుస్తుందనుకోలేదు అయినా, ఆపరేషన్ చేశారు. అంతా బాగానే ఉందని అనుకున్నాం. కానీ ఆపరేషన్ జరిగిన సాయంత్రం నా మనవడి శ్వాస ఆగింది. సీపీఆర్ చేసిన నకిలీ డాక్టర్ అత్యవసర చికిత్స కోసం పాట్నాకు తరలించారు. మార్గ మధ్యలోనే మృతి చెందడంతో నా మనవడి మృతదేహాన్ని ఆస్పత్రి మెట్లపై వదిలి పారిపోయారు. వాడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని’ నేను అనుకోలేదని బాలుడి తాత ప్రహ్లాద్ ప్రసాద్ షా విచారం వ్యక్తం చేశాడు.విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నకిలీ డాక్టర్ అజిత్ కుమార్ పూరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
గాల్లోకి కరెన్సీ నోట్లను విసురుతూ.. యూట్యూబర్ ఓవరాక్షన్
సాక్షి,హైదరాబాద్: తెలుగు యూట్యూబర్ హర్ష మరోసారి ఓవర్ యాక్షన్ చేశాడు. గురువారం కూకట్ పల్లిలో రద్దీగా ఉండే ప్రాంతంలో డబ్బును గాల్లోకి విసిరి రీల్స్ చేశాడు. నోట్లు వెదజల్లడంతో వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు ప్రయత్నించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. గాల్లోకి నోట్లు విసురుతున్న రీల్స్ వైరల్ కావడంపై ప్రజలు, నెటిజన్లు సదరు యూట్యూబర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా యూట్యూబర్ హర్ష ఇప్పటికే పలు మార్లు డబ్బుల్ని గాల్లోకి చల్లుతూ రీల్స్ చేసి పోస్ట్ చేశాడు. కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్ పై స్టంట్లు చేయడం,విసిరిన డబ్బుల్ని దక్కించుకునేందుకు వాహనదారులు ప్రయత్నించడంపై వెల్లువెత్తాయి. ఈ తరుణంలో మరోసారి డబ్బుల్ని గాల్లోకి విసరడంతో ట్రాఫిక్‌జామ్ కావడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబర్‌పై తగు చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి పోలీసులకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. YouTuber’ & Instagrammer’s Reckless Stunt of Throwing Money in Traffic Sparks Outrage in HyderabadCyberabad police will you please take action?A viral video showing a YouTuber and Instagrammer tossing money into the air amidst moving traffic in Hyderabad’s Kukatpally area has… pic.twitter.com/YlohO3U3qp— Sudhakar Udumula (@sudhakarudumula) August 22, 2024 -
మారుతున్న ప్రచార పంథా
ఏ వస్తువు తయారు చేసినా దాన్ని విక్రయించాలంటే సరైన ప్రచారం అవసరం. మేలైన వస్తువులు ఉత్పత్తి చేస్తోన్న కంపెనీలైనా సరే వాటి స్తోమతకు తగిన ప్రచారకర్తలను నియమించుకుంటాయి. కొన్ని పెద్ద కంపెనీలు సినీ తారలు, క్రికెట్లు, పాపులర్ వ్యక్తులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుని ప్రచారం సాగిస్తుంటాయి. కానీ క్రమంగా ఆ ట్రెండ్ మారుతుంది. ప్రముఖ కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను మరింత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు సామాజిక మాధ్యమాల్లోని చిన్న ఇన్ఫ్లుయెన్సర్లకు అవకాశం ఇస్తున్నాయి.భారత్‌లో స్థిరంగా వృద్ధి చెందే ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) రంగంలోని కంపెనీలు చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ పరిశ్రమలో ప్రముఖ సంస్థలుగా ఉన్న హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్), డాబర్, గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్(జీసీపీ)..వంటివి ఈ పంథాను అనుసరిస్తున్నాయి. ఈమేరకు 2024 ఆర్థిక సంవత్సరంలో చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెట్ విలువ రూ.2,344 కోట్లుగా ఉంది. ఇది 2026 నాటికి రూ.3,375 కోట్లకు చేరుతుందని అంచనా. కంపెనీలు తమ డిజిటల్ బడ్జెట్లో సుమారు 8-10 శాతం రెవెన్యూను ఈ ప్రచారానికి ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. దేశీయంగా ఎఫ్ఎంసీజీ రంగంలో పెద్ద కంపెనీగా ఉన్న హెచ్‌యూఎల్ తన ఉత్పత్తుల ప్రమోషన్ కోసం వెచ్చించే ఖర్చును 2024లో 31 శాతం పెంచి రూ.6,380 కోట్లకు చేర్చింది. ఈ కంపెనీ దాదాపు 700 మంది ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా దేశంలోని అన్ని భాషల్లో తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తోంది.ఇదీ చదవండి: పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు!ఈ ఇన్ఫ్లుయెన్సర్లు సామాజిక మాధ్యమాలు, యూట్యూజ్, ఇన్స్టాగ్రామ్..వంటి వాటిలో కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తారు. ఇదిలాఉండగా, ఏ వస్తువైనా మార్కెట్లోని ఇతర కంపెనీ ఉత్పత్తుల ధరతో పోల్చి ఎక్కడ తక్కువకు లభిస్తుందో బేరీజు వేసుకుని తీసుకోవాలి. ప్రధానంగా ఏదో విలాసాలకు వస్తువులు కొనకుండా అవసరానికి మాత్రమే కొనుగోలు చేసేలా జాగ్రత్తపడాలి. డబ్బు మిగిల్చుకోవాలి. -
యూట్యూబ్‌లో కొత్త ఫీచర్స్.. ఇవెలా పనిచేస్తాయంటే?
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో సంస్థలు కూడా యూజర్లకు అనుగుణంగా తమ యాప్‌లను అప్డేట్ చేయడం లేదా కొత్త ఫీచర్స్ తీసుకురావడం చేయాలి. ఇందులో భాగంగానే గూగుల్ యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మూడు కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇవన్నీ యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.స్లీప్ టైమర్ ఫీచర్పేరుకు తగ్గట్టుగానే.. యూజర్ ఏదైనా కంటెంట్‌ను చూస్తున్నప్పుడు లేదా వింటున్నప్పుడు టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న టైమ్ తరువాత వీడియోని ఆటోమేటిక్‌గా పాజ్ చేయవచ్చు. వీడియో చూస్తూ నిద్రపోయే వ్యక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. యూజర్లు మొబైల్, డెస్క్‌టాప్‌లోని సెట్టింగ్‌ల మెను నుంచి స్లీప్ టైమర్ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు.డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ఇది క్రియేటర్లకు ఉపయోగపడే ఫీచర్. ఇది మొబైల్ యాప్‌లో పనిచేస్తుంది. 'ఏఐ'ను ఉపయోగించి గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్లను క్రియేట్ చేసుకోవడానికి యూజర్లను అనుమతిస్తుంది. షార్ట్ కెమెరా ఓపెన్ చేయడానికి వినియోగదారులు ప్లస్ (+) చిహ్నం మీద క్లిక్ చేసి.. గ్రీన్ స్క్రీన్ ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో మాత్రమే కనిపిస్తాయి.ఆన్సర్ బాట్ ఫీచర్ప్రత్యేకించి ఈ ఫీచర్‌ను మొబైల్ యూజర్ల కోసం పరిచయం చేశారు. వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్నప్పుడు వీడియోకు సంబంధించి అనుమానాలు వస్తే.. వాటిని పరిష్కరించుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది కూడా ఏఐ బేస్డ్ ఫీచర్. యూట్యూబ్‌లోని అన్ని వీడియోలు ఈ కొత్త ఫీచర్‌ను కలిగి ఉండవు. ఇది వీడియో కింద ఉన్న ఆస్క్ ట్యాబ్ రూపంలో అర్హులైనవారికి మాత్రమే వీడియోలలో కనిపిస్తుంది. యూజర్లు ముందుగా సెట్ చేసిన ప్రశ్నలను ఎంచుకోవడం మాత్రమే కాకుండా.. సొంత ప్రశ్నలను టైప్ చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది.యూట్యూబ్ కొత్త ఫీచర్స్ కొన్ని రోజులు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. స్లీప్ టైమర్ ఫీచర్ సెప్టెంబర్ 2 వరకు, డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ ఆగస్ట్ 20 వరకు, ఆన్సర్ బాట్ ఫీచర్ ఆగస్ట్ 21 వరకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. టెస్టింగ్ పూర్తయిన తరువాత భవిష్యత్తులో ఇవి వినియోగంలోకి వస్తాయి. కానీ ఇప్పుడునా వస్తాయి అనేది తెలియాల్సి ఉంది. -
యూట్యూబ్ మాజీ సీఈఓ కన్నుమూత
యూట్యూబ్ మాజీ సీఈఓ 'సుసాన్ వొజ్కికి' (Susan Wojcicki) క్యాన్సర్‌తో రెండేళ్ల పోరాటం తర్వాత 56 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమె మరణ వార్తను ఆమె భర్త 'డెన్నిస్ ట్రోపర్' ఆగస్టు 9న ధృవీకరించారు.సుసాన్ వొజ్కికి మరణ వార్తను ట్రోపర్ ఫేస్బుక్ పోస్ట్‌తో తెలియజేశారు. నా భార్య ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడి చివరకు కన్నుమూసింది. సుసాన్ నాకు ప్రాణ స్నేహితురాలు. జీవిత భాగస్వామి మాత్రమే కాదు, తెలివైన మనస్సు, ప్రేమగల తల్లి, చాలా మందికి మంచి స్నేహితురాలు. మా కుటుంబంపై ఆమె ప్రభావం ఎనలేనిదని అన్నారు.సుసాన్ వొజ్కికి మరణం టెక్ ప్రపంచానికి తీరని లోటు అని చాలామంది నివాళులు అర్పించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేస్తూ విచారం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల క్యాన్సర్‌తో పోరాడి నా ప్రియమైన స్నేహితురాలు సుసాన్ వొజ్కికిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆమె లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టంగా ఉందని అన్నారు.Unbelievably saddened by the loss of my dear friend @SusanWojcicki after two years of living with cancer. She is as core to the history of Google as anyone, and it’s hard to imagine the world without her. She was an incredible person, leader and friend who had a tremendous…— Sundar Pichai (@sundarpichai) August 10, 2024 -
రష్యాలో స్తంభించిన యూట్యూబ్.. యూజర్ల గగ్గోలు
వీడియో హోస్టింగ్ సైట్ యూట్యూబ్‌లో ప్రపంచంలో ఎక్కోడో చోట అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం రష్యాలో యూట్యూబ్ సేవలు స్తంభించాయి. దీంతో యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. యూట్యూబ్ లభ్యతలో వేలాది అవాంతరాలను రష్యన్ ఇంటర్నెట్ మానిటరింగ్ సర్వీసెస్ కూడా నివేదించింది.రష్యాలో యూట్యూబ్‌కు సంబంధించి వేలకొద్దీ అవాంతరాలు నమోదయ్యాయని రష్యన్ ఇంటర్నెట్ మానిటరింగ్ సర్వీస్ Sboi.rf తెలిపింది. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల (VPNలు) ద్వారా మాత్రమే యూట్యూబ్‌ని యాక్సెస్ చేసేందుకు వీలు కలుగుతోందని యూజర్లు పేర్కొన్నారు.రష్యాలోని రాయిటర్స్ రిపోర్టర్లు కూడా యూట్యూబ్‌ని యాక్సెస్ చేయలేకపోయారు. అయితే కొన్ని మొబైల్స్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. యుట్యూబ్ డౌన్లోడ్ వేగం ఇటీవల గణనీయంగా తగ్గింది. యూట్యూబ్ అంతరాయంపై దాని యజమాన్య సంస్థ ఆల్ఫాబెట్‌ను రష్యన్ చట్టసభ సభ్యులు నిందించారు. -
జియో సినిమాలోకి యూట్యూబ్ ఇండియా ఎండీ..?
గూగుల్ ఆధ్వర్యంలోని యూట్యూబ్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఇషాన్ ఛటర్జీ తన పదవికి రాజీనామా చేశారు. వయాకామ్ 18 యాజమాన్యంలోని జియో సినిమా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ (సీఆర్ఓ)గా చేరబోతున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది.యూట్యూబ్ ఇండియాలో నాలుగేళ్ల నుంచి సేవలందిస్తున్న ఛటర్జీ గూగుల్‌లో దాదాపు 13 ఏళ్లు పనిచేశారు. ఆ సమయంలో యూరప్, ఆసియా అంతటా అనేక హోదాల్లో సేవలందించారు. యూట్యూబ్ ఎండీగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు యూట్యూబ్ ఏపీఏసీ, ప్రోడక్ట్ పార్టనర్షిప్ ఎండీగా వ్యవహరించారు. ఛటర్జీ రాజీనామాపై వయోకామ్18, యూట్యూబ్ రెండు సంస్థలు వివరాలు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసింది.ఇదీ చదవండి: కాల్ హోల్డ్‌లో పెట్టారా..? రూ.4.6 లక్షల కోట్లు నష్టం!ఇదిలాఉండగా, అమెజాన్ ప్రైమ్ వీడియో కంట్రీ డైరెక్టర్ సుశాంత్ శ్రీరామ్‌ను వయోకామ్ 18 చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సీఎంఓ)గా ఇటీవల నియమించింది. తాజాగా వస్తున్న కథనాల ప్రకారం ఛటర్జీని సీఆర్ఓగా చేర్చుకుంటే వయోకామ్లో జరిగే రెండో అతిపెద్ద నియామకమవుతుంది. వీరిద్దరు వయోకామ్ 18 డిజిటల్ వెంచర్స్ సీఈఓ కిరణ్ మణికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ఇప్పటికే వాల్ట్ డిస్నీలో వాటాలు పెంచుకుంది. -
నాడు వ్యూవర్స్.. నేడు క్రియేటర్స్: యూట్యూబ్ రిపోర్ట్
యూట్యూబ్ కొన్నేళ్లుగా ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. ఏ సమాచారం కావాలన్నా, ఏం సందేహం వచ్చినా అన్నింటికీ అదే సమాధానం అయిపోయింది. ఒకప్పుడు వీడియోలు చూడటానికే పరిమితమైన యూజర్లు క్రమంగా తామూ వీడియాలు చేస్తూ తమను తాము ప్రదర్శించుకోవడానికి యూట్యూబ్‌ను అద్భుతమైన వేదికగా మార్చుకున్నారు.యూట్యూబ్‌లో ఏదైనా కంటెంట్‌ను అభిమానిస్తూ ఫాలో అయ్యే ఫ్యాన్స్ ధోరణిలో ఇటీవల చాలా మార్పు వచ్చింది. ఏడాది కాలంగా భారతీయ యూజర్లలో వచ్చిన మార్పులపై యూట్యూబ్ ఓ నివేదికను విడుదల చేసింది. యూట్యూబ్ కల్చర్ అండ్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం.. భారతీయ జెన్ జెడ్ (14-24 సంవత్సరాల వయసువారు)లో 91% మంది గత సంవత్సరంలో ఫ్యాన్ సంబంధిత కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. 93% మంది తమకు ఇష్టమైన అంశాలను అనుసరించడానికి వారానికోసారైనా యూట్యూబ్‌ను ఉపయోగించారు.ముంబైలో జరిగిన యూట్యూబ్ ఫ్యాన్‌ఫెస్ట్ 10వ వార్షికోత్సవం సందర్భంగా స్మిత్గీగర్తో కలిసి రూపొందించిన ఈ నివేదికను యూట్యూబ్ విడుదల చేసింది. ఇంకా ఈ రిపోర్ట్ మరికొన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించింది. భారతీయ జెన్ జెడ్‌లో 83% మంది తమను తాము క్రియేటర్లుగా ప్రదర్శించుకున్నారు. 87% మంది వివిధ స్థాయిలలో ఎవరో ఒకరికి, ఏదో ఒక దానికి ఫ్యాన్‌గా నిమగ్నమయ్యారు. అంటే లైక్, కామెంట్ వంటివి చేశారన్నమాట. -
ప్రభాస్ 'ది రాజాసాబ్' గ్లింప్స్.. అది రెబల్ స్టార్ క్రేజ్!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజాసాబ్'. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఏకంగా నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. గ్లింప్స్ విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ది రాజా సాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ప్రభాస్ వింటేజ్ లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి సరికొత్తగా ప్రభాస్‌ను చూపించనున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
యూట్యూబ్ డౌన్!.. గగ్గోలు పెడుతున్న యూజర్లు
గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ యాప్, వెబ్సైట్లో వీడియోలను అప్లోడ్ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నట్లు కొందరు యూజర్స్ పిర్యాదు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి యూట్యూబ్‌లో సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.యూట్యూబ్‌లో సమస్య గురించి వచ్చిన ఫిర్యాదుల్లో.. 43 శాతం మంది వినియోగదారులు యాప్‌తో సమస్య ఉన్నట్లు వెల్లడించారు. 33 శాతం మంది వీడియోను అప్లోడ్ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నట్లు, 23 శాతం మందికి యూట్యూబ్ వెబ్‌సైట్‌తో సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు.నెటిజన్లు ఎదుర్కొన్న సమస్యలను గురించి ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. యూట్యూబ్ డౌన్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సమస్య మరువక ముందే.. యూట్యూబ్ సమస్య వచ్చిందని చెబుతున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని యూట్యూబ్ టీమ్ పేర్కొంది.Youtube Video Upload But not showing in YouTube application as well as Yt studio please fix this issue as early as possible.... #Youtubedown #Videouploadbutnotshowingproblem @TeamYouTube @YouTubeIndia @YouTubeCreators— Piyush Joshi (@Piyush_j_7) July 22, 2024#YouTube Ka Bhi Systumm Hang Ho Gya Aaj 🤦♀️🤦♀️Upload Nahi Ho Rahi Videos#YoutubeDown— Aditi Shharmaa (@AditiSharma780) July 22, 2024 -
వర్చువల్ కచ్చడాలు
‘ఒక తల్లి, ముగ్గురు డాడీలు’ యూ ట్యూబ్ ఓపెన్ చెయ్యగానే ఒక చానల్ పెట్టిన థంబ్ నెయిల్ కనపడింది. వ్యూస్ పెంచుకోవడానికి యూట్యూబ్ చానల్స్‌తో పాటు చిన్నా పెద్ద పత్రికల డిజిటల్ విభాగాలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. ‘మతి పోగొట్టే, రచ్చరచ్చ చేసే, పడీపడీ నవ్వే, చూడగానే షాకయ్యే’ ఎన్నో థంబ్ నెయిల్స్ చూస్తూనే ఉన్నాము. కానీ ఆడవాళ్ళ విషయంలో... ముఖ్యంగా పోరాట కులాల నుంచి వచ్చిన ఆడవాళ్ళ విషయంలో ఈ చూపుడు వేళ్ళు మరిన్ని వంకర్లు తిరుగుతాయి. ‘ఆడదాన్ని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తావా?’ అంటుంది ఫ్యూడల్ సమాజం. పౌరుషమైన విషయాలు మగవారికే కనుక వారు పురుషులయ్యారు. సమాజమూ రాజకీయాలు వగైరాలన్నీ మగవారి టెరిటరీగా ఉన్నంతకాలం ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగడం తప్పన్నది ఒక అనాగరిక విలువ. ఆ మేరకు స్త్రీలు యుద్ధాలు చేయని సుకుమారులుగా, మాటంటే బడబడా కన్నీరు కార్చే సున్నిత మనస్కులుగా తయారు చేయబడ్డారు. ఇక ఇపుడు అలా లేరు. స్త్రీలు అన్నీ మాట్లాడగలరు. ముక్కూ చెవులూ కోసి పంపినందుకు సంబరపడిన మన మొహాలకేసి జాలిగా చూసి, ‘ప్రేమించడం తప్పా?’ అంటుంది ఆధునిక శూర్పణఖ. ‘పేడితో యుద్ధం చెయ్యనని’ ఆయుధం విసర్జించిన విలువిద్యకారుని ప్రశ్నించింది శిఖండి. ‘భీష్మా! నాతో పోరాడు’ అని సవాల్ చేసినట్లు కూడా రాసింది ఒక రచయిత్రి. స్త్రీలు తమ యుద్ధాలు తామే చేస్తున్నా వారి లైంగిక వ్యక్తిత్వం మగవారి సొత్తుగానే ఉంది. సామాజిక మాధ్యమాల విస్తృతి వల్ల ఈ స్థితి కొత్తరూపం తీసుకుంటోంది. రాజకీయ నాయకులుగా, రాజకీయ కుటుంబీకులుగా, ఉన్నతోద్యోగులుగా, కళాకారులుగా ఇంకా ఎన్నో రంగాలలో స్త్రీలు బాహాట శీలపరీక్షలకు గురవుతున్నారు. చేతిలో ఫోనో, ఛానలో ఉన్న చాలామంది అగ్నిగుండాలకి సమిధలు తయారు చేస్తున్నారు. ‘ఫలానా స్త్రీ ఎవరితో శారీరక సంబంధంలో ఉందీ, ఆమె బిడ్డకి ఎంతమంది డాడీలు, ఆమెకి ఎంతమంది మగాళ్లతో సంబంధాలు ఉన్నాయి, ఆమె ఏ రోజు ఎవరితో ఏ హోటల్లో ఉందీ’ వంటి లక్షోపలక్షల ప్రశ్నలు సమాజాన్ని ఉద్ధరించడం కోసం మీడియా వేస్తూ ఉంటుంది. అంతేకాదు అటువంటి స్త్రీలకి ఎటువంటి శిక్షలు విధించాలో కూడా రచ్చబండలు, బతుకు జట్కాబండులతో పాటు పిల్లా పిచుకా యూట్యూబర్లు, పెద్ద మీడియా సంస్థల, రాజకీయ పార్టీల డిజిటల్ విభాగాలు నిర్ణయిస్తాయి. ‘కామాంధురాలి కళ్ళు పీకాలి’, ‘పరాయి మగాడితో కులికిన స్త్రీని గుడ్డలూడదీసి కొట్టాలి’, ‘అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమెని చెట్టుకు కట్టేసి తన్నాలి’ వంటి అనేక శిక్షలను సజెస్టివ్గా చెప్పడంతో పాటు, ఆ యా శిక్షలను అభినయించి చూపగల ధీరులు వారు. స్త్రీ పురుష శారీరక సంబంధాలు వ్యక్తిగతం. వాటిని చర్చించడానికి కొద్దిమందికి మాత్రమే హక్కు ఉంది. అటువంటి వివాదాల్లోని వ్యక్తులు, ఆ యా సంబంధాలలోని అవకాశవాదాన్ని, మోసాన్ని, హింసని గుర్తించి తీర్పు ఇచ్చే న్యాయవ్యవస్థ లేదా ఆ ఇరువురి సమ్మతంతో ప్రయత్నించే మధ్యవర్తులకి మాత్రమే ఆ హక్కు ఉంది. అంతే తప్ప ఎవరు పడితే వారు, వారి సంబంధాలలోకి తొంగి చూసి, చకచకా అడుగులు వేసి వ్యాఖ్యానించడం కుసంస్కారం. తమ రక్తం పంచుకు పుట్టినవారికే ఆస్తి ఇవ్వడం కోసం, బయలాజికల్ తండ్రులుగా తమ స్థితిని నిర్ధారించుకోవడం కోసం స్త్రీ మొలకు ఇనుప కచ్చడాలు బిగించి, తాళాలు వేసిన ఘనత పితృస్వామ్య సమాజానిది. ఇపుడు మీడియా, సోషల్ మీడియా సామాజిక, రాజకీయ రంగాలలో ఉన్న స్త్రీలకు అటువంటి వర్చువల్ కచ్చడాలు బిగించే ప్రయత్నం చేస్తున్నాయి.డియర్ మీడియా– సోషల్ మీడియా! అవినీతిని వెలికి తీయడమే మీ అత్యున్నత లక్ష్యం అయినపుడు అవినీతే ప్రమాణం కావాలి తప్ప ఎవరి వ్యక్తిగతాలయినా మీకెందుకు! వేల కోట్ల సంపన్నుల మీద పెద్దచూపు, పీడిత వర్గాల వ్యక్తిత్వం మీద చిన్నచూపుతో ఉన్న విషయానికి వంద మసాలా దినుసులు కలిపి వార్తలను వండి వడ్డించే హక్కు మీకుందా? ఒక స్త్రీ ఎంతమందితో తిరిగితే, ఎవరితో ఏ సంబంధంలో ఉంటే, ఎవరితో బిడ్డని కంటే మీకేమిటి నొప్పి? స్త్రీలుగా, పోరాట కులాల స్త్రీలుగా, పౌరులుగా, మనుషులుగా మాకు ఉండే హక్కుల పట్ల ఎలానూ అక్కర లేదు. ఏ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని పసిబిడ్డల పట్ల మానవ సహజమైన తడి కూడా మీకు లేదు. ‘తల్లి వాస్తవం, తండ్రి నమ్మకం’ అన్న నానుడి పాతదే కానీ దాని నిజార్థాన్ని, ‘పిల్లలు మన ద్వారా వస్తారు తప్ప మనకోసం రారు’ అన్న ఖలీల్ గిబ్రన్ తాత్వికార్థాన్ని గ్రహించగలిగితే స్త్రీ పురుష సంబంధాల పట్ల మీ చూపు మారుతుంది. ఒక బిడ్డకు ఎంతమంది డాడీలు అంటూ చర్చ చేసిన ప్రతి మీడియా సంస్థా ఈ రోజు స్త్రీల, బాలల హక్కులను ఉల్లంఘించాయి. వ్యూస్ కోసం ఎంతకైనా తెగించే మిమ్మల్ని చూస్తుంటే, మా శరీరాల చుట్టూ కెమెరాలు బిగించినట్లు, రాబందుల మైకుల చప్పుడు మా తలల మీదుగా వీస్తున్నట్లు ఉంది. దయ చేసి ఆపండి!కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త కార్యదర్శి, ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక, ఏపీmalleswari.kn2008@gmail.com -
యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నారా? కొత్త ఫీచర్స్ చూశారా..
మారుతున్న కాలానికి అనుకూలంగా యూట్యూబ్ కూడా అప్డేట్ అవుతోంది. ఇందులో భాగంగానే కంటెంట్ క్రియేటర్స్ లేదా వినియోగదారుల కోసం తాజాగా నాలుగు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.టెక్స్ట్-టు-స్పీచ్షార్ట్లకు టెక్స్ట్-టు-స్పీచ్ వీడియో నేరేషన్ ఫీచర్ ఒకటి. ఇది ఆర్టిఫిషియల్ వాయిస్ఓవర్ను అందించడానికి ఉపయోగపడుతుంది. టిక్‌టాక్‌లో చూసిన అదే ఫీచర్ ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మొదట టెక్స్ట్ రెడీ చేసుకున్న తరువాత.. స్క్రీన్ ఎగువన ఎడమవైపు మూలలో ఉండే యాడ్ వాయిస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీకు కావలసిన వాయిస్‌ని ఎంచుకోగలుగుతారు. అయితే ప్రస్తుతం యూట్యూబ్‌లో కేవలం నాలుగు వాయిస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఆటో జనరేటెడ్ క్యాప్షన్క్యాప్కట్ వంటి థర్డ్-పార్టీ యాప్‌ని ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే మీరు మీ వీడియోలకు యాడ్ చేసుకోగలిగే ఆటోమేటిక్ క్యాప్షన్లను యూట్యూబ్ పరిచయం చేస్తోంది. యూట్యూబ్ షార్ట్‌లకు ఇప్పటికే ఉన్న మాన్యువల్ టెక్స్ట్ ఓవర్లే ఫీచర్ లాగానే, వినియోగదారులు వివిధ ఫాంట్లు, రంగులతో క్యాప్షన్ల స్టైల్ కస్టమైజ్ చేసుకోవచ్చు.మైన్ క్రాఫ్ట్ ఎఫెక్ట్స్యూట్యూబ్ తీసుకువచ్చిన మరో ఫీచర్ మైన్ క్రాఫ్ట్ ఎఫెక్ట్స్. ఇందులో గ్రీన్ స్క్రీన్ బ్యాక్‌గ్రౌండ్, మైన్ క్రాఫ్ట్ రష్ వంటి మినీ గేమ్ వంటివి ఉన్నాయి.వర్టికల్ వీడియో ఫార్మాట్మరింత మంది యూట్యూబ్ క్రియేటర్లను ఆకర్శించమే లక్ష్యంగా వర్టికల్ వీడియో ఫార్మాట్ ఫీచర్ కూడా తీసుకువచ్చింది. ఇది కూడా టిక్‌టాక్‌లో మాదిరిగా ఉంటుంది. మొత్తం మీద మరింత మందిని ఆకర్శించడమే ప్రధానంగా యూట్యూబ్ ఈ ఫీచర్స్ తీసుకువచ్చినట్లు స్పష్టమవుతోంది. -
బ్యాంక్ జాబ్ వదిలి 'యూ ట్యూబ్'.. ఏటా కోట్లు సంపాదిస్తూ..
చేస్తున్న పనిలో సవాళ్లు లేకుంటే.. కొందరు ఉద్యోగాలకు స్వస్తి చెప్పి, నచ్చినపని చేస్తూ.. కొందరికి సాయపడాలనుకుంటారు. ఇలాంటి కోవకు చెందినవారిలో ఒకరు 'నిశ్చా షా' (Nischa Shah). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గతంలో ఎందుకు ఉద్యోగం వదిలేశారు. ఇరులకు ఎలా సాయం చేస్తున్నారనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..'నిశ్చా షా' ఒకప్పుడు లండన్‌లో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ఈ రంగంలో ఈమెకు ఏకంగా తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా, క్రెడిట్ అగ్రికోల్లో అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేస్తూ ఏడాది రెండు కోట్ల రూపాయల కన్నా ఎక్కువ వేతనం తీసుకునేది. చేస్తున్న పనిలో సవాళ్లు కనిపించకపోవడంతో జాబ్ వదిలేయాలనుకుంది. అనుకున్న విధంగా ఉద్యోగం వైదిలేసి యూట్యూబ్ ఛానల్ చెస్ట్ చేసింది.ఇతరులకు సాయం చేస్తూనే ఆర్థికంగా ఎదగాలని భావించిన నిశ్చా షా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా పర్సనల్ ఫైనాన్స్ విషయాలను చెబుతూ కంటెంట్ క్రియేటర్ అవతారమెత్తింది. దీనికోసం 2023లో తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. యూట్యూబ్ ద్వారా ఏకంగా రూ. 8 కోట్ల కంటే ఎక్కువ సంపాదించినట్లు సమాచారం.ప్రారంభంలో అనుకున్న విధంగా చేయడం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు.. వెయ్యిమంది సబ్స్క్రైబర్లను సంపాదించడానికి 11 నెలల సమయం పట్టిందని ఓ ఇంటర్వ్యూలో నిశ్చా షా పేర్కొన్నారు. ఆ సమయంలో పొదుపు చేసుకున్న డబ్బును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. ఒక వీడియో బాగా వైరల్ కావడంతో 50వేలమంది సబ్స్క్రైబర్లను పొందేలా చేసింది. అప్పుడు ఒకేసారి రూ.3 లక్షలు సంపాదించినట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: 22ఏళ్ళ క్రితం నిర్మించారు.. ఇప్పటికీ అక్కడ టోల్ ట్యాక్స్ ఎక్కువే! ఇప్పుడు నిశ్చా షా యూట్యూబ్ ఛానల్ 1.16 మిలియన్ సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. దీంతో ఈమె యూట్యూబ్ వీడియోలు చేస్తూ భారీగానే ఆర్జిస్తోంది. అనుకున్నది సాధించడానికి ఉన్న ఉద్యోగం వదిలి సక్సెస్ సాధించింది. అయితే ఇది అందరికి సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి వాటికి పూనుకునే ముందు పదిసార్లు ఆలోచించడం మంచింది. -
యూట్యూబ్ కొత్త ఫీచర్.. డీప్‌ఫేక్ వీడియోలకు గుడ్‌బై
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతున్న తరుణంలో దాదాపు అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే కొంతమంది ఈ టెక్నాలజీని డీప్‌ఫేక్ వీడియోలను సృష్టించడానికి ఉపయోగించి దుర్వినియోగం చేస్తున్నారు. దీనికి సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా బలైపోతున్నారు.సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్శించడానికి కొంతమంది తప్పుడు వీడియోలను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు చూడటానికి అసలైన వీడియోల మాదిరిగానే ఉండటం వల్ల, అసలైన వీడియో ఏది? నకిలీ వీడియో ఏది, అని గుర్తించడం చాలా కష్టమైపోయింది. ఇలాంటి వాటిని పరిష్కరించడానికి యూట్యూబ్ చర్యలు తీసుకుంటోంది, ఇందులో భాగంగానే కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తోంది.ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫోటోలను గానీ, వారి వాయిస్ గానీ ఉపయోగించి వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే వాటిపైన రిపోర్ట్ చేయవచ్చు. అంతే కాకూండా ఏఐను ఉపయోగించి కంటెంట్ క్రియేట్ చేసేవారు తప్పకుండా ఆ విషయాన్ని యూజర్లకు తెలియజేయాలని యూట్యూబ్ పేర్కొంది.ఏఐను ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తే.. యూజర్ల రిపోర్ట్ మేరకు యూట్యూబ్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఆ కంటెంట్ డిలీట్ చేస్తుంది. ఈ విధంగా డీప్‌ఫేక్ వీడియోలను పూర్తిగా రూపుమాపే అవకాశం ఉంది. దీంతో డీప్‌ఫేక్ భయానికి లోనయ్యేవారు నిశ్చింతగా ఉండవచ్చు. యూజర్ల భద్రతే ప్రధానంగా భావించిన యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది. -
ప్రపంచంలోనే నంబర్ వన్ యూట్యూబ్ ఛానల్ ఇదే..!
-
యూట్యూబ్‌లో అదిరిపోయే మరో ఫీచర్
యూట్యూబ్.. ఈ యాప్ గురించి తెలియనివారెవరూ ఉండరు. వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన యూట్యూబ్.. వినియోగదారులకు కావలసిన అన్ని రకాల సమాచారాలకు సంబంధించిన వీడియోలను ముందుకు తీసుకువస్తుంది. తాజాగా యూట్యూబ్‌లో మరో ఫీచర్ దర్శనవివ్వనుంది. అది యూజర్స్‌కు సరికొత్త అనుభూతిని అందిస్తుందనడంలో సందేహం లేదు. గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ఫారం యూట్యూబ్ ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఇన్స్టాల్ అయి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు రోజులో కొంతసేపైనా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అత్యధిక వినియోగదారుల బేస్ కలిగిన యూట్యూబ్ మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు తరచూ నూతన ఫీచర్లను అందిస్తుంటుంది.త్వరలో యూట్యూబ్‌లో గూగుల్ లెన్స్ బటన్ యూజర్స్‌కు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ ఫోను వినియోగదారులు గూగుల్ లెన్స్ బటన్ ఉపయోగించడం ద్వారా టైప్ చేయడానికి బదులు ఏదైనా ఫొటో సాయంతో వీడియోలను శోధించవచ్చు. యూట్యూబ్ యాప్ అప్డేట్లో గూగుల్ లెన్స్ బటన్ కనిపించనుంది. ఇదే విధంగా యూట్యూబ్ యూజర్స్ ఫోనులోని మైక్రోఫోన్ బటన్ సహాయంతో, మాట రూపంలో సూచించడం ద్వారా కూడా తమకు కావలసిన వీడియోలను చూసే అవకాశం ఉంది. -
గర్ల్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన ప్రముఖ యూట్యూబర్, భావోద్వేగ క్షణాలు
ప్రముఖ యూట్యూబర్ అరుణ్ మైని తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. తన బెస్ట్ ఫ్రెండ్ద్రిషను పెళ్లాడాడు. ఈశుభవార్తను సోషల్ మీడియాద్వారా పంచుకున్నాడు.ఈ వివాహానికి సంబంధించిన కొన్ని భావోద్వేగ ఫోటోలను షేర్ చేశాడు."8 జూన్ 2024 నేను నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రేరణ, నా దేవత, నా సర్వస్వాన్ని పెళ్లి చేసుకున్నాను. మా జీవితాల్లోని ఆ మూడు రోజుల ఆనంద క్షణాలను హాయిగా గడిపాం. సంపూర్ణంగా ఎంజాయ్ చేశాం. ఇక భవిష్యత్లుగా జంటగా జీవించే లైఫ్ గురించి ఉత్సాహంగా ఉన్నాం’ అంటూ తమ పెళ్లి కబురు గురించి ఆనందంగా చెప్పుకొచ్చాడు. ఎక్స్‌లో అరుణ్ చేసిన పోస్ట్‌కు సుమారు 30 లక్షల లైక్స్ వచ్చాయంటేనే అతని క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్లో రాయల్ లుక్‌లో ఈ లవ్‌బర్డ్స్ అరుణ్, ద్రిష అందంగా మెరిసిపోయారు.‘మిస్టర్ హూఈజ్ ది బాస్’ అనే యూట్యూబ్ చానల్ ద్వారా అరుణ్ మైనీ ఆధునిక టెక్ కంటెంట్, డిజిటల్ టెక్నాలజీ ఇలా అనేక విషయాల గురించి తన ఛానల్లో మాట్లాడుతాడు. అతని యూట్యూబ్ ఛానెల్లో1. 8 కోట్ల సబ్స్క్రైబర్లున్నారు. ఇన్‌స్టాగ్రాంలో 10 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు.I just married my best friend pic.twitter.com/lW2oICMV1I— Arun Maini (@Mrwhosetheboss) June 11, 2024అరుణ్ దంతపు రంగు షేర్వానీని , తలపాగా ,దుపట్టాలో కొత్త పెళ్లికొడుకుగా మారిపోయాడు. ఇక ధృషా అయితే భారీగా ఎంబ్రాయిడరీ చేసిన రెడ్ రంగు లెహంగాలో అందంగా మెరిసిపోయింది. ఆకుపచ్చ రత్నాలతో బంగారు చోకర్, ఆకుపచ్చ రత్నంతో రాయితో పొదిగిన చెవిపోగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
Tech Talk: గూగుల్ 'ఆస్క్ ఫొటోస్' తో.. ఈ వెతుకులాటకి చెక్!
టెక్ దిగ్గజం గూగుల్ రకరకాల కొత్త ఫీచర్ల గురించి ప్రకటించింది. అందులో ‘ఆస్క్ ఫొటోస్’ ఒకటి. అడ్వాన్స్డ్ జెమిని ఏఐ మోడల్‌తో వస్తున్న ఈ ఫీచర్‌ను యూజర్లు తమ ఫొటో కలెక్షన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. యూజర్లు తమ గ్యాలరీని విస్తరించినప్పుడు వారికి అవసరమైన ఫొటోను కనుక్కోవడం కష్టంగా ఉండవచ్చు.దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పెసిఫిక్ ఫొటోను త్వరగా కనిపెట్టడానికి ‘ఆస్క్ ఫొటోస్’ ఫీచర్ ఉపయోగపడుతుంది. కీవర్డ్ కాంబినేషన్స్‌తో పనిలేదు. ప్రాంప్ట్ చాలు. ఉదాహరణకు... ‘షో మీ ది బెస్ట్ ఫొటో ఫ్రమ్ ఈచ్ నేషనల్ పార్క్ ఐ హ్యావ్ విజిటెడ్’ అని ప్రాంప్ట్ ఇస్తే సంబంధిత ఇమేజ్‌లను చూపిస్తుంది. ఈ ఏఐ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.... యూజర్లు తమ ఫొటోల గురించి వివరంగా అడగవచ్చు.హువావే వాచ్ ఫిట్ 3డిస్ప్లే: 1.82 అంగుళాలురిజల్యూషన్: 480“408 పిక్సెల్స్బరువు: 26 గ్రా బ్యాటరీ: 400 ఎంఏహెచ్- ఆటోమెటిక్ప్రాంప్ట్స్ – ట్రాక్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్, వెదర్ వార్నింగ్స్ డిస్ప్లేఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు సంగీతం..ఇన్స్టాగ్రామ్ప్రొఫైల్కు పర్సనలైజ్డ్ టచ్ ఇవ్వడానికి, మ్యూజిక్ ద్వారా మన మూడ్‌ను రెఫ్లెక్ట్ చేయడానికి ఉపకరించే లేటెస్ట్ ఫీచర్ ఇది. దీని కోసం...– ఇన్స్టాగ్రామ్ యాప్‌ను అప్డేట్ చేయాలి– ప్రొఫైల్ స్క్రీన్‌తో యాక్సెస్ కావడానికి బాటమ్ రైట్ కార్నర్లోనిప్రొఫైల్ పిక్చర్ ట్యాప్ చేయాలి– ఎడిట్ప్రొఫైల్–ట్యాప్– మ్యూజిక్–ట్యాప్– పాటను ఎంపిక చేసుకోవడానికి ప్రొఫైల్ సాంగ్ సెక్షన్లో ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేయాలి.షావోమీ ప్యాడ్ 6ఎస్ ప్రో 12.4..డిస్ప్లే: 12.40 అంగుళాలు ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీబ్యాటరీ: 10000 ఎంఏహెచ్ రిఫ్రెష్ రేట్: 144 హెచ్జడ్మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్/ 256జీబి 12జీబి ర్యామ్/ 512జీబి 12జీబి ర్యామ్డ్రీమ్ స్క్రీన్..‘డ్రీమ్ స్క్రీన్’ అనే కొత్తఫీచర్ని పరీక్షిస్తోంది యూట్యూబ్. ఏఐ ద్వారా ‘షార్ట్స్’కు బ్యాక్‌డ్రాప్‌ను జెనరేట్ చేసే ఫీచర్ ఇది. యూజర్లు డ్రీమ్ స్క్రీన్కు యాక్సెస్ ΄÷ందిన తరువాత బ్యాక్‌గ్రౌండ్‌లో తమకు ఏమి కావాలో వివరిస్తూప్రాంప్ట్ ఇవ్వవచ్చు.ఉదా: ఒక ద్వీపంలో ఫ్యాన్సీ హోటల్. ఇమేజ్ జనరేట్ అయిన తరువాత వెంటనే బ్యాక్‌గ్రౌండ్‌కు జత చేయవచ్చు. ఈ ప్రయోగాత్మక ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన ‘షార్ట్స్’ క్రియేటర్స్ మాత్రమే అందుబాటులో ఉంది.ఇవి చదవండి: Aria: ‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు.. ఈ ఆల్బమ్‌లో ఉంటాయి’ -
మహిళపై అనుచిత వీడియో అప్లోడ్
తిరువొత్తియూరు: మహిళలపై అనుచిత వీడియో లను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన యూ ట్యూబర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. విరుదునగర్‌కు చెందిన దుర్గైరాజ్ యూ ట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. దీని ద్వారా చాలా మంది మహిళలతో సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయ్యేవాడు. అందుకు తగ్గట్టుగానే పుదుచ్చేరికి చెందిన ఓ మహిళతో మాట్లాడే వారు. తరువాత ఆమెతో భేదాభిప్రాయాలు వ చ్చాయి. ఆ తర్వాత మహిళను అసభ్యకరంగా చిత్రీకరించిన ఆడియో, వీడియోలను తన ఛానెల్లో అప్లోడ్ చేశాడు. దీనిపై ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దుర్గైరాజ్పై కేసు నమోదు చేశారు. విచారణలో దుర్గైరాజ్ యూ ట్యూబ్ ఛానెల్‌ని పరిశీలించగా, అతను 20 మందికి పైగా మహిళలను అసభ్య పదజాలంతో దూషించి, మహిళలను కించపరిచేలా వీడియో అప్లోడ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే వీడియో రికార్డింగ్ చేసిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రాన్ని కూడా అసభ్య పదజాలంతో దూషించాడని, వీలైతే పోలీసులను ఉపయోగించి అరెస్టు చేయమని సవాల్ విసిరినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో పుదుచ్చేరి పోలీసులు మదురైలో తలదాచుకున్న దుర్గైరాజ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. -
Tech Talk: యూట్యూబ్‌లో కామెంట్‌ను ఎడిట్, డిలీట్ చేయడానికి..
మనం చూసిన వీడియోలు, చేసిన కామెంట్స్‌ను యూట్యూబ్ సేవ్ చేస్తుంది. కామెంట్ హిస్టరీని చూడాలనుకుంటున్నారా? ఎడిట్ లేదా డిలీట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి... యూట్యూబ్ లోగోకు లెఫ్ట్‌లో ఉన్న హంబర్గర్ మెనూ బటన్‌ను క్లిక్ చేయాలి. ‘యూ’ సెక్షన్ కింద ఉన్న ‘హిస్టరీ’ని క్లిక్ చేయాలి. రైట్లో ఉన్న ‘మేనేజ్ ఆల్ హిస్టరీ’ క్లిక్ చేయాలి కామెంట్స్–ట్యాప్.డిలిట్, ఎడిట్ చేయడానికి...– ‘ఎక్స్’ ఐకాన్‌ను నొక్కితే కామెంట్ ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది.– ఎడిట్ చేయడానికి వీడియో లింక్‌ను నొక్కాలి. లోడ్ అయిన పేజీ మీ కామెంట్‌ను హైలైట్ చేస్తుంది.– ఎడిట్ చేయాలనుకుంటున్న కామెంట్ పక్కన ఉన్న త్రీడాట్ మెనూ బటన్‌పై క్లిక్ చేసి ‘సేవ్’ బటన్ నొక్కాలి.– గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్పులు చేసిన తరువాత కామెంట్ ఎడిట్ చేసినట్లు యూట్యూబ్ చూపిస్తుంది.ఇవి చదవండి: Aryan Chauhan: అద్భుతాల ఆర్యన్! -
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ప్రముఖ ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ నిషేధిత కంటెంట్‌గా భావించే 32 వీడియో లింకులను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్ కోర్టు నిర్ణయానికి లోబడి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.చైనా-హాంకాంగ్ మధ్య కొన్నేళ్లుగా రాజకీయ, బౌగోళిక సమస్య కొనసాగుతోంది. హాంకాంగ్‌లో ప్రత్యేకపాలన ఉంటుంది. అక్కడి ప్రభుత్వాన్ని చైనాకు అనుకూలంగా ఉండే వారికి కట్టబెడుతారు. దాంతో స్థానిక ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. అందులో భాగంగా 2019లో ‘గ్లోరీ టు హాంకాంగ్’ అనే నిరసన గీతం ప్రాచుర్యంలోకి వచ్చంది. దీన్ని నిషేధించాలని కోరుతూ హాంకాంగ్ అప్పీల్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ గీతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారడంతో దాన్ని తొలగించాలని తాజాగా కోర్టు ఆదేశించింది. ఫలితంగా పాటకు సంబంధించిన 32 వీడియో లింకులను తొలగిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. చైనా నుంచి హాంకాంగ్ విభజనను కోరుకుంటున్న అసమ్మతివాదులు ఆ పాటను ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తులు హెచ్చరించారు.ఇదీ చదవండి: టీవీ రిమోట్ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..కోర్టు నిర్ణయంతో నిరాశ చెందినట్లు యూట్యూబ్ చెప్పింది. అయినప్పటికీ ఆ తీర్పును పాటిస్తామని స్పష్టం చేసింది. బుధవారం నుంచి ఇకపై యూట్యూబ్‌లో ఆ గీతం కోసం సెర్చ్‌చేస్తే ‘కోర్టు ఆర్డర్ వల్ల ఇందుకు సంబంధించిన కంటెంట్ దేశీయ డొమైన్లో నిషేధించడమైంది’ అనే పాప్అప్ మెసేజ్ వస్తుందని చెప్పింది. ఆన్లైన్లో స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించానుకునేవారిని కట్టడి చేయడం సరికాదని, ఈ వ్యవహారానికి సంబంధించి ఇతర వర్గాలకు అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇప్పటికే మానవ హక్కుల సంస్థలతో తమ భావాలను పంచుకున్నట్లు కంపెనీ పేర్కొంది. -
Lok Sabha Election 2024: ఈసారి యూట్యూబ్ హవా!
సార్వత్రిక ఎన్నికల వేడి సోషల్ మీడియాలోనూ సెగలు పుట్టిస్తోంది. ఫేస్బుక్.. వాట్సాప్.. ఇన్‌స్టా.. ఎక్స్.. యూట్యూబ్.. ఇలా సోషల్ ప్లాట్ఫాముల్లోనే మునిగి తేలుతున్న నెటిజన్లకు చేరువయ్యేందుకు పారీ్టలు కూడా ఆ వేదికలనే అడ్డగా మలచుకుంటున్నాయి. రాజకీయ విశ్లేషకులతో పాటు కంటెంట్ క్రియేటర్లు కూడా జోరు పెంచడంతో రెండు నెలలుగా డిజిటల్ ప్రచారం దుమ్ము రేగిపోతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పారీ్టలు ఎక్కువగా ఫేస్‌బుక్‌పై దృష్టి పెట్టగా 2019కు వచ్చేసరికి ప్రధానంగా వాట్సాప్‌ను నమ్ముకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం డిజిటల్ క్యాంపెయినింగ్‌కు యూట్యూబ్ కీలక వేదికగా మారింది... సాధారణంగా యూట్యూబ్‌లో వినోదాత్మక కంటెంట్‌కు మంచి గిరాకీ ఉంటుంది. ఎన్నికల పుణ్యమా అని నెల రోజులుగా సీరియస్ రాజకీయ కంటెంట్‌కు ఒక్కసారిగా వ్యూస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సబ్‌్రస్కయిబర్లు భారీగా ఎగబాకుతున్నారు. సోషల్ మీడియా డేటాను విశ్లేíÙంచే సోషల్ బ్లేడ్ గణాంకాల ప్రకారం రాజకీయ థీమ్‌తో కంటెంట్ క్రియేట్ చేస్తున్న ధృవ్ రాఠీకి ఒక్క ఏప్రిల్ నెలలోనే ఏకంగా 25 లక్షల మంది యూజర్లు దక్కడమే ఇందుకు నిదర్శనం! ఇక డిజిటల్ న్యూస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన రవీశ్ కుమార్, అభిసార్ శర్మ వంటి టీవీ జర్నలిస్టుల యూట్యూబ్ ఛానెల్స్ కూడా మూడు లైక్‌లు, ఆరు షేర్లుగా దూసుకెళ్తున్నాయి. వీరిద్దరి ఛానెల్స్ నెలవారీ వ్యూస్ వరుసగా 175 శాతం, 115 శాతం చొప్పున ఎగబాకాయి! షార్ట్ వీడియోలే ట్రెండింగ్... గత ఎన్నికల్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా డిజిటల్ మెసేజ్‌లను పార్టీలన్నీ బాగా వాడుకున్నాయి. ఇందుకోసం కొన్ని పారీ్టలైతే ఏకంగా 2 లక్షలకు పైగా వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసినట్లు రషీద్ చెబుతున్నారు! కానీ ఇప్పుడు నెటిజన్ల అభిరుచులతో పాటు ట్రెండ్ కూడా మారిపోయింది. ముఖ్యంగా 30 సెనక్ల కంటే తక్కువ నిడివిగల చిన్నపాటి వీడియో క్లిప్‌లకు భలే క్రేజ్ ఉంది. వాస్తవానికి ఈ ట్రెండ్ టిక్‌టాక్‌తో మొదలైంది. దాన్ని బ్యాన్ చేయడంతో యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టా రీల్స్ ఇప్పుడు దుమ్ము రేపుతున్నాయి. స్మార్ట్ ఫోన్ యూజర్లు భారీగా పెరగడం, డేటా చౌకగా లభించడం, మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెరగడం కూడా దీనికి ప్రధాన కారణాలే. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత చౌక డేటా ప్లాన్లు ఉన్న దేశాల్లో భారత్‌ది ఏడో స్థానం. స్మార్ట్ ఫోన్లోనే ఈజీగా కంటెంట్ క్రియేట్ చేయగల వీడియో ఎడిటింగ్ యాప్‌లు అందుబాటులోకి రావడం షార్ట్ వీడియోలకు బాగా కలిసొస్తోంది. కేవలం ఫొటో, మెసేజ్‌లతో కాకుండా చిన్న వీడియోలతో పారీ్టలు తమ అభిప్రాయాలను మరింత ప్రభావవంతంగా ఓటర్లకు చేరవేసేందుకు వీలవుతుండటం వల్లే యూట్యూబ్ ఈ ఎన్నికల్లో కీలక ప్రచార వేదికగా మారింది. అంతేగాక ప్రధాన టీవీ ఛానెళ్లలో ముఖ్యమైన ప్రజా సమస్యలకు తగిన కవరేజీ దక్కడం లేదని యూట్యూబ్ క్రియేటర్లు అంటున్నారు. దాంతో అలాంటి వార్తలు చూపించే యూట్యూబ్ ఛానెళ్లకు డిమాండ్ బాగా పెరుగుతోందని చెబుతున్నారు.రాజకీయ యాడ్లకూ తగ్గేదేలే... యూట్యూబ్ డిజిటల్ ప్రచార హవా పార్టీల అడ్వర్టయిజింగ్ వ్యయాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి మే 4 మధ్య బీజేపీ, కాంగ్రెస్ గూగుల్ యాడ్స్ కోసం కేవలం వీడియోలపైనే అత్యధిక నిధులను వెచి్చంచాయి. వివిధ ఫార్మాట్ల ద్వారా మెటా యాడ్స్‌కు ఖర్చు చేసిన దానికంటే ఇది మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. వీడియో కంటెంట్‌కు సంబంధించి కాషాయ పార్టీ గూగుల్ యాడ్స్‌కు రూ.50.4 కోట్లు ఖర్చు చేయగా, మెటా యాడ్స్‌కు రూ. 15.4 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇక కాంగ్రెస్ గూగుల్ యాడ్స్‌కు రూ.24.5 కోట్లు, మెటాకు రూ.8.1 కోట్ల చొప్పున వెచ్చించింది.యూజర్లు రయ్.. రయ్.. ఎన్నికల హడావుడి మొదలైన ఫిబ్రవరి నుంచి చూస్తే... చాలామంది నాయకులు, పారీ్టల యూట్యూబ్ సబ్‌్రస్కయిబర్లు 2 నుంచి ఏకంగా 4 రెట్లు పెరగడం విశేషం. వీరిలో రాఘవ్ చద్దా (ఆప్–4.2 లక్షల యూజర్లు), శివరాజ్ సింగ్ చౌహాన్ (బీజేపీ– 2.7 లక్షలు), రేవంత్ రెడ్డి (కాంగ్రెస్– 2.05 లక్షలు) వంటి నేతలు ప్రధానంగా ఉన్నారు. పారీ్టలపరంగా ప్రస్తుతం యూట్యూబ్‌లో ఆమ్ ఆద్మీ పారీ్టదే హవా! ఏకంగా 63.4 లక్షల సబ్స్రయిబర్లతో ఆప్ దేశంలోనే టాప్‌లో ఉంది. బీజేపీకి 59.1 లక్షల మంది యూజర్లుండగా కాంగ్రెస్ సబ్ర్స్కయిబర్ల సంఖ్య 48 లక్షలు.ఫేస్బుక్ టు యూట్యూబ్.. వయా వాట్సాప్! 2019 ఎన్నికల్లో డిజిటల్ ప్రచారానికి వాట్సాప్ ప్రధాన వేదికైంది. అదే సమయంలో నిజానిజాలతో పనిలేకుండా ఫేక్ న్యూస్ పెరిగిపోవడానికి కూడా ఇది కారణమైంది. వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ అయ్యే సమాచార ప్రామాణికతను చెక్ చేసే యంత్రాంగం లేకపోవడం ఈ మాధ్యమంపై బాగా ప్రతికూల ప్రభావం చూపింది. ఈ ప్రతికూలత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు వాట్సాప్‌లో మెసేజ్ ఫార్వార్డ్‌లను 5 యూజర్లకు పరిమితం చేయడం కూడా ఈ ప్లాట్‌ఫాం వినియోగానికి బ్రేక్ వేసిందనే చెప్పాలి. పైగా వాట్సాప్ ఫార్వార్డ్లు లేనిపోని సమస్యలు తెచి్చపెడుతుండటంతో ఈసారి ఎన్నికల ప్రచారంలో యూట్యూబ్ కీలక ప్లాట్‌ఫామ్‌గా ఆవిర్భవించిందని కంటెంట్ రీసెర్చర్ విజేత దహియా చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో యూట్యూబ్‌కు 50 కోట్ల మందికి పైగా యాక్టివ్ యూజర్లుండటం కూడా దీనికి ఊతమిస్తోంది. రాజకీయ విశ్లేషకులు, ప్రభుత్వ విధానాలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే విమర్శకులతో పాటు పారీ్టలు కూడా ఏడాదిగా యూట్యూబ్‌లో జోరు పెంచాయి. యూట్యూబ్‌లో తప్పుడు సమాచారాన్ని చెక్ చెసే యంత్రాంగం సమర్థంగా పని చేస్తుండటం కూడా పార్టీలు, నేతలు దీనికి అధిక ప్రాధాన్యమిచ్చేందుకు మరో కారణంగా నిలుస్తోంది. లైవ్ స్ట్రీమ్‌లను, ర్యాలీ వీడియోలను, ఇంటర్వ్యూలను యూజర్లకు చేరువ చేసేందుకు చాలామంది నేతలు తమ సొంత యూట్యూబ్ ఛానెల్స్‌ను ప్రారంభించారు. అంతేగాక డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లు, పాడ్కాస్టర్ల సహకారంతో నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారని రాజకీయ వ్యూహకర్త, డిస్కోర్స్ కన్సలి్టంగ్ సహ వ్యవస్థాపకుడు తల్హా రషీద్ పేర్కొన్నారు. ‘‘దశాబ్దకాలంగా సార్వత్రిక ఎన్నికల్లో పారీ్టల సోషల్ ట్రెండ్ రకరకాలుగా మారుతోంది. 2014లో ఫేస్బుక్ పేజీలను, ఈవెంట్లను పారీ్టలు బాగా వాడుకున్నాయి. ఆ ఎన్నిలకప్పుడు పోలింగ్ రోజున ఫేస్బుక్ అలర్టులు సైతం అందించింది’’ అని ఆయన గుర్తు చేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రోజులో ఒకసారైనా ఓపెన్ చేసే ఈ యాప్ గురించి తెలుసా..?
యూట్యూబ్.. దాదాపు ప్రతిఒక్కరు రోజులో కనీసం ఒకసారైనా ఈ యాప్ ఓపెన్ చేస్తారు. ఇంటర్నెట్పై పూర్తి అవగాహన లేనిరోజుల్లో అసలు వీడియోల ద్వారా కంటెంట్‌ను అందించాలనే ఆలోచన పుట్టడమే అప్పట్లో గొప్ప విషయం. ఆ ఆలోచనలో నుంచి పుట్టిన యూట్యూబ్ ప్రస్తుతం కోట్లమంది కంటెంట్ క్రియేటర్లకు జీవనాధారంగా మారుతోంది. వయసు భేదం లేకుండా కొత్త విషయాలు తెలుసుకునే వారికి దిక్సూచిగా ఉంటోంది. తమ ఉత్పత్తులు ప్రమోట్ చేయాలనుకునేవారికి సహాయపడుతోంది. అలాంటి యూట్యూబ్ ప్రస్థానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. -
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
ఒక నిమిషానికి దాదాపు 500 గంటల కంటెంట్‌ను అప్లోడ్ చేస్తున్న యూట్యూబ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఫిబ్రవరి 14, 2005లో పేపాల్‌లో పనిచేస్తున్న స్టీవ్ చెన్, చాడ్ హార్లీ, జావెద్ కరీం యూట్యాబ్‌ను రూపొందించారు.2005 ఏప్రిల్ 23న ‘మీ ఎట్ ది జు’ అనే వీడియోను మొదటగా అప్లోడ్ చేశారు.మే 2005లో యూట్యూబ్ బెటా సైట్‌ను ప్రారంభించారు.సెప్టెంబర్ 2005లో మొదటగా 1 మిలియన్ మంది వీక్షించిన వీడియా ‘నైక్’ యాడ్.నవంబర్ 2005లో మొదటగా 3.5 మిలియన్ డాలర్లతో సెకోయా క్యాపిటల్ పెట్టుబడి పెట్టింది.మార్చి 2006లో మొదటగా యూట్యూట్‌లో ప్రకటనలు ప్రారంభించారు.జులై 2006 వరకు సగటున రోజూ 100 మిలియన్ వీక్షణలు వచ్చాయి.అక్టోబర్ 9, 2006లో యూట్యూబ్‌ను 1.65 బిలియన్ డాలర్లకు గూగుల్ కొనుగోలు చేసింది.యూట్యూబ్ వీడియో అప్‌లోడర్లుకు 2007 నుంచి అవార్డులను ప్రకటిస్తోంది.2008లో యూట్యూబ్ సినిమాలు, టీవీ షోలను అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది.జనవరి 2010లో మూవీ రెంటల్ సర్వీస్‌ను తీసుకొచ్చింది.మార్చి 2010లో ఉచితంగా స్పోర్ట్స్ కంటెంట్ అప్‌లోడ్‌ను ప్రారంభించింది.మే 2010లో రోజూ సగటున 2 బిలియన్ వీక్షణలు వచ్చేవి.2011లో 3 బిలియన్ వీక్షణలకు చేరింది.జనవరి 2012లో రోజూ 4 బిలియన్ వ్యూస్ వచ్చేవి.2012లో ప్రతి నిమిషానికి 60 గంటల కంటెంట్ అప్లోడ్ అయ్యేంది. ప్రతినెల కొత్తగా 800 మిలియన్ల మంది యూట్యూబ్ చూసేవారు.మొదటగా 2012 డిసెంబర్ 21న 1 బిలియన్ వ్యూస్ వచ్చిన వీడియా.. ‘గంగనమ్ స్టైల్’.మార్చి 2013లో 1 బిలియన్ యూజర్ల మార్కును తాకింది.సుసాన్ వోజ్కి ఫిబ్రవరి 2014లో యూట్యూబ్ సీఈఓగా నియమితులయ్యారు.యూట్యూబ్ కిడ్స్ అని పిలువబడే మొబైల్ యాప్‌ను యూట్యూబ్ 2015లో విడుదల చేసింది.2017 ఫిబ్రవరి నాటికి ప్రతి నిమిషానికి 400 గంటల నిడివి ఉన్న కంటెంట్ అప్లోడ్ అయ్యేది.ఆగస్టు 2017లో సర్వీస్ ప్లే బటన్‌తో లోగోను రీడిజైన్ చేశారు.ఏప్రిల్ 3, 2018న కాలిఫోర్నియాలోని శాన్ బ్రూనోలో ఉన్న యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో కాల్పులు జరిగాయి.2019 నాటికి ప్రతి నిమిషానికి 500 గంటల నిడివి ఉన్న కంటెంట్ అప్లోడ్ అయ్యేది.పింక్‌ఫాంగ్ ఛానల్‌కు చెందిన బేబీ షార్క్ డ్యాన్స్ వీడియో వ్యూస్ జనవరి, 2022 నాటికి 1400 కోట్లు దాటి రికార్డు నెలకొల్పింది. 2016 జూన్‌లో ఈ వీడియో అప్లోడ్ చేశారు.ఇదీ చదవండి: గూగుల్‌లో 20 ఏళ్ళు.. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్అత్యంత వయసు కలిగిన యూట్యూబర్‌గా ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా గుడివాడ గ్రామానికి చెందిన కర్రి మస్తానమ్మ(107) రికార్డు నెలకొల్పారు.యూట్యూబ్‌లో 70 శాతం ట్రాఫిక్ మొబైల్ ఫోన్ల ద్వారానే వస్తోంది.96 శాతం టీనేజర్లు దీన్ని వినియోగిస్తున్నారు.91 దేశాల్లో ఇది సేవలందిస్తోంది.యూట్యూబ్ 80 భాషల్లో సేవలందిస్తోంది. దాదాపు 95 శాతం మంది తమ స్థానిక భాషలో వీడియోలు వీక్షించవచ్చు. -
Lok sabha elections 2024: దుమ్ము రేపుతున్న సోషల్ మీడియా
కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ సోషల్ మీడియా ప్రచారానికనర్హం! జనాలంతా ఆ స్థాయిలో ‘సోషల్’ జీవులుగా మారిపోయారు. అందుకే ఎన్నికల పోరులో పారీ్టలు కూడా సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. ప్రజల మూడ్‌తో పాటు క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని పసిగట్టేందుకు ‘లైక్ చేయండి.. షేర్ చేయండి.. సబ్ర్‌స్కయిబ్ చేసుకోండి’ అంటూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఎడాపెడా యాడ్లు కుమ్మరిస్తూ డిజిటల్ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. పలు పారీ్టలు లోక్‌సభ ఎన్నికల సీజన్లో సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి..! పదేళ్లుగా దేశాన్నేలుతున్న బీజేపీయే సోషల్ మీడియాలోనూ రాజ్యమేలుతోంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కొత్త యూజర్లను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ముందున్నాయి. ప్రస్తుత లోక్‌సభలో మూడో అతి పెద్ద పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్‌కు పెద్దగా సోషల్ ప్రాతినిధ్యం లేకపోవడం విశేషం. నేతల విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థులెవరకీ అందనంత ఎత్తులో మూడు లైక్‌లు.. ఆరు షేర్లు అన్నట్టుగా ‘సోషల్’ జర్నీలో దూసుకుపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పార్టీలు, నేతల సోషల్ మీడియా పేజీలు/ఖాతాల్లో యూజర్ల సంఖ్య పెరుగుదల, డిజిటల్ యాడ్ వ్యయాలు తదితరాలను ‘సోషల్ బ్లేడ్’ అనే ఎనలిటిక్స్ సంస్థ విశ్లేషించింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ‘ఎక్స్’ ఫ్యాక్టర్! సోషల్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ప్రతి పార్టీ నిలకడగా యూజర్లను పెంచుకుంటూ వస్తోంది. బీజేపీ ఎక్స్ ఖాతాకు గత మూడు నెల్లలో 4 లక్షల పైచిలుకు యూజర్లు జై కొట్టారు. కాంగ్రెస్ 2.37 లక్షల కొత్త ఫాలోవర్లను సాధించింది. ఆప్‌కు 12,000 మంది నయా యూజర్లు దక్కారు. టీఎంసీని కొత్తగా ఫాలో అయిన వారి సంఖ్య 9,800. మైక్రో బ్లాగింగ్‌కు కీలక వేదికగా నిలుస్తున్న ఈ సోషల్ వేదికలో బీజేపీకి ఏకంగా 2.18 కోట్ల ఫాలోవర్లున్నారు! కాంగ్రెస్‌ను 1.04 కోట్లు, ఆప్‌ను 65 లక్షల ఎక్స్ యూజర్లు ఫాలో అవుతున్నారు. టీఎంసీ మాత్రం 6.9 లక్షలతో వెనకబడి ఉంది. యూట్యూబ్‌లో ‘ఆప్’ షో పారీ్టల ప్రసంగాలు, ప్రచార వీడియోలు, మీడియా సమావేశాలకు కీలక వేదికగా నిలుస్తున్న యూట్యూబ్‌లో ఆప్ ‘చీపురు’ తిరగేస్తోంది. కొత్త సబ్్రస్కయిబర్లను పెంచుకోవడంలో ఆప్‌తో పాటు కాంగ్రెస్ కూడా ముందుండగా బీజేపీకి మాత్రం క్రమంగా తగ్గుముఖం పట్టారు. గత మూడు నెలల్లో కేజ్రీవాల్ పార్టీ ఏకంగా 5.9 లక్షల కొత్త యూజర్లను దక్కించుకుంది. లిక్కర్ స్కాం ఆరోపణలతో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం తెలిసిందే. ఒక్క మార్చిలోనే ఆప్ యూట్యూబ్ చానల్‌ను ఏకంగా 3.6 లక్షల మంది సబ్ర్‌స్కయిబ్ చేసుకున్నారు! బీజేపీ మాత్రం జనవరిలో 3 లక్షలకు పైగా కొత్త యూజర్లు జతయినా ఫిబ్రవరి, మార్చిల్లో భారీగా తగ్గారు. మొత్తమ్మీద 3 నెలల్లో బీజేపీ చానల్‌కు 5.3 లక్షలు, కాంగ్రెస్క 5 లక్షల మంది కొత్త యూజర్లు చేరారు. టీఎంసీ 28,000 మంది యూజర్లను సంపాదించింది. అయితే బీజేపీ వీడియోలను చూస్తున్న వారి సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. జనవరి–మార్చి మధ్య ఏకంగా 43.2 కోట్ల వీక్షణలు దక్కాయి. తర్వాతి స్థానంలో ఆప్ (30.78 కోట్లు), కాంగ్రెస్ (16.69 కోట్లు), టీఎంసీ (93 లక్షలు) ఉన్నాయి. 59.9 లక్షల సబ్స్క్రయిబర్లు, 10 వేలకు పైగా వీడియోలతో యూట్యూబ్‌ను ఆప్ ఊడ్చేస్తోంది. బీజేపీ యూట్యూబ్ చానల్ 58.2 లక్షల సబ్ర్‌స్కయిబర్లు, 41 వేల వీడియోలతో ‘టాప్’ లేపుతోంది. కాంగ్రెస్‌కు 44.8 లక్షలు, తృణమూల్‌ను 5.91 లక్షల మంది సబ్‌్రస్కయిబ్ చేసుకున్నారు. ఎదురులేని మోదీ... సోషల్ మీడియా వేదికేదైనా దేశంలోనే గాక ప్రపంచంలోనే తిరుగులేని నాయకునిగా మోదీ దుమ్మురేపుతున్నారు. భారత్‌లో ఏ నాయకుడూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు! గత మూడు నెలల్లో మోదీ ‘ఎక్స్’ యూజర్ల సంఖ్య 26 లక్షలు పెరిగి 9.73 కోట్లకు చేరింది. కేజ్రీవాల్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్ష పెరిగి 2.74 కోట్లుగా ఉంది. రాహుల్‌గాం«దీకి కొత్తగా 5 లక్షల మంది జతయ్యారు. ఆయన యూజర్ల సంఖ్య 2.54 కోట్లకు పెరిగింది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి స్వల్పంగా 52,000 మంది యూజర్లు దక్కారు. ఎక్స్‌లో ఆమెను 74 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇక ఎక్స్‌లో అత్యంత యాక్టివ్‌గా ఉండే రాజకీయవేత్తగా కూడా మోదీ నిలుస్తున్నారు. గత మూడు నెలల్లో మోదీ 1,367 పోస్టులు పబ్లిష్ చేశారు. కేజ్రీవాల్ 270, రాహుల్ 187 పోస్టులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇన్‌స్టాలోనూ మోదీకి ఏకంగా 8.85 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. అందులో గత మూణ్నెల్లలోనే 52 లక్షల మంది మోదీని కొత్తగా ఫాలో కావడం జెన్ జెడ్‌లోనూ ఆయన క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఇన్‌స్టాలో రాహుల్‌కు 68 లక్షలు, కేజ్రీవాల్‌కు 22 లక్షలు, మమతాకు కేవలం 3.84 లక్షల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు! ఇక యూట్యూబ్‌లోనూ మోదీదే హవా! 2.29 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఆయన సొంతం. రాహుల్ (44.7 లక్షలు), కేజ్రీవాల్ (7.58 లక్షలు) మోదీకి ఆమడ దూరంలో ఉన్నారు. గత మూడు నెలల్లో మోదీ చానల్లో పబ్లిషైన వీడియోలకు అత్యధికంగా 47.7 కోట్ల వ్యూస్ దక్కాయి! ఇది రాహుల్, కేజ్రీవాల్ వీడియోల కంటే రెట్టింపు కావడం విశేషం. ఇన్‌స్టా.. జెన్–జెడ్ ఓటర్ల ‘డెన్’ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్.. స్టోరీస్.. పోస్ట్‌లు.. లైవ్ వీడియోలతో చెలరేగిపోతున్న నవతరం యువత (జెనరేషన్ జెడ్)కు చేరువయ్యేందుకు పారీ్టలూ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా తొలిసారి ఓటేయనున్న యూత్‌కు అడ్డగా మారిన ఈ సోషల్ వేదికపై మరింతగా ఫోకస్ చేస్తున్నాయి. తాజా డేటా ప్రకారం మెటా ఫ్లాట్‌ఫాంలైన ఫేస్బుక్, ఇన్‌స్టా, వాట్సాప్‌ల్లో బీజేపీ, కాంగ్రెస్ గత నాలుగు నెలల్లో చేసిన యాడ్ వ్యయాల్లో సింహ భాగం ఇన్స్టాపైనే వెచి్చంచడం దీని ప్రాధాన్యానికి నిదర్శనం. గత మూడు నెలల్లో ఈ ప్లాట్‌ఫాంలో కాంగ్రెస్ 13.2 లక్షల మంది ఫాలోవర్లను పెంచుకోగా బీజేపీ (8.5 లక్షలు), ఆప్ (2.3 లక్షల)తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టీఎంసీకి 6,000 మంది కొత్త యూజర్లు దక్కారు. మొత్తం ఫాలోవర్ల విషయానికొస్తే, బీజేపీకి 76 లక్షలు, కాంగ్రెస్‌కు 43 లక్షలు, ఆప్‌కు 12 లక్షలు, తృణమూల్‌కు కేవలం 1.1 లక్షల మంది ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న డ్రైవర్: ఆనంద్ మహీంద్ర ఫిదా!
ప్రస్తుతకాలంలో ఏ వృత్తిలో ఉన్నా, ఆధునిక టెక్నాలజీని, ట్రెండ్‌ని పట్టుకోవడంలోనే ఉంది సక్సెస్. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, యూ ట్యూబ్ ప్రపంచానికి తన టాలెంట్ ఏంటో చూపించి సత్తా చాటుకున్నారు చాలామంది. ఇంటి వంట,ఇంటి పంట, గాత్రం,వ్యవసాయ క్షేత్రం ఇలా ఏదైనా చివరికి తమ రోజువారీ జీవితాల్లోని మామూలు అంశాలతో వైరల్ అయి పోతున్నారు. మట్టిలో మాణిక్యాల్లా యూట్యూబ్‌లో సంచలనం క్రియేట్ చేస్తున్నారు అలాంటి వారిలో ఒక ట్రక్ డ్రైవర్ విశేషంగా నిలుస్తున్నాడు. 1.47 మిలియన్ల యూట్యూబ్ సబ్స్క్రైబర్లతో నెటిజన్లుల చేత 'మాస్టర్‌చెఫ్' గా ప్రశంసలు పొందుతున్న కార్గో ట్రక్ డ్రైవర్ రాజేష్ రావాని గురించి తెలుసు కుందాం రండి. రాజేష్ రావాని ఒక ట్రక్ డ్రైవర్. వృత్తిపరంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ట్రక్ డ్రైవర్ నా జీవితంలో ఏముంది స్పెషల్ అనుకోలేదు. తన జీవితం నుంచే ఏదో సాధించాలనుకున్నాడు. ఇదే అతని జీవితాన్ని మార్చింది. సాధారణంగా సుదూర ప్రాంతాలకు వస్తువులను రవాణా చేసే వెళ్లే లారీ, ట్రక్ డ్రైవర్లు రోజుల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకే వారుమధ్యలో ఎక్కడో ఒక చోట ఆగి వండుకొని తినేలా ఏర్పాటు చేసుకుంటారు. కానీ రాజేష్ రావాని ఇంకొంచెం స్పెషల్. తనకొక స్పెషల్ కిచెన్ క్రియేట్ చేసుకుని నచ్చిన వంటల్ని, రుచికరంగా వండుకుని ఆస్వాదిస్తూ ఉంటాడు. దీన్నే స్మార్ట్‌ఫోన్ ద్వారా వీడియో తీసి పోస్ట్ చేయడం షురూ చేశాడు. దీనికి కొడుకుల సాయం తీసుకున్నాడు. రాజేష్‌కు ఇద్దరు కుమారులు సాగర్, శుభం. వీరే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి ప్రోత్సహించారని ఒకసారి నెటిజన్లుతో పంచుకున్నాడు. ముఖ్యంగా సాగర్ వీలైనప్పుడు ట్రక్కుపై అతనితో పాటు వీడియోలు చిత్రీకరిస్తూ, ఎడిట్ చేస్తూ ఉంటాడని చెప్పాడు. "యూట్యూబ్ అంటే ఏమిటో కూడా తెలియదు, అబ్బాయిలే ఛానెల్‌ని ప్రారంభించారని వెల్లడించాడు. వివిధ రాష్ట్రాలకు చెందిన పదార్థాలతో ప్రయోగాలు చేస్తూండటంతో స్పందన బాగా వచ్చింది. 2021 ఏప్రిల్‌లో తన సొంత YouTube ఛానెల్, Instagram పేజీని ప్రారంభించాడు. ఇక అక్కడినుంచి వెనుదిరిగి చూడలేదు. తన వెళ్లే ప్రదేశాలు, వండుకునే సూపర్ వంటకాలు, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, మఠర్ పనీర్ ఫ్రైడ్ రైస్ ఇలా ఒకటీ రెండూకాదు రోడ్డు పక్కన జరిగిన సంఘటనలు,ఎన్నోఅద్భుతాలు వీడియోల ద్వారా నెటిజనులకు పరిచయం చేశాడు. ప్రతీ వీడియోకు లక్షలకు పైగా వ్యూస్. సబ్స్క్రైబర్లు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చారు. 786 వీడియోలు చేశాడు. 50, 60 లక్షల వ్యూస్ వచ్చిన వీడియోలున్నాయటే రాజేష వీడియోల క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. View this post on Instagram A post shared by R_ Rajesh (@r_rajesh_07) ఆర్ రాజేష్ వ్లాగ్స్ ఛానెల్‌తో సెలబ్రిటీగా మారిపోయాడు. అంతేకాదు ఆయన భాష కూడా నిజంగా సూపర్ చెఫ్లాగా ఉండటంతో ఫాలోయింగ్ బాగా పెరిగింది. దీంతో "మాస్టర్‌చెఫ్" , బెస్ట్ ఫుడ్ వ్లాగర్" గా పాపులర్ అయ్యాడు. అంతేకాదు నెటిజన్లు అతని ట్రక్కును "ఫైవ్ స్టార్ రెస్టారెంట్" లేదా "చల్తా ఫిర్తా దాభా" అని పిలవడం విశేషం. ఇంకో విశేషం ఏమిటంటే డ్రైవర్లు నిర్జన ప్రదేశంలో ట్రక్ చెడిపోయినప్పుడు, చెత్త రోడ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా సమస్య వస్తే మరమ్మత్తు ఎలా చేసుకోవాలి లాంటివాటితో పాటు తన ట్రక్కు నుండి డ్రోన్ షాట్‌ను పోస్ట్ చేశాడు. హైదరాబాద్ నుండి పాట్నాకు వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్‌ను చూపించింది. ఈ క్లిప్‌కి ఐదు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.ఇన్‌స్టాగ్రామ్‌లో అతని వంటకాలు, వీడియోలు బాగా ఆకట్టుకుంటాయి. ఎనిమిది లక్షలకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లున్నారు. దీంతో సంపాదన కూడా బాగానే ఉంది. రాజేష్ కుమారుడు కూడా తోడయ్యాడు. ఈ క్రమంలోనే ఇపుడొక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు ఇద్దరూ. కొత్త ఇంటిపార్టీ వీడియోను కూడా అప్లోడ్ చేశాడు. రాజేష్ సక్సెస్ జర్నీని పారిశ్రామికవేత్త ఆనంద్మహీంద్రను బాగా ఆకట్టుకుంది. మండే మోటివేషన్ను అంటూ రాజేష్ స్టోరీని ట్విటర్లో షేర్ చేశారు. 25 సంవత్సరాలకు పైగా ట్రక్ డ్రైవర్‌గా ఉన్న రాజేష్ రావాని, తన వృత్తికి ఫుడ్ & ట్రావెల్ వ్లాగింగ్ యాడ్ చేసి ఇపుడొక ఇంటి వాడయ్యాడు అంటూ ట్వీట్ చేశారు. -
రహస్య ప్రాజెక్ట్.. ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు
Facebook Secret Project: మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్‌చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్ క్రంచ్’ కథనం ప్రకారం.. స్నాప్‌చాట్ (Snapchat) యాప్‌కి, తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్‌ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్‌బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్ బిహేవియర్‌ను అర్థం చేసుకోవడానికి, స్నాప్‌చాట్‌పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ ఈ చొరవను రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్‌లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్నాప్‌చాట్‌లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్డొమైన్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది. -
వీడియో క్రియేటర్లకు పెద్దదెబ్బ.. యూట్యూబ్ కొత్త నిబంధన..?
రోజంతా ఏదో సమయంలో యూట్యూబ్ చూడకుండా ఉండని వారుండరంటే అతిశయోక్తి కాదు. ట్రైలరనో, టీజరనో.. ఎంటర్టైన్మెంట్ వీడియోలకోసమో, ఇన్ఫ్లూయెన్సర్ల షార్ట్స్ కోసమో.. రివ్యూలకనో, ప్రముఖుల వ్యూస్కనో.. మనం నిత్యం యూట్యూబ్‌పై ఆధారపడుతుంటాం. అయితే అలా వస్తున్న కంటెంట్‌లో నిజమెంత..? ఆ కంటెంట్‌లోని ఫొటోలు, వీడియో క్లిప్‌లు, వాయిస్‌లు నిజంగా ఆ వీడియో అప్లోడర్లవేనా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేలా యూట్యూబ్ కొత్త నియమావళిని తీసుకురాబోతుంది. కృత్రిమ మేధ(ఏఐ) పురోగమిస్తున్నందున అది తయారుచేసే కంటెంట్‌పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కంటెంట్‌కు సంబంధించి వాస్తవాలు ఎంతనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏఐ సృష్టిస్తున్న సమాచారాన్ని ఎలా నిర్ధారించాలో ఒకింత సవాలుగా మారుతోంది. ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్‌ల రూపంలో ఏఐ మోడల్‌ల ద్వారా వచ్చిన డేటాను స్పష్టంగా గుర్తించడంలో కేంద్రం సైతం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా యూట్యూబ్ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఆ వార్తల సారాంశం ప్రకారం.. కృత్రిమ మేధతో రూపొందించిన వీడియోలకు సంబంధించి యూట్యూబ్ నియమాలను ప్రకటించనుంది. యూట్యూబ్‌లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసేముందు కొన్ని జనరేటివ్ ఏఐ క్లిప్‌లు, వాస్తవికతకు దగ్గరగా ఉండే కృత్రిమంగా సృష్టించిన వీడియోలను జోడిస్తుంటారు. వీక్షకులు దాన్ని ఇన్ఫ్లూయెన్సర్ల నిజమైన కంటెంట్ అని భ్రమపడే అవకాశం ఉంది. అలాంటి వారు ఇకపై తమ వీడియోలకు లేబులింగ్ ఇవ్వాలని యూట్యూబ్ కొత్త నియమాల్లో పేర్కొననుంది. వీడియో ఫుటేజీలో మార్పులు చేస్తున్నవారు, ఇతర పద్ధతుల్లో వాడుకుంటున్నవారు, రియల్ వాయిస్నుమర్చి సింథటిక్ వెర్షన్లను వినియోగిస్తున్నవారు తమ వీడియోలో లేబుల్‌ని చేర్చాల్సి ఉంటుంది. వీడియోలోని కంటెంట్ మార్పులు, ఫుటేజీ వివరాలు, సింథటిక్ అంశాలను పేర్కొంటూ విజువల్స్ రూపంలో లేదా వీడియో డిస్క్రిప్షన్ రూపంలో ఇవ్వాలి. లేదంటే వాయిస్ రూపంలో అయినా తెలియజేయాలి. ఇదీ చదవండి: బ్యాటరీ కనిపించకుండా ఫోన్ల తయారీ.. ఎందుకో తెలుసా.. ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే యూట్యూబ్ చర్యలు తీసుకోబుతున్నట్లు తెలిసింది. ఈ నిబంధనలు మొబైల్ యాప్, డెస్క్‌టాప్, టెలివిజన్ ఇంటర్ఫేస్ వినియోగదారులందరికీ వర్తింపజేయనుంది. వార్తలు, ఎన్నికలు, ఫైనాన్స్, ఆరోగ్యం వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన కంటెంట్‌లో మరింత అప్రమత్తంగా ఉండేందుకు యూట్యూబ్ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. -
యూట్యూబ్ టీవీకి పోటీగా ఎక్స్ టీవీ యాప్!
ఎక్స్.కామ్ బాస్ ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూట్యూబ్ టీవీకి పోటీగా త్వరలో అమెజాన్, శామ్సంగ్ వినియోగదారుల కోసం టీవీ యాప్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఫార్చ్యూన్ మ్యాగజైన్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చాయి. దీనిపై స్పందించిన మస్క్ స్మార్ట్ టీవీల్లో లాంగ్ ఫార్మ్ వీడియోలు త్వరలో అందుబాటులో తెస్తామని ప్రకటించారు. గతంలో ఎక్స్.కామ్‌ను ఎవ్రీథింగ్ యాప్ మార్చే యోచనలో ఉన్నట్లు మస్క్ వెల్లడించారు. అందుకు అనుగుణంగా యాప్‌లో నగదు లావాదేవీల సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత గత అక్టోబర్‌లో ఎంపిక చేసిన వినియోగదారుల కోసం వీడియో, ఆడియో కాలింగ్ ప్రారంభ వెర్షన్‌ను విడుదల చేశారు. Coming soon https://t.co/JlnlSL7eS9 — Elon Musk (@elonmusk) March 9, 2024 ఇప్పుడు టీవీల్లో ఎక్స్.కామ్ టీవీ యాప్‌ను తెచ్చే పనిలో ఉన్నారు. ఇదే విషయంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు మస్క్ క్లారిటీ ఇచ్చారు. త్వరలో వచ్చేస్తుంది. ఎక్స్.కామ్‌లోని లాంగ్ వీడియోలు టీవీల్లో చూసే వెసలు బాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. -
Siraj collection and Vlogs: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు...
యూట్యూబ్ ‘సిల్వర్ ప్లే బటన్’ను సొంతం చేసుకోవడం అనేది అంత వీజీ కాదు. లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ ప్రతిష్ఠాత్మకమైన సిల్వర్ ప్లే బటన్ సొంతం అవుతుంది. అయితే పాకిస్థాన్‌లోని గిల్గిత్–బల్టిస్థాన్ ప్రాంతంలోని ఖప్లూ నగరానికి చెందిన మహ్మద్ సిరాజ్ అనే పిల్లాడు మాత్రం తన యూట్యూబ్ చానల్ ‘సిరాజీ విలేజ్ వ్లోగ్స్’తో ‘సిల్వర్ ప్లే బటన్’ను అవలీలగా సాధించాడు. సిరాజ్ చానల్‌కు లక్షమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. చెల్లి ముస్కాన్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సిరాజ్ చేసిన వీడియోలు పాపులర్ అయ్యాయి. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్‌ను సిరాజ్ అన్బాక్సింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. -
మృణాల్ అలాంటి పిలుపు.. ఏం కావాలంటోన్న విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం'ఫ్యామిలీ స్టార్'. పరశురామ్ పెట్ల డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ టీజర్ నంబర్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. అంతే కాకుండా మృణాల్ ఠాకూర్ క్యూట్‌గా విజయ్ను పిలుస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఏవండీ.. ఏవండీ.. అంటూ మృణాల్ పిలవగా.. ఆ.. ఏం కావాలి? అంటూ మన హీరో రిప్లై ఇచ్చాడు. దీనికి మృణాల్ నవ్వులు చిందిస్తూ చిందులు వేస్తూ కనిపించింది. మృణాల్ అలా ప్రేమగా పిలవడంతో మా సెట్ వెలిగిపోతోందంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో మీరు చూసేయండి. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. #FamilyStar trending at No 1 ❤️ And @mrunal0801 is glowing in your love and lighting up our set with “THE PILUPU”https://t.co/gRbhprx4rV pic.twitter.com/D4d8u17jgR — Vijay Deverakonda (@TheDeverakonda) March 5, 2024 -
ప్రపంచ టాప్ కంపెనీలో నోటీసు లేకుండా ఉద్యోగాల తొలగింపు..
టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగాల తొలగొంపునకు పూనుకుంటున్నాయి. అందులో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అన్ని సంస్థలో భాగమవుతున్నాయి. తాజాగా ప్రపంచంలోనే టాప్ కంపెనీగా ఉన్న గూగుల్‌కు చెందిన యూట్యూబ్ మ్యూజిక్ విభాగం నుంచి 43 మందికి ఉద్యోగాల నుంచి ఉద్వాసన పలికారు. యూట్యూబ్ మ్యూజిక్‌లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న 43 మంది ఉద్యోగులు మెరుగైన వేతనం, ఇతర ప్రయోజనాలు అడిగినందుకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు కొన్ని మీడియా కథనాల్లో ప్రచురితమైంది. ఆ ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన గూగుల్‌లో, సబ్‌కాంట్రాక్ట్‌గా కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్నారు. అయితే ఈ తొలగింపులకు గూగుల్ బాధ్యత వహించదని తెలిపింది. బాధితుల్లో ఒకరైన యూట్యూబ్ డేటా అనలిస్ట్ జాక్ బెనెడిక్ట్ గూగుల్‌తో లేఆఫ్స్‌కు సంబంధించి యూనియన్ చర్చలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇదీ చదవండి: యూపీఐ సేవల్లోకి ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఈ అంశంపై జాక్ బెనెడిక్ట్ మాట్లాడుతూ ఉద్యోగులకు తమ తొలగింపుల గురించి ఎలాంటి ముందస్తు నోటీసు రాలేదని చెప్పారు. గూగుల్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ కంపెనీ ముందుగా చేసుకున్న ఒప్పందాలు గడువులోపు ముగుశాయన్నారు. తొలగింపులు తమ వ్యాపార కార్యకలాపాల్లో ఒక భాగమని చెప్పారు. అయితే తొలగించిన ఉద్యోగులకు కంపెనీలో ఇతర స్థానాలను కల్పించేలా ఏడు వారాల గడువు ఉంటుందని తెలిసింది. -
స్తంభించిన యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్ల గగ్గోలు!
ప్రముఖ ఉచిత వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ (YouTube) కొద్దిసేపటి నుంచి కంటెంట్ క్రియేటర్లకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీంతో కంటెంట్ క్రియేటర్లు గగ్గోలు పెడుతూ యూట్యూబ్ సమస్యను సోషల్ మీడియాలోకి తీసుకొచ్చారు. వివిధ వెబ్సైట్లు, సర్వీస్ స్టేటస్ గురించి యూజర్లకు రియల్ టైమ్ సమాచారాన్ని అందించే ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ డౌన్‌డెటెక్టర్ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ సమస్య తలెత్తినట్లు వేల సంఖ్యలో క్రియేటర్లు తెలియజేశారు. తమ దగ్గరున్న వీడియోలను అప్లోడ్ చేసినా.. అవి రియల్‌టైంలో యూజర్లకు కనిపించడం లేదని తెలిపారు. ఏం జరిగిందంటే.. డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. 80 శాతం మంది క్రియేటర్లు యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేయడంలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించారు. అయితే ఈ సమస్య కేవలం భారతీయ యూజర్లలకు మాత్రమే తలెత్తిందా లేదా ప్రపంచవ్యాప్తంగా ఇలా జరిగిందా అనేది తెలియరాలేదు. ప్రధానంగా న్యూస్ ఛానళ్ల నుంచి ఫీడ్/ వీడియోలు/ లైవ్ రాకపోవడంతో యూజర్లు ఇబ్బంది పడ్డారు. అలాగే కంటెంట్‌ను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించే క్రియేటర్లు కూడా దీనిపై యూట్యూబ్‌కు సర్వీస్ రిక్వెస్ట్‌లు పంపించారు. వర్కింగ్ డే కావడం, అందునా భారతీయ కాలమానం ప్రకారం పీక్ టైంలో ఇలాంటి సమస్య రావడంతో యూట్యూబ్ ఆధారిత వ్యవస్థలు ఇబ్బంది పడ్డాయి. Any YouTube Server Down or any other issues please clarify I go live and upload shorts but nothing shown in channel and yt studio #YouTubeDown @YouTubeCreators @YouTubeIndia https://t.co/qnIvSd0OiV — Nithish R Yuvirosk (@OneNimitPlzz_NR) February 27, 2024 -
YouTube: మీకు మీరే బాస్
ఒక్క వీడియో వైరల్‌గా మారినా.. లక్షలాది రూపాయలు వచ్చి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. యూజర్లు నచ్చే, మెచ్చే అలాంటి వీడియోలను మరిన్ని అందిస్తూ వెళితే మంచి పేరు, గుర్తింపు, ఐశ్వర్యం సంపాదించుకోవచ్చు. ఇదంతా యూట్యూబ్ ప్రపంచం గురించే. నేడు వయసుతో సంబంధం లేకుండా యూట్యూబర్ కావాలనే అభిలాష చాలామందిలో కనిపిస్తోంది. యూట్యూబ్ కంటెంట్ ద్వారా దండిగా ఆదాయాన్ని సంపాదించుకోవాలన్న కాంక్ష కూడా కనిపిస్తోంది. కానీ ఎలా..? ఎలాంటి సందేహం వచి్చనా, ఆరోగ్యం లేదా ఆహారం, విద్య, వృత్తి, వినోదం, విహారం, యోగాభ్యాసం ఇలా అన్నింటికీ చిరునామాగా యూట్యూబ్ మారిపోయింది. ఎలాంటి సమాచారం కావాలన్నా కళ్ల ముందుంచుతుంది. వీక్షకులకు కావాల్సినంత సమాచారం, వినోదం. పంచే వారికి పండంటి ఆదాయం. ప్రపంచవ్యాప్తంగా 27 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు 2023లో వారంలో 17 గంటల చొప్పున వీడియోలను వీక్షించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. నేడు ఎక్కువ మంది సమాచారాన్ని వీడియోల రూపంలోనే పొందుతున్నారు. కనుక యూట్యూబ్ వినోదం లేదా సమాచార వేదికగానే మిగిలిపోవడం లేదు. ఉపాధిని వెతుక్కునే అవకాశాలకు చిరునామాగా మారిపోయింది. ప్రతి నెలా రూ.లక్షలాది రూపాయలు సంపాదించే తెలుగు యూట్యూబర్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరిగా చేరిపోవాలంటే..? ఏమి కావాలి..? ఎలాంటి పెట్టుబడి లేకుండా యూట్యూబ్ చానల్ ఆరంభించడం చాలా మందిని ఆకర్షిస్తున్న అంశం. ఓ మంచి ఫోన్, ల్యాప్‌టాప్, వీడియో ఎడిటింగ్ టూల్ (ఉచిత), రూ.150 పెట్టుబడితో వచ్చే మైక్ ఉంటే చాలు. ఇక్కడ ధన పరమైన పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. ప్రయత్నం, కృషి, అంకిత భావం వంటి వనరులు కావాలి. వీలైనంత సమయాన్ని వెచి్చంచాలి. ‘‘నేను నా కుటుంబంతో గడిపే దానికంటే పది రెట్లు అధిక సమయాన్ని యూట్యూబ్ కోసం ఆరంభంలో వెచ్చించాల్సి వచ్చేది. వీడియో చేయాలంటే అందుకు సంబంధించిన కంటెంట్ (సమాచారం) సిద్ధం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత వీడియో షూట్ చేసి, ఎడిటింగ్ అనంతరం పబ్లిష్ చేయాలి. ఇందుకు ఎంతో సమయం పట్టేది. ప్రతిరోజూ ఒక వీడియో అంటే అది అసాధ్యం. దీనికంటే వారానికి రెండు, మూడు వీడియోలకు కుదించుకోవడం మంచిది. ప్రతి సోమవారం, శుక్రవారం సాయంత్రం నిర్ధిష్ట సమయంలో వీడియోలను అప్లోడ్ చేయడం వల్ల యూజర్లకు మరింత చేరువ కావచ్చు’’అని యూట్యూబర్ రతీష్ (‘రతీష్‌ఆర్‌మీనన్’) తెలిపారు. వ్యక్తిగతంగా ఒక నెలలో 8 వీడియోలకు మించి చేయడానికి సమయం సరిపోదన్నది అతడి అభిప్రాయం. బాగా పాపులర్ అయి, సబ్ర్‌స్కయిబర్లు మిలియన్ దాటిపోతే, అప్పుడు సహాయకులను పెట్టుకుని పూర్తి స్థాయి యూట్యూబర్‌గా మరిన్ని వీడియోలు చేయడాన్ని పరిశీలించొచ్చు. కానీ, ఆరంభంలో పరిమాణం కాకుండా, నాణ్యతకు పెద్దపీట వేయాలి. యూజర్లతో బలమైన బాండింగ్ అవసరం. ఆరంభం ఇలా.. ► 18 ఏళ్లు నిండి, భారత్‌లో నివసించే స్థానికులు ఎవరైనా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (వైపీపీ)లో నమోదుకు అర్హులే. చానల్ ప్రారంభించి వీడియోల పోస్టింగ్ అనంతరం ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ► వైపీపీలో చేరాలంటే కనీస చందాదారులను సంపాదించి ఉండాలి. ‘నోటిఫై మీ వెన్ ఐ యామ్ ఎలిజబుల్’ నోటిఫికేషన్ అలర్ట్ పెట్టుకుంటే చాలు. మీ చానల్‌కు అర్హత లభించిన వెంటనే యూబ్యూబ్ నుంచి ఆహా్వనం వస్తుంది. ► ఒక్కసారి మీ చానల్ వైపీపీ కోసం ఎంపిక అయిందంటే అప్పుడు నియమ, నిబంధనలకు అంగీకరిస్తూ, మానిటైజేషన్ ఫీచర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా పని చేస్తుంది..? యూట్యూబ్‌లో వీడియోలను పోస్ట్ చేయాలంటే అందుకు సంబంధించి నియమ, నిబంధనలు తెలిసి ఉండాలి. అశ్లీల, హానికారక, తప్పుదోవ పట్టించే, అవాస్తవ, కల్పిత సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదు. చట్టబద్ధంగా వ్యవహరించాలి. వీడియోలు పోస్ట్ చేసే విషయంలో పరిమితి లేదు. వాటిపై ఆదాయం కోరుకునేట్టు అయితే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (వైపీపీ) కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మానిటైజేషన్ ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకోవాలి. యూట్యూబ్ చానల్‌కు ఎంత మంది సబ్‌్రస్కయిబర్లు (సభ్యులు) ఉన్నారనేది ఇక్కడ కీలకం అవుతుంది. ఒకరు ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్ మాడ్యూల్ ఆధారంగా ఆర్జించే మొత్తం ఆధారపడి ఉంటుంది. ‘‘ఆవిష్కరణలకు యూట్యూబ్ మద్దతు పలుకుతుంది. సృజనాత్మకత ఎలా ఉన్నా సరే దాన్ని యూజర్లకు చేరువ చేసి వారికి తగిన ప్రతిఫలం అందించడమే మా లక్ష్యం. భారత్‌లో 2008లో పార్ట్నర్ (భాగస్వామి) కార్యక్రమాన్ని ప్రారంభించాం. వీడియో క్రియేటర్లు కంటెంట్ ద్వారా ఆర్జించడం మొదలైంది. క్రియేటర్ల విజయంపైనే ప్రకటనల ఆదాయం ముడిపడి ఉంటుంది’’అని యూట్యూబ్ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ వివరించారు. చానల్ సక్సెస్ కోసం..? ఏదైనా ఒక రంగం/విభాగం/సబ్జెక్ట్/కళలో నైపుణ్యాలు ఉంటే, దాన్ని యూజర్లకు అందించొచ్చు. మంచి సృజనాత్మకత ఉండాలి. లేదా సాధారణ విషయాలను సైతం కళాత్మకంగా పంచుకునే నైపుణ్యాలు కావాలి. విలువైన, ఉపయోగకరమైన కంటెంట్‌తో వీడియోలు పోస్ట్ చేయడమే కాదు.. వినూత్నంగా ఉండేలా చూసుకోవాలి. మీ ఛానల్ నుంచి కొత్త వీడియోలు ఎప్పుడు పోస్ట్ అవుతాయనే స్పష్టత యూజర్లలో ఉండాలి. రోజుకు ఒకటా? వారానికి ఒకటా లేదా రెండా..? ఏ సమయంలో వస్తుందనే స్పష్టత ఇవ్వాలి. వీడియోలను పోస్ట్ చేసిన తర్వాత వీక్షకులతో అనుసంధానం కావాలి. వీలైతే కామెంట్లను చదివి, వారి అభిప్రాయాలు అర్థం చేసుకోవడం, వారికి నచ్చేలా కంటెంట్‌ను అందించడంపై దృష్టి పెట్టాలి. వీలు చేసు కుని సబ్్రస్కయిబర్లతో చాట్, సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల బాండింగ్, బ్రాండింగ్ పెరుగుతుంది. అనలైసిస్ టూల్ వాడు కోవాలి. ఆరంభంలో ప్రయోగాలకు వెనుకాడకూడదు. సమయం చాలడం లేదని నాణ్యతలో రాజీపడకూడదు. మరింత మంది యూజర్లను చేరుకునేందుకు, అప్పటికే పాపులర్ అయిన యూట్యూబర్ల సాయం తీసుకోవచ్చు. యూజర్లను పెంచుకునే విషయంలో యూట్యూబ్ సైతం కావాల్సినంత సహకారం, మద్దతును అందిస్తుంది. యూజర్లకు చేరువ అయితే, ఆదాయం అదే వస్తుంది. ఆదాయం ఏ రూపంలో..? యూట్యూబ్‌లో కొత్తగా చేరిన వారు ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు. చానల్ సభ్యులు నెలవారీగా చెల్లించే మొత్తం నుంచి కొంత యూట్యూబ్ పంచుతుంది. సూపర్ చాట్, సూపర్ స్టికర్స్ కోసం సభ్యులు చెల్లింపులు చేస్తారు. బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి మన్దీప్ సింగ్ 2021లో ‘డేటాసైన్స్డైరీస్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచాడు. కృత్రిమ మేధకు సంబంధించి కంటెంట్‌ను ఇది అందిస్తుంటుంది. చందాదారులు కేవలం 1,500 మందే ఉన్నారు. దీంతో ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్ ద్వారా ప్రతి నెలా కొన్ని వేల రూపాయల చొప్పున ఆదాయం సంపాదించే వాడు. అదే ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ రతీష్ ఆర్ మీనన్ ‘రతీష్‌ఆర్‌మీనన్’ పేరుతో 2012 నుంచి చానల్ నడుపుతుండగా, ప్రస్తుతం చందాదారులు 11.2 లక్షలకు చేరుకున్నారు. మూడు మార్గాల ద్వారా అతడికి ఆదాయం వస్తోంది. యూట్యూబ్ ప్రకటనల ఆదాయంతోపాటు, స్పాన్సర్డ్ ప్రకటనలు, అఫిలియేట్ మార్కెటింగ్ కమీషన్ ద్వారా ఆదాయం వస్తోంది. ఇందులో యూట్యూబ్ ప్రకటనల ఆదాయం ఒక్కటే నేరుగా యూట్యూబ్ నుంచి వచ్చేది. మిగిలిన రెండూ థర్డ్ పారీ్టల రూపంలో వస్తుంది. స్పాన్సర్డ్ ప్రకటనలకు సంబంధించి కంపెనీలు, బ్రాండ్లతో నేరుగా సంప్రదింపులు నిర్వహించుకోవచ్చు. ఇక అఫిలియేట్ మార్కెటింగ్ అంటే.. చానల్ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ఎవరైనా ఉత్పత్తిని కొనుగోలు చేస్తే వచ్చే ఆదాయం. ఉదాహరణకుఒక ఉత్పత్తికి సంబంధించిన యూఆర్ఎల్ లింక్‌ను వీడియో డి్రస్కిప్షన్లో ఉంచడం. ఎవరైనా యూజర్ ఆ లింక్‌ను క్లిక్ చేసి, సంబంధిత ఉత్పత్తి కొనుగోలు చేస్తే, దానిపై 2–5 శాతం కమీషన్‌గా లభిస్తుంది. ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్లో తనకు వచ్చే ఆదాయం నుంచి 70 శాతాన్ని యూట్యూబ్ చెల్లిస్తుంది. షార్ట్‌లకు సంబంధించి వ్యూస్ ఆధారంగా (ఎంత మంది వీక్షించారు) ఆదాయంలో 45 శాతాన్ని చెల్లిస్తుంది. వీడియోల్లో ప్రదర్శించే ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంలో 55 శాతాన్ని చెల్లిస్తుంది. యూట్యూబ్‌కు ప్రీమియం మెంబర్షిప్ ద్వారా కూడా ఆదాయం వస్తుంటుంది. ఈ ఆదాయంలోనూ కొంత వాటాను.. ఛానల్ కంటెంట్‌ను ఏ మేరకు యూజర్లు చూశారనే దాని ఆధారంగా యూట్యూబర్‌కు పంచుతుంది. రెగ్యులర్ ఆదాయానికి ప్రత్యామ్నాయమా..? తమ కంటెంట్‌కు ప్రపంచవ్యాప్త వీక్షకులు యూట్యూబ్ వల్లే సాధ్యమైనట్టు మెజారిటీ యూట్యూబర్లు అంగీకరిస్తున్నారు. కంటెంట్ ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం లభించినట్టు 80 శాతం మంది చెబుతున్నారు. ఇతర వృత్తి, ఉద్యోగాన్ని విడిచి పెట్టేసి యూట్యూబ్‌ను ప్రధాన ఆదాయ మార్గంగా చేసుకుందామని అనుకుంటున్నారా..? ఆచరణలో అదంత సులభమైన పని కాదు. యూట్యూబ్ ప్రపంచంలో ప్యాసివ్ ఆదాయం కోసం (రెండో ఆదాయ మార్గం) చానళ్లను నడిపిస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. తమ కంటెంట్‌కు ఆదరణ వస్తూ, ఆదాయం పెరిగిన తర్వాత, పూర్తి స్థాయిలో యూట్యూబర్‌గా మారుతున్నారు. కనుక ప్రస్తుతం చేస్తున్న వృత్తి లేదా వ్యాపారం లేదా జాబ్ కొనసాగిస్తూనే.. తమకున్న ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగా యూట్యూబ్ ఛానల్‌ను ఆరంభించి, ఖాళీ సమయాన్ని కంటెంట్ క్రియేషన్‌పై వెచి్చంచడం మంచి ఆలోచన అవుతుంది. యూజర్లను ఎలా ఆకర్షించాలి, ఆదాయం ఎలా పెంచుకోవాలి? తదితర విషయాలన్నీ తెలియడానికి కొంత వ్యవధి తీసుకుంటుంది. కనుక అప్పటి వరకు ఇతర ఆదాయ మార్గాలను ఎందుకు కాదనుకోవాలి. ఒకవైపు వృత్తి లేదా ఉద్యోగం చేస్తూ, మరోవైపు యూట్యూబ్ వీడియోల కోసం కావాల్సినంత సమయాన్ని వెచి్చంచడం కూడా కష్టమైన టాస్కే. అందుకే ఆరంభంలో కాస్తంత సమతుల్యం చేసుకుని, ఆ తర్వాత ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి. సమయాన్ని పొదుపుగా వినియోగించుకున్న వారికే ఇది సాధ్యపడుతుంది. అసలు వీలు చేసుకోవడమే పెద్ద సమస్య అని కార్పొరేట్ ట్రైనర్ అయిన నిధి సైని పేర్కొన్నారు. ‘నిధిసైని2808’ పేరుతో ఆమె 2020లో యూట్యూబ్ చానల్ ప్రారంభించింది. 2,690 మంది యూజర్లే ఉన్నారు. అయినా కానీ తన చానల్‌ను మానిటైజ్ (ఆదాయం పొందడం) చేసుకోలేదు. కంటెంట్‌ను అందించేందుకు తగినంత సమయాన్ని వెచి్చంచలేనన్నది ఆమె అభిప్రాయం. కనీసం 1,000 మంది సబ్ర్‌స్కయిబర్లు, 4,000 గంటల వాచ్ అవర్స్ (గడిచిన ఏడాది కాలంలో) ఉంటే ఆదాయం పొందడానికి మార్గం ఏర్పడినట్టేనని రతీష్ అంటున్నారు. యూట్యూబ్ ప్రపంచంలో స్వల్ప మొత్తాన్ని ఆర్జించే వారే ఎక్కువ. యూట్యూబ్‌నే ప్రధాన వృత్తిగా మలుచుకుని, కావాల్సినంత ఆదాయం సంపాదించే వారు తక్కువ. యూట్యూబ్ ఛానల్ ఆరంభించి వీడియోలు పోస్ట్ చేసిన వెంటనే ఆదాయం మొదలు కాదు. ఎంత మంది చూశారు? ఎన్ని గంటల పాటు చూశారు? తదితర పారామీటర్ల ఆధారంగా ఆదాయం మొదలు కావడానికి సమయం తీసుకోవచ్చు. రతీష్‌ఆర్‌మీనన్ 2011లో చానల్ ప్రారంభించగా, నెల రోజుల్లోనే అతడికి ఆదాయం రావడం మొదలైంది. కాకపోతే అప్పట్లో నిబంధనలు ఇప్పటి మాదిరి కఠినంగా లేవు. 2014లో తన చానల్‌ను రీబ్రాండింగ్ చేసుకోగా, ఏడాదిన్నర క్రితమే ఒక మిలియన్ సబ్స్క్రయిబర్ల మార్క్ దాటింది. టెక్ వీడియోలు అప్లోడ్ చేసే రతీష్, ట్రావెల్ వీడియోలను కూడా పోస్ట్ చేసే యోచనలో ఉన్నారు. ఒక వీడియోకి 20,000 వీక్షణలు ఉంటే, టెక్ క్రియేటర్లకు నెలవారీ 500 డాలర్ల వరకు ఆదాయం (రూ.41,000) ప్రకటనల రూపంలో వస్తుందని చెప్పారు. అదే ఎంటర్టైన్మెంట్ చానల్ అయి, ఒక మిలియన్ వ్యూస్ ఉంటే నెలవారీ ఆదాయం రూ.2–3 లక్షల మధ్య ఉంటుందట. ఏమిటి మార్గం..? చానల్‌పై ఎంత సమయం వెచి్చంచగలరనేది ముందుగా నిర్ణయించుకోవాలి. తమ పరిమితులు తెలుసుకోవాలి. మరిన్ని వీడియోలు అందించే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించొచ్చు. కానీ, దాన్నే ప్రధాన ఆదాయ మార్గంగా మార్చుకోవడానికి ఎంతో సహనం, సమయం కావాలి. పెట్టిన చానల్, పోస్ట్ చేసే వీడియోలు ఆదరణ సంపాదించలేకపోవచ్చు. సక్సెస్ అవ్వకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ అనుకున్నట్టుగా ఫలితం రాకపోతే, అప్పుడు ప్లాన్ బీ కూడా ఉండాలి. యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేయడం ఆపివేసిన వెంటనే, ఆదాయ మార్గం తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. సంప్రదాయ వ్యాపారస్థులు కస్టమర్లను చేరుకునేందుకు యూట్యూబ్ ఛానళ్లను వినియోగించుకుంటున్నారు. తమ ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలతో కస్టమర్లకు చేరువ అవుతున్నారు. సంగీతం, ఇతర కళల్లో పట్టున్న వారు యూట్యూబ్ చానళ్లు తెరిచి యూట్యూబ్ సాయంతో అభిమానులను పెంచుకుంటున్నారు. ఫలానా అనే కాకుండా, ప్రస్తుత మీ ఉపాధి, వృత్తి నైపుణ్యాలను విస్తరించుకునేందుకు సైతం యూట్యూబ్‌ను వేదికగా చేసుకోవచ్చు. -
తగ్గేదేలే అంటోన్న టాలీవుడ్ మూవీ.. ఏకంగా ప్రపంచ రికార్డ్ సొంతం!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'జయ జానకి నాయక'. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్‌లో రిలీజ్ అయినప్పటీ నుంచి ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తాజాగా 800 మిలియన్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. కాగా.. ఈ సినిమాను హిందీలో ఖుంఖార్ పేరుతో రిలీజ్ చేశారు. సౌత్ డబ్బింగ్ మూవీస్‌లో ఇప్పటివరకు జయ జానకి నాయక మాత్రమే ఈ రికార్డ్ సాధించింది. యశ్ నటించిన కేజీఎఫ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. కానీ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది. గతంలోనే హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 772 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో కొనసాగుతోంది. కాగా.. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. #JayaJanakiNayaka 800M+ Views 💥👌@BSaiSreenivas @Rakulpreet #BellamkondaSrinivas #RakulPreetSingh #PenMovies pic.twitter.com/eC5M6cml89 — South Hindi Dubbed Movies (@SHDMOVIES) February 20, 2024 -
వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ సంస్థలో విషాదం!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ సంస్థలో విషాదం చోటు చేసుకుంది. ఆ కంపెనీకి చెందిన మాజీ సీఈఓ సుసాన్ వోజ్కికీ కుమారుడు 19 ఏళ్ల మాక్రో ట్రోపర్ మరణించారు. నార్తన్ కాలిఫోర్నియాలోని బర్కిలీ నగరం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన హాస్టల్లో మరణించిట్లు ట్రాపర్ తల్లిదండ్రులు నిర్ధారించారు. ట్రోపర్ ఎందుకు మరణించారనే విషయంపై స్పష్టత లేదు. ట్రోపర్ ఆపస్మారక స్థితిలో జారుకున్నప్పుడు సమాచారం అందుకు బర్కిలీ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ట్రాపర్ మరణించినట్లు తేలింది. ట్రోపర్ ఎందుకు మరణించారనే అంశం వెలుగులోకి వచ్చేందుకు ఇంకా నెల రోజుల సమయం పట్టొచ్చంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టాక్సికాలజీ రిపోర్ట్ కోసం కుటుంబం ఎదురు చూస్తున్నారు. మనవడి మరణంపై ట్రోపర్ నాయనమ్మ, యూట్యూబ్ మాజీ సీఈఓ సూసన్ వోజిస్కీ తల్లి ఎస్తేర్ వోజిస్కీ కన్నీరుమున్నీరుగా విలపించారు. మెటా పోస్ట్‌లో తన మనవడిది ప్రేమించే తత్వం, గణిత మేధావి’ అంటూ అభివర్ణించింది. యూట్యూబ్ సీఈఓ సూసన్ వోజిస్కీ తొమ్మిదేళ్ల పాటు యూట్యూబ్‌కు సీఈఓగా వ్యవహరించిన సూసన్ వోజిస్కీ గత ఏడాది రాజీనామా చేశారు. 54 ఏళ్ల సూసన్ తన కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తొమ్మిదేళ్ల క్రితం తాను యూట్యూబ్‌లో చేరినప్పుడు, మంచి లీడర్షిప్ టీంను ఏర్పాటు చేశానని, నీల్ మోహన్ ఆ బృందంలో భాగమని సూసన్ చెప్పారు. సూసన్ రాజీనామాతో భారత సంతతికి చెందిన నీల్ మోహన్, యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు స్వీకరించారు. -
ఒకప్పుడు రోజు కూలీ..నేడు యూట్యూబ్ స్టార్‌గా..!
నాడు ఆ వ్యక్తి రోజు కూలీగా కటిక దారిద్య్రం అనుభవించేవాడు. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అలాంటి స్థితోలో అనుకోని అతిథిలా వచ్చిపడినా కరోనా మహమ్మారితో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది. కనీసం కుటుంబాన్ని పోషించలేని దారుణమైన స్థితిలోకి వచ్చేశాడు. అయిపోంది జీవితం అనుకునే టైంలో "యూట్యూబ్" ఓ ఆశా కిరణంలా అతడి లైఫ్‌లోకి వచ్చింది. అంతే అక్కడ నుంచి అతడి జీవితమే మారిపోయింది. ఈ రోజు ఏకంగా నెలకు రెండు లక్షల వరకు ఆర్జిస్తున్నాడు. ఇంతకీ అతడెవరు? అతని యూట్యూబ్ ప్రస్థానం ఎలా సాగిందంటే..? ఒడిశాకు చెందిన ఇశాక్ రోజు వారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆ చాలీచాలని సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. రోజుకి అతికష్టం మీద 250 రూపాయలు సంపాదించేవాడు. ఇంతలో కరోనా మహమ్మారి కారణం ఆ సంపాదన కూడా లేకుండా పోయింది. పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా అయిపోయింది. ఏంచేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో యూట్యూబ్ ఓ వరంలా అతడి జీవితంలోకి వచ్చింది. యూట్యూబ్ ఛానెల్‌తో డబ్బులు సంపాదించొచ్చు అనే విషయం తెలుసుకుని వీడియోల చేయడంపై దృష్టి సారించాడు. ఒడియా వంటకాలతో అలరించాలనుకున్నాడు. తమ సంప్రదాయ వంటకాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు. అయితే మొదట్లో అతడి వీడియోలు ఎవ్వరూ చూసేవారు కాదు. అయితే ఒకరోజు అనుకోకుండా ఒడిశాలో బాగా ఇష్టపడే పులియబెట్టిన అన్నం అయిన బాసి పఖాలా వీడియో బాగా ప్రేక్షకాధరణ పొంది వైరల్ అయ్యింది. అంతే అక్కడ నుంచి అతని వీడియోలు బాగా నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగి అతని ఫాలోవర్ల సంఖ్య 20 వేలకు చేరింది. ఇక యూఎస్, బ్రెజిల్, మంగోలియా దేశాల వాళ్లు కూడా ఇతని వీడియోలను ఆదరించడంతో ఒక్కసారిగా ఓవర్ నైట్‌స్టార్ అయ్యిపోయాడు. ది బెటర్ ఇండియా వంటి ప్రముఖ వెబ్సైట్లు మీడియా అతడి గురించి రాయడంతో మరింత ఫేమస్ అయ్యాడు. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్ కీ బాత్ రేడియో షోలో అతడి గురించి ప్రస్తావించడమే గాకుండా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆ యూట్యూబ్ స్టార్ ఇశాక్ మాట్లాడుతూ..ఈ రోజు నా వీడియోలు బాగా వెళ్తే గనుకు నెలకు దాదాపు రూ. 3 లక్షల దాక సంపాదించగలనని దీమాగా చెబుతున్నాడు. దీనివల్ల వీడియో ఎడిట్ చేసేందుకు ల్యాప్‌టాప్ కొనుక్కున్నాను, ఉపయోగించడం తెలుసుకున్నానని చెబుతున్నాడు. అలాగే ఓ సెకండ్ హ్యాండ్ కారుని కూడా కొనుక్కోగలిగానని ఆనందంగా చెప్పాడు. అలాగే నా కుటుంబాన్ని ఈ రేంజ్లో చూసుకోగలుగుతానని కలలో కూడా అనుకోలేదంటూ బావోద్వేగంగా మాట్లాడాడు ఇసాక్. (చదవండి: ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్!) -
సోషల్ మీడియాలో.. 504 కోట్ల మంది
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని సోషల్ మీడియా ఊపేస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోని వివిధ యాప్‌లలో గంటలు గంటలు గడిపేస్తున్నారు. గ్లోబల్ వెబ్ ఇండెక్స్ పరిశోధన ప్రకారం.. ప్రపంచ జనాభాలో ఏకంగా 62.30 శాతం మంది సోషల్ మీడియాను వినియోగిస్తున్నట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే 26.60 కోట్ల మంది కొత్త వినియోగదారులు సోషల్ మీడియాలోకి వచ్చినట్లు నివేదిక పేర్కొంది. మొత్తంగా యూజర్ల సంఖ్య 504 కోట్లకు చేరిందని వెల్లడించింది. వీరిలో 46.50 శాతం మంది మహిళలు, 53.50 శాతం మంది పురుషులు ఉన్నారు. సగటున ఒక వ్యక్తి రోజువారీ సోషల్ మీడియా వినియోగం 2.23 గంటలుగా నమోదయ్యింది. ఇక ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారిలో అత్యధికంగా 94.20 శాతం మంది సోషల్ మీడియాలోనే ఉంటున్నారని నివేదిక పేర్కొంది. అమెరికాలో యూట్యూబ్ టాప్ గతంలో సగటున ఒక వ్యక్తి సోషల్ మీడియా ప్లామ్‌ఫారమ్‌ల వినియోగం 6.9 శాతంగా ఉంటే ఇప్పుడు 6.7 శాతానికి తగ్గడం విశేషం. మరోవైపు టాప్–4 సోషల్ మీడియా ఫ్లామ్‌ఫారమ్‌లలో మూడు ‘మెటా’కు చెందినవే ఉన్నాయి. అగ్రస్థానంలో ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ కొనసాగుతున్నాయి. అమెరికాలో మాత్రం ఫేస్‌బుక్‌ను వెనక్కి నెడుతూ యూట్యూబ్ ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించింది. -
స్టార్ హీరో చిత్రాన్ని తొలగించిన ప్రముఖ ఓటీటీ సంస్థ.. ఎందుకంటే?
కన్నడ దివంగత స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆయన కెరీర్లో చివరిసారిగా నటించిన చిత్రం గంధడ గడ. డాక్యుమెంటరీగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో రిలీజై ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ చిత్రం మొదట అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ తర్వాత లైసెన్స్ గడువు ముగియడంతో తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి అమెజాన్ ఈ మూవీని తొలగించింది. దీంతో పునీత్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. (ఇది చదవండి: పునీత్ రాజ్‌కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్) అయితే అమెజాన్‌లో తొలగించినా.. గంధడ గడ మూవీ మరికొన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం యూట్యూబ్, గూగుల్ టీవీ, ఐట్యూన్స్, యాపిల్ టీవీల్లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ సినిమాను వీక్షించాలనుకుంటే...రూ.100 అద్దె చెల్లించి చూసేయొచ్చు. ఈ డాక్యుమెంటరీని కర్ణాటక రాష్ట్ర అడవులు, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. ఈ డాక్యూమెంటరీ ఫిల్మ్ లో నటిస్తూనే స్వయంగా నిర్మించారు పునీత్ రాజ్‌కుమార్. కాగా.. పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు. ఆయన మరణానంతరం మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్ స్వీకరించింది. -
వరల్డ్ టాప్ యూట్యూబ్ ఛానెల్ మనదే.. ఏదో తెలుసా?
యూట్యూబ్! వీడియో విభాగంలో ఓ సెన్సేషన్. 2005 ప్రారంభమై ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతోంది. డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో గేమ్‌ఛేంజర్‌గా మారిన యూట్యూబ్ లక్షలాది కంటెంట్ క్రియేటర్లకు ఆదాయ వనరుగా మారింది. వారి ఎదుగుదలకూ తోడ్పడుతోంది. సబ్స్క్రైబర్లు, లైక్స్, వ్యూస్ ఆధారంగా డిజిటల్ వరల్డ్‌లో ఏ యూట్యూబ్ ఛానల్ అగ్రస్థానంలో ఉందో గుర్తించవచ్చు. అయితే ఎప్పటిలాగే తొలి టాప్‌టెన్ యూట్యూబ్ ఛానల్స్ వివరాల్ని ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ప్రపంచంలో మిగిలిన దేశాల యూట్యూబ్ ఛానల్స్‌తో పోలిస్తే భారత్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్స్ యూజర్లను ఆకట్టుకోవడంతో సబ్‌స్క్రైబర్ లాయల్టీ పరంగా అగ్రస్థానాన్ని సంపాదించాయి. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం..భారత్‌లోని మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ టీ సిరీస్ అగస్థానాన్ని సంపాదించుకుంది. శ్రోతల్ని ఆకట్టుకునే సంగీతంతో పాటు, ఎంటర్టైన్మెంట్ను అందించడంతో ప్రపంచంలో అత్యధికంగా సబ్స్క్రయిబ్ చేసుకున్న టాప్ 10 యూట్యూబ్ ఛానెల్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. టీ సిరీస్ తర్వాత మిగిలిన ఛానల్స్ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబ్ ఛానెల్స్ జాబితా ప్రకారం.. టీ-సిరీస్: ప్రపంచంలోనే నంబర్ వన్ యూట్యూబ్ ఛానెల్ 257 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. భారతదేశంలోని అతిపెద్ద మ్యూజిక్ లేబుల్, మూవీ స్టూడియో యాజమాన్యంలో వారి ఛానెల్లో మ్యూజిక్ వీడియోలు, సినిమాలు, ట్రైలర్లతో సహా ఇతర ఎంటర్ టైన్మెంట్ వీడియోల్ని ఇందులో వీక్షించవచ్చు. మిస్టర్ బీస్ట్: జిమ్మీ డొనాల్డ్సన్ అమెరికన్ యూట్యూబర్. మిస్టర్బీస్ట్గా ప్రసిద్ధి చెందారు. సాహసాలూ, వింత స్టంట్లూ చేస్తూ నడుపుతున్న ఈ ఛానల్‌కు సబ్స్క్రైబర్ల సంఖ్య సుమారు 232 మిలియన్లకు పైగా.. ఆదాయం వందల కోట్లే కోకోమెలన్ : ఈ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్ 3డీ యానిమేటెడ్ నర్సరీ రైమ్‌లు, పిల్లల పాటల వీడియో కంటెంట్‌ను అందిస్తుంది. ఈ ఛానెల్‌కు 170 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సెట్ ఇండియా (సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్): భారతదేశంలో సెట్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్ ఉంది. హిందీలో కంటెంట్‌ను అందిస్తుంది. ఈ ఛానెల్‌కు 167 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కిడ్స్ డయానా షో: ఆన్లైన్లో కిడ్స్ డయానా షో అని పిలువబడే ఎవా డయానా కిడిస్యుక్. ఆమె, అమె కుటుంబ సభ్యులు కలిసి ఈ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. 118 మిలియన్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ప్యూడైపీ : స్వీడిష్ యూట్యూబర్ ఫెలిక్స్ కెజెల్బర్గ్ నిర్వహించే ప్యూడైపీ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్‌లలో ఒకటి. ఇందులో 111 మిలియన్ల మంది సబ్‌స్కైబర్లు ఉండగా.. 4,747 వీడియోల్ని అప్లోడ్ చేశారు. లైక్ నాస్త్య: ది లైక్ నాస్త్య యూట్యూబ్ ఛానెల్ అనేది నాస్త్య అనే యువతి, ఆమె కుటుంబ సభ్యులతో పిల్లలకు ఎంటర్టైన్మెంట్ వీడియోల్ని అందిస్తుంటుంది. దీనికి 112 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వ్లాడ్ అండ్ నికి: ఈ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్ ఇద్దరు అన్నదమ్ములు నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 108 మిలియన్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. జీ మ్యూజిక్ కంపెనీ: ప్రధానంగా హిందీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఆఫర్లతో, జీ మ్యూజిక్ కంపెనీ యూట్యూబ్ ఛానెల్ 104 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్: డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్ ఛానెల్‌కు 99 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు, 73 వేల వీడియోలు ఉన్నాయి. ఇందులో రెజ్లింగ్ వీడియోల్ని వీక్షించవచ్చు. -
అశ్లీల కంటెంట్... యూట్యూబ్‌కు సమన్లు
ఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ భారత్ విభాగానికి నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సమన్లు జారీ చేసింది. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. అటువంటి ఛానెల్‌ల జాబితాతో జనవరి 15న తమ ముందు హాజరు కావాలని యూట్యూబ్ సంస్థ భారత్ విభాగ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెడ్‌ని కోరింది. ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో ఈ మేరకు భారతదేశంలోని యూట్యూబ్ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ అధిపతి మీరా చాట్‌కు లేఖ రాశారు. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన చర్యలను చిత్రీకరించే యూట్యూబ్ ఛానెల్‌లలో ఆందోళనకరమైన ధోరణిని కమిషన్ గుర్తించిందని ప్రియాంక కనూంగో అన్నారు. ‘వీడియోలలో’ తల్లులు, కొడుకుల మధ్య అసభ్యకరమైన చర్యలు, తల్లులు, యుక్తవయస్సులో ఉన్న కొడుకుల మధ్య ముద్దులు వంటివి ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ వీడియోలు లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే (పోక్సో) చట్టం- 2012ను ఉల్లంఘిస్తున్నాయి.' అని కమిషన్ గుర్తించిందని తెలిపారు. “యూట్యూబ్ దీన్ని పరిష్కరించాలి. నేరస్థులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వీడియోలను కమర్షియల్‌గా మార్చడం అంటే పోర్న్ అమ్మడం లాంటిది. పిల్లలు లైంగిక వేధింపులకు గురైన వీడియోలను ప్రదర్శించే ఏదైనా ప్లాట్‌ఫామ్ జైలుకు వెళ్లవలసి ఉంటుంది.”అని ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో తెలిపారు. ఇదీ చదవండి: అతిపెద్ద సముద్ర వంతెన.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం -
రూ.12 వేలకోట్ల సంగీత సామ్రాజ్యం.. టాప్ 10లో 7 మన పాటలే!
చదువు పూర్తయి సంగీత పరిశ్రమలో స్థిరపడాలనుకునే వారి తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన ఎదురవుతోంది. ఆ రంగంలో స్థిరపడేవారి ఆదాయమార్గాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే భావన ఉంది. దాంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందేమోనని భయపడుతారు. కానీ 2022లో దేశంలోని మ్యూజిక్ ఇండస్ట్రీ ఏకంగా రూ.12000 కోట్ల వ్యాపారం సాగించింది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. మొత్తంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో రూ.2.1 లక్షల కోట్ల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. అయితే అందులో మ్యూజిక్ ఇండస్ట్రీ 6 శాతం వాటా కలిగి ఉంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లోని టాప్ 10 పాటల్లో ఏడు భారతీయులవే కావడం విశేషం. పుష్ప సినిమాలో సునిధి చౌహాన్ పాడిన ‘రారా సామీ’ పాట ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దీనికి 1.55 బిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇంద్రావతి చౌహాన్ పాడిన ‘ఊ అంటావా’ పాటను 1.52 బిలియన్ల మంది చూశారు. మ్యూజిక్ కంపోజర్లు, గేయ రచయితలు, సింగర్లకు చెల్లించే డబ్బు 2.5 రెట్లు పెరిగినట్లు తెలిసింది. ప్రత్యేకంగా మ్యూజిక్ ఆల్బమ్స్‌ను క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నవారు, లైవ్‌షోల ద్వారా అర్జిస్తున్నవారు, డిస్కో జాకీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ది మ్యూజిక్ క్రియేటర్ ఎకానమీ: ది రైజ్ ఆఫ్ మ్యూజిక్ పబ్లిషింగ్ ఇన్ ఇండియా, 2023 నిర్వహించిన సర్వే ప్రకారం.. 40,000 కంటే ఎక్కువ మంది సంగీత సృష్టికర్తలు ఏటా 20,000-25000 పాటలను సిద్ధం చేస్తున్నారు. ఈ సర్వేలో అప్పటికే ఉంటున్న పాటలు, మ్యూజిక్ రీమిక్స్ చేస్తున్నవారిని పరిగణలోకి తీసుకోలేదు. వారిని కూడా కలుపుకుంటే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా పేరున్న సంస్థలు విడుదల చేసే మ్యూజిక్కే ఆదరణ ఉండేదని, కానీ పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా స్థానికంగా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్న వారి కంటెంట్‌కు సైతం మంచి ఆదరణ లభిస్తోందని సర్వే ద్వారా తెలిసింది. ఇదీ చదవండి: రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు? 1957నాటి కాపీరైట్ చట్టంలో 2012లో మార్పులు తీసుకొచ్చారు. రికార్డింగ్‌ని యధాతథంగా కాకుండా అదే పాటను మరొక సింగర్ పాడవచ్చు. వేరొక ట్యూన్‌కి సెట్ చేయవచ్చు. లైవ్‌షోలో పాడవచ్చు. దాంతో వివిధ మార్గాల నుంచి రాయల్టీలు పొందే వీలుంది. -
YouTube: ఇక్కడ సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత!
ఆధునిక టెక్నాలజీ యుగంలో సామాజిక మాధ్యమాలు విస్తృతమయ్యాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్ ఇలా ఎన్నో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. నేటి రోజుల్లో బ్యాంక్ అకౌంట్ అయినా లేనివారు ఉంటారేమో గానీ ఏదో ఒక సోషల్‌మీడియా అకౌంట్ లేనివారు మాత్రం ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఎన్ని సోషల్‌మీడియా వేదికలు ఉన్నా యూట్యూబ్‌కు ఉన్న ప్రత్యేకత, ఆదరణ వేరు. అత్యధికమంది ఉపయోగించే సోషల్ మీడియా యాప్ ఇది. ఇందుకు కారణం పెద్దగా చదువుకోని సమాన్యులు సైతం ఉపయోగించేందుకు వీలుగా ఉండటం, కంటెంట్ వీడియోల రూపంలో ఉండటం. యూట్యూబ్ యూజర్లు ఏ స్థాయిలో ఉన్నారో అంతే స్థాయిలో కంటెంట్ క్రియేటర్లు అంటే యూట్యూబర్లు కూడా ఉన్నారు. అభిరుచిని తీర్చుకోవడంతోపాటు ఆదాయాన్ని పొందే అవకాశం ఉందిక్కడ. యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, ట్రావెలింగ్, కుకింగ్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఫైనాన్స్, న్యూస్.. ఇలా రకరకాల కంటెంట్‌ను యూట్యూబర్లు క్రియేట్ చేసి వీక్షకుల ముందుకు తెస్తున్నారు. యూట్యూబర్లు అంత సంపాదిస్తున్నారు.. ఇంత సంపాదిస్తున్నారు.. అంటూ మాట్లాడుకోవడమే గానీ వారికి డబ్బు ఎలా వస్తుంది.. ఎంత మంది చూస్తే ఎంత డబ్బు వస్తుంది.. అన్న లెక్కలు చాలా మందికి తెలియవు. ఈ లెక్కల్ని అర్థం చేసుకుని, ఒక యూట్యూబర్ ఎంత సంపాదించగలరు అన్నది అంచనా వేయాలని ఆసక్తి ఉన్న వారి కోసం ఇక్కడ కొంత సమాచారం ఇస్తున్నాం.. డబ్బు ఎలా వస్తుంది? స్పాన్సర్‌షిప్‌ల నుంచి మొదలు పెట్టి ఉత్పత్తుల ప్రమోషన్ వరకూ పలు రకాల మార్గాల్లో యూట్యూబర్లు డబ్బు సంపాదించవచ్చు. కానీ గూగుల్ ప్రకటనలు (Google Ads) నుంచే వచ్చే ఆదాయమే అత్యధికం. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో చేరిన సోషల్ మీడియా క్రియేటర్లు తమ వీడియోల ద్వారా గూగుల్ ప్లేస్డ్ యాడ్స్‌తో (Google-placed ads) డబ్బు సంపాదించవచ్చు. ఈ అర్హతలుండాలి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేయడానికి, క్రియేటర్లు తప్పనిసరిగా కనీసం 500 మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. అలాగే గత 90 రోజుల్లో కనీసం మూడు పబ్లిక్ అప్లోడ్లు చేసి ఉండాలి. సంవత్సర కాలంలో 3,000 వాచింగ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 3 మిలియన్ల యూట్యూబ్ షార్ట్‌ల వీక్షణలను కలిగి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉండి ఒకసారి అప్రూవల్ పొందిన తర్వాత, అర్హత కలిగిన క్రియేటర్లు ఛానెల్ మెంబర్‌షిప్‌లు, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్లు, సూపర్ థాంక్, యూట్యూబ్ షాపింగ్‌తో తమ సొంత ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునే సామర్థ్యం వంటి ఫీచర్ల ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఇక యూట్యూబ్ యాడ్సెన్స్ (YouTube AdSense) నుంచి డబ్బు సంపాదన ప్రారంభించడానికి, ప్రోగ్రామ్‌లోని క్రియేటర్లు తప్పనిసరిగా 1,000 మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. సంవత్సర కాలంలో 4,000 వాచింగ్ అవర్స్‌ను కలిగి ఉండాలి. ఎంత మంది చూస్తే ఎంత డబ్బులు? తమతో యూట్యూబర్లు పంచుకున్న రెవెన్యూ పర్ మిల్లీ (RPM) రేట్ల ఆధారంగా బిజినెస్ ఇన్సైడర్ ఓ అధ్యయనం చేసింది. దాని ప్రకారం.. ప్రతి 1,000 వీక్షణలకు 1.61 నుంచి 29.30 డాలర్లు (రూ.130 నుంచి రూ.2,400) యూట్యూబర్లు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ నుంచి యూట్యూబర్లు నెలకు ఎంత డబ్బు సంపాదిస్తారు అనేది వీక్షణల మొత్తం, ఆడియన్స్ లొకేషన్, కంటెంట్ కేటగిరి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. బిజినెస్ ఇన్సైడర్ అధ్యయనం చేసిన ఓ 28 మంది యూట్యూబర్ల నెలవారీ ఆదాయాలు 82 నుంచి 83,000 డాలర్ల వరకూ (రూ.6,800 నుంచి సుమారు రూ.70 లక్షలు) ఉన్నాయి. ఈ ఆదాయాలు నెలవారీగా మారవచ్చు. ఉదాహరణకు సుమారు లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఓ యూట్యూబర్ ఒక నెలలో 1,000 డాలర్లు (రూ.83,000) సంపాదిస్తే మరొక నెలలో 6,000 డాలర్లు (సుమారు రూ.5 లక్షలు) వరకు సంపాదించినట్లు బిజినెస్ ఇన్సైడర్ పేర్కొంది. ఇక ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న వ్యక్తిగత ఫైనాన్స్ గురించి వీడియోలను రూపొందించే మరో యూట్యూబర్ ఒకే నెలలో 50,000 డాలర్లు (సుమారు రూ.41 లక్షలు) కంటే ఎక్కువ సంపాదించారు . గమనిక: ఇది కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. -
భారత్‌కు మించింది లేదు: యూట్యూబ్ ఎండీ
ప్రతిభావంతులైన, ఔత్సాహికులైన యువతకు ప్రస్తుతం భారత్‌కు మించిన మెరుగైన ప్రదేశం మరొకటి లేదు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇషాన్ ఛటర్జీ. ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన ఇషాన్ ఛటర్జీ గత సంవత్సరం యూఎస్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. హెచ్‌పీఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఎన్డీటీవీతో పలు విషయాలు వెల్లడించారు. భారత్‌లో రాబోయే 10 సంవత్సరాలు అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు. భారత్ అత్యంత వైవిధ్యమైన, డైనమిక్ ఉత్తేజకరమైన మార్కెట్ అని పేర్కొన్నారు. భాషతో సంబంధం లేకుండా దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లకు సైతం యూట్యూబ్ వేదికను కల్పించిందన్నారు. ఇషాన్ ఛటర్జీ పాఠశాల విద్యాభ్యాసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఢిల్లీలోని సెయింట్ స్టీపెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ చేసిన ఆయన అమెరికాలోని వార్టన్ స్కూల్ యూనివర్సిటీ నంచి ఎంబీఏ పూర్తి చేశారు. యూట్యూబ్‌కు ముందు ఇషాన్ ఛటర్జీ గూగుల్, మెకెన్సీ కంపెనీల్లో పనిచేశారు. -
యూట్యూబ్ షేక్.. 2023లో దుమ్ము రేపిన వీడియోలు, షార్ట్స్ ఇవే..
ఆధునిక కాలంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. దీంతో ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగిన నిమిషంలో తెలిసిపోతోంది. ఇందులో కూడా కొన్ని సంఘటనలు మాత్రమే పెద్దగా వైరల్ అవుతాయి. ఈ ఏడాది (2023) ఎక్కువ మంది చూసిన వీడియోలు ఏవి, టాప్ ట్రెండింగ్ కంటెంట్, దాని వెనుక ఉన్న క్రియేటర్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2023లో ఎక్కువ మంది వీక్షించిన వీడియాల్లో చెప్పుకోదగ్గది 'చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్-ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్'. దీనికి ప్రారంభంలో 8.5 మిలియన్స్.. ఇప్పటి వరకు 79 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. ఈ సంవత్సరంలో యూట్యూబ్‌లో అతిపెద్ద లైవ్ స్ట్రీమ్‌గా ఇది సంచలనం సృష్టించింది. ఆ తరువాత వరుసగా మ్యాన్ ఆన్ మిషన్, యూపీఎస్సీ స్టాండ్ అప్ కామెడీ, డైలీ వ్లాగర్ పేరడీ, శాస్తా బిగ్ బాస్ 2 వంటివి ఎక్కువ వ్యూవ్స్ పొందాయి. టాప్ 15 గేమింగ్ వీడియోలు 2023లో 'ఐ స్టోల్ సుప్రా ఫ్రమ్ మాఫియా హౌస్' ఎక్కువమంది హృదయాలను దోచింది. ఈ గేమింగ్ వీడియో ఇప్పటికి 30 మిలియన్ వీక్షణనలను పొందింది. ఆ తరువాత స్థానంలో జీటీఏ5 ఇన్ రియల్ లైఫ్, గ్రానీ చాఫ్టర్ 1, స్కిబిడి టాయిలెట్ 39 - 59, కునాలి కో దర్ నహీ లగ్తా వంటివి ఉన్నాయి. టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్ ఈ ఏడాది యుట్యూబ్లో సంచలనం సృష్టించిన టాప్ 10 కంటెంట్ క్రియేటర్ల జాబితాలో ప్రధమ స్థానంలో పవన్ సాహు ఉండగా.. ఆ ఆ తరువాత స్థానాల్లో నీతూ బిష్ట్ (Neetu Bisht), క్యూట్ శివాని 05, ఫిల్మీ సూరజ్ యాక్టర్, అమన్ డ్యాన్సర్ రియల్, ఆర్టిస్ట్ సింతు మౌర్య మొదలైనవారు ఉన్నాయి. ఇందులోనే మహిళల విభాగంలో నీతూ బిష్ట్, షాలు కిరార్, జశ్వి విశ్వి, ది థాట్ఫుల్ గర్ల్, రాయల్ క్యూన్, సోనాల్ అగర్వాల్, మింకు టింకు, అంజు డ్రాయింగ్ షార్ట్స్, మహి లక్రా వ్లాగ్స్, మామ్ అండ్ రీదిష్ణ వంటి వారు ఉన్నారు. టాప్ 15 షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ విభాగంలో ఈ ఏడాది వరుసగా పతి కో బనాయా పాగల్, కదం కదం భజాంగే జా, 500 మీ ఐఫోన్, బ్లో ద రోలర్ అండ్ విన్ ఛాలెంజ్, చలాక్ బాయ్ ఫ్రెండ్, టామ్ అండ్ జెర్రీ (రిత్వి & కవి), పోర్ ఛాలెంజ్ విత్ సిరప్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా.. టాప్ 15 మ్యూజిక్ వీడియోలు 2023లో పాపులర్ అయిన వీడియోల విషయానికి వస్తే.. ఇందులో మొదటి స్థానంలో ఘనీ కో సబ్ ఘన్, జరా హక్తే జరా బచ్కే, జవేద్ మోహ్సిన్, క్యా లోగే తుమ్, హా నువ్ కావాలయ్యా (జైలర్), పల్సర్ బైక్ (ధమాకా), నా రెడీ (లియో) మొదలైనవి ఉన్నాయి. -
పనిచేయకుండానే డబ్బు కావాలా..?
అవునండీ.. పని చేయకుండానే డబ్బులు వస్తాయి. ఎలాగంటారా..? ప్యాసివ్ ఇన్‌కమ్‌తో ఇది సాధ్యం అవుతుంది. ప్యాసివ్ ఇన్‌కమ్‌తో కులాసాగా కాలం గడిపేయొచ్చు అనే భావన ఇప్పటికే చాలామందికి వచ్చేసింది. ఇంతకీ ఫ్యాసివ్ ఇన్కమ్ అంటే పని చేయకుండా వచ్చే ఆదాయం అన్నమాట! ఇదేదో బాగానే ఉందే.. ఇక కాయకష్టం చేయాల్సిన అవసరం లేదని ఫిక్సయిపోకండి. అలా కాలు కదపకుండా కాసులు రాలాలంటే అంతకుముందు యాక్టివ్ ఇన్కమ్ గణనీయంగా సంపాదిస్తే గానీ, ప్యాసివ్ సంపాదన సాధ్యపడదని మాత్రం గుర్తుంచుకోండి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ప్రత్యేక్షంగా మన ప్రమేయం లేకుండా స్థిరంగా డబ్బు వచ్చే విధానం. ఈ ఆదాయం రెంటల్ ప్రాపర్టీస్, ఇన్వెస్ట్మెంట్లు, క్రియేటివ్ వర్క్ రాయల్టీలు, డివెడెండ్లు.. నుంచి జనరేట్ అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్పైన డైలీ అటెన్షన్ అవసరం ఉండదు. అది కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు యూట్యూబ్ చానల్ పెడితే లక్షల్లో సంపాదించొచ్చని చాలామంది అంటారు. అయితే అందుకు మాత్రం ముందు చాలా కష్టపడాలి. ఒకసారి మనిటైజేషన్ అయిపోయి ఫాలోవర్లు పెరుగుతుంటూ డబ్బు వస్తూంటుంది. కొన్నిసార్లు వీడియో చేయకపోయినా కొందరు మనం గతంలో చేసిన వీడియోలు చూస్తారు కాబట్టి డబ్బు వస్తుంది. ఇన్‌స్టాలో కొత్తగా ఏదైనా థీమ్ క్రియేట్చేసి ఇన్‌స్టాంట్‌గా వైరల్ అయిపోవచ్చు. కానీ అందుకు చాలా కష్టపడాలి. అయితే ఫ్యాసివ్ ఇన్కమ్ నిర్వచనాన్ని అర్థం చేసుకోకుండా సంపాదనకు షార్ట్‌కట్స్ ఎంచుకుంటే మూడు షేర్లు… ఆరు లైకులకు పరిమితం అవుతారని నిపుణులు చెబుతున్నారు. స్టాక్మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్‌చేసి స్టాక్‌లు పెరుగుతున్నపుడు అందులో మదుపుచేసిన డబ్బు పెరుగుతుంది. దాంతోపాటు కంపెనీలు మంచి త్రైమాసిక ఫలితాలు పోస్ట్ చేస్తూ భవిష్యత్తులో మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చెబుతుంటాయి. అయితే అందుకుగల కారణాలను విశ్లేషిస్తూ సిప్ మోడ్‌లో మరింత ఇన్వెస్ట్ చేయాలి. కంపెనీలు డివెండెండ్ ప్రకటిస్తున్నపుడు పెరిగిన స్టాక్ ధరతో సంబంధం లేకుండా అదనంగా ప్యాసివ్ ఇన్‌కమ్‌ను సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే మరెన్నో మార్గాలున్నాయని, కానీ అంతకుముందు యాక్టివ్ మనీను సంపాదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: ఆఫీస్‌లో కాసేపు పడుకోనివ్వండి! -
యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన క్రికెట్ మ్యాచ్‌లు ఇవే..!
-
ఒకేసారి వంద పచ్చిగుడ్లను తిన్న యూట్యూబర్, వీడియో వైరల్
గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజూ గుడ్లు తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. దీంట్లో ప్రోటీన్లతో పాటు శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయన్నది నిజమే. కొందరు రోజూ ఉడికించిన గుడ్డు తీసుకుంటే మరికొందరు పచ్చిగుడ్డు తీసుకుంటారు. అయితే ఓ యూట్యూబర్ మాత్రం ఏకంగా ఒకేసారి వంద పచ్చి గుడ్లను తిని నెట్టింట సెన్సేషన్‌గా మారాడు. జిమ్ చేసేవాళ్లలో చాలామంది తమ డైట్లో తప్పకుండా గుడ్లు ఉండేలా చూసుకుంటారు. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుందని, శరీరానికి కావల్సినంత ప్రోటీన్‌ను అందిస్తుందని చాలామంది గుడ్లను తప్పకుండా రోజూ తీసుకుంటారు. అయితే ఓ ఫిట్నెస్ ఇన్ఫ్యూయెన్సర్,యూట్యూబర్ మాత్రం పెద్ద సాహసమే చేశాడు. తన యూట్యూబ్ చానల్‌కు లక్ష ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా ఆడియెన్స్ కోసం ఏదైనా సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. అనుకుందే తడవుగా జిమ్‌లో ఓ పెద్ద మగ్గు నిండా 100 పచ్చి గుడ్లను నింపుకున్నాడు. ఇదేం చేస్తాడబ్బా అని చుట్టూ ఉన్నవాళ్లు చూసేలోపు మగ్గులోని సగానికి పైగా గుడ్లను ఖాళీ చేసేశాడు. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి పుషప్స్ చేసి మళ్లీ పచ్చి గుడ్లను తాగడం కంటిన్యూ చేశాడు. అలా మొత్తం మగ్‌లోని వంద గుడ్లను తాగేసరికి అక్కడున్న వాళ్లందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫాలోవర్స్ కోసం ఇలాంటి పిచ్చి స్టంట్లు చేస్తే ప్రాణానికి ప్రమాదం..ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు గుడ్డు తినడం మంచిది కదా అని అతిగా తీసుకుంటే చాలా ప్రమాదం అని డాక్టర్లు సైతం హెచ్చరిస్తున్నారు. View this post on Instagram A post shared by Vince Iannone (@vince_aesthetic) -
క్రియేటర్లకు యూట్యూబ్ భారీ షాక్!
క్రియేటర్లకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ భారీ షాకిచ్చింది. చాట్‌జీపీటీ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఏఐ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుంటున్న పలువురు వీడియో క్రియేటర్లు ఏఐ సాయంతో వీడియోలు చేస్తున్నారు. డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశంపై యూట్యూబ్ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఏఐ యాప్స్‌తో చేసే కంటెంట్‌కు యూట్యూబ్‌లో చోటు లేదని స్పష్టం చేసింది. వీడియోల నుంచి ఏఐ ఇమేజెస్ వరకు యూట్యూబ్ వీడియోల్లో వినియోగించడానికి వీలు లేదని తెలిపింది. ఇందుకోసం కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపింది. ఒకవేళ ఏఐ ఫోటోలు, వీడియోల్ని వినియోగిస్తే సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు తప్పని సరిగా ఈ కంటెంట్ ఏఐతో చేసినట్లు తెలపాలి. లేదంటే ఆయా వీడియోలను తొలగించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా యూట్యూబ్ బ్లాగ్‌లో మార్గదర్శకాలపై సమాచారం ఇచ్చింది. యూజర్లు కంటెంట్ వీక్షిస్తున్న సందర్భంలో ఈ కంటెంట్‌ను ఏఐ సహాయంతో సృష్టించినట్లు చెబుతుందని పేర్కొంది. డిస్క్రిప్షన్లో ఏఐ లేబుల్‌కు ఆప్షన్ ఉంటుందని పేర్కొంది. కొత్త మార్గదర్శకాలను పాటించని కంటెంట్ క్రియేటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కంటెంట్‌ను తొలగించడంతో పాటు ఆయా ఛానెల్స్‌కు సంబంధించి మానిటైజేషన్ నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. -
యూజర్లకు షాక్.. మరింత కాస్ట్లీగా యూట్యూబ్!
టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్ యూజర్లకు షాకిచ్చింది. ఆదాయమార్గాల్ని అన్వేషిస్తున్న యూట్యూబ్ పలు దేశాల్లో యూట్యూబ్ ప్రీమియం ధరల్ని మరింత పెంచింది. పెంచిన ధరలతో యూట్యూబ్ కొన్ని దేశాల్లో మరింత కాస్ట్లీగా మారింది. వాటిల్లో భారత్ లేకపోవడం గమనార్హం. ఎక్కువ యాడ్స్ ఉంటే యూట్యూబ్‌కి ఆదాయం పెరుగుతుంది. అయితే, యూజర్లు యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోలు చూడటానికి యాడ్ బ్లాకర్లను వాడుతుంటారు. దీంతో ఆదాయం తగ్గడంతో యాడ్ బ్లాకర్స్‌ని వినియోగిస్తున్న యూజర్లను బ్లాక్ చేసేలా కొత్త మెకానిజంను తయారు చేసింది. ఈ టెక్నాలజీ రాకతో ప్రపంచవ్యాప్తంగా యాడ్ బ్లాకర్లను వినియోగించే వారికి ‘యాడ్ బ్లాకర్లను వినియోగిస్తే యూట్యూబ్ నిబంధనలను ఉల్లంఘించినట్లే. యాడ్ బ్లాకర్లను వాడొద్దని ఇప్పటికే సూచించాం. ఒక వేళ ప్రకటనలు రాకుండా వీడియోలు చూడాలంటే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది’ అని మెసేజ్‌లు పంపిస్తుంది. నవంబర్ 1 నుంచే అమలు తాజాగా, 9 టూ 5 గూగుల్ నివేదిక ప్రకారం.. అర్జెంటైనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, చీలీ,జర్మనీ, పోలాండ్, టర్కీ ఈ 7 దేశాలకు చెందిన యూజర్లకు యూట్యూబ్ మెయిల్స్ పంపింది. య్యూట్యూబ్‌లో ప్రీమియం ధరల్నిపెంచుతున్నట్లు ఆమెయిల్స్లో పేర్కొంది. ఈ పెరిగిన ధరలు నవంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే సబ్స్క్రిప్షన్ సేవల్ని వినియోగిస్తున్న యూజర్లు మరో మూడు నెలల వరకు పాత సబ్స్క్రిప్షన్ ఛార్జీలను చెల్లించే అవకాశం కల్పిస్తూనే.. కొత్తగా వచ్చి చేరే పెయిడ్ యూజర్లు మాత్రం పెంచిన ధరలు వర్తిస్తాయని చెప్పింది. అయితే, పెంచిన ధరలు ఎంతనేది తెలియాల్సి ఉంది. భారత్‌లో యూట్యూబ్ ప్రీమియం ధరలు భారతదేశంలో యూట్యూబ్ ప్రీమియం ధరలు స్థిరంగానే ఉన్నాయి. సంస్థ ప్రస్తుతం చందాదారుల నుండి నెలవారీ సబ్స్క్రిప్షన్ ధర రూ. 139, మూడు నెలల సబ్స్క్రిప్షన్ ధర రూ. 399, ఏడాది సభ్యత్వానికి ధర రూ. 1,290ని వసూలు చేస్తుంది. తద్వారా యూజర్లు యూట్యూబ్‌లో వీడియోల్ని వీక్షించే సమయంలో ఎలాంటి యాడ్స్ డిస్ప్లే అవ్వవు. చదవండి👉 ‘నీవ్వు వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ’ -
ఇవిగివిగో... అవిగవిగో!
తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించింది 24 సంవత్సరాల ఆకాంక్ష మోంగ. కన్సల్టెన్సీ జాబ్‌ను వదిలేసి ఫుల్‌టైమ్ ట్రావెలర్‌గా మారింది. పుణెకు చెందిన ఆకాంక్ష ట్రావెల్ అండ్ ఫొటోగ్రఫీ విభాగంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘కంటెంట్‌ను ప్రేక్షకులకు వేగంగా చేరువ చేయడానికి సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయం లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి’ అంటుంది ఆకాంక్ష. డిజిటల్ క్రియేటర్లు నిలువ నీరులా, గోడకు కొట్టిన మేకులా ఉండకూడదు అనే స్పృహతో యువ క్రియేటర్లు ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్‌పైనే కాదు టూల్స్ గురించి కూడా అవగాహన చేసుకుంటున్నారు. క్రియేటర్–ఫ్రెండ్లీ టూల్స్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అప్డేట్స్ను వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. కంటెంట్ మేకింగ్‌లో మరింత క్రియేటివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.... రెండు నెలల క్రితం ‘మీ షార్ట్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లండి’ అంటూ యూట్యూబ్ కొత్త క్రియేషన్ టూల్స్‌ను తీసుకువచ్చింది. అందులో ఒకటి కొలాబ్. ఈ టూల్‌తో సైడ్–బై–సైడ్ ఫార్మట్‌లో ‘షార్ట్’ను రికార్డ్ చేయవచ్చు. క్రియేటర్లు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడానికి మల్టిపుల్ లే ఔట్ ఆప్షన్లు ఉంటాయి.గత నెలలో జరిగిన ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ కార్యక్రమంలో క్రియేటర్స్‌కు ఉపకరించే కొత్త టూల్స్‌ను ప్రకటించింది కంపెనీ. ‘క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కు కొత్త టూల్స్ తీసుకురానున్నాం. క్లిష్టం అనుకునే వాటిని సులభతరం, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసే టూల్స్ ఇవి. క్రియేటివ్ పవర్‌కు దగ్గర కావడానికి ఉపకరిస్తాయి’ అన్నాడు యూ ట్యూబ్ సీయీవో నీల్ మోహన్.యూ ట్యూబ్ ప్రకటించిన కొన్ని టూల్స్.... డ్రీమ్ స్క్రీన్ యూట్యూబ్ షార్ట్స్ కోసం రూపొందించిన న్యూ జెనరేటివ్ ఫీచర్ ఇది. దీని ద్వారా తమ షార్ట్స్‌కు ఏఐ జనరేటెడ్ వీడియో లేదా ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయడానికి వీలవుతుంది. పెద్దగా కష్టపడనక్కర్లేకుండానే పాప్ట్ ఇస్తే సరిపోతుంది. ‘డ్రీమ్ స్క్రీన్’ ద్వారా క్రియేటర్లు తమ షార్ట్స్‌కు న్యూ సెట్టింగ్స్ జ నరేట్ చేయవచ్చు. యూట్యూబ్ క్రియేట్ వీడియోలు క్రియేట్ చేయడానికి షేర్ చేయడానికి ఉపకరిస్తుంది. యూట్యూబ్ క్రియేట్ యాప్ ద్వారా ఖచ్చితత్వం, నాణ్యతతో కూడిన ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ కాప్షనింగ్, వాయిస్ వోవర్, యాక్సెస్ టు లైబ్రరీ ఆఫ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, రాయల్టీ–ఫ్రీ మ్యూజిక్... మొదలైనవి క్రియేటర్లకు ఉపయోగపడతాయి. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కాంప్లెక్స్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో పని లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా వీడియోలను సులభంగా క్రియేట్ చేయవచ్చు. క్రియేటర్ల నోట ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం దీన్ని ఫీచర్‌గా మలచనున్నారు. ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ వినిపిస్తున్నప్పుడు ఈ బటన్లను సింక్‌లోని విజువల్ క్యూతో హైలైట్ చేస్తుంది. ఏఐ ఇన్సైట్స్ యూట్యూబ్‌లో ప్రేక్షకులు చూస్తున్న కంటెంట్ ఆధారంగా వీడియో ఐడియాలను తయారు చేసుకోవడానికి వీలవుతుంది. అలౌడ్ ఆటోమేటిక్ డబ్బింగ్ టూల్ ద్వారా కంటెంట్‌ను ఎక్కువ భాషల్లో క్రియేట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్తో ముందుకు వస్తోంది. వాటిలో ఒకటి క్రియేటర్లు ‘రీల్స్’లో టాప్ ట్రెండింగ్ సాంగ్స్ గురించి తెలుసుకునే అవకాశం. ఆ ఆడియోనూ ఎన్నిసార్లు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. సేవ్ చేసి అవసరమైన సందర్భంలో వాడుకోవచ్చు. ట్రెండింగ్ టాపిక్స్ ఏమిటో కూడా తెలుసుకోవచ్చు. ‘ప్రస్తుతం పాపులర్ ఏమిటి?’ అనేది తెలుసుకోవడానికి కొత్త డెడికేటెడ్ సెక్షన్ క్రియేటర్లకు ఉపకరిస్తుంది’ అని చెబుతుంది కంపెనీ.‘రీల్స్’ను ఎడిట్ చేయడాన్ని సులభతరం చేయడానికి వీడియో క్లిప్‌లు, ఆడియో, స్టిక్కర్స్, టెక్ట్స్‌ను ఒకేచోటుకు తీసుకువచ్చింది. తమ కంటెంట్ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవడానికి కొత్తగా తీసుకువచ్చిన ‘రీల్స్ ఇన్సైట్స్’తో యాక్సెస్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్తగా యాడ్ చేసిన ‘టోటల్ వాచ్ టైమ్’ మెట్రిక్, ‘యావరేజ్ టైమ్’ మెట్రిక్‌తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. రీల్స్‌లో ‘స్ట్రాంగర్ హుక్’ క్రియేట్ చేసి వీడియోను ఆకట్టుకునేలా చేయడానికి ఇది ఉపకరిçస్తుంది. అయిననూ... టెక్నాలజీ మాత్రమే సర్వస్వం, విజయ సోపానం అనుకోవడం లేదు యువ క్రియేటర్లు. ‘టెక్నాలజీ అంటే టూల్స్ మాత్రమే కాదు క్రియేటర్ పనితీరు. ప్రత్యేకత. సృజనాత్మకత’ అనే విషయంపై అవగాహన ఉన్న యువ క్రియేటర్లు నేల విడిచి సాము చేయడం లేదు. కంటెంట్, టెక్నాలజీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. -
సోషల్ మీడియాతో పాపులర్ సింగర్ అయిన డిసోజా
బెంగళూరుకు చెందిన సింగర్, సాంగ్ రైటర్ ఫ్రిజెల్ డిసోజా. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో రకరకాల పాటల గురించి పోస్ట్‌లు, వీడియోలు పెట్టడం ద్వారా ఇండియన్ ఇండీ మ్యూజిక్ ప్రపంచంలోకి వచ్చింది. లాక్డౌన్ కాలంలో ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు ‘సమ్‌థింగ్ న్యూ’ పాట ఐడియా వచ్చింది. ఈ డెబ్యూ సాంగ్ ద్వారా డిసోజా మెలోడియస్ వాయిస్‌కు మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియాలో కనిపించి, వినిపించే డిసోజా లైవ్ ప్రోగ్రామ్స్‌లో కూడా పాల్గొంది. ఫస్ట్ టూర్లో వచ్చిన పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఆమెకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ఇక రచన విషయానికి వస్తే...లవ్, హార్ట్‌బ్రేక్‌కు సంబంధించిన అంశాలపై పాటలు రాయడం డిసోజాకు ఇష్టం.‘వ్యక్తిగత అనుభవాల నుంచి చూసిన, విన్న విషయాల ఆధారంగా పాటలు రాయడం నాకు సులభం’ అంటుంది. మొదట్లో తన పాటల్లో ఎలక్ట్రిక్ గిటార్, డ్రమ్‌ల శబ్దం లిరిక్స్‌ను డామినేట్ చేసేది. ఇప్పుడు మాత్రం లిరిక్స్ కూడా స్పష్టంగా వినబడే ఈజీ–టు–లిజెన్ వైబ్కు ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేట్ అయిన డిసోజా ఫుల్–టైమ్ మ్యూజిషియన్‌గా ఉండడమే తనకు ఇష్టం అంటుంది. View this post on Instagram A post shared by Frizzell D'Souza (@frizzell.dsouza) View this post on Instagram A post shared by Frizzell D'Souza (@frizzell.dsouza) -
యూట్యూబ్‌లో మొదటి వీడియో ఏది? ఎంతమంది చూశారు?
ఈ రోజుల్లో యూట్యూబ్ అనేది వినోద ప్రపంచపు రారాజు. ఒకవైపు యూట్యూబ్ ద్వారా కోట్లాది మంది వినోదం పొందుతుండగా, మరోవైపు లక్షలాది మంది ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. నేటి రోజుల్లో యూట్యూబర్‌గా మారడం అనేది ఉద్యోగం కంటే ఉత్తమమైన ఆదాయం అందుకోగల వృత్తి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే యూట్యూబ్ ఎప్పుడు ప్రారంభమయ్యింది? దానిలో పోస్ట్ చేసిన మొదటి వీడియో ఏది? అనే ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యూట్యూబ్‌ని 2005లో స్టీవ్ చెన్, చాడ్ హర్లీ, జావేద్ కరీం ప్రారంభించారు. అయితే ఆ తర్వాత వీరు దీనిని 165 కోట్ల డాలర్లకు గూగుల్‌కు విక్రయించారు. ఈ రోజు ఈ యాప్‌కున్న క్రేజ్ ఎంతంటే ప్రతి నెలా 200 బిలియన్లకు(ఒక బిలియన్ అంటే వంద కోట్లు) పైగా వినియోగదారులు దీనిని సందర్శిస్తున్నారు. యూట్యూబ్‌లో మొదటి వీడియో 2005 సంవత్సరంలో ఏప్రిల్ 24న రాత్రి 8:27 గంటలకు అప్లోడ్ చేశారు. ఈ వీడియోను యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం అప్లోడ్ చేశారు. ఈ వీడియో టైటిల్ ‘మీ ఎట్ ది జూ’. ఈ 19 సెకన్ల వీడియోలో జావేద్ ఏనుగుల గురించి మాట్లాడుతూ ‘ఇప్పుడు మనం ఏనుగుల ముందున్నాం. ఏనుగులకు పొడవాటి తొండం ఉంటుంది’ అని అన్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 291 మిలియన్లకు (ఒక మిలియన్ అంటే పది లక్షలు) పైగా వీక్షణలు దక్కాయి. అదే సమయంలో 4.09 మిలియన్ల మంది ఈ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఈ వీడియోను 14 మిలియన్ల మంది లైక్ చేశారు. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఛానెల్లో ఈ వీడియో తప్ప మరో వీడియో అందుబాటులో లేదు. ఇది కూడా చదవండి: గోల్ఫ్ కోర్సుల రంధ్రాల మూసివేత ఎందుకు? -
యూట్యూబ్ ఛానల్‌తో కోటీశ్వరుడు అయ్యాడు, అలాంటి వీడియోలతొ..
‘అసాధ్యం’ అనే మాటలో కొందరు ‘అ’ అనే అక్షరాన్ని ఎప్పటికీ పట్టించుకోరు. అజయ్ అక్షరాలా అలాంటి కుర్రాడే. ‘మనం అనుకోవాలేగానీ సాధ్యం కానిది అంటూ ఏముంది’ అనేది అతడి నమ్మకం. అంతులేని బలం. చిన్న వయసులోనే యూట్యూబ్ ప్రపంచంలోకి వచ్చాడు హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన అజయ్ నాగర్. ఇరవై ఏళ్లు దాటే లోపే వైరల్ యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఔత్సాహిక యూట్యూబర్లకు రోల్‌మోడల్ అయ్యాడు. చిన్నప్పుడు ఫుట్‌బాల్ ట్యుటోరియల్ వీడియోలు చూస్తూ వాటి నుంచి స్ఫూర్తి పొంది యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు అజయ్. ‘అడిక్టెడ్’ పేరుతో ఉన్న అతడి యూట్యూబ్ చానల్ ఆ తరువాత ‘క్యారీ డియోల్’గా పేరు మార్చుకుంది. కొత్త పేరే కాదు...కొత్త కంటెంట్ వచ్చింది. గేమ్‌ప్లే ఫుటేజిని అప్లోడ్ చేయడం నుంచి హీరో సన్నీ డియోల్‌ను అనుకరించడం వరకు ఎన్నో చేశాడు. అజయ్ వీడియో ‘యూట్యూబ్ వర్సెస్ టిక్ టాక్: ది ఎండ్’ ఆరు రోజుల్లోనే 72.2 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్ సృష్టించింది. అజయ్ ఫాలోవర్స్ ఒక రేంజ్‌కు చేరుకునే సమయానికి చానల్ పేరు ‘క్యారీమినటీ’గా మారింది. ‘ఇంతకీ క్యారీమినటీ అంటే?’ అని అడిగితే ‘నాకు కూడా తెలియదు. ఇట్ జస్ట్ సౌండ్స్ కూల్ అని అలా డిసైడైపోయాను’ నవ్వుతూ అంటాడు అజయ్. ఒక వీడియో హిట్ అయిన తరువాత సంతోషం మాటేమిటోగానీ దాని ప్రభావం చేయబోయే వీడియో మీద పడుతుంది. ‘గత వీడియోను మించి వ్యూస్ రావాలి’ అనుకునే సమయంలో ఒత్తిడి వచ్చి తల మీద కూర్చుంటుంది. దాన్ని కిందికి దించడం కష్టమైన పని. మరి ఈ సమస్యను అజయ్ ఎలా ఎదుర్కొన్నాడు? అతడి మాటల్లోనే... ‘వీడియోలు చేస్తుప్పుడు ఒత్తిడికి గురవుతుంటారా? అని నన్ను చాలామంది అడిగే వాళ్లు. ఒత్తిడి ఏమిటి! అని ఆశ్చర్యపడేవాడిని. అయితే అది ఒకప్పటి సంగతి. ఆ తరువాత నాలో కూడా మెల్లగా ఒత్తిడి మొదలైంది. ఎన్నో లక్షల మంది నా వీడియోలు చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా చేయాలి. నెగెటివ్ కామెంట్స్ రావద్దు...అని ఒకటికి పదిసార్లు అనుకోవడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురయ్యేవాడిని. అయితే చివరి సమయంలో మాత్రం ఏదైతే అది అవుతుంది అనుకొని నా మనసుకు నచ్చినట్లు చేసేవాడిని. నా అంచనా ఎప్పుడూ తప్పలేదు’ఎవరి పిల్లలు వారికి ముద్దు అన్నట్లు ఎవరు చేసిన వీడియోలు వారికి మురిపెంగానే ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తన వీడియోలను యూట్యూబ్‌లోకి వదిలే ముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటాడు. బయటి ప్రేక్షకుడు ఎవరో చూస్తున్నట్లుగా తన వీడియోను చూస్తాడు.జీవితం పర్సనల్ లైఫ్,ప్రొఫెషనల్ లైఫ్ అని రెండు ప్రపంచాలుగా విడిపోయిన కాలంలో ఉన్నాం మనం. ప్రొఫెషనల్ లైఫ్‌లోనే అజయ్ ఎక్కువ కాలం గడపడం వల్ల కాలేజీ, యూనివర్శిటీలలో చదువుకునే అవకాశం రాలేదు. ఫ్రెండ్స్‌తో సరదాలు లేవు. వినోదాలు లేవు. అయితే అజేయపథంలో దూసుకుపోతున్న అజయ్ నాగర్‌కు వాటి గురించి గుర్తు రావడం అరుదే. ‘అజయ్ నాగర్, క్యారీమినటీ ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరి అవసరం మరొకరికి ఉంది. కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ లేడు అనే బాధ నాకు లేదు’ అంటాడు అజయ్.‘చాలా కష్టసమయంలో మీ వీడియో ఒకటి చూశాను. ఉత్సాహం పుంజుకోవడానికి అది నాకు ఔషధంలా పనిచేసింది’ ఇలాంటి ఈమెయిల్స్ అజయ్‌కు వస్తుంటాయి. వాటిని చదివినప్పుడల్లా తన బలం రెట్టింపు కావడంతో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది.హార్డ్‌వర్క్, టాలెంట్‌తో అయిదు యూట్యూబ్ అవార్డ్‌లతో పాటు అజయ్ ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు. ఆర్థిక కోణంలో కోటీశ్వరుడు అయ్యాడు. ఔత్సాహిక యూట్యూబర్లకు రోల్‌మోడల్‌గా మారాడు. -
Cyber Attack: యూట్యూబ్ లైక్ కొడితే రూ.77 లక్షలు దోచుకున్నారు!
ఏటికేటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ను ఊతంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆశచూపి సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. దీంతో అమాయకులు బలవుతున్నారు. లక్షల్లో నగదు పోగొట్టుకున్నాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని కేసుల్లో నగదు రికవరీ అవుతున్నా, మరికొన్ని ఘటనల్లో నగదు కోసం బాధితులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఆన్లైన్ జాబ్స్, పార్ట్‌టైం జాబ్స్ ఆశచూపి తాజాగా 56 ఏళ్ల వ్యక్తి దగ్గర ఏకంగా రూ.77 లక్షలు కొట్టేసిన ఘటన నాగ్‌పుర్‌లో చోటుచేసుకుంది. యూట్యూబ్ లైక్‌ల ద్వారా నగదు సంపాదించవచ్చు అని చెప్పి సైబర్ నేరగాళ్లు నాగ్‌పుర్‌కు చెందిన 56 ఏళ్లు సరికొండ రాజు అనే వ్యక్తిని టెలిగ్రాం ద్వారా తొలుత సంప్రదించారు. తమ వద్ద ఒక ఉద్యోగ అవకాశం ఉందని, సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించారు. ఇష్టమైన యూట్యూబ్ ఛానల్‌ను లైక్చేసి స్క్రీన్ షాట్లు పంపాలని కోరారు. అయితే ప్రారంభంలో అంతా మంచిగానే అనిపించింది. తనకు ఎటువంటి ఇబ్బంది రాదని రాజు భావించాడు. తాను చేసిన పనికి డబ్బులు కూడా వస్తుండడంతో సైబర్ నేరగాళ్లపై ఎలాంటి అనుమానం రాలేదు. దాంతో తన బ్యాంకు ఖాతా వివరాలను వారితో పంచుకున్నాడు. ఇదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్లు రాజు బ్యాంక్ ఖాతా నుంచి అనధికార లావాదేవీలు నిర్వహించారు. ఏకంగా రూ.77 లక్షలు దోచుకున్నారు. చేసేదేమిలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు, ఓ బుకీని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మరో కోణం బయటపడింది. ఇటీవల జరిగిన భారత్ పాక్ ప్రపంచ కప్ మ్యాచ్‌పై బెట్టింగ్ పాల్పడినట్లు సదరు బుకీ అంగీకరించాడు. పార్ట్ టైం ఉద్యోగాలు, సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అంటూ ఎవరైనా ఆశచూపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వారు ఎంత మభ్యపెట్టినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోకూడదని పోలీసులు తెలిపారు. -
టైం మెచ్చిన ధృవ్తార!
యూట్యూబ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు... ధృవ్ రాఠీ. ఈ హరియాణా కుర్రాడు యూట్యూబర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. గాలివాటంగా విజయం సాధించలేదు. తనదైన సక్సెస్ ఫార్ములాను రూపొందించుకున్నాడు. ఆడియో స్పేస్‌లోకి అడుగు పెట్టి పాడ్‌కాస్టర్‌గా కూడా సత్తా చాటాడు. ‘డబ్బు కోసం కాదు ప్యాషన్‌తో పనిలోకి దిగండి. సామాజిక బాధ్యతను మరవకండి’ అంటున్న ధృవ్ రాఠీ తాజాగా టైమ్ మ్యాగజైన్ ‘నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్ 2023’ జాబితాలో చోటు సంపాదించాడు... ధృవ్ రాఠీ సొంత రాష్ట్రం హరియాణా. జర్మనీలోని కాజ్రువ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్, అదే ఇన్స్టిట్యూట్లో రెన్యూవబుల్ ఎనర్జీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ట్రావెల్ వీడియోలతో ప్రయాణం ప్రారంభించిన ధృవ్ ఆ తరువాత రాజకీయా, సామాజిక అంశాలపై దృష్టి సారించాడు. ‘ఇన్సైడ్ ది వరల్డ్స్ స్మాలెస్ట్ కంట్రీ’ ‘గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ దిల్లీ స్కూల్స్’ ‘క్లీనింగ్ నైన్ మిలియన్ కేజీ వర్త్ ఆఫ్ ట్రాష్’.... మొదలైన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఏదో ఒక వీడియో చేయాలి, వదలాలి అని తొందర పడకుండా ఆచితూచి ఆలోచించి వీడియోలు చేసేవాడు ధృవ్. ‘చేయకపోయిన ఫరవాలేదు. చేసింది మాత్రం బాగుండాలి’ అని గట్టిగా నమ్ముతాడు. ఒక అంశంపై వీడియో చేయాలనుకున్నప్పుడు ‘కెమెరా ఉంది కదా. ఇది చాలు’ అనుకోకుండా ఆ అంశంపై లోతుగా రిసెర్చ్ చేస్తాడు. జర్నల్స్, రిపోర్ట్స్ చదవడంతో పాటు ఎంతోమంది నిపుణులతో మాట్లాడతాడు. ఆ తరువాతే పనిలోకి దిగుతాడు. ‘డబ్బులు బాగా గడించాలనే లక్ష్యంతో యూట్యూబర్‌గా మారవద్దు. యూట్యూబ్ అనేది జస్ట్ ఫర్ మనీ అనే భావనను మనసులో నుంచి తీసివేయాలి. ప్యాషన్ ఉన్నప్పుడే క్రియేటర్ కావాలి. ఒక క్రియేటర్ సక్సెస్ కావడానికి ఓపిక అనేది అతి ముఖ్యం. ఇక నేను తెలుసుకునేది ఏమీ లేదు అనుకోకుండా అనుభవాలు, పరిస్థితుల నుంచి ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నది ఏమిటో నా గత వీడియోలు, ఇప్పటి వీడియోలకు మధ్య ఉన్న తేడాను గమనిస్తే తెలుస్తుంది. ఖరీదైన టెక్నికల్ టూల్స్ వాడినంత మాత్రాన పేరు రాదు అనేది గ్రహిం చాలి. వృథాగా డబ్బులు ఖర్చు చేయవద్దు. సింపుల్ కెమెరా ఫోన్, ఫ్రీ వీడియో ఎడిటర్‌తో మన ప్రయాణం మొదలు పెట్టవచ్చు. సామాజిక బాధ్యతను ఎప్పుడూ మరవద్దు’ అంటాడు ధృవ్. ‘పాపులర్ యూట్యూబర్’గా పేరు వచ్చినప్పటికీ అక్కడే ఆగిపోకుండా ఆడియో స్పేస్‌లోకి అడుగు పెట్టాడు ధృవ్ రాఠీ. పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్, సోషల్, ఎకనామిక్స్ టాపిక్‌లను కవర్ చేస్తూ పాడ్‌కాస్టర్‌గా కూడా తానేమిటో నిరూపించుకున్నాడు. ‘పాడ్‌కాస్ట్‌లో అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. విజువల్‌గా ఆట్టుకునే అవకాశం లేదు. యానిమేషన్‌కు వీలులేదు. కేవలం మాట మాత్రమే ముఖ్యం అవుతుంది. శ్రోతలు తమ పనులు చేసుకుంటూ కూడా మన మాటలు ఆసక్తిగా వినేలా చేయాలి. పాడ్‌కాస్టింగ్‌లో నేను వీడియోలో ఎలా కనిపించాలి? అనేదాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆకట్టుకునేలా ఎలా మాట్లాడాలి? అనేదానిపైనే దృష్టి ఉంటుంది. నా ముఖాన్ని మాత్రమే కాదు గొంతు కూడా చాలామంది గుర్తుపట్టడం అనేది పాడ్‌కాస్టింగ్‌లో నాకు ప్లస్‌పాయింట్ అయింది. పాడ్‌కాస్టర్‌గా నాకు మంచి మార్కులు వేస్తూ శ్రోతలు నుంచి మెయిల్స్, మెసేజ్‌లు వస్తుంటాయి’ అంటున్న ధృవ్ అభిరుచుల విషయానికి వస్తే...ప్రయాణాలు, ఫొటోగ్రఫీ, స్కూబా–డైవింగ్, పుస్తక పఠనం అంటే ఇష్టం. ‘తక్కువలో ఎక్కువ’ అనేది నమ్మే సూత్రం. (చదవండి: సాధారణ ఉద్యోగిగా అడుగుపెట్టి..నేడు సంపన్న మహిళగా..!) -
సోషల్ మీడియాలో కనపడని పార్టీల సైన్యం!
ఒకప్పుడు.. ఎన్నికల ప్రచారమంటే ఊరూరా పార్టీలు, నాయకుల ర్యాలీలు.. మైకులలో హోరెత్తే ప్రసంగాలు.. ప్రచార పాటలతో తిరిగే వాహనాలు మాత్రమే అన్నట్టుండేది. ప్రతి పార్టీకి, అభ్యర్థికి వారి మద్దతుదారులే ప్రచార సేనగా ఉండేవారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా సైన్యం ఎన్నికల కదనంలో తెరవెనుక ఉంటూ కనిపించని యుద్ధం చేస్తోంది. ఓటర్లపై దీని ప్రభావం ఎక్కువే ఉంటుండటంతో.. ప్రతి పార్టీ ప్రత్యేకంగా తమకంటూ ఓ సోషల్ మీడియా వింగ్‌ను ఏర్పాటు చేసుకుంది. కొన్ని పార్టీల నేతలు, కొత్తగా ఎన్నికల్లో పోటీలో దిగుతున్నవారు కూడా సైతం ఎవరికి వారు సొంతంగా సోషల్ టీంలను పెట్టుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ప్రచారం ఎలా ఉండబోతోంది, సాంకేతికంగా దీని వెనుకదాగున్న అంశాలపై కథనం.. – సాక్షి , హైదరాబాద్ ‘సోషల్’ప్రచారం.. ఎందులో ఎలా? ఫేస్బుక్లో ప్రత్యేక పేజీలు, ఖాతాలు సృష్టించి ప్రమోషన్.. ఇన్‌స్టాగ్రాంలో రీల్స్ ద్వారా.. ట్విట్టర్ (ఎక్స్)లో హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా.. యూట్యూబ్ చానల్స్‌లో ఎక్కువ లైక్స్, వ్యూస్ వచ్చేలా చేయడం. సోషల్ మీడియా వాడకం సూక్ష్మంగాఇలా.. ♦ కంటెంట్ క్రియేషన్ ♦ కంటెంట్ ప్రమోషన్ అండ్ ట్రెండింగ్ ♦ సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్ ♦ కంటెంట్ క్రియేషన్.. కంటెంట్ రైటర్లు.. కంటెంట్ క్రియేషన్.. కంటెంట్ రైటర్లు.. సోషల్ మీడియాలో మంచి ప్రచారం పొందాలంటే ఓటర్లను ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా.. అనుకూల ఓటరుగా మార్చేలా వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, వీడియో, ఆడియో సందేశాలు ఉండాలి. ఇందుకే అన్ని రాజకీయ పార్టీలు కంటెంట్ రైటర్లను, క్రియేటర్లను నియమించుకుంటున్నాయి. నేతలు కూడా వ్యక్తిగత సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ కంటెంట్ క్రియేటర్లు రోజువారీగా వారికి ఇచ్చిన టార్గెట్ నియోజకవర్గ పరిధిలోని సమస్యలు, సదరు రాజకీయ పార్టీ లేదా పోటీలో ఉన్న నాయకుడి గురించిన సానుకూల అంశాలు.. ప్రత్యర్థి పార్టీ, అభ్యర్థుల బలహీనతలపై విమర్శలతో కంటెంట్‌ను రాసి ఇస్తూ ఉంటారు. కంటెంట్ ప్రమోషన్ అండ్ ట్రెండింగ్.. కంటెంట్ రైటర్ల ద్వారా తీసుకున్న అంశాలతో తయారు చేసిన కథనాలు, ఆడియోలు, వీడియోలు, ఫొటోలను టార్గెట్‌గా పెట్టుకున్న అసెంబ్లీ సెగ్మెంట్, జిల్లా లేదా రాష్ట్రం మొత్తంగా ఓటర్లకు వివిధ రకాల సోషల్ మీడియా వేదికల ద్వారా చేర్చడమే కంటెంట్ ప్రమోషన్. ఇందుకోసం కంటెంట్ ప్రమోటర్లు తొలుత ఆ రాజకీయపార్టీ, నేతల పేరిట ఫేస్బుక్, ట్విట్టర్ (ఎక్స్), ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ చానళ్లు, వాట్సాప్ గ్రూపులు, చానళ్లు వంటివి సృష్టిస్తారు. సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్ సోషల్ మీడియా అనేది బయటికి కనిపించని డిజిటల్ ప్రపంచం. అందులో మనం పోస్ట్ చేస్తున్న, వైరల్ చేస్తున్న కంటెంట్‌ను, వీడియోలు, ఫొటోలు, సమాచారం, ఆడియో మెసేజ్‌లు ఎంత వరకు టార్గెట్ ఓటర్లకు చేరుతుంది. ఒకవేళ చేరకపోతే ఎందుకు చేరడం లేదు? టార్గెట్ ఓటర్ను ఆకర్షించేలా ప్రత్యర్థి పార్టీలు ఎలాంటి ప్రమోషన్ చేస్తున్నాయి? వాటిని కౌంటర్ చేయాలంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలన్న అంశాలను విశ్లేషించడాన్నే స్థూలంగా సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్‌గా చెప్పొచ్చు. దీని ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా కంటెంట్‌లో ఎలాంటి మార్పులు చేయాలనేది కంటెంట్ రైటర్లకు సూచనలు చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో అంశాలనే కాకుండా క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి ప్రజల నాడి తెలుసుకోవడం కూడా ఈ సోషల్ మీడియా సెంటిమెంట్ అనాలసిస్ టీమ్‌ల పనిగా చెప్పొచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సోషల్ మీడియాతో.. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడటం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆన్లైన్ డిబేట్లు, సోషల్ మీడియాలో గట్టి ప్రచారంతో ఆయన ముందంజలో నిలుస్తున్నారని అక్కడి రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరింత ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు. హ్యాకింగ్ టీమ్‌లతో గుట్టు తెలుసుకుంటూ.. పలు రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలు, నేతల వ్యూహాలను తెలుసుకోవడం కోసం సైబర్ హ్యాకింగ్ నిపుణుల సేవలనూ వాడుకుంటున్నారు. సోషల్ మీడియా పెనెట్రేటింగ్ టూల్స్‌ను వినియోగించి.. కీలక వివరాలు సేకరించి, తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నారు. ప్రచార ట్రెండ్ మారింది.. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను చేరేందుకు సోషల్ మీడియా అనేది రాజకీయ పార్టీలకు, నేతలకు అస్త్రంగా మారింది. ఓటర్లకు మన బలాన్ని చెప్పడంతోపాటు ఎదుటి వ్యక్తి బలహీనతలపై ఓటర్లను ఆలోచింపజేసేలా ఈ డిజిటల్ ప్రచారం ఉపయోగపడుతోంది. పార్టీలే కాదు అభ్యర్థులు సైతం సొంతంగా సోషల్ మీడియా ప్రచార టీమ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వాట్సాప్ చానల్.. నయా ట్రెండ్.. స్మార్ట్‌ఫోన్ ఉండి, ఇంటర్నెట్ వాడే ఉన్న ప్రతి ఒక్కరూ వాడుతున్న సోషల్ మీడియా యాప్ అంటే వాట్సాప్ అని టక్కున చెప్పేయొచ్చు. ఇందులో ఇటీవల జతచేసిన సరికొత్త చానల్ ఫీచర్ సైతం ఎన్నికల వేళ అభ్యర్థులకు, ఆయా పార్టీలకు బాగా ఉపయోగపడుతోంది. ఈ వాట్సాప్ చానల్ ట్రెండ్ బాగా పెరుగుతోంది. వాట్సాప్ చానల్లో సదరు పార్టీలు, నాయకులు తమ కంటెంట్‌ను వైరల్ చేస్తూ ఓటర్లకు చేరుతున్నారు. ఇది కూడాకంటెంట్ ప్రమోషన్‌గా చెప్పొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్స్.. టిక్‌టాక్ వీడియోలు, హెల్త్, యోగా, ఫ్యాషన్ ఇలా పలు అంశాలపై సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇన్ఫ్లూయెన్సర్ల (సోషల్ మీడియాలో ప్రభావవంతమైన వ్యక్తులు)కు డబ్బు చెల్లించి ఒప్పందం చేసుకోవడం ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మరో విధానం. మనం చెప్పదలచుకున్న అంశాలపై వీడియోలు, లింక్‌లు ఇస్తే.. వాటిని లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో వాటిని షేర్ చేస్తారు. ఇందులో ఇన్ఫ్లూయెన్సర్ల ఫాలోవర్స్‌కు సదరు రాజకీయ పార్టీ లేదా నేత కంటెంట్‌ను చేర్చుతున్నారు. ఒక్కో చోట..ఒక్కోలా.. ♦ ఫేస్బుక్లో పార్టీ లేదా నాయకుడి కంటెంట్, ఆడియోలు, వీడియోలు, ఫొటోలు ఓటర్లకు చేరాలనుకుంటే అధికారికంగానే ఫేస్బుక్ యాడ్ సెన్స్‌లో ప్రమోషన్‌కు కొంత డబ్బులు చెల్లిస్తే చాలు. స్పాన్సర్డ్ ప్రకటనలు వైరల్ అవుతాయి. ఇందుకోసం మనం ఇచ్చిన వివరాలతో ఫేస్బుక్ ఓ జియోఫెన్సింగ్ క్రియేట్ చేస్తుంది. దాని ఆధారంగా ఈ కంటెంట్ వెళ్లేలా చేస్తారు. ♦ గూగుల్ యాడ్ సెన్స్‌లోనూ డబ్బులు చెల్లిస్తే.. ఫేస్బుక్ లింక్, యూట్యూబ్ లింక్, ఇన్‌స్ట్రాగామ్ లింక్ అందులో షేర్ చేస్తారు. ఇలా కూడా కంటెంట్ ప్రమోషన్ చేస్తున్నారు. గూగుల్లోకి వెళ్లి సెర్చ్ చేయగానే మనం ప్రమోట్ చేయాలనుకున్న లింక్‌లు హైలెట్ అయ్యేలా చేయడమే గూగుల్ యాడ్ సెన్స్. -
ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్‌లకు నోటీస్ - వాటిని వెంటనే తొలగించండి
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. నోటీసులు అందించడానికి కారణమేంటనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (చిన్న పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించినవి) ప్లాట్‌ఫామ్స్ నుంచి వెంటనే తీసివేయాలని హెచ్చరించింది. ఈ సందర్భంగా ఆయా ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా భవిష్యత్తులో కంటెంట్ మోడరేషన్ అల్గారిథమ్‌లు, రిపోర్టింగ్ మెకానిజమ్స్ వంటి చురుకైన చర్యలను కూడా అమలు చేయాలని తెలిపింది. ఈ నియణామాన్ని పాటించకుంటే 2021 రూల్ 3(1)(బి) అండ్ రూల్ 4(4) ఉల్లంఘనగా పరిగణించబడుతుందని ప్రకటనలో తెలిపింది. దీనిని ఉల్లంఘిస్తే.. సెక్షన్ 79 ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇదీ చదవండి: అంబానీ కంపెనీతో ఏడీఏఐ డీల్.. వేలకోట్లు పెట్టుబడికి సిద్ధం! There will be ZERO #tolerance for criminal & #harmful content on Indian #Internet. #ITRules under the #ITAct clearly lays down the expectation from #Intermediaries: They cannot host #criminal & harmful content like #CSAM. If Intermediaries do not act swiftly to clean up such… pic.twitter.com/PRQ9VypbR6 — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 6, 2023 -
మేకప్ వీడియోలతో సూపర్ క్రేజ్..ఏకంగా 19M ఫాలోవర్స్
ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ యూట్యూబ్.. పేరు బ్రెట్మ్యాన్. ఫిలిప్పీన్స్‌లో పుట్టాడు, హానలూలూలో పెరిగాడు. అమెరికన్ సిటిజన్‌గా సెటిల్ అయ్యాడు. బ్రెట్మ్యాన్ అసలు పేరు Sacayanan Laforga. వాళ్ల నాన్నకు.. రెజ్లర్స్ బ్రెట్ ‘ద హిట్‌మన్’ హార్ట్, డ్వైన్ ‘ద రాక్’ జాన్సన్ అంటే చాలా ఇష్టమట. అందుకే కొడుకును.. ఆ ఇద్దరి పేర్లు కలిసొచ్చెటట్టు బ్రెట్మ్యాన్ రాక్ అని పిలవడం షురూ చేశాడట. ఒరిజినల్ పేరు కన్నా నాన్న పెట్టిన బ్రాట్మ్యాన్ రాకే మంచిగా ఉందని దానికే ఫిక్స్ అయ్యాడట కొడుకు. 2015లో మేకప్ టిప్స్ వీడియోస్‌తో సోషల్ మీడియాలతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ వీడియోస్‌లో కాండిడ్ హ్యూమర్ కామెంట్రీతో పాపులర్ అయ్యాడు. ఇన్నోవేటివ్ ఫ్యాషన్ సెన్స్కీ ఫేమస్ అయ్యాడు. ఇవన్నీ కలిసే బ్రెట్మ్యాన్ని యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్స్‌ని చేశాయ్. అకార్డింగ్ టు ఆన్లైన్ సోర్స్ .. బ్రెట్మ్యాన్ రాక్కి ఇప్పుడు ఆల్మోస్ట్ 9 మిలియన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, 18.5 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ 15.1 మిలియన్ టిక్‌టాక్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. View this post on Instagram A post shared by Bretman Rock (@bretmanrock) View this post on Instagram A post shared by Vogue Philippines (@voguephilippines) -
పెట్టుబడికి సోషల్ రూట్..?
ఇటీవలి స్టాక్ మార్కెట్ రికార్డుల ర్యాలీ కొత్త ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2023 జూలై నాటికి 12.3 కోట్లు దాటిపోయింది. 2020 మార్చి నాటికి ఉన్న 4 కోట్లతో పోలిస్తే మూడేళ్లలోనే మూడు రెట్లు పెరిగాయి. అంటే మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్ల రాక ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. (టేబుల్–గడిచిన 12 నెలల్లో డీమ్యాట్ ఖాతాల తీరు). తమ పెట్టుబడులు అనతి కాలంలోనే భారీ రాబడులు ఇవ్వాలనే ఆకాంక్ష కొత్త ఇన్వెస్టర్లలో సహజంగానే కనిపిస్తుంటుంది. ఫలితంగా మలీ్టబ్యాగర్ల కోసం జల్లెడ పడుతుంటారు. గతంలో అయితే స్టాక్స్‌లో పెట్టుబడి కోసం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులను విచారించే వారు. సోషల్ మీడియా వ్యాప్తితో నేటితరం ఇన్వెస్టర్ల ప్రపంచం మరింత విస్తృతం అయింది. ఎన్నో యూట్యూబ్, ఫేస్బుక్, టెలీగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలు తెరుచుకుంటున్నాయి. ఎంతో మంది నిపుణుల అవతారం ఎత్తుతున్నారు. ఫలానా స్టాక్స్ కొనుగోలు చేయాలనే టిప్స్‌కు ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ పెట్టుబడులకు సంబంధించి కనీస ప్రాథమిక సూత్రాలను విస్మరించకూడదు. నియంత్రణల పరిధిలో లేని సామాజిక మాధ్యమ వేదికలపై చెప్పే సమాచారానికి, ఇచ్చే సలహాలకు జవాబుదారీ ఏది? ఏది నిజం, ఏది తప్పుదారి? తెలుసుకోవడం ఎలా? ఇది అవగాహనపైనే తెలుస్తుంది. ఈ దిశలో సాయపడేదే సోషల్ ఇన్వెస్టింగ్. ఆచరణ ముఖ్యం ఒకరి నుంచి నేర్చుకోవడం, ఆచరణలో పెట్టడం ఈ రెండు వేర్వేరు. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు ట్రేడింగ్, పెట్టుబడి గురించి తెలుసుకునేందుకు సాయపడతాయి. ‘‘ఇన్వెస్టర్‌కు ఒక ప్రణాళిక ఉండాలి. దానికి కట్టుబడి ఉండాలి. రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తాము పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ కంటే నేరుగా స్టాక్స్‌లో తక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ఆ మధ్య నిర్వహించిన ఒక సర్వేలో తెలిసింది. దీనికి ఇన్వెస్టర్లు మార్కెట్లో అనుకూల సమయం కోసం వేచి చూసి, ఇన్వెస్ట్ చేయడం కారణం కావచ్చు. లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌ను అనుకూలం కాని సమయంలో విక్రయించి, కొనుగోళ్లు చేస్తుండొచ్చు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత వార్తలు, ప్రతికూల విశ్లేషణలు చూసి చలించిపోకుండా, ఫండ్స్ మాదిరిగా స్థిరమైన వైఖరి అనుసరించాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్లో తోటి ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో చూసి పెట్టుబడులు పెట్టినట్టయితే.. మార్కెట్ల పతనాల్లో ఎంత స్థిరంగా, దృఢంగా ఉండగలరన్నది కీలకం అవుతుంది. ఆ సమయంలో భయపడి విక్రయించారంటే రాబడులు గణనీయంగా తగ్గిపోతాయి. నష్టాలూ ఎదురు చూడొచ్చు’’అని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దీపేశ్ రాఘవ్ వివరించారు. మార్గదర్శిగానే.. ఇన్వెస్టింగ్ వేదికలను మార్గదర్శిగానే చూడాలి. గుడ్డిగా అనుసరించడం సరికాదు. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తగినంత అవగాహన, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్న తర్వాత, విడిగా ప్రతీ ఇన్వెస్టర్ తన వైపు నుంచి లోతైన అధ్యయనం చేయాలి. ఆ తర్వాతే తనకు అనుకూలమైన పెట్టుబడుల వ్యూహాలను అనుసరించాలి. ఇతరులు కేవలం తమ అనుభవాన్ని పంచుతారే కానీ, జవాబుదారీగా ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు స్టాక్స్, ట్రేడింగ్ గురించి నేర్చుకునే వేదికలే. ఇన్వెస్టర్లు ఎవరికి వారే తమ వంతుగా పెట్టుబడుల లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఎవరో పోర్ట్‌ఫోలియో కాపీ చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత, నష్టాలు వచ్చాయని పరిహారం డిమాండ్ చేయలేరు. గుడ్డిగా అనుసరించడం సరికాదు.. కొత్త ఇన్వెస్టర్లు ఉచిత లేదా చెల్లింపుల వేదికల ద్వారా స్టాక్స్‌లో పెట్టుబడులు, ట్రేడింగ్‌కు మొగ్గు చూపించే ముందు.. ఆయా వేదికలు తమ లక్ష్యాలు, రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోయే వేనా? అన్నది ఒక్కసారి తరిచి చూసుకోవాలి. ‘‘తాము అనుసరించే తోటి ఇన్వెస్టర్ల ప్రొఫైల్‌ను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వారు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. వారి పోర్ట్‌ఫోలియో తీవ్ర అస్థిరతలతో కూడుకుని ఉండొచ్చు. ‘‘ప్రతి వ్యక్తి లక్ష్యాలు, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. మీ స్నేహితులు లేదా ఇతరులు వారి కోణం నుంచి సాధారణ సూచనలు ఇవ్వొచ్చు. అది విడిగా ప్రతి ఇన్వెస్టర్‌కు అనుకూలమైనదని చెప్పలేం. మీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియో, భవిష్యత్ నగదు అవసరాలు, రిస్క్ సామర్థ్యం ఇలాంటివి ఏవీ ఎదుటి వారికి తెలియవు’’అని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పారుల్ మహేశ్వరి పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టే ముందు పోర్ట్‌ఫోలియోను ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. తమకు సరిపోలని ఉత్పత్తులు, సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ట్రేడింగ్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టింగ్లో రిస్క్ తక్కువ. ఈ రెండింటిలో తమకు ఏది అనుకూలమో ఇన్వెస్టర్లే తేల్చుకోవాలి. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే..? ఎన్నో తరాల నుంచి ఇది ఉన్నదే సోషల్ ఇన్వెస్టింగ్ (ఇన్వెస్టర్ల సమూహం/సమాజం). గతంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల వరకే ఇది పరిమితం. ఇప్పుడు టెక్నాలజీ ఫలితంగా మరింత పెద్దదిగా అవతరించింది. ట్రేడర్లు, ప్రపంచవ్యాప్త నిపుణులు, ఇన్వెస్టర్లు ఇందులో భాగమవుతున్నారు. సోషల్ ఇన్వెస్టింగ్ యాప్స్, ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఏవి అసలైనవో, ఏవి నకిలీవో గుర్తించేందుకు ఇవి దారి చూపిస్తున్నాయి. సీనియర్ ట్రేడర్లు, తమ మాదిరే ఆకాంక్షలతో కూడిన ఇన్వెస్టర్లతో చాట్, సంప్రదింపులకు ఇవి వేదికలుగా నిలుస్తున్నాయి. ట్రేడింగ్, పెట్టుబడులకు సంబంధించిన విజ్ఞానం పంచుకునేందుకు వారధిగా పనిచేస్తున్నాయి. అనుభవజు్ఞలైన ట్రేడర్ల పోస్ట్‌లు, పోర్ట్‌ఫోలియోను వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తాజా సమాచారానికితోడు, పెట్టుబడుల సలహాలు కూడా వీటిపై అందుకోవచ్చు. యూఎస్, యూరప్‌లో అయితే ఇన్వెస్టర్లు, నిపుణుల ట్రేడ్ పోర్ట్‌ఫోలియోను ఇతరులు కాపీ చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన ఈటోరో కూడా ప్రముఖ సోషల్ ఇన్వెస్టింగ్ పోర్టల్. ధ్రువీకరించిన ట్రేడర్ల పోర్ట్‌ఫోలియోలను ఈ వేదికపై పరిశీలించొచ్చు. కానీ, మన దేశంలో ఇంకా ఈ విధమైన అవకాశం అందుబాటులోకి రాలేదు. మన దగ్గర సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది ఒక చిన్న ఇన్వెస్టర్ల సమూహంగానే ప్రస్తుతం ఉంది. ‘‘సోషల్ ఇన్వెస్టింగ్ అన్నది విస్తృతమైన పదం. ఒక ఉమ్మడి వేదికగా వ్యక్తుల మధ్య సంప్రదింపులకు వీలు కలి్పంచేది. స్టాక్ ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు), కంపెనీ లాభ, నష్టాల నివేదిక విశ్లేషణ, కీలక రేషియోలు, సాంకేతిక సూచికలు, మార్కెట్ ధోరణులపై సంప్రదింపులకు అవకాశం కలి్పస్తుంది. ఇన్వెస్టర్లు తాము అనుసరించే ట్రేడింగ్ విధానాలు, పోర్ట్‌ఫోలియోను వీటిపై ఇతరులతో పంచుకుంటారు’’అని స్మాల్‌కేస్ సీఈవో వసంత్ కామత్ తెలిపారు. నేర్చుకునే మార్గం.. ‘‘కరోనా సమయంలో మార్కెట్లు కనిష్ట స్థాయిలను చవిచూశాయి. దాంతో అవి ఆకర్షణీయంగా మారాయి. సెబీ కేవైసీ నిబంధనలను సరళతరం చేసింది. దీంతో ఆన్లైన్లోనే వేగంగా ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడింది. దీనికితోడు యువ జనాభా ఎక్కువ మంది ఇంటికి పరిమితం కావడం పెద్ద ఎత్తున డీమ్యాట్ ఖాతాల ప్రారంభానికి దారితీసింది’’అని ప్రభుదాస్ లీలాధర్ రిటైల్ బ్రోకింగ్ సీఈవో సందీప్ రాయ్చురా తెలిపారు. ముంబైకి చెందిన ఉత్కర్‡్ష (32) కూడా కరోనా సమయంలో మార్కెట్లోకి ప్రవేశించిన వారిలో ఒకరు. సహజంగా వ్యాపారవేత్త అయిన ఆయన ఇప్పుడు స్టాక్స్‌లో చురుగ్గా ట్రేడింగ్ చేస్తున్నారు. తొలుత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతాను ఉపయోగించుకున్నారు. స్టాక్స్‌లో ట్రేడింగ్ చేయాలని 2021 మార్చిలో ఆయన నిర్ణయించుకున్నారు. కానీ ఇందుకు సంబంధించిన సమాచారం ఎలా తెలుసుకోవాలో ఆయనకు తోచలేదు. ఆ సమయంలో మలీ్టబ్యాగర్లు అంటూ పెన్నీ స్టాక్స్ గురించి యూట్యూబ్ చానళ్లు, ట్విట్టర్ పోస్ట్‌లలో టిప్స్ కనిపించేవి. అయినా సరే వాటి ట్రాప్‌లో ఆయన పడిపోలేదు. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ తరహా అనధికారిక, రిజిస్ట్రేషన్ లేని అడ్వైజర్లు, సామాజిక మాధ్యమ వేదికల అణచివేతకు సెబీ కఠిన చర్యలు తీసుకోవడం గమనించొచ్చు. ఉత్కర్‡్ష స్వతహాగా కొంత అవగాహన కలిగి ఉండడంతో విశ్వసనీయత లేని ఇలాంటి బూటకపు చానళ్ల బారిన పడకుండా, సోషల్ ఇన్వెస్టింగ్ ఫోరమ్‌లలో చేరాడు. అన్నీ కాదు కానీ, కొన్ని ఉపయోగకరమైనవి అని కొంత కాలానికి ఆయనకు అర్థమైంది. కొందరు అనుభవం కలిగిన స్టాక్ ట్రేడర్లు స్టాక్స్, ఫండ్స్, పెట్టుబడి సూత్రాల గురించి చెప్పడం తనకు నిజంగా సాయపడినట్టు ఉత్కర్‡్ష వెల్లడించారు. వీటి సాయంతో ట్రేడింగ్‌పై అవగాహన మరింత పెరిగింది. ఇప్పటికీ ఈ సామాజిక మాధ్యమ ఫోరమ్‌ల సాయంతో స్టాక్స్ ట్రెండ్స్ గురించి ఆయన తెలుసుకుంటూనే ఉంటారు. సోషల్ ఇన్వెస్టింగ్ అంటే ఇదే. ‘‘మార్కెట్లోని సీనియర్, అనుభవజ్ఞులైన ట్రేడర్ల నుంచి కొత్త ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నేర్చుకునే వేదికగానే సోషల్ ఇన్వెస్టింగ్‌ను చూడాలి. మరొకరిని కాపీ కొట్టడం కాకుండా.. స్టాక్ పరిశోధన, వార్తలు, ట్రేడింగ్ విధానాలను రూపొందించుకోవడానికి మార్గంగా నిలుస్తుంది’’అని స్మాల్‌కేస్ వసంత్ కామత్ వివరించారు. ఒక్క ఉత్కర్‡్ష అనే కాదు లక్షలాది మందికి నేడు ఇలాంటి సామాజిక మాధ్యమ వేదికలు ఇన్వెస్టింగ్‌కు మెరుగైన దారి చూపిస్తున్నాయనడంలో సందేహం లేదు. కాకపోతే నిజమైన–మోసపూరిత వేదికల మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. సామాజిక మాధ్యమ వేదికలు ఇప్పుడు పోస్ట్‌లకు వచ్చే వ్యూస్ ఆధారంగా, ప్రకటనల ఆదాయాన్ని యూజర్లతో పంచుకుంటున్నాయి. దీంతో సీనియర్ ట్రేడర్లు తమ అనుభవాన్ని, ట్రేడింగ్, పెట్టుబడి విధానాలను తోటి యూజర్లతో పంచుకోవడం వల్ల వారికి అదొక ఆదాయ వనరుగానూ మారుతోంది. దీంతో కొత్త ఇన్వెస్టర్లు నేర్చుకునే అవకాశాలు, వేదికలు పెరిగాయి. -
వీడియోలు చూడటానికి ఇదే ఫేవరెట్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్లో వీడియోల వీక్షణకు ఎక్కువ మంది యూట్యూబ్‌ను ఎంచుకుంటున్నారు. ప్రతి అయిదుగురిలో నలుగురు తమ ప్లాట్‌ఫామ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు యూట్యూబ్ ఒక ప్రకటనలో తెలిపింది. యూట్యూబ్‌ను ఇంటర్నెట్ ఆధారిత టీవీల్లో చూసే వారి సంఖ్య గణనీయంగా ఉంటోందని తెలిపింది. అలాగే యూట్యూబ్ షార్ట్స్ (తక్కువ నిడివి ఉండే వీడియోలు) సగటు రోజువారీ వీక్షణలు 120 శాతం మేర పెరిగినట్లు సంస్థ తెలిపింది. షార్ట్స్ వీక్షకుల్లో 96 శాతం మంది .. 18–44 ఏళ్ల వయస్సు మధ్య వారు ఉంటున్నారని పేర్కొంది. కంటెంట్ అప్లోడ్స్ 40 శాతం పెరిగినట్లు యూట్యూబ్ వివరించింది. -
యూట్యూబర్లకు గుడ్ న్యూస్: సుందర్ పిచాయ్ ప్లాన్ అదిరిపోయిందిగా!
AI-Powered Video Editing App గూగుల్ యాజమాన్యంలోని ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) వీడియో క్రియేటర్లకు తీపి కబురు అందించింది. తాజాగా యూట్యూబ్ క్రియేట్ (YouTube Create) యాప్ లాంచ్ చేసేంది. అలాగే ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఎంటిలిజెన్స్ (AI)కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ క్రియేటర్లు వీడియోలను సులువుగా రూపొందించుకునేలా కొత్త యాప్‌ను తీసు కొస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్‌మాతృ సంస్థ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఎక్స్ (ట్విటర్)లోప్రకటించారు. AI పవర్డ్ టెక్నాలజీ రంగంలో తన మార్గ-బ్రేకింగ్ ఆవిష్కరణను వెల్లడించింది గూగుల్. Just announced at today’s #MadeOnYouTube event: Dream Screen lets creators type in an idea to produce an AI-generated video or image background, and creators can use YouTube Create to make video production much easier. https://t.co/mXxStE83N9 — Sundar Pichai (@sundarpichai) September 21, 2023 transport yourself to places you could only imagine - from a popcorn volcano to a jellybean beach 🤯 Dream Screen AI-generated backgrounds enter the chat in 2024. pic.twitter.com/11DXy6olYi — YouTube (@YouTube) September 21, 2023 వీడియో క్రియేట్‌లో ప్రెసిషన్ ఎడిటింగ్ , ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ వాయిస్ఓవర్, క్యాప్షనింగ్ ,ట్రాన్సిషన్స్ వంటి ఫీచర్లు ఉంటాయని కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. చాట్ బాక్స్‌లో మనం అనుకున్నది టైప్ చేయడం ద్వారా రి వీడియోలకు AI- రూపొందించిన వీడియో లేదా చిత్రాన్ని జోడించేలా 'డ్రీమ్ స్క్రీన్' అనే కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఉదాహరణకు, వినియోగదారులు "నేను పారిస్‌లో ఉండాలనుకుంటున్నాను" అని టైప్ చేస్తే దానికి సంబంధించి వీడియో లేదా చిత్రాన్ని వస్తుంది. ట్రెండింగ్ టాపిక్‌లు, ప్రేక్షకుల ప్రాధాన్యతల ఆధారంగా వీడియోల కోసం టాపిక్ ఐడియాలు, అవుట్‌లైన్‌లను రూపొందించడంలో సాయపడుతుంది. ఈ కొత్త యాప్ ప్రతి ఒక్కరికీ వీడియో ప్రొడక్షన్‌ను సులభతరం చేయడం, ముఖ్యంగా ఫస్ట్‌టైం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నవారికి మరింత అందుబాటులో ఉండేలా చేయడమే తమ లక్ష్యమని యూట్యూబ్ కమ్యూనిటీ ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ టోనీ తెలిపారు. ఈ ఫిచర్ షార్ట్-ఫారమ్ వీడియోల కోసం మాత్రమే కాకుండా, YouTubeలో లాంగ్ ఫామ్ కంటెంట్ సృష్టికి కూడా సమానంగా సపోర్ట్ చేస్తుందని ఆయన వెల్లడించారు. తద్వారా చిన్న వీడియోలు లేదా రీల్స్ విషయంలో యూత్ మనసు దోచుకున్న టిక్‌టాక్, ఇన్‌స్టాలోని యాప్‌లతో YouTube క్రియేట్ పోటీ పడనుంది. ప్రస్తుతానికి ఇది ఎంపిక చేసిన దేశాల్లో యాప్ ఆండ్రాయిడ్‌లో బీటా మోడ్‌లో తొలుత భారత్, అమెరికా,యూకె, జర్మనీ, ఫ్రాన్స్, ఇండోనేషియా, సింగపూర్, కొరియాలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. -
మీ పిల్లలు సైన్స్ అంటే భయపడుతున్నారా? ఈమె పాఠాలు వినిపించండి..
‘సరిగా అర్థం చేసుకోవడం నుంచే ప్రతిభకు బీజాలు పడతాయి’ అంటారు. ‘నాకు అర్థం కాలేదు’ అన్నంత మాత్రాన ఆ స్టూడెంట్ తెలివి తక్కువ అని కాదు. ఒక సబ్జెక్ట్ అర్థం కాకపోవడానికి, అవడానికి మధ్య ఏదో గ్యాప్ ఉండి ఉండవచ్చు. ఆ ఖాళీని పూరించగలిగితే అద్భుత ఫలితాలు సాధించవచ్చని ‘స్టెమాన్స్టర్’ద్వారా నిరూపించింది బెంగళూరుకు చెందిన సైంటిస్ట్ సోనాలి గుప్తా... ఆరోజు స్కూలు నుంచి వచ్చిన శ్రిష్టి తల్లి సోనాలిని ఒక డౌట్ అడిగింది.‘లోహంతో తయారు చేసిన ఓడ నీటిలో ఎలా తేలుతుంది?’నాల్గవ తరగతి చదువుతున్న శ్రిష్టి ఇలాంటి సందేహాలెన్నో తల్లిని అడుగుతుంటుంది. అప్పటికప్పుడు జవాబు చెప్పి చిన్నారి సందేహాన్ని తీరుస్తుంటుంది సోనాలి. ఇంట్లో శ్రిష్టి కోసం ఒక ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌ను పరిశీలించడం ద్వారా శ్రిష్టిలో శాస్త్రీయ విషయాలపై ఆసక్తి పెంచాలనేది సోనాలి కోరిక. ఫిజిక్స్‌లో పీహెచ్డీ చేసిన సోనాలికి కూతురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం అత్యంత సులువైన పని. మరి శాస్త్రీయ విషయాలపై అవగాహన లేని తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? ఓడకు సంబంధించిన కుమార్తె సందేహాన్ని ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే చెప్పింది సోనాలి. తాను అలా చెప్పడం వల్ల శ్రిష్టికి సులభంగా అర్థమైంది. ఇదే విధానంలో ఇతర పిల్లలకు చెబితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన లాక్డౌన్ టైమ్‌లో పట్టాలకెక్కింది. ‘అది నా జీవితంలో చెప్పుకోదగిన ముఖ్య సందర్భం’ అంటుంది సోనాలి. ‘లెర్నింగ్ బై డూయింగ్’ అనే నినాదంతో పిల్లలకు శాస్త్రీయ విషయాలపై అవగాహన పెంచడానికి హ్యాండ్స్–ఆన్ లెర్నింగ్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ‘స్టెమాన్స్టర్’కు శ్రీకారం చుట్టింది. రకరకాల సందేహాలను తీర్చేలా వాట్సాప్ వేదికగా ఎన్నో వీడియోలు చేసింది. సంప్రదాయ బోధన ఎలా మెరుగుపడాలో చెబుతున్నట్లుగా ఉండేవి ఆ వీడియోలు. పరిచితులు, అపరిచితులు, మిత్రుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ‘మీ వీడియోలు అంటే మా పిల్లలకు ఎంతో ఇష్టం’ అని ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు చెప్పినప్పుడల్లా సోనాలికి ఉత్సాహంగా ఉండేది. ‘చాలా స్కూళ్లలో సైన్స్ అనేది సూత్రాలు, నిర్వచనాల పరిధి దాటి బయటికి రాదు. నిర్వచనాలు నిర్వచనాలలాగే చెప్పడం వల్ల అందరు పిల్లలకు అర్థం కాకపోవచ్చు. అందుకే అందరికీ అర్థమయ్యేలా ప్రాక్టికల్‌గా చెప్పాలి. ప్రపంచంలో గొప్ప ల్యాబ్స్ అని చెప్పుకోదగ్గ ఎన్నో ల్యాబ్స్‌లో పనిచేశాను. ఎందరో పిల్లలు ఆ ల్యాబ్స్‌లో కనిపించేవారు. పిల్లలకు సైన్స్‌పై ఆసక్తి అక్కడినుంచే మొదలవుతుంది’ అంటుంది సోనాలి. ‘స్టెమాన్స్టర్’ ద్వారా సైన్స్, గణితానికి సంబంధించి జటిలమైన కాన్సెప్ట్‌ల గురించి పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా వివిధ రకాల వస్తువులను ఉపయోగించి చెబుతున్నారు. ఎనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని వీటిని రూపొందించారు. ‘పిల్లలు నా నుంచి మాత్రమే కాదు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటున్నారు’ నవ్వుతూ అంటుంది సోనాలి. అయిదవ తరగతి చదువుతున్న ఆర్యన్ కేజ్రీవాల్‌కు సౌరవ్యవస్థ అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్. ‘స్టెమాన్స్టర్’ ΄ప్లాట్‌ఫామ్ ద్వారా తనకు ఇష్టమైన సబ్జెక్ట్‌కు సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాడు. ‘నేను ఒరిగామి స్టార్స్ తయారు చేస్తాను. వాటి ద్వారా ఎన్నో సైన్స్ విషయాలు ఫ్రెండ్స్‌కు చెబుతుంటాను’ అంటాడు ఆర్యన్. ‘మా అబ్బాయిలో ఎంత మార్పు వచ్చిందంటే ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్ వాడి ఫేవరెట్ సబ్జెక్ట్‌లు’ అంటుంది ఆనందంగా ఆర్యన్ తల్లి ఆంచల్. ప్రశ్న–జవాబుల నుంచి వర్క్‌షాప్‌ల వరకు ‘స్టెమాన్స్టర్’ ద్వారా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఆస్క్, డూ, లెర్న్, రిపీట్’ అంటూ పిల్లలకు దగ్గరవుతోంది స్టెమోన్స్టర్. -
గూగుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ యాప్స్ ఇక మరింత సులువు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో పనిచేసే ‘బార్డ్’ చాట్‌బాట్‌ను గూగుల్‌కు చెందిన మ్యాప్స్, డాక్స్, డ్రైవ్ వంటి మరిన్ని యాప్స్‌తో అనుసంధానం చేస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ (Google) వెల్లడించింది. అలాగే మరిన్ని దేశాల్లో, మరిన్ని భాషల్లో క్వెరీల ఫలితాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది. జీమెయిల్, డాక్స్, గూగుల్ డ్రైవ్ వ్యాప్తంగా గల వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి యూజర్లు అడిగే ప్రశ్నలకు బార్డ్ సమాధానాలు ఇవ్వగలదు. ఈ ఎక్స్టెన్షన్స్ డీఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటాయని, కావాలంటే వాటిని ఎప్పుడైనా డిజేబుల్ చేయొచ్చని గూగుల్ తెలిపింది. ఓపెన్ సోర్స్ జెన్ఏఐ ప్లాట్‌ఫాం చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌ను గూగుల్ రూపొందించింది. -
సోషల్ మీడియాలో బ్రాండింగ్ ప్రమోషన్ చేస్తున్నారా? అలా చేస్తే శిక్షార్హులు అవుతారు!
సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు వ్యూవర్స్‌ని యాడ్స్ ద్వారా ప్రభావితం చేస్తుంటారు. వీరితో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా వెలుగులోకి వస్తున్నవారు కూడా ఇ–కామర్స్ సంస్థల బ్రాండ్స్‌ను ఎలా ప్రచారం చేయాలో తెలుసుకోవాలి. ప్రకటనదారులు ఇన్ఫ్లుయెన్సర్లకు కానుకల ఆశ చూపి, తమ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా మార్చుకుంటారు. ఇవి తెలియని ఇన్ఫ్లుయెన్సర్లు ఉత్పత్తులకు, సేవలకు ప్రచారకర్తలుగా మారిపోతారు. వీరు చెప్పే బ్రాండ్స్‌ను గుడ్డిగా నమ్మి వ్యూవర్స్ వాటిని కొనుగోలు చేసి, మోసపోవచ్చు. అందుకే, భారత ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టం –2019 అమలులోకి తీసుకు వచ్చింది. ఉత్పత్తులు, సేవల గురించి తప్పుడు ప్రచారాలు చేసి, ప్రజలను మోసం చేస్తే వారు శిక్షార్హులు అవుతారని చెబుతోంది. వ్యూవర్లను, సబ్స్రైబర్లను పొందాలంటే.. సాధారణంగా ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్‌మీడియా ఛానెల్స్‌లో పోస్ట్ చేసిన వాటి విషయంలో ఈ పరిస్థితి తలెత్తదు. వాటిలో స్వీయప్రచారం లేదా సబ్‌స్రైబర్స్‌కి ఏదైనా సూచన ఇవ్వడం కనిపిస్తుంది. లాంగ్‌టైమ్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరిగా సక్సెస్ కావాలంటే ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేసే వ్యక్తిగానే ఉండాలి. ►అర్ధవంతమైన కంటెంట్, సంభాషణను ప్రదర్శించాలి. ► సబ్స్రైబర్లు, ఫాలోవర్లను కట్టిపడేలా మీ కంటెంట్ సమయాన్ని పెంచుకోవచ్చు. వ్యూవర్స్ అన్ని కామెంట్స్‌కు ప్రత్యుత్తరం ఇవ్వడం మర్చిపోవద్దు. ► సబ్స్క్రైబర్ల దృష్టి కోణం నుండి మీ పోస్ట్ ఉండేలా చూసుకోండి. కృత్రిమమైన డ్రామాను ప్లే చేయకూడదు. ► మీ ఛానెల్‌ను ఫాలో అవమని వ్యక్తులను అడగడంలో మీరు ఎంత పెద్దవారైనప్పటికీ సిగ్గుపడకూడదు. సబ్స్రైబర్లను కొనుగోలు చేయడం కంటే సోషల్‌మీడియా ఛానెల్లో ప్రమోషన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ► మీ పోటీదారులు ఎవరు, వారు సోషల్ మీడియాలో ఏమేం చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారో చూడండి. వారిని ఫాలో అవడం ద్వారా మీ లోపాలను సులభంగా గుర్తించి, సరి చేసుకోవచ్చు. అంతేకాదు, సబ్స్క్రయిబర్లను పెంచుకునే వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. ► ప్రతిరోజూ ఉండాలి కదా అని ఏదో ఒకటి పోస్ట్ చేయకండి. అది మీ వ్యూవర్స్‌ని పెంచదు. ప్రతి పోస్ట్ మీ లక్ష్యానికి చేరువ చేస్తుందా అని నిర్ధారించుకోండి. క్వాలిటీ కంటెంట్‌పైనే దృష్టి పెట్టండి. ► సాధారణంగా కొందరు రెచ్చగొట్టే చర్చలను, వివాదాలను సృష్టించడానికి ట్రోల్ చేస్తారు. దీనివల్ల సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లను సంతోషపెట్టలేరు. అలాగని, మీపై ట్రోల్ చేయడంలో వారి పూర్తి పాయింట్ అదే కాబట్టి ట్రోల్‌లను విస్మరించకూడదు. ► అన్ని సామాజిక ఛానెల్స్ కంటెంట్‌ను మానిటైజ్ చేస్తున్నందున జాగ్రత్తపడాలి. వార్తలు, వినోదం కోసం ఫేస్బుక్, బ్లాగ్ పోస్ట్‌లకు ట్విటర్, ఫోటోలు, వీడియోలకు ఇన్స్టాగ్రామ్, ఇండస్ట్రీలకు సంబంధించిన కథనాలకు లింక్డ్ ఇన్.. ఇలా దేనికది ఎంచుకోవాలి. ► మీ ప్రతిస్పందనలోనూ నిజాయితీగా ఉండండి. సోషల్‌మీడియా ఉనికికి సంబంధించిన ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. ► హాష్‌ట్యాగ్‌ల విషయాలపై సరైన పరిశోధన చేయండి. లేకుంటే, హ్యాష్‌ట్యాగ్‌లు మీ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రకటనలు ఎలా చేయాలి? ప్రకటనలు స్పష్టంగా, ప్రముఖంగా, మిస్ చేయడం చాలా కష్టంగా ఉండే విధంగా ఎండార్స్మెంట్ సందేశంలో ఉంచాలి. హ్యాష్‌ట్యాగ్‌లు లేదా లింక్‌ల సమూహంతో యాడ్స్‌ను బహిర్గతం చేయకూడదు. వ్యూవర్స్ గమనించే విధంగా ప్రకటనల ఎండార్స్ మెంట్ ఇమేజ్‌పై ఉంచాలి. ప్రకటనలు ఆడియో, వీడియో ఫార్మాట్లో చేయాలి. ప్రకటనలు మొత్తం లైవ్‌స్ట్రీమ్‌లో ప్రదర్శించాలి. సింపుల్ అండ్ క్లియర్ లాంగ్వేజ్ ఉండాలి. తగిన శ్రద్ధ .. ►సెలబ్రిటీలు/ఇన్ఫ్లుయెన్సర్లు ప్రకటనలో చూపిన విధంగా ఆ ఉత్పత్తులను తాము వాడి, ప్రయోజనం పొందేలా కూడా ఉండాలి. ఉత్పత్తి, సేవ తప్పనిసరిగా ఎండార్సర్ ద్వారా ఉపయోగించబడి ఉండాలని కూడా సిఫార్సు చేయబడింది. ► ఒక ప్రముఖ ఇ–కామర్స్ సంస్థ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను సంప్రదించి వారి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి తమ బ్రాండ్ దుస్తులను ధరించమని, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం కంటెంట్‌ను రూపొందించమని కోరాలి. ► సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఆన్లైన్లో కంటెంట్‌ను పోస్ట్ చేస్తే ఆ బ్రాండ్స్‌ను ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించాలి. ► సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు తమ మెటీరియల్ కనెక్షన్ ను బహిర్గతం చేయనట్లయితే, వారి అభిప్రాయం పక్షపాతంగా లేదా తప్పుదారి పట్టించేదిగా ఉందనుకోవాలి. ► ఏదైనా మెటీరియల్ కనెక్షన్ ను బహిర్గతం చేయడంలో ఇన్ఫ్లుయెన్సర్లు ఫెయిల్ అయితే వినియోగదారుల రక్షణ చట్టం – 2019 కింద చట్టం ప్రకారం కఠిన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే, తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఉచిత ఉత్పత్తుల వల్ల.. వ్యూవర్స్ నిర్ణయాలు లేదా అభిప్రాయాలను ప్రభావితం చేసే శక్తి ఉన్న ప్రముఖ వ్యక్తులు కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాదు. వ్యూవర్స్ అభిప్రాయాలపై బలమైన ప్రభావంతో ఉత్పత్తుల, సేవలను ప్రకటించే సృష్టికర్తలు మాత్రమే. ప్రకటనల కంపెనీలు వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటాయి. ట్రిప్స్ లేదా హోటల్ వసతి, ఉచిత ఉత్పత్తులు, అవార్డులు.. మొదలైనవి జత చేస్తారు. ఇక, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు కంప్యూటర్ సృష్టించిన వ్యక్తులు. వీటి ద్వారా కూడా యాడ్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తుంటాయి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
యూట్యూబ్‌ను ముంచేస్తున్న షార్ట్స్.. ఆందోళనలో ఉద్యోగులు
భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలు చైనా షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను బ్యాన్ చేశాయి. దీంతో యూట్యూబ్ ‘యూట్యూబ్ షార్ట్స్’ పేరుతో షార్ట్ వీడియో విభాగాన్ని ప్రారంభించింది. అయితే వ్యూస్, యూజర్ల విషయంలో షార్ట్స్‌కు ఊహించని స్పందన వచ్చింది. యూట్యూబ్ యాజమాన్యం సైతం సంతోషించింది. కానీ ఆ సంతోషం అంతలోనే అవిరైనట్లు తెలుస్తోంది. ఆందోళనలో యూట్యూబ్ సిబ్బంది షార్ట్స్‌ను ప్రారంభించడంలో యూట్యూబ్ లక్ష్యం.. వ్యాపారాన్ని పెంచడం, టిక్ టాక్, మెటా వంటి ప్రత్యర్థులతో నిలబడటం. అయితే, ఈ షార్ట్స్ ఫీచర్ లాంగ్ వీడియోలకు వచ్చే ఆదాయానికి గండిపెడుతుందని యూట్యూబ్ సిబ్బంది భావిస్తున్నారు. ఇటీవలి యూట్యూబ్ స్ట్రాటజీ మీటింగ్స్ లో కంపెనీకి ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే లాంగ్ ఫామ్ వీడియోలు ఫార్మాట్ గా 'అంతరించిపోతున్నాయి' అనే ప్రమాదం గురించి చర్చించినట్లు నివేదిక తెలిపింది. సందిగ్ధంలో యూట్యూబ్ షార్ట్ ఫామ్ వీడియో కంటెంట్‌కు ఆదరణ పెరుగుతుండటంతో యూట్యూబ్ సందిగ్ధంలో పడింది. షార్ట్ ఫామ్ వీడియోలు ప్రేక్షకులలో మరింత ప్రాచుర్యం పొందాయి .త్వరగా క్రియేట్ చేయడం, వీక్షించడం సులభం. అందుకే టిక్ టాక్ , ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అంత సక్సెస్ కావడంతో పాటు యూట్యూబ్ కూడా షార్ట్స్‌ను పరిచయం చేసింది. ఏదేమైనా, యూట్యూబ్ ప్రకటనల నుండి ఆదాయాన్ని గడిస్తుంది. షార్ట్ ఫామ్ వీడియోలు ఎక్కువ ప్రకటనలను అనుమతించవు. అందువల్ల యూట్యూబ్ లాంగ్ ఫామ్ వీడియోల ద్వారా సంపాదించినంత లాభాన్ని షార్ట్స్ నుంచి పొందలేకపోతోంది. ఆదాయం కోసం ఇదిలా ఉంటే షార్ట్స్ నుంచి మరింత యాడ్ ఆదాయాన్ని ఎలా ఆర్జించాలనే దానిపై యూట్యూబ్ ఇంకా ప్రయత్నిస్తోంది. అయితే ఈలోగా కంటెంట్ క్రియేటర్లు తక్కువ నిడివి ఉన్న వీడియోలను అప్లోడ్ చేస్తుండటం యూట్యూబ్ సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది. గూగుల్ తన యూట్యూబ్ ఆడియన్స్ యూజర్లను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఆదాయం గడించే మార్గాన్ని గుర్తించాలని యూట్యూబ్ సిబ్బంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
యాపిల్ సంచలన నిర్ణయం: యూజర్లకు షాక్?
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త నిర్ణయంతో తన యూజర్లకు షాక్ ఇవ్వనుంది. సోషల్ మీడియాలో కస్టమర్ సహాయాన్ని నిలిపివేయనుంది. ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్, సపోర్ట్ కమ్యూనిటీ ఆన్లైన్ ఫోరమ్‌లకు చెక్ పెట్టనుంది. అంతేకాదు సోషల్ మీడియా సపోర్ట్ అడ్వైజర్లను తొలగించాలని యోచిస్తోంది, అంటే కస్టమర్లు ఇకపై ట్విట్టర్, యూట్యూబ్‌లో ప్రత్యక్ష మద్దతు పొందలేరు. అక్టోబర్ నుండి కస్టమర్ల డైరెక్ట్ మెసేజ్‌లకు వ్యక్తిగతంగా సమాధానాలివ్వడం ఆపివేస్తుంది. మ్యాక్ రూమర్స్ అందించిన సమాచారం ప్రకారం సోషల్ మీడియా సపోర్ట్స్ అడ్వైజర్ ఉద్యోగుల్ని కూడా తొలగించనుంది. వచ్చే ఏడాది ఆరంభంనుంచి ఈ చర్యకు దిగనుంది. అంటే ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కస్టమర్లు ఇకపై ఈ ప్లాట్‌ఫారమ్‌లలో యాపిల్ ఉద్యోగి సపోర్ట్‌ను పొందలేరు. అలాగే అక్టోబర్ నుండి, ట్విటర్లోని యాపిల్ సపోర్ట్ అనే అకౌంట్ ఇక పని చేయదు. యూజర్ల మెసేజ్‌లకు స్పందించదు. దీనికి బదులుగా కస్టమర్లు సహాయం కోసం ఆటోమేటెడ్ సమాధానాలపై దృష్టి పెడుతోందని ఈ నివేదిక తెలిపింది. దీనికి ఫోన్ సపోర్ట్ అందించడానికి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వ నుందని, నవంబర్ నాటికి పరివర్తన పూర్తవుతుందని నివేదిక పేర్కొంది. దీనిపై పని చేయ కూడదనుకునే వారు యాపిల్ వెలుపల ఉద్యోగం చూసుకోవాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు సెప్టెబంరు 12న ఈ ఏడాది మెగా ఈవెంట్‌ను నిర్వహించనుంది యాపిల్.ఇందులో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇదే ఈవెంట్లో కొత్త యాపిల్ వాచ్‌లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కాగా 2016నుంచి ట్విటర్ ద్వారా కస్టమర్ మద్దతును అందిస్తోంది. కానీ గత ఏడాది ట్విటర్ ఎలాన్ మస్క్ చేతిలోకి వెళ్లిన తరువాత ఉద్యోగులతో ఇటీవల జరిగిన సమావేశంలో, ఫోన్ బేస్డ్ సపోర్ట్ నిర్ణయాన్ని సమర్ధించుకున్నట్టుతెలుస్తోంది. అయితే ఈ మార్పులపై యాపిల్ అధికారిక ప్రకటన ఏదీ ఇంత వరకు విడుదల చేయలేదు. -
64 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్.. కారణం ఏంటంటే?
ఆధునిక కాలంలో యూట్యూబ్ గురించి పెద్దగా పరిచయమే అవసరం లేదు. దీని ద్వారా ఎంతోమంది బాగా సంపాదిస్తున్నారు. అయితే ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇటీవల ఏకంగా ఇండియాలో 19 లక్షల వీడియోలను తొలగించినట్లు వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలో 2023 జనవరి నుంచి మార్చి వరకు సుమారు 1.9 మిలియన్లకంటే ఎక్కువ వీడియోలను తొలగించినట్లు తెలిసింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 6.48 మిలియన్ల (64 లక్షల కంటే ఎక్కువ) వీడియోలను తీసివేసింది. ఇదీ చదవండి: ఆడియో, వీడియో కాల్ సదుపాయం ఎక్స్(ట్విటర్)లో కూడా - ఎలాన్ మస్క్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ యూట్యూబ్ పొందే ఫ్లాగ్‌లు అండ్ యూట్యూబ్ పాలసీలను ఎలా అమలు చేస్తుంది అనే దానిపై గ్లోబల్ డేటాను విడుదల చేసింది. ఇందులో తొలగించిన వీడియోల వివరాలు వెల్లడించింది. ఒక్క భారతదేశంలో (1.9 మిలియన్స్) మాత్రమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్ తీసివేసింది. అగ్రరాజ్యమైన అమెరికాలో 654968, రష్యాలో 491933, బ్రెజిల్లో 449759 వీడియోలను తొలగించినట్లు సమాచారం. -
ఇంటికే ‘ఈ–పాఠం’
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతోంది. విద్యార్థి ఎక్కడున్నా నేర్చుకునేలా పాఠాలను అందిస్తోంది. పాఠ్యాంశాలు విద్యార్థికి మరింత అర్థమయ్యేలా, వివిధ మాధ్యమాల ద్వారా నేర్చుకునేలా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఏపీ ఎస్సీఈఆర్టీ) వీడియో కంటెంట్‌ను రూపొందించింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో మూడు నుంచి 9వ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలను సిద్ధం చేసింది.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్‌పీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందిస్తోంది. మరోవైపు అవే పాఠాలను ట్యాబ్‌ల ద్వారా ఇంటి వద్ద కూడా నేర్చుకునేలా బైజూస్ కంటెంట్‌ను అప్లోడ్ చేసి అందించింది. వీటితోపాటు ఆయా తరగతుల అన్ని పాఠ్యాంశాలకు నిపుణులైన ఉపాధ్యాయులతో 366 వీడియోలను రూపొందించిన ఎస్సీఈఆర్టీ వాటిని యూట్యూబ్ (ఆంధ్రప్రదేశ్ ఈ–పాఠశాల చానల్)లోనూ అప్లోడ్ చేసింది.వీటిని మొబైల్ ఫోన్లోనూ చూసే అవకాశం కల్పించింది. ఈ వీడియోలను విద్యార్థి ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు. తద్వారా బడిలో ఉపాధ్యాయులు బోధించినప్పుడు విస్మరించిన, మరిచిపోయిన అంశాలను తిరిగి మననం చేసుకోవచ్చు. ఐదు డీటీహెచ్ చానళ్ల ద్వారా ప్రసారం టీవీలకు అలవాటుపడిన విద్యార్థుల్లో కూడా చదువుపై ఆసక్తి కలిగించేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విధానంలో ప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు ఈ–విద్య డీటీహెచ్ చానళ్లను కేటాయించింది. వీటిలో ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక చానల్ వినియోగిస్తున్నారు. మిగిలిన నాలుగు చానళ్లను ఆరు నుంచి 9వ తరగతి పాఠ్యాంశాల ప్రసారానికి కేటాయించారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన విద్యా క్యాలండర్, పాఠ్యప్రణాళిక ప్రకారం.. ఆయా నిర్మిత తేదీల్లో డీటీహెచ్ చానళ్లలో ఆ నెల పాఠ్యాంశాలను నిరంతరం ప్రసారం చేస్తారు. ఇలా 100 శాతం కంటెంట్‌తో ఈ–విద్య డీటీహెచ్ చానళ్ల ద్వారా పూర్తి స్థాయి పాఠాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ, జూనియర్ విభాగాల్లో టోఫెల్‌ను ప్రవేశపెట్టడంతో ఆయా పాఠాల బోధనకు మరో మూడు డీటీహెచ్ చానళ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. మొబైల్ యాప్ సైతం.. ఆన్లైన్లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ‘ఈ–పాఠశాల’ మొబైల్ యాప్‌ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్‌పీ, ట్యాబ్, డీటీహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్.. ఇలా అన్ని మాధ్యమాల్లోనూ ఒకే తరహా కంటెంట్, బోధన ఉండేలా వీడియోలను రూపొందించారు. దీంతో విద్యార్థి ఎలాంటి గందరగోళం లేకుండా తన తరగతి పాఠాలను ఈ ఐదు మాధ్యమాల్లో సులువుగా నేర్చుకోవచ్చు. అన్ని కేబుల్ నెట్‌వర్క్‌ల్లోనూ ప్రసారం బడిలో ఉపాధ్యాయులు బోధించే అన్ని పాఠాలను ఈ–కంటెంట్ రూపంలోకి మార్చాం. నిష్ణాతులైన సబ్జెక్టు ఉపాధ్యాయులతో సిలబస్ వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వీడియో పాఠాలు రూపొందించాం. ఈ–పాఠశాల చానళ్లను అందించేందుకు ప్రైవేటు టీవీ నెట్వర్క్ ప్రొవైడర్లు కూడా అంగీకరించారు. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రసారమవుతున్నాయి. త్వరలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంట్లో టీవీ ద్వారా విద్యార్థులు పాఠాలు వినొచ్చు. అలాగే యూట్యూబ్‌లో కూడా ఎప్పుడైనా వీటిని చూడొచ్చు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతులు 3 నుంచి 9 తరగతి వరకు వీడియో కంటెంట్ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల్లోని కంటెంట్‌ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖకు అందించింది. వీటిని యధావిధిగా విద్యార్థులకు ఐఎఫ్‌పీల ద్వారా బోధించడంతోపాటు ట్యాబ్‌ల్లోనూ అప్లోడ్ చేశారు. అయితే, ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్‌తోపాటు కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ఇందులో ప్రధానంగా మూడో తరగతి విద్యార్థులకు.. తెలుగు, ఇంగ్లిష్ , మ్యాథ్స్, ఈవీఎస్, నాలుగు, ఐదు తరగతులకు.. తెలుగు, ఇంగ్లిష్ , ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు.. తెలుగు, ఇంగ్లిష్ , హిందీ సబ్జెక్టుల్లో వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్‌లో పాఠాలు అందరికీ అందుబాటులో ఉండగా.. ప్రైవేటు నెట్వర్క్ ప్రొవైడర్లు చాలా ప్రాంతాల్లో డీటీహెచ్ చానళ్లను అందించడం లేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన డీటీహెచ్ చానళ్లను అన్ని ప్రైవేటు కేబుల్ నెట్వర్క్ సంస్థలు కూడా అందించేలా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను రూపొందించనుంది. -
సైక్లింగ్‌తో స్ఫూర్తి నింపుతూ...
సాక్షి, వరంగల్: ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదని అందరూ అంటారు. కానీ కొందరు మాత్రమే ఆరోగ్యంకోసం తపిస్తారు. ఆదాయం వేటలోపడి ఆరోగ్యాన్ని మరచిపోతారు. అయితే యుక్త వయసులోనే రంజిత్ కుమార్ దవేరాకు ఆరోగ్యం ఎంత విలువైనదో తెలియజెప్పింది కరోనా... మార్చిన మహమ్మారి... కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఆ మహమ్మారి బారిన పడిన నాన్న రాములే కాదు...కళ్లెదుటే ఎంతో మంది చనిపోవడం వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఈ డీఫార్మసీ గ్రాడ్యుయేట్‌ను కదిలించింది. సరైన శారీరక శ్రమ లేక వ్యాధినిరోధకత కోల్పోయి ఈ మహమ్మారికి బలయ్యారని ఆయనకు అవగతమైంది. దీంతో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలన్న ఆలోచన కలిగించడమే లక్ష్యంగా సైక్లింగ్ వైపు రంజిత్ అడుగులు పడ్డాయి. అలా 2021 ఏప్రిల్ 5న మొదలైన ‘రంజిత్ ఆన్ వీల్స్’సైక్లింగ్....దశలవారీగా రాష్ట్రాలు దాటింది. ఇప్పుడు ఏకంగా ఖండాంతరాలు దాటింది. ఏ ఉద్దేశంతో ఈ సైక్లింగ్ మొదలెట్టాడో... ఇప్పుడు అదీ కార్యాచరణ రూపంలో కనిపించడం ఎంతో సంతృప్తిగా ఉందని అంటున్నాడు రంజిత్. దాదాపు 500 మంది వరకు తనను చూసి స్ఫూర్తి పొందారని మలేసియాలో సైక్లింగ్ కొనసాగిస్తున్న రంజిత్ ‘సాక్షి’కి తెలిపారు. తనను ఆగస్టు 15న మలేసియా ఇండియన్ హైకమిషన్ సత్కరించడం సంతోషం కలిగించిందన్నాడు. అలా మొదలైంది... 2021 ఏప్రిల్ ఐదున హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన సైక్లింగ్...దాదాపు 3,000 కిలోమీటర్లు తిరిగి హైదరాబాద్‌లోనే జూన్ 14న ముగిసింది. మళ్లీ జూలై 17న ప్రారంభించి హైదరాబాద్ నుంచి లడఖ్ వరకు సైక్లింగ్ చేశాడు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తిరిగి అక్టోబర్ 22న హైదరాబాద్‌లో ముగిసింది. ఈ సమయంలోనే రంజిత్ సినీ హీరో సోనూసూద్‌ను కలిశాడు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి చైనా సరిహద్దు వరకు పెంపుడు శునకం భగీరతో కలిసి రంజిత్ సైక్లింగ్ చేశాడు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్,అస్సాం, వెస్ట్‌బెంగాల్, సిక్కింల నుంచి నథులాపాస్‌లో చైనా బార్డర్ వరకు వెళ్లాడు. గత 2022 ఫిబ్రవరి 8న మొదలైన ఈ ఆరువేల కిలోమీటర్ల యాత్ర జూలై 25న ముగిసింది. ఆ్రస్టేలియా వైపుగా... హైదరాబాద్ నుంచి వియత్నాంకు రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం లేకపోవడంతో 2023 మే ఐదున శంషాబాద్ విమానాశ్రయంలో సైకిల్ ప్యాక్ చేసుకొని వియత్నాం వెళ్లాడు. అక్కడ హానోయ్ సిటీ నుంచి హోచి మిన్హ్ వరకు దాదాపు మూడు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, ఆ తర్వాత కాంబోడియాలోకి ప్రవేశించి 900 కిలోమీటర్లు, థాయ్‌లాండ్‌లో 2,200 కిలోమీటర్లు, మలేసియాలో 400 కిలోమీటర్లు దాటి ప్రస్తుతం కౌలంలంపూర్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్, ఇండోనేసియా, జకార్తాకు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాకు విమానం ద్వారా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేస్తాడు రంజిత్. 2021 ఏప్రిల్ ఐదు నుంచి ఇప్పటివరకు 22 వేల కిలోమీటర్ల మార్క్ చేరుకున్నాడు. ఆసియా, ఆ్రస్టేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. సోషల్ మీడియాతో మరింత క్రేజ్ సైక్లింగ్ చేస్తున్న సమయంలో రంజిత్ తీస్తున్న వీడియోలు, ఫొటోలు తనకు సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను తెస్తున్నాయి. ‘రంజిత్ ఆన్ వీల్స్’ఫేస్బుక్ పేజీలో 40,000 మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3,15,000 మంది, యూట్యూబ్‌లో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా సైక్లింగ్ చేస్తూనే...ఇంకోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా రంజిత్ ఎంతో మందిని చైతన్యవంతం చేస్తున్నారు. -
చంద్రయాన్-3 మరో ఘనత: యూట్యూబ్‌లో టాప్ రికార్డ్
Chandrayaan-3 Youtube most viewed Record చంద్రయాన్ -3కి చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే క్షణం కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన కోట్లాదిమంది భారతీయుల కలల్ని సాకారం చేసింది. ఇస్రో. దీంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇస్రో ఇంజనీర్లపై అభినందనల వెల్లువ కురిసింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ ఖ్యాతిని దక్కించుకుంది. జాబిల్లిపై భారతీయజెండాను రెపరెపలాడించేందుకు ఉద్దేశించిన ఈ చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్‌తో రూ. 615 కోట్లు. అతితక్కువ బడ్జెట్‌తో అంతరిక్ష యాత్రల జాబితాలో ప్రత్యేకంగా నిలిచింది. ప్రత్యేకించి 96.5 మిలియన్ల డాలర్ల బ చంద్రయాన్-2తో బడ్జెట్‌తో పోల్చినా ఇది తక్కువే కావడం విశేషం. మరో విశేషాన్ని కూడా చంద్రయాన్-3 మిషన్ సాధించింది. యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రాంగా ఘనతను దక్కించుకుంది. భారత ఇస్రో చంద్రయాన్ -3 లైవ్‌ను ఏకంగా 8.06 మిలియన్లు మంది వీక్షించారని తాజా లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రత్యక్ష ప్రసారాన్ని అత్యధికంగా చూసిన ఇతర కార్యక్రమాలు బ్రెజిల్ vs దక్షిణ కొరియా ఫుట్‌బాల్ మ్యాచ్: 6.15 మిలియన్లు బ్రెజిల్ vs క్రొయేషియా ఫుట్‌బాల్ మ్యాచ్: : 5.2 మిలియన్లు వాస్కో vs ఫ్లెమెంగో ఫుట్‌బాల్ మ్యాచ్ : 4.8 మిలియన్లు అమెరికా స్పేస్ఎక్స్ క్రూ డెమో: 4.08 మిలియన్లు బీటీఎస్ బటర్ వెన్న: 3.75 M యాపిల్ లైవ్ ఈవెంట్ 3.69 M జానీ డెప్ v అంబర్ ట్రయిల్ : 3.55 మిలియన్లు ఫ్లుమినెన్స్ vs ఫ్లెమెంగో ఫుట్‌బాల్ మ్యాచ్ : 3.53 మిలియన్లు కారియోకో చాంపియషన్ షిప్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్: 3.25మిలియన్లు Most Viewed Live Streams on YouTube ▶️ 1. 🚀🇮🇳 ISRO Chandrayaan3: 8.06 Million 🔥 2. ⚽️🇧🇷 Brazil vs South Korea: 6.15 M 3. ⚽️🇧🇷 Brazil vs Croatia: 5.2 M 4. ⚽️🇧🇷 Vasco vs Flamengo: 4.8 M 5. 🚀🇺🇸 SpaceX Crew Demo: 4.08 M 6. 🎶🇰🇷 BTS Butter: 3.75 M 7. 🇺🇸 Apple: 3.69 M 8. 🧑⚖️🇺🇸… — The World Ranking (@worldranking_) August 23, 2023 -
‘యూట్యూబ్’ చూస్తూ భార్యకు కాన్పు
హోసూరు: పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా యూట్యూబ్‌లో వీడియో చూస్తూ ఓ భర్త కాన్పు చేశాడు. మగబిడ్డకు జన్మనిచి్చన ఆమె తీవ్ర రక్తస్రావమై మరణించింది. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హనుమంతపురంలో జరిగింది. హనుమంతపురానికి చెందిన మాదే‹Ù(27)కు పోచ్చంపల్లి సమీపంలోని పులియంబట్టికి చెందిన వేడియప్పన్ కూతురు లోకనాయకి(27)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరూ అగ్రికల్చర్ కోర్సులో డిగ్రీ చేశారు. ఇంటి వద్ద పెరట్లో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలనే తినేవారు. ఈ క్రమంలో లోకనాయకి గర్భం దాల్చగా.. ఇంటి వద్దే సహజసిద్ధంగా ప్రసవం చేయాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మాదేష్ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుండేవాడు. మంగళవారం తెల్లవారుజామున లోకనాయకికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను మాదేష్ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం యూట్యూబ్‌లో చూస్తూ కాన్పుకు సాయం చేశాడు. మగ బిడ్డకు జన్మనిచి్చన అనంతరం.. లోకనాయకి తీవ్ర రక్తస్రావంతో కోమాలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిశీలించిన డాక్టర్లు లోకనాయకి మరణించినట్లు తెలిపారు. -
పల్లె నుంచి పట్నం దాకా..యూట్యూబ్‌తో సూపర్‌స్టార్స్
భారతదేశంలో పదిహేను వసంతాలను పూర్తి చేసుకున్న యూట్యూబ్ (ఇండియా) పల్లె నుంచి మహా పట్నం వరకు యువతరంలో ఎంతోమందిని కంటెంట్ క్రియేటర్స్‌గా మార్చింది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల నాడిని తెలుసుకుంటూ, యూట్యూబ్ కొత్త టూల్స్‌ను అందిపుచ్చుకుంటూ తమ సృజనాత్మక శక్తులను బలోపేతం చేసుకుంటున్నారు యంగ్ క్రియేటర్లు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్ యువత రంగుల కలలను సాకారం చేసే రంగస్థలం అయింది. ప్యారే దోస్తుగా మారింది... ‘మన దేశ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పదిహేను సంవత్సరాల యూట్యూబ్ ప్రయాణంలో కనిపిస్తుంది’ అంటాడు యూట్యూబ్ ఇండియా డైరెక్టర్ ఇషాన్ ఛటర్జీ. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మాట ఎలా ఉన్నా యువతరం క్రియేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. యూట్యూబ్ ఎంతోమంది క్రియేటర్లను సృష్టించింది. కొత్త కెరీర్ దారులను పరిచయం చేసింది. చెన్నైకి చెందిన మలర్ సరదాగా యూట్యూబ్‌లో ఇంగ్లీష్–స్పీకింగ్ కోర్సు మొదలుపెట్టింది. ఆ తరువాత ఆఫ్‌లైన్‌లో కూడా సక్సెస్ అయింది. తన యూట్యూబ్ కుకింగ్ చానల్‌తో సక్సెస్ అయిన పశ్చిమబెంగాల్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన పుష్పరాణి సర్కార్ ‘ఈ చానల్ ద్వారా నలుగురికి నా పేరు తెలియడమే కాదు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది’ అంటుంది. ఎబిన్ జోస్ పాపులర్ యూట్యూబ్ చానల్ ‘ఫుడ్ అండ్ ట్రావెల్’కు 7,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ‘అనుకరణతో ఫలితం ఉండదు. ఎవరి సక్సెస్ ఫార్ములాను వారు రూపొందించుకోవాల్సిందే’ అంటాడు జోస్. 2008లో మన దేశంలోకి యూ ట్యూబ్ లోకలైజ్డ్ వెర్షన్ అడుగు పెట్టింది. ఈ పదిహేను సంవత్సరాల కాలంలో ఎన్నో అవతారాలు ఎత్తింది. ఎన్నో ట్రెండ్స్‌ను పరిచయం చేసింది. ఈ ట్రెండ్స్‌లో యువతరానిదే పై చేయిగా మారింది.యూట్యూబ్ ట్రెండ్స్–2023 రిపోర్ట్ ప్రకారం జెన్ జడ్లో 69 శాతం మంది ప్రేక్షకులు షార్ట్ ఫామ్, లాంగ్ ఫామ్, లైవ్‌స్ట్రీమ్... ఇలా ఏ ఫార్మట్‌లోనైనా తమ అభిమాన క్రియేటర్ కంటెంట్‌ను చూడడానికి ఇష్టపడుతున్నారు. నిర్దిష్టమైన కంటెంట్, ఆర్టిస్ట్‌లు, పబ్లిక్ ఫిగర్స్‌కు సంబంధించి ఫ్యాన్స్ రూపొందించిన వీడియోలను చూడడానికి ఇష్టపడుతున్నట్లు జెన్ జడ్లో 48 శాతం మంది చెబుతున్నారు. పదిహేను సంవత్సరాల కాలంలో యూట్యూబ్ యూత్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్‌గా మారింది. మహానగరంలో ఉన్నా, మారుమూల పల్లెలో ఉన్నా ఒక చిన్న బ్రైట్ ఐడియాతో అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోయేలా ఈ వేదిక యూత్‌కు ఉపకరించింది. డ్యాన్స్ ట్యుటోరియల్స్ నుంచి హౌ–టు వీడియోల వరకు యువతరంలో ఎంతోమందిని ఫేమ్ చేసింది. యూ ట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (2011) లాంచ్‌తో ఎంతోమంది క్రియేటర్లకు ఒక వేదిక దొరికింది. ఈ ఫస్ట్ వేవ్ క్రియేటర్లు తమ విజయాలతో ఎంతోమందిని ప్రభావితం చేశారు.మ్యూజిక్, సినిమాలు ఆరాధించే మన దేశంలో యూట్యూబ్ వేదికగా యువతరం చేతిలో కంటెంట్ క్రియేషన్ అనేది కొత్త పుంతలు తొక్కింది. కంటెంట్ క్రియేషన్‌కు సంబంధించి యూట్యూబ్ అడ్వాన్సింగ్ టూల్స్‌ను తీసుకువచ్చింది. ఫార్మట్లను విస్తరించింది. క్రియేటర్లు తమ వీడియోలను ఇతర భాషల్లోకి తీసుకువచ్చే ఏఐ పవర్డ్ డబ్బింగ్ టూల్‌ను తీసుకురానుంది. భవిష్యత్‌లో ఈ టూల్ ద్వారా వాయిస్ ప్రిజర్వేషన్, లిప్ రీ–యానిమేషన్, ఎమోషన్ ట్రాన్స్ఫర్... మొదలైనవి చేయవచ్చు. ఫిల్మ్ స్టూడియోలు, మ్యూజిక్ కంపెనీలు కూడా యూట్యూబ్ చానల్స్‌ను స్టార్ట్ చేయడం మొదలు పెట్టాయి. దీనిద్వారా యువతలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. ‘యూట్యూబ్ తొలిసారిగా పరిచయం అయినప్పుడు అది టైమ్‌పాస్ మాత్రమే. అయితే మన టైమ్‌ను కూడా మార్చుకొని ఎదగవచ్చని ఎంతోమంది నిరూపించారు’ అంటుంది బెంగళూరుకు చెందిన ప్రజ్వల. స్ఫూర్తినిచ్చే సూపర్‌స్టార్స్ మన దేశంలోని మోస్ట్ పాపులర్ యూట్యూబ్ స్టార్ల స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ‘ది యూట్యూబ్ స్టార్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చాడు దిల్లీకి చెందిన అజితాభ బోస్. ఇది బోస్ నాన్–ఫిక్షన్ బుక్. ఈ పుస్తకంలో సక్సెస్ఫుల్ యూట్యూబర్ల స్ట్రగుల్‌ను కళ్లకు కట్టేలా రాశాడు. అశిష్, అమిత్ బదన, ప్రజక్త కోలి, కునాల్ చాబ్రియ, శృతి, అర్జున్ ఆనంద్‌లాంటి పదిహేను మంది యూట్యూబర్ల గురించి రాశారు. విజయం అనేది ఎంత కష్టపడితే వస్తుంది అనేది వీరి గురించి చదివితే బోధపడుతుంది. అహ్మదాబాద్‌కు చెందిన హర్ష్ పమ్నానీ వృత్తిపరంగా బ్రాండ్ ఎక్స్పర్ట్. ప్రవృత్తి పరంగా స్టోరీటెల్లర్. ‘బూమింగ్ బ్రాండ్స్’ పేరుతో పుస్తకం రాసి పేరు తెచ్చుకున్న హర్ష్ ‘బూమింగ్ డిజిటల్ స్టార్స్’ పేరుతో సక్సెస్ఫుల్ యూ ట్యూబ్ స్టార్స్ గురించి మరో పుస్తకం రాశాడు. క్రియేటర్ ఎకనామీలో భాగం కావడానికి వారి పరిచయాలు పాఠాలుగా ఉపయోగపడతాయని అంటాడు రచయిత. కవితా సింగ్, ఉజ్వల్ చౌరాసియ, యశ్వంత్ ముఖ్తే... లాంటి పదకొండుమంది యూట్యూబ్ స్టార్ల గురించి ఈ పుస్తకంలో రాశాడు హర్ష్. -
నేడు యూట్యూబ్‌లోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ సినిమా
విలక్షణ నటుడు కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ డ్రామా చిత్రం 'హే రామ్'. ఇందులో షారుఖ్‌ఖాన్, రాణి ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో వివాదాల మధ్య 2000 సంవత్సరంలో విడుదలైంది ఈ చిత్రం. అప్పట్లో మంచి టాక్‌ను తెచ్చుకోవడంతో పాటు కమల్ కెరీర్లో విభిన్న చిత్రంగా నిలిచింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాజాగ ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్ ఛానెల్లో నేడు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఈమేరకు కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. అయితే, ఇందులో షారుఖ్చేసిన పాత్ర కోసం ఆయన రెమ్యునరేషన్‌గా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని కమల్‌హాసన్ గతంలో స్వయంగా చెప్పారు. ఇలాంటి కథను, చిత్రాన్ని భవిష్యత్‌లో మళ్లీ చేసే అవకాశం రాదని షారుఖ్ భావించారట. కానీ ఈ సినిమాకు గుర్తుగా తన చేతి గడియారాన్ని ఆయనకు కమల్ ఇచ్చారట. ఈ సినిమాలో భారత్- పాకిస్థాన్ విభజన, మహాత్మ గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేయడం వంటి అంశాలను చూపించారు. ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. మూడు జాతీయ అవార్డులు అప్పట్లో 'హే రామ్' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా అతుల్ కుల్కర్ణి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా సారిక, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో మంత్రకు అవార్డులు వచ్చాయి. అంతే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటింది. 25వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 2000 లోకార్నో ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ సినిమాతో నాటి అనుభూతి పొందాలంటే 'హే రామ్' చూడాల్సిందే. Experience the brilliance of #Ulaganayagan #KamalHaasan in the Cult Classic #HeyRam Streaming Tomorrow at 6 PM ➡️ https://t.co/n9afe1tmUq @ikamalhaasan @ilaiyaraaja @iamsrk pic.twitter.com/ZU3agwYqvA — Raaj Kamal Films International (@RKFI) August 14, 2023 -
అరచేతిలో స్వతంత్రం
ఒక్కోసారి చేతిలో ఖాళీ ఉంటుంది. కానీ ఆ ఖాళీకి సార్థకత తెచ్చేలా చేయగలిగిందేమీ తోచదు. అప్పుడు ఆడుకోవడానికి ఆన్లైన్ అనేది మంచి గేమ్. అందరినీ వ్యసనపరులను చేసే ఆన్లైన్ గేమ్స్ గురించి కాదు; ఆన్లైన్తోనే ఆడుకోవడం! దీనికి గూగుల్, వికీపీడియా, యూట్యూబ్, ట్విట్టర్ లాంటివన్నీ పనిముట్లు. ఒకదాన్లోంచి ఇంకోదాన్లోకి గెంతుతూ, కొత్త విషయాలకు ద్వారాలు తెరుచుకుంటూ వెళ్లడం సరదాగా ఉంటుంది. మామూలుగా అయితే ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి గ్రంథాలయాలను చుట్టేయాలి. అంత శ్రమ లేకుండా మన అరచేతిలోనే ఆ భాండాగారం ఉంది. ఎక్కడినుంచి మొదలు పెట్టాలనే సమస్య అయితే ఉంటుంది. ఇది వ్యక్తిగత ఎంపిక. ఉదాహరణకు ప్రపంచ సినిమాను ఇష్టపడే ఏ స్నేహితుడో ఈ పేరును డ్రాప్ చేసివుంటాడని అనుకుందాం: ‘హిరోషిమా మాన్ అమౌర్’. ఈ ఒక్క హింటు మీదే ఎన్నో విషయాలు పోగేయవచ్చు. హిరోషిమా అంటే అర్థమౌతోంది; తర్వాతి పదాలు? గూగుల్ ఎందుకుంది? మాన్ అంటే ఫ్రెంచ్‌లో ‘నా’. అమౌర్ అంటే ప్రేమ. రెండో ప్రపంచ యుద్ధపు బీభత్సాన్ని చిత్రించిన సినిమా ఇది. కానీ ఆ బీభత్సం కథాకాలానికి సుదూర గతం. యుద్ధం మనుషుల మనసుల్లో ఎంత లోతైన గాయాలను చేసిందో జ్ఞాపకాల తలపోత ద్వారా చెప్పిన సినిమా. దీర్ఘ కవిత లాంటి సినిమా. పేరులేని అతడు, ఆమె జరిపే ఏకాంత సంభాషణ. ఇదంతా సినిమా చూస్తే అర్థమౌతుంది. సినిమాకు బయటి సంగతులు? ప్రపంచ సినిమా గతిని మార్చిన ‘న్యూ ఫ్రెంచ్ వేవ్’కు ఈ సినిమా ఒక శక్తిమంతమైన చేర్పు. 1959లో వచ్చింది. ఈ వేవ్‌లో శిఖరంగా చెప్పే ‘బ్రెత్లెస్’ కంటే ఏడాది ముందే విడుదలైందని తెలియడం అదనపు విశేషం. ఇదొక ఫ్రెంచ్–జపనీస్ ఉమ్మడి నిర్మాణం. తగినట్టుగానే ‘ఆమె’ ఫ్రెంచ్ నటి, ‘అతడు’ జపనీస్ నటుడు. ఎమాన్యుయెల్ రివా, ఎయిజీ ఒకాడా. వీళ్ల విశేషాలేమిటి? రివా సరిగ్గా తొంభై ఏళ్లు బతికి 2017లో చనిపోయింది. ఆమె కవయిత్రి, ఫొటోగ్రాఫర్. ఇంకా చాంటెయూజ్. అంటే బార్ లేదా స్టేజ్ మీద పాడే నైట్‌క్లబ్ సింగర్. వీటన్నింటికంటే ఆకట్టుకునే విశేషం, ఆమె మరో సుప్రసిద్ధ సినిమా– ‘అమౌర్’. రెండిట్లోనూ ప్రేమ ఉంది చూశారా? అది విదేశీ భాషా చిత్రం విభాగంలో 2012లో ఆస్కార్ గెలుచుకున్న ఫ్రెంచ్ సినిమా. ఈమెను ఇక్కడ వదిలేసి ‘అతడి’ దగ్గరికి వెళ్తే– ఓహో! ఈ ఎయిజీ ఒకాడా 1964లో వచ్చిన జపనీస్ కల్ట్ సినిమా ‘వుమన్ ఇన్ ద డ్యూన్స్’లో హీరోనట! అందుకేనా ఆ రెండింట్లోనూ ఒకే రకమైన మగటిమి నవ్వు ఉంటుంది! ఇలాంటి నవ్వు బహుశా యూకియో మిషిమా ఇష్టపడతాడు. ఈయనెందుకు వచ్చాడు మధ్యలో? అదే 1960ల్లో ఆయన్ని సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరిస్తుందనుకున్నారు. కండలు తీరి మంచి దేహదారుఢ్యంతో ఉండే మిషిమా వేషధారణ, జీవనశైలి ఒక యోధుడిని తలపించేది. జపనీస్ సాహిత్యం ‘సుకుమార హృదయ’ సంబంధి అనీ, దాన్ని తాను ‘మగటిమి’ దిశగా లాక్కెళ్తున్నాననీ అనేవాడు. ఇంతకీ మనం దర్శకుడి గురించి వాకబు చేయనేలేదు. ఆయన పేరును ఫ్రెంచ్ ఉచ్చారణలో అలె రెనీ అనాలట. ఈ రెనీకి సంబంధించిన విశేషాలేమిటి? 1922లో జన్మించాడు. అంటే పోయినేడాదే శతజయంతి ఉత్సవాలు ముగిశాయి. దీనికంటే ముఖ్యమైనది, ప్రపంచ మేటి డాక్యుమెంటరీల్లో ఒకటిగా చెప్పే ‘నైట్ అండ్ ఫాగ్’కు దర్శకత్వం వహించడం! 1956లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో శవాల గుట్టలుగా మిగిలిన యూదుల దయనీయ గాథను కడుపులో తిప్పేంత దగ్గరగా చూపుతుంది. ఏ హేతువుకూ అందని దుర్మార్గం దాని పరాకాష్ఠకు చేరినప్పుడు మనిషనేవాడు కేవలం శవాల గుట్టల్లో కొన్ని గుర్తుపట్టని ఎముకలుగా మాత్రమే మిగిలిపోయే అత్యున్నత విషాదాన్ని చిత్రిస్తుంది. దర్శకుడిని వదిలేసి, ఆ సినిమాకు రచయితగా ఎవరు చేశారో చూద్దాం. మార్గ్యూరైట్ డురాస్. ఈమె ఫ్రెంచ్ రచయిత్రి. ‘ఫిడెలిటీ’(పాతివ్రత్య) భావాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నావిడ అని తెలియడం ఈమెకు సంబంధించి కొట్టొచ్చినట్టు కనబడే విశేషం. ఈమె కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆ జాబితాలో ఏమైనా ఉండనీ, ‘ఇండియన్ సాంగ్’ అనే పేరున్న సినిమాకు దర్శకత్వం వహించారని తెలియడం భారతీయ మెదడును ఆకర్షిస్తుంది. ఆమె భావాలకు తగినట్టే భారత్‌లో ఫ్రెంచ్ రాయబారి భార్య తాలూకు వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో సాగుతుంది. గొప్ప సినిమా ఏం కాదని విమర్శకులు చెబుతున్నారు, కానీ దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఎటూ ఆటను హిరోషిమాతో మొదలుపెట్టాం కాబట్టి, మళ్లీ అక్కడికే వద్దాం. ఆ మహా విషాదాన్ని గుర్తుచేస్తూ ఇటీవలే ‘ఒపెన్‌హైమర్’ సినిమా వచ్చింది. అణుబాంబు పితగా అపఖ్యాతి పొందిన రాబర్ట్ ఒపెన్‌హైమర్ నేతృత్వంలో తయారు చేసిన బాంబులనే హిరోషిమా, నాగసాకి నగరాల మీద వరుసగా 1945 ఆగస్ట్ 6, 9 తేదీల్లో వదిలింది అమెరికా. మరింత ఘోర చేదు వాస్తవం ఏమిటంటే, జపాన్ను లొంగదీసుకోవడం కోసం అమెరికా ఈ బాంబులు వేయలేదు; అప్పటికే జపాన్ ఓటమి అంచున ఉంది. కేవలం తన అణుపాటవ శక్తిని ప్రపంచానికి చాటడం కోసం ఈ బాంబుల్ని జారవిడిచింది. దీనివల్ల సుమారు మూడున్నర లక్షల మంది క్షణాల్లో బూడిదయ్యారు. లక్షల మంది ఏళ్లకేళ్లు దాని పర్యవసానాలు అనుభవించారు. మూలమూలల్లోని సమాచారం ఎవరికైనా ఎప్పుడైనా అందుబాటులో ఉండటమే ఈ ఆధునిక కాలంలో నిజమైన స్వతంత్రం. ఆ ఉన్న సమాచారంతో ఏం చేస్తామనేది మన వివేకం! -
దేశంలో యూట్యూబ్ తోపులు వీళ్లే!
యూట్యూబ్ ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతిఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూట్యాబ్‌ను వీక్షిస్తున్నారు. భారతదేశంలోనూ కోట్ల మంది యూట్యూబ్ వీక్షకులు ఉన్నారు. ఇందుకు తగినట్లే యూట్యూబర్లు, యూట్యాబ్ ఛానళ్లు సైతం ఇటీవల పెద్ద సంఖ్యలో పెరిగాయి. యూజర్లు కంటెంట్‌ని వినియోగించే విధానంలో యూట్యాబ్ విప్లవాత్మక మార్పులు చేసింది. దేశంలో ఈ ప్లాట్‌ఫారమ్ కొత్త తరం డిజిటల్ సెలబ్రిటీలకు జన్మనిచ్చింది. కామెడీ స్కెచ్‌ల నుంచి టెక్నికల్ రివ్యూల వరకు దేశంలోని ఈ టాప్ యూట్యూబర్లు దూసుకుపోతున్నారు. 2008లో భారతదేశంలో యూట్యూబ్ అరంగేట్రం కొత్త శకానికి నాంది పలికింది. ప్రారంభంలో మ్యూజిక్ వీడియోలకే పరిమితమైన యూట్యూబ్ అనతి కాలంలోనే దేశంలోని యూట్యూబర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అతిపెద్ద వేదికగా మారింది. వర్ధమాన చిత్రనిర్మాతల నుంచి గృహిణుల వరకు యూట్యూబ్ కోట్లాది మంది గొంతుగా మారింది. 2023లో దాదాపు 467 మిలియన్ల మంది యూజర్లతో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యూట్యూబ్ సబ్స్క్రైబర్లను దేశంగా భారత్ నిలిచింది. దేశంలోని టాప్ 10 యూట్యూబర్లు భారతదేశంలో డిజిటల్ సూపర్స్టార్లు ఈ టాప్ 10 యూట్యూబర్లు. యూట్యూబ్‌లో యూజర్లను పెంచుకోవడం మామూలు విషయం కాదు. యూట్యూబ్ అల్గారిథంను అవపోసన పట్టి యూజర్ల నాడిని తెలుసుకుని అందుకు తగిన కంటెంట్‌ను క్రియేట్ చేసే వాళ్లే ఇక్కడ టాప్‌లో నిలుస్తారు. అలా యూజర్లపరంగా టాప్ 10లో ఉన్న యూట్యాబర్లు, వారి చానళ్లు, ఏ రకమైన కంటెంట్ అందిస్తున్నారో తెలుసుకుందాం.. క్యారీమినాటి, 39.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, రోస్టింగ్, కామెడీ కంటెంట్ టోటల్ గేమింగ్, 35.7 మిలియన్ సబ్స్క్రైబర్లు, గేమింగ్ కంటెంట్ టెక్నో గేమర్స్, 34.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, గేమింగ్ కంటెంట్ మిస్టర్ ఇండియన్ హ్యాకర్, 32.1 మిలియన్ సబ్స్క్రైబర్లు, లైఫ్ హ్యాక్స్, ప్రయోగాలు రౌండ్2హెల్, 30.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ స్కిట్లు ఆశిష్ చంచలానీ, 29.8 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ స్కిట్లు, వ్లాగ్‌లు సందీప్ మహేశ్వరి, 27.9 మిలియన్ సబ్స్క్రైబర్లు, మోటివేషనల్ స్పీకింగ్ బీబీకి వైన్స్, 26.3 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ, వినోదం అమిత్ భదానా, 24.3 మిలియన్ సబ్స్క్రైబర్లు, కామెడీ, వినోదం టెక్నికల్ గురూజీ, 23.1 మిలియన్ సబ్స్క్రైబర్లు, టెక్నాలజీ రివ్యూస్ -
యూట్యూబ్ సెన్సేషన్.. ఈ మిస్టరీ గర్ల్ ఇన్నాళ్లకు దొరికింది
కొందరికి ఎంత కష్టపడ్డా స్టార్డమ్ అంత ఈజీగా రాదు. మరికొందరికేమో ఓవర్ నైట్‌లోనే పాపులారిటీ వస్తుంది. మీకు గుర్తుందా? యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తరచూ ఓ యాడ్‌లో ఓ అమ్మాయి వెనక్కి తిరిగి నవ్వుతున్న ఫోటో ఒకటి కనిపించేది. కేవలం ఆ ఒక్క యాడ్‌లోనే కనిపించిన ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడ ఉంది? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మొదట మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రకటనల్లో నటించి వచ్చిన గుర్తింపుతో అవకాశాలను సంపాదించుకుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో ఏదో ఒక యాడ్‌లో నటించే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంటారు. ఇలాంటి కోవలోకే వస్తుంది నుపుర్ చాబ్రా. అప్పట్లో యూట్యూబ్‌లో ఏ లింక్ ఓపెన్ చేసినా మొదట యాడ్‌లో ఓ అమ్మాయి ఫోటో కనిపించేది. ట్రెడిషనల్ డ్రెస్‌లో ఓ అందమైన అమ్మాయి స్మైల్ ఇస్తూ కనిపించేది. కానీ ఈ యాడ్ తర్వాత ఆ అమ్మాయి మరే ఇతర ప్రకటనల్లోనూ కనిపించలేదు. ఈ మిస్టరీ గర్ల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆరాతీస్తే ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్‌లో కనిపించే ఈ పాపులర్ అమ్మాయి పేరు నుపుర్ చాబ్రా. ఇండియాకు చెందిన నుపుర్ కుటుంబం చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడింది. శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా యూనివర్సిటీలో మార్కెటింగ్ బ్యాచలర్ డిగ్రీని అందుకున్న నుపుర్ ఫేస్బుక్ సంస్థలో టెక్నికల్ రిక్రూటర్, మార్కెటింగ్ మీడియా మేనేజర్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే ఆమెకు ఓ యాడ్‌లో నటించేందుకు ఆఫర్ వచ్చింది. పేదరికంలో ఉన్న చిన్నపిల్లలకు సహాయం చేసే స్వచ్చంద సంస్థకు చెందిన ప్రకటన అది. ఆరేళ్ల క్రితమే నుపుర్ ఈ యాడ్‌లో నటించింది. ఇక 2020లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సాహిల్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. కేరింగ్ హ్యాండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థకు డైరెక్టర్‌గా కొనసాగుతూనే, లెట్స్ హాంగిన్ అనే మరో సంస్థకు కూడా కో ఫౌండర్‌గా ఉన్నారు నుపూర్. -
ఇన్ఫినిటమ్ అంటేనే ఒక వైబ్రేషన్...యూత్ కలల డెస్టినేషన్
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫినిటమ్ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. యువత కలల సాధనకు వారధిగా నిలుస్తోంది. అరుదైన యుత్ ఐకాన్స్ కు ఇన్ఫినిటమ్ అడ్డగా నిలుస్తోంది. ఇన్ఫినిటమ్ ఈవెంట్ అదరహో అనే స్థాయిలో సాగింది. స్పూర్తిని నింపేలా ఈవెంట్ సంథింగ్ స్పెషల్‌గా నిలిచింది. యువతలో స్పూర్తిని నింపే ఎంతో మంది ఒకే వేదిక మీదకు ఇన్ఫినిటమ్ తీసుకొచ్చింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సాధించిన విజయం అద్భుతం. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు సినిమా రంగంలో అడుగు పెట్టింది. ఇందుకు సంబంధించిన భాగస్వామ్య సంస్థలను పరిచయం చేసింది. తమ లక్ష్యం ఏంటో ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది. సెలబ్రెటీస్ సందడి.. ప్రముఖుల బ్లెస్సింగ్ నడుమ పండుగ వాతావరణంలో ఈవెంట్ సినీ ఎంట్రీ గ్రాండ్ లాంచ్ చేసింది. ఇన్ఫినిటమ్ ఈవెంట్‌కు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తరలి వచ్చారు. ఏషియన్ గ్రూప్ జాహ్నవి నారంగ్, ఎమ్మెల్యే రఘనందన్ రావు ఇన్ఫినిటమ్కి విషెస్ చెప్పారు. ఏషియన్ మూవీతో టై అప్ అయిన ఇన్ఫినిటమ్ జయ క్రిష్ణ ముకుంద మురారీ తొలి మూవీ టైటిల్ ను ఆవిష్కరించారు. ఇక ఈవెంట్ కలర్ ఫుల్ అండ్ ఇంట్రస్టింగ్ గా గ్రాండ్ ఫీస్ట్ గా నిలిచింది. ఎంతో మంది యువ కళాకరులను ఈ వేదిక ద్వారా పరిచయం చేసింది. ఇన్ఫినిటమ్ కోర్సులను ఈవెంట్ లో ఆవిష్కరించారు. యూఎస్ లో ఇన్ఫినిటమ్ ఆపరేషన్స్ ను ఇదే ముహూర్తంగా అధికారికంగా లాంఛ్ చేసారు. ట్రిపుల్ ఆర్ మూవీ ఫేం రాహుల్ సిప్లిగంజ్, బేబీ ఫేం వైష్ణవి చైతన్యను సత్కరించారు. ఇన్ఫినిటమ్ పిక్చర్స్ సభికుల హర్షధ్వానాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ చేసారు. 2023 ఇన్ఫినిటమ్ వైటీ క్యాలెండర్ ను ప్రకటించారు. స్టూడెంట్ వెబ్ సిరీస్ లిరికల్ సాంగ్ రిలిజ్ చేశారు. ఇదే సమయంలో ఇన్ఫినిటమ్ ఏషియన్ భాగస్వామ్యంతో కొనసాగనున్న ప్రణాళికలు..ప్రకటనలను ఈవెంట్ లో ప్రకటించి ఆసక్తిని పెంచారు. యువ కళాకారుల అభిరుచులకు ఇన్ఫినిటమ్ మార్గదర్శకత్వం వహిస్తోంది. వారి అభిరుచులకు అనుగుణంగా ఎదిగేందుకు వేదికగా నిలుస్తోంది. వారు సక్సెస్ అవ్వటంలో రోల్ మోడల్ గా ఖ్యాతి దక్కించు కుంది. ఇలాంటి ప్రతిభ.. సమర్ధతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఇన్ఫినిటమ్ను గెస్టులు మనస్పూర్తిగా అభినందించారు. భవిష్యత్‌లో మరెన్నో సక్సెస్ లకు చిరునామాగా నిలవాలని ఆకాంక్షించారు. -
ప్రముఖ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!
బుల్లితెరలో ప్రసారం అవుతున్న కామెడీ షోలకు స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన హైపర్ ఆది రానురానూ అదే షోలో టీమ్‌కు లీడర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. ఆపై తిరుగులేని పంచులతో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తద్వారా వచ్చిన పాపులారిటీతో పలు షోలు చేస్తూ బిజీబిజీగా మారాడు. దీంతో తన కామెడీ టైమింగ్ పంచ్‌లతో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అలా బుల్లితెరపైనే కాకుండా బిగ్ స్క్రీన్‌పైనా కూడా పలు సినిమాల్లో కమెడియన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మధ్యే విడుదలైన ధనుష్ 'సార్' సినిమాలో కూడా ఆది మెప్పించాడు. (ఇదీ చదవండి: TFCC Election Live Update: టాలీవుడ్ లో ఉత్కంఠ.. గెలుపెవరిది?) తాజాగా అతడు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అవ్వాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఊపందుకుంది. దీంతో అతడికి కాబోయే భార్య ఎవరా? అని అభిమానులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ యూట్యూబ్ యాంకర్‌తో ఆది ప్రేమలో ఉన్నారట. ఆమెతో ఆదికి చాలా కాలం నుంచే పరిచయం ఉందట. ఒక రకంగా ఆది ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో అతనికి ఆమె ఎంతో సాయంగా నిలిచిందట. అలా స్నేహంగా మొదలైన వారి బంధం ప్రేమ వరకు వచ్చిందట. (ఇదీ చదవండి: TFCC Election: సంతోషపడాలో, సిగ్గు పడాలో తెలియట్లేదు..తమ్మారెడ్డి) తాజాగా వీరి ప్రేమ గురించి ఇంట్లో తెలిపితే ఇద్దరి పెద్దలు కూడా అంగీకరించారట. ఇంకేముంది త్వరలోనే ఒక మంచి ముహూర్తం ఏర్పాటు చేసి ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో ఆ ఆమ్మాయి పేరుతో పాటు.. పెళ్లి విషయాన్ని అధికారికంగా ఆదినే వెల్లడించాలనే ప్లాన్‌లో ఉన్నారట. -
ఫోన్లో ఆ వీడియోలు చూడవద్దు అన్నందుకే...
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎప్పుడు ఫోన్లో యూ ట్యూబ్ చూడొద్దని బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురైన విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్‌తండాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. విద్యార్థి మృతిఘటన తండాలో విషా దం నింపింది. పోలీసులు తెలిపిన వివరాలు. మా లోతు రేణ–ప్రశాంత్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఉదయ్(11) రాజన్నపేటలో ని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నా డు. పాఠశాలకు సెలవు దినం కావడంతో ఉదయ్ ఇంటి వద్ద ఉండగా తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని ఇంటికొచ్చిన వారికి ఉదయ్ కనిపించలేదు. రాత్రి పొద్దుపోయే వరకు గా లించారు. ఇంట్లోని వంట గదికి గడియపెట్టి ఉండడంతో అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా గోడమేకుకు లుంగితో మెడకు చుట్టుకొని ఉరేసుకొని ఉన్నా డు. కొనఊపిరితో ఉన్న ఉదయ్‌ని ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించా డు. యూట్యూబ్ చూడొద్దని చదువుకోవాలని మందలించిన పాపానికి చెట్టంతా కొడుకు మమ్మల్ని విడిచి వెళ్లాడని ఆ దంపతుల రోదనలు అందరిని కలచివేశాయి. మృతుడి తండ్రి ప్రశాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తల్లిని దరిచేర్చిన యూ ట్యూబ్
ఖమ్మం: మతిస్థిమితం లేక తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎక్కడా వెతికినా ఆచూకీ తెలియలేదు. చివరకు కాలిపోయిన స్థితిలో కనిపించిన మహిళ మృతదేహాన్ని తల్లిదిగానే భావించి కర్మకాండలు నిర్వహించారు. చివరకు యూ ట్యూబ్‌లో అనాథాశ్రమం వీడియోలను ఆమె కుమారుడు చూసే క్రమంలో తల్లి కనిపించడంలో ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. దీంతో ఏపీ నుంచి వచ్చిన యువకుడు ఖమ్మం జిల్లా మధిరలోని ఆశ్రమం నుంచి తల్లిని తీసుకెళ్లాడు. వివరాలు... ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లూరు శివారు కొత్తగూడెంకు చెందిన నాగేంద్రమ్మకు భర్త తిరుపతయ్య, కుమారులు ముత్తయ్య, శ్రీనివాసరావు ఉన్నారు. అయితే, నాగేంద్రమ్మకు మతిస్థిమితం సరిగ్గా లేక రెండేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల వెతికారు. అప్పట్లో గ్రామ సమీపంలోని గుట్టపై కాలిపోయిన మహిళ మృతదేహం లభించడంతో నాగేంద్రమ్మదిగా భావించి కర్మకాండలు పూర్తిచేశారు. ఇటీవల నాగేంద్రమ్మ కుమారుడు ముత్తయ్య యూట్యూబ్‌లో విజయవాడకు చెందిన హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యాన రూపొందించిన వీడియో చూశాడు. ఈ వీడియో ఒక అనాథ శరణాలయం వివరాలు ప్రసారమవుతుండగా తల్లి కనిపించడంతో నిర్వాహకులకు ఫోన్ చేయగా ఖమ్మం జిల్లా మధిరలో ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ దోర్నాల రామకృష్ణ, జ్యోతి ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఆశ్రమంగా తేలింది. ఈమేరకు నాగేంద్రమ్మ కుటుంబ సభ్యులు శుక్రవారం మధిరకు రాగా, ట్రెయినీ ఐపీఎస్ అవినాష్‌కుమార్ సమక్షాన ఆశ్రమం నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ అప్పగించారు. -
ఇండియాలోనే పాపులర్ యూట్యూబ్ చానెల్.. పొలిటికల్ లీడర్స్ కూడా
ఎన్నికల సమయం రాబోతూ ఉంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సోషల్ ఇన్‌ఫ్లూయర్స్‌ను సంప్రదించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రచారం పొందుతున్నారు. ‘కర్లీ టేల్స్’ యూ ట్యూబ్ చానల్‌తో విశేషంగా ఫాలోయర్స్‌ను సాధించుకున్న కామియా జని ఇటీవల రాహుల్ గాంధీ, ఆదిత్య థాకరే వంటి నేతలను కూడా ఇంటర్వ్యూ చేస్తోంది. 20 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్న కామియా జని కేవలం ఈ ఇంటర్వ్యూల ద్వారా పేరు, పైకం సంపాదిస్తోంది. కామియా జని ‘సండే బ్రంచ్’ పేరుతో చేసే యూ ట్యూబ్ ఇంటర్వూలు 100వ ఎపిసోడ్‌కు చేరుకున్నప్పుడు గెస్ట్‌గా సచిన్ టెండూల్కర్ వచ్చాడు. ‘శివాజీ పార్కులో చిన్నప్పుడు క్రికెట్ ఆడితే చాలా ఆకలేసేది. మూడు నాలుగు వడపావ్‌లు లాగించేసేవాణ్ణి’ అని చెప్పాడు. వెంటనే కామియా జని ‘మీ కోసం జుహూ, అంధేరి, శివాజీ పార్క్ నుంచి మూడు వడపావ్‌లు తెప్పించాను. వాటిలో ఏది శివాజీ పార్క్దో మీరు తిని కనిపెట్టి చెప్పాలి’ అంది. సచిన్ టెండూల్కర్ చిటికెలో కనిపెట్టాడు. ఇలా ఇంటర్వ్యూ చేస్తే జనం చూడరూ? ‘సండే బ్రంచ్’కు విరాట్ కోహ్లీ ఒక వారం గెస్ట్. ‘అనుష్కతో పెళ్లయ్యాక మమ్మల్ని ఎవరూ గుర్తు పట్టకూడదని హనీమూన్‌కు ఫిన్లాండ్ వెళ్లాం. హాయిగా తిరుగుతున్నాం. ఒక చోట కాఫీ తాగుతూ ఉంటే ఒక సర్దార్జీ మమ్మల్ని గుర్తు పట్టాడు. కోహ్లీ... మా ఇంటి పేరు కూడా కోహ్లీనే అన్నాడు. పెద్దాయనా... ఇప్పుడు హడావిడి చేసి మా గుట్టు బయట పెట్టకు అని బతిమాలుకున్నాం’ అని సరదా విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు.ఇలాంటి సరదా కబుర్ల కోసం కామియా జని ఇంటర్వ్యూలు చూస్తారు. భారత్‌జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో ఉన్నప్పుడు ‘సండే బ్రంచ్’కు పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. కామియా జనితో ‘నాకు పాతికేళ్ల వయసు వచ్చినప్పుడు లండన్‌లో ఒక కార్పొరెట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. ఆ రోజుల్లో మొదటి జీతం 2,500 పౌండ్లు అందుకున్నప్పుడు అది చాలా పెద్ద అమౌంట్ అనిపించింది’ అని గుర్తు చేసుకున్నాడు. కామియా జని యూట్యూబ్ చానల్ ‘కర్లీ టేల్స్’కు 20 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఆమె ఇప్పటి వరకూ ప్రొడ్యూస్ చేసిన వీడియోలకు 88 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆమె చానల్ ఇండియాలో అత్యంత పాపులర్ చానల్‌గా గుర్తింపు పొందింది. అందుకే కొత్త సినిమా రిలీజ్ అయినా, ఈవెంట్ జరుగుతున్నా సెలబ్రిటీలే ఆమెను ఇంటర్వ్యూ చేయమని కోరుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు కనుక రాజకీయ నేతలు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూల వ్యూస్ కామియా జనికి భారీ ఆదాయం సంపాదించి పెడుతున్నాయి. ఒకప్పుడు జర్నలిస్ట్ ముంబైలో ఒక సాధారణ ఆటో డ్రైవర్‌కు జన్మించిన కామియా జని మాస్ మీడియాలో డిగ్రీ చేసింది. తర్వాత ఎల్ఎల్బీ చేసి 2006లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో సబ్ ఎడిటర్‌గా పని చేసింది. ఆ తర్వాత సిఎన్‌బిసి తదితర చానల్స్‌లో పని చేసి 2016 నాటికి ఈ రోజువారీ పని బోర్ కొడుతోందని భావించి ఉద్యోగం మానేసింది. ఆమెకు ప్రయాణాలు, ఫుడ్ అంటే చాలా ఇష్టం. తన మనసుకు నచ్చిన ప్రయాణాలు చేస్తూ, నచ్చింది తింటూ వాటి మీద వీడియోలు తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటే విశేషమైన ఆదరణ లభించింది. కామియా జని జట్టు రింగులు రింగులుగా ఉంటుంది కనుక ‘కర్లీ టేల్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలెట్టింది. ‘సండే బ్రంచ్’ పేరుతో సెలబ్రిటీలను బ్రంచ్‌కు పిలిచి వారికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వడ్డిస్తూ పిచ్చాపాటి కబుర్లతో ఇంటర్వ్యూ చేయడం కామియా జని స్టయిల్. విహారం, ఆహారం అంటే అందరికీ ఇష్టం కనుక వ్యూస్ విపరీతంగా పెరిగాయి. పెరుగుతూనే ఉన్నాయి. ఫోలోయెర్స్ ఉన్నవారే నిర్ణేతలు ఇవాళ ఎక్కువమంది ఫాలోయెర్స్ ఉన్నవారే అభిప్రాయాలను నిర్మిస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఇది కనిపెట్టారు. లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల సాయం పొందుతున్నారు. వారు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఇంటర్వ్యూలు ఇస్తూ తాము ప్రచారం పొందుతున్నారు. ఇటీవల్ ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్యా థాక్రే కామియా జనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. రానున్న ఎన్నికల్లో కామియా జని లాంటి వాళ్లకు ఇంకా డిమాండ్ పెరగనుంది. -
ఆదిపురుష్ మూవీ లీక్.. దెబ్బకు 2 మిలియన్లకు పైగా వ్యూస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు చేశారు. (ఇది చదవండి: కిరాక్ పార్టీ హీరోయిన్.. ఆ ఫిట్నెస్ ఏంట్రా బాబు!) అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆన్లైన్లో లీకైన విషయం తెరపైకి వచ్చింది. ఇంతకుముందే ఈ చిత్రం ఆన్లైన్ పైరసీ జరిగింది. తాజాగా మరోసారి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఆదిపురుష్ చిత్రం లీకైనట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబ్‌లో హెచ్డీ క్వాలిటీలో చూడటానికి అందుబాటులోకి రావడంతో.. కొద్దిసేపటికే 2.3 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత చిత్రబృందం ఫిర్యాదు చేయడంతో యూట్యూబ్ నుంచి తొలగించారు. యూట్యూబ్‌లో లీక్ కావడం పట్ల చిత్ర బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. (ఇది చదవండి: RRR Sequel: రామ్‌చరణ్, తారక్లతోనే RRR2, కానీ దర్శకుడు మాత్రం జక్కన్న కాదట!) -
యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లకు, ఇన్ఫ్లుయెన్సర్లకు కేంద్రం భారీ షాక్!
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లు, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్లపై కేంద్రం దృష్టిసారించింది. ఆదాయపుపన్ను నిబంధనల్ని ఉల్లంఘించిన క్రియేటర్లపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్రియేటర్లను, ఇన్ఫ్లుయెన్సర్లను కేంద్ర విభాగానికి చెందిన ఇన్ ట్యాక్స్ అధికారులు విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆదాయాలు, లాభాలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించాల్సి ఉందంటూ పీటీఐ తన కథనంలో పేర్కొంది. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ గత వారం, కేరళకు చెందిన 10 మంది యూట్యూబ్ చానల్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమా రంగానికి చెందిన ఆర్టిస్టులు, యాక్టర్స్లను ఐటీ అధికారులు విచారించారు. సోషల్ మీడియాలో ప్రభావశీలురుగా చెలామణి అవుతున్నవారు, కంటెంట్ క్రియేటర్లు ఊహించని విధంగా సంపాదిస్తున్నారని, కానీ ఇన్ కమ్ ట్యాక్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నోటీసులు జారీ ఇక, కేరళకు చెందిన కంటెంట్ క్రియేటర్ల నుంచి ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు మరిన్ని వివరాలు రాబట్టారని, బాధ్యతాయుతంగా పన్నులు చెల్లించేలా ప్రోత్సాహిస్తూ వారికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నివేదికల ప్రకారం..ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. ఇందులో వారి బ్రాండ్ ఎండార్స్మెంట్లు, చెల్లింపులు, చెల్లించని ప్రమోషన్లు, డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల వినియోగం, ఖర్చలు, ఆయా సంస్థల నుంచి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా చేసే ప్రకటనల రూపంలో జరిపే చెల్లింపులపై చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించారు. కేరళతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోషల్ మీడియాను ప్రభావితం చేసే వారిపై ఇలాంటి చర్యలే తీసుకున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్ల కార్యకలాపాలు నిర్వహించే సంస్థల గురించి ఆరాతీస్తున్నారు. కొత్త నిబంధనలు గత ఏడాది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) వ్యాపారం లేదా వృత్తిలో పొందే ప్రయోజనాలకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఒక వ్యక్తి ఏడాదిలో రూ. 20,000 కంటే ఎక్కువ ప్రయోజనాలు లేదా అవసరాలు తీర్చుకుంటే.. సదరు వ్యక్తి 10 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. చదవండి👉 ‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు! -
వయసు 11.. సంపాదన వందల కోట్లు - చిన్నారి సక్సెస్ స్టోరీ!
Youtuber Shfa Success Story: ఆధునిక ప్రపంచాన్ని ఈ రోజు ట్విటర్, వాట్సాప్, యూట్యూబ్ ఏలేస్తున్నాయి. ఏ చిన్న సంఘనటన జరిగినా నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఈ సోషల్ మీడియా ఆధారంగా ఎంతో మంది లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు 11 సంవత్సరాల 'ష్ఫా' (Shfa). ఇంతకీ ఈమె యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తోంది. ఎలాంటి వీడియోలు చేస్తుంది అనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో 2011 డిసెంబర్ 19న జన్మించిన 'ష్పా' (Shfa) పిల్లలకు ఉపయోగకరమైన ఎన్నో వీడియోలను తన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పోస్ట్ చేసి అతి తక్కువ కాలంలో పాపులర్ అయిపోయింది. ఈ అమ్మాయి వీడియోలు అరబిక్ భాషలో ఉండటం గమనార్హం. ష్ఫా యూట్యూబ్ ఛానల్ పాలొవర్స్.. సుమారు 40 మిలియన్స్ పాలొవర్స్ ఉన్న 'ష్ఫా' యూట్యూబ్ ఛానల్ 2015 మార్చి 29 నుంచి ప్రారంభమైనట్లు సమాచారం. అంతే కాకుండా ఇది మొదట్లో తన తల్లి నిర్వహించేది, అయితే ష్ఫా యూట్యూబ్ వీడియోలు చేయడం ప్రారంభించిన తరువాత ఎంతో మంది పిల్లల హృదయాలను దోచుకుంది, తద్వారా ఈ ఛానల్ బాగా డెవలప్ అయింది. (ఇదీ చదవండి: విడుదలకు ముందే అంచనాలు దాటేస్తున్న హోండా ఎలివేట్ - బుకింగ్స్) నెల సంపాదన ఎంతంటే.. ష్ఫా యూట్యూబ్ ఛానల్ ఇప్పటికి 22 బిలియన్లకు పైగా వీక్షణలను పొందింది, ఫలితంగా రాబడి భారీగా పెరిగింది. 2023 మే నాటికి వీరి ఛానల్ ఆదాయం 2,00,000 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం, రూ. 1 కోటి కంటే ఎక్కువ. కొన్ని సందర్భాల్లో ఆమె నెల సంపాదన 3,00,000 డాలర్లు కూడా దాటింది. (ఇదీ చదవండి: సంచలనం సృష్టించి కనుమరుగైపోయిన భారతీయ బడా కంపెనీలు ఇవే!) కేవలం ఎనిమిది సంవత్సరాల వ్యవధిలోనే 984 వీడియోలను అప్లోడ్ చేసి సంపాదనలో బిలియన్ డాలర్ మార్క్‌కు చేరుకుంది. ష్పా నికర సంపాదన విలువ 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అంటే సుమారు 410 కోట్లు. కేవలం 11 సంవత్సరాల వయసులోనే కోట్లు సంపాదిస్తున్న ఈ చిన్నారి ఎంతోమందికి ఆదర్శం కావడం చాలా గొప్ప విషయం. -
యూట్యూబ్ కు పోటీగా ట్విట్టర్
-
యూట్యూబ్ కు పోటీగా ట్విట్టర్
-
టీవీల్లో వీడియోలు చూడొచ్చు.. ట్విటర్లో సరికొత్త ఫీచర్!
మీకు నచ్చిన గంటల కొద్ది నిడివిగల వీడియోలను ట్విటర్లో చూడలేకపోతున్నారా? అయితే, మీకో శుభవార్త. సాధారణంగా యూట్యూబ్ వీడియోలను టీవీలో చూడొచ్చు. మరి ట్విటర్లో వీడియోలు టీవీల్లో చూడలేం. కానీ ఇకపై ఆ సౌకర్యాన్ని ట్విటర్ సైతం అందించనుంది. ప్రస్తుతం, ట్విటర్ వీడియోలను టీవీల్లో వీక్షించే సౌకర్యంపై పనిచేస్తున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. ట్విటర్ యూజర్ ఎస్ - ఎం రాబిన్సన్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ట్విటర్ వీడియోలను టీవీల్లో చూసే సౌకర్యం ఉంటే బాగుంటుంది. గంటల నిడివి గల వీడియోలను యాప్‌లో చూడలేకపోతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై స్పందించిన మస్క్.. త్వరలో ఆ సౌకర్యాన్ని యూజర్లకు అందిస్తామని పేర్కొన్నారు. NEWS: Highlights from Zuby’s interview with Elon! Elon points out that giving in to advertiser demands is costing Twitter about $2 Billion in ad revenue a year. “Freedom of speech is pretty expensive”. 🧵 https://t.co/ujkHpmgY4S — T(w)itter Daily News (@TitterDaily) June 17, 2023 మస్క్ ట్వీట్‌పై స్పందించిన సదరు యూజర్. మస్క్‌కు అభినందనలు తెలిపారు. నేను యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్ చేసుకుంటాను. ఇకపై దానిని నేను మళ్లీ చూడకూడదని అనుకుంటున్నానని బదులిచ్చారు. ఇటీవలపెరిగిపోతున్న డిమాండ్ దృష్ట్యా ఆయా టెక్నాలజీ సంస్థలు వీడియో కంటెంట్‌పై దృష్టిసారించాయి. యూజర్లు వీడియోలను సులభంగా వీక్షించేలా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా, ట్విట్ సైతం స్మార్ట్ టీవీల్లో వీడియోలు చూసే వీలు కల్పిస్తున్నట్లు మస్క్ స్పష్టం చేశారు. ‘సోషల్ మీడియా భవిష్యత్తు అంతా వీడియో కంటెంట్‌దే. ఈ ట్రెండ్‌లో ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాను. మరింత మంది క్రియేటర్లు ట్విటర్‌ను వినియోగించేందుకు మక్కువ చూపుతున్నారు. అందుకే వినియోగదారులు ట్విటర్లో వీడియోలు చూసేలా సులభతరం చేయాలనుకుంటున్నట్లు మస్క్ తెలిపారు. అందుకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ట్విటర్ బాస్ మస్క్ స్పష్టం చేశారు. చదవండి👉 ‘నేను స్మార్ట్ అయితే’..రూ.3.37 లక్షల కోట్లు పెట్టి ట్విటర్‌ను ఎందుకు కొంటాను? -
క్రియేటర్ లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ ..!
-
యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!
వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్, ‘యూట్యూబ్ పార్ట్నర్ ప్రొగ్రామ్’(వైపీపీ) ద్వారా డబ్బులు సంపాదించేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది. షార్ట్ వీడియోస్ చేసి డబ్బులు సంపాదించుకుందుకు సంబంధించిన అర్హత అవసరాలను సగానికి తగ్గించేసింది.ముఖ్యంగా పేమెంట్ చాట్, టిప్పింగ్, ఛానెల్ మెంబర్‌షిప్‌లు, షాపింగ్ ఫీచర్లతో సహా షార్ట్ వీడియో క్రియేటర్లకు మానిటైజేషన్‌లో కొత్త విధానాన్ని లాంచ్ చేసింది. ఇదీ చదవండి: Adipurush Promotions: స్పెషల్ శాలువాతో కృతి సనన్, దీని విశేషాలు తెలిస్తే సవరించిన విధానం ప్రకారం, క్రియేటర్లు ఇప్పుడు 500 మంది సబ్స్క్రైబర్లు ఉంటే వైపీపీలో చేరిపోవచ్చు. ఇప్పటిదాకా వెయ్యి సబ్స్క్రైబర్లు ఉంటే తప్ప ఈ అవకాశం లభించేది కాదు. అంతేకాదు గతంలో 4,000 వాచ్ హవర్స్, 10 మిలియన్లతో పోలిస్తే ఇపుడు మూడు మిలియన్ల వ్యూస్ లేదా 3వేలు వాచ్ అవర్స్ ఉంటే సరిపోతుంది. క్రియేటర్లకు మానిటైజేషన్ అవకాశాలను విస్తరించాలనే యూట్యూబ్‌ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా షార్ట్స్ మానిటైజేషన్ మాడ్యూల్ నిబంధనలను బట్టి షార్ట్ వీడియోల మధ్యలో వచ్చేయాడ్ వాచ్ టైమ్‌ను బట్టి ఇన్కమ్ జనరేట్ అవుతుందనేది తెలిసిన సంగతే. (కేటీఎం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!) ఈ నిబంధనలు ప్రస్తుతం యూఎస్, యూకే, కెనడా, తైవాన్,దక్షిణ కొరియాలో అందుబాటులోకి వస్తాయని ది వెర్జ్ నివేదించింది. ఇతర ప్రదేశాలలో కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నప్పటికీ భారత్‌లో ఈ నిబంధన ఎప్పటినుంచి వర్తించేది స్పష్టత లేదు. ఇలాంటిమరిన్ని ఆసక్తికర క థనాలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఫాలోయింగ్‌లో కింగ్
వివిధ డిజిటల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ ఖాతాల నిర్వహణలో ముందుకు దూసుకుపోతోంది. తెలంగాణ సీఎంఓ, మంత్రి కేటీఆర్ డిజిటల్ మీడియా వింగ్.. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ చానల్ ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం, తప్పుడు సమాచారంపై అప్రమత్తం చేయడం వంటి కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సీఎం కార్యాలయం, మంత్రి కేటీఆర్‌ను ఎంత మంది అనుసరిస్తున్నారు, ఎంత మందికి చేరువవుతున్నారనే గణాంకాలను ఇటీవల తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ విడుదల చేసింది. మరోవైపు ఈ ఏడాది మే 20వ తేదీ నాటికి ట్విట్టర్లో హరియాణా తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతీ వెయ్యి మందిలో 44 మంది సీఎం కార్యాలయ ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
అంతా బాగుంది అనుకునేలోపు యూట్యూబర్లకు ఊహించని షాక్!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 26 నుంచి యూట్యూబ్‌లో స్టోరీస్ ఫీచర్ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. నిర్ధేశించిన గడువు తర్వాత వారం రోజుల వ్యవధిలో అప్పటికే క్రియేటర్లు షేర్ చేసిన స్టోరీస్‌లోని పోస్ట్‌లు కనుమరుగు కానున్నాయి. 2017లో యూట్యూబ్ 10వేల మంది సబ్‌స్కైబర్లు ఉన్న యూజర్లకు స్టోరీస్ అనే ఫీచర్‌ను అందించడం ప్రారంభించింది. ఆ ఫీచర్ సాయంతో యూట్యూబ్ క్రియేటర్లు వారి కంటెంట్‌ను ప్రమోట్ చేసుకునేందుకు మరింత సులువగా ఉండేది. కానీ యూట్యూబ్ ఊహించిన స్థాయిలో క్రియేటర్లు స్టోరీస్‌ని వినియోగించేందుకు మక్కువ చూపలేదు. ముఖ్యంగా, వినియోగంలో పరిమితి ఉండడంతో పట్టించుకోలేదు. అందుకే ఈ యూట్యూబ్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని పలు నివేదికలు చెబుతున్నాయి. కమ్యూనిటీ పోస్ట్‌లు, షార్ట్స్ ఉన్నాయిగా యూట్యూబ్ నిర్వాహకులు అప్లోడ్ చేస్తున్న కంటెంట్‌ను ప్రమోట్ చేసుకునేందుకు స్టోరీస్‌కు ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీ పోస్ట్‌లు, షార్ట్స్లు వినియోగిస్తున్నారు. యూజర్లను కంటెంట్‌తో ఎంగేజ్ చేసేలా ఉన్న ఆ రెండు ఫీచర్లలో టెక్ట్స్‌తో పాటు, పోల్లు, క్విజ్లు, ఫోటోలు, వీడియోలు షేర్ చేసే అవకాశం ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉండడంతో స్టోరీస్ ఫీచర్‌ను పట్టించుకోలేదు. చదవండి👉 ఫోన్‌పే యూజర్లకు బంపరాఫర్.. దేశంలోనే తొలిసారిగా.. -
ఇకపై మరింత విసిగించనున్న యూట్యూబ్! అర నిమిషంపాటు నాన్ స్టాప్..
గూగుల్ (Google) యాజమాన్యంలోని యూట్యూబ్ (YouTube) ప్రేక్షకులను మరింత విసిగించనుంది. అంటే ఎక్కువ సేపు యాడ్స్‌ను ప్రసారం చేయనుంది. అది కూడా స్కిప్ చేయడానికి వీలు లేకుండా. కనెక్టెడ్ టీవీ (సీటీవీ)లలో 30 సెకన్ల నాన్-స్కిప్ యాడ్లను ప్రవేశపెట్టనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. ఇంతకు ముందున్న రెండు 15 సెకన్ల వరుస యాడ్స్ స్థానంలో ఈ 30 సెకన్ల నాన్- స్కిప్ యాడ్స్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవల ఒక బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది. ప్రకటనకర్తల లక్ష్యాలకు అనుగుణంగా బిగ్ స్క్రీన్‌పై ఎక్కువ నిడివి యాడ్స్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతిని ఇస్తాయని పేర్కొంది. టీవీ స్క్రీన్‌పై యూట్యూబ్ సెలెక్ట్ వీక్షకులు పెరుగుతున్న నేపథ్యంలో ఇందులో వివిధ కంటెంట్లు ప్రసారమయ్యే సమయంలో యాడ్స్ ప్రసారం చేసుకునేందుకు ప్రకటనకర్తలకు యూట్యూబ్ అవకాశం కల్పిస్తోంది. ఇదీ చదవండి: జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్: త్వరలో అకౌంట్లు డిలీట్! -
యూ ట్యూబ్ వీడియోలు చూసి దొంగ నోట్లు ముద్రించిన యువకుడు
-
యూట్యూబ్ చూసి దొంగనోట్ల ముద్రణ
పలమనేరు (చిత్తూరు జిల్లా): చదివింది కేవలం ఏడో తరగతి.. వారపు సంతలో దుకాణాల వద్ద తిరుగుతూ టీ అమ్మడం అతని వృత్తి. ఇంట్లో రహస్యంగా దొంగ నోట్టు ముద్రించి సంతలో మార్చి సులభంగా డబ్బులు సంపాదించడం ప్రవృత్తి. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా వి.కోట మండలం కె.కొత్తూరుకు చెందిన గోపాల్ (41) ఏడో తరగతి చదివాడు. కొన్నాళ్లు బెంగళూరులోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేశాడు. ఇప్పుడు సంతలకు వెళ్లి టీ అమ్ముతుంటాడు. వ్యసనాలకు బానిసైన గోపాల్ సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా అని యూట్యూబ్‌లో చూసేవాడు. అందులో దొంగనోట్లను ముద్రించే వీడియోలు చూస్తూ దొంగనోట్లను ముద్రించాలనుకున్నాడు. బెంగళూరు వెళ్లి కలర్ ప్రింటర్, మందంగా ఉండే ఖాళీ బాండ్ పేపర్లు, కలర్లు, గ్రీన్ కలర్ నెయిల్ పాలీష్ కొనుక్కొచ్చాడు. 6 నెలలుగా ఇంట్లోనే రహస్యంగా రూ.500, రూ.200, రూ.100 నోట్లను ముద్రిస్తున్నాడు. రూ.500 నోట్లపై ఉండే సెక్యూరిటీ థ్రెడ్ కోసం గ్రీన్ నెయిల్ పాలిష్ వేశాడు. ఇలా ముద్రించిన నోట్లను వారపు సంతలో చలామణి చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం పట్టణంలోని కూరగాయల దుకాణంలో రూ.500 దొంగనోటు ఇచ్చి రూ.50 విలువైన కూరగాయలు కొని చిల్లర తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గోపాల్‌ను అరెస్ట్ చేసి రూ.8,200 విలువైన దొంగనోట్లను, ప్రింటర్, ఖాళీ తెల్లకాగితాలను సీజ్ చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్: త్వరలో అకౌంట్లు డిలీట్!
మీకు జీమెయిల్, యూట్యూబ్ అకౌంట్లు ఉన్నాయా.. క్రియేట్ చేసి చాలా కాలం అవుతోందా.. తరచూ ఉపయోగించడం లేదా.. అయితే ఆ అకౌంట్లు త్వరలో డిలీట్ అయ్యే అవకాశం ఉంది. మనలో చాలా మందికి జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. కొంత మంది అవసరంకొద్దీ రెండు.. మూడు.. ఇలా లెక్కకు మించి జీమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఆ అకౌంట్లను ఒకసారి కూడా ఓపెన్ చేయరు. రెండేళ్లకుపైగా ఉపయోగంలో లేని అలాంటి ఇన్‌యాక్టివ్ జీమెయిల్ అకౌంట్లను గూగుల్ త్వరలో డిలీట్ చేయనుంది. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. ఇన్‌యాక్టివ్ అకౌంట్లకు సంబంధించి గూగుల్ కొత్త విధానాలను ప్రకటించింది. ప్రతి 24 నెలలకు ఒకసారి లాగిన్ అవ్వాలని, పాత గూగుల్ అకౌంట్లను సమీక్షించాలని యూజర్లను కోరింది. రెండు సంవత్సరాలుగా ఆపరేట్ చేయని అకౌంట్లలో స్టోర్ అయిన డేటా డిలీట్ అయ్యేలా ఇప్పటికే గూగుల్ ఒక విధానాన్ని కలిగి ఉంది. కానీ, ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని పూర్తిగా తమ సర్వర్ల నుంచి డిలీట్ చేయనుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి గూగుల్ అకౌంట్ల కోసం ఇన్‌యాక్టివ్ విధానాన్ని మరో రెండేళ్లకు అప్డేట్ చేస్తున్నట్లు గూగుల్ పేర్కొంది. యూట్యూబ్, గూగుల్ ఫొటోస్పైనా ప్రభావం కొత్త విధానం డిసెంబర్ 2023 నుంచి అమలులోకి వస్తుందని ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ పేర్కొంది. జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్, యూట్యూబ్, గూగుల్ ఫోటోస్ సహా ఇనాక్టివ్ అకౌంట్లలో స్టోర్ మొత్తం మొత్తం కంటెంట్ తొలగించనున్నట్లు తెలిపింది. ఇంతకు ముందు 2020లో ప్రకటించిన విధానం ప్రకారం.. ఇనాపరేటివ్ అంకౌంట్లలోని కంటెంట్‌ను మాత్రమే తొలగించేది. ఇప్పుడు తీసుకొచ్చిన విధానంలో అకౌంట్లను కూడా తొలగించే అవకాశం ఉంది. ఈ విధానం వ్యక్తిగత గూగుల్ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుందని, పాఠశాలలు లేదా వ్యాపార సంస్థల అకౌంట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని గూగుల్ పేర్కొంది. తొలగించే ముందు నోటిఫికేషన్లు ఉపయోగంలో లేని అకౌంట్లను గూగుల్ దశలవారీగా తొలగిస్తుంది. మొదటగా డిసెంబర్లో ఈ తొలగింపు ప్రక్రియను ప్రారంభించనుంది. అకౌంట్ క్రియేట్ చేసి తర్వాత ఎప్పుడూ ఉపయోగించని అకౌంట్లను తొలి విడతలో తొలగించనుంది. ఇలా తొలగించే ముందు ఆ అకౌంట్లకు, దానికి సంబంధించి పేర్కొన్న రికవరీ అకౌంట్లకు నోటిఫికేషన్లు పంపుతుంది. కాబట్టి మీకు గూగుల్ అకౌంట్ ఉండి తరచూ ఉపయోగించకపోతే వెంటనే యాక్టివేట్ చేసుకోండి. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. యూట్యూబర్‌పై మంత్రి కన్నెర్ర
సాక్షి,చైన్నె: యూట్యూబర్ ఎస్ శంకర్‌పై విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ కన్నెర్ర చేశారు. ఆయనపై ఏకంగా నాలుగు పరువు నష్టం దావాలను సోమవారం సైదాపేట కోర్టులో దాఖలు చేశారు. శంకర్ తనకు వ్యతిరేకంగా పదే పదే వీడియోలను విడుదల చేస్తూ వస్తున్నారని ఆ పిటిషన్లలో మంత్రి వివరించారు. మహారాష్ట్ర తరహాలో తమిళనాడులో ప్రభుత్వాన్ని కూల్చేందుకు తానేదో కుట్ర చేస్తున్నట్లుగా శంకర్ ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొన్నా రు. అలాగే, తాను టాస్మాక్బార్లను నిర్వహిస్తున్నట్లు ఆరోపించారని తెలిపారు. ఆధార రహిత ఆరోపణలు చేయడమే కాకుండా డీఎంకే అధిష్టానం తనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తప్పుడు సమాచారం ప్రజలకు అందజేస్తూ వస్తున్నాడని వివరించారు. తన పేరుకు, పరు వుకు కలంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ మేరకు కోర్టును కోరారు. -
ఎవరీ మేఘన కౌర్?.. దేశంలో ఆమెకు ఎందుకంత క్రేజ్?
ముంబైకి చెందిన మేఘన కౌర్ సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా పెద్ద పేరు తెచ్చుకుంది. తన యూట్యూబ్ ఛానల్ ‘షీ ట్రుబుల్మేకర్’ బాగా ΄పాపులర్ అయింది. హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, సిందీ భాషలు మాట్లాడే మేఘనకు ప్రయాణాలు చేయడం, బ్యాడ్మింటన్ ఆడడం, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. అమెరికన్ సింగర్ జస్టిన్ బీబర్ పాటలు వినడం అంటే బోలెడు ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి ఉత్సాహం చూపే మేఘన జంతుప్రేమి. సామాజిక సేవ కార్యక్రమాల్లో ΄పాల్గొంటుంది. ‘క్రియేటర్ ఎకనామీ ఊపందుకున్న ఈ సమయంలో మీదైన సొంత శైలి ఏర్పాటు చేసుకోవడానికి ఏం చేస్తారు?’ అని అడిగితే ‘నా నుంచి ఆడియెన్స్ ఏం ఆశిస్తున్నారనే దాని గురించి ఆలోచించడంతో పాటు, నేను ఆడియెన్స్‌లో ఒకరిగా మారి నన్ను నేను విశ్లేషించుకుంటాను. సబ్జెక్ట్ విషయంలో రెలవెంట్‌గా ఉండడం అనేది ముఖ్యమైనది. అందుకే ఆడియెన్స్‌తో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతాను. మారుతున్న ట్రెండ్స్‌పై ప్రత్యేక దృష్టి పెడతాను. సబ్జెక్ట్ విషయానికి వస్తే అతి తెలివి ఎప్పుడూ ప్రదర్శించవద్దు. ఎందుకంటే ఆడియెన్స్ మనకంటే తెలివైన వాళ్లు’ అంటుంది మేఘన. ఎంతవారికైనా ట్రోలింగ్ తప్పదు. సోషల్ మీడియా స్టార్ ఇన్ఫ్లూయెన్సర్ అయిన మేఘన ట్రోలింగ్‌పై ఇలా అంటుంది.. ‘నేను ఎమోషన్ పర్సన్. చిన్న విషయాలకే చిన్నబుచ్చుకుంటాను. అలాంటి నేను ఇన్ఫ్లూయెన్సర్గా ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో ట్రోలింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. దాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు అనిపించింది. అయితే ఆ తరువాత నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. ఒక్క హేట్ కామెంట్ ఉన్నచోట పది ప్రశంసలు కనిపిస్తాయి. మరి ఆ ఒక్క కామెంట్‌ను చూస్తూ బాధ పడడం ఎందుకు! అందుకే ΄పాజిటివ్ కామెంట్స్‌పైనే ఎక్కువ దృష్టి పెడతాను. వాటి ద్వారా శక్తిని గ్రహిస్తాను. సక్సెస్ఫుల్ కంటెంట్ క్రియేటర్‌గా రాణించడానికి మొదట ఉండాల్సింది సహనం. ఆ తరువాతే ఏదైనా!’ -
పేరుకే యూట్యూబర్.. ఆస్తుల్లో కుబేరుడు: ఎవరతడు?
సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన చాలా మందిలో గౌరవ్ చౌదరి ఒకరు. వృత్తిపరంగా టెక్నికల్ గురూజీ పేరుతో సుపరిచితుడైన ఈ యూట్యూబర్ దుబాయ్‌లో నివసిస్తున్నాడు. భారతదేశంలో ఎక్కువ మంది అనుసరించే టెక్ యూట్యూబర్ కూడా. ఈయన రెండు యూట్యూబ్ ఛానెల్‌లను నడుపుతూ కోట్ల కొద్ది సంపాదిస్తున్నారు. గౌరవ్ చౌదరి అండ్ టెక్నికల్ గురూజీ పేరుతో రెండు యూట్యూబ్ ఛానెల్‌లను నడుపుతున్న ఇతనికి సుమారు 27 మిలియన్స్ పాలొవర్స్ ఉన్నారు. ప్రపంచంలో అతి పెద్ద టెక్ ఛానెల్‌లలో ఒకటి టెక్నికల్ గురూజీ యూట్యూబ్ ఛానెల్. 1991లో రాజస్థాన్‌లో అజ్మీర్‌లో జన్మించిన టెక్నికల్ గురూజీ BITS పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీని పూర్తి చేసాడు. 2015లో యూట్యూబ్ ప్రారంభించాడు. ఈ ఛానల్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే గొప్ప సక్సెస్ సాధించాడు. ఒక పక్క యూట్యూబ్ ద్వారా భారీగా సంపాదించమే కాకుండా, దుబాయ్ పోలీసులకు, ఇతర సంస్థలకు భద్రతా సామగ్రిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడు దుబాయ్ పోలీస్ సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇంజనీర్ అని సమాచారం. ప్రస్తుతం దుబాయ్‌లో రూ. 60 కోట్ల విలువైన ఇల్లు ఉంది, అంతే కాకుండా అతడు ఇప్పటికే ఖరీదైన సుమారు 11 కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో రూ. 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెక్లారెన్ GT, రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే పనామెరా GTS, మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్, బిఎండబ్ల్యు 750ఎల్ఐ, మెర్సిడెస్ బెంజ్ 500ఎమ్ఎల్, ఆడి ఏ6, మహీంద్రా థార్ మొదలైనవి ఉన్నాయి. ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లను కలిగి ఉన్న టెక్నికల్ గురూజీ మొత్తం ఆస్తుల విలువ 45 మిలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 369 కోట్లు. అతని నెల సంపాదన కోటి కంటే ఎక్కువే. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
‘పుష్ప -2’ టీజర్.. ఐకాన్ స్టార్ దెబ్బకు యూట్యూబ్ షేక్
‘పుష్ప -2’ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ‘వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్’ అంటూ విడుదలైన ఈ గ్లింప్స్ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులోని పులి సీన్ అయితే టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. దీంతో విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ టీజర్ మిలియన్‌కు పైగా వ్యూస్ రాబట్టిం ట్రెండింగ్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఇక ఇప్పటి వరకు విడుదలైన అన్ని భాషల్లో కలిపి 64 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. హిందీలో అయితే ఏకంగా 35 మిలియన్లు రావడం మరో విశేషం. తెలుగులో 22 మిలియన్స్‌తో రెండోస్థానంలో ఉంది. అంతే కాకుండా ఈ టీజర్ 2.48 మిలియన్స్ లైక్స్ వచ్చాయి. మొత్తానికి బన్నీ టీజర్‌తోనే రికార్డుల మోత మోగిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్ పాజిల్, సునీల్, అనసూయ తదితరలు కీలక పాత్రలు పోషించారు. It is Icon Star @alluarjun's Blockbuster RULE 🔥🔥#Pushpa2TheRule Glimpse trending all over with 64M+ views and 2.48M+ likes 💥💥 - https://t.co/eNEiADQGP0@iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/TRipwCp5a2 — Mythri Movie Makers (@MythriOfficial) April 9, 2023 -
పుష్ప రూలింగ్ స్టార్ట్
-
ఒక్కసారిగా మైండ్ బ్లాక్!.. వెయిట్రస్‌కు కోట్ల విలువైన కారు టిప్‌గా ఇచ్చాడు
ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ మీస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్సన్ ప్రపంచంలో అత్యధికంగా ఫాలోవర్లును సంపాదించుకున్నాడు. వెరైటీ కంటెంట్లతో నెటిజన్లకు ఎప్పటికప్పుడు వినోదాన్ని పంచుతుంటాడు ఈ యూట్యూబర్. అందుకే తన ఫాలోవర్లు సంఖ్య 139 మిలియన్లకు పెంచుకోగలిగాడు. తన బిజినెస్ వెంచర్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు సరికొత్తగా ప్లాన్లు చేసే ఈ యూట్యూబర్ ఇటీవల ఓ వెయిట్రస్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆమె ఆనందానికి అవధులు లేకుండా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఊహించని టిప్.. రెస్టారెంట్‌కు వెళ్లిన ఆ యూట్యూబర్ అక్కడ పని చేస్తున్న వెయిట్రెస్‌తో.. ఇంత వరకు నువ్వు అత్యధికంగా ఎంత టిప్ తీసుకున్నావు అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు, ఆమె 50 డాలర్లు అని సమాధానమిస్తుంది. దాంతో ఇప్పటివరకూ నీకు టిప్‌గా కారు ఎవరైన ఇచ్చారా అని అడుగుతూ తన కారు తాళాన్ని వెయిట్రెస్‌కు ఇస్తాడు. మొదట్లో ఆమె ఈ విషయాన్ని నమ్మదు గానీ తర్వాత ఆ యూట్యూబర్ తను కారును పార్క్ చేసిన ప్రదేశానికి వెయిట్రెస్‌ను తీసుకువెళ్లి సర్ప్రైజ్ చేస్తాడు. బ్లాక్ టయోటా కారును వెయిట్రెస్‌కు టిప్‌గా అందిస్తాడు ఆ యూట్యూబర్. టిప్‌గా ఇచ్చిన కారుపై తన చాక్లెట్ కంపెనీ ఫీస్టబుల్ లోగో కనిపిస్తుంది. కస్టమర్ నుంచి కోట్లు ఖరీదైన కారుని టిప్‌గా అందుకోవడంతో వెయిట్రెస్ ఆనందంలో మునిగి తేలిపోతుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యూట్యూబర్ ఔదార్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) -
నకిలీ వీడియో కేసు.. పోలీసుల కస్టడీలో యూట్యూబర్!
చెన్నై: తమిళనాడులోని బీహార్ వలస కార్మికులపై దాడులు చేశారంటూ నకిలీ వీడియోలను పోస్ట్ చేసిన కేసులో యూట్యూబర్ మనీష్ కశ్యప్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని మధురై కోర్టు ముందు హాజరుపరచగా.. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం న్యాయస్థానం కశ్యప్‌కు మూడు రోజుల కస్టడీని విధించింది. మార్చి 18న జగదీష్పూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన తర్వాత బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOU) కశ్యప్‌ను అరెస్టు చేసింది. పోలీసుల ప్రత్యేక బృందం ట్రాన్సిట్ రిమాండ్‌పై బీహార్ నుంచి తమిళనాడుకు తీసుకువచ్చింది. నకిలీ వీడియోలను వ్యాప్తి చేసినందుకు అతనిపై మధురైలో నమోదైన ఫిర్యాదు ఆధారంగా, అతనిపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇటీవల, తమిళనాడులో వలస కార్మికులపై దాడికి గురైన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఫ్యాక్ట్ చెక్ కమిటీ, పోలీసు శాఖ ద్వారా ఈ వీడియోలు ఫేక్ అని తేలింది. దీంతో వెంటనే అతనిపై చర్యలు తీసుకున్నారు. వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోల అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇటువంటి పుకార్లను వ్యాప్తి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అవసరమైన అన్ని సహాయాన్ని వలస కార్మికులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. -
రేర్ రికార్డ్ నెలకొల్చిన జయ జానకి నాయక
-
ప్రపంచ రికార్డ్ సృష్టించిన టాలీవుడ్ మూవీ!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన చిత్రం జయ జానకి నాయక. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికీ ఐదేళ్లు దాటిపోయినా కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 709 మిలియన్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. ఏకంగా హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 702 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో నిలిచింది. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు!
ప్రముఖ ఎడ్టెక్ సంస్థ ఫిజిక్స్ వాలాను వీడిన ముగ్గురు టీచర్లు తమపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ సానుభూతి కోసం ఏడుస్తూ పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అయింది. వారి ఏడుపు టీవీ నాటకంలా ఉందని నెటిజన్లు ఓ రేంజ్లో విమర్శలు చేశారు. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! ‘ఫిజిక్స్ వాలా’లో పనిచేస్తున్న తరుణ్ కుమార్, మనీష్ దూబే, సర్వేష్ దీక్షిత్ అనే ముగ్గురు టీచర్లు.. సంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండేతో విభేదాల కారణంగా ఇటీవల ఆ సంస్థను విడిచి బయటకు వెళ్లారు. అయితే అడ్డా247 అనే సంస్థ నుంచి రూ.5 కోట్లు తీసుకుని ‘ఫిజిక్స్ వాలా’ను వీడినట్లు ఆ సంస్థ కెమిస్ట్రీ టీచర్ తమపై ఆరోపణలు చేశారని ముగ్గురూ పేర్కొన్నారు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! రాజీనామా తర్వాత ముగ్గురు ఉపాధ్యాయులు ఇప్పుడు సంకల్ప్ అనే పేరుతో వారి సొంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఫిజిక్స్ వాలాపై విమర్శలు చేస్తూ తమ ఛానెల్లో ఓ వీడియో పెట్టారు. తమపై ఆరోపణలు చేయడంపై విరుచుకుపడ్డారు. ఓ దశలో బోరుమంటూ ఏడ్చేశారు. అయితే వీరికి కొంతమంది నెటిజన్లు సానుభూతి తెలపగా ఇదంతా టీవీ నాటకం లాగా ఉందని చాలామంది విమర్శలు చేశారు. ఈ వీడియోను కేవలం ఒక్కరోజులోనే 2.1 మిలియన్ల మంది వీక్షించారు. -
అదేం పని.. జూమ్ చేసి వీడియోలు తీస్తున్నారు: నటి ఫైర్
మోడలింగ్ రంగం నుంచి బుల్లితెరకు, ఆ తర్వాత వెండితెరకు పరిచయమైన నటి వాణిభోజన్. ఓ మై కడవులే చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సీరీస్‌లతో బిజీగా ఉంది. ఈమె తాజాగా నటించిన వెబ్‌సీరీస్ సెంగలం. నటుడు కలైయరసన్ ప్రధాన పాత్రలో నటించిన ఇందులో వాణిభోజన్ రాజకీయ నాయకురాలుగా నటించింది. ఎస్సార్ ప్రభాకర్ దర్శకత్వంలో 9 ఎపిసోడ్స్‌గా రూపొందిన దీన్ని అభి అండ్ అభి పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఇది ఇప్పుడు జీ5 చానల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వాణి భోజన్ మాట్లాడుతూ ఇంతకుముందు ఎప్పుడు నటించనటువంటి పాత్రను ఇందులో నటించినట్లు చెప్పింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ పాత్ర తనకు చాలా కొత్తగా అనిపించిందని పేర్కొంది. కాగా ఈ అమ్మడిపై కొందరు పాజిటివ్‌గా స్పందిస్తున్నా మరికొందరు మాత్రం పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై స్పందించిన వాణి భోజన్ నువ్వు సినిమాల్లో నటించడానికి ఎందుకు వచ్చావు? అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ తన చెవి వరకు కూడా వచ్చాయని చెప్పింది. అలాంటి కామెంట్స్ చూసి మొదట్లో చాలా భయపడ్డానని, ముఖ్యంగా అలాంటివి తన తల్లితండ్రులు చదువుతారని అని భావించేదాన్ని పేర్కొంది. అయితే ఇప్పుడు అలాంటి వాటిని ధైర్యంగా ఫేస్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చీర సరి చేసుకున్నా జూమ్ చేసి వీడియోలు తీసి కామెంట్స్ చేస్తున్నారని యూట్యూబ్‌పై మండిపడింది. అలాంటి వాటిని పట్టించుకుంటే సంతోషంగానే ఉండలేమని చెప్పింది. తాను సినిమాలో చాలా అప్ అండ్ డౌన్న్ చూశానని, నటించిన ఒక్కోచిత్రం వీడియో సమయంలో అది హిట్టో ఫ్లాపో సంతోషం కలుగుతుందని చెప్పింది. తను మాత్రం శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నానని అది తనను ఎక్కడకు తీసుకెళ్లి నిలబెడుతుందో తెలియదని వాణి భోజన్ పేర్కొంది. -
జాబ్, బిజినెస్ మాకొద్దు.. సంపాదన మాత్రం లక్షల్లో.. ఆ గ్రామంలో అదే ట్రెండ్!
ప్రస్తుత రోజుల్లో గ్రాడ్యుయేట్లుగా కళాశాల నుంచి బయటకొస్తున్న విద్యార్థులు.. ఉద్యోగులుగా మారడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తుండగా.. మరి కొందరు ఐటీ రంగంలో ఇంజనీర్లుగా మారేందుకు కుస్తీ పడుతున్నారు. టీచర్లు, మార్కెటింగ్, వ్యాపారమంటూ.. విద్యార్థులు కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు చాలానే కష్టపడుతుంటారు. అయితే ఏ ఉద్యోగం చేసిన సంపాదనే ధ్యేయంగా పని చేస్తుంటాం. ఈ విషయాన్ని గుర్తించిన ఓ గ్రామంలోని యువత జాబ్, వ్యాపారాలు చేయకుండానే సంపాదించేస్తున్నారు. అదెలాగో తెలుసుకుందాం ఆ గ్రామంలో యువత ఎంచుకున్న దారి అదే ట్రండ్ మారుతోంది.. అందుకు తగ్గట్టే యువత దృక్పథంలో కాస్త మార్పు కనిపిస్తోంది. అందుకే కేవలం ఉద్యోగాలనే కాకుండా ఆఫ్‌బీట్ కెరీర్ల వైపు కూడా ఓ లుక్కేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా సోషల్‌మీడియా యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో యూట్యూబ్‌ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతోంది ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లోని తులసి గ్రామ యువత. గ్రామంలో నివసిస్తున్నప్పటికీ తమకున్న వనరులతో మంచి కంటెంట్‌ని రూపొందించి యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామంలో దాదాపు 400 పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామ జనాభా 3000-4000 మధ్య ఉండగా.. వారిలో 30 శాతం అనగా దాదాపు 1000 మంది యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు. అలా మొదలైంది.. ఈ స్టోరీ ఇద్దరు స్నేహితులు గ్రామంలో యూట్యూబ్ వీడియోలు చేయడం ప్రారంభించారు. యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించడం కోసం వీరిద్దరూ చేస్తున్న ఉద్యోగాలను సైతం వదులుకున్నారు. అందులో ఒకరు.. జ్ఞానేంద్ర శుక్లా ఎస్బిఐలో నెట్వర్క్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదిస్తున్న యూట్యూబర్ల గురించి తెలుసుకున్నాడు. తాను ఆ దారిలో ప్రయాణించాలనుకుని, అనుకున్నదే తడవుగా జాబ్ రిజైన్ చేసి వీడియోలపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు, అతను తన ఛానెల్లో 250 కంటే ఎక్కువ వీడియోలను అప్లోడ్ చేశాడు. మరొకరు.. కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేసిన జై వర్మ ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేశాడు. అక్కడ అతను నెలకు 12,000-15,000 రూపాయలు సంపాదించే వాడు. అయితే యూట్యూబ్‌లో వీడియోల ద్వారా దాదాపు రూ.30,000- 35,000 సంపాదన రావడంతో టీచర్ జాబ్‌కు రిజైన్ చేసి ఈ రంగంలోకి అడుగపెట్టాడు. అలా వీరిద్దరి నుంచి యూట్యూబ్ వీడియోలు మొదలయ్యాయి. ప్రస్తుతం వాళ్లిద్దరి సంపాదన ఏడాదికి లక్షల్లో ఉంది. ఇక దాదాపు ఆ గ్రామంలోని ప్రతి కుటుంబం YouTube వీడియోలలో పాల్గొంటుంది. అంతేకాకుండా అక్కడ యువత ఉద్యోగాలను పక్కను పెట్టి.. వీరినే ఫాలో అవుతూ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం తులసి గ్రామం నుంచి 40-50 ఛానళ్లు తయారవుతున్నాయి. -
హ్యాపీ పేరెంటింగ్: వసపిట్ట పాఠాలు
తల్లిదండ్రులుగా పిల్లలను చూసుకోవాల్సిన విధానాన్ని, తల్లిగా తన అనుభవాన్ని కళ్లకు కడుతూ యూ ట్యూబర్‌గా రాణిస్తోంది హైదరాబాద్ కొండాపూర్‌లో ఉంటున్న చిలుకూరి కృష్ణమాధురి, నాలుగు, ఏడాదిన్నర వయసున్న పిల్లలతో కలిసి, తన స్వీయ అనుభవాలను షేర్ చేస్తుంటుంది. మాధురి మూడేళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నాలు... పిల్లల పెంపకంలో తను తీసుకునే జాగ్రత్తలు ఎంతోమంది తల్లులకు పాఠాలు అవుతున్నాయి. ఈ విషయాల గురించి మాధురి మాట్లాడుతూ ... ‘‘నేను పుట్టి పెరిగింది రాజమండ్రిలో. మావారిది గుంటూరు. మా వారి ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉండేవాళ్లం. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్న నేను పిల్లల పుట్టడంతో ఇంటి దగ్గరే ఉండిపోయాను. పిల్లలపై తపన, వారి ఆరోగ్య జాగ్రత్తలు, పెంపకం విషయాలన్నీ తల్లిగా నాకు ప్రతిరోజూ ఓ పాఠమే. వీటిని నలుగురితో పంచుకుంటే కొంతమంది తల్లులకైనా ఉపయోగపడుతుంది కదా అని సరదాగా వీడియోలు తీసి, యూ ట్యూబ్‌లో పోస్ట్ చేసేదాన్ని. వాయిస్ ఆఫ్ వసపిట్ట పిల్లల అల్లరి మాటలకు పెద్దవాళ్లు ముద్దుగా పెట్టే పేరు వసపిట్ట. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని చిన్నప్పటి నుంచి కాస్త ఎక్కువగా మాట్లాడేదాన్ని. అందుకే, అందరూ నన్ను వసపిట్ట అని పిలిచేవారు. దీంతో ఛానెల్‌కి ఇదే పేరు బాగుంటుందని ఎంచుకున్నాను. మూడేళ్లు అవుతోంది ఇది స్టార్ట్ చేసి. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాక నా పోస్ట్‌లు మరిన్ని పెరిగాయి. పెంపకాన్ని పరిచయం చేస్తూ.. అమ్మ తన పిల్లలను ఏ విధంగా పెంచుతుందనే విషయాల గురించి వెతికితే తెలుగులో ఎక్కువ బ్లాగర్స్ లేరు. ఉన్నా, వివరంగా చెప్పేవారు లేరు. పిల్లల పెంపకం అనగానే చాలా వరకు డాక్టర్లు, డైటీషియన్లు కనిపిస్తారు. వాళ్లు చెప్పేవి అందరూ ఆచరణలో పెడుతున్నారో లేదో తెలియదు. నేను డాక్టర్ దగ్గరకు పిల్లలను తీసుకెళ్లినప్పుడు, అక్కడ వారిచ్చిన మందులు, జాగ్రత్తల నుంచి అన్నీ నా ఛానెల్ ద్వారా పరిచయం చేస్తుంటాను. రోజువారి పనులు చిన్న పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటుందో తల్లులందరికీ అనుభవమే. ఇల్లు పీకి పందిరేస్తారు అంటుంటారు. ఇలాంటప్పుడు చిన్నపిల్లలకు క్రమశిక్షణ ఎలా అలవాటు చేయాలి, దుమ్ము, కాలుష్యం నుంచి వారిని ఎలా కాపాడాలి, టీవీ చూడకుండా తినడం ఎలా అలవాటు చేయాలి, స్క్రీన్ టైమ్ ఎందుకు తగ్గించాలి.. ఇలాంటివి పిల్లలను ఇన్వాల్వ్ చేసి చెప్పడం వల్ల చాలా మంది కనెక్ట్ అయ్యారు. అంతేకాదు, వాళ్లంతట వాళ్లు పనులు చేసుకోవడం, వంటలో సాయం చేయడం.. వంటివి పిల్లలకు పెద్దవాళ్లు అలవాటు చేయాలి. వీటిని మా పిల్లలను చూపిస్తూ ‘హ్యాపీ పేరెంటింగ్’ అనేది తెలియజేయాలనుకున్నాను. అదే చేస్తున్నాను. ఆనందకరమైన లక్ష్యం మదర్ హుడ్, ఫాదర్ హుడ్ ఎంజాయ్ చేస్తూ పిల్లలు కూడా మంచి ఫీలింగ్‌తో పెరగాలనేది నా ఆలోచన. మేం సమస్యలను ఎలా అధిగమిస్తున్నామో కూడా చూపిస్తున్నాను. వీటిని చూడటానికి నాలుగు లక్షలకు పైగా వీక్షకులున్నారు. వీరిలో పిల్లలున్నవారు 70 శాతం మంది ఉన్నారు. నా వీడియోలు చూసి తాము కూడా బ్లాగ్స్ చేస్తున్నామని కొందరు చెబుతుంటారు. ఆరోగ్య జాగ్రత్తలు... వీక్షకులలో చాలా మంది డాక్టరు చెప్పే జాగ్రత్తలు, కిడ్స్ ఫుడ్ గురించి సలహాలు సూచనలు అడుగుతుంటారు. పిల్లలు సరిగా తినరు అనేది పెద్దలు ప్రతిసారి చెబుతుంటారు. కానీ, ఎందుకు తినరు, ఎలా తింటారు.. అనే వివరాలను మా పిల్లలను ఉదాహరణగా చూపిస్తూ వివరిస్తుంటాను. వివిధ సమయాలలో పిల్లల ప్రవర్తన, మనం వారితో మాట్లాడటం, ్రపాక్టికల్గా చేస్తూ చెబుతుంటాను. పిల్లలు కూడా ఈ విధానాన్ని బాగా ఇష్టపడుతున్నారు. మా పిల్లలకు ఓ సారి ర్యాషెష్ వచ్చాయి. వాటిని ప్రాక్టికల్‌గా చూపించి, డాక్టరు చెప్పిన సూచనలతో పాటు, నేను స్వయంగా ఎలాంటి కేర్ తీసుకుంటున్నానో చూపించాను. అలాగే.. డెంటల్ ట్రీట్మెంట్, గర్భిణిగా ఉన్నప్పుడు, తల్లిపాల ప్రాముఖ్యత.. ఆ సమయాల్లో నేనెలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను.. మరికొన్ని ఇతరుల ద్వారా సేకరించిన సూచనలూ ఇస్తుంటాను. మా నాన్న రైల్వేలో ఉద్యోగి. చిన్నప్పటి నుంచి కుటుంబంలో ప్రతి విషయంలో నా అభిప్రాయాన్ని కూడా అడిగేవారు. అలా వారి నుంచే నాకు నా పిల్లల పెంపకాన్ని మరింతగా నలుగురికి తెలియజేయాలనే ఆలోచన పెరుగుతూ వచ్చింది’’ అని తల్లిగా తన అనుభవ పాఠాలను ఆనందంగా వివరించారు మాధురి. – నిర్మలారెడ్డి -
చాట్‌జీపీటీకి పోటీగా.. 1000 భాషల్లో గూగుల్ ఏఐ మోడల్
కొత్త కొత్త టెక్నాలజీలను యూజర్లకు పరిచయం చేసేందుకు దిగ్గజ టెక్ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ పోటీ పడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ai) ఆధారిత చాట్ బోట్ చాట్ జీపీటీ (chatgpt)ని మైక్రోసాఫ్ట్ విడుదల చేయగా.. గూగుల్ సైతం బార్డ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ ఏఐ ఆధారిత యూనివర్సల్ స్పీచ్ మోడల్ (usm)ను యూజర్లకు అందించనుంది. ఈ ఏడాది మే నెలలో అమెరికా కాలిఫోర్నియా నగరం మౌంటెన్ వ్యూ వేదికగా జరగబోయే గూగుల్ డెవలపర్ డే (Google I/O-Input/Output)లో కంపెనీ భవిష్యత్ లక్ష్యాలు, యూఎస్ఎం మోడల్‌పై స్పష్టత ఇవ్వనుంది. దీంతో పాటు గూగుల్ 20 రకాలైన ఏఐ ఆధారిత ప్రొడక్ట్‌ల గురించి వివరించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ యూనివర్సల్ స్పీచ్ మోడల్ అంటే? గూగుల్ 2022 నవంబర్‌లో జరిగిన ఈవెంట్లో ఈ ఏఐ ఆధారిత స్పీచ్‌ను యూజర్లకు అందిస్తామని తెలపగా.. ఆ ప్రకటనకు కొనసాగింపుగా ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 1000 భాషలను ఏఐ పద్దతిలో యూజర్లు వినియోగించుకోవచ్చని తాజాగా తెలిపింది. ఇందుకోసం 300 భాషల్లో 2 బిలియన్ పారమీటర్స్‌లో శిక్షణ ఇచ్చి 12 గంటల మిలియన్ గంటల ప్రసంగం, 28 బిలియన్ సెంటెన్స్‌ను తయారు చేసినట్లు గూగుల్ పేర్కొంది. యూనివర్సల్ స్పీచ్ మోడల్‌తో ఉపయోగాలు ప్రస్తుతం యూట్యూబ్ యూనివర్సల్ స్పీచ్ మోడల్‌ను వీడియోల్లో క్లోజ్డ్ క్యాప్షన్ కోసం వినియోగిస్తుంది. వీడియోల్లో క్లోజ్డ్ క్యాప్షన్ అంటే డైలాగ్స్‌ను టెక్స్ట్ రూపంలో స్క్రీన్ మీద చూపించడం. ఈ టెక్నాలజీ అటోమెటిక్ స్పీచ్ రికగ్నైజేషన్ (ఏఎస్ఆర్) మీద పనిచేస్తుంది. ప్రస్తుతం,యూఎస్ఎం 100కి పైగా భాషలకు సపోర్ట్ చేస్తున్నట్లు టెక్ దిగ్గజం చెప్పింది. మెటా సైతం ఏఐ ఆధారిత లాంగ్వేజ్‌పై పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలో ఉంది. యూనివర్సల్ స్పీచ్ మోడల్‌ను ఎలా ఉపయోగించుకోవచ్చు గూగుల్ ఈ సాంకేతికతను ఆగ్మెంటెడ్-రియాలిటీ (AR) గ్లాసెస్‌లో ఉపయోగించాలని భావిస్తుంది. కంపెనీ తన ఐ/ఓ 2022 ఈవెంట్లో చూపినట్లుగా ఏఆర్ గ్లాసెస్‌ను ధరిస్తే మనం చూసే ప్రతి దృశ్యాన్ని కావాల్సిన లాంగ్వేజ్‌లలో ట్రాన్సలేట్ అవుతుంది. ఈ టెక్నాలజీ వినియోగంలోకి రావాలంటే ఇంకా మరింత సమయం పట్టనుంది. చదవండి👉 కోడింగ్ రానక్కర్లేదు.. మైక్రోసాఫ్ట్ మరో సంచలనం! -
యూట్యూబ్ చూస్తూ ఇంట్లోనే డెలివరీ చేసుకున్న బాలిక.. తల్లి రావడంతో
ముంబై: సోషల్‌మీడియా పరిచయాలు ఊహించని ప్రమాదంలో పడేయడంతో పాటు పలు ఇబ్బందులకు గురి చేసిన ఘటనలు చూస్తునే ఉన్నాం. తెలిసిన వాళ్లే మోసం చేస్తున్న రోజులివి, అలాంటిది కొందరు ఆన్లైన్ స్నేహాలను నమ్మి ఘోరంగా మోసపోతున్నారు. ప్రత్యేకంగా యువత కాలక్షేపం కోసం నెట్టింట్లోకి వెళ్లి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. ఈ తరహాలోనే 15 ఏళ్ల బాలిక ఇంటర్నెట్లో పరిచయమైన వ్యక్తని నమ్మి గర్భం దాల్చింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా యూట్యూబ్‌లో చూస్తూ ఇంట్లోనే సొంతంగా డెలివరీ చేసుకొంది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. యూట్యూబ్ చూసి... పోలీసుల వివరాల ప్రకారం..నాగ్‌పూర్‌లోని అంబజారీ ప్రాంతానికి చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి బాలికకు లైంగికంగా దగ్గరవ్వడంతో ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని బాలిక ఇంట్లో కూడా చెప్పలేదు. ఓ దశలో పొట్ట పెద్దగా ఉందని బాలిక తల్లి ప్రశ్నించగా.. తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అందుకే కడుపు ఉబ్బందని అబద్దం చెప్పింది. అలా బాలిక గర్భవతినన్న విషయాన్ని తన తల్లి నుండి దాచి పెట్టగలిగింది. అనంతరం డెలివరీ ఎలా చేసుకోవాలో యూట్యూబ్ వీడియోలను చూసి తెలుసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును గొంతునులిమి చంపేసి ఇంట్లోనే ఓ బాక్స్‌లో దాచిపెట్టింది. తల్లి ఇంటికి తిరిగి రాగానే బాలిక తీవ్ర అనారోగ్యంతో నీరసంగా కనిపించింది. దీంతో బాలికను గట్టిగా నిలదీయగా విషయాన్ని మొత్తం తల్లికి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శిశువు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. -
యూట్యూబ్‌లో వారికే మొదటి ప్రాధాన్యత: సీఈవో నీల్మోహన్
కంటెంట్ క్రియేటర్లు, ఆర్టిస్టులు యూట్యూబ్‌కు గుండె కాయ లాంటి వారని, వారికే తాను మొదటి ప్రధాన్యత ఇస్తానని యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ స్పష్టం చేశారు. గత నెలలో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన యూట్యూబ్ కమ్యూనిటీతో తన భావాలను పంచుకున్నారు. ప్రధాన్యతలు తెలియజేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడిప్పుడే తన సామర్థ్యాలను చాటుతోందని, వీడియోల స్వరూపాన్నే మార్చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే రోజులు ముందున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నుంచి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు కూడా ప్రయోజనం పొందుతారన్నారు. యూట్యూబ్ సరికొత్త ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లను తమ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లో ప్రవేశపెట్టనుంది. దీంతో కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోలకు అద్భుతమైన హంగులు జోడించేందుకు వీలు కలుగుతుంది. ఏఐ ఉత్పత్తుల్లో ఇప్పటికే ముందున్న ఓపెన్ఏఐ, మైక్రోసాఫ్ట్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చే లక్ష్యంతో గూగుల్ ఈ ప్రయత్నం చేస్తోంది. చదవండి: త్వరలోనే మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు.. ప్రకటించిన సీఈవో సరికొత్త ఏఐ సాధనాలను విడుదల చేయాలనే ఆతృతలో ఉన్న ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్.. ఇప్పటికే ఉన్న దాని సొంత సాధనాలు, సేవలను మెరుగుపరచడంలో నిదానంగా ఉందని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో పోటీదారులు ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీని, మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ చాట్‌బాట్‌ను విడుదల చేశాయి. కంపెనీకి డిజిటల్ యాడ్లు తగ్గిపోవడం, చాట్బాట్ల కారణంగా కంపెనీ ప్రధాన ఆదాయమైన ఇంటర్నెట్ సెర్చ్ వ్యాపారం మందగించడం వంటి ఎదురుదెబ్బలతో గూగుల్ కూడా గత ఫిబ్రవరిలో బార్డ్ అనే ఏఐ చాట్‌బాట్‌ను ప్రకటించింది. ఏది ఏమైనా ఏఐ విషయంలో గూగుల్ అప్రమత్తంగా ఉందనే విషయం యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ మాటల్లో వ్యక్తమౌతోంది. చదవండి: WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్‌లో భారత్ టాప్! -
యూట్యూబ్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త!
యూజర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ల కోసం మల్టీ లాంగ్వేజ్ పేరుతో కొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు ఇతర భాషల వీడియోలను తమకు నచ్చిన భాషలో (ఆడియోలో) చూడొచ్చు. తొలిసారి ఈ తరహా టెక్నాలజీని నెట్‌ఫ్లిక్స్ వీక్షకులకు పరిచయం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఆకట్టుకున్న కొరియన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్క్విడ్ గేమ్‌ను వీక్షకులకు అర్ధమయ్యేలా సబ్‌టైటిల్స్ పాటు, స్థానిక భాషల్లో డబ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పుడు యూట్యూబ్ సైతం అదే తరహాలో ఇతర లాంగ్వేజ్ వీడియోలను యూజర్లకు నచ్చిన భాషలో చూడొచ్చు. అంటే..యూట్యూబ్‌లో మనం కొన్ని వీడియోలు చూడటానికి చాలా బాగుంటాయి. భాష అర్ధం గాక పోవచ్చు.. కానీ భావం తెలుస్తుంది. అయితే యూట్యూబ్ అందించే కొత్త ఫీచర్ సాయంతో బాహుబలిలో కాలకేయ కిలికి వంటి భాషల నుంచి ఇతర దేశాల్లోని స్థానిక భాషల వరకు.. మనకు అర్ధమయ్యే భాషలో డబ్ చేసుకోవచ్చని యూట్యూబ్ తెలిపింది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసేందుకు సెట్టింగ్‌లో ఉన్న ఆడియో ట్రాక్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో నచ్చిన భాషను సెలక్ట్ చేస్తే ఆ భాషలో ఆడియో వినిపిస్తుంది. -
యూట్యూబ్‌లో లైక్ చేయాలంటూ వల.. ఒక్క రోజులో రూ. కోటి స్వాహా!
హిమాయత్‌నగర్: ఒక్క రోజులో సైబర్ కేటుగాళ్లు రూ.కోటి కొట్టేశారు. డబ్బు పోగొట్టుకున్న బాధితులు శనివారం సైబర్‌క్రైం పోలీసు స్టేషన్‌కు క్యూ కట్టారు. సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లో నివాసం ఉండే వైద్యురాలికి కొద్దిరోజుల క్రితం టెలిగ్రాంలో ఓ యువతి పరిచయమైంది. తాము పంపించే యూట్యూబ్ లింకులను ఓపెన్ చేసి దానిలోని వీడియోను లైక్, కామెంట్‌తో పాటు షేర్ చేస్తే ఒక్కో లైక్‌కు రూ.500, కామెంట్‌కు రూ.1,000, షేర్ చేస్తే రూ.2 వేలు ఇస్తామన్నారు. తొలిరోజుల్లో లాభాలు ఇచ్చారు. వీరి మధ్య సాన్నిహిత్యం బలపడింది. దీంతో ఇన్వెస్ట్మెంట్ వైపు ఆమెను ఆహా్వనించింది. దీనికి ఒప్పుకున్న వైద్యురాలికి ఇన్వెస్ట్మెంట్లో కూడా తొలుత లాభాలు ఇచ్చారు. ఆ తర్వాత పెట్టిన పెట్టుబడికి టాస్క్‌లు ఉన్నాయంటూ చెబుతూ పలు దఫాలుగా రూ.64 లక్షలు దోచుకున్నారు. మరో వ్యక్తి ఆమెజాన్ గిఫ్ట్ కూపన్స్ కొనుగోలు చేసి ఆన్లైన్లో ఇతరులకు విక్రయిస్తుంటాడు. కేవైసీ తీసుకున్న వారికే గిఫ్ట్ కూపన్స్‌ను బల్్కలో కొంతకాలంగా ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నాడు. బల్క్‌లో తీసుకున్న కొందరు డబ్బు వేస్తున్నట్లు నటించి డబ్బు వేయలేదు. రెండు నెలల వ్యవధిలో కేవైసీ ఇచి్చన ఇద్దరు వ్యక్తులు రూ.34 లక్షలు కాజేశారు. మరో ఐదుగురి నుంచి సైబర్ నేరగాళ్లు ఓటీపీలు, ఇన్వెస్ట్మెంట్లు అంటూ దాదాపు రూ.10 లక్షలు స్వాహా చేశారు. ఇలా శనివారం ఒక్కరోజే కోటికి పైగా డబ్బు పోగొట్టుకున్న వారు సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
వాట్ ఏ ప్లాన్..! యూట్యూబ్‌లో చూసి.. అన్న ఆలోచన, చెల్లెలి తయారీ
సాక్షి, హైదరాబాద్: అతడి పేరు కస్తూరి రమేష్ బాబు... ఆమె పేరు రామేశ్వరి. అన్నాచెల్లెళ్లు అయిన వీళ్లు యూట్యూబ్ వీడియోల ఆధారంగా నకిలీ కరెన్సీ ముద్రణ, చెలామణిలో దిట్టలు. ఐదు నెలల కాలంలో గోపాలపురం, గుజరాత్‌ల్లో వీరిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రమేష్ గుజరాత్ జైల్లో ఉండగా... రామేశ్వరి తన అన్న ద్వారా పరిచయమైన హసన్ బిన్ హమూద్‌తో కలిసి ఫేక్ నోట్లు చెలామణి చేయడానికి ప్రయత్నించింది. వీరిద్దరినీ పట్టుకున్న సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.27 లక్షలు నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారని డీసీపీ క్రైమ్స్ డాక్టర్ పి.శబరీష్ తెలిపారు. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. అన్న ఆలోచన.. చెల్లెలి తయారీ... నారాయణపేట్ జిల్లా కోస్గికి చెందిన రమేష్ తన సోదరి రామేశ్వరితో కలిసి బండ్లగూడ జాగీర్‌లోని కాళీ మందిర్ వద్ద కొన్నాళ్లు నివసించాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికి రమేష్ నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేయాలని నిర్ణయించుకున్నాడు. రామేశ్వరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో ల్యాప్‌టాప్, స్కానర్, ప్రింటర్ సాయంతో 2021 నుంచి ఫేక్ కరెన్సీ తయారీ దందా మొదలెట్టారు. యూట్యూబ్‌లో ఉన్న అనేక వీడియోలు చూసిన వీళ్లిద్దరూ నోట్లు తయారు చేయడంతో పాటు ఆ వీడియోల కింద కామెంట్ బాక్స్‌లో ‘మాల్ హై హోనా క్యా?’ అంటూ రమేష్ కామెంట్ చేసి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. మొదటిసారిగా గోపాలపురంలో అరెస్టు.. నాచారంలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే సాట్ల అంజయ్య తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. ఆయనకు చికిత్స చేయించడానికి డబ్బు కోసం ఇతడు ఆ వీడియోలు చూశాడు. అలా రమేష్‌ను సంప్రదించి రూ.50 వేలు చెల్లించి రూ.1.3 లక్షల నకిలీ నోట్లు తీసుకున్నాడు. వీటిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద చెలామని చేస్తూ అంజయ్య పోలీసులకు చిక్కాడు. ఇదే కేసులో రమేష్‌ను గతేడాది సెపె్టంబర్లో గోపాలపురం పోలీసులు అరెస్టు చేయగా.. రామేశ్వరి కోర్టు నుంచి బెయిల్ పొందారు. జైల్లో రమేష్‌కు హత్య కేసులో అరెస్టు అయిన ఫలక్‌నుమకు చెందిన ఆటోడ్రైవర్ హసన్‌తో పరిచయమైంది. అక్కడే వీళ్లు నకిలీ కరెన్సీ చెలామణిపై ఓ పథకం వేశారు. ఈ కేసులో బయటకు వచ్చిన రమేష్... రామేశ్వరితో కలిసి తాండూర్‌కు మకాం మార్చాడు. భారీగా నకిలీ కరెన్సీ ముద్రించిన వీళ్లు ఈ ఏడాది జనవరిలో గుజరాత్లో మారి్పడికి ప్రయతి్నంచారు. అక్కడి ముఠా వీరి నుంచి తీసుకున్న నోట్లను చెలామణికి ప్రయతి్నంచి చిక్కింది. వీరి ద్వారా రమేష్ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాజ్‌కోట్ పోలీసులు రమేష్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. పాతబస్తీలో దాచి మార్పిడికి యత్నం.. రమేష్ ద్వారానే రామేశ్వరికి హసన్ విషయం తెలిసింది. గుజరాత్ పోలీసులు దాడి చేసినప్పుడు మరో గదిలో దాచి ఉంచిన రూ.27 లక్షలు వారికి దొరకలేదు. ఈ మొత్తాన్ని హసన్ వద్దకు తీసుకువచ్చి దాచిన రామేశ్వరి ఇద్దరూ కలిసి మార్పిడి చేయాలని భావించారు. వీరిద్దరూ ఈ ప్రయత్నాల్లో ఉన్నారనే సమాచారం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్రకు తెలిసింది. ఆయన నేతృత్వం ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, షేక్ బుర్హాన్, కె.నర్సింహులు వలపన్ని ఇద్దరినీ పట్టుకుని నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌ను గుజరాత్ జైలు నుంచి పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు. వీళ్లు ఇప్పటి వరకు దాదాపు రూ.కోటి విలువైన నకిలీ నోట్లు మార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. గోపాలపురం పోలీసులు రమేష్‌ను పట్టుకున్నప్పుడు అతడి ల్యాప్‌టాప్‌లో రూ.2 వేలతో పాటు రూ.5 వేల నోటు స్కాన్డ్ కాపీని గుర్తించారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఆర్బీఐ వీటిని ముద్రిస్తుంటుంది. చదవండి వివాహేతర సంబంధం: రాత్రి వేర్వేరు గదుల్లో నిద్రిస్తుండగా -
Neal Mohan: యూట్యూబ్ కొత్త సీఈవో జీతమెంతో తెలుసా?
భారత సంతతికి చెందిన నీల్ మోహన్ ఇప్పుడు యూట్యూబ్ కొత్త సీఈవోగా బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే సుసాన్ వోజ్కికీ స్థానంలో నియమితులైన నీల్మోహన్ భారీ ప్యాకేజీ అందుకోబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారతీయ-అమెరికన్ మోహన్.. సుసాన్ వోజ్కికీ నేతృత్వంలోని అత్యంత సీనియర్ అధికారులలో ఒకరిగా యూట్యూబ్ చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్‌గా పనిచేశారు. సీఈఓగా అర్హుల జాబితాలో చాలామంది ఉన్నా నీల్ మోహన్నే యూట్యూబ్ ఎంపిక చేయడం విశేషం. యూట్యూబ్‌లో ఉన్నత స్థాయిలో పనిచేస్తుండటంతో పాటు అనేక ప్రతిష్టాత్మక సంస్థలలో కూడా మోహన్ పని చేశారు. గూగుల్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన కెరీర్ ప్రారంభంలో మైక్రోసాఫ్ట్‌లో చిన్న ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు. గూగుల్‌లో డిస్ప్లే, వీడియో ప్రకటనల విభాగాన్ని పర్యవేక్షించిన ఆయన యూట్యూబ్, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్, యాడ్సెన్స్, యాడ్‌మాబ్, డబుల్ క్లిక్ యాడ్ టెక్ వంటి ఉత్పత్తి సేవల బాధ్యతలు నిర్వహించారు. యూట్యూబ్‌కు రాజీనామా చేసిన వోజ్కికీకి యాజమాన్యం భారీ జీతం ఇచ్చేది. మీడియా నివేదికల ప్రకారం నెలకు సుమారు 3,74,829 యూఎస్ డాలర్ల జీతం తీసుకునేవారు ఆమె. అంటే మన కరెన్సీలో రూ. 3.1 కోట్లు. దీని బట్టే..కొత్త సీఈవో నీల్ మోహన్ జీతం అంతకు మించి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. గతంలో నీల్ మోహన్ ట్విటర్‌కు మారకుండా ఉండేందుకు గూగుల్ నుంచి 100 మిలియన్ డాలర్లు బోనస్‌గా అందుకున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: యూట్యూబ్ సీఈవోగా భారతీయుడు.. అసలు ఎవరీ నీల్ మోహన్!) -
యూట్యూబ్ సీఈవోగా భారతీయుడు.. అసలు ఎవరీ నీల్ మోహన్!
అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలకు సారథ్యం వహించే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో టెక్నాలజీ కంపెనీ సారథ్య బాధ్యతలను భారత సంతతికి చెందిన వ్యక్తి దక్కించుకున్నారు. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌కు సీఈవోగా నీల్ మోహన్ (47) నియమితులయ్యారు. దీంతో నీల్ మోహన్ సైతం ఇతర టెక్ కంపెనీల్లో సీఈవోలుగా విధులు నిర్వహిస్తున్న భారతీయుల జాబితాలో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన నియామకంతో యూట్యూబ్‌కి సుదీర్ఘ కాలంగా.. సీఈవోగా ఉన్న సూసన్ వొజిసికి తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తన బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల క్రితం తాను యూట్యూబ్‌లో చేరినప్పుడు అద్భుతమైన నాయక బృందాన్ని తీసుకురావాలనేది..తన మెుదటి ప్రాధాన్యమని..సూసన్ తెలిపారు. నీల్ మోహన్ అందులో ఒకరని వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌లో ఇంటర్ వరకు చదివిన నీల్ మోహన్..యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టే వరకు ఆయన ప్రస్తానం ఎలా సాగిందో తెలుసుకుందాం. ►లక్నోకు చెందిన ఆదిత్యమోహన్, దీపా మొహన్ దంపతులకు నీల్ మొహన్ జన్మించారు. ►ప్రాధమిక విద్య వరకు లక్నో స్థానిక స్కూల్లో చదివిన ఆయన ఇంటర్ హజ్రత్‌గంజ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. ►1996లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ►గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత 1997లో యాక్సెంచర్‌లో, అదే ఏడాది నెట్ గ్రావిటీ అనే స్టార్టప్‌లో చేరారు. నెట్ గ్రావిటీలో ఆపరేషన్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అక్కడే తాను ఉన్నత శిఖరాలకు చేరుకునేలా బీజం పడిందని నీల్ మొహన్ చెబుతారు. ►1997లోనే నెట్ గ్రావిటీని ప్రముఖ పెట్టుబడుల సంస్థ హెల్మాన్ & ఫ్రైడ్మెన్కు చెందిన డబుల్ క్లిక్ సంస్థ కొనుగులో చేసింది. ఈ కొనుగోలుతో నీల్ మొహన్ న్యూయార్క్‌లో ఉన్న డబుల్ హెడ్ క్వార్టర్స్‌కు షిఫ్ట్ అయ్యారు. అక్కడే కొన్ని సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ►ముఖ్యంగా డాట్ కామ్ బుడగ పేలిన సమయంలో ఆ గండం నుంచి గట్టేందుకు డబుల్ క్లిక్ సంస్థ నీల్ మోహన్‌పై ఆధారపడింది. అలా తన బిజినెస్ వ్యూహాలతో అదే సంస్థ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ►2003లో ఎంబీఏ చదివేందుకు స్టాన్‌ఫోర్డ్‌కు తిరిగి వచ్చారు. స్టాన్‌ఫోర్డ్‌లో ఉన్నప్పుడు డబుల్ క్లిక్ సంస్థ 1999లో అబాకస్ డైరెక్ట్‌ను కొనుగోలు చేసింది. ►ఆ తర్వాత జరిగిన పరిణామాలతో డబుల్ క్లిక్‌ను, అబాకస్ డైరెక్ట్ ఈ రెండు సంస్థల్ని విలీనం చేయాలనే హెల్మాన్ & ఫ్రైడ్మెన్ యాజమాన్యం ప్రతిపాదనల్ని వెనక్కి తీసుకుంది. ►అదే సమయంలో హెల్మెన్ & ఫ్రైడ్మాన్ కంపెనీ విభజన నేపథ్యంలో డబుల్‌క్లిక్ దీర్ఘకాల సీఈవోగా డేవిడ్ రోసెన్బ్లాట్ను నియమించింది. ►డబుల్ క్లిక్ సీఈవోగా రోసెన్‌బ్లాట్ విధులు నిర్వహించే సమయంలో నీల్ మోహన్ ఎంబీఏ పూర్తి చేశారు. కొన్ని షరతులతో మోహన్ డబుల్ క్లిక్‌లో చేరారు. ►రోసెన్‌బ్లాట్ -మోహన్‌లు కలిసి డబుల్క్లిక్ను అడ్వర్టైజింగ్ ఎక్స్ఛేంజ్, కోర్ యాడ్ టెక్నాలజీ తో పాటు యాడ్ నెట్ వర్క్‌ను విస్తృతం చేసేందుకు కృషి చేశారు. ►యాడ్ నెట్‌వర్క్‌పై కంపెనీగా మార్చేందుకు వారిద్దరూ కలిసి బిజినెస్ ప్రణాళికల్ని 400 స్లైడ్‌లలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశారు. 2005 డిసెంబర్ నెలలో డబుల్ క్లిక్ - హెల్మెన్ అండ్ ఫ్రైడ్ మెన్ బోర్డ్‌కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. ► 2007 ఏప్రిల్ 13న గూగుల్ 3.1 బిలియన్లకు డబుల్ క్లిక్‌ను కొనుగోలు చేసింది. దీంతో గూగుల్ యాడ్ నెట్ వర్క్ దశ మారిందని గూగుల్ ఎగ్జిక్యూటివ్ సుసాన్ వోజ్కికీ నమ్ముతారు. 2007లో అధికారికంగా గూగుల్‌లో మోహన్ గూగుల్‌లో చేరారు. సుసాన్ వోజ్కికీ - మోహన్లో 15 ఏళ్ల పాటు ఆమె కలిసి పనిచేశారు. ►ముఖ్యంగా గూగుల్ - డబుల్‌క్లిక్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్‌లో కీలక పాత్ర, 2010లో 85 మిలియన్లతో డిస్ప్లే అడ్వటైజింగ్, ఎక్ఛేంజీ బిడ్డింగ్ కంపెనీ ఇన్వైట్ మీడియా కొనుగోలులో ముఖ్య పాత్ర పోషించారు. ►గూగుల్‌లో డిస్ప్లే, వీడియో యాడ్స్ విభాగాల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ►2015లో మోహన్ యూట్యూబ్ (గూగుల్ అనుబంధ సంస్థ)లో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా చేరారు. 2010 - 2020 మధ్య కాలంలో యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ ప్రీమియం , యూట్యూబ్ షార్ట్‌లు, యూట్యూబ్ ఎన్ఎఫ్టిలతో యూట్యూబ్‌లో సరికొత్త ఒరవడిని సృష్టించారు. ►తాజాగా సుసాన్ వోజ్కికి తర్వాత యూట్యూబ్ సీఈవోగా మోహన్ ఎంపికయ్యారు