
యూట్యూబ్‌లో చూసి డైటింగ్
ఆరోగ్యం విషమించి కన్నుమూత
బరువు తగ్గాలనే ఆరాటంలో చాలా పొరబాట్లు చేస్తూ ఉంటారు కొంతమంది. శరీర తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అసలు బరువు తగ్గడం అవసరమా? తగ్గితే ఎన్ని కిలోలు తగ్గాలి? ఎలాంటి డైట్ పాటించాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? అనేది నిర్ణయించుకోవడం అవసరం. ఇందుకు వైద్యుల సలహాలు, నిపుణుల సూచనలు చాలా ముఖ్యం. అలాకాకుండా బరువు పెరుగుతామనే భయంతో ఆన్‌లైన్‌లో చూసో, లేదా మరెవరో చెప్పారనో ఏ డైట్ బడితే అది ఫాలో కావడం అనర్థం. ఒక్కోసారి ఇది ప్రాణాలు కూడా పోవచ్చు. కేరళలో కన్నూరులో చోటు చేసుకున్న ఘటన ఇలాంటి ఆందోళనలనే రేకెత్తిస్తోంది. కొన్ని రకాల రుగ్మతల వల్ల కూడా భయం పెరిగిపోతామనే భయం పట్టుకుంటుందని మీకు తెలుసా? రండి తెలుసుకుందాం!
కేరళలోని కన్నూర్‌కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి తీవ్రమైన ఆహార నియంత్రణలు పాటించేది. యూట్యూబ్‌లో చూసి దాదాపు పూర్తిగా ఆహారాన్ని తీసుకోవడం మానేసింది. కేవలం నీటినే తీసుకునేది. చివరికి తీవ్రమైన దీర్ఘకాలిక ఆకలి కారణంగా ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయింది. మృతురాల్ని కూతుపరంబ నివాసి శ్రీనందగా గుర్తించారు. తీవ్రమైన సమస్యలతో తలస్సేరిలోని ఒక ఆసుపత్రిలో చేరింది. వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండి ప్రాణాలు కోల్పోయింది. ఆమె గతంలో కూడి ఇలాంటి సమస్యలతో కోజికోడ్ మెడికల్ కాలేజీలో చేరిందట.
వైద్యుడు డాక్టర్ నాగేష్ ప్రభు ప్రకారం, శ్రీనంద అనోరెక్సియా నెర్వోసా అనే తినే రుగ్మతతో బాధపడుతోంది. దీని వలన రోగి బరువు పెరుగుతారనే భయం ఉంటుంది. ఆరు నెలల కింత నుంచి ఆకలితోనే ఉంటోందని ఆయన తెలిపారు. సోడియం , చక్కెర స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఇలాంటి సమస్యలకు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాధి తీవ్రత గురించి తెలుసు కోవాలన్నారు. పశ్చిమ దేశాల్లో ఎక్కువగా కనిపించే అనోరెక్సియా నెర్వోసా కేరళలో కనిపించడం ఇది చాలా అరుదు అని కూడా ఆయన చెప్పారు.
అనోరెక్సియా నెర్వోసా అంటే..?
డా. నగేష్ అందించిన వివరాల ప్రకారం అనోరెక్సియానెర్వోసాతో బాధపడేవారిలో కాలక్రమేణా ఆకలి అనే అనుభూతిని కోల్పోతారు. దీనికి కారణాలపై స్పష్టత లేదు. అయితే మానసిక ఆరోగ్యం, జన్యు మార్పులు, పర్యావరణం వంటివి ఈ పరిస్థితికి కారణమవుతుంది. అన్ని వయసులు, జాతులు, శరీర రకాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.
మానసిక చికిత్స
అనోరెక్సియా నెర్వోసా ఒక మానసిక పరిస్థితి. దీని లక్షణాలను బట్టి మానసిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మందులు, పోషకాహార కౌన్సెలింగ్, వారానికి ఒకసారి మానసిక కౌన్సెలింగ్ తీసుకోవాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి. సకాలంలో చికిత్స చేస్తే నయమవుతుంది. అయితే, ఇలాంటివి రుగ్మతలు రాత్రికి రాత్రే నయం కావు. కోలుకోవడానికి సమయం చాలా పట్టవచ్చు. వైద్యులను సలహాలను తప్పక పాటిస్తూ, క్రమం తప్పకుండా మందులు వాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment