Diet Plan
-
60 ఏళ్లు దాటిన వాళ్లు.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం సహజం. కీళ్ల నొప్పులు, చర్మం సాగిపోవడం, సత్తువ లేకపోవడం, జీవక్రియ మందగించడం వంటి సమస్యలు ఎన్నో చుట్టుముడతాయి. ముఖ్యంగా 60 ఏళ్లు దాటాక ఈ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. అందుకే వయసుకు తగ్గట్లు ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరు పదుల వయసు దాటిన వాళ్లు తమ డైట్ ప్లాన్‌లో ఎలాంటి ఆహారం చేర్చుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. సుమారు 60 ఏళ్లు పైబడిన వారికి విటమిన్స్ అత్యవసరం. వయసు పైబడుతున్న కొద్దీ చూపు మందగిస్తుంది. రుచి, వాసన, గ్రహణ శక్తి తగ్గిపోతుంది. జీర్ణక్రియలో మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకు తగ్గట్లుగా సరైన ఆహారం తీసుకోవాలి. మహిళల్లో 40 ఏళ్లు దాటితే కండరాలు బలహీనపడటం సహజం. 60 తర్వాత కండరాల క్షీణత మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి కండరాల శక్తిని మెరుగుపరుస్తాయి. వయసు పైబడిన వృద్ధులు ప్రతి కిలోగ్రాము బరువుకు 1 నుంచి 1.2 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది. ఎముకలు గట్టిపడాలంటే వారు మరింత కాల్షియం ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ప్రోటీన్ ఉండే ఆహారాలు బాదం, చేపలు, పెరుగు, డార్క్ చాక్లెట్, సోయామిల్క్, లెంటిల్స్, చీజ్, చికెన్ గుమ్మడి విత్తనాలు, చిక్కుడు,ఆవు పాలు పీనట్ బటర్ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, చిక్కుడు గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 50 ఏళ్లు దాటిన మహిళలు అందరూ రోజుకు 21 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ఫైబర్ తినాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సిఫార్సు చేస్తోంది. అదే వయసు గల పురుషులు 30 లేదా అంతకంటే ఎక్కువ గ్రాములు తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం, కూరగాయలు, పండ్లను క్రమం తప్పకుండా తమ డైట్లో చేర్చుకోవాలి. తగినంత ఫైబర్ డైట్లో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని వైద్యులు తెలిపారు. ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు యాపిల్స్ బార్లీ బ్లాక్ బీన్స్ బ్లాక్ బెర్రీలు బ్రాన్ ఫ్లేక్స్ బ్రకోలి చియా సీడ్స్ రోజ్ బెర్రీస్ బఠాణీలు, పప్పులు -
చాట్‌జీపీటీ డైట్ ప్లాన్.. 11 కేజీల బరువు తగ్గాడు!
ఈరోజుల్లో అధిక బరువు సమస్య ఎంతో మందిని వేధిస్తోంది. చాలా రోగాలకు అధిక బరువు కూడా కారణంగా మారుతోంది. ఈ నేపథ్యంలో బరువు తగ్గేందుకు అనేక మంది నానా యాతన పడుతుంటారు. బరువు తగ్గడం అనేది అంత ఆశామాషీ కాదు. ఇందు కోసం చాలా కష్టపడాలి. సరైన డైట్ ఫాలో అవ్వాలి. బరువు తగ్గాలని అనుకోగానే చాలా మంది డైటీషియన్లను, న్యూట్రిషనిస్టులను సంప్రదిస్తుంటారు. కానీ బరువు తగ్గడం కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను ఉపయోగించడం గురించి విన్నారా? అమెరికాలోని సియాటెల్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇలాగే చేశాడు. గ్రెగ్ ముస్కెన్ అనే వ్యక్తి చాట్ జీపీటీ అందించిన డైట్ ప్లాన్‌ను అనుసరించి ఏకంగా 11 కేజీలు బరువు తగ్గాడు. నివేదికల ప్రకారం.. అధిక బరువున్న గ్రెగ్‌కు రన్నింగ్ చేయడం ఇష్టం లేదు. దీంతో చాట్ జీపీటీ సహాయంతో హెల్తీ డైట్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఇదీ చదవండి ➤లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మూడు నెలల తర్వాత ఆశ్చర్యకరంగా వారానికి ఆరు రోజులు రన్నింగ్ చేయగలుగుతున్నాడు. మరిన్ని వర్కవుట్లపై గ్రెగ్కి ఆసక్తి పెరిగింది. తన బరువును చూసుకోగా అప్పటికే 11 కేజీలు తగ్గాడు. చాట్ జీపీటీ ఇచ్చిన డైట్ ప్లాన్‌ను గ్రెగ్ మొదట్లో నమ్మలేదు. కానీ ఆ ప్లాన్ సరళంగా, సులభంగా ఉంటడంతో అనుసరించడం ప్రారంభించాడు. చిన్న అలవాటే.. రన్నింగ్ షూస్‌ను ఫ్రంట్ డోర్‌కి దగ్గరగా పెట్టుకోవడం వంటి చిన్నచిన్న సలహాలను చాట్ జీపీటీ ఇచ్చింది. మూడో రోజు నుంచి గ్రెగ్ కొన్నినిమిషాలపాటు కొద్దిపాటి దూరం నడవడం ప్రారంభించాడు. నిజానికి ఇది సరైన విధానమని నిపుణులు కూడా ధ్రువీకరించారు. కొత్తగా వర్కవుట్లు మొదలు పెట్టేవారు కష్టమైన వర్కవుట్ల జోలికి వెళ్లడం మంచిది కాదని, గాయాల బారిన పడకుండా ఉండాలంటే మొదటి చిన్నగా ప్రారంభించి రోజురోజుకు పెంచుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు. చిన్నపాటి అలవాట్లే వర్కవుట్ గాడిలో పడేలా చేస్తాయని చెబుతున్నారు. ఒకే రకమైన డైట్ ప్లాన్ సరికాదు చివరగా చెప్పేందేంటంటే ఒక్కొక్కరి శరీర స్వభావం ఒక్కోలా ఉంటుంది. అందరికీ ఒకే రకమైన డైట్ ప్లాన్లు సరిపడవు. ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించడం మంచిది. -
తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా? ఈ లక్షణాలు ఉంటే మాత్రం..
కొందరికి ఎంత తిన్నా మళ్లీమళ్లీ ఆకలి వేస్తుంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎంత తిన్నా తిరిగి ఆకలేస్తుందంటే ఆరోగ్యపరంగా ఏవో సమస్యలు ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. ఇలా అతిగా తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే మనం తినే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేయండం ద్వారా ఆకలి సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు వైద్యులు. ► ఎంత తిన్నా తిరిగి ఆకలేస్తుందంటే మీ జీర్ణాశయంలో ఏదో సమస్య ఉన్నట్లే... దీనికి మరో కాఱనం.. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తినడం వల్ల ఆకలి పెరగుతుంది. ► మన శరీరంలో 70శాతం వరకూ నీరు నిండి ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత కూడా తిరిగి ఆకలేస్తుందంటే అందుకు శరీరంలో నీరు తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి తగినన్ని నీళ్లు తీసుకోవడం చాలా ఉత్తమం. ► బ్రేక్‌ఫాస్ట్ మానేసి ఒకేసారి భోజనం చేయడం మరికొందరికి అలవాటు. దీనివల్ల ఉదయం నుంచి ఖాళీ కడుపుతో ఉన్న ఫీలింగ్ ఏర్పడి ఎక్కువ తినేస్తారు. ► కొందరికి భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తుంది. దీనికి మెడిసిన్స్ కారణం ఉండొచ్చు. మెడిసిన్స్‌లో రాయిడ్స్, ప్రిడ్నోసోన్స్, కార్టికాస్టెరాయిడ్ వంటివి ఆకలిని మరింత పెంచేస్తాయి. ► అతిగా వర్కవుట్స్ చేయడం వల్ల కూడా క్యాలరీలు తగ్గిపోయి ఎక్కువగా ఆకలేస్తుంటుంది. కాబట్టి శరీరానికి ఎంత అవసరమో అంతవరకే వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ►ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనది ఒత్తిడి. ఈరోజుల్లో చాలావరకు ఒత్తిడితో బాధపడుతున్నవాళ్లు ఉన్నారు. అదే సమయంలో ఎక్కువ ఆహరం తీసుకోవాలనిపిస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. ►మనం తినే ఆహారంలో శరీరానికి సరైన పోషకాలు, ప్రోటీన్స్ అందకపోయినా వెంటనే ఆకలిగా అనిపిస్తుంది. కాబట్టి సరైన డైట్‌ను పాటిస్తూ వేళకు భోజనం, 8గంటల నిద్ర పాటిస్తే మంచిందటున్నారు డైటీషియన్స్ -
రిషి సునాక్ ఫిట్నెస్ సీక్రెట్, డైట్ ప్లాన్ ఏంటో తెలుసా?
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ కొద్ది రోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు. 42 ఏళ్ల వయసున్న రిషి సునాక్.. 200 ఏళ్ల బ్రిటన్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా నిలిచారు. ఏ వేదికపై చూసినా ఎంతో ఫిట్‌గా, ఉత్సాహంగా కనిపిస్తారు. ఇంతకి ఆయన ఫిట్నెస్ సీక్రెట్, డైట్ ప్లాన్ ఏంటి అనేది చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్న. ఆయన దిన చర్య, డైట్ ప్లాన్, ఫిట్నెస్ కోసం ఏం చేస్తారనేది ఆయనే వెల్లడించారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని సాధించేందుకు రిషి సునాక్ దిన చర్య ఎందరికో ఆదర్శవంతంగా ఉంటుంది. గత ఏడాది ‘ద ట్వంటీ మినట్ వీసీ పోడ్కాస్ట్ విత్ హ్యారీ స్టెబ్బింగ్స్’ కార్యక్రమం వేదికగా తన దినచర్య, ఆహార అలవాట్ల వంటి అంశాలను బహిర్గతం చేశారు రిషి సునాక్. తాను ఉదయం 6-7గంటలకు నిద్ర లేస్తానని, అది తాను చేయబోయే జిమ్‌ను బట్టి సమయం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ‘శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ఒక సెషన్ పెలోటన్, ఒక సెషన్ ట్రెడ్మిల్ వర్కౌట్ చేస్తా. అలాగే హెచ్ఐఐటీ క్లాస్ నిర్వహిస్తాను. అమెరికన్ ఫిట్నెస్ ట్రైనర్ కాడీ రగ్స్బైని అనుసరిస్తాను. ఆయనే నాకు చాలా కాలంగా ఫేవరెట్. నేను అడపా దడపా ఉపవాసం చేస్తాను. కొన్ని రోజులు అసలు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే ఉంటాను. ఉపవాసం రోజుల్లో గ్రీకు పెరుగు, బ్లూబెర్రీలను తీసుకుంటాను. ఆపై అల్పాహారంలో బన్, చాక్లెట్ వంటివి తీసుకుంటాను. వారాంతాలు శని, ఆదివారాల్లో ఇంట్లోనే వండిన వాటిని అల్పాహారంగా తీసుకుంటాము. అమెరికన్ స్టైల్లో పాన్‌కేక్స్ తయారు చేస్తాము.’ అని తెలిపారు రిషి సునాక్. ఇదీ చదవండి: రిషి సునాక్ ఆప్యాయ పలకరింపు వీడియో.. ఇంతకీ ఆ ‘విజయ్ మామా’ ఎవరు? -
హీరోయిన్ రష్మిక రోజూ ఏం తింటుందో తెలుసా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన రష్మిక ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతుంది. తన క్యూట్‌లుక్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్ చేస్తున్న రష్మిక అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మరి ఈ భామ అందానికి గల కారణం ఏముంటుంది? రోజూ రష్మిక అసలు ఏం తింటుంది అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. అలాంటి వారికోసమే రష్మిక స్వయంగా తన డైట్ ప్లాన్‌ను రివీల్ చేసింది. షూటింగ్లో ఉన్నప్పుడు నేను ఏం తింటానంటే.. అంటూ వీడియోను షేర్చేసింది. ఈ వీడియోలో షూటింగ్ సెట్స్‌లో ఉన్నట్లు కనిపించిన రష్మిక మొదట కోల్డ్ కాఫీ, సెలరీ జ్యూస్‌ని తాగింది. తర్వాత భోజనం బాదం వెన్నతో కూడిన ఓట్స్, సాయంత్రం టీని ఆస్వాదించింది. చికెన్, బంగాళదుంపలను రాత్రి భోజనంలో తీసుకుంది. The happiest when I get my food! 😋🍲🤍 Check out what I eat on a shoot day on my YT now! https://t.co/wNYel27T6l — Rashmika Mandanna (@iamRashmika) April 29, 2022 -
Tamannaah: 'అనారోగ్యం.. అందుకే ప్రతిరోజు ఆ జ్యూస్ తాగుతా'
Tamannaah Reveals About Her Health Issue: 'శ్రీ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. విభిన్న పాత్రలతో ఎంటర్టైన్ చేస్తున్న తమన్నా ఇటీవలె మాస్ట్రో సినిమాలో విలన్ రోల్‌తో అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా..'కొన్నాళ్లుగా తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొంది. 'నాకు మంచి ఆహారపు అలవాట్లు ఉన్నాయి. కానీ ఎక్కువగా వర్కవుట్స్ చేయడం, ఒత్తిడి కారణంగా ఓ అనారోగ్య సమస్యను ఎదుర్కొన్నాను.దాన్నుంచి బయటపడేందుకు నిపుణుల సూచనలతో వ్యాయామాలు చేస్తున్నా. ఫ్రై ఫుడ్ ఐటమ్స్ పూర్తిగా మానేశా. ప్రస్తుతం సేంద్రీయ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నా. అంతేకాకుండా క్రమం తప్పకుండా నోని లేదా తొగరి ఫలం(Noni juice)ను తీసుకుంటా. ఈ జ్యూస్ నాకున్న సమస్య నుంచి బయటపడేందుకు ఎంతో ఉపయోగపడుతుంది' అని తెలిపింది. అంతేకాకుండా ప్రతిరోజు ఉసిరి రసం, బాదం పాలు,పసుపు, కొబ్బరి నీళ్లు తన డైట్లో ఉండేలా చూసుకుంటానని చెప్పింది. ఫిట్‌గా, స్లిమ్‌గా ఉండేందుకు లిక్విడ్ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు వివరించింది. అయితే తనకున్న ఆరోగ్య సమస్య ఏంటన్న దాన్ని మాత్రం తమన్నా బయటపెట్టలేదు. చదవండి: మాస్ట్రో: తమన్నాను అలా చూసి ఏడ్చిన డైరెక్టర్ గాంధీ కూతురు Bigg Boss Telugu 5: 'అర్థపావు భాగ్యం'.. ఆ ఒక్క తప్పు చేయకపోయి ఉంటే.. -
ఈ ఆహారంతో అస్తమాకు చెక్!
కొన్ని రకాల ఆహారాలు ఆస్తమాను నివారిస్తాయి. అవి... 1.కిస్మిస్, వాల్నట్స్ వంటి ఢ్రై ఫ్రూట్స్, బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, కూర అరటి వంటి కూరగాయలు, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఈ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి కాబట్టి ఇవి కూడా ఎక్కువగా లభ్యమయ్యేలా ఆహారం తీసుకోవాలి. 2.బ్రేక్‌ఫాస్ట్‌లో... పండ్లు, తేనె, కిస్మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు తీసుకోవాలి. 3.కూరల్లో లేదా తీసుకునే పదార్థాల్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం– సోయా గింజలు ఉండటం మంచిది. 4.దనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి. 5.పాలు లేదా టీలో అరస్పూన్ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగాలి. ఆస్తమాను ప్రేరేపించడానికి అవకాశం ఉన్న ఆహారాలు ఇక ఆస్తమాను ప్రేరేపించే ఆహారాలూ ఉన్నాయి. అలా ట్రిగర్ చేసే ఈ కింది వాటిని సాధ్యమైనంతగా నివారించడం మేలు. అయితే... ఇవన్నీ అందరిలోనూ ఆస్తమాను ప్రేరేపించవు. వ్యక్తిగతంగా వారికి సరిపడక వారిలో మాత్రమే ఆస్తమాను ట్రిగర్ చేస్తాయి. అందుకే ఈ కింది వాటిలో ఏదైనా పదార్థం సరిపడక, దేని కారణంగానైనా ఆస్తమా వస్తుంటే దాన్నుంచి దూరంగా ఉండాలి. సాధారణంగా కొందరిలో ఆస్తమాను ప్రేరేపిస్తాయంటూ చెప్పే ఆహారాలు ఇవే... పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు... ఇవి ఆస్తమా సమస్యను తీవ్రతరం చేయవచ్చు. అయితే ఇందులో కొన్ని మాత్రమే నిజం. వీటిలో ఫలానా ఆహారం నిర్దిష్టంగా అలర్జీని కలిగించి ఆస్తమాను ప్రేరేపిస్తుందని, అదే ట్రిగర్ అని తెలిస్తేనే... అప్పుడు దాన్ని మాత్రమే మానేయాలి. కమలాలు, నిమ్మ, బత్తాయి లాంటివి సి విటమిన్‌ను కలిగించి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయి. నిర్దిష్టంగా ఆ ఆహారం అలర్జీని కలిగిస్తుందని అనుకున్నప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించి, అది కచ్చితంగా అలర్జీని కలిగిస్తుందనే నిర్ధారణ పరీక్షను చేయించాకే... ఆ ఆహారం నుంచి దూరంగా ఉండాలి. -
హీరో ఊరించాడు.. కంట్రోల్ చేసుకోలేకపోయిన నటి
మనముందు ఎన్నో టేస్టీ వెరైటీలు ఊరిస్తున్నా డైట్ పేరుతో నోరు కట్టేసుకుంటాం. అయితే మన కళ్లముందే కావాలని మనల్ని ఊరిస్తూ తింటే అస్సలు ఆగలేం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే నటి కీర్తి సురేష్‌కు సైతం ఎదురైంది. పాపం డైట్లో ఉన్న కీర్తి..తన మానాన ఫ్రూట్స్ తింటుండగా, హీరో నితిన్ మాత్రం పిజ్జాతో ఊరిస్తుంటాడు. మొదట నో పిజ్జా అని భీష్మించుకున్నా...కాసేపటికే నోట్లో నీళ్లు ఊరిపోయాయి. దీంతో డైట్‌ని పక్కన పెట్టేసి చీటింగ్ చేసేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోగా, ఇది నెటిజన్లను ఆకట్టుకుంటుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) ప్రస్తుతం నితిన్- కీర్తి సురేష్ జంటగా ‘రంగ్‌దే’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీపై సినీ ప్రేమికుల అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవలె విడుదలైన ‘ నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడూ అననే అనని…’’ పాట నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మార్చి 26 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. చదవండి : (రంగ్‌దే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా!) ('ఆ నటుడితో డేటింగ్లో ఉన్నా.. చూద్దాం ఎంత వరకు వెళ్తుందో') -
బరువు తగ్గడం: ఇవన్నీ అపోహలే
ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సందర్భంలో ప్రాచూర్యం పొందిన చిట్కాలనో, డైట్ ప్లాన్లనో పాటించే ఉంటాము. యూట్యూబ్‌లో చూసిన దాన్నో.. ఇంటర్నెట్లో చదివిన దాన్నో.. స్నేహితుడు చెప్పినదాన్నో అచరించే ఉంటాము. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గటం కోసం ప్రాచూర్యం పొందిన ప్రతీ చిట్కాను, డైట్ ప్లాన్‌ను ఫాలో అయిపోతుంటారు. నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారు, రాత్రి పూట తిండి తినడం మానేస్తే బరువు తగ్గుతారు ఇలా ఏదో ఒక దాన్ని ఆచరణలో పెట్టి ఫలితం రాక ఢీలా పడిపోతుంటారు. అయితే ఇప్పటికి చాలా మంది కొన్ని డైటింగ్ విధానాలపై అపోహలతో ఉన్నారు. ఆ డైటింగ్ విధానాల ద్వారా బరువు తగ్గే అవకాశం ఉందనే భ్రమలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం ప్రాచూర్యం పొందిన డైట్ ప్లాన్లలో 90శాతానికిపైగా అపోహలే. డైట్ ప్లాన్ అపోహల్లో కొన్ని.. 1) గ్రీన్ టీ గ్రీన్ టీ ఒక జీరో క్యాలరీ డ్రింక్. ఇందులో ఫ్లేవనాయిడ్స్ తగిన మోతాదులో ఉంటాయి. అయితే గ్రీన్ టీ తాగటం వల్ల బరువు తగ్గుతారన్నది అపోహ మాత్రమే. 2) తేనె, నిమ్మరసం తేనె, నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని, పరగడపున తాగితే బరువు తగ్గుతారన్నది కూడా అపోహే. ఈ పానీయాన్ని ఉదయం లేవగానే తాగటం వల్ల కొవ్వు కణాలను కరిగిస్తుందన్నది అబద్ధం. 3) చెమట ఎంత ఎక్కువగా పడితే అంత కొవ్వు కరుగుతుంది? చెమట ఎంత ఎక్కువగా పడితే అంత కొవ్వు కరుగుతుందన్నది కూడా శుద్ధ అబద్ధం. జిమ్ ట్రైనర్స్ చెప్పే కొన్ని విషయాల్లో వాస్తవాలు ఉండవు. మీరు జిమ్‌లో బరువు తగ్గాలనుకుంటే కార్డియోను, వెయిట్ ట్రైనింగ్, కోర్ స్ట్రెన్తనింగ్తో బ్యాలన్స్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 4) కార్డియో కార్డియో ద్వారా బరువు తగ్గుతారన్నది కూడా అపోహే. మీరు కార్డియో చేస్తున్నపుడు క్యాలరీలు ఖర్చవుతాయి. కానీ, కార్డియో తర్వాత మీరు ఖర్చుచేసే క్యాలరీల సంఖ్య జీరో. అందువల్ల మనం ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం అన్న దానిపై శ్రద్ధ వహించాలి. కొత్తగా కొవ్వు ఒంట్లో చేరకుండా చూసుకోవాలి. -
ఇలా చేస్తే.. కచ్చితంగా బరువు తగ్గుతారు
సాక్షి, న్యూఢిల్లీ : సినీ తారలా సన్నగా, మెరపు తీగలా ఉండాలని తాపత్రయపడే యువతులు, బక్కగా ఉండడమే కాకుండా హృతిక్ రోషన్లాగా బలిష్టంగా కూడా కనిపించాలని కోరుకునే యువకులు, లావు తగ్గి చురుగ్గా కనిపించాలనుకునే మధ్య వయస్కులు మన చుట్టూ కోకొల్లలు. అందుకోసం వారంతా బరువు తగ్గించే బెల్టులు, యంత్రాలతో రోజు కుస్తీ పట్టడం, రక రకాల డైటింగ్లు కూడా చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం. అయినా ఆశించిన ఫలితాలు లేక కొత్త కొత్త పద్ధతులు, సూచనల కోసం ఎదురు చూసే వారు లేకపోలేదు. అలాంటి వారిని సొమ్ము చేసుకోవడానికి ఈ డైటింగ్ మంచిది, ఆ డైటింగ్ మంచిదంటూ ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఎన్నో సూచనలతో కూడిన పత్రికలు పుస్తకాలు వెలువడుతున్నాయి. ఫలితంగా బ్రిటన్‌లో డైట్ ఫుడ్ బిజినెస్ ఏడాదికి 18 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. డైటింగ్లకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదు లక్షలకుపైగా పరిశోధనాత్మక పత్రాలు, పుస్తకాలు వెలువడి ఉంటాయని అమెరికా ఫిజిషియన్, రచయిత డాక్టర్ మైఖేల్ గ్రెగర్ అంచనా వేశారు. ఈ పత్రాల్లో, పుస్తకాల్లో సూచించిన డైటింగ్లు ఎంత మేరకు శాస్త్రీయంగా ఉన్నాయన్న అంశాన్ని తెలుసుకునేందుకు డాక్టర్ మైఖేల్ తన బృందంతో అధ్యయనం చేయించారు. ఆ తర్వాత ఆయన మూడు వేర్వేరు వాలంటీర్ల బృందాలను ఎంపిక చేసుకొని రక రకాల డైటింగ్‌లను వారిపై ప్రయోగించి ఫలితాలను విశ్లేషించారు. ఇలా ఆయన 17 ఏళ్లపాటు పరిశోధనలు జరిపి వాటి ఆధారంగా ఎలా డైటింగ్ చేయాలో, ఎలా చేయకూడదో వివరణ ఇస్తూ ‘హౌ నాటు టు డైట్’ అంటూ ఓ పుస్తకాన్నే వెలువరించారు. టూకీగా చెప్పాలంటే అందులో ఆయన డైటింగ్‌కు 12 చిట్కాలు చెప్పారు. 1. అల్పాహారం మానవద్దు అల్పాహార విందును మానేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. గోడ గడియారంలాగానే మన భౌతిక శరీర గడియారంలో కూడా 24 గంటలు ఉంటాయి. ఆహారం తీసుకునేందుకు, విశ్రాంతి, నిద్రలకు సమయాలు ఉంటాయి. ఉదయం పూట ఎక్కువ కేలరీలను కరిగించే గుణం మన భౌతిక శరీరానికి ఉంటుంది. అందుకని అల్పాహారం మానేయాల్సిన అవసరం లేకపోగా, అల్పాహారప్పుడుగానీ, మధ్యాహ్నంగానీ ఎక్కువ తినాలి. రాత్రి పూట చాలా తక్కువ తినాలి. 2. శరీరంలో కొవ్వు రెండు రకాలు కడుపు, నడుముల వద్ద పేరుకుపోయే కొవ్వును వైట్ ఫ్యాట్ అంటారు. భుజాల వద్ద, మెడ, చెక్కిళ్ల వద్ద పేరుకుపోయే ఫ్యాట్‌ను గోధుమ రంగు ఫ్యాట్ అంటారు. శాస్త్ర విజ్ఞానపరంగా ‘బ్రౌన్ అడపోస్ టిష్యూ (బ్యాట్)’గా వ్యవహరిస్తారు. పగటి పూట ఈ ఫ్యాట్‌లోని కేలరీస్ త్వరగా కరుగుతాయి. 3. టీ, కాఫీలతో కాలరీలు కరుగుతాయి రోజుకు మూడుసార్లు టీ తాగడం వల్ల 25 కేలరీలు, రోజుకు మూడుసార్లు కాఫీలు తాగడం వల్ల 14 కాలరీలు మన శరీరంలో కరగుతాయి. బ్లాక్ టీ తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. 4. టమాటాలతో ఎంతో ప్రయోజనం ప్రతి మీల్స్ ముందు పండిన ఓ టమాటను తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ టమాటలో 90 శాతం నీళ్లు ఉండడం వల్ల తిండిని తగ్గిస్తుంది. అందులోని రసాయనాలు తిన్నదాంట్లోని కేలరీలను కరిగిస్తాయి. 5. డ్రైఫ్రూట్స్ గింజలు వీటిలో కాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. 24 గంటల భౌతిక గడియారం సజావుగా సాగేందుకు ఇవి ఉపయోగపడతాయి. 6. నల్ల జిలకర మన కూరల్లో నల్ల జిలకర ఉపయోగించడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు దాదాపు వెయ్యి పరిశోధనా పత్రాల్లో పేర్కొన్నట్లు డాక్టర్ వివరించారు. ఇది అతివేగంగా శరీరంలోని కాలరీలను కరిగిస్తోంది. 7. వెనిగర్ దీన్ని రోజుకు రెండు టీ స్పూన్ల చొప్పున తీసుకుంటే నెల రోజుల్లో రెండున్నర కిలోల శరీర బరువును తగ్గిస్తుంది. నేరుగా తీసుకుంటే స్వరపేటిక దెబ్బతినే ప్రమాదం ఉన్నందున, సలాడ్స్‌పై పోసి వాటిని తీసుకోవాలి. 8. ఉడకబెట్టిన బంగాళ దుంపలు ప్రతి భోజనంతో పాటు అంచుకు ఉడకబెట్టిన బంగాళ దుంపలు తీసుకోవడం వల్ల 200 కాలరీల ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. 9. వ్యాయామంతో ఫిట్ వ్యాయామం చేయడం వల్ల లావు తగ్గరు. తిండి పెరుగుతుంది. వ్యాయామం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు పెరిగి బలంగా తయారవుతారు. 10. ఇంటి పనుల్లో చురుగ్గా ఉండడం వంటావార్పు, ఇతర ఇంటి పనుల్లో తరచుగా కూర్చొడం, లేవడం, నిలబడడం, వంగడం తదిర క్రియల వల్ల శరీరంలోని కాలరీలు ఎక్కువగా కరగుతాయి. 11. బొజ్జలను తగ్గించే బెల్టులు.. వీటి వల్ల, ఇతర పరికరాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. 12. శృంగారంతో 10 కేలరీలు.. దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇరువురి మధ్య లైంగిక సంబంధం మహా అయితే ఆరు నిమిషాలు ఉంటుంది. దీని వల్ల కేవలం పది కేలరీలు మాత్రమే కరుగుతాయి. ఆ సమయంలో ఎక్కువగా గుండెకు ఆక్సిజన్ అందక పోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. రోజు టీవీ చూడడం వల్ల కూడా 14 కేలరీలు కరగుతాయి. (గమనిక: డాక్టర్ మైఖేల్ గ్రెగర్ రాసిన ‘హౌ నాట్ టు డైట్’ పుస్తకం డిసెంబర్, 10వ తేదీనాడు మార్కెట్లోకి వస్తోంది. అమెజాన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది) -
టార్గెట్ 10
డైట్ ప్లాన్‌ని చేంజ్ చేశారు హీరో అరవింద స్వామి. మరింత స్లిమ్ కావడం కోసం కాదు. బరువు పెరగడానికి. ఎందుకంటే ఆయన తాజా చిత్రం ‘కల్లాపార్ట్’ కోసం. రాజపాండి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాలో కథానాయికగా రెజీనా నటించనున్నారు. ‘‘ఒక కారణం కోసం బరుపు పెరగడం భలేగా ఉంటుంది. నా నెక్ట్స్ చిత్రం కోసం పది కేజీలు బరువు పెరుగుతున్నాను’’ అని పేర్కొన్నారు అరవింద స్వామి. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో రూపొందనున్న ఈ సినిమాలో రెజీనా డ్యాన్సర్‌గా కనిపిస్తారు. ‘‘నా క్యారెక్టర్ కోసం ప్రస్తుతం డ్యాన్స్ క్లాసులకు వెళ్తున్నాను. ఈ సినిమాలో చాలా తక్కువ క్యారెక్టర్లు ఉంటాయి. ఓ చైల్డ్ యాక్టర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. రాజపాండి మంచి టెక్నికల్ క్వాలిటీ ఉన్న దర్శకుడు. ఆయన స్టోరీ చెప్పిన విధానం నాకు నచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఇంతకన్నా ఎక్కువగా చెప్పలేను’’ అని పేర్కొన్నారు రెజీనా. -
వెన్నెల కిశోర్ ఫన్నీ డైట్ ప్లాన్
-
వెన్నెల కిశోర్ ఫన్నీ డైట్ ప్లాన్
టాలీవుడ్ స్టార్ కమెడియన్‌గా వెలుగొందుతున్న వెన్నెల కిశోర్ సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటాడు. తన షూటింగ్ అప్డేట్స్ ఇవ్వటంతో పాటు సామాజిక అంశాలపై కూడా తనదైన స్టైల్లో స్పందిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా అలాంటి ఆసక్తికరమైన ఒక ట్వీట్ తో ఆకట్టుకున్నాడు కిశోర్. కొన్ని బాదం పప్పుల మాత్రమే ఉన్న చిన్న బౌల్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన కిశోర్ ఆసక్తికర కామెంట్ చేశాడు. ‘నా బ్రేక్ ఫాస్ట్ ఇది మాత్రమే. 15 నిమిషాల తరువాత రెండు ఇడ్లీలు, కొంచెం పొంగల్, రెండు ఆనియన్ దోశలు (ఆనియన్స్ లేకుండా), ఒక టీ మాత్రం స్నాక్స్ లా తీసుకుంటా’ అంటూ ట్వీట్ చేశాడు. వెన్నెల కిశోర్ చేసిన ఈ ట్వీట్‌పై స్పందించిన మంచు లక్ష్మీ ‘నా జీవితంలో ప్రతీరోజు ఆనందానికి నువ్వు కూడా ఓ కారణం’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పదించిన చాలా మంది అభిమానులకు తనదైన స్టైల్ లో సమాధానమిచ్చాడు కిశోర్. My only breakfast..then after almost 15 mins will have a light snack of just two idlis, little pongal, two onion dosas (without onions) and one tea..#eathealthy pic.twitter.com/wAWQ9yNcJ5 — vennela kishore (@vennelakishore) 17 March 2018 -
మిస్ ఆచి మిసెస్ తూచి
ఆచితూచి తింటే ఆరోగ్యం బాగుండడమే కాకుండా... మహిళలకు తమ బరువు మీద కంట్రోల్ వస్తుంది. సన్నగా ఉండగలిగితే జీవితం చలాకీగా ఉంటుంది. తొందరగా కీళ్ల నొప్పులు, ఆరోగ్యసమస్యలు సతాయించవు. ఇంటి బడ్జెట్టును ఎంతో జాగ్రత్తగా చూసుకునే ఇల్లాలు... తన ఒంటి బడ్జెట్టును ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోకపోతే ఎలా?! మిస్లు, మిసెస్లు క్యాలుక్యులేట్ చేసుకోడానికి ఇక్కడో లెక్కుంది. దానికో కిక్కుంది. పద్దులు మేమిచ్చాం. పాళ్లు మీరు సరిచూసుకోండి. రెజీనా డైట్ ప్లాన్ మాణింగ్ గ్లాసుడు నీళ్లతో నా డైలీ డైట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మసాలా టీ లేక కాఫీ. {బేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోసె.. ఇలా ఏదో ఒకటి తీసుకుంటా. {బేక్ఫాస్ట్కి, లంచ్‌కి మధ్య {yై ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు. మధ్యాహ్న భోజనంలో బీట్రూట్, క్యారెట్, కీరా ఉండేలా చూసుకుంటాను. కొంచెం రైస్, రోటీ తీసుకుంటా. నాకు పనీర్ అంటే ఇష్టం. నా శరీరానికి కావల్సిన ప్రొటీన్స్ పనీర్, పప్పుల ద్వారానే అందుతాయి. ఆయిలీ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. అందుకని వేపుళ్లను అవాయిడ్ చేస్తాను. నూనె పదార్థాలకు దూరంగా ఉంటాను కాబట్టి, డైట్ పరంగా పెద్దగా నియామలు పాటించాల్సిన అవసరం లేకుండాపోతోంది. లంచ్‌కి, డిన్నర్‌కి మధ్య ఫ్రూట్స్, నట్స్ తింటుంటాను. డిన్నర్ లైట్‌గా తీసుకుంటాను. రంజితకు ముప్పై ఏళ్లుంటాయి. ఇద్దరు పిల్లల తల్లి. గృహిణి. రోజంతా క్షణం తీరికలేని పని. రెండు పూటల హెవీ మీల్స్, సాయంకాలం స్నాక్స్, రాత్రి పడుకునే ముందు పాలు... ఇన్ని తీసుకుంటున్నా నీరసంగానే ఉంటోంది. పత్రికల్లో, టీవీల్లో వచ్చే ఆరోగ్యం సూత్రాలను చదువుతుంది, చూస్తుంది, వింటుంది. ఆ లెక్క ప్రకారమే దాదాపుగా తన డైట్‌ని ప్లాన్ చేసుకుంటున్నా తనకెందుకనో సూట్ అవడం లేదు. లోపం ఎక్కడుందో తెలియడం లేదు. అసలు తన శ్రమకు ఎలాంటి అహారం తీసుకోవాలో అర్థంకావడం లేదు. అవంతిక వయసు నలభై. ఏజీ ఆఫీస్‌లో వర్క్ చేస్తుంది. తనదీ అదే సమస్య. ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం రైస్‌తో లంచ్, రాత్రికి డిన్నర్లో చపాతి. ఈవినింగ్ స్నాక్స్‌లో స్ప్రౌట్స్ తీసుకుంటోంది. వినడానికి హెల్దీ డైట్లాగే ఉన్నా అవంతికకేమీ తేడా కనిపించడం లేదు. ఎనర్జిటిక్‌గా ఉన్నట్టు ఫీలవడం లేదు. ఉరుకుల పరుగుల తన లైఫ్ స్టయిల్‌కి ఈ డైట్ సూట్ అవుతుందో లేదో అర్థకావడం లేదు. రోజుకి ఎన్ని కేలరీలు తీసుకోవాలి? ఎన్ని కేలరీలు బర్న్ చేయాలో.. తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌ని వడపోస్తోంది. వీళ్లిద్దరి సమస్య ఇలా ఉంటే టీనేజ్ గర్ల్ రశ్మి సమస్య వేరు. పద్దెనిమిదేళ్ల పిల్ల. ఇంజనీరింగ్ చదువుతోంది. మంచి హైట్. దానికి తగ్గ వెయిట్‌ను మెయిన్టైన్ చేయాలని తపన. ఉదయం పాలు.. మధ్యాహ్నం రెండు రోటీలు.. రాత్రి ఉడికించిన కూరగాయలతో కడుపునింపేసుకుంటుంది. దానికి తగ్గట్లే వర్కవుట్లు. సన్నగా తోటకూర కాడలా .. ప్రాణమంతా కళ్లల్లో నింపుకొని కనపడుతోంది. రశ్మిని చూసినప్పుడల్లా వాళ్లమ్మ మనసు తరుక్కుపోతోంది. ఇంటర్ వరకు ఆరోగ్యంగా కళకళలాడుతూ ఉన్న పిల్ల ఒక్క యేడాదిలో వడలిపోయింది. పట్టుకుచ్చులా ఉండే జుట్టు గరికలా మారింది. పాలిపోయి కళావిహీనమైంది. ఈ డైట్ ఏంటో.. ఆ ఎక్సర్‌సెజైస్ ఏంటో ఆమెకు అంతుచిక్కడం లేదు. వ్యత్యాసం.. నిజానికి ఈ ముగ్గురు స్త్రీల వయస్సు, చేస్తున్న పనుల తీరు వేరువేరు అయినా సమస్య ఒకటే. ఎన్ని కేలరీనిచ్చే ఆహారం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనే! అయితే తీసుకునే ఆహారంలో మహిళలకు, పురుషులకు కొంత వ్యత్యాసం ఉంటుంది అన్న విషయం గమనించాలి. ఆ రకంగానే ఆహారాన్ని తీసుకోవాలి. బాడీ మాస్ ఇండెక్స్ ముందుగా ఎత్తుకు తగ్గ బరువు ఉన్నామా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అంటే శరీరంలో కండపాళ్లు సరిపడా ఉన్నాయా లేదా చూసుకోవడం. ఇదే బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ). ఆరోగ్యంగా ఉన్న వాళ్ల బీఎమ్ఐ విలువ 19 నుంచి 23 మధ్య ఉంటుంది. 23 నుంచి 25 మధ్య ఉంటే ఉండాల్సిన దానికన్న బరువు ఎక్కువున్నట్టు లెక్క. 25 పై మాటే అంటే లావుగా ఉన్నట్టే అని నిర్ధారించుకోవాల్సిందే! 30 కంటే ఎక్కువుంటే అధిక బరువు అని అర్థం. ఈ బీఎమ్ఐ లెక్కించడానికి సులభమైన సూత్రమొకటి ఉంది. ఉదాహరణకు మీ ఎత్తు అయిదు అడుగుల ఎనిమిది అంగుళాలు అనుకుందాం.. అంటే 172 సెంటిమీటర్లన్న మాట. మీ బరువు 65 కిలోలు అనుకుందాం. అప్పుడు 65కిలోలు డివెడైడ్బై 1.72 ఇంటూ 1.72 కాలిక్యులేట్ చేస్తే మీ బీఎమ్ఐ వచ్చేస్తుంది. ఎవరు.. ఎన్ని కేలరీలు.. తీసుకోవాలి? బీఎమ్ఐ లెక్క చూసుకున్నాక ఆహారం విషయం ప్లాన్ చేసుకోవాలి. ఎవరి శారీరక శ్రమను అనుసరించి వాళ్లు డైట్‌చార్ట్‌ను ప్లాన్ చేసుకోవాలి. ఇందుకోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ డైటరీ రిఫరెన్స్ ఒక పట్టికను తయారు చేసింది. దాని ప్రకారం.. బట్టలుతకడం, గిన్నెలు కడగడం, ఇల్లు ఊడ్వడం, వంటచేయడం వంటి ఇంటి పని చేస్తున్న స్త్రీలు రెండువేల నుంచి రెండువేల రెండువందల కేలరీల ఆహారం తీసుకుంటూ ఉంటే వాళ్ల బరువు పెరగడంకానీ, తగ్గడం కానీ ఉండదు. ఒకే బరువు మెయిన్టైన్ అవుతూ ఉంటుంది. ఈ మోస్తరు పని ఉన్నవాళ్లే ఒక కిలో బరువు తగ్గాలి అనుకుంటే రోజుకి పన్నెండువందల కేలరీలు మాత్రమే తీసుకుంటే తొమ్మిది రోజుల్లో ఒక కిలో బరువు తగ్గుతారు. అంటే వీళ్లు రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో వెయ్యి కేలరీలు తగ్గించాలన్నమాట. ఇలాకాకుండా వేగంగా బరువు తగ్గాలని అతి తక్కువ కేలరీలు తీసుకుంటుంటే అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్టే. ఎంత వేగంగా బరువు తగ్గుతారో అంతే వేగంగా మళ్లీ బరువు పెరుగుతారు. కాబట్టి నిదానంగా బరువు తగ్గడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం. మీరు రోజుకు ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నారో తెలుసుకోవడానికి ఈ పట్టికను చూడండి.. పలు రకాల పదార్థాల్లోని క్యాలరీలు (సుమారుగా)... -
ఆహార నియమాలకు 5 సూత్రాలు
సమతుల ఆహారాన్ని వేళ ప్రకారం తీసుకుంటూ, శారీరక వ్యాయామానికి సరైన ప్రాధాన్యమిస్తూ ఉంటే అధికబరువు సమస్యే దరిచేరదు. అయితే, చాలామందికి ఆహారం తీసుకోవడంలో సరైన ప్రణాళిక ఉండదు. దాంతో అధిక బరువుతో పాటు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారన్నది పోషకాహార నిపుణుల అభిప్రాయం. ఆహార ప్రణాళికకు నిపుణులు అందిస్తున్న 5 సూత్రాలు.. 1. ఆహార ప్రణాళిక.. ‘డైట్ ప్లాన్’ సరిగ్గా ఉండాలి కదా అని ఒకే తరహా ఆహారంతో సరిపెట్టేయకూడదు. దీని వల్ల ఆ ప్రణాళిక సవ్యంగా నడవదు. కొన్ని రకాల పదార్థాలు మరికొన్నింటితో కలిపితే రుచిగానే కాదు, ఆరోగ్యానికీ మేలు కలుగుతుంది. అయితే, ఏ పదార్థాలు కలిపితే శరీరానికి మంచిది అనేవి తెలిసుండటం ముఖ్యం. ఉదాహరణకి- చేపలు ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చాలామందికి తెలుసు. అయితే, చేపలను కూరల రూపకంగానే కాకుండా ఆవిరి మీద ఉడికించి, గ్రిల్ చేసి, ఇతర కూరగాయల సలాడ్స్‌తో తీసుకోవచ్చు. 2. ఎంపిక ప్రధానం.. లక్ష్యం వైపుగానే ఆహారపు అలవాట్లు ఉండాలి. మనకు నచ్చనిదైనా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని కూడా మెల్ల మెల్లగా మొదలుపెట్టి శరీరానికి అలవాటు చేయవచ్చు. దీని వల్ల లక్ష్యానికి త్వరగా చేరువకావచ్చు. 3. భాగస్వామిని ఎంచుకోండి... కుటుంబంలోనో, స్నేహితుల్లోనో, సహోద్యోగుల్లోనూ.. మీలాగే ఆహారనియమాలు పాటించే వ్యక్తిని ఈ నియమాల్లో భాగస్వామిగా ఎంచుకోండి. దీని వల్ల ఆహార నియమాలను పాటించడంలో ప్రోత్సాహం ఉంటుంది. వాయిదా వే సే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాయిదా వేసినా తిరిగి కొనసాగించే ధోరణి ఈ పద్ధతిలో ఎక్కువ. 4. సులువుగా కితాబు ఇచ్చేసుకోకండి... మీకు మీరుగా ‘నేను చాలా బాగా ఆహార నియమాలు పాటించగలను’అనే కితాబు ముందే ఇచ్చుకోకండి. ఎప్పుడైనా నియమాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల మీ ప్రణాళిక కూడా పూర్తిగా మూలన పడే అవకాశమూ ఉంది. అందుకే, ప్రతి రోజూ ‘ఈరోజును కొత్తగా, ఇంకా మరింత ఆరోగ్యకరమైన ఆహార నియమాలతో ప్రారంభిస్తాను’ అనుకోండి. 5. ఒత్తిడిని అదుపులో ఉంచండి.. భావోద్వేగాల ప్రభావం ఆరోగ్యం మీద చూపుతుంది. ఇలాంటి సమయాల్లో ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, లేదా అసలు తీసుకోకపోవడం జరుగుతుంటుంది. మానసిక ఒత్తిడి అదుపులో లేకపోతే ఆహారం మీద అదుపు ఉండదు. అనారోగ్యకరమైన ఆహారం మరింత మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఇదొక విషవలయంగా మనిషిని వేధిస్తూనే ఉంటుంది. అందుకని మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకొని, నియమాల అమలు సక్రమంగా జరిగేలా చూడాలి.