హీరో ఊరించాడు.. కంట్రోల్‌ చేసుకోలేకపోయిన నటి | Nitin Disrupted Heroine Keerthi Suresh Diet Plan See How Her Cheat Day Goes | Sakshi
Sakshi News home page

హీరో ఊరించాడు.. కంట్రోల్‌ చేసుకోలేకపోయిన నటి

Published Thu, Mar 18 2021 9:24 PM | Last Updated on Thu, Mar 18 2021 10:02 PM

Nitin Disrupted Heroine Keerthi Suresh Diet Plan See How Her Cheat Day Goes - Sakshi

మనముందు ఎన్నో టేస్టీ వెరైటీలు ఊరిస్తున్నా డైట్‌ పేరుతో నోరు కట్టేసుకుంటాం. అయితే మన కళ్లముందే కావాలని మనల్ని ఊరిస్తూ తింటే అస్సలు ఆగలేం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే నటి కీర్తి సురేష్‌కు సైతం ఎదురైంది. పాపం డైట్‌లో ఉన్న కీర్తి..తన మానాన ఫ్రూట్స్‌ తింటుండగా, హీరో నితిన్‌ మాత్రం పిజ్జాతో ఊరిస్తుంటాడు. మొదట నో పిజ్జా అని భీష్మించుకున్నా...కాసేపటికే నోట్లో నీళ్లు ఊరిపోయాయి. దీంతో డైట్‌ని పక్కన పెట్టేసి చీటింగ్ చేసేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకోగా, ఇది నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం నితిన్‌- కీర్తి సురేష్‌ జంటగా ‘రంగ్‌దే’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌  చేశాయి. దీంతో ఈ మూవీపై సినీ ప్రేమికుల అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవలె విడుదలైన ‘ నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడూ అననే అనని…’’ పాట నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మార్చి 26 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. 

చదవండి : (రంగ్‌దే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఎంతో తెలుసా!)
('ఆ నటుడితో డేటింగ్‌లో ఉన్నా.. చూద్దాం ఎంత వరకు వెళ్తుందో')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement