హీరోయిన్‌ కీర్తి వల్ల బతుకు బస్టాండ్‌ అయ్యింది : నితిన్‌ | Rang De movie : Nithin shares Funny Video of Keerthy Suresh eating thier food | Sakshi
Sakshi News home page

'నలుగురు తినే తిండి మొత్తం తినేసింది చూడండి'

Published Thu, Mar 25 2021 7:41 PM | Last Updated on Thu, Mar 25 2021 9:44 PM

Rang De movie : Nithin shares Funny Video of Keerthy Suresh eating thier food - Sakshi

నితిన్‌- కీర్తి సురేష్‌లు జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ఇప్పటికే విడుదలైన  ట్రైలర్‌.. సినిమాపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేసింది. ఇక ట్రైలర్‌లో టామ్‌ అండ్‌ జెర్రీల్లా కొట్టుకున్న వీరిద్దరూ రియల్‌లైఫ్‌లోనూ తెగ హంగామా చేసేస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో ఇది స్ఫష్టంగా కనిపిస్తుంది.  రంగ్‌ దే షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి వీళ్లిద్దరి అల్లరికి హద్దు లేకుండా పోయింది.షూటింగ్‌ గ్యాప్‌లో చిన్న కునుకు తీస్తే దాన్ని ఫొటో తీసి రచ్చ చేశారు దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో నితిన్‌. దీంతో వీళ్ల మీద కక్ష కట్టిన కీర్తి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసింది. అన్నట్లుగానే వెంకీని పరిగెత్తించి మరీ సరదాగా కొట్టింది. ఇక నితిన్‌ ఫొటోను ఎడిట్‌ చేసి ఆడుకుంది. ఇటీవలె అను కనిపించడం లేదంటూ హీరోయిన్‌ కీర్తి రెండు జడలు వేసుకున్న చిన్నప్పటి ఫొటోను షేర్‌ చేసి ఆమెను ఆటపట్టించారు నితిన్‌.

తాజాగా కీర్తి సురేష్‌ వల్ల తమ బతుకు బస్టాండ్‌ అయ్యిందంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేశాడు. ఓ ఈవెంట్‌ అనంతరం రకరకాల ఫుడ్‌ ఐటెమ్స్‌ తిందామని రెడీగా పెట్టుకున్న తమకు కీర్తి షాకిచ్చిందని, మేం తినే తిండి మొత్తం కీర్తి ఒక్కతే తింటుందంటూ బాధను నెటిజన్లతో పంచుకున్నాడు. అంతేకాకుండా నితిన్‌కి సపోర్ట్‌గా మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ కూడా చేరి అహా నా పెళ్ళంట సినిమాలోని వివాహ భోజనంబు అనే పాట పాడుతూ కీర్తిని ఆట పట్టించారు. అయితే ఇవేమీ పట్టించుకోని కీర్తి...హ్యాపీగా తనకు  ప్లేట్‌లోని ఐటెమ్స్‌ను తింటూ ఎంజాయ్‌ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా నితిన్‌- కీర్తి చేస్తున్న అల్లరి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. మొదటిసారి వీరిద్దరూ జోడిగా కలిసి నటించిన రంగ్‌దే చిత్రం మార్చి 26న రిలీజ్‌ అవుతోంది.
 

 చదవండి : కీర్తి సురేశ్‌ మిస్సింగ్‌: నితిన్‌ ఫిర్యాదుకు పోలీసుల రిప్లై!
హీరో ఊరించాడు.. కంట్రోల్‌ చేసుకోలేకపోయిన నటి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement