Devi sri prasd
-
స్టార్ హీరో లేటెస్ట్ మూవీ.. న్యూ ఇయర్‌కు క్రేజీ అప్డేట్
ఇటీవలే మార్క్ ఆంటోనీ చిత్రంతో అలరించిన కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా విశాల్ నటిస్తోన్న చిత్రం రత్నం. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు హరీ దర్శకత్వం వహిస్తుండగా.. కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌తో పాటు లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తే విశాల్ ఎన్నడూ కనిపించని ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. తల నరికి చేత్తో పట్టుకునే ఆ సీన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఫస్ట్‌లుక్‌తో పరాటు ఓ లిరికల్ పాటను విడుదల చేశారు. 'రా రా రత్నం' అంటూ సాగే ఈ పాట మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో నరనరాల్లో రక్తాన్ని పరుగులు పెట్టించేలా లిరిక్స్, ట్యూన్, విజువల్స్ ఉన్నాయి. వివేక్ సాహిత్యం, షేన్ భాగరాజ్ గాత్రం, దేవీ శ్రీ ప్రసాద్ బాణీ ఎంతో పవర్ ఫుల్‌గా ఉన్నాయి. ఈ చిత్రంలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్నీ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
DSP పెళ్లి ఫిక్స్ ? అమ్మాయి ఏజ్ తెలిస్తే షాక్..!
-
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు
-
హీరోయిన్‌తో రహస్యంగా దేవీశ్రీ ప్రసాద్ పెళ్లి? ఆమె ఏమందంటే..
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌తో రహస్యంగా పెళ్లి జరిగింది అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ పూజిత పొన్నాడ స్పందించింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె దేవీశ్రీతో తనకు సీక్రెట్ మ్యారేజ్ అంటూ వస్తున్న కథనాలపై క్లారిటీ ఇచ్చింది. అక్కినేని నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన ఊపిరి చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన పూజిత అచ్చమైన తెలుగింటి అమ్మాయే. విశాఖపట్నానికి చెందిన ఈ బ్యూటీ రంగస్థలం, హ్యాపీ వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'ఆకాశ వీధుల్లో' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్లో పాల్గొన్న పూజిత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'దేవీశ్రీ ప్రసాద్‌తో రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొచ్చాయో నాకు అర్థం కావడం లేదు. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకున్నామని వార్తలు రాస్తున్నారు. ఇందులో నిజం లేదు. నేను ఎవరితోనూ రిలేషన్లో లేను.. ప్రస్తుతానికి నేను సింగిల్' అంటూ చెప్పుకొచ్చింది. -
Pushpa2: దేవిశ్రీపైనే ఎక్కువ ప్రెజర్.. ఈ సారి ఏం చేస్తాడో?
అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ విజయంలో దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు కీలక పాత్ర పోషించాయి. పాన్ ఇండియా మార్కెట్ లో పుష్ప ను గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేసేందుకు సినిమాకు సూపర్ ఓపెనింగ్స్ ను అందించేందుకు చాలా హెల్ప్ అయ్యాయి. దేశాన్ని మొత్తాన్ని రాక్ స్టార్ బీట్స్ , బన్ని స్టెప్స్ ఊపేశాయి. ఇప్పుడు పుష్ప-2పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. (చదవండి: సీతారామం’ఫస్ట్ రివ్యూ: థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కు సరైన మూవీ!) దీంతో సుకుమార్ మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. సెప్టెంబర్ నుంచి పుష్ప పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్తోంది. అయితే సుకుమార్ కంటే కూడా సీక్వెల్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ పైనే ఎక్కువ ప్రెజర్ ఉంది. ఈ సారి రాక్ స్టార్ ఎలాంటి ట్యూన్స్ అందిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అందుకు తగ్గట్లే రాక్ స్టార్ అదిరిపోయే ట్యూన్స్ కంపోజ్ చేశాడట. మరోసారి దేవి ట్రాక్స్ సెన్సేషన్ సృష్టించడం ఖాయం అంటోంది చిత్ర యూనిట్. కానీ పుష్ప తర్వాత వచ్చిన సినిమాలకు దేవి అందించిన పాటలేవి అంతగా ఆకట్టుకోలేదు. గుడ్ లక్ సఖి, ఖిలాడి, ఆడవాళ్లు మీకు జోహార్లు, లాంటి చిత్రాలకు రాక్ స్టార్ కంపోజ్ చేసిన సాంగ్స్ సినిమాకు హెల్ప్ కాలేదు. ఎఫ్ 3, ది వారియర్ మూవీస్ కు మాత్రం దేవి ఇచ్చిన పాటలు కొంత ఇంప్రెస్ చేశాయి. ఈ దశలో పుష్ప 2కు దేవి అంచనాలు మించి ట్యూన్స్ అందించగలడా అంటే రాక్ స్టార్ ఎక్స్ పీరియెన్స్ ను తక్కువ అంచనా వేయద్దు అంటున్నారు అతని ఫ్యాన్స్. ఈ సారి ఊ ఆంటావా , శ్రీవల్లి, సామిసామి మించిన ట్యూన్స్ తో తిరిగొస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. -
విజిల్ వేయించేలా 'ది వారియర్' విజిల్ సాంగ్..
Ram Pothineni The Warrior Whistle Lyrical Song Released By Surya: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులోను 'బుల్లెటు' సాంగ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను బయటకు వదిలింది చిత్రబృందం. ఈ సినిమాలోని 'విజిల్.. విజిల్..' అంటూ సాగే పాటను సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరో సూర్య రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్‌తో అందరి చేత విజిల్ వేయించేలా మ్యూజిక్ అందించాడు. సాహితీ రాసిన క్యాచీ లిరిక్స్, సింగర్స్ ఆంటోని దాసన్, శ్రీనిషా జయశీలన్ అద్భుతంగా ఆలపించారు. ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేతృత్వంలో రామ్, కృతిశెట్టి వేసిన స్టెప్స్ పాటకు హైలెట్‌గా నిలవనున్నాయి. విడుదలైన అతి కొద్ది సమయంలోనే ఈ పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ ! కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. Here’s the #WhistleSong from #TheWarriorrhttps://t.co/4v4ED7InOz All the best for a super success!! @dirlingusamy @ThisIsDSP @RamSayz @AadhiOfficial @IamKrithiShetty — Suriya Sivakumar (@Suriya_offl) June 22, 2022 -
'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా'.. పూజాతో వెంకీ, వరుణ్ స్టెప్పులు..
F3: Pooja Hegde Life Ante Itta Vundaala Lyrical Song Released: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా త్రిబుల్ ఫన్‌తో సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ అని తెలిసిన విషయమే. మిల్క్ బ్యూటీ తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్ 3' మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేకాకుండా అంతకుముందు రిలీజైన రెండు సింగిల్స్ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా మూడో సింగిల్‌ను వదిలారు. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మంగళవారం (మే 17) విడుదల చేశారు. ఈ పాటలో బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పూజాతోపాటు వెంకటేశ్, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ కలిసి చిందేసారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పార్టీ నంబర్‌గా పేర్కొన్న ఈ పాట పార్టీల్లో, వేడుకల్లో మారుమోగనుంది. చదవండి: ఎఫ్ 3లో సోనాలి చౌహాన్ రోల్‌పై స్పందించిన అనిల్ రావిపూడి -
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సమంత స్పెషల్ సాంగ్
Youtube Records Of Samantha Oo Antava Oo Antava Song In Pushpa: ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'పుష్ప' మ్యానియా కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సమంత తొలిసారిగా ఐటెం సాంగ్ చేయడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట అంటూ సమంత చేసిన ఈ సాంగ్ యూట్యూబ్‌ను దుమ్మురేపుతుంది. సమంత గ్లామర్, చంద్రబోస్ లిరిక్స్ ఒక ఎత్తైతే, గాయని ఇంద్రావతి చౌహాన్ తన మత్తు వాయిస్‌తో పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.చదవండి: నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే పనులు చేయను: నాగ చైతన్య తాజాగా అన్ని భాషల్లో కలుపుకొని ఈ పాటకి 45 మిలియన్స్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా 1.6మిలియన్స్‌కి పైగా లైక్స్ వచ్చాయి. థియేటర్స్‌లో ఈ సాంగ్ మరింత సందడి చేయడం ఖాయమని అంటున్నారు. ముఖ్యంగా సమంత పర్ఫార్మెన్స్కి బొమ్మ దద్దరిల్లుతుందని మేకర్స్ భావిస్తున్నారు. కాగా సినిమాలో ఇంటర్వెల్‌కి ముందుగానే ఈ సాంగ్ సందడి చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. చదవండి: సమంత ఐటెం సాంగ్‌కి చిందేసిన బోల్డ్ బ్యూటీ అరియానా నాగ చైతన్య బెస్ట్‌ఫ్రెండ్‌కి బర్త్‌డే విషెస్ చెప్పిన సమంత 45M+ views with 1.6M+ Likes for the Record Breaking SIZZLING SONG OF THE YEAR💥 -https://t.co/xuag0ghoHu@alluarjun @iamRashmika @Samanthaprabhu2 @aryasukku @ThisIsDSP @adityamusic @TSeries @MythriOfficial #PushpaTheRise#PushpaTheRiseOnDec17 pic.twitter.com/OH3jDPvJhY — Pushpa (@PushpaMovie) December 15, 2021 -
'పుష్ప' మూవీ నుంచి ఊరమాస్ సాంగ్ అదిరిపోయిందిగా...
Pushpa: Eyy Bidda Idhi Naa Adda Full Song Out Now: సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప' . ఈ సినిమా తొలి పార్ట్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దక్కో మేక', ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే’ 'సామీ సామీ' పాటలు యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి. తాజాగా ఈ పుష్ప నుంచి నాలుగో పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఆ పక్కా నాదే.. ఈ పక్కా నాదే..తలపైన ఆకాశం ముక్కా నాదే..‘ఏ బిడ్డ ఇది నా అడ్డ’అంటూ ఈ పాట సాగుతుంది. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో ఎర్రటి నిలువు బొట్టుతో ఊర మాస్ లుక్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సమంత ఈ చిత్రంలో స్పెషల్‌సాంగ్‌లో కనిపింనుండటం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. Make way for the Swagger with some noise 💥💥#EyyBiddaIdhiNaaAdda Song Out Now! - https://t.co/0CcaCieCmS#PushpaFourthSingle 🤙#PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @AzizNakash @boselyricist @adityamusic @MythriOfficial pic.twitter.com/HhPH7m4Un3 — Pushpa (@PushpaMovie) November 19, 2021 -
Pushpa Update: గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో బన్నీ.. ఫోటో వైరల్
సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు మూడు పాటలు విడుదల కాగా, తాజాగా నాలుగో పాట విడుదల తేదిని ప్రకటించింది చిత్రబృందం. ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ’అంటూ సాగే ఈ పాట నవంబర్ 19న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్‌ను గమనిస్తే అందులో బన్నీ గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో ఎర్రటి నిలువు బొట్టు పెట్టుకుని సోఫాలో స్టైల్‌గా కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. SwAAg of #PushpaRaj 😎#EyyBiddaIdhiNaaAdda song out on 19th NOV 💥💥#PushpaFourthSingle 🤘#PushpaTheRise #PushpaTheRiseOnDec17 pic.twitter.com/Sw5DltVSAs — Pushpa (@PushpaMovie) November 14, 2021 -
ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాదే హీరో: దిల్ రాజు
‘‘ఔట్ అండ్ ఔట్ యూత్ మూవీ ‘రౌడీ బాయ్స్’. చాలా కాలం తర్వాత మా బ్యానర్లో వస్తున్న యూత్ ఫిల్మ్ ఇది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్‌తో కలసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేసిన అనంతరం ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘రౌడీ బాయ్స్’ సినిమాకి హీరో దేవిశ్రీ ప్రసాద్. కొత్త వాళ్లతో సినిమా చేస్తున్నప్పుడు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు రప్పించాలంటే మొదట అందర్నీ మెప్పించేది సంగీతమే. ఆశిష్‌ను హీరోగా లాంచ్ చేస్తున్నామని, మ్యూజిక్ చేయాలని అడిగితే వారం టైమ్ తీసుకుని ఓకే అన్నాడు. దేవిశ్రీ, నా జర్నీలో అన్ని సినిమాలు వేరు.. ఈ ‘రౌడీ బాయ్స్’ వేరు. ఇద్దరి హీరోలకంటే అనుపమా పరమేశ్వరన్ పెద్దగా కనిపిస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ, తను బాగా చేసింది. దేవిశ్రీ తర్వాత ఈ సినిమాకి తనే సెకండ్ హీరో. దసరాకు సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవలే విడుదలైన మా సినిమా టైటిల్ సాంగ్, ఇప్పుడు విడుదలైన టీజర్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను’’ అన్నారు ఆశిష్. ‘‘రౌడీబాయ్స్’ లో మొత్తం 9 పాటలు ఉన్నాయి. పాటలన్నీ ఆడియన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటాయి’’ అన్నారు హర్ష. ‘‘రౌడీ బాయ్స్’ కి మ్యూజిక్ అందించేందుకు ‘దిల్’ రాజుగారు అడిగిన వెంటనే ఓకే చెప్పాను. ఆశిష్ సినిమాకు మ్యూజిక్ అందించడం నా బాధ్యత. ఈ సినిమాకు మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుని ఉంటే నేను ధర్నా చేసేవాణ్ణి. ‘రౌడీబాయ్స్’ సినిమాతో కాలేజీ డేస్‌ను గుర్తుచేసుకుంటారు.. యూత్ అంతా కలిసి నవ్వుకుంటూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఆశిష్ నటన చూస్తే తొలి సినిమాకే ఇంత బాగా యాక్ట్ చేశాడేంటి? అనిపించింది. ఆశిష్, విక్రమ్ పోటాపోటీగా నటించారు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. చదవండి: కావ్య కోసం కొట్టుకున్న 'రౌడీ బాయ్స్' -
pushpa Movie: దాక్కో దాక్కో మేక.. మొదలైంది రికార్డుల మోత
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, శుక్రవారం ఈ మూవీ నుంచి తొలి పాట ‘దాక్కో దాక్కో మేక..’ విడుదలైంది. ఈ సాంగ్‌ని హిందీలో విశాల్ దడ్లాని, కన్నడలో విజయ్ ప్రకాశ్, మలయాళంలో రాహుల్ నంబియార్,తెలుగులో శివం,తమిళంలో బెన్నీ దయాల్ ఆలపించారు. అల్లు అర్జున్ మాస్ లుక్, దేవీశ్రీ స్పెషల్ బీట్, చంద్రబోస్ పవర్ ఫుల్ లిరిక్స్ కలిస్తే.. ‘దాక్కో దాక్కో మేక’పాట. ఈ ప్రపంచంలో ప్రతి జీవి బతకడం కోసం మరో జీవిని చంపక తప్పదు అనే అర్థం చెప్పేలా అద్భుత లిరిక్స్ అందించాడు చంద్రబోస్. ఈ సాంగ్ అప్పుడే యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తుంది. విడుదలైన 182 నిమిషాల్లోనే 4 లక్షల లైకులను సొంతం చేసుకొని రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు 39లక్షలకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. ఈ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. -
యువగాయని పాటకు కేటీఆర్ ఫిదా.. చాన్స్ ఇచ్చిన దేవీశ్రీ
పల్లెటూరికి చెందిన ఆ గాయని పాడిన పాటకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఆమె గాత్రం సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్, తమన్‌లను మంత్రముగ్ధులను చేసింది. తాము భవిష్యత్‌లో నిర్వహించే షోలలో ఆమెకు అవకాశం ఇస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే అమ్మాయి అధ్భుత గాయని. తన పాటకు ఫిదా అయినా సరేంద్ర తిప్పరాజు అనే నెటిజన్.. ఆ వీడియోని ట్విటర్ వేదికగా కేటీఆర్‌కు షేర్ చేశాడు. ‘మెదక్ జిల్లాలోని నారైంగి గ్రామంలో ఓ ఆణిముత్యం దొరికింది. శ్రావణి అనే అమ్మాయి బ్రిలియంట్ సింగర్. ఆ గాయని స్వరం మైమరిపించేలా ఉంది. ఆమె ట్యాలెంట్‌కు మీ సహకారంతో పాటు మీ ఆశీస్సులు అవసరం’అంటూ ట్వీట్ చేశారు. అలాగే శ్రావణి పాడిన ‘రేలా రే రేలా రే’అనే పాటను ట్వీటర్లో షేర్ చేశాడు. ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ.. శ్రావణిలో అద్భుతమైన ట్యాలెంట్ ఉందంటూ కేటీఆర్ ప్రశంసించారు. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్లు తమన్, దేవీ శ్రీప్రసాద్కు కేటీఆర్ ట్యాగ్ చేశారు. దీనిపై తమన్ స్పందిస్తూ.. శ్రావణి అద్భుతమైన సింగర్ అని మెచ్చుకున్నాడు. ఇక డీఎస్పీ ఆమె స్వరానికి ఫిదా అయ్యానని చెప్పాడు. ఇంతటి ప్రతిభావంతురాలిని తమ దృష్టికి తీసుకొచ్చిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. తాము భవిష్యత్‌లో నిర్వహించే షోలలో శ్రావణికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని దేవీ శ్రీప్రసాద్ ట్వీట్లో పేర్కొన్నారు. చదవండి: రష్మిక కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తూ 900 కి.మీ ప్రయాణం -
హల్చల్ : నాన్నే నా హీరో అంటున్న మహేశ్.. డీఎస్పీ ఎమోషనల్
View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) Very Few know that my FATHER’s passion was Photography/Cinematography🎥 Tho he was a Writer/Director🖊 He is d Reason 4 d Photography Passion in me..He taught me😁 Lov U Daddy..4 painting our LIVES with Beautiful COLOURS❤️🎶🤗#HappyFathersDay2021 ❤️@sagar_singer pic.twitter.com/OSN4CSc0q5 — DEVI SRI PRASAD (@ThisIsDSP) June 20, 2021 View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by MONNALLISA (@aslimonalisa) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) View this post on Instagram A post shared by Mannara❤️ (@memannara) And we grew up, with the help of ever growing love and care. Happy #FathersDay Nanna ❤️ Best of the best 🤗 pic.twitter.com/X6RrY5CU8r — Sudheer Babu (@isudheerbabu) June 20, 2021 -
ఆకాశంలో శివుడు.. వస్తున్నాడు: ఫొటో తీసిన డీఎస్పీ
కరోనా ఇప్పుడప్పుడే పోయేలా లేదు. ఇప్పటికే ఎంతోమందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి నానాటికీ విజృంభిస్తోందే తప్ప తగ్గడం లేదు. ఈ మాయదారి రోగం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీని పీడ ఎప్పుడు విరగడువుతుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చేసిన ట్వీట్ ఒకటి వైరల్‌గా మారింది. "ఆకాశంలో శివుడు కనిపిస్తున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో నుంచి మనల్ని గట్టెక్కించేందుకు తరలి వస్తున్నాడు" అంటూ తన కెమెరాల్లో బంధించిన ఫొటోను షేర్ చేశాడు. దీనికి ఈశ్వరా.. పరమేశ్వరా అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు. ఈ ఫొటోను చూసిన జనాలు అబ్బురపడిపోతున్నారు. గరళాన్నే కంఠంలో దాచుకున్న ఆ పరమశివుడికి కరోనాను అంతం చేయడం పెద్ద కష్టం కాదని, ఆయన త్వరగా ఆ వ్యాధిని అంతం చేసి అందరినీ కాపాడతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం దేవుడిని పిలవగానే ప్రత్యక్షమైపోవడానికి ఇది సినిమా కాదు అంటూ వ్యంగ్యంగా సమాధానాలిస్తున్నారు. మొత్తానికి డీఎస్పీ తీసిన ఫొటో మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. SHIVA in the SKY.. on the way to save this WORLD frm the PANDEMIC !! 🙏🏻❤️#EeshwaraParameshwara 🎶❤️🙏🏻 pic.twitter.com/C5vkcKkUPr — DEVI SRI PRASAD (@ThisIsDSP) May 16, 2021 చదవండి: 2021ని ఇరగదీయాలని డిసైడ్ అయ్యాను: డీఎస్పీ -
హీరోయిన్ కీర్తి వల్ల బతుకు బస్టాండ్ అయ్యింది : నితిన్
నితిన్- కీర్తి సురేష్‌లు జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్లో టామ్ అండ్ జెర్రీల్లా కొట్టుకున్న వీరిద్దరూ రియల్లైఫ్లోనూ తెగ హంగామా చేసేస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో ఇది స్ఫష్టంగా కనిపిస్తుంది. రంగ్ దే షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీళ్లిద్దరి అల్లరికి హద్దు లేకుండా పోయింది.షూటింగ్ గ్యాప్‌లో చిన్న కునుకు తీస్తే దాన్ని ఫొటో తీసి రచ్చ చేశారు దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో నితిన్. దీంతో వీళ్ల మీద కక్ష కట్టిన కీర్తి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసింది. అన్నట్లుగానే వెంకీని పరిగెత్తించి మరీ సరదాగా కొట్టింది. ఇక నితిన్ ఫొటోను ఎడిట్ చేసి ఆడుకుంది. ఇటీవలె అను కనిపించడం లేదంటూ హీరోయిన్ కీర్తి రెండు జడలు వేసుకున్న చిన్నప్పటి ఫొటోను షేర్ చేసి ఆమెను ఆటపట్టించారు నితిన్. తాజాగా కీర్తి సురేష్ వల్ల తమ బతుకు బస్టాండ్ అయ్యిందంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఓ ఈవెంట్ అనంతరం రకరకాల ఫుడ్ ఐటెమ్స్ తిందామని రెడీగా పెట్టుకున్న తమకు కీర్తి షాకిచ్చిందని, మేం తినే తిండి మొత్తం కీర్తి ఒక్కతే తింటుందంటూ బాధను నెటిజన్లతో పంచుకున్నాడు. అంతేకాకుండా నితిన్‌కి సపోర్ట్‌గా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా చేరి అహా నా పెళ్ళంట సినిమాలోని వివాహ భోజనంబు అనే పాట పాడుతూ కీర్తిని ఆట పట్టించారు. అయితే ఇవేమీ పట్టించుకోని కీర్తి...హ్యాపీగా తనకు ప్లేట్లోని ఐటెమ్స్‌ను తింటూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా నితిన్- కీర్తి చేస్తున్న అల్లరి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. మొదటిసారి వీరిద్దరూ జోడిగా కలిసి నటించిన రంగ్‌దే చిత్రం మార్చి 26న రిలీజ్ అవుతోంది. All Our DINNER being eaten by One Person.. ANU.. 🙈🙈🙈 BusStande BusStande Ika Bathuke BusStande.. 😂🤣😂🤣@actor_nithiin @KeerthyOfficial @dirvenky_atluri @vamsi84 @SitharaEnts @ShreeLyricist @pcsreeram @haarikahassine pic.twitter.com/KeiPEPh8N1 — DEVI SRI PRASAD (@ThisIsDSP) March 24, 2021 చదవండి : కీర్తి సురేశ్ మిస్సింగ్: నితిన్ ఫిర్యాదుకు పోలీసుల రిప్లై! హీరో ఊరించాడు.. కంట్రోల్ చేసుకోలేకపోయిన నటి -
బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్న దేవీశ్రీ
దేవీ శ్రీ ప్రసాద్...పరిచయం అక్కర్లేని పేరు. రాక్‌స్టార్‌గా పాపులర్ అయిన దేవీ.. తాజాగా ఈ ఏడాది విడుదలైన ఉప్పెనతో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేని దేవీకి ఉప్పెన మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా విడుదలకు ముందే ఉప్పెన పాటలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఉప్పెన అందించిన విజయంతో ఇప్పుడు టెలివిజన్‌లోనూ సందడి చేసేందుకు రెడీ అయ్యాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్తో స్టేజ్ షోలలో దుమ్ము రేపే దేవీ..ఇప్పుడు బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. 'రాక్ స్టార్' పేరుతో రానున్న సరికొత్త టీవీ షోకు దేవీ శ్రీ సారథ్యం వహించనున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోను 'జీ తమిళ్' ఛానెల్ విడుదల చేసింది. త్వరలోనే బుల్లితెరపై ఈ షో ప్రసారం కానుంది. దేవీ అందించే ఎనర్జీతో షో సూపర్‌హిట్ కావడం ఖాయమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి : (అందుకే దేవిశ్రీని రాక్‌స్టార్ అనేది!) (‘జాతి రత్నాలు’ టీమ్‌కి భారీ షాక్, తొలి రోజే ఇలా...) | Idhu Vera level Musical Phenomena... மாபெரும் இசை மேடையில் பல entertainment on the way 🎙️🎹🥁🎼. "Rockstar"⭐ 🌟✨விரைவில்! @ThisIsDSP#Rockstar #ComingSoon #ZeeTamil காணுங்கள், எப்போதும், எங்கேயும் Zee5ல! https://t.co/pL2W5lKqKN pic.twitter.com/H7qBAzuaBJ — Zee Tamil (@ZeeTamil) March 12, 2021 -
గుడ్‌లక్ సఖి.. టీజర్ వచ్చేసింది
మహానటి ఫేం కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న గుడ్‌లక్ సఖీ అఫీషియల్ టీజర్ వచ్చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్రబృందం శనివారం టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. 'హైదరాబాద్ బ్లూస్, డోర్, ఇక్బాల్ సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా జాతీయస్థాయిలో గుర్తింపును తెచ్చుకున్న నగేష్ కుకునూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రమాప్రభ, రాహుల్ రామకృష్ణ, తదితరులు నటిస్తున్నారు. కీర్తి సురేశ్ అచ్చమైన పల్లెటూరి పిల్లగా కనిపిస్తూ టీజర్లో ఆకట్టుకుంటుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి.. దేశం గర్వించే షూటర్‌గా ఎలా తయారైందన్న అంశంతో చిత్రం రూపుదిద్దుకుంది. కీర్తిని జాతీయ షూటర్‌గా తయారు చేసే కోచ్‌గా జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. టీజర్లో కీర్తి సురేశ్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్‌రాజు సమర్పణలో వార్త్ షాట్ మోషన్ ఆర్ట్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న గుడ్‌లక్ సఖీ చిత్రానికి సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
జయహో బాపూ
చిత్రం: శంకర్‌దాదా జిందాబాద్ రచన: సుద్దాల అశోక్ తేజ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: దేవిశ్రీ ప్రసాద్, సాగర్ జెమినీ కిరణ్‌గారు నన్ను పిలిపించి ‘శంకర్‌దాదా జిందాబాద్’లో గాంధీ పైన పాట రాయమన్నారు. సరేనని చెప్పి ఇంటికి వచ్చి, నా ఆఫీసులో కూర్చుని గాంధీ గురించి విన్నది, చదివింది గుర్తు చేసుకుంటున్నాను. అనేక తరంగాలు ఆయన జీవన మహాసముద్రంలో లేచి పడుతున్నాయి. గాంధీ మద్రాసు వచ్చినప్పుడు రాజాజీ ఒక ప్రఖ్యాత సాముద్రికవేత్తకు గాంధీ చేయి చూపించి భవిష్యత్తు తెలుసుకుందామని చెబితే, గాంధీ సున్నితంగా తిరస్కరించి, ‘మై క్యారెక్టర్ ఈజ్ మై ఫేట్’ అన్నాడట.ఆయన ఆత్మకథ ఎన్నోసార్లు చదివిన నాకు ఎప్పుడూ గాంధీ పలికిన సహస్రానేక సుభాషితాల్లో పైమాటే నిరంతరం మంత్రంలా మోగుతుంటుంది.ఆయన జీవితాకాశాన్ని ఒక పల్లవి – రెండు చరణాల్లో చెప్పడమంటే కమండలంలో సముద్రాన్ని వడబోయడం కదా అనుకున్నాను. పెన్ను ఎత్తకుండా ఒకే రేఖా చిత్రంలో గాంధీని దించి సినీ నటులు గుమ్మడిగారికి ఇచ్చిన బాపు ‘గాంధీ’ చిత్రం మనసులో మెదలగానే పల్లవి పల్లవించింది.గాంధీ ఎంత నిరాడంబరుడో... పల్లవి అంతే నిరాడంబరంగా మొదలవ్వాలని ‘కళ్లజోడుతో – చేతికర్రతో కదిలిందో సత్యాగ్రహం’ అనే వాక్యం కాగితంపై సాక్షాత్కరించింది. ‘జయహో బాపూ’ అనుకున్నాను. ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే ‘‘వెండి కొండలా శిరసు పండిన యువకుల మించిన సాహసం’’ అనే వాక్యం రాలేదు. నేను రాసిన రెండో వాక్యం... ‘‘అతడంటె గడగడలాడింది ఆంగ్లేయుల సింహాసనం’’.అయితే పాట పూర్తయ్యాక నాకు సంబంధం లేకుండా జరిగిన మార్పు ‘వెండి కొండలా’ వాక్యం రెండో వాక్యమైంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చేసిన మార్పని తెలిసి, ‘ఓహో’ అనుకుని సమన్వయం చెడనందుకు సంతోషించాను. కళ్లజోడు – చేతికర్ర... అంటూ ఆయన వాడిన పరికరాలను పల్లవికి ఆధారంగా తీసుకున్న నేను తరవాత ఆయన ఆకారాన్ని కూడా చరణించుదామనుకుని ‘బక్క పలచని బాపు గుండెలో ఆసేతు హిమాచలం’ అని రాసి వెంటనే అతని ‘ఉక్కు నరాల్లో ఉప్పొంగే రక్తం స్వాతంత్య్ర రక్త గంగాజలం’ అన్నాను. స్వాతంత్రేచ్ఛతో ఉప్పొంగే రక్తం పవిత్ర గంగాజలం అనుకున్నాను. ఆయన పోరాటం సాయుధం కాదు, అహింసాయుధం కనుక ‘‘చాకు – పిస్టల్ – కొడవలి – గొడ్డలి ఎందుకు హింసా సాయుధం’’ గా కొనసాగింది. ‘‘భయం చెందని రక్తం చిందని స్వాతంత్య్రోద్యమ జ్వాలలు/ గాలి తరంగాలై వీచినవి దేశంలో నలుమూలలుగా’’ అని ముగించాను.దేశంలో వర్తమానంలో జరిగే ఘోరాలను ఆపడానికి ‘వందే మాతరం గాంధీ ఓంకారం/ఓ బాపూ నువ్వే రావాలి నీ సాయం మళ్లీ కావాలి/జరిగే దుర్మార్గం ఆపాలి నువ్వే ఓ మార్గం చూపాలి/కళ్ల జోడుతో చేతి కర్రతో కదిలే ఓ సత్యాగ్రహమా’ వాక్యాలు తర్వాత పల్లవిగా తలకెక్కాయి. ముందనుకున్న పల్లవి వాక్యాలు చరణాలు అయ్యాయి. ప్రతి అక్టోబర్ 2న టీవీలలో పాఠశాలల్లో జీవనదులై ప్రవహిస్తున్నాయి. – ఇంటర్వ్యూ: వైజయంతి పురాణపండ -
‘హలో గురు ప్రేమకోసమే’ ఫస్ట్ లుక్
‘ఉన్నది ఒకటే జిందగీ’తో సక్సెస్ సాధించారు రామ్. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ వంటి హిట్ మూవీస్ తీశారు డైరెక్టర్ త్రినాథ్‌రావు నక్కిన. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో మరో లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ తెరకెక్కుతోంది. ఒకప్పటి హిట్ సాంగ్ హలో గురు ప్రేమ కోసమోరా జీవితం...అంటూ సాగే ఆ పాటనే సినిమా టైటిల్‌గా ఎంచుకున్నారు. త్రినాథ్‌రావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘హలో గురు ప్రేమకోసమే’ ఫస్ట్ లుక్‌ను ఈరోజు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో రామ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. -
భరత్ బహిరంగ సభ ప్రీరిలీజ్ హైలైట్స్
-
జీవితాంతంరుణపడి ఉంటాం
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం): ‘‘యూనివర్సిటీలో అడుగుపెట్టిన వెంటనే ఇది నా కుటుంబం అనే భావన కలిగింది. ఇక్కడి వాతావరణ, విద్యార్థులు, భవనాలు అన్నీ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం మనం మొదటిగా నేర్చుకోవలసిన విషయం, అది ఇక్కడ విద్యార్థుల్లో కనిపించడం ఎంతో ఆనందం వేస్తోంది. మా తండ్రి సత్యమూర్తికి ఇంతటి ప్రాధాన్యం ఇచ్చిన యూనివర్సిటీకి తాము జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అన్నారు. ప్రముఖ సినీగేయ రచయిత డాక్టర్ వెనిగెళ్ల రాంబాబు ఆదికవి నన్నయ యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా రచించిన యూనివర్సిటీ గీతాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. అలాగే తన తండ్రి సత్యమూర్తి పేరుతో ఏర్పాటు చేసిన యోగ విజ్ఞాన కేంద్రాన్ని తల్లి శిరోమణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడికి ఒక ఫంక్షన్‌కి గెస్ట్‌గా వచ్చినట్టుగా లేదని, మా ఫ్యామీలీ ఫంక్షన్‌గా ఉందన్నారు. తన తండ్రి పుట్టినూరు వెదురుపాకైతే, తన తల్లి పుట్టింది అమలాపురమన్నారు. అందువల్లే అ.. అంటే అమలాపురం పాట చేశానన్నారు. అమ్మమ్మ పేరు దేవీమీనాక్షి, తాత పేరు ప్రసాద్‌లను శ్రీతో కలిపి తనకు దేవిశ్రీ ప్రసాద్‌గా పెట్టారన్నారు. పాటలతో జోష్ నింపుతూ.. విశ్వమే ఒక విద్యాలయం అంటారు. కానీ ఈ విద్యాలయమే ఒక విశ్వంగా కనిపిస్తుందన్నారు. ‘ఎర్రచొక్కానే నీ కోసం వేశాను, సర్‌మంటూ ఫారిన్ సెంటు కొట్టాను, గళ్ల లుంగీతో నీ కోసం వచ్చాను. అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు అని పాడుతూ విద్యార్థులతో ఈలలు వేయించారు. యోగ సాధనలో నిష్టాతులుగా పేరొందిన తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన యోగా కేంద్రాన్ని ప్రస్తావిస్తూ వన్, టూ, త్రీ, ఫోర్ చెయ్యి యోగా.. ఒంటికి యోగా మంచిదేగా అంటూ పాడి గ్యాలరీలో కేరింతలు కొట్టించారు. రంగా రంగా..రంగస్థలాన ఓ.. అంటూ రానున్న రంగస్థలం సినిమాలో పాటను పాడి వినిపించారు. వీడి పేరు గబ్బర్‌సింగ్., ఏ పిల్లా నీవులేని జీవితం., పాటలు పాడుతూ హుషారెత్తించారు. అలాగే ఆయన సోదరుడు, సినీ సంగీత దర్శకుడు సాగర్ విద్యార్థుల కోరిక మేరకు పాట పాడుతూ ‘తీసేద్దాం.. తీసేద్దాం ఎగ్జామ్ తాట తీసేద్దాం.. తెచ్చేద్దాం తెచ్చేద్దాం ఫస్ట్ మార్కు తెచ్చేద్దాం’ అంటూ వారిలో జోష్ పుట్టించారు. చదువు, ఉత్తీర్ణత లక్ష్యాలను గుర్తు చేశారు. మనస్సు పెట్టి చేస్తే ఏదైనా హిట్టే.. ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు మాట్లాడుతూ మనస్సు పెట్టి చేస్తే ఏదైనా సూపర్ హిట్ అవుతుందనడానికి దేవీశ్రీప్రసాదే ఉదాహరణ అని వీసీ పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆయన సంగీతం అందించిన అనేక సినిమాలు విజయవంతమయ్యాయన్నారు. యూనివర్సిటీ కోసం గీతాన్ని రచించిన డాక్టర్ వెనిగెళ్ల రాంబాబు, ఆలపించిన డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఆవిష్కరించిన దేవిశ్రీప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తరాలు మారిన తరగని ఆస్తి సాహిత్యమేనని గీత రచయిత డాక్టర్ వెనిగెళ్ల రాంబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవిశ్రీప్రసాద్‌తోపాటు ఆయన తల్లి శిరోమణి, సోదరుడు సాగర్, చెల్లెలు పద్మినిప్రియదర్శిని, బావ రాంబాబు, యూనివర్సిటీ అధికారులు డాక్టర్ ఎస్.టేకి, డాక్టర్ పి.సురేష్‌వర్మ, డాక్టర్ కేఎస్ రమేష్, డాక్టర్ కె.సుబ్బారావు, డాక్టర్ ఎ.మట్టారెడ్డి, డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ టి.హైమవతి, డాక్టర్ పి.పెర్సిస్ పాల్గొన్నారు. -
అదో మధురమైన అనుభూతి
తమిళసినిమా: దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఉంటే ఆ చిత్రం సక్సెసే అన్నంత స్థాయికి ఎదిగారాయన. ఆయన ప్రస్తుతం విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సామి స్కేయర్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్న దేవీశ్రీప్రసాద్‌ను కారణం ఏమిటని ప్రశ్నించగా మరింత ఆనందంతో చెప్ప డం మొదలెట్టారు. అదేమిటో ఆయన మాటల్లోనే.. ఈ మ ధ్య దక్షిణ భారత నటినటుల సంఘం మలేషియాలో స్టార్స్ క్రికెట్‌తో పాటు పలు సినీ వినోద కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో నేనూ పా ల్గొన్నాను. చివరి కార్యక్రమంలో నేను ఆడి పాడాను. ఆ వేదిక ముందు వరుసలో సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్ కూర్చుని నా ఆట, పాటను తిలకించి, చివర్లో లేచి నిలబడి చప్పట్లతో అభినందించడం మరచిపోలేని అనుభూతి. ఇద్దరు లెజెండ్స్ ఒకేసారి ప్రశంసించడం అరుదైన విషయం కాగా, వారి మధ్య నన్ను కూర్చోబెట్టుకోవడం, అలా ఫోటో తీయిచుకోవడం జీవితంలో మరపురాని అనుభూతి. గతేడాది 8 చిత్రాలు: 2017 నాకు మరచిపోలేని సంవత్సరం. తెలుగులో ఖైదీ నంబర్–150, నేను లోకల్, రారండోయ్ వేడుక చూద్దాం, దువ్వాడ జగన్నాథమ్, జయజానకి నాయక, జైలవకుశ, ఉన్నది ఒక్కటే జిందగీ, మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రాలకు సంగీతం అందించడం ఒక ఎత్తైతే ఆ చిత్రాల్లో పాటలన్నీ హిట్ కావడం మరో ఎత్తు. దీనిపై మీడియా అభినందించడం సంతోషంగా ఉంది అని దేవీశ్రీప్రసాద్ పేర్కొన్నారు. చిత్రం విడుదలకు ముందు వరుసగా ఆ చిత్రంలోని పాటలను వారానికొక్క సింగిల్ ట్రాక్‌ను విడుదల చేయడం ఖైదీనంబర్–150 తో మొదలైంది. ఇప్పుడు అదే ట్రెండ్‌ను అందరూ ఫాలో అవుతున్నారు. అదే విధంగా లిరిక్ వీడియోలో సాంకేతిక వర్గం, సంగీత కళాకారుల ఫొటోలను, కాన్సెప్ట్‌ను, గ్రాఫిక్స్‌తో కలిపి విడుదల చేయడం అన్న ట్రెండ్‌ను శ్రీకారం చుట్టింది డీఎస్పీనే. ప్రస్తుతం ఆయన సంగీతం అందిస్తున్న సామి–2 చిత్రంలో పాటలన్నీ సూపర్‌గా వచ్చాయని, అందుకు కారణం దేవీశ్రీప్రసాద్ అంకితభావం, శ్రమేనని చిత్ర యూనిట్ అభినందిస్తున్నారు. -
త్రివిక్రమ్ సినిమా నుంచి అనిరుధ్ ఔట్
సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం నితిన్ హీరోగా అ.. ఆ.. సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.., ప్రస్తుతం మార్చి లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సమయంలో త్రివిక్రమ్‌కు అనుకోని షాక్ తగిలింది. చాలా రోజులుగా త్రివిక్రమ్ సినిమాలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు. అయితే అ.. ఆ.. సినిమాకు తమిళ యువ సంచలనం అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు ఈ యువ సంగీత దర్శకుడు త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పుకున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం ఇప్పుడు హడావిడిగా మరో సంగీత దర్శకుడి కోసం వేట ప్రారంభించాడు త్రివిక్రమ్. దేవీ శ్రీ ప్రసాద్‌తో పాటు, మిక్కీ జే మేయర్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్న త్రివిక్రమ్, త్వరలోనే కొత్త సంగీత దర్శకుణ్ని ప్రకటించనున్నాడు.