
మహానటి ఫేం కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న గుడ్‌లక్ సఖీ అఫీషియల్ టీజర్ వచ్చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్రబృందం శనివారం టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. 'హైదరాబాద్ బ్లూస్, డోర్, ఇక్బాల్ సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా జాతీయస్థాయిలో గుర్తింపును తెచ్చుకున్న నగేష్ కుకునూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రమాప్రభ, రాహుల్ రామకృష్ణ, తదితరులు నటిస్తున్నారు.
కీర్తి సురేశ్ అచ్చమైన పల్లెటూరి పిల్లగా కనిపిస్తూ టీజర్‌లో ఆకట్టుకుంటుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి.. దేశం గర్వించే షూటర్‌గా ఎలా తయారైందన్న అంశంతో చిత్రం రూపుదిద్దుకుంది. కీర్తిని జాతీయ షూటర్‌గా తయారు చేసే కోచ్‌గా జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. టీజర్‌లో కీర్తి సురేశ్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్‌రాజు సమర్పణలో వార్త్ షాట్ మోషన్ ఆర్ట్ ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న గుడ్‌లక్ సఖీ చిత్రానికి సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment