
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌పై హరీశ్ శంకర్ ప్రశంసల వర్షం కురిపించారు. మీ సంగీతమే కాదు మీ సంస్కారం గురించి కూడా అందరూ మాట్లాడుకునే చేశావంటూ పొగడ్తలతో మంచేశాడు. దేవిని హరీశ్ అంతలా ప్రశంసించడానికి గల కారణం ఏంటంటే..
దేవి( Devi Sri Prasad) తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన రోజే కొన్ని నియమాలు పెట్టుకున్నానని, వాటిని ఇంతవరకు బ్రేక్ చేయలేదని చెప్పాడు. తన కెరీర్‌లో ఎప్పుడూ ఓ పాటను రీమేక్ చేయడం కానీ, కాపీ కొట్టడం కానీ చేయొద్దని ఫిక్సయ్యాడట. అయితే రీమేక్ సాంగ్ ఉందని చాలా సినిమాలే వదుకున్నాడట డీఎస్పీ.
‘హరీశ్ శంకర్(Harish Shankar) దర్శకత్వం వహించిన గద్దలకొండ గణేష్ సినిమాకి నేనే సంగీతం అందించాలి. హరీశ్ మొదట ఈ స్క్రిప్ట్ నాకే చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కానీ చివర్లో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ. ఎల్లకిల్లా పడ్డాదమ్మో’ రీమేక్ సాంగ్ ఉంటుందని చెప్పాడు. నేను రీమేక్ చేయనని హరీశ్‌కు తెలుసు. కానీ మా నాన్న సత్యమూర్తి మొదటి సినిమా ‘దేవత’లోని పాట కాబట్టి చేస్తానేమోనని హరీశ్ భావించాడు. కానీ నేను నా రూల్స్‌ని బ్రేక్ చేయలేనని చెప్పాను. చివరకు ఆ పాటను తీసేస్తానని చెప్పాడు. కానీ నా కోసం స్క్రిప్ట్‌లో మార్పులు చేయొద్దని చెప్పి.. ఆ సినిమాకు నో చెప్పాను.
అయితే ఓ ప్రెస్‌మీట్‌లో ‘గద్దలకొండ గణేశ్’కి మొదట దేవిశ్రీని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకుంటానని చెప్పారు కదా..ఎందుకు మార్చారు?’ అని మీడియా అడిగితే.. జరిగిందంతా చెప్పి..‘ఆయన రీమేక్ సాంగ్స్ చేయడు కాబట్టి మార్చాం’అని చెప్పారు. వాస్తవానికి హరీశ్ అక్కడ సింపుల్‌గా ‘కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదు’అని చెప్పొచ్చు. అప్పుడు నాపై ఏవోవో వార్తలు రాసుకునేవాళ్లు. హరీశ్ అలా చెప్పి నా దృష్టిలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఇకపై ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటానని అప్పుడే చెప్పా’ అని దేవి చెప్పుకొచ్చాడు.
దీనికి సంబంధించిన వీడియోని హరీశ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘గుర్తింపు కోసం ఏదైనా మాట్లాడే ఈ రోజుల్లో …గుర్తు పెట్టుకుని మరీ మీరు ఇలా మాట్లాడ్డం కేవలం మీ గొప్పదనం .మీ సంగీతం గురించే కాకుండా మీ సంస్కారం గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా చేసారు’అని రాసుకొచ్చాడు.
ఇక ‘గద్దలకొండ గణేష్’ విషయానికొస్తే..తమిళంలో హిట్టయిన ‘జిగార్తండ’ తెలుగు రీమేక్‌గా హరీశ్ తెరకెక్కించాడు. వరుణ్ తేజ హీరోగా నటించగా, మిక్కీజే మేయర్ సంగీతం అందించాడు. 2019లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment