Gaddalakonda Ganesh
-
అమలా పాల్ ఒక చెత్త హీరోయిన్ అంటూ అథర్వ కామెంట్
అథర్వ మురళీ తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన యంగ్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రముఖ తమిళ హీరో మురళి కుమారుడే అథర్వ అనే సంగతి తెలిసందే. 2010లో 'బాణకాతాడి' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2013లో కోలీవుడ్‌లో విడుదలైన 'పరదేశి'కి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆపై 2019లో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గద్దలకొండ గణేష్' సినిమాతో తెలుగు సినీరంగంలోకి అథర్వ ప్రవేశించాడు. తాజాగ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో కొత్త వెబ్ సిరీస్ 'మధకం' స్ట్రీమింగ్ ప్రమోషన్‌కు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో అథర్వ మాట్లాడుతూ, తనతో నటించిన హీరోయిన్లలలో అమలా పాల్ చెత్త హీరోయిన్ అని ఇలా చెప్పాడు. (ఇదీ చదవండి: రీ- రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్..?) 'నా రెండో సినిమా 'ముహుదుముత్ ఉన్ కర్పనై'లో మేమిద్దరం కలిసి నటించాం. షూటింగ్ ప్రారంభం అయ్యాక మొదటి పది రోజుల్లో తనతో ఒక చిన్న వివాదం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ఇద్దరి మధ్య ఈ గొడవ మళ్లీ సెట్ అయింది. కానీ ఆమె ఒక చెత్త హీరోయిన్ అనే విషయాన్ని నేరుగా అమలా పాల్కే చెప్పాను' అని అథర్వ తెలిపాడు. దీంతో ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి. -
ఎన్నో అవార్డులు తెచ్చిన జిగర్తాండ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే
తమిళంలో సూపర్ హిట్ సాధించిన జిగర్తాండ సినిమాను ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తమిళ హీరో సిద్ధార్థ్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించగా.. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపించడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇదే సినిమాను తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేశ్ పేరుతో తెరకెక్కింది. హరీశ్ శంకర్ దీనిని రీమెక్ చేయగా.. టాలీవుడ్లో కూడా మంచి విజయాన్ని సాధించింది. (ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి) తాజాగా దీనికి సిక్వెల్ రెడీ చేశారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. సుమారు 8 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా జిగర్తాండ డబుల్ ఎక్స్ రూపొందుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తూ తన స్టోన్ బెంచ్ ఫిలింస్‌పై అలంకార్ పాండియన్‌కు చెందిన ఇన్వలియో ఆరిజిన్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి కార్తికేయన్ సంతానం సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, తిరు చాయాగ్రహణ అందిస్తున్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. (ఇదీ చదవండి:విజయ్ను డైరెక్ట్ చేసే లాస్ట్ ఛాన్స్ ఆ దర్శకుడికే..) ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్రం సంతృప్తికరమైన అనుభవాన్ని కలిగించిందని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు. చిత్రాన్ని పలు ప్రాంతాల్లో భారీ వ్యయంతో రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాన్ని దీపావళికి థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగులో కూడా ఈ సినిమా రానుంది. -
రిస్క్‌గా మారిన రీమేక్స్.. అసలు ప్రాబ్లమ్ అదే!
టాలీవుడ్ అంటేనే రీమేక్స్ అడ్డా. వేరే ఇండస్ట్రీస్‌లో సూపర్ హిట్టైన సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తుంటారు. ప్రస్తుతం చిరు మాలీవుడ్ బ్లాక్ బస్టర్ లూసీఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నాడు. అలాగే వేదాళం చిత్రాన్ని భోళాశంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. అయితే రాను రాను రీమేక్స్‌లో నటించడం మన హీరోలకు పెద్ద రిస్క్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా అదే క్యారెక్టర్ని మాటిమాటికి రిపీట్ చేయాల్సి రావడమే అసలు ప్రాబ్లమ్‌గా మారనుంది. ఇండియా వైడ్‌గా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో ఇప్పుడు హిట్టైన సినిమాలకు సీక్వెల్స్ తీయడం ఆనవాయితీగా మారుతోంది. చిరు నటించే గాడ్ ఫాదర్ ఓరిజినల్ వర్షన్ లూసీఫర్ కు త్వరలోనే సీక్వెల్ తెరకెక్కిస్తాంటున్నాడు దర్శకుడు దర్శకుడు ప్రముఖ హీరో పృథ్వీరాజ్. అదే జరిగితే చిరు మరోసారి గాడ్ ఫాదర్ గా మారాల్సి వస్తోంది.గతంలో మున్నాభాయ్ సిరీస్‌ను రీమేక్స్ చేసిన చిరు, రెండు సార్లు శంకర్ దాదాగా మారాడు. (చదవండి: ఒక్క ట్వీట్‌తో ఫ్యాన్స్‌కి షాకిచ్చిన రానా) వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు గద్దలకొండ గణేష్ గా మారాల్సిన సమయం ఆసన్నమైంది.ఎందుకంటే గద్దలకొండ గణేష్ ఓరిజినల్ వర్షన్ జిగర్తాండ కు సీక్వెల్ అనౌన్స్ చేసాడు తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు. జిగర్తాండ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాండ్ గా మాస్ గా సీక్వెల్ వీడియో రిలీజ్ చేశాడు. సో త్వరలోనే వరుణ్ కూడా ఇప్పుడు గద్దలకొండ గణేష్ స్టోరీని కంటిన్యూ చేయాలంటే రీమేక్ చేయకతప్పదు. ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. ఇప్పటికే దృశ్యం, దృశ్యం2 చిత్రాల్లో కనిపించాడు వెంకటేశ్. త్వరలోనే దృశ్యం 3 తీస్తానంటున్నాడు జీతుజోసెఫ్. సో వెంకీ మళ్లీ దృశ్యం 3 చేయాల్సి ఉంటుంది. కన్నడ బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీని తెలుగులో కిరాక్ పార్టీ పేరుతో రీమేక్ చేశాడు నిఖిల్. ఇప్పుడు ఈ సినిమకు సీక్వెల్ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిఖిల్ కూడా కిరాక్ట్ పార్టీ2తో తిరిగొస్తాడా అనేది చూడాల్సి ఉంది. -
అక్షయ్‌కుమార్ 'బచ్చన్ పాండే' ట్రైలర్ చూశారా?
Bachchhan Paanday Trailer Out: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బచ్చన్ పాండే'. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన తమిళ హిట్ 'జిగర్తాండ'కు హిందీ రీమేక్ ఈ చిత్రం. దీని ఆధారంగానే తెలుగులో గద్దల కొండ గణేష్ వచ్చిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే స్టోరీ లైన్‌తో హిందీలోనూ బచ్చన్ పాండేగా ఈ సినిమా తెరకెక్కుతుంది.వచ్చే నెల18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అక్షయ్ కుమార్ ఒంటి కన్నుతో క్రూరంగా కనిపించారు. కృతి సనన్ అక్షయ్‌కి జోడీగా నటించింది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. -
నల్లగా ఉంది.. కలర్ తక్కువ అని చాలా మాటలు అన్నారు : హీరోయిన్
Khiladi Movie Actress dimple Hayathi Faced Rejection Of Her Skin Colour: గద్దలకొండ గణేష్ సినిమాలో 'జర్రా జర్రా'.. ఐటెం సాంగ్‌తో మెప్పించింది డింపుల్ హయతి. ఆ తర్వాత హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకోంటోంది. ప్రస్తుతం రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో నటిస్తుంది. దీంతో పాటు గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ అవకాశం సంపాదించుకుంది. అయితే కెరీర్ మొదట్లో పలు తిరస్కారాలు ఎదుర్కొన్నాని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. గద్దలకొండ గణేష్ చిత్రానికి ముందు చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. కానీ నల్లగా, రంగు తక్కువ ఉన్న కారణంగా ఎన్ని తిరస్కారాలు ఎదుర్కొన్నానో లెక్కేలేదు. ఫెయిర్ స్కిన్ ఉన్న అమ్మాయి కావాలనేవాళ్లు. అప్పుడు కొంచెం బాధగా అనిపించేది. తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో గద్దలకొండ గణేష్‌లో పాట చేశా. ఆ తర్వాత అన్నీ అలాంటి అవకాశాలే వచ్చాయి. దీంతో నటిగా నన్ను నేను నిరూపించుకునేందుకు కొన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నా. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూశా. ఆ సమయంలోనే ఖిలాడి ఆఫర్ వచ్చింది అని చెప్పుకొచ్చింది. -
మేకింగ్ ఆఫ్ మూవీ-గద్దలకొండ గణేష్
-
మేకింగ్ ఆఫ్ మూవీ- గద్దలకొండ గణేష్
-
మెగాస్టార్, సూపర్‌స్టార్ ప్రశంసలు
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ బేనర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన 'గద్దలకొండగణేష్' సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన ప్రతీ చోట కలెక్షన్లతో దుమ్ముదులుపుతోంది. ఈ రోజు(సెప్టెంబర్ 24) ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. వరుణ్ పెర్ఫార్మన్స్ చాలా బాగుందని, హరీష్ శంకర్ చాలా బాగా తీశాడు, డైలాగ్స్ చాలా బాగున్నాయని అన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మాతలు ఈ చిత్రాన్నితీశారని కొనియాడారు. సినిమాలో టీం స్పిరిట్ కనిపిస్తోందని ఆయన ప్రశంసిస్తూ ఈ అద్భుత విజయాన్ని సాధించిన టీం అందరికీ విజయాభినందనలు తెలిపారు. ‘గద్దలకొండ గణేష్’ చూస్తూ బాగా ఎంజాయ్ చేశానని. వరుణ్ తేజ్ గణేష్‌గా అద్భుతంగా నటించాడని సూపర్‌స్టార్ మహేష్ బాబు తెలిపాడు. హరీష్ శంకర్, 14 రీల్స్ సినిమాని చాలా బాగా తెరకెక్కించారని, అలాగే మంచి సక్సెస్ ను అందుకున్న చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్‌కి హీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు రామ్, గోపి థాంక్స్ చెప్పారు. -
వాల్మీకి.. టైటిల్లో ఏముంది?
పేరులో ఏముంది అని షేక్స్పియర్ అన్నాడు. కాని జనం ‘పేరులోనే ఉంది అంతా’ అంటున్నారు. ‘మా సెంటిమెంట్స్ హర్ట్ అవుతున్నాయ్’ అని హెచ్చరిస్తున్నారు. ‘వినోదం ఇవ్వండి.... కాని గమనించుకొని టైటిల్ పెట్టండి’ అని సలహా ఇస్తున్నారు. టైటిల్ దగ్గర పేచీ వస్తే సినిమా కష్టాల్లో పడుతుంది. సర్దుబాట్లు చేసుకుని అడ్డంకిని దాటాల్సి వస్తుంది. ‘వాల్మీకి’ టైటిల్ ‘గద్దలకొండ గణేష్’ అయ్యింది.కాని ఇలా జరగడం మొదలూ కాదు. బహుశా తుదీ కాబోదు. సినిమా అంతా ఏమిటో ఒక్క మాటలో చెప్పేదే ‘టైటిల్’. ప్రేక్షకుడు గోడ మీద ఉన్న పోస్టర్‌ను చూసి, ఆ పోస్టర్ మీద ఉన్న టైటిల్‌ను చూసి సినిమా మీద ఒక అంచనాకు వస్తాడు. ఆసక్తి పెంచుకుంటాడు. తాను ఇష్టపడే సినిమా అయితే మొదటి రోజు మొదటిఆట క్యూలో నిలబడతాడు. అందుకే టైటిల్స్ పెట్టే విషయంలో మొదటి నుంచి నిర్మాత, దర్శకులు శ్రద్ధ పెట్టేవారు. విజయవారి సినిమా టైటిల్స్ ఆ విషయంలో ముందుండేవి. ‘పాతాళ భైరవి’, ‘మాయాబజార్’, ‘మిస్సమ్మ’, ‘జగదేక వీరుని కథ’ ఇలాంటి టైటిల్స్‌తో వారు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులెత్తించేవారు. ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’, ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ వంటి పొడవు పేర్లు కూడా వారే పెట్టారు. అయితే అన్నీసార్లు సినిమావారి ఆలోచన ప్రేక్షకుల ఆలోచన ఒకేలా ఉండకపోవచ్చు. సినిమా వారు చేసిన ఆలోచనను సెన్సార్ వారు ఒప్పుకోకపోవచ్చు. దానివల్ల గతంలో చాలా టైటిల్స్ చివరి నిమిషంలో మారాయి. గొల్లభామ – భామా విజయం ఎన్.టి.ఆర్ హీరోగా సి.పుల్లయ్య దర్శకత్వంలో దేవిక హీరోయిన్గా ‘గొల్లభామ’ సినిమా మొదలైంది. పూర్తి కావచ్చింది. పేపర్లలో పబ్లిసిటీ కూడా వచ్చింది. అయితే అలా టైటిల్ ‘గొల్లభామ’ అని పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తమయ్యింది. ఎన్.టి.ఆర్ వంటి పెద్ద హీరో కూడా జనం నుంచి వచ్చిన అభ్యంతరాన్ని గౌరవించాల్సి వచ్చింది. ఆ సినిమా ‘గొల్లభామ’ నుంచి ‘భామా విజయం’గా మారింది. అయితే ఇది జరిగిన చాలా రోజులకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా వరుణ్ తేజ్‌తో తీసిన సినిమాకు మొదట ‘గొల్లభామ’ అనే టైటిలే పెట్టాలనుకున్నారు. కాని అప్పుడు వచ్చినట్టే ఇప్పుడూ వ్యతిరేకత రావడంతో దానిని ‘ముకుంద’గా మార్చారు. రాముడు – సీత ‘రామాయణం’తో ముడి పడ్డ టైటిల్స్ కొన్ని పాసయ్యాయి. కొన్ని ప్రశ్నను ఎదుర్కొన్నాయి. ‘రాముడే రావణుడైతే’ వంటి టైటిల్స్ పాస్ అయి పోయాయి. అయితే వి.ఎస్.ఆర్. స్వామి నిర్మాతగా జయసుధ హీరోయిన్గా తీసిన ‘కలియుగ సీత’ అనే టైటిల్ మాత్రం సెన్సార్ అభ్యంతరాన్ని ఎదుర్కొంది. కలియుగ సీత అనడంలో సీతకు అవమానం జరిగే ప్రమాదం ఉందంది. దాంతో నిర్మాత ఆ టైటిల్‌ను ‘కలియుగ స్త్రీ’ అని మార్చి రిలీజ్ చేయాల్సి వచ్చింది. అలాగే కృష్ణ డబుల్ యాక్షన్‌తో ‘రామరాజ్యంలో రక్తపాతం’ అని సినిమా సిద్ధమైంది. కాని సెన్సార్ వారి అభ్యంతరంతో ‘రామరాజ్యంలో రక్తపాతమా?’ అని మార్చి రిలీజ్ చేశారు. పోలీసోడి పెళ్లాం – పోలీసు భార్య నరేష్ హీరోగా, సీత హీరోయిన్గా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తయారైన సినిమా ‘పోలీసోడి పెళ్లాం’. కన్నడంలో సూపర్ హిట్ అయిన సినిమాకి తెలుగు రీమేక్ ఇది. అయితే తీరా రిలీజ్‌కు ముందు పోలీసు సంఘాల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. ‘పోలీసోడి పెళ్లాం’ అనే టైటిల్ స్త్రీలను కించపరిచేలా ఉందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు ఆ టైటిల్‌ను ‘పోలీసు భార్య’గా మార్చారు. సినిమా ఘనవిజయం సాధించింది. ఇటీవల తమిళంలో విజయం సాధించిన విజయ్ సినిమా ‘తేరి’ తెలుగులో ‘పోలీసోడు’గా విడుదలైంది. అయితే విడుదయ్యే రెండు మూడు రోజుల ముందు పోలీసు సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో దానిని ‘పోలీసు’గా మార్చాల్సి వచ్చింది. ఈ టైటిల్ వివాదం వల్ల సినిమా ప్రమోషన్ సరిగ్గా జరక్క, టైటిల్ సరిగ్గా రిజిస్టర్ కాక ఊహించిన కలెక్షన్లు రాలేదు. సామ్రాట్– సాహాస సామ్రాట్ టైటిల్ కోసం చిన్నస్థాయి నిర్మాతలు, హీరోలు పోటీ పడితే నష్టం ఉండదు. కాని దిగ్గజాలు తలపడితే టెన్షన్ వస్తుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా మొదలైంది. కృష్ణ కుమారుడు రమేశ్‌బాబును హీరోగా పరిచయం చేస్తూ బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘బేతాబ్’ రీమేక్‌గా మరో సినిమా విడుదలైంది. ఇద్దరూ తమ సినిమాలకు ‘సామ్రాట్’ టైటిల్ అనౌన్స్ చేశారు. అభిమానులు ఆ టైటిలే ఉండాలని పట్టుబట్టారు. ఇరువర్గాలు కూడా అలాగే హోరాహోరికి దిగాయి. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు కృష్ణ అంటే ఇండస్ట్రీలో పెద్ద న్యూస్ కింద లెక్క. చివరకు రాఘవేంద్రరావు తమ సినిమా టైటిల్‌కు ముందు ‘సాహస’ చేర్చి ‘సాహస సామ్రాట్’గా మార్చడంతో గొడవ సద్దుమణిగింది. రెండు సినిమాలు విడుదలయ్యాక ‘సాహస సామ్రాట్’ కంటే ‘సామ్రాట్’ మెరుగైన కలెక్షన్లు సాధించింది. రాసలీల– రాగలీల జంధ్యాల దర్శకత్వంలో రెహమాన్–తులసి జంటగా ‘రాసలీల’ నిర్మాణమైంది. పోస్టర్లతో సహా సినిమా అంతా ‘రాసలీల’గా ప్రచారమైంది. అయితే సెన్సార్‌వారు ఈ టైటిల్‌కు అభ్యంతరం చెప్పారు. ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తూ టైటిల్‌ను మార్చమన్నారు. జనసామాన్యంలో శృంగార చేష్టలను రాసలీలలుగా పేర్కొడం పరిపాటి. అయినప్పటికీ సెన్సార్‌వారు ఊరుకోలేదు. దాంతో జంధ్యాల విధిలేక సినిమా పేరును ‘రాగలీల’గా మార్చారు. అయితే దీని ప్రభావం సినిమా మీద పడింది. రాగలీల అనే టైటిలే జనానికి అర్థం కాలేదు. వారిని ఆ సినిమాలోని కంటెంట్‌కు తగినట్టుగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా బిలో యావరేజ్‌గా నిలిచింది (ఇదే సినిమాను పోలిన కథతో ఆ తర్వాత ఇ.వి.వి ‘చిలక్కొట్టుడు’ అనే సినిమా వెంకటేష్ హీరోగా ‘ప్రేమతో’ అనే సినిమా తయారయ్యాయి). చింతామణి – శ్రీదేవి కొన్ని సినిమాలు టైటిల్ అనౌన్స్ చేసిన వెంటనే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. తెలుగునాట గతంలో ప్రఖ్యాతమైన తెలుగు నాటకం (రచన: కాళ్లకూరి నారాయణరావు) సినిమాగా తీయాలని దాసరి నారాయణరావు అనుకున్నారు. అనౌన్స్ కూడా చేశారు. అయితే అందులోని ‘సుబ్బిశెట్టి’ పాత్ర వ్యవహారశైలి అభ్యంతరకరమని ఆ సినిమాను వ్యతిరేకిస్తామని నిరసన వ్యక్తం కావడంతో మానుకున్నారు. అలాగే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఒక ‘కవ్వింపు చిత్రాన్ని’ తీయబోతున్నట్టుగా దానికి ‘సావిత్రి’ అని టైటిల్ పెట్టారు. సావిత్రి తెలుగువారి ఆరాధ్యనటి. అలాంటి నటి పేరు పెడతారా అని నిరసన రావడంతో ఆ టైటిల్ తీసి ‘శ్రీదేవి’ అని పెట్టారు. ఈ పని అసలుకే ఎసరు తెచ్చింది. ఒక ‘చవకబారు’ సినిమాకు రామ్‌గోపాల్‌వర్మ ‘శ్రీదేవి’ అనే టైటిల్ పెట్టాడని కొంతమంది బోనికపూర్‌కు, శ్రీదేవికి ఆ విషయం చేరవేశారు. శ్రీదేవి చాలా నొచ్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. బోనికపూర్ కోర్టునోటీసులు పంపి మరీ రామ్‌గోపాల్ వర్మను హెచ్చరించారు. ఆ సినిమా అంతటితో ఆగిపోయింది. మహేష్ ఖలేజా – నాని గ్యాంగ్‌లీడర్ సినిమా టైటిల్స్ ముందే రిజిస్టర్ అయి ఉంటాయి. అయితే కొన్ని సినిమాల కథలు సిద్ధమయ్యాక ఆ ఫలానా టైటిలే కావాలనిపిస్తుంది. రిజిస్టర్ చేసినవారిని అడిగినప్పుడు కొందరు ఇస్తారు. కొందరు ఇవ్వరు. అప్పుడు కొంత మాయ చేయాల్సి వస్తుంది. మహేశ్‌బాబుతో త్రివిక్రమ్ తీసిన ‘ఖలేజా’కు టైటిల్ దొరక్కపోవడంతో దానిని ‘మహేష్ ఖలేజా’గా మార్చారు. తాజాగా నాని సినిమా ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్ యధాతథంగా దొరక్కపోవడంతో దానిని ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’గా మార్చాల్సి వచ్చింది. గతంలో రవితేజా హీరోగా నటించిన ‘ఆటోగ్రాఫ్’ టైటిల్ దొరకనే దొరకలేదు. దాంతో సినిమాను ‘మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’గా విడుదల చేయాల్సి వచ్చింది. ‘దాదార్ ఎక్స్‌ప్రెస్’ ఒకప్పుడు ఒక రేప్ కేస్ కారణంగా వార్తలకెక్కింది. నాగబాబు హీరోగా అదే టైటిల్‌తో తీసినప్పుడు సెన్సార్ వారు అభ్యంతరం చెప్పడంతో ‘సూపర్ ఎక్స్‌ప్రెస్’గా విడుదలైంది. రాజశేఖర్ హీరోగా కన్నడ ‘ఓం’ను రీమేక్ చేసినప్పుడు ‘ఓం’ టైటిల్ దొరకలేదు. దాంతో ‘ఓంకారం’గా విడుదల చేశారు. పవన్‌కల్యాణ్ హీరోగా ‘కొమరం పులి’ నిర్మించినప్పుడు గట్టి వ్యతిరేకత ఎదురవడంతో టైటిల్ నుంచి ‘కొమరం’ తీసేయాల్సి వచ్చింది. రామ్‌గోపాల్ వర్మ ‘బెజవాడ రౌడీలు’ కాస్త ‘బెజవాడ’గా రిలీజ్ అయ్యింది. పిచ్చి అనడం కూడా తప్పే ఇటీవలే హిందీలో ‘మెంటల్ హై క్యా’ అనే సినిమా కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావులతో విడుదలైంది. అయితే ఈ సినిమా టైటిల్ చూసి దేశంలోని సైకియాట్రీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ‘మెంటల్’ అని అనడం మానసిక సమస్యలతో బాధపడుతున్నవారిని అవమానించడమే అన్నాయి. దాంతో సినిమా పేరు ‘జడ్జ్‌మెంటల్ హై క్యా’గా మార్చారు. సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘రామ్–లీల’ కాస్త ‘గలియోంకా రాస్లీల– రామ్‌లీల’గా మారింది. ఆయనే తీసిన ‘రాణి పద్మావతి’ కేవలం ‘పద్మావత్’గా విడుదలైంది. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘బిల్లు బార్బర్’ సినిమాలో ‘బార్బర్’ అనే మాట ఉండటం పట్ల క్షురక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ‘బిల్లు’ గా సినిమా విడుదల చేశారు. కొందరు టైటిల్స్ పెట్టాక కాంట్రవర్సీ అవుతుంది. కొందరు కాంట్రవర్సీ చేయడానికే టైటిల్స్ పెడుతుంటారు. సినిమా అనేది వ్యాపారం. ఎలాగోలా చేసి నాలుగు డబ్బులు సంపాదించాలన్న తపన తప్పు లేదు. కాని ఈ తపనలో తెలిసో తెలియకో ఒకరికి కష్టం కలిగించే, మనోభావాలు దెబ్బ తీసే సినిమాలు తీసే హక్కులేదని ఆయా ఉదంతాలు తెలియచేస్తున్నాయి.రాబోయే రోజుల్లో ఇటువంటి వివాదాలు ఎదురుకావని ఆశిద్దాం.– సాక్షి సినిమా ప్రతినిధి -
‘గద్దలకొండ గణేష్’ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్