అక్షయ్‌కుమార్‌ 'బచ్చన్‌ పాండే' ట్రైలర్‌ చూశారా? | Akshay Kumar And Kriti Sanons Bachchhan Paanday Trailer Out | Sakshi
Sakshi News home page

Bachchhan Paanday : అక్షయ్‌కుమార్‌ 'బచ్చన్‌ పాండే' ట్రైలర్‌ చూశారా?

Published Fri, Feb 18 2022 11:56 AM | Last Updated on Fri, Feb 18 2022 1:08 PM

Akshay Kumar And Kriti Sanons Bachchhan Paanday Trailer Out - Sakshi

Bachchhan Paanday Trailer Out: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బచ్చన్ పాండే'. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన తమిళ హిట్ 'జిగర్తాండ'కు హిందీ రీమేక్‌ ఈ చిత్రం. దీని ఆధారంగానే తెలుగులో గద్దల కొండ గణేష్ వచ్చిన సంగతి తెలిసిందే. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులో సూపర్‌ హిట్‌ అయ్యింది.

ఇప్పుడు అదే స్టోరీ లైన్‌తో హిందీలోనూ బచ్చన్‌ పాండేగా ఈ సినిమా తెరకెక్కుతుంది.వచ్చే నెల18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. అక్షయ్ కుమార్ ఒంటి కన్నుతో క్రూరంగా కనిపించారు. కృతి సనన్‌ అక్షయ్‌కి జోడీగా నటించింది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement