షాహిద్ కపూర్ టైటిల్ రోల్‌లో నటించిన తాజా యాక్షన్ ఫిల్మ్ ‘దేవా’. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ దేవా పాత్రలో షాహిద్ కపూర్ నటించారు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీతో మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూ హిందీ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దేవా’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌లో షాహిద్ మాసీ విజువల్స్ మాత్రమే కనిపిం చాయి. కానీ చివర్లో వన్ అండ్ ఓన్లీ దేవా వస్తున్నాడు అని చూపించారు. పావైల్ గులాటి, ప్రవేవ్ రాణా, కుబ్రా సైట్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి విశాల్ మిశ్రా స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment