Shahid Kapoor
-
వన్ అండ్ ఓన్లీ దేవా
షాహిద్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన తాజా యాక్షన్ ఫిల్మ్ ‘దేవా’. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ దేవా పాత్రలో షాహిద్ కపూర్ నటించారు. పూజాహెగ్డే హీరోయిన్గా నటించిన ఈ మూవీతో మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూ హిందీ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దేవా’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్లో షాహిద్ మాసీ విజువల్స్ మాత్రమే కనిపిం చాయి. కానీ చివర్లో వన్ అండ్ ఓన్లీ దేవా వస్తున్నాడు అని చూపించారు. పావైల్ గులాటి, ప్రవేవ్ రాణా, కుబ్రా సైట్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి విశాల్ మిశ్రా స్వరకర్త. -
దేవా వస్తున్నాడు
ఈ నెలాఖర్లో థియేటర్స్‌లోకి వస్తున్నాడు దేవా. షాహిద్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘దేవా’. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూ ఈ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ‘దేవా’ చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను జనవరి 31న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘లాక్ అండ్ లోడ్’ అంటూ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేశారు షాహిద్ కపూర్. జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాకు విశాల్ మిశ్రా సంగీతం అందించగా, జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. -
మొదటిసారి ప్రెగ్నెన్సీ.. స్టార్ హీరో భార్యకు అలాంటి అనుభవం!
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో కబీర్ సింగ్, జెర్సీ, పద్మావత్, బ్లడీ డాడీ లాంటి చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఆయన దేవా చిత్రంతో ప్రేక్షకుల ముంందుకు రానున్నారు. అయితే తన సినిమాలతో బిజీగా ఉండగానే.. తన ప్రియురాలు మిరా రాజ్‌పుత్‌ను 2015లో షాహిద్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన భార్య మీరా రాజ్‌పుత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు మొదటిసారి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తీవ్రమైన సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో దాదాపు గర్భస్రావం అయినంత పనైందని.. ఏ నిమిషంలోనైనా బిడ్డను కోల్పోవచ్చని చెప్పారని వెల్లడించింది. అయితే వైద్యులు తనకు వెంటనే సోనోగ్రఫీ చికిత్స అందించారని ఆమె పేర్కొంది.దీంతో మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నానని.. లేకపోతే గర్భస్రావం జరిగి ఉండేదని తెలిపింది. ఈ విషయంలో తన భర్త షాహిద్ కపూర్ పూర్తిగా సహకరించాడని వివరించింది. తమ ఇంటినే ఆస్పత్రిగా మార్చేశాడని మీరా తన భర్తపై ప్రశంసలు కురిపించింది. కాగా.. షాహిద్ కపూర్‌తో వివాహమైన ఏడాది తర్వాత 2016లో మిషా అనే కూతురు జన్మించింది. ఈ జంట 2018లో తమ రెండో బిడ్డ జైన్‌ను స్వాగతించారు. -
ఇద్దరమ్మాయిలు ప్రేమించి మోసం చేశారు: హీరో
బ్రేకప్‌కు కారణం కొన్నిసార్లు అమ్మాయి కావొచ్చు, మరికొన్ని సార్లు అబ్బాయి కావచ్చు. లేదా ఏకాభిప్రాయంతో విడిపోవచ్చు. అయితే తన విషయంలో మాత్రం ప్రేమించిన అమ్మాయిలే మోసం చేశారంటున్నాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.ఎన్నిసార్లు మోసపోయావు?ఓ షోలో అతడికి మాజీ ప్రేమ కహానీల గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించేందుకు షాహిద్ ఒకటికి రెండుసార్లు ఆలోచించాడు. అయినా హోస్ట్ అడుగుతూనే ఉంది.. ప్రేమలో ఎన్నిసార్లు మోసపోయావు?అని! ఇందుకతడు స్పందిస్తూ ఒకసారైతే దారుణంగా మోసపోయాను. మరో లవ్ కహానీలో చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు ఇద్దరు నన్ను మోసం చేశారు. వారి పేర్లు మాత్రం చెప్పను అని చెప్పుకొచ్చాడు.ఆ ఇద్దరు హీరోయిన్లేనా?వాళ్లిద్దరూ ఫేమస్ సెలబ్రిటీలా? అని అడగ్గా షాహిద్ దానికి సమాధానం చెప్పడానికి నిరాకరించాడు. ఇది చూసిన నెటిజన్లు ఆ ఇద్దరు సెలబ్రిటీలు మరెవరో కాదు ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ అని అభిప్రాయపడుతున్నారు. కాగా రెండుసార్లు ప్రేమలో విఫలమైన షాహిద్ 2015లో మీరా రాజ్‌పుత్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం.అన్ని పాత్రల్లోనూషాహిద్ సినిమాల విషయానికి వస్తే.. చుప్ చుప్కే సినిమాలో సాఫ్ట్ బాయ్‌గా కనిపించి మెప్పించాడు. పద్మావత్‌లో మహారావల్ రతన్ సింగ్‌గా రాయల్ లుక్‌లో అలరించాడు. కబీర్ సింగ్‌లో యాటిట్యూడ్ స్టార్‌గా అదరగొట్టాడు. ఇటీవలే తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం దేవ అనే సినిమా చేస్తున్నాడు. -
రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రం.. సడన్‌గా ఓటీటీలోకి!
బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'తేరీ బాతోన్ మే ఐజా ఉల్జా జియా'. జాన్వీ కపూర్ అతిథి పాత్రలో మెరిసింది. అమిత్ జోషి, ఆరాధన సాహ్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైంది. మొదట్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆ తర్వాత మంచి వసూళ్లనే రాబట్టింది. దాదాపు రూ.130 కోట్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. సడన్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. కాకపోతే రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. ఈ మధ్య చాలా సినిమాలను అమెజాన్ ప్రైమ్ తన ప్లాట్ఫామ్లో ముందుగా అద్దె పద్దతిలోనే తీసుకువస్తోంది. కొన్నాళ్ల తర్వాతే ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ మూవీ చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే! #TeriBaatonMeinAisaUljhaJiya is now available for RENT. Amazon Prime. pic.twitter.com/BMpiUajA55 — Christopher Kanagaraj (@Chrissuccess) March 22, 2024 చదవండి: స్టార్ హీరోహీరోయిన్లు డిప్రెషన్లో.. నాకు అలాంటి లైఫ్ వద్దు! -
Ashwatthama: The Saga Continues: బాలీవుడ్ అశ్వత్థామ
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్’ టైటిల్ ఖరారైంది. కన్నడ దర్శకుడు సచిన్ రవి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వసు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్ నిర్మిస్తున్న ఈ సినిమా అధికారిక ప్రకటన వెల్లడైంది. సచిన్ రవి మాట్లాడుతూ– ‘‘మహా భారతంలోని అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉంటారని కొందరి నమ్మకం. మహాభారత కాలంనాటి ఓ అమరుడు ఇప్పటి ఆధునిక కాలానికి వస్తే ఏం జరుగుతుంది? అనే అంశాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో లెజెండ్స్ యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు జాకీ భగ్నాని. -
విజయ్ దేవరకొండకు స్టేజీపైనే ముద్దుపెట్టిన హీరో
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాతోనే అతడు రౌడీ స్టార్‌గా మారిపోయాడు. ఇది బాలీవుడ్లో కబీర్ సింగ్‌గా రీమేకై అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. తెలుగులో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రను హిందీలో షాహిద్ కపూర్ నటించాడు. తాజాగా ఈ ఇద్దరు అర్జున్ రెడ్డిలు ఒక్కచోట కనిపించారు. ఓటీటీ ఈవెంట్లో అర్జున్‌రెడ్డి, కబీర్ సింగ్ మార్చి 19న అమెజాన్ ప్రైమ్ వీడియో.. ముంబైలో ఓ ఈవెంట్ నిర్వహించింది. ప్రైమ్ వీడియోలో రాబోయే సినిమాలు, సిరీస్‌లివే అంటూ పెద్ద జాబితానే రిలీజ్ చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా థియేటర్లో రిలీజైన తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోకి రానుందని షాహిద్ కపూర్ ప్రకటించాడు. ఈ సమయంలో చిత్రయూనిట్‌ను వేదికపైకి ఆహ్వానించాడు. విజయ్ను చూసి ఎమోషనల్ విజయ్ను చూసి ఎమోషనలైన షాహిద్ అతడి చేయి పట్టుకుని మాట్లాడాడు. 'నేను విజయ్‌కు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అతడు లేకపోతే అర్జున్ రెడ్డి లేదు. అర్జున్ రెడ్డి లేకపోతే ఈ కబీర్ సింగ్ కూడా ఉండేవాడు కాదు' అంటూ అతడి చెంపపై ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే షాహిద్ కపూర్ అశ్వథ్థామ మూవీ కూడా ప్రైమ్‌లోనే రిలీజ్ కానున్నట్లు ఈ వేదికపై ప్రకటించారు. #ArjunReddy Meets #KabirSingh#VijayDevarakonda #ShahidKapoorpic.twitter.com/SJid9dq1X2 — GSK Media (@GskMedia_PR) March 19, 2024 చదవండి: అమెజాన్ ప్రైమ్ క్రేజీ అప్డేట్స్: ఒకేసారి 50కి పైగా వెబ్‌సిరీస్, సినిమాల ప్రకటన.. లిస్ట్ ఇదిగో -
ఎంతో అవమానించారు, ఇక నా వల్ల కాదు: స్టార్ హీరో
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే.. కానీ ఒక అవుట్సైడర్గానే కెరీర్ మొదలుపెట్టాడు. ఆమె తల్లి నటి, రచయిత్రి.. సీరియల్స్, సినిమాల్లో సాధారణ పాత్రలు పోషించేది. తండ్రి నటుడు.. ఈయన కూడా సీరియల్స్‌లో యాక్ట్ చేశాడు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటికీ రాణిస్తున్నాడు. ఈ ఇద్దరి పేర్లు వాడుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు షాహిద్. దీంతో అవుట్‌సైడర్స్(సినీ బ్యాగ్రౌండ్ లేనివారు)ని ఎలాగైతే చూసేవారో తనను కూడా అలాగే చులకనగా చూసేవారంటున్నాడు షాహిద్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే.. 'ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చినప్పుడు క్లాసులో నన్ను కూర్చోనివ్వలేదు. నా యాస వేరేగా ఉండటంతో నన్ను పరాయివాడిగా, అంటరానివాడిగానే చూశారు. మేము అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. 11 నెలలకోసారి ఇల్లు మారుతూ ఉండేవాళ్లం. ఎవరూ మాతో కలుపుగోలుగా ఉండేవారు కాదు. కాలేజీలో మాత్రం నన్ను యాక్సెప్ట్ చేశారు. నాకంటూ మంచి మిత్రులు దొరికారు. కానీ ఎప్పుడైతే ఇండస్ట్రీలో అడుగుపెట్టానో నాకు మళ్లీ నా స్కూలు గుర్తొచ్చింది. ఇక్కడ బయట నుంచి వచ్చేవాళ్లకు అంత ఈజీగా అవకాశాలివ్వరు. హీనంగా చూస్తారు. చాలా ఏళ్లు ఆ సమస్యతో బాధపడ్డాను. అప్పుడంత శక్తి లేదు కానీ.. నేను గుంపు(బాలీవుడ్ గ్యాంగ్)లో తిరిగే రకాన్ని కాదు. అవకాశాల కోసం అలా తిరగడం ఇష్టముండదు కూడా! అలా అని వారు ఇతరులను తొక్కేయాలనుకోవడం, వారిని ఎదగకుండా చేయడం, అవమానించడం సరి కాదు. టీనేజ్‌లో తిరిగి పోరాడేంత శక్తి నాకు లేకపోయింది. కానీ ఇప్పుడు నన్ను వేధించాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను, తిరగబడతాను. ఇతరుల్ని వేధించి ఆనందించేవాళ్లను నేను కూడా వేధిస్తాను, అదే వారికి తగిన శిక్ష' అని చెప్పుకొచ్చాడు. కాగా షాహిద్ చివరగా 'తేరి బాతోన్ మే ఐసా జియా' అనే సినిమా చేశాడు. ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. చదవండి: మనసు మార్చుకున్న బ్యూటీ.. బోల్డ్ సీన్స్‌కు పచ్చజెండా.. ఆ సీన్ అందుకే చేశానంటూ.. -
షాహిద్ కపూర్ & కృతి సనన్ తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు
-
ఇండియాలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ ఇదే!
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే స్కామ్-2003, కాలా పానీ లాంటి సిరీస్‌లు ప్రేక్షకులను అలరించాయి. గతంలో ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, సేక్రెడ్ గేమ్స్, స్కామ్ 1992 లాంటి సూపర్ హిట్ సిరీస్ కూడా వచ్చాయి. అయితే ఓటీటీలో ఇండియాలోనే 4 కోట్ల వ్యూస్‌తో ఎక్కువ ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్‌గా షాహిద్ కపూర్ నటించిన ఫర్జీ నిలిచింది. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న మృణాల్ మూవీ.. ఏకంగా జైలర్‌ను వెనక్కి నెట్టి!) ప్రముఖ ఇండస్ట్రీ ట్రాకింగ్ ఏజెన్సీ ఓర్మాక్స్ మీడియా ఒక్క సీజన్లో వచ్చిన వ్యూస్ ఆధారంగా అత్యధికంగా వీక్షించబడిన టాప్ 10 భారతీయ వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. సేక్రేడ్ గేమ్స్, మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లను అధిగమించిన ఫర్జీ.. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఫర్జీ జూన్ నెల వరకే 3.7 కోట్ల వ్యూస్ సాధించగా.. తాజాగా వీక్షణల సంఖ్య 4 కోట్లకు చేరుకుంది. రెండో స్థానంలో అజయ్ దేవగన్ నటించిన రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ నిలిచింది. దీనికి 3.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న మీర్జాపూర్, పంచాయత్ వరుసగా 3.2 కోట్లు, 2.96 కోట్ల వ్యూస్ సాధించాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ అనే వెబ్ సిరీస్ 2.91 కోట్ల వీక్షణలతో ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత టాప్ 10లో ఉన్న ఇతర సిరీస్‌లలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, ది నైట్ మేనేజర్, తాజా ఖబర్, ది గ్రేట్ ఇండియన్ మర్డర్, స్కామ్ 1992 ఉన్నాయి. అయితే ఆదరణ ఉన్నప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న సేక్రేడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌కు టాప్ 10లో చోటు చేసుకోలేదు. ఎందుకంటే ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉండడమే కారణంగా తెలుస్తోంది. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న మృణాల్ మూవీ.. ఏకంగా జైలర్‌ను వెనక్కి నెట్టి!) -
ప్రస్తుతానికి అందుబాటులో లేను!
పుట్టినరోజు (అక్టోబర్ 13) సందర్భంగా పూజా హెగ్డే తన తాజా చిత్రం గురించి థ్రిల్లింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. షాహిద్ కపూర్ సరసన తొలిసారి ఆమె కథానాయికగా నటించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించనున్నారు. ఇలా బర్త్ డేకి ఓ థ్రిల్లర్ మూవీకి సైన్ చేయడం పట్ల పూజా హెగ్డే ఆనందంగా ఉన్నారు. ‘‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే కథాంశం కొత్తగా ఉంది. అలాగే నాది చాలా విభిన్నమైన పాత్ర. షాహిద్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుండటం హ్యాపీగా ఉంది. తను మంచి నటుడు. అందుకే ఈ సినిమా ప్రయాణాన్ని ఆరంభించడానికి ఆసక్తిగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. ఇక పుట్టినరోజుని ఎలా జరుపుకున్నారంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో ఉన్నారు. ‘కరెంట్లీ అన్ అవైలబుల్’ (ప్రస్తుతం అందుబాటులో లేను) అంటూ మాల్దీవుల్లో సేద తీరుతున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు పూజా హెగ్డే. -
తెలుగు హీరోతో సినిమా వదులుకున్న స్టార్ హీరోయిన్.. తగిన శాస్తే జరిగింది!
పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ ట్యాగ్ సొంతం చేసుకున్న భామ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్తా గందరగోళంగా మారింది. అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి అన్న తరహాలో రష్మిక పరిస్థితి ఉందటున్నారు నెటిజన్స్. అసలు విషయానికొస్తే కన్నడ చిత్రసీమ నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన ముద్దుగుమ్మ. అక్కడ ఛలో అనే తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత చిత్రం గీతగోవిందంతో అనుహ్యమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇక అల్లు అర్జున్‌తో పుష్ప చిత్రం ఏకంగా రష్మిక దశనే మార్చేసింది. ఈ చిత్రం ఆమెను బాలీవుడ్ వరకు తీసుకెళ్లింది. (ఇది చదవండి: Roopa Koduvayur: వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తెలుగు బ్యూటీ ) అలా అక్కడ రెండు, మూడు చిత్రాలు చకచకా చేసేసింది భామ. ఆ చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయినా, నటిగా రష్మికకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టాయి. దీంతో మరో రెండు, మూడు చిత్రాలు ఈ బ్యూటీని వరించాయి. అలా రణ్వీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా షాహీద్ కపూర్ జత కట్టే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. ఆ చిత్రం కోసం తెలుగులో టాలీవుడ్ హీరో నితిన్ సరసన నటించే అవకాశాన్ని వదులుకుంది. నిజానికి ఈ జంట భీష్మ చిత్రం సక్సెస్‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది. కాగా ఇప్పుడేమో షాహీద్ కపూర్ సరసన నటించే బాలీవుడ్ చిత్రం బడ్జెట్ కారణంగా ఆగిపోయిందనే విషయం రష్మికకు షాక్ ఇచ్చిందని సమాచారం. దీంతో ఆమె ఊహించింది ఒకటైతే జరిగింది.. మరొకటి అంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం రష్మిక హిందీలో యానిమల్ చిత్రం, తెలుగులో పుష్ప –2 చిత్రాలు పైనే ఆశ పెట్టుకుందని సమాచారం. అదే విధంగా రెయిన్బో అనే మరో ద్విభాషా చిత్రం కూడా ఆమె చేతిలో ఉంది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి!) -
రూ.500కోసం హీరోహీరోయిన్ల వీడియో లీక్ చేశారు!
షాహిద్ కపూర్, కరీనా కపూర్.. ఒకప్పుడు వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. బాలీవుడ్లో క్యూట్ లవ్ బర్డ్స్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఎన్నో ప్రేమకథల్లాగే వీరి కథ కూడా సుఖాంతం కాలేదు. 2000 సంవత్సరం ప్రారంభంలో మొదలైన వీరి లవ్ కహానీ 2006లో బ్రేకప్‌తో ముగిసింది. అయితే 2004 సంవత్సరంలో వీరి ప్రైవేట్ వీడియో లీకైంది. ఓ క్లబ్బులో షాహిద్, కరీనా ఈ లోకాన్నే మర్చిపోతూ ముద్దులాటలో మునిగిపోయారు. అయితే ఈ వీడియో నెట్టింట లీకై అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. కానీ ఆ సమయంలో ఇద్దరూ దీనిపై స్పందించనేలేదు. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ ఘటనపై స్పందించాడు షాహిద్. 'అప్పుడు నా వయసు 24 ఏళ్లు. ఆ ఫోటోలు, వీడియో లీక్ అయ్యేసరికి.. ఏంటి? ఏం జరుగుతోంది? అని షాక్‌లో ఉన్నాను. అంతా అయిపోయినట్లే అనుకున్నాను. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు మనల్ని ఎంతగానో ఇబ్బందిపెడతాయి. ఆ వయసులో మరీనూ! ఆ కుర్ర ఏజ్‌లో మన ఫీలింగ్స్ మనకే సరిగా అర్థం కావు. ఒక అమ్మాయితో ఎలా నడుచుకోవాలో కూడా తెలియదు. పైగా అప్పుడు డేటింగ్లో ఉంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు నాకు పెళ్లైంది కాబట్టి అటువంటి విషయాలు ఎవరూ పట్టించుకోరు' అని షాహిద్ చెప్పుకొచ్చాడు. అతడిని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి మాట్లాడుతూ.. 'ముగ్గురు పిల్లలు మాజీ ప్రేయసితో మీ ముద్దు వీడియోతో ఆఫీసుకు వచ్చారు. రూ.500 ఇచ్చాకే ఈ వీడియో మా చేతికిచ్చారు' అని చెప్పుకొచ్చాడు. కాగా కరీనా కపూర్ 2012లో హీరో సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి తైమూర్ అలీ ఖాన్, జే అలీ ఖాన్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాహిద్ కపూర్ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. 2015లో మీరా రాజ్‌పుత్‌తో వివాహం జరగ్గా వీరికి మిషా, జైన్ అని ఇద్దరు సంతానం. చదవండి: పార్టీలో పూటుగా తాగారు, తెల్లారేసరికి ఆమిర్ చేతికి బ్రేస్లెట్ -
ఇంపాజిబుల్ లవ్‌స్టోరీ
షాహిద్‌కపూర్, కృతీసనన్ జంటగా హిందీలో ఓ రొమాంటిక్ ఫిల్మ్ రూపొందుతోంది. ఈ చిత్రానికి అమిత్ జోషి, ఆరాధన షా కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. జియో స్టూడియోస్, దినేష్ విజన్, జ్యోతిదేశ్ పాండే, లక్ష్మణ్ ఉటేకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోందని బాలీవుడ్ సమాచారం. కాగా ఈ సినిమాను తొలుత అక్టోబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమాను డిసెంబరు 7న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ సోమవారం ప్రకటించింది. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కానీ, ‘యాన్ ఇంపాజిబుల్ లవ్‌స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్. -
ఐశ్వర్య సరే... అతడు ఎవరు?
‘షాహిద్ కపూర్ ఎవరు?’ అనే ప్రశ్నకు ‘బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు’ అని జవాబు చెప్పడానికి అట్టే టైమ్ పట్టదు. హీరో కావడానికి ఎంత టైమ్ పట్టిందో తెలియదుగానీ, బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు షాహిద్. కొరియోగ్రాఫర్ షియామక్ దావర్ డ్యాన్స్ ట్రూప్‌లో పని చేస్తున్న కాలంలో సుభాష్ ఘాయ్ ‘తాళ్’ సినిమాలో ఐశ్వర్యరాయ్ నృత్యం చేసిన ‘జంగిల్ మే బోలే కోయల్ కుక్కూ’ పాటలో డ్యాన్సర్లలో ఒకరిగా అవకాశం వచ్చింది. బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆరోజు గురించి ఆర్జే రోహిణికి ఇంటర్వ్యూ ఇస్తూ ‘వరస్ట్ అండ్ ది బెస్ట్ డే ఆఫ్ మైలైఫ్’ అని చెప్పాడు షాహిద్. అందాలతార పక్కన డ్యాన్స్ చేసే అవకాశం అదృష్టమే కదా...మరి ‘వరస్ట్ డే’ అంటాడు ఏమిటి! అనే డౌట్ రావచ్చు. విషయం ఏమిటంటే ఆరోజు షూటింగ్‌కు వస్తున్న షాహిద్ బైక్ మీది నుంచి పడ్డాడు. అదీ విషయం. ‘తాళ్’ సినిమా పాటలో ‘షాహిద్ ఎక్కడ?’ అంటూ నెటిజనులు సెర్చింగ్ మొదలు పెట్టారు. ఐశ్వర్యరాయ్ పక్కన ఉన్న అలనాటి షాహిద్ ఫొటో వైరల్ అయింది. -
ఐశ్వర్యరాయ్ సాంగ్.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే: స్టార్ హీరో
బాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న షాహిద్ కపూర్.. ఒకప్పుడు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కూడా చేశారు. సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నాడు షాహిద్. తాజాగా 'బ్లడీ డాడీ' చిత్రంతో బిజీగా ఉన్న షాహిద్ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో సిద్ధంగా ఉన్నారు. జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిల్మ్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించాయి. గతంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కరిష్మా కపూర్, ఐశ్వర్య రాయ్ పాటల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా పనిచేసిన రోజులను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు షాహిద్.. ఐశ్వర్య రాయ్ నటించిన తాల్ మూవీలోని 'కహిన్ ఆగ్ లగే లాగ్ జాయే' పాట కాగా, కరిష్మా కపూర్ 'లే గయీ' వంటి పాటలకు డ్యాన్సర్‌గా పని చేశాడు. (ఇదీ చదవండి: అఫీషియల్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఇదే!) కరిష్మా కపూర్ పాటను చెడగొట్టాను: షాహిద్ కపూర్ కరిష్మా కపూర్ పాట గురించి ఇలా చెప్పాడు..'దిల్ తో పాగల్ హైలోని 'లే గయీ' పాట కోసం పనిచేయడం నిజంగా అదో భయానకం... ఆ సినిమాతో నాకు ఇష్టమైన జ్ఞాపకాలు ఏవీ లేవు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో నా జుట్టు చాలా ఎక్కువగా బౌన్స్ అవుతోంది. నేను షాట్‌ను పాడు చేస్తున్నానని కొరియో గ్రాఫర్ నుంచి తిట్లు కూడా తిన్నాను. నిజంగా ఆ సమయంలో భయపడిపోయాను. అప్పుడు నేను చాలా సమయం పాటు ఆందోళనగానే ఉన్నాను'. అని తెలిపాడు. ఐశ్వర్యరాయ్ కోసం వెళ్తుంటే రోడ్డు ప్రమాదం దిల్ తో పాగల్ హై తర్వాత.. తాల్ సినిమాలోని 'కహిన్ ఆగ్ లగే లాగ్ జాయే' పాటలో కనిపించాడు షాహిద్. అతను ఐశ్వర్యతో కలిసి డ్యాన్సర్‌గా కనిపించాడు. పాట చిత్రీకరణ రోజు రోడ్డు ప్రమాదానికి గురయినట్లు తెలిపాడు. అయినా, గాయాలతోనే సెట్‌కి చేరుకున్నట్లు తెలిపాడు. కానీ పాటు కోసం పని చేస్తున్నప్పుడు అందరిలా యాక్టివ్‌గా పనిచేయలేక పోయానని తెలిపాడు. ఆ సమయంలో చాలా బాధ పడినట్లు అన్నాడు. సినిమా విడుదల అయిన తర్వాత అదే పాట పెద్ద హిట్ కావడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని షాహిద్ తెలిపాడు. (ఇదీ చదవండి: నాకు దగ్గరయ్యేందుకు చాలా ట్రై చేశారు: మధుమిత) -
పెళ్లికి సరికొత్త నిర్వచనం చెప్పిన బాలీవుడ్ హీరోపై ట్రోలింగ్
పెళ్లంటే రెండు మనసుల కలయిక.. నూరేళ్లు జంటగా జీవించేందుకు ముందడుగు.. ఇలా బోలెడు కబుర్లు చెప్తారు. కానీ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మాత్రం పెళ్లికి సరికొత్త అర్థం చెప్పాడు. అబ్బాయిని సరైన దారిలో పెట్టేందుకు ఓ అమ్మాయి అతడి జీవితంలోకి రావడమే వివాహం అని పేర్కొన్నాడు. ఇది విన్న ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు. షాహిద్ కపూర్ ప్రస్తుతం బ్లడీ డాడీ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'ఈ వివాహం అనేది ఒకే ఒకదానిపై ఆధారపడి ఉంటుంది. అదేంటంటే.. జీవితంపై ఓ క్లారిటీ లేని అబ్బాయి లైఫ్‌లోకి అమ్మాయి వచ్చి అతడి సమస్యలను పరిష్కరించి, తనను ఓ దారిలో పెట్టడమే పెళ్లి. ఆ అమ్మాయి వల్లే అతడు బాధ్యత గల వ్యక్తిగా మారతాడు' అని కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు కొందరికి అస్సలు మింగుడుపడటం లేదు. 'ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగడం పెళ్లి కాదా? ఒకరినొకరు సరిదిద్దుకోవడమే పెళ్లా? ఇదెక్కడి విచిత్రం?' అని కామెంట్లు చేస్తున్నారు. 'ఏంటి బాబూ మరోసారి చెప్పు.. అంటే మీ అమ్మ అదే పని చేసిందా? నిన్ను సరిగా పెంచిందా? లేదా? మీకింకా బుర్ర ఎదగలేదు. ఆడవాళ్లు అంటే మిమ్మల్ని పెంచుతూ, మిమ్మల్ని బాగు చేసే నర్సులు అనుకుంటున్నారా?', 'నువ్వు కబీర్ సింగ్(అర్జున్ రెడ్డి రీమేక్)లో నటించావు, మాకు ఆ విషయం తెలుసు, కానీ నువ్వు ఇంకా ఆ పాత్రలో నుంచి బయటపడలేదా?' అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ప్రియుడితో నటి బ్రేకప్.. ఓదార్చిన వ్యక్తితో పెళ్లికి రెడీ -
ఆ బాలీవుడ్ హీరోతో పూజాహెగ్డే రొమాన్స్
షాహిద్ కపూర్–పూజా హెగ్డే జోడీ ఒక సినిమాకి సెట్ అయ్యిందన్నది బాలీవుడ్ తాజా ఖబర్. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రా నికి ‘కోయీ షాక్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ఆరంభం కావాల్సింది. అయితే ముందుగా ప్రారంభోత్సవం జరిపి, ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని షూటింగ్ ప్లాన్ చేస్తారట. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించనున్నారు. కాగా, ఇటీవల పూజా హెగ్డే ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా హిందీలో ఆమె మూడు చిత్రాలు సైన్ చేశారని, వాటిలో ‘కోయీ షాక్’ ఒకటని సవచారం. -
ఓటీటీలో దూసుకెళ్తున్న 'ఫర్జీ'.. ఆల్ టైమ్ రికార్డ్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, హీరోయిన్ రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'ఫర్జీ'. ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్స్ రాజ్-డీకేలు తెరకెక్కించారు. ఈ సిరీస్ ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ఓటీటీలో దూసుకెళ్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఇండియన్ ఓటీటీలోనే ఆల్ టైమ్ వ్యూయర్షిప్ను సాధించింది. ఇప్పటివరకు 37 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు ఓర్‌మ్యాక్స్ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని నటుడు షాహిద్ కపూర్ కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అజయ్ దేవగణ్ నటించిన రుద్ర 35.2 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో నిలిచింది. Thanks for all the love!! 🫶🏼#Farzi #FarziOnPrime pic.twitter.com/zcjqkQyW6x — Raj & DK (@rajndk) March 25, 2023 -
ఆ స్టార్ కిడ్ నా వెంటపడుతోంది, నా వల్ల కాదని: బాలీవుడ్ హీరో
హీరోలను ఇష్టపడటం సహజమే, కొందరైతే అభిమానం హద్దులు దాటి ఆరాధిస్తారు కూడా! కానీ ఈ మితిమీరిన అభిమానం కొన్నిసార్లు స్టార్స్‌ను ఇబ్బందులపాలు చేస్తుంది. అందుకు ఇప్పుడు చెప్పబోయే సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. కాకపోతే ఇక్కడో ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసుకుందాం.. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే పడి చచ్చే లేడీ ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. 'ఇష్క్ విష్క్' సినిమాతో చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న అతడు తక్కువ కాలంలోనే ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. అతడు మీరా రాజ్‌పుత్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతోమంది మహిళా అభిమానుల గుండె ముక్కలైంది. వారిలో దివంగత నటుడు రాజ్ కుమార్ కూతురు వాస్తవిక్త కూడా ఒకరు. ఆమెకు షాహిద్ అంటే పిచ్చి ప్రేమ. అతడు కనిపిస్తే చాలు హీరోనే చూస్తూ తన్మయత్వానికి లోనవుతుంది. షైమక్ డావర్ డ్యాన్స్ క్లాసులో తొలిసారి షాహిద్‌ను నేరుగా చూసింది. తొలిచూపులోనే అతడు తెగ నచ్చేశాడట. తనకు తెలియకుండానే అతడితో ప్రేమలో కూడా పడిందట! కానీ నటుడు మాత్రం తనకేమీ పట్టనట్లుగా ఉండిపోయేవాడు. ఎంతమందిలో ఉన్నా ఆమె చూపులు మాత్రం షాహిద్పైనే ఉండేవట. పైగా తనను షాహిద్ భార్యగా కూడా చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇది హీరోకు ఇబ్బందికరంగా అనిపించింది. మొదట నచ్చజెప్పి చూశాడు, కానీ ఆమె వినిపించుకోలేదట. పైగా తను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవడంతో ఓపిక నశించిన హీరో ఏకంగా పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సినిమా సెట్స్‌కు రావడం, బయటకు వెళ్తే ఫాలో కావడం, ఏకంగా తన ఇంటి పక్క ఇంట్లోకి షఫ్ట్ కావడం.. ఇవన్నీ చిరాకు తెప్పించడంతో 2012లో షాహిద్.. వాస్తవిక్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ ఫిర్యాదు తర్వాత ఆమె మరెన్నడూ షాహిద్‌ను ఫాలో కాలేదట. ఇకపోతే వాస్తవిక్త 1996లో యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. తండ్రి రాజ్‌కుమార్ అందుకున్న పేరు ప్రతిష్టలు తనకెలాంటి సక్సెస్ తెచ్చిపెట్టలేకపోయాయి. ఫలితంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక సినిమాలకు గుడ్‌బై చెప్పేసిందీ నటి. చదవండి: అవార్డులే అనుకున్నా ఆస్కార్ కూడా కొనేశారు కదరా! -
మాపై దయ చూపలేదు, నా గుండె ముక్కలయ్యింది: బాలీవుడ్ హీరో
ఒక భాషలో ఏదైనా సినిమా హిట్టయిందంటే చాలు దాన్ని వేరే భాషలో రీమేక్ చేయాలని తహతహలాడిపోతుంటారు సినీతారలు. ఈ క్రమంలో కొన్నిసార్లు సూపర్ హిట్లు తీసినా మరికొన్నిసార్లు మాత్రం చేతులు కాల్చుకుంటారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇలా రీమేక్‌లు తీసి వరుస ఫ్లాపులు మూటగట్టుకుంటోంది. సౌత్‌లో హిట్ అయిన చిత్రాలను హిందీలో రీమేక్ చేసి వదులుతోంది. కానీ ఎందుకో అక్కడ అస్సలు వర్కవుట్ కావడం లేదు. అయినా సరే పట్టు వదలకుండా రీమేక్‌లు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో విక్రమ్ వేద, హిట్, జెర్సీ, షెహజాదా (అల వైకుంఠపురములో), డ్రైవింగ్ లైసెన్స్(సెల్ఫీ) వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. అయినా సరే వాటిని లెక్క చేయకుండా బోలెడన్ని సినిమాలు ఇంకా క్యూలో ఉన్నాయి. లవ్ టుడే, సూరరై పోట్రు, ఎఫ్ 2, బ్రోచెవారెవరురా, ఖైదీ, కత్తి, అయ్యప్పనుమ్ కోషియుమ్.. ఇలా చాలా చిత్రాలు రీమేక్ బాటపట్టాయి. హిందీ ప్రేక్షకులు సౌత్ కంటెంట్‌ను ఇష్టపడటం లేదని కాదు.. దక్షిణాది సినిమాలను చూస్తున్నారు, ఒరిజినల్ కంటెంట్‌ను మాత్రమే ఇష్టపడుతున్నారు.. రీమేక్‌లకు మాత్రం నిర్మొహమాటంగా నో చెప్తున్నారు. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాను వ్యతిరేకిస్తే తట్టుకోలేమంటున్నాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. నాని హీరోగా నటించిన జెర్సీ మూవీకి తెలుగులో విశేష స్పందన లభించింది. ఈ సినిమా హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్‌లో రిలీజవగా ఘోర పరాజయం పొందింది. దీనిపై షాహిద్ మాట్లాడుతూ.. 'నా గుండె పగిలినట్లైంది. ఎంతో మంచి సినిమా అది, కానీ ఈ ప్రపంచం మాపై దయచూపలేదనుకుంటా.. పాటలు విడుదలైన మరో నాలుగు నెలలకు సినిమా రిలీజైంది. జెర్సీతో ఓ విషయం నాకు బాగా అర్థమైంది. సినిమాలు ఫాస్ట్‌ఫుడ్ వంటివి. అది వేడివేడిగా ఉన్నప్పుడే వెంటనే తినేయాలి.. దాన్ని వాయిదాలు వేసుకుంటూ ఆలస్యం చేస్తే అంత మజా రాదు. అప్పుడు కరోనా టైంలో సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా అర్థం కాలేదు. దురదృష్టవశాత్తూ సినిమా ఫ్లాప్ అయింది' అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఫర్జీ వెబ్ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాడు షాహిద్ కపూర్. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది. -
స్టార్ హీరో ఇంట్లో అద్దెకు దిగిన యంగ్ హీరో, రెంట్ ఎంతో తెలుసా?
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం 'షెహజాదా' సినిమాలో నటిస్తున్నాడు. టాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమాకు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే! షెహజాదా ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే కార్తీక్.. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఇంట్లో అద్దెకు దిగుతున్నాడట! ముంబైలోని జుహులో షాహిద్ కపూర్‌కు లగ్జరీ అపార్ట్మెంట్ ఉంది. గతేడాది వరకు షాహిద్ తన భార్య మీరా రాజ్‌పుత్.. పిల్లలు జైన్, మిషాతో కలిసి అక్కడే ఉండేవాడు. ఇటీవలే వీరు వర్లిలోని డూప్లెక్స్ ఇంటికి షిఫ్ట్ అయ్యారు. దీంతో ప్రానెటా బిల్డింగ్‌లోని తన అపార్ట్మెంట్ ఖాళీ అయింది. తాజాగా ఈ అపార్ట్మెంట్లోకి కార్తీక్ ఆర్యన్ అద్దెకు దిగినట్లు తెలుస్తోంది. ఈ లగ్జరీ ఇంటి అద్దె రూ.7.5 లక్షలు కాగా ఏడాది తర్వాత రెంట్ పెరుగుతుందట. రెండో ఏడాది నెలనెలా రూ.8.02 లక్షలు కట్టాల్సి ఉంటుందట. ఇక మూడో సంవత్సరంలో ఏకంగా రూ.8.58 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.45 లక్షలు ముందుగానే అప్పజెప్పాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సంక్రాంతికి ముందే పూర్తైనట్లు బీటౌన్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. కాగా కార్తీక్ ఆర్యన్ గతంలో వెర్సోవాలోని ఓ అపార్ట్మెంట్లో నివసించేవాడు. దీన్ని 2019లో రూ.1.60 కోట్లకు కొనుగోలు చేశాడు. చదవండి: రోజూ రాత్రి ఒంటరిగా వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని: రష్మిక డైరెక్టర్‌కు మెగాస్టార్ ఖరీదైన బహుమతి -
‘మనీ హేస్ట్’ సిరీస్‌ను తలపిస్తున్న షాహిద్ ‘ఫర్జీ’ ట్రైలర్!
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ రూపొందింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్స్ రాజ్-డీకేలు తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. చదవండి: అఫిషియల్: ఓటీటీకి వచ్చేస్తున్న ‘18 పేజెస్’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే! ఈ నేపథ్యంలో సిరీస్ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఫర్జీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైం వీడియోస్. ఈ ట్రైలర్ చూస్తుంటే డబ్బు చూట్టు కథ తిరుగనుందని తెలుస్తోంది. ‘నేను ఎంత డబ్బు సంపాదించాలంటే.. ఆ డబ్బు మీద నాకు మోజు పోవాలి’ అంటూ షాహిద్ చెప్పే డైలాగ్ ఆసక్తిగా పెంచుతోంది. దొంగ నోట్లు ముద్రించే యువకుడిగా షాహిద్ ఇందులో కనిపంచనున్నాడు. ఇక ఫర్జీ ట్రైలర్ చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన మనీ హేస్ట్ ఇంగ్లీష్ సిరీస్‌ను తలపిస్తోంది. చదవండి: ‘బాధపడకమ్మా.. నేను నీ వెనకే ఉన్నా’: సమంత ఎమోషనల్ పోస్ట్ ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకులు రాజ్-డీకే మాట్లాడుతూ తమకు ఇష్టమైన స్క్రిప్ట్‌ల్లో ఇదీ ఒకటని చెప్పారు. ఎంతో అభిరుచితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించామని, ‘ది ఫ్యామిలీమ్యాన్’ సిరీస్లానే ఇది కూడా అందరికి నచ్చుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇందులో విజయ్ సేతుపతి పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ప్రముఖ నటుడు కేకే మేనన్, రాశీఖన్నాలు మరో కీలక పాత్రలు పోషించారు. -
ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కియారా-సిద్దార్థ్, క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ మీడియా కెమెరాలకు చిక్కుతుండటంతో వీరద్దరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ నడుస్తోందని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో దర్శక-నిర్మాత కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్ తమ ప్రేమ గురించి చెప్పకనే చెప్పింది ఈ జంట. ఇటీవల షోకు వచ్చిన సిద్ధార్థ్ మల్హోత్రా కియారాతో డేటింగ్‌పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. చదవండి: అప్పట్లోనే బిగ్‌బి కంటే అధిక పారితోషికం అందుకున్న చిరు, వైరల్‌గా కవర్ ఫొటో కెరీర్ ప్లాన్ ఏంటని సిద్ధార్థ్‌ను కరణ్ ప్రశ్నించగా.. తాను సంతోషకరమైన, ప్రకాశవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నానని చెప్పాడు సిద్ధార్థ్. ఆ వెంటనే కియారాతోనా? అని కరణ్ అనడంతో.. ఆమె అయితే ఇంకా బాగుంటుందంటూ తమ ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పాడు సిద్ధార్థ్. తాజాగా హీరో షాహిద్ కపూర్‌తో కలిసి కియారా ఈ షోలో సందడి చేసింది. ఈ సందర్భంగా తనకు పరిశ్రమలో అంత్యంత క్లోజ్ ఎవరని అడగ్గా షాహిద్ పేరు చెప్పింది కియారా. అనంతరం సిద్ధార్థ్‌తో ఉన్న బంధం ఏంటని అడగ్గా. అతడు ఫ్రెండ్ కంటే ఎక్కువ అంటూ ముసిముసిగా నవ్వింది ఆమె. చదవండి: హీరోగా పరిచయమవుతున్న కమెడియన్ గౌతమ్ రాజు కుమారుడు ఇంతలో షాహిద్ కల్పించుకుని ‘ఈ ఏడాది చివర్లో ఎప్పుడైన బిగ్ అనౌన్స్మెంట్ రావోచ్చు సిద్ధంగా ఉండండి. కానీ అది సినిమాకు సంబంధించినది మాత్రం కాకపోవచ్చు!’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో సిద్ధార్థ్, కియారాలు త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారని, ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎట్టకేలక తమ లవ్వీ లవ్‌బర్డ్స్ పెళ్లి ఒక్కటికాబోతున్నారా? వీరిద్దరు క్యూట్ కపుల్, ఎట్టకేలకు కియార-సిద్ధార్థ్ బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారన్నమాట’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కియారా, సిద్ధార్థ్‌లు ‘షేర్షా’ చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్ల తెలుస్తోంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
మీ మాజీ భర్త షాహిద్ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్ చూశారా?
బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’. ఈ షో ఎంతటి క్రేజీ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు వచ్చిన సినీ సెలబ్రెటీలను తనదైన స్టైల్లో చిక్కు ప్రశ్నలు అడిగి ఇబ్బందుల్లో పడేస్తుంటాడు కరణ్. అలా వారి నుంచి ఆసక్తిర విషయాలను బయటపెట్టిస్తూ ఈ టాక్ షోను సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ షో 6వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఈ సీజన్లో తొలిసారి మన తెలుగు హీరోయిన్ సమంత, హీరో విజయ్ దేవరకొండలు సందడి చేశారు. చదవండి: బింబిసార మూవీపై జూ. ఎన్టీఆర్ రివ్యూ.. ఏమన్నాడంటే దీంతో కాఫీ విత్ కరణ్ 6వ సీజన్‌కు నార్త్‌లోనే కాదు సౌత్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రమంలో లెటేస్ట్ ఎపిసోడ్లో లాల్ సింగ్ చద్దా హీరోహీరోయిన్లు అయిన ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ సందడి చేశారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్, కరీనాను అడిగిన ఓ ప్రశ్న ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రాపిడ్ ఫైర్ రౌండ్లో హోస్ట్ కరణ్ కరీనాను కజిన్ రణ్‌బిర్ కపూర్, షాహిద్ కపూర్ పార్టీ చేసుకుంటే ఎవరు మిమ్మల్ని ఆహ్వానించరు అని అడగ్గా.. ‘రణ్‌బిర్ కజిన్ కాబట్టి ఆహ్వానిస్తాడు. కానీ షాహిద్ కపూర్ మాత్రం ఆహ్వానించకపోవచ్చు’ అని వివరించింది. చదవండి: పసి పిల్లలను సైతం చంపే రాక్షస చక్రవర్తి 'బింబిసార'.. మూవీ రివ్యూ ఆ తర్వాత గతంలో ఈ షోలో బేబో ఎన్నోసార్లు పాల్గొంందని, పెళ్లికి ముందు ఒకసారి, పెళ్ల అనంతరం తన భర్త సైఫ్‌తో.. మాజీ భర్త షాహిద్.. అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో షోకు వచ్చినవారంత ఒక్కసారిగా షాకయ్యారు. కరణ్ మాటలకు కరీనా సైతం అవాక్కైంది. తన తప్పును వెంటనే సవరించుకున్న కరణ్.. కరీనాను క్షమాపణలు కోరాడు. కాగా కరీనా, షాహిద్లు జంటగా నటించిన జబ్ వి మెట్ మూవీ సమయంలో వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లకు ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్న వీరిద్దరు. ఆ తర్వాత కరీనా.. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా.. షాహిద్ మిరా రాజ్‌పుత్‌ను వివాహమాడాడు.