కరీనా పెళ్లికి నన్ను పిలువలేదు : హీరో | Kareena Did Not Invite Shahid To Her Marriage | Sakshi
Sakshi News home page

కరీనా పెళ్లికి నన్ను పిలువలేదు : హీరో

Published Thu, Jun 13 2019 3:56 PM | Last Updated on Thu, Jun 13 2019 4:37 PM

Kareena Did Not Invite Shahid To Her Marriage - Sakshi

ముంబై: కరీనా కపూర్‌ వివాహానికి తనను ఆహ్వానించలేదని బాలీవుడ్‌ స్టార్‌ షాహిద్‌ కపూర్‌ తెలిపారు. ఆయన నటించిన తాజా చిత్రం కబీర్‌ సింగ్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో నేహా ధూపియా చాట్‌ షో  బీఎఫ్‌ఫ్‌ విత్‌ వోగ్‌లో పాల్గొన్న షాహిద్‌ తన సినిమా, వ్యక్తిగత జీవితం, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రియాంక, కరీనా.. షాహిద్‌ మాజీ ప్రియురాళ్లు. ఇటీవల జరిగిన ప్రియాంక చోప్రా వివాహానికి హాజరైన మీరు కరీనా పెళ్లి ఎందుకు వెళ్లలేదని నేహా ధూపియా ప్రశ్నించగా.. కరీనా వివాహం జరిగి చాలా రోజులవుతుందని, తనను పెళ్లికి పిలిచిందో లేదో సరిగా గుర్తులేదని అన్నారు.

దీపికా పదుకొనె, రణ్‌వీర్‌ సింగ్‌ ఇద్దరిలో ఎవరు మీకు మంచి కో-స్టార్‌ అని అడగ్గా.. దీపిక అని సమాధానమిచ్చారు. పద్మావతి సినిమాలో దీపిక, రణ్‌వీర్‌తో కలిసి షాహిద్‌ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పాత్రలపరంగా రణ్‌వీర్‌ క‍ంటే దీపికతో ఎక్కువగా కనెక్ట్‌ అయ్యానని చెప్పారు. సినిమా సెట్‌లో దీపికతో అనేక విషయాలు పంచుకున్నట్లు తెలిపారు. గత సంవత్సరం వచ్చిన ‘పద్మావతి’ సినిమా తమ ముగ్గురికి మంచి పేరు తీసుకొచ్చిందని తెలిపారు.

2006లో విడుదలైన ‘రంగ్‌దే బసంతి’ సినిమాలో తనకు  అవకాశం వచ్చిందని, అయితే సమయం దొరకని కారణంతో ఆ సినిమా చేయలేకపోయానని షాహిద్‌ బాధపడ్డారు. అంతేకాక ‘షాన్‌దార్‌’ సినిమా  చేసేటప్పుడు తను అయోమయంలో ఉండి.. ఆ సినిమా ఒప్పుకున్నట్టు చెప్పారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement