
మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor), హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) రాజస్తాన్‌లోని జైపూర్‌లో జరుగుతున్న ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్) కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఒకరికొకరు తారసపడటంతో ఆత్మీయంగా హగ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఇన్నాళ్లకు మీరిద్దరూ మెచ్యూర్డ్‌గా ప్రవర్తించారు. ఇలా మీ ఇద్దర్నీ చూస్తుంటే సంతోషంగా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు.

గతంలో ప్రేమజంట
కాగా కరీనా, షాహిద్‌లు గతంలో ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఫిదా, చుప్ చుప్ కే, జబ్ వి మెట్ వంటి చిత్రాల్లో జంటగా నటించారు. ఆన్‌స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ జోడీగానే కనిపించేవారు. జబ్ వి మెట్ సినిమా షూటింగ్‌కు ముందు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో విడిపోక తప్పలేదు. అనంతరం కరీనా.. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు సంతానం. షాహిద్ కపూర్.. మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడగా వీరికి ఓ కుమారుడు, కూతురు జన్మించారు.
చదవండి: కట్నంగా 40 గోల్డ్ బ్యాంగిల్స్ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్ కుమారుడు