
బాలీవుడ్ నటి చాహత్ ఖన్నా.. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులే తీసుకుంది. 2006లో భరత్ నర్సింగనిని పెళ్లాడగా నాలుగు నెలలకే విడాకులిచ్చింది. అనంతరం 2013లో ఫర్హాన్ మీర్జాను పెళ్లాడగా 2018లో అతడి దగ్గరా విడాకులు తీసుకుంది. అయితే ఈ విడాకులు తన కెరీర్‌కు అడ్డంకిగా మారాయంటోందీ బ్యూటీ.
విడాకులు.. కష్టమే
చాహత్ ఖన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రెండోసారి విడాకులు తీసుకున్నప్పుడు ఎంతో కష్టంగా అనిపించింది. ఒక కూతురు నాతో, మరొకరు ఫర్హాన్‌తో ఉంటున్నారు. పిల్లల్ని బాగా చూసుకోవడం మా బాధ్యత. వారి కోసం అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదేమైనా విడాకులనేవి మనసును పట్టి పిండేస్తాయి. అదంత ఈజీ కాదు. ఎవరికీ ముఖం చూపించుకోలేము. ఎందుకంటే వాళ్లు ఏదో ఒకటి మాట్లాడి మనల్ని మరింత బాధపెడతారు. అందుకో బయటకు వెళ్లాలంటే కూడా పెద్దగా ఇష్టపడను.
భరణం తీసుకోలే
ఇద్దరు భర్తల దగ్గర ఒక్క రూపాయి కూడా భరణం తీసుకోలేదు. కానీ జనాలు మాత్రం విడాకులు తీసుకుని భరణంగా భారీగా ఆస్తి, బంగారం లాగి ఉంటుంది అంటూ రకరకాలుగా మాట్లాడుతుంటారు. కేవలం భరణంతోనే బతికేస్తున్నానని కూడా అంటుంటారు. అందులో ఆవగింజంత కూడా నిజం లేదు. ఈ విడాకుల వల్ల నాపై నెగెటివిటీ పెరిగింది. చాలామంది నాతో కలిసి పని చేయడానికి కూడా ఇష్టపడలం లేదు.
నాతో ఎవరూ పనిచేయరు!
మీడియాలో నా వ్యక్తిగత జీవితం గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటే ఎవరు మాత్రం నాతో కలిసి నటించేందుకు ఇష్టపడతారు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు నన్ను పట్టించుకోవు. మీడియాలో నా పేరు మార్మోగిపోతోంది కాబట్టి.. సైడ్ చేస్తున్నాం అని కొందరు నా ముఖం మీదే చెప్పారు అని వాపోయింది. చాహత్.. ద ఫిలిం, థాంక్యూ, ప్రస్థానం, యాత్రిస్ సినిమాలు చేసింది. బుల్లితెరపై కాజల్, ఖుబూల్ హై వంటి సీరియల్స్‌లో నటించింది.
చదవండి: గుండు గీయించుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?