
మలయాళ ర్యాపర్, సింగర్ హనుమాన్‌కైండ్ (Hanumankind) సరిహద్దులు దాటుకుని ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్లిపోయాడు. అంతర్జాతీయంగా పాపులర్ అయిన కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్ (Coachella Music and Arts Festival 2025)లో భాగమయ్యాడు. ఇప్పటివరకు ఈ ఉత్సవంలో కేవలం ఇద్దరు భారతీయ సింగర్లు మాత్రమే భాగమయ్యారు. దిల్జిత్ దోసాంజ్, ఏపీ ధిల్లాన్ తర్వాత కోచెల్లాలో భాగమైన మూడో భారతీయ సింగర్‌గా హనుమాన్‌కైండ్ రికార్డు సృష్టించాడు. విజయ్ చివరి సినిమా అయిన జననాయగన్‌లో హనుమాన్‌కైండ్ ఓ స్పెషల్ సాంగ్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
హాలీవుడ్‌లోనే కెరీర్..
అలాగే ఈ సంగీత ఫెస్టివల్‌లో కె. షానన్ ఎంట్రీ కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ సింగర్ కుమార్ సాను కూతురే షానన్. ఈమె పుట్టింది ముంబైలో అయినా చదివింది, కెరీర్‌ను కొనసాగిస్తోంది మాత్రం అమెరికాలోనే! హాలీవుడ్ చిత్రాల్లో నటించడంతో పాటు పలు సాంగ్స్ పాడింది. ఆమె పాడిన గివ్ మి యువర్ హ్యాండ్ బిల్‌బోర్డ్ మ్యాగజైన్‌లోనూ ప్రదర్శితమైంది. ఇదే పాటను కోచెల్లా ఫెస్టివల్‌లోనూ ఆలపించి సంగీతప్రియులను ఉత్సాహపరిచింది. కోచెల్లా ఫెస్టివల్ ఏప్రిల్ 20న ముగియనుంది.
చదవండి: దేవి శ్రీప్రసాద్‌కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్ నైట్ లేనట్లే!