
తొంభైఆరవ ఆస్కార్ అవార్డుల వేడుక పూర్తయి నెల రోజులు మాత్రమే అవుతోంది (మార్చి 10న 96వ ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది). కానీ ఆస్కార్ అకాడమీ మాత్రం అప్పుడే 97వ ఆస్కార్ అవార్డుల వేడుకను గురించిన వివరాలను అధికారికంగా ప్రకటించింది. 2025 మార్చి 2న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ అట్మాస్ థియేటర్‌లో 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరపనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు వెల్లడించారు.
అలాగే వచ్చే ఏడాది జనవరి 17న ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ వివరాలను ప్రకటించనున్నట్లుగా కూడా తెలిపారు. ఇక ఈ ఏడాది నవంబరు 17న ఆస్కార్ గవర్నర్స్ అవార్డుల విజేతల ప్రకటన ఉంటుందని, డిసెంబరు 17న ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాను వెల్లడిస్తారని, ఫిబ్రవరి 8తో ఫైనల్ ఓటింగ్ గడువు ముగుస్తుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment