Oscar Awards Ceremony
-
Oscars 2025: 97వ ఆస్కార్ అవార్డుల డేట్ ఫిక్స్
తొంభైఆరవ ఆస్కార్ అవార్డుల వేడుక పూర్తయి నెల రోజులు మాత్రమే అవుతోంది (మార్చి 10న 96వ ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది). కానీ ఆస్కార్ అకాడమీ మాత్రం అప్పుడే 97వ ఆస్కార్ అవార్డుల వేడుకను గురించిన వివరాలను అధికారికంగా ప్రకటించింది. 2025 మార్చి 2న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ అట్మాస్ థియేటర్లో 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరపనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 17న ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ వివరాలను ప్రకటించనున్నట్లుగా కూడా తెలిపారు. ఇక ఈ ఏడాది నవంబరు 17న ఆస్కార్ గవర్నర్స్ అవార్డుల విజేతల ప్రకటన ఉంటుందని, డిసెంబరు 17న ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాను వెల్లడిస్తారని, ఫిబ్రవరి 8తో ఫైనల్ ఓటింగ్ గడువు ముగుస్తుందని సమాచారం. -
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
సినీరంగంలో అందించే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. అమెరికా లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో మార్చి 10న 96వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అకాడమీ అవార్డ్స్ వేడుకలను హాస్యనటుడు జిమ్మీ కిమ్మెల్ నాల్గవ సారి హోస్ట్ చేయనున్నారు. ఆదివారం రాత్రి జరగనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారతీయులకు లైవ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు. తాజాగా ఈ ఈవెంట్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 11న సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆస్కార్ వేడుకను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలతో వీడియోను షేర్ చేసింది. ఈ ఏడాది అవార్డులకు కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, ఓపెన్‌హైమర్, బార్బీ, మాస్ట్రో, పూర్ థింగ్స్, అమెరికన్ ఫిక్షన్ వంటి లాంటి పోటీ పడుతున్నాయి. ఇండియా నుంచి పోటీలో ‘టు కిల్ ఏ టైగర్’ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌కు ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రం నామినేట్ అయింది. భారత్‌లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. గతేడాది ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఆస్కార్ వేడుకల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విష్పరర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక.. ఈ ఏడాది బరిలో నిలిచిన చిత్రాలివే!
గతేడాదిలో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు మన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విష్పర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాదికి సంబంధించి ఆస్కార్ అవార్డుల వేడుకకు సమయం ఆసన్నమైంది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాగే లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరగనుంది. మార్చి 10, 2024న ఈ ఏడాది ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేట్ అయిన చిత్రాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించిన ఆస్కార్ అకాడమీ.. బరిలో నిలిచిన చిత్రాల జాబితాను వెల్లడించింది. 2024 ఆస్కార్ అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడే చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది. ఈ ఏడాది కూడా వరుసగా నాలుగోసారి జిమ్మీ కిమ్మెల్ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. ఇండియా నుంచి ఆస్కార్ పోటీలో ‘టు కిల్ ఏ టైగర్’ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌కు ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రం నామినేట్ అయింది. భారత్‌లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. గతేడాది ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. 2024లో వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే! ►ఉత్తమ చిత్రం విభాగం అమెరికన్ ఫిక్షన్ అటానమీ ఆఫ్ ఎ ఫాల్ బార్బీ ది హోల్డోవర్స్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ మేస్ట్రో ఒప్పైన్ హైమర్ పాస్ట్ లైవ్స్ పూర్ థింగ్స్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ►ఉత్తమ దర్శకుడి విభాగం అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్స్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: యోర్గోస్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్ ►ఉత్తమ నటుడు విభాగం బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో కోల్మన్ డొమింగో: రస్టిన్ పాల్ జియామటి: ది హోల్డోవర్స్ కిలియన్ మర్ఫీ: ఒప్పైన్ హైమర్ జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్ ►ఉత్తమ నటి విభాగం అన్నెతే బెనింగ్: నయాడ్ లిల్లీ గ్లాడ్‌స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్ కెర్రీ ములిగన్: మేస్ట్రో ఎమ్మాస్టోన్: పూర్ థింగ్స్ ►ఉత్తమ సహాయ నటుడు స్టెర్లింగ్ కె. బ్రౌన్ : అమెరికన్ ఫిక్షన్ రాబర్ట్ డినోరో: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ రాబర్ట్ డౌనీ జూనియర్: ఒప్పైన్ హైమర్ రేయాన్ గాస్లింగ్: బార్బీ మార్క్ రఫెలో: పూర్ థింగ్స్ ► ఉత్తమ సహాయ నటి ఎమిలీ బ్లంట్: ఒప్పైన్ హైమర్ డానియల్ బ్రూక్స్: ది కలర్ పర్పుల్ అమెరికా ఫెర్రారా: బార్బీ జోడీ ఫాస్టర్: నయాడ్ డేవైన్ జో రాండాల్ఫ్: ది హోల్డోవర్స్ ►బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్, ఆర్థర్ హరారీ ది హోల్డోవర్స్: డేవిడ్ హేమింగ్సన్ మేస్ట్రో: బ్రాడ్లీ కూపర్, జోష్ సింగర్ మే డిసెంబర్: సామీ బరుచ్, అలెక్స్ మెకానిక్ పాస్ట్ లివ్స్: సీలింగ్ సాంగ్ ►బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ది ఫైర్ ఇన్సైడ్: ఫ్లామిన్ హాట్ ఐయామ్ జస్ట్ కెన్: బార్బీ ఇట్నెవ్వర్ వెంట్ అవే: అమెరికన్ సింఫనీ వజాజీ (ఏ సాంగ్ ఫర్ మై పీపుల్): కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్: బార్బీ ►బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అమెరికన్ ఫిక్షన్ ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ కిల్లర్స్ ఆఫ్‌ది ఫ్లవర్ మూన్ ఒప్పైన్ హైమర్ పూర్ థింగ్స్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ బాబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్ ది ఇటర్నల్మెమెరీ ఫోర్ డాటర్స్ టు కిల్ ఏ టైగర్ 20 డేస్ ఇన్ మరియా పోల్ ►బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్ ది ఏబీసీస్ఆఫ్ బుక్ బ్యానింగ్ ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్ ఐలాండ్ ఇన్ బిట్విన్ ది లాస్ట్ రిపేష్ షాప్ నైనాయ్ అండ్ వైపో ►బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఇయల్కాపిటానో (ఇటలీ పర్ఫెక్ట్ డేస్ (జపాన్) సొసైట్ ఆఫ్ ది స్నో (స్పెయిన్) ది టీచర్స్ లాంజ్ (జర్మనీ) ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ( యూకే) ► బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే అమెరికన్ ఫిక్షన్: కార్డ్ జెఫర్సన్ బార్బీ: గ్రెటా గెర్విక్, నొవా బాంబాక్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: టోనీ మెక్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లాజర్ ►బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అటానమీ ఇఫ్ ఎ ఫాల్: లారెంట్ ది హోల్డోవర్స్: కెవిన్ టెంట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: తెల్మా స్కూన్మేకర్ ఒప్పైన్ హైమర్: జెన్నిఫర్ లేమ్ పూర్ థింగ్స్: యోర్గోస్ ►బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ బార్బీ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ నెపోలియన్ ఓపెన్‌హైమర్ పూర్ థింగ్స్ ►బెస్ట్ సౌండ్ ది క్రియేటర్ మ్యాస్ట్రో మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1 ఒప్పైన్ హైమర్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ► ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ది క్రియేటర్ గాడ్జిల్లా మైనస్ వన్ గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్3 మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1 నెపోలియన్ ►బెస్ట్ సినిమాటోగ్రఫీ ఎల్కాండే : ఎడ్వర్డ్ లచ్మెన్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: రోడ్రిగో ప్రిటో మ్యాస్ట్రో: మాథ్యూ లిబ్టాక్యూ ఒప్పైన్ హైమర్: హైతీ వాన్ హోతిమా పూర్ థింగ్స్: రాబిన్ రియాన్ ► బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ జాక్వెలిన్ దురన్: బార్బీ జాక్వెలిన్ వెస్ట్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ జాంటీ ఏట్స్, డేవ్ క్రాస్‌మన్: నెపోలియన్ ఎలెన్ మిరాజ్నిక్: ఒప్పెన్ హైమర్ హాలీ వాడింగ్టన్: పూర్ థింగ్స్ ► బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ గోల్డా మాస్ట్రో ఓపెన్‌హైమర్ పూర్ థింగ్స్ సొసైటీ ఆఫ్ ది స్నో ► బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ది ఆఫ్టర్ ఇన్విన్సిబుల్ నైట్ ఆఫ్ ఫార్చ్యూన్ రెడ్, వైట్ అండ్ బ్లూ ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్ ► బెస్ట్ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ లెటర్ టు ఎ పిగ్ నైంటీ- ఫైవ్ సెన్సెస్ అవర్ యూనిఫామ్ ప్యాచిడమ్ వార్ ఈజ్ ఓవర్! -
ప్రారంభమైన ఆస్కార్ ఓటింగ్.. 23న నామినేషన్స్ ప్రకటన
ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 10న లాస్ ఏంజెల్స్‌లో జరగనుంది. కాగా ఓటింగ్ ప్రక్రియను శుక్రవారం మొదలుపెట్టినట్లు ఆస్కార్ అకాడమీ వెల్లడించింది. జనవరి 12న మొదలైన ఈ ఓటింగ్ జనవరి 16 సాయత్రం 5 గంటల వరకు సాగుతుంది. ఆస్కార్ అకాడమీలో పదివేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. (చదవండి: రచ్చ లేపిన గుంటూరు కారం.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?) వీరందరూ వారికి కేటాయించిన విభాగాల్లోని వారికి ఓటు వేస్తారు. అకాడమీలో సభ్యులుగా ఉన్న యాక్టర్స్ యాక్టింగ్ విభాగానికి మాత్రమే ఓటు వేస్తారు. అలాగే మిగతా విభాగాల వారు కూడా. 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డుల విజేతలను ప్రకటిస్తారు. అయితే ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’, ‘డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్’, ‘డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’ విభాగాలకు చెందిన ఓటింగ్‌కు మాత్రం ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయట. ఈ నెల 23న ఆస్కార్ నామినేషన్స్‌ను ప్రకటిస్తారు. ఇప్పటికే పది విభాగాల్లోని షార్ట్ లిస్ట్ జాబితాను ప్రకటించారు ఆస్కార్ నిర్వాహకులు. -
Angela Bassett: హృదయాలను ధైర్యంతో నింపుకోండి!
ఆస్కార్ అకాడమీ పద్నాలుగో ఆనరరీ అవార్డుల ప్రదానం అమెరికాలో జరిగింది. 2023 సంవత్సరానికిగాను నటి ఏంజెలా బాసెట్, నటుడు– రచయిత–ఫిల్మ్ మేకర్ మెల్ బ్రూక్స్, ఫిల్మ్ ఎడిటర్ కరోల్ లిటిల్టన్, సన్డాన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన మిచెల్ సాటర్‌లకు ఈ అవార్డులను ప్రదానం చేసింది అకాడమీ. అయితే ఈ వేడుక గత ఏడాది నవంబరు 18న జరగాల్సింది. కానీ హాలీవుడ్లో రచయితలు, నటీనటులు చేసిన సమ్మెల కారణంగా ఈ వేడుక వాయిదా పడింది. తాజాగా ఈ అవార్డు ప్రదానోత్సవం అమెరికాలో జరిగింది. ఈ గౌరవ పురస్కారాల అవార్డు విభాగంలో రెండో అవార్డును గెలుచుకున్న బ్లాక్ లేడీగా నిలిచారు ఏంజెలా బాసెట్. తొలిసారిగా నటి సిసిలీ టైసన్ ఈ గౌరవాన్ని ΄÷ందారు. ‘‘ఈ విభాగంలో నేను అవార్డు అందుకున్నందుకు ఆమె (సిసిలీ) స్వర్గంలో ఆనందంగా ఉండి ఉంటారు. నా తోటి బ్లాక్ యాక్ట్రస్ అందరికీ చెబుతున్నాను. మీ హృదయాలను ధైర్యంతో నింపుకోండి. ధృడంగా ఉండండి’’ అంటూ అవార్డు అందుకున్న అనంతరం ఏంజెలా బాసెట్ ఉద్వేగంగా ప్రసంగించారు. ‘‘మీ సహచరులు మీ పనిని మెచ్చుకున్నప్పుడు మరియు వారు ఈ బంగారు విగ్రహంతో అభినందించినప్పుడు కలిగే ఆనందమే వేరు. ఈ పురస్కారానికి నా మనసులో ఎప్పటికీ గౌరవం ఉంటుంది. అందుకే ఈ అవార్డును అమ్మను సుమా..’’ అని చమత్కరించారు మెల్ బ్రూక్స్. ఈ వేడుకలో టామ్ హాంక్స్, జూలియన్నే మూర్, మార్గొట్ రాబీ, కోల్మన్ డొమింగో వంటి హాలీవుడ్ ప్రముఖులు ΄ాల్గొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... చిత్రసీమకు విశిష్టమైన సేవలు అందించిన వారికి ఈ హానరరీ అవార్డులను ప్రదానం చేస్తుంటారు. మరోవైపు ఈ ఏడాది మార్చిలో 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లో జరగనుంది. జనవరిలో నామినేషన్స్ వెల్లడి కానున్నాయి. -
ఆస్కార్‌లో కొత్త రూల్.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ
ప్రతి ఏడాది ఆస్కార్ సభ్యత్వ నమోదు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు విజేతల నిర్ణయానికి ఈ సభ్యుల ఓటింగ్ కీలకంగా నిలుస్తుంది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న జరగనుంది. కాగా ‘క్లాస్ ఆఫ్ 2023’లో భాగంగా 398 మంది కొత్త సభ్యులకు ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానాన్ని పంపినట్లు ఆస్కార్ కమిటీ సీఈవో బిల్ క్రామెర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్ వెల్లడించారు. ఈ జాబితాలో మన దేశం నుంచి దాదాపు 15 మందికి ఆహ్వానం అందడం విశేషం. తెలుగు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌లో ఆరుగురు, తమిళం నుంచి మణిరత్నం, బాలీవుడ్‌నుంచి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ వంటివారు ఉన్నారు. వృత్తిపరమైన అర్హతలు, ప్రపంచవ్యాప్త గుర్తింపు వంటి అంశాల ఆధారంగా ఈ ‘క్లాస్ ఆఫ్ 2023’ జాబితాను తయారు చేసినట్లు అకాడమీ పేర్కొంది. ఈ 398 మందిలో 51 దేశాలకు చెందినవారు ఉండగా, వీరిలో 40 శాతం మంది మహిళలు, 52 శాతం మంది యూఎస్‌కు చెందనివారు ఉన్నట్లుగా ఆస్కార్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ కొత్త సభ్యులతో కలిసి ఆస్కార్ మెంబర్‌షిప్‌లు కలిగి ఉన్నవారి సంఖ్య 10, 817కు చేరినట్లు హాలీవుడ్ అంటోంది. ఆర్ఆర్ఆర్ నుంచి ... ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకుగాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ యంయం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌లకు అకాడమీ ఆహ్వానాలు అందాయి. అలాగే ఈ చిత్రం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌లు కూడా ఆస్కార్ అకాడమీ సభ్యులు కానున్నారు. దర్శకులు మణిరత్నం, షౌనక్ సేన్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ దర్శకుడు), నిర్మాతలు కరణ్ జోహర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపబడిన గుజరాతీ ఫిల్మ్ ‘ది ఛెల్లో షో’ నిర్మాత), చైతన్య తమ్హానే (మరాఠీ), ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీకి చెందిన గిరీష్ బాలకృష్ణన్, క్రాంతి శర్మ, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌లు హరేష్ హింగో రాణి, పీసీ సనత్, ఫిల్మ్ ఎగ్జిక్యూ టివ్‌లు శివానీ రావత్, శివానీ పాండ్యా మల్హోత్రా వంటివారు ఉన్నారు. గర్వంగా ఉంది – రాజమౌళి ‘‘ఆస్కార్ అకాడమీ సభ్యత్వ నమోదు కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి ఆరుగురికి ఇన్విటేషన్స్ రావడం గర్వంగా ఉంది. వీరితో పాటు భారతదేశం తరఫున ఆస్కార్ ఆహ్వానం అందుకున్నవారికి కూడా నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు రాజమౌళి. కొత్త రూల్ ఓ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి పంపాలంటే కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. యూఎస్‌లోని ఆరు ప్రధాన నగరాల్లో (న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, చికాగో, మియామి, అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో) ఆ సినిమా కనీసం ఏడు రోజులు ప్రదర్శితం కావాలి. వీటిలో ఒక షో సాయంత్రం ప్రైమ్ టైమ్‌లో ఉండాలి, థియేటర్స్‌లో కనీస సీటింగ్ సామర్థ్యం ఉండాలి. తాజాగా బెస్ట్ పిక్చర్, ఫారిన్ బెస్ట్ ఫిల్మ్ విభాగాలకు సంబంధించి కొత్త రూల్ పెట్టనున్నారట. ఇకపై ఆస్కార్‌కు ఓ సినిమాను పంపాలంటే యూఎస్‌లోని పాతికకు పైగా మూవీ మార్కెట్స్ ఉన్నచోట సినిమాలు ప్రదర్శించబడాలట. అది కూడా రెండువారాలకు పైగా. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ కొత్త రూల్‌ను 97వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం (2025) నుంచి అమలులోకి తేవాలని అవార్డ్ కమిటీ ప్లాన్ చేస్తోందన్నది హాలీవుడ్ టాక్. ఆ నలుగురికీ గౌరవం ‘‘ఈ నలుగురూ చలన చిత్రపరి శ్రమలో మంచి మార్పుకు నాంది అయ్యారు. తర్వాతి తరం ఫిల్మ్ మేకర్స్‌కి, ఫ్యాన్స్‌కి స్ఫూర్తిగా నిలిచారు. వీరిని సత్కరించడం ‘బోర్డ్ ఆఫ్ గవర్నర్స్’కి థ్రిల్‌గా ఉంది’’ అని ఆస్కార్ అకాడమీ అవార్డ్ అధ్యక్షుడు జానెట్ యాంగ్ అన్నారు. సినిమా రంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ‘గవర్నర్ అవార్డ్స్’లో భాగంగా హానరరీ ఆస్కార్ అవార్డ్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఈ గౌరవ ఆస్కార్‌ను అందుకోనున్న నలుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. నటి ఏంజెలా బాసెట్, రచ యిత–దర్శకుడు–నటుడు–గేయ రచయిత మెల్ బ్రూక్స్, ఫిల్మ్ ఎడిటర్ కరోల్ లిటిల్టన్లతో పాటు సన్డాన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన మిచెల్ సాటర్‌లకు అవార్డును అందజేయనున్నారు. నవంబర్ 18న లాస్ ఏంజెల్స్‌లోని ఫెయిర్మాంట్ సెంచరీ ప్లాజాలో జరిగే వేడుకలో ఈ నలుగురూ గౌరవ పురస్కారాలు అందుకుంటారు. -
ఆస్కార్ నైన్టీసిక్స్కి డేట్ ఫిక్స్
95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగి నెలన్నర (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) అవుతోంది. అప్పుడే 96వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన ప్లాన్ మొదలుపెట్టింది కమిటీ. వచ్చే ఏడాది మార్చి 10న ఆస్కార్ వేడుక జరపనున్నట్లు ప్రకటించి, ఇందుకు సంబంధించిన కొన్ని కీలకమైన తేదీలను కూడా వెల్లడించారు నిర్వాహకులు. 96వ ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్‌ను ఈ ఏడాది డిసెంబరు 21న ప్రకటిస్తారు. నామినేషన్స్‌ను వచ్చే ఏడాది జనవరి 23న వెల్లడిస్తారు. ఆస్కార్ విజేతల ఎంపికకు ఫిబ్రవరి 22న ఓటింగ్ ఆరంభించి, 27 వరకూ కొనసాగిస్తారు. అవార్డుల ప్రదానోత్సవం మార్చి 10న జరుగుతుంది. ఇక జనరల్ ఎంట్రీ కేటగిరీలో అవార్డుల దరఖాస్తుల స్వీకరణకు నవంబరు 15 చివరి తేదీగా పేర్కొంది కమిటీ. మొత్తం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందిస్తారు. -
అత్యధిక ఆస్కార్స్ గెలుచుకున్న చిత్రమిదే.. పదేళ్ల కష్టానికి ప్రతిఫలం
మిషెల్ యో, స్టెఫానీ, కే హుయ్ క్వాన్, జెన్నీ స్లాట్, జామి లీ కర్టిస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్’. డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ గత ఏడాదిæ బాక్సాఫీస్ వద్ద సూపర్ బంపర్‌హిట్ కొట్టింది. 25 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం అంతకు నాలుగు రెట్లు అంటే వంద మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసింది. ఇక ఏడు ఆస్కార్ అవార్డులను సాధించిన ఈ చిత్రకథ విషయానికి వస్తే... చైనా నుంచి అమెరికాకు వలస వచ్చిన ఎవిలిన్ క్వాడ్ కుటుంబం అక్కడ లాండ్రీషాపు పెట్టుకుని జీవనం సాగిస్తుంటుంది. వీరు ఒక ప్రపంచంలో జీవిస్తున్నట్లే మరో ప్రపంచంలో వీరిలాంటి వారే ఉంటారు. వీరు ఒకరికొకరు తారసపడినప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అన్నదే కథ. ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ చిత్రదర్శకులు డేనియల్ క్వాన్, స్కీనెర్ట్ 2010లోనే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రకథను స్టార్ట్ చేశారు. కానీ షూటింగ్‌కి వెళ్లడానికి పదేళ్లు పట్టింది. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం 2022 లో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. -
ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ..
‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా...’ పాటలో దమ్ముంటే లోకం పాడుతుంది.. ఆడుతుంది.. ఆ పాట విశ్వ విజేత అవుతుంది. ‘నాటు నాటు...’ అందుకో ఉదాహరణ. క్లాస్, మాస్ తేడా లేకుండా నాటు బీటు అందరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. తెలుగు పరిశ్రమ తొలి ఆస్కార్ ఆనందాన్ని చవి చూసేలా చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి, డాల్బీ థియేటర్లో ఇతరుల కరతాళ ధ్వనుల మధ్య చిత్రసంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్‌ని అందుకున్నారు. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ 95వ ఆస్కార్ అవార్డు విశేషాలు తెలుసుకుందాం... అంతర్జాతీయ వేదికపై తెలుగోడి ‘నాటు నాటు’ మారుమోగిపోయింది. ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులు అదిరిపోయాయి. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. దాదాపు 80 పాటలను పరిశీలించి 15 పాటలను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు కోసం షార్ట్‌లిస్ట్ చేసింది ఆస్కార్ కమిటీ. ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషన్స్‌తో ‘నాటు నాటు..’ విదేశీయులకు కూడా మరింత చేరువైంది. ఈ క్రమంలోనే జనవరి 24న వెల్లడైన ఆస్కార్ నామినేషన్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు..’కు చోటు దక్కింది. ‘ నాటు నాటు’ పాటతో పాటు ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ చిత్రంలోని ‘అప్లాజ్’, ‘బ్లాక్‌పాంథర్: వకాండ ఫరెవర్’లోని ‘లిఫ్ట్ మీ అప్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రంలోని ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’లోని ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలు బరిలో నిలిచాయి. అయితే వీటన్నింటినీ దాటుకుని తెలుగు ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డును తెచ్చింది. ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త చరిత్రకు పునాది వేసింది. ఇలా దేశానికి ఆస్కార్ తెచ్చిన తొలి చిత్రంగా, తొలి తెలుగు చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది (గతంలో కొందరు భారతీయులు, ఇండో–అమెరికన్స్ ఆస్కార్ అవార్డులు సాధించినప్పటికీ అవి భారతీయ చిత్రాలు కావు). ఒక ఏషియన్ చిత్రం (ఆర్ఆర్ఆర్) నుంచి ఓ పాటకు (నాటు నాటు) అవార్డు రావడం ఇదే తొలిసారి. అలాగే నాన్–ఇంగ్లిష్ పాటల్లో ఆస్కార్ అవార్డు సాధించిన నాలుగో పాటగా ‘నాటు నాటు’ నిలిచింది. ఇక ఆస్కార్ అవార్డు సాధించిన తొలి తెలుగు వ్యక్తులుగా కీరవాణి, చంద్రబోస్ రికార్డు సృష్టించారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించిన రెండో భారతీయుడుగా కీరవాణి, రెండో గీత రచయితగా చంద్రబోస్ నిలిచారు. 2009లో జరిగిన 81వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఇంగ్లిష్ చిత్రం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కి గాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఏఆర్ రెహమాన్, రచయిత గుల్జార్ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ప్రకటించిన మొత్తం 23 విభాగాల జాబితాల్లోకి వస్తే... ఉత్తమ చిత్రం: ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్ ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ నటుడు: బ్రెండెన్ ఫ్రాసెర్ (ది వేల్) ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ ఒరిజినల్‌సాంగ్: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’(మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్) ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్ క్వాన్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సహాయ నటి: జామి లీ కర్టిస్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ క్యాస్ట్యూమ్ డిజైన్: రూథ్ కార్టర్(బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్) ఉత్తమ స్క్రీన్ ప్లే: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సినిమాట్రోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్) ఉత్తమ ఎడిటర్: పాల్ రోజర్స్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్ (జర్మనీ) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నవాల్నీ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్ 2) బెస్ట్ సౌండ్: టాప్‌గన్: మ్యావరిక్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిల్: ది వేల్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: పినాషియో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ఏన్ ఐరిస్ గుడ్ బై యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్ అండ్ ది హార్స్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: షెరా పాల్లే (ఉమెన్ టాకింగ్) బెస్ట్ ఒరిజినల్ స్కోర్: బ్రెటెల్‌మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) హోస్ట్ జిమ్మిపై నెటిజన్ల ఆగ్రహం ఆస్కార్ వేడుక ప్రారంభంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తావన వచ్చినప్పుడు హోస్ట్ జిమ్మి ‘ఆర్ఆర్ఆర్’ బాలీవుడ్ మూవీ అన్నట్లుగా చెప్పారు. దీంతో నెటిజన్లు జిమ్మి కిమ్మెల్ను తప్పుపడుతూ కామెంట్ల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా అని గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆస్కార్‌లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డుకు హోస్ట్ అయిన జిమ్మీ బాలీవుడ్ మూవీ అనడం సరికాదని çపలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శించారు. డు యూ నో నాటు? ‘నాటు నాటు’ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్కక్కర్లేదు. కానీ ఆస్కార్ వేదికపై ‘డు యూ నో నాటు?.. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు’.. అంటూ దేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌కి ఓ ప్రెజెంటర్‌గా వెళ్లిన దీపికా పదుకోన్ ‘నాటు నాటు’ పాటను పరిచయం చేశారు. వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ‘నాటు నాటు’ పాటను పాడగా, వెస్ట్రన్ డ్యాన్సర్స్ కాలు కదిపారు. ఈ వేడుకలో వీక్షకుల్లో ‘నాటు నాటు..’ పాట ఎంత జోష్ నింపిందంటే.. పాట పూర్తయ్యాక అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..? -
Oscars 2023 Photos: అపురూప క్షణాలు.. అవార్డు ఫంక్షన్లో మెరిసిన తారక్-రామ్‌చరణ్ ( ఫొటోలు)
-
ఆస్కార్ బరిలో ఆ ఐదుగురు స్పెషల్.. ఎందుకంటే?
ఆస్కార్ ఆ పేరు వింటేనే అదో గొప్ప. అవార్డ్ రాకపోయినా సరే.. కనీసం నామినేట్ అయినా ఆ ఫీలింగే వేరు. ప్రపంచ వేదికపై మన పేరు వినిపించాలని ఎవరికీ మాత్రం కోరిక ఉండదు. ఈ ఏడాది జరగునున్న 95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఆసక్తికర విషయాలెన్నో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కేటగిరీలో ఐదుగురు పోటీ పడుతున్నారు. కాగా.. ఉత్తమ నటుడు విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ఐదుగురు గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఎందుకంటే ఈ ఐదుగురు తొలిసారి ఆస్కార్ బరిలో నిలవడం విశేషం. దీంతో ఎవరినీ అవార్డ్ వరించినా అది తొలిసారి దక్కించుకున్న ఘనత వారికి సొంతమవుతుంది.. ఉత్తమ నటుడి రేసులో తొలిసారి పోటీలో నిలిచిన ఐదుగురు వీరే ఆస్టిన్ రాబర్ట్ బట్లర్ అమెరికన్ సింగర్ ఎల్వీస్ ప్రెస్లీ జీవిత కథలో అద్భుతంగా నటించారు ఆస్టిన్ రాబర్ట్ బట్లర్. ఆయన నటనే 95వ ఆస్కార్ రేసులో నిలిచేలా చేసింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్నారు. బట్లర్ యుక్త వయస్సులోనే టెలివిజన్ ధారావాహికలు ‘ది క్యారీ డైరీస్’, ది షన్నారా క్రానికల్స్’ లో నటనకు పేరు సంపాదించారు. ఏలియన్స్ ఇన్ ది అట్టిక్(2009) చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌లో మోస్ట్ ప్రామిసింగ్ పెర్ఫార్మర్ అవార్డును కైవసం చేసుకున్నారు. కోలిన్ జేమ్స్ ఫారెల్ ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ చిత్రంలో పాడ్రాయిక్ పాత్రతో నామినేషన్ దక్కించుకున్నారు కోలిన్ జేమ్స్ ఫారెల్(46). ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు. ఫారెల్ ది వార్ జోర్ సినిమాతో కెరీర్ మొదలెట్టిన కోలిన్ జేమ్స్ ‘టైగర్ ల్యాండ్, మైనారిటీ రిపోర్ట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ కామెడీ చిత్రం ఇన్ బ్రూగెస్‌లో ఆయన పాత్రకి ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. బ్రెండన్ జేమ్స్ ఫ్రేజర్ కామెడీ సినిమాలతో గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు బ్రెండన్ జేమ్స్ ఫ్రేజర్. ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచారాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి యుక్త వయస్సులో ఉన్న తన కూతురితో బంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నించే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది వేల్’. ఈ చిత్రంలో ఉపాధ్యాయుడి పాత్రను పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన ‘డాగ్ ఫైట్’, ‘ఎన్సినో మ్యాన్, స్కూల్ టైస్, జార్జ్ ఆఫ్ ది జంగిల్’ లాంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ‘ది వేల్’ చిత్రంలోని నటనకు ఫ్రేజర్ ఉత్తమ నటుడిగా 12 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. చిన్న వయస్సులో పాల్ మెస్కల్ ఆస్కార్ ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందిన అతి చిన్న వయస్సు కలిగిన నటుడు పాల్ మెస్కల్(27). ‘ఆఫ్టర్ సన్’ ఈ చిత్రంలో 11 ఏళ్ల అమ్మాయికి తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నార్మల్ పీపుల్ అనే మినీ సిరీస్‌తో మెస్కల్ గుర్తింపు పొందారు. బ్రిటీష్ అకాడమీ టెలివిజన్ అవార్డ్స్‌లో కూడా ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కించుకున్నారు. అత్యధిక వయసులో బిల్ నైజీ అత్యధిక వయసులోనూ ‘లివింగ్’ అనే చిత్ర నటుడు బిల్ నైజీ 73 ఏళ్ల వయసులో బరిలో నిలిచాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. ప్రాణాంతకమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి పాత్రలో నటించి మెప్పించారు. ‘గిడియాన్స్ డాటర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. లవ్ యాక్చువల్లీ అనే చిత్రానికి బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. -
Oscars 2023: ఆస్కారం ఎవరికి ఎక్కువ!.. లైవ్ ఎన్ని గంటలకు?
ఆస్కార్ సంబరానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల12న (భారతీయ కాలమానం ప్రకారం 13వ తేదీ) లాస్ ఏంజిల్స్‌లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. 23 విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. ఆస్కార్ రేస్‌లో ఉన్న చిత్రాల్లో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రం అత్యధికంగా 11 నామినేషన్స్‌ను దక్కించుకుంది. ఆ తర్వాత ‘ది బన్షీష్ ఆఫ్ ఇనిషెరిన్’, ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ చిత్రాలు తొమ్మిది నామినేషన్స్‌తో పోటీలో ఉన్నాయి. కాగా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి వంటి విభాగాలతోపాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కు నామినేట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’పాట గురించి కూడా హాలీవుడ్లో జోరుగా చర్చ జరుగుతోంది. అవార్డు దక్కే ఆస్కారం ఎక్కువగా ఎవరికి ఉంది? అంటూ హాలీవుడ్ చేస్తున్న విశ్లేషణలోకి వెళదాం. ఉత్తమ చిత్రం బెస్ట్ మూవీ విభాగంలో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘ది బన్షీష్ ఆఫ్ ఇనిషెరిన్’, ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’, ‘ఎల్విస్’, ‘ది ఫేబుల్‌మ్యాన్స్’, ‘టార్’, ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్’, ‘ఉమెన్ టాకింగ్’ ఇలా మొత్తం పది చిత్రాలు బరిలో ఉన్నాయి. కాగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రానికే అవార్డు దక్కే ఆస్కారం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. 28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్, 29వ యాన్యువల్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్, 38వ ఫిల్మ్ ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్ ప్రదానోత్సవాల్లో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ ఉత్తమ చిత్రం విభాగంలో విజేతగా నిలిచింది. అలాగే ఇతర విభాగాల్లో 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, 76వ బాఫ్తా అవార్డ్స్‌లో ఈ చిత్రం అవార్డులను సాధించి, ఆస్కార్ కమిటీ దృష్టిని ఆకర్షించింది. చైనా నుంచి అమెరికాకు వలస వచ్చి, లాండ్రీ షాపు పెట్టుకున్న ఓ కుటుంబం అనుకోని ప్రమాదాల నుంచి ఎలా బయటపడింది? అన్నదే ఈ చిత్రకథ. డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్డ్ దర్శకత్వంలో ఆంథోనీ రుస్సో, జో రుస్సో, మైక్లరోకా, జోనాథన్ వాంగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిచెల్ యోహ్, స్టెఫానీ హ్సు, కే హుయ్ క్వాన్ ముఖ్య తారలు. ఉత్తమ దర్శకుడు ఉత్తమ దర్శకుడి విభాగంలో మార్టిన్ మెక్‌డొనాగ్ (ది బన్షీష్ ఆఫ్ ఇనిషెరిన్) డానియల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), స్టీవెన్ స్పీల్బర్గ్ (ది ఫేబుల్‌మ్యాన్స్), రూబెన్ ఆస్టాండ్ (ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్) టడ్ ఫీల్డ్ (టార్) పోటీ పడుతున్నారు. కాగా డానియల్ క్వాన్, డానియేల్ స్కీనెర్ట్‌లు ఉత్తమ దర్శకులుగా అవార్డు తీసుకెళ్తారని టాక్. 28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్‌లో క్వాన్, స్కీనెర్ట్ అవార్డు సాధించారు. ఉత్తమ నటుడు ఉత్తమ నటుడి విభాగంలోని అవార్డు కోసం ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్), కొలిన్ ఫార్రెల్ (ది బన్షీష్ ఆఫ్ ఇని షెరిన్), బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్), బిల్ నిగీ (లివింగ్),పాల్ మెస్కల్ (ఆఫ్టర్సన్) పోటీ పడుతున్నారు. అయితే ఎక్కువ పోటీ మాత్రం ‘ఎల్విస్’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన ఆస్టిన్ బట్లర్, ‘ది వేల్’ చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్రెండెన్ ఫ్రాసెర్ల మధ్య కనిపిస్తోంది. ఇక ఇటీవల జరిగిన క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్‌గా బ్రెండన్ ఫ్రాసెర్ అవార్డును కొల్లగొట్టగా, 80వ గోల్డెన్ గ్లోబ్, 76వ బాఫ్తా అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఆస్టిన్ బట్లర్ నిలిచారు. దీన్ని బట్టి ఆస్టిన్ బట్లర్‌కే ఉత్తమ నటుడి అవార్డు దక్కే అవకాశం కనిపిస్తోంది. అమెరికన్ రాక్ అండ్ రోల్ మ్యూజిక్ సింగర్, యాక్టర్ ఎల్విస్ ప్రెస్లీ జీవితం ఆధారంగా రూ΄÷ందిన ‘ఎల్విస్’లో టైటిల్ రోల్లో తన నటనతో వావ్ అనిపించారు ఆస్టిన్ బట్లర్. ఈ చిత్రానికి బాజ్ లుహార్మాన్ దర్శకుడు. ఉత్తమ నటి ఉత్తమ నటి విభాగంలో అవార్డు కోసం పోటీలో ఉన్న ‘అన్నా దె అర్మాస్’ (బ్లాండ్), ‘ఆండ్రియా రైజ్‌బరో’ (టు లెస్లీ), ‘మిషెల్ యో’ (ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్), ‘మిషెల్ విలియమ్స్’ (ది ఫేబుల్‌మ్యాన్స్) లను దాటుకుని ‘కేట్ బ్లాంచెట్’ (టార్) విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, బాఫ్తా అవార్డ్స్ ప్రదానోత్సవాల్లో ఉత్తమ నటిగా ‘కేట్ బ్లాంచెట్’ అవార్డులు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగల ప్రతిభ ఉన్న ఓ మహిళా సంగీత విద్యాంసురాలు జీవితంలో ఎదుగుతున్న సమయంలో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఎలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కోవలసి వచ్చింది? వాటిని ఆమె ఎలా అధిగమించారు? అన్నదే ‘టార్’ సినిమా కథాంశం. మహిళా విద్వాంసురాలిగా కేట్ బ్లాంచెట్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు టాడ్ ఫీల్డ్ దర్శకుడు. ఆస్కార్‌లో భారత్ ఈ ఏడాది దేశం నుంచి మూడు విభాగాల్లో (బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్) నామినేషన్స్ దక్కాయి. ఈ మూడు విభాగాల్లోనూ అవార్డులు రావాలని భారతీయ సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇక బరిలో ఉన్న ఈ మూడు విభాగాల విశేషాల్లోకి వస్తే... నాటు నాటు..కే అవార్డు? ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఐదుపాటలు బరిలో ఉన్నాయి. వీటిలో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’పాటకు అవార్డు వస్తుందని హాలీవుడ్ మీడియా జోస్యం చెబుతోంది. ఇప్పటికే 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో, 28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ సాంగ్’గా ‘నాటు నాటు..’ నిలిచింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తదితర అవార్డ్స్‌లోనూ అవార్డులు గెల్చుకుంది. కీరవాణి స్వరపరచిన ఈపాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవపాడిన సంగతి తెలిసిందే. ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ‘నాటు నాటు’తోపాటు ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’లోని ‘అప్లాజ్’, ‘బ్లాక్΄పాంథర్: వకాండ ఫరెవర్’లోని ‘లిఫ్ట్ మీ అప్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’లోని ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’ చిత్రం నుంచి ‘హోల్డ్ మై హ్యాండ్’పాటలు నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఒకవేళ ‘నాటు నాటు..’పాటకు అవార్డ్ వస్తే భారతీయులకు పండగే పండగ. గాయపడ్డ పక్షుల కోసం... బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో శౌనక్ సేన్ దర్శకత్వం వహించిన ఇండియన్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ నామినేషన్ దక్కించుకుంది. గాయపడిన పక్షుల సంరక్షణ కోసం ఢిల్లీకి చెందిన సోదరులు నదీమ్ షెహజాద్, మహమ్మద్ సౌద్ తమ జీవితాలను ఏ విధంగా త్యాగం చేశారు? అన్నదే ఈ డాక్యుమెంటరీ ప్రధాన కథాంశం. గత ఏడాది 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఆల్ దట్ బ్రీత్స్’ గోల్డెన్ ఐ అవార్డును సాధించింది. ఇక ఇదే విభాగంలో అమెరికన్ ‘ఫైర్ ఆఫ్ లవ్’, రష్యా ‘నవల్నీ’, ‘ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్పింట్లర్స్’, ‘ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్ షెడ్’ పోటీలో ఉన్నాయి. తప్పిపోయిన ఏనుగు తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ రూ΄÷ందించిన డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’తోపాటు ‘హాలౌట్’, ‘హౌ డు యు మెసర్ ఎ ఇయర్’, ‘ది మార్తా మిచెల్ ఎఫెక్ట్’, ‘స్ట్రేంజర్ ఎట్ ది గేట్’ పోటీలో ఉన్నాయి. లైవ్‌లో నాటు.. నాటు ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు..’పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్పాడనున్నారు. ఈపాటకు తాను కూడా లైవ్‌లో పెర్ఫార్మ్ చేయనున్నట్లు ఆమెరికన్ యాక్ట్రస్, డ్యాన్సర్ లారెన్ గాట్లీబ్ వెల్లడించారు. కాగా హిందీలో ‘ఏబీసీడీ’, ‘ఏబీసీడీ 2’ వంటి చిత్రాల్లో నటించారామె. ప్రీ ఆస్కార్పార్టీ అమె రికాలో ప్రీ ఆస్కార్పార్టీ అదిరిపోయే లెవల్లో జరిగింది. ఈపార్టీలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతోపాటు ప్రియాంకా చో్ర΄ా, ప్రీతి జింతా తదితర ప్రముఖులుపాల్గొన్నారు. లైవ్ ఎన్ని గంటలకు అంటే... సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి భారతీయులు ఆస్కార్ అవార్డు వేడుకను వీక్షించవచ్చు. అవార్డు వేడుక లాస్ ఏంజిల్స్‌లో ఆదివారం రాత్రి 8 గంటలకు ఆరంభమయ్యే రెండు గంటల ముందు రెడ్ కార్పెట్ సందడి షురూ అవుతుంది. వేడుక దాదాపు 11 గంటలకు ముగిసే అవకాశం ఉంది. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి వేడుకను వీక్షించవచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఏబీసీ నెట్వర్క్ (ఏబీసీ టీవీ, ఏబీసీ.కామ్, ఏబీసీ యాప్, యూట్యూబ్) హులు లైవ్ టీవీ, డైరెక్ట్ టీవీ, ఫ్యూబో టీవీ, ఏటీ అండ్ టీ టీవీలో ఆస్కార్ అవార్డుల వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. అయితే కొన్నింటికి సబ్స్క్రిప్షన్ అవసరమవుతుంది. -
దీపికా పదుకోన్‌కు అరుదైన గౌరవం
బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకోన్‌కు ఆస్కార్ అవార్డు కమిటీ నుంచి ఆహ్వానం అందింది. మార్చి 12న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ వేదికపై మెరవనున్నారామె. జిమ్మి కెమ్మల్ హోస్ట్‌గా జరగనున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ఓ ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు దీపికా పదుకోన్. ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవ తొలి దశ ప్రెజెంటర్స్ 16 మంది జాబితాను నిర్వాహకులు ప్రకటించారు. రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, మైఖేల్ బి జోర్డాన్, గ్లెన్ క్లోజ్, శ్యాముల్ ఎల్. జాక్సన్, డ్వేన్ జాన్సన్, జోయ్ సాల్డానా, జెన్నిఫర్ కొన్నెల్లీ తదితర హాలీవుడ్ తారలు ఉన్న ఈ జాబితాలో దీపికా పదుకోన్ ఉన్నారు. ఇక 2017లో జరిగిన ఆస్కార్ ఆఫ్టర్ పార్టీ (అవార్డుల ప్రదానోత్సవం తర్వాత జరిగే పార్టీ)లో పాల్గొన్న దీపికా ఈసారి ఓ ప్రెజెంటర్‌గా ఈవెంట్‌కు వెళ్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రెజెంటర్స్ మలి జాబితా లోనూ ఇండియన్ స్టార్స్ ఉంటారా? అనే విషయం తెలియాలంటే కొంత సమయం వేచి ఉండాలి. ఇక ‘బెస్ట్ ఒరిజి నల్ సాంగ్’ విభాగంలో అవార్డు కోసం ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేదికపై లైవ్‌లో ఈ పాట పాడనున్నారు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ గత ఏడాది మార్చిలో విడుదలైన సంగతి తెలిసిందే. మొదలైన ఓటింగ్ ఆస్కార్ అవార్డు విజేతలకు సంబంధించిన ఆన్లైన్ ఓటింగ్ గురువారం ఆరంభమైంది. ఈ ఓటింగ్ మార్చి 7 వరకు జరుగుతుంది. ఆస్కార్ అకాడమీలో పదివేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరందరూ ఆన్లైన్లో ఓటింగ్ వేస్తారు. ఓటర్స్‌లో ఉన్న యాక్టర్స్ ‘యాక్టింగ్’ విభాగానికి, ఎడిటర్స్ ‘ఎడిటింగ్’ విభాగానికి.. ఇలా ఇతర విభాగాలకు చెందినవారు ఆ విభాగానికి ఓట్లు వేస్తారు. కానీ ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’, ‘యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్’ విభాగాల ఓటింగ్‌కు మాత్రం ప్రత్యేక నియమ నిబంధనలున్నాయి. అలాగే బెస్ట్ పిక్చర్స్ విభాగానికి ఆస్కార్ ఓటర్స్ అందరూ ఓటు వేయొచ్చు. ఓటింగ్ పూర్తయ్యాక ఆ ఫలితాలు ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ సంస్థ వద్ద ఉంటాయి. అవార్డులను అధికారికంగా ప్రకటించడానికి ముందు ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (ఆస్కార్ ఆన్లైన్ ఓటింగ్ రిజల్ట్స్ సెక్యూరిటీని చూసేవారు)కు చెందిన ఇద్దరు వ్యక్తులకు మాత్రమే విజేతలు ఎవరో తెలుస్తుందని అవార్డు కమిటీ పేర్కొంది. బెస్ట్ పిక్చర్ ఓటింగ్ ఇలా.. బెస్ట్ పిక్చర్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న చిత్రాలకు ఆస్కార్ ఓటర్లు 1, 2, 3.. అంటూ ర్యాంకింగ్‌లు ఇస్తారు. ఓటర్లందరూ ర్యాంకింగ్‌లు ఇచ్చిన తర్వాత ఏ చిత్రం యాభైశాతం ఓటర్ల ఫేవరెట్‌గా నిలుస్తుందో అదే బెస్ట్ పిక్చర్‌గా నిలుస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’కు స్టాండింగ్ ఒవేషన్ ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌లో హీరో రామ్‌చరణ్ (మరో హీరో ఎన్టీఆర్ సోమవారం అమెరికా వెళ్తారని తెలిసింది), దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్ అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ను ఈ నెల 3న రీ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా లాస్ ఏంజిల్స్‌లోని ప్రముఖ ఏస్ హోటల్ థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ను ప్రదర్శించారు. షో పూర్తయ్యాక ‘ఆర్ఆర్ఆర్’కు స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘ఓ నటుడిగా ఈ క్షణాలను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. ఎంత కష్టపడైనా సరే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలన్నదే నా లక్ష్యం. రాజమౌళిగారితో పని చేస్తే సినిమాల పట్ల నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. ఆయన నాకు ప్రిన్సిపాల్, గురువులాంటివారు. ‘ఆర్ఆర్ఆర్’తో తారక్ (ఎన్టీఆర్) నాకు ఇంకా ఇంకా దగ్గరయ్యాడు’’ అన్నారు. -
ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్.. ఎంపికైన నాటు నాటు సాంగ్
సినీరంగంలో అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ విడుదలయ్యాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన టాలీవుడ్ సంచలన మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి 'నాటు నాటు సాంగ్' ఎంపికైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్వీట్ చేసింది. 'సరికొత్త చరిత్ర సృష్టించాం' అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ నామినేట్ అయింది. తాజాగా ఈ జాబితాను ఆస్కార్ నామినేషన్స్ కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది 95వ ఆస్కార్ నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 13న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు స్థానం దక్కించుకున్నాయి. షార్ట్ ఫిల్మ్ విభాగంలో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విష్పరర్స్, ఆల్ దట్ బ్రీత్స్ ఎంపికయ్యాయి. మొత్తానికి నామినేషన్స్‌లో ఇండియా మూడు చిత్రాలు ఎంపికయ్యాయి. ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ జాబితా నాటు నాటు (ఆర్ఆర్ఆర్) అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్) హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్) లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్) ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) WE CREATED HISTORY!! 🇮🇳 Proud and privileged to share that #NaatuNaatu has been nominated for Best Original Song at the 95th Academy Awards. #Oscars #RRRMovie pic.twitter.com/qzWBiotjSe — RRR Movie (@RRRMovie) January 24, 2023 -
హాలీవుడ్ సంస్థతో రాజమౌళి కీలక ఒప్పందం.. అందుకేనా?
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చెందిన క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీతో(సీఏఏ)తో ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఎంట్రీకి నోచుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ సినిమా ఛెల్లో షోను ఎంపిక చేసిన కొద్ది రోజులకే రాజమౌళి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ ఎంట్రీలో చుక్కెదురైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా పదివారాలు ట్రెండ్ అయిన నాన్ హాలీవుడ్ చిత్రంగా నిలిచిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలవలేకపోయింది. అమెరికా కాలిఫోర్నియా హెడ్‌క్వార్టర్స్‌గా ఉన్న సీఏఏ ఏజెన్సీ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ రంగాల్లో పలు రకాల సేవలందిస్తోంది. (చదవండి: ఆస్కార్ బరిలో గుజరాతీ ఫిల్మ్ ఛెల్లో షో) గుజరాతీ చిత్రం ఛెల్లో షోను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ ఎంట్రీకి నామినేట్ చేయడంతో దేశవ్యాప్తంగా అభిమానులు నిరాశకు గురయ్యారు. కొంతమంది సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్కు మద్దతుగా పోస్టులు కూడా చేశారు. ఈ నిర్ణయంపై కొందరు టాలీవుడ్ నటులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్ఆర్ఆర్ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ వేరియెన్స్ ఫిల్మ్స్ సంస్థ సైతం మద్దతు తెలిపింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కేటగిరీలో ఈ చిత్రాన్ని పరిగణించాలని అభ్యర్థించింది. ఆస్కార్ ఎంట్రీకి ఆర్ఆర్ఆర్ ఎంపిక కాకపోవడంపై హాలీవుడ్ డైరెక్టర్ ఆడమ్ మెక్కే కూడా స్పందించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తమ చిత్రాల విభాగంలో నామినేట్ చేయాల్సిందిగా మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. -
ఆస్కార్ వేడుక ఆ రోజే
వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డు వేడుక తేదీ ఖరారైంది. 2023 మార్చి 12న వేడుక నిర్వహించనున్నట్లు అవార్డు కమిటీ ప్రకటించింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరగనున్న ఈ 95వ ఆస్కార్ అవార్డు వేడుక ‘ఏబీసీ’లో ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అవార్డు పోటీదారులు నవంబర్ 15 లోపు తమ వివరాలు పంపాలని కమిటీ పేర్కొంది. డిసెంబర్ 12న ప్రాథమిక ఓటింగ్ ఆరంభమవుతుంది. డిసెంబర్ 21న షార్ట్లిస్ట్స్ని ప్రకటిస్తారు. జనవరి 12 నుంచి 17లోపు నామినీల ఓటింగ్ జరుగుతుంది. నామినేషన్ దక్కించుకున్నవారి జాబితాను 24న ప్రకటిస్తారు. విజేతల ఫైనల్ ఓటింగ్ మార్చి 2 నుంచి మార్చి 7లోపు జరుగుతుందని తెలిసింది. విజేతలను మార్చి 12న వేదిక మీద ప్రకటిస్తారు. -
ఆస్కార్ అవార్డు కమిటీపై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్, కారణం ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు 2022 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా ముగిసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనీ ప్రముఖులు పాల్గొన్నారు. క్రిస్ రాక్ చెంపను విల్ స్మిత్ పగలగొట్టడం లాంటి చిన్న చిన్న వివాదాలు మినహా.. కార్యక్రమం అంతా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఆస్కార్ అవార్డు కమిటీపై ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణంగా.. ఆస్కార్ అవార్డ్స్ ‘ఇన్ మెమోరియమ్’ విభాగంలో దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్, దివంగత ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ పేర్లను ప్రస్తావించకపోవడమే. 93వ ఆస్కార్ అవార్డ్స్ (2021) సమయంలో రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌లకు ఆస్కార్ ‘ఇన్ మెమోరియమ్’లో స్థానం కల్పించిన నేపథ్యంలో ఈ ఏడాది లతా మంగేష్కర్, దిలీప్ కుమార్‌లను విస్మరించడంతో ఆస్కార్ కమిటీ మెమరీ (జ్ఞాపక శక్తి) లో వీళ్లిద్దరూ లేరా? అనే చర్చ మొదలైంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ వచ్చిన చిత్రాలకు ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉంది. ‘ఇన్ మెమోరియమ్’ని కూడా ఆ ప్రాతిపదికన తీసుకుంటే... లతా మంగేష్కర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్ను మూశారు కాబట్టి ఆమె పేరుని ప్రస్తావించలేదని ఆస్కార్ వివరణ ఇచ్చుకోవడానికి లేదు. ఎందుకంటే గత ఏడాది జూలైలో మరణించిన దిలీప్ కుమార్‌ని అయినా ప్రస్తావించాలి కదా.. సో.. ఆస్కార్ చేసినది ముమ్మాటికీ తప్పిదమే అన్నది నెటిజన్ల మాట. -
ఆస్కార్ ఎంట్రీకి నామినేట్ అయిన మన సినిమాలివే..
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ఈ అవార్డుల కోసం ప్రపంచ దేశాల నుంచి పలు విభాగాల్లో సినిమాలు పోటీపడే విషయం తెలిసిందే. ఈ ఏడాది ‘2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీ’లో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ కోసం పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. 15 మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యూరీ మన దేశం నుంచి ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లదగ్గ సినిమాలను వీక్షించి, ఒక్క సినిమాను ఎంపిక చేస్తుంది. వచ్చిన ఎంట్రీల్లో 14 చిత్రాలు ఆస్కార్‌కి పంపించే స్థాయి ఉన్నవిగా జ్యూరీ భావించింది.వాటిలో హిందీ నుంచి ‘సర్దార్ ఉదమ్’, ‘షేర్నీ’, తమిళ చిత్రం ‘మండేలా’, మలయాళ సినిమా ‘నాయట్టు’ కూడా ఉన్నాయి. మరి.. ఈ నాలుగింట్లో ఒక్కటా? లేక లిస్ట్‌లో ఉన్న వేరే భాషల చిత్రాల్లో ఒక్కటా? ఆస్కార్ వరకూ వెళ్లే ఆ ఒక్క చిత్రం ఏంటనేది చూడాలి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ ఉదమ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘సర్దార్ ఉదమ్’. జలియన్‌వాలా బాగ్ మారణకాండకు కారణమైన జనరల్ డయ్యర్‌ను హతమార్చడానికి లండన్‌లో సర్దార్ ఉదమ్ పడిన కష్టాలను ఈ చిత్రంలో చూపించారు చిత్రదర్శకుడు సూజిత్ సర్కార్. ఉదమ్ పాత్రను విక్కీ కౌశల్ చేశారు. షేర్నీ విషయానికొస్తే.. జనావాసంలోకి వచ్చిన ఓ ఆడపులి నుంచి కాపాడాలని అటవీ గ్రామీణుల అభ్యర్థన. పులిని చంపైనా ఓట్లు కూడగట్టుకోవాలన్నది రాజకీయ నేతల ఆకాంక్ష. ఆ ఆడపులిని కాపాడాలనుకుంటుంది ఫారెస్ట్ ఆఫీసర్. ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ లాంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది. విద్యాబాలన్ కథానాయికగా అమిత్ వి. మసూర్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యోగిబాబు టైటిల్ రోల్లో నటించిన పొలిటికల్ సెటైరికల్ మూవీ ‘మండేలా’. ఓ క్షురకుడి ఓటు తమ గెలుపుకి కారణం అవుతుందని తెలిసి, అతన్ని మాయ చేయడానికి పంచాయతీ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీపడుతున్న ఇద్దరు అన్నదమ్ముల ప్రయత్నమే ‘మండేలా’. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘నాయట్టు’. ఇందులో కుంచాకో బోబన్, జోజు జార్జ్, నిమిషా సజయన్ ప్రధాన తారలుగా నటించారు. రాజకీయ నాయకుల చేతిలో వ్యవస్థలు ఎలా కీలుబొమ్మలుగా మారాయనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. -
వచ్చే ఏడాది మార్చిలో ఆస్కార్ అవార్డ్స్
94వ ఆస్కార్ అవార్డుల వేడుకకు తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది మార్చి 27న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు వెల్లడించారు. ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ చేయబడిన చిత్రాలను ఈ ఏడాది డిసెంబరు 21న, ఆస్కార్ నామినేషన్స్ ప్రకటనను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న, ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని వచ్చే ఏడాది మార్చి 27న జరపనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే ఉత్తమ చిత్రం విభాగానికి ప్రతిసారీ ఐదు నుంచి పది మధ్యలో సినిమాలను నామినేట్ చేసేవారు. కానీ ఇకపై ఉత్తమ చిత్రం విభాగానికి పది సినిమాలను నామినేట్ చేయనున్నారు. సాధారణంగా ఆస్కార్ వేడుకలు ఫిబ్రవరిలో జరుగుతాయి. కోవిడ్ కారణంగా 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన 93వ ఆస్కార్ అవార్డుల వేడుక ఏప్రిల్‌లో జరిగింది. ఇంకా వచ్చే ఏడాది బీజింగ్‌లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ (ఫిబ్రవరి 4– 20), లాస్ ఏంజెల్స్‌లో ప్లాన్ చేసిన ఓ ప్రముఖ ఫుట్‌బాల్ లీగ్‌ల కారణంగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి 2022 మార్చి 27వ తేదీని ఆస్కార్ ప్రతినిధులు ఎంచుకున్నట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. -
Oscars 2021: ఉత్తమ చిత్రంగా నో మ్యాడ్ ల్యాండ్
-
ఆస్కార్ 2021: రెడ్ కార్పెట్ మీద హొయలు ఒలికించిన తారలు
-
ఆస్కార్ 2021: అవార్డులు గెలుచుకున్నది వీరే!
ఆస్కార్ అవార్డు.. జీవితంలో ఒక్కసారైనా దీన్ని గెలుచుకోవాలని ఉవ్విళ్లూరే సినీతారలు ఎందరో. అకాడమీ అవార్డు సాధిస్తే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంబరపడిపోతారు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక 93వ ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ప్రారంభమైంది.. కోవిడ్ కారణంగా మొట్టమొదటిసారి రెండు ప్రాంతాల్లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. అటు డోల్బీ థియేటర్లో, మరోవైపు లాస్ఏంజెల్స్లో ఆస్కార్ 2021 అవార్డు విజేతలను ప్రకటిస్తున్నారు. మరోవైపు ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇక అవార్డుల విషయానికి వస్తే.. నో మ్యాడ్ ల్యాండ్ సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించగా, ఇదే సినిమాకుగానూ క్లోవే జావోకు ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్ వరించింది. అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో ది ఫాదర్ చిత్రానికి అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఎమరాల్డ్ ఫెన్నెల్‌కు ఆస్కార్ దక్కింది. బెస్ట్ రైటర్స్‌గా క్రిస్ట్ఫర్ హ్యాంప్టన్, ఫ్లోరియన్ జెల్లర్లకు, ఉత్తమ సహాయ నటుడిగా డానియల్ కలూయకు ఆస్కార్ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ సహాయ నటిగా యువాన్ యు జంగ్ (మిన్నారి సినిమా)కు అవార్డును ప్రకటించడంతో దక్షిణ కొరియాలోనే ఆస్కార్ అందుకున్న తొలి నటిగా ఆమె రికార్డులకెక్కారు. ఆస్కార్ విజేతలు.. ఉత్తమ చిత్రం: నో మ్యాడ్ ల్యాండ్ ఉత్తమ నటుడు: ఆంటోని హాప్కిన్స్ (ద ఫాదర్) ఉత్తమ నటి: ఫ్రాన్సెస్ మెక్‌డోర్‌మ్యాండ్ (నో మ్యాడ్ ల్యాండ్) ఉత్తమ చిత్రం ఎడిటింగ్: సౌండ్ ఆఫ్ మెటల్ ఉత్తమ దర్శకురాలు: క్లోవే జావో (నోమ్యాడ్ ల్యాండ్) ఉత్తమ సహాయ నటుడు: డానియెల్ కలువోయా (జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయా) ఉత్తమ సహాయ నటి: యువాన్ యు–జంగ్(మిన్నారి) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫి: మ్యాంక్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: టెనెట్ ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: అనదర్ రౌండ్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: మై ఆక్టోపస్ టీచర్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ప్రామిసింగ్ యంగ్ ఉమెన్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: ది ఫాదర్ ఉత్తమ సినిమాటోగ్రఫీ: మ్యాంక్ ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మా రైనీస్ బ్లాక్ బాటమ్ ఉత్తమ క్యాస్టూమ్ డిజైన్: మా రైనీస్ బ్లాక్ బాటమ్ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: సోల్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: కొలెట్ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మ్యాంక్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్: సోల్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్: ఫైట్ ఫర్ యూ (జుడాస్ అండ్ బ్లాక్ మెస్సయ్య) చదవండి: ఆస్కార్‌లో మన భారతీయ సినిమాలు -
ఆస్కార్ అవార్డులు వాయిదా!
సాక్షి, న్యూఢిల్లీ : 2021, ఫిబ్రవరి 28వ తేదీన జరగాల్సిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నాలుగు నెలల పాటు వాయిదా వేయాలనుకుంటున్నారు. ప్రాణాంతక కరోన వైరస్ మహమ్మారి కారణంగా చాలా సినిమాలు నిర్మాణ దశలోనే నిలిచిపోవడం, కొత్త సినిమాలు ఎక్కువగా విడుదలకు నోచుకోక పోవడంతో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేయాలనుకుంటున్నారు. (చదవండి : శుభశ్రీతో మాట్లాడిన మెగాస్టార్) భారతీయ కాలమానం ప్రకారం సాధారణంగా సమ్మర్లో బ్లాక్‌బస్టర్ కమర్శియల్ సినిమాలు విడుదలవుతాయి. ఆ తర్వాత అకాడమి అవార్డులను దృష్టిలో పెట్టుకొని నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రత్యేక సినిమాలు విడుదలవుతాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో సినిమాలు విడుదల కావాలంటే ఇప్పటికే సినిమా షూటింగ్‌లు ప్రారంభం కావాలి. కానీ ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కుదుపేస్తున్న నేపథ్యంలో అలా జరగలేదు. ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన బ్లాక్‌బస్టర్ జేమ్స్ బాండ్ చిత్రమే నవంబర్ నెలకు వాయిదా పడింది. ఎక్కువ సినిమాల నామినేషన్లకు అవకాశం ఇవ్వడం కోసం ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేయాలనే ప్రతిపాదనపై నిర్వాహకులు గత వారం, పది రోజులుగా చర్చలు జరపుతున్నారు. తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_741246272.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కరోనా: ఆస్కార్ కొత్త నియమాలు
కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా రంగంలో అత్యంత ముఖ్యమైన అవార్డు వేడుక ‘ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం’. కరోనా మమమ్మారి కారణంగా వచ్చే ఏడాది (2021)లో ప్రదానం చేయబోయే ఆస్కార్ ఆవార్డుల నియమాలను తాత్కాలికంగా మార్చినట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించింది. వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి ఇప్పటికే అన్ని థియేటర్లను మూసివేసిన విషయం తెలిసిందే. థియేటర్లను ఓపెన్ చేయటంలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అన్లైన్లో విడుదల చేసి ప్రదర్శించబడిన చిత్రాలను మాత్రమే ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేస్తామని అకాడమి వెల్లడించింది. మాములుగా అయితే లాస్ ఏంజిల్స్‌లోని మోషన్ పిక్చర్ థియేటర్లో ఎంపిక చేసిన సినిమాలను పరిశీలన కోసం కనీసం ఏడు రోజులపాటు ప్రదర్శిస్తారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఇటువంటి అనిశ్చితి ఉన్న సమయంలో అకాడమీ సభ్యులకు మద్దతు ఇస్తుందని, వారి సేవలను గుర్తించామని అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్, సీఈఓ డాన్ హడ్సన్ అన్నారు.థియేటర్లు ప్రారంభించిన తర్వాత ప్రస్తుతం ప్రకటించిన తాత్కాలిక నియమాలు వర్తించవని అకాడమి పేర్కొంది. 93వ ఆస్కార్ ఆవార్డుల ప్రదానోత్సం ఫిబ్రవరి 28, 2021లో జరగనుంది. -
‘పారాసైట్’ విజయ్ మూవీ కాపీనా..!
పారసైట్.. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల్లో ప్రస్తుతం ఈ కొరియన్ సినిమా గురించే చర్చ జరుగుతోంది. కారణం.. తొలిసారి ఓ కొరియన్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలవడం. ఆస్కార్ అవార్డుల్లో ఓ దక్షిణ కొరియా సినిమా ఉత్తమ విదేశీచిత్రం కేటగిరీలో కూడా పురస్కారం అందుకున్న చరిత్ర లేకపోగా.. ఈ చిత్రం ఏకంగా ఓవరాల్ కేటగిరీలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్‌ప్లైతో పాటు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ పిల్మ్విభాగాల్లో కూడా అస్కార్ అవార్డులను దక్కించుకుంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా దానికి ఈ అవార్డులు రావడంలో అతిశయోక్తి లేదంటారు. అయితే ఆస్కార్లు తెచ్చుకున్న ఈ మూవీ కోలీవుడ్ హీరో విజయ్ నటించిన ఓ చిత్రానికి కాపీ అంటున్నారు కొందరు నెటిజన్లు. విజయ్ ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందించిన 'మిన్సార కన్నా' సినిమాతో 'పారసైట్'కు పోలికలు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ‘మిన్సార కన్నా’కు, 'పారసైట్ ' కు చాలా సారూప్యతలు ఉన్నాయని .. బహుశా సౌత్ కొరియన్ డైరెక్టర్ ఈ సినిమా చూసి స్ఫూర్తి పొంది .. ఆ కథనే కొంచెం మార్చి, కొన్ని మలుపులు జోడించి 'పారసైట్ ' తీసి ఉండొచ్చని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బిలియనీర్ అయిన హీరో తన ప్రేమ కోసం హీరోయిన్ ఇంటిలో పనివాడుగా చేరుతాడు. అంతేకాదు తన కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి ఆ ఇంట్లో పనివాళ్లుగా పెడతాడు. చివరకు తన ప్రేమను అతడు ఎలా గెలిపించుకున్నాడు అనే కథాంశంతో ‘మిన్సార కన్నా’తెరకెక్కింది. పారసైట్ కథను మిన్సార కన్నా నుంచి తీసుకున్నారని విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ‘పారసైట్’, ‘షాప్ లిఫ్టర్’ అనే చిత్రంను కూడా పోలి ఉందని మరికొంతమంది తమ కామెంట్లు వినిపిస్తున్నారు. ‘పారసైట్’ స్టోరీ ఏంటంటే.. ఓ ధనిక కుటుంబాన్ని ఓ పేద కుటుంబం తెలివిగా బోల్తా కొట్టించి వాళ్ల ఇంట్లో పనిలోకి ప్రవేశిస్తుంది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులన్న విషయం యజమానుల దగ్గర దాచిపెడతారు. వాళ్ల కన్నా ముందు ఆ ఉద్యోగాల్లో ఉన్న వారిని మోసగించి, ఆ ఇంటి నుంచి వెళ్లగొడతారు. యజమాని కుటుంబం విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడి సౌకర్యాలను ఉపయోగించుకుంటూ గడుపుతుంటారు. అక్కడ ఉద్యోగాలు కోల్పోయినవారికి వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసిపోతుంది. ఈలోపే విహారయాత్రకు వెళ్లిన యజమానులు తిరిగి వస్తున్నారనే వార్త ఆ కుటుంబీకుల చెవిన పడుతుంది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారనియజమానికి తెలిస్తే.. వాళ్ల ఉద్యోగాల పోతాయన్న భయంతో వారేం చేశారు? అన్నదే సినిమా ఇతివృత్తం. పేద, ధనిక అంతరాల వలన సమాజంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతాయో పారాసైట్ అనే చిత్రంద్వారా దర్శకుడు బాంగ్ జోన్-హో చూపించారు. @khushsundar Today parasite movie got 4 oscar awards but after watching the movie I came to know the plot of the story which was taken from Minsara kanna. In minsara kanna all the family was employed for love help& the same here parasite all the family were employed for survival. — rajeshkannan (@rajesh7) February 10, 2020 So many thoughts running the head.. just finished watching #Parasite..Got me thinking about another movie I saw few months back - #Shoplifters... Both very good movies, similar yet different.. #aarootales — Aarti 🐾 (@talesfromaaroo) February 9, 2020 Watched korean movie #parasite lately & realized that the movie is inspired by @actorvijay 's tamil movie #minsarakanna directed by k.s.ravikumar.Parasite is a worldwide hit,but we made such films long back.#legendksravikumar#parasiteisminsarakanna#ThalapathyVijay#Thalapathy — Andrew Rajkumar (@iamrajdrew) February 5, 2020 -
ఆస్కార్ 2020 అవార్డుల ప్రదానోత్సవం
-
‘పారాసైట్’కి ఆస్కార్ అవార్డుల పంట
లాస్ఏంజెల్స్ : దక్షిణ కొరియా చిత్రం పారాసైట్‌కు ఆస్కార్ అవార్డుల పంట పండింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్‌ప్లైతో పాటు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ పిల్మ్ విభాగాల్లో అస్కార్ అవార్డులను దక్కించుకుంది. ముందు నుండి ఎన్నో అంచనాలని పెంచుకున్న పారాసైట్ చిత్రం ఆస్కార్ కిరీటం దక్కించుకోవడం విశేషం. మేకింగ్‌తో పాటు కంటెంట్లోను హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఈ సినిమాను తెరకెక్కించారు. డార్క్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఓ ధనిక కుటుంబాన్ని ఓ పేదకుటుంబం తెలివిగా బోల్తా కొట్టించి వాళ్ల ఇంట్లో పనిలోకి ప్రవేశిస్తుంది. పేద, ధనిక అంతరాల వలన సమాజంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతాయో పారా సైట్ అనే చిత్రం ద్వారా దర్శకుడు బాంగ్ జోన్-హో చూపించారు. చదవండి : ఆస్కార్ విజేతలు వీరే లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరుగుతున్న 92వ ఆస్కార్ అవార్డ్ వేడుకలో పారాసైట్ చిత్రంతో పాటు జోకర్, 1917 చిత్రాలు కూడా తమ హవాను చూపాయి. జోకర్ చిత్రానికి గాను హీరో జోక్విన్ ఫినిక్స్ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఇక 1917 సినిమా మూడు విభాగాల్లో (విజువల్ ఎఫెక్ట్, సౌండ్ మిక్సింగ్, సినిమాటోగ్రఫీ) అవార్డులను ఎగరేసుకుపోయింది. -
ఆస్కార్ 2020 విజేతలు వీరే
లాస్ఏంజెల్స్ : 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ఏంజెల్స్లో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డాల్బీ థియేటర్లో జరుగుతున్న ఈ వేడకకు ప్రముఖ హాలీవుడ్ తారాగణమంతా హాజరై సందడి చేసింది. జోకర్ సినిమా హీరో జోక్విన్ ఫినిక్స్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో బ్రాడ్ పిట్ నటననకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ఫిల్మ్గా టాయ్‌స్టోరీ నిలిచింది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా టాయ్‌స్టోరీ-4, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బాంగ్ జాన్ హో (పారాసైట్), బెస్ట్ లైవ్‌యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌గా ద నైబర్స్ విండో నిలువగా, ఉత్తమ స్క్రీన్‌ప్లే తైకా వెయిటిటి(జోజో రాబిట్) కు దక్కింది. ఉత్తమ చిత్రం : పారాసైట్ ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్(జోకర్) ఉత్తమ నటి : రెంజి జెల్వెగర్ (జూడి) ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్‌పిట్ ( వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్) ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ) ఉత్తమ దర్శకుడు : బాంగ్ జోన్-హో(పారసైట్) ఉత్తమ సంగీతం : జోకర్ (హిల్దార్) బెస్ట్ మ్యూజిక్ ఒరిజనల్ సాంగ్ : ఐయామ్ గోన్నా.. లవ్ మీ ఎగేన్ (రాకెట్ మ్యాన్) ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : పారాసైట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ : బాంబ్ షెల్ ఉత్తమ డాక్యుమెంటర్ షార్ట్ ఫీచర్ : అమెరికర్ ఫ్యాక్టరీ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే : టైకా వైటిటి( జోగో ర్యాబిట్) బెస్ట్ యానిమేటేడ్ ఫీచర్: టాయ్ స్టోరీ 4 బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ : అమెరికన్ ఫ్యాక్టరీ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది నైబర్స్ విండో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే : బాంగ్ జూన్ హో( పారాసైట్) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ : లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గర్ల్) బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ : హెయిర్ లవ్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వి ఫెరారీ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ : 1917 ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917 ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : 1917 బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వి ఫెరారీ ఉత్తమ ప్రొడెక్షన్ డిజైన్ : వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది నైబర్స్ విండో (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈసారీ యాంకర్ లేని ఆస్కార్
అవార్డు ఫంక్షన్ అంటే స్టార్స్, వారి పెర్ఫార్మెన్స్లు, సర్ప్రైజ్లతో పాటు హోస్ట్ కూడా ముఖ్యం. అయితే యాంకర్ లేకుండానే గత ఏడాది ఆస్కార్ అవార్డు ఫంక్షన్‌ను నిర్వహించింది అకాడమీ సంస్థ. 1989 తర్వాత యాంకర్ లేకుండా ఆస్కార్ వేడుక జరిగింది 2019లోనే. ముందుగా అనుకున్న హోస్ట్ (కెవిన్ హార్ట్) అనుకోని వివాదంలో చిక్కుకోవడంతో యాంకరింగ్ చేసే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. యాంకర్ సరదా మాటలు, సీరియస్ కామెంట్లు లేకుండానే గత ఏడాది వేడుక హిట్ కాబట్టి ఈ ఏడాది కూడా యాంకర్ లేకుండా వేడుకను నిర్వహించాలని నిశ్చయించుకుంది. ఏ అవార్డును ఎవరు అందజేయాలో వాళ్లు మాత్రం స్టేజ్ మీదకు వచ్చి అవార్డును అందించి వెళ్లిపోతారు. ‘‘ఈ ఏడాది ఆస్కార్స్‌లో స్టార్స్ ఉన్నారు. పెర్ఫార్మెన్స్లు ఉన్నాయి. సర్ప్రైజ్లు ఉన్నాయి. హోస్ట్ లేడు. ఫిబ్రవరి 9న కలుద్దాం’’ అని ట్వీటర్లో పేర్కొంది ఆస్కార్ అవార్డ్స్ అకాడమీ. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా ఆస్కార్ ఫంక్షన్‌ను వీక్షించే వాళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే 2019లో మాత్రం వీక్షకుల సంఖ్య 18శాతం వరకూ పెరిగింది. దాంతో ఈ ఏడాది సంఖ్య పెరిగేలా వేడుకను ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. -
ఉత్తమ చిత్రం గ్రీన్‌బుక్
లాస్ ఏంజిలస్: 2019 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డును ‘గ్రీన్‌బుక్’ దక్కించుకుంది. శ్వేత,నల్ల జాతీయుల మధ్య స్నేహబంధానికి దర్పణంగా నిలిచే ఒక వ్యక్తి జీవిత చరిత్రే గ్రీన్‌బుక్ చిత్రం. రోమా చిత్ర దర్శకుడు అల్ఫాన్సో కారన్‌కు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించగా, ద ఫేవరెట్ సినిమాలో నటించిన ఒలివియా కామన్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. బొహెయిమెన్ రాప్సోడీ చిత్రంలో అస్థాన విద్వాంసుడు ఫ్రెడీ మెర్క్యురీ పాత్రలో నటించిన రామి మలేక్ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం లాస్ ఏంజిలస్‌లో అట్టహాసంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. వ్యాఖ్యాత లేకుండా ఈ ఉత్సవం జరగడం విశేషం. 1989 తర్వాత వ్యాఖ్యాత లేకుండా ఆస్కార్ అవార్డుల ఉత్సవం జరగడం ఇది రెండో సారి. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో భారతీయ డాక్యుమెంటరీకి అవార్డు లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన ఘటనపై ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’పేరుతో తీసిన డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డు పొందింది. ఒక నల్లజాతి విద్యాంసుడు అతని దగ్గర కారు డ్రైవరుగా పనిచేసే శ్వేత జాతీయుడి మధ్య సంబంధమే ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ఎంపికయిన గ్రీన్ బుక్ కథాంశం. గ్రీన్‌బుక్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడు(మహేర్షల అలీ), ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డులు కూడా లభించాయి. ఉత్తమ నటి రేసులో ముందున్న గ్లెన్ క్లోజ్(ద వైఫ్)ను పక్కకు నెట్టి ద ఫేవరెట్ చిత్రంలో నటించిన కాల్మన్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కాల్మన్ నిగ్రహం కల రాణి అన్నెగా నటించారు. ఈ సారి అవార్డులు వేర్వేరు సినిమాలకు వచ్చాయి. బొహెమియన్ రాప్సోడీ చిత్రానికి ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, ఉత్తమ మిక్సింగ్ అవార్డులు సహా మొత్తం నాలుగు అవార్డులు లభించాయి. కారన్‌కు ఒకే ఏడాది 4 నామినేషన్లు రోమా సినిమా ఉత్తమ చిత్రం అవార్డును పొగొట్టుకున్నా ఇతర కేటగిరీలో ఉత్తమ పురస్కారాలు అందుకుంది. చిత్ర దర్శకుడు కారన్ ఉత్తమ దర్శకుడి అవార్డు పొందారు. విదేశీ భాషా చిత్రం కేటగిరీ, సినిమాటోగ్రఫీ కేటగిరీలో కూడా ఈయన ప్రతిభకు పురస్కారాలు లభించాయి. ఒకే సంవత్సరంలో నాలుగు నామినేషన్లు పొందిన మొట్టమొదటి వ్యక్తి కారన్. భారతీయ ఫ్రెడ్డీ భారతీయ మూలాలున్న వ్యక్తికి సంబంధించిన పాత్ర పోషించిన నటుడికి కూడా 91వ ఆస్కార్ అవార్డుల్లో ఓ పురస్కారం దక్కింది. బొహెమియన్ రాప్సోడీ చిత్రంలో ఫ్రెడ్డీ మెర్కూరీ పాత్రలో నటించినందుకు ఉత్తమ నటుడి అవార్డుకు రామి మలేక్ ఎంపికయ్యారు. ఆ చిత్రం ఫ్రెడ్డీ మెర్యూరీ జీవితం ఆధారంగా తెరకెక్కిందే. ఇంతకీ ఈ ఫ్రెడ్డీ మెర్క్యూరీ ఎవరని అనుకుంటున్నారా? ఈయన తన చిన్న తనాన్ని మహారాష్ట్రంలోని పంచగని పట్టణంలో గడిపారు. అక్కడే పాఠశాల విద్యనభ్యసించారు. సంగీత రంగంలో కూడా ప్రవేశించారు. టాంజానియాలోని జంజీబర్లో పార్సీ కుటుంబంలో 1946లో మెర్క్యూరీ జన్మించారు. ఆ తర్వాత ఆయన కుటుంబం భారత్‌కు వలస వచ్చింది. పంచగనిలోని సెయింట్ పీటర్స్ స్కూల్లో మెర్యూరీ చదువుకుంటూనే హెక్టిక్స్ అనే రాక్బ్యాండ్లోనూ అలరించాడు. శాస్త్రీయ సంగీత పాఠాలు నేర్పాలని ఆ స్కూల్లోని గురువులు ప్రయత్నించినా మెర్క్యూరీ ర్యాప్ మ్యూజిక్ పైనే ఆసక్తి చూపాడు. తర్వాత 1960ల్లో ఆయన తన తల్లిదండ్రులతో కలిసి బ్రిటన్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. -
91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం
-
మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం
91వ ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్లో నాలుగు విభాగాలను (ఎడిటింగ్, లైవ్ యాక్షన్ షార్ట్, మేకప్ అండ్ హైయిర్ స్టైల్) తొలగిస్తున్నట్టు, ఆ విభాగాలకు సంబంధించిన అవార్డులను యాడ్స్ బ్రేక్‌లో ప్రదానం చేయనున్నట్లు ఆస్కార్ బృందం పేర్కొంది. పలువురు హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు ఈ నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. ‘‘మీ అందరి అభిప్రాయాలను స్వీకరించాం. వాటిని గౌరవిస్తున్నాం. ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ మునుపటిలానే ఎటువంటి ఎడిటింగ్ లేకుండా జరుగుతుంది’’ అని అకాడమీ బృందం పేర్కొంది. వచ్చే ఆదివారం (భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) ఆస్కార్ అవార్డ్ వేడుక జరగనుంది. ఆస్కార్.. నాట్ సో వైట్? ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్లో నల్ల జాతీయులకు దక్కే ప్రాధాన్యం గురించి చర్చ జరుగుతోంది. ఆస్కార్ తెల్లవాళ్ల వైపే మొగ్గు చూపుతుంది అనే కలర్‌ఫుల్ కామెంట్‌ను మోస్తూ వస్తోంది అకాడమీ. అయితే ఈ ఏడాది నామినేషన్లో నల్లజాతీయులు సుమారు 15మంది వరకూ కనిపించనున్నారు. దర్శకుల విభాగంలో ఇద్దరు (మునుపు ఒక్కరు లిస్ట్‌లో కూడా ఉన్న దాఖలాలు లేవు), ప్రొడక్షన్ డిజైనర్ విభాగంలో నల్లజాతీయురాలు (హన్నా బీచ్లర్) ఎంపిక కావడం మొట్టమొదటిసారి. గతేడాది ఆస్కార్‌ను వీక్షించిన వారి సంఖ్య రికార్డ్ స్థాయిలో తగ్గిపోయిందని, అందుకే నల్ల జాతీయులకూ ప్రాధాన్యం ఇచ్చారని, 2015లో ‘ఆస్కార్ సో వైట్’ అనే నిందను పోగొట్టుకోవడానికి కూడా ఇలా చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆస్కార్ నాట్ సో వైట్ అనిపించుకోవడానికి కమిటీ ప్రయత్నం చేస్తోందని అర్థం అవుతోంది. -
ఆస్కార్ మారుతోంది!
ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్‌కు సంబంధించిన ప్రతీ విషయం విచిత్రంగానో, వివాదంలానో మారుతోంది. యాంకర్ లేకుండానే వేడుకను నిర్వహిస్తాం అని ఇటీవల నిర్వాహకులు ప్రకటించారు. తాజాగా ‘సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఎడిటింగ్, లైవ్‌యాక్షన్ షార్ట్, మేకప్, హెయిర్ స్టైల్’ విభాగాలకు సంబంధించిన అవార్డులను పక్కన పెడుతున్నట్టు అకాడమీ ప్రెసిడెంట్ జాన్ బెయిలీ ప్రకటించారు. పైన పేర్కొన్న అవార్డులను టీవీల్లో యాడ్స్ ప్లే అయ్యే సమయంలో ఇవ్వనున్నారట. ఈ నిర్ణయం గురించి గతేడాది బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ అందుకున్న గులెర్మో డెల్ టొరో మాట్లాడుతూ – ‘‘ఏయే కేటగిరీలను తొలగించాలో నేను చెప్పలేను. కానీ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అనేవి సినిమాకు ప్రాణం. గుండెలాంటివి. వాటిని చిన్నచూపు చూస్తూ.. ఇలా యాడ్స్ ప్లే అయ్యే టైమ్‌లో ఇవ్వాలనుకోవడం కరెక్ట్ కాదని భావిస్తున్నాను’’ అన్నారు. -
అట్టహాసంగా ఆస్కార్ 2018
డాల్బీ థియేటర్.. లాస్ ఏంజిల్స్, యూఎస్ఏ. సినిమాకు పండగలాంటి ‘ఆస్కార్–2018’ వేడుక జరుగుతోంది. బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్న గెలెర్మో డెల్టొరో మాట్లాడుతూ.. ‘‘ఈ కళ, ఈ సినీ పరిశ్రమ వల్ల జరిగే ఓ గొప్ప ప్రయోజనం ఏంటంటే.. ఈ మట్టిలో మనం గీసుకున్న గీతలను అవి చెరిపేస్తాయి. ఈ ప్రపంచం ఆ గీతల్ని ఎంత ఒత్తుగా గీస్తూ వెళ్లినా మనం ఆ గీతలను చెరిపేస్తూనే ఉండాలి..’’ అన్నాడు. హాలీవుడ్లో అక్కడి పరిశ్రమకు కేంద్రమైన అమెరికా నుంచే నటులు, టెక్నీషియన్స్ ఎక్కువగా కనిపిస్తారు. గెలెర్మో మెక్సికన్. అయినా కూడా సినిమాయే తనను ఈ స్థాయిలో నిలబెట్టి, దేశాల మధ్య సరిహద్దులు చెరిపేసిందనే కోణంలో ఆయన తన స్పీచ్ ఇచ్చారు. నిజమే! శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న, ప్రపంచాన్ని ఏకం చేయగల శక్తి సినిమా అనే మాధ్యమానికి తప్పకుండా ఉంది. సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి కూడా అంత ఉంది ఆ సినిమాకు. అలాంటి సినిమాకు పెద్దన్న లాంటి హాలీవుడ్ సినీ పరిశ్రమ ఏటా చేసుకునే ఆస్కార్ సంబరం, ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 90వ ఆస్కార్ వేడుకలో హాలీవుడ్లో గతేడాది అద్భుతాలు సృష్టించిన సినిమాలు, టెక్నీషియన్స్‌కు అవార్డులు అందజేసి ఆస్కార్ సంబరం జరిపింది. గతేడాది ఆస్కార్స్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ప్రముఖ హాస్యనటుడు జిమ్మీ కిమ్మెల్, ఈ ఏడాది కూడా తన స్టైల్లో ఈ షోను ఉత్సాహంగా మొదలుపెట్టి, అలాగే నడిపించాడు. అతని మోనోలాగ్తోనే ఈ షో ప్రారంభమైంది. మోనోలాగ్లో ‘‘ఆస్కార్ అవార్డు ప్రకటించే సమయంలో మీ పేరు రాగానే, వెంటనే వచ్చి అవార్డు తీసుకోకండి. ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే గతేడాదిలాగా జరగొద్దని కోరుకుంటున్నా..’’ అన్నాడు. గతేడాది బెస్ట్ పిక్చర్ విషయంలో జరిగిన తప్పిదం తెలిసిందే. బెస్ట్ పిక్చర్ అయిన ‘మూన్లైట్’కు బదులు ‘లా లా లాండ్’ను బెస్ట్ పిక్చర్‌గా ప్రకటించి, ఆ తర్వాత తప్పు జరిగిపోయిందని, మూన్‌లైట్‌కు ఆస్కార్ ఇచ్చారు. ఈసారి అలా జరగబోదని, ఎన్వలెప్లన్నీ సరిగ్గా చూసుకున్నామని జిమ్మీ చెప్పడంతో డాల్బీ థియేటర్ అంతా గట్టిగా నవ్వులు వినిపించాయి. ఆస్కార్స్‌లో టాప్ అవార్డు అయిన ‘బెస్ట్ పిక్చర్’ను ఈ ఏడాది ‘ది షేప్ ఆఫ్ వాటర్’ అందుకుంది. పోటీకి నిలబడ్డ తొమ్మిది సినిమాల్లో మిగతా ఎనిమిది సినిమాలను పక్కనబెట్టి బెస్ట్ పిక్చర్ అనిపించుకుంది. ఆస్కార్స్‌లో ఈ ఏడాది ఎక్కువ అవార్డులు అందుకుంది కూడా ఈ సినిమానే! బెస్ట్ పిక్చర్తో పాటు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులందుకుంది ‘షేప్ ఆఫ్ వాటర్’. ఇక రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో డంకర్క్ ఎవాక్యుయేషన్‌ను బేస్ చేస్కొని తెరకెక్కిన ‘డంకర్క్’.. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్‌లతో మూడు అవార్డులందుకుంది. ‘బ్లేడ్ రన్నర్ 2049’, ‘కోకో’, ‘డార్కెస్ట్ అవర్’, ‘త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’ సినిమాలు రెండు చొప్పున అవార్డులు దక్కించుకున్నాయి. నామినేషన్స్ దక్కించుకోవడానికి ముందు నుంచే ఆస్కార్‌లో సత్తా చాటుతాయని భావించిన ‘ది పోస్ట్’, ‘లేడీ బర్డ్’ సినిమాలు ఒక్క అవార్డూ దక్కించుకోలేదు. దాదాపు 4 గంటలకు పైనే సాగిన ఈ వేడుకలో గతేడాదిలాగా ఘోర తప్పిదాలేవీ జరగకపోయినా, అక్కడక్కడా కాస్త బోరింగ్‌గా నడిచిందనే టాక్ తెచ్చుకుంది. గతేడాది ఆస్కార్స్‌ను యూఎస్‌లో 3.29 కోట్ల మంది చూశారని అంచనా. ఈసారి ఆ నంబర్ కాస్త తగ్గొచ్చనే అంచనా వేస్తున్నారు. బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న గ్యారీ ఓల్డ్మన్ తన స్పీచ్‌లో చెప్పాల్సిన వారందరికీ థ్యాంక్స్ చెప్పాక, ‘‘ఆస్కార్ కంటే పెద్దదైన మా అమ్మకు.. వచ్చే బర్త్‌డేకి ఆమెకు 99 ఏళ్లు. ఆమె ఇప్పుడు సోఫాలో కూర్చొని ఈ వేడుక చూస్తూంటుంది. ఆమెకు ఇవ్వాళ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అమ్మా! కాఫీ రెడీగా ఉంచు. ఆస్కార్‌ను ఇంటికి తీసుకొస్తున్నా..’’ అన్నాడు. ఆ మాటకు థియేటర్ అంతా గట్టిగా నవ్వింది. ఆ నవ్వులాంటి ఇంకెన్నో ఎమోషన్స్‌తో ఆస్కార్ ఎప్పట్లానే ఫ్యాన్స్‌కు పండగలా వచ్చి, మళ్లీ వచ్చే ఏడాది కలుద్దామంటూ వెళ్లిపోయింది. ► హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ ‘మీటూ’ ఉద్యమం గురించి మాట్లా డాడు. హార్వీ వెయిన్‌స్టీన్‌పై చేసిన పోరాటం గొప్పదని, ఇది హాలీవుడ్లో మార్పు తప్పకుండా తీసుకొస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ► తక్కువ టైమ్‌లో స్పీచ్ పూర్తి చేసిన అవార్డ్ విన్నర్‌కు జిమ్మీ కిమ్మెల్ జెట్ స్కైని గిఫ్ట్‌గా ఇస్తానన్నాడు. మార్క్ బ్రిడ్జెస్ తక్కువ మాట్లాడి (30 సె‘‘) దక్కించుకున్నాడు. ► రోజర్ డేకిన్స్ 13సార్లు బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా నామినేషన్ సాధించి, నిరాశతో వెనుదిరిగాడు. ఈసారి ‘బ్లేడ్ రన్నర్ 2049’ సినిమాకు ఆస్కార్ దక్కించు కున్నాడు. ► ఫస్ట్ టైమ్ రైటర్‌గా ఒక ఆఫ్రికన్ – అమెరికన్ (జోర్డాన్ పీలె) అవార్డు అందు కున్నాడు. ► 89 ఏళ్లకు ఆస్కార్ అందుకొన్న అతి పెద్దవాడిగా రైటర్ జేమ్స్ ఐవరీ రికార్డ్ సాధించారు. ఆస్కార్స్ వేడుకలో ‘ఆస్కార్స్ ఇన్ మెమొరియమ్’ పేరుతో ఆ ఏడాది ఈ లోకాన్ని విడిచివెళ్లిన ఫిల్మ్ స్టార్స్‌ను తల్చుకునే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది మెమొరియమ్ సెక్షన్లో ఇండియన్ సినిమా లెజెండ్స్ శ్రీదేవి, శశి కపూర్లను ఆస్కార్స్ తలుచుకుంది. అవార్డ్ విన్నింగ్ స్పీచ్ 90వ ఆస్కార్ వేడుకలో ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్ ఇచ్చిన స్పీచ్‌ను అవార్డ్ విన్నింగ్ స్పీచ్ అనొచ్చు. ‘త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’ సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్న మెక్‌డోర్మండ్, యాక్సెప్టెన్స్ స్పీచ్‌లో చెప్పాల్సిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పాక, ‘‘నేనిప్పుడు ఒక విషయం చెప్పాలి..’’ అంటూ ఆస్కార్‌కు నామినేట్ అయిన ఆడవాళ్లందరినీ నిలబడమని చెప్పింది. రెండే రెండు పదాలు చెప్పి ఈ స్పీచ్ ముగిస్తా, అని ‘‘ఇన్‌క్లూజన్ రైడర్’’ అంది. దానర్థం సినిమాల్లో నటించేముందు అగ్రిమెంట్ మీద సంతకం చేసే ఏ–లెవెల్ స్టార్స్‌కు సినిమా క్రూ అండ్ కాస్ట్లో 50 శాతం జెండర్ ఈక్వాలిటీ అడిగే చాన్స్ ఉందని. అంటే 50 శాతం మంది ఆడవాళ్లను టీమ్‌లో ఉండేలా చూసుకోమని. ఈ విషయం ఆస్కార్ వేడుక ముగిసాక, మెక్డోర్మంటే క్లారిటీ ఇస్తూ చెప్పింది. విన్నర్స్ లిస్ట్ బెస్ట్ పిక్చర్ ది షేప్ ఆఫ్ వాటర్ బెస్ట్ డైరెక్టర్ గెలెర్మో డెల్టొరో (ది షేప్ ఆఫ్ వాటర్) బెస్ట్ యాక్ట్రెస్ – లీడింగ్ రోల్ ఫ్రాన్సెన్స్ మెక్‌డోర్మండ్ (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి) బెస్ట్ యాక్టర్ : లీడింగ్ రోల్ గ్యారీ ఓల్డ్‌మేన్ (డార్కెస్ట్ అవర్) బెస్ట్ యాక్ట్రెస్ : సపోర్టింగ్ రోల్ ఎలిసన్ జేలీ (ఐ, టోన్యా) బెస్ట్ యాక్టర్ : సపోర్టింగ్ రోల్ సామ్ రాక్వెల్ (తీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి) బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్) జోర్డాన్ పీలే (గెట్ ఔట్) బెస్ట్ స్క్రీన్‌ప్లే (అడాప్టెడ్) జేమ్స్ ఐవరీ (కాల్ మీ బై యువర్ నేమ్) బెస్ట్ సినిమాటోగ్రఫీ రోజర్ డీకిన్స్ (బ్లేడ్ రన్నర్ 2049) బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అలెగ్జాండర్ డిప్లా (ది షేప్ ఆఫ్ వాటర్) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్రిస్టిన్ ఆండర్సన్ లోపెజ్, రాబర్ట్ లోపెజ్ ( సాంగ్ : రిమెంబర్ మి సినిమా : కోకో) బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ (ఫీచర్) కోకో బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ (షార్ట్) డియర్ బాస్కెట్ బాల్ బెస్ట్ లైవ్ యాక్షన్ (షార్ట్) ది సైలెంట్ చైల్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ (ఫీచర్) ఇకారస్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ (షార్ట్) హెవెన్ ఈజ్ ఎ ట్రాఫిక్ జామ్ ఆన్ ద 405 బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ ఎ ఫెంటాస్టిక్ వుమన్ (చిలీయన్ సినిమా) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ పాల్ డీ ఆస్టర్‌బెల్లీ, జెఫ్రీ ఎ మాల్విన్, షేన్ వియ (ది షేప్ ఆఫ్ వాటర్) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ జాన్ నెల్సన్, గెర్ద్ నెఫ్జర్, పాల్ లాంబర్ట్, రిచర్డ్ ఆర్ హూవర్ (బ్లేడ్ రన్నర్ 2049) బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ లీ స్మిత్ (డంకర్క్) బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కజుహిరొ సుజి, డేవిడ్ మాలినోవ్స్కీ, లూసీ సిబ్బిక్ (డార్కెస్ట్ అవర్) బెస్ట్ కాస్టూమ్ డిజైన్ మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ థ్రెడ్) బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ రిచర్డ్ కింగ్, అలెక్స్ గిబ్సన్ (డంకర్క్) బెస్ట్ సౌండ్ మిక్సింగ్ మార్క్ వెంగర్టిన్, గ్రెగ్ ల్యాండెకర్, గ్యారీ ఎ రిజొ (డంకర్క్) ఆష్లే జడ్, గాల్ గోడాట్, గ్రేటా గెర్విగ్, హీడీ క్లమ్, జెన్నిఫర్ లారెన్స్ అదిరేటి డ్రెస్సు మీరేస్తే ఆహా.. మనసుకి ఆహా.. కంటికి ఆహా అంటూ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేసిన అందాల తారలను చూసిన వీక్షకులు ఆహా.. ఓహో అనుకున్నారు. సేమ్‌టైమ్ బెదిరేటి డ్రెస్సులు వేసుకొచ్చిన భామలూ ఉన్నారు. ‘అబ్బే.. బొత్తిగా ఫ్యాషన్ తెలియదు’ అని వాళ్లను చూసి పెదవి విరిచేశారు. ఏదేతైనేం విదేశీ భామలది విశాలమైన హృదయం అని సరదాగా జోకేసుకున్నవారూ ఉన్నారు. -
ఎవరు కొట్టినా ఫస్టే!
ఆస్కార్ అవార్డుల ప్రదానానికి సరిగ్గా రెండు వారాల సమయం ఉంది. ఒక సోమవారం పోయి, ఇంకో సోమవారం వచ్చేస్తే, ఎవరెవరు ఆస్కార్ చేతిలో పట్టుకొని ఇంటికెళతారో తెలిసిపోతుంది. ఇప్పటికే ఎవరెవరు గెలుస్తారనేదానిపై ఎక్కడిలేని చర్చ జరుగుతోంది. అందులోనూ ‘బెస్ట్ డైరెక్టర్’ క్యాటగిరీకి వచ్చేసరికి ఆ చర్చ తారాస్థాయికి చేరుకుంది. ఈసారి బెస్ట్ డైరెక్టర్‌కు నామినేట్ అయిన వారిలో అందరూ డిఫరెంట్ జానర్ సినిమాలకు నామినేట్ అయినవారే! ఈ లిస్ట్‌లో ఉన్నవారంతా ఇప్పటివరకూ ఒక్క ఆస్కార్ కూడా పొందలేదు. కాబట్టి ఇందులో ఎవ్వరు ఆస్కార్ కొట్టినా అది ఫస్టే!! బెస్ట్ డైరెక్టర్‌కు నామినేట్ అయిన దర్శకుల గురించి ఈ వారం చూద్దాం.. క్రిస్టొఫర్ నోలన్ (సినిమా: డంకర్క్) ఇరవై ఏళ్లుగా హాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తోన్న డైరెక్టర్ క్రిస్టొఫర్ నోలన్. ఆయన సినిమాలకు పిచ్చిగా అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ బద్దలైపోతుంది. ఇప్పుడున్న వాళ్లలో టాప్ కమర్షియల్ డైరెక్టర్ ఎవరంటే అందరూ నోలన్ పేరే చెప్పేస్తారు. అలాంటి నోలన్‌కు బెస్ట్ డైరెక్టర్ క్యాటగిరీలో ‘డంకర్క్’ వరకూ ఒక్క నామినేషన్ కూడా దక్కలేదు. తన శైలికి భిన్నంగా.. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో, డంకర్క్ ఎవాక్యుయేషన్‌ను కథగా ఎంచుకున్న నోలన్, టైమ్ అనే అంశాన్ని ‘డంకర్క్’ సినిమాలో బలంగా వాడుకుంటూ సక్సెస్ సాధించాడు. వార్ జానర్ సినిమాల్లో డంకర్క్ ఓ అద్భుతమైన ప్రయోగం. అలాంటి సినిమాకు నామినేట్ అవ్వడంతో సహజంగానే నోలన్ ఆస్కార్ కూడా అందుకోవడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. గతంలో స్క్రీన్‌ప్లేకు రెండు, నిర్మాతగా ఒక ఆస్కార్‌కు నామినేట్ అయిన నోలన్.. ఒక్క ఆస్కార్ కూడా అందుకోలేదు. ఈసారి ఆయనకే అవార్డు వస్తే, బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకుంటాడు నోలన్. అది ఆయన అభిమానులు ఎప్పట్నుంచో కంటోన్న ఓ గొప్ప కల! గెలెర్మో దెల్తోరో (సినిమా: ది షేప్ ఆఫ్ వాటర్) నోలన్ తర్వాత ఈ లిస్ట్‌లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకుంటాడన్న క్రేజ్ గెలెర్మో సొంతం చేసుకున్నాడు. ‘ది షేప్ ఆఫ్ వాటర్’తో ఇప్పటికే పలు అవార్డు వేడుకల్లో సత్తా చాటిన గెలెర్మో ఆస్కార్ రేసులో భారీ అంచనాల మధ్యనే అవార్డు అందుకుంటాడన్న పేరు తెచ్చుకున్నాడు. గెలెర్మోకి గతంలో ఒక నామినేషన్ దక్కింది. ఇప్పుడిది రెండోది. ఈసారి ఆస్కార్‌ను సొంతం చేసుకుంటే ఆయనకిది ఫస్ట్ ఆస్కార్. ‘ది షేప్ ఆఫ్ వాటర్’తో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడన్న పేరు తెచ్చుకున్నాడు గెలెర్మొ. జోర్డన్ పీలే ( సినిమా: గెటౌట్) కామెడీ నటుడు, రచయిత జోర్డన్ పీలే దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా ‘గెటౌట్’. మొదటి సినిమాకే జోర్డన్ ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం విశేషం. ఆఫ్రికన్ – అమెరికన్ సంతతికి చెందిన వారిలో ఆస్కార్‌కు నామినేట్ అయిన ఐదోవాడు జోర్డన్. ఇతనే గనక బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ కూడా అందుకుంటే, ఈ ఐదుగురిలో ఆస్కార్ అందుకున్న మొదటివాడవుతాడు జోర్డన్. హారర్ కామెడీ జానర్లో జోర్డన్ ‘గెటౌట్’లో చేసిన ప్రయోగం అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. మేకింగ్ పరంగా తనకంటూ ఒక స్టైల్ సెట్ చేసుకున్నాడతను. నోలన్, గెల్మెరోలకు పోటీ ఇచ్చేలా జోర్డన్ కనిపించడం లేదని సినీ పండితుల అభిప్రాయం. కానీ ఆస్కార్‌కు నామినేట్ అయిన వారిలో ఎవరు గెలుస్తారన్నది చివరివరకూ చెప్పలేం కాబట్టి వేచి చూడాల్సిందే! పాల్ థామస్ ఆండర్సన్ (సినిమా: ఫాంటమ్ థ్రెడ్) ఆండర్సన్ ఈ లిస్ట్‌లో ఆస్కార్‌కు బాగా దగ్గరి వ్యక్తి. గతంలో ఆరుసార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన ఆండర్సన్, అవార్డు అయితే ఒక్కటీ అందుకోలేదు. ఇంగ్లాండ్ నేపథ్యంలో 1950ల కాలంలో నడిచే కథ పట్టుకొని, ‘ఫాంటమ్ థ్రెడ్’తో ఆండర్సన్ ఒక బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. మేకింగ్‌లో ఆయన స్థాయిని ఈ సినిమాలో అడుగడుగునా చూడొచ్చు. ‘ఫాంటమ్ థ్రెడ్’ కమర్షియల్‌గా మంచి సక్సెస్. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పటికే ఆరుసార్లు ఆస్కార్ మిస్ అయిన ఆండర్సన్ ఈసారైనా అవార్డు అందుకుంటాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఆండర్సన్పై పెద్దగా అంచనాలైతే లేవుకానీ, పోటీ అయితే బాగానే ఇచ్చేలా కనిపిస్తున్నాడు. డిఫరెంట్ జానర్లో తమ బ్రాండ్ చాటుకున్న ఈ దర్శకుల్లో ఆస్కార్ ఎవరు అందుకుంటారన్నది తెలియాలంటే మార్చి 4 వరకూ ఎదురు చూడాల్సిందే! మరి ఆరోజు బెస్ట్ డైరెక్టర్ క్యాటగిరీలో ‘అన్డ్ ది అవార్డ్ గోస్ టూ..’ అనగానే ఎవరు లేచి నిలబడతారన్నది ఎదురు చూడాల్సిందే!! గెటా గర్‌విగ్ (సినిమా: లేడీ బర్డ్) ఏ సినీ పరిశ్రమలో అయినా డైరెక్టర్ అనేసరికి మేల్ డామినేషనే కనిపిస్తుంది. ఎక్కడో మెరుపుల్లా వుమన్ డైరెక్టర్స్ కనిపిస్తారు. గెటా గర్‌విగ్ చిన్న మెరుపు కాదు. మామూలు మెరుపు కూడా కాదు. ‘లేడీ బర్డ్’ సినిమాతో ఆమె హాలీవుడ్‌కు పరిచయమై, మొదటి సినిమాతోనే ఒక స్టార్ అనిపించుకుంది. 90 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో బెస్ట్ డైరెక్టర్‌గా ఇప్పటివరకూ నామినేట్ అయిన లేడీ డైరెక్టర్స్ ఐదుగురే! అందులో ఒక్కరికే (కేథరిన్ బైగ్లో – 2010) అవార్డు దక్కించుకుంది. ఇప్పుడు గెటా గనక అవార్డు దక్కించుకుంటే ఆమె రెండో వ్యక్తి అవుతుంది. ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ కథను చాలా సున్నితంగా, అద్భుతంగా సినిమాగా ఆవిష్కరించిన గెటా, ‘లేడీ బర్డ్’తో కమర్షియల్ సక్సెస్, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. -
రివీల్ చేస్తారట!
జనవరి 24. హాలీవుడ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు. విశేషం ఏంటా అనుకుంటున్నారా? మార్చి 4న 90వ ఆస్కార్ వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబందించిన నామినేషన్స్ ఈ బుధవారం అనౌన్స్ చేస్తారట. ఈ అనౌన్స్మెంట్కు సంబంధించిన చిన్న క్లూను ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్’ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ఆ క్లూ ఏంటంటే.. ఆస్కార్ ఫైనల్స్ రౌండ్ వరకూ చేరుకున్న యాక్టర్స్, మూవీస్ నామినేషన్ లిస్ట్‌ను బాలీవుడ్ నటి, హాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రియాంకా చోప్రా రివీల్ చేస్తారట. ప్రియాంకతో పాటు రెబల్ విల్సన్, రొసారియో డాసన్, మిచెల్ రోడ్రిగేజ్ లాంటి హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇందులో పాల్గొంటారట. దీనికి సంబంధించిన షూటింగ్ లొకేషన్ పిక్స్‌ను బయటకు వదిలి ఆస్కార్ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మరింత ఆసక్తి రేపింది ‘ఆస్కార్ బృందం’. -
ఆస్కార్ హంగామా మొదలైంది
‘ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ సినిమా’ అన్నది ఒక సినిమాకు తిరుగులేని బ్రాండ్. ఆ బ్రాండ్‌ను దక్కించుకునేందుకు ఏటా అదిరిపోయే సినిమాలు పోటీ పడుతుంటాయి. జనవరిలో నామినేషన్స్ అనౌన్స్ అయిన రోజు నుంచే ఏ సినిమాకు ఆస్కార్ వస్తుందన్న చర్చ మొదలైపోతుంది. ఇక ఈ ఏడాదికి అయితే ఇంకా నామినేషన్స్ రాకముందే ఆస్కార్ సందడి కనిపిస్తోంది. 2017 సంవత్సరానికి సంబంధించి ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 4, 2018న జరగనుంది. 2017లో చాలానే బెస్ట్ అనిపించుకునే సినిమాలు రావడంతో ఇప్పట్నుంచే అసలు నామినేషన్స్‌కి ఏ సినిమాలు ఎంపికవుతాయి? అందులో నిలిచి, గెలిచే సినిమా ఏది? అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ‘డన్కిర్క్’, స్పీల్బర్గ్ తీసిన ‘ది పోస్ట్’, ‘షేప్ ఆఫ్ వాటర్’, ‘వండర్ వుమన్’, ‘లేడీ బర్డ్’, ‘కాల్ మి బై యువర్ నేమ్’ తదితర సినిమాల పేర్లు రేసులో ఉంటాయని ఎక్కువమంది అంచనా! మరి ఇందులో ఎన్నింటికి నామినేషన్స్ దక్కుతాయన్నది జనవరి 23 వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఇక అస్కార్‌ను ఏ సినిమా తన్నుకుపోతున్నది తెలియాలంటే మాత్రం మార్చి 4 వరకూ వెయిట్ చేయాల్సిందే!! -
బంగారు కలలు కందాం...
‘థీమ్ పార్టీ’ గురించి వినే ఉంటారు. ఇలాంటి పార్టీలకు ఓ డ్రెస్ కోడ్ నిర్ణయిస్తారు. ఎలాంటి వేషధారణలో రావాలో కూడా ముందే చెప్పేస్తారు. ఆదివారం సాయంత్రం (భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం) లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకను ‘వియ్ ఆల్ డ్రీమ్ ఇన్ గోల్డ్’ అనే థీమ్‌తో నిర్వహించారు. ‘బంగారు బొమ్మను సొంతం చేసుకోవడానికి బంగారు కలలు కందాం’ అంటూ నామినేషన్ దక్కించుకున్నవాళ్లు ఇన్నాళ్లూ కలలు కన్నారు. మరి.. ఎవరి కల నిజమయ్యిందనేది సోమవారం తెలిసిపోతుంది. ఈలోపు ఆస్కార్ అవార్డుల గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం... మెరుపు తీగలను దగ్గరగా చూడ్డానికి పోటీ! ఆస్కార్ అవార్డు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విషయాల్లో రెడ్ కార్పెట్ ఒకటి. ఎర్ర తివాచీ పై అందాల తారలు వయ్యారంగా నడుస్తుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఈ క్యాట్వాక్ని దగ్గరగా చూడ్డానికి చాలామంది పోటీలు పడుతుంటారు. అందుకే, రెడ్ కార్పెట్‌కి సమీపంగా ఉన్న పోడియమ్కి వెళ్లే చాన్స్ దక్కించుకోవడానికి ఉవ్విళ్లూరుతారు. అందులో 745 మంది ఆసీనులు కావచ్చు. దీనికోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్లకే ఈ అవకాశం దక్కుతుంది. వీరికి లోపల జరిగే అవార్డు కార్యక్రమాన్ని వీక్షించే అనుమతి మాత్రం ఉండదు. అయి నప్పటికీ పోడియమ్లో చోటు కోసం ఆన్లైన్లో వేల సంఖ్యలో అప్లికేషన్స్ వస్తాయట. ఎక్కువ మాట్లాడితే... మైక్ కట్! ... అండ్ ది విన్నర్ ఈజ్ అంటూ తమ పేరు వినగానే విజేతల గుండె లయ తప్పినట్లు అవుతుంది. ఒకింత ఉద్వే గంగా, కన్ఫ్యూజన్గా వేదిక మీదకు వస్తారు. ఆ కంగారులో ఎక్కువ మాట్లాడేయాలనుకుంటారు కొంతమంది. కానీ, కేవలం 45 సెకండ్లు మాత్రమే విజేతకు టైం ఇస్తారు. అందుకే నామినేషన్ దక్కించుకున్నవాళ్లు ముందుగానే రిహార్సల్ చేస్తారు. అయినప్పటికీ ఉద్వేగంలో 45 సెకండ్లు కన్నా ఎక్కువ మాట్లాడితే...? మైక్రో ఫోన్‌ను కట్ చేస్తారు. ఆనాటి ఆనవాళ్లు! ఆస్కార్ వేదిక అంటే అంగరంగ వైభవంగా ఉంటుంది. ఈసారి వేదిక విశేషం ఏంటంటే.. 1970ల నాటి హాలీవుడ్ చిత్రాలను తలపించేలా ఉంటుందట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కాబట్టి, వేదికను అలా డిజైన్ చేశారు. ఆ విషయాన్ని ఉద్దేశిస్తూ.. ‘వియ్ ఆల్ డ్రీమ్ ఇన్ గోల్డ్’ అనే థీమ్‌తో ఈ వేడుక జరపాలనుకున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఆస్కార్ వేదికను డి జైన్ చేస్తున్న డెరిక్ మెక్లెయిన్ ఈసారి కూడా వేదికను డిజైన్ చేశారు. ముస్తాబుకు అంత ఖరీదా! అందాల తారలు రెడ్ కార్పెట్‌పై రకరకాల డ్రెస్సుల్లో చూపరుల మతులు పోగొడతారు. వీళ్లు వేసుకునే దుస్తులు, ఆభరణాలు, కేశాలంకరణ, మేకప్.. అన్నింటికీ కలిపి ఒక్కో బ్యూటీకి అయ్యే ఖర్చు దాదాపు 50 లక్షల రూపాయలట. అంత ఖర్చుపెడతారు కాబట్టే, కనువిందు చేయగలుగుతున్నారు. ఆ చానల్‌కి కాసుల పంట! ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఏబీసీ చానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గత 50 ఏళ్లుగా ఇదే చానల్ ఆస్కార్ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ ప్రసార హక్కులు దక్కించుకోవడానికి దాదాపు 520 కోట్ల రూపాయలను సదరు చానల్‌వారు వేడుక నిర్వాహకులకు ఇస్తారట. ఆ డబ్బుని యాడ్స్ రూపంలో సునాయాసంగా వసూలు చేసేసుకుంటారు. ప్రత్యక్ష ప్రసారం మధ్య మధ్యలో వచ్చే యాడ్స్‌కి దాదాపు 12 నుంచి 13 కోట్ల రూపాయల వరకూ తీసుకుంటారని భోగట్టా. 2020 వరకూ ఈ కార్యక్రమాన్ని తమ చానల్ వారే ప్రసారం చేసేలా ఆస్కార్ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుంది ఏబీసీ. ఈ చానల్ ద్వారా 225 దేశాల్లో ఆస్కార్ అవార్డుల పండగ వీక్షకులను కనువిందు చేయనుంది. లంచ్ మీట్లో సందడి నామినేషన్స్‌ని ప్రకటించిన తర్వాత నామినీస్‌కి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ లంచ్‌లో పాల్గొనడానికి వచ్చే నామినీస్ అందంగా ముస్తాబై హాజరవుతారు. ఈ మధ్య జరిగిన లంచ్ మీట్లో లియొనార్డో డికాప్రియో, స్టీవెన్ స్పీల్బర్గ్, జెన్నిఫర్ లారెన్స్, సీర్షా రొనాన్, రేషెల్ మెక్ ఆడమ్స్, లేడీ గగా తదితరులు పాల్గొని, సందడి చేశారు. అమెరికానే నా దగ్గరకు వచ్చింది: ప్రియాంకా చోప్రా ఆస్కార్ వేడుకల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేసే అవకాశం మన భారతీయ నటి ప్రియాంకా చోప్రాకు దక్కిన విషయం తెలిసిందే. రిహార్సల్స్ చేయడం కోసం రెండు రోజుల క్రితమే ఆమె లాస్ ఏంజిల్స్ వెళ్లారు. ‘‘జుత్తుకు హెన్నా పెట్టుకోమని, నోస్ రింగ్ పెట్టుకోమని.. ఇలా చాలామంది ఏవేవో సలహాలు ఇచ్చారు. ఎలా మ్యానేజ్ చేస్తావో.. ఏంటో అని కంగారుపెట్టారు. నేను కూల్‌గానే ఉన్నా’’ అని ప్రియాంక అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’ ఒప్పుకున్నప్పుడు అమెరికాలో నేనేంటో నిరూపించుకోవాలనే ప్లాన్ నాకుందని చాలామంది అనుకున్నారు. నాకలాంటి ప్లాన్స్ ఏవీ లేవు. అమెరికానే ఓ అవకాశం తీసుకుని నా దగ్గరకు వస్తే, నేను ఒప్పుకున్నాను... అంతే. నేను అమెరికన్ ఇండియన్ని కాదు. ఎప్పటికీ ‘ఇండియన్ ఇండియన్’నే’’ అన్నారు. ఆస్కార్ వేడుకలో అందర్నీ ఆకట్టుకోగలననే ధీమా ఆమెలో కనిపించింది.