
వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డు వేడుక తేదీ ఖరారైంది. 2023 మార్చి 12న వేడుక నిర్వహించనున్నట్లు అవార్డు కమిటీ ప్రకటించింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనున్న ఈ 95వ ఆస్కార్ అవార్డు వేడుక ‘ఏబీసీ’లో ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
అవార్డు పోటీదారులు నవంబర్ 15 లోపు తమ వివరాలు పంపాలని కమిటీ పేర్కొంది. డిసెంబర్ 12న ప్రాథమిక ఓటింగ్ ఆరంభమవుతుంది. డిసెంబర్ 21న షార్ట్‌లిస్ట్స్‌ని ప్రకటిస్తారు. జనవరి 12 నుంచి 17లోపు నామినీల ఓటింగ్ జరుగుతుంది. నామినేషన్ దక్కించుకున్నవారి జాబితాను 24న ప్రకటిస్తారు. విజేతల ఫైనల్ ఓటింగ్ మార్చి 2 నుంచి మార్చి 7లోపు జరుగుతుందని తెలిసింది. విజేతలను మార్చి 12న వేదిక మీద ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment