Oscar
-
ఆస్కార్ వేదికపై 'హిందీ'.. నామినీలకు రూ.1.9 కోట్లు
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు. సినీ ఇండస్ట్రీలో కుంభస్థలం అంటే ఆస్కారే (Oscars 2025)! ఎన్ని సినిమాలు తీసినా, ఎన్నింటిలో నటించినా, ఎన్నో యేళ్లుగా పని చేస్తున్నా.. ఒక్కసారైనా ఆస్కార్‌ను ముద్దాడాలని తహతహలాడేవారు ఎంతోమంది. కానీ అంతటి అదృష్టం అందరికీ వరించదు.. కొద్దిమందికి మాత్రమే దక్కుతుంది. అగ్నిమాపక సిబ్బందికి సలాంఅలా ఈసారి 97వ అకాడమీ అవార్డు వేడుకల్లో పలువురూ పురస్కారాలు అందుకున్నారు. అనోరా ఉత్తమచిత్రంగా నిలిచి సెన్సేషన్ దృష్టించింది. ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఈ వేడుక జరిగింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో లాస్ ఏంజిల్స్ నగరం మంటల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే! దాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది వారాల తరబడి కృషి చేశారు. అందుకుగానూ వారిని ఆస్కార్ వేదికపై ప్రశంసించారు. భారత ప్రేక్షకుల కోసం స్పెషల్ స్పీచ్అలాగే ఈ విపత్తు వల్ల 29 మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారందరికోసం విరాళాలు సేకరించనున్నట్లు ప్రకటించారు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమ వ్యాఖ్యాత, కమెడియన్ కోనన్ ఓబ్రీన్ హిందీలో మాట్లాడటం విశేషం. భారత ప్రజలకు నమస్కారాలు.. అక్కడ ఉదయం అయింది కాబట్టి అల్పాహారం భుజిస్తూ ఆస్కార్‌ను వీక్షించండి అని హిందీలో వెల్కమ్ స్పీచ్ ఇచ్చాడు.(చదవండి: 97వ ఆస్కార్ విజేతల పూర్తి జాబితా.. ఉత్తమ చిత్రం 'అనోరా')ఖరీదైన గిఫ్ట్ బ్యాగులుఇక ఆస్కార్ గెలిచినవారికి ట్రోఫీ తప్ప ఏదీ అందదు. నామినీలకు మాత్రం 'ఎవ్రీబడ్ విన్స్' పేరిట విలువైన గిఫ్ట్ బ్యాగులు అందుతాయి. ఈ బహుమతులకు అకాడమీతో ఎటువంటి సంబంధం ఉండదు. డిస్టింక్టివ్ అసెట్స్ అనే కంపెనీ గత 22 ఏళ్లుగా క్రమం తప్పకుండా వీటిని బహుకరిస్తోంది. ఆస్కార్ హోస్ట్, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో నామినేట్ అయినవారికి మాత్రమే ఈ బ్యాగ్ ఇస్తారు. ఒక్క బ్యాగులో 60 బహుమతులుఒక్కో బ్యాగు విలువ సుమారు రూ.1.92 కోట్లు ఉంటుందని సమాచారం. అందులో రూ.20 వేల విలువైన కటింగ్ బోర్డు నుంచి లక్షలు విలువ చేసే కూపన్ల వరకు ఉంటాయి. మాల్దీవుల్లో విడిది చేసేందుకు రూ.20 లక్షల మేర కూపన్, ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసేందుకు రూ.4 లక్షలు, మైసన్ కన్స్ట్రక్షన్ ద్వారా గృహ ఆధునీకరణ ప్రాజెక్ట్ కోసం రూ.43 లక్షలు ఇస్తారు. రూ.33.7 లక్షలు విలువ చేసే కాస్మొటిక్ ట్రీట్మెంట్స్ కూపన్స్ ఉంటాయి. ఇలా దాదాపు 60 వరకు బహుమతులు ఉంటాయి. Good attempt, but frankly, Conan totally butchered the Hindi greeting! #Oscars #Oscars2025 pic.twitter.com/v83eWj23H8— Sanjay Kalra, Digital Transformation Sherpa™️ (@sanjaykalra) March 3, 2025 చదవండి: ఆస్కార్ మెచ్చిన వేశ్య కథ.. ఏంటి 'అనోరా' స్పెషల్? -
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక.. లైవ్ ఏ ఓటీటీలో చూడాలంటే?
ప్రతిష్టాత్మక సినీ ఆవార్డుల వేడుక-2025కు అంతా సిద్ధమైంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 97వ ఆస్కార్ అవార్డుల పండుగ ఆదివారం జరగనుంది. ఈ అవార్డులకు ఎంపికైన విజేతలను ఆ రోజు ప్రకటించనున్నారు. ఈ వేడుక కోసం వరల్డ్ వైడ్‌గా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ సారి కూడా అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఈ వేడుకలు జరగనున్నాయి.(ఇది చదవండి: ఆస్కార్ నామినేషన్స్.. ఎంపికైన చిత్రాలివే.. ఫుల్ లిస్ట్ చూసేయండి) అయితే భారత కాలమానం ప్రకారం మనదేశంలో మార్చి 3వ తేదీ ఉదయం 5:30 నిమిషాలకు ఈ వేడుక వీక్షించే అవకాశముంది. మనదేశంలోని సినీ ప్రియులు ఈ వేడుక లైవ్‌లో చూడొచ్చు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌తో పాటు లైవ్ స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. కాగా.. ఇప్పటికే 97వ అకాడమీ అవార్డులకు నామినీలను ఈ ఏడాది జనవరి 23న ప్రకటించారు. ఈసారి హాలీవుడ్ చిత్రం ఎమిలియా పెరెజ్ అత్యధికంగా 13 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత్ వికెడ్ మూవీ 10 విభాగాల్లో నామినేషన్లను సాధించింది. ఈ ఏడాది భారతీయ సినిమాలకు మాత్రం నిరాశే ఎదురైంది. -
నాటి బాలకార్మికురాలు..ఇవాళ లీడ్ స్టార్‌గా..!
ఏ కలలకు ఆస్కారం లేని కరుకు జీవితాన్ని చిన్న వయసులోనే అనుభవించిన సజ్దా పఠాన్ పేరు ఆస్కార్ విశేషాల్లో భాగంగా తరచు వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా గునీత్ మోంగా షార్ట్ ఫిల్మ్ ‘అనూజ’ 97వ ఆస్కార్ అవార్డుల్లో నామినేట్ అయిన విషయం తెలిసిందే. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌గా నామినేట్ అయిన ‘అనూజ’పై బజ్ వేడెక్కడంతో అందరి దృష్టి ఆ చిత్రంలో నటించిన తొమ్మిదేళ్ల లీడ్‌స్టార్ సజ్దా పఠాన్‌పై పడింది.ఢిల్లీ మురికివాడల్లోని బాల కార్మికురాలైన సజ్దాను ‘సలాం బాలక్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ కాపాడింది. సజ్దాకు సినిమా నేపథ్యం లేకపోయినప్పటికీ సినిమాలకు బొత్తిగా కొత్త కాదు. ఇంతకుముందు లాటిటియా కొలోంబానీ దర్శకత్వం వహించిన ఫ్రెంచ్ చిత్రం ‘ది బ్రైడ్’లో సజ్దా నటించింది. ఆ సినిమాలో మియా మేల్జర్తో స్క్రీన్ స్పేస్ పంచుకుంది. మీరా నాయర్ ఆస్కార్ నామినేటెడ్ చిత్రం ‘సలాం బాంబే’ ద్వారా వచ్చిన ఆదాయంతో ఏర్పాటైన ‘సలాం బాలక్ ట్రస్ట్ కృష్ణన్ నాయక్ ఫిల్మ్స్ భాగస్వామ్యంతో ‘ది బ్రైడ్’ను నిర్మించింది. ఊహించని నాటకీయ పరిణామాలు వెండితెరకే పరిమితం కాదు అని నిజజీవితంలో కూడా ఉంటాయని మరోసారి బలంగా చెప్పడానికి సజ్దా పఠాన్ బలమైన ఉదాహరణ. (చదవండి: ‘హైబ్రీడ్ త్రీ ఇన్ వన్’ సైకిల్ ఆవిష్కరించిన 14 ఏళ్ల కుర్రాడు..!) -
ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ 'అనూజ' చిత్రం
ఓవైపు హాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా నిర్మాతగా కూడా నిరూపించుకుంటుంది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). తాను నిర్మాతగా తెరకెక్కించిన 'అనూజ' (Anuja) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. తాజాగా ఈ షార్ట్ ఫిలిం ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం దక్కించుకొని సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఆడమ్ జే గ్రేవ్స్ ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. జీవిత గమనాన్ని మార్చే సినిమాగా అనూజ అందరినీ మెప్పిస్తుందని ప్రియాంక చోప్రా పేర్కొంది. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టులో తాను భాగమయ్యినందుకు గర్వపడుతున్నాని ఆమె తెలిపింది.ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ నామినేషన్స్‌లో అనూజ చోటు దక్కించుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అనూజ చిత్రం కోసం ఎదరుచూస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న ఈ చిత్రం తప్పకుండా అవార్డ్ సాధిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే తొమ్మిదేళ్ల బాలిక జీవితంగా ఆధారంగా ఈ మూవీని గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా నిర్మాతలుగా తెరకెక్కించారు.బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో డోవ్ కోట్, ది లాస్ట్ రేంజర్, ది లియోన్, ది మ్యాన్ వు కుడ్నాట్ రిమేన్ సైలెంట్ చిత్రాలతో పోటీపడనుంది. ఈ కేటగిరీలో దాదాపు 180 సినిమాలు పోటీ పడగా..ఈ ఐదు చిత్రాలు నిలిచాయి. మన దేశం నుంచి రేసులో అనూజ చిత్రం ఉండటం విశేషం. -
ఆస్కార్ నామినేషన్స్.. ఎంపికైన చిత్రాలివే.. ఫుల్ లిస్ట్ చూసేయండి
ఈ ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక 97వ ఆస్కార్ నామినేషన్స్ జాబితా ఇవాళ విడుదలైంది. పలు విభాగాల్లో పోటీపడుతున్న చిత్రాల లిస్ట్‌ను లాస్ ఎంజిల్స్‌లో ప్రకటించారు. గతంలోనే విడుదల కావాల్సిన నామినేషన్స్ చిత్రాల జాబితా.. కార్చిచ్చు ఘటన ఆలస్యమైంది. వాయిదా పడడంతో గురువారం అకాడమీ అవార్డుల నామినేషన్ల చిత్రాల జాబితాను అకాడమీ సభ్యులు బోవెన్ యాంగ్, రాచెల్ సెన్నోట్ ప్రకటించారు.ఈ సారి ఇండియన్ చిత్రాలకు తీవ్ర నిరాశ ఎదురైంది. కంగువా, ది గోట్ లైఫ్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, సంతోష్, స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రాలు నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయాయి. కాగా.. గతంలో రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించిన షార్ట్ ఫిల్మ్ అనూజకు నామినేషన్స్‌లో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌లో నిలిచింది. ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 2న లాస్ ఎంజిల్స్‌లో జరగనున్నట్లు అకాడమీ నిర్వాహకులు ప్రకటించారు. ఆస్కార్- 2025 ఎంపికైన చిత్రాల జాబితా మీరు చూసేయండి.బెస్ట్ పిక్చర్ కేటగిరీ.. అనోరా ది బ్రూటలిస్ట్ ఎ కంప్లీట్ అన్నోన్ కాన్క్లేవ్ డ్యూన్: పార్ట్2 ఎమిలియా పెరెజ్ ఐయామ్ స్టిల్ హియర్ నికెల్ బాయ్స్ ది సబ్‌స్టాన్స్ విక్డ్బెస్ట్ డైరెక్టర్ విభాగం.. సీన్ బేకర్ -(అనోరా) బ్రాడీ కార్బెట్ -(ది బ్రూటలిస్ట్) జేమ్స్ మ్యాన్‌గోల్డ్- (ది కంప్లీట్ అన్నోన్) జాక్వెస్ ఆడియార్డ్- (ఎమిలియా పెరెజ్) కోరలీ ఫార్గేట్- (ది సబ్‌స్టాన్స్)బెస్ట్ యాక్ట్రెస్.. సింథియా ఎరివో -(విక్డ్) కార్లా సోఫియా గాస్కన్ -(ఎమిలియా పెరెజ్) మికే మాడిసన్ -(అనోరా) డెమి మూర్ - (ది సబ్‌స్టాన్స్) ఫెర్నాండా టోర్రెస్- (ఐ యామ్ స్టిల్ హియర్)బెస్ట్ యాక్టర్.. అడ్రియాన్ బ్రాడీ- (ది బ్రూటలిస్ట్) తిమోతీ చాలమెట్ -(ది కంప్లీట్ అన్నోన్) కోల్మెన్ డొమినింగో- (సింగ్సింగ్) రే ఫియన్నెస్- (కాన్క్లేవ్) సెబస్టియన్ స్టాన్ -(ది అప్రెంటిస్)బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్.. మోనికా బార్బరో- (ఏ కంప్లీట్ అన్నౌన్) అరియానా గ్రాండే -(విక్డ్) జామీ లీ కుర్తీస్- (ది లాస్ట్ షో గర్ల్) ఇసబెల్లా రోస్సెల్లిని -(కాన్క్లేవ్) జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్.. యురా బోరిసోవ్ -(అనోరా) కిరెన్ కల్కిన్ -(ది రియల్ పెయిన్) జెరీమీ స్ట్రాంగ్- (అప్రెంటిస్) ఎడ్వర్డ్ నార్తన్ -(ఏ కంప్లీట్ అన్నోన్) గాయ్ పియర్స్- (ది బ్రూటలిస్ట్)బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే..ది సబ్స్టాన్స్అనోరా-(సీన్ బేకర్)ది బ్రూటలిస్ట్-(బ్రాడీ కార్బెట్, మోనా ఫాస్ట్ వోల్డ్)ది రియల్ పెయిన్(జెస్సీ ఐసన్‌బర్గ్)సెప్టెంబర్ 5బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే..ఏ కంప్లీట్ అన్నౌన్కాన్క్లేవ్ఎమిలియా పేరేజ్సింగ్ సింగ్విక్డ్బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్..ఎమిలియా పేరేజ్ఫ్లోఐయామ్ స్టిల్ హియర్నీ క్యాప్వర్మింగ్లియోబెస్ట్ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ఫ్లోఇన్సైడ్ అవుట్-2మెమోర్ ఆఫ్ ఏ స్నేయిల్వాలెస్ అండ్ గ్రామిట్ వెంగేన్స్ ఆఫ్ మోస్ట్ ఫౌల్ది వైల్డ్ రోబోట్బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్డాటర్స్నో అదర్ ల్యాండ్పార్సీలైన్ వార్సౌండ్ ట్రాక్ టూ ఏ కౌప్ డిటాట్సుగర్కేన్బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం..డెత్ బై నంబర్స్ఐ యామ్ రెడీ, వార్డెన్ఇన్సిడెంట్వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఉక్రెయిన్ఏ స్విమ్ లెస్సన్బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం..అనూజ(ప్రియాంక చోప్రా చిత్రం)డోవేకోట్ది లాస్ట్ రేంజర్ఏ లైయన్ది మ్యాన్ వు కుడ్ నాట్ రిమైన సైలెంట్ -
ఆస్కార్ నామినేషన్స్‌లో ప్రియాంక చోప్రా చిత్రం.. ఏ విభాగంలో అంటే?
ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ నామినేషన్స్‌లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చిత్రం స్థానం దక్కించుకుంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌లో నిలిచింది. తాజాగా ప్రకటించిన ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్‌లో అనూజ చిత్రం పోటీ పడుతోంది. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే తొమ్మిదేళ్ల బాలిక జీవితంగా ఆధారంగా ఈ మూవీని గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా నిర్మాతలుగా తెరకెక్కించారు. దీంతో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో డోవ్ కోట్, ది లాస్ట్ రేంజర్, ది లియోన్, ది మ్యాన్ వు కుడ్నాట్ రిమేన్ సైలెంట్ చిత్రాలతో పోటీపడనుంది. ఈ కేటగిరీలో దాదాపు 180 సినిమాలు పోటీ పడగా..ఈ ఐదు చిత్రాలు నిలిచాయి. కాగా.. ప్రియాంక చోప్రా నిర్మాతగా తెరకెక్కించిన అనూజ షార్ట్ ఫిల్మ్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. కంగువా, ది గోట్ లైఫ్ చిత్రాలకు నిరాశ.. Short on time, big on talent, here are this year's nominees for Live Action Short Film. #Oscars pic.twitter.com/Wx0TZIpUen— The Academy (@TheAcademy) January 23, 2025 -
ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుక.. డేట్ ఫిక్స్ చేసిన నిర్వాహకులు
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు అంతా సిద్ధమైంది. ఇటీవల లాస్ ఎంజిల్స్‌లో కార్చిచ్చు వల్ల వాయిదా పడిన ఈవెంట్ కొత్త తేదీలను ఆస్కార్ అకాడమీ తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 2న ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుందని అకాడమీ సీఈఓ బిల్ క్రామెర్, ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ లేఖ విడుదల చేశారు. అయితే ఈ ఏడాది వేదికపై ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎంపికైన పాటల ప్రదర్శన ఉండదని అకాడమీ స్పష్టం చేసింది. కార్చిచ్చు నింపిన విషాదం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే పాటలు రాసిన రచయితలను వేదికపైకి ఆహ్వానిస్తామని తెలిపింది. ఇప్పటికే ఇండియా నుంచి ఆరు చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. వాటిలో ప్రధానంగా సూర్య కంగువా, మలయాళ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన చిత్రాల జాబితాను జనవరి 23న ప్రకటించనున్నారు. ఈ వేడుక ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ బరిలోను సౌత్ నుంచి సూర్య కంగువా(Kanguva Movie ), పృథ్వి రాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ది గోట్ లైఫ్(Aadujeevitham: The Goat Life) కూడా ఆస్కార్‌లోకి ఎంట్రీ దక్కించుకుంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ‘ఆడు జీవితం’, ‘కంగువా’, సంతోష్ , స్వాతంత్ర్య వీర సావర్కర్ , ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్(మలయాళం) చిత్రాలు ఉన్నాయి. షార్ట్ లిస్ట్ అయినా సినిమా నుంచి ఆస్కార్ ఫైనల్ నామినేషన్లను ఎంపిక చేస్తారు.లాపతా లేడీస్‌కు నో ఎంట్రీ..ఇండియా నుంచి మొదటగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’(Laapataa Ladies ) ఆస్కార్‌కు ఎంపికైంది. అయితే ఈ చిత్రం ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. డిసెంబర్ 17న ఆస్కార్ షార్ట్ లిస్ట్ చిత్రాలను అకాడమీ ప్రకటించింది. వాటిలో లాపతా లేడీస్ కు చోటు దక్కలేదు. కానీ భారతీయ నటి షహనా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ చిత్రం ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్‌కి ఎంపికైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ హిందీ చిత్రం యూకే నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం సొంతం చేసుకుంది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ జాబితాలో షార్ట్ లిస్ట్‌లో అధికారికంగా చోటు సాధించింది. -
ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.అయితే తాజాగా కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ చేసిన నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవల ఆస్కార్ ఎంపికైన చిత్రాల జాబితాపై హాట్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆస్కార్ సినిమాల జాబితాపై కాస్తా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మనదేశాన్ని వ్యతిరేకంగా తీసిన సినిమాలకే స్థానం దక్కిందని కంగనా ఆరోపించింది. అలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతోందని మండిపడింది.(ఇది చదవండి: సినిమాల్లో నటించనంటూ రిటైర్మెంట్ ప్రకటించిన పాపులర్ హీరో)కంగనా రనౌత్ మాట్లాడుతూ..'మనదేశానికి వ్యతిరేకంగా చిత్రీకరించే సినిమాలు తరచుగా ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక చేస్తున్నారు. సాధారణంగా మనదేశం కోసం.. వారు ముందుకు తెచ్చే ఎజెండా చాలా భిన్నంగా ఉంటుంది. ఆస్కార్ ఎంపికైన చిత్రాలు భారతదేశానికి వ్యతిరేకం. ఇప్పుడు ఆ చిత్రాలకే ప్రశంసలు వస్తున్నాయి. మన దేశంలో ఆస్కార్ అవార్డుల కోసం స్లమ్‌డాగ్ మిల్లియనీర్ లాంటి సినిమా అయి ఉండాలి. అంటే మనదేశాన్ని తక్కువగా చూపించే సినిమాలకే నామిషన్స్లో చోటు ఉంటుంది.'అని అన్నారు.కంగనా మాట్లాడుతూ..'ఎమర్జెన్సీ అలాంటి చిత్రం కాదు. ఈ రోజు భారతదేశం ఎలా ఉందో చూడటానికి పాశ్చాత్య దేశాలు సిద్ధంగా ఉన్నాయి. నేను ఈ అవార్డుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను భారతీయ అవార్డులు, విదేశీ అవార్డుల గురించి పట్టించుకోను. ఇది అద్భుతంగా రూపొందించిన చిత్రం. అంతర్జాతీయ చలన చిత్రం కంటే బాగుటుంది. అదే సమయంలో మన రాజకీయాలు ఎలా పనిచేస్తాయో నాకు తెలుసు. ఒక జాతీయవాదిగా నాకు అవార్డు ఫంక్షన్లపై మాకు పెద్దగా ఆశ లేదు' అని తెలిపింది.ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.(ఇది చదవండి: Oscar 2025: ఆస్కార్ బరిలో ‘కంగువా’)మొదటి నుంచి వివాదాలు..ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. -
97వ ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో 207 సినిమాలు
-
క్వీన్ ఐశ్వర్య ‘ఐకానిక్ లెహంగా' ఆస్కార్ మ్యూజియానికి
అద్భుతమైన ఒక డిజైనర్ లెహంగా మరో అద్భుతాన్ని సాధించడం ఎక్కడైనా విన్నారా? నీతా లుల్లా రూపొందించిన లెహంగా అలాంటి ప్రత్యేకతను సంతరించుకుంది. బాలీవుడ్ జోధా అక్బర్ మూవీలో, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai) పాత్ర కోసం నీతా లుల్లా డిజైన్ చేశారు. దీన్ని ఇపుడు ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగా చూడగలిగేలా ప్రతిష్టాత్మక ఆస్కార్ మ్యూజియంలో కొలువు దీరింది. ఈ విషయాన్ని అకాడమీ తన అధికారిక ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) అకాడమీ మ్యూజియం కలర్ ఇన్ మోషన్ ఎగ్జిబిషన్లో సినిమాలో క్వీన్ ఐశ్వర్య ధరించిన దుస్తులే కాకుండా ఆమె ఆభరణాలు కూడా బొమ్మపై రూపొందించారు. ఈ విషయాన్ని అకాడమీ తన అధికారిక ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది.దీంతో ఈ లెహెంగాను రూపొందించిన నీతా లుల్లా నైపుణ్యం పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.A lehenga fit for a queen, designed for the silver screen.In JODHA AKBAR (2008), Aishwarya Rai Bachchan’s red wedding lehenga is a feast for the eyes: vibrant zardozi embroidery, centuries-old craftsmanship, and a hidden gem—quite literally. Look closely and you’ll spot a… pic.twitter.com/UfUYxTeP22— The Academy (@TheAcademy) December 24, 2024 > ఐకానిక్ రెడ్ లెహెంగా,నగల విశేషాలివేజర్దోజీ ఎంబ్రాయిడరీ , శతాబ్దాల నాటి హస్తకళా నైపుణ్యం ఈ లెహెంగాలో దాగి ఉంది. ఇదే విషయాన్ని అకాడమీ తన పోస్ట్‌లో పేర్కొంటూ, ప్రశంసింయింది. నటి ధరించిన ఆభరణాలు మరింత ఆకర్షణగా ఉన్నాయి. ఆమె ధరించిన నెక్లెస్ మధ్యలో నీలం రాళ్లతో భారతదేశ జాతీయ పక్షి నెమలి మరో ఎట్రాక్షన్.జోధా అక్బర్ (Jodha Akbar) "రాణికి సరిపోయే లెహంగా, వెండితెరపై ఎంతోమందిని ఆకర్షించింది ఇకపై ఆస్కార్ మ్యూజియంలో కొలువు దీరనుంది అని అకాడమీ తెలిపింది. కాగా 2008లో అశుతోష్ గోవార్కర్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘జోధా అక్బర్’. ఐశ్వర్య 'జోధా బాయి' పాత్రలో అందర్నీ ఆకట్టుకుంది. ఈ మూవీలో హీరోగా హృతిక్ రోషన్ నటించారు. వీరి రాయల్ లుక్‌కోసం రాజస్తానీ, మొఘల సంస్కృతుల మేళవింపుతో అసలు సిసలు బంగారం, విలువైన రాళ్లతో మొత్తం 400 కిలోల ఆభరణాలను తయారు చేయించారన. ఇందులో 200 కిలోల ఐశ్వర్య ప్రాతకోసం. ఈ మొత్తం ఆభరణాల తయారీకి 70 మంది కళాకారులు రెండేళ్ల పాటు శ్రమించారని చెబుతారు. -
ఆస్కార్‌లో నిరాశ.. లాపతా లేడీస్‌ను సెలక్ట్ చేయడమే తప్పంటున్న డైరెక్టర్
లాపతా లేడీస్.. బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమాకు ఓటీటీ ప్రియులు బ్రహ్మరథం పట్టారు. కాన్సెప్ట్ కొత్తగా ఉందని ఎగబడి చూశారు. అంతేనా? ఏకంగా ఆస్కార్ కోసం మన దేశం నుంచి లాపతా లేడీస్ చిత్రాన్ని పంపించారు. కానీ ఆదిలోనే భంగపాటు ఎదురైంది. ఈ సినిమా షార్ట్ లిస్ట్ కాకపోవడంతో అకాడమీ అవార్డుల రేసులో నుంచి తప్పుకుంది. అయితే ఆస్కార్‌కు ఈ సినిమాను ఎంపిక చేయడమే పెద్ద తప్పంటున్నాడు దర్శకనిర్మాత హన్సల్ మెహతా.మరో ఫెయిల్యూర్ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరోసారి తన వైఫల్యాన్ని చాటిచెప్పింది. ఏయేటికాయేడు సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేస్తూ పూర్తిగా వెనకబడుతోంది అని ట్వీట్ చేశాడు. దీనికి పలువురు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. కేన్స్, స్పిరిట్, గోల్డెన్ గోబ్స్ వంటి అంతర్జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాను పంపించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఆస్కార్ బరిలో ఇండియన్ సినిమాలు అడ్రస్ లేకుండా పోతున్నాయని కామెంట్లు చేస్తున్నారు.లాపతా లేడీస్లాపతా లేడీస్ విషయానికి వస్తే.. మహిళా డైరెక్టర్ కిరణ్ రావు తీసిన ఈ మూవీ మార్చిలో విడుదలైంది. ప్రతిభ రంత, నితాన్షి గోయల్, స్పర్ష్ శ్రీవాత్సవ, రవి కిషన్, ఛాయా కదమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నాలుగైదు కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ.25 కోట్లు రాబట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. Film Federation of India does it again! Their strike rate and selection of films year after year is impeccable. pic.twitter.com/hiwmatzDbW— Hansal Mehta (@mehtahansal) December 17, 2024చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త -
ఆస్కార్ రిటైరయ్యింది..!
ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం ముంబైలోని అంటీలియా వద్ద పేలుడు పదార్థాలను కనిపెట్టి పెను ప్రమాదాన్ని నివారించిన పోలీసు జాగిలం ‘ఆస్కార్’విధుల నుంచి విశ్రాంతి తీసుకుంది. మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న అంబానీ నివాసం సమీప పార్కింగ్ ప్లేస్‌లో 2021 ఫిబ్రవరి 25న ఆగంతకులు ఉంచిన జిలెటిన్ స్టిక్స్‌ను ఇది పసిగట్టింది. అప్పట్లో ఈ విషయం దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది. ఆస్కార్ బుధవారం తోటి శునకం మిలోతోపాటు రిటైరయ్యింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకకు అదనపు కమిషనర్ వినీత్ సాహూ సహా పలువురు అధికారులు హాజరై జాగిలాలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ముంబై పోలీసు విభాగం బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీడీఎస్)లో 2014లో చేరిన ఆస్కార్ పదేళ్లపాటు వీఐపీ భద్రతతోపాటు బెదిరింపులు, బెదిరింపు కాల్స్ సమయంలో విధులను సమర్ధవంతంగా నిర్వహించిందని ఓ అధికారి తెలిపారు. మిలో కూడా వీఐపీలు, కీలక సంస్థల భద్రతతోపాటు అనుమానాస్పద బ్యాగుల తనిఖీ విధుల్లో పాల్గొందని చెప్పారు. రిటైరయ్యాక ఈ రెండు జాగిలాలకు ఏసీ వసతి సౌకర్యంతోపాటు రవాణా సమయంతో ఏసీతో కూడిన వాహనం సమకూర్చుతామని, ఇవి అందించిన సరీ్వసులకు గుర్తింపుగా ‘వాల్ ఆఫ్ ఫేమ్’ను ఏర్పాటు చేశామని చెప్పారు. -
Oscars 2025: యూకే ఓకే చెప్పిన ఈక్వాలిటీ కథ..
మన దేశంలో అందరికీ సమాన న్యాయం జరగడం సులభమేనా?న్యాయానికి కులం, మతం,ప్రాంతం ఉంటాయా?కంటికి కనిపించేది, చెవికి వినిపించేదంతా న్యాయమేనా?సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’ సంధించే ప్రశ్నలివి. యు.కె. ప్రభుత్వ నిర్మాణ భాగస్వామ్యంతో నిర్మితమైన ఈ సినిమాను ఇప్పుడు ఆ దేశం తన అఫిషియల్ ఎంట్రీగా ఆస్కార్‌కు పంపింది. ‘లాపతా లేడీస్’తో పాటు ఆస్కార్‌లో ‘సంతోష్’ కూడా భారతీయ మహిళల కథను పోటీకి నిలపనుంది.ఈ వ్యవస్థ ఎలా నడుస్తోందో వ్యవస్థతో తలపడినప్పుడే సగటు మనిషికి తెలుస్తుంది. సామాజిక వ్యవస్థలో తన కంటే పై వర్గం ఎలా వ్యవహరిస్తుందో తెలిసొస్తే పాలనా వ్యవస్థలో తన కంటే పై అధికారి ఆ పై అధికారి ఎలా వ్యవహరిస్తారో తెలిసొస్తుంది. ప్రతి వ్యవస్థకు వర్షించే కళ్లు, కాటేసే కోరలు ఉంటాయి.ఎవరి మీద వర్షించాలో, ఎప్పుడు కాటేయాలో దానికి తెలుసు. అది మారాలని అందరికీ ఉంటుంది. వ్యవస్థ కూడా తాను మారాలని అనుకోవచ్చు. కాని మారదు. మారాలనుకున్నా మనుషులు మారనివ్వరు. ఏదో కొద్ది వెసులుబాటులో కాసింతో కూసింతో గాలి ఆడి పనులు అవుతుంటాయి అంతే.డాక్యుమెంటరీ మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ సినిమా మన భారతీయ వ్యవస్థ– అది కుల వ్యవస్థ కాని పాలనా వ్యవస్థ గాని ఎలా వ్యవహరిస్తుందో ఒక బాలిక చావు ఆధారంగా చర్చిస్తుంది. ఒక మహిళా కానిస్టేబుల్ కళ్లతో సామాజిక వ్యవస్థను, న్యాయ వ్యవస్థను చూసి ప్రేక్షకుల మనసుల్లో ప్రశ్నలు నాటుతుంది.కథ ఏమిటి?‘సంతోష్’ సినిమాలో ప్రధాన పాత్రధారి సంతోష్ సైని అనే మహిళా పోలీస్ కానిస్టేబుల్. ఈ పాత్రను చాలా ప్రతిభావంతమైన నటిగా పేరు పొందిన షహానా గోస్వామి పోషించింది. ఉత్తరప్రదేశ్‌లాంటి ఒక కల్పిత రాష్ట్రంలో సంతోష్‌కు ఒక కానిస్టేబుల్‌కు పెళ్లవుతుంది. కానీ డ్యూటీలో ఉండగా భర్త హఠాత్తుగా మరణిస్తాడు. ‘నా కొడుకును మింగింది’ అని అత్తగారు సూటి పోటి మాటలంటే అమ్మ గారింట్లోని వారు తిరిగొచ్చిన కూతురిని రకరకాలుగా బాధలు పెడతారు. దాంతో గత్యంతరం లేక భర్త మరణం వల్ల వచ్చే కారుణ్య నియామకంలో ఆమె కానిస్టేబుల్ అవుతుంది. కాని పోలీసులంటే బయట ఉండే మనుషుల్లాంటి వారేనని అక్కడ దారుణమైన పురుషస్వామ్యం, కుల పెత్తనం, అవినీతి, మత ద్వేషం ఉంటాయని తెలుసుకుంటుంది. ఆ సమయంలోనే ఒక అట్టడుగు వర్గం బాలిక శవం ఊరి బావిలో దొరుకుతుంది. అగ్ర కులాల వారే ఆమెను చంపి బావిలో వేశారని గ్రామస్తులు విచారణకు వెళ్లిన సంతోష్‌కు చెబుతారు. అక్కడి నుంచి ఆమె ఎలాంటి ప్రయాణం చేసిందనేదే కథ.మహిళలపై హింసకు వ్యతిరేకంగాలండన్లో పుట్టి పెరిగిన బ్రిటిష్ ఇండియన్ సంధ్యా సూరి గతంలో ‘ఐ ఫర్ ఇండియా’ డాక్యుమెంటరీలో ‘ఫీల్డ్’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో చాలా అవార్డులు పొందింది. భారతదేశంలో స్త్రీలపై సాగే హింస మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని ఇండియాలోని ఎన్జిఓలతో పని చేస్తున్నప్పుడు ‘నిర్భయ’ ఘటన ఆమెను హతాశురాలిని చేసింది. ఆ సమయంలో నిరసనలు చేస్తున్న స్త్రీలను అదుపు చేసే మహిళా కానిస్టేబుళ్ల కళ్లలోని బాధ, ఆవేదన చూసినప్పుడు ఆమెకు ‘సంతోష్’ సినిమా తీయాలని అనిపించింది. అయితే దీని నిర్మాణం కోసం ఆమె యు.కె/జర్మన్/ఫ్రెంచ్ దేశాల ఫిల్మ్ ఫండింగ్ ఏజెన్సీల భాగస్వామ్యం కోరింది. సునీతా రాజ్వర్ (పంచాయత్ ఫేమ్), సంజయ్ బిష్ణోయ్ తదితరులు ఇందులో నటించారు.ఆస్కార్ ఎంట్రీమేలో జరిగిన 77వ కాన్స్‌లో బహు ప్రశంసలు పొందిన ‘సంతోష్’ను 97వ ఆస్కార్ అవార్డుల పోటీలో తన దేశ అఫిషియల్ ఎంట్రీగా పంపాలని యూకే భావించడం ఈ కథకు, దర్శకురాలికి దక్కిన గౌరవంగా భావించాలి. ఇప్పటికే మన దేశం నుంచి వెళుతున్న లాపతా లేడీస్ స్త్రీల కథకాగా ‘సంతోష్’ కూడా స్త్రీల కథే కావడం విశేషం.ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ.. -
All We Imagine as Light: ఆస్కార్ బరిలో...!
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచే చాన్స్ ఉంది. కనికస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రలో, ఛాయాకందం ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ఇది. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్ దేశాలు ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. ఈ ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డు ఈ చిత్రం గెలుచుకుంది. తాజాగా ఈ సినిమాను 2025 ఆస్కార్ బరిలో నిలిపేందుకు మేకర్స్ సన్నాహాలు మొదలు పెట్టారట. ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపేందుకు ఫ్రాన్స్ దేశం షార్ట్ లిస్ట్ చేసిందని టాక్. ఇక 97వ ఆస్కార్ అవార్డుల వేడుక 2025 మార్చిలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం అక్టోబరు 2న ఫ్రాన్స్‌లో రిలీజ్ కానుందని, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో రూ΄÷ందిన ఈ సినిమాను ఇండియాలో హీరో రానా నిర్మాణసంస్థ ‘స్పిరిట్ మీడియా’ డిస్ట్రిబ్యూట్ చేయనుందట. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముంబైలో పని చేస్తున్న ఇద్దరు కేరళ నర్సులు ప్రభ (కనికస్రుతి), అను (దివ్య) జీవితాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ కథనం సాగుతుంది. -
ఆస్కార్ అదరహో
బాకు (అజర్బైజాన్): వరుసగా నాలుగో ఏడాది క్వాలిఫయింగ్‌లో మెరిపించిన ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ప్రధాన రేసులో మాత్రం తడబడ్డాడు. ఆదివారం జరిగిన సీజన్‌లోని 17వ రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి విజేతగా నిలిచాడు. నిరీ్ణత 51 ల్యాప్‌లను ఆస్కార్ అందరికంటే వేగంగా 1 గంట 32 నిమిషాల 58.007 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆ్రస్టేలియాకు చెందిన 23 ఏళ్ల ఆస్కార్‌కు ఈ సీజన్లో ఇది రెండో విజయం. హంగేరి గ్రాండ్‌ప్రిలోనూ ఆస్కార్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన లెక్లెర్క్ 1 గంట 33 నిమిషాల 08.917 సెకన్ల సమయంతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 20వ ల్యాప్‌లో అప్పటి వరకు నంబర్‌వన్ స్థానంలో ఉన్న లెక్లెర్క్ను ఆస్కార్ పియాస్ట్రి ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు ఆస్కార్ నిలబెట్టుకొని తన కెరీర్లో రెండో విజయాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ జార్జి రసెల్‌కు మూడో స్థానంలో, మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్‌కు నాలుగో స్థానంలో, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) ఐదో స్థానంలో నిలిచారు. వీసా క్యాష్ యాప్ జట్టుకు చెందిన యుకీ సునోడా రేసును పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. 24 రేసుల ఫార్ములావన్ సీజన్లో 17 రేసులు ముగిశాక మాక్స్ వెర్స్టాపెన్ 313 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని 18వ రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 22న జరుగుతుంది. -
అంగరంగ వైభవంగా ఆస్కార్స్-2024 వేడుక.. ఈ ఫొటోలు చూశారా?
-
ఆస్కార్ పార్టీలో మెరిసిన తారలు
-
ఆస్కార్‌లో కొత్త అవార్డు
ఆస్కార్ అవార్డుల్లో ఓ కొత్త కేటగిరీ చేరనుంది. ప్రస్తుతం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. కొత్తగా క్యాస్టింగ్ డైరెక్టర్స్‌కు ఓ కేటగిరీని చేర్చినట్లు అకాడమీ వెల్లడించింది. దీంతో ఆస్కార్ అవార్డుల విభాగాల సంఖ్య 24కు చేరనుంది. కానీ ఈ ఏడాది మార్చి 10న జరగనున్న 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో కానీ, 2025లో జరిగే 97వ ఆస్కార్ అవార్డ్స్‌లో కానీ ‘క్యాస్టింగ్ డైరెక్టర్స్’ విభాగంలో అవార్డును ప్రదానం చేయరు. 2026లో జరిగే 98వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఈ విభాగంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. అంటే.. 2025లో రిలీజయ్యే సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్స్ 98వ ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ అవుతారు. ‘‘ఫిల్మ్ మేకింగ్ విభాగంలో, ఆస్కార్ ప్రదానోత్సవంలో క్యాస్టింగ్ డైరెక్టర్స్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఇప్పుడు వారిని ఈ ప్రదానోత్సవంలో భాగం చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు ఆస్కార్ అకాడమీ అధ్యక్షుడు జానెట్ యంగ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్ క్రామెర్. ‘‘క్యాస్టింగ్ డైరెక్టర్స్ ఆస్కార్ అవార్డు’ అనేది మా కృషికి గుర్తింపుగా భావిస్తున్నాం. ఆస్కార్ అకాడమీకి «థ్యాంక్స్’’ అని క్యాస్టింగ్ డైరెక్టర్ బ్రాంచ్ గవర్నర్లు రిచర్డ్ హిక్స్, కిమ్ టేలర్–కోల్మన్, డెబ్రా జేన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆస్కార్ అవార్డ్స్‌కు సంబంధించి ఓ కేటగిరీని చేర్చారని, చివరిసారిగా 2001లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌ను చేర్చారని హాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. -
లేటు వయసులో గర్ల్‌ఫ్రెండ్‌తో బిడ్డకు తండ్రి: నటుడి రియాక్షన్ వైరల్
హాలీవుడ్ నటుడు , లెజెండ్ రాబర్ట్ డి నీరో లేటు వయసులో తండ్రి కావడంపై స్పందించారు. రెండుసార్లు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న నీరో , గర్ల్ ఫ్రెండ్ టిఫనీ చెన్‌తో కలిపి గత ఏడాది ఏప్రిల్‌లో 79 ఏళ్ళ వయసులో ఏడో బిడ్డగా ఒక పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రిగా తాను పొందుతున్న ఆనందాలను, అనుభూతి గురించి మాట్లాడారు. తన పాప గియా చూసినపుడు చాగా తనకు సంతోషంగా ఉంటుదని, ఈ వయసులో సాధ్యమైనంత ఎక్కువ సమయం పాపతో గడపాలని కోరుకుంటున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.. ఎన్ని టెన్షన్స్ ఉన్నా పాను ఒక్కసారి చూస్తే అన్నీ మటు మాయం... తన పాప చాలా అందంగా ముద్దుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. 80 ఏళ్ళ వయసులో తండ్రి అవ్వడం పెద్ద విశేషమే అంటూ మురిసిపోయాడు. “I'm an 80-year-old dad, and it's great. And I want to be around for as long as I can to enjoy it.” Robert De Niro gets emotional talking about his baby daughter during an interview with AARP. pic.twitter.com/C1PHzxetnP — AP Entertainment (@APEntertainment) January 25, 2024 ఇప్పటికే ‘గాడ్ ఫాదర్-2’ సినిమాకు రాబర్ట్ డి నీరో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. అలాగే 2024 ఆస్కార్ నామినేషన్ లిస్టులో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ క్యాటగిరీలో మరో అవార్డు అందుకున్నాడు. రాబర్ట్ డి నీరో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. అతని మొదటి భార్య డయానే అబాట్ ద్వారా ఇద్దరు పిల్లలు, కుమార్తె డ్రేనా , కుమారుడు రాఫెల్ ఉన్నారు. అలాగే మోడల్-నటి టౌకీ స్మిత్‌తో జూలియన్ ,ఆరోన్ అనే కవలలకు జన్మనిచ్చాడు. దీంతో పాటు రాబర్ట్ డి నీరోకు అతని మాజీ భార్య గ్రేస్ హైటవర్‌తో కుమారుడు ఇలియట్ ,కుమార్తె హెలెన్ గ్రేస్ ఉన్నారు.వీరిలో ఇద్దరు హాలీవుడ్ లో పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఇక ఏడో సంతానంగా టిఫనీ చెన్ , నీరోకు పాప గియా పుట్టింది. -
అందుకే భావోద్వేగానికి లోనయ్యాను: చంద్రబోస్
‘‘నేనిప్పటివరకు 3700 పాటలు రాశాను. ఈ రోజు నా మీద పాట రాసి, పాడారు. ఆ పాటను నాకు బహుమతిగా ఇచ్చిన ‘పర్ఫ్యూమ్’ టీమ్‌కి కృతజ్ఞతలు. నేను ఆస్కార్ అందుకున్న వీడియోను మళ్లీ ఇక్కడ చూడటంతో భావోద్వేగానికి లోనయ్యాను. ‘పర్ఫ్యూమ్’ పెద్ద విజయం సాధించాలి. నా భార్య సుచిత్ర ఈ చిత్రంలో ఒక పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు’’ అని రచయిత చంద్రబోస్ అన్నారు. చేనాగ్,ప్రాచీ థాకర్ జంటగా జేడీ స్వామి దర్శకత్వం వహించిన చిత్రం ‘పర్ఫ్యూమ్’. శ్రీమాన్ మూవీస్ సమర్పణలో జె. సుధాకర్, శివ .బి, రాజీవ్ కుమార్ .బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఆస్కార్ అవార్డుగ్రహీత చంద్రబోస్‌ను యూనిట్ సత్కరించింది. ఈ వేడుకకి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్. విష్ణుమూర్తి, ఐఆర్ఎస్ అధికారి మురళీమోహన్, గ్రీన్ హార్స్ కంపెనీ అధినేత ప్రవీణ్ రెడ్డి, ఆచార్య భట్టు రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ‘‘కొత్త పాయింట్‌తో రూపొందిన చిత్రమిది’’ అన్నారు జేడీ స్వామి, చేనాగ్. -
జూనియర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు!
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తాజాగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు జూనియర్‌కు అభినందనలు తెలుపుతున్నారు. (ఇది చదవండి: లియోకు మరో షాక్.. రిలీజైన కొద్ది గంటల్లోనే!! ) తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. అందులో మన టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కే హుయ్ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్ కూడా ఉన్నారు. కాగా.. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో జూనియర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. ఆ తర్వాత హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్2’లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?) View this post on Instagram A post shared by The Academy (@theacademy) -
ఆస్కార్ బరిలో మన 'బలగం'.. టాలీవుడ్ నుంచి ఆ రెండే!
ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పురస్కారం లభించింది. మరోవైపు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు సైతం ఈ అవార్డ్ దక్కింది. ఈ ఏడాది భారత్ నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో గుజరాతీ చిత్రం ఛెల్లో షో ను పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఎలాంటి అవార్డు లభించలేదు. (ఇది చదవండి: ఓటీటీలో సూపర్‌హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!) అయితే వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ వేడుక కోసం అప్పుడే సందడి మొదలైంది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్-2024 ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈ విభాగంలో మన టాలీవుడ్ సినిమాలు బరిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆస్కార్ ఎంట్రీ కోసం దాదాపు 22 చిత్రాలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలను ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నైలో వీక్షిస్తున్నారు. ఈ చిత్రాలు చూసిన తర్వాతే ఉత్తమ చిత్రం ఎంపిక చేయనున్నారు. ఆస్కార్ ఎంట్రీకి వచ్చిన సినిమాలివే!! దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు తెలుస్తోంది. దసరా (తెలుగు), బలగం(తెలుగు), ది స్టోరీ టెల్లర్ (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), 12 ఫెయిల్ (హిందీ), ది కేరళ స్టోరీ, విడుదలై పార్ట్-1 (తమిళం), ఘూమర్ (హిందీ), వాల్వి (మరాఠీ), గదర్-2 (హిందీ), అబ్ థో సాబ్ భగవాన్ భరోస్ (హిందీ), బాప్ లాయక్ (మరాఠీ), రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, జ్విగాటో చిత్రాలు ఉన్నట్లు సమాచారం. (ఇది చదవండి: రైతుబిడ్డకు 26 ఎకరాల పొలం, కోట్ల ఆస్తి? స్పందించిన ప్రశాంత్ తండ్రి) బలగం సినిమాకే ఛాన్స్!! ఈ సారి టాలీవుడ్ నాని సూపర్ హిట్ దసరా, చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన బలగం పోటీ పడుతున్నాయి. ఈ సినిమాలన్నీ చూసిన తర్వాతే ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్‌కు పంపుతారు. కాగా.. ఇప్పటికే బలగం చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు సైతం వరించి సంగతి తెలిసిందే. దీంతో బలగం మూవీ ఆస్కార్ ఎంట్రీకి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆస్కార్ మ్యూజియమ్‌లో మెమోరీస్ గుర్తు చేసుకున్న ఇండియన్ స్టార్స్
లాస్ ఏంజిల్స్‌లోని ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించారు నటుడు–దర్శక–నిర్మాత కమల్‌హాసన్, సంగీత దర్శకుడు–గాయకుడు–నిర్మాత ఏఆర్ రెహమాన్. ఆ మ్యూజియమ్లోనే హాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ ‘ది గాడ్‌ఫాదర్’ (1972) సినిమాను వీక్షించారు కమల్, రెహమాన్. 81వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ (2008) సినిమాకుగాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డ్స్‌ను సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. నాటి విశేషాలను కూడా కమల్‌తో కలిసి ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ గుర్తు చేసుకున్నారు. అలాగే కమల్‌తో కలిసి ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించిన ఫొటోలను రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా, కమల్‌హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గ్లింప్స్ వీడియో లాంచ్ ఇటీవల అమెరికాలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక కోసం అమెరికా వెళ్లిన కమల్‌హాసన్ ఇంకా అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే తన సినిమాలకు మేకప్ ఆర్టిస్ట్‌గా చేసిన మైఖేల్ వెస్ట్మోర్ను కలిసిన కమల్‌హాసన్ తాజాగా ఏఆర్ రెహమాన్‌తో కలిసి ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించారు. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తాను హీరోగా నటించాల్సిన సినిమా షూటింగ్లో కమల్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకుడు. -
హ్యాపీ బర్త్ డే బాబాయ్.. ఉపాసన స్పెషల్ విషెస్!
ఉపాసన- రామ్ చరణ్ ఈ ఏడాది తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జూన్ 20న అపోలో ఆస్పత్రిలో చేరిన మెగా కోడలు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే తమ ముద్దుల కూతురి పేరును క్లీంకారగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫ్యామిలీలో వారసురాలు అడుగు పెట్టడంతో పండుగ వాతావరణం నెలకొంది. (ఇది చదవండి: విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా ) అయితే ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో జరిగిన వేడుకలో ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు. అయితే ఇవాళ సంగీత దర్శకుడు కీరవాణి బర్త్‌డే సందర్భంగా ఉపాసన వినూత్నంగా విషెస్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఫోటోను పంచుకున్నారు. నాటు నాటు పాట స్టెప్పులకు వింబుల్డన్‌లో టెన్నిస్ ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తున్నట్లు ఫోటోను షేర్ చేశారు. అంతే కాకుండా హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఆస్కార్ అవార్డ్‌తో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. (ఇది చదవండి: డైరెక్టర్‌తో హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. యూటర్న్ తీసుకున్న కల్పికా గణేశ్) -
అవునూ.. మన అడవుల్లో ఏనుగెందుకు లేదు?
మీరు ఓ విషయాన్ని గమనించారా? మన రాష్ట్రంలో జూలో తప్ప అడవుల్లో ఏనుగులు లేవు. చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ ఉన్నాయి. దక్షిణాదిలో అయితే.. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మందలు మందలుగా కనిపిస్తే.. ఇటు ఏపీలోనూ పదుల సంఖ్యలో అటవీ ప్రాంతాల్లో ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. మరి తెలంగాణలో ఎందుకు లేవు? ఇటీవలే ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీకి ఆస్కార్ పురస్కారం దక్కిన నేపథ్యంలో ఏనుగుల మీదకు అందరి దృష్టి మళ్లింది. ఈ నేపథ్యంలో అసలు గజరాజు తెలంగాణలో ఎందుకు లేడు? పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు రాడు? అన్న విషయంపై ఓ లుక్కేద్దామా.. – సాక్షి, హైదరాబాద్ ఎందుకు లేవు.. ఎందుకు రావు.. ♦తెలంగాణలో ఏనుగులు కనిపించకపోవడానికి ప్రధానంగా భౌగోళిక, వాతావరణ పరిస్థితులే కారణం. తెలంగాణ, చుట్టుపక్కల ప్రాంతాలు భౌగోళికంగా దక్కన్ పీఠభూమిపై ఉండటంతోపాటు అడవుల మధ్య ‘డ్రై ఏరియా’ కారణంగా చారిత్రకంగానే ఇక్కడ ఏనుగులు లేవు. తెలంగాణకు ఆనుకుని ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని జిల్లాలన్నీ (పూర్వపు హైదరాబాద్ స్టేట్‌లోని) పొడి వాతావరణం, వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాలే. రాయచూర్, గుల్బర్గా, అకోలా, బీదర్, నాందేడ్ తదితర చోట్లా ఏనుగులు లేకపోవడంతో తెలంగాణలో ఏనుగుల ప్రవేశానికి అవకాశాలు లేకుండా పోయాయి. ♦ఏనుగులు స్థిర నివాసం ఏర్పరుచుకోవాలంటే దట్టమైన అడవులు, పచ్చదనం అవసరం. కనీసం 1,000–1,500 మిల్లీమీటర్ల వర్షపాతముండే ప్రాంతాలు కావాలి. తేమ వాతావరణం ఉండాలి. కనీసం 7, 8 నెలల పాటైనా అడవుల్లోని చెట్లు ఆకులు కలిగి ఉండాలి. గడ్డి ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి. ఒక్కో ఏనుగుకు సగటున రోజుకు 150 నుంచి 200 కేజీల మేత అవసరం. ఒక గుంపులో ఐదు ఏనుగులుంటే రోజూ టన్ను మేత కావాలి. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి దట్టమైన అడవులు లేకపోవడం వల్ల.. పెద్ద పులులు, ఇతర జంతువులు పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి, స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నా ఏనుగులు మాత్రం రావడం లేదు. ♦ అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగులున్న చిత్తూరు, విజయనగరం జిల్లాల నుంచి తెలంగాణలోకి రావడానికి ఎలాంటి అడవుల కనెక్షన్ లేదు. మధ్యలో మైదాన ప్రాంతాలను దాటి ఏనుగులు ఇటు వచ్చేందుకు అవకాశాల్లేవు. ఏపీ సరిహద్దుల్లో ఖమ్మంకు ఆనుకుని పశ్చి మగోదావరి, మహబూబ్‌నగర్‌కు ఆనుకుని కర్నూలు, నల్లగొండ వైపు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఏనుగులు లేవు. దీనితో తెలంగాణలోకి వచ్చే పరిస్థితి లేదు. ♦ గతంలో ఉమ్మడి ఏపీలోకి రెండు మార్గాల్లో ఏనుగులు వచ్చాయి. ఒకటి.. చిత్తూరు జిల్లాకు ఆనుకుని ఉన్న కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అడవుల నుంచి వచ్చాయి. ఆ రెండు రాష్ట్రాలు కూడా ఏనుగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే. ఆయా చోట్ల ఏనుగుల సంతతి పెరగడంతో పొరుగునే ఉన్న ఏపీలోకి ప్రవేశించాయి. స్థిరనివాసం ఏర్పరుచుకునే వాతావరణం, పరిస్థితులు ఉండడంతో ఇక్కడే ఉండిపోయాయి. ♦ ఇక రెండోది.. ఒడిశాకు పలుమార్లు భారీ వరదలు రావడంతో సరిహద్దుల్లోని విజయనగరం జిల్లాకు కొన్ని ఏనుగులు వలస వచ్చాయి. తిరిగి వెళ్లకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండిపోయాయి. అదేవిధంగా జార్ఖండ్ నుంచి కూడా ఏనుగులు వలస వచ్చాయి. చారిత్రకంగా, భౌగోళికంగా, ఇతర ప్రధాన కారణాలతో తెలంగాణలో ఏనుగులు లేవు. ఏపీలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఏనుగులు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగును నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకువచ్చేలా ఒక కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో పెద్దపులులు అసలు లేకపోవడం, ఇటు తెలంగాణలో ఏనుగులు లేకపోవడంతో.. రెండు ప్రాంతాల్లో పరస్పరం పులులు, ఏనుగులను మార్పిడి చేస్తే బావుంటుందని అంచనా వేశారు. ఈ విధంగా చేయడం ద్వారా మొత్తం ఉమ్మడి ఏపీవ్యాప్తంగా పుష్కలంగా వన్యప్రాణులతో పాటు జీవవైవిధ్యంతో కూడిన మంచి వాతావరణం ఏర్పడుతుందని ఆశించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. – ఎ.శంకరన్, ఓఎస్డీ, తెలంగాణ అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ విభాగం -
ఆస్కార్ విజేతలకు తెలంగాణ ప్రభుత్వం ఘన సన్మానం
-
ఆయన రాజమౌళి కాదు.. రాజముని
‘‘ఆస్కార్’ అవార్డు సాధించి ఎంతో మంది తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారు డైరెక్టర్ రాజమౌళి. ఆయన రాజమౌళి కాదు.. రాజముని. ఆయన చేసిన గొప్ప ప్రయోగం (ఆర్ఆర్ఆర్) తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటింది’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. 95వ ఆస్కార్ వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీతలు కీరవాణి, చంద్రబోస్‌లను హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ–‘‘ఆస్కార్ అంటే ఆకాశంలో తారలాంటిది. ఆ తారని నేలకు తెచ్చిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్‌లకు అభినందనలు. తెలుగువారు గర్వపడేలా తెలుగు ఇండస్ట్రీని ఉన్నత స్థానంలో నిలిపిన వారికి ఏపీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి తరఫున అభినందనలు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘నాటు నాటు..’ పాటకి ‘ఆస్కార్’ రావాలని లక్షల మంది ఎదురు చూశారు.. ఆ అవార్డు రానే వచ్చింది. ఈ విజయాన్ని సాధించిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్గార్లకు అభినందనలు’’అన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ–‘‘ఒక సినిమాకి నంది అవార్డు వచ్చిందంటే చాలా గొప్పగా అనుకుంటున్నాం. అలాంటిది తొలిసారి ఒక తెలుగు పాటకి ప్రపంచంలో అత్యున్నతమైన ‘ఆస్కార్’ అవార్డు రావడం తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సమయం. ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు. ఎంఎం కీరవాణి మాట్లాడుతూ– ‘‘నాటు నాటు..’ పాటకి ‘ఆస్కార్’ అవార్డు రావడం వెనుక రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, అద్భుతంగా డ్యాన్స్ చేసిన రామ్‌చరణ్, ఎన్టీఆర్, ఉక్రెయిన్ డ్యాన్సర్స్ కృషి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నచ్చింది కాబట్టే ‘నాటు నాటు..’ పాట నచ్చింది, అవార్డు వచ్చింది. ఇది ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ సమిష్టి కృషికి లభించిన విజయం’’ అన్నారు. పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ–‘‘తమ్ముడూ.. నువ్వు పాడటంపై దృష్టి పెట్టొద్దు.. రాయడంపై దృష్టి పెట్టు’ అని చెప్పిన గుర్రా శ్రీనాథ్ అన్న, ‘పెళ్లిసందడి’ సమయంలో ‘బోస్‌ని మనతోపాటు చెన్నై తీసుకెళదాం’ అంటూ రాఘవేంద్రరావుగారితో చెప్పిన కీరవాణిగార్ల మాటలు నా జీవిత గమనాన్ని మార్చి ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆస్కార్‌ని చేతిలో పట్టుకున్నప్పుడు భారత సాహిత్య పతాకాన్ని పట్టుకున్నంత ఆనందం కలిగింది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు, దర్శకులు, హీరోలు, చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
'నాటు నాటు' పాట అలా పుట్టింది... వెల్లడించిన చంద్రబోస్
చిట్యాల: చల్లగరిగలో చిన్నప్పుడు నేర్చుకున్న పదాలతోనే ‘నాటు నాటు’పాట పుట్టింది.. దీంతో ఊరికే ఆస్కార్ అవార్డు దక్కిందని.. సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు రాసిన ‘నాటు నాటు’పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డు స్వీకరించిన అనంతరం సొంత ఊరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు ఆదివారం వచ్చిన చంద్రబోస్ దంపతులు.. స్థానిక శివాలయంలో పూజలు చేశారు. ఇంటినుంచి పాఠశాల వరకు డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లారు. చంద్రబోస్ చదివిన పాఠశాల 1969–2022 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు అతన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ గ్రంథాలయం నుంచే తనకు అక్షర బీజం పడిందని.. ఇప్పడు శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాన్ని పునర్నిర్మిస్తానని చెప్పారు. గ్రామస్తులతో చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. -
ఆరోపణలకు చెక్, ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చుపై క్లారిటీ ఇచ్చిన కార్తికేయ
తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ వచ్చిందంటే యావత్ భారతదేశం పొంగిపోయింది. కానీ కొందరు మాత్రం ఆస్కార్ క్యాంపెయిన్ కోసం కోట్లు గుమ్మరించారు, అవార్డును కొన్నారంటూ ఎవరికి నచ్చినట్లు వాళ్లు విమర్శలు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై రాజమౌళి తనయుడు, ఆర్ఆర్ఆర్ లైన్ ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ క్లారిటీ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ఆర్ఆర్ఆర్ సినిమాపై విదేశీయులు మక్కువ చూపించారు. అందుకే ఓటీటీలోకి వచ్చినప్పటికీ అమెరికాలో రిలీజ్ చేయాలనుకున్నాం. కేవలం ఒక రోజు 60 స్క్రీన్లలో ప్రదర్శిద్దామనుకున్నాం. ఒక రోజు కోసం అనుకుంటే నెల రోజులు గడిచిపోయింది. సినిమా చూశాక అందులో మీకు ఏం నచ్చింది? అని అక్కడి ప్రేక్షకులను అడిగాం. చరణ్‌ను తారక్ అన్న ఎత్తుకుని ఫైట్ చేసిన సన్నివేశం తెగ నచ్చిందన్నారు. పాటలు వస్తుంటే కూడా లేచి డ్యాన్స్ చేస్తున్నారు. వారికి మాత్రమే ఆహ్వానం కీరవాణి, చంద్రబోస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రేమ్‌రక్షిత్, కాలభైరవలకు అకాడమీ ఆహ్వానం పంపింది. నామినీలకు, స్టేజీపై పర్ఫామ్ చేసేవాళ్లకు అకాడమీ కమిటీ ఆహ్వానిస్తుంది. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందాలు టికెట్ కొనాల్సిందే! ఇందుకోసం నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు కమిటీకి ఈమెయిల్ పంపుతారు. కీరవాణి, చంద్రబోస్ మాకోసం ఈమెయిల్ చేశారు. వాళ్లు అది చూసిన తర్వాత లింక్ పంపుతారు. దాని ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి. ఆ టికెట్లలో కూడా రకరకాల క్లాసులుంటాయి. లోయర్ లెవల్ సీట్ల కోసం ఒక్కొక్కటి 1500 డాలర్లు పెట్టి కొన్నాం. ఒక్కో టికెట్‌కు ఎంతంటే? టాప్‌లో కూర్చుని చూసేందుకు మా కుటుంబంలోని నలుగురికి 750 డాలర్లు పెట్టి టికెట్లు తీసుకున్నాం. ఆస్కార్ కొనడమనేది పెద్ద జోక్. 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూషన్ అది. అక్కడ ప్రతిదానికీ ఓ పద్ధతి ఉంటుంది. అయినా ఆడియన్స్ ప్రేమను కొనగలమా? స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కామెరూన్ మాటలను కొనలేం కదా.. హాలీవుడ్ సినిమాలు ప్రచారం కోసం స్టూడియోలను ఆశ్రయిస్తాయి. కానీ మాకు అలాంటి ఆస్కారం లేదు. ప్రచారం కోసం రూ.5 కోట్లు బడ్జెట్ అనుకున్నాం. మొదటి ఫేజ్‌లో రూ.3 కోట్లు ఖర్చయ్యాయి. నామినేషన్స్ అయ్యాక ఆ సెకండ్ ఫేజ్‌లో మరికొంత బడ్జెట్ పెంచాం. మొత్తంగా రూ.8.5 కోట్లు ఖర్చయింది' అని చెప్పుకొచ్చాడు కార్తికేయ. -
గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి.. మార్వెల్ స్టార్ నటుడు అరెస్ట్
మార్వెల్ స్టార్, హాలీవుడ్ నటుడు జోనాథన్ మేజర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియురాలిపై దాడి చేసిన కేసులో న్యూయార్క్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బ్రూక్లిన్‌లోని బార్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా టాక్సీలో ఇద్దరి మధ్య గొడవ జరిగనట్లు జోనాథన్ ప్రియురాలు పోలీసులకు తెలిపింది. తనపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దాడిలో ప్రియురాలి తల, మెడకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. జోనాథన్ తన మొబైల్ ద్వారా మరొక మహిళకు మేసేజ్ పంపడం ప్రియురాలు చూసింది. దీంతో అతని ఫోన్‌ను పరిశీలించాలని ఆమె అడిగింది. దీనికి అతని కోపం కట్టలు తెచ్చుకుంది. ఆమెను చేయి పట్టుకుని విచక్షణారహితంగా కొట్టాడు. వెంటనే అతని ప్రియురాలు పోలీసులను కాల్ చేసింది. జోనాథన్ మేజర్స్ చివరిగా క్రీడ్-3, యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమానియాలో కనిపించారు. అతను రెండు వారాల ముందు ఆస్కార్స్‌లో తన క్రీడ్-3 సహనటుడు మైఖేల్ బి. జోర్డాన్‌తో పాటు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. కానీ జోనాథన్ ప్రతినిధి మాట్లాడుతూ అతను ఏ తప్పు చేయలేదని అన్నారు. -
జూ.ఎన్టీఆర్‌కు ఘన స్వాగతం..కళ్లలో నీళ్లు తిరిగాయని భావోద్వేగం.
సాక్షి, హైదరాబాద్: ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిందని అనౌన్స్ చేసిన క్షణంలో ఆనందం తట్టుకోలేక పోయామని ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. 'ఆస్కార్ వేదిక మీద ట్రిపుల్ ఆర్ టీం చేతికి ఆస్కార్ అందించినప్పుడు అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదనిపించింది. మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన అభిమానులకి, ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు. రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవార్డు వచ్చిన విషయం నా ఫ్యామిలీలో మొదటగా నా వైఫ్ కి కాల్ చేసి షేర్ చేసుకున్నాను.' అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సాంగ్‌కు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫీ చేశారు. జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు యావత్ ప్రపంచాన్ని ఊర్రూతలించాయి. -
అమిత్ షాతో విజయసాయిరెడ్డి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. షాను ఆయన నివాసంలో మంగళవారం రాత్రి కలిసిన విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. అంతేకాక.. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధులు తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వందలాదిమంది కృషి ఫలితమే ఆస్కార్ ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల వల్ల ఆస్కార్ సాధ్యం కాలేదని.. వందలాదిమంది టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, సినిమాకు పనిచేసిన వారి వల్లే సాధ్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. మన దేశం నుంచి రెండు ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న సందర్భంగా వారిని మంగళవారం రాజ్యసభలో ఆయన అభినందించారు. ఆస్కార్ వచ్చిన వారికి అందించే ప్రశంసలు సందర్భానుసారంగా సినిమాకు లేదా డాక్యుమెంటరీకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ చెందాలన్నారు. భాషతో సంబంధం లేకుండా, కులమతాలకు అతీతంగా కళాకారులు ప్రతిచోటా ఉన్నారు కాబట్టి.. ఈ ప్రాంతీయ భావాలు లేదా ఉపప్రాంతీయ భావాలు లేదా భాషా భావాలు అభినందించేటప్పుడు ఉండరాదని ఆయన సూచించారు. తెలుగువారికి గుర్తింపు: జి.వి.ఎల్ ‘నాటు నాటు‘ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం తెలుగువారికి, తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు అని ఎంపీ జి.వి.ఎల్.నరసింహారావు అభివర్ణించారు. ఆయన మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ ఆస్కార్ అవార్డులు భారతీయ సినిమాకు.. ముఖ్యంగా తెలుగువారికి ఒక చారిత్రాత్మక గుర్తింపని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం వాస్తవానికి తెలుగు చిత్రమని, ఆస్కార్ అవార్డు పొందిన ‘నాటు నాటు‘ పాట తెలుగుపాట అని రాజ్యసభ సభ్యులందరికీ గుర్తుచేశారు. ఆస్కార్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ టీంను ఎంపీలు కె.కేశవరావు, జయాబచ్చన్, సుధాంశు త్రివేది, మనోజ్‌కుమార్ ఝా సహా పలువురు అభినందించారు. -
యూఎస్‌లో ఆస్కార్ ‘నాటు’ సంబురాలు (ఫొటోలు)
-
మోదీజీ ఆ ఆస్కార్ క్రెడిట్‌ని తీసుకోకండి: ఖర్గే సెటైరికల్ పంచ్
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఆస్కార వేడుకల్లో భారత్ సాధించిన కీర్తిని గురించి కొనియాడారు. విజేతలకు అభినందనలు తెలుపుతూ.. ఈ గెలుపు భారతదేశానికి గర్వకారణమని అన్నారు. అలాగే విజేతలు దక్షిణ బారతదేశానికి చెందిన వారంటూ హెలెట్ చేస్తూ చెప్పారు. ఐతే ఆర్ఆర్ఆర్ నుంచి నాటునాటు పాట, చిన్న డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖర్గే మాట్లాడుతూ... దీనికి మేము చాలా గర్వపడుతున్నాం కానీ నాదోక అభ్యర్థన అంటూ ఒక సైటిరికల్ పంచ్ విసిరారు. మోదీజీ దయచేసి ఈ ఆస్కార్ క్రెడిట్‌ని తీసుకోకండి అలా చేయకూడదు అన్నారు. మోదీ తన గెలుపు కోసం.. మేమే దర్శకత్వం వహించాం, మేము రాశాం, అని చెప్పకూడదు ఇదే నా అభ్యర్థన అని ఖర్గే అన్నారు. అంతే ఒక్కసారిగా రాజ్యసభలో నవ్వులు విరబూశాయి. ఖర్గే వ్యాఖ్యలకు ప్రతిపక్ష సభ్యుల నుంచే కాకుండా ట్రెజరీ బెంచ్ నుంచి కూడా నవ్వులు విరిశాయి. ఈ మేరకు రాజసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్, సభా నాయకుడు పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవియా, కార్మిక మంత్రి భూపేందర్ యదవ్ తదితరులందరూ నవ్వుతూ కనిపించారు. ఇదిలా ఉండగా, పియూష్ గోయల్ రాజసభ నామినేషన్ల గురించి ఆస్కార్ ఫర్ ప్రధానమంత్రి కార్యాలయం అనే పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అదికాస్తా ప్రధాన మంత్రి ఎంపిక ద్వారా రాజ్యసభ్యకు నామినేట్ అయిన వ్యక్తులకే ఆస్కార్ అవార్డు వచ్చిందన్నట్లు ఉండటంతో ఖర్గే ఇలా సైటరికల్‌గా వ్యాఖ్యానించారు. గోయల్ ఆ పోస్ట్‌లో విభిన్న రంగాల్లో విశేషమైన కృషి చేసిన వ్యక్తులను ఎంపిక చేసి మరీ రాజ్యసభకు నామినేట్ చేయడంలో మోదీ తనదైన ముద్ర వేశారని అన్నారు. అంతేగాదు 2022లో ఎగువ సభకు నామినేట్ అయిన వారిలో ఆర్ఆర్ స్క్రిప్ట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారని ఆయన్ ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు. Oscar winning 'RRR' and The Elephant Whisperes' are India's contributions to the world. We request Modi ji not to take the credit for their win. :Congress President and LoP in Rajya Sabha Shri @kharge pic.twitter.com/43loVpofCF — Congress (@INCIndia) March 14, 2023 (చదవండి: క్షమాపణ చెప్పేదే లే! మరోసారి వాయిదాపడ్డా ఉబయ సభలు) -
Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ అక్షరాలా..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది అభిమానులు కలిగి ఉన్న హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడిగా పరిచయమై 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా మారి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ రోజు దక్షిణాది చిత్ర సీమలో ఎక్కువ సంపాదిస్తున్న నటులలో ఈయన ఒకరు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మొత్తం ఆస్తుల విలువ 70 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 571 కోట్లు. ఈయన నెలకు రూ. 3 కోట్లు వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. గతంలో ఒక్కో సినిమాకు రూ. 12 కోట్లు తీసుకునే వారని, ఆర్ఆర్ఆర్ మూవీకి 45 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు సినిమాలతో పాటు కొన్ని బ్రాండ్ ఎండార్స్మెంట్ కూడా సంపాదిస్తారు. ఇతర హీరోలతో పోలిస్తే అలాంటి సంపాదన ఎన్టీఆర్‌కి కొంత తక్కువనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమా విజయం తరువాత ఇప్పుడు తన రెమ్యునరేషన్ రూ. 60 నుంచి 80 కోట్లకు పెంచారు. టాలీవుడ్లో యంగ్ టైగర్‌గా పిలువబడే Jr NTR హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రూ. 25 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాలో తన కుటుంబముతో కలిసి నివసిస్తున్నారు. బెంగళూరులో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా హైదరాబాద్ శివార్లలోని గోపాలపురంలో 'బృందావనం' అనే ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారుని కలిగి ఉన్నారు. అంతే కాకుండా రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే 718 కేమాన్, బిఎండబ్ల్యు 720LD, మెర్సిడెస్ బెంజ్ జిఎస్ఎస్ 250డి, 4 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే ఎఫ్1తో పాటు ఖరీదైన వాచీలు, సుమారు రూ. 8 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నారు. -
అత్యధిక ఆస్కార్స్ గెలుచుకున్న చిత్రమిదే.. పదేళ్ల కష్టానికి ప్రతిఫలం
మిషెల్ యో, స్టెఫానీ, కే హుయ్ క్వాన్, జెన్నీ స్లాట్, జామి లీ కర్టిస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్’. డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ గత ఏడాదిæ బాక్సాఫీస్ వద్ద సూపర్ బంపర్‌హిట్ కొట్టింది. 25 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం అంతకు నాలుగు రెట్లు అంటే వంద మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసింది. ఇక ఏడు ఆస్కార్ అవార్డులను సాధించిన ఈ చిత్రకథ విషయానికి వస్తే... చైనా నుంచి అమెరికాకు వలస వచ్చిన ఎవిలిన్ క్వాడ్ కుటుంబం అక్కడ లాండ్రీషాపు పెట్టుకుని జీవనం సాగిస్తుంటుంది. వీరు ఒక ప్రపంచంలో జీవిస్తున్నట్లే మరో ప్రపంచంలో వీరిలాంటి వారే ఉంటారు. వీరు ఒకరికొకరు తారసపడినప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అన్నదే కథ. ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ చిత్రదర్శకులు డేనియల్ క్వాన్, స్కీనెర్ట్ 2010లోనే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రకథను స్టార్ట్ చేశారు. కానీ షూటింగ్‌కి వెళ్లడానికి పదేళ్లు పట్టింది. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం 2022 లో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. -
Ram Charan: రామ్ చరణ్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?
తెలుగు చిత్ర సీమను ప్రపంచానికి ఎలుగెత్తి చూపి ఆస్కార్ సొంతం చేసుకున్న 'ఆర్ఆర్ఆర్' గురించి, అందులో నటించిన నటీ, నటులను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అయితే చరణ్ సినిమాల గురించి తెలిసిన చాలామందికి అతడు ఎలాంటి కార్లను ఉపయోగిస్తాడు, అతని ఆస్తుల విలువ ఎంత అనేది తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అలాంటి వారికోసం ప్రత్యేక కథనం.. చిరుత సినిమాతో తెలుగు సినీ రంగప్రవేశం చేసిన చరణ్.. మగధీరతో బాక్సాఫీస్ బద్దలు కొట్టి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఖైదీ నంబర్ 150 నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. అంతే కాకుండా పెప్సీ, టాటా డొకోమో, వోలానో, అపోలో జియా, హీరో మోటోక్రాప్, ఫ్రూటీ వంటి దాదాపు 34 బ్రాండ్లను అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ బాగా సంపాదిస్తున్నాడు. కొణిదెల రామ్ చరణ్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు 1370 కోట్లు ఉంటుందని అంచనా. ఈయన నెల సంపాదన రూ. 3 కోట్లకంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. RRR సినిమాలో తన పాత్ర కోసం రూ. 45 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద మన దేశంలో ఎక్కువ ట్యాక్స్ చెల్లిస్తున్నవారిలో రామ్ చరణ్ ఒకరు కావడం గమనార్హం. (ఇదీ చదవండి: సిట్రోయెన్ సి3 కొత్త ధరలు.. వాహన ప్రియులకు షాక్) రామ్ చరణ్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దాదాపు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బంగ్లా కలిగి ఉన్నారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, టెంపుల్, జిమ్, ఫిష్ పాండ్ వంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయని తెలుస్తోంది. దీని విలువ రూ. 38 కోట్లు ఉంటుందని అంచనా. దీనితో పాటు ముంబైలో పెంట్ హౌస్ కూడా ఉందని చెబుతున్నారు. ఇక చివరగా రామ్ చరణ్ ఎలాంటి వాహనాలు ఉపయోగిస్తారు అనే విషయానికి వస్తే, ఈయన వద్ద దాదాపు రూ.4 కోట్ల విలువైన కస్టమైజ్డ్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 తో పాటు, ఆడి మార్టిన్ V8 వాంటేజ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆస్టన్ మార్టిన్ మరియు ఫెరారీ పోర్టోఫినో ఉన్నాయి. అంతే కాకుండా చరణ్ ఒక సొంత ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నారు. -
ఆ సినిమాకు ఏకంగా ఏడు ఆస్కార్లు.. తొలి ఆసియా మహిళగా రికార్డు
95వ అకాడమీ అవార్డు వేడుకల్లో ఓ హాలీవుడ్ చిత్రం సత్తా చాటింది. 'ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్'(Everything Everywhere All At Once)అనే హాలీవుడ్ చిత్రం ఏకంగా ఏడు ఆస్కార్లను కైవసం చేసుకుంది. 11 విభాగాల్లో నామినేట్ అయిన ఈ సినిమా ఏకంగా ఏడు అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు వరించాయి. కాగా, ఈ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్‌యో ఆస్కార్ అందుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా ఏడు ఆస్కార్లను సొంతం చేసుకొని సత్తా చాటింది. -
Oscars 2023: కోరిక తీరింది.. పాటతో మనసులో మాట చెప్పిన ఎంఎం కీరవాణి!
లాస్ ఏంజెల్స్: ప్రపంచ వేదికపై ఓ తెలుగు సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను కైవసం చేసుకుని మన సత్తా చాటింది. భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో అవార్డ్‌ను సొంతం చేసుకుని చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రానికి గుర్తింపును తెచ్చిపెట్టింది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఆస్కార్ అవార్డ్‌ను ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. అనంతరం ఆయన పాట రూపంలో తన ఆనందాన్ని వ్యక్త పరిచారు. అందులో.. ‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కైవసం చేసుకోవాలని’ అన్నారు. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని, థ్యాంక్యూ కార్తికేయ అని కీరవాణి పేర్కొన్నారు. చివరిలో రచయిత చంద్రబోస్ నమస్తే అంటూ తెలుగులో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా కంటున్న కలలను నిజం చేస్తూ రెండు ఆస్కార్లను మన చిత్రాలు దక్కించుకున్నాయి. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకోగా.. మరో భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్‌ను దక్కించుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #NaatuNaatu wins the #Oscar for best Original Song 😭#SSRajamouli & team has done it🫡🇮🇳 Indian Cinema on the Rise 🔥 !! #RRRMovie | #AcademyAwards | pic.twitter.com/VG7zXFhnJe — Abhi (@abhi_is_online) March 13, 2023 -
ఆస్కార్స్ 2023: కనుల విందుగా 95వ అకాడెమీ అవార్డుల పండగ ( ఫొటోలు)
-
నాటు నాటు పాటకి బెస్ట్ ఒరిజినల్స్ సాంగ్ కేటగిరీలో నామినేషన్
-
ఆస్కార్ వేడుకల్లో.. స్టార్ల సందడి (ఫొటోలు)
-
ఆస్కార్‌లో ఓటు హక్కు ఉపయోగించుకున్న సూర్య
ఆస్కార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు సూర్య. ఈ నెల 12న లాస్ ఏంజిల్స్‌లో 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక జరగనుంది. విజేతల ఎంపిక కోసం పదివేల మందికి పైగా ఉన్న ఆస్కార్ ఓటర్స్ ఈ నెల 2 నుంచి 7వరకు ఆన్లైన్లో ఓటు నమోదు చేశారు. ఇందులో భాగంగానే సూర్య కూడా ఓటు వేశారు. ఆకాడమీ ‘క్లాస్ ఆఫ్ 2022’లో భాగంగా సూర్య ఆస్కార్ సభ్యునిగా ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే సూర్యతో ΄ాటు నటి కాజోల్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్ రీమా ఖగ్తీలు కూడా ఆస్కార్ మెంబర్స్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
కాలిఫోర్నియాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సందడి (ఫొటోలు)
-
ఆస్కార్ కోసం అమెరికా పయనమైన తారక్, వీడియో వైరల్
-
ఆస్కార్ వేదికపై నాటు నాటు...
ఆస్కార్ వేదికపై తెలుగు ‘నాటు నాటు’ మారుమోగనుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 12న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) జరగనున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘నాటు నాటు..’ పాటను పాడిన గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్‌లో పాడనున్నట్లు ఆస్కార్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. యం.యం. కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే. అమెరికాలోనే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆస్కార్ అవార్డుల వేడుక దగ్గర పడటంతో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి తదితరులు అమెరికాలో ఉన్నారని తెలిసిది. ఆస్కార్‌కి సంబంధించిన వరుస ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు రామ్‌చరణ్ కూడా ఈ నెల 12కు వరకు యూస్లోనే ఉంటారట. మరో హీరో ఎన్టీఆర్ వీరిని త్వరలో జాయిన్ కానున్నారు. అలాగే ఇటీవల ఆస్కార్ నిర్వాహకులు అవార్డుల నామినీల కోసం ఏర్పాటు చేసిన లంచ్‌కు కీరవాణి, చంద్రబోస్ హాజరైన విషయం తెలిసిందే. ఈ నెల 9న అమెరికాలో నామినీల కోసం డిన్నర్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ విందులో కీరవాణి, చంద్రబోస్ పాల్గొననున్నారు. ఎన్టీఆర్... చరణ్... హుక్ స్టెప్? ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను లైవ్‌లో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడతారు కాబట్టి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటే బాగుంటుందని పలువురు నెటిజన్లు పో స్ట్ చేస్తున్నారు. వీటికి తోడు ఇటీవల ఓ అమెరికా మీడియాకు రామ్‌చరణ్ ఇంటర్వ్యూ ఇస్తూ...‘‘ఇప్పటివరకు ప్రేక్షకులు మాకు చాలానే ఇచ్చారు. నా ప్రేమను ప్రేక్షకులకు చూపించడానికి ‘నాటు నాటు’ పాటను ఆస్కార్ లైవ్‌లో ప్రదర్శించడం ఓ మార్గంలా భావిస్తున్నాను. ఇది నేను వారికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్‌లా అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. దీంతో ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటకు ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే మరో ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ ‘నాటు నాటు’ పాట గురించి మాట్లాడుతూ– ‘‘ఈ పాట చిత్రీకరణ సమయంలో దాదాపు 300మందిప్రొ ఫెషనల్ డ్యాన్సర్లు సెట్స్‌లో ఉన్నారు. 7 రోజుల రిహార్సల్స్ తర్వాత 17 రోజుల పాటు ఈ పాటను షూట్ చేశాం.. ‘నాటు నాటు’ పాటను మేం ప్రదర్శించిన ప్రతిచోటా మంచి స్పందన లభిస్తోంది. అలా అని అన్ని చోట్లా చేయలేం. ఇక ఆస్కార్ నిర్వాహకులు రిక్వెస్ట్ చేస్తే, టైమ్ కలిసొస్తే ‘నాటు నాటు’ పాట పెర్ఫార్మ్ చేస్తాం. అయితే పాట మొత్తం ప్రదర్శించడం అనేది కష్టం. ఎందుకంటే ఈ పాటకు స్టెప్స్ వేసే టైమ్‌లో చాలా బ్రీత్ కావాలి, ఎనర్జీ ఉండాలి. కానీ చాన్స్ ఉంటే ‘నాటు నాటు’లోని ‘హుక్ స్టెప్’ను ఎందుకు ప్రయత్నించకూడదు? అను కుంటున్నాను’’ అని పేర్కొన్నారు. మరి.. ఎన్టీఆర్, చరణ్‌ల లైవ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందా? లేదా అనేది 13న తెలిసి పో తుంది. -
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఎంట్రీపై నెటిజన్ ట్వీట్.. ఘాటుగా స్పందించిన మంచు విష్ణు
దర్శకధీరుడు రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడంతో అభిమానులు, సినీనటులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ది కశ్మీర్ పైల్స్, ఆర్ఆర్ఆర్ను వెనక్కి నెట్టి గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో' ఎంపికైంది . అయితే ఈ విషయంలో ఆర్ఆర్ఆర్కు మద్దతు కోసం చిత్రబృందం క్యాంపెయిన్ మొదలుపెట్టింది. మొత్తం 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ కోసం చిత్ర బృందం క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. ఆస్కార్‌లో బెస్ట్ క్రింజ్ మూవీ అనే కేటగిరీ ఏదైనా ఉందా? అలాగైతే ఆర్ఆర్ఆర్ కచ్చితంగా ఆ విభాగంలో ఆస్కార్ గెలుస్తుందని ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనికి మంచు విష్ణు బదులిస్తూ.. 'భారతీయ సినిమాగా మనం ఎందుకు జరుపుకోకూడదు సోదరా? ఇది కేవలం ప్రాంతీయ చిత్రానికి దక్కే గౌరవం కాదు.. జాతీయంగా దేశం మొత్తం గర్వించదగ్గ విషయం' అంటూ పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే థీమ్‌తో జక్కన్న రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ. రూ. 1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంతటి ప్రజాధారణ పొందిన ఈ చిత్రం భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులకు ఎంపిక అవుతుంది అని అందరూ భావించారు. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలవాలని కోరుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ మూవీ ఛైల్లో షోను ఆస్కార్స్‌కు నామినేట్ చేసింది. Why don’t we celebrate Indian cinema my brother? Now it ain’t about regional pride but national pride. https://t.co/81kNIXgRMQ — Vishnu Manchu (@iVishnuManchu) October 9, 2022 -
వారికి ఆ హక్కు ఉంది.. 'ఛెల్లో షో' అభ్యంతరాలపై స్పందించిన నిర్మాత
ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలను వెనక్కి నెట్టి అస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో'. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఆస్కార్ వేడుకల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్'( ఉత్తమ అంతర్జాతీయ చిత్రం) విభాగంలో పోటీకి ఎంపికైంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఈ సినిమాపై చర్చ మొదలైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా ఎంపికను ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సైతం తప్పుబట్టింది. విదేశీ చిత్రానికి రీమేక్ కావడం వల్ల ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీకి ఎలా అర్హత సాధిస్తుందని ప్రశ్నించింది. తాజాగా వీటిపై 'ఛెల్లో షో' ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాయ్ కపూర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ' మేము దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మా సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఎంపిక చేసింది. దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు అదే గౌరవం. సినిమాపై ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఉంటుంది. అందువల్ల ఇతరుల మాటలను మేం పట్టించుకోం. ఈ దేశంలోని ప్రతి తమ అభిప్రాయం వెల్లడించేందుకు హక్కు ఉంది. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అభ్యంతరం చెప్పడంలో అందులో తప్పేమీ లేదు. అది వారి అభిప్రాయం మాత్రమే' అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఛెల్లో షో గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉన్న గలాలా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు కథతో తెరకెక్కించారు. పాన్ నలిన్ దర్శకత్వ వహించిన ఈ చిత్రంలో భవిన్ రాబరి, భవేశ్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావెల్ ప్రధానపాత్రల్లో నటించారు. -
Mur Ghurar Duronto Goti: అవును.. గుర్రం ఎగిరింది.. కలా? నిజమా!
‘అవును... గుర్రం ఎగరావచ్చు’ అంటారు. ఈ గుర్రం మాత్రం ఎగరడమే కాదు... యంగ్ డైరెక్టర్ మహర్షి కశ్యప్‌ను కూర్చోబెట్టుకొని బెంగళూరు నుంచి జైపుర్ వరకు తిప్పింది. రేపు ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా తీసుకువెళ్లవచ్చు... ఆస్కార్ 2023 బరిలో ‘షార్ట్ ఫిల్మ్ ఫిక్షన్’ విభాగంలో మన దేశం నుంచి అస్సామీ షార్ట్ ఫిల్మ్ మర్ గౌరర్ డురొంటో గోటి (ది హార్స్ ఫ్రమ్ హెవెన్) ఎంపికైంది. 27 సంవత్సరాల మహర్షి తుహిన్ కశ్యప్ దీని దర్శకుడు. కథ విషయానికి వస్తే... ఒక పెద్దాయన ఎప్పుడూ పగటి కల కంటూ ఉంటాడు. నగరంలో జరిగే గుర్రపు పందేలలో తన గుర్రం కూడా ఉండాలి. ఆ గుర్రం ఎలాంటిదంటే, మెరుపు వేగంతో పరుగులు తీస్తుంది. ఎప్పుడు గుర్రపు పందేలు జరిగినా తానే విజేత. ‘మీ గుర్రానికి ఎంత బాగా శిక్షణ ఇచ్చారు’ అంటూ అందరూ తనను వేనోళ్లా పొగుడుతుంటారు. ‘ఇంతకీ నా గుర్రం ఏదీ?’ అని వెదుకుతాడు ఆ పెద్దాయన. కానీ ఆ గుర్రం ఊహాల్లో తప్ప వాస్తవప్రపంచంలో కనిపించదు. అక్కడ కనిపించేది తన గాడిద మాత్రమే! ‘కలా? నిజమా! అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ గురించి వింటూ, చూస్తూ పెరిగాను. ఇప్పుడు నేను ఆస్కార్ బరిలో నిలవడం అనేది గర్వంగా ఉంది’ అంటున్నాడు మహర్షి. కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయిన మహర్షి స్టూడెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ చిత్రాన్ని తీశాడు. సర్రియలిజం, డార్క్ హ్యూమర్లతో కూడిన ఈ కథను చెప్పడానికి సంప్రదాయ కళ ‘ఒజపాలి’ని సమర్థవంతంగా వాడుకున్నాడు దర్శకుడు. ఆరువందల సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న అస్సామీ కళారూపం ‘ఒజపాలి’లో కళాకారులు ఆడుతూ, పాడుతూ, నవ్విస్తూ పురాణాలలో నుంచి కథలు చెబుతుంటారు. ‘ది హార్స్ ఫ్రమ్ హెవెన్’ను ఎక్కువ భాగం క్యాంపస్‌లో చిత్రీకరించారు. కొంత భాగం కోల్‌కతా శివారులలో చిత్రీకరించారు. ఈ చిత్రం కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్, జైపుర్ ఫిల్మ్‌ఫెస్టివల్, ది హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్, డీప్ ఫోకస్ స్టూడెంట్ ఫిల్మ్‌ఫెస్టివల్...మొదలైన ఎన్నో చిత్రోత్సవాలకు ఎంపికైంది. తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్(బీఐఎస్ఎఫ్ఎఫ్)లో ‘బెస్ట్ ఫిల్మ్’ అవార్డ్ అందుకొని ఆస్కార్ బరిలోకి దిగబోతుంది. ఫీచర్ ఫిల్మ్స్‌లా కాకుండా ఒక షార్ట్‌ఫిల్మ్‌ను ఆస్కార్‌కు పంపాలంటే అది ఆస్కార్ – క్వాలిఫైయింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డ్ గెలుచుకోవాలి. మన దేశంలో అలాంటి ఏకైక ఫిల్మ్ ఫెస్టివల్ బీఐఎస్ఎఫ్ఎఫ్. ‘చిత్ర రూపకల్పన అనేది ఎంత క్లిషమైన విషయమో అందులో దిగాక కాని తెలియదు. ప్రతిరోజూ ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. స్వర్గం నుంచి దిగి వచ్చిన గుర్రం మమ్మల్ని ఎన్నో నగరాలు తిప్పింది. భవిష్యత్‌లో ఎన్ని చోట్లకు తీసుకువెళుతుందో తెలియదు’ అంటున్నాడు మహర్షి. కల్లోల ప్రాంతంలో పుట్టి పెరిగిన మహర్షికి ఎనిమిదవ తరగతిలో డైరెక్టర్ కావాలనే కోరిక పుట్టింది. చాలామందిలో ఆతరువాత కాలంలో ఆ కోరిక ఆవిరైపోతుంది. కానీ మహర్షి విషయంలో మాత్రం అది ఇంకా బలపడింది. (క్లిక్: హీరో శింబుకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత) సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో అడుగు పెట్టిన రోజు తన కలకు రెక్కలు దొరికినట్లుగా సంతోషపడ్డాడు. మహర్షిలో ఉన్న ప్రశంసనీయమైన ప్రత్యేకత ఏమిటంటే.. నేల విడిచి సాము చేయాలనుకోవడం లేదు. తన నేల మీద నడయాడిన కథలనే చిత్రాల్లోకి తీసుకురావాలకుంటున్నాడు. ఉత్తర, దక్షిణ భారతాలతో పోల్చితే వెండి తెర మీద కనిపించిన ఈశాన్య భారత ప్రాంత కథలు తక్కువ. ఇప్పుడు ఆ లోటు మహర్షి కశ్యప్ రూపంలో తీరబోతుంది. ఆస్కార్ ఎంట్రీ అనేది ఆరంభం మాత్రమే! (క్లిక్: 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆస్కార్ ఎందుకు? హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్) ప్రాంతీయ చిత్రాలు రకరకాల కష్టాలు ఎదుర్కొన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతుంది. అస్సాం అనేది కొత్త కథలకు కేంద్రం కాబోతుంది. – మహర్షి -
'ఛెల్లో షో' ఇండియా సినిమానే కాదు.. ఆస్కార్ ఎంపికపై అభ్యంతరం
అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో'. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఆస్కార్ వేడుకల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్'( ఉత్తమ అంతర్జాతీయ చిత్రం) విభాగంలో పోటీకి ఎంపికైంది ఈ చిత్రం. ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్‌తో పోటీపడి మరీ రేసులో నిలిచింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అందరిచూపు ఈ సినిమావైపు మళ్లింది. ఆస్కార్‌కు భారత అధికారిక ఎంట్రీగా 'ఛెల్లో షో'ను పంపాలని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు ఈ చిత్రం భారతీయ చిత్రమే కాదని ఆరోపించింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) తన నిర్ణయాన్ని పునరాలోచించాలని సూచించింది. ఛెల్లో షో హాలీవుడ్లో 'లాస్ట్ ఫిల్మ్ షో'గా విడుదలైందని తెలిపింది. విదేశీ చిత్రం కావడం వల్ల ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీకి ఎలా అర్హత సాధిస్తుందని ప్రశ్నించింది. ఈ అంశంపై ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రెసిడెంట్ బీఎన్ తివారీ మాట్లాడుతూ.. 'ఛెల్లో షో భారతీయ సినిమానే కాదు.. ఈ ఎంపిక సరైంది కాదు. పోటీలో ఇంకా ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్ లాంటి భారతీయ చిత్రాలు ఉన్నాయి. సిద్ధార్థ్ రాయ్ కపూర్ కొనుగోలు చేసిన విదేశీ చిత్రం కావడం వల్లే జ్యూరీ ఎంపిక చేసింది. మేము ప్రస్తుత జ్యూరీని రద్దు చేయాలని కోరుతున్నాం. జ్యూరీ సభ్యుల్లో సగం మంది ఎన్నో ఏళ్లుగా ఉన్నారు. వారిలో చాలా వరకు సినిమా చూడకుండానే ఓటేశారు.'లాస్ట్ ఫిల్మ్ షో'ఆస్కార్‌కు పంపితే, భారతీయ చిత్ర పరిశ్రమకే చెడ్డపేరు. దీనిపై కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాస్తాం' అని తెలిపారు. ఆస్కార్ల ఎంపిక కమిటీకి గతంలో అధ్యక్షునిగా పనిచేసిన దర్శకుడు టీఎస్ నాగభరణ ఈ అంశంపై మాట్లాడారు. 'మార్కెటింగ్, వినోదం విలువ, మాస్, కలెక్షన్స్ మాత్రమే ప్రమాణాలు కాదు ఆస్కార్‌లో గుర్తింపు తెచ్చేది. నేను కూడా భారతీయుడ్నే. సినిమా కేవలం అనేది ప్రజాదరణ మాత్రమే కాదు. మీ హృదయాన్ని హత్తుకుంటే చాలు' అన్నారు. ఛెల్లో షో గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉన్న గలాలా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు కథతో తెరకెక్కించారు. పాన్ నలిన్ దర్శకత్వ వహించిన ఈ చిత్రంలో భవిన్ రాబరి, భవేశ్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావెల్ ప్రధానపాత్రల్లో నటించారు. -
PVR Raja: షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కార్ అవార్డే లక్ష్యం
విజయనగరం టౌన్: చిన్నప్పటి నుంచి చిత్రరంగంలో అడుగుపెట్టాలనే ఆకాంక్షే ఆ యువకుడిని షార్ట్ ఫిలిమ్స్‌లో ఉన్నతశిఖరాలు అధిరోహించేలా చేసింది. ఏ కాంటెస్ట్‌లో పాల్గొన్నా గెలుపొందిన మొదటి మూడు చిత్రాలు ఆయన రచన, సంగీత దర్శకత్వం చేసినవే కావడం విశేషం. ఇప్పటివరకూ షార్ట్ ఫిలి మ్స్‌లో వందలాది అవార్డులు అందుకున్న విజయనగరం యువకుడు పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్రాజా) ఎప్పటికైనా షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కార్ అవార్డ్ తీసుకోవడమే లక్ష్యమని చెబుతున్నాడు. విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్ రాజా) సత్యవతి, చంద్రశేఖర్ రాజుల తొలిసంతానం. బీఏ వరకూ మహారాజా కళాశాలలో చదివి, సంగీతం పట్ల మక్కువతో మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో గాత్రం, వయోలిన్, భరతనాట్యం, వీణ తదితర అంశాలలో తర్ఫీదు పొందాడు. షాలోమ్స్ మ్యూజిక్ సెంటర్లో గిటార్ తదితర ఇన్‌స్ట్రుమెంట్స్‌పై సాధన చేశాడు. రచనలు చేయడం అలవాటు. 2012 నుంచి ఇప్పటివరకూ తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, ఆంగ్ల భాషల్లో సుమారు 250కి పైగా లఘుచిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. 2017లో ఒకే ఏడాదిలో ఆయన సంగీతం సమకర్చిన లఘుచిత్రాలకు వరుసగా ఏడుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. 2007లో చెన్నైలో ఏఆర్ రెహమాన్ నిర్వహించిన హూ.లలల్లా మ్యూజిక్ బ్యాండ్హంట్లో షాలోమ్ తరఫున టాప్ 18లో నిలిచాడు. తానా ఇంటర్నేషనల్ తెలుగు ఫిలిం ఫెస్టివల్–2017 అవార్డు దక్కింది. 2020లో రాంగోపాల్ వర్మ నిర్వహించిన స్పార్క్ ఓటీటీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో తొమ్మిదివేల చిత్రాలలో పీవీఆర్ సంగీత దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు టాప్ 18లో నిలిచాయి. టాప్ 5లో నిలిచిన రెండు చిత్రాలు ఉత్తమ చిత్రాల అవార్డులు సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా 2020లో సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్‌లో ఎంఆర్ ప్రొడక్షన్స్ అంతరార్థం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. షార్ట్ ఫిలిం మాస్ట్రోగా పేరు సంపాదించుకున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్ధ వైష్ణో మీడియా నిర్మించిన ఆర్య–3 లఘుచిత్రంతో పీవీఆర్ రాజా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. పేపర్ బాయ్ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో విటమిన్ షీ ఓటీటీ చిత్రానికి సంగీత దర్శకత్వం అందించాడు. ప్రముఖ డ్యాన్సర్ యశ్వంత్ మాస్టర్ తొలివీడియో ఆల్బం దిల్ అంత అదిరే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడంతో పాటు ఎల్బీ శ్రీరామ్ స్వీయ నిర్మాణంలో పదికి పైగా లఘు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సంగీతం పట్ల మక్కువతో షార్ట్ ఫిలిమ్స్ వైపు అడుగులు వేశాను. బేగంపేటలో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రద్ధ స్కూల్ ఆఫ్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ పాఠశాలలో పిల్లలకు సంగీతం నేర్పించడం మరిచిపోలేని అనుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయేలా చిత్రాలను తీస్తాను. సంగీతంలో నేను రచించే పుస్తకం ప్రతి ఇంట్లో ఉండే పెద్ద బాలశిక్షలా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. – పెనుమత్స వెంకటరామరాజు (పీవీఆర్ రాజా), సంగీత దర్శకుడు, విజయనగరం -
ఆస్కార్ నుంచి సూర్యకు ఆహ్వానం.. తొలి సౌత్ ఇండియా హీరోగా రికార్డు
ప్రపంచ చలన చిత్ర రంగంలోని ఏ నటుడైన ప్రతిష్టాత్మకంగా భావిచే అవార్డు ఆస్కార్. జీవితంలో ఒక్కసారైన ఈ అవార్డు రావాలని కోరుకుంటారు. అలాగే ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనే అవకాశం వచ్చిన చాలనుకుంటారు. ఈ అరుదైన అవకాశం తాజాగా స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ నటి కాజోల్కు దక్కింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు, సభ్యురాలిగా వీరిద్దరు ఛాన్స్ కొట్టేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు వరల్డ్‌వైడ్‌గా 397 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో సూర్య, కాజోల్‌తోపాటు గతేడాది బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న రైటింగ్ విత్ ఫైర్ దర్శకులు సుస్మిత్ ఘోష్, రింటూ థామస్, ఇతర కళాకారులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఈ విషయాన్ని జూన్ 28న రాత్రి అకాడమీ బోర్డ్ ప్రకటించింది. 2022లో 44 శాతం మంది మహిళలు, 37 శాతం తక్కువ ప్రాతినిధ్యం ఉన్న జాతులకు చెందిన వారిని, 50 శాతం యూఎస్ఏకు వెలుపల 53 దేశాలు, భూభాగాలకు చెందిన వారిని తీసుకుంటున్నట్లుగా అకాడమీ తెలిపింది. చదవండి: గుండెముక్కలైంది.. టాలీవుడ్ ప్రముఖుల సంతాపం కాగా సౌత్ ఇండియాతోపాటు కోలీవుడ్ నుంచి ఇలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నటుడిగా సూర్య గుర్తింపు పొందారు. సూర్య నటించిన 'జై భీమ్', 'ఆకాశం నీ హద్దురా' చిత్రాలు గతంలో ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంలో అవార్డును అందుకోలేకపోయాయి. చదవండి: మరోసారి తండ్రి అయిన నిర్మాత దిల్ రాజు.. -
ఆస్కార్ వేడుక ఆ రోజే
వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డు వేడుక తేదీ ఖరారైంది. 2023 మార్చి 12న వేడుక నిర్వహించనున్నట్లు అవార్డు కమిటీ ప్రకటించింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరగనున్న ఈ 95వ ఆస్కార్ అవార్డు వేడుక ‘ఏబీసీ’లో ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అవార్డు పోటీదారులు నవంబర్ 15 లోపు తమ వివరాలు పంపాలని కమిటీ పేర్కొంది. డిసెంబర్ 12న ప్రాథమిక ఓటింగ్ ఆరంభమవుతుంది. డిసెంబర్ 21న షార్ట్లిస్ట్స్ని ప్రకటిస్తారు. జనవరి 12 నుంచి 17లోపు నామినీల ఓటింగ్ జరుగుతుంది. నామినేషన్ దక్కించుకున్నవారి జాబితాను 24న ప్రకటిస్తారు. విజేతల ఫైనల్ ఓటింగ్ మార్చి 2 నుంచి మార్చి 7లోపు జరుగుతుందని తెలిసింది. విజేతలను మార్చి 12న వేదిక మీద ప్రకటిస్తారు. -
ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యుల జాబితాలో విద్యాబాలన్, ఏక్తా కపూర్
ప్రపంచ సినీ రంగంలో అకాడమీ అవార్డులకు ఉన్న విలువ మరే అవార్డులకు ఉండదు. ఆస్కార్ వచ్చిందంటే అది ఏ క్యాటగిరి అయినా అత్యంత గౌరవప్రదంగా భావిస్తారు. అభ్యర్థులను ఎంపిక చేయాలంటే ఆయా క్యాటగిరిల్లో వారిని వడబోసి ఆస్కార్ అవార్డులను ఇస్తారు. అంతటి ప్రతిష్టాత్మకమైన ఈ అస్కార్ అవార్డుల ఎంపికలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కీలకమైన వ్యక్తులు జ్యూరీ సభ్యులుగా ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ ఏడాదికి సంబంధించి కొత్త సభ్యుల జాబితాను ఆస్కార్ వెల్లడించింది. ఇందులో బాలీవుడ్ నటి విద్యాబాలన్, నిర్మాత ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్లు ఉండటం విశేషం. మొత్తం 50 దేశాలకు చెందిన 395 మంది సభ్యులు ఈ ఏడాది ఆస్కార్ సభ్యులుగా ఉన్నారు. ‘ద క్లాస్ ఆఫ్ 2021’ పేరుతో ఆస్కార్ ఆకాడమీ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ సారి ఆస్కార్ సభ్యుల్లో 46 శాతం మంది మహిళలు ఉండటం గమనార్హం. కాగా ‘మిస్టరీ థ్రిల్లర్ కహానీ’ చిత్రంలో విద్యాబాలన్ గర్భవతిగా తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక ‘పా, బూల్‌బులయ్యా, పరిణీత, బాబీ జాసూస్, శకుంతలా దేవి’ చిత్రాల్లోనూ ఆమె నటించారు. 2011లో వచ్చిన ‘ద డర్టీ పిక్చర్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన విద్యాబాలన్‌కు జాతీయ ఫిల్మ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అలాగే బాలాజీ టెలి ఫిల్మ్స్‌కు చెందిన ప్రొడ్యూసర్లు ఏక్తా కపూర్, శోభా కపూర్లు కూడా ఆస్కార్ అకాడమీలో కొత్త సభ్యులయ్యారు. డ్రీమ్ గర్ల్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, ఉడ్తా పంజాబ్, డర్టీ పిక్చర్ లాంటి సినిమాలకు వీళ్లు నిర్మాతలుగా వ్యవహరించారు. -
'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు!
ఇటీవల వచ్చిన చిన్న సినిమా జాతిరత్నాలు పెద్ద హిట్టు సాధించింది. థియేటర్లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత కామెడీని పంచిన చిత్రం మరొకటి లేదనడంలో ఆశ్చర్యమేమీ లేదు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తాజాగా ఆస్కార్‌కు ఎంపికైందట. ఈ మేరకు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన సర్టిఫికెట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బెస్ట్ జానే జిగర్ మూవీ కేటగిరీ కింద ఈ సినిమాకు నామినేషన్ అయ్యిందని సంస్థ తెలియజేసింది. అయితే ఈ మధ్యే ఆస్కార్ అవార్డుల ప్రదానం అయిపోతే కొత్తగా జాతిరత్నాలు సినిమా నామినేట్ అవడమేంటి అని బుర్రలు బద్ధలు చేసుకున్నారు. కానీ కాసేపటికే వారికి అసలు విషయం అర్థమైంది. ఈ రోజు ఏప్రిల్ 1 కావడంతో అందరినీ ఏప్రిల్ ఫూల్ చేశారని తెలిసొచ్చింది. అలా ఈ రోజు మన జాతిరత్నాలు అందరినీ వెర్రివెంగళప్పలను చేశారన్నమాట! Eeeeyyy... Congratulations 🥳#JathiRatnalu @NaveenPolishety @fariaabdullah2 @priyadarshi_i @eyrahul @anudeepfilm @vennelakishore @actorbrahmaji @ItsActorNaresh @murlisharma72 @radhanmusic #PriyankaDutt @nagashwin7 @SwapnaCinema @VyjayanthiFilms @LahariMusic pic.twitter.com/4PWLEJefti — Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 1, 2021 చదవండి: చిట్టీ అని పిలుస్తుంటే భలేగా ఉంది: ఫరియా ఏప్రిల్: రిలీజయ్యే కొత్త సినిమాలివే గురూ.. -
ఆస్కార్ రేసులో సూర్య సినిమా
విలక్షణ నటుడు సూర్య తాజా సూపర్ హిట్ చిత్రం ‘సూరరై పోట్రు’(ఆకాశం నీ హద్దురా). సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రజలు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కరోనా సమయంలో ఓటీటీ ద్వారా విడుదలైన పెద్ద తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాదు! ఈ సంవత్సరం ఉత్తమ నటుడు, నటి, దర్శకురాలు/దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాలలో ఈ సినిమా ఆస్కార్ రేసులోనూ నిలిచింది. మంగళవారం అకాడమీ స్క్రీనింగ్ రూములో దీన్ని ప్రదర్శించారు. ( అభిమాని పెళ్లికి హాజరైన సూర్య ) అపర్ణా బాలమురళీ, మోహన్ బాబు, పరేశ్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గత నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. 670 పేజీలుండే ‘సింప్లీ ఫ్లై’ బుక్‌ను దర్శకురాలు సుధ రెండు గంటల సినిమాగా మలిచి సక్సెస్ అయ్యారు. (చదవండి: ‘ఆకాశమే నీ హద్దురా’ రివ్యూ) -
ఆస్కార్... కొత్త రూల్స్
96వ ఆస్కార్ అవార్డు నుంచి ఉత్తమ చిత్రానికి సంబంధించిన ఎంపిక విధానం, అందులోని పలు రూల్స్‌ను మారుస్తున్నట్టు ప్రకటించింది అకాడమీ ఆఫ్ మోషన్స్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్. 2024లో 96వ ఆస్కార్ వేడుక జరగనుంది. అప్పటినుంచి కొత్త విధానం అమలులోకి వస్తుంది. అకాడమీ ఏర్పాటు చేసిన కొత్త నియమ, నిబంధనలు పాటించిన చిత్రాలను మాత్రమే ఉత్తమ చిత్రానికి ఎంపిక చేయాలనుకుంటోంది కమిటీ. ఇక నిబంధనల విషయానికి వస్తే...ఆస్కార్‌కు ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వాలంటే... ఓ సినిమాలోని ప్రధాన పాత్ర లేదా సహాయ పాత్ర తప్పకుండా భిన్న వర్గాలకు సంబంధించినది అయి ఉండాలి. కథలోని ఐడియా తక్కువ ప్రాతినిధ్యం వహించిన వర్గానికి సంబంధించింది అయి ఉండాలి. అంతే కాదు చిత్రబృందంలోనూ వివిధ వర్గాలకు సంబంధించినవాళ్లను భాగం చేయాలి. ఇలా పలు నియమాలు పెట్టింది ఆస్కార్. ఈ నియమాలన్నింటినీ పాటిస్తేనే ఉత్తమ చిత్రం విభాగానికి సినిమా ఎంపికవుతుంది. అన్ని వర్గ, వర్ణ, లింగ బేధాలను సమానంగా ఉంచేందుకు, సినిమాల్లో భిన్నతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుందట కమిటీ. ఈ నియామాలను కేవలం సినిమాలో మాత్రమే కాదు, సినిమా చేసే టీమ్, స్టూడియో అన్నింట్లోనూ పాటించాలని పేర్కొంది. -
నాకు పరిశ్రమలో అవకాశాలు రాలేదు
-
‘ఆస్కార్ రావడమే శాపం’
బాలీవుడ్ పరిశ్రమలో ఒక గ్యాంగ్ తన గురించి దుష్ప్రచారం చేస్తూ తనకు ఆఫర్స్ రాకుండా చేస్తున్నారంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రెహమాన్ అనంతరం ఆస్కార్ అవార్డు విన్నర్ రేసుల్ పూకుట్టి కూడా తన ఆవేదనను బయట పెట్టారు. ఆస్కార్ గెలుచుకున్న తరువాత బాలీవుడ్లో అవకాశం ఇవ్వడానికి ఎవరు ఆసక్తి చూపలేదని తెలిపారు. కొంత మంది మాకు నువ్వు అవసరం లేదని ముఖం మీదే చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తనకి బాలీవుడ్ పరిశ్రమ అంటే ఇప్పటికీ ఇష్టమేనని పేర్కొన్నారు. Dear @shekharkapur ask me about it, I had gone through near breakdown as nobody was giving me work in Hindi films and regional cinema held me tight after I won the Oscar... There were production houses told me at my face ”we don’t need you” but still I love my industry,for it.... https://t.co/j5CMNWDqqr — resul pookutty (@resulp) July 26, 2020 రెహమాన్ చేసిన వ్యాఖ్యలపై శేఖర్ కపూర్ స్పందిస్తూ రెహమాన్ ‘నీ సమస్య ఏంటో నీకు తెలుసు, నువ్వు ఆస్కార్ గెలుచుకున్నావు. ఆస్కార్ అంటేనే బాలీవుడ్లో చనిపోవడానికి ముద్దు పెట్టడం లాంటిది. దాని అర్థం నువ్వు బాలీవుడ్ హ్యాండిల్ చేసేదాని కంటే ఎక్కువ టాలెంట్ కలిగి ఉన్నావు’ అని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌కు రేసుల్ పూకుట్టి స్పందిస్తూ, ‘శేఖర్ దాని గురించి నన్ను అడగండి. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తరువాత నాకు పరిశ్రమలో అవకాశాలు రాలేదు. దాంతో నేను కుంగిపోయాను. తరువాత నాకు ఆస్కార్ శాపం గురించి తెలిసింది. కొంత మంది మాకు నువ్వు అవసరం లేదు అని ముఖం మీదే చెప్పారు. కానీ నాకు ఈ పరిశ్రమ అంటే ఇప్పటికీ ఇష్టమే’ అని చెప్పారు. @shekharkapur ...and much later when I discussed this with my @TheAcademy members friends they told me about #OscarCurse! It’s faced by everybody! I enjoyed going through that phase, when you are on top of the world &when you know people reject you,it’s the biggest reality check! — resul pookutty (@resulp) July 26, 2020 దిల్ బచరా విడుదల తరువాత మీరు బాలీవుడ్లో ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడంలేదు అని ఏఆర్ రెహమాన్‌ను ఒక ఇంటరర్వ్యూలో ప్రశ్నించగా, ‘నేను ఎప్పుడు మంచి సినిమాలకు చేయను అని చెప్పలేదు. కానీ కొంత మంది గ్యాంగ్ నా మీద రూమర్స్ సృష్టిస్తున్నారు. దీంతో అవకాశాలు రావడం లేదు’ అని రెహమాన్ చెప్పారు. దీంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చదవండి: నీ ప్రతిభను బాలీవుడ్ హ్యాండిల్ చేయలేదు -
‘పారాసైట్’కి ఆస్కార్ అవార్డుల పంట
లాస్ఏంజెల్స్ : దక్షిణ కొరియా చిత్రం పారాసైట్‌కు ఆస్కార్ అవార్డుల పంట పండింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్‌ప్లైతో పాటు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ పిల్మ్ విభాగాల్లో అస్కార్ అవార్డులను దక్కించుకుంది. ముందు నుండి ఎన్నో అంచనాలని పెంచుకున్న పారాసైట్ చిత్రం ఆస్కార్ కిరీటం దక్కించుకోవడం విశేషం. మేకింగ్‌తో పాటు కంటెంట్లోను హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఈ సినిమాను తెరకెక్కించారు. డార్క్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఓ ధనిక కుటుంబాన్ని ఓ పేదకుటుంబం తెలివిగా బోల్తా కొట్టించి వాళ్ల ఇంట్లో పనిలోకి ప్రవేశిస్తుంది. పేద, ధనిక అంతరాల వలన సమాజంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతాయో పారా సైట్ అనే చిత్రం ద్వారా దర్శకుడు బాంగ్ జోన్-హో చూపించారు. చదవండి : ఆస్కార్ విజేతలు వీరే లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరుగుతున్న 92వ ఆస్కార్ అవార్డ్ వేడుకలో పారాసైట్ చిత్రంతో పాటు జోకర్, 1917 చిత్రాలు కూడా తమ హవాను చూపాయి. జోకర్ చిత్రానికి గాను హీరో జోక్విన్ ఫినిక్స్ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఇక 1917 సినిమా మూడు విభాగాల్లో (విజువల్ ఎఫెక్ట్, సౌండ్ మిక్సింగ్, సినిమాటోగ్రఫీ) అవార్డులను ఎగరేసుకుపోయింది. -
ఆస్కార్ 2020 విజేతలు వీరే
లాస్ఏంజెల్స్ : 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ఏంజెల్స్లో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డాల్బీ థియేటర్లో జరుగుతున్న ఈ వేడకకు ప్రముఖ హాలీవుడ్ తారాగణమంతా హాజరై సందడి చేసింది. జోకర్ సినిమా హీరో జోక్విన్ ఫినిక్స్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో బ్రాడ్ పిట్ నటననకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ఫిల్మ్గా టాయ్‌స్టోరీ నిలిచింది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా టాయ్‌స్టోరీ-4, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బాంగ్ జాన్ హో (పారాసైట్), బెస్ట్ లైవ్‌యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌గా ద నైబర్స్ విండో నిలువగా, ఉత్తమ స్క్రీన్‌ప్లే తైకా వెయిటిటి(జోజో రాబిట్) కు దక్కింది. ఉత్తమ చిత్రం : పారాసైట్ ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్(జోకర్) ఉత్తమ నటి : రెంజి జెల్వెగర్ (జూడి) ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్‌పిట్ ( వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్) ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ) ఉత్తమ దర్శకుడు : బాంగ్ జోన్-హో(పారసైట్) ఉత్తమ సంగీతం : జోకర్ (హిల్దార్) బెస్ట్ మ్యూజిక్ ఒరిజనల్ సాంగ్ : ఐయామ్ గోన్నా.. లవ్ మీ ఎగేన్ (రాకెట్ మ్యాన్) ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : పారాసైట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ : బాంబ్ షెల్ ఉత్తమ డాక్యుమెంటర్ షార్ట్ ఫీచర్ : అమెరికర్ ఫ్యాక్టరీ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే : టైకా వైటిటి( జోగో ర్యాబిట్) బెస్ట్ యానిమేటేడ్ ఫీచర్: టాయ్ స్టోరీ 4 బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ : అమెరికన్ ఫ్యాక్టరీ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది నైబర్స్ విండో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే : బాంగ్ జూన్ హో( పారాసైట్) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ : లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గర్ల్) బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ : హెయిర్ లవ్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వి ఫెరారీ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ : 1917 ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917 ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : 1917 బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వి ఫెరారీ ఉత్తమ ప్రొడెక్షన్ డిజైన్ : వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది నైబర్స్ విండో (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆస్కార్ ఎంట్రీ లిస్ట్‌లో ‘డియర్ కామ్రేడ్’
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ చిత్రంతో పాటు మరో 28 చిత్రాలను ఈ జాబితాలోకి ఎంపికయ్యాయి. ఈ చిత్రాలన్నింటినీ స్క్రీనింగ్ చేసి, వాటిలో మంచి చిత్రాన్ని ఎంపిక చేసి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆస్కార్‌కి పంపుతారు. `డియర్ కామ్రేడ్` మాత్రమే ఈ లిస్టులోకి ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. ప్రస్తుతం స్క్రీనింగ్ జరుగుతుంది. వీటిలో ఉత్తమ చిత్రాన్ని ప్రకటిస్తారు. ప్రముఖ ఫిలిం మేకర్ అపర్ణ సేన్ అధ్యక్షతన ఈ జ్యూరీ పని చేస్తుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నిర్మించాయి. -
ఆస్కార్ బరిలో మోతీ భాగ్
ప్రస్తుత కాలంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ల సమస్యలేంటి? ఎందుకు వలస వెళ్లిపోతున్నారనే నేప థ్యంలో రూపొందిన డాక్యుమెంటరీ చిత్రం ‘మోతీ భాగ్’. ఉత్తరాఖండ్‌లో నివసించే విద్యుత్ అనే రైతు జీవితం ఆధారంగా దర్శకుడు నిర్మల్ చందర్ దండ్రియాల్ ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఇటీవల ప్రకటించారు. ‘‘ఇలాంటి సినిమాలే యువతను తమ ప్రాంతాల్లోనే ఉండేలా ప్రేరణనిస్తాయి. వలసలు వెళ్లిపోవడాన్ని కూడా తగ్గిస్తాయి. ‘మోతీ భాగ్’ టీమ్‌కు కంగ్రాట్స్’ అని పేర్కొన్నారాయన. -
చోటా భీమ్‌ను ఆస్కార్‌కు తీసుకెళ్లాలి
‘‘ఇది వరకు చూసిన ‘చోటాభీమ్’ చిత్రాలకు, ఇప్పడు వస్తున్న ‘చోటా బీమ్: కుంగ్‌ఫూ ధమకా’కి తేడా ఏంటంటే ‘ఎక్స్పీరియన్స్’. పాత సినిమాలన్నీ 2డీలో షూట్ చేశాం. లేటేస్ట్ చిత్రాన్ని స్టీరియోస్కోపిక్ 3డీలో షూట్ చేశాం. మునుపటి సినిమాల కంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం’’ అన్నారు ‘చోటా భీమ్’ సృష్టికర్త రాజీవ్ చిలక. యానిమేషన్ క్యారెక్టర్ చోటా భీమ్ ముఖ్య పాత్రలో రాజీవ్ చిలక తెరకెక్కించిన తాజా చిత్రం ‘చోటా భీమ్: కుంగ్ఫు ధమాకా’. ఈ చిత్రం మే 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజీవ్ మాట్లాడుతూ – ‘‘చోటా భీమ్’, అతని గ్యాంగ్ కలసి చైనా వెళ్లి, అక్కడ కుంగ్‌ఫూ కాంపిటీషన్లో పాల్గొంటారు. ఈ ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది అన్నదే సినిమా కథ. పిల్లలు ఎంజాయ్ చేసే యాక్షన్, కామెడీ ఇందులో ఉంటాయి. చైనీస్ ఫుడ్‌ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ఫుడ్ ఐటమ్స్‌కు సంబంధించి ఓ సాంగ్ ఉంది. పంజాబీ గాయకుడు దలేర్ మెహందీతో ఓ ప్రమోషనల్ సాంగ్ షూట్ చేశాం. సినిమా లాస్ట్‌లో వచ్చే ఈ సాంగ్‌లో సినిమాలోని క్యారెక్టర్స్‌తో పాటు దలేర్ పాడుతూ, డ్యాన్స్ చేస్తారు. మన ఫ్రెండ్‌కి ఏదైనా కష్టం ఎదురైతే మనం నిలబడాలి. మన సైజ్ కాదు.. మన సంకల్పం ముఖ్యం అనే సందేశం ఈ సినిమాలో ఉంటుంది. 3డీ సినిమాకు చాలా ఫోకస్ కావాలి. ఈ సినిమాను ఐదేళ్లుగా షూట్ చేస్తున్నాం. ఏదో రోజు చోటాభీమ్ ఆస్కార్‌కు వెళ్తాడు అనే నమ్మకం ఉంది, తీసుకువెళ్లడానికి మా సామర్థ్యం మించి పని చేస్తాం’’ అని అన్నారు. -
నాప్కిన్స్కి నామినేషన్
కథిఖేరా... ఢిల్లీకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. హాపూర్ జిల్లా. కొన్నాళ్ల కిందట అక్కడ మహిళల పరిస్థితి దారుణం. దేశంలోని చాలా ఊళ్లలాగే ఇక్కడ రుతుచక్రం గురించి చాలా అపోహలు, అంధ విశ్వాసాలూనూ. రుతు సమయం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లోని ఆడవాళ్లు ఎవరికంటా పడకుండా ఊరవతలకు వెళ్లి ఉండేవారు. ఇక అమ్మాయిలు పెద్దమనిషి అయ్యారు అంటే పెళ్లికి, సంసారానికి ఇంకా చెప్పాలంటే రేప్‌కి లైసెన్స్ వచ్చినట్టుగా భావించేవారట ఆ ఊళ్లో మగవాళ్లు. ఇలాంటి సామాజిక పరిస్థితులు, నెలసరి పట్ల అవగాహన లేమి ఉండేదక్కడ. సిగ్గుతో ఆడపిల్లలు చదువు మానేసి ఇంటికే పరిమితమయ్యేవారు. అందుకే ఆ ఊళ్లో మొన్నమొన్నటి వరకు కూడా హైస్కూల్ పూర్తి చేసిన అమ్మాయి లేదు. రుతుసమయంలో శుభ్రత పాటించడం తెలియక ఎంతో మంది మహిళలు అనారోగ్యం పాలయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే రుతుచక్రం మొదలైన ఆడవాళ్లను అస్పృశ్యులుగా పరిగణించే సంప్రదాయం నెలకొందన్నమాట. అక్కడే విప్లవమూ మొదలైంది. అదీ మహిళల నుంచి! శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే మెషీన్ వచ్చింది. రుతుచక్రం, రుతు సమయం పట్ల ఉన్న అపోహలు పోయాయి. ఆడవాళ్లే నాప్కిన్స్ తయారు చేస్తూ మార్కెట్ కూడా వాళ్లే చేసుకుంటూ వాళ్ల ఆర్థిక పరిస్థితినీ మెరుగుపర్చుకున్నారు. ఆ నాప్కిన్స్కి ‘‘ఫ్లై’’ అనే పేరు పెట్టుకున్నారు. దాంతో ఆ ఊరి చిత్రమే మారిపోయింది. ఓ షార్ట్ డాక్యు మెంటరీగానూ రూపుదిద్దుకుంది.. అదే... ‘‘పీరియడ్. ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్’. ఆస్కార్ అవార్డ్స్ బరిలో డాక్యుమెంటరీ కేటగిరీలో షార్ట్‌లిస్ట్ అయింది. ఈ డాక్యుమెంటరీకి లాస్ఏంజెల్స్లోని ఓక్వుడ్ స్కూల్, ఫెమినిస్ట్ ఫౌండేషన్ రెండూ కలిసి ఫండింగ్ చేశాయి. దర్శకత్వం.. రేయ్‌కా జెహ్తాబ్చీ. రేయ్‌కా జెహ్తాబ్చీ.. అమెరికాలో పుట్టిన ఇరానీ వనిత. యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఫిల్మ్ ప్రొడక్షన్ డిగ్రీ చేశారు. మొదటి నుంచీ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ అంటే ఆసక్తి ఉన్న రేయ్కాకు ఫిల్మ్ మేకర్స్ అస్ఘర్ ఫర్హాది, పాల్ గ్రీన్గ్రాస్లే స్ఫూర్తి. ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’. డాక్యుమెంటరీ తీయడానికి నిర్మాతలు ఒక యంగ్ ఫిల్మ్‌మేకర్ గురించి వెదుకుతుంటే వాళ్లకు రేయ్‌కా గురించి తెలిసింది. అలా ఆమెకు ఈ అవకాశం వచ్చింది. ‘‘ఓక్వుడ్ స్కూల్లోని పదిహేను నుంచి పదహారేళ్ల మధ్య వయసున్న అమ్మాయిలంతా ఇండియాలోని కథిఖేరా విలేజ్ మహిళల కోసం శానిటరీ నాప్కిన్ మెషీన్ కోసం ఆర్థిక సహాయం అందించడం, ఈ మెషీన్‌తో అక్కడి మహిళలు ఆరోగ్యంతోపాటు ఆర్థిక స్వావలంబననే సాధించడం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఈ సినిమాకు అవార్డ్ వస్తుందా రాదా.. అన్నది సెకండ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్.. ఇది ఆస్కార్ డాక్యుమెంటరీ షార్ట్‌లిస్ట్‌లో ఉన్నందుకే చాలా గర్వంగా ఉంది’’ అని తన సంతోషాన్ని పంచుకున్నారు రేయ్‌కా జెహ్తాబ్చీ. ఈ సినిమా షూటింగ్ అంతా కథిఖేరాలోనే తీశారు. అందుకోసం రేయ్‌కా రెండుసార్లు ఇండియాను సందర్శించారు. శానిటరీ వెండింగ్ మెషీన్ రాకముందు ఊళ్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆ ఊరివాళ్లను ఇంటర్వ్యూ చేయడానికి, తర్వాత షూటింగ్ కోసం. ఊళ్లోని చాలా మంది దీనిమీద మాట్లాడ్డానికి ఇష్టపడలేదట. ప్యాడ్స్ తయారు చేసే మెషీన్ నెలకొల్పడానికి, దాన్ని ఆడవాళ్లే నడుపుకునేలా చేయడానికి స్నేహా అనే అమ్మాయి చేసిన ప్రయత్నాన్ని తెలుసుకుని చలించి పోయిందట రేయ్‌కా. ఆ సంఘటననూ ఉన్నదున్నట్లే ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’లో పొందుపర్చారు రేయ్‌కా జెహ్తాబ్చీ. – శరాది -
కోహ్లి ఫేక్ యాక్టింగ్‌కు అవార్డు చూశారా!
న్యూఢిల్లీ: ఏ విషయమైనా ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకోవడం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అలవాటు. ఒక్కోసారి ఆటపట్టించేలా కూడా పోస్టులు చేస్తుంటాడు. ఇలాగే తాను ఓ సినిమాలో నటిస్తున్నట్లు గత నెలలో కోహ్లి ట్విటర్లో ఓ పోస్టు చేశాడు. దాని పేరు ట్రైలర్ అని, నిర్మాత వ్రాన్ ప్రొడక్షన్స్ అని.. తన స్టిల్ ఉన్న ఓ పోస్టర్‌ను గత నెల 20న ట్వీట్ చేశారు. దీంతో ఆయన అభిమానులంతా అవాక్కయ్యారు. కోహ్లి నిజంగా సినిమాలో నటిస్తున్నాడా అని ఆశ్చర్యపోయారు. అయితే ‘ఈ ఫేక్ సినిమాకు ఇప్పుడు నకిలీ ఆస్కార్ గెలిచాను’ అని ఆటపట్టిస్తూ ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు.‘నేను నటించని ట్రైలర్ సినిమాకు వచ్చిన నకిలీ ఆస్కార్ ఇది. ఈ సినిమాను నిర్మించని వ్రాన్ ప్రొడక్షన్కూ, దాన్ని చూడని ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఓ ఫేక్ చిత్రం కాబట్టి.. ఇదీ నకిలీ ఆస్కార్' అని 22 సెకన్ల వీడియోను పోస్ట్ చేశాడు. Getting it right when you think you got it all WROGN 😂🤘🏻@StayWrogn #TrailerTheMovie pic.twitter.com/htlWP6L7wx — Virat Kohli (@imVkohli) 17 October 2018 -
కేరళ కుట్టి ఉద్యమానికి సోషల్ ప్రోగ్రెస్ ‘ఆస్కార్’
’ఇది ప్రతి స్త్రీ జీవితంలో అనుభవమయ్యే పునరుత్పత్తి పునాది ప్రక్రియ. కానీ ఏ దేశంలోనైనా చర్చించడానికి ససేమిరా ఇష్టపడని విషయం కూడా ఇదే. రక్తస్రావమనే అత్యంత సహజక్రియకి స్త్రీలంతా శిక్షింపబడుతున్నారు.’ అంటూ పట్టుమని పద్దెనిమిదేళ్ళు కూడా లేని కేరళ కుట్టి అమికా జార్జ్ బ్రిటన్ వీధుల్లో ప్రారంభించిన ’’ఫ్రీ పీరియడ్స్’’ ఉద్యమం ఆమెకు గోల్‌కీపర్స్ గ్లోబల్ అవార్డు దక్కేలా చేసింది. సామాజిక అభివృద్ధి రంగంలో ఈ అవార్డును ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రగతిని పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా బిల్, మెలిండా ఫౌండేషన్ 2017లో గోల్‌కీపర్స్ అనే సామాజిక చైతన్య ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 ఏళ్ళ అమికా జార్జ్ పేద బాలికలకు ఉచిత సానిటరీ ప్యాడ్స్ కోసం బ్రిటన్ వీధుల్లో పూరించిన శంఖారావం ఆమెకు ఈ అవార్డు దక్కేలా చేసింది. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం చివరకు బ్రిటన్ పురవీధుల్లో స్త్రీపురుష భేదాన్ని మరిపిస్తూ సాగింది. దాదాపు 2000 మంది యువతీయువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు బ్రిటన్ ప్రభుత్వం పేద బాలికల రుతుక్రమావసరాలను తీర్చే ఉచితి సానిటరీ ప్యాడ్స్ కోసం 1.5 మిలయన్ పౌండ్లు వెచ్చించేలా చేసింది. అభివృద్ధిచెందిన బ్రిటన్‌లాంటి దేశాల్లోనే ప్రతి పదిమంది బాలికల్లో ఒకరు సానిటరీ ప్యాడ్స్‌ని కొనుగోలు చేయలేని పేదరింకలో మగ్గుతున్నారని ప్లాన్ ఇంటర్నేషల్ సర్వేలో చదివిన 18 ఏళ్ల భారతీయ యువతి అమికా జార్జ్ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమ క్రమంలో బ్రిటన్ పేద బాలికలు సానిటరీ ప్యాడ్స్‌ని కొనుక్కోలేని స్థితిలో ఆ అవసరానికి కాగితాలనూ, పాత న్యూస్ పేపర్స్‌నీ, సాక్స్‌నూ వాడుతుండడం తన హృదయాన్ని కలిచివేసిందంటారు అమికా జార్జ్. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆమె దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఇదే ఆమె చేపట్టిన ’’ఫ్రీ పీరియడ్’’ ఉద్యమానికి పునాది అన్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చరిత్ర చదవడానికి వెళ్ళి చరిత్ర సృష్టించిన∙అమికా జార్జ్. 2017 డిసెంబర్లో జరిగిన ఈ ఉద్యమం ఫలితంగా అక్కడి పేద బాలికలకు దక్కిన ఫలితాన్ని గుర్తించిన గోల్‌కీపర్స్ సోషల్ ప్రోగ్రెస్ ఆస్కార్ అవార్డుతో సత్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలా సమాజాన్ని చైతన్యయుతం చేసిన ముగ్గురు మహిళలను ఈ అవార్డుకి ఎంపిక చేస్తే అందులో అమికా జార్జ్ ఒకరు. ఫ్రెంచ్ అధ్యక్షలు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, మహిళల పిల్లల హక్కుల కార్యకర్త గ్రేస్ మైఖస్త్ల్, రచయిత, సామాజిక కార్యకర్త రిచర్డ్ కర్టిస్ తదితర ప్రముఖులు ఈ అవార్డుల కార్యక్రమంలో ఉపన్యసించారు. న్యూయార్క్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇరాక్ కి చెందిన 24 ఏళ్ళ నదియా మురద్, కెన్యాకి చెందిన 28 ఏళ్ళ డిస్మస్ కిసిలు లకి సైతం అమికా జార్జ్‌తో సహా ఈ అవార్డులు అందుకున్నారు. -
పదేళ్ల అమ్మాయి కథ.. విలేజ్ రాక్‌స్టార్స్!
ప్రపంచ సినీ రంగస్థలంలో అస్సామీ సినిమా ఒకటి నా సామి రంగా అనిపించింది. పెద్ద పెద్ద బడ్జెట్లతో ఇండియాలో తయారైన సినిమాలతో పోటీ పడి వాటిని ఓడించి ఆస్కార్ బరిలో నిలిచింది. ‘విలేజ్ రాక్‌స్టార్స్’ ఈ విజయంతో సినీ అభిమానులను రాక్ చేసింది. రీమా దాస్.. ఈ మూడునాలుగు రోజులుగా బాగా వినపడుతున్న పేరు. ఆమె సినిమా దర్శకురాలు. రీమా తీసిన ‘‘విలేజ్ రాక్‌స్టార్’’ ఆస్కార్ విదేశీ సినిమా విభాగానికి మన దేశం నుంచి నామినేట్ అయిన అస్సామి సినిమా. అందుకే ఆమె వార్తల్లో ఉన్నారు. ముందు రీమా దాస్ గురించి తెలుసుకుందాం..అస్సామ్‌లో మధ్యతగరతి వాళ్ల కలల కొలువు టీచర్ ఉద్యోగం. రీమా పుట్టిపెరిగిన ఊరు ‘కాలార్డియా’లో కూడా అంతే. గువహటికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రీమా వాళ్ల నాన్న కూడా టీచరే. తనలాగే తన కూతురు టీచర్ కావాలనుకున్నాడు. తండ్రి కోరిక మేరకు రీమా పూణె యూనివర్శిటీలో సోషియాలజీ చదివింది. టీచర్ ఉద్యోగం కోసం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా పాసయింది. కాని ఆమె లోపల ఉన్న ఆసక్తి వేరు. ఆమె చిత్తమంతా నటనవైపే! థియేటర్.. సినిమా చిన్నప్పుడు స్కూల్లో నాటకాల్లో నటించింది. నాటక ప్రదర్శన కోసం ముంబై కూడా వెళ్లింది. పృథ్విథియేటర్లో ప్రేమ్‌చంద్ ‘‘గోదాన్’’నాటకంలో అభినయించింది. ఇదంతా సినిమా పట్ల ఆమెలో క్రేజ్‌ను పెంచింది. సత్యజిత్‌రే, ఇంగ్మర్ బెర్గ్మన్, మాజిద్ మాజిద్ వంటి గొప్ప దర్శకుల సినిమాలను చూడ్డం మొదలుపెట్టింది. అలా సినిమా తీయడమనే థియరీ నేర్చుకుంది. బైనాక్యులర్స్.. బయోస్కోప్ తండ్రి పెంపకం, పెరిగిన నేపథ్యం తనను టీచింగ్ వైపు తోసినా ఆమె ఆసక్తి సినిమా దగ్గరకే లాక్కెళ్లింది. 2009లో ‘ప్రథా’ అనే షార్ట్ ఫిల్మ్ తీసింది రీమా. తర్వాత రెండు షార్ట్ఫిల్æ్మ్సకీ దర్శకత్వం వహించింది. అయినా ఆమె ప్రయాణం అడుగు కూడా ముందుకు సాగలేదు. ఆ అసంతృప్తితో ఉన్నప్పుడే రీమా ఫ్రెండ్ అతని తండ్రి కోసం కొన్న బైనాక్యులర్స్ చూపించాడు. వాళ్ల నాన్నకు చాలా ఇష్టమని అందుకే కొన్నానని చెప్తూ. వాటిని చూసిన వెంటనే ఓ లైన్ తట్టింది రీమాకు. ఆ తలపు స్క్రిప్ట్ రాసే వరకు ఊరుకోలేదు. వెంటనే స్క్రీన్ ప్లేనూ సిద్ధం చేసుకుంది. అదే రీమా తొలి ఫీచర్ ఫిల్మ్ ‘అంతర్ దృష్టి’. 2013లో తన సొంతూరు కాలార్డియాలోనే కేనన్ డీఎస్ఎల్ఆర్ కెమెరాతో మొదలుపెట్టింది చిత్రీకరణ. 2016లో పూర్తయింది. అదే యేడు అది కేన్స్, ముంబై, టాలిన్ బ్లాక్ నైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి వెళ్లింది. ఈ సినిమా ఆమెను సెల్ఫ్ టాట్ ఫిల్మ్‌మేకర్‌గా నిలబెట్టింది. ‘అంతర్ దృష్టి’కి రీమాయే వన్ ఉమన్ క్రూ. కథ, దర్శకత్వం, నిర్మాత, ఎడిటర్, కెమెరా, ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైనర్.. అన్నీ ఆమే! దృష్టి మార్చిన అంతర్దృష్టి ‘అంతర్దృష్టి’ సినిమా షూటింగ్ జీవితం పట్ల ఆమె దృక్కోణాన్నే మార్చేసింది. ఎన్నో పార్శా్వలు తెలిశాయి. తను పుట్టి పెరిగిన ఊరు కొత్తగా అర్థమైంది. ఆ ఊరి అందాన్ని చూడగలిగింది. తన బాల్యాన్ని మళ్లీ అన్వేషించుకుంది. అంతర్ దృష్టి షూట్ చేస్తున్నప్పుడు కొంత మంది పిల్లలను కలిసింది. ఆడియోలో పాటలు వస్తుంటే ఈ పిల్లలంతా చేతుల్లో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నట్టు ఆ మ్యూజిక్‌కి తగ్గట్టు అభినయించడం చూసి తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది. ఆ అమాయకత్వమే ‘‘విలేజ్ రాక్‌స్టార్స్’’కి ప్లాట్నిచ్చింది. ఇది పదేళ్ల అమ్మాయి చుట్టూ సాగే కథ. 2014లో మొదలైన ఈ సినిమా 2017లో పూర్తయింది. షూటింగ్ సమయం 150 రోజులు. 2017లో ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కి, స్పెయిన్‌లోని సాన్సెబాస్టియన్ ఫిల్మ్ఫెస్టివల్కూ వెళ్లింది. ఈశాన్య భారతం నుంచి టొరంటో ఫిల్మ్‌ఫెస్టివల్‌కు వెళ్లిన మొదటి సినిమా ఇదే. ప్రస్తుతం ఓ టీనేజ్ లవ్‌స్టోరీ మీద సినిమా ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను తన సొంతూరు దగ్గర్లోని చాయ్‌గావ్‌లో తీయనుందట రీమా. అయితే ఈ సినిమాలో ప్రొఫెషనల్ యాక్టర్స్ ఉంటారని చెప్పింది రీమా. బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ ఆస్కార్ కోసం సెలెక్ట్ అయిన ఫస్ట్ అస్సామీ సినిమా ఇది. ఈ రోజుని నా జీవితంలో మరిచిపోలేను. మన దేశంలో ఇన్ని భాషలు ఇన్ని సినిమాలు ఉండగా నా సినిమా ఎన్నిక కావడం మంటే ఒకరకంగా ప్రపంచంలోనే అస్సామీకి ఇది ఒక గుర్తింపు. ఆస్కార్ బరిలో ‘విలేజ్ రాక్‌స్టార్స్’తో పోటీపడ్డ సినిమాలు మేఘనా గుల్జార్ ‘రాజీ’, సిద్ధార్థ్ మల్హోత్రా ‘హిచ్కీ’, సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావత్’, తబ్రేజ్ నూరానీ ‘లవ్ సోనియా’, నాగ్ అశ్విన్ ’మహానటి’, చెళియన్ ‘టు లెట్’, రాహి బర్వే ‘తుంబాడ్’, సుకుమార్ ‘రంగస్థలం’, వినిత్ కనోజియా ‘రేవ’, దేబ్ మేధేకర్ ‘బయోస్కోప్‌వాలా’ సినిమాలతో పోటీ పడి గెలిచింది ‘‘విలేజ్ రాక్‌స్టార్స్’. విలేజ్ రాక్‌స్టార్స్ వాద్యసంగీతమంటే చెవికోసుకునే పదేళ్ల అమ్మాయికి ఎలక్ట్రిక్ గిటార్ కొనుక్కోవాలనేది కల. ఆ అమ్మాయి పేరు ధును. గిటార్ కొనుక్కొని ఓ రాక్ బ్యాండ్‌ను తయారు చేయాలనేది ఆ పిల్ల లక్ష్యం. ఆ గమ్యాన్ని చేరడమే సినిమా. ధును పాత్రను రీమా దాస్ మేనకోడలు భనితా దాస్ పోషించింది. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. అన్నీ రీమానే. ప్రొడ్యూసర్ కూడా ఆమే. ఈ నెల (సెప్టెంబర్) 28న థియేటర్లలో విడుదలకానుందీ ‘‘విలేజ్ రాక్‌స్టార్స్’’. నేను దర్శకత్వం వహించిన ‘మహానటి’ సినిమా మన దేశం తరఫున నామినేషన్‌కి వెళ్లే చిత్రాల లిస్ట్‌లో ఉండటం ఆనందంగా ఉంది. ఆస్కార్ బరిలో నిలిచిన ‘విలేజ్ రాక్‌స్టార్స్’ సినిమాను నేను చూడలేదు. కానీ ఆ సినిమా గురించి విన్నాను. ఇక, నా ‘మహానటి’ సినిమా గురించి చెప్పాలంటే.. నేను అవార్డులు ఆశించి ఈ సినిమా తీయలేదు. నిజాయతీగా మా ప్రయత్నం మేం చేశాం. విడుదలైన తర్వాత ఈ స్థాయి ఆదరణ లభిస్తుందని ఊహించలేదు. – ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్లు మీ సినిమాను ఆస్కార్ నామినేషన్స్‌కు పంపుతున్నట్లు ఒక లెటర్ పంపి, కంటెంట్ ఇవ్వమన్నారు. చాలా హ్యాపీగా ఫీలై కంటెంట్ పంపించాం. నిజానికి మేం ఈ సినిమా తీసేటప్పుడు అవార్డుల గురించి అసలు ఆలోచించలేదు. ‘విలేజ్ రాక్‌స్టార్స్’ సినిమా ఎంపికైందని విన్న తర్వాత ఆ సినిమా ట్రైలర్ చూశాం. బావుంది, చాలా ‘రా’గా ఉంది. ఇలాంటి ఫిల్మ్స్‌కి అవార్డ్సు వస్తాయి. సుకుమార్ గారి డైరెక్షన్ మ్యాజిక్‌తో మేం తీసిన ‘రంగస్థలం’ సినిమా రా అండ్ రియలిస్టిక్‌గానే కాదు.. కమర్షియల్‌గా ఉంటుంది. ఆ విధంగా ఆయన ఈ సినిమాని మలిచిన తీరు అద్భుతం అనే చెప్పాలి. ఆ సంగతలా ఉంచితే.. మా ‘రంగస్థలం’ పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అక్కడివారు కూడా సినిమాని చూసి, ఎంజాయ్ చేయడం ఆనందంగా ఉంది. అలాగే బెస్ట్ ఫారిన్ కేటగిరీ విభాగంలోకి మా చిత్రాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో టీమ్ అంతా హ్యాపీ. – నిర్మాతలు చెరుకూరి మోహన్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ -
ఇన్‌క్లూజన్ రైడర్
‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ల ఫంక్షన్‌కు అందరూ నలుపురంగు దుస్తులే వేసుకుని వెళ్లారు. ‘బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్’ అవార్డుల ప్రారంభోత్సవంలో నటీమణులంతా కలిసికట్టుగా ‘టైమ్స్‌అప్’కు మద్దతు ఇస్తూ ఒక ఉత్తరం రాశారు. అదేవిధంగా ఆస్కార్ ఫంక్షన్లో డోర్మండ్ ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే మాట వాడారని అనుకోవాలి. ‘‘లేడీస్ అండ్ జెంటిల్మన్.. చివరిగా రెండు మాటలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను..’’ అని ఒక్క క్షణం ఆగారు హాలీవుడ్ నటి ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్. డాల్బీ థియేటర్లో ఒక్కసారిగా నిశ్శబ్దం. ఏమిటా రెండు మాటలు?! డోర్మండ్ చేతిలో ‘ఉత్తమ నటి’గా ఆమె గెలుచుకున్న ఆస్కార్ ప్రతిమ ఉంది. ‘త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్ మిస్సోరీ’ చిత్రానికి వచ్చిన అవార్డు అది. ‘‘లేడీస్ అండ్ జెంటిల్మన్.. ఐ హ్యావ్ టూ వర్డ్స్ టు లీవ్ విత్ యు టునైట్’’ అని ఆగి, ఇన్‌క్లూజన్ రైడర్’’ అంటూ ప్రసంగాన్ని ముగించారు డోర్మండ్. అంతే! ఇంటర్నెట్ జామ్ అయింది. ట్వీటర్ కిక్కిరిసిపోయింది. ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే మాటలకు మీనింగ్ ఏమై ఉంటుదన్న వెదకులాట మొదలైంది. కొన్ని గంటల తర్వాత గానీ ఒక క్లారిటీ రాలేదు. Inclusion Riderఅనేది ఒక ఫ్రేజ్ కాదు. వేర్వేరుగా రెండు పదాలు అవి. ఇన్‌క్లూజన్ అంటే ‘చేర్పు’. రైడర్ అంటే ‘ఉపవాక్యం’. లేదా ‘అనుబంధ అంశం’. (రైడర్‌కి ఉన్న ఇంకో అర్థం తెలిసిందే. ‘నడిపే వ్యక్తి’). ఇన్‌క్లూజన్ రైడర్ అని డోర్మండ్ అనడంలోని ఉద్దేశం.. ‘చేర్చాలనే షరతు విధించండి’ అని చెప్పడం. ఏంటి చేర్చడం? ఏంటి షరతు? ఏంటి విధించడం? ఇన్ని ప్రశ్నలకూ ఒకే సమాధానం ఏంటంటే.. ‘ఓ.. ప్రధాన నటీనటులారా.. మీరొక సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు ఎలాంటి జాతి, లైంగిక వివక్ష లేకుండా కథాంశంలోని కాల, స్థలాలను బట్టి నటీనటులు, ఇతర సిబ్బందిని చేర్చుకుంటేనే నేను ఈ చిత్రంలో కొనసాగుతాను అని ‘కొసరు’గా ఒక షరతును విధించండి’.. అని చెప్పడం! ఆ మాటనే ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే పదాలతో చెప్పి, తన ప్రసంగాన్ని ముగించారు డోర్మండ్! ఒక విధంగా ఇది ‘మీటూ’, ‘టైమ్స్‌అప్’ మహిళా ఉద్యమాలను సమర్థించడమే. ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ల ఫంక్షన్‌కు అందరూ నలుపురంగు దుస్తులే వేసుకుని వెళ్లారు. ‘బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్’ అవార్డుల ప్రారంభోత్సవంలో నటీమణులంతా కలిసికట్టుగా ‘టైమ్స్‌అప్’కు మద్దతు ఇస్తూ ఒక ఉత్తరం రాశారు. అదేవిధంగా ఆస్కార్ ఫంక్షన్లో డోర్మండ్ ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే మాట వాడారని అనుకోవాలి. అయినా, ఈ రెండు మాటలకు అంత అర్థం ఉందని ఎలా అనుకుంటాం? డిక్షనరీలలోకి నేటికింకా ఈ పదాలు రాలేదు కదా! కానీ, ఈ జంట పదాలు రెండేళ్ల క్రితమే జన్మించాయి! డాక్టర్ స్టేసీ స్మిత్ అనే యువతి 2016లో కాలిఫోర్నియా యూనివర్సిటికీ సమర్పించిన ఒక సిద్ధాంత పత్రంలో ఈ పదప్రయోగం చేశారు. ‘ది డేటా బిహైండ్ హాలీవుడ్స్ సెక్సిజం’ అనే పత్రంలో ‘ఎ–లిస్టు హాలీవుడ్ నటులు తమ ఒప్పందాలలో ఒక ‘ఇన్‌క్లూజన్ రైడర్’ను పెడితేనే కానీ చిత్రపరిశ్రమలోని వివక్ష సమసిపోదు’ అని రాశారు. హాలీవుడ్‌లోని అసమానతల్ని తొలగించేందుకు స్టేసీ స్మిత్ చేసిన సూచన అది. అప్పట్లో ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే పదాలకు ఏమంత ప్రాముఖ్యం రాలేదు. ఇప్పుడు అవే పదాలు ఆస్కార్ విజేత నోటి నుంచి రాగానే ప్రాణం పోసుకున్నాయి. నేడో, రేపో ఒకే పదబంధంగా ఇవి డిక్షనరీల్లో కనిపించడమే ఇక మిగిలింది. -
'ఆస్కార్ కాదు.. నాకు ఆడియన్సే ముఖ్యం'
హైదరాబాద్ : బాహుబలి.. రెండు భాగాలుగా విడుదలైన ఈ తెలుగు చిత్రం ప్రపంచాన్ని చుట్టేసింది. మునుపెన్నడూ లేనంతగా ఇంకా చెప్పాలంటే దిన చర్యలో భాగంగా మాట్లాడుకోవడం ఎంత సహజమో అలా బాహుబలి గురించి మాట్లాడుకోవడం అంత సహజంగా మారింది. అంతగా ఇటు టాలీవుడ్ నుంచి అటు హాలీవుడ్ వరకు బాహుబలి మానియా కొనసాగింది. దాదాపు రూ.1500కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఎన్నో రికార్డులు తిరగేసిన ఈ చిత్రం ఇప్పుడు మరోసారి చర్చవేదికపైకి వచ్చింది. అదేమిటంటే.. ఈ ఏడాది బాహుబలి ఎందుకు ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లలేదు అని. చిన్నచిత్రంగా వచ్చిన బాలీవుడ్ చిత్రం న్యూటన్ ఈ ఏడాది భారత్ నుంచి విదేశీ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులు బాహుబలి సృష్టికర్త దర్శకదీరుడు రాజమౌళిని ప్రశ్నించారు. భారత్ నుంచి ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ దక్కకపోవడం మీకు నిరాశ కలిగించిందా అన్నదే ఆ ప్రశ్నకు దానికి రాజమౌళి ఏమని బదులిచ్చారో తెలుసా.. 'నేను చిత్రాలు చేసేటప్పుడు అవార్డు గురించి ఎప్పుడూ ఆలోచించను. అది నా గమ్యం కూడా కాదు. కథతో ముందు నన్ను నేను సంతృప్తి పరుస్తుందా లేదా చూస్తాను.. ఆ తర్వాత ఎక్కువమంది ప్రేక్షకులకు నచ్చేలా చూస్తాను. అలాగే, ఆ సినిమాకోసం కష్టపడి పనిచేసే ప్రతిఒక్కరికీ ప్రతిఫలం దక్కాలని కోరుకుంటాను. అవార్డు వస్తే సంతోషిస్తాను.. అలాగే రాకపోతే పట్టించుకోను. నేను విజయాన్ని బాక్సాఫీస్ వసూళ్లలో, ప్రశంసల్లో చూస్తాను.. అవార్డుల్లో కాదు.. అది నాకు ముఖ్యం కూడా కాదు' అని చెప్పారు. -
ఆస్కార్‌కి న్యూటన్
‘‘కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలకే ఆస్కార్ అవార్డులు వస్తాయన్నది అపోహ. తక్కువ బడ్జెట్‌తో, కథాబలంతో తీసే సినిమాలకు అవార్డు దక్కించుకునే అర్హత ఉంటుంది. ఆస్కార్ అవార్డుకి కలక్షన్స్‌తో సంబంధం లేదు’’ అని ఆస్కార్ ఇండియా జ్యూరీ కమిటీ అధ్యక్షులు సీవీ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డ్ పోటీలకు మన దేశం నుంచి ‘ఉత్తమ విదేశీ’ చిత్రాల కేటగిరీకి హిందీ చిత్రం ‘న్యూటన్’ని ఎంపిక చేశారు. రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అంజలీ పాటిల్ ముఖ్య తారలుగా అమిత్ వి. మసూర్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై, మంచి ప్రశంసలు అందుకోవడం విశేషం. ఈ చిత్రాన్ని ఎంపిక చేసిన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీవీ రెడ్డి మాట్లాడుతూ – ‘‘తక్కువ బడ్జెట్‌తో తీసిన ‘న్యూటన్’ ఉన్నతంగా ఉంది. అందుకే ఏకగ్రీవంగా ఈ సినిమాను ఎంపిక చేశాం. తెలుగు ‘బాహుబలి’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో పాటు కన్నడం, మలయాళం, బెంగాలీ భాషల నుంచి రెండేసి సినిమాలు, పన్నెండు హిందీ సినిమాలు, ఐదు మరాఠీ సినిమాలు ఒక తమిళ సినిమా.. ఇలా మొత్తం 26 సినిమాలు ఎంట్రీకి వచ్చాయి. తెలుగుతో పోలిస్తే మరాఠీ, బెంగాలీ భాషల సినిమాలు బాగున్నాయి’’ అన్నారు. ‘‘ఆస్కార్ అవార్డులకు పోటీ పడే చిత్రాలకు ఇకనుంచి ప్రభుత్వం కోటీ రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది’’ అన్నారు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సి. కల్యాణ్ ‘న్యూటన్’ కథేంటి?: న్యూటన్ కుమార్ ఓ గవర్నమెంట్ క్లర్క్. నిజాయతీకి చిరునామా అతను. ఛత్తీస్‌గడ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంతో అతనికి ఎన్నికల నిర్వహణ బాధ్యత అప్పగిస్తారు. ఎలక్షన్ డ్యూటీలో ఎదురైన అడ్డంకులను అధిగమించి, ఎన్నికలు సజావుగా సాగడానికి న్యూటన్ కుమార్ ఏం చేశాడు? అనే కథతో ఈ సినిమా తీశారు. విడుదలైన రోజే ఈ సినిమాని పలువురు చిత్రరంగ ప్రముఖులు చూశారు. ‘‘ఈ సినిమా ఓ కనువిప్పు’’ అని అమితాబ్ పేర్కొన్నారు. అక్షయ్‌కుమార్ కూడా ఈ చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఆస్కార్ నామినేషన్ పోటీకి అర్హత ఉన్న చిత్రమిది అని పలువురు సినీ రంగ ప్రముఖులు పేర్కొన్నారు. విమర్శకుల ప్రశంసలు సైతం ఈ సినిమా అందుకుంటోంది. మరి.. ఆస్కార్‌లో నామినేషన్ దక్కించుకుని, ఆ తర్వాత అవార్డు కూడా దక్కించుకుంటుందా? వేచి చూద్దాం. -
ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు కన్నుమూత!
ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత మార్టిన్ లండౌ కన్నుమూశారు. ఆయన వయస్సు 89 ఏళ్లు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వృద్ధాప్య కారణాల వల్ల శనివారం తుదిశ్వాస విడిచారు. 1960లో ’మిషన్: ఇంపాజిబుల్’ టీవీ సిరీస్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన మార్టిన్ అనేక సినిమాల్లో, టీవీ సీరియళ్లలో నటించి ప్రేక్షకులను అలరించారు. ’ఎడ్వుడ్’ సినిమాలో బెలా లుగోసి పాత్రకుగాను ఆయనను ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు వరించింది. 1959లో దర్శక దిగ్గజం ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ దర్శకత్వంలో వచ్చిన ’నార్త్ బై నార్త్‌వెస్ట్’ సినిమాతో ఆరంగేట్రం చేసిన ఆయన.. ఎడ్వుడ్, క్రైమ్స్ అండ్ మిస్డిమీనర్స్ తదితర సినిమాలు, స్పేస్, మిషన్ ఇంపాజిబుల్ వంటి టీవీ సీరియళ్లతో అలరించారు. 1989లో వచ్చిన క్రైమ్స్ అండ్ మిస్డీనర్స్ చిత్రంలో అద్భుతమైన నటనతో మార్టిన్ ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆయన మృతి పట్లు పలువురు హాలీవుడ్ నటులు సంతాపం ప్రకటించారు. -
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎం
-
బాహుబలిని ఆస్కార్‌కు సిఫార్సు చేస్తా
మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి తెలుగువారి చిత్ర నిర్మాణ ప్రతిభా పాటవాన్ని చాటిచెప్పిన బాహుబలి సినిమాను ఆస్కార్‌కు సిఫారసు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సినిమాను ఆద్యంతం హృద్యంగా మలిచిన రాజమౌళికి హ్యాట్సాఫ్ చెబుతూ... చిత్ర నిర్మాణ యూనిట్‌కు అభినందలు తెలుపుతూ మంత్రివర్గం తీర్మానించిందని వివరిం చారు. బాహుబలి యూనిట్‌ను త్వరలో అమరావతికి తీసుకొచ్చి సన్మానిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కన్సార్టియం కంపెనీకి స్విస్ ఛాలెంజ్‌లో అప్పగించేందుకు నిర్ణయించామని తెలిపారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని సీఎం పేషీలో మంగళవారం రాత్రి వరకు జరిగిన మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. మంత్రివర్గ నిర్ణయాలు ► కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డు రావడం పట్ల హర్షం. ► ఒలింపిక్ విజేత పీవీ సింధుకి గ్రూప్–1 సర్వీస్‌లో నియమించేందుకు వీలుగా చర్యలు. ► కొత్తగా 800 కానిస్టేబుల్ పోస్టులకు ఆమోదం. 25 డివిజినల్ అక్కౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్–2 పోస్టులను గ్రేడ్–1 పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఆమోదం. -
ఆస్కార్‌కూ ‘ట్రంప్’ మంటలు!
- ముస్లిం దేశాలపై నిషేధానికి నిరసనగా వేడుకలకు రాని ఇరాన్ డైరెక్టర్ అస్ఘర్ ఫర్హాదీ - ట్రంప్ విధానాలపై మండిపాటు - ఆరు ఆస్కార్లు గెల్చుకున్న ‘లా లా ల్యాండ్’ - ఉత్తమ చిత్రంగా మూన్లైట్ ‘ట్రంప్’మంటలు ఆస్కార్ అవార్డులకూ పాకాయి! ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు విధించిన నిషేధాన్ని నిరసిస్తూ ఇరాన్‌కు చెందిన చిత్ర దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ... అవార్డు కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఉత్తమ విదేశీ విభాగంలో ‘ది సేల్స్‌మేన్’ ఆస్కార్‌ను గెల్చుకోగా.. అవార్డును అందుకునేందుకు ఆయన రావాల్సి ఉంది. అయితే ట్రంప్ విధానాలపై మండిపడుతూ ఈ కార్యక్రమానికి ఫర్హాదీ దూరంగా ఉండిపోయారు. ఇదిలా ఉండగా ఈసారి ఉత్తమ చిత్రంగా ‘మూన్లైట్’ఎంపికైంది. ఈ చిత్రం మొత్తం మూడు పురస్కారాలను ఎగరేసుకుపోయింది. 14 కేటగిరీల్లో నామినేట్ అయిన ‘లా లా ల్యాండ్’చిత్రానికి ఆరు అవార్డులు దక్కాయి. ఒక్క అడుగు... భగవంతుణ్ణి అదొక్కటీ అడుగు... లైఫ్‌లో ఒక్కసారైనా ఆస్కార్‌తో అడుగేయాలని అడుగు... చిత్రసీమలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ఆస్కార్ గెలిచి, అవార్డు వేదికపై ఓ అడుగేయాలనుకుంటారు. కొందరికి ఛాన్స్ త్వరగా వస్తుంది. మరికొందరికి లేటుగా వస్తుంది. అవకాశం ఎప్పుడొచ్చినా ఆస్కార్ అందుకున్న తర్వాత వేసే మొదటి అడుగు లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుంటుంది. ఉత్తమ నటి, నటుడు, దర్శకుడు, సహాయ నటి, సహాయ నటుడు, సంగీత దర్శకుడు... 89వ ఆస్కార్స్‌లో ముఖ్యమైన కేటగిరీల్లో తొలి అవార్డు (ఫస్ట్ స్టెప్) గెల్చుకున్నోళ్లు ఎక్కువమందే ఉన్నారు. ఈ ఫస్ట్ స్టెప్ మరిన్ని సక్సెస్ స్టెప్స్ వేసే జోష్, ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటూ... కంగ్రాచ్యులేషన్స్ టు ఆస్కార్ విన్నర్స్. 2017 ఆస్కార్ విజేతలు వీరే ఉత్తమ చిత్రం: మూన్లైట్; ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్ (మాంచెస్టర్ బై ద సీ); ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్) ; ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా ల్యాండ్) ; ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా అలీ (మూన్ లైట్) ; ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్ (ఫెన్సెస్) ; ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైల్: సూసైడ్ స్క్వాడ్ చిత్రం ; ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ చిత్రం: ఫెంటాస్టిక్ బీస్టస్ ; ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే.. మేడ్ ఇన్ అమెరికా ; ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: అరైవల్ ; ఉత్తమ సౌండ్ ; మిక్సింగ్ చిత్రం: హాక్సారిడ్జ్ ; ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: జాన్ గిల్బర్ట్ ; ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సెల్స్మ్యాన్ (ఇరాన్ ) ; బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్: జూటోపియా ; బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: పైపర్ ; ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ చిత్రం: లా లా ల్యాండ్ ; బెస్ట్ విజువల్ ఎఫెక్టస్: ద జంగిల్ బుక్ ; బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్: ద వైట్ హెల్మెట్స్ ; బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: సింగ్ ; బెస్ట్ సినిమాటోగ్రఫి: లా లా ల్యాండ్ ; బెస్ట్ ఒరి జినల్ ; స్కోర్: లా లా లాండ్ ; బెస్ట్ ఒరిజినల్ సాంగ్: సిటీ ఆఫ్ స్టార్స్ (లా లా ల్యాండ్) ; బెస్ట్ ఒరిజినల్ స్కీన్ర్‌ప్లే: మాంచెస్టర్ బై ద సీ ; బెస్ట్ అడాప్టెడ్ స్కీన్ర్‌ప్లే: మూన్లైట్ ఆ గీత చెరగాలి – అస్ఘర్ ఫర్హాదీ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఇరానియన్ మూవీ ‘ది సేల్స్‌మేన్’కు అవార్డు దక్కింది. ఆ చిత్రదర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్ల తన ఆగ్రహావేదనను వ్యక్తం చేశారు. ‘‘ముస్లిమ్ దేశాలపై ట్రంప్ విధించిన ‘ట్రావెల్ బ్యాన్’కు నిరసనగా ఈ అవార్డు వేడుకకు హాజరు కాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. తన మనోభావాలను లిఖితపూర్వకంగా ఆస్కార్ అవార్డు కమిటీకి పంపించారు. ‘‘పలు ముస్లిమ్ దేశాల పౌరులపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఆ దేశాలను, అక్కడి ప్రజలను గౌరవిస్తున్నాను. అందుకే అవార్డు తీసుకోవడానికి రాలేదు. ప్రపంచాన్ని మనము, మన శత్రువులు అని విభజించడం భయంగా ఉంది. యుద్ధానికి దారి తీసే ఘోరమైన నిర్ణయాలివి. ఇది సరికాదు. ఫిలిం మేకర్స్ తమ కెమేరాలను ఎక్కుపెట్టి కుల, మతాలనే అడ్డుగోడను చెరిపేయగలరు. ‘మేము, ఇతరులు.. అనే ఆ ఇద్దరి మధ్య సమానత్వాన్ని పెంపొందించగలరు. ఈరోజు ఆ సమానత్వం చాలా అవసరం’’ అంటూ అస్ఘర్ మనోభావాలను హోస్ట్ చదివారు. విన్న వీక్షకులు ఉద్వేగానికి గురయ్యారు. కొందరు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నా హార్ట్ ముక్కలైందన్నాడు! – ఉత్తమ నటుడు క్యాసే ఎఫ్లెక్ ఉత్తమ నటుడిగా క్యాసే ఎఫ్లెక్ పేరు ప్రకటించగానే, అతడు సీట్లో నుంచి వెంటనే లేచి తన అన్నయ్య బెన్ ఎఫ్లెక్ వద్దకు వెళ్లి కౌగిలించుకున్నారు. ఆల్రెడీ ఉత్తమ చిత్రం (నిర్మాతగా), బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే (మాట్ డామన్తో కలసి).. రెండు సార్లు్ల బెన్ ఎఫ్లెక్ ఆస్కార్స్ అందుకున్నారు. ఇప్పుడు క్యాసే ఎఫ్లెక్కి అవార్డు రావడంతో ఆస్కార్స్ అందుకున్న సిబ్లింగ్స్ (తోబుట్టువులు) లిస్టులో ఈ అన్నదమ్ములిద్దరూ 16వ స్థానం సంపాదించారు. ఇక, అవార్డు స్వీకరించిన తర్వాత క్యాసే ఎఫ్లెక్ మాట్లాడుతూ – ‘‘నాకు ఎలా నటించాలో నేర్పిన మొదటి వ్యక్తుల్లో దర్శక–నటుడు డెంజెల్ వాషింగ్టన్ ఒకరు. జస్ట్.. ఇప్పుడే ఆయన్ను కలిశాను. థాంక్యూ! ఈ అవార్డు నాకెంతో విలువైనది. ఆస్కార్ కమ్యూనిటీలో భాగం కావడం నా అదృష్టం. ఇంతకు మించి మాటలు రావడం లేదు. ‘మాంచెస్టర్ బై ద సీ’ యూనిట్ సభ్యులకు థ్యాంక్స్. బెన్... ఐ లవ్ యూ’’ అన్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ స్పీచ్‌లో అన్నయ్య బెన్ ఎఫ్లెక్ పేరును క్యాసే ప్రస్తావించలేదు కానీ, మాజీ భార్య గురించి పేర్కొన్నారు. ఈ ఆస్కార్స్ స్పీచ్‌లో పిల్లలతో పాటు మాజీ భార్య పేరు మర్చిపోయారు. ‘‘ఆస్కార్ వేదిక దిగిన మూడు సెకన్లకు నా ఫోన్ మోగింది. ‘మా గురించి చెప్పడం మర్చిపోయావ్. నా హార్ట్ ముక్కలైంది’ అని మా అబ్బాయి అన్నాడు’’ అని బ్యాక్ స్టేజిలో క్యాసే ఎఫ్లెక్ పేర్కొన్నారు. ఆస్కార్ అందుకున్న తొలి ముస్లిం ఇలాంటి పాత్రలకు బానిసను – ఉత్తమ సహాయ నటుడు మహేర్షలా అలీ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును అందుకున్న తొలి ముస్లిమ్ వ్యక్తిగా మహేర్షలా అలీ (43) చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ చిత్రం ‘మూన్ లైట్’లో ప్రదర్శించిన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా మహేర్షలా అలీకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ చిత్రంలో అలీ డ్రగ్ డీలర్ జువాన్ పాత్రలో ఒదిగిపోయారు. జెఫ్ బ్రిడ్జెస్, హెడ్జెస్, దేవ్ పటేల్, షానూన్ వంటి అగ్రనటులతో పోటీపడి అలీ ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. ‘లయన్’ చిత్రంతో సహాయ నటుడి విభాగంలో నిలిచిన భారత సంతతి నటుడు దేవ్ పటేల్‌కు నిరాశే ఎదురైంది. అవార్డు తీసుకున్న తర్వాత మహేర్షలా అలీ ఉద్వేగభరితమైన స్పీచ్ ఇచ్చారు. ‘‘మూన్ లైట్’ వంటి సినిమాల్లోని పాత్రలకు నేను బానిసను. ఈ చిత్రదర్శకుడు బెర్రిజెన్ కిన్స్కు థ్యాంక్స్. నటన నేర్చుకోవడంలో నాకు సహకరించిన టీచర్స్, ప్రొఫెసర్స్ అందరికీ ధన్యవాదాలు. ‘ఏ అవార్డు అయినా మనకు ఇచ్చినది కాదు. చిత్రంలోని పాత్రకు ఇచ్చినది’ అని వాళ్లు అనేవాళ్లు. నా ఫీలింగ్ కూడా అదే. నా భార్య సామి కరీమ్‌కు రుణపడి ఉంటాను’’ అన్నారు. 2013లో సామి కరీమ్‌తో మహేర్షల వివాహం జరిగింది. నాలుగు రోజుల క్రితమే కరీమ్ ఓ పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు భర్త ఆస్కార్ అందుకున్నారు. దీంతో మహేర్షల దంపతులు డబుల్ హ్యాపీ. ఆ సంగతలా ఉంచితే, వాస్తవానికి అలీ క్రిస్టియన్ అనీ, అయితే ఓ సందర్భంలో మసీదుకు వెళ్లి వచ్చిన తరువాత ముస్లిమ్‌గా మారారని సమాచారం. అతను అహ్మదీయుడు అనేది కొందరి వాదన. వాదించుకునేవాళ్లు వాదించుకుంటూనే ఉంటారు. ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేని మహేర్షలనిండు మనసుతో శుభాకాంక్షలు చెబుతున్నవాళ్లకు ధన్యవాదాలు తెలియజేయడంలోనూ, ఇప్పుడే తన జీవితంలోకి వచ్చిన పసి పాపను అపురూపంగా చూసుకోవడంలోనూ బిజీ అయ్యారు. లా లా.. లవ్‌లో పడ్డా – ఉత్తమ దర్శకుడు డామీన్ ఛాజెల్లె ఇప్పటివరకూ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్స్ అందుకున్న వ్యక్తుల్లో డామీన్ ఛాజెల్లె (‘లా లా ల్యాండ్’ దర్శకుడు) చిన్నోడిగా చరిత్ర సృష్టించారు. అతడి వయసు 32 ఏళ్లు. ఫస్ట్ టైమ్ ఆస్కార్ అందుకున్న డామీన్ మాట్లాడుతూ – ‘‘ప్రేమ గురించి చెప్పిన సినిమా ‘లా లా ల్యాండ్’. ఈ సినిమా తీస్తున్న టైమ్‌లోనే నేను ప్రేమలో పడడం నా అదృష్టం. దీనర్థం... నాతో పాటు నువ్వూ (డామీన్ ప్రేయసి ఒలీవియా హామిల్టన్) ఈ అవార్డును పంచుకున్నట్లే’’ అన్నారు. ఆ శరీరాలను తవ్వి బయటకు తీయాలి! – ఉత్తమ సహాయ నటి వయోలా డేవిస్ ‘‘మీకో విషయం తెలుసా? అత్యంత ప్రతిభావంతులందరూ కలిసుండే చోటు ఒకటుంది. అదే శ్మశానం’’ అంటూ కన్నీటి పర్యంతమవుతూ వయోలా డేవిస్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రచయిత ఆగస్ట్ విల్సన్ రాసిన ‘ఫెన్సెస్’ అనే కథ ఆధారంగా అదే పేరుతో రూపొందిన చిత్రంలో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను ఆమె ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నారు. 2005లో ఆగస్ట్ విల్సన్ చనిపోయారు. ఆయన రాసిన కథలోని పాత్ర తనకు అవార్డు తెచ్చిపెట్టినందుకుగాను ఆస్కార్ వేదికపై వయోలా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. ఇంకా వయోలా మాట్లాడుతూ – ‘‘నువ్వు ఎలాంటి కథలు చెప్పాలనుకుంటావ్? అని కొంతమంది నన్ను అడుగుతుంటారు. ‘తవ్వి, పాతిపెట్టిన ఆ శరీరాలను బయటకు తీయాలి. ఆ మనుషుల కథలను తెలుసుకోవాలి. పెద్ద పెద్ద కలలు కని, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడి, ఫలాలు అందుకోని ఆ వ్యక్తుల కథలు చెప్పాలనిపిస్తుంది’ అంటుంటాను’ అన్నారు. ఆగస్ట్ విల్సన్ వంటి ప్రతిభావంతుల మరణాన్ని ఉద్దేశించే ఆమె ఇంత ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘నేను ఆర్టిస్టును అయ్యాను. అందుకు దేవుడికి రుణపడి ఉంటాను. సెలబ్రిటీల హోదాలో బ్రతికేందుకు ఇదొక మంచి ప్రొఫెషన్. ఎలా జీవించాలో, ఎలా ప్రేమించాలో ప్రతి రోజూ.. నాకు నేర్పే నా భర్త , నా కూతురికి రుణపడి ఉంటాను. డైరెక్టర్ డెంజెల్ వాషింగ్టన్కు ధ్యాంక్స్’’ అని వయోలా డేవిస్ అన్నారు. మూడు సార్లు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన, తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న అమెరికన్– అఫ్రికన్ వుమెన్‌గా వయోలా రికార్డ్ సాధించారు. తప్పు తప్పే.. శుద్ధ తప్పే! ఏం జరిగింది? ఓ చిత్రం పేరుకు బదులు మరో చిత్రం పేరును చదివారు. చెప్పుకోవడానికి చిన్న తప్పే! కానీ, ఏదో పొరపాటు జరిగిందని సర్దిచెప్పుకోవడానికి వీలు లేని తప్పు జరిగింది. ఈ తప్పే కాదు.. ఇంకో శుద్ధ తప్పు కూడా జరిగింది. ఈ ఏడాది జరిగిన 89వ ఆస్కార్స్‌లో ‘మూన్లైట్’ ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. కానీ, ‘మూన్లైట్’ పేరు ప్రకటించిన తీరు మాత్రం సూపర్‌హిట్ సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. అసలు ఏం జరిగిందంటే... జోక్ కాదు.. నిజమే! క్లాసిక్ ఫిల్మ్ ‘బోనీ అండ్ క్లయిడే’ విడుదలై 50 ఏళ్లైంది. ఈ సందర్భంగా అందులోని స్టార్స్ వారెన్ బీట్టీ, ఫాయే డన్ అవేలను 89వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రం పేరును ప్రకటించమని వేదికపైకి పంపారు. వాళ్లు ‘లా లా ల్యాండ్’ పేరును ప్రకటించారు. ఒక్కసారిగా హర్షాతిరేకాలు.. కరతాళ ధ్వనులు.. ‘లా లా ల్యాండ్’ చిత్ర బృందం అవార్డును స్వీకరించడానికి వేదికపైకి చేరుకుంది. యాక్సెప్టెన్స్ స్పీచ్‌లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇంతలో, ‘లా లా ల్యాండ్’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జోర్డాన్ హోరోవిట్జ్ మైక్ అందుకుని... ‘‘ఉత్తమ చిత్రం కేటగిరీ విజేత ‘మూన్లైట్’. దిస్ ఈజ్ నాట్ ఎ జోక్’’ అంటూ అవార్డు కార్డును అందరికీ చూపించారు. ఒక్కసారిగా వేదికపై ఉన్న మిగతా చిత్ర బృందంలో ఆనందం ఆవిరైంది. ఆ వెంటనే వారంతా వేదికను ఖాళీ చేశారు. తర్వాత ‘మూన్లైట్’ చిత్ర బృందం అవార్డును అందుకుంది. ‘లా లా ల్యాండ్’ సినిమా క్లైమాక్స్‌లో ఒక్క క్షణం హీరో హీరోయిన్ కలుసుకున్నట్టు చూపిస్తారు. కట్ చేస్తే... హీరోయిన్ మరొకర్ని పెళ్లి చేసుకుంటుంది. థియేటర్లో ప్రేక్షకులు అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అనుకుంటారు. ఆస్కార్స్ వేదికపై జరిగిన ఘటన చూశాక.. మళ్లీ సేమ్ ఫీలింగ్ కలగక మానదు. (ఆస్కార్-2017: ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తప్పే.. క్షమించండి! ఆస్కార్స్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటనపై ప్రైజ్ వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) క్షమాపణలు కోరింది. 83 ఏళ్లుగా ఆస్కార్స్ బ్యాలెట్ కౌంటింగ్‌ను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. ‘‘ఉత్తమ చిత్రం పేరును ప్రకటించే సమయంలో జరిగిన తప్పుకి అందరికీ క్షమాపణ చెబుతున్నాం’’ అని పీడబ్ల్యూసీ సంస్థ పేర్కొంది. ప్రెజెంటర్స్కు రాంగ్ కవర్ ఇవ్వడంతో ఈ తప్పు జరిగిందట! ఇంకొకరి బాధలో ఆనందం ఎక్కడుంది? ఆస్కార్స్ వేదికపై జరిగిన ఘటన పట్ల మహేర్షలా అలీ స్పందిస్తూ – ‘‘ఉత్తమ చిత్రంగా ‘లా లా ల్యాండ్’ పేరు ప్రకటించగానే నేనేమీ సర్ప్రైజ్ కాలేదు. ఆ సినిమా బాగుంది, బాగా ఆడింది. వాళ్లు వేదికపై ఉన్నప్పుడు సెక్యూరిటీ, ఇతరులు వచ్చి డిస్ట్రబ్ చేస్తుంటే వర్రీ అయ్యాను. అప్పుడు ‘మూన్లైట్’ పేరు ప్రకటించగానే వేదికపైకి వెళ్లాలనుకోలేదు. అలాంటి సందర్భంలో ఆనందపడడం చాలా కష్టం. కానీ, అదృష్టవశాత్తూ మేము ఉత్తమ చిత్రం పురస్కారంతో బయటకు నడిచాం’’ అన్నారు. ఎమ్మా స్టోన్ (ఉత్తమ నటి, ‘లా లా ల్యాండ్’) మాట్లాడుతూ –‘‘ఓ గాడ్, ఐ లవ్ ‘మూన్లైట్’ సోమచ్. అఫ్కోర్స్, ‘లా లా ల్యాండ్’ పేరు ఉత్తమ చిత్రంగా వినడం అద్భుతంగా ఉంది. ‘మూన్లైట్’ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు. బతికి ఉన్న మనిషిని చంపేశారు! బతికి ఉన్న మనుషులకు నివాళులు అర్పిస్తారా? అలా చేస్తే బతికున్నవాళ్ల ఫీలింగ్ ఏంటి? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ‘జాన్ చాప్మాన్’ని అడిగితే చెబుతారు. ఎవరీ జాన్ చాప్మాన్ అంటే? ఈవిడ ఆస్ట్రేలియన్ ఫిలిం ప్రొడ్యూసర్. ‘ది పియానో’, ‘లవ్ సెరనేడ్’, ‘హోలీ స్మోక్’ వంటి పలు చిత్రాలు నిర్మించారు. వయసు 66. మంచి ఆరోగ్యంతో హాయిగా ఉన్నారు. కానీ, గతేడాది తిరిగి రాని లోకాలకు వెళ్లిన ప్రముఖులకు నివాళులర్పించే కార్యక్రమంలో ఆస్కార్ అవార్డు కమిటీ జాన్ చాప్మాన్ ఫొటోను చూపించింది. గతేడాది చనిపోయిన కాస్ట్యూమ్ డిజైనర్ ‘జానెట్ ప్యాటర్సన్’కి నివాళులర్పిస్తూ, ఆమె ఫొటోకు బదులుగా చాప్మాన్ ఫొటోను చూపించారు. దాంతో ‘నేను బతికే ఉన్నాను. బాగున్నాను కూడా. నిర్మాతగా యాక్టివ్‌గా ఉన్నాను’ అని చాప్మాన్ చెప్పుకోవాల్సి వచ్చింది. జానెట్ ప్యాటర్సన్తో కలసి తాను సినిమాలు చేశానని, ఆమె మంచి స్నేహితురాలని కూడా చాప్మాన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అనిపించుకున్న ఆస్కార్ అవార్డు లాంటి భారీ వేడుకలో ఇలాంటి తప్పులు జరగడం నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణిని బయటపెట్టింది. అదృష్టం.. అవకాశం కలిసొస్తేనే... – ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఎమ్మా స్టోన్.. ఆస్కార్స్‌కి నామినేట్ అయిన సహచర నటీమణులపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, ఫ్యామిలీకి థ్యాంక్స్ చెబుతూ స్పీచ్ ప్రారంభించారు. ‘‘అదృష్టం, అవకాశం బాగా కలిసొచ్చినప్పుడే ఇలాంటి సందర్భం వస్తుందని నాకు అర్థమైంది. జీవితంలో ఒక్కసారే ‘లా లా ల్యాండ్’ వంటి సినిమాలో నటించే ఛాన్స్ వస్తుంది. నాపై నమ్మకంతో ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు డామీన్ ఛాజెల్లెకు థ్యాంక్స్. ప్రతిసారీ, ప్రతి సన్నివేశంలో నేను బాగా నటించేలా సహకరించిన ర్యాన్ గోస్లింగ్కి థ్యాంక్స్. నేనింకా నేర్చుకోవలసింది ఎంతో ఉంది’’ అన్నారు. ఓంపురికి ఆస్కార్ నివాళి ప్రతి ఆస్కార్ వేడుకలోనూ గడచిన 12 నెలల్లో స్వర్గస్తులైన సినీ ప్రముఖులకు నివాళులు అర్పించడం అనవాయితీ. అందులో భాగంగా భారతీయ నటుడు ఓంపురికి నివాళులర్పించారు. ‘సిటీ ఆఫ్ జాయ్’, ‘వోల్ఫ్’, ‘ద ఘోస్ట్ అండ్ ద డార్క్నెస్’, ‘సచ్ ఎ లాంగ్ జర్నీ’, ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’లతో పాటు మరికొన్ని ఇంగ్లీష్ చిత్రాల్లో ఓంపురి నటించారు. ఆయన నటించిన చివరి ఇంగ్లీష్ చిత్రం ‘వైశ్రాయస్ హౌస్’ ఈ నెల 12న బెర్లిన్‌లో విడుదలైంది. మార్చి 3న యూకేలో విడుదల కానుంది. ‘‘25 ఏళ్ల నుంచి వరుసగా హాలీవుడ్, బ్రిటీష్ సినిమాల్లో నటిస్తున్న ఏకైక నటుడు ఓంపురి. ఈరోజు ఆస్కార్స్ ఆయనకు నివాళులు అర్పించింది. ఆస్కార్స్ నివాళులు అందుకున్న తొలి భారతీయ నటుడు ఓంపురీనే. థ్యాంక్యూ అకాడెమీ అవార్డ్స్. థ్యాంక్యూ ఎవ్రీవన్. వుయ్ మిస్ ఓం’’ అని ఓంపురి ఫ్యామిలీ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశీ గాళ్స్ హంగామా విదేశీ తారలకు ధీటుగా ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో పాల్గొని, రెడ్ కార్పెట్‌పై నడవడం అంత వీజీ కాదు.. దానికి చాలా ఖలేజా ఉండాలి. మన దేశీ భామ ప్రియాంకా చోప్రా తన దమ్మేంటో గతేడాది ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొన్నప్పుడు నిరూపించుకున్నారు. వైట్ గౌన్, లైట్ మేకప్, డైమండ్ జ్యుయెలరీలో ఆమె మెరిసిపోయారు. ఈసారి కూడా విదేశీయుల దగ్గర మార్కులు కొట్టేశారు. మరో భామ దీపికా పదుకొనే కూడా సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ‘ఆఫ్టర్ పార్టీ’ (అవార్డు వేడుక ముగిసిన తర్వాత జరిగే పార్టీ)లో దీపికా పదుకొనే పాల్గొన్నారు. నలుపు రంగు గౌనులో ‘వెరీ నైస్’ అనిపించుకున్నారు. మన దేశీ భామలా... మజాకానా! వయ్యారి భామ.. నీ హంస నడక... 16,500 చదరపు అడుగుల ఎర్ర తివాచీ అది. పదహారణాల తెలుగమ్మాయిలు నడిస్తేనేమి... పరాయి దేశపు భామలు నడిస్తేనేమి... చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసినా.. ఇంకా ఏదో ‘మిస్’ అయ్యామని మగ మనసులు బాధపడిపోతాయ్. వచ్చినవాళ్లు వచ్చినట్లు వయ్యారంగా వాక్ చేసుకుంటూ వెళుతుంటే చూసేకొద్దీ చూడబుద్ధేస్తోందంటూ ఆ మనసులు గారాలు పోయాయి. భారీ రెడ్ కార్పెట్ పై భామలు అడుగులో అడుగేస్తూ, ఆకట్టుకున్నారు. ప్రతి ఏడాదీ రెడ్ కార్పెట్ ఈవెంట్ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచినట్లే ఈ ఏడాది కూడా నిలిచింది. చీరకట్టు @ రెడ్ కార్పెట్టు భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం చీరకట్టు. ఆ చీరకట్టు 89వ ఆస్కార్ వేడుకల్లో వీక్షకులతో పాటు సినీ ప్రముఖుల కళ్లను కట్టిపడేసింది. ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో నామినేట్ అయిన దేవ్ పటేల్.. తన తల్లి అనితా పటేల్‌తో కలసి ఆస్కార్ వేడుకలకు హాజరయ్యారు. చీరకట్టులో భారతీయ హుందాతనం చూపించిన అనితా పటేల్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ‘‘దేవ్ పటేల్‌కి ఆస్కార్ రాకున్నా.. 26 ఏళ్లకు నామినేషన్ దక్కడం అద్భుతమైన విషయం. ఆ లెక్కన దేవ్ విన్నరే. ఇంత త్వరగా దేవ్‌కి ఆస్కార్ నామినేషన్ వస్తుందని ఊహించలేదు’’ అని అనితా పటేల్ పేర్కొన్నారు. -
ద బ్లాక్ అండ్ వైట్ షో!
• ఆస్కార్స్ 2017 యుద్ధం... రంగు రాజేసిన మాటల యుద్ధం... ఎరుపెక్కిన కళ్లతో నల్లగొంతు సంధించిన బాణం! ఆ బాణం... గతేడాది తెలుపెక్కిన ఆస్కార్స్ షోకి సూటిగా తగిలిందా?! 89వ ఆస్కార్ అవార్డుల (ఈ ఏడాది) నామినేషన్లను పరిశీలిస్తే ఆ అంశం స్పష్టమవుతోంది. కులమతాలు, ప్రాంతాలకు అతీతమైనది కళ. ముఖానికి రంగేసుకునే కళాకారులకు కుల, మత, ప్రాంతీయ రంగులు అద్దకూడదని అందరూ చెప్పేమాట! కానీ, దురదృష్టవశాత్తూ గతేడాది ఆస్కార్ అవార్డులకు జాతి రంగు అంటుకుంది. 88వ ఆస్కార్ అవార్డుల నామినేషన్లలో నల్ల జాతీయుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడంతో నల్ల జాతీయులపై వివక్ష చూపించారనే అంశం తెరపైకి వచ్చింది. ‘ఆస్కార్స్ ఆర్ సో వైట్’ అనే విమర్శలు వినిపించాయి. అయితే ఈసారి నామినేషన్లను పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ ‘ఆస్కార్స్ 2017... ద బ్లాక్ అండ్ వైట్ షో’ అంటారు. ఆస్కార్ ల్యాండ్‌లో లా..లా... ఆస్కార్ చరిత్రలో అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న చిత్రాలుగా ‘ఆల్ అబౌట్ ఈవ్’ (1950), ‘టైటానిక్’ (1997) చిత్రాలు నిలిచాయి. ఇవి 14 నామినేషన్లు దక్కించుకున్నాయి. ఈ ఏడాది 14 నామినేషన్లతో ‘లా లా ల్యాండ్’ వాటి సరసన నిలిచింది. ఇప్పటికే ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను తన ఖాతాలో వేసుకుందీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా. ఇరవైలో ఏడుగురు నలుపే! గతేడాది చెలరేగిన నలుపు–తెలుపు జాతి వివక్ష కంచెను తెంచి ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకున్న మూడు చిత్రాలు... ‘ఫెన్సెస్’, ‘హిడెన్ ఫిగర్స్’, ‘మూన్లైట్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మూడు చిత్రాలూ అమెరికాలో నల్లజాతీయుల జీవితాల గురించి చర్చించినవే. మూడింటికీ ఉత్తమ చిత్రం కేటగిరీలో నామినేషన్ దక్కింది. మరో విశేషం ఏంటంటే... మూడు చిత్రాల్లోని మహిళా తారలు వయోలా డేవిస్, నోమీ హ్యారీస్, ఆక్టివా స్పెన్సర్లకు ఉత్తమ సహాయనటి కేటగిరీలో నామినేషన్లు దక్కాయి. ‘ఫెన్సెస్’లో హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించిన డెంజెల్ వాషింగ్టన్‌కి ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్ ఎప్పటికీ గుర్తుంటాయి. ఆ చిత్రానికి నాలుగు నామినేషన్లు దక్కాయి. ముఖ్యంగా ఉత్తమ నటుడిగానూ ఆయన పోటీలో నిలిచారు. ‘మూన్లైట్’లో నటుడు మహర్షాలా అలీకి ఉత్తమ సహాయ నటుడిగా నామినేషన్ దక్కింది. దేవ్ పటేల్ (ఉత్తమ సహాయ నటుడు – లయన్), రూత్ నెగ్గా (ఉత్తమ నటి –లవింగ్)... మొత్తం మీద ఉత్తమ నటీనటుల కేటగిరీ ఇరవైమందిలో ఏడుగురు నల్ల జాతీయులున్నారు. ఇక, నలుపు–తెలుపు వివక్షను పక్కనపెట్టి సినిమాల పరంగా చూసుకుంటే... ‘అరైవల్’, ‘మూన్లైట్’ చిత్రాలకు ఎనిమిదేసి, ‘హక్సారిడ్జ్’, ‘లయన్’, ‘మాంచెస్టర్స్ బై ద సీ’ చిత్రాలకు ఆరేసి, ‘హెల్ ఆర్ హై వాటర్’ చిత్రానికి 4 నామినేషన్లు దక్కాయి. మెరిల్ 20వ సారి... డెంజెల్ 7వ సారి.. ‘ఫ్లోరెన్సీ ఫోస్టర్ జెనిక్స్’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నామినేట్ అయిన మెరిల్ స్ట్రీప్, ఆస్కార్ అవార్డుల బరిలో నామినేషన్ దక్కించు కోవడం ఇది 20వసారి. ఇదీ ఓ రికార్డే. గతంలో ‘క్రెమర్ వర్సెస్ క్రెమర్’ (1980), ‘సోఫీస్ చాయిస్’ (1983), ‘ద ఐరన్ లేడీ’ (2012) చిత్రాల్లో ఆమె నటనకు ఆస్కార్ ఫిదా అయింది. మరి, నాలుగోసారి 67 ఏళ్ల ఈ నటికి ఆస్కార్ వస్తుందో? లేదో? చూడాలి. ఆస్కార్స్ నామినేషన్స్ చరిత్రలో అత్యధికసార్లు నామినేట్ అయిన నల్ల జాతీయుడుగా డెంజెల్ వాషింగ్టన్ రికార్డు దక్కించుకున్నారు. మొత్తం ఏడుసార్లు నామినేట్ కాగా, ‘గ్లోరీ’ (1989)కి ఉత్తమ సహాయ నటుడిగా, ‘ట్రైనింగ్ డే’ (2001)కి ఉత్తమ నటుడిగా... రెండుసార్లు ఆస్కార్ బొమ్మని ఇంటికి తీసుకువెళ్లారు. మూడోసారి ఆస్కార్ అందుకుంటారా? లేదా? వెయిట్ అండ్ సీ! రెహమాన్ లేడు... దేవ్ పటేల్ ఉన్నాడు ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’తో డబుల్ ఆస్కార్‌ని ముద్దాడిన ఏఆర్ రెహమాన్ ఈసారి ‘పీలే: బర్త్ ఆఫ్ ఎ లెజెండ్’ చిత్రానికిగాను ఆస్కార్ రేసులో ‘ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్’, ‘ఒరిజినల్ సాంగ్’ విభాగాల్లో పోటీపడ్డారు. రెండిటిలోనూ ఆయనకి నామినేషన్ దక్కలేదు. అయితే... ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’లో నటించిన భారత సంతతి నటుడు దేవ్ పటేల్‌కి తొలిసారి నామినేషన్ లభించింది. ‘లయన్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో పోటీపడుతున్నారు. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో పోటీపడిన రేఖారాణా ‘యాహా అమీనా బిక్తీ హై’ చిత్రానికీ నామినేషన్ దక్కలేదు. ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లు దక్కించుకున్న నల్లజాతి నటీనటులు, సాంకేతిక నిపుణులకు గతేడాది చెలరేగిన వివాదం ఏమాత్రమూ సహాయపడిందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే... గతంలో కొందరు ఆస్కార్ బరిలో నిలిచి, అవార్డులు గెలిచినవారే. ఫిబ్రవరి 26న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. -
ఆస్కార్ రేసు నుంచి మన సినిమా అవుట్
ఈ ఏడాది విశ్వ సినీ వేదిక మీద మన సినిమా సత్తా చాటుతుందని భావించిన సినీ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ పోటిలో సత్తా చాటుతుందని భావించిన తమిళ సినిమా విసారణై చివరి రౌండ్ కన్నా ముందే పోటి నుంచి తప్పుకుంది. ఆస్కార్ బరిలో భారత్ తరుపున నామినేషన్ సాధించటంతో పాటు, అవార్డు కోసం ఎంపిక చేసిన 29 చిత్రాల జాబితాలో కూడా విసారణైకి స్థానం తగ్గటంతో.., ఈ సారి విశ్వసినీ వేదిక మీద భారతీయ సినిమా సగర్వంగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు సినీ జనాలు. అయితే ఫైనల్ రౌండ్ కోసం ఎంపిక చేసిన 9 చిత్రాల్లో విసారణైకి స్థానం దక్కలేదు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నిర్మాతగా వెట్రీమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడింది. విసారణై వెనక్కు వచ్చినా భారతీయులకు ఆస్కార్ ఆశలు ఇంకా ఉన్నాయి. ఇప్పటికే రెండు ఆస్కార్ అవార్డులు సాధించిన ఏఆర్ రెహమాన్, ఈ సారి కూడా రెండు విభాగాల్లో పోటి పడుతున్నాడు. పీలే చిత్రానికి గాను ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో బరిలో ఉన్నాడు రెహమాన్. -
‘అమ్మా బొమ్మాళీ’ నటుడికి చైనాలో..
‘అమ్మా బొమ్మాళీ’ అంటూ అరుంధతి సినిమాలో పశుపతిగా అద్భుతంగా నటించిన సోనూ సూద్‌కు చైనాలో అరుదైన గౌరవం దక్కింది. ఆయన నటించిన చారిత్రక పోరాటగాథ ‘.జవాన్ఝంగ్’ సినిమా చైనా తరఫున అధికారిక ఎంట్రీగా 89వ ఆస్కార్ పురస్కారోత్సవాల్లో పోటీపడనుంది. తెలుగులో, హిందీలో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సోనూ ‘జవాన్ఝంగ్’ సినిమాతో చైనా చిత్రపరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమాలో హర్ష అనే పాత్రను సోనూ పోషించాడు. తాను ప్రధాన పాత్రలో నటించిన సినిమా చైనా తరఫున అధికారికంగా ఆస్కార్‌కు వెళుతున్న విషయాన్ని ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఆస్కార్ వేడుకల్లో తమ చిత్రం ఈ అవార్డు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు హువో జియాంకి తెరకెక్కించిన ఈ సినిమాలో భారతీయ నటులు నేహా శర్మ, అలీ ఫజల్ తదితరులు నటించారు. అదేవిధంగా జాకీ చాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ’కుంగ్ఫు యోగ’ సినిమాలోనూ సోనూ సూద్ నటిస్తున్నాడు. చైనా అధ్యక్షుడు జింపింగ్ భారత పర్యటన సందర్భంగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా భారత్-చైనా ఉమ్మడిగా తెరకెక్కిస్తున్న మూడో చిత్రాల్లో ‘కుంగ్ ఫు చైనా’ ఒకటి కావడం గమనార్హం. -
చెప్పుకోదగ్గ పని
పిల్లలు అంటే... వెన్నెల్లో అందమైన ఆటలు.పిల్లలు అంటే.... ముద్దు ముద్దు ముచ్చట్లు.పిల్లలు అంటే... ఇంటిపై వెలిగే ఇంద్రచాపాలు.అయితే పిల్లలంటే... ఇప్పుడు పసితనం మాత్రమే కాదు... పరుల కోసం ఆలోచించడం కూడా. వారికి తమ పరిధిలో సేవ చేయడం కూడా. పిల్లలకు చదివే లోకం. అయితే వారు ఆ లోకానికే పరిమితమైపోవడం లేదు. ఆ లోకం నుంచి మరో లోకంలోకి చూస్తున్నారు. తమలాంటి పిల్లల గురించి ఆలోచిస్తున్నారు.పొద్దుట, సాయంత్ర వేళల్లో ‘ఎక్స్‌వెజైడ్’ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఐదు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వయసు ఉన్న వంద మంది పిల్లలు ముంబైలోని ఇరవైకి పైగా కాలనీలు తిరిగి పన్నెండు వేలకు పైగా చెప్పుల జతలను సేకరించి... ‘హమారా ఫుట్‌పాత్’ ‘గూంజ్’ ‘ఏంజెల్’ ‘ఆస్కార్’... మొదలైన ఫౌండేషన్లకు ఇచ్చారు. ‘‘స్కూలుకు వెళ్లే చాలామంది పేద పిల్లలకు కాళ్లకు చెప్పులు ఉండవు. అలాంటి పిల్లలకు చెప్పులు సమకూర్చడానికి పిల్లలందరూ కదిలారు. దీనివల్ల రెండు మంచి పనులు జరుగుతాయి. ఒకటి... పేద పిల్లలకు సహాయపడటం. రెండు... వారిలో మానవతాదృక్పథం పెరగడం. ఇప్పుడు ఏర్పడిన పునాది మీద వారు సమాజానికి ఉపయోగపడే ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలరు’’ అంటున్నాడు ఎక్స్‌వెజైడ్ వ్యవస్థాకుడు హుషాంగ్ గొట్టె. కేవలం చెప్పుల జతల సేకరణ మాత్రమే కాదు.... రకరకాల కాలనీలు తిరిగి చందాలు వసూలు చేసి ఆ సొమ్మును పేద విద్యార్థుల కోసం వెచ్చిస్తున్నారు. ‘‘కాళ్లకు చెప్పులు లేని పేదలు ఒక పక్క... చెప్పులు పాత పడకుండానే... కొత్తవి కొనేవారు ఇంకో పక్క. పాత చెప్పులను అలా మూలకు పడేసే బదులు వాటిని పేదలకు ఇవ్వడం ద్వారా వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చినట్లు ఉంటుంది. మనసుకు తృప్తి మిగులుతుంది. ధనవంతుల ఇళ్లలోనే కాదు... మధ్యతరగతి ఇళ్లలో కూడా ఒకటి రెండు ఎక్స్ట్రా చెప్పుల జతలు ఉంటున్నాయి’’ అంటున్నారు గొట్టె.పదమూడు సంవత్సరాల రియాన్ కర్బాయి ఎన్నోసార్లు చెప్పుల సేకరణకు వెళ్లాడు. అయితే కొద్దిమంది మాత్రం ప్రతికూలంగా స్పందించారు. అంతమాత్రాన... రియాన్ బాధపడి వెనక్కు తగ్గలేదు. తన ముద్దు మాటలతో వారిలో మార్పు వచ్చేలా చేశాడు. ఇలాంటి పిల్లలు ‘ఎక్స్‌వెజైడ్’లో ఎంతోమంది ఉన్నారు.కొత్త చెప్పుల జత పాతబడకుండానే... కొత్త చెప్పులు కొనమని మారాం చేసేవాడు రియాన్. అలాంటి రియాన్... ఇప్పుడు తన చెప్పుల గురించి ఆలోచించకుండా చెప్పులు లేని పేద పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు.‘‘మా పిల్లాడిలో నాయకత్వ లక్షణాలు పెరగడం గమనించాను’’ అని సంతోషంగా చెబుతుంది రియాన్ తల్లి నాజ్నీన్.‘‘రకరకాల వ్యక్తులతో, రకరకాల వయసు వారితో మాట్లాడడం వల్ల తమదైన దృక్పథం ఏర్చర్చుకునే అవకాశం ఏర్పడుతుంది’’ అంటున్నారు నాజ్నీన్.‘ఎక్స్‌వెజైడ్’ సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ మరింత పెరగడమే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతున్నాయి.పదమూడు సంవత్సరాల పక్జిన్ తాను డ్రైవ్‌లో పాల్గొనడమే కాదు... స్కూల్లో తన ఫ్రెండ్స్ ఆసక్తి చూపేలా ప్రయత్నిస్తోంది. ‘‘మంచి పని చేస్తున్నావు... అని టీచర్లు, తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది’’ అంటుంది పక్జిన్.కొందరు పిల్లలు అయితే... తమ పాకెట్ మనీని కూడా పేద పిల్లల అవసరాల కోసం వినియోగిస్తున్నారు. దాతల పేర్లను పార్శీ కమ్యూనిటి న్యూస్‌పేపర్ ‘పార్శీ టైమ్’లో ప్రచురించడం ద్వారా ఇతరులలో ప్రేరణ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు పిల్లలు ‘షూ డొనేట్’పై ఆకర్షణీయమైన పోస్టర్లు రూపొందిస్తున్నారు.మరికొందరు తమ సేవాకార్యక్రమాలకు వేదికగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. దాతల నుంచి మంచి స్పందన ఉంది. అయితే సేకరించిన చెప్పులను స్టోర్ చేయడమే కష్టంగా మారింది. దీంతో మరో గోడౌన్‌ను అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది. ‘‘సేవ గురించి పాఠ్య పుస్తకాల్లోనో, ఇతర పుస్తకాల్లోనో చదువుకోవడం వేరు. స్వయంగా అందులో భాగం కావడం వేరు. దీనివల్ల సేవాగుణంలో ఉన్న తృప్తి స్వయంగా గ్రహించగలుగుతారు’’ అంటున్నాడు అంధేరీలోని ఒక రిటైర్డ్ ఉద్యోగి.చెప్పుల జతలను సేకరించడం, అవసరం ఉన్నవారికి వాటిని పంచడం... అనేది ప్రస్తుతానికైతే ‘ఎక్స్‌వెజైడ్’ ముఖ్యకార్యక్రమం కావచ్చుగానీ... భవిష్యత్‌లో మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలనుకుంటారు. వారు మరిన్ని మంచిపనులు చేయాలని ఆశిద్దాం. -
జాకీచాన్‌కు గౌరవ ఆస్కార్
యాక్షన్ మూవీ హీరో, రచయిత, దర్శకుడు, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు అయిన జాకీచాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ సినిమాకు ఆయన చేస్తున్న సేవలకు, ఆయన సాధించిన విజయాలకు గాను గౌరవ ఆస్కార్‌ను అందించాలని ఆస్కార్ జ్యూరీ నిర్ణయించింది. జాకీతో పాటు ఎడిటర్ అన్నేకోట్స్, కాస్టింగ్ డైరెక్టర్ లెన్ స్టేల్మాస్టర్, డాక్యుమెంటరీ దర్శకుడు ఫ్రెడ్రిక్ వైజ్మన్లను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. నవంబర్‌లో జరగనున్న ఆస్కార్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ నలుగురికి అవార్డు ప్రధానం జరుగనుంది. ప్రస్తుతం జాకీచాన్ ఇండో చైనీస్ సినిమాగా తెరకెక్కుతున్న కుంగ్ ఫూ యోగా సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సోనూసూద్, దిశాపటాని లాంటి భారతీయ నటీనటులు కూడా నటిస్తుండగా, పలువును ఇండియన్ టెక్నిషియన్స్ కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.