ఆస్కార్‌ అదరహో | Oscar Piastri ranks thrilling victory at Azerbaijan GP as best win of career | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ అదరహో

Published Mon, Sep 16 2024 1:38 PM | Last Updated on Mon, Sep 16 2024 1:38 PM

Oscar Piastri ranks thrilling victory at Azerbaijan GP as best win of career

 అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రిలో టైటిల్‌ సొంతం

 మెక్‌లారెన్‌ జట్టు డ్రైవర్‌కు సీజన్‌లోరెండో విజయం

 వరుసగా నాలుగో ఏడాదీ లెక్‌లెర్క్‌కు దక్కని అగ్రస్థానం

బాకు (అజర్‌బైజాన్‌): వరుసగా నాలుగో ఏడాది క్వాలిఫయింగ్‌లో మెరిపించిన ఫెరారీ జట్టు డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ ప్రధాన రేసులో మాత్రం తడబడ్డాడు. ఆదివారం జరిగిన సీజన్‌లోని 17వ రేసు అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రిలో మెక్‌లారెన్‌ జట్టు డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రి విజేతగా నిలిచాడు. నిరీ్ణత 51 ల్యాప్‌లను ఆస్కార్‌ అందరికంటే వేగంగా 1 గంట 32 నిమిషాల 58.007 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

ఆ్రస్టేలియాకు చెందిన 23 ఏళ్ల ఆస్కార్‌కు ఈ సీజన్‌లో ఇది రెండో విజయం. హంగేరి గ్రాండ్‌ప్రిలోనూ ఆస్కార్‌ విజేతగా నిలిచాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును మొదలుపెట్టిన లెక్‌లెర్క్‌ 1 గంట 33 నిమిషాల 08.917 సెకన్ల సమయంతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 20వ ల్యాప్‌లో అప్పటి వరకు నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న లెక్‌లెర్క్‌ను ఆస్కార్‌ పియాస్ట్రి ఓవర్‌టేక్‌ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. 

ఈ ఆధిక్యాన్ని చివరి వరకు ఆస్కార్‌ నిలబెట్టుకొని తన కెరీర్‌లో రెండో విజయాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ జార్జి రసెల్‌కు మూడో స్థానంలో, మెక్‌లారెన్‌ జట్టు డ్రైవర్‌ లాండో నోరిస్‌కు నాలుగో స్థానంలో, ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) ఐదో స్థానంలో నిలిచారు. వీసా క్యాష్‌ యాప్‌ జట్టుకు చెందిన యుకీ సునోడా రేసును పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. 24 రేసుల ఫార్ములావన్‌ సీజన్‌లో 17 రేసులు ముగిశాక మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ 313 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని 18వ రేసు సింగపూర్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 22న జరుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement