australian
-
మూడో ప్రపంచయుద్ధం ముంచుకొస్తోంది: భయపెడుతున్న బిషప్ భవిష్యవాణి
కాన్బెర్రా: మూడో ప్రపంచయుద్ధ భయాలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. ఇరాన్, సిరియా, హమాస్, హిజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడైనా భీకర యుద్ధం జరగబోతోందనే భయం అందరిలో నెలకొంది. మరోవైపు చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు ఆసియా ఖండంలో అశాంతిని మరింతగా పెంచుతున్నాయి.ప్రపంచంలోని పలు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇతర దేశాలలో తీవ్ర ఆందోళనను సృష్టిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియన్ బిషప్ చెప్పిన భవిష్యవాణి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన బిషప్ మార్ మేరీ ఇమ్మాన్యుయేల్ మూడవ ప్రపంచ యుద్ధం భారీ బీభత్సాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నాడు. ఈ యుద్ధంలో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతారని, బతికిన వారు తర్వాత పశ్చాత్తాప పడతారని బిషప్ పేర్కొన్నారు. ఈయన తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో మానవాళికి ఎదురయ్యే చీకటి భవిష్యత్తును తాను ఊహించినట్లు పేర్కొన్నారు. A prophecy of world War 3.Almost one third of the population will perish.It will be the most disastorous , times of humanity. pic.twitter.com/om9PIia9BH— M. O. G. Bishop mar mari Emmanuel (@Bishopmurmuri) November 24, 2024బిషప్ మార్ మేరి ఇమ్మాన్యుయేల్ తన వీడియో సందేశంలో మూడవ ప్రపంచ యుద్ధం భారీ విధ్వంసాన్ని తెస్తుందని హెచ్చరించారు. ఈ యుద్ధంలో ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది కనుమరుగవుతారని, మిగిలిన మూడింట రెండొంతుల మంది తాము ఇక పుట్టకూడదని కోరుకుంటారని తెలిపారు. ఈ యుద్ధంలో అణ్వాయుధాలను వినియోగిస్తారని పేర్కొన్నారు. భవిష్యత్ గురించి బిషప్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాబా వెంగా, నోస్ట్రాడామస్ తదితర ప్రపంచ ప్రసిద్ధ భవిష్యవాణివేత్తలు కూడా ఇదే విధమైన విషయాలను వెల్లడించారు.ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత -
ఆస్కార్ అదరహో
బాకు (అజర్బైజాన్): వరుసగా నాలుగో ఏడాది క్వాలిఫయింగ్‌లో మెరిపించిన ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ప్రధాన రేసులో మాత్రం తడబడ్డాడు. ఆదివారం జరిగిన సీజన్‌లోని 17వ రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి విజేతగా నిలిచాడు. నిరీ్ణత 51 ల్యాప్‌లను ఆస్కార్ అందరికంటే వేగంగా 1 గంట 32 నిమిషాల 58.007 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆ్రస్టేలియాకు చెందిన 23 ఏళ్ల ఆస్కార్‌కు ఈ సీజన్లో ఇది రెండో విజయం. హంగేరి గ్రాండ్‌ప్రిలోనూ ఆస్కార్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన లెక్లెర్క్ 1 గంట 33 నిమిషాల 08.917 సెకన్ల సమయంతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 20వ ల్యాప్‌లో అప్పటి వరకు నంబర్‌వన్ స్థానంలో ఉన్న లెక్లెర్క్ను ఆస్కార్ పియాస్ట్రి ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు ఆస్కార్ నిలబెట్టుకొని తన కెరీర్లో రెండో విజయాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ జార్జి రసెల్‌కు మూడో స్థానంలో, మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్‌కు నాలుగో స్థానంలో, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) ఐదో స్థానంలో నిలిచారు. వీసా క్యాష్ యాప్ జట్టుకు చెందిన యుకీ సునోడా రేసును పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. 24 రేసుల ఫార్ములావన్ సీజన్లో 17 రేసులు ముగిశాక మాక్స్ వెర్స్టాపెన్ 313 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని 18వ రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 22న జరుగుతుంది. -
కాల్ చేస్తే కట్ చేయొచ్చు
సిడ్నీ: ఆఫీసులో పని ముగించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యాజమాన్యం నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకు కలుగుతుంది కదా! ఆ్రస్టేలియాలో ఇలాంటి చిరాకు ఇకపై ఉండదు. ఎందుకంటే ‘రైట్ టు డిస్కనెక్ట్’ నిబంధన అమల్లోకి వచ్చింది. పని వేళలు ముగించుకొని ఇంటికెళ్లిన ఉద్యోగులకు యాజమాన్యాలు అనవసరంగా ఫోన్ చేస్తే జరిమానా విధిస్తారు. యాజమాన్యాలు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తే ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. మాట్లాడకపోతే శిక్షిస్తారేమో, ఉద్యోగం పోతోందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆఫీసు అయిపోయాక యాజమాన్యం ఫోన్ చేస్తే ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్‌డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేయొచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ఫోన్ వస్తే ఉద్యోగులు స్పందించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఫోన్‌కాల్‌ను తిరస్కరించకూడదు. ఎఫ్‌డబ్ల్యూసీ నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలకు 94 వేల డాలర్లు, ఉద్యోగులకు 19 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. ఆఫీసులో పని ముగిశాక తమకు ఫోన్ చేయవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకొనే అధికారాన్ని ఉద్యోగికి కట్టబెట్టారు. ఆ్రస్టేలియాలో ఆఫీసు టైమ్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయడం మామూలే. ఒక్కో ఉద్యోగి ప్రతిఏటా సగటున 281 గంటలు అధికంగా ఆఫీసులో పని చేస్తున్నట్లు గత ఏడాది ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఓవర్‌టైమ్ పనికి అదనపు వేతనం ఉండదు. -
డెవిల్స్ పూల్! ఆ నీళ్లల్లో అడుగుపెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదట!!
క్వీన్స్లండ్, ఆస్ట్రేలియన్ బుష్‌లో ‘బబిందా బౌల్డర్స్ పూల్’ అనే విస్తారమైన ఈత కొలను.. సహజ అందాలకు కొలువు. కానీ ఆ నీళ్లల్లో అడుగుపెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదట. 1959 నుంచి ఇప్పటి వరకు ఆ కొలనులో పడి సుమారు 21 మందికి పైగా చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని మృతదేహాలు ఇంకా దొరకను కూడా లేదు. ఆ కొలను రాళ్ల మధ్య ఉంటుంది. అక్కడ నీరు ఉన్నట్టుండి పెరుగుతుంది, అకస్మాత్తుగా తగ్గుతుంది.కాలాన్ని బట్టి.. సమయాన్ని బట్టి మారుతుంది. పైగా ఆ రాతికొండలకు లోతైన గోతులు, గుంతలు ఉంటాయి. వాటిల్లో నీళ్లు నిండి.. కొన్ని చోట్ల ఆ గుంతలు కనిపించను కూడా కనిపించవు. ఆ క్రమంలోనే అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఆ గోతుల్లో ఇరుక్కుని.. బయటికి రాలేక చనిపోతున్నారు. ఆ కొలనులో నీరు నిండుగా ఉన్నా.. నేల మట్టానికి చేరుకున్నా.. కళ్లు చెదిరే అందం అక్కడి ప్రకృతి సొంతం. అందుకే ఆ అందాలను చూడటానికి, ఈత కొట్టడానికి జనాలు ఎగబడుతుంటారు. కొన్ని డేంజర్ జోన్స్‌ని సూచిస్తూ హెచ్చరికలు, గమనికలు ఉన్న బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయినా ప్రమాదాలు ఆగడంలేదు.అక్కడికి వచ్చే వారిలో ఒకరిని ఆ కొలను దగ్గరుండే దయ్యం ఎన్నుకుంటుందని.. వారిని చావుకు ఆహ్వానిస్తుందని.. బాధితులంతా అలా చనిపోయినవారేనని కొందరు స్థానికుల నమ్మకం. ఆ తరహాలోనే.. సమీపంలో నివసించే ఆదివాసులు.. హడలెత్తించే విషాద గాథనూ వినిపిస్తుంటారు. కొన్నేళ్ల క్రితం యిండింజి తెగకు చెందిన ఊలానా అనే అందమైన యువతి.. వరూనూ అనే ఆ జాతి పెద్దను వివాహం చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించిందట.అయితే వివాహమైన కొన్నాళ్లకి ఊలానా జీవితంలోకి మరొక తెగకు చెందిన డైగా అనే యువకుడు రావడంతో.. అది వారి మధ్య ప్రేమకు దారితీసింది. కొంతకాలం గుట్టుగా సాగిన ఆ బంధం.. ఉన్నట్టుండి బంధువుల మధ్య పంచాయతీకి రావడంతో అవమానాన్ని తట్టుకోలేక ఊలానా.. బబిందా బౌల్డర్స్ పూల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుందట. అయితే ఆమె ఆ కొలనులోకి దూకే క్రమంలోనే ‘డైగా డైగా’ అని అరిచిందట. ఆ అరుపులకు డైగా కూడా అదే కొలనులో దూకి చనిపోయాడు.అయితే డైగా దూకడం, చనిపోవడం అంతా.. ఊలానా చనిపోతూనే కళ్లరా చూసిందట. తాను చనిపోతున్న సమయంలోనే.. తన ప్రియుడి చావుని చూస్తూ.. భీకరంగా ఏడ్చిందట. ఆ కన్నీరే ఆ కొలను నీటిమట్టాన్ని పెంచిందని.. కొలనులో ప్రమాదకరమైన గుంతలను ఏర్పరచిందని వారంతా చెబుతారు. అందుకే ఆ ప్రాంతాన్ని వారు హాంటెడ్ ప్రదేశంగా నమ్మి.. అటువైపు పోవద్దని హెచ్చరిస్తుంటారు.మొదట బాధితుడు లేదా బాధితురాలి శరీరంలోకి డైగా ఆత్మ చేరుతుందని.. నీటిలో ఉన్న ఊలానా ఆత్మ.. ప్రేమగా ‘డెగా డైగా’ అని పిలవగానే.. బాధితులు తమపై తాము నియంత్రణ కోల్పోయి.. నీటిలో ఇరుక్కునేలా డైగా ఆత్మ చేస్తుందని.. అలా ఆత్మల ప్రేమకు అమాయకులు బలవుతున్నారనేది స్థానికుల మాట.మరోవైపు 1940లో జాన్ డొమినిక్ అనే ఎనిమిదేళ్ల బాలుడు ఆ నీటిలో మునిగి చనిపోయాడు. అతడి కుటుంబం అక్కడే అతడి పేరున స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ ఫలకాన్ని తన్నిన ఓ యువకుడు.. ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడని, డొమినిక్ ఆత్మే అతడ్ని మాయం చేసిందనే మరో హారర్ స్టోరీ వినిపిస్తూ ఉంటుంది.ఒకానొక సాయంత్ర వేళ ఒక జంట ఆ కొలను అందాలు చూడటానికి వెళ్తే.. ఉన్నట్టుండి నీళ్లు అనకొండలా పైకి లేచి.. రాళ్ల మీదున్న వారిని కొలనులోకి లాక్కెళ్లడం ఓ వ్యక్తి కళ్లారా చూశాడట. అప్పటి నుంచి ఆ కొలనుపై పుకార్లు మరింతగా పెరిగిపోయాయి. ఏదిఏమైనా ఆ ప్రదేశంలో ఏ శక్తి ఉంది? ఎందుకు అంతమంది చనిపోతున్నారు? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన -
స్నేహితురాలిని పెళ్లాడిన ఆ్రస్టేలియా మహిళా మంత్రి
అడిలైడ్: ఆ్రస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తన చిరకాల భాగస్వామి సోఫీ అల్లౌచెను పెళ్లి చేసుకున్నారు. ఆ్రస్టేలియా పార్లమెంట్ సభ్యుల్లో మొట్టమొదటిగా స్వలింగ సంపర్కులిగా ప్రకటించుకున్న వాంగ్.. తనతోపాటు పూల బొకెతో పెళ్లి దుస్తుల్లో ఉన్న అల్లౌచె ఫొటోను ఆదివారం ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశారు. ‘మా కుటుంబసభ్యులు, ఎందరో స్నేహితులు ఈ ప్రత్యేకమైన రోజును మాతో పంచుకున్నందుకు సంతోషిస్తున్నాం’అని వాంగ్ పేర్కొన్నారు. వాంగ్, అల్లౌచె దాదాపు రెండు దశాబ్దాలుగా కలిసి ఉంటున్నారు. శనివారం అడిలైడ్‌లోని ఓ ద్రాక్ష తోటలో వారి వివాహ వేడుక జరిగినట్లు ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ తెలిపింది. సెనేట్‌లో దక్షిణ ఆస్ట్రేలియా తరఫున వాంగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ్రస్టేలియా కేబినెట్లో స్థానం సంపాదించుకున్న ఆసియా(చైనా)లో జని్మంచిన మొదటి వ్యక్తి పెన్నీ వాంగ్. ఆ్రస్టేలియాలో 2017 నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. -
చనిపోయిన భర్త నుంచే పిల్లలు పొందాలని.. ఆమె ఏకంగా..!
ఇటీవల కాలంలో చనిపోయిన భర్త నుంచే పిల్లలను కన్న ఓ మహిళ గురించి విన్నాం. ఆకేసులో ఆ దంపతులు పిల్లలు పుట్టకపోవడంతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) ఆస్పత్రిని ఆశ్రయించారు. ఆ పద్ధతిలో పిల్లను కనాలనుకునేలోపు కరోనా మహమ్మారి రావడం భర్త చనిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. ఒంటిరిగా అయిపోయిన ఆ భార్య తన భర్త ఉన్నప్పుడు పిల్లలను కనాలనుకున్న ఘటన గుర్తొచ్చి ఆస్పత్రికి వెళ్లి తన నిర్ణయాన్ని తెలిపి మరీ సాహసోపేతంగా బిడ్డను కని వార్తల్లో నిలిచింది. అది మరువక మునుపే అదే మాదిరి ఘటన కాకపోతే కొద్ది తేడా ఉంది. అక్కడ బతికుండగానే భర్త నుంచి స్పెర్మ్ తీసుకున్నారు. ఇక్కడ ఈ జంట కనాలనుకునేలోపే భర్త అకాల మరణం పొందాడు. అయినా తన భర్త నుంచే పిల్లలను కనాలనుకుంటున్నా అంటూ అందుకు పర్మిషన్ ఇమ్మని ఏకంగా సుప్రీం కోర్టునే ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంది. ఈ ఆశ్చర్యకర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..వెస్ట్ ఆస్ట్రేలియాకు చెందిన 62 ఏళ్ల మహిళ ఆమె భర్త తమ ఇద్దరు పిల్లలను వేర్వేరు ఘటనలు పోగొట్టుకున్నారు. దీంతో ఇరువురు పిల్లను కనాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే అనుకోకుండా ఇటీవలే డిసెంబర్ 17న భర్త ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆమె తన భర్త బతికుండగానే పిల్లలను కనాలనుకున్న దాన్ని నిజం చేయాలనుకుంది. చనిపోయినప్పటికీ తన భర్త నుంచే పిల్లలను కనాలనుకుంది. అందుకోసం అని చనిపోయిన భర్త నుంచి స్పెర్మ్‌ని సేకరించాలనుకుంది. దీనికి సుప్రీం కోర్టు అనుమతివ్వాలంటూ అభ్యర్థించింది. తన భర్త బతికున్నప్పుడే తామిరువురం అనుకున్నామని, తన భర్త కోరికని అనుమతిమ్మని కోర్టుని వేడుకుంది. దీంతో ధర్మాసనం చనిపోయిన భర్త నుంచి స్పెర్మ్‌ని తీసుకునేందు అనుమతి మంజూరుచేసింది. ఇక్కడ ఓ చనిపోయిన వ్యక్తి స్పెర్మ్ ఫలదీకరణం చెందించేలా ఉపయోగించడం అనేది వైద్యశాస్త్రంలో మరింత పురోగతికి నాంది పలుకుతుందనే చెప్పాలి. ఇక ఆ జంట పిల్లలు 2013లో కుమార్తె(29) ఫిషింగ్ ట్రిప్‌లో మరణించగా, కుమారుడు(30) కారు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లను కనాలని అనుకుంది. అయితే పిల్లలను కనే వయసు సదరు మహిళకు దాటిపోవడంతో సరోగసి ద్వారా పిల్లలను పొందాలనుకున్నారు. ఈలోగా అనుకోకుండా భర్త దూరమవ్వడంతో ఆ కోరిక కలగా మిగిలిపోకూడదని ఆ మహిళ స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించి చనిపోయిన భర్త నుంచే స్పెర్మ్‌ని సేకరించేలా అనుమతి పొందింది. కాగా, మరణాంతర ఫలదీకరణంపై వెస్ట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. అందువల్ల ఆమె సరోగసి ద్వారా బిడ్డను పొందాలనుకుంటే..ముందుగా సదరు మహిళ స్త్రీ పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞాన మండలికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆమె దివగంత భర్త తండ్రి కావాలనుకున్నాడా? అలాగే సదరు మహిళ చెబుతోంది అంతా నిజమేనా? అన్నది నిర్థారణ చేసుకుని ఆస్ట్రేలియా వైద్యాధికారులు అనుమతి ఇస్తేనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక అధికారులు సదరు మహిళ వివరాలను చాలా గోప్యంగా ఉంచారు. (చదవండి: ఒక లీటర్ బాటిల్లో ఎన్ని నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో తెలుసా! వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
David Warner: ఆసీస్ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
అభిమాని కలకలం
అహ్మదాబాద్: రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య లక్ష పైచిలుకు అభిమానులున్న స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. 6000 మందికి పైగా సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. ఇంతటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన కూడా... ఆస్ట్రేలియాకు చెందిన పాలస్తీనా సానుభూతిపరుడు ఇన్ని అంచెలను దాటుకొని కోహ్లిని కలవడం, కౌగిలించుకోవడం కలకలం సృష్టించింది. ఇది భద్రత డొల్లతనాన్ని భయటపెట్టింది. వెంటనే అప్రతమత్తమైన భద్రత దళాలు వేన్ జాన్సన్ అనే ఆ్రస్టేలియన్ను నిర్బంధించాయి. అతన్ని చాంద్ ఖేడా పోలీస్ స్టేషన్‌కు తరలించి తదుపరి విచారణ చేపట్టింది. ప్రస్తుతం పాలస్తీనాలో హమాస్, ఇజ్రాయెల్‌ల మధ్య భీకర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే! -
భలే ఉద్యోగ ప్రకటన!..జీతం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు మాథ్యూ లెప్రీ. ఆస్ట్రేలియాలో ఉంటూ ఆన్లైన్ వ్యాపారం చేస్తుంటాడు. ‘ఈకామ్ వారియర్ అకాడమీ’ని నెలకొల్పాడు. వ్యాపారంలో కోట్లకు కోట్లు గడించాడు. ఇప్పుడు ఇతగాడు ప్రపంచయాత్ర చేయాలనుకుంటున్నాడు. గడచిన ఐదేళ్లలో ముప్పయి దేశాలు తిరిగి, అక్కడి తన క్లయింట్ల వ్యాపారాలు పుంజుకొనేందుకు సహాయపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా సంచరించే తనకు తన ప్రయాణాల్లో సహకరించేందుకు ఒక సహాయకుడు కావాలంటూ ఇటీవల ఇతగాడు ప్రకటన ఇచ్చాడు. వెంటనే ఈ ప్రకటన వైరల్‌గా మారింది. తగిన వ్యక్తి దొరికితే తనకు సహాయకుడిగా నియమించుకుంటానని, జీతంగా ఏడాదికి 30,500 పౌండ్లు (రూ.31 లక్షలు) చెల్లించడమే కాకుండా, హెల్త్ ఇన్సూరెన్స్, ట్రావెల్ అలవెన్స్ తదితర సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు ప్రకటించాడు. ఈ ఉద్యోగం కోసం ఇప్పటికే 70 వేలకు పైగా దరఖాస్తులు పోటెత్తాయి. View this post on Instagram A post shared by Matthew Lepre (@matthewlepre) (చదవండి: అదొక శాపగ్రస్త గ్రామం! అరవై ఏళ్లుగా మనుషులే లేని ఊరు) -
Moeen Ali Unseen Photos: ట్రెండింగ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ (ఫోటోలు)
-
ఆస్ట్రేలియా టీమ్ కి నిద్రలేని రాత్రులు ఎందుకంటే..!
-
కొత తరహాలో సైబర్ మోసం..ఆస్ట్రేలియా జైల్లో..
ఇంతవరకు సైబర్ నేరస్తులు ఏదో ఒక ఎర వేసి లేదా ఆశ చూపో వారి ట్రాప్‌లోకి దించి డబ్బులు దుండుకునేవారు. అదీ కుదరకపోతే ఏకంగా అత్యున్నత హోదా అధికారి పేరు చెప్పి ట్రాప్ చేసేవారు. ఇక వాటన్నింటిని అధిగమించి కొత్త తరహాలో నేరాలకు తెగబడుతున్నారు. అందుకోసం ఆయా వ్యక్తుల నేపథ్యం గురించి తెలుసుకుని ట్రాప్ చేసి మోసం చేస్తున్నారు. అచ్చం అలానే ఓ కుటుంబం రూ. 4 లక్షలు పొగొట్టుకుంది. వివరాల్లోకెళ్తే..ఉత్తర ఢిల్లీలోని ఓ కుటుంబం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని రూ. 4 లక్షలు పోగొట్టుకుంది. 29 ఏళ్ల గుర్సిమ్రాన్ సింగ్ ఈ విషయమై పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వ్యక్తి తన తల్లికి ఓ అంతర్జాతీయ కాల్ వచ్చిందని పోలీసులకు తెలిపాడు. వారి బంధువు నౌనిహాల్ ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నాడు అతడి పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు ఆ కుటంబాన్ని దోచుకున్నారు. ఓ రోజు తన తల్లికి నౌనిహాల్ సింగ్ అని పరిచయం చేసుకుంటూ ఓ కాల్ వచ్చింది. అతడు తమ బంధువే కదా అని అతడి తల్లి ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత కొద్దిరోజుల అనంతరం నైనిహాల్ స్నేహితులందరూ జైల్లో ఉన్నారని, వారంతా ఓ వ్యక్తితో గొడపడ్డట్టు చెప్పుకొచ్చాడు. నైనిహాల్ మాత్రమే బయటే ఉన్నట్లు తెలిపాడు. కేసు గురించి మరింతగా విచారించడానికి ఒక న్యాయవాది ఆమెను పిలుస్తారని అతను తన తల్లికి చెప్పాడని పోలీసులకు వెల్లడించాడు. కొద్ది వ్యవధిలోనే ఓ న్యాయవాది ఫోన్ చేసి నౌనిహాల్ని జైలుకు పంపారని, బెయిల్ పొందడానికి పోలీసులకు డబ్బులు డిపాజిట్ చేయాలని చెప్పాడు. చెల్లించకపోతే సుమారు 15 నుంచి 20 ఏళ్ల వరకు కటకటాల్లోనే ఉంటాడని చెప్పాడు. పైగా డబ్బులు డిపాజిట్ చేసేందుకు రాంచీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కి సంబంధించి విక్రమ్ కుమార్ ముండా పేరిట ఉన్న ఖాతా నెంబర్‌ను ఇచ్చాడు. మొదట రెండు లక్షలు అని చెప్పాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పోలీసులు రూ. 2.5 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో ఆ కుటుంబం విడతలు వారీగా ఆర్టీజీఎస్ ద్వారా నగదును అతడిచ్చిన ఖాతా నెంబర్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత బంధువుల్ని విచారించగా..నౌనిహాల్ క్షేమంగా ఉన్నాడని, తనపై అతడి స్నేహితులపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిసి ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కి గురైంది. తాము సైబర్ మోసానికి బలయ్యినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్సిమ్రాన్ సింగ్ పేర్కొన్నాడు. ఉత్తర ఢిల్లీకి చెందిన మరో కుటుంబాన్ని ఇదే తరహాలో మోసం చేసేందుకు యత్నించి నేరగాళ్లు విఫలమైనట్లు అధికారులు తెలిపారు. ఆ కేసులో కూడా..ఆ కుటుంబానికి కెనడాలో బంధువులు ఉన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు మీ బంధువులు జైలులో ఉన్నారని వారిని బెయిల్‌పై విడుదల చేయడానికి డబ్బు అవసరమంటూ ట్రాప్ చేసేందుకు యత్నించారు. అయితే వారు డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి ఎంక్వైయిరీ చేస్తే అది నకిలీ ఫోన్ కాల్ అని తేలిందని పోలీసులు చెప్పుకొచ్చారు. (చదవండి: షాకింగ్ ఘటన: ఏకంగా 45 బ్యాగుల్లో మానవ అవశేషాలు!) -
రతన్ టాటాకు మరో అరుదైన పురస్కారం: ఫోటోలు వైరల్
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త, టాటాసన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాకు అరుదైన పురస్కారం లభించింది. ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం రతన్ టాటాను వరించింది. ఆస్ట్రేలియా-భారత్ ద్వైపాక్షిక సంబంధానికి చేసిన సేవకుగాను ఈ గౌరవం లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలను భారతదేశంలోని ఆస్ట్రేలియన్ రాయబారి బారీ ఓ' ఫారెల్ ట్విటర్లో షేర్ చేశారు. పారిశ్రామిక దిగ్గజమైన రతన్ టాటా వ్యాపారంలోనే కాదు, దాతృత్వంలో కూడా గొప్ప వ్యక్తిగా నిలిచారని ప్రశంసించారు. టాటా సహకారం ఆస్ట్రేలియాలో గణనీయమైన ప్రభావాన్ని తీసుకొచ్చిం దన్నారు. ఆస్ట్రేలియా-భారత్ బంధానికి టాటా సుదీర్ఘ నిబద్ధతకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గౌరవాన్ని ప్రదానం చేయడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. టాటా వపర్ సదరన్ ఒడిశా డిస్టట్రీబ్యూషన్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ రంజన్ కూడా లింక్డ్ఇన్ పోస్ట్‌లో సత్కార వేడుక ఫోటోలను చేశారు. బిజినెస్‌లోనూ, ఫిలాంత్రఫీలోనే టాటా చేసిన సేవలు భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్ అయ్యాయన్నారు. అనేక విజయవంతమైన వెంచర్ల వెనుక చోదక శక్తిగా రతన్ టాటా ఉన్నారు. ఆయన లీడర్ షిప్, విజన్ ఎంతోమందికి తమ కలల సాకారంలో గొప్ప స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు Ratan Tata is a titan of biz, industry & philanthropy not just in 🇮🇳, but his contributions have also made a significant impact in 🇦🇺. Delighted to confer Order of Australia (AO) honour to @RNTata2000 in recognition of his longstanding commitment to the 🇦🇺🇮🇳relationship. @ausgov pic.twitter.com/N7e05sWzpV — Barry O’Farrell AO (@AusHCIndia) April 22, 2023 -
Pull-ups: 24 గంటల్లో 8,008 పుల్ అప్స్.. గిన్నిస్ రికార్డు బద్దలు..
కాన్బెర్రా: వ్యాయామం చేసే వారు తమ బాడీ ఫిట్‌గా ఉండేందుకు కచ్చితంగా పుల్ అప్స్ చేస్తారు. వీటి వల్ల వీపు, ఛాతీ, భుజాల ఖండరాలు ఉత్తేజితమవుతాయి. అయితే ఇవి చేయడం కాస్త కఠినమే. రోజుకు 1,000 పుల్ అప్స్ చేయడమంటే గగనమే. అయితే ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన ఓ ఫిట్నెస్ ఔత్సాహికుడు మాత్రం పుల్ అప్స్లో గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 24 గంటల్లో 8,008 పుల్ అప్స్ చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. గత రికార్డు 7,715 పుల్ అప్స్‌ను చెరిపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను జాక్సన్ ఇటాలియోనో తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు. ఈ రికార్డు కోసం తాను 8 నెలలపాటు శిక్షణ తీసుకున్నట్లు వివరించాడు. ఎట్టకేలకు తన శ్రమకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశాడు. గిన్నిస్ రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉందన్నాడు. View this post on Instagram A post shared by Jaxon Italiano (@jaxon_italiano) గతంలో మరొకరి పేరుపై ఉన్న 12 గంటల్లో 5,900 పుల్ అప్స్ రికార్డును కూడా జాక్సన్ అధిగమించాడు. కాగా.. మొత్తం 24 గంటల్లో చివరి 3.5 గంటలను జాక్సన్ వినియోగించుకోలేదు. తీవ్రంగా అలసిపోవడంతో ఈ సమయంలో ఒక్క పుల్ అప్ కూడా చేయలేదు. అయినా గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి సత్తా చాటాడు. జాక్సన్ పుల్ అప్స్ రికార్డుతో పాటు ఈ ఒక్క రోజే చారిటీ కోసం రూ.5లక్షల విరాళాలు కూడా సేకరించడం గమనార్హం. చదవండి: షాకింగ్.. ఇంట్లో 1,000 కుక్కలు మృతి.. ఆకలితో కడుపు మాడ్చి! -
చిన్నారులపై అత్యాచారం కేసులో ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష
చిన్నారులపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పుడుతున్న ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. బాలికలపై అత్యాచారం, మానవ అక్రమ రవాణా కేసుల్లో ఇప్పటికే జీవిత ఖైతు అనుభవిస్తున్న పీటర్ గెరార్డ్ స్కల్లీ అనే ఆస్ట్రేలియా వ్యక్తికి ఇది రెండో నేరం. అతను 18 నెలలు వయసు ఉన్న చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో స్కల్లీకి ఈ శిక్ష విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ తీర్పు ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడేవారికి, మానవ అక్రమ రవాణాదారులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ చిన్నారులపై లైంగిక వేదింపులకు అడ్డగా మారిందన్నారు. దేశంలోని పేదరికం, ఆగ్లంలో మంచి పట్టు, హైస్పీడ్ ఇంటర్నెట్ వెసులుబాటు తదితరాలు ఈ దారుణమైన ఘటనలకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. నిందితుడు స్కల్లీ చిన్నారులపై అత్యాచారాలు, మానవ అక్రమ రవాణాతో సహా సుమారు 60 నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు ఆస్ట్రేలియా కగాయన్ డి ఓరో కోర్టు నిందితుడు స్కల్లీ అతని ముగ్గురు సహచరులకు 129 ఏళ్ల జైలు శిక్ష విధించగా అతడి స్నేహితురాలికి 126 ఏళ్లు జైలు శిక్ష విధించింది. (చదవండి: ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు’.. బందీగా మారిన భారత నావికుడు) -
వింత ఘటన: బతికి ఉండగానే మార్చురీకి... కంగుతిన్న వైద్యులు
ఒక వ్యక్తిని బతికి ఉండగానే మార్చురీకి పంపించింది ఓ ఆస్పత్రి. చనిపోయింది ఒకరోజు అయితే మరో రోజు చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది. దీంతో ఆస్సత్రి వర్గాలు కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....55 ఏళ్ల ఆస్ట్రేలియన్ వ్యక్తి రీడ్ని యూకేలో పెర్త్‌లోని రాకింగ్హామ్ ఆస్పత్రి చనిపోయాడని నిర్ధారించి మార్చురీకి తరలించింది. ఐతే సదరు వ్యక్తి మృతదేహాన్ని తరలించడానికి ముందు కుటుంబ సభ్యులుకు సమాచారం కూడా అందించింది. ఐతే ధృవీకరణ పత్రం వెంటనే జారీ చేయలేదు. వాస్తవానికి రీడ్ అనే వ్యక్తిని మార్చురుకి సజీవంగా ఉండగానే తరలించారు. ఈ విషయం మార్చురీలో వైద్యులు శవపరీక్ష జరుపుతుండగా బయటపడింది. ఈ మేరకు వైద్యుడు పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా ఆ మృతదేహాన్ని చూసి అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ మృతదేహం ఉన్న స్థితి చాలా సేపటి క్రితం చనిపోయిన వ్యక్తిలా లేదు కొద్ది నిమిషాల ముందు చనిపోయినట్లు అనిపించింది. పైగా సదరు వ్యక్తి మృతదేహాన్ని ప్యాక్ చేసిన కవర్ విప్పి ఉందని, కవర్‌పై రక్తం పడి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు వైద్యుడు. బహుశా ఆ వ్యక్తి బతికే ఉండవచ్చని ఆ కవర్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి ఉండవచ్చని అన్నారు. అందువల్లే కవర్ని ఓపెన్ చేసి ఉందని దానిపై రక్తపు మరకలు ఉన్నాయని అన్నారు. పైగా ఆ రక్తం బతికి ఉన్న వ్యక్తి శరీరంలోని రక్తం మాదిరిగా ఉందని అన్నారు. తాము పోస్ట్‌మార్టం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయి చాలాసేపు కాలేదని, కొద్ది నిమిషాల వ్యవధిలోనే మరణించినట్లు వైద్యులు పోస్ట్‌మార్టం నివేదికలో తెలిపారు. అదీగాక అతను సెప్టెంబర్ 5న చనిపోతే...6న చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది రాకింగ్హామ్ ఆస్పత్రి. దీంతో ఈ ఘటనపై యూకే కరోనరీ కోర్టు దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు ఆస్పత్రి వర్గాలు ఈ ఘటనను కప్పి పుచ్చుకునేందుకు యత్నించాయి కూడా. అంతేగాదు మరణధృవీకరణ పత్రాన్ని వెనక్కి తీసుకుంటామని ఆస్పత్రి వర్గాలు కోర్టుని అభ్యర్థించాయి కూడా. దీంతో కరోనరి కోర్టు సదరు వ్యక్తి మరణం అసహజంగా ఉందని పోస్ట్‌మార్టం నివేదిక ఆస్పత్రి వర్గాలు చెబుతున్న దానికి భిన్నంగా ఉందంటూ దర్యాప్తు ప్రారంభించటమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యుల తీసుకుంటామని స్పష్టం చేసింది. (చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు) -
ఉద్యోగులకు బంపర్ ఆఫర్: ఖాళీలున్నాయా బాస్ అంటున్న నెటిజన్లు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇవ్వడం వైరల్‌గా మారింది. సిడ్నీకి చెందిన మార్కెటింగ్ సంస్థ సూప్ ఏజెన్సీ ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. మొత్తం ఉద్యోగులందరినీ చాలా ఖరీదైన ట్రిప్‌కు తీసుకెళ్లింది. అందులోనూ ఉద్యోగులలో ఒకరి 24వ పుట్టినరోజును కూడా ఘనంగా నిర్వహించింది. దీంతో కంపెనీ ఎండీ కాట్యా వకులెంకో, "వరల్డ్స్ బెస్ట్ బాస్" అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు ఈ రోజు సూప్ ఏజెన్సీ మూడో పుట్టినరోజును జరుపుకుంటోంది. తొందర్లోనే మరో యూరప్‌కు ట్రిప్‌ను ప్లాన్ చేస్తోందట కంపెనీ. View this post on Instagram A post shared by Soup Agency (@soup_agency) ఈ సంవత్సరం మేలో జరిగిన ఈ ట్రిప్పై నెటిజన్లులు కామెంట్ల వర్షం కురిపించారు. "లక్కీ ఉద్యోగులు...మనకు అదంతా కలే " అని ఒక యూజర్ వాపోయాడు. నాకు అలాంటి అద్భుతమైన ఏజెన్సీ, యజమానిని దొరికితేనా.. నా నా సామి రంగ అన్నట్టుగా మరొకరు కమెంట్ చేశారు. అంతేకాదు ఏమైనా వేకెన్సీలున్నాయా బాస్ అంటూ మరో యూజర్ కమెంట్ చేయడం విశేషంగా నిలిచింది. ఇండొనేసియాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బాలికి తన ఉద్యోగులందర్నీ హాలీడే ట్రిప్‌నకు పంపించింది ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన సూప్ ఏజెన్సీ ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా 2 వారాల పెయిడ్ లీవ్ ఇచ్చింది. అంతేకాదు విలాసవంతమైన హాలీడే ట్రిప్‌నకు అయ్యే ఖర్చులన్నీ తానే భరించింది. దీంతో ఉద్యోగులందరూ ఎగిరి గంతేసి మరీ పండగ చేసుకున్నారు. ఫ్యామిలీలతో బాలికి చెక్కేశారు. జాగింగ్లు, డ్రింక్స్‌తో అంటూ తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను జూన్ 9న కంపెనీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. బాలిలో ఉద్యోగులు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా కంపెనీ వెబ్సైట్ ప్రకారం, సూప్ ఏజెన్సీ సిడ్నీలో ఇండిపెండెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఇన్వెంటివ్, డేటా ఆధారిత ప్రచారాలకు అత్యుత్తమ ఫలితాలను సాధించిన కంపెనీగా పాపులర్ అయింది. కోవిడ్-19 సంక్షోభం సమయంలో ఉత్పాదకత ఎక్కువగానే ఉందని డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కుమి హో తెలిపారు. ఇది ఖచ్చితంగా జీవితంలో మరచిపోలేని అనుభవం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Soup Agency (@soup_agency) -
22 ఏళ్ల యూట్యూబ్ స్టార్ మృతి.. తండ్రి భావోద్వేగపు పోస్ట్
Australian Rapper YouTube Star Lil Bo Weep Dies At 22: ప్రముఖ ఆస్ట్రేలియిన్ ర్యాపర్, యూట్యూబ్ స్టార్ లిల్ బో వీప్ అకాల మరణం చెందింది. 22 ఏళ్ల ఈ గాయని మార్చి 3న తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి మాథ్క్యూ స్కోఫీల్డ్ సోషల్ మీడియా వేదికైన ఫేస్బుక్లో తెలిపారు. ఈ పోస్ట్‌లో 'డిప్రెషన్, బాధ, పీటీఎస్డీ, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మా కుమార్తె కోసం ఈ వారమంతా పోరాడుతూనే ఉన్నాం. ఆమెను అమెరికా నుంచి ఇక్కడికీ తీసుకువచ్చినప్పటినుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. మేము పక్కనే ఉన్నప్పుడు ఆమె తన రాక్షసులతో తీవ్రంగా పోరాడింది. కానీ మేము ఆమెను కోల్పోయాం. మేము కూడా ఓడిపోయాం' అంటూ రాసుకొచ్చారు. అయితే ఆమె మృతికి గల సరైన కారణాలను ఇంకా వెల్లడించలేదు. గాయని లిల్ బో వీప్ మృతిపట్ల ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేశారు. 'ఐ లవ్ యూ. ఐయామ్ సారీ బేబీ గర్ల్. మరో జీవితం', 'రెస్ట్ ఇన్ పీస్ వినోనా, నా కష్టతరమైన సమయంలో మీ సంగీతం నాకు సాంత్వన కలిగించింది.' అంటూ కామెంట్స్ పెట్టారు. లిల్ అభిమానుల ప్రేమను చూసి ఆమె తండ్రి మళ్లీ 'ఆమె తండ్రిగా నేను చాలా గర్వపడుతున్నాను. తను నా హీరో, నా కూతురు, నా బెస్ట్ ఫ్రెండ్. తనను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేను. ఆమె మళ్లీ తిరిగి వస్తుంది.' అంటూ రాసుకొచ్చారు. లిల్ బో వీప్ అసలు పేరు 'వినోనా బ్రూక్స్'. 2015సో సౌండ్క్లౌడ్లో తన సంగీతం కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత అనేక మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. 'పీటీఎస్డీ' పేరుతో ఒక నిమిషంన్నర నిడివి గల పాటను ఆమె చివరిగా పోస్ట్ చేసింది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేత యాష్లే బార్టీ
-
అభ్యర్థుల్లో ‘కంగారు’ పుట్టించారు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆస్ట్రేలియాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటారు. సిడ్నీలోని కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా తెలంగాణకు చెందిన సంధ్యారెడ్డి అలియాస్ సాండీ రెడ్డి.. వెస్ట్ సిడ్నీలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవగా, రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి చెట్టిపల్లి లివింగ్స్టన్.. బ్లాక్ టౌన్ వార్డ్ 5 నుంచి విజయం సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పిల్లలమర్రి శ్రీనివాస్ అలియాస్ శ్రీనీ.. హాన్స్ బీ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. లివింగ్స్టన్, శ్రీనివాస్ ఇద్దరూ లిబరల్ పార్టీ నుంచి గెలవగా సంధ్యారెడ్డి ఇండిపెండెంట్‌గా విజయం సాధించా రు. ఈ మేరకు బుధవారం ఫలితాలు వెల్లడించారు. కొండా ఫ్యామిలీ నుంచి.. కొండా రంగారెడ్డి సోదరుడు కొండా నారాయణరెడ్డి మనవరాలు సంధ్యారెడ్డి. ఈమె మేనమామ కొండా లక్ష్మణ్ రెడ్డి 1983లో చేవెళ్ల నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. చిన్ననాటి నుంచి ఖైరతాబాద్‌లో పెరిగిన సంధ్యారెడ్డి.. 16 ఏళ్ల క్రితం నగరానికి చెందిన కర్రి బుచ్చిరెడ్డిని వివాహం చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లిన బుచ్చిరెడ్డి కంప్యూటర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సంధ్యారెడ్డి కూడా స్ట్రాత్ ఫీల్డ్‌లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు క్లీన్ అప్ ఆస్ట్రేలియా నినాదంతో కార్యక్రమాలు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నీల్ రెడ్డి, నిఖిల్ రెడ్డి. ఇద్దరూ ప్రస్తుతం హైస్కూల్ విద్యాభ్యాసంలో ఉండగా చిన్న కుమారుడు నిఖిల్‌రెడ్డి నేషనల్ జూనియర్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. డిప్యూటీ మేయర్ రేసులో సంధ్యారెడ్డి స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ రేసులో సంధ్యారెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఈ స్థానిక సంస్థలో ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో సంధ్యారెడ్డితో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్‌గా గెలవగా మిగిలిన వాళ్లు స్థానిక పార్టీల నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్‌గా సంధ్యారెడ్డికి అవకాశం వస్తుందని సిడ్నీలోని భారతీయులు భావిస్తున్నారు. -
ఏ భర్తకు ఇటువంటి కష్టం రాకూడదు!
Australian Man Banned From Leaving Israel: ఇటీవల కాలంలో రకరకాల విడాకులు చట్టాలు గురించి విన్నాం. అయితే వాటిలో భార్యకు విడాకులు ఇవ్వాలంటే అత్యంత పెద్ద మొత్తంలో భరణం ఇవ్వడం వంటివి చూశాం. కానీ ఇక్కడ ఒక దేశంలో భరణం పూర్తిగా చెల్లించేంత వరకు దేశం విడిచి పెట్ట వెళ్లకుండా నిషేధించారు. (చదవండి: ప్రపంచపు తొలి డ్యూయల్ మోడ్ వాహనం) అయితే అసలు విషయంలోకెళ్లితే....ఆస్ట్రేలియన్‌కి చెందిన 44 ఏళ్ల నోమ్ హుప్పెర్ట్ 2012లో తన పిల్లల కోసం అని తన భార్య కోసం ఇజ్రాయెల్ దేశానికి వెళ్లాడు. అయితే అతని భార్య ఇజ్రాయెల్ కోర్టులో విడాకుల కేసు వేసింది. దీంతో కోర్టు 2013లో హుప్పెర్ట్కి వ్యతిరేకంగా "స్టే-ఆఫ్-ఎగ్జిట్"(దేశాన్ని విడిచి వెళ్లకూడదు) ఆర్డర్‌ని జారీ చేసింది. అంతే కాదు పిలల్లకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెల రూ లక్ష భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా అతను దేశాన్ని విడిచిపెట్టడానికి వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసింది. అంటే హుప్పెర్ట్ పిల్లల భవిష్యత్తు ఖర్చుల నిమిత్తం సుమారు రూ 18 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించేంత వరకు హుప్పెర్ట్ డిసెంబర్ 31, 9999వ సంవత్సవరం వరకు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఇజ్రాయెల్ కోర్టు నిషేధించింది. పైగా సెలవు కారణంగానో లేక పని మీదనో కూడా వెళ్లడానికి వీల్లేదు. అంతేకాదు ఒకసారి ఇజ్రాయెల్ కోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు(నో ఎగ్జిట్ ఆర్డర్) వచ్చిన వాళ్లు కనీసం 21 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన రసాయన శాస్త్రవేత్త అయిన హుప్పెర్ట్ దీనిపై ఆవేదన వ్యక్తం చేశాడు.. ఇజ్రాయెల్ వివాహ చట్టాలు చాలా కఠినమైనవని పైగా పురుషుల ఆర్థిక పరిస్థితి పై కోర్టు ఎటువంటి విచారణ జరపకుండా పురుషుల ఆదాయంలో 100 శాతం చెల్లించాల్సిందేనని ఆదేశిస్తుందని అని తన గోడు బ్రిటీష్ మీడియాకి వెల్లబోసుకున్నాడు.. (చదవండి: ప్రధాని మోదీ విరాళం ఎంతో తెలుసా!!) -
‘యూ బ్లడీ ఫూల్’ అంటూ బాతు నోట తిట్టు!
మానవేతర జాతుల్లో కొన్ని జాతులు.. శబ్దాలను అనుకరిస్తాయనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఏనుగులు, గబ్బిలాలు, చిలుకలు, హమ్మింగ్బర్డ్స్తో పాటు.. నీటిలోని జీవించే తిమింగలాలు, డాల్ఫిన్లు సహా.. ఇలా కొన్ని పక్షులు, జంతువులు.. నిర్దిష్ట శబ్దాలను ఇట్టే నేర్చుకోగలవని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. అయితే ఆ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ‘రిప్పర్ డక్’ (కస్తూరి బాతు).. అచ్చం మనిషి మాదిరి మాట్లాడటమే కాదు.. మనిషి మాదిరి తిట్టగలదని నిరూపితమైంది. అందుకు 34 ఏళ్ల కిందట రికార్డ్ అయిన ఓ ఆడియో సాక్ష్యంగా నిలిచింది. చదవండి: ఇలా మనుషుల్ని అమ్మగలరా? లేదు కదా..? డాక్టర్ పీటర్ ఫుల్లగర్ అనే పరిశోదకుడు.. 1987లో కాన్బెర్రా సమీపంలోని టిడ్బిన్ బిల్లా నేచర్ రిజర్వ్‌లో కస్తూరి బాతు మాట్లాడుతుండగా ఆ వాయిస్‌ను రికార్డ్ చేశారు. దానిలో రిప్పర్ ‘యూ బ్లడీ ఫూల్’ అని అచ్చం మనిషి తిట్టినట్లే తిట్టింది. నాడు ఆయన చేసిన రికార్డింగులను ఇటీవల నెదర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కారెల్ టెన్ కేట్ తిరిగి వెలుగులోకి తెచ్చారు. పక్షులలో స్వర అభ్యాసంపై ప్రొఫెసర్ టెన్ కేట్ అధ్యయనం చేస్తున్నారు. తలుపు కొట్టుకుంటుండగా వచ్చే శబ్దాన్ని కూడా ఈ బాతు అనుకరించగలదని సరికొత్త అంశాన్ని గుర్తించారు. -
‘స్టిక్’ సీన్ మారింది...
సాక్షి క్రీడా విభాగం: ఎన్నో ఏళ్లుగా చెప్పుకోదగ్గ విజయాలు లేని బాధ, ఆటతీరుపై జోక్‌లు... అధికారుల చేతకానితనం, జట్టులో అంతర్గత రాజకీయాలు... ప్రతిభకు పాతర, ఆటగాళ్లంటే చులకనభావం... ఇంటా, బయటా భారత హాకీపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. ఇలాంటి స్థితిలో రెండేళ్ల క్రితం చీఫ్ కోచ్‌గా వచ్చిన ఆస్ట్రేలియన్ గ్రాహం రీడ్ ‘భారత జట్టు ఉండాల్సింది ఈ స్థానంలో కాదు. దీన్ని నేను ఎక్కడికో తీసుకెళతాను’ అని తొలి మాటగా అన్నాడు. కొత్తగా రాగానే అందరూ చెప్పే మాటలే ఇవి అని ఎవరూ నమ్మలేదు. పైగా అంతర్గత రాజకీయాలతోపాటు కొత్తగా వచ్చే మార్పులను అంత సులభంగా అంగీకరించలేని తత్వం ఉన్న ఆటగాళ్ల జట్టుతో అతను సాధిస్తాడా అని అంతా తేలిగ్గా తీసుకున్నారు. కానీ రీడ్ ఎక్కడా తగ్గలేదు. కంప్యూటర్ సైన్స్ చదివి ఐటీ రంగంలో సుదీర్ఘ కాలం పని చేయడంతో పాటు ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థల్లో పెద్ద హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న రీడ్ హాకీలోనూ తనదైన కొత్త శైలితో ఆటగాళ్లను దారిలో పెట్టాడు. రీడ్ వచ్చే నాటికి జట్టులో అందరూ వ్యక్తిగతంగా పెద్ద ప్లేయర్లే. కానీ తుది ఫలితం వరకు వచ్చేసరికి మాత్రం అంతా అంతంతమాత్రమే. ముందుగా టీమ్‌ను ఒక్క చోటికి చేర్చడంలో అతను సఫలమయ్యాడు. పేరుకు శ్రీజేశ్, మన్‌ప్రీత్, మన్దీప్, బీరేంద్ర లక్డాలాంటి సీనియర్లు ఉన్నా వారెప్పుడూ జట్టుకంటే ఎక్కువ కాదనే భావనను రీడ్ కల్పించాడు. కోచింగ్ క్యాంప్‌లో రీడ్ భార్య స్వచ్ఛందంగా ఆటగాళ్లకు ‘పర్సనాలిటీ డెవలప్మెంట్’ క్లాస్‌లు తీసుకొని వారిలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేసిందంటే రీడ్ ఎంతగా తన మిషన్‌లో మునిగాడో అర్థమవుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఎంపికైన వారిలో 12 మందికి ఇదే తొలి ఒలింపిక్స్. ఇలాంటి టీమ్‌ను ఎంచుకోవడంలో కూడా కోచ్ సాహసం కనిపిస్తుంది. ఆటగాళ్లు, అధికారులతో ఏ విషయంలోనైనా మొహమాటం లేకుండా నిక్కచ్చిగా నిజం మాట్లాడే రీడ్ తత్వం అందరికీ మేలు చేసింది. ఫిట్నెస్ సూపర్... సుదీర్ఘ కాలంగా భారత హాకీ వైఫల్యాల్లో ఫిట్‌నెస్‌లేమి కూడా కీలకపాత్ర పోషించింది. ఆటపరంగా ఎంతో బాగున్నా, ఆస్ట్రోటర్ఫ్‌పై కొద్దిసేపు ఆడగానే అలసటకు గురై మనోళ్లు ఇబ్బంది పడుతూ కొనసాగడం గతంలో చాలాసార్లు జరిగింది. దీనిని ఎలాగైనా మార్చాలని రీడ్ సంకల్పించాడు. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌లతో పాటు సైంటిఫిక్ అడ్వైజర్ రాబిన్ అర్కెల్ సహకారం తీసుకొని ఆటగాళ్లను ఫిట్‌గా తయారు చేశాడు. యూరోపియన్ జట్లతో పోటీ పడినప్పుడు గతంలో ఎదురైన సమస్యలేవీ లేకుండా మనోళ్లు వారితో సమానంగా మైదానంలో చురుగ్గా కనిపించడం ఆటగాళ్లలో వచ్చిన కీలకమార్పు. తీవ్రమైన వేడి ఉన్న ఒసి స్టేడియంలో 13 రోజుల వ్యవధిలో 8 మ్యాచ్‌లు ఆడగలగడం వారి ఫిట్నెస్ను చూపించింది. రీడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మనోళ్లు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడం బాగా మెరుగైంది. టోక్యోలో భారత్ 8 మ్యాచ్‌లలో 25 గోల్స్ చేసింది. ఇక సబ్స్టిట్యూట్లను సమర్థంగా వాడుకోవడం రీడ్ వ్యూహాల్లో బాగా పని చేసింది. సెమీస్‌లో సిమ్రన్‌జిత్‌కు విశ్రాంతినివ్వగా, కాంస్య పోరులో అతను కొత్త ఉత్సాహంతో వచ్చి రెండు గోల్స్ చేశాడు. అమిత్ రోహిదాస్ ‘ఫస్ట్ రషర్’ రూపంలో శ్రీజేశ్కంటే ముందే పెనాల్టీలను ఆపడానికి ముందుకు దూసుకురావడం మనం గతంలో చూడని మార్పు. భారత ఆటగాళ్లు తమను, తమ కోచ్‌ను, తమ సహచరులను, తమ శిక్షణను నమ్మారు కాబట్టే ఈ ఫలితం వచ్చింది. నాలుగు దశాబ్దాలుగా బరిలోకి దిగిన ప్రతీ భారత జట్టు మట్టిపై ఆడిన తమ ముందు తరంవారి విజయాల భారం మోస్తూ కుప్పకూలిపోయేది. ఈ జట్టు మాత్రం అలా కాలేదు. హాకీ మున్ముందు మరింత వెలిగేందుకు తమ వైపునుంచి తొలి అడుగు వేసింది. -
బంగారు పతకం గెలిచిన ఆనందంలో ఆమె ఏం అనేసిందో వినండి..!
టోక్యో: పట్టరాని ఆనందంలో ఉన్నప్పుడు ఏదేదో వాగేస్తుంటాం. కాసేపయ్యాక విషయం తెలిసి నాలుక్కరుచుకుంటుంటాం. మనిషి నైజమే ఇది. ఇలాంటి ఘటనే టోక్యో ఒలింపిక్స్‌లో మంగళవారం చోటుచేసుకుంది. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్ పోటీల్లో స్వర్ణ పతకం నెగ్గిన ఆస్ట్రేలియన్ స్విమ్మర్ కేలీ మెక్‌కీన్.. పతకం నెగ్గిన ఆనందంలో నోరు జారింది. మెడల్ గెలిచాక ఓ మీడియా ప్రతినిధి.. గోల్డ్ మెడల్ గెలుచుకోవడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారని ప్రశ్నించగా, అప్పటికే ఆనంద డోలికల్లో తేలియాడుతున్న కేలీ పొరపాటున వాడకూడని ఓ బూతు మాటను(F**K) అనేసింది. Starting a “best daily moments of the Olympics” thread with this Hall of Fame entry from Kaylee McKeown after winning gold: pic.twitter.com/6NVuOnUfss — Josh Butler (@JoshButler) July 27, 2021 అయితే తాను తప్పుగా మాట్లాడానని గుర్తించి వెంటనే టాపిక్‌ను డైవర్ట్ చేసి, చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెడల్ నెగ్గినందుకు కేలీకి కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు.. పట్టలేని సంతోషంలో ఉన్నప్పుడు ఇలాంటి పదాలు మాట్లాడటం సహజమేనని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. భావోద్వేగాలకు ఎవరూ అతీతులు కాదనడానికి ఈ వీడియో ప్రత్యక్ష సాక్ష్యమని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే కేలీ ఇలా లైవ్‌లో బూతు పదం వాడటంపై ఆమె తల్లి స్పందిస్తూ.. తనతో మాట్లాడతానని చెప్పడం విశేషం. కాగా, కేలీ.. 100 బ్యాక్‌స్ట్రోక్‌ను కేవలం 57.47 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే 20 ఏళ్ల కేలీ మెక్కీన్కు ఒలంపిక్స్‌లో మెడల్ సాధించడం ఇదే తొలిసారేమి కాదు. ఇప్పటి వరకు ఆమె ఏకంగా 4 మెడల్స్ గెలుచుకొని రికార్డు సృష్టించింది. -
కరోనా: పాట్ కమిన్స్ ఔదార్యం, ఐపీఎల్‌పై కీలక సూచన
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా ఉగ్రరూపంతో అల్లాడిపోతున్న భారత్‌ను ఆదుకునేందుకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ముందుకు వచ్చారు. తనవంతు సాయంగా 50 వేల డాలర్లను పీఎం కేర్స్‌ఫండ్‌కు సాయాన్ని ప్రకటించారు. అంతేకాదు మిగతా ఐపీఎల్ సభ్యులు కూడా స్పందించాలని కోరారు. కరోనా విజృంభణతో ఆక్సిజన్ నిల్వల తీవ్ర కొరత నేపథ్యంలో పాట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తనది చిరుసాయమే అయినా బాధితులకు ఎంతోకొంత ఉపయోపడితే చాలన్నారు. ప్రత్యేకంగా ఆక్సిజన్ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు తన విరాళాన్ని ఉపయోగించాలని ఆయన కోరారు. అలాగే దేశంలో కరోనా కేసుల తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ఐపీల్ కొనసాగించడం సరియైనదా కాదా అనే చర్చ జరుగుతోంది. కానీ లాక్డౌన్లో కాలక్షేపం చేస్తున్న ప్రజలకు ఐపీల్ మ్యాచ్‌లు కాస్త సంతోషానిస్తాయన్నారు. రికార్డు కేసులతో బెంబేలెత్తుతున్న వారికి క్రికెట్ ఊరటనిస్తుందనే విషయాన్ని భారత ప్రభుత్వానికి తను సూచించదల్చుకున్నానని తెలిపాడు. ఈ మేరకు కమిన్స్ ఒక ప్రకటన విడుదల చేశాడు. కాగా, 2021 ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సిక్సర్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. కేవలం 34 బంతుల్లోనే కమిన్స్ 66 పరుగులు చేసి కొత్త చరిత్రను రాశాడు. ఇలా ఐపీఎల్లో ఒకే ఓవర్లో 30, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన వారిలో కమిన్స్ ఆరోవాడుగా నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం