అడిలైడ్: ఆ్రస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తన చిరకాల భాగస్వామి సోఫీ అల్లౌచెను పెళ్లి చేసుకున్నారు. ఆ్రస్టేలియా పార్లమెంట్ సభ్యుల్లో మొట్టమొదటిగా స్వలింగ సంపర్కులిగా ప్రకటించుకున్న వాంగ్.. తనతోపాటు పూల బొకెతో పెళ్లి దుస్తుల్లో ఉన్న అల్లౌచె ఫొటోను ఆదివారం ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశారు. ‘మా కుటుంబసభ్యులు, ఎందరో స్నేహితులు ఈ ప్రత్యేకమైన రోజును మాతో పంచుకున్నందుకు సంతోషిస్తున్నాం’అని వాంగ్ పేర్కొన్నారు.
వాంగ్, అల్లౌచె దాదాపు రెండు దశాబ్దాలుగా కలిసి ఉంటున్నారు. శనివారం అడిలైడ్‌లోని ఓ ద్రాక్ష తోటలో వారి వివాహ వేడుక జరిగినట్లు ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ తెలిపింది. సెనేట్‌లో దక్షిణ ఆస్ట్రేలియా తరఫున వాంగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ్రస్టేలియా కేబినెట్‌లో స్థానం సంపాదించుకున్న ఆసియా(చైనా)లో జని్మంచిన మొదటి వ్యక్తి పెన్నీ వాంగ్. ఆ్రస్టేలియాలో 2017 నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది.
Comments
Please login to add a commentAdd a comment