austrilia
-
T20 World Cup 2024: ఆసీస్‌ను పడగొట్టి సెమీఫైనల్‌కు
ఏడు నెలల క్రితం తగిలిన దెబ్బకు ఇప్పుడు కాస్త ఉపశమనం! ఫైనల్ కాకపోవచ్చు, ఫార్మాట్ వేరు కావచ్చు... కానీ ప్రపంచ కప్‌లో ఆ్రస్టేలియాను ఓడించడం అంటే సగటు భారత అభిమాని ఆనందాన్ని రెట్టింపు చేసే క్షణం! వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మళ్లీ ఇప్పుడే తలపడిన మ్యాచ్‌లో టీమిండియా అలాంటి సంతోషాన్నే పంచింది. ఆసీస్‌ను చిత్తు చేసి సగర్వంగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోరుకు బాటలు వేస్తే మన బౌలర్లు సమర్థంగా లక్ష్యాన్ని కాపాడుకోగలిగారు. ఈ ఓటమితో ఆసీస్ సెమీఫైనల్ ఆశలు అడుగంటిపోగా... 2022 తరహాలోనే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధమైంది. గ్రాస్ ఐలెట్: టి20 వరల్డ్‌కప్‌లో వరుసగా రెండోసారి భారత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. లీగ్ దశలో 3 మ్యాచ్‌లు నెగ్గిన టీమిండియా సూపర్–8లోనూ ఆడిన 3 మ్యాచ్‌లు గెలిచి అజేయంగా సెమీస్ చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు. ఇతర బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), దూబే (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ (17 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. జట్టు ఇన్నింగ్స్‌లో రోహిత్ ఒక్కడే 15 బౌండరీలు బాదితే, మిగతా బ్యాటర్లు కలిపి 14 బౌండరీలు కొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులే చేయగలిగింది. ట్రవిస్ హెడ్ (43 బంతుల్లో 76; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. సమష్టి బ్యాటింగ్ ప్రదర్శన... రెండో ఓవర్లో కోహ్లి (0)ని హాజల్‌వుడ్ అవుట్ చేయడంతో ఆసీస్ సంబరపడింది. కానీ ఆ తర్వాత అసలు కథ మొదలైంది. రోహిత్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లందరికీ చుక్కలు చూపించాడు. స్టార్క్ ఓవర్లో 29 పరుగులు బాదిన అతను కమిన్స్ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు కొట్టి 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ జోరు చూస్తే సెంచరీ లాంఛనమే అనిపించినా... చక్కటి యార్కర్‌తో స్టార్క్ రోహిత్‌ను బౌల్డ్ చేశాడు! తన తర్వాతి ఓవర్లో సూర్యనూ అతను వెనక్కి పంపించాడు. చివరి 5 ఓవర్లలో భారత్‌ను ఆసీస్ కట్టడి చేసింది. హెడ్ మెరుపులు... ఛేదనలో ఆసీస్ కూడా ఆరంభంలోనే వార్నర్ (6) వికెట్ కోల్పోయింది. అయితే హెడ్, మార్‡్ష ధాటిగా ఆడి రెండో వికెట్‌కు 48 బంతుల్లో 81 పరుగులు జోడించారు. హెడ్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయితే అక్షర్ అద్భుత క్యాచ్‌కు మార్‡్ష వెనుదిరగడంతో ఆసీస్ పతనం మొదలైంది. 38 పరుగుల వ్యవధిలో జట్టు తర్వాతి 5 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) స్టార్క్ 92; కోహ్లి (సి) డేవిడ్ (బి) హాజల్‌వుడ్ 0; పంత్ (సి) హాజల్‌వుడ్ (బి) స్టొయినిస్ 15; సూర్యకుమార్ (సి) వేడ్ (బి) స్టార్క్ 31; దూబే (సి) వార్నర్ (బి) స్టొయినిస్ 28; పాండ్యా (నాటౌట్) 27; జడేజా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–6, 2–93, 3–127, 4–159, 5–194. బౌలింగ్: స్టార్క్ 4–0–45–2, హాజల్‌వుడ్ 4–0–14–1, కమిన్స్ 4–0–48–0, జంపా 4–0–41 –0, స్టొయినిస్ 4–0–56–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) సూర్యకుమార్ (బి) అర్‡్షదీప్ 6; హెడ్ (సి) రోహిత్ (బి) బుమ్రా 76; మార్‡్ష (సి) అక్షర్ (బి) కుల్దీప్ 37; మ్యాక్స్‌వెల్ (బి) కుల్దీప్ 20; స్టొయినిస్ (సి) పాండ్యా (బి) అక్షర్ 2; డేవిడ్ (సి) బుమ్రా (బి) అర్‡్షదీప్ 15; వేడ్ (సి) కుల్దీప్ (బి) అర్‡్షదీప్ 1; కమిన్స్ (నాటౌట్) 11; స్టార్క్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–6, 2–87, 3–128, 4–135, 5–150, 6–153, 7–166. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–37–3, బుమ్రా 4–0–29–1, అక్షర్ పటేల్ 3–0–21–1, హార్దిక్ పాండ్యా 4–0–47–0, కుల్దీప్ యాదవ్ 4–0–24–2, జడేజా 1–0–17–0. ఒకే ఓవర్లో 29 పరుగులు... ఆసీస్ టాప్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రోహిత్ నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో రోహిత్ వరుసగా 6, 6, 4, 6 కొట్టాడు. ఐదో బంతికి పరుగు రాకపోగా, తర్వాత స్టార్క్ ‘వైడ్’ వేశాడు. దాంతో అదనపు బంతిని కూడా రోహిత్ సిక్సర్‌గా మలిచాడు. -
స్నేహితురాలిని పెళ్లాడిన ఆ్రస్టేలియా మహిళా మంత్రి
అడిలైడ్: ఆ్రస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తన చిరకాల భాగస్వామి సోఫీ అల్లౌచెను పెళ్లి చేసుకున్నారు. ఆ్రస్టేలియా పార్లమెంట్ సభ్యుల్లో మొట్టమొదటిగా స్వలింగ సంపర్కులిగా ప్రకటించుకున్న వాంగ్.. తనతోపాటు పూల బొకెతో పెళ్లి దుస్తుల్లో ఉన్న అల్లౌచె ఫొటోను ఆదివారం ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశారు. ‘మా కుటుంబసభ్యులు, ఎందరో స్నేహితులు ఈ ప్రత్యేకమైన రోజును మాతో పంచుకున్నందుకు సంతోషిస్తున్నాం’అని వాంగ్ పేర్కొన్నారు. వాంగ్, అల్లౌచె దాదాపు రెండు దశాబ్దాలుగా కలిసి ఉంటున్నారు. శనివారం అడిలైడ్‌లోని ఓ ద్రాక్ష తోటలో వారి వివాహ వేడుక జరిగినట్లు ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ తెలిపింది. సెనేట్‌లో దక్షిణ ఆస్ట్రేలియా తరఫున వాంగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ్రస్టేలియా కేబినెట్లో స్థానం సంపాదించుకున్న ఆసియా(చైనా)లో జని్మంచిన మొదటి వ్యక్తి పెన్నీ వాంగ్. ఆ్రస్టేలియాలో 2017 నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. -
కణ కవలలపై పరిశోధనలు
అక్కినేని నాగార్జున ద్విపాత్రాభియనం చేసిన సినిమా ‘హలో బ్రదర్’ గుర్తుందా? 1994లో విడుదలైన ఈ సినిమా చూసుంటే.. ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతలు అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోనీ జీలింగర్‌లు చేసిన పరిశోధనలు అర్థం చేసుకోవడం సులువవుతుంది. కణస్థాయిలో జరిగే కొన్ని భౌతిక దృగ్విషయాలను నియంత్రించడం వీలవుతుందని వీరు వేర్వేరుగా జరిపిన పరిశోధనలు స్పష్టం చేశాయి. ఫలితంగా అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ మొదలుకొని హ్యాకింగ్‌కు అస్సలు చిక్కని సమాచార వ్యవస్థల రూపకల్పనకు మార్గం సుగమమైంది. ఇంతకీ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలేమిటి? హలో బ్రదర్ సినిమా చూసుంటే వాటిని అర్థం చేసుకోవడం ఎలా సులువు అవుతుంది? దూరంగా ఉన్నప్పటికీ ఒకేలా ప్రవర్తన ముందుగా చెప్పుకున్నట్లు హలో బ్రదర్ చిత్రంలో నాగార్జునది ద్విపాత్రాభినయం. పుట్టినప్పుడే వేరైన ఇద్దరు కవలల కథ. కవలలంటే చూసేందుకు ఒకేలా ఉండేవారు మాత్రమే అని అనుకునేరు. వీరిద్దరు కొంచెం దగ్గరగా వస్తే చాలు.. ఒకరిని కొడితే ఇంకొకరికి నొప్పి కలుగుతుంది. కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే ఒకరికి నవ్వు వచ్చినా, దుఃఖం కలిగినా అదే రకమైన భావనలు రెండో వ్యక్తిలోనూ కలుగుతూంటాయి! నిజ జీవితంలో ఇలాంటి కవలలు ఉండటం అసాధ్యమేమో గానీ భౌతిక శాస్త్రంలో మాత్రం సుసాధ్యమే. సూక్ష్మ కణాల మధ్య కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ అని పిలుస్తుంటారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ కణాల్లో ఒకదానిలో జరిగే మార్పు ప్రభావం ఇంకోదాంట్లోనూ కనిపిస్తుందన్నమాట! అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్ జీలింగర్‌లు పరిశోధనలు చేసింది ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్‌పైనే. దూరంగా ఉన్నా కూడా ఒక్కతీరుగా ప్రవర్తించే కాంతి కణాల (ఫోటాన్లు)పై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలూ వేర్వేరుగా పరిశోధనలు నిర్వహించారు. ఈ ప్రయోగాల ఫలితాల ఆధారంగా కొన్ని కొత్త, వినూత్నమైన టెక్నాలజీలు రూపుదిద్దుకున్నాయి. ఫలితంగా చాలాకాలంగా కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితమైన కొన్ని విషయాలు వాస్తవ రూపం దాల్చడం మొదలైంది. లెక్కకు చిక్కనంత వేగంగా పనిచేసే కంప్యూటర్లు, అతి సురక్షితమైన సమాచార వ్యవస్థలు వీటిల్లో మచ్చుకు కొన్ని మాత్రమే. చిరకాల శేష ప్రశ్నలు నిజానికి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్పై చాలాకాలంగా ఎన్నో శేష ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. రెండు కణాలు దూరంగా ఉన్నా ఒకేలా ప్రవర్తించడం వెనుక ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చాలానే జరిగాయి. 1960వ దశకంలో జాన్ స్టూవర్ట్ బెల్ అనే శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. గుర్తు తెలియని అంశాలు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సేకరించే కొలతల ఫలితాలు నిర్దిష్టమైన విలువకు మించి ఉండవని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఈ ‘‘బెల్స్ అసమానత’’లు నిర్దిష్ట ప్రయోగాల్లో చెల్లవని క్వాంటమ్ మెకానిక్స్ చెబుతుంది. ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతల్లో ఒకరైన జాన్ ఎఫ్ క్లాసర్ గతంలోని స్టూవర్ట్ బెల్ సిద్ధాంతాలను మరింత అభివృద్ధి చేయడమే కాకుండా.. లెక్కలకు మాత్రమే పరిమితం కాకుండా వాస్తవిక ప్రయోగాలు చేపట్టారు. క్వాంటమ్ మెకానిక్స్‌లో ‘‘బెల్స్ అసమానత’’లు పనిచేయవని స్పష్టమైంది. అలెన్ ఆస్పెక్ట్ ఈ విషయాలను మరింత ముందుకు తీసుకెళుతూ.. జాన్ క్లాసర్ ప్రయోగాల్లోని కొన్ని లోపాలను సరిదిద్దే వ్యవస్థను రూపొందించారు. వీరిద్దరి ప్రయోగాల ఫలితాల ఆధారంగా ఆంటోనీ జీలింగర్ ఎంటాంగిల్‌మెంట్ స్థితిలో ఉన్న కణాలను నియంత్రించవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
T20 World Cup 2022: అంపైర్ల జాబితా ప్రకటన.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామానికి మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఆక్టోబర్ 16 నుంచి ఈ మెగా ఈవెంట్ తొలి రౌండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 16న నమీబియాతో శ్రీలంక తలపడనుంది. ఇక ఆక్టోబర్ 22 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. సూపర్-12 మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఆడనుంది. కాగా ఈ మెగా ఈవెంట్ కోసం మ్యాచ్ రిఫెరీలు, అంపైర్ల జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ జాబితాలో నలుగురు మ్యాచ్ రిఫరీలు, 16 మంది అంపైర్లు ఉన్నారు. కాగా భారత్ నుంచి ఐసీసీ ఎలైట్ అంపైర్ నితిన్ మీనన్‌కు స్థానం దక్కింది. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భాధ్యత వహించిన అదే 16 మంది అంపైర్లను ఐసీసీ ఎంపిక చేసింది. వారిలో నితిన్ మీనన్, రిచర్డ్ కెటిల్‌బరో, కుమార ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, అలీం దార్ వంటి సీనియర్ అంపైర్లు ఉన్నారు. ఇక మ్యాచ్ రిఫరీలగా ఆండ్రూ పైక్రాఫ్ట్, క్రిస్టోఫర్ బ్రాడ్, డేవిడ్ బూన్, రంజన్ మడుగల్లె ఎంపికయ్యారు. టీ20 ప్రపంచకప్-2022కు అంపైర్లు: అడ్రియన్ హోల్డ్‌స్టాక్, అలీమ్ దార్, అహ్సన్ రజా, క్రిస్టోఫర్ బ్రౌన్, క్రిస్టోఫర్ గఫానీ, జోయెల్ విల్సన్, కుమార ధర్మసేన, లాంగ్టన్ రుసెరే, మరైస్ ఎరాస్మస్, మైఖేల్ గోఫ్, నితిన్ మీనన్, పాల్ రీఫిల్, పాల్ విల్సన్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరోక్, రిచర్డ్ కెటిల్‌బరోక్ మ్యాచ్ రిఫరీలు: ఆండ్రూ పైక్రాఫ్ట్, క్రిస్టోఫర్ బ్రాడ్, డేవిడ్ బూన్, రంజన్ మడుగల్లె చదవండి: Jasprit Bumrah: 'నేను ధైర్యంగానే ఉన్నా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం కావడంపై బుమ్రా స్పందన -
T20 World Cup: అయ్యో బుమ్రా..!
టి20 ప్రపంచకప్‌కు బయల్దేరక ముందే భారత క్రికెట్ జట్టుకు పెద్ద షాక్! ఆసీస్ గడ్డపై జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించగలడని భావించిన స్టార్ పేసర్ ఇప్పుడు టోర్నీకే దూరం కానున్నాడు. వెన్ను నొప్పి గాయం (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా నొప్పి తిరగబెట్టడంతో తప్పనిసరిగా ఆటకు విరామం పలకాల్సి వచ్చింది. దాంతో అతను టి20 ప్రపంచకప్ వెళ్లే అవకాశం లేదని తేలిపోయింది. ఇప్పటికే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో మెగా టోర్నీనుంచి తప్పుకోగా, ఇప్పుడు బుమ్రా కూడా లేకపోవడం టీమిండియాను బలహీనంగా మార్చింది. న్యూఢిల్లీ: గాయంనుంచి కోలుకొని విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టిన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆట రెండు మ్యాచ్‌లకే పరిమితమైంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో, మూడో టి20లో ఆడిన అతను బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టి20నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నాడు. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్లో బుమ్రాకు వెన్ను నొప్పి వచ్చిందని, అందుకే మ్యాచ్ ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఆ వెన్ను బాధ అంతటితో ఆగిపోలేదని బుధవారం సాయంత్రం తేలింది. తిరువనంతపురంనుంచి బుమ్రా నేరుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి చేరుకున్నాడు. పరీక్షల అనంతరం గాయం తీవ్రమైందని తేలగా, కొన్ని నెలల పాటు ఆటకు దూరం కావాల్సి ఉందని అర్థమైంది. బీసీసీఐ అధికారికంగా బుమ్రా గాయంపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటన చేయకపోయినా...బోర్డు ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘బుమ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ టి20 ప్రపంచకప్ ఆడే అవకాశం లేదు. అతని వెన్ను గాయం చాలా తీవ్రమైంది. స్ట్రెస్ ఫ్రాక్చర్ కాబట్టి కోలుకునేందుకు కనీసం ఆరు నెలలు పడుతుంది’ అని ఆయన వెల్లడించారు. వరల్డ్ కప్‌కు ప్రకటించిన జట్టులో స్టాండ్‌బైలుగా ఇద్దరు పేసర్లు అందుబాటులో ఉన్నారు. మొహమ్మద్ షమీ లేదా దీపక్ చహర్‌లలో ఒకరిని ప్రధాన జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బుమ్రా గాయాన్ని బీసీసీఐ వైద్యులు పర్యవేక్షిస్తారని, టీమ్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న అక్టోబర్ 15 వరకు వేచి చూడవచ్చని చెబుతున్నా... పూర్తి ఫిట్‌గా లేని ఆటగాడిని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లే సాహసం టీమ్ మేనేజ్మెంట్ చేయకపోవచ్చు. బలమే బలహీనతై... ‘బుమ్రా పూర్తి స్థాయిలో మళ్లీ బౌలింగ్ చేయడం సంతోషంగా అనిపిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే వెన్ను నొప్పితో రెండు నెలలు విశ్రాంతి తీసుకొని మళ్లీ బౌలింగ్ చేయడం అంత సులువు కాదు. అతని ప్రదర్శన ఎలా ఉందన్నది అనవసరం. మెల్లగా లయ అందుకుంటున్నాడు. అతను తిరిగి రావడమే విశేషం. ’...ఆసీస్‌తో రెండో టి20 తర్వాత బుమ్రా గురించి రోహిత్ వ్యాఖ్య ఇది. అయితే మరో మ్యాచ్‌కే గాయం తిరగబెట్టి బుమ్రా మళ్లీ అందుబాటులో లేకుండా పోతాడని బహుశా రోహిత్ కూడా ఊహించి ఉండడు. విజయావకాశాలు ప్రభావితం చేయగల తన స్టార్ బౌలర్ లేకపోవడం ఏ కెప్టెన్‌కైనా లోటే. అయితే బుమ్రా గాయాన్ని బోర్డు వైద్యులు, ఎన్సీఏ పర్యవేక్షించిన తీరే సరిగా కనిపించడం లేదు. బుమ్రా విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా ఏమీ ఆడటం లేదు. బోర్డు రొటేషన్ పాలసీ, వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతను చాలా తక్కువ మ్యాచ్‌లే ఆడాడు. 2022లో అతను ఐపీఎల్‌తో పాటు 5 టెస్టులు, 5 వన్డేలు, 5 అంతర్జాతీయ టి20లు మాత్రమే ఆడాడు. నిజానికి బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చర్ కొత్త కాదు. 2019లోనే అతను ఇదే బాధతో మూడు నెలలు ఆటకు దూరమయ్యాడు. నిపుణులు చెప్పినదాని ప్రకారం అతని భిన్నమైన శైలే అందుకు ప్రధాన కారణం. వెన్నునొప్పితోనే అతను ఇటీవలే ఆసియా కప్‌లోనూ ఆడలేదు. అయితే సరిగ్గా ఇక్కడే టీమ్ మేనేజ్మెంట్ తొందరపాటు కనిపిస్తోంది. అతను పూర్తి స్థాయిలో కోలుకోకుండానే ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేసినట్లుగా అనిపిస్తోంది. లేదంటే ఎన్సీఏ బుమ్రా గాయాన్ని సరిగ్గా అంచనా వేయలేక తగినంత రీహాబిలిటేషన్ లేకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఉంది. ఎందుకంటే పూర్తి ఫిట్‌గా ఉంటే రెండు మ్యాచ్‌లకే గాయం తిరగబెట్టడం ఊహించలేనిది. ‘తక్కువ రనప్‌తో ఫాస్ట్ బౌలింగ్ చేసేందుకు బుమ్రా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎంత కాలం ఇలా అతని శరీరం సహకరిస్తుందనేదే నా సందేహం. అది మానవశరీరం. మెషీన్ కాదు’ అని రెండేళ్ల క్రితం దిగ్గజ పేసర్ మైకేల్ హోల్డింగ్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు వాస్తవంగా మారినట్లు అనిపిస్తోంది. -
టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన నమీబియా
టీ20 ప్రపంచకప్-2022కు 16 మంది సభ్యలతో కూడిన తమ జట్టును నమీబియా క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు గెర్హార్డ్ ఎరాస్మస్ సారథ్యం వహించనున్నాడు. నమీబియా యువ బ్యాటర్లు లోహన్ లౌరెన్స్, దివాన్ లా కాక్, పేసర్ తంగేని లుంగమేని తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనున్నారు. కాగా గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నమీబియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్ వంటి జట్లును ఓడించి టీ20 ప్రపంచకప్-2021లో సూపర్ 12 దశకు నమీబియా చేరుకుంది. సూపర్-12లో తమ పోరాట పటమతో అందరినీ నమీబియా అకట్టుకుంది. ఇక టీ20 ప్రపంచకప్-2022 రౌండ్-1లో గ్రూప్ Aలో శ్రీలంక, నెదర్లాండ్స్, యూఏఈ వంటి జట్లతో నమీబియా తలపడనుంది. కాగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌కు నమీబియా జట్టు: గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జెజె స్మిత్, దివాన్ లా కాక్, స్టీఫెన్ బార్డ్, నికోల్ లాఫ్టీ ఈటన్, జాన్ ఫ్రైలింక్, డేవిడ్ వైస్, రూబెన్ ట్రంపెల్మాన్, జేన్ గ్రీన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, టాంగెని లుంగమేని, మైఖేల్ వాన్ లింగేన్, బెన్ షికోన్‌గోస్ట్, బెన్ షికోన్‌గోస్ట్, , లోహన్ లౌరెన్స్, హెలావో యా ఫ్రాన్స్. చదవండి: Urvashi Rautela: లైట్ తీసుకున్న పంత్.. చేతులు జోడించి సారీ చెప్పిన ఊర్వశి.. వీడియో వైరల్! -
బీచ్‌లో ఎంజాయ్ చేసేందుకే..రూ.5లక్షల కోట్ల కంపెనీకి సీఈవో రాజీనామా!
వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే పట్టించుకోవడం లేదు. నిట్ట నిలువునా నడిరోడ్డు మీద వదిలిస్తున్నారు. కానీ లక్షల కోట్ల విలువైన ఓ దిగ్గజ కంపెనీ సీఈవో అలా చేయలేదు. తల్లిదండ్రుల కోసం సీఈవో జాబ్‌ను తృణ ప్రాయంగా వదిలేశారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రుల పట్ల కాఠిన్యం ప్రదర్శించే కొడుకులకు కనువిప్పును కలిగిస్తుంటే..తోటి సీఈవోలగా ఆదర్శంగా నిలుస్తోంది. బ్లూం బర్గ్ కథనం ప్రకారం..యూకేకి చెందిన జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్ సంస్థ సీఈవోగా ఆండ్రూ ఫార్మికా విధులు నిర్వహిస్తున్నారు. జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ వ్యాల్యూ అక్షరాల 5లక్షల కోట్లు. ఆ సంస్థ సీఈవోగా ఉన్న ఆండ్రూ తన జాబ్‌కు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రిజైన్ కార్పొరేట్ దిగ్గజాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుండగా.. సీఈవో పదవి నుంచి తప్పుకోవడంపై ఆండ్రూ బ్లూంబర్గ్‌కు వివరణిచ్చారు. బీచ్‌లో కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. నా రాజీనామాకు ఇంతకు మించిన కారణాలు ఏం లేవని అనుకుంటున్నట్లు చెప్పారు. కంపెనీ బోర్డ్‌కు ఏం చెప్పారంటే సీఈవో పదవి నుంచి వైదొలగడంపై ఇప్పటికే ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఆండ్రూ స్పష్టత నిచ్చినట్లు (అంచనా మాత్రమే) పలు నివేదికలు చెబుతున్నాయి. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, వారి కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు అతను చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వైదొలిగినప్పటికీ, ఆండ్రూ ఫార్మికా జూన్ 2023 వరకు వ్యాపారంలో కొనసాగుతారు. కొత్త నాయకత్వంలో వ్యాపార కార్యకలాపాలు సజావుగా ఉండేలా ఆసియా వ్యాపారానికి మద్దతు ఇవ్వడం, ఆస్ట్రేలియన్ మార్కెట్‌పై పట్టసాధించేలా నిర్దేశించిన వ్యూహాత్మక లక్ష్యాల్ని చేరుకునేందుకు సహాయ పడనున్నట్లు జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్ బోర్డ్ సభ్యులు తెలిపారు. ఆండ్రూ వారసుడిగా మాథ్యూ బిస్లీ "మార్కెట్లో మనం చేస్తున్న వ్యాపారం నిలుపుకోవడం సవాలుతో కూడుకుంది. సీఈవో హోదాలో అదే పనిని నేను అద్భుతంగా,అంకితభావంతో చేసినందుకు గర్వపడుతున్నాను" అని ఆండ్రూ తెలిపారు. బోర్డు నా వారసుడిగా మాథ్యూ బీస్లీని నియమించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. చదవండి👉 ఎలన్ మస్క్ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్! -
ఆటో పైలెట్‌ని నమ్ముకుంది.. ఇప్పుడు కష్టాలపాలయ్యింది ?
టెస్లా ఆటోపైలెట్ ఫీచర్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసును మెల్బోర్న్ కోర్టు విచారిస్తుండగా నిందితురాలు ఆటో పైలెట్ అంశాన్ని ప్రస్తావించడంతో ఒక్కసారిగా ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది దృష్టిని ఆకర్షించింది. భారత సంతతి యువతి సాక్షి అగర్వాల్ ఇటీవల ఓ రోడ్డు ప్రమాదానికి కారణమైంది. టెస్లాకి చెందిన మోడల్ 3 కారులో ప్రయాణిస్తున్న సాక్షి అగర్వాల్ రోడ్డుపై ట్రామ్ ఎక్కేందుకు ప్రయత్నిస్తోన్న నికోల్ లాగోస్ అనే మహిళను కారుతో ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన కేసు మెల్బోర్న్ కోర్టులు విచారణకు వచ్చింది. కోర్టు విచారణలో నిందితురాలు సాక్షి అగర్వాల్ మాట్లాడుతూ.. ట్రామ్ మరింత ముందుకు వెళ్లి ఆగుతుందని తాను భావించానని అందువలేల్ల కారును సకాలంలో అదుపు చేయలేకపోయానంటూ ఆమె తెలిపారు. పైగా ప్రమాదం జరిగినప్పుడు కారు ఆటో పైలెట్ మోడ్‌లో ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టు తుది తీర్పును వెల్లడించలేదు. కేసు విచారణ దశలోనే ఉంది. A 23-year-old driver is accused of hitting an aged care worker in Melbourne - claiming her Tesla was on autopilot at the time. Police say the P-plater left the scene and returned hours later to speak to officers. @penelopeliersch #9News pic.twitter.com/U0xEqAPUkk — 9News Melbourne (@9NewsMelb) March 22, 2022 డ్రైవర్ సాయం లేకుండా కారు నడిపే టెక్నాలజీని టెస్లా కార్లలో అందుబాటులోకి తెస్తామంటూ ఎలన్ మస్క్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో కాకపోయినా డ్రైవర్ నామమాత్రపు కంట్రోల్లో ఉండే ఆటోపైలెట్ ఆప్షన్ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే అమెరికాలో ఈ ఆటోపైలెట్ మోడ్‌పై అభ్యంతరాలు ఉన్నాయి. ఇంతలో ఆస్ట్రేలియాలో మరో కేసు వెలుగు చూసింది. -
శ్రీలంక జట్టులో కీలక పరిణామం.. కోచ్‌గా లసిత్ మలింగ!
శ్రీలంక జట్టులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఆ జట్టు దిగ్గజం లసిత్ మలింగ ఎంపికయ్యే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు మలింగని కన్సల్టెంట్ కోచ్‌గా నియమించాలని హై-ప్రొఫైల్ క్రికెట్ అడ్వైజరీ కమిటీ శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సిఫార్సు చేసింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇక గత ఏడాదిలో అన్ని ఫార్మాట్ల నుంచి మలింగను తప్పుకున్న సంగతి తెలిసిందే. తన టీ20 కేరిర్‌లో 390 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా తొమ్మిది వన్డేల్లో శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించిన మలింగ ఒక్క సారి కూడా జట్టును గెలిపించ లేకపోయాడు. అదే విధంగా 24 టీ20ల్లో సారధ్యం వహించిన మలింగకు 15 సార్లు పరాజయం ఎదురైంది. ఇక అతడితో పాటు మహేల జయవర్ధనే కూడా కన్సల్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. చదవండి: Ind Vs WI: 458 పరుగులు.. 17 వికెట్లు.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి.. ఆ ఇద్దరికి బంపర్ ఛాన్స్.. ఏకంగా విండీస్‌తో సిరీస్‌తో.. -
ఏటీపీ కప్‌నుంచి తప్పుకున్న జొకోవిచ్..
వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ 2022 తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. శనివారంనుంచి సిడ్నీలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ సన్నాహక టోర్నీ ఏటీపీ కప్‌నుంచి అతను తప్పుకోవడం దీనికి మరింత బలం చేకూర్చింది. వ్యాక్సినేషన్ పూర్తయినవారే ఆడాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలు విధించగా... వ్యాక్సిన్ వేసుకోని జొకోవిచ్ మొదటినుంచి దీనిని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. చదవండి: SA Vs IND: "అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్.. దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపిస్తున్నాడు" -
విజయం దిశగా ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ ఆశలు ఆవిరి!
అడిలైడ్: యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ విజయానికి ఆరు వికెట్ల దూరంలో నిలిచింది. 468 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 43.2 ఓవర్లలో 4 వికెట్లకు 82 పరుగులు చేసింది. బర్న్స్ (34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆటకు నేడు చివరి రోజు. మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాలంటే ఇంగ్లండ్ ఆఖరి రోజు 90 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 45/1తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను 61 ఓవర్లలో 9 వికెట్లకు 230 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మార్నస్ లబుషేన్ (51; 6 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (51; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. చదవండి: Yash Dhull: ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేశారు! -
ఐసీసీ సీఈవోగా ఆసీస్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్...
ICC Appoints Geoff Allardice As Permanent CEO: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సీఈవోగా ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ అలార్డైస్ నియమితులయ్యారు. ఎనిమిది నెలలకు పైగా తాత్కాలిక సీఈవోగా ఉన్న జెఫ్ అలార్డైస్‌ను శాశ్వత సీఈవోగా నియమిస్తున్నట్లు ఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఆసీస్ మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆటగాడైన జెఫ్.. గతంలో ఐసీసీ జనరల్ మేనేజర్ గా కూడా పని చేశారు. ఐసీసీ సీఈవోగా జెఫ్ అలార్డైస్ భాధ్యతలు చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే తెలిపాడు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. "ఐసీసీ సీఈవోగా భాధ్యతలు స్వీకరించడానికి జెఫ్ అంగీకరించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇటీవలే ముగిసిన పురుషుల టీ20 ప్రపంచకప్ ను అద్భుతంగా నిర్వహించడంలో జెఫ్ కీలక మైన పాత్రపోషించాడు. అతడికి క్రికెట్‌పైన అపారమైన అనభవం ఉంది. రాబోయే దశాబ్దంలో ఐసీసీ చాలా కీలకమైన టోర్నీలు నిర్హహిస్తుంది. ఈ క్రమంలో మా సభ్యులతో కలిసి పనిచేయడానికి అతడే సరైన వ్యక్తి అని గ్రెగ్ బార్క్లే పేర్కొన్నాడు. చదవండి:WI vs SL: తలకు బలంగా తగిలిన బంతి.. ఫీల్డ్‌లోనే కుప్పకూలాడు -
ఆ జట్టే టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్: సునీల్ గావస్కర్
Sunil Gavaskar picks his favourite team to lift famous trophy: టీ20 ప్రపంచకప్2021లో తుది పోరుకు సమయం అసన్నమైంది. టీ20 ప్రపంచకప్ విజేత ఎవరో అనేది మరి కొద్ది గంట్లో తేలిపోనుంది. ఆదివారం(నవంబర్14) దుబాయ్ వేదికగా జరగనున్న ఈ తుది సమరంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే విజేత ఎవరన్నది భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అంచనా వేశాడు. ఐసీసీ ఈవెంట్ల నాకౌట్ రౌండ్లలో ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉన్న నేపథ్యంలో ఆ జట్టే టైటిల్ ఫేవరేట్ అని అభిప్రాయపడ్డాడు. "ఐసీసీ ఈవెంట్ నాకౌట్ దశలో ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉంది. వాళ్లకు ఈ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ జట్టు కీలక మ్యాచ్‌ల్లో ఓడిన సందర్బాలు కంటే గెలిచిన సందర్బాలే ఎక్కువ. వాళ్లు తమదైన రోజున ప్రత్యర్ధి జట్టును చిత్తుగా ఓడించగలరు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తొలి సారి టీ20 ప్రపంచకప్ ట్రోఫిని ఆస్ట్రేలియన్లు కైవసం చేసుకుంటారు" అని గావస్కర్ పేర్కొన్నాడు. చదవండి: T20 World Cup 2021: టైటిల్ రేసులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఎవరి బలం ఎంతంటే? -
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ కన్నుమూత...
Alan Davidson: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ అలాన్ డేవిడ్సన్(92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిడ్నీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో వెల్లడించింది. 44 టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన డేవిడ్సన్ 186 వికెట్లు సాధించాడు. 1959లో కాన్పూర్ టెస్టులో భారత్‌పై 7 వికెట్లు పడగొట్టి తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాలును నమోదు చేశారు. 193 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అతడు 6804 పరుగులు, 672 వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 World Cup 2021 Pak Vs Afg: టిక్కెట్లు లేకుండానే.. ఫ్యాన్స్ రచ్చ.. ఐసీసీ క్షమాపణలు -
ఆస్గ్రిడ్ కోసం ఇన్ఫీ, మైక్రోసాఫ్ట్ జత
న్యూఢిల్లీ: క్లౌడ్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలు అందించేందుకు తాజాగా ఐటీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ చేతులు కలిపాయి. తద్వారా ఆ్రస్టేలియా తూర్పుతీర ప్రాంతంలోని విద్యుత్ పంపిణీ దిగ్గజం ఆస్గ్రిడ్కు కొన్నేళ్లపాటు సేవలు అందించనున్నాయి. ఇందుకు వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తాము సమకూర్చనున్న సరీ్వసుల మద్దతుతో ఆస్గ్రిడ్ కస్టమర్లకు అందుబాటులో నమ్మకమైన నిరంతర సరీ్వసులను అందించేందుకు వీలుంటుందని ఇన్ఫోసిస్ పేర్కొంది. 40 లక్షలమంది ఆస్ట్రేలియన్లకు ప్రతిరోజూ అత్యున్నత ప్రమాణాలతో అందిస్తున్న అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దవలసి ఉన్నట్లు ఆస్గ్రిడ్ సీఐవో నిక్ క్రోవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో నెట్‌వర్క్‌ను మరింత నమ్మదగిన స్థాయిలో మెరుగుపరుస్తామని, తద్వారా విద్యుత్ ధరలు తగ్గేందుకు వీలుంటుందన్నారు. కొత్త సరీ్వసులను మార్కెట్లో చౌక గా, వేగవంతంగా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. వెరసి క్లౌడ్ ప్రోగ్రామ్ ద్వారా ఆస్గ్రిడ్ వ్యయాల అదుపుతోపాటు.. ఐటీ వ్యవస్థ పనితీరు బలపడనున్నట్లు పేర్కొన్నారు. ఎంటర్ప్రైజ్ ఆధారిత క్లౌడ్ సరీ్వసుల వినియోగం పెరుగుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఆ్రస్టేలియా ప్రధాన అధికారి రాచెల్ బాండీ అన్నారు. పలు బిజినెస్‌ల వృద్ధికి కీలకంగా నిలుస్తున్నట్లు చెప్పారు. ఇన్ఫోసిస్, ఆస్గ్రిడ్లతో జట్టుకట్టడం ద్వారా మైక్రోసాఫ్ట్ అజూర్ శక్తిని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. -
డెంటల్ డాక్టర్‌ను పెళ్లాడిన 'సాహో' భామ
బాలీవుడ్ బ్యూటీ ఎవెలిన్ శర్మ వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన దంతవైద్యుడు తుషన్ బిండీతో ఎవెలిన్ పెళ్లి జరిగింది. 2019లో నిశ్చితార్థం చేసుకున్న తుషన్, ఎవెలిన్ అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో కోవిడ్ నియమ నిబంధనలతో ఈ ఏడాది మే 15న బ్రిస్బేన్‌లో వివాహం చేసుకున్నారు. తాజాగా తన పెళ్లి ఫొటోలను ఎవెలిన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నన్ను బాగా అర్థం చేసుకున్న నా బెస్ట్ ఫ్రెండ్ నా జీవితభాగస్వామి అయ్యారు. మేం ఇద్దరం కలిసి భార్యాభర్తలుగా జీవిస్తున్నందుకు చాలా హ్యాపీ. న్యూ లైఫ్.. న్యూ స్టార్ట్’’ అని పేర్కొన్నారు ఎవెలిన్. ‘ఏ జవానీ హై దీవాని, మై తేరా హీరో, జబ్ హ్యారీ మెట్ సెజల్’ వంటి హిందీ చిత్రాల్లో నటించారు ఎవెలిన్. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’లో ఎవెలిన్ ఓ కీలక పాత్ర చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
‘బిగ్‌బాష్’లో షఫాలీ, రాధ
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ టీనేజ్ సెన్సేషన్ షఫాలీ వర్మకు మరో మంచి అవకాశం లభించింది. ఇంగ్లండ్‌లో జరిగే ‘హండ్రెడ్’లో బర్మింగ్‌హామ్ ఫోనిక్స్‌కు ఆడనున్న షఫాలీ... ఆస్ట్రేలియాలో జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నమెంట్లో కూడా బరిలోకి దిగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. లీగ్‌లో ఆమె సిడ్నీ సిక్సర్స్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న 17 ఏళ్ల షఫాలీ, భారత్ తరఫున 22 మ్యాచ్‌లలో 148.31 స్ట్రయిక్‌రేట్‌తో 617 పరుగులు చేసింది. మరో భారత క్రీడాకారిణి, 21 ఏళ్ల రాధా యాదవ్ కూడా బిగ్‌బాష్‌లో ఆడే అవకాశం ఉంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్‌తో కూడా సిడ్నీ సిక్సర్స్ టీమ్ చర్చలు తుది దశకు చేరాయని సమాచారం. బిగ్‌బాష్ లీగ్‌లో భారత్ నుంచి గతంలో హర్మన్‌ప్రీత్ (సిడ్నీ థండర్), స్మృతి మంధాన (బ్రిస్బేన్ హీట్స్), వేద కృష్ణమూర్తి (హోబర్ట్ హరికేన్స్) ప్రాతినిధ్యం వహించారు. -
ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనక ఓ విషాదం
అయిదేళ్ల ఆ చిన్నారి పేరు రెండు వారాల కిందట ఆసీస్ ప్రసార మాధ్యమాల్లో మార్మోగింది. కారణం.. ఓ ప్రాణాంతక వ్యాధిపై పోరుకోసం చేయనున్న చట్ట సవరణ ప్రతిపాదన బిల్లుకు ఆ చిన్నారి పేరు పెట్టడమే. దీనిని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ ఏకంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఆ చట్టం మావె లా.. ఆ చిన్నారి పేరు మావె హుడ్. విప్లవాత్మక చట్ట సవరణకు ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనక ఓ విషాదం దాగి ఉంది. సారా హుడ్, జోయెల్ హుడ్ దంపతుల మూడో కూతురు మావె హుడ్. ఐదు నెలల వయసులో తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది మావెలో. వైద్యుల పర్యవేక్షణ, చికిత్సతో కోలుకున్నప్పటికీ ఆ తర్వాతా అనేక సమస్యలు వెంటాడాయి. 18 నెలల వయసులో చిన్నారి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈసారి పాపను పరీక్షించిన వైద్యులు.. మైటోకాండ్రియా లోపంతో వచ్చే లీ సిండ్రోమ్‌కు గురైనట్లు గుర్తించారు. పాపను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ, అప్పటికప్పుడు మాత్రలతో వ్యాధి తీవ్రతను తగ్గించి, మరణాన్ని వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదన్నారు డాక్టర్లు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ పాప పరిస్థితికి తల్లఢిల్లినా, పాపను అప్రమత్తంగా చూసుకోసాగారు. ఇటీవల ఈ విషయం పత్రికల ద్వారా ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్‌కు చేరింది. మావె పడుతున్న కష్టాలను తెలుసుకున్న ఆయన దేశంలో మరే చిన్నారికీ ఇలాంటి అవస్థ రాకూడదంటే ఏం చేయాలో చెప్పాలని వైద్యులనడిగారు. డీఎన్ఏ మార్పిడి ద్వారా ఈ సమస్య పరిష్కరించవచ్చని వాళ్లు చెప్పారు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే.. తల్లి గర్భిణిగా ఉన్నప్పడు చిన్నారిలోని ఆమె డీఎన్ఏ స్థానంలో మరొకరి నాణ్యమైన డీఎన్ఏను ఐవీఎఫ్ పద్ధతిలో ప్రవేశపెడితే ప్రాణాంతక వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చని వివరించారు. అయితే, ఇది కష్టమైన పని. ఎందుకంటే డీఎన్ఏ మార్పిడిపై ఆసీస్‌లో నిషేధం ఉంది. దీంతో ఈ చట్టాన్ని సవరించేందుకు గ్రెగ్ హంట్ తీర్మానించాడు. అందులో భాగంగానే చట్ట సవరణ కోరుతూ బిల్లు ప్రవేశపెట్టడంతోపాటు, ఆ బిల్లుకు మావె పేరు పెట్టాడు. నిజానికి ఆస్ట్రేలియాలో ఏటా కనీసం 56 మంది చిన్నారులు మైటోకాండ్రియా డిసీజ్‌తో జన్మిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందులో చాలామంది ఐదేళ్లలోపే మరణిస్తున్నారు. ఈ పరిస్థితిని పరిష్కరించి, పసిప్రాణాలను కాపాడడం, తల్లిదండ్రుల కడుపుకోతను అడ్డుకోవాలనే తన ప్రయత్నానికి మనఃస్ఫూర్తిగా సహకరించాలని గ్రెగ్ హంట్ పార్లమెంట్లో విపక్ష సభ్యులందరినీ కోరాడు. ఈ చట్ట సవరణకు ఆమోదం లభిస్తే ఆ తరువాత ఆస్ట్రేలియాలో మైటోకాండ్రియాతో చిన్నారులు మరణించడమేనేది ఉండకపోవచ్చు. మైటోకాండ్రియా డిసీజ్ అంటే... మనిషిని పట్టి పీడించే ప్రాణాంతక వ్యాధుల్లో ఇదొకటి. మన శరీరానికి కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుందనే విషయం తెలిసిందే కదా. అయితే, ఆహారం జీర్ణమై శక్తిగా రూపొందడంలో కీలకంగా వ్యవహరించే పాత్ర మన శరీరంలోని ఉండే కణాల్లోని మైటోకాండ్రియాదే. ఏ కారణం వల్ల అయినా మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోయినా, నిర్జీవమైనా మన శరీరానికి తగిన శక్తి ఆహారం నుంచి అందదు. ఫలితంగా రకరకాల రుగ్మతలు వస్తాయి. అందులో ముఖ్యమైనది ఆర్గాన్ ఫెయిల్యూర్.. అంటే అవయవం పనిచేయకపోవడం. ఇది మరణానికి దారి తీస్తుంది. అలాగే గుండెపోటు, చెవుడు, దృష్టిలోపం, నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం వంటివీ సంభవిస్తాయి. జన్యులోపం వల్లో, వంశపారంపర్యంగానో, జీవన శైలిలో మార్పుల వల్లో వచ్చే ఈ వ్యాధికి ఇప్పటికీ సరైన చికిత్స లేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేలోగా ఎప్పుడైనా సరే ఈ వ్యాధి వచ్చే ప్రమాదముంది. -
‘36’ పీడ కల.. మనసు కుదుటపడింది!
ఎంత వద్దనుకున్నా ‘36’ జ్ఞాపకాలు ఒకవైపు వెంటాడుతూనే ఉంటాయి... అటు ఆటతో, ఇటు మాటతో కూడా జట్టును నడిపించే నాయకుడు వెళ్లిపోయాడు... మ్యాచ్‌కు ముందు ప్రధాన పేసర్ దూరమైతే, మ్యాచ్ మధ్యలో మరో పేసర్ బంతి వేయలేని పరిస్థితి... బరిలో ఇద్దరు కొత్త ఆటగాళ్లు... ఆపై టాస్ కూడా ముఖం చాటేసింది... ఇలాంటి ప్రతికూలతలకు ఎదురీది భారత జట్టు మెల్బోర్న్లో మరపురాని విజయాన్ని అందుకుంది. గత 20 ఏళ్లలో విదేశీ గడ్డపై భారత్ పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. పెర్త్ (2007), జొహన్నెస్‌బర్గ్ (2006), హెడింగ్లీ (2002), డర్బన్ (2010), అడిలైడ్ (2018), ట్రెంట్‌బ్రిడ్జ్ (2007)... వాటిలో కొన్ని. వాటితో పోలిస్తే తాజా విజయం ఏ స్థానంలో నిలుస్తుంది, దీని ప్రత్యేకత ఏమిటి? గత ఘనతలతో సరిగ్గా పోల్చి చూడటం సరైంది కాకపోవచ్చు. ఏ మ్యాచ్ గొప్పతనం దానిదే. కానీ ప్రస్తుతం జట్టు ఉన్న స్థితిని చూస్తే ఇది చెప్పుకోదగ్గ ఘనతగానే కనిపిస్తుంది. గత మ్యాచ్ పరాభవాన్ని మరచి ఇలాంటి గెలుపు సాధించడం అంటే ఆట మాత్రమే ఉంటే సరిపోదు. అంతకుముందు మానసిక దృఢత్వం, పోరాటతత్వం కూడా ఉండాలి. రహానే సేన దానిని ఇప్పుడు సరిగ్గా ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌కు ముందు గత 50 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డపై ఒక విదేశీ జట్టు 0–1తో వెనుకబడి తర్వాతి మ్యాచ్‌లో నెగ్గడం రెండుసార్లు మాత్రమే జరిగింది. ఇప్పుడు టీమిండియా దానిని చేసి చూపించింది. ప్రత్యర్థి స్కోరును రెండుసార్లు కూడా 200 దాటకుండా కట్టడి చేయడంలోనే మన బౌలింగ్ సత్తా కనిపించింది. బుమ్రా ఎప్పటిలాగే శుభారంభం అందిస్తే విదేశీ గడ్డపై మనకు కొత్త అశ్విన్ కనిపించాడు. అనుభవంకొద్దీ రాటుదేలిన ఈ స్పిన్నర్ కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. విదేశీ గడ్డపై గత 14 టెస్టుల్లో కేవలం 25.8 సగటుతో అశ్విన్ 54 వికెట్లు తీయడం అతని బౌలింగ్ పదునెక్కిన తీరు ఏమిటో చెబుతుంది. ఇక అశ్విన్‌కు సరి జోడీగా జడేజా చూపించిన ఆట కూడా ఆసీస్‌ను దెబ్బ కొట్టింది. విదేశాల్లో మూడేళ్ల తర్వాత వీరిద్దరు ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడి జట్టును గెలిపించారు. ఇక బ్యాటిం గ్లో జడేజా ఇచ్చే అదనపు విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుజారా రెండు ఇన్నింగ్స్‌లలో విఫలమైనా... రహానే మొత్తం భారాన్ని మోసి శతకం సాధించడంతో పాటు ఫీల్డింగ్ వ్యూహాల్లో కెప్టెన్ జట్టును నడిపించిన తీరుపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిశాయి. ఎవరి గురించి ఎంత చెప్పినా మెల్బోర్న్ టెస్టు గిల్, సిరాజ్‌లకు అందరికంటే ప్రత్యేకంగా నిలుస్తుంది. వీరిద్దరి ఆట చూస్తే తొలి టెస్టు ఆడుతున్నట్లుగా ఏమాత్రం కనిపించలేదు. మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడమే కాకుండా... ఆసాం తం అదే జోష్‌ను ప్రదర్శించిన హైదరాబాదీ సిరాజ్ అందరి మనసులు గెలుచుకు న్నాడు. ఇక గిల్ ఆడిన క్లాసికల్ షాట్లు అతనికి మంచి భవిష్యత్తు ఉందని చూపించాయి. సిరీస్ తుది ఫలితం ఎలాగైనా ఉండ వచ్చు కానీ తాజా ప్రదర్శన మాత్రం భారత అభిమానుల్లో సంతోషం నింపిందనేది వాస్తవం. కొసమెరుపు... మ్యాచ్ గెలిచిన తర్వాత భారత జట్టు ఏమైనా సంబరాలు చేసుకున్నట్లు కనిపించిందా... గాల్లోకి పంచ్‌లు విసురుతూ డగౌట్‌లోని ఆటగాళ్లు కూడా ఉత్సాహం ప్రదర్శించడం చూశామా... అసలు ఏమీ జరగనట్లు, ఏదో ఒక రొటీన్ మ్యాచ్ ఆడినట్లు, ఇలా గెలవడం తమకు కొత్త కాదన్నట్లు, ఇకపై ఆస్ట్రేలియాలో గెలవడం అద్భుతంగా భావించరాదని, మున్ముందు చాలా వస్తాయన్నట్లుగా మనోళ్ల స్పందన కనిపించింది. సిరీస్‌కు ముందు కోహ్లి చెప్పినట్లుగా ‘న్యూ ఇండియా’ అంటే ఇదే కావచ్చేమో! (చదవండి: రహానే అన్ని ప్రశంసలకు అర్హుడు: రవిశాస్త్రి) -
రవీంద్ర-చహల్ విజయం
వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ గెలిచిన ఉత్సాహంతో భారత జట్టు అదే వేదికపై టి20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో సాధారణ స్కోరే సాధించినా... యజువేంద్ర చహల్, నటరాజన్ బౌలింగ్‌తో విజయం దిశగా సాగింది. అంతకుముందు కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీకి తోడు రవీంద్ర జడేజా మెరుపులు జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా, ఆతిథ్య జట్టు మాత్రం అతి సాధారణ ప్రదర్శనతో తేలిపోయింది. అయితే విజయంలోనూ జడేజా–చహల్ ‘కన్కషన్’ వివాదం మ్యాచ్ ఫలితంకంటే ఎక్కువ చర్చ రేపింది. కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో ఆస్టేలియాను ఓడించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, రవీంద్ర జడేజా (23 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. అనంతరం ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులకే పరిమితమైంది. ఫించ్ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), డార్సీ షార్ట్ (38 బంతుల్లో 34; 3 ఫోర్లు), హెన్రిక్స్ (20 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. గాయపడ్డ జడేజా స్థానంలో ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’గా తుది జట్టులోకి వచ్చిన స్పిన్నర్ యజువేంద్ర చహల్ (3/25) మూడు కీలక వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన నటరాజన్ (3/30) కూడా ఆకట్టుకున్నాడు. జడేజా మెరుపులు... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. ధావన్ (1)ను స్టార్క్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఐపీఎల్లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రాహుల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. అబాట్ బౌలింగ్‌లో రాహుల్ వరుసగా 4, 6 కొట్టగా పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 42 పరుగులకు చేరింది. అయితే తర్వాతి ఓవర్లోనే కోహ్లి (9)ని అవుట్ చేసి స్వెప్సన్ దెబ్బ తీశాడు. 37 బంతుల్లో రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, సామ్సన్ (15 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే ఆరు పరుగుల వ్యవధిలో భారత్ సామ్సన్, మనీశ్ పాండే (2), రాహుల్ వికెట్లు కోల్పోయింది. హార్దిక్ (16) కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ దశలో జడేజా ఇన్నింగ్స్ జట్టుకు చెప్పుకో దగ్గ స్కోరును అందించింది. హాజల్‌వుడ్ వేసిన 19వ ఓవర్లో తొలి బంతిని ఫోర్‌గా మలచిన జడేజా... చివరి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 4 బాదాడు. చివరి ఓవర్లో కూడా అతను మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఆకట్టుకున్న నటరాజన్... సాధారణ లక్ష్య ఛేదనను ఆసీస్ ఓపెనర్లు డార్సీ షార్ట్, ఫించ్ మెరుగ్గానే ప్రారంభించారు. దీపక్ చహర్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లతో 14 పరుగులు వచ్చాయి. షమీ ఓవర్లోనూ 12 పరుగులు రాబట్టిన ఆసీస్ పవర్‌ప్లేలో 53 పరుగులు నమోదు చేసింది. తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో పాండే, కోహ్లి క్యాచ్‌లు వదిలేసినా... స్పిన్నర్ చహల్ రాకతో మ్యాచ్ మలుపు తిరిగింది. తొలి వికెట్‌కు 46 బంతుల్లో 56 పరుగులు జోడించిన అనంతరం హార్దిక్ పాండ్యా పట్టిన అద్భుత క్యాచ్‌తో ఫించ్ వెనుదిరిగాడు. చహల్ తన తర్వాతి ఓవర్లోనే స్మిత్ (12)ను కూడా అవుట్ చేశాడు. ఈసారి సామ్సన్ సూపర్ క్యాచ్ అందుకోగా, మ్యాక్స్‌వెల్ (2)ను ఎల్బీగా అవుట్ చేసిన నటరాజన్ తన కెరీర్లో తొలి వికెట్ సాధించాడు. ఆ తర్వాత హెన్రిక్స్ కొంత ప్రయత్నించడం మినహా ఆసీస్ గెలుపునకు చేరువగా రాలేకపోయింది. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 27 పరుగులు కావాల్సి ఉండగా ఆ జట్టు 15 పరుగులే చేసింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) అబాట్ (బి) హెన్రిక్స్ 51; ధావన్ (బి) స్టార్క్ 1; కోహ్లి (సి అండ్ బి) స్వెప్సన్ 9; సామ్సన్ (సి) స్వెప్సన్ (బి) హెన్రిక్స్ 23; మనీశ్ పాండే (సి) హాజల్‌వుడ్ (బి) జంపా 2; హార్దిక్ (సి) స్మిత్ (బి) హెన్రిక్స్ 16; జడేజా (నాటౌట్) 44; సుందర్ (సి) అబాట్ (బి) స్టార్క్ 7; దీపక్ చహర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–11; 2–48; 3–86; 4–90; 5–92; 6–114; 7–152. బౌలింగ్: స్టార్క్ 4–0–34–2; హాజల్‌వుడ్ 4–0–39–0; జంపా 4–0–20–1; అబాట్ 2–0–23–0; స్వెప్సన్ 2–0–21–1; హెన్రిక్స్ 4–0–22–3. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డార్సీ షార్ట్ (సి) హార్దిక్ (బి) నటరాజన్ 34; ఫించ్ (సి) హార్దిక్ (బి) చహల్ 35; స్మిత్ (సి) సామ్సన్ (బి) చహల్ 12; మ్యాక్స్‌వెల్ (ఎల్బీ) (బి) నటరాజన్ 2; హెన్రిక్స్ (ఎల్బీ) (బి) చహర్ 30; వేడ్ (సి) కోహ్లి (బి) చహల్ 7; అబాట్ (నాటౌట్) 12; స్టార్క్ (బి) నటరాజన్ 1; స్వెప్సన్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–56; 2–72; 3–75; 4–113; 5–122; 6–126; 7–127. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–29–1; సుందర్ 4–0–16–0; షమీ 4–0–46–0; నటరాజన్ 4–0–30–3; చహల్ 4–0–25–3. హార్దిక్ పాండ్యా అద్భుత క్యాచ్ కండరాల నొప్పితో కూలబడ్డ జడేజా -
ఆసీస్ మహిళలదే సిరీస్
బ్రిస్బేన్: అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా అత్యధిక వన్డేలు (21) గెలిచిన తమ పురుషుల జట్టు రికార్డును సమం చేసేందుకు ఆస్ట్రేలియా మహిళల టీమ్ మరింత చేరువైంది. సోమవారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ మహిళల టీమ్‌పై విజయం సాధించింది. ఆసీస్‌కు ఇది వరుసగా 20వ వన్డే విజయం కావడం విశేషం. 2003లో రికీ పాంటింగ్ నాయకత్వంలోని కంగారూ జట్టు వరుసగా 21 వన్డేలు గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫీ డివైన్ (115 బంతుల్లో 79; 7 ఫోర్లు), అమేలీ సాటర్‌వైట్ (73 బంతుల్లో 69; 9 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. జెస్ జొనాసెన్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం ఆసీస్ 45.1 ఓవర్లలో 6 వికెట్లకు 255 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (96 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అజేయ శతకం సాధించగా, రాచెల్ హేన్స్ (89 బంతుల్లో 82; 13 ఫోర్లు, 1 సిక్స్) సహకరించింది. లానింగ్‌కు ఇది 14వ వన్డే సెంచరీ కావడం విశేషం. ఈ గెలుపుతో ఆసీస్ మహిళల జట్టు మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది. -
ధన్యవాదాలు వర్ఘీస్
తల్లి కువైట్‌లో ఉంది. తండ్రి ఇండియాలో ఉన్నాడు. షరాన్ వర్ఘీస్ ఆస్ట్రేలియాలో ఉంది. కరోనా అంతటా ఉంది. తల్లి నర్సు. కూతురు నర్సింగ్ డిగ్రీ పూర్తయింది. ‘‘అమ్మా.. ఏం చేయమంటావ్’’ అని అడిగింది. ‘‘నీ ఇష్టం.. నేనైతే వదిలి రాలేను’’ అంది. ఆమె వదిలి రాలేనన్నది కువైట్‌లోని కరోనా రోగులను. కూతురు కూడా ఆస్ట్రేలియాను వదల్లేదు. వృద్ధులకు సేవ చేస్తూ అక్కడే ఉండిపోయింది. ఈ యువ నర్సుకు గిల్‌క్రీస్ట్ ధన్యవాదాలు తెలిపాడు. షరాన్, ఆడమ్ గిల్‌క్రీస్ట్ షరాన్ వర్ఘీస్ బియస్సీ నర్సింగ్ పూర్తి చేసి యూనివర్సిటీ బయటికి అడుగు పెట్టే వేళకు కరోనా ఆస్ట్రేలియా వరకు వచ్చేసింది. వచ్చేసింది కానీ, మరికొంతకాలమైనా ఉండకుండా పోయేది కాదని అప్పటికెవరికీ తెలీదు. షరాన్ నర్సుగా అక్కడే తన పేరు నమోదు చేసుకుని ఉంది. తొలి ఉద్యోగాన్ని ఏదైనా పెద్ద ఆసుపత్రిలో వెతుక్కోవడమే మిగిలింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా నుంచి విదేశీయుల తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి! కరోనా భయంతో అంతా విమానాశ్రయాలకు చేరుకుంటున్నారు. షరాన్ సందిగ్ధంలో పడింది. కేరళలో తనకు మంచి ఉద్యోగం దొరక్కపోదు. వెళ్లడమా? ఉండటమా? ‘‘అమ్మా... ఏం చేయమంటావ్?’ అని కువైట్‌లో ఉన్న తల్లికి ఫోన్ చేసింది. ఆమె కూడా నర్సే. కువైట్‌లో చేస్తున్నారు. ‘‘నేను ఇక్కడే ఉండిపోతాను. వీళ్లనిలా వదిలేసి రాలేదు’’ అన్నారు ఆవిడ! అది మనసులో పడిపోయింది షరాన్‌కు. తనూ ఆస్ట్రేలియాలోనే ఉండిపోదలచుకుంది. అయితే ఆసుపత్రిలో కాకుండా వృద్ధులకు మాత్రమే వైద్యసేవలు (జెరియాట్రిక్) అందించే ఆరోగ్య కేంద్రంలో చేరింది. ఆస్ట్రేలియాలో 60 ఏళ్లు పైబడిన వారి జనాభా ఎక్కువ. వారికి సేవలు అందించడానికి అందుబాటులో ఉండే నర్సుల సంఖ్య తక్కువ. అందుకే షరాన్ జెరియాట్రిక్ నర్స్ అయింది. అప్పటికి కరోనా కూడా ఆస్ట్రేలియా అంతటికీ విస్తరించింది. కరోనా నుంచి వృద్ధులను కాపాడటం అంటే ఒళ్లంతా హూనం చేసుకోవడం మాత్రమే కాదు. ఒళ్లంతా కళ్లు చేసుకోవడం కూడా. ∙∙ రోజుకు ఆరేడు గంటలు పని చేస్తోంది షారన్. కరోనా భయంతో దూర ప్రాంతాల్లో ఉండే నర్సులు రావడం మానేశారు. కొంతమంది రాగలిగి ఉన్నా ఇంట్లో పసిపిల్లలు ఉండటంతో జాగ్రత్తకోసం ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ పని కూడా షరాన్ మీదే పడింది. కష్టమనుకోలేదు షరాన్. ‘‘వదిలేసి రాలేను’’ అని తల్లి అన్నమాట ఆమెకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోంది. నాలుగు నెలలుగా అవిశ్రాంతంగా వృద్ధుల్ని కనిపెట్టుకుని ఉంటోంది షారన్. ఇటీవల ఓ రోజు.. షరాన్ చదివొచ్చిన ఉలాంగ్గాంగ్ యూనివర్సిటీ నుంచి ఆమెకు ఒక మెయిల్ వచ్చింది. యూనివర్సిటీలోని కోవిడ్ –19 హెల్ప్ గ్రూప్ పంపిన మెయిల్ అది. విదేశాల నుంచి వచ్చి ఆస్ట్రేలియాలో వైద్యసేవలు అందిస్తున్న నర్సులు తమ ఉద్యోగ వివరాలను తెలియజేయాలని హెల్ప్ గ్రూప్ కోరింది. షరాన్ వెంటనే తన వివరాలు మెయిల్ చేసింది. వీడియో తీసి పంపమని మళ్లీ ఒక మెయిల్ వచ్చింది. షరాన్ కాస్త తీరిక చేసుకుని అప్పటికప్పుడు కోటు వేసుకుని, కొంచెం లిప్‌స్టిక్ అద్దుకుని.. ‘హాయ్.. నేను షరాన్’ అంటూ తన వివరాలను రికార్డ్ చేసి పంపింది. ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయింది.. కొన్ని రోజుల తర్వాత తనకు ఫోన్లు, మెజేస్‌లు వరదలా వచ్చి పడేవరకు! అవి కేరళ నుంచి, కువైట్ నుంచి.. ఇంకా విదేశాల్లో ఉన్న స్నేహితుల నుంచి. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రీస్ట్ ఆ అమ్మాయికి ధన్యవాదాలు తెలిపాడని! ఆస్ట్రేలియాలోనే ఉండి ఇక్కడి వారికి సేవ చేయాలనుకున్న షరాన్‌కు, మిగతా భారతీయ విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతున్న గిల్క్ట్రీస్ వీడియో క్లిప్ అప్పటికే వైరల్ అవుతోంది. ‘‘మా నాన్న దేనినీ మెచ్చరు. ఆయన క్రికెట్ అభిమాని. గిల్‌క్రీస్ట్ నన్ను ప్రశంసించారు అనగానే ఫోన్ చేసి ‘వెల్ డన్’ అన్నారు అని సంతోషపడిపోయింది షరాన్. ఇక కేరళలో ఉన్న ఆమె తమ్ముడు, అతడి ఫ్రెండ్స్ అయితే సోషల్ మీడియాలో ఇంచుమించు ఒక ఉత్సవాన్నే జరుపుకుంటున్నారు. షరాన్కి ఇదంతా థ్రిల్లింగ్‌గా ఉంది. ∙∙ కొట్టాయంలోని కురుప్పుంత్ర షరాన్ వర్ఘీస్ స్వస్థలం. తల్లి ఎప్పట్నుంచో కువైట్‌లో నర్సు. షరాన్ తల్లి దగ్గరే ఉండి స్కూల్‌కి వెళ్లింది. ఆస్ట్రేలియాలో కాలేజ్ చదువు. సెలవుల్లో కేరళ వచ్చి వెళ్తుంటుంది. ఇక రెండేళ్ల వరకు ఉలాంగ్గాంగ్ ను వదిలి వెళ్లేది లేదని అంటోంది. ఆ ప్రాంతంలోనే ఒక ‘ఏజ్డ్ కేర్’ సెంటర్లో తనిప్పుడు పని చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించడం తనకు ఇష్టమని అంటోంది. -
పెళ్లి పత్రికల్లో మత్తు పదార్థాలు పెట్టి..
సాక్షి, బెంగళూరు : బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో భారీమొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. పెళ్లిపత్రికల్లో రహస్యంగా తరలిస్తున్న రూ.5.05కోట్ల విలువైన ఎఫెడ్రిన్ అనే మత్తు మందును సీజ్ చేశారు. శనివారం 5.49 కేజీల డ్రగ్స్‌ను పెళ్లిపత్రికల్లో గుట్టుగా అమర్చి తరలిస్తుండగా కార్గో విభాగంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.మదురైకి చెందిన వ్యక్తి డ్రగ్స్ దాచిన 43 శుభలేఖలను ఆస్ట్రేలియాకు తరలిస్తున్నాడు. కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా పత్రికల మధ్య అమర్చిన ఎఫెడ్రిన్ ప్యాకెట్లు బయటపడ్డాయి. 18న రూ.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత ఇదే కార్గో విభాగంలో ఈ నెల 18న బట్టలు కుట్టే యంత్రంలో రూ.5 కోట్ల ఖరీదైన ఎఫెడ్రిన్‌ను రవాణా చేస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడం కలవరపరుస్తోంది. దీంతో కస్టమ్స్ అధికారులు మరింత లోతుగా తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో నిందితులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. తరచుగా డ్రగ్స్ రవాణా కేసులు బయటపడడం చూస్తుంటే మత్తు రవాణాకు దుండగులు బెంగళూరు ఎయిర్‌పోర్టును ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల్లో తనిఖీలను ముమ్మరం చేయడంతో ఇక్కడి నుంచి స్మగ్లింగ్‌కు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
కరోనా మృతులు 56
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. రోజు రోజుకి కరోనా వైరస్ కాటేసిన వారి సంఖ్య పెరిగిపోతోంది. శరవేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. దీంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికి కరోనా వైరస్ సోకి 56 మంది ప్రాణాలు కోల్పోగా 2వేల కరోనా కేసులు నమోదైనట్టు చైనా సర్కార్ ప్రకటించింది. వివిధ దేశాలకు విస్తరణ చైనాలో వూహాన్ నగరంలో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్ మెల్లమెల్లగా అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంగ్‌కాంగ్, మలేసియా, నేపాల్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్, థాయ్‌ల్యాండ్, వియత్నాం తదితర దేశాలకు వ్యాపించింది. పాకిస్తాన్‌కు కూడా ఈ వైరస్ విస్తరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా నుంచి వచ్చిన నలుగురు పాకిస్తానీయులకి ముల్తానా, లాహోర్ నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చైనాలో ఉన్న అమెరికా పౌరులు, సిబ్బందిని వెనక్కి తీసుకురావడానికి ఆ దేశం ప్రత్యేక విమానాన్ని పంపింది. ఫ్రాన్స్ ప్రత్యేకంగా బస్సుల్ని ఏర్పాటు చేసి తమ దేశ పౌరుల్ని వెనక్కి తీసుకువచ్చేస్తోంది. భారత్‌లోనూ భయాందోళనలు చైనా నుంచి భారత్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో క్షుణ్నంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు ఉన్న వారిని ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరికీ ఈ వైరస్ సోకినట్టు అధికారికంగా వెల్లడి కాలేదు. చైనాలో ఉన్న భారతీయుల క్షేమ సమాచారాలు బీజింగ్‌లో భారత్ రాయబార కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టుగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జై శంకర్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ వైరస్‌కి కేంద్రమైన వూహాన్ నగరంలో 250 మంది వరకు భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. వారికి ఎలాంటి సాయమైనా అందించడానికి భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మాంసం విక్రయంపై నిషేధం చైనాలో విస్తృతంగా మాంసాహారాన్ని వినియోగిస్తారు. అడవి జంతువుల్ని ఎక్కువగా చంపి తింటారు. కరోనా వైరస్ మొదట్లో సీఫుడ్ నుంచి వచ్చిందని భావించారు. కానీ తాజా పరిశోధనల్లో పాముల నుంచి ఇతర అడవి జంతువులకి సోకి వారి నుంచి మనుషులకి సోకినట్టు వెల్లడైంది. దీంతో అడవి జంతువుల మాంసం వ్యాపారాలపై చైనా ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. వాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో చైనా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ ఉండడంతో దానికి వాక్సిన్ కనుగొనడానికి శాస్త్రవేత్తలు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవల ఉన్నతాధికారుల సమావేశంలో కరోనా విస్తరణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన శాస్త్రవేత్తలు దీనికి వాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు చేస్తున్ట శాస్త్రవేత్త జూ వెంబో వెల్లడించారు. -
ప్రియా సెంచరీ వృథా
బ్రిస్బేన్: తొలి వన్డేలో భారీ విజయం సాధించిన భారత మహిళల ‘ఎ’ జట్టు రెండో వన్డేలో మాత్రం తడబడింది. ఆస్ట్రేలియా ‘ఎ’తో మూడు అనధికారిక వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 81 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ‘ఎ’ 50 ఓవర్లలో 5 వికెట్లకు 315 పరుగులు చేసింది. జార్జియా రెడ్మేన్ (128 బంతుల్లో 113; 10 ఫోర్లు, సిక్స్), ఎరిన్ అలెగ్జాండ్రా బర్న్స్ (59 బంతుల్లో 107; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. భారత ‘ఎ’ బౌలర్లలో దేవిక వైద్యకు రెండు వికెట్లు లభించాయి. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ‘ఎ’ 44.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ప్రియా పూనియా (127 బంతుల్లో 112; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), షెఫాలీ వర్మ (36 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్) తొలి వికెట్‌కు 17 ఓవర్లలో 98 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే షెఫాలీ అవుటయ్యాక... ప్రియా సెంచరీ పూర్తి చేసుకోగా... మిగతా వారు క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. హేమలత, అరుంధతి రెడ్డి, అనూజా పాటిల్, తనూజ కన్వర్ ఖాతా తెరవకుండానే అవుటయ్యారు. ఫలితంగా భారత ‘ఎ’ మహిళలకు ఓటమి తప్పలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో వన్డే సోమవారం జరుగుతుంది. -
మొండి ధైర్యం ప్రదర్శించిన స్మిత్
లండన్: అది ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 77వ ఓవర్. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 152 బంతుల్లో 80 పరుగులతో ఆడుతున్నాడు. క్రీజు మొత్తం నాదే అన్నట్లు కదులుతూ, మంచి బంతులను దీటుగా ఆడుతూ, వీలు చిక్కితే బౌండరీలు బాదుతూ ఇంగ్లండ్ బౌలర్లకు చిర్రెత్తిస్తున్నాడు. నిలకడగా 145 నుంచి 155 కి.మీ. వేగంతో వస్తున్న ఆర్చర్ బంతులను కాచుకుంటూ జట్టు స్కోరును 200 దాటించాడు. అప్పటికీ ఆర్చర్ వేసిన 71వ ఓవర్ చివరి బంతి బలంగా తగిలి స్మిత్ ఎడమచేయి వాచిపోయింది. అయినా, మొండిగా ఆడిన అతడు 80ల్లోకి వచ్చాడు. సెంచరీ చేసేలా కనిపించాడు.అంతలోనే అనూహ్య ఘటన...! పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన 77వ ఓవర్ రెండో బంతి నేరుగా స్మిత్ మెడకు తగిలింది. 149 కిలోమీటర్ల వేగంతో షార్ట్ లెంగ్త్‌లో వచ్చిన ఆ బంతిని తప్పించుకోలేకపోయిన అతడు కుప్పకూలాడు. వెల్లకిలా పడుకుని నొప్పితో విలవిల్లాడాడు. మైదానంలో ఒక్కసారిగా కలవరం. జట్టు డాక్టర్ పరుగు పరుగున వచ్చాడు. ఆర్చర్ మినహా ఇంగ్లండ్ ఆటగాళ్లు స్మిత్ చుట్టూ చేరిపోయారు. 2014 నాటి ఫిల్ హ్యూస్ ఉదంతం తలచుకుని అటు ఆస్ట్రేలియా టీంలోనూ కంగారు.కాస్త దిమ్మెరపోయినప్పటికీ స్మిత్ వెంటనే పైకి లేచాడు. డాక్టర్‌తో సంభాషించి రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. అయితే 9 ఓవర్ల అనంతరం వచ్చి వోక్స్ బౌలింగ్‌లో రెండు వరుస బౌండరీలు బాదాడు. వోక్స్ మరుసటి ఓవర్లో ఓ ఫోర్ కొట్టి వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో యాషెస్ రెండో టెస్టు నాలుగో రోజు శనివారం ఇరు జట్ల ఆట కంటే ఈ ఘటనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొత్తానికి సెంచరీ చేజారినా స్టీవ్ స్మిత్ (161 బంతుల్లో 92; 14 ఫోర్లు) మరో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను ఆదుకున్నాడు. అతడి పోరాటంతో తొలి ఇన్నింగ్స్‌లో జట్టు 250 పరుగులకు ఆలౌటై ఇంగ్లండ్ స్కోరు (258)కు దగ్గరగా వచ్చింది. 8 పరుగుల స్వల్ప ఆధిక్యంతో అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆతిథ్య జట్టును కమిన్స్ (2/16), సిడిల్ (2/19) దెబ్బకొట్టారు. కెప్టెన్ జో రూట్ (0)డకౌట్ అయ్యాడు. రోజు ముగిసేసరికి ఇంగ్లండ్ 96/4 తో నిలిచింది. ఆ జట్టు 104 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్మిత్ వర్సెస్ ఆర్చర్ ఓవర్‌నైట్ స్కోరు 80/4తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్‌కు ఎప్పటిలాగే స్మిత్ ఆపద్బాంధవుడయ్యాడు. మాథ్యూ వేడ్ (6) తొందరగానే ఔటైనా, కెప్టెన్ టిమ్ పైన్ (70 బంతుల్లో 23; 2 ఫోర్లు); కమిన్స్ (80 బంతుల్లో 20; 3 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. ఈ క్రమంలోనే యాషెస్‌లో వరుసగా ఏడో అర్ధ శతకాన్ని (107 బంతుల్లో) సాధించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లంచ్ తర్వాత స్మిత్ వర్సెస్ ఆర్చర్‌గా సాగింది. ఆర్చర్ వేసిన 8 ఓవర్ల స్పెల్ భీకరంగా సాగింది. స్మిత్‌కు 73వ ఓవర్ చివరి బంతిని అతడు 155 కి.మీ. వేగంతో సంధించడం గమనార్హం. -
బైబై ఇండియా..!
భారత్‌ను వీడి విదేశాల్లో ఆశ్రయం పొందాలనుకుంటున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతర్యుద్ధం, రాజకీయ సంక్షోభం వంటి సమస్యలు లేకపోయినా విదేశాల్లో ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ తెలిపింది. 2008–18 మధ్యకాలంలో ఇలా విదేశాలను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య ఏకంగా 996.33 శాతానికి ఎగబాకిందని వెల్లడించింది. ఇలా ఆశ్రయం కోరుతున్నవారిలో అత్యధికులు అమెరికా, కెనడా దే శాలవైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొంది. సాధారణంగా అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత ఇతర కారణాలతో ప్రజలు ప్రాణాలను అరచేతపెట్టుకుని పారిపోతుంటారు. ఈ తరహా సమస్యలు ఏవీ లేకపోయినా భారత్ నుంచి భారీగా వలసలు పెరగడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితం పరిస్థితి వేరు... పదేళ్ళ క్రితం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. 2008–09 మధ్యకాలంలో అమెరికా, కెనడాల ఆశ్రయాన్ని కోరుతూ కేవలం 282 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కానీ గత పదేళ్ళలో ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయి 22,967కి చేరుకుంది. 2018లో అమెరికా ఆశ్రయాన్ని కోరుకున్న భారతీయుల సంఖ్య 28,489కు పెరగ్గా, కెనడా ఆశ్రయాన్ని కోరుకున్న వారి సంఖ్య 5,522కు చేరుకుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అమెరికా, కెనడాల తర్వాత భారతీయులు ఆశ్రయం కోరిన దేశాల్లో దక్షిణాఫ్రికా(4,329), ఆస్ట్రేలియా(3,584), దక్షిణకొరియా(1,657), జర్మనీ(1,313) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి వలస వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ పేదరికం, అంతర్యుద్ధం, విపరీతమైన హింస ఉండే యెమెన్, సూడాన్, బోస్నియా, బురుండి వంటి దేశాలను కూడా భారతీయులు ఆశ్రయం కోరడం అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులను విస్మయంలో పడేస్తోంది. 2018లో ఇలాంటి 57 దేశాల్లో భారతీయులు ఆశ్రయాన్ని కోరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత్‌లో నెలకొన్న అసహనం కారణంగానే ఇలా ప్రజలు విదేశీ ఆశ్రయం కోరుతున్నారని మరికొందరు వాదిస్తున్నారు. భారత్‌కు వస్తున్నవారు తక్కువే... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఆశ్రయిస్తోన్న శరణార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా 35.03 లక్షల మంది శరణార్థులు వేర్వేరు దేశాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారు 11,957 మంది(0.34 శాతం) మాత్రమే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2018 చివరికినాటికి భారత్ 1.95 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది. ప్రాంతాలవారీగా చూసుకుంటే పాకిస్తాన్ 14.04 లక్షల మంది విదేశీయులకు ఆశ్రయం ఇచ్చింది. వీరిలో అత్యధికులు ఆఫ్గన్లు. 9.06 లక్షల మందితో బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రోహింగ్యాలు వీరిలో అత్యధికంగా ఉన్నారు. -
ఆసీస్ అదరహో
భారత్ చేతిలో పరాజయం తర్వాత ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఒక్కసారిగా చెలరేగుతోంది. గత రెండు మ్యాచ్‌లలో పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించి జోరు పెంచిన కంగారూలు ఇప్పుడు ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకున్నారు. తనదైన శైలిలో చెలరేగిన డేవిడ్ వార్నర్ మరో భారీ సెంచరీతో కదం తొక్కగా... ఉస్మాన్ ఖాజా, ఫించ్ అండగా నిలిచి భారీ స్కోరుకు కారణమయ్యారు. చిన్నదైన ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో బంగ్లా పేలవ బౌలింగ్‌ను చితక్కొట్టిన ఆసీస్ పరుగుల వరద పారించింది. కొండంత లక్ష్యం ముందుండగా బంగ్లా పోరాడేందుకు సిద్ధమైంది. సీనియర్లు ముష్ఫికర్, మహ్ముదుల్లా, తమీమ్, షకీబ్ తమ స్థాయిలో గట్టిగా ప్రయత్నించినా... వన్డేల్లో తమ అత్యధిక స్కోరు చేసినా విజయానికి చేరువలో రాలేకపోయింది. గత మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతో విండీస్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటిన బంగ్లా... ఆసీస్ పదునైన బౌలింగ్‌లో మాత్రం చివరి వరకు అదే ధాటిని కనబర్చలేక ఓటమిపాలైంది. నాటింగ్‌హామ్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌లో ఐదో విజయంతో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. గురువారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 48 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (147 బంతుల్లో 166; 14 ఫోర్లు, 5 సిక్సర్లు) కెరీర్లో 16వ సెంచరీ సాధించాడు. ఉస్మాన్ ఖాజా (72 బంతుల్లో 89; 10 ఫోర్లు), ఆరోన్ ఫించ్ (51 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించారు. తొలి వికెట్‌కు ఫించ్‌తో 121 పరుగులు జోడించిన వార్నర్, రెండో వికెట్‌కు ఖాజాతో 192 పరుగులు జత చేశాడు. అనంతరం బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 333 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (97 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో ఏడో సెంచరీ సాధించగా... మహ్ముదుల్లా (50 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), తమీమ్ ఇక్బాల్ (74 బంతుల్లో 62; 6 ఫోర్లు), షకీబ్ అల్ హసన్ (41 బంతుల్లో 41; 4 ఫోర్లు) రాణించారు. రెండు శతక భాగస్వామ్యాలు... ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వార్నర్, ఫించ్ మరోసారి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. గత మ్యాచ్‌లో ఫించ్ భారీ సెంచరీతో చెలరేగిపోతే ఈసారి ఆ బాధ్యతను వార్నర్ తీసుకున్నాడు. వీరిద్దరి చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను షబ్బీర్ వదిలేయడం ఆసీస్‌కు కలిసొచ్చింది. పది ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 53 పరుగులకు చేరింది. ఇదే జోరులో ముందుగా వార్నర్ 55 బంతుల్లో, ఆ తర్వాత ఫించ్ 47 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఎట్టకేలకు ఫించ్‌ను తన తొలి ఓవర్లోనే ఔట్ చేసి పార్ట్‌టైమర్ సౌమ్య సర్కార్ ఓపెనింగ్ జోడీని విడదీశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఖాజా వార్నర్‌కు చక్కటి సహకారం అందించాడు. షకీబ్ బౌలింగ్‌లో సింగిల్‌తో ఈ ప్రపంచ కప్‌లో వార్నర్ రెండో సెంచరీ (110 బంతుల్లో) పూర్తయింది. అనంతరం సైతం వార్నర్, ఖాజా దూకుడు తగ్గకుండా ఆడారు. ఫలితంగా ప్రపంచకప్ చరిత్రలో ఆసీస్ తొలిసారి మొదటి రెండు వికెట్లకు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసింది. సరిగ్గా 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఖాజా.. ముస్తఫిజుర్ వేసిన ఇన్నింగ్స్ 42వ ఓవర్లో పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్లో 4 ఫోర్లు కొట్టిన మొత్తం 19 పరుగులు రాబట్టడం విశేషం. వార్నర్ ధాటిని కొనసాగిస్తూ 150 పరుగుల మైలురాయి (139 బంతుల్లో) అధిగమించాడు. చివరకు సర్కార్ బౌలింగ్‌లోనే థర్డ్‌మ్యాన్‌కు క్యాచ్ ఇవ్వడంతో అతడి అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. నంబర్ 4లో దిగిన మ్యాక్స్‌వెల్ (10 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు అదరగొట్టాడు. రూబెల్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 6 బాదాడు. ఖాజా మరో ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్లో 25 పరుగులు వచ్చాయి. రెండు పరుగుల వ్యవధిలో ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఖాజాతో సమన్వయ లోపంతో మ్యాక్సీ రనౌట్ కాగా... ఖాజా, స్మిత్ (1) వెంటవెంటనే వెనుదిరిగారు. 49 ఓవర్ల తర్వాత వర్షంతో ఆట ఆగిపోయినా... కొద్ది సేపటికి అంపైర్లు మళ్లీ కొనసాగించారు. చివరి ఓవర్లో స్టొయినిస్ (17 నాటౌట్) రెండు ఫోర్లు కొట్టడంతో మరో 13 పరుగులు జతచేరాయి. చివరి పది ఓవర్లలో ఆస్ట్రేలియా ఏకంగా 131 పరుగులు సాధించడం విశేషం. రాణించిన షకీబ్... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాకు పేలవ ఆరంభం లభించింది. లేని సింగిల్ తీసే ప్రయత్నంలో సౌమ్య సర్కార్ (10) రనౌట్ కావడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఇద్దరు సీనియర్లు తమీమ్, షకీబ్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. సూపర్ ఫామ్‌లో ఉన్న షకీబ్ అదే జోరును కొనసాగించగా, తమీమ్ సొగసైన షాట్లు ఆడారు. ఫలితంగా పవర్‌ప్లే ఆసీస్‌లాగే బంగ్లా సరిగ్గా 53 పరుగులు చేసింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించాక స్టొయినిస్ బౌలింగ్‌లో షకీబ్ వెనుదిరిగాడు. 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తమీమ్‌ను అద్భుత బంతితో స్టార్క్ బౌల్డ్ చేయడంతో బంగ్లా కష్టాల్లో పడింది. లిటన్ దాస్ (20) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ దశలో ముష్ఫికర్, మహ్ముదుల్లా జోడి బంగ్లా బృందంలో విజయంపై ఆశలు రేపింది. వీరిద్దరు ఒకరితో పోటీ పడి మరొకరు దూకుడుగా ఆడారు. 54 బంతుల్లో ముష్ఫికర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, జంపా ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన మహ్ముదుల్లా 41 బంతుల్లోనే ఆ మైలురాయిని అందుకున్నాడు. 80 బంతుల్లోనే ఈ భాగస్వామ్యం 100 పరుగులు దాటడం విశేషం. సాధించాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోయిన పరిస్థితుల్లో... 28 బంతుల్లో 80 పరుగులు చేయాల్సి ఉండగా మహ్ముదుల్లా, షబ్బీర్ (0)లను వరుస బంతుల్లో కూల్టర్ నైల్ ఔట్ చేయడంతో బంగ్లా పరాజయం ఖాయమైంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) రూబెల్ (బి) సర్కార్ 166; ఫించ్ (సి) రూబెల్ (బి) సర్కార్ 53; ఖాజా (సి) ముష్ఫికర్ (బి) సర్కార్ 89; మ్యాక్స్‌వెల్ (రనౌట్) 32; స్టొయినిస్ (నాటౌట్) 17; స్మిత్ (ఎల్బీ) (బి) ముస్తఫిజుర్ 1; క్యారీ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ) 381. వికెట్ల పతనం: 1–121, 2–313, 3–352, 4–353, 5–354. బౌలింగ్: మొర్తజా 8–0–56–0, ముస్తఫిజుర్ 9–0–69–1, షకీబ్ 6–0–50–0, రూబెల్ 9–0–83–0, మెహదీ హసన్ 10–0–59–0, సర్కార్ 8–0–58–3. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (బి) స్టార్క్ 62; సర్కార్ (రనౌట్) 10; షకీబ్ (సి) వార్నర్ (బి) స్టొయినిస్ 41; ముష్ఫికర్ (నాటౌట్) 102; లిటన్ దాస్ (ఎల్బీ) (బి) జంపా 20; మహ్ముదుల్లా (సి) కమిన్స్ (బి) కూల్టర్‌నైల్ 69; షబ్బీర్ రహమాన్ (బి) కూల్టర్‌నైల్ 0; మెహదీ హసన్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 6; మొర్తజా (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టొయినిస్ 6; ఎక్స్‌ట్రాలు 17, మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 333. వికెట్ల పతనం: 1–23, 2–102, 3–144, 4–175, 5–302, 6–302, 7–323, 8–333. బౌలింగ్: స్టార్క్ 10–0–55–2, కమిన్స్ 10–1–65–0, మ్యాక్స్‌వెల్ 3–0–25–0, కూల్టర్‌నైల్ 10–0–58–2, స్టొయినిస్ 8–0–54–2, జంపా 9–0–68–1. 2: ప్రపంచకప్‌లో ఆసీస్ తరఫున వార్నర్ రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు (166) సాధించాడు. అగ్రస్థానంలో కూడా అతనే (178, అఫ్గానిస్తాన్‌పై 2015లో) ఉన్నాడు. 6: వార్నర్ కెరీర్లో 150కుపైగా స్కోరు చేయ డం ఇది ఆరోసారి. ఈ జాబితాలో రోహిత్ (7) మాత్రమే అతనికంటే ముందున్నాడు. 3: ఆసీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో గిల్‌క్రిస్ట్‌తో సమంగా వార్నర్ (16) నిలిచాడు. రికీ పాంటింగ్ (29), మార్క్‌వా (18) మాత్రమే ముందున్నారు. 3: ఆస్ట్రేలియాకు వన్డేల్లో ఇది మూడో అత్యుత్తమ స్కోరు. గతంలో ఆ జట్టు 434/4, 417/6 స్కోర్లు సాధించింది. వార్నర్ సెంచరీ సంబరం -
శ్రీలంకపై 87 పరుగులతో కంగారూల విజయం
-
ఫించ్ ఫటాఫట్
బ్యాటింగ్, బౌలింగ్‌లో కొంత తడబడినా చివరకు శ్రీలంకపై ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. తొలుత కెప్టెన్ ఫించ్ భారీ సెంచరీతో అదరగొట్టడంతో శ్రీలంకకు సవాల్ విసిరిన కంగారూలు... అనంతరం ప్రత్యర్థి పోరాటాన్ని తట్టుకుని గెలుపును అందుకున్నారు. ఓ దశలో సింహళీ జట్టు సంచలనం సృష్టిస్తుందేమో అనిపించినా ఆసీస్ ముందు వారి ఆటలు సాగలేదు. లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు ప్రపంచ కప్‌లో మరో విజయం దక్కింది. శనివారం ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 87 పరుగుల తేడాతో శ్రీలంకను తేలిగ్గా ఓడించింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (132 బంతుల్లో 153; 15 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీకి తోడు, స్టీవ్ స్మిత్ (59 బంతుల్లో 73; 7 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. చివర్లో మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) మెరిశాడు. ఉదాన (2/57) కీలక వికెట్లు తీయడంతో పాటు రెండు చురుౖకైన రనౌట్లు చేశా డు. ఛేదనలో ఓపెనర్లు కెప్టెన్ కరుణరత్నే (108 బంతుల్లో 97; 9 ఫోర్లు), కుశాల్ పెరీరా (36 బంతుల్లో 52; 5 ఫోర్లు, సిక్స్) ఇచ్చిన అద్భుత ప్రారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన లంక 45.5 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌటైంది. పేసర్లు స్టార్క్ (4/55), రిచర్డ్సన్ (3/47) కీలక సమయంలో విజృంభించి ప్రత్యర్థిని నిలువరించారు. ఫించ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆసీస్ స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా బరిలో దిగడం గమనార్హం. వారిద్దరికి తోడు.. చివర్లో అతడు కెప్టెన్ హోదాకు తగ్గట్లు ఆసీస్ ఇన్నింగ్స్‌కు ఫించ్ మూలస్తంభంలా నిలిచాడు. అతడితో కలిసి తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించినా ఇబ్బందిగా కనిపించిన మరో ఓపెనర్ వార్నర్ (48 బంతుల్లో 26; 2 ఫోర్లు)ను ధనంజయ బౌల్డ్ చేశాడు. 53 బంతుల్లో ఫించ్ అర్ధశతకం అందుకున్నాడు. ఉస్మాన్ ఖాజా (10)నూ ధనంజయే ఔట్ చేశాడు. అప్పటికి స్కోరు 23 ఓవర్లలో సరిగ్గా 100. రన్‌రేట్ 5 లోపే. ఈ దశలో ఫించ్‌కు స్మిత్ తోడవడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ధనంజయ బౌలింగ్‌లో ఫోర్, రెండు సిక్స్‌లు బాది ఫించ్ ఊపు తెచ్చాడు. సిరివర్దన ఓవర్లో లాంగాఫ్‌లోకి లాఫ్టెడ్ షాట్‌తో సిక్స్ కొట్టి సెంచరీ (97 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. స్మిత్ అర్ధ సెంచరీ (46 బంతుల్లో) మార్క్‌ను చేరుకోవడం, ఫించ్ దూకుడు మీద ఉండటంతో ఆసీస్ 350 పైనే చేసేలా కనిపించింది. తిసారా పెరీరా, నువాన్ ప్రదీప్, మలింగ వేసిన వరుస ఓవర్లలో వీరు ఏకంగా 45 పరుగులు పిండుకున్నారు. 128 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసుకున్న ఫించ్ ఇదే జోష్‌లో ఉదాన బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. మరుసటి ఓవర్లోనే మలింగ పదునైన యార్కర్‌తో స్మిత్ వికెట్లను గిరాటేశాడు. ప్రదీప్ బౌలింగ్‌లో (45వ ఓవర్) మ్యాక్స్‌వెల్ నాలుగు ఫోర్లు, సిక్స్ బాది జట్టు స్కోరును 300 దాటించాడు. ఆ ఐదు ఓవర్లు... మొదటి 25 ఓవర్లలో 110 పరుగులే చేసిన ఆసీస్ తర్వాతి 20 ఓవర్లలో 192 పరుగులతో చెలరేగింది. అయితే, ఆ జట్టు ఇన్నింగ్స్‌లో చివరి ఐదు ఓవర్లను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భీకరంగా ఆడుతున్న మ్యాక్స్‌వెల్‌ను కట్టడి చేయడంతో పాటు, షాన్ మార్‡్ష, అలెక్స్ క్యారీలను అడ్డుకుని లంక ఒక్కసారిగా పుంజుకుంది. ఈ క్రమంలో 46, 47 ఓవర్లలో మలింగ, ఉదాన నాలుగేసి పరుగులే ఇచ్చారు. 48వ ఓవర్లో మలింగ 7 పరుగులతో సరిపెట్టాడు. 49వ ఓవర్లో ఉదాన సైతం 7 పరుగులే ఇచ్చి... డైరెక్ట్ హిట్లతో క్యారీ (4), కమిన్స్ (0)లను రనౌట్ చేశాడు. తిసారా వేసిన ఆఖరి ఓవర్లో 10 పరుగులే వచ్చాయి. మొత్తమ్మీద చివరి ఐదు ఓవర్లలో కంగారూలు మూడు వికెట్లు కోల్పోయి 32 పరుగులే చేయగలిగారు. లంక కలకలం రేపినా... తమ స్థాయి ఆటకు భారీ అనదగ్గ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక అనూహ్యంగా విజృంభించింది. కరుణరత్నే, కుశాల్ తొలి ఓవర్ నుంచే బౌండరీలు బాదుతూ సులువుగా పరుగులు సాధించారు. ఒకటికి రెండుసార్లు బంతి ఓపెనర్ల బ్యాట్ లోపలి అంచుకు తగిలినా వాటికీ ఫోర్లు రావడంతో రన్‌రేట్ జోరుగా సాగింది. 43 బంతుల్లో కరుణరత్నే, 33 బంతుల్లో కుశాల్ అర్ధ సెంచరీలు నమోదు చేసుకున్నారు. 13వ ఓవర్లోనే జట్టు స్కోరు 100 దాటింది. అయితే, కుశాల్‌ను బౌల్డ్ చేసి స్టార్క్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తిరిమన్నె (16) పేలవ ఫామ్ కొనసాగిస్తూ వెనుదిరిగాడు. సెంచరీ ముంగిట కరుణరత్నే ఔటయ్యాడు. మాథ్యూస్ (9), మెండిస్ (30) పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోయారు. ఒకే ఓవర్లో సిరివర్ధన (3), తిసారా పెరీరా (7)లను పెవిలియన్ చేర్చి లంక ను స్టార్క్ దెబ్బకొట్టాడు. ఉదాన (8), మలింగ (1) వికెట్లు రిచర్డ్సన్కు దక్కాయి. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) ధనంజయ 26; ఫించ్ (సి) కరుణరత్నే (బి) ఉదాన 153; ఖాజా (సి) ఉదాన (బి) ధనంజయ 10; స్మిత్ (బి) మలింగ 73; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 46; షాన్ మార్‡్ష (సి) సిరివర్ధన (బి) ఉదాన 3; క్యారీ (రనౌట్) 4; కమిన్స్ (రనౌట్) 0; స్టార్క్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 334. వికెట్ల పతనం: 1–80, 2–100, 3–273, 4–278, 5–310, 6–317, 7–320. బౌలింగ్: మలింగ 10–1–61–1, ప్రదీప్ 10–0–88–0, ఉదాన 10–0–57–2, తిసారా పెరీరా 10–0–67–0, డి సిల్వా 8–0–40–2, సిరివర్ధన 2–0–17–0. శ్రీలంక ఇన్నింగ్స్: కరుణరత్నే (సి) మ్యాక్స్‌వెల్ (బి) రిచర్డ్సన్ 97; కుశాల్ పెరీరా (బి) స్టార్క్ 52; తిరిమన్నె (సి) క్యారీ (బి) బెహ్రెన్‌డార్ఫ్ 16; మెండిస్ (సి) క్యారీ (బి) స్టార్క్ 30; మాథ్యూస్ (సి) క్యారీ (బి) కమిన్స్ 9; సిరివర్ధన (బి) స్టార్క్ 3; తిసారా పెరీరా (సి) వార్నర్ (బి) స్టార్క్ 7; ధనంజయ నాటౌట్ 16; ఉదాన (సి) ఫించ్ (బి) రిచర్డ్సన్ 8; మలింగ (సి) ఖాజా (బి) రిచర్డ్సన్ 1; ప్రదీప్ (సి) క్యారీ (బి) కమిన్స్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (45.5 ఓవర్లలో ఆలౌట్) 247. వికెట్ల పతనం: 1–115, 2–153, 3–186, 4–205, 5–209, 6–217, 7–222, 8–236, 9–237, 10–247. బౌలింగ్: స్టార్క్ 10–0–55–4; కమిన్స్ 7.5–0–38–2; బెహ్రెన్‌డార్ఫ్ 9–0–59–1; రిచర్డ్సన్ 9–1–47–3; మ్యాక్స్‌వెల్ 10–0–46–0. లంక నిరసన ప్రపంచ కప్‌లో బస, ప్రాక్టీస్ ఏర్పాట్లు, మ్యాచ్ వేదికల విషయంలో తమ పట్ల వివక్ష చూపుతున్నందుకు నిరసన తెలుపుతూ... శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం మీడియా సమావేశాన్ని బహిష్కరించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం జట్టు తరఫున ఎవరైనా ఒకరు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరవాలి. దీనిని ఉల్లంఘించినందుకు లంక జట్టుపై చర్యలు తీసుకునే వీలుంది. -
ఆసీస్...ఆసీసే!
ఎంతైనా ఆస్ట్రేలియా... ఆస్ట్రేలియానే! మొదట వెస్టిండీస్ పేసర్ల దెబ్బకు కుదేలైనా గొప్పగా తేరుకుంది. అనంతరం కీలక సమయంలో కరీబియన్లకు ముకుతాడు వేసి మ్యాచ్‌ను వశం చేసుకుంది. మొత్తంగా తమనెందుకు ప్రొఫెషనల్ జట్టు అంటారో చాటింది. తామెంత బలంగా ఉన్నామో చాటుతూ పరోక్షంగా ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిందీ డిఫెండింగ్ చాంపియన్. మ్యాచ్‌లో 8వ నంబరు బ్యాట్స్‌మన్ కూల్టర్ నైల్ (60 బంతుల్లో 92; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అసాధారణ ఇన్నింగ్స్ ఓ విశేషమైతే... స్టీవ్ స్మిత్ సాధికారిక ఇన్నింగ్స్... పేసర్ మిచెల్ స్టార్క్ (5/46) ఐదు వికెట్ల గణాంకాలు మరో మెరుపు ప్రదర్శన. పాపం... వెస్టిండీస్! అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో పైచేయి సాధించినట్లే సాధించి పట్టు విడిచిపెట్టి పరాజయం పాలైంది. వారి పేసర్ల ప్రతాపం మరుగున పడిపోయింది. నాటింగ్‌హామ్: మ్యాచ్‌ను అదుపులోకి తెచ్చుకోవడం ఎలాగో, ప్రత్యర్థికి కళ్లెం వేయడం ఎలాగో చూపుతూ వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 15 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కూల్టర్ నైల్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (103 బంతుల్లో 73; 7 ఫోర్లు), వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (55 బంతుల్లో 45; 7 ఫోర్లు) రాణించారు. కార్లోస్ బ్రాత్‌వైట్ (3/67) మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కీపర్ షై హోప్ (105 బంతుల్లో 68; 7 ఫోర్లు), నికొలస్ పూరన్ (36 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ హోల్డర్ (57 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) రాణించినా... మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యం... ఆసీస్ బౌలర్లు స్టార్క్, కమిన్స్ (2/41) పదునైన బంతులకు విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 273 పరుగులే చేయగలిగింది. చెదిరిన ఇన్నింగ్స్‌ను నిలిపారు... థామస్ లయ తప్పడంతో తొలి ఓవర్లోనే ఆసీస్‌కు 10 పరుగులొచ్చాయి. ఈ ఆనందం కాసేపే. భీకర వేగంతో మరుసటి ఓవర్లో థామస్ ప్రతాపం చూపాడు. గుడ్ లెంగ్త్‌లో ఆఫ్ స్టంప్‌పై వేసిన రెండో బంతికి కెప్టెన్ ఫించ్ (6) వెనుదిరగ్గా, కాట్రెల్ బౌన్సర్‌ను స్క్వేర్ డ్రైవ్ ఆడబోయి మరో ఓపెనర్ వార్నర్ (3) వెనుదిరిగాడు. రసెల్... ఖాజా పనిపట్టాడు. మ్యాక్స్‌వెల్ (0)ను ఖాతా తెరవకుండానే కాట్రెల్ ఔట్ చేశాడు. అప్పటికి స్కోరు 38/4. ఈ దశలో స్మిత్, స్టొయినిస్ (19; 4 ఫోర్లు) నిలిచి 41 పరుగులు జోడించారు. స్టొయినిస్‌ను హోల్డర్ పెవిలియన్ చేర్చడంతో కంగారూలు మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు. ఈ దశలో స్మిత్, క్యారీ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. స్కోరు పైకి వెళ్తున్న క్రమంలో క్యారీని ఔట్ చేసి 68 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి రసెల్ ముగింపు పలికాడు. కథ మార్చిన కూల్టర్ నైల్... ఈ దశలో ఆసీస్ 200 చేసినా గొప్పే అనుకుంటుండగా ఉరుము లేని పిడుగులా వచ్చి పడ్డాడు కూల్టర్ నైల్. తొలి రెండు బంతులకు దాదాపు ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న అతడు అనంతరం గేరు మార్చుకుంటూ పోయాడు. అంతకుముందు తమ బ్యాటింగ్ లైనప్‌ను కూల్చిన బౌలర్లలో ఎవరినీ లెక్కచేయకుండా షాట్లు కొట్టాడు. అవతలి ఎండ్‌లో 77 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న స్మిత్... కూల్టర్ నైల్‌కు ఎక్కువగా స్ట్రయికింగ్ వచ్చేలా చూశాడు. 41 బంతుల్లో కూల్టర్ కెరీర్ తొలి అర్ధ సెంచరీ అందుకున్నాడు. సెంచరీ ఖాయమనుకుంటుండగా 49వ ఓవర్లో భారీషాట్‌కు యత్నించి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్లో స్టార్క్ (8) కూడా ఔటవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. కాట్రెల్... ఓ అద్భుత క్యాచ్ ఆసీస్ ఇన్నింగ్స్‌లో కాట్రెల్ పట్టిన స్మిత్ క్యాచ్ అద్భుతం అని చెప్పాలి. 44వ ఓవర్ రెండో బంతిని థామస్ ఫుల్ లెంగ్త్‌లో వికెట్లకు దూరంగా వేయగా స్మిత్ తనదైన శైలిలో లాంగ్ లెగ్‌లోకి షాట్ ఆడాడు. అంతా అది సిక్స్ అని భావించారు. కానీ, 20 గజాల దూరం నుంచి పరిగెత్తుకు వచ్చిన కాట్రెల్ ఎడమ చేతితో బంతిని మెరుపులా అందుకున్నాడు. రోప్‌కు అతి సమీపంలో ఉండటంతో గాల్లోకి ఎగరేశాడు. అనంతరం లైన్ దాటి వచ్చి క్యాచ్ పట్టాడు. విండీస్ ఆడినట్లే...ఆడి! విండీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లలో లూయిస్ (1), గేల్ (21; 4 ఫోర్లు) త్వరగానే ఔటయ్యారు. హోప్ మూడో వికెట్‌కు పూరన్ తో 68 పరుగులు, నాలుగో వికెట్‌కు హెట్‌మైర్ (21; 3 ఫోర్లు)తో 50 పరుగులు జోడించి కరీబియన్లను పోటీలోకి తెచ్చాడు. సమన్వయం కొరవడి హెట్‌మైర్ రనౌటవడం దెబ్బకొట్టింది. హోల్డర్, హోప్ 46 బంతుల్లో 41 పరుగులు జత చేసి ఆశలు రేపారు. 90 బంతుల్లో 99 చేయాల్సిన స్థితిలో హోప్ ఔటయ్యాడు. రసెల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోతున్నాడనగా స్టార్క్ యార్కర్ లెంగ్త్ బంతితో బలిగొన్నాడు. ఈ క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ చక్కగా అందుకున్నాడు. 46వ ఓవర్ చివరి బంతికి హోల్డర్ ఔటవడంతో విండీస్ పోరాటం ఓటమిలో పరుగుల అంతరాన్ని తగ్గించేందుకే అన్నట్లయింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) హెట్‌మైర్ (బి) కాట్రెల్ 3; ఫించ్ (సి) హోప్ (బి) థామస్ 6; ఖాజా (సి) హోప్ (బి) రసెల్ 13; స్మిత్ (సి) కాట్రెల్ (బి) థామస్ 73; మ్యాక్స్‌వెల్ (సి) హోప్ (బి) కాట్రెల్ 0; స్టొయినిస్ (సి) పూరన్ (బి) హోల్డర్ 19; క్యారీ (సి) హోప్ (బి) రసెల్ 45; కూల్టర్ నైల్ (సి) హోల్డర్ (బి) బ్రాత్‌వైట్ 92; కమిన్స్ (సి) కాట్రెల్ (బి) బ్రాత్‌వైట్ 2; స్టార్క్ (సి) హోల్డర్ (బి) బ్రాత్‌వైట్ 8; జంపా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 288. వికెట్ల పతనం: 1–15, 2–26, 3–36, 4–38, 5–79, 6–147, 7–249, 8–268, 9–284, 10–288. బౌలింగ్: థామస్ 10–0–63–2, షెల్డన్ కాట్రెల్ 9–0–56–2, రసెల్ 8–0–41–2, బ్రాత్‌వైట్ 10–0–67–3, హోల్డర్ 7–2–28–1, ఆష్లే నర్స్ 5–0–31–0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 21; లూయిస్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 1; హోప్ (సి) ఖాజా (బి) కమిన్స్ 68; పూరన్ (సి) ఫించ్ (బి) జంపా 40; హెట్‌మైర్ (రనౌట్) 21; హోల్డర్ (సి) జంపా (బి) స్టార్క్ 51; రసెల్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 15; బ్రాత్‌వైట్ (సి) ఫించ్ (బి) స్టార్క్ 16; ఆష్లే నర్స్ (నాటౌట్) 19; కాట్రెల్ (బి) స్టార్క్ 1; థామస్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 273. వికెట్ల పతనం: 1–7, 2–31, 3–99, 4–149, 5–190, 6–216, 7–252, 8–252, 9–256. బౌలింగ్: స్టార్క్ 10–1–46–5, కమిన్స్ 10–3– 41–2, కూల్టర్ నైల్ 10–0–70–0, మ్యాక్స్‌వెల్ 6–1–31–0, జంపా 10–0–58–1, స్టొయినిస్ 4–0–18–0. -
ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్లీ మోరిసన్!
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ సంకీర్ణం అనూహ్య ఫలితాలు సాధించింది. ప్రతిపక్ష లేబర్ పార్టీ గెలుపు ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మెజారిటీ సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు శనివారం జరిగిన ఎన్నికల్లో సుమారు 1.60 కోట్ల మంది ఓటేశారు. అయితే, 9 గెలాక్సీ ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్ష లేబర్ పార్టీ కూటమి మొత్తం 151 సీట్లలో 82 స్థానాలు గెలుచుకుంటుందని వచ్చింది. కానీ, ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలను బట్టి అధికార పార్టీ 74 స్థానాలను కైవసం చేసుకోగా, మోరిసన్ మళ్లీ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కనీసం 76 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. అయితే, 65 స్థానాలు మాత్రమే గెలుచుకున్న లేబర్ పార్టీ ఓటమిని అంగీకరించింది. -
భారత హాకీ కోచ్‌గా గ్రాహం రీడ్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా దిగ్గజం గ్రాహం రీడ్ భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్‌గా ఎంపికయ్యారు. ఆయన 2020 ముగిసే వరకు కోచ్ పదవిలో ఉంటారని హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం అనంతరం హరేంద్ర సింగ్‌ను అనూహ్యంగా తప్పించిన తర్వాత కోచ్ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు రీడ్ ఆ స్థానంలో బాధ్యతలు చేపడతారు. గత నెలలోనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) భారత కోచ్‌గా ఆయన పేరును సిఫారసు చేసింది. రీడ్‌కు నెలకు 15 వేల డాలర్లు (సుమారు రూ. 10 లక్షలు) వేతనంగా లభిస్తుంది. కుటుంబంతో సహా స్థిరపడిపోయి బెంగళూరు ‘సాయ్’ సెంటర్ కేంద్రంగా ఆయన పని చేయనున్నారు. ప్రత్యేక శిక్షణా శిబిరం కోసం 60 మంది ఆటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. భారత జట్టు మంచి ఫలితాలు సాధిస్తే రీడ్ కాంట్రాక్ట్‌ను 2022 ప్రపంచ కప్ వరకు పెంచే అవకాశం కూడా ఉంది. ఘనమైన రికార్డు... క్వీన్స్‌లాండ్‌కు చెందిన 54 ఏళ్ల గ్రాహం రీడ్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడు. నాలుగు సార్లు చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమ్‌లో కూడా ఆయన భాగంగా ఉన్నారు. డిఫెండర్, మిడ్‌ఫీల్డర్‌గా 130 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రీడ్ 36 గోల్స్ చేశారు. 2009లో కోచింగ్‌లో అడుగు పెట్టిన ఆయన 2014లో ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ నంబర్‌వన్ కావడంలో కీలక పాత్ర పోషించారు. గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్ టీమ్‌కు కూడా రీడ్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు. ‘భారత హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. హాకీలో భారత్‌కు ఉన్నంత గొప్ప చరిత్ర మరే దేశానికి లేదు. చాలా కాలంగా భారత హాకీని దగ్గరినుంచి చూశాను. నాతో పాటు ఆటగాళ్లకు కూడా సానుకూల వాతావరణం ఉండేలా చేయడం నా పని. చాలా దూరంలో ఉన్న ఒలింపిక్స్, వరల్డ్ కప్లకంటే కూడా త్వరలో జరగనున్న టోర్నీలపైనే దృష్టి పెడతా. భారత హాకీ కోచ్ బాధ్యత చాలా ఒత్తిడితో కూడుకున్నదని నేనూ విన్నా. కానీ దానిని పట్టించుకోను’ –గ్రాహం రీడ్ -
పంచరత్నాలు
ఒకటా... రెండా...? ఏడు దశాబ్దాల ప్రయాణం! పదకొండు సిరీస్‌ల ప్రస్థానం! నలభై నాలుగు టెస్టుల పరంపర! గెలిచింది మాత్రం ఐదంటే ఐదే! ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాకు ఎంతటి గడ్డు కాలం సాగిందో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. కాలక్రమంలో వెస్టిండీస్, ఇంగ్లండ్‌లపై వారివారి దేశాల్లోనే సిరీస్‌లు నెగ్గిన భారత్‌కు కంగారూలు మాత్రం ఇంతవరకు కొరుకుడుపడలేదు. ఇందులో తుది ఫలితం సంగతి అటుంచి... ఓ ఐదుసార్లు మాత్రం మన జట్టు విజయాలను ఒడిసిపట్టింది. ఆ పంచ రత్నాలేమిటో చూద్దామా..! సాక్షి క్రీడా విభాగం ఎవరెన్ని చెప్పనీ... ఆస్ట్రేలియా ఎంత బలహీనపడనీ... టీమిండియా ఎంత బలంగా ఉండనీ... కంగారూ దేశంలో ‘టెస్టు సిరీస్ నెగ్గడం’ మనకింకా తీరని కలే! స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పోరాడుతున్నా... అదో అందని ద్రాక్షే! సిరీస్ సంగతి సరే... అసలు తొలి విజయానికే 30 ఏళ్లు పట్టిందంటే ఆసీస్‌తో సమరం ఎంత కఠిన సవాలో తెలుస్తోంది. అంతెందుకు...? ఈ ఆధునిక యుగంలోనూ వారి గడ్డపై టెస్టు నెగ్గి పదేళ్లయిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈసారి విరాట్ కోహ్లి సేన కొంత మెరుగైన ఫలితం సాధించే అవకాశం కనిపిస్తోన్న నేపథ్యంలో, గతంలో రెండేసి వరుస సిరీస్‌లలో టీమిండియా అందుకున్న ఆణిముత్యాల్లాంటి ఓ ఐదు విజయాలివి... పెర్త్‌లో పటాకా... 2008 జనవరి 16–19 అంపైరింగ్ నిర్ణయాలతో వివాదాస్పదమై, అప్పటికే రెండు టెస్టులను కోల్పోయి, మంకీ గేట్ దుమారంతో సంచలనం రేపిన సిరీస్ ఇది. అయితే... ‘ఈ సిరీస్‌లో ఒక్క జట్టే క్రీడా స్ఫూర్తితో ఆడింది’ అన్న ఒకే ఒక్క మాటతో భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే ఇచ్చిన పంచ్ ఆస్ట్రేలియన్లు తలొంచుకునేలా చేసింది. అదే సమయంలో కుంబ్లే జట్టులో ఆత్మవిశ్వాసం నింపి సారథిగా విశిష్టతను చాటుకున్నాడు. ఈ క్రమంలో మూడో టెస్టులో ద్రవిడ్ (93), సచిన్ (71) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 330కి ఆలౌటైంది. ఆర్పీ సింగ్ (4/68) మెరుపులతో పాటు ఇషాంత్, ఇర్ఫాన్ పఠాన్, కుంబ్లే రెండేసి వికెట్లు పడగొట్టడంతో ఆసీస్‌ను 212కే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్ (79) స్పెషల్ ఇన్నింగ్స్, సెహ్వాగ్ (43), ఇర్ఫాన్ (46) ఆకట్టుకోవడంతో టీమిండియా 294 పరుగులు చేసింది. 412 పరుగుల ఛేదనలో ఆసీస్‌ను ఇర్ఫాన్ (3/54), ఆర్పీ సింగ్ (2/95) దెబ్బ కొట్టారు. దీంతో ఆ జట్టు 340కే ఆలౌటై లక్ష్యానికి 72 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ సిరీస్‌లో కొత్త కుర్రాడు ఇషాంత్ శర్మ... ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ రికీ పాంటింగ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో వార్తల్లో నిలిచాడు. మెల్బోర్న్ మెరుపు 1977 డిసెంబర్ 30– 1978 జనవరి 4 ఆస్ట్రేలియాలో తొలి టెస్టు (1947) ఆడిన 30 ఏళ్లకు... మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా టీమిండియాకు ఓ గెలుపు దక్కింది. వాస్తవానికి ఈ సిరీస్ భారత్‌కు ఓ మరుపురానిదిగా మిగిలిపోయేదే. ‘కెర్రీ ప్యాకర్’ ఉదంతంతో చాపెల్ సోదరులు, డెన్నిస్ లిల్లీ వంటి ఉద్ధండులు దూరమవడంతో కొంత బలహీనపడిన ఆసీస్... ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులను అతి కష్టం మీద (16 పరుగులు, 2 వికెట్లు) నెగ్గింది. మూడో దాంట్లో మాత్రం మనదే పైచేయి అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్... ఓపెనర్లు సునీల్ గావస్కర్, చేతన్ చౌహాన్ ఖాతా తెరవకుండా ఔటైనా, మొహిందర్ అమర్నాథ్ (72), గుండప్ప విశ్వనాథ్ (59) అర్ధశతకాలతో కోలుకుంది. వెంగ్‌సర్కార్ (37), వినూ మన్కడ్ (44), సయ్యద్ కిర్మాణీ (29) తలోచేయి వేయడంతో 256 పరుగులకు ఆలౌటైంది. బీఎస్ చంద్రశేఖర్ (6/52) స్పిన్ మాయ, బిషన్‌సింగ్ బేడి (2/71), కర్సన్ ఘావ్రీ (2/37) దెబ్బకు ఆసీస్ 213 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో లిటిల్ మాస్టర్ గావస్కర్ (118) అద్భుత శతకం, విశ్వనాథ్ (54) అర్ధశతకాలకు తోడు అమర్నాథ్ (41) రాణించడంతో భారత్ 343 పరుగులు చేసింది. చంద్రశేఖర్ (6/52) మరోసారి ఆరేయగా... బేడి (4/58) మిగతా వారి పని పట్టాడు. దీంతో 386 పరుగుల ఛేదనలో ప్రత్యర్థి 164కే చాప చుట్టేసింది. టీమిండియా 222 పరుగులతో జయభేరి మోగించింది. సిడ్నీలో సూపర్...: 1978 జనవరి 7–12 మెల్బోర్న్ విజయం ఊపును కొనసాగించిన భారత్ వెంటనే జరిగిన సిడ్నీ టెస్టునూ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్... చంద్రశేఖర్ (4/30), బేడి (3/49) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలింది. విశ్వనాథ్ (79), ఘావ్రీ (64) అర్ధ శతకాలతో పాటు గావస్కర్ (49), చౌహాన్ (42), వెంగ్‌సర్కార్ (48), కిర్మాణీ (42) తోడ్పాటుతో 396/8 వద్ద డిక్లేర్ చేసింది. ఫాలోఆన్‌లో కంగారూలను ఎరాపల్లి ప్రసన్న (4/51) దెబ్బకొట్టాడు. చంద్రశేఖర్, బేడి, ఘావ్రీ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. దీంతో ఆసీస్ 263కే ఆలౌటైంది. భారత్ ఇన్నింగ్స్, 2 పరుగులతో వరుసగా రెండో విజయం సాధించింది. అయితే, ఐదో టెస్టు (ఆడిలైడ్) నాలుగో ఇన్నింగ్స్‌లో 492 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మన జట్టు తీవ్రంగా పోరాడి 445 వద్ద ఆగిపోయింది. 47 పరుగులతో నెగ్గిన ఆసీస్ సిరీస్‌ను 3–2తో కైవసం చేసుకుంది. మళ్లీ మొదటి చోటే...: 1981 ఫిబ్రవరి 7–11 ఈ పర్యటనలో తొలి టెస్టు ఓడి, రెండో టెస్టును ‘డ్రా’ చేసుకున్న టీమిండియా మూడో దాంట్లో విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సిరీస్ 1–1తో సమమైంది. అయినా, చివరి టెస్టులో భారత్ విజయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మన జట్టు గుండప్ప విశ్వనాథ్ (114) వీరోచిత శతకంతో తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేయగలిగింది. అలెన్ బోర్డర్ (124) శతకం, గ్రెగ్ చాపెల్ (76), వాల్టర్ (78) అర్ధశతకాలతో ఆసీస్ 419 పరుగులు చేసింది. ఓపెనర్లు గావస్కర్ (70), చేతన్ చౌహాన్ (85) ఇచ్చిన శుభారంభాన్ని వెంగ్‌సర్కార్ (41), విశ్వనాథ్ (30), సందీప్ పాటిల్ (36) సద్వినియోగం చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 324 పరుగులు చేయగలిగింది. 142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్‌ను కపిల్ దేవ్ (5/28) కుదేలు చేశాడు. దీంతో ఆ జట్టు 83 పరుగులకే ఆలౌటై 59 పరుగుల తేడాతో ఓడింది. లక్ష్మణ్ స్పెషల్ ద్రవిడ్ డబుల్... అడిలైడ్: 2003 డిసెంబర్ 12–16 అటు రికీ పాంటింగ్ (242), ఇటు రాహుల్ ద్రవిడ్ (233) డబుల్ సెంచరీల మోతతో రెండు జట్లు హోరాహోరీగా తలపడిన మ్యాచ్ ఇది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 556 పరుగులకు ఆలౌటైంది. అనిల్ కుంబ్లే (5/154) ఐదు వికెట్లు పడగొట్టాడు. స్కోరు 85/4 ఉన్న దశలో డబుల్ సెంచరీతో ద్రవిడ్, భారీ శతకంతో వీవీఎస్ లక్ష్మణ్ (148) ఐదో వికెట్‌కు 385 పరుగులు జోడించడంతో భారత్ 523 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో అజిత్ అగార్కర్ (6/41) అద్భుత స్పెల్‌తో ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడంతో ఆసీస్ 196కే పరిమితమైంది. 229 పరుగుల ఛేదనలో ద్రవిడ్ (72)కు సెహ్వాగ్ (47), సచిన్ (37), లక్ష్మణ్ (32) సహకారం అందించడంతో భారత్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ సిరీస్‌లో మొదటి టెస్టు ‘డ్రా’ కాగా... భారత్ రెండో దాంట్లో గెలిచి 1–0 ఆధిక్యంలో నిలిచింది. ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే, ఆసీస్ మూడో టెస్టును 9 వికెట్లతో గెల్చుకుని సిరీస్‌ను 1–1తో ‘డ్రా’ చేసింది. 1981 తర్వాత 22 ఏళ్లకు ఆస్ట్రేలియాలో భారత్ టెస్టు గెలవడం గమనార్హం. -
మళ్లీ ఆసీస్ అమ్మాయిలే
నార్త్‌సౌండ్ (అంటిగ్వా): మహిళల టి20 ప్రపంచ కప్‌ను మళ్లీ ఆస్ట్రేలియా జట్టే శాసించింది. నాలుగో సారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆసీస్ అమ్మాయిల జట్టు 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ డానియెల్ వ్యాట్ (37 బంతుల్లో 43; 5ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, హీతర్ నైట్ (25) మెరుగనిపించింది. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ (3/22), మెగన్ షుట్ (2/13), జార్జియా వేర్హమ్ (2/11) ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. తర్వాత 106 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మహిళల జట్టు 15.1 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ మెగన్ లానింగ్ (30 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), గార్డ్నర్ (26 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. ఓపెనర్ అలీసా హీలీ 22 పరుగులు చేసింది. ఎకెల్‌స్టోన్, హాజెల్ చెరో వికెట్ తీశారు. గార్డ్నర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అలీసా హీలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ లభించాయి. ఈ పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు ఆరు ప్రపంచకప్‌లు జరుగగా... నాలుగుసార్లు ఆసీస్ (2010, 2012, 2014, 2018) జట్టే గెలవడం విశేషం. ఇప్పటికే ఆరు వన్డే ప్రపంచకప్‌లు సాధించడంతో ఆసీస్ నెగ్గిన మొత్తం వరల్డ్ కప్‌ల సంఖ్య పదికి చేరింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: వ్యాట్ (సి) లానింగ్ (బి) గార్డ్నర్ 43; బీమాంట్ (సి) విలాని (బి) షుట్ 4; జోన్స్ రనౌట్ 4; సీవర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పెర్రీ 1; నైట్ (సి) వేర్హమ్ (బి) గార్డ్నర్ 25; విన్ఫీల్డ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వేర్హమ్ 6; డన్క్లే (బి) వేర్హమ్ 0; ష్రబ్సోల్ (సి) పెర్రీ (బి) గార్డ్నర్ 5; హాజెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షుట్ 6; ఎకెల్‌స్టోన్ (రనౌట్) 4; గోర్డాన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 105. వికెట్ల పతనం: 1–18, 2–30, 3–41, 4–64, 5–74, 6–74, 7–84, 8–98, 9–104, 10–105. బౌలింగ్: మొలినెక్స్ 3–0–23–0, షుట్ 3.4–0–13–2, ఎలిస్ పెర్రీ 3–0–23–1, కిమిన్స్ 3–0–10–0, వేర్హమ్ 3–0–11–2, గార్డ్నర్ 4–0–22–3. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హీలీ (బి) ఎకెల్‌స్టోన్ 22; మూనీ (సి) జోన్స్ (బి) హాజెల్ 14; గార్డ్నర్ (నాటౌట్) 33; లానింగ్ (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.1 ఓవర్లలో 2 వికెట్లకు) 106. వికెట్ల పతనం: 1–29, 2–44. బౌలింగ్: సీవర్ 1.1–0–3–0, ష్రబ్సోల్ 3–0–30–0, ఎకెల్‌స్టోన్ 4–0–12–1, హాజెల్ 3–0–19–1, గోర్డాన్ 3–0–30–0, నైట్ 1–0–10–0. -
టీమిండియా గెలిస్తే సిరీస్ సమం
కుదించిన లక్ష్యంతోనైనా మొదటి మ్యాచ్‌లో ఫలితం తేలింది. కనీసం ఛేదనకు దిగకుండానే రెండోది రద్దయి పోయింది. దీంతో మూడో మ్యాచ్‌కు వచ్చేసరికి... ఓడినా సిరీస్ చేజారని నిశ్చింత ఆస్ట్రేలియాది. గెలుపుతో... తమ జైత్ర యాత్రకు అడ్డుకట్ట పడకుండా చూసుకోవాల్సిన ఒత్తిడి టీమిండియాది. మరి... చివరి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో! సిడ్నీ: ఆట కంటే వరుణుడి అడ్డంకులే ఎక్కువగా వస్తున్న ఆస్ట్రేలియా–భారత్ టి20 సిరీస్... ఆఖరికి వచ్చింది. రెండు జట్ల మధ్య ఆదివారం సిడ్నీ క్రికెట్ మైదానం (ఎస్సీజీ)లో చివరి మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే 1–0 ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య జట్టును ఇందులో ఓడించి... 1–1తో లెక్క సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తద్వారా ఈ ఫార్మాట్లో వరుసగా ఏడు సిరీస్‌లు నెగ్గిన తర్వాత ఓటమి ఎదురు కాకుండా చూసుకోవాలని భావిస్తోంది. మరోవైపు చాన్నాళ్ల తర్వాత ఓ పెద్ద జట్టుపై సిరీస్ విజయం సాధించే అవకాశాన్ని కంగారూలు అంత తేలిగ్గా వదులుకుంటారని భావించలేం. ఈ నేపథ్యంలో మూడో టి20లో ఎవరికి అనుకూల ‘ముగింపు’ దక్కుతుందో చూడాలి. అదే కూర్పా.. లేక మార్పా...? భారత్ రెండో టి20కి ఒక మార్పుతో బరిలో దిగుతుందనుకుంటే అదేమీ లేకుండానే ఆడింది. ఇప్పుడు మరోసారి ఆ ఒక్క స్థానంపైనే ఊగిసలాట నడుస్తోంది. పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను ఆడిస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, పరుగులిస్తున్నా పేస్‌లో వైవిధ్యంతో ఖలీల్ మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి, బాగా అవసరం అనుకుంటే తప్ప అతడిని తప్పించకపోవచ్చు. మెల్బోర్న్లో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా మెరుగ్గా కనిపించాడు. చైనామన్ కుల్దీప్ యాదవ్, పేసర్లు భువనేశ్వర్, బుమ్రాల బౌలింగ్‌పై బెంగలేదు. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ ఫామ్‌పైనే ఆందోళన నెలకొంది. టెస్టు సిరీస్‌కు ఓపెనర్ రేసులో నిలవాలంటే అతడు ఈ మ్యాచ్‌లోనైనా ప్రభావం చూపాలి. రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నందున జట్టు ఛేదనకే ఎక్కువ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ధావన్ ఫామ్‌కు, కోహ్లి, రోహిత్ జోరు తోడైతే లక్ష్యాన్ని అవలీలగా అందుకోగలం. మన బౌలర్ల ఫామ్ ప్రకారం చూస్తే... మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆసీస్ అవకాశం వదులుకుంటుందా? వరుణుడి దయతో తొలి మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా... అత్యంత క్లిష్ట పరిస్థితుల నుంచి కొంత బయటపడింది. కానీ, రెండో టి20లో ఆ జట్టు బలహీనతలు బయటపడ్డాయి. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ భారత బౌలింగ్‌ను ఎదుర్కొనలేక తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. వారి బౌలింగ్ కూడా ఏమంత గొప్పగా లేనందున ఒకవేళ ఆట పూర్తిగా సాగి ఉంటే మ్యాచ్‌నే కోల్పోయేవారు. ఓపెనర్లు డీయార్సీ షార్ట్, కెప్టెన్ ఫించ్ వైఫల్యంతో లిన్, మ్యాక్స్‌వెల్, మెక్‌డెర్మాట్‌లపై బ్యాటింగ్ భారం పడుతోంది. అయితే, పొట్టి ఫార్మాట్లో ఏ క్షణమైనా విరుచుకుపడే వీరితో జాగ్రత్తగా ఉండాల్సిందే. గాయపడిన స్టాన్లేక్ స్థానంలో సిడ్నీ మ్యాచ్‌కు కీలక పేసర్ మిచెల్ స్టార్క్‌ను జట్టుతో చేర్చినా అతడు ఆడేది అనుమానమే. పేసర్లు కూల్టర్‌నీల్, ఆండ్రూ టైతో పాటు స్పిన్నర్ ఆడమ్ జంపా టీమిండియాను ఎంతమేరకు నిలువరిస్తారనే దానిపైనే ఆసీస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్, బుమ్రా, చహల్/ఖలీల్ ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), షార్ట్, లిన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, మెక్‌డెర్మాట్, క్యారీ, టై, జంపా, బెహ్రెన్‌డార్ఫ్, కూల్టర్‌నీల్/ స్టార్క్ పిచ్, వాతావరణం ఎస్సీజీ పిచ్ నెమ్మదిగా ఉంటుంది. పేస్‌కు పెద్దగా అనుకూలం కాదు. ఆదివారం వర్ష సూచన లేదు. ►మధ్యాహ్నం గం.1.20 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లలో ప్రత్యక్ష ప్రసారం -
గెలిస్తే సరి.. ఓడితే సిరీస్ హరీ!
ఆడిన చివరి ఐదు టి20ల్లో... టీమిండియా ఒక్క దాంట్లోనే ఓడింది. ఆస్ట్రేలియా ఒక్క దాంట్లోనే గెలిచింది! ‘ఈ ఒక్కటీ’ బుధవారం నాటి మ్యాచ్. రెండు జట్ల ఇటీవలి ఫామ్‌కు అద్దం పట్టే ఈ గణాంకాలివీ. ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత్ పొరపాట్లతో పరాజయం పాలైంది. పరిస్థితులు కలిసొచ్చి అనూహ్య విజయంతో ఆసీస్ ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. కంగారూ గడ్డపై ‘పొట్టి ఫార్మాట్’లో నెగ్గాలంటే మరింత పకడ్బందీగా ఉండాలని కోహ్లి సేనకు తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఫించ్ బృందాన్ని ఎలా నిలువరిస్తుందో చూడాలి. మెల్బోర్న్: వరుసగా ఎనిమిదో టి20 సిరీస్ గెలిచే ఘనత చేజారకుండా ఉండాలన్నా, కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం చిక్కకుండా చేయాలన్నా... విజయం తప్పనిసరైన పరిస్థితుల్లో టీమిండియా శుక్రవారం ఆస్ట్రేలియాతో రెండో టి20 ఆడనుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో కోహ్లి సేన సరైన కూర్పుతో దిగితేనే అనుకూల ఫలితం రాబట్టే వీలుంటుంది. మరోవైపు కష్ట కాలంలో భారత్‌లాంటి జట్టుపై నెగ్గడం కంగారూలకు ఊపిరి పోసింది. ఆటలో ‘బుద్ధి బలం’ కంటే ‘భుజ బలం’దే పైచేయిగా నిలుస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోనే పెద్ద మైదానమైన మెల్బోర్న్లో ఏ జట్టు ఎక్కువ బౌండరీలు, సిక్స్‌లు బాదుతుందో దానిదే గెలుపు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం తప్పేలా లేదు. కాబట్టి రన్‌రేట్‌నూ దృష్టిలో పెట్టుకోక తప్పదు. కూర్పు మార్చాల్సిందే... ‘కొందరు భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తే వారు నిన్ననే ఆస్ట్రేలియా వచ్చినట్లున్నారు’ తొలి టి20 సందర్భంగా వినిపించిన వ్యాఖ్యలివి. మ్యాచ్‌లో ఫీల్డింగ్ పొరపాట్లను చూస్తే ఇది నిజమేననిపించింది. అయితే, బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్ మంచి టచ్‌లో ఉండటం, దినేశ్ కార్తీక్ మెరుపులతో లక్ష్యానికి దగ్గరగా రాగలిగాం. మెల్బోర్న్లో గెలవాలంటే మాత్రం ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లి విజృంభించాల్సిందే. కోహ్లి మూడో స్థానంలో రావడమే ఉత్తమం. జట్టులో చోటు నిలవాలంటే కేఎల్ రాహుల్ వైఫల్యాల నుంచి తక్షణమే బయటపడాలి. ఇంగ్లండ్ సిరీస్‌లో సెంచరీ అనంతరం గత ఆరు టి20ల్లో అతడు కనీసం 30 పరుగులు కూడా దాటలేదు. ప్రతిభరీత్యా రాహుల్‌కు మరో అవకాశం దక్కొచ్చు. ఈ ఫార్మాట్లో తనపై భరోసా పెట్టుకోవచ్చని దినేశ్ కార్తీక్ మరోసారి చాటాడు. ఒత్తిడిలో ఎలా ఆడాలో కుర్ర రిషభ్ పంత్ నేర్చుకోవాలి. బ్రిస్బేన్‌లో ఘోరంగా విఫలమైనా... ఆల్ రౌండర్ హోదాలో కృనాల్ పాండ్యాను కొనసాగించే సూచన కనిపిస్తోంది. యువ పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో లెగ్ స్పిన్నర్ చహల్‌ను తీసుకోనున్నారు. తొలి మ్యాచ్‌లో కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా చక్కగా బౌలింగ్ చేశారు. టి20ల్లో వీరిని ఎదుర్కొనడం ఏ జట్టుకైనా సవాలే. అలవాటైన మైదానాల్లో ఆస్ట్రేలియన్లు అలవోకగా భారీ షాట్లు కొడుతున్నందున బౌలింగ్ మరింత పకడ్బందీగా సాగాల్సిన అవసరం ఉంది. ఆసీస్ అనూహ్యంగా... బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత ఆసీస్ అన్ని ఫార్మాట్లలో 23 మ్యాచ్‌లాడి, కేవలం ఆరింట్లో గెలిచింది. అందులో మూడు జింబాబ్వే, యూఏఈలపై వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన బౌలర్లు లేకుండానే బరిలో దిగినా, భారత్‌పై టి20 నెగ్గడం జట్టులో నమ్మకాన్ని పెంచింది. బ్యాటింగ్‌లో మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, క్రిస్ లిన్లకు కెప్టెన్ ఫించ్, డియార్సీ షార్ట్ దూకుడు తోడైతే ఆ జట్టును ఆపడం కష్టం. భారీ మైదానాల్లో వీరి భుజ బలమే కీలకం కానుంది. ఆతిథ్య జట్టు మార్పుల్లేకుండానే బరిలో దిగే వీలుంది. ఏదో పేరుకు మాత్రమే అన్నట్లు తీసుకున్న స్పెషలిస్ట్ స్పిన్నర్ ఆడమ్ జంపా మ్యాచ్ ఫలితాన్ని శాసించే ప్రదర్శన చేశాడు. పేసర్లు కూడా ప్రభావం చూపితే టీమిండియాపై వరుసగా రెండో గెలుపును అందుకుని సిరీస్‌ను ఇక్కడే ఎగరేసుకుపోదామని జట్టు ఆశిస్తోంది. తుది జట్టు (అంచనా) భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), రాహుల్, దినేశ్ కార్తీక్, పంత్, కృనాల్, భువనేశ్వర్, కుల్దీప్, చహల్/ఖలీల్, బుమ్రా. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), షార్ట్, లిన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, బెన్ మెక్‌డెర్మట్, క్యారీ, టై, జంపా, బెహ్రెన్‌డార్ఫ్, స్టాన్లేక్. పిచ్, వాతావరణం ఎంసీజీలో డ్రాప్ ఇన్ పిచ్‌ను వాడనున్నారు. పెద్దగా బౌన్స్ ఉండకపోవచ్చు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే వీలుంది. ఈ మైదానంలో భారత్, ఆసీస్ జట్ల మధ్య 3 టి20 మ్యాచ్‌లు జరిగాయి. రెండింటిలో భారత్ నెగ్గగా... మరో మ్యాచ్‌లో ఆసీస్ గెలిచింది. -
టి20 కూడా ఇంగ్లండ్‌దే
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ పర్యటనలో ఆస్ట్రేలియా పరాజయం పరిపూర్ణమైంది. కంగారూలు ఏకైక టి20లో కూడా పరాజయంపాలై వెనుదిరిగారు. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. జోస్ బట్లర్ (30 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మరోసారి చెలరేగాడు. ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (22 బంతుల్లో) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జేసన్ రాయ్ (44; 6 ఫోర్లు), హేల్స్ (49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం ఆసీస్ 19.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆరోన్ ఫించ్ (41 బంతుల్లో 84; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగినా, మిగతావారంతా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. -
ఇంగ్లండ్ శుభారంభం
లండన్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది ఐదు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ పోరులో మొదట ఆస్ట్రేలియా 47 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. మ్యాక్స్‌వెల్ (62), అస్టన్ అగర్ (40) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మొయిన్ అలీ, ప్లంకెట్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, ఆదిల్ రషీద్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 44 ఓవర్లలో 7 వికెట్లకు 218 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ మోర్గాన్ (69), జో రూట్ (50) అర్ధసెంచరీలు సాధించారు. స్టాన్లేక్, నెసెర్, ఆండ్రూ టై తలా 2 వికెట్లు తీశారు. కార్డిఫ్‌లో రేపు (శనివారం) రెండో వన్డే జరగనుంది. -
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి దుర్మరణం
మెల్బోర్న్: భారతీయ విద్యార్థి ఒకరు సెల్ఫీ తీసు కుంటూ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోయి చనిపోయిన విషాద ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అంకిత్ అనే 20 ఏళ్ల భారతీయ విద్యార్థి పశ్చిమ ఆస్ట్రేలియాలోని అల్బనీ పట్టణం దగ్గర్లోని ప్రఖ్యాత పర్యాటక సముద్ర తీరం వద్ద ఉన్న రాళ్లపై స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు వెల్లడించారు. ఐదుగురు స్నేహితులతో కలిసి గురువారం అక్కడికి వెళ్లిన అంకిత్, అక్కడి రాళ్లపై ఉత్సాహంగా దూకుతూ ఉన్న సమయంలో, 40 అడుగుల ఎత్తైన రాతి శిఖరం నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
జోరు ఎవరిదో!
జొహన్నెస్‌బర్గ్: గత వారం రోజులుగా బాల్ ట్యాంప రింగ్ వివాదంతో వార్తల్లో నిలిచిన ఆస్ట్రేలియా... దక్షిణాఫ్రికా సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. వాండరర్స్ మైదానంలో శుక్రవారం మొదలయ్యే నాలుగో టెస్టు ‘డ్రా’ చేసుకుంటే దక్షిణాఫ్రికా సొంతగడ్డపై 1970 తర్వాత ఆస్ట్రేలియాపై సిరీస్ దక్కించుకుంటుంది. ఇప్పటికే ఆతిథ్య జట్టు 2–1తో ముందంజలో ఉంది. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు దూరమై ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన ఆసీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి తమ అభిమానుల మనసులు గెలవాలని భావిస్తోంది. మరోవైపు మూడో టెస్టులో విజయం సాధించిన సఫారీలు అదే జోరు కొనసాగించాలని చూస్తున్నారు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కానున్న మోర్నీ మోర్కెల్‌పై అందరి దృష్టి నిలవనుంది. -
గోల్డ్ కోస్ట్ చేరిన భారత క్రీడాకారులు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులు బుధవారం ఆతిథ్య నగరం గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా)కు చేరుకున్నారు. ‘అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, లాన్ బాల్స్, షూటింగ్ క్రీడాంశాలకు చెందిన ఆటగాళ్లు క్రీడా గ్రామంలోకి అడుగు పెట్టారు’ అని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తెలిపింది. భారత బృందానికి చెఫ్ డి మిషన్‌గా ఉన్న విక్రమ్ సింగ్ సిసోడియా, మేనేజర్లు నామ్‌దేవ్, అజయ్ నారంగ్, షియాద్ క్రీడా గ్రామంలో ఐఓఏ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. -
పరువు నిలబెట్టుకోవాలని...
వడోదర: ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌కు భారత జట్టు సిద్ధమైంది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన మిథాలీ బృందం ఆదివారం జరిగే చివరి వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తున్న ఆసీస్‌ను నిలువరించాలంటే భారత్ సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బ్యాటింగ్‌లో స్మృతి మంధాన మెరుపులు మినహా మిగతావారు ఆకట్టుకోలేకపోయారు. ఆమెకు తోడు కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, పూనమ్ రౌత్ రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. మరోవైపు సీనియర్ పేసర్ జులన్ గోస్వామి గైర్హాజరీలో శిఖా పాండే, పూజ వస్త్రకర్ ప్రభావం చూపలేకపోతున్నారు. స్పిన్నర్లు ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్ కూడా ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు టాపార్డర్ రాణించడంతో రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆసీస్ ఆదివారం జరిగే పోరులోనూ గెలవాలని చూస్తోంది. రెండు వన్డేల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన బోల్టన్‌తో పాటు పెర్రీ, మూనీ, కెప్టెన్ మెగ్ లానింగ్ ఫామ్‌లో ఉండటం కంగారూలకు కలిసొచ్చే అంశం. -
మగాళ్లు బలంగా ఉండాలంటే హైహీల్స్ వేసుకోవాలట..!
సిడ్నీ : మగాళ్లు ఏంటి? హైహీల్స్ వేసుకోవడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా.. అందరిలాగా ఆలోచిస్తే కిక్కేముందనుకున్నాడో ఏమో ఓ మహాశయుడు ఇలాగే వెరైటీగా ఆఫీస్‌కు వెళ్లడం మొదలుపెట్టాడు. మహిళలు ధరించే హైహిల్స్ వేసుకొని ఆఫీస్‌కు వెళుతున్నాడు. ఇదేంటి అని పక్కవాళ్లు నవ్వుకున్నా.. తోటి ఉద్యోగులు ఎద్దేవా చేసినా అతను వెరవలేదు. అంతేకాదు.. హైహిల్స్ కంటే మహిళలాగా పురుషులు కూడా శక్తిమంతంగా తయరు కావొచ్చునని ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన యాష్లే మాక్స్వెల్-లామ్.. ఇలా ఆడవాళ్లు ధరించే హైహీల్స్ వేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్న ఇతడు కొన్నేళ్ల కిందటి వరకు అందరిలాగే మామూలుగా పురుషుల షూస్ వేసుకొని ఆఫీస్‌కు వెళ్లేవాడు. అయితే, తన ఆఫీసులో పనిచేసే ఓ మహిళా సహోద్యోగి.. ఆమె శక్తివంతంగా ఉండడానికి కారణం హైహీల్సేనని చెప్పింది. కావాలంటే వేసుకుని చూడమని సలహా ఇచ్చింది. ఆ సలహా నచ్చడంతో లామ్.. లైఫ్‌స్టైలే మారిపోయింది. ఇప్పుడు అతను ఎక్కడికివెళ్లినా.. అందరి చూపు అతని వేసుకునే చెప్పులపైనే ఉంటుంది. అతను హైహీల్స్ ధరించడం..చూసేవారికి వింతగా తోచినా.. ఇవి ధరించడం వల్ల చాలా హుందాగా, శక్తిమంతంగా ఉన్నానని నిర్మోహమాటంగా చెప్తున్నాడు. అనుమానం ఉంటే మీరు కూడా ధరించండని సలహా ఇస్తున్నాడు. -
ఆసీస్ విజయం నేడే ఖాయం
డర్బన్: తొలి టెస్టులో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలుపు ఖాయమైంది. కాకపోతే... ప్రత్యర్థి చివరి వికెట్ పడగొట్టలేక ఆ జట్టు ఐదో రోజు కూడా మైదానంలోకి దిగాల్సి వస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 213/9తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 227కు ఆలౌటైంది. అనంతరం 417 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన సఫారీ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 293 పరుగులు చేసింది. చేతిలో ఒక వికెట్ మిగిలి ఉండగా... విజయానికి మరో 124 పరుగులు దూరంలో నిలిచింది. ప్రధాన బ్యాట్స్‌మెన్ ఎల్గర్ (9), ఆమ్లా (8), డివిలియర్స్ (0), కెప్టెన్ డుప్లెసిస్ (4)ల వైఫల్యం కారణంగా ఒక దశలో దక్షిణాఫ్రికా 4/49 స్కోరుతో దయనీయస్థితిలో నిలిచింది. ఈ దశలో ఓపెనర్ మార్క్రమ్ (143; 19 ఫోర్లు) పోరాట పటిమ చూపాడు. అద్భుత శతకం సాధించిన అతడు తొలుత డిబ్రుయెన్ (36)తో కలిసి 87 పరుగులు, కీపర్ డికాక్ (81 బ్యాటింగ్; 11 ఫోర్లు) అండగా ఆరో వికెట్‌కు 147 పరుగులు జోడించి జట్టు పరువు నిలిపాడు. వీరిని విడగొట్టేందుకు ఆసీస్ బౌలర్లు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మిచెల్ మార్‡్ష బౌలింగ్‌లో ఎట్టకేలకు మార్క్రమ్ అవుటయ్యాడు. తర్వాత స్టార్క్ (4/74) విజృంభించి ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టాడు. వెలుతురు తగ్గడంతో చివరి ఓవర్లను స్మిత్, లయన్ వేయాల్సి వచ్చింది. డికాక్, మోర్కెల్ (27 బంతుల్లో 0 బ్యాటింగ్) వికెట్ ఇవ్వకుండా 9 ఓవర్లు పైగా బ్యాటింగ్ చేశారు. -
ఈ ఇళ్లు భూగర్భంలో..!
నేషనల్ డెస్క్: సాధారణంగా మనకు ఎండ ఎక్కువగా ఉందనిపిస్తే ఫ్యాన్ లేదా ఏసీ వేసుకుంటాం. యూరప్, అమెరికా వంటి చలితీవ్రంగా ఉండే ప్రాంతాల్లో ఇళ్లను వెచ్చగా ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఏడారులకు సమీపంలో నివసించే ప్రజలు ప్రతిరోజూ ఈ రెండురకాల వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆఫ్రికా దేశమైన ట్యూనీషియాలో జెబెల్దహార్లోని గ్రామాల్లో నివసిస్తున్న బెర్బెర్ జాతి ప్రజలు ఈ సమస్యకు తమదైన పరిష్కారాన్ని కనుగొన్నారు. సహారా ఎడారికి సమీపంలో ఉండటంతో పగటి పూట వడగాలుల్ని, రాత్రిపూట తీవ్రమైన చలిని తట్టుకునేందుకు వీలుగా నేలను తవ్వి గుహల్లాంటి ఇళ్లను నిర్మించుకున్నారు. వలయాకారం మధ్యలో ఖాళీ ప్రదేశంతో పగలు, రాత్రి స్థిరమైన ఉష్ణోగ్రత ఉండేలా ఈ ఇళ్లను అక్కడి ప్రజలు తీర్చిదిద్దుకున్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఇళ్లను అక్కడి కుటుంబాలు వారసత్వంగా కాపాడుకుంటున్నాయి. సౌర విద్యుత్ సాయంతో రాత్రిపూట ప్రజలు తమ పనుల్ని చక్కబెట్టుకుంటున్నారు. పట్టణీకరణ ప్రభావంతో.. స్థానికులు ప్రధానంగా యువత ఉపాధిని వెతుక్కుంటూ పట్టణాలకు వలసవెళుతుండటంతో ప్రస్తుతం ఈ ప్రాంతం ప్రజలు లేక వెలవెలబోతోంది. ఇళ్లతో అనుబంధం పెనవేసుకున్నవారు మాత్రం వదిలివెళ్లట్లేదు. ఈ విషయమై స్థానికురాలు లతీఫా బిన్ యహ్యా(38) మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాన్న, అమ్మ చనిపోయారు. నా కుమార్తెలు వివాహం చేసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఐదు గదులున్న ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నా. ఇప్పుడు నేను ఈ ఇంటిని వదిలేస్తే ఇల్లు మాదికాకుండా పోతుంది’ అని తెలిపారు. మరికొందరు కొత్త ఇళ్లను నిర్మించుకుని ఈ భూగర్భ గృహాలను స్టోర్‌రూమ్‌లుగా మార్చుకుంటున్నారని ఆమె వెల్లడించారు. ఫ్రాన్స్ నుంచి 1956, మార్చి 20న స్వాతంత్య్రం పొందిన తర్వాత అధ్యక్షుడు హబీబ్ బోర్గిబా 1960,70 దశకాల్లో చేపట్టిన సంస్కరణల ప్రభావంతో పలువురు బెర్బెర్ జాతి ప్రజలు ఈ భూగర్భ ఇళ్లను వదలి పట్టణాలకు వలస వెళ్లారు. అయితే తమ జాతిని విచ్ఛిన్నం చేసేందుకే అధ్యక్షుడు హబీబీ అప్పట్లో ఈ మార్పులు తీసుకొచ్చాడని పలువురు స్థానికులు ఆరోపించారు. ఆదాయంపై విప్లవ పంజా 1977లో వచ్చిన ‘స్టార్ వార్స్’ సినిమా కోసం ఓ హోటల్ సెట్‌ను ఇక్కడ వేయడంతో ప్రత్యేకమైన నిర్మాణశైలితో ఉన్న ఈ భూగర్భ ఇళ్లకు అంతర్జాతీయంగా సందర్శకుల తాకిడి పెరిగిపోయింది. అప్పటివరకూ ఆలివ్, పామ్‌జాతి(ఈత,ఖర్జూర) చెట్ల సాగుపై ప్రధానంగా ఆధారపడ్డ స్థానికులు.. పర్యాటకుల కోసం హోటళ్లు ఏర్పాటుచేసి అదనపు ఆదాయాన్ని ఆర్జించడం మొదలుపెట్టారు. అయితే 2011లో చెలరేగిన ‘అరబ్ విప్లవం’తో పరిస్థితి తారుమారైంది. విదేశీ పర్యాటకులపై ట్యూనీషియాలో దాడులు పెరిగిపోవడంతో వారి రాక తగ్గిపోయింది. ఆదాయం తగ్గిపోవడంతో పాటు వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడుతున్న తీవ్రమైన కరువు, భారీ వర్షాలను తట్టుకోలేక పలువురు ప్రజలు ఈ ఇళ్లను వదిలి మెరుగైన జీవితం కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఈ ప్రాంతంలో చివరి భూగర్భ గృహాన్ని తాను 1970లో నిర్మించానని అలీ కయెల్ అనే వ్యక్తి చెప్పారు. ఆస్ట్రేలియాలో కూడా ఆస్ట్రేలియాలోని కూబర్పెడీ పట్టణంలోనూ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొండల్ని ఆనుకుని ఇలాంటి నిర్మాణాలే వెలిశాయి. 1915లో ఏర్పడిన ఈ పట్టణంలో ప్రస్తుతం 3,500 మంది ప్రజలుండగా వీరిలో 60 శాతం మంది కొండల్ని తొలిచి భూగర్భంలో నిర్మించిన ఇళ్లలోనే నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 95 శాతం ఓపల్(ఓ రకమైన విలువైన రాయి) ఇక్కడే లభ్యమవుతోంది. కప్పడోసియా ఇళ్లు (టర్కీ), వర్జెడియా కేవ్ సిటీ(జార్జియా), కండోవన్(ఇరాన్) లలోనూ ఇలాంటి ఇళ్లున్నాయి. -
గెలుపు బాటలో ఆసీస్
సిడ్నీ: మార్ష్ సోదరులు షాన్, మిచెల్ అద్భుత సెంచరీలు చేయడంతో... యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా విజయం ముంగిట నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను 649/7 వద్ద డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియాకు 303 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ప్రస్తుతం జో రూట్ (42 బ్యాటింగ్), బెయిర్‌స్టో (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ మరో 210 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ కాపాడుకోవాలంటే ఇంగ్లండ్ చివరి రోజు పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సి ఉండగా... ఆసీస్ మరో ఆరు వికెట్లు తీస్తే నాలుగో విజయాన్ని ఖాయం చేసుకుంటుంది. ఓవర్‌నైట్‌స్కోరు 479/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ఆటలో మార్ష్ సోదరుల బ్యాటింగే హైలైట్. అన్నదమ్ములిద్దరూ ఒకరిని మించి ఒకరు దూకుడుగా ఆడటంతో.. ఇంగ్లండ్ బౌలర్లు ప్రేక్షక పాత్ర వహించారు. ఈ క్రమంలో ముందు షాన్ మార్ష్ (291 బంతుల్లో 156; 18 ఫోర్లు)... ఆ తర్వాత మిచెల్ మార్ష్ (145 బంతుల్లో 101; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలు పూర్తి చేసుకున్నారు. పాయింట్ దిశగా బంతిని పంపిన మిచెల్ మార్ష సెంచరీ సంబరాల్లో పడి రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలి పరుగు పూర్తవగానే పిచ్ మధ్యలో సోదరుడిని హత్తుకొని రెండో పరుగు పూర్తి చేయడం మరిచాడు. అనంతరం షాన్ మార్ష్ గుర్తుచేయడంతో క్రీజులోకి చేరి బతికిపోయాడు. ► ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అన్నదమ్ములు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో చాపెల్ సోదరులు గ్రెగ్, ఇయాన్ (1972లో)... ‘వా’ సోదరులు మార్క్, స్టీవ్ (2001లో)లు కూడా ఇంగ్లండ్ పైనే ఈ ఘనత సాధించడం విశేషం. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో అన్నదమ్ములిద్దరూ ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేయడం ఇది ఎనిమిదో సారి. ► రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగుల వద్ద కుక్ టెస్టుల్లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా కుక్ రికార్డు నమోదు చేశాడు. ► గత 80 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సిడ్నీలో ఆదివారం 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విపరీతమైన ఉక్కపోతతో ఇంగ్లండ్ బౌలర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. -
క్రికెట్ క్యాలండర్ 2018
కొత్త ఏడాదిలో కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, మరికొన్ని కొత్త ఆశయాలు... ప్రపంచాన్ని గెలిచేందుకు, ప్రపంచానికి పరిచయమయ్యేందుకు మీ కోసమే అంటూ ఎన్నో వేదికలు, మరెన్నో ఆహ్వానాలు... క్రీడాకారులు అద్భుతాలు సృష్టించేందుకు ప్రతీ ఏడూ కొత్త రూపంలో అవకాశాలు వెతుక్కుంటూనే వస్తాయి. గత పరాజయాలను మరచి విజయాల వైపు దూసుకెళ్లేవారు కొందరైతే, సాధించిన ఘనతలతో సరిపెట్టుకోకుండా ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసేవారు మరికొందరు. అలాంటి క్షణాలను ఆస్వాదిస్తూ ఆటగాళ్ల గెలుపును తమ గెలుపుగా భావించే అభిమానులందరి కోసం కొత్త సంవత్సరం పసందైన క్రీడా సమరాలతో సిద్ధంగా ఉంది. క్రికెట్లో మన పదునేమిటో చూపించేందుకు దక్షిణాఫ్రికా నుంచి మొదలు పెట్టి ఇంగ్లండ్, ఆపై ఆస్ట్రేలియా వరకు మూడు కఠిన పర్యటనలు. క్రికెట్ జనవరి 5–9: భారత్–దక్షిణాఫ్రికా, తొలి టెస్టు (కేప్‌టౌన్) జనవరి 13–17: భారత్–దక్షిణాఫ్రికా, రెండో టెస్టు (సెంచూరియన్) జనవరి 24–28: భారత్–దక్షిణాఫ్రికా, మూడో టెస్టు (జోహన్నెస్‌బర్గ్) జనవరి 27–28: బెంగళూరులో ఐపీఎల్–11 వేలం కార్యక్రమం ఫిబ్రవరి 1: భారత్–దక్షిణాఫ్రికా, తొలి వన్డే (డర్బన్) ఫిబ్రవరి 4: భారత్–దక్షిణాఫ్రికా, రెండో వన్డే (సెంచూరియన్) ఫిబ్రవరి 7: భారత్–దక్షిణాఫ్రికా, మూడో వన్డే (కేప్‌టౌన్) ఫిబ్రవరి 10: భారత్–దక్షిణాఫ్రికా, నాలుగో వన్డే (జోహన్నెస్‌బర్గ్) ఫిబ్రవరి 13: భారత్–దక్షిణాఫ్రికా, ఐదో వన్డే (పోర్ట్ ఎలిజబెత్) ఫిబ్రవరి 16: భారత్–దక్షిణాఫ్రికా, ఆరో వన్డే (సెంచూరియన్) ఫిబ్రవరి 18: భారత్–దక్షిణాఫ్రికా, తొలి టి20 (జోహన్నెస్‌బర్గ్) ఫిబ్రవరి 21: భారత్–దక్షిణాఫ్రికా, రెండో టి20 (సెంచూరియన్) ఫిబ్రవరి 24: భారత్–దక్షిణాఫ్రికా, మూడో టి20 (కేప్‌టౌన్) మార్చి 8–20: శ్రీలంకలో టి20 ముక్కోణపు టోర్నీ (భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్) ఏప్రిల్ 4–మే 27: ఐపీఎల్–2018 జూలై 3: భారత్–ఇంగ్లండ్, తొలి టి20 (మాంచెస్టర్) జూలై 6: భారత్–ఇంగ్లండ్, రెండో టి20 (కార్డిఫ్) జూలై 8: భారత్–ఇంగ్లండ్, మూడో టి20 (బ్రిస్టల్) జూలై 12: భారత్–ఇంగ్లండ్, తొలి వన్డే (నాటింగ్హమ్) జూలై 14: భారత్–ఇంగ్లండ్, రెండో వన్డే (లార్డ్స్) జూలై 17: భారత్–ఇంగ్లండ్, మూడో వన్డే (లీడ్స్) ఆగస్టు 1–5: భారత్–ఇంగ్లండ్, తొలి టెస్టు (బర్మింగ్హమ్) ఆగస్టు 9–13: భారత్–ఇంగ్లండ్, రెండో టెస్టు (లార్డ్స్) ఆగస్టు 18–22: భారత్–ఇంగ్లండ్, మూడో టెస్టు (నాటింగ్హమ్) ఆగస్టు 30–సెప్టెంబర్ 3: భారత్–ఇంగ్లండ్, నాలుగో టెస్టు (సౌతాంప్టన్) సెప్టెంబర్ 7–11: భారత్–ఇంగ్లండ్, ఐదో టెస్టు (లండన్) సెప్టెంబర్: ఆసియా కప్ (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, క్వాలిఫయర్) అక్టోబర్–నవంబర్: భారత్‌లో వెస్టిండీస్ పర్యటన (3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టి20) నవంబర్–డిసెంబర్: ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన (4 టెస్టులు) -
మార్చిలో మహిళల ముక్కోణపు టోర్నీ
న్యూఢిల్లీ: మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసి రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల జట్టు గత ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుండటంతో... ఎనిమిది నెలల తర్వాత భారత జ ట్టు అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ (2017–2020)లో భాగంగా మార్చి 12–18 మధ్య బరోడాలో జరిగే మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా పాల్గొననుంది. అనంతరం మార్చి 22 నుంచి ముంబైలో జరిగే ముక్కోణపు టి20 సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియాలతో పాటు ఇంగ్లండ్ జట్లు పాల్గొంటాయని బీసీసీఐ శుక్రవారం తెలిపింది. -
విజయం దిశగా ఆసీస్
పెర్త్: వరుణుడు వెంటాడి అంతరాయాలు కల్పించకపోతే... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వీరోచిత పోరాటంతో రోజంతా ఆడితే తప్ప... సోమవారం ఆస్ట్రేలియా ఖాతాలో యాషెస్ సిరీస్ చేరడం ఖాయమనిపిస్తోంది. ఇప్పటికే రెండు టెస్టులు గెల్చుకున్న ఆస్ట్రేలియా మూడో టెస్టులోనూ విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టింది. 9 నాలుగోరోజు ఆదివారం ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. కుక్ (14), స్టోన్‌మన్ (3), విన్స్ (55; 12 ఫోర్లు), కెప్టెన్ రూట్ (14) అవుటయ్యారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరోలు మలాన్ (28 బ్యాటింగ్), బెయిర్‌స్టో (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ రెండు... స్టార్క్, లయన్ ఒక్కో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా మళ్లీ బ్యాటింగ్ చేయాలంటే ఇంగ్లండ్ మరో 127 పరుగులు చేయాలి. చేతిలో ఆరు వికెట్లున్నాయి. సోమవారం ఆటకు చివరిరోజు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 549/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు 662/9 వద్ద డిక్లేర్ చేసింది. -
ఆసీస్ దీటైన జవాబు
పెర్త్: యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ మళ్లీ తడబడింది. రెండో రోజు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 305/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 98 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (92 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి జట్టును ముందుండి నడిపించాడు. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు మలాన్ (140; 19 ఫోర్లు, 1 సిక్స్), బెయిర్‌స్టో (119; 18 ఫోర్లు)ల అద్భుత బ్యాటింగ్‌తో ఓ దశలో 368/4తో పటిష్ట స్థితిలో నిలిచి భారీ స్కోరుపై కన్నేసింది. మలాన్‌ను స్పిన్నర్ లయన్ అవుట్ చేయడం... అనంతరం వచ్చిన వారు వచ్చినట్లు వెనుదిరగడంతో ఇంగ్లండ్ తమ చివరి ఆరు వికెట్లను 35 పరుగుల తేడాలో కోల్పోయింది. స్టార్క్‌కు 4, హాజల్‌వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. -
ఆసీస్ దీటైన జవాబు
పెర్త్: యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ మళ్లీ తడబడింది. రెండో రోజు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 305/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 98 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (92 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి జట్టును ముందుండి నడిపించాడు. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు మలాన్ (140; 19 ఫోర్లు, 1 సిక్స్), బెయిర్‌స్టో (119; 18 ఫోర్లు)ల అద్భుత బ్యాటింగ్‌తో ఓ దశలో 368/4తో పటిష్ట స్థితిలో నిలిచి భారీ స్కోరుపై కన్నేసింది. మలాన్‌ను స్పిన్నర్ లయన్ అవుట్ చేయడం... అనంతరం వచ్చిన వారు వచ్చినట్లు వెనుదిరగడంతో ఇంగ్లండ్ తమ చివరి ఆరు వికెట్లను 35 పరుగుల తేడాలో కోల్పోయింది. స్టార్క్‌కు 4, హాజల్‌వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. -
మార్ష్ సెంచరీ: ఆసీస్ భారీ స్కోరు
అడిలైడ్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్టులో అతిథ్య ఆస్ట్రేలియా జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. షాన్ మార్ష్ (126 నాటౌట్; 15 ఫోర్లు, ఒక సిక్స్) అద్భుత సెంచరీతో 442/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆసీస్... అనంతరం ఇంగ్లండ్ ఓపెనర్ స్టోన్‌మన్ వికెట్ పడగొట్టి శుభారంభం చేసింది. 9.1 ఓవర్లో 29/1 స్కోరు వద్ద వర్షం ప్రారంభం కావడంతో రెండో రోజు ఆట నిలిచిపోయింది. ఆట ముగిసే సమయానికి కుక్ (11 బ్యాటింగ్), విన్స్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 209/4తో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే హ్యాండ్స్కోంబ్ (36) అవుటయ్యాడు. అనంతరం పైన్ (57; 6 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి షాన్ మార్ష్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అర్ధసెంచరీ తర్వాత పైన్ అవుటైనా లోయర్ ఆర్డర్ సాయంతో మార్ష్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో కమిన్స్ (44; 7 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. కమిన్స్ నిష్క్రమించిన కొద్దిసేపటికే కెప్టెన్ స్మిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. -
ఆస్ట్రేలియా వర్సిటీతో చండీగఢ్ వర్సిటీ ఒప్పందం
చండీగఢ్: మీడియా స్టడీస్, హెల్త్ సైన్సెస్, అగ్రికల్చరల్ సైన్స్, బిజినెస్ మేనేజ్మెంట్లో పరస్పర సహకారం అందించుకోవడానికి ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాన్బెర్రాతో చండీగఢ్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. యూనివర్సిటీ ఆఫ్ కాన్బెర్రా వైస్ చాన్స్‌లర్ ప్రొ.దీప్ సైని ఈ ఒప్పందంపై సంతకం చేశారు. కార్యక్రమంలో చండీగఢ్ వర్సిటీ చాన్స్‌లర్ డా. సత్నాం సింగ్, వైస్ చాన్స్‌లర్ డా.ఆర్.ఎస్.బవా తదితరులు పాల్గొన్నారు. నేర్చుకోవడానికి అనుకూల వాతావరణం, చవకైన విద్య, మెరుగైన ఉద్యోగావకాశాల వల్ల భారత విద్యార్థులకు ఆస్ట్రేలియా ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని ప్రొ. దీప్ సైని అన్నారు. ప్రపంచలో టాప్ 100 వర్ధమాన వర్సిటీల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ కాన్బెర్రాతో ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణమని సత్నాం సింగ్ అన్నారు. -
విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్
-
విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్
మెల్ బోర్న్: ఆతిత్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్ డేలో టీడిండియా బ్యాట్స్ మన్, టెస్ట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫీట్ సాధించాడు. వన్ డేల్లో అతి వేగంగా ఏడు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు 169 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 161 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికన్ స్టార్ ఏ.బి. డివిలియర్స్ పేరుమీద ఉండేది. వన్ డేల్లో తన 166వ ఇన్నింగ్స్(172వ మ్యాచ్)లో డివిలియర్స్ 7వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీ తాజా ఇన్నింగ్స్ తో ఏబీ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ప్రపంచ క్రికెట్ లో ఇప్పటివరకు 7 వేల పరుగుల మైలురాయిని దాటిన క్రికెటర్లు 36 మంది ఉన్నారు. వన్ డేల్లో ప్రమాదకరమైన బ్యాట్స్ మన్ గా ముద్రపడ్డ 27ఏళ్ల కోహ్లీ ఇప్పటివరకు వన్ డేల్లో 23 సెంచరీలు, 36 అర్ధసెంచరీలు కూడాసాధించాడు. వేగంగా ఏడువేల పరుగులు చేసిన బ్యాట్స్ మన్ల వివరాలిలా ఉన్నాయి.. సౌరవ్ గంగూలి(భారత్) - 174వ ఇన్నింగ్స్(180వ మ్యాచ్) బ్రియాన్ లారా(వెస్టిండీస్)- 183వ ఇన్నింగ్స్ లో డెస్మండ్ హెన్స్(వెస్టిండీస్) 183వ ఇన్నింగ్స్ లో జాక్వెస్ కలిస్(దక్షిణాఫ్రికా)- 188వ ఇన్నింగ్స్ సచిన్ టెండూల్కర్(భారత్)- 189వ ఇన్నింగ్స్ -
మోసం చేశాడని మగతనాన్ని కాల్చేసింది!
- మాజీ ప్రియురాలిని కలిశాడని బాయ్‌ఫ్రెండ్‌పై దాడి - అసాధారణ నేరంగా పరిగణించి యువతికి జైలుశిక్ష విధించిన కోర్టు తప్పు చేస్తే ఒకరినొకరు శిక్షించుకోవడం ఆ ప్రేమికుల ఒప్పందం. అలా చేతిలో చెయ్యేసి చేసిన బాస.. తన పాలిట శాపంగా మారుతుందని ఊహించకపోయాడు ఆ ప్రియుడు! అసాధారణ రీతిలో ప్రియురాలు చేసిన పైశాచిక దాడిలో తన మగతనాన్ని తాత్కాలికంగా కోల్పోయాడు. కేసులోని తీవ్రతను గుర్తించిన కోర్టు నిందితురాలికి జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఆస్ట్రేలియాలోని మౌంట్ బార్కర్ పట్టణంలో బ్రోన్విన్ పార్కర్ (22) అనే యువతి తన బాయ్‌ప్రెండ్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. తమ మధ్య ఎలాంటి గొడవలొచ్చినా వారికివారే చిన్నిచిన్న శిక్షలు విధించుకుంటూ.. కలకాలం కలిసుండేలా రాసుకోని ఒప్పందం చేసుకున్నారిద్దరూ. కాగా, సదరు బాయ్‌ఫ్రెండ్ ఇటీవలే తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను అనుకోకుండా కలిశాడు. నాలుగు మాటల తర్వాత పాత రోజులు గుర్తుచేసుకుంటూ ఇద్దరూ మైమరచిపోయి ఒక్కటయ్యారు. ఈ సంగతికాస్తా ప్రస్తుత ప్రేయసికి తెలిసిందే. అంతే.. 'నన్ను మోసం చేశావు. మాట తప్పావు' అంటూ అంతెత్తున ఎగిరింది. చేసేదేమీ లేక ఒప్పందం ప్రకారం శిక్ష భరించడానికి సిద్ధమయ్యాడు ప్రియుడు. వేడివేడి హెయిర్ స్ట్రైటనర్తో అతని ప్రైవేట్ పార్ట్ ను కాల్చేసింది ప్రియురాలు. దాంతో లబోదిబోమంటూ అరుపులు పెట్టాడు బాధితుడు. విషయం పోలీస్ కేసు నుంచి కోర్టుకు చేరింది. 'ఏదో ఆయనకు బుద్ధి చెబుదామని సరదాగా హెయిర్ స్ట్రైటనర్ ను అంటించా. కానీ ఇంత పెద్ద గాయం అవుతుందని ఊహించలేదు' అని న్యాయస్థానంలో వాపోయింది పార్కర్. అయితే జడ్జిగారు మాత్రం ఆమె చేసింది ముమ్మాటికి నేరమేనని తేల్చిచెబుతూ తొమ్మిది నెలల జైలుశిక్ష విధించారు. బాధిత ప్రేమికుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి అవయవాలు మామూలు స్థితికి రావడానికి కనీసం రెండేళ్లు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. -
చేతకాక ఆరోపణలు
కేప్‌టౌన్: తమ బౌలర్ల స్వింగ్‌ను ఆడటం చేతకాక ఆస్ట్రేలియా క్రికెటర్లు తమపై ట్యాంపరింగ్ ఆరోపణలు చేస్తున్నారని దక్షిణాఫ్రికా జట్టు ఘాటుగా స్పందించింది. ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా క్రికెటర్లు ట్యాంపరింగ్ చేశారని వార్నర్ ఆరోపించాడు. దీనిని సఫారీ జట్టు తీవ్రంగా ఖండించింది. తమ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేందుకే ఇలా మాట్లాడరని పేర్కొంది