మార్క్‌రమ్
డర్బన్: తొలి టెస్టులో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలుపు ఖాయమైంది. కాకపోతే... ప్రత్యర్థి చివరి వికెట్ పడగొట్టలేక ఆ జట్టు ఐదో రోజు కూడా మైదానంలోకి దిగాల్సి వస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 213/9తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 227కు ఆలౌటైంది. అనంతరం 417 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన సఫారీ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 293 పరుగులు చేసింది. చేతిలో ఒక వికెట్ మిగిలి ఉండగా... విజయానికి మరో 124 పరుగులు దూరంలో నిలిచింది. ప్రధాన బ్యాట్స్‌మెన్ ఎల్గర్ (9), ఆమ్లా (8), డివిలియర్స్ (0), కెప్టెన్ డుప్లెసిస్ (4)ల వైఫల్యం కారణంగా ఒక దశలో దక్షిణాఫ్రికా 4/49 స్కోరుతో దయనీయస్థితిలో నిలిచింది.
ఈ దశలో ఓపెనర్ మార్క్‌రమ్ (143; 19 ఫోర్లు) పోరాట పటిమ చూపాడు. అద్భుత శతకం సాధించిన అతడు తొలుత డిబ్రుయెన్ (36)తో కలిసి 87 పరుగులు, కీపర్ డికాక్ (81 బ్యాటింగ్; 11 ఫోర్లు) అండగా ఆరో వికెట్‌కు 147 పరుగులు జోడించి జట్టు పరువు నిలిపాడు. వీరిని విడగొట్టేందుకు ఆసీస్ బౌలర్లు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మిచెల్ మార్‡్ష బౌలింగ్‌లో ఎట్టకేలకు మార్క్‌రమ్ అవుటయ్యాడు. తర్వాత స్టార్క్ (4/74) విజృంభించి ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టాడు. వెలుతురు తగ్గడంతో చివరి ఓవర్లను స్మిత్, లయన్ వేయాల్సి వచ్చింది. డికాక్, మోర్కెల్ (27 బంతుల్లో 0 బ్యాటింగ్) వికెట్ ఇవ్వకుండా 9 ఓవర్లు పైగా బ్యాటింగ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment