‘బాక్సింగ్ డే’ టెస్టులో మన జట్టు మూడే రోజుల్లో మునిగింది. రోజు రోజుకూ ప్రత్యర్థి జట్టే పట్టు బిగించడం... మూడో రోజైతే ఏకంగా అటు బ్యాటింగ్‌లో ప్రతాపం... ఇటు బౌలింగ్‌లో పట్టుదల చూపిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ విజయం సాధించింది. దీంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ సఫారీ బౌలింగ్ ముందు ఎదురు నిలువలేకపోయింది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ సొంతం చేసుకునేందుకు భారత్ మరోసారి పర్యటించాల్సి ఉంటుంది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
సెంచూరియన్: టీమిండియా ఈ పర్యటనలో టి20లను సమం చేసుకున్నా... వన్డే సిరీస్‌ను వశం చేసుకున్నా... అసలైన క్రికెట్ టెస్టు ఫార్మాట్‌కు వచ్చేసరికి సఫారీలో సవారీ అంత సులభం కానేకాదని తొలిటెస్టు మూడు రోజుల్లోనే తెలుసుకుంది. ‘బాక్సింగ్ డే’ పోరులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. మొదట ఓవర్‌నైట్ స్కోరు 256/5తో గురువారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 108.4 ఓవర్లలో 408 పరుగుల వద్ద ఆలౌటైంది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డీన్ ఎల్గర్ (287 బంతుల్లో 185; 28 ఫోర్లు), మార్కొ జానెŠస్‌న్ (147 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) భారీస్కోరుకు బాటవేశారు. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు 111 పరుగులు జోడించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 163 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 34.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. కోహ్లి (82 బంతుల్లో 76; 12 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ పరుగులే చేయలేదు. రెండు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది.
అప్పుడు రాహుల్... ఇప్పుడు కోహ్లి
ఈ టెస్టులో సఫారీ పేసర్లు భారత బ్యాటర్ల పాలిట గన్ గురిపెట్టునట్లుగా... బంతుల స్థానంలో బుల్లెట్లు సంధించారేమో! ఎందుకంటే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటర్లు తేలిగ్గా వికెట్లను సమర్పించుకున్నారు. ముఖ్యంగా మూడో రోజైతే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలాన్ని, బౌలింగ్ అ్రస్తాల్ని ప్రయోగించిన తీరుకు భారత్ భీతిల్లిపోయింది. ప్రత్యర్థి తొలిసెషన్‌కు పైగా ఆడింది. 42.4 ఓవర్లలో మిగిలున్న 5 వికెట్లతోనే 152 పరుగులు చేసింది.
కానీ 10 మంది భారత బ్యాటర్లు కనీసం 35 ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయారు. రబడ (2/32), బర్గర్ (4/33), జాన్సెన్ (3/36) ముప్పేట దాడికి దిగడంతో అనుభవజు్ఞడైన కెపె్టన్ రోహిత్ (0) ఖాతా తెరువలేకపోయాడు. యశస్వి (5), అయ్యర్ (6), కేఎల్ రాహుల్ (4), అశ్విన్ (0), శార్దుల్ (2) సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. కోహ్లి అర్ధసెంచరీతో పోరాడగా, శుబ్‌మన్ గిల్ (26) కాస్త మెరుగనిపించాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 245 ఆలౌట్;
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్‌రమ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 5; ఎల్గర్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 185; టోని జార్జి (సి) జైస్వాల్ (బి) బుమ్రా 28; పీటర్సన్ (బి) బుమ్రా 2; బెడింగ్‌హమ్ (బి) సిరాజ్ 56; వెరిన్ (సి) రాహుల్ (బి) ప్రసి«ద్‌కృష్ణ 4; జాన్సెన్ నాటౌట్ 84; కొయెట్జీ (సి) సిరాజ్ (బి) అశ్విన్ 19; రబడ (బి) బుమ్రా 1; బర్గర్ (బి) బుమ్రా 0; బవుమా (ఆబ్సెంట్ హర్ట్); ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (108.4 ఓవర్లలో ఆలౌట్) 408. వికెట్ల పతనం: 1–11, 2–104, 3–113, 4–244, 5–249, 6–360, 7–391, 8–392, 9–408. బౌలింగ్: బుమ్రా 26.4–5–69–4, సిరాజ్ 24–1–91–2, శార్దుల్ 19–2–101–1, ప్రసిధ్ కృష్ణ 20–2–93–1, అశ్విన్ 19–6–41–1.
భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) వెరిన్ (బి)బర్గర్ 5; రోహిత్ (బి) రబడ 0; గిల్ (బి) జాన్సెన్ 26; కోహ్లి (సి) రబడ (బి) జాన్సెన్ 76; అయ్యర్ (బి) జాన్సెన్ 6; రాహుల్ (సి) మార్క్‌రమ్ (బి) బర్గర్ 4; అశ్విన్ (సి) బెడింగ్‌హమ్ (బి) బర్గర్ 0; శార్దుల్ (సి) బెడింగ్‌హమ్ (బి) రబడ 2; బుమ్రా రనౌట్ 0; సిరాజ్ (సి) వెరిన్ (బి) బర్గర్ 4; ప్రసిద్‌కృష్ణ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (34.1 ఓవర్లలో ఆలౌట్) 131. వికెట్ల పతనం: 1–5, 2–13, 3–52, 4–72, 5–96, 6–96, 7–105, 8–113, 9–121, 10–131. బౌలింగ్: రబడ 12–3–32–2, బర్గర్ 10–3–33–4, జాన్సెన్ 7.1–1–36–3, కొయెట్జీ 5–0–28–0.
Comments
Please login to add a commentAdd a comment